సోషల్ మీడియాలో తొందరగా పాపులరిటీ సంపాదించేందుకు కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. చేయకూడని పనులు చేసి చిక్కుల్లో పడుతున్నారు. రకరకాల రీల్స్ చేస్తూజనాల చేత తిట్లు తింటున్నారు. ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్‌తో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆదిత్య అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఢిల్లీ రోడ్డుపై డేంజరస్ స్టంట్లు చేశాడు. ద్వారక ప్రాంతంలో గౌరవ్ సింగ్ (19) డ్రైవింగ్ చేస్తుండగా.. స్పైడర్ మ్యాన్ వేషం ధరించిన ఆదిత్య కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.
దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు. చివరికి సమాచారం అందుకున్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. యువకులపై చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు.
Delhi | On receiving a complaint on social media about a car seen on Dwarka roads with a person dressed as Spiderman on its bonnet, the Delhi Traffic Police took action. The person in the Spiderman costume was identified as Aditya (20) residing in Najafgarh. The driver of the… pic.twitter.com/UtMqwYqcuK
— ANI (@ANI) July 24, 2024
ప్రమాదకర డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు రూ. 26 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆదిత్య గతంలోనూ స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ప్రమాదకర స్టంట్లకు పాల్పడి కటకటాల పాలైనట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment