traffic rules
-
నో డౌట్ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు..!
ఇటీవల కాలంలో ఎంతలా ట్రాఫిక్ నిబంధలు పెట్టినా..ఘెరమైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేగాదు ఎందరో తల్లులకు కడుపుకోత, తీరని వ్యథ మిగులుతుంది. ప్రధానంగా మొబైల్ ఫోన్లు, నిర్లక్ష్య ధోరణి, తొందరపాటులే ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు. అక్కడికి దీనిపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం లేదు. ఏం చేస్తే ఈ సమస్యని నివారించగలమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రేంజ్‌లోనే హైవేలపై స్పీడ్ ఉండాలని నియంత్రించినా..ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే సమస్యను ఫేస్ చేస్తున్న వియత్నాం దేశం అమలు చేస్తున్న ట్రాఫిక్ చట్టాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలా అయినా ప్రమాదాలు తగ్గుతాయేమో అనే ఆశను రేకెత్తించింది. ఇంతకీ ఆ దేశం ఎలాంటి ట్రాఫిక్ చట్టాలను తీసుకొచ్చింది..? మన దేశంలో సాధ్యమేనా..?వియత్నాం(Vietnam) రోడ్డు ప్రమాదాలను నివారించేలా ట్రాఫిక్ ఉల్లంఘనలు నియంత్రించేందుకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది. ఎవ్వరైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి గురించి సమాచారం అందిచినట్లయితే వారికి ప్రభుత్వం దాదాపు రూ. 17 వేలు వరకు ప్రోత్సహకాన్ని అందుకోవచ్చు. ప్రజా భద్రతను పెంచేలా ట్రాఫిక్ క్రమశిక్షణ(Traffic Rules) అమలయ్యేందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వియత్నాం. నిజానికి గతేడాది ప్రారంభ నుంచే వియత్నాం ట్రాపిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి భరించలేని స్థాయిలో జరిమానాలు పెంచేసింది. రెడ్ సిగ్నల్ ఉండగానే పట్టించుకోకుండా వెళ్లిపోవడం, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తదితరాలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ఏ పౌరుడైనా సమాచారం(reporting) అందిస్తే..వారి గోప్యతను భద్రంగా ఉంచడమే గాక వాళ్లకి పడిన జరిమానా నుంచి మినహాయింపు లేదా తగిన విధంగా ప్రోత్సాహకం ఇవ్వడం వంటివి చేస్తోంది. అంతేగాదు వారు నడిపే వాహనం అనుసరించి జరిమానాలను భారీగా పెంచింది. అలాగే పారితోషకం కూడా ఆ విధమైన డిఫరెన్స్తోనే భారీగా ముట్టచెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో నెటిజన్లు ఆ దేశానికి దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఉన్న మనదేశంలో కూడా వాటిని అమలు చేస్తే చాలామంది మిలియనీర్లుగా మారతారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు(NITI Aayog member) అరవింద్ విర్మాణితో సహా చాలామంది మాత్రం తప్పనిసరిగా భారత్‌లో కూడా ఇలాంటి రూల్స్‌ని అమలు చేయాలని వాదిస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేస్తే సంపాదన సామర్థ్యం కష్టమైపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఒకకంగా ఇది ఇరు దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎంతలా ఉన్నాయనేది హైలెట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒకరకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారన్ని అందించిందని చెప్పొచ్చు.We should definitely introduce this for major traffic offenses like going the wrong way on a divided highway/street, and jumping red lights https://t.co/tTkpwoIXck— Dr Arvind Virmani (Phd) (@dravirmani) January 5, 2025 (చదవండి: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుకలో మెనూ ఇలా ఉంటుందా..! 24 క్యారెట్ల బంగారం..) -
పాపులారిటీ కోసం పాకులాట.. ‘స్పైడర్ మ్యాన్’ అరెస్ట్
సోషల్ మీడియాలో తొందరగా పాపులరిటీ సంపాదించేందుకు కొందరు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటారు. చేయకూడని పనులు చేసి చిక్కుల్లో పడుతున్నారు. రకరకాల రీల్స్ చేస్తూజనాల చేత తిట్లు తింటున్నారు. ప్రమాదకర స్టంట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి మానుకోవాలని అధికారులు చెబుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.తాజాగా ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్తో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని ఆదిత్య అనే వ్యక్తి మరో యువకుడితో కలిసి ఢిల్లీ రోడ్డుపై డేంజరస్ స్టంట్లు చేశాడు. ద్వారక ప్రాంతంలో గౌరవ్ సింగ్ (19) డ్రైవింగ్ చేస్తుండగా.. స్పైడర్ మ్యాన్ వేషం ధరించిన ఆదిత్య కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు. చివరికి సమాచారం అందుకున్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. యువకులపై చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్నారు. Delhi | On receiving a complaint on social media about a car seen on Dwarka roads with a person dressed as Spiderman on its bonnet, the Delhi Traffic Police took action. The person in the Spiderman costume was identified as Aditya (20) residing in Najafgarh. The driver of the… pic.twitter.com/UtMqwYqcuK— ANI (@ANI) July 24, 2024ప్రమాదకర డ్రైవింగ్, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోవడం, సీటు బెల్టు ధరించకపోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు రూ. 26 వేల జరిమానా విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఆదిత్య గతంలోనూ స్పైడర్ మ్యాన్ దుస్తుల్లో ప్రమాదకర స్టంట్లకు పాల్పడి కటకటాల పాలైనట్లు తెలుస్తోంది. -
ఇదేం కొత్త రూల్.. తల గోక్కున్నా జరిమానా!
డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే చలాన్లు పడటం మామూలే! కానీ ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు తల దురద పెడితే గోక్కున్నా, జరిమానా బెడద తప్పదు. ఇదేం కొత్త రూల్ అని ఆశ్చర్యపోతున్నారా! ఈ మధ్య అమెరికాలో టిమ్ హాన్సెన్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ తల గోక్కున్నాడట. అంతే! పోలీసులు రూ. 33,211 జరిమానాను వడ్డించారు. నిజానికి అతనికి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాట్లాడినందుకు ఫైన్ పడింది. ఫొటోను కాస్త నిశితంగా పరిశీలిస్తే అతను ఫోన్ పట్టుకోలేదని తెలుస్తోంది. అతను తల గొక్కోవడాన్ని ఏఐ పవర్డ్ కెమెరా అపార్థం చేసుకుని, ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా భావించింది. స్మార్ట్ కెమెరా లోపం కారణంగానే ఇలా జరిగిందని స్పష్టమవడంతో ట్రాఫిక్ పోలీసులు అతని చలానాను రద్దు చేశారు. అయితే అప్పటికే ఆ జరిమానాపై టిమ్ కోర్టులో కేసు నమోదు చేశాడు. అధికారిక తీర్పు ఇంకా రాలేదు. ఇంతలోనే ఈ విషయం వైరల్ అయింది. కొన్ని సంస్థలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ల వినియోగాన్ని గుర్తించే కెమెరాలను ఇస్టాల్ చేయమని కోరుతుంటే, మరికొందరు తమకూ ఇలాంటి వింత జరిమానాలు పడ్డాయి అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. -
కొత్త నిర్ణయాలు తీసుకుందాం!
కొత్త సంవత్సరంలో వ్యక్తులుగా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అదే విధంగా మనమంతా ఒక దేశంగా కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. పార్లమెంటులో సభా సమయాన్ని దుర్వినియోగం చేయబోమని ఎంపీలూ, చర్చల పేరుతో జనాల మధ్య గొడవలు సృష్టించబోమని టీవీ యాంకర్లూ తీర్మానించుకోవాలి. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించకుండా వాహనాలను ధ్యాసగా, జాగ్రత్తగా నడుపుతామని మనం సంకల్పం చెప్పుకోవాలి. కానీ మూణ్ణాళ్లకే ఈ తీర్మానాలన్నీ వట్టి ముచ్చటగా మారిపోతే? అసలీ తీర్మానాలు తీర్చేవా, మార్చేవా? దీనికి ఒకటే జవాబు. తీర్చడం, మార్చడం కళ్లకు కనిపించపోవచ్చు. కానీ, అసలంటూ కొత్త నిర్ణయం తీసుకోవటం అన్నదే సంకల్ప సాధనలోని నిబద్ధతకు మొదటి మెట్టు అని గుర్తించాలి. పూతకొచ్చే తీర్మానాలకు కొత్త సంవత్సరం ప్రియమైన రుతువు అయినప్పటికీ, వాటిల్లో చాలా వరకు ఎక్కువ కాలం జీవించి ఉండవు. గొప్ప ఉత్సాహపు ధ్వనితో మొగ్గ తొడిగి, చప్పుడే కాని పరిహాసపు గాలివానలతో టప్పున నేల రాలేందుకే అవి చిగురిస్తాయి. అయినప్పటికీ, మనమంతా ఒక దేశంగా కొన్ని తీర్మానాలను స్వీకరించాలని నేనిప్పుడు సూచించబోవడం మీకొక ప్రశ్నార్థకం అవొచ్చు. దీనికి చాలా సులభమైన జవాబే ఉంది. చేయాలని అనుకున్న దానిలో నిబద్ధత కొరవడినా, ఏం చేయవలసిన అవసరం ఉన్నదో దానిని ఒక సంకల్పంలా తీసుకోవడమే అసలొక తీర్మానం. కనుక ఈ కొత్త సంవత్సర ఆరంభంలో ఆ మొదటి అడుగు వేద్దాం. ‘సంకల్పం’ అనే అడుగు. మొదటిది, ఒకటేంటంటే మన రాజకీయ నాయకులు చేయ వలసినది. పార్లమెంటులో ఎంతో విలువైన ప్రజాసమయ దుర్విని యోగానికి పాల్పడే విధంగా తమ ప్రవర్తన ఉండకూడదని వారు తీర్మానం చేసుకోవాలి. వాళ్లు అక్కడ కూర్చున్నందుకు మీకు, నాకు అవుతున్న ఖర్చు నిమిషానికి 2 లక్షల 50 వేల రూపాయలు. ఈ ఖర్చును మనం సంతోషంగానే భరిస్తున్నాం. ఎందుకంటే, నిజాలను నిగ్గు తేల్చేందుకు, ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపేందుకు, నిశిత పరిశీలనకు; అవినీతిని, అసమర్థతను బహిర్గతం చేయడానికి... ప్రశ్నలు, చర్చలు తప్పనిసరి అని మనం విశ్వసిస్తాం. అటువంటిది... సభ ‘వెల్’లోకి దూసుకెళ్లే, స్పీకర్‌పై రంకెలు వేసే, సభకు గైర్హాజరు అయ్యే ఎంపీలకు మన కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చుపెట్టాలి? 16వ లోక్‌సభ (2014–19) సభా సమయం 1,615 గంటలు కాగా,అందులో 16 శాతం సమయాన్ని అంతరాయాలు, వాయిదాల కారణంగా కోల్పోయాం. ఆ కోల్పోయిన సమయానికి అయిన ఖర్చు రూ. 39 కోట్లు. మన ప్రజాప్రతినిధులుగా, మనం వారికి నిధులు సమ కూరుస్తున్నాం కనుక, ఆ విలువకు సమానమైన సేవలను మన ఎంపీలు మనకు అందించాలి. అందుకు మనం అడుగుతున్నదల్లా పార్లమెంటు సమర్థంగా, అర్థవంతంగా పనిచేయాలని! వారి నుండి ఈ కొత్త సంవత్సరం మనకు ఇలాంటి హామీ లభిస్తుందా? తర్వాత, ప్రెస్! ఇక్కడ నా ఉద్దేశం ప్రెస్ అంటే ప్రధానంగా టెలివి జన్ న్యూస్ చానెళ్లు. టీవీ వీక్షకులు డబ్బు చెల్లిస్తారు కనుక ముఖ్యమైన వార్తల్ని ఆశించే హక్కు వారికి ఉంటుంది. ఏది ముఖ్యమైన వార్తో నిర్ణయించడానికి అనేకమైన ప్రామాణికాలు ఉంటాయన్న దాంట్లో సందేహమేమీ లేదు కానీ, చివరికొచ్చేటప్పటికి ప్రధానంగా ప్రాముఖ్యం, ఔచిత్యం, సమతౌల్యం అనేవి లెక్కలోకి వస్తాయి. కనుక టీవీ వాళ్లకు నేను చెప్పేదేమిటంటే, దయచేసి మీరు సినిమా తారలు, క్రికెటర్ల పట్ల మీకున్న మక్కువను వదులుకోండి. ‘బ్రేకింగ్ న్యూస్’ కోసం మీ పరుగులను ముగించండి; బదులుగా కచ్చితత్వం పైన, విశ్లేషణ మీద దృష్టి పెట్టండి; మరీ ముఖ్యంగా... సాగతీతల్ని ఆపేయండి. ఏ వార్తా కథనానికైనా తన సహజమైన నిడివి ఉంటుంది. కేవలం ప్రసార సమయాన్ని భర్తీ చేయడానికి ఆ నిడివిని పొడిగించుకుంటూ పోకండి. గుర్తుంచుకోండి. మేము పెద్దవాళ్లం; మమ్మల్ని పిల్లల్లా చూడకండి; మేము తరచు పిల్లల్లా స్పందిస్తున్నా కూడా అలాగే, మన యాంకర్లకు ఎవరైనా చర్చల లక్ష్యం జనం మధ్య గొడవలు సృష్టించడం కాదని చెప్పగలరా... ఆ జనం ఒకవేళ గొడవలకు సిద్ధంగా ఉన్నప్పటికీ! చర్చ అనేది ప్రజాభిప్రాయాన్ని రాబట్టేందుకు... అది కూడా ఒక వివేచనతో, వీలైతే తక్కినవారికి భిన్నంగా, పూర్తిగా తమదైన ప్రత్యేకతతో ఉండాలనీ... చర్చకు వచ్చిన అతిథులు తమతో ఏకీభవించేలా యాంకర్లు వారిపై మాటల బల ప్రయోగం చేయకూడదనీ వీక్షకులుగా ఈ కొత్త సంవత్సరంలో మనం ఆశపడదాం. చివరిగా, మనమంతా ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉన్న విషయం – సురక్షితంగా వాహనం నడపడం. పద్ధతిగా, తెలివిడిగా నడపాలి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీని దాటేందుకు వేరే వైపు మళ్లకండి. ఎర్ర రంగు పడటానికి ముందు ఆరెంజి రంగులోకి సిగ్నల్ మారినప్పుడు మీ అదృష్టంపై నమ్మకంతో జంక్షన్లో మీ వాహనాన్ని ముందుకు దూకించకండి. ఇంకొక సంగతి, మీరు మీ కారును పార్క్ చేస్తున్నప్పుడు వేరొకరి గేటుకు కానీ, తోవకు కానీ అడ్డంగా నిలుపుతున్నారేమో గమనించండి. ఇక మన డ్రైవింగ్ ఎలా ఉండాలనే దానికి ఎల్ల వేళలా వర్తించే సాధారణ నియమం – రోడ్డుపై మీరే కాకుండా ఇంకా చాలామంది వాహనం నడు పుతూ ఉంటారు కనక – రోడ్డుపై మీకున్నంత హక్కే వారికీ ఉంటుందని గ్రహించడం! మరీ పాత సంగతి కాదు కానీ, సిగరెట్ తాగడం మొదలుపెట్టాలని నాకొక కొత్త సంవత్సర తీర్మానం ఉండేది. గడియారం సరిగ్గా రాత్రి పన్నెండు కొట్టగానే నా వేళ్ల మధ్య సిగరెట్ వెలుగు తుండేది. మర్నాడు సాయంత్రమంతా ఉమ్మడం, దగ్గడం! ‘సిగరెట్ తాగకపోవడం’ అనే వ్యసనాన్ని దూరం చేసుకోడానికి నేను ఎంచుకున్న మార్గం అది. అయితే జనవరి చివరినాటికి నా తీర్మానం పట్టు సడలిపోయేది. అది వ్యసనంగా మారుతుందేమోనన్న భయం నా చేత సంతోషంగా సిగరెట్ మాన్పించేది. అలా నేను దానికి దూరంగా ఉండటం జరిగేది. ఈ సంవత్సరం నేను మరింత పెద్ద సవాలును స్వీకరిస్తున్నాను. టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చే నా అతిథులకు అంతరాయం కలిగించడాన్ని మానుకోవాలని నిర్ణయించుకున్నాను. బదులుగా, వారిని తమ ఊకదంపుడుకు, అదే పనిగా మాట్లాడేందుకు అనుమ తిస్తాను. వాళ్లేం మాట్లాడినా, మాట్లాడవలసిన దానిని వాళ్లసలే మాట్లాడకపోతున్నా – మీరు, మిగతా వీక్షకులు అరచి నిరసన తెలియజేసే వరకు వాళ్లకు అడ్డుతగలనే తగలను. ‘వద్దు కరణ్, మీరు మీ పాత భౌభౌమనే రాట్వైలర్ జాతి శునకం స్టెయిల్‌కి వచ్చేయండి’ అంటూ తొలి విజ్ఞాపన పత్రం నాకు అందినప్పుడు మాత్రమే నేను ఎప్పటిలా నా పాత శైలికి వచ్చేస్తాను. మరి అలాంటి విజ్ఞాపన పత్రం ఒకటి ఎప్పటికీ రాకపోతే? మా ప్రియమైన పోస్ట్‌మ్యాన్ నేను ఎదురు చూసే క్రిస్మస్, న్యూ ఇయర్ కార్డులన్నిటినీ ఎక్కడో తారుమారు చేసి ఉండొచ్చని అనుకోవాలి. ఏ సంగతీ ఏదో ఒక విధంగా త్వరలోనే మీకు తెలుస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
టెకీలకు మరో గండం..! ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే..
దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కఠినమైన నిబంధనలను అమలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కేరళ ఏఐ కెమెరాలతో ట్రాఫిక్ చలానాలు జారీ చేస్తూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే.. కర్ణాటక ఓ వినూత్న ఆలోచనను తెరమీదకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే.. వారికే చలానా జారీ చేయడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు బెంగళూరులో వచ్చిన ఓ కొత్త రూల్ ప్రకారం ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి ట్రాఫిక్ నియమాలను పాటించకుంటే ఆ సంస్థ బాస్‌కు చలాన్ అందజేస్తారు. ఈ విధానం త్వరలోనే అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నంలో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రత్యేకమైన చొరవతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఈ చొరవ కింద, సంస్థలో పనిచేసే వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఉద్యోగుల ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి కంపెనీలకు తెలియజేస్తారు. 15 రోజుల కింద ప్రారంభమైన ఈ కొత్త కార్యక్రమం రోడ్డుకు రాంగ్ సైడ్‌లో టూ వీలర్ నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఐటీ కంపెనీ సిబ్బందిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుంది. నియమాలను అతిక్రమించిన వారి ఐడీ కార్డును తనిఖీ చేయడం ద్వారా వారు ఎక్కడ పనిచేస్తారనేది తెలుసుకుంటున్నారు. మహదేవపుర ట్రాఫిక్ పోలీస్ డివిజన్ పరిధిలోకి వచ్చే బెంగళూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్ మీదుగా ప్రస్తుతం డ్రైవ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ.. రైడర్లు రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి స్పృహతో ఉన్నారో లేదో చూడటానికి మేము ఈ చొరవతో ప్రయోగాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఈ చొరవ మంచిదేనా? బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ కొత్త చొరవ చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ఇదో మార్గం అని తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు సాధ్యమవుతుందనేది ప్రశ్నగానే ఉన్నప్పటికీ.. ఉద్యోగి భద్రత గురించి కంపెనీ అవగాహనా కల్పించే అవకాశం ఉంటుంది. -
హైదరాబాద్ ORRపై కొత్త రూల్స్.. బీఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది సైబరాబాద్ పోలీస్ శాఖ. పైగా కొత్త రూల్స్ నేటి నుంచి(జులై 31వ తేదీ నుంచి) అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. లైన్ 1 అండ్ 2ల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లొచ్చు. ఆ మధ్య స్పీడ్ లిమిట్‌ని అనుమతిస్తారు. ఈ లైన్లలో కనిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్ల చొప్పున ఉండొచ్చు. అలాగే.. లైన్ 3 అండ్ 4 లో గరిష్టంగా గంటకు 80, కనిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చు. ORRలో కనీస వేగం గంటకు 40 కి.మీ. ఇంతకన్నా తక్కువ వాహనాలను ఓఆర్ఆర్పైకి అనుమతించరు. 🛣️ ఇక.. లేన్ల మధ్య వాహనాల జిగ్-జాగ్ కదలిక అనుమతించబడదు. 🛣️ పై వేగం ప్రకారం లేన్లను మార్చాలనుకునే అన్ని వాహనాలు ఇండికేటర్ లైట్లను ఉపయోగించిన తర్వాత మాత్రమే చేయాలి. 🛣️ అలాగే.. లేన్లను మార్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 🛣️ ఓఆర్ఆర్లోని నాలుగు లేన్లలో ఏ వాహనం కూడా ఆగకూడదు. 🛣️ ఏ ప్రయాణీకుల వాహనాలు ORRలో ఆపి ప్రయాణికులను ఎక్కించకూడదు. 🛣️ ORRపై టూవీలర్స్, అలాగే పాదచారులకు అనుమతి లేదు ORRలో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు లక్ష్యం పెట్టుకుంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. కొత్త నియమాలు డ్రైవింగ్ క్రమశిక్షణను తీసుకువస్తాయని, అలాగే.. గందరగోళాన్ని తగ్గిస్తాయని, పైగా.. ORRలో ప్రయాణాలు సాఫీగా సాగేందుకు ఉపకరిస్తాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆ నోటిఫికేషన్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ గవర్నమెంట్ స్కూళ్లలో వాళ్లకు నో ఎంట్రీ -
ఫాస్టాగ్ అకౌంట్ల నుంచి జరిమానాలు కట్.. ట్రాఫిక్ ఉల్లంఘనుల ఆటకట్టు!
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారి ఆటకట్టించేందుకు బెంగళూరు పోలీసులు సూపర్ ఐడియా వేశారు. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనదారులకు వారి ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను ఉపయోగించి జరిమానా విధించాలని ప్రతిపాదించారు. అతివేగం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కొన్ని రోజులుగా పలు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి సాయంతో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, వాహనం నడుపుతున్నప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను గుర్తిస్తున్నారు. ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి? ఇక టూవీలర్లు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి నెమ్మదిగా కదిలే వాహనాల వల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా వాటిని ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్లకుండా నిషేధించారు. తాజాగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓవర్‌స్పీడ్‌కు కళ్లెం వేయడానికి వాహనాల ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేసేందుకు ప్రతిపాదించారు. ఈ ఆలోచన ఇంకా ప్రతిపాదన స్థాయిలో ఉండగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటువంటి ఆలోచనను అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. దీన్ని సమర్ధవంతంగా అమలు చేస్తే జరిమానా వసూలు సులభతరంగా మారుతుంది. వాహనాలను మాన్యువల్‌గా ఆపి జరిమానాలు విధించే అవసరం ఉండదు. అయితే నేరుగా ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా ద్వారా జరిమానాలను వసూలు చేయడం అనేది ప్రధాన గోప్యతా సమస్యను లేవనెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాల నుంచి వసూలు చేస్తున్న జరిమానాల మొత్తం ఎన్హెచ్ఏఐకి వెళుతోందని, అలా కాకుండా ప్రభుత్వానికి జమ చేయాలనేది తమ ప్రణాళిక అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. -
బాలీవుడ్ స్టార్స్ ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్ ఇదే!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ బైక్ రైడ్‌పై ముంబయి పోలీసులు స్పందించారు. అమితాబ్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లేందుకు బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగి వెళ్లారు. అయితే బైక్‌పై ఇద్దరు ఎలాంటి హెల్మెట్ లేకుండా కనిపించారు. బైక్‌పై కూర్చొని ఉన్న చిత్రాన్ని బిగ్ బీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై ముంబయి పోలీసులు సైతం స్పందించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. (ఇది చదవండి: పెళ్లై 14 ఏళ్లు.. పిల్లలు లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్న నటి) మరోవైపు బాలీవుడ్ నటి అనుష్క శర్మ సైతం ఎలాంటి హెల్మెట్ లేకుండా బైక్‌పై కనిపించారు. తన బాడీగార్డ్‌తో బైక్ రైడ్ చేస్తూ కనిపించింది. వాళ్లద్దరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో నెటిజన్స్ వెంటనే ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలపై ముంబయి పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఎంత పెద్దవారైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని పోలీసులు సూచిస్తున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 2024లో విడుదల కానుంది. ఇదే కాకుండా బిగ్ బి రిభు దాస్‌గుప్తా మూవీ కోర్ట్ రూమ్ డ్రామా సెక్షన్ 84లో కనిపించనున్నారు. ఆ తర్వాత అతను టైగర్ ష్రాఫ్, కృతి సనన్ చిత్రం గణపత్‌లో కూడా నటించనున్నారు. (ఇది చదవండి: లైకా ప్రొడక్షన్స్‌పై ఈడీ దాడులు.. దాదాపు ఎనిమిది చోట్ల ఒకేసారి!) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) మరోవైపు.. అనుష్క చివరిసారిగా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో కలిసి జీరోలో కనిపించింది. ఈ ఏడాది ఆమె చక్దా 'ఎక్స్‌ప్రెస్‌తో తిరిగి సినిమాల్లోకి రానుంది. తన కూతురు వామిక పుట్టిన తర్వాత ఆమెకు ఇది మొదటి సినిమా కావడం విశేషం. #AnushkaSharma ditches the car and takes a bike ride to travel in the city! pic.twitter.com/jUwiCsyhbJ — Pinkvilla (@pinkvilla) May 15, 2023 We have shared this with traffic branch. @MTPHereToHelp — मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) May 15, 2023 -
బండెక్కితే భయమే! రాష్ట్రంలో రోజూ 20 మంది మృతి.. టాప్ 10లో తెలంగాణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రోడ్డెక్కగానే బండిని రయ్‌మంటూ పరుగెత్తిస్తారు.. జన సంచారం ఉండని హైవేలపై అయితే వాయు వేగంతో పోటీ పడతారు.. ఇలా దూసుకుపోతే ఆ కిక్కే వేరనుకుంటారు.. దీనికోసం ట్రాఫిక్ నిబంధనలనూ బేఖాతరు చేస్తారు.. ఇందులో కిక్కు ఎంత వస్తుందో వారికే తెలుసుగానీ.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం మాత్రం పెరిగిపోతోంది. రహదారులపై బ్లాక్ స్పాట్లు, వాహన వేగ నియంత్రణలో వైఫల్యం, హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వంటివి వేలకొద్దీ మరణాలకు కారణమవుతున్నాయి. కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. దీనితో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువై ప్రమాదాలు– మరణాల శాతం పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు. ప్రమాద మృతుల్లో 35ఏళ్ల లోపు వారే 46.3శాతం ఉంటుండటంపై ఆందోళన కరమని పేర్కొంటున్నారు. 2021 సంవత్సరానికిసంబంధించి కేంద్ర రవాణాశాఖ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించిన గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి. అతి వేగమే.. చంపేస్తోంది ♦ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18–35 ఏళ్లలోపు వారే అత్యధికంగా (46.3శాతం) ఉన్నారు. ఇందులోనూ 45.1శాతం టూవీలర్స్‌పై, 12.9 శాతం కార్లలో ప్రయాణిస్తున్నవారుకాగా.. 18.9శాతం మంది పాదచారులు. ♦ 71.7శాతం ప్రమాదాలు అతివేగంతో డ్రైవర్ వైఫల్యం వల్లే చోటు చేసుకున్నాయి. ఇందులో 31శాతం కొత్త వాహనాలు (5 ఏళ్లలోపువే) నడిపేవారే చేశారు. 9.5 శాతం మంది మద్యం–సెల్‌ఫోన్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాల బారినపడ్డారు. ♦ ప్రమాదాలు చేసిన వారిలో ఏడు శాతం మందికి లైసెన్స్‌లు కూడా లేకపోవడం గమనార్హం. ♦ నేషనల్ హైవేలపైనే అత్యధిక ప్రమాదాలు–మరణాలు చోటు చేసుకున్నాయి. 2021లో 1,28,825 (31.6శాతం) ప్రమాదాలు, 56,007 మరణాలు హైవేలపైనే నమోదయ్యాయి. ఆ ఏడాది తెలంగాణలోని హైవేల 2,735 మంది చనిపోయారు. ♦ 10 లక్షలు జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల విషయంలో చెన్నై, ఢిల్లీ, జబల్పూర్లో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ 8వ ప్లేస్‌లో ఉంది. మహానగరాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పాదచారులే. హైవేలపై లోపాలు సరిదిద్దక.. తెలంగాణ మీదుగా వెళుతున్న ప్రధాన హైవేలపై లోపాలను సరిదిద్దే అంశం వేగంగా ముందుకు కదలటం లేదు. అత్యధిక ప్రమాదాలు జరిగే హైవే–65 (మచిలీపట్నం– హైదరాబాద్– పుణే), హైవే–44 (కన్యాకుమారి–కశ్మీర్), హైవే–563 (భూపాలపట్నం–హైదరాబాద్)లపై పలుచోట్ల ఇంజనీరింగ్ లోపాలను గతంలోనే గుర్తించారు. వాటితో ప్రమాదాలు జరుగుతున్నట్టూ తేల్చారు. కానీ వాటిని సరిదిద్దే విషయంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైవే–65పై కోదాడ, మునగాల, కట్టంగూర్, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్‌వేలు నిర్మించాల్సి ఉంది. మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు. హైవే–44లోనూ నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఇంజనీరింగ్ లోపాలు అలానే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? తెలంగాణలో ప్రమాదాల నియంత్రణ దిశగా నూతన మోటార్ వెహికల్ యాక్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్‌లో లోపాలను సరిచేయడం, సైన్‌బోర్డులు, ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ను పెంచటం, ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందే చర్యలు తీసుకోవడం అవసరమని స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా తగిన అవగాహన కల్పించాలని పేర్కొంటున్నారు. ప్రమాదాల్లో యూఎస్.. మరణాల్లో భారత్.. వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్–2020 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 19,27,654 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్య (36,650)లో మూడో స్థానంలో నిలిచింది. భారత్ 4,12,432 ప్రమాదాలతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 1,53,972 మృతులతో మరణాల సంఖ్యలో మాత్రం టాప్‌లో నిలిచింది. అమ్మానాన్నను రోడ్డు మింగింది గత ఏడాది డిసెంబర్ 11న సూర్యాపేట జిల్లా అనంతగిరి నుంచి ఖమ్మం జిల్లా జల్లేపల్లికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రమేష్–రేణుక దంపతులు మృతిచెందడంతో.. వారి పిల్లలు కార్తీక్, హాసిని అనాథలుగా మారిపోయారు. -
ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే?
భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. రూల్స్ అతిక్రమించిన వారు ఎంతవారైనా వదిలిపెట్టే సమస్యే లేదని పోలీసులు కరాఖండిగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గోవా నగరంలో ట్రాఫిక్ పోలీసులు 40 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా రహదారులపై నడిచే ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలకు లోబడి ఉండాలి. అలా కాదని మోడిఫైడ్ చేసుకుని రోడ్లమీద తిరిగితే మాత్రం జరిమానాలు భారీగా చెల్లించాల్సి వస్తుంది. గోవాలో సీజ్ చేసిన వాహనాల ఎగ్జాస్ట్ మోడిఫై చేయబడ్డాయి. వాహనంలో కంపెనీ అందించే భాగాలు కాదని కొంతమంది తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. ఇదే వారిని సమస్యల్లోకి నెట్టేస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. సీజ్ చేసిన బైకులలో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: Pakistan Crisis: చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో) మోడిఫైడ్ చేసిన ఎగ్జాస్ట్ సాధారణ బైకుల కంటే ఎక్కువ సౌండ్ చేస్తాయి. ఇది ప్రజా రహదారుల్లో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తుంది. మోటార్ వెహికల్ యాక్ట్ నియమాలను ఉల్లంఘించిన కారణంగా అన్ని బైకులను సీజ్ చేసినట్లు మార్గోవ్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బైకులలో రాయల్ ఎన్ఫీల్డ్, ఇతర స్పోర్ట్స్ బైకులు ఎక్కువ శబ్దం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కొంతమంది బైక్ ప్రేమికులు తమ వాహనాలను మరింత మాడిఫైడ్ చేసుకోవడం వల్ల ఆ శబ్దం మరింత ఎక్కువవుతుంది. 80 డెసిబుల్స్ మించిన శబ్దాన్ని ఉత్పత్తి చేసే వాహనాలు చట్ట విరుద్ధం. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. -
లగ్జరీ కారు, బైక్‌లతో హల్చల్.. 77వేలు ఫైన్ వేసి ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు పదే పదే చెబుతున్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా యూత్.. బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారు. తాజాగా కొందరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఓవరాక్షన్ చేయగా ట్రాఫిక్ పోలీసులు వారిని ఏకంగా 77వేల జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలో హాపూర్‌లో నడిరోడ్డుపై కొందరు యువకులు హల్చల్ చేశారు. బెంజ్ కార్లు, బైక్‌లపై వెళ్తూ వీడియోలు తీసుకున్నారు. ఇన్స్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం నానా హంగామా క్రియేట్ చేశారు. హైస్పీడ్, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతూ పక్కన వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ వీడియోలు హాపూర్ ఎస్సీ అభిషేక్ వర్మ దృష్టికి చేరాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారి వాహనాలు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను గుర్తించి యువకులకు రూ.77,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ ప్రకారం.. వారికి జరిమానా విధించినట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచించారు. లేకపోతే భారీ జరిమానాలు సహా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు హెచ్చరించారు. -
Hyderabad: న్యూ ఇయర్ వేడుకలు.. ఇవి అస్సలు మరవద్దు!
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ పార్టీ విషయంలో సభ్యత, భద్రత మరువద్దని నగర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా వీటిని నిర్వహించుకోవాలని చెప్తున్నారు. సాధారణ సమయాల్లో హోటళ్లు, పబ్స్, క్లబ్స్‌ను రాత్రి 12 వరకే తెరిచి ఉంచాలి. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఒక గంట అదనంగా అనుమతించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి ఒంటి గంట తరవాత ఏ కార్యక్రమం కొనసాగకూడదని స్పష్టం చేస్తున్నారు. పోలీసులు జారీ చేసిన మార్గదర్శకాలివి.. కార్యక్రమాలకు వచ్చే ఆర్టిస్టులు, డీజేలకూ నిబంధనలున్నాయి. ►వీరి వస్త్రధారణ, హావభావాలు, పాటలు తదితరాల్లో ఎక్కడా అశ్లీలం, అసభ్యతలకు తావుండకూడదు. అక్కడ ఏర్పాటు చేసే సౌండ్ సిస్టం నుంచి వచ్చే ధ్వని తీవ్రత 45 డెసిబుల్స్ మించకూడదు. ►ఇళ్లు, అపార్ట్‌మెంట్స్‌లో వ్యక్తిగత పార్టీలు నిర్వహిస్తున్న వాళ్లూ పక్కవారికి ఇబ్బంది లేకుండా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి. న్యూ ఇయర్ కార్యక్రమాల్లో ఎక్కడా మాదకద్రవ్యాల వినియోగానికి తావు లేకుండా చూడాలి. వీటిని సేవించి వచ్చే వారినీ హోటల్స్, పబ్స్ నిర్వాహకులు అనుమతించకూడదు. ►యువతకు సంబంధించి ఎలాంటి విశృంఖలత్వానికి తావు లేకుండా, మైనర్లు పార్టీలకు రాకుండా నిర్వాహకులు చూసుకోవాలి. బౌన్సర్లు అతిగా ప్రవర్తించినా, ఆహుతులకు ఇబ్బందులు కలిగించినా వారితో పాటు ఏర్పాటు చేసిన సంస్థల పైనా చర్యలు తప్పవు. ►నిబంధనల పర్యవేక్షణ, నిఘా కోసం 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరు కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, వాటిని చిత్రీకరించడంతో పాటు ఆడియో మిషన్ల సాయంతో శబ్ధ తీవ్రతనూ కొలుస్తారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్ పార్క్‌రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. చదవండి: New Year Celebrations: అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో .. ►ఇక్కడ రేసులు, డ్రంకన్ డ్రైవింగ్ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్ చేసి డ్రైవ్ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. ‘సాగర్’ చుట్టూ నో ఎంట్రీ... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు. ఓఆర్ఆర్, వంతెనలు బంద్ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గలలో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్ నం–45, సైబర్ టవర్, ఫోరంమాల్–జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి లేదు. -
మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ
సాక్షి, బెంగళూరు: ప్రజలు ఎవరైనా బైక్ మీద హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకుని వేలకు వేల జరిమానా విధించి బండిని సీజ్ చేస్తారు. కానీ చట్టాన్ని కాపాడే పోలీసులే అతిక్రమిస్తే.. ఏమిటిది? అని ఓ మహిళ నిలదీసిన ఘటన వైరల్ అయ్యింది. నగరంలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు, అది కూడా ఇద్దరు హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వెళ్తున్నారు. వీరిని గమనించిన ఒక మహిళ రూల్స్ చేసేది మీరే, ధిక్కరించేది మీరే అని క్లాస్ తీసుకుంటూ వీడియో తీశారు. అత్యవసర కార్యం ఉండడంతో హెల్మెట్ లేకుండా వచ్చామని మహిళా కానిస్టేబుల్స్ సమాధానమిచ్చారు. మీరు ఏం చేశారో చూసుకోండి, దయచేసి స్కూటీలో నుంచి దిగి హెల్మెట్ ధరించండి అని వారికి మహిళ హితబోధ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: (మతాంతర ప్రేమ పెళ్లి కలకలం) -
Hyderabad: రాంగ్‌సైడ్, ట్రిపుల్ రైడింగ్‌కు ఇక బాదుడే
సాక్షి, హైదరాబాద్: రోడ్డు భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాంగ్ సైడ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వాహనదారులకు కళ్లెం వేసేందుకు సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించనున్నారు. వ్యతిరేక దిశలో వాహనాలను నడిపితే సెక్షన్ 119/177, 184 కింద రూ.1,700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1,200 జరిమానా విధించనున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 2020లో 15 మంది, 2021లో 21 మంది, ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 15 మంది, ట్రిపుల్ రైండిగ్ కారణంగా 2020లో 24 మంది, గతేడాది 15 మంది, గత నెలాఖరు వరకు 8 మంది మరణించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం కారణంగా ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చని, అందుకే స్పెషల్ డ్రైవ్‌లను చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: (కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బహిష్కరణ) -
వాహనాదారులకు బిగ్ షాక్.. అమల్లోకి కొత్త యాక్ట్!
సాక్షి, చెన్నై: కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు బుధవారం నుంచి కొరడా ఝులిపించారు. కొన్ని చోట్ల జరిమానాల మోత మోగించగా, మరికొన్ని చోట్ల వాహన చోదకులకు అవగాహన కల్పించి, హెచ్చరించి పంపివేశారు. రాజధాని నగరం చెన్నై తో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి భరతం పట్టేలా కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారుకు ఇకపై భారీ జరిమానా విధించనున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి మత్తు దిగేలా కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులే కాదు, లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్ఐ ఆపైస్థాయి అధికారులు సైతం బుధవారం నుంచి వాహన తనిఖీలపై దృష్టి పెట్టారు. పలు చోట్ల నిబంధనలు అతి క్రమించిన వారికి జరిమానాలు విధించారు. చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది! -
రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!
నిబంధనలకు అందరికీ వర్తిస్తాయి. అందుకు ఎవరూ అతీతులు కారు అని నిరూపించింది ఇక్కడ జరిగిన ఒక సంఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే...ఇక్కడోక పోలీసు సరైన హెల్మట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీస్‌కి అడ్డంగా దొరికిపోయాడు. అతనిపై హెల్త్ హెల్మెట్ కేసు బుక్‌చేసి కేసు నమోదు చేశారు ఈ ఘటన బెంగళూరులోని ఆర్టీ నగర్లో చోటు చేసుకుంది. నగర రహదారులపై ఇలా ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం. ఇలా గేర్‌లెస్ స్కూటర్ నడుపుతున్నప్పుడూ.. ఆఫ్ హెల్మట్ ధరించడం నేరం. ఈ మేరకు ఆర్టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ట్విట్టర్లో... ఇలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక పోలీస్‌పై ట్రాఫిక్ పోలీసు కేసు నమోదు చేసి జరిమానా విధించిన విషయాన్ని వివరిస్తూ..ఆ ఘటనకు సంబంధించిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈ వైరల్ ఫోటోని చూసి పోలీసులు సైతం నిబంధనలను అతిక్రమించడానికి వీల్లేదన్నట్లుగా జరిమానా విధించారంటూ... పలువురు ప్రశంసిస్తే, మరికొంతమంది ఇది స్టేజ్ స్టంట్ కాబోలు లేకపోతే సదరు వ్యక్తి ఫోటోలో ఎలా నవ్వుతున్నాడంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజకీయ నాయకుడి విడుదల...అట్టహాసంగా ఘనస్వాగతం) -
బాబోయ్ చలాన్ల బాదుడు.. అలా చేస్తే 2వేలు, 10వేల వరకు జరిమానా
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మోటారు వెహికల్ యాక్ట్‌లో తాజాగా కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జరిమానాల మోత మోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త రోడ్డు భద్రతా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సాక్షి, చెన్నై: రాజధాని చెన్నై సహా అనేక నగరాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కేవలం సిటీ దాటేందుకే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనూ కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే అనేక ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారిని, త్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్లే కుర్ర కారును, రాత్రుల్లో మద్యం తాగి నడిపే వారిని, బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునే వారిని ఇకపై ఊపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్‌లో సవరణలు చేసింది. ఫలితంగా జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలు కూడా మరింత కఠినమయ్యాయి. ఇందుకు తగ్గట్లు చెన్నైలో అనేక మార్గాల్లో పెద్దఎత్తున నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నేరగాళ్లను, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టనున్నారు. అమల్లోకి కొత్త జరిమానాలు.. ఇకపై అతివేగంగా వాహనం నడిపే వారికి తొలిసారి రూ. 1000, మళ్లీ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు రూ. 2 వేల విధించనున్నారు. మానసికంగా, ఆరోగ్య రీత్యా సామర్థ్యం లేని వారు వాహనాలు నడిపితే తొలిసారి రూ. 1000, రెండోసారి రూ. 2 వేలు వసూలు చేస్తారు. అంబులెన్స్, అగ్నిమాపక వంటి అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వకుండా వ్యవహరించే వాహనదారులకు విధించి ఫైన్‌ను రూ. 10 వేలుకు పెంచారు. నిషేధిత ప్రాంతాల్లో హారన్ ఉపయోగిస్తే రూ. 1000, రిజిస్ట్రేషన్లు సక్రమంగా లేని వాహనాలకు తొలిసారి రూ. 2,500, తర్వాత రూ. 5,000 , అధిక పొగ వెలువడే వాహనాలకు రూ. 10 వేలు, బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారి నుంచి రూ. 10 వేల వరకు ఫైన్ వసూలు చేస్తారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి రూ. 1000, సిగ్నల్ దాటితే రూ. 500 జరిమానాగా నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకూ ఆ అధికారం.. ట్రాఫిక్ పోలీసులే కాదు, ఇకపై లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్ఐ, ఆ పైస్థాయి అధికారుల కూడా వాహనాలు తనిఖీ చేసేందుకు, జరిమానా విధించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మోటారు వెహికల్ యాక్ట్‌లో మార్పులు చేశారు. రవాణాశాఖ చెక్‌పోస్టులు మినహా తక్కిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు జరిమానా విధించే నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. -
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లపై వాహనదారుల గరంగరం
-
పోలీసుల చలాన్లపై వాహనదారులు గరంగరం.. మైత్రివనంలో హైటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తమ బైక్‌లపై ట్రాఫిక్ చలాన్ విధించారని మైత్రివనం దగ్గర ట్రాఫిక్ పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి బైక్ స్టాప్‌లైన్‌ను దాటించాడని బైక్‌పై పోలీసులు చలాన్ విధించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన బైకర్.. తన బైక్‌కు తానే నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. కాగా, పోలీసులు నగరంలో చాలాచోట్ల ట్రాపిక్ నిబంధనలు పాటించని వారికి చలాన్లు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే తనిఖీల్లో పాత చల్లాన్లు ఉంటే కట్టాలని కూడా కోరుతున్నట్టు సమాచారం. అయితే, సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రూల్స్ ఇవే.. ► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా ► ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా ► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా జరిమానా విధిస్తారు. -
హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!
సాక్షి, హైదరాబాద్: సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. చలాన్లు వెంటనే విధించడం లేదని, మూడు రోజుల తర్వాత విధిస్తామని చెప్పారు. వాహనదారుల్లో పరివర్తన రావాలని, అన్ని సమస్యలు పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కొత్త రూల్స్ ఇవే.. ► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా ► ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా ► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా జరిమానా ప్రస్తుతానికైతే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆపరేషన్ రోప్ అమలుపై తనిఖీ చేసినట్లు ఆనంద్ తెలిపారు. వీటిపై నాలుగు రోజుల తర్వాత పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు. చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు -
ఫైన్ల మోత.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్ తెచ్చారు. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఒకవేళ లైన్స్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తారు. అలాగే.. ఎవరైనా ఫ్రీ లెఫ్ట్‌ను గనుక బ్లాక్ చేస్తే ఫైన్‌ను రూ.1000 గా నిర్ణయించారు. పుట్‌పాత్‌లపై దుకాణాదారులు వస్తువులు పెట్టడానికి వీల్లేదని, ఒకవేళ పెడితేగనుక భారీ జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అలాగే.. పాదాచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే గనుక రూ.600 ఫైన్ విధించనున్నారు. అయితే.. ఈ రూల్స్‌కు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలోని ప్రతీ ఒక్కరి జీవితంపై నేరుగా ప్రభావితం చూపే అంశం ట్రాఫిక్. ఇది సజావుగా సాగేలా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారం, సమన్వయం ఉంటే పూర్తి సాయి ఫలితాలు ఉంటాయి’ అని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న ఏడాది కాలానికి సిద్ధం చేసుకున్న ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్‌పై గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్వాల్ ఏం చెప్పారంటే.. క్యారేజ్ వే క్లియరెన్స్ కోసం ‘రోప్’... రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగాలంటే ఫుట్‌పాత్‌కు– ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్ వే క్లియర్‌గా ఉండాలి. ప్రస్తుతం ప్రధాన రహదారులు సహా అనేక చోట్ల అక్రమ పార్కింగ్, ఆక్రమణలతో క్యారేజ్ వే కనిపించట్లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆపరేషన్ రోప్ (రివూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌కరోజ్‌మెంట్స్) చేపడుతున్నాం. ఇందులో భాగంగా అదనపు క్రేన్లు సమకూర్చుకుని టోవింగ్ చేయడంతో పాటు అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలకు క్లాంప్స్ వేస్తాం. వాహన చోదకుడికి ఇబ్బంది లేకుండా వాటిపై స్థానిక అధికారుల ఫోన్ నంబర్లు ఉంచుతాం. తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణలనూ పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్స్ సహా ప్రతి భవనానికీ పార్కింగ్ ఉండేలా చూస్తాం. ఆర్టీసీ సహకారంతో బస్ బేల పునరుద్ధరణ, ఆటో స్టాండ్లు పూర్తి స్థాయి వినియోగంలోకి తేస్తాం. చదవండి: ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు! పీక్ అవర్స్‌లో మార్పులు.. ఒకప్పుడు నగర వ్యాప్తంగా ఒకే సమయాలు రద్దీ వేళలుగా ఉండేవి. ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయం పీక్ అవర్‌గా మారుతోంది. ఆయా వేళల్లో అన్ని స్థాయిల అధికారులూ రోడ్లపైనే ఉంటారు. ట్రాఫిక్ పర్యవేక్షణే మా తొలి ప్రాధాన్యం. జరిమానా విధింపులో ఎన్ని జారీ చేశారనేది కాకుండా ఎలాంటి ఉల్లంఘనలపై చేశారన్నది చూస్తాం. ట్రాఫిక్ ఠాణా వారీగా వీటిని విశ్లేషిస్తాం. ఉల్లంఘనల వారీగా ప్రతి వారం ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్లో టెక్నాలజీ వినియోగిస్తాం. స్టాప్ లైన్ వద్ద డిసిప్లిన్ కనిపిస్తే ఇతర ఉల్లంఘనలు తగ్గుతాయని గుర్తించడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వీలున్న ప్రతి జంక్షన్లో ఫ్రీ లెఫ్ట్ విధానం అమలు చేస్తాం. రద్దీ వేళల్లో అవసరమైన మార్గాలను రివర్సబుల్ లైన్లుగా మారుస్తాం. జంక్షన్లు, యూటర్నులను అభివృద్ధి చేయిస్తాం. తీవ్రమైన ఉల్లంఘలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక చర్యలు.. వాహన చోదకుల్లో అవగాహన పెంచడానికి సోషల్ మీడియా, షార్ట్ఫిలింస్ తదితరాలను వినియోగిస్తాం. ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయిస్తాం. బాటిల్‌నెక్స్‌ను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటాం. పబ్స్ అంశంలో జీహెచ్ఎంసీ, ఎక్సైజ్ అధికారులతో సమావేశమవుతాం. ప్రస్తుతం సిబ్బంది కొరత కారణంగా 150 జంక్షన్లలో మోహరించలేకపోతున్నాం. ఆయా వర్గాలతో సంప్రదింపులు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాల తర్వాతే చర్యలు ఉంటాయి. వ్యక్తిగత వాహనాల్లో గణనీయమైన పెరుగుదల ‘కొవిడ్ తర్వాత గ్రేటర్ పరిధిలో వ్యక్తిగత వాహనాలు గణనీయంగా పెరిగాయి. 2020 జనవరిలో 64 లక్షలున్న వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు నాటికి 18 శాతం పెరిగి 77.65 లక్షలకు చేరింది. కార్లు 11 లక్షల నుంచి 21 శాతం పెరిగి 14 లక్షలకు, ద్విచక్ర వాహనాలు 46.46 లక్షల నుంచి 17 శాతం పెరిగి 56 లక్షలకు చేరాయి. ప్రతి రోజూ డయల్–100కు వస్తున్న కాల్స్‌లో 70 నుంచి 80 శాతం ట్రాఫిక్ సమస్యల పైనే. భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అంతా కలిసి సమష్టిగా, సమన్వయంతో ముందుకు వెళ్లాలి’ -
Ind Vs Aus- Uppal: రోహిత్, దినేష్ కార్తీక్ ఫోటోలతో హైదరాబాద్ పోలీసుల ట్వీట్
సాక్షి, హైదరాబాద్- Ind Vs Aus 3rd T20- Hyderabad: హైదరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా నగర ప్రజలకు సూచనలు ఇస్తూ చైతన్యవంతం చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ నియమాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు.. ఇలా పలు అంశాలపై జాగ్రత్తలు చెబుతూ నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందుకోసం అప్పుడప్పుడూ పాపులర్ సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు ఉపయోగించి.. సృజనాత్మకంగా జనాలకు వివరిస్తుంటారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీసులు క్రికెట్‌ను ఇందుకోసం వాడుకున్నారు. ఓ ట్రెండింగ్ ట్వీట్‌తో ముందుకు వచ్చారు. హైదరాబాద్ వేదికగా.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రోహిత్, దినేష్ కార్తీక్‌కు చెందిన రెండు ఫోటోలను షేర్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఇందులో మొదటి ఫోటోలో రోహిత్ గ్రౌండ్లో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని ముఖాన్ని నలిపేసే ప్రయత్నం చేశాడు. When commuters follow traffic rules... #HelmetSavesLives #HyderabadCityPolice #wearhelmet #BeSafe #RoadSafety pic.twitter.com/DZwlQggJ6W — Hyderabad City Police (@hydcitypolice) September 26, 2022 రెండో దానిలో రోహిత్ దినేష్‌ను దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతున్నాడు. అయితే ఆ సమయంలో అతని ముఖానికి హెల్మెట్ ఉంది. ఈ రెండిటిని హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విటర్లో షేర్ చేస్తూ.. ప్రయాణికులు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో వెల్లడించారు. హెల్మెట్ ధరించకుంటే ప్రమాదమని, అదే హెల్మెట్ ధరిస్తే అందరూ సంతోషంగా ఉండచ్చనే అనే కోణంలో ఈ మేరకు ట్వీట్ చేశారు. -
30 వాహనాలు..రూ.68.57 లక్షలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను మూడు కేటగిరీలుగా ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించారు. డీసీఎం వంటివి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఈ మూడు విభాగాల్లోనూ టాప్ టెన్ చొప్పున మొత్తం 30 వాహనాలు ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.68,57,230 చెల్లించినట్లు తేలింది. వీటిపైనే ట్రాఫిక్ విభాగం 24,510 చలాన్లు జారీ చేసింది. జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాల్లో కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. కేవలం పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకే నగరంలో 24 గంటలూ సంచరించే ఆస్కారం ఉంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను రాత్రి వేళల్లో మాత్రమే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం శీతల పానీయాల సరఫరా, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనే వాహనాలు సంచరిస్తుంటాయి. ఇవి ఆయా దుకాణాల పని వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం అనివార్యం. ఇలా వచ్చిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరో జరిమానా విధించడానికి ఆస్కారం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగరంలో సంచరిస్తున్నాయి. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతితక్కువ కావడంతో ఈ పని చేస్తున్నాయి. ఈ తరహాకు చెందిన 10 వాహనాలు ఐదేళ్ల కాలంలో రూ.56,43,700 జరిమానాగా చెల్లించాయి. ఇలాంటి వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై 24 గంటలకు ఒక చలాన్ కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ఓ చలాన్ విధించడానికి ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కమర్షియల్ వాహనాల విషయం ఇలా ఉంటే.. ద్విచక్ర వాహనచోదకులూ ‘రికార్డులు’ సృష్టిస్తున్నారు. టూ వీలర్ నడిపే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇలా చేయని వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది ద్విచక్ర వాహనాలపైనే ఐదేళ్లల్లో 2,236 ‘హెల్మెట్’ జరిమానాలు పడ్డాయి. ఇతర ఉల్లంఘనలతో కలిపి మొత్తం 2,818 చలాన్లకు సంబంధించి ఇవి చెల్లించిన జరిమానా మొత్తం రూ.4,01,370గా ఉంది. ఫైన్లను ఈ వాహనచోదకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక గూడ్స్, సాధారణ ఆటోలు చేసే ఉల్లంఘనల్లో అత్య«ధికం ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్‌లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ కేటగిరీలో ‘టాప్ టెన్’ వాహనాలపై ఐదేళ్లల్లో 6,516 చలాన్లు జారీ కాగా వీటిలో అత్యధికంగా 2,847 సరుకు ఓవర్ లోడింగ్వే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రయాణికులను ఎక్కువగా ఎక్కించుకోవడంపై 2,659, రాంగ్ పార్కింగ్‌పై 574 జారీ అయ్యాయి. వీటితో సహా పది వాహనాలు ఐదేళ్లల్లో రూ.8,12,160 జరిమానా చెల్లించాయి. (చదవండి: ఫార్ములా- ఈ పనులు రయ్ ..రయ్) -
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి!.. ట్రాఫిక్ పోలీసులనే తికమక పెట్టాడు
బనశంకరి(బెంగళూరు): జరిమానా చెల్లించకుండా తప్పించుకునేందుకు ఓ ద్విచక్రవాహనదారుడు తన బుల్లెట్ బైక్‌కు ముందు, వెనుక వేర్వేరు నంబర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను బోల్తా కొట్టించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన మరిగౌడ పలు పర్యాయాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో రూ.29 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముందు వైపు ఒక నంబర్, వెనుక వైపు మరో నంబర్ రాయించాడు.దీంతో పలు మార్లు ట్రాఫిక్ పోలీసులు ముందు ఒక నెంబర్ వెనక మరొకటి చూసి చూసి తికమక పడ్డారు. చివరికి ఈనెల 29వ తేదీన మరిగౌడ రాజాజీనగర కూలినగర వంతెన వద్ద సంచరిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 12 వరకు రిమాండ్ విధించారు. చదవండి: నిత్య పెళ్లికొడుకు సతీష్ తెలుగుతమ్ముడే! -
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా.. ఇక వారి ఆటలు సాగవు
బనశంకరి: కర్నాటకలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ ఉల్లంఘనులపై నిఘా కోసం అమర్చిన ఆటోమేటిక్ నంబరు ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా 3 లక్షల 90 వేల పెండింగ్ కేసులను కనిపెట్టారు. అతిక్రమణదారుల నుంచి రూ. 21 కోట్లు జరిమానాలను వసూలు చేశారు. మార్చి నుంచి అమల్లోకి బెంగళూరు నగరంలో అధిక వాహనాల రద్దీ కలిగిన జంక్షన్లు, ప్రముఖ వాణిజ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల ప్రమేయం లేకుండా సంచార వ్యవస్థ నిర్వహణ కోసం ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 చోట్ల ఏఎన్పీఆర్ కెమెరాలు అమర్చారు. అప్పటి నుంచి జూలై 19 వరకు రోజుకు సరాసరి 2,765 ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులను గుర్తించారు. చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలు అనేకం దొరికాయి. అలా 3.90 లక్షల పెండింగ్ కేసులను కనిపెట్టారు. ఎలా పనిచేస్తాయంటే అత్యాధునిక పరిజ్ఞానంతో ఇవి పనిచేస్తాయి. ఏఎన్పీఆర్ కెమెరాలు అమర్చిన మార్గాల్లో సంచరించే వాహనాల నంబరు ప్లేట్లపై కెమెరాలు నిఘాపెడతాయి. ఆ నంబరుతో వాహనాలు నియమాల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే నమోదు చేసి తక్షణం సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మొబైల్‌కు మెసేజ్ పంపుతుంది. దీని ఆధారంగా పోలీసులు సదరు వాహనం దగ్గరికి రాగానే వాహనదారున్ని అడ్డుకుని కేసు రాసి జరిమానా వసూలు చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఏర్పాటు? ఈ కెమెరాలను అమర్చడంతో ట్రాఫిక్ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే తరహా కెమెరాలు అమర్చాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ఏఎన్పీఆర్ కెమెరాలు అమరుస్తున్నారు. ఏఎన్పీఆర్ కెమెరాలు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన, పాత కేసుల ఆచూకీ కనిపెట్టడంతో పాటు చోరీకి గురైన వాహనాలను కనిపెట్టేందుకు సాయపడతాయని జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బీఆర్ రవికాంతేగౌడ తెలిపారు. 69 చలానాలతో దొరికాడు సుమారు 69 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడి జరిమానా చెల్లించని బైకిస్టు కోరమంగల 6వ బ్లాక్ 80 ఫీట్ రోడ్డులో అమర్చిన ఏఎన్పీఆర్ కెమెరా సమీపంలో దొరికాడు. అతని గురించి ట్రాఫిక్ పోలీసుల మొబైల్‌కు మెసేజ్ రావడంతో నిఘా వేసి పట్టుకున్నారు. నేను హెల్మెట్ పెట్టుకున్నాను, సక్రమంగా నడుపుతున్నా, ఎందుకు వాహనాన్ని అడ్డుకున్నారని వాగి్వవాదం చేశాడు. అతని వాహన రిజి్రస్టేషన్ నంబరు ఆధారంగా పరిశీలించగా గతంలో 69 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినట్లు నమోదై ఉంది. రూ.34,600 జరిమానాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇది కూడా చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
సిగ్నల్ జంప్! పైగా నా కారే ఆపుతావా? అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కుమార్తె చిందులు
బెంగళూరు: ట్రాఫిక్‌లో సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించింది ఓ యువతి. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది. తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు తన బీఎండబ్ల్యూ కారు డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఓచోట రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా రయ్‌మంటూ దూసుకెళ్లింది. ఇది తెలిసిన ట్రాఫిక్ పోలీస్ ఆమె కారును ట్రేస్ చేసి రాజ్‌భవన్ రోడ్డు వద్ద ఆపారు. కారును పోలీసులు అడ్డుకోవడంతో చిర్రెత్తిన ఎమ్మెల్యే కుమార్తె నా కారే ఆపుతావా అంటూ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ‘నేనే ఎవరో తెలుసా. నేను ఇప్పుడు వెళ్లాలి. నా కారును ఆపోద్దు. ఓవర్టేక్ చేసినందుకు నాపై కేసు పెట్టలేవు. ఇది ఎమ్మెల్యే వాహనం. మా నాన్న అరవింద్ లింబావలీ’ అంటూ పోలీసులపై రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతోనూ గొడవ పడింది. దీంతో రాజ్‌భవన్ వద్ద జనాలు గుమిగూడటంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా యువతి సీట్ బెల్టుకూడా పెట్టుకోలేదని తెలిసింది. అయితే ఆమె మాటలు పట్టించుకొని పోలీసులు యువతికి జరిమానా విధించారు అలాగే బీఎండబ్ల్యూ కారు నెంబర్‌పై చలాన్లు పరిశీలించగా పోలీసులు ఖంగుతున్నారు. ఆమె వాహనంపై 9 వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక ప్రస్తుతం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించారు. దీంతో మొత్తం 10 వేలను ఆమె ఉంచి పోలీసులు రాబట్టారు. SHOCKING! VVIP arrogance on full display! BJP MLA's daughter abuses cops and even, later on, slaps a journalist. Imran (@KeypadGuerilla) joins @DEKAMEGHNA with details.#NewsPulse | #AravindLimbavali #BJP pic.twitter.com/c2PiMhPA3W — TIMES NOW (@TimesNow) June 9, 2022 కాగా దృశ్యాలను కొందరు సెల్ఫోన్లో వీడియోలు తీయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దుర్భాషలాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కుమార్తె చర్యలను సదరు ఎమ్మెల్యే సమర్ధించుకోవడం గమనార్హం. కూతురు ఏ తప్పు చేయలేదని, ఇలాంటి ఘటనలు రోజూ వేలాదిగా జరుగుతాయన్నారు. జర్నలిస్ట్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు వస్తున్న ఆరోపణలను సైతం ఆయన తోసిపుచ్చారు. అయితే ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో ఎట్టకేలకు తన కూతురు తరపున బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ క్షమాపణలు కోరారు. ట్రాఫిక్ పోలీసులు, జర్నలిస్టులతో అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పారు. -
‘స్పీడ్’ రూల్స్ ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో వాహనాల వేగానికి కళ్లెం వేసేలా పక్కాగా ప్రణాళిక అమలు చేయడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ సన్నాహాలు చేస్తోంది. ఈ–చలాన్లు విధించడం మొదలెట్టడానికి ముందు కొన్ని రోజుల పాటు వాహనచోదకులకు అవగాహన పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రవాణా శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కి.మీ., మిగిలిన వాహనాలు 50 కి.మీ., అవి లేని రూట్లలో వీటి వేగాన్ని గంటకు 50 కి.మీ., 40 కి.మీ.గా నిర్దేశించారు. కాలనీల్లో ఏ వాహనమైనా గంటకు 30 కి.మీ. వేగమే. ప్రస్తుతం రహదారులపై ఉన్న సూచికల బోర్డుల్లో పాత వేగ పరిమితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో ఆయా ప్రాంతాల్లో కొత్తగా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఇక పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించడానికి ప్రస్తుతం ఆరు స్పీడ్ లేజర్ గన్స్, 44 సీసీ కెమెరాలను అనుసంధానించిన సాఫ్ట్వేర్ ఉపకరిస్తున్నాయి. వీటిని మరింతగా పెంచాలని భావిస్తున్నారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి ఉండే సీసీ కెమెరాలు తమ ముందు ప్రయాణిస్తున్న వాహనం వేగాన్ని క్షణాల్లో గుర్తించగలుగుతాయి. పగలు, రాత్రి కూడా వేగాన్ని గుర్తించడానికి ఉపకరించే విధంగా సాఫ్ట్వేర్, కెమెరాలను అభివృద్ధి చేయనున్నారు. పరిమితికి మించిన వేగంతో ప్రయాణించే వాహనాలకు చలాన్లు జారీ చేసే ముందు పెద్ద ఎత్తున అవగాహన కల్పించనున్నారు. దీనికోసం సైనేజ్ బోర్డులు, సోషల్ మీడియా తదితరాలను వాడాలని నిర్ణయించారు. సుదీర్ఘ అధ్యయనం చేశాం నగరంలో వేగ పరిమితుల విధింపుపై సుదీర్ఘ అధ్యయనం చేశాం. చండీఘర్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు సిటీల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేశాం. చండీఘర్ మోడల్‌ను హైదరాబాద్‌కు అనువుగా మార్పుచేర్పులు చేసి సిఫార్సు చేశాం. ఉత్తర్వుల్లో ఉన్న వేగ పరిమితులు అన్ని రహదారులకు వర్తిస్తాయి. తాజా ఉత్తర్వులు అమలులో వచ్చినా ఓఆర్ఆర్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే మార్గాల్లో గతంలో సూచించిన వేగమే వర్తిస్తుంది. రింగ్ రోడ్ మీద లారీలు గంటకు 80 కి.మీ., కార్లు వంటివి గంటకు 100 కి.మీ., ఎక్స్‌ప్రెస్ వే మీద గంటకు 80 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ (చదవండి: ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు ) -
సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!
చట్టాలు కఠినతరం చేస్తున్నా, జరిమానాలు భారీగా విధిస్తున్నా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఆగడం లేదు. అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, సిగ్నల్స్ పట్టించుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్), మరో రెండు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్‌తో పరేషాన్ హైదరాబాద్‌లో 16.5 శాతం మంది దిచక్ర వాహన చోదకులు డ్రైవింగ్ చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నారని అధ్యయనంలో తేలింది. వీరిలో 71.7 శాతం మంది ఫోన్‌ను చేతితో పట్టుకోకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంటే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వినియోగిడం లేదా ఫోన్‌ను హెల్మెట్ లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారన్న మాట. వీక్‌డేస్(35.49%)తో పోలిస్తే వారాంతాల్లో సెల్‌ఫోన్ డ్రైవింగ్(64.51%) చేసే వారే ఎక్కువగా ఉన్నారు. బిజీ రోడ్లలో 26.08%, రద్దీ లేని రహదారుల్లో 73.92% మంది దిచక్ర వాహనదారులు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నారు. రద్దీ సమయాల్లో పోలిస్తే(30.09%), రద్దీలేని సమయంలోనే (69.91%) ఈ ట్రెండ్ ఎక్కువగా కనబడుతోంది. చట్టంలో సవరణలు చేయాలి అధ్యయంలో భాగంగా మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట, మేడ్చల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను వీడియో తీసి విశ్లేషించారు. ఏయే సమయాల్లో ఆయా రహదారులపై వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. ‘ఎక్కువ మంది వాహన చోదకులు హేండ్ ఫ్రీ మోడ్‌లోనే డ్రైవ్ చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ బండి నడిపే వారి సంఖ్య వీకెండ్లోనే అధికంగా ఉంటోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాన్-బిజీ రోడ్లపై రద్దీ తక్కువగా సమయంలోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా కనబడుతోంది. వీక్‌డేస్‌తో పోలిస్తే ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే వారి సంఖ్య వారాంతాల్లో ఒకటిన్నర శాతం అధికంగా ఉన్నట్టు గుర్తించాం. చేతులతో ఫోన్ పట్టుకుని వాహనం నడిపేవారితో పాటు హేండ్ ఫ్రీ ఫోన్ డ్రైవింగ్ చేసే వారికి కూడా జరిమానాలు విధించేలా మోటార్ వెహికల్ చట్టంలో సవరణలు చేర్చాల’ని పరిశోధకులు కోరుతున్నారు. (క్లిక్: ఫోర్త్ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ) మూడేళ్లలో 85 వేల కేసులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. గత మూడేళ్లలో 85,862 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే వారిపై మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 184 కింద కేసులు నమోదు చేస్తామన్నారు. 85,862 కేసుల్లో దాదాపు 68,900 కేసులకు సంబంధించి జరిమానాలు వసూలయ్యాయని.. 16,782 జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. 2021లో 36,566 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. (క్లిక్: మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!) -
హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే లైసెన్స్ రద్దు!
న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముంబైలో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేస్తే మూడు నెలలపాటు లైసెన్స్ రద్దు చేస్తాం అని పోలీసులు చెప్పారు. అంతేకాదు యూట్యూబ్‌లో ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన వీడియోని ముంబై పోలీసులు పోస్ట్ చేశారు కూడా. ఆ వీడియోలో ...."హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ప్రతి వ్యక్తి చలాన్ని వెంటనే ఆర్టీవోకి పంపతాం. దీంతో మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా జరిమాన కూడా విధించబడుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి సమీపంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ పంపిస్తాం. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే వీడియోలను చూపిస్తాం." అని డీసీపీ రాజ్ తిలక్ రోషన్ పేర్కొన్నారు. అలాగే ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడూ హారన్లు మోగించకుండా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డెసిబెల్ మీటర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరైన గనుక ఇలా హారన్ మోగిస్తే ఆయా వాహనాల వ్యక్తుల డబుల్ టైం వెయిటింగ్ చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. అదీగాక ముంబై ప్రపంచంలోనే అత్యంత ధ్వనించే నగరాల్లో ఒకటి. పైగా ముంబై వాసులు రెడ్ సిగ్నల్ వద్ద కూడా హారన్లు వేయడంతో శబ్దకాలుష్యం ఎక్కువ అతుతోందని, దీన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ పోలీస్ కమీషనర్ మధుకర్ పాండే అన్నారు. (చదవండి: రిక్షాలో మినీ గార్డెన్...ఫోటోలు వైరల్) -
తగ్గేదేలే.. అంతా మా ఇష్టం..
సాక్షి,చార్మినార్(హైదరాబాద్): పాతబస్తీలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తున్నారు. పాతబస్తీలోని దక్షిణ మండలంలో చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్‌నుమా, బహదూర్‌పురా నాలుగు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో రెండు, మూడు జాతీయ రహదారులతో పాటు ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజు వాహనాల రాకపోకలు జోరుగా కొనసాగుతాయి. అయితే కొంత మంది వాహనదారులు నిబంధనలు డోంట్ కేర్ అంటూ.. వాహనాలను ఇష్టానుసారంగా నడుపుతూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఉన్నా.. వారు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ► ప్రధాన కూడళ్లలో ఆశించిన మేరకు ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోవడం, సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు విధి నిర్వహణలో ఉండాల్సినప్పటికీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ► అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రోడ్లలో సైతం యువతీ, యువకులు రయ్.. మంటూ దూసుకెళ్తూ ఇతర వాహనదారులకు ఆటంకాలు కలిగిస్తున్నారు. నంబర్ ప్లేట్ల మార్పులు.. ► పాతబస్తీలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను మార్చేస్తున్నారు. ► కొందరైతే ఉద్దేశపూర్వకంగా తమ నంబర్ ప్లేట్లను కనిపించకుండా సగం వరకు వంచేయడం, ఇంకొందరు విరగ్గొట్టడం, ప్లాస్టర్లు అతికించడం వంటివి చేస్తూ ఆర్టీఏ, ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. (చదవండి: మరమ్మతు చేస్తుండగా కరెంట్ సరఫరా ) ప్రమాదాలు కొని తెచ్చుకునేలా.. ► అసలే ఇరుకు రోడ్లు.. ఆపై రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో స్పీడ్‌గా వాహనాలను నడపడానికి పాతబస్తీలో ఏ మాత్రం అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు కుర్రాళ్లు రెట్టింపు ఉత్సాహంతో స్పీడ్‌గా ముందుకెళ్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ► ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల బారీ నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇతరులకు ప్రమాదాలు కలిగించరాదంటూ అవగాహన కల్పిస్తామన్నారు. పాతబస్తీలో కూడా ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేస్తాం. – శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, దక్షిణ మండలం -
హైదరాబాద్‌లో వర్క్ ఫ్రం ఆఫీస్.. బ్యాక్ టు ‘ట్రాఫిక్ రూల్స్’
సాక్షి, హైదరాబాద్: దశల వారీగా ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులూ సన్నద్ధమవుతున్నారు. ఐటీ కారిడార్‌లో క్రమగా వాహనాల రద్దీ పెరుగుతోంది. వ్యక్తిగత వాహనాలు, ట్రావెల్ బస్సులలో ఉద్యోగులు కార్యాలయాలకు హాజరవుతుండటంతో ఐటీ కారిడార్ జంక్షన్లలో ఉదయం, సాయంత్రం సమయాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ఇప్పటికే ఆయా కారిడార్లలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద పని చేయని సిగ్నల్స్, సీసీ కెమెరాలను రిపేరు చేసి పోలీసులు నిర్వహణకు సిద్ధం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత... ► కరోనా ప్రభావంతో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ముగించేందుకు ఐటీ కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉద్యోగులు దశల వారీగా ఉద్యోగులు హాజరయ్యేలా కంపెనీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ► తొలుత సగం మంది ఉద్యోగులను వారం విడిచి వారం ఆఫీసులకు వచ్చేలా.. క్రమంగా హాజరు శాతాన్ని పెంచుతూ.. రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు ప్రత్యక్ష విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ► సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్‌కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. (క్లిక్: హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ భారీ డేటా సెంటర్) ► ఐటీ కారిడార్‌లో ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల రద్దీ పెరగనుంది. ఇందుకు తగ్గట్టుగానే జంక్షన్లు, సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పని చేయని సిగ్నళ్లు, పాడైపోయిన కెమెరాలను బాగు చేయడంతో పాటూ, వార్షిక సర్వీస్‌లను చేసే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తగా మూడు సెక్టార్లు.. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 10 ట్రాఫిక్ పీఎస్‌లు ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో కొత్తగా మూడు ట్రాఫిక్ సెక్టార్లు ఏర్పాటు చేశారు. సిటీ నలుమూలల నుంచి ప్రతి రోజు ఉద్యోగులు మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి వంటి ప్రాంతాలకు వస్తుంటారు. దీంతో ఆయా ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై ఒత్తిడి తగ్గి, ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుందని అధికారులు భావించారు. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి ట్రాఫిక్ పోటీస్ స్టేషన్ల పరిధిలో కొత్తగా మూడు సెక్టార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ► మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో రాయదుర్గం సెక్టార్ ► గచ్చిబౌలి పీఎస్ పరిధిలో నార్సింగి సెక్టార్ ► కూకట్పల్లి పీఎస్ పరిధిలో కేపీహెచ్‌బీ సెక్టార్‌ను ఏ ర్పాటు చేశామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ► ఒక్కో సెక్టార్‌కు ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు, 45 మంది కానిస్టేబుళ్లు కేటాయించారు. (క్లిక్: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ) -
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్.. ఇక ఇంటికొస్తారు!
‘ఖెరతాబాద్ చౌరస్తాలో సిగ్నల్ జంపింగ్ చేసిన ఓ యువకుడు అదే జోష్‌లో రాయదుర్గంలోని తన ఇంటికి చేరుకున్నాడు. మర్నాటి మధ్యాహ్నం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అతడి ఇంటికి వచ్చారు. కౌన్సిలింగ్ చేయడంతో పాటు అతడి వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు కట్టించారు’. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ స్థితిగతులను మెరుగుపరచడం, రోడ్డు ప్రమాదాలను నిరోధించడం దృష్టి పెట్టిన ట్రాఫిక్ విభాగం అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని చౌరస్తాలు, జంక్షన్లలో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్ చెప్పే విషయంలో వినూత్నంగా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా ఆ తరహా ఉల్లంఘనుల ఇంటికి పంపడానికి ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నామని సిటీ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రమాదాలు మూడు తరహాలు... ట్రాఫిక్ విభాగం అధికారులతో పాటు రహదారి భద్రత నిపుణులు సైతం రోడ్డు ప్రమాదాలను మూడు తరహాలకు చెందినవిగా చెబుతుంటారు. వాహనం నడిపే వ్యక్తి మాత్రమే ప్రమాదకరంగా పరిగణించేవి మొదటి రకమైతే.. ఎదుటి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నవి రెండో తరహాకు చెందినవి. ఈ రెంటికీ మించి వాహన చోదకుడితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం జరగడానికి కారణమయ్యే వాటిని మూడో కేటగిరీగా పరిగణిస్తారు. సాధారణంగా ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కోవకు చెందిన వాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ నిరోధానికి చర్యలు తీసుకుంటూ ఉంటారు. కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ.. నగరంలోని కొన్ని జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పతుడున్న వారి వల్ల.. వారితో పాటు ఎదుటి వారికీ ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్, జిగ్‌జాగ్ డ్రైవింగ్ వంటి వైలేషన్స్ ఎక్కువ ఇబ్బందికరంగా ఉన్నట్లు గుర్తించారు. చౌరస్తాలు, జంక్షన్లలో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, ఫొటో, వీడియోలు తీయడానికి బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అదనపు సిబ్బందిని మోహరించనున్నారు. వీరు ఆ తరహా ఉల్లంఘనులను, వారి వాహనం నంబర్ ఆధారంగా చిరునామా గుర్తిస్తారు. వైలేషన్ చోటు చేసుకున్న మరుసటి రోజే ఉల్లంఘనుడి ఇంటికి వెళ్లడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. అక్కడిక్కడే వెరిఫై చేయడం ద్వారా ఆ వాహనంపై ఉన్న చలాన్లు గుర్తించి కట్టిస్తారు. జంక్షన్లలోనూ ప్రమాదాలు.. నగరంలో 2019– 21 మధ్య కాలంలో నగరంలో చోటుచేసుకున్న ప్రమాదాలను ట్రాఫిక్ విభాగం అధికారులు అధ్యయనం చేశారు. అవి జరిగిన సమయాలతో పాటు ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సిటీలోని అనేక జంక్షన్లు, యూ టర్న్స్ వద్ద పెద్ద సంఖ్యలోనే ప్రమాదాలు జరిగినట్లు తేల్చారు. ద్విచక్ర వాహనచోదకులు జంక్షన్లలో చేస్తున్న ఉల్లంఘనల కారణంగానూ ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ వైలేషన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండింటికీ సమ ప్రాధాన్యం నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నిరోధానికీ సమ ప్రాధాన్యమిస్తున్నాం. అందులో భాగంగానే జంక్షన్లలో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి, వారి ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ చేయడానికి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేస్తున్నాం. వాహన చోదకుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతో పాటు వారిలో బాధ్యత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
-
ఇదేందయ్యో.. బైక్‌పై ఏకంగా ఐదుగురు, నెంబర్ ప్లేట్ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. వాహనదారులు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డుపై వెళ్తూనే ఉంటారు. నింబంధనలు ఉల్లంఘించిన వారిని రోడ్డుపైనే నిలిపి పోలీసులు చలానాలు రాసినా.. ఫోటోలు తీసి ఇంటికి జరిమానాలు పంపినా కూడా కొంత మంది మాత్రం పట్టించుకోకుండా యాథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కకుండా కొంతమంది తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా దాచేస్తారు. తాజాగా ఓ వ్యక్తి ఎన్టీఆర్ గార్డెన్స్ రోడ్డు గుండా వెళ్తూ నిబంధనలు ఉల్లంఘించాడు. బైక్‌పైన ఏకంగా నలుగురిని ఎక్కించుకుని వెళ్తున్నాడు. సీసీ కెమెరాల్లో చిక్కకుండా నెంబర్ ప్లేట్‌కు ఓ సంచీని అడ్డుపెట్టి మరో ఉల్లంఘనకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఓ నెటిజన్ స్పందించి.. ‘ఐదుగురితో వెళ్లడమే కాకుండా.. నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేయడం మరో ఉల్లంఘన. ఇలా అయితే ఎలా? ’ అని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిబంధనలు ఉల్లంఘించిన బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు రిప్లై ఇచ్చారు. -
మాజీ ప్రియుడిపై ప్రతీకారం, పక్కా ప్లాన్.. అందుకు 50 సార్లు..
ప్రేమలో ఉన్నప్పుడు బంగారం, బుజ్జి, బేబీ అని ముద్దుగా పిలుచుకునే ప్రేమికులు అదే వారి బ్రేకప్ తర్వాత ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవాలని ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా ఓ యువతి తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ యువతి తన మాజీ ప్రియుడితో భారీగా జరిమానా కట్టేలా ప్లాన్ చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో షాక్సింగ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి తన మాజీ ప్రియుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందుకోసం ఆమె.. అతని కారుని అతడికే తెలియకుండా అద్దెకు తీసుకుంది. ఆ కారుతో రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు 2 రోజుల్లోని 50 సార్లు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించింది. దీని కారణంగా అతను భారీగా ఫైన్లు కట్టలాని ప్లాన్ వేసింది. కాకపోతే ఈ తరహా ఉల్లంఘన వింతగా ఉండడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లోనే 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో సులువుగానే స్థానిక పోలీసులు ఆ కారును గుర్తించారు. చివరకు అసలు విషయం బయటపడడంతో పాటు ఆ యువతిని అరెస్ట్ చేశారు. పాపం ఆ యువతి ప్లాన్ అయితే వేసింది గానీ చివర్లో అది ఫైయిల్ కావడమే గాకా కటకటాలపాలైంది. -
నేను ఎప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాను : టాలీవుడ్ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని టాలీవుడ్ నటి అంజలి పేర్కొన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ నిబంధనలపై నగర పోలీసులు ఎంజే మార్కెట్లో శనివారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ట్రాఫిక్ అవగాహనపై సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూపొందించిన మూడు షార్ట్ ఫిలిమ్స్‌ను అంజలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. తను ఎల్లప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తానని పేర్కొన్నారు. నా డ్రైవర్‌కు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్తానని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడానికి కారణమవుతోందన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్, డ్రగ్స్, ఇతర చెడు అలవాట్ల కారణంగా సమాజం ప్రభావితం అవుతుందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహణ కోసం కార్యక్రమం ఏర్పాటు చేశామని, ప్రతది రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైవేలపై జరిగే ప్రమాదాలకు అతివేగం కారణమవుతోందని అన్నారు. సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపిస్తున్నారు కానీ బయట పోలీసులు నిజమైన హీరోలని, ప్రతది ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబద్ సీపీ అంజనీ కుమార్, అడిషనల్ సీపీ అనిల్ కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. చదవండి: జాగ్రత్త.. ఇక మీకు మామూలుగా ఉండదు! -
జాగ్రత్త: ఇక మీకు మామూలుగా ఉండదు!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా.. జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు పడే పాట్లు వర్ణనాతీతం. ఆ మధ్య కేబుల్ బ్రిడ్జిపై ఫొటోల కోసం ఆగిన ఓ కుటుంబం, రోడ్డుకు అడ్డంగా నిలుచోవడమే గాకుండా, తమ బండి నంబరు కెమెరాకు చిక్కకుండా చున్నీని అడ్డుపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక మొన్నటికి మొన్న, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడమే కాకుండా ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ, నంబరు ప్లేటు కనిపించకుండా ఓ మహిళ కాలు అడ్డుపెట్టిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిలాగే, చలానాలు తప్పించుకోవడం కోసం బైకర్లు చేస్తున్న చిత్రవిచిత్ర విన్యాసాల ఫొటోలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు. (చదవండి: ఎంత పని జేశినవ్ అక్క..!) పైగా అలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పామో ఫన్నీ మీమ్స్ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం... నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలే గానీ, ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయరాదని చెప్పడమే. అయినా మంచిగా చెప్తే ఎవరు మాత్రం వింటారు.. అందుకే ఓవైపు అవగాహనా కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు భారీ జరిమానాలతో షాకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బీ సిటిజెన్ పోలీస్(పౌర పోలీసు)’ అంటూ బాధ్యత గల పౌరులుగా మెలగమంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ వాట్సాప్ నంబరును షేర్ చేశారు. ఈ మేరకు.. ‘‘సైబబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనను బండి నెంబరుతో సహా ఫొటో/వీడియో తీసి, తేది, ప్రదేశం, సమయం జత పరిచి 9490617346 నంబరుకు వాట్సాప్ చేయండి. తగు చర్య తీసుకుని మీకు తెలియజేస్తాం. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం’’ అంటూ ఓ నంబరును ట్విటర్లో షేర్ చేశారు. Be citizen police. Report a Traffic Violation. Capture the violation and send that image to Cyberabad E-challan WhatsApp: 9490617346 with Date, Time and Location. pic.twitter.com/F1e79Z1H5D — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 5, 2021 -
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక చుక్కలే!
న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్ని కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చిన కొందరు వాహనదారులు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ ఉంటారు. వీరి వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందికి గురి అవుతుంటారు. అయితే ఇలా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారు ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భీమా రెగ్యులేటర్ ఐఆర్డిఎఐ కొత్త రూల్స్ తీసుకురాబోతుంది.(చదవండి: లండన్‌ను వెనక్కినెట్టిన బెంగళూరు) ట్రాఫిక్‌కు ఇన్సూరెన్స్‌కు సంబంధం ఏంటని మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఒక లింకు ఉంది. ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలను తరుచూ ఉల్లంఘిస్తారో.. వారి వాహనం యొక్క భీమా ప్రీమియం కూడా పెరిగిపోతుంది. ఈ కొత్త రూల్ వల్ల మీరు ట్రాఫిక్ చలనాతో పాటు మీ వెహికల్ భీమా ప్రీమియాన్ని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబందించిన తుది నివేదికను ఐఆర్డిఎఐ సిద్ధం చేసింది. తొలిసారిగా ఈ కొత్త నిబంధనలు దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి రావచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకురానున్నారు. వాహన భీమా ప్రీమియం సమయంలో గత రెండేళ్ల నాటి ట్రాఫిక్ చలానాలను పరిగణలోకి తీసుకొని మీకు ప్రీమియం నిర్ణయిస్తారు. -
వాహనం ఒకరిది.. నంబర్ ఇంకొకరిది
పై ఫొటోలో కనిపిస్తున్న ఆటో టేకులపల్లిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు ఫొటో తీసి, నంబర్ ఆధారంగా ఈ–చలాన్ పంపారు. కానీ అది ఖమ్మంలోని ఓ కారు ఓనర్‌కు వెళ్లింది. కారు నంబర్ ఆటోపై రాయడంతో ఈ మతలబు జరిగింది. భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి స్కూటీ ఎప్పుడూ ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. అయితే చండ్రుగొండలో హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఈ–చలాన్ వచ్చింది. ఫొటోలో మాత్రం ప్యాషన్ బైక్ ఉంది. జరిమానా స్కూటీ ఓనర్‌కు వచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు తప్పించుకునేందుకు కొందరు తమ వాహనాలపై ఇతరుల వాహనాల నంబర్లు రాసుకుంటున్నారు. సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పోలీసులు నిబంధనలు ఉల్లంఘించేవారి వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వాటి ఆధారంగా వాహనం నంబర్ గుర్తించి జరిమానా విధిస్తున్నారు. అయితే కొందరు ఉల్లంఘనులు ఇతరుల వాహనాల నంబర్లను తమ వాహనాలపై రాయించుకుంటున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ–చలాన్లు మాత్రం ఇతరులకు వెళ్తున్నాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఒక వాహనం నంబరును మరో వాహనానికి చెందిన వ్యక్తులు ఉపయోగిస్తుండటంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేరేవాళ్లు చేస్తున్న తప్పులకు తాము జరిమానా కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ వాహనాల నంబర్లు పెట్టుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం పోలీసులకు భారీ లక్ష్యాలు విధించి ఒత్తిడి చేస్తోంది. దీంతో రోజూ అన్ని ఠాణాల పరిధిలోని కానిస్టేబుళ్లు వివిధ కూడళ్లలో నిలబడి ఫొటోలు తీయడమే పనిగా ఉంటున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ సైతం గాలికి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు తనిఖీలు చేస్తేనే ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఏజెన్సీలోనే తనిఖీలు.. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల నేపథ్యంలో జిల్లాలోని భద్రాచలం, పినపాక ఏజెన్సీల్లో మాత్రమే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నారు. పోలీసులు పేలుడు పదార్థాలు, గంజాయి రవాణాపైనే దృష్టి పెడుతున్నారు తప్ప వాహనాలకు పత్రాలు ఉన్నాయా? లేవా? అనే విషయం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో తనిఖీలు అంతగా చేపట్టడం లేదు. దీంతో ఏ వాహనంలో ఏం తరలిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల ఫొటోలను తీసేందుకే కానిస్టేబుళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ సమస్యలపై ఎస్పీ సునీల్‌దత్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు. -
రూ.397 కోట్లు సమర్పణ.. బాధ్యులు ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : ఎవరింట్లో అయినా దొంగలు పడి తులం బంగారం ఎత్తుకుపోతే నానా హైరానా పడిపోతాం. అదే రహదారిపై వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ చలాన్ పడుతుందని తెలిసీ ఉల్లంఘనలకు పాల్పడతాం. ట్రాఫిక్ ఉల్లంఘనులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాదు... అనునిత్యం నగరవాసి జేబుకు చిల్లుపడుతూనే ఉంది. వాహనచోదకుల అవగాహనా రాహిత్యం... మౌలిక వసతుల లేమి.. ఎడ్యుకేషన్ కోణంలో అధికారుల వైఫల్యం.. .కారణం ఏదైతేనేమి మూడు కమిషనరేట్లకు చెందిన వాహనచోదకులు గత ఏడాది అక్షరాలా రూ.397,89,42,640 జరిమానాల రూపంలో ఖజానాకు సమర్పించుకున్నారు. ఇదే కాలంలో చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు వంటి వివిధ రకాలైన నేరాల్లో ప్రజలు కోల్పోయింది రూ.57,38,20,973 కావడం గమనార్హం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో సరాసరిన రోజుకు 186 కేసులు నమోదు అవుతుండగా.... ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య మాత్రం 31,956గా ఉంది. ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరు? నిబంధనలు పట్టని వాహనచోదకులా..? మౌలిక వసతుల కల్పనలో ఘోరంగా విఫలమౌతున్న జీహెచ్‌ఎసీనా? ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌లో విఫలమౌతున్న పోలీసులా? అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మిలియన్ డాలర్ల ప్రశ్నే. చదవండి: ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు నగరంలో రోడ్డు నిబంధనల పాటించకుండా ట్రాఫిక్ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసే వారిలో పదే పదే ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య... వాహనాల సంఖ్య కంటే కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఇందులో ప్రతి ఒక్క వాహనచోదకుడూ ఉల్లంఘనలకు పాల్పడటం అనేది జరుగదు. కనిష్టంగా తీసుకున్నా పది లక్షల మంది వాహనచోదకులు నిబంధనలు పాటిస్తూనో, సొంత వాహనాలు లేని కారణంగానో ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలకు పూర్తి దూరంగా ఉన్నారని లెక్కేయచ్చు. అయితే ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం ఏటా సరాసరిన 30 లక్షలకు పైగా ఉంది. అనేక మంది వాహనచోదకులు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతూ రిపీటెడ్ వైలేటర్స్‌గా ఉండటమే దీనికి కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. అవగాహనే కీలక ప్రాధాన్యం ‘ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి జరిమానాలు విధిస్తున్నాం. వారీలో రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికీ పెద్దపీట వేస్తున్నాం. క్రమం తప్పకుండా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థి దశ నుంచే మార్పులు తీసుకురావడానికి కళాశాలలు, పాఠశాలలకూ వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కొందరు సెలబ్రెటీలను భద్రతాంశాలపై ప్రచారం కోసం తీసుకురావడంతో పాటు మీడియా ద్వారానూ ప్రచారం చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సోషల్‌మీడియా ద్వారా నెట్‌జనులకు దగ్గరవుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కంటే ఎడ్యుకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం.’ – నగర ట్రాఫిక్ అధికారులు ఎవరికి వారే మారాలి ‘నగరంలో ఈ పరిస్థితుల నెలకొనడానికి ఏ ఒక్కరో కారణం కాదు. ప్రభుత్వ యంత్రాగాల అలసత్వం, వాహనచోదకుల నిర్లక్ష్యం వెరసి నగరవాసి జేబుకు మాత్రం చిల్లుపడుతోంది. కేవలం చలాన్ల రూపంలోనే కాకుండా విలువైన పనిగంటలు, ఇంధనం రూపంలోనూ నష్టపోతున్నారు. అన్ని ఉల్లంఘనల్లోనూ అత్యంత కీలకమైంది పార్కింగ్. ఏ ప్రదేశంలోనూ కూడా నిబంధనల ప్రకారం పార్కింగ్ ఉండట్లేదు. అయినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. నిబంధనలను ఇబ్బందిగా ఫీల్ అవుతున్న నగరవాసి, మౌలిక వసతుల కల్పనను ఓ భారంగా భావిస్తున్నా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వని ట్రాఫిక్ కాప్స్ సమూలంగా మారితేనే పరిస్థితుల్లో మార్పు వచ్చేది’. – రోమల్, జగదీష్ మార్కెట్ ట్రాఫిక్ కేసులు ఇలా... కమిషనరేట్ చలాన్లు విధించిన జరిమానా హైదరాబాద్ 54,74,479 రూ.173,84,01,535 సైబరాబాద్ 47,71,328 రూ.178,39,40,605 రాచకొండ 14,18,355 రూ.45,66,00,500 మొత్తం 1,16,64,162 రూ.397,89,42,640 (నవంబర్ వరకు) నేరాల కేసులు ఇలా... కమిషనరేట్ కేసులు దుండుగల పాలైంది హైదరాబాద్ 22,641 రూ.26,15,21,679 సైబరాబాద్ 24,868 రూ.15,31,78,771 రాచకొండ 20,641 రూ.15,91,20,523 మొత్తం 68,150 రూ.57,38,20,973 (డిసెంబర్ 20 వరకు) -
జరిమానాల కొరడాతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు 8 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణమైన ఓవర్ స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం వంటి కేటగిరీల్లో అయితే ఏకంగా పది నుంచి 15 శాతం వరకు ఉల్లంఘనలు తగ్గిపోయాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసి పక్కాగా అమలు చేస్తుండటమే ఇందుకు కారణమని రవాణా శాఖ పేర్కొంటోంది. ఉల్లంఘనలు ఇంకా తగ్గుముఖం పడితే రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని అధికారులు అంటున్నారు. గత నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాలు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు, అలాగే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 వరకు నమోదైన ఉల్లంఘనల్ని రవాణా శాఖలోని ట్రాఫిక్ రీసెర్చి వింగ్ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఉల్లంఘనలతో రోజుకు 9మంది మృతి ⇔ రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తేల్చింది. ⇔ ఈ కారణంగా రోజుకు 9మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 36 మంది దుర్మరణం పాలవుతున్నారు. ⇔ ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జరిమానాలు భారీగా పెంచింది. ⇔ 2019లో మొత్తం 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 15,303 ప్రమాదాలు డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 1,262 ప్రమాదాలు లెర్నింగ్ లైసెన్సు ఉన్నవారి వల్ల, 2,576 రోడ్డు ప్రమాదాలు అసలు డ్రైవింగ్ లైసెన్సు లేనివారి వల్ల జరిగాయి. కాగా నిబంధనల ఉల్లంఘనల కారణంగా 2,851 ప్రమాదాలు జరిగాయి. ⇔ ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నెలకు సగటున 7 వేల వరకు నమోదు అయ్యేవి. జరిమానాల పెంపుతో దాదాపు నెల రోజుల్లో 6,400 మాత్రమే నమోదయ్యాయి. అంటే 8 శాతం వరకు తగ్గాయన్న మాట. ⇔ ఇక భారీ జరిమానాలు విధిస్తుండటంతో హెల్మెట్ ధరించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగింది. ⇔ గతంలో హెల్మెట్ ధరించకపోతే రూ.100 జరిమానా విధించే వారు. ఇప్పుడు రూ.1,000కి పెంచడం సత్ఫలితాన్నిచ్చింది.. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు హెల్మెట్ ధరించని కేసులు 1,947 నమోదు కాగా.. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 17 మధ్య 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే 15 శాతం మేర కేసులు తగ్గాయన్న మాట. ⇔ ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలకు జరిమానా రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు పెంచడంతో ఈ కేసులు 10 శాతం తగ్గిపోయాయి. జరిమానా పెంచక మునుపు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు 900 వరకు మాత్రమే నమోదవుతున్నాయి. పదే పదే ఉల్లంఘిస్తే జైలే జరిమానాల పెంపుతో సత్ఫలితాలు వస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల సంఖ్య తగ్గిపోతోంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు 20 శాతం తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. పదే పదే నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జైలుకు పంపేలా ఆలోచన చేస్తున్నాం. -ప్రసాదరావు, రవాణా శాఖ అదనపు కమిషనర్ -
‘నా కారునే తీసుకెళ్తారా?!’
లండన్: సాధారణంగా మన దగ్గర నో పార్కింగ్ ఏరియాలో వాహనాలను ఆపితే ఏం చేస్తారు. ట్రాఫిక్ అధికారులు ఓ క్రేన్ తీసుకువచ్చి.. వాహనాలను తీసుకుని వెళ్లి పోతారు. ఆ తర్వాత మనం ఫైన్ కట్టి వాటిని విడిపించుకుంటాం. సాధారణంగా జరిగేది ఇదే. కానీ లండన్‌కు చెందిన ఓ నడి వయసు జంట మాత్రం ఇలా చేయలేదు. కారు తీసుకెళ్లడానికి వీలు లేకుండా రోడ్డుకు చెరో వైపు బైఠాయించి అధికారులను అడ్డుకున్నారు. ఇక చేసేదేం లేక వారి కారును వారికి తిరిగి అప్పగించారు అధికారులు. వివరాలు.. నార్త్ లండన్‌కు చెందిన పీటర్ ఫెన్నెల్ కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించాడు. డబుల్ యెల్లో లైన్స్ మీద తన కారును పార్క్ చేశాడు. దాంతో అధికారులు అతడికి 300 పౌండ్ల జరిమానా విధించారు. (చదవండి: ఒకే బైక్.. 71 కేసులు !) కానీ అతడు ఫైన్ కట్టడకపోవడంతో అధికారులు ఇంటికి వచ్చి కారును తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు అధికారులు. దాంతో ఆగ్రహించిన ఫెన్నెల్ దంపతులు చెరో వైపున నడి రోడ్డు మీద కూర్చున్నారు. ఫెన్నెల్ రోడ్డు మధ్యలో ఓ స్టూల్ వేసుకుని దాని మీద కూర్చుని ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని ఆఫీస్ పని చేసుకున్నాడు. మరో వైపు అతడి భార్య కూడా ఇలానే చేసింది. ఇలా దాదాపు ఐదు గంటలపాటు ఈ డ్రామా కొనసాగింది. చివరకు చేసేదేం లేక అధికారులు అతడి కారును తిరిగి అప్పగించారు. అనంతరం వారితో కలిసి శాండ్విచ్ తిని కాఫీ తాగి వెళ్లి పోయారు అధికారులు. ఈ సంఘటన కాస్త వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఫెన్నెల్ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నుదురులోకి చొచ్చుకెళ్లిన తాళం చెవి
డెహ్రాడూన్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్‌కు తరలిగిస్తారు. కానీ, ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించని ఓ వ్యక్తితో అమానుషంగా ప్రవర్తించారు. బైక్ తాళం చెవిని అతని మొహంపై పెట్టి బలంగా నెట్టేశారు. దీంతో ఆ కీ అతని నుదురులోకి చొచ్చుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్‌లోని ఈ ఘటన జరిగింది. ఈఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ముగ్గురు ట్రాఫిక్ సిబ్బందిని పై అధికారులు సస్పెండ్ చేశారు. అయితే, వాహనదారుడిపై పోలీసుల దాడి విషయం బయటపడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ కుమార్ జోక్యంతో పరిస్థితులు చక్కబడ్డాయి. స్థానికులు నిరసన విరమించారు. పోలీసుల దాడిలో గాయపడ్డ వాహనదారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
సెల్‌ఫోన్‌తో క్లిక్.. ఫేస్బుక్లో పోస్ట్
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ వేళ ట్రాఫిక్ నియమ, నిబంధనలను అతిక్రమిస్తూ యథేచ్ఛగా నగర రహదారులు, కాలనీల్లో రయ్యురయ్యమంటూ దూసుకెళుతున్న వాహన చోదకులను సిటిజన్లు సెల్ఫోన్లతో క్లిక్‌మనిపిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నెలవారీగా మూడు వేల వరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఉల్లంఘనల ఫొటోలను సైబరాబాద్ (10.309), రాచకొండ (703) ఫేస్బుక్, ట్విట్టర్లకు పోస్టు చేస్తే... గత 40 రోజుల నుంచి ఏకంగా 11,012 ఫిర్యాదులు రావడం పోలీసులకే ఆశ్చర్యం కలిగించింది. ఏ ప్రాంతం, ఏ సమయం తదితర వివరాలతో ఆ ఫొటోలను నిక్షిప్తం చేస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా అది ఏ ఉల్లంఘన కింద వస్తుందో ఎంత జరిమానా విధించారనే విషయంతో కూడిన ఈ–చలానా ఐడీ వివరాల్ని సదరు ఫిర్యాదుదారుడికి పంపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలుఅతిక్రమించేవారి ఫొటోలు తీసి మరీ పోస్టు చేసేస్తున్నారు. సెల్‌ఫోన్‌తో క్లిక్.. ఫేస్బుక్లో పోస్ట్ రహదారులపై ప్రయాణించేటప్పుడు మరో వాహనదారుడెవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడితే వెంటనే స్పందిస్తున్నారు. సెల్‌ఫోన్‌తో దానిని చిత్రీకరించి సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ విభాగానికి పంపుతున్నారు. ఇందుకు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్ని వినియోగిస్తున్నారు. చిత్రంతోపాటు ఉల్లంఘనకు సంబంధించిన వివరాల్ని నమోదు చేస్తే చాలు పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు. ఫిర్యాదుదారులకు సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ ఈ–చలానా విభాగం నుంచి తిరుగు సమాధానం వెళ్తోంది. ఏ ఉల్లంఘనకు ఎంత జరిమానా విధించారనే విషయంతో కూడిన ఈ–చలానా ఐడీ వివరాల్ని తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసిన సమాచారాన్ని వెల్లడిస్తున్నారు. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే అందుకు గల కారణాన్నీ వివరిస్తున్నారు. ఇలా చేస్తుండటం వల్ల తమ ఫిర్యాదుకు స్పందన ఉంటోందనే నమ్మకాన్ని వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు స్వయంగా పోలీసులే ఉల్లంఘనలకు పాల్పడిన చిత్రాల్ని పోస్ట్ చేసినా జరిమానాలు విధిస్తున్నారు. లాక్డౌన్ వేళ సిటిజన్లు తమ సెల్ఫోన్లతో ఫొటోలు తీసి ఆయా ట్రాఫిక్ విభాగాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. -
ఒకే బైక్.. 71 కేసులు !
యశవంతపుర: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన బైక్ చోదకుడిపై 70 కేసులు నమోదు కాగా జరిమానా రూ. 15 వేలు విధించిన సంఘటన బెంగళూరులో జరిగింది. గురువారం రాజాజీనగర ట్రాఫిక్ పోలీసులు మహలక్ష్మీ లేఔట్ శంకరనగర బస్టాండ్ వద్ద హెల్మెట్ లేకుండా వెళ్తున్న బైక్ చోదకుడు మంజును పోలీసులు ఆపారు. బైక్ నంబర్ కేఏ 41–ఇజి6244 ఆధారంగా అతడికి హెల్మెట్ లేని కారణంగా జరిమానా విధించాలని పోలీసులు పరిశీలించారు. జరిమానా రశీదు ఏకంగా రెండు మీటర్ల పొడవుతో జరిమానా బిల్లు వచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఏడాదిగా అతడిపై 70 కేసులు నమోదైనట్లు పెద్ద స్లిప్ వచ్చింది. తాజా కేసులో మొత్తం 71 కేసులు అతడిపై నమోదయ్యాయి. హెల్మెట్ లేకుండా, త్రిబుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ కేసులు ఉన్నాయి. కెమెరాలు పట్టేస్తాయి : బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన కెమెరాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎప్పటికైనా దొరకడం ఖాయమని చెబుతున్నాయి. ఏడాదిగా తప్పించుకు తిరుగుతున్న ఓ బైక్ చోదకుడి తాజాగా దొరకడమే ఇందుకు నిదర్శనం. పోలీసులు లేరని సిగ్నల్ జంప్ చేసినా కెమెరాలో దొరికిపోతారు. ఈ కెమెరాలో ఫొటోలు తీసి కంట్రోల్ రూమ్‌కు పంపుతాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేయవచ్చని స్పష్టం చేస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ట్రాఫిక్ చలాన్లను కడితే బికారే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలపై సోషల్ మీడియా తనదైన రీతిలో స్పందిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భారీగా చలాన్లను పెంచడాన్ని తీవ్రంగా దూషిస్తోంది. చలాన్లను చెల్లించిన తర్వాత రోడ్డుపై అడుక్కుతినాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఒకరు బాలీవుడ్ చిత్రం ‘సంజూ’లో రణీబీర్ కపూర్ రోడ్డుపై అడుక్కుంటున్న దృశ్యాన్ని పోస్ట్ చేశారు. అప్పటి వరకు జల్సాగా రోడ్లపై బలాదూర్ తిరిగిన ఓ యువకుడు ట్రాఫిక్ చలాన్లను చెల్లించాక బస్టాండ్‌లో వచ్చిపోయే బస్సుల వెంట తిరిగుతూ నూనె డబ్బులు అమ్ముతున్న దశ్యం అంటూ మరో బాలీవుడ్ చిత్రంలోనే ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు రుణాల కోసం బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలంటూ తమదైన శైలిలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోవడానికి కారణం యూత్ కొత్త కార్ల కొనుగోలుకు మొగ్గుచూపకుండా ఊబర్, ఓలా క్యాబ్‌ల పట్ల ఆకర్షితులవడమేనంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు వదిలి పెట్టలేదు. ఇంతకుముందు సంగతేమోగానీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచిన చలాన్లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన నాటి నుంచి వాహనాల కొనుగోలు భయంకరంగా పడిపోయిందని పలువురు సెటైర్లు వేశారు. రోడ్లు, ట్రాఫిక్ లైన్లు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అందుకు భారీ వడ్డింపులే మార్గమని ఆలోచిస్తే బాగుండేదని కూడా సోషల్ మీడియా యూజర్లు సూచిస్తున్నారు. రోడ్డుపై ఎన్ని గుంతలు ఉంటే గుంతకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున మున్సిపాలిటీకి, తెల్లటి, నల్లటి ట్రాఫిక్ చారికల్ సవ్యంగా లేకపోతే లైన్‌కు ఐదు వందల రూపాయల చొప్పున ట్రాఫిక్ విభాగానికి ముందుగా చలాన్లు విధించండని, ఆ తర్వాతనే వాహనదారుల జోలికి రావడమే సమంజసమని పలువురు సూచించారు. -
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
సాక్షి, విజయవాడ తూర్పు : వాహన చోదకులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పలు కూడళ్లల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహన చోదకులను అదుపులోకి తీసుకున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 257 కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.1.05 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశారు. వారి వాహనాలు సీజ్ చేశారు. అలాగే, తనిఖీల్లో పట్టుబడ్డ వారికి మంగళవారం బందరు రోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వలన కలిగే అనర్థాల గురించి షార్టు ఫిల్మ్‌లు ప్రదర్శించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ వాహన చోదకులు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాదాల కేసులను తీవ్రమైనవిగా పరిగణించాలని సూచించిందని తెలిపారు. అందులో భాగంగా తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. వాహన చోదకులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నగరంలో సగటున రోడ్డు ప్రమాదాలలో రోజుకు ఒకరు మృతి చెందుతున్నారని, వీరిలో టూ వీలర్ నడుపుతున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రావి సురేష్‌రెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. -
అంత భారీ చలాన్లా? ప్రజలెలా భరిస్తారు?
ముంబై: ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు భారీమొత్తంలో పెరిగాయి. ఈ చట్టం అమలులోకి రావడంతో ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పలువురు వాహనదారులకు ఒక్కరోజే ఏకంగా రూ. 59వేల వరకు జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షం శివసేన ట్రాఫిక్ జరిమానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ జరిమానాలు విధించడంలోని ఆంతర్యమేమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈస్థాయిలో జరిమానాలు విధిస్తే.. సామాన్య ప్రజలు ఎలా భరిస్తారని ప్రశ్నించింది. కొత్త మోటారు వాహన చట్టానికి తాను వ్యతిరేకం కాదని, కానీ జరిమానాలు సామాన్య ప్రజలు భరించలేనివిధంగా చాలా ఎక్కువగా ఉండటాని తాము వ్యతిరేకిస్తున్నామని శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. ‘కొత్త చట్టంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు దాదాపు పదిరెట్లు ఎక్కువగా జరిమానాలు పెంచారు. కొత్త చట్టం ఆహ్వానించదగిందే. కానీ మన దేశంలో నిరుపేదలకు అంత భారీస్థాయి జరిమానాలు భరించే స్తోమత ఉందా?’ అని సామ్నా పేర్కొంది. నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టిన ఈ చట్టంలో పెద్దమొత్తంలో జరిమానాలు ప్రతిపాదించడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయని తెలిపింది. ఇప్పటికైనా కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ భారీగా పెంచిన జరిమానాలపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసింది. రోడ్ల మీద అనేక గుంతలు ఉన్నాయని, ఆ గుంతల వల్ల ప్రమాదాలు జరుతున్నాయని, ఈ గుంతలు సరిచేసి.. రహదారులను చక్కగా తీర్చిదిద్దిన అనంతరం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తే బాగుండేదని సామ్నా అభిప్రాయపడింది. రోడ్లను సరిచేసేవరకు కొత్త చట్టం అమలును నిలిపేయాలన్న గోవా కాంగ్రెస్ డిమాండ్‌ను ఈ సందర్భంగా ‘సామ్నా’ తన సంపాదకీయంలో ప్రస్తావించింది. -
ఉల్లంఘిస్తే ‘రెట్టింపు’
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ప్రజలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా పడుతుంది. ఇదే పని పోలీసులు చేస్తే ఇప్పటి వరకు వారికి ఫైన్‌తో పాటు తాఖీదులు, తీవ్రమైన వాటికి పాల్పడితే బదిలీ అనివార్యం అవుతోంది. త్వరలో అమలులోకి రానున్న సవరణలతో కూడిన మోటారు వాహనాల చట్టం ఫలితంగా పోలీసులపై ఈ భారం మరింత పెరగనుంది. హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరైనా ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే... కొత్త చట్టంలో చేర్చిన సెక్షన్ 210–బీ ప్రకారం వారికి రెట్టింపు వడ్డన ఉంటుంది. అంటే సాధారణ ప్రజలకు ఆ ఉల్లంఘనలకు ఎంత జరిమానా విధిస్తారో... వీరికి ఆ మొత్తానికి రెట్టింపు వేస్తారు. దీనిపై నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ లేఖ రాశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 371 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్–క్వార్టర్స్ సహా వివిధ విభాగాలకు ఎటాచ్ చేస్తూ వేటు వేశారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలు ఉన్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) వద్దకు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా దీనిని ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీ యాక్ట్‌లోకి కొత్తగా వచ్చిన 210–బీను అనుసరిస్తూ ఈ విధానాలను మరింత విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/ కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడితే తేలిగ్గా గుర్తించి వారికి రెట్టింపు జరిమానా విధించవచ్చు. అదే ఓ అధికారి మఫ్టీలో తన ప్రైవేట్ వాహనం వినియోగించి ఉల్లంఘనలకు పాల్పడితే వారిని ఎలా గుర్తిస్తారని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చేస్తున్న ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం నాలుగు రకాల సాధనాల ద్వారా ఇవి పోలీసులకు చేరుతున్నాయి. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారం అయిన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసులను నుంచి జరిమానా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇకపై ప్రతి హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా వ్యవహరించాలని అనిల్‌కుమార్ కోరారు. -
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇపుడొక లెక్క!
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ లేకపోయినా ఏం పరవాలేదు అని డ్రైవింగ్ చేస్తున్నారా.. మద్యం తాగి వాహనం నడుపుతున్నారా.. ఆ.. ఏముంది వందో రెండు వందలో జరిమానా కడితే సరిపోతుంది అని ఆలోచిస్తున్నారా?.. ఇకపై మీ పప్పులుడకవు. ఎందుకంటే వేలకు వేలు జరిమానా కట్టాల్సిందే. అంతేగాకుండా కొన్ని నిబంధనలు పాటించకుంటే ఏకంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. ఇంకా ఉంది.. ఓవర్ లోడింగ్ ప్రయాణికులను ఎక్కించుకుంటే ఒక్కో ప్రయాణికునికి రూ.1000 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఈ మేరకు వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 1) నుంచి ‘మోటారు వాహనాల సవరణ చట్టం–2019’ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర రవాణాశాఖ బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై నిబంధనలు పాటించకుంటే జరిమానాలు 100 నుంచి 500 శాతం పెరగనున్నాయి. ప్రధానంగా 25 ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చట్ట సవరణలో ఉన్న మరో కీలకాంశం ఏమిటంటే.. ఇకపై ట్రాఫిక్ జరిమానాల మొత్తం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ ఉంటుంది. గురువారం నోటిఫికేషన్ అందుకున్న రాష్ట్ర రవాణాశాఖ, వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. శనివారం గాని, వినాయకచవితి సెలవు ముగిసిన త ర్వాత మంగళవారం గాని ఉత్తర్వు జారీ కానుందని రవాణాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. గోల్డెన్ అవర్ నిధి.. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ‘గోల్డెన్ అవర్’ గా పరిగణించే మొదటి గంట అత్యంత కీలకం. ఈ సమయంలో వైద్యం అందితే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అందుకే ‘గోల్డెన్ అవర్’లో క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించేలా నిబంధన తీసుకొచ్చారు. దీని కోసం కేంద్రం ప్రత్యేకంగా ‘మోటారు వెహికిల్ యాక్సిడెంట్ ఫండ్’ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారానే ఆయా ఆస్పత్రులకు చికిత్సకైన ఖర్చులు చెల్లిస్తారు. దేశంలో ఉన్న ప్రతి రోడ్ యూజర్‌కు నిబంధనలకు లోబడి ఈ ఫండ్ ద్వారా బీమా ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆధార్ తప్పనిసరి. అలాగే ప్రమాదాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న పరిహారం భారీగా పెరగనుంది. గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ఎవరైనా చనిపోతే ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న రూ.25 వేల పరిహారం రూ.2 లక్షలకు, క్షతగాత్రులకు ఇస్తున్న రూ.12,500 నుంచి రూ.50 వేలకు పెంచారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సహకరించే వ్యక్తులు తమ వివరాలను అటు పోలీసులు, ఇటు వైద్యాధికారులకు చెప్పాల్సిన అవసరం లేకుండా నిబంధన పొందుపరిచారు. తల్లిదండ్రులూ బాధ్యులే.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలను రీకాల్ చేసే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. అలాంటి వాహనాలకు ఉత్పత్తి చేసిన కంపెనీలకు గరిష్టంగా రూ.500 కోట్ల వరకు జరిమానా విధించే ఆస్కారం లభిస్తుంది. మైనర్లు వాహనం నడుపుతూ చిక్కితే ఆ చర్య తమకు తెలియకుండానో, తాను వారిస్తున్నా జరిగిందని తల్లిదండ్రులు/సంరక్షకుడు నిరూపించుకోవాలి. లేదంటే వారికీ జైలు శిక్ష, జరిమానా తప్పవు. మైనర్లు వాహనాలు నడుపుతూ లేదా ఉల్లంఘనలకు పాల్పడుతూ చిక్కితే వారి తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. ఆ మైనర్పైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాహనం రిజిస్ట్రేషన్ శాశ్వతంగా రద్దు అవుతుంది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలుగా పరిగణించే ట్రాఫిక్ అధికారులు, పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడితే సాధారణ వ్యక్తులకు విధించే జరిమానాకు రెట్టింపు విధిస్తారు. పెండింగ్ చలాన్లు.. చకచకా.. మరో 3 రోజుల్లో కొత్తగా పెంచిన జరిమానాలు అమల్లోకి రానుండటంతో పెండింగ్ ఈ–చలాన్లను వాహన చోదకులు భారీగా క్లియర్ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఈ–చలాన్ చెల్లింపులు రోజుకు రూ.50 లక్షల వరకు ఉంటాయి. అయితే గడిచిన 4 రోజుల చెల్లింపులు పరిశీలిస్తే రూ.65 లక్షలు, రూ.68 లక్షలు, రూ.2.08 కోట్లు, రూ.2.38 కోట్లుగా ఉండి రికార్డు సృష్టిస్తున్నాయి. -
గీత దాటితే మోతే!
సాక్షి, వేటపాలెం (ప్రకాశం): మీ పిల్లలకు వాహనాలిస్తున్నారా? మైనర్ అయి ఉండి పోలీసులకు పట్టుబడితే ఇకపై మీరు జైలుకెళ్లాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే నామమాత్రపు జరిమానా చెల్లించి బయటపడొచ్చని అనుకుంటున్నారా? ఇక మీదట డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మాత్రం భారీ జరిమానాతో పాటు జైలుకెళ్లాల్సిందే. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అంబులెన్సుకు దారి ఇవ్వకపోతే ఇకపై భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి వచ్చే నెల 1 నుంచి భారీగా జరిమానాలు పోలీసులు విధించనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. ఇప్పటి వరకు విధించే జరిమానాలు కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని మూడు, నాలుగు రెట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ. 25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశమూ ఉంది. ఒకవేళ పిల్లలు ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. రోడ్డుపై వెళ్లే అంబులెన్సుకు దారి ఇవ్వకపోతే రూ. 10 దివేల జరిమానా చెల్లించాలి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇటీవల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు హైవేలపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయితే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు అటు పోలీసులు, ట్రాఫిక్ అధికారులతో పాటు రవాణా శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనకు పాల్పడే వాహనదారులకు రూ. 1లక్ష వరకు జరిమానా విధించే అధికారం ఆయా శాఖల అధికారులకు ఉంది. రోడ్డుపై పరిమితికి మించి వేగంగా దూసుకెళ్లే వాహనదారులకు రూ. 1000 నుంచి రూ. 2 వేల వకు జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. వాహన బీమా లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు , సీటుబెల్టు లేకుండా వాహనం నడిపితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానాతో పాటు జైలుశిక్ష అనుభవించాలి. రవాణా చేసే వాహనాలు ఓవర్ లోడుతో పట్టుబడితే రూ. 20 వేలు చెల్లించేలా నిబంధనల్లో మార్పు చేశారు. అధికారులే ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపు అవుతాయని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. -
నోరూల్స్ అంటున్న వాహనదారులు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంతే వేగంగా ట్రాఫిక్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలని నిబంధనలను లెక్కచేయడంలేదు. అతివేగం నియంత్రణకు పోలీసులు ఈ చలాన్ ద్వారా జరిమానా విధిస్తున్నా ఉల్లంఘనలు మాత్రం తగ్గడంలేదు. ఒకవైపు జరిమానా చెల్లిస్తూనే మరోవైపు ‘నో రూల్స్’ అంటూ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాపిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నా అవకాశం దొరికితే చాలు రూల్స్ అతిక్రమిస్తున్నారు. తమను ఎవరూ చూడడం లేదని అనుకుంటూన్నారు. కానీ నిఘా నేత్రాలు ఉల్లంఘనలను కెమెరాల్లో బంధిస్తున్నాయి. దీంతో ప్రతినెలా జరిమానా వీపరితీంగా పెరిగిపోతున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 8 నెలల్లోనే రూ.10,27,09,200 జరిమాన వసూలవడమే ఇందుకు నిదర్శనం. కేసుల రకాలు కేసులు జరిమానాలు(రూ.) రాంగ్‌రూట్ డ్రైవింగ్/ జిగ్‌జాగ్ డ్రైవింగ్ 29,142 89,48,200 ఒవర్లోడు కేసులు 23 10,800 సెల్ఫొన్ డ్రైవింగ్ కేసులు 650 6,50,000 మైనర్ డ్రైవింగ్ కేసులు 128 64,300 ట్రిపుల్ రైడింగ్ కేసులు 2,340 2,88,000 నంబర్‌ప్లేట్ మార్పు కేసులు 1,326 3,17,900 ఈ చలాన్‌తో జరిమానాల వేగం... రాష్ట్ర వ్యాప్తంగా పలు దశల్లో ఈచలాన్లు అమలు చేశారు. మొదట హైదారాబాద్‌లో అమలు చేయగా అక్కడ విజయవంతం కావడంతో 2018, డిసెంబర్ 23 నుంచి కరీంనగర్లో ఈ చలాన్ విధానం ప్రారంభించారు. గతంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిని అక్కడిక్కడే పట్టుకుని జరిమానా నేరుగా వసూలు చేసేవారు. దీనితో ఇటు వాహనాదారులు, అటు పోలీసులు కూడా ఇబ్బంది పడేవారు. కొన్నిసార్లు వాహనదారుడి వద్ద నగదు లేకపోవడంతో వాహనాన్ని పట్టుకుని రావడం, వాటిని భద్రపరచడం పోలీసులు తలకుమించి భారంగా మారేది. జరిమానాల విషయంలో కూడా పోలీసులు పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీటన్నంటికీ చెక్ పెడుతూ ఈ చలాన్ అమలు చేయడం ప్రారంభించారు. ఈపద్ధతితో అక్కడిక్కడే జరిమానా చెల్లించాల్సిన అవసరం లేకపోవడం, వాహనాలను వాహనాదారులు తీసుకుని వెళ్లడం చేయడం వల్ల వాహనాదారులు వీలు చూసుకుని ఆన్లైన్లో జరిమానాలు చెల్లిస్తున్నారు. ఉల్లంఘనలే.. ఉల్లంఘనలు.. కరీంనగర్లో ట్రాఫిక్స్ రూల్స్ ఉల్లంఘనలు వీపరితంగా పెరిగిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కరీంనగర్లో అత్యధికంగా రాంగ్‌రూట్ డ్రైవింగ్ , జిగ్‌జాగ్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ చలాన్ పద్ధతి అమలు చేసిన నాటి నుంచి 2019, జులై 31 వరకు 29,142 కేసులు నమోదు కాగా జరిమానాల రూపంలో భారీగా రూ.89.49 లక్షల జరిమానాల చెల్లించారు. తర్వాత స్థానం ట్రిపుల్ రైడింగ్ కేసులు ఉన్నాయి. ఇవి 2,340 కేసులు నమోదు కాగా రూ.28.08 లక్షల జరిమానా చెల్లించారు. హెల్మెట్ లేకుండా నమోదు అవుతున్నా కేసులు కూడా అధికంగా ఉంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. సరాసరి రోజుకు సుమారు 150 వరకూ నో హెల్మెట్ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు పరిధిలో 2018 డిసెంబర్ నుంచి 2019 జులై వరకూ 2,104 కేసులు నమోదు కాగా వీటిలో 966 జరిమానాలు విధించారు. 1,085 మందికి జైలు శిక్ష అమలు చేశారు. వీటిని బట్టి వాహనాలు ఇష్టారాజ్యంగా నడుపుతూ జరిమానాలు చెల్లించడానికి ఇబ్బందులు పడడం లేదని తెలుస్తోంది. నిబంధనలు ఎలా ఉన్నా జరిమానాలు చెల్లిసున్నాం కదా అన్న ధోరణి పెరిగిపోతోందని నిపుణులు పేర్కొంటున్నారు. పెరిగిన మైనర్ డ్రైవింగ్.. హైదారాబాద్ తర్వాత అత్యధిక మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు అవుతోంది కూడా కరీంనగర్‌లోనే. హైస్కూల్ స్థాయిలో వాహనాలు నడుపు తూ పోలీసులకు చిక్కుతున్నారు. దీనికి పోలీసు లు కేసులు నమోదు చేస్తే వారి భవిష్యత్ నాశమ వుతుందనే వదిలేస్తున్నారు. అయితే ఇదే అలుసుగా వాహనాలపై మైనర్లు దూసుకుపోతు న్నా రు. నగరంలో మైనర్లు అధిక వేగంతో దూసు కుని పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు నగరంలో చాలా మంది ట్రాపిక్ నియమాలను పాటించకుండా వెళ్తున్నారు. ద్విచక్రవాహనంపై ముగ్గురు వెళ్లడం, రాంగ్రూట్లో వెళ్లడం, నో పార్కింగ్ ప్రాంతాలు వాహనాలు నిలపడం చెస్తున్నారు. ఇలాంటి ఘటనలను ట్రాపిక్ పోలీసులు కెమోరాల్లో బంధించి వాహనాల నంబర్ ప్లేట్లు కనిపించేలా ఫొటోలు తీస్తున్నారు. తర్వాత వాటిని ఈ చలాన్‌కు జతపరుస్తారు. వారం రోజుల వ్యవధిలోనే ఉల్లంఘించిన ట్రాపిక్ నియమ నిబంధనలు పేర్కొంటూ ఇంటికి రశీదు పంపతున్నారు. నెల రోజులోపు జరిమానా చెల్లించకుంటే వాహనం పట్టుబడినప్పుడు సీజ్ చేస్తున్నారు. అనంతరం జరిమానాలు చెల్లించి వాహనాన్ని తీసుకుని వెళ్లాలి. నిబంధనలు పాటించాలి ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించడంతోపాటు ఎలాంటి జరిమానాలు లేకుండా సాఫిగా వెళ్లొచ్చు. ఇతరులకు కూడా ఇబ్బంది లేకుండా భద్రంగా ఇంటికి చేరుకోవచ్చు. వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. నిబంధనలు పాటించని వాహనాదారుల, ట్రాపిక్ ఉల్లంఘనలకు జరిమానాలు విధిస్తాం. – తిరుమల్, ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, కరీంనగర్ -
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గురువారం గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 8 గంటల వరకు రాజ్‌భవన్ రూట్లో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి ఖైతరాబాద్ చౌరస్తా వరకు రాజ్‌భవన్ రోడ్డు రెండువైపుల రహదారి రద్దీ ఉంటుంది, దీంతో ఈ రూట్లో ఆ సమయంలో వెళ్లే వాహనాదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లడం మంచిందని అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ సూచించారు. ఈ దారిలోట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, అతిథులకు ప్రత్యేక పార్కింగ్, ప్రవేశాలు కల్పించినట్లు తెలిపారు. ♦ వీవీఐపీలు ముఖ్యమంత్రి, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్, శాసన మండలి ఛైర్మన్, స్పీకర్, కేంద్ర మంత్రి, క్యాబినెట్ మంత్రులు హాజరవుతారు. వీరి వాహనాలు గేట్ నెం.1 నుంచి రాజ్‌భవన్‌లోకి వెళ్లి, గేట్–2 నుంచి బయటకు రావాలి. ఆ తరువాత ఈ వాహనాలను రాజ్‌భవన్ కేటాయించిన పార్కింగ్ స్థలంలో పార్కు చేయాలి. ♦ పింక్ కారు పాస్ కలిగిన ఇతర అతిథులు, గేట్ నెం.3 నుంచి లోపలికి వెళ్లి, లోపలే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కల్గిన వారు గేట్ నెం.3 వద్ద ఆగి, ఆయా వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, ఎంఎంటీఎస్ సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసిడెన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా సింగిల్ లైన్లో పార్కింగ్ చేసుకోవాలి. -
పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, సిటీబ్యూరో: పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో పోలీస్ విభాగం అప్రమత్తమైంది. గోల్కొండ కోటపై డేగకన్ను వేసింది. కశ్మీర్ పరిణామాల నేపథ్యంలో నిఘా విభాగాల హెచ్చరికలతో ఈసారి భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. కోటతో పాటు చుట్టపక్కల ప్రాంతాలు, రహదారులను నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆయా మార్గాల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు కెమెరాలు ఏర్పాటు చేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బషీర్‌బాగ్ పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానించింది. దీంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేసింది. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ నిఘా ఉపకరించనుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా గోల్కొండ కోట చుట్టుపక్కల మార్గాలనూ అధ్యయనం చేసే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తుండే సీసీసీలోని అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరించేందుకు ఉపయోగించనున్నారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పనితీరుపై సీసీసీ అధికారులు సోమవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే గోల్కొండ కోటతో పాటు గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు నగర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల ఏర్పాట్లపై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్ని విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్‌కు వచ్చే సందర్శకులు తమ వెంట హ్యాండ్‌బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్‌బాటిళ్లు తదితర తీసుకురావడం నిషేధించారు. ఈ మేరకు అంజనీకుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసరమై ఎవరైనా తీసుకొచ్చినా కచ్చితంగా సోదా చేయాలని నిర్ణయించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసమ్మర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. లాడ్జిలు, అనుమానిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. 900 మంది సిబ్బంది... వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట, పరేడ్‌గ్రౌండ్స్ వద్ద ట్రాఫిక్ విభాగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. గురువారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు 900 మంది ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ముందుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి అక్కడి నుంచి ముఖ్యమంత్రి గోల్కొండలో జరిగే వేడుకలకు వెళ్లే అవకాశం ఉంది. వేడుకలు జరిగే సమయాలలో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు, ట్రాఫిక్ నిలిపివేత వంటివి ఆయా రూట్లలో చేపడుతున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. గోల్కొండ కోటలో జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో వీఐపీలు, ప్రజలు హాజరవుతున్నారని అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్ వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వీఐపీల కోసం ఏ,బీ,సీ,డీ,ఈ,ఎఫ్ విభాగాలుగా చేసి ప్రభుత్వం నుంచి పాసులు జారీ అవుతున్నాయి. ఆయా పాసులు కల్గి ఉన్న వారికి పాస్ వెనకాల పార్కింగ్ స్థలం, గోల్కొండలో జరిగే వేడుకలకు వచ్చే మార్గం వంటి సూచనలు కూడా ఉన్నాయి. పార్కింగ్ స్థలాల నుంచి వేడుకల వరకు దూరం ఎక్కువగా ఉంటే అక్కడి పరిస్థితులను బట్టి బస్సులను కూడా ఆయా విభాగాలు ఏర్పాటు చేయనున్నాయి. వర్షం పడితే ఇబ్బందులు ఎదురుకాకుండా వచ్చే వారి కోసం కావాల్సిన గొడుగులను జీహెచ్ఎంసీ అందుబాటులోకి తేనుంది. పాస్‌లు కలిగిన వారు పోలీసులకు స్పష్టంగా కన్పించే విధంగా దాన్ని కారుకు ముందుభాగంలో ఎడమవైపు అద్దాలకు అంటించుకోవాలని, విధి నిర్వహణలో ఉండే పోలీసులకు సహకరించి వేడుకలను విజయవంతం చేయాలని కోరుతున్నారు. వేడుకలు పూర్తయిన తరువాత వారికి సూచించిన మార్గంలో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. ♦ గురువారంఉదయం7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే రోడ్డును మూసివేస్తారు. ఏ,బీ,సీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలకు మాత్రమే ఉదయం 7:30 గంటల నుంచి 10 గంటల వరకు ఈ రూట్లోకి అనుమతిస్తారు. ♦ సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏ,బీ,సీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జంక్షన్, నాలా నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని, బాలిక భవన్, ఆంధ్రా ఫ్లోర్ మిల్స్, ప్లైఓవర్, లంగర్‌హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్‌గూడ రైట్ టర్న్‌తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్‌కు చేరుకోవాలి. పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా టివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్‌ను బ్రూక్‌బాండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అమలులో ఉంటాయి. సీఎస్ పరిశీలన గోల్కొండ: సీఎం కాన్వాయ్ వచ్చే మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులకు సూచించారు. మంగళవారం గోల్కొండ కోటలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీస్ అధికారులతో కలిసి సీఎం కాన్వాయ్ రీహార్సల్స్‌ను పర్యవేక్షించా రు. అనంతరం ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కాన్వాయ్ వచ్చే మార్గానికి ఇరువైపులా భద్రతా సిబ్బందికి తప్ప మిగతా ఎవరూ ఉండకూడదన్నారు. అనంతరం ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధిపతి ఎం.కె.సింగ్ ఆధ్వర్యంలో జరిగిన పతావిష్కరణ రిహార్సల్స్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ మాణిక్‌రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, సెక్యూరిటీ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
హెల్మెట్ మస్ట్
సాక్షి, సిటీబ్యూరో: హెల్మెట్ లేకుండా బైకులు నడుపుతున్న వారిపై సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 60శాతం మంది హెల్మెట్ లేకపోవడంతోనే గాయపడుతున్నారని గణాంకాలు చెబుతుండడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ ఏడాదిలో జూలై వరకు 12,96,580 మంది వాహనదారులకు చలాన్లు వేశారు. మొత్తం రూ.12,92,09,600 జరిమానా విధించారు. తనిఖీలు చేస్తున్నా, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా హెల్మెట్ ధరించకుండా వెళ్లేవారు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తుండడంతో రెండు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ప్రత్యేక బృందాల్లోని పోలీసులు విద్యాసంస్థలు, ట్రాఫిక్ జంక్షన్లు, ప్రధాన మార్గాల్లో ఉండి హెల్మెట్ ధరించని ఫొటోలు కెమెరాల్లో బంధించి ఈ–చలాన్లు ఇంటికి పంపుతున్నారు. కొన్నిసార్లు స్పాట్లోనే పట్టుకొని జరిమానాలు విధించడంతో పాటు రెండుసార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో ఉల్లంఘన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే విషయాలను వీడియో ప్రజంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. రెండోసారి కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు శిక్షణ కేంద్రం ఎస్సై ధ్రువీకరించాకే వారి వాహనాలను తిరిగి ఇస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా బైకులు నడుపుతూ మైనర్లు చిక్కితే వాహనాలను స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మరోసారి ద్విచక్ర వాహనాన్ని నడపనివ్వమంటూ లిఖిత పూర్వకంగా రాయించుకుంటున్నారు. నేరమని తెలిసీ... ద్విచక్ర వాహనదారుల్లో కొందరు హెల్మెట్లు ధరించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. బైక్ నడుపుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మోటార్ వాహన చట్టం ప్రకారం నేరం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీటన్నింటిపై ట్రాఫిక్ పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఉల్లంఘనకు జరిమానాతో పాటు పాయింట్లు ఖాతాలోకి వెళ్తాయని, వీటి ద్వారా జైలు శిక్షలు పడతాయంటూ హెచ్చరిస్తున్నారు. ఉల్లంఘనులకు సంబంధించి తాము పట్టుకున్న ప్రతి వాహనం వివరాలను రవాణా శాఖ సర్వర్‌లోని రికార్డులకు అనుసంధానిస్తున్నామని వివరిస్తున్నారు. ఇప్పటికే 10 పాయింట్లు దాటేసిన వారి వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. 12 పాయింట్లు చేరుకున్నాక వారి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దవుతుందని, అలాగే జైలు శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారిని ట్రాఫిక్ పోలీసుల దగ్గరున్న ట్యాబ్ ద్వారా గుర్తిస్తున్నారు. లైసెన్స్ నంబర్ నమోదు చేస్తే వాహన చోదకుల చరిత్ర తెరపై కనిపిస్తుందని ట్రాఫిక్ పోలీసులు వివరించారు. తద్వారా తదుపరి చర్యలు తీసుకుంటున్నామని ఇరు కమిషనరేట్ల ట్రాఫిక్ ఉన్నతాధికారులు విజయ్‌కుమార్, దివ్యచరణ్ తెలిపారు. చలాన్లు ఇలా... (జనవరి–జూలై) కమిషనరేట్ చలాన్లు జరిమానా(రూ.ల్లో) సైబరాబాద్ 8,42,653 8,38,35,600 రాచకొండ 4,53,927 4,53,74,000 -
బేఖాతర్..!
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసినా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావడంలేదు. వారు చేసే చిన్న చిన్న తప్పిదాల మూలంగా.. ఎందరో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మద్యం మత్తులో.. సెల్ఫోన్లలో మాట్లాడుతూ.. స్థాయికి మించి ఎక్కించుకొని డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో వారి వాహనాలతోపాటు ఎదురుగా వచ్చే వాహనాల్లోని అమాయకులు విగతజీవులుగా మారుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఇంటి పెద్ద దిక్కును.. తోబుట్టువులను.. బంధువులను.. మరెందరినో కోల్పోవడమేగాక.. ఆ కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నాయి. సాక్షి, మహబూబ్‌నగర్ : కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మోటార్ బైక్‌లు, ఆటోలు,ట్రాక్టర్లు, లారీలు,తదితర వాహణాలు నడుపుతున్న వారు నిర్లక్షంగా డ్రైవ్ చేయడంతో రోడ్డుపై వెళ్లే అమాయక ప్రజలు బలవుతున్నారు. వీరితో పాటు డ్రైవ్ చేస్తున్న వారు సైతం తమ ప్రాణాలను కాపాడుకోలేక పోతున్నారు. ఒక్కో సారి తీవ్ర గాయాలతో ఇట్టే ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. రోడ్డుపైకి ఎక్కిన వాహనాలను నడుతున్న సమయంలో కనీస అవగాహనతో నడపక పోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలు రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడుపుతున్నారు. ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలన ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా సంభవిస్తుంది. అంతేగాక డ్రైవింగ్ చేయడానికి సైతం వీలు లేకుండా డ్రైవింగ్ సీటు పక్కను అటు ఇటుగా నలుగురిని సైతం ఎక్కించుకోవడంతో రోడ్డుపై సక్రమంగా డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఒక్కో ఆటోలో 15 నుంచి 20 మందికి పైగా ప్రయాణికులను చేరవేస్తున్న ఆటోలు నిత్యం అనేకంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయ పనులకు సంబందించి వివిధ గ్రామాల నుంచి సంబంధిత వ్యవసాయ క్షేత్రాలకు కూలీలను చేరవేస్తున్న ఆటోలు కూడా ఇదే రీతిలో రాకపోకలు కొనసాగిస్తున్నాయి. విద్యాసంస్థల విద్యార్థులను చేరవేస్తున్న ఆటోలు, బస్సుల పరిస్థితి ఇలాగే ఉంది. ఆటోలో కిక్కిరిసిన ప్రయాణికులకు తోడు భారీ శబ్దంతో కూడిన లౌడ్ స్పీకర్ల వినియోగం, మద్యం సేవించి నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ మాట్లాడడం, తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాక పట్టాణాల్లో ప్రయాణికుల కోసం రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో వెనకే వస్తున్న వాహనదారులు ఆటోను ఢకొట్టి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఇటీవల మోటార్ బైక్‌లతో పాటు అన్ని రకాల వాహనాలను నడుపుతున్న వారు మొబైల్ ఫోన్లను మాట్లాడుతు డ్రైవ్ చేస్తున్నారు.మరికొందరయితే వాట్సాప్‌లలో చాట్ చేస్తూ మరీ డ్రైవింగ్ చేస్తున్నారంటే పరిస్థితిని ఊహించవచ్చు. సురక్షితమైన ప్రయాణానికి చిరునామాగా చెప్పుకుంటున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం ఇలాగే వ్యవహరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు డ్రైవింగ్ నిర్లక్ష్యం వలన పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా కొత్తపల్లి వద్ద ఆటోను లారీ డీకొన్న సంఘటనలో 13 మంది మృత్యువాత పడిన విషయం విధితమే. ఇంతకు ముందు కూడా కావేరమ్మపేట వద్ద జాతీయరహదారిని దాటుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్లు, వేగం, తదితర వాటిపై అంతగా అవగాహన లేకుండా వాహనాలను డ్రైవ్ చేయడంతో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. మైనర్లు సైతం బైక్‌లు, వాహనాలు నడుపతుండడం పట్ల రోడ్డుపై వెళ్లే ప్రజలు కలవరపడుతున్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఎప్పటికప్పడు తనిఖీలు చేస్తూ ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తూ, వాహనాల రాకపోకలను సమీక్షిస్తే కొంతమేరకైనా ప్రమాదాలను నియంత్రించే పరిస్థితి ఉంటుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్తపల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఆటో (ఫైల్) -
రూల్స్ బ్రేక్ .. పెనాల్టీ కిక్
మద్యం మత్తులో ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. తెలిసీతెలియని తనంలోని మైనర్లకు తల్లిదండ్రులే బైక్ ఇచ్చి జనం ప్రాణాలకు మీదుకు తెస్తున్నారు. రహదారిపై డ్రైవింగ్ రూల్స్ పాటించకుండా వన్‌వేలో వెళ్లడం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. తాగి వాహనంతో రోడ్డెక్కితే, మైనర్లకు వాహనాలు నడిపితే కారకులకు పెనాల్టీల వాతలు పెట్టడానికి నిబంధనలు కఠినం చేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 6,578 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇకపై ఇలాంటి వారికి భారీగా పెనాల్టీ కిక్ ఇవ్వనున్నారు. సాక్షి, నెల్లూరు: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే.. పెనాల్టీలతో కిక్ దింపనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి మత్తు దిగిపోయేలా కేంద్ర ప్రభుత్వ మోటారు వాహన చట్టానికి సవరణ తెచ్చింది. ఇందుకు అవసరమైన బిల్లుకు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం లభించింది. ఈ చట్ట సవరణ ద్వారా వాహన చోదకులకు భరోసా కల్పించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే అంశాల విషయంలో కూడా తీసుకునే చర్యలను కఠిన తరం చేసింది. ఇక జరిమానాలతో పాటు ట్రాఫిక్ నిబంధన అతిక్రమణ అంశంలో ‘సమాజసేవ’ చేయాలనే శిక్షను కూడా ఈ చట్ట సవరణతో అమల్లోకి తెస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితుల రక్షణార్థం చేసే వైద్య సహాయ చర్యలను సదుద్దేశంతో పరిగణించే అంశాన్ని చట్టంలో పొందు పరిచారు. ఈ విధంగా సహాయం చేసే వారికి పోలీసు, కోర్టు, వేధింపులు లేకుండా ఈ చట్ట సవరణ దోహద పడుతోంది. మైనర్లు వాహనాలు నడిపితే నేరమే ఇకపై జరిగే రోడ్డు ప్రమాదాలకు రోడ్ల నిర్మాణం లోపమే కారణమైతే సదరు రోడ్డు నిర్వహణ శాఖ నుంచి పరిహారాన్ని వసూలు చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే పెద్ద నేరంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకు రూ.25 వేలు జరిమానాను విధించడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తే దానికి మూల్యాన్ని కారకుడైన మైనర్ తల్లిదండ్రులు లేదా గార్డియన్‌తో పాటు వాహన యజమాని కూడా చెల్లించాల్సి వస్తుంది. వాహన ప్రమాదాల్లో పరిహారం కోసం దాఖలు చేసుకొనే వ్యాజ్యాలను ఇకపై ప్రమాదం జరిగిన ఆరు నెలల్లో దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తు తెలియని వాహనాల ప్రమాదంలో సంభవించే మరణాల కుటుంబాలకు క్షత్రగాత్రులకు పరిహారాన్ని చెల్లించే ఈ చట్టంలో పొందు పరిచారు. ఈ పథకం కింద మరణానికి రూ.2 లక్షలు, క్షత్రగాత్రులకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు పరిహారం దక్కేలా చర్యలు చేపడతారు. కొత్తగా వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక పన్నులు, సీజ్‌ల ద్వారా ఈ నిధిని సమకూర్చుతారు. ఈ నిధి ద్వారా వాహన ప్రమాద బాధితులకు వినియోగిస్తారు. ఇలా అనేక మార్పులతో పాటు నిబంధనలు ఉల్లంఘనలకు జరిమానాలను విపరీతంగా పెంచుతూ ఈ దిగువ సవరణలు చేశారు. జిల్లాలో కొనసాగతున్న స్పెషల్ డ్రైవ్ నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ప్రత్యేక దృష్టి సారించారు. వాహన తనిఖీలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా అన్నీ పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనులపై భారీగా జరిమానాలు విధించడంతో పాటు నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మద్యం మత్తులో జరుగుతుండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంవీ యాక్ట్ కింద 1,23,309 కేసులు నమోదు చేయగా, అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 6,578 కేసులు నమోదు చేశారు. జిల్లాలో కేసుల వివరాలు సంవత్సరం ఎంవీ యాక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ 2017 1,33,402 1,172 2018 2,53,978 4,260 2019 1,23,,309 6,015 (ఇప్పటి వరకు) -
జరిమానాలకూ జడవడం లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘వేగం కంటే గమ్యం ముఖ్యం’రోడ్డు భద్రతలో ప్రధాన నినాదం ఇది. దీనికి భిన్నంగా యు వత దూసుకుపోతోంది. వేగమే ముఖ్యమనుకొని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రాణాల రక్షణకు ప్రాధాన్యమివ్వడంలేదు. వేల రూపాయల జరిమానాలు చెల్లిస్తున్నారే తప్ప.. నిబంధనలను పాటించడంలేదు. 33 జిల్లాల్లో రోజూ నమోదవుతున్న గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి. ఓవర్ స్పీడ్, రాంగ్ పార్కింగ్, సీటు బెల్టు ధరించకపోవడం, డ్రైవింగ్‌లో మొబైల్ మాట్లాడటం, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర కేసులు రోజురోజు కూ పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 12,46,420 కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 6,924 కేసులకుపైగా నమోదవుతున్నాయి. ఈ ఆరునెలల్లో మొత్తం రూ.58.86 కోట్ల జరిమానా చెల్లించారు. అంటే రోజుకు రూ.3.22 లక్షలు కడుతున్నారన్నమాట. అయినా పరిస్థితిలో మార్పు రాకపోగా ఇవి అధికమవుతుండటం గమనార్హం. ఇలా రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తున్నవారిలో అధిక శాతం విద్యావంతులు, యువత, ఉద్యోగులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. చలానాలు కట్టే వాహనాల్లో ఎక్కువగా కార్లు, బైకులు ఉంటున్నాయని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ టెస్ట్ పెట్టి లాభమేంటి? ఏ వాహనమైనా రోడ్డు మీదకు రావాలంటే డ్రైవింగ్ పరీక్షలు పాస్ కావాల్సిందే. లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడే అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. అందులో రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు చిహ్నాలు, పాటించాల్సిన నిబంధనలను గుర్తు పట్టి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందే వారిలో ఉల్లంఘనులు అధికం. ఎల్ఎల్ఆర్ టెస్టును పకడ్బందీగా అమలు చేస్తేనే ఇలాంటి ఉల్లంఘనలు, ప్రమాదాలు తగ్గుతాయని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 12 పెనాల్టీ పాయింట్ల సిస్టమ్ అటకెక్కినట్లేనా? హైదరాబాద్ నగర పరిధిలో రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన ట్రాఫిక్ ఉల్లంఘన 12 పెనాల్టీ పాయింట్ల సిస్టమ్ మంచి ఫలితాలనే ఇచ్చింది. తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారి డ్రైవింగ్ లైసెన్సుతోపాటు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ)ని కూడా రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండేళ్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి 12 పాయింట్లకు చేరుకుంటే.. వారి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని అధికారులు భావించారు. కానీ, దీని అమలులో పలు సాంకేతిక, చట్టపరమైన సమస్యలు తలెత్తడంతో దీన్ని అధికారులు తాత్కాలికంగా పక్కనబెట్టారు. ఈ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తే.. ఉల్లంఘనలు తగ్గి ప్రాణనష్టాన్ని నివారించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
బుల్లెట్ బాబు..70 చలాన్లు!
నల్లకుంట: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు సంబంధించి 77 పెండింగ్ చలానాలు ఉన్న ఓ ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు ఎస్సై రమేష్ నేతృత్వంలో ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో జుజ్జువారపు సువర్ణరాజు తన బుల్లెట్ (టీఎస్ 07ఎఫ్హెచ్ 1245) వాహనంపై శంకరమఠం నుంచి ఫీవర్ ఆస్పత్రి వైపు వెళ్తుండగా పోలీసులు ఆపారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఆ బండి నెంబర్‌తో చెక్ చేయగా ఆ వాహనంపై మొత్తం 77 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ చలానాలకు సంబంధించి బకాయిలు రూ.12,725 ఉండటంతో ఎస్సై రమేష్ ద్విచక్రవానహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని సీఐ రాజేంద్ర కులకర్ణికి తెలియజేయడంతో ఆయన నగర పోలీసు కమిషనరేట్‌కు సమాచారం ఇచ్చారు. పెండింగ్ చలానాలు క్లియర్ చేస్తే వాహనాన్ని అప్పగిస్తామని ఎస్సై చెప్పారు. కాగా .. పెండింగ్ చలానాల్లో ఎక్కువగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకే ఉండటం గమనార్హం. ఇంతగా ట్రాఫిక్ వాయిలెన్స్‌కు పాల్పడిన సదరు వాహనదారుడికి ఏమైనా శిక్ష విధిస్తారా, లేక లైసెన్స్ రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. -
గీత దాటితే మోతే
సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా ఫైన్ మోత మోగనుంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా, శిక్ష రెండూ అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటి వరకు విధించే జరిమానాలన్నీ కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ మంత్రివర్గం తీర్మానించింది. ఇకపై చిన్నపిల్లలకు (మైనర్లకు) వాహనాలు ఇస్తే పిల్లల తల్లితండ్రులకు, సంరక్షులు లేదా వాహనం ఇచ్చిన వ్యక్తికి రూ. 25వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్సు కూడా రద్దు చేసే అవకాశముంది. వారి పిల్లలు ప్రమాదం చేస్తే తల్లితండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ. 10వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులై వాహనం నడిపితే రూ. 10వేలు జరిమానా చెల్లించాలి. ఇక డ్రైవింగ్ లైసెన్సు ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ. 1000 నుంచి రూ. 2000 జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. బీమా లేకుండా వాహనం నడిపితే రూ. 2 వేలు జరిమానా చెల్లించాలి. సీటు బెల్టు ధరించకపోతే రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినా రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్సు రద్దవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధిస్తారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే గతంలో రూ.500 పెనాల్టీ విధించేవారు. ఇప్పుడు దానిని రూ. 2 వేలకు పెంచారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 5 వేలు, మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా నడిపితే రూ. 5 వేలు, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. రవాణా చేసే వాహనాలు ఓవర్ లోడింగ్ చేస్తే రూ. 20 వేలు పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు మార్పు చేశారు. ఇలాంటి నిబంధనలు స్వయంగా సంబంధిత అధికారులే ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపవుతాయి. దీనికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. ఇటీవల కాలంలో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందితే ఇలాంటి కఠిన నిబంధనలతో తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుంది. -
వీరు మారరంతే..!
గత జనవరిలో అత్తాపూర్‌లో వేగంగా వెళుతున్న బైక్ ముందు వెళుతున్న కారును ఢీకొట్టింది. అయితే ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించడంతో చిన్న చిన్న గాయాలతో క్షేమంగాబయటపడ్డాడు’మే నెలలో బాలానగర్‌లో వేగంగా వెళుతున్న బైక్ ముందున్న కారును ఢీకొట్టడంతో ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకుతీవ్ర గాయం కావడంతో ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందాడు. హెల్మెట్ ధరించి ఉంటే అతడి ప్రాణాలు కూడా దక్కేవి’ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సగానికి పైగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న కేసులే. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మే నెలవరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 10,48,934 ఈ–చలాన్లు జారీ చేయగా, అందులో 5,72,237(54.55 శాతం) కేసులు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపినవే కావడం గమనార్హం. మొత్తం ఈ–చలాన్ల ద్వారా రూ.38,18,96,205 జరిమానా విధించగా, అందులో దాదాపు రూ.8 కోట్లు హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు విధించినదే. ప్రాణాలు పోతున్నా మారరు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి మే నెలవరకు జరిగిన 1090 రోడ్డు ప్రమాదాల్లో 600 వరకు ఘటనలకు (55 శాతం) ద్విచక్ర వాహనదారులే కారణం. ఆయా ప్రమాదాల్లో 281 మంది మృతి చెందగా, వారిలో 182 మంది బైక్ రైడర్లే(64.7 శాతం) ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలోనూ పలువురు హెల్మెట్ ధరించనందునే తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హెల్మెట్ ధరించిన వారు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. ‘హెల్మెట్ లేకుండా బైక్ నడిపినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగితే తలకు గాయాలై కొద్ది సెకన్లపాటు స్పృహ కోల్పోవడం, తలనొప్పి, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించడం, దృష్టి మసకబారడం, చెవిలో హోరున శబ్దం, రుచి తెలియకపోవడం, బాగా ఆలసటగా ఉన్నట్లు అనిపించడం, ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపకశక్తి, దృష్టి కేంద్రీకరణలో మార్పులు కనిపిస్తాయ’ని వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర గాయా లైతే తలనొప్పి, వాంతులు, వికారం, ఫిట్స్, మాట ముద్దగా రావడం, ఏదైనా అయోమయం లో బలహీనత లేదా తిమ్మిర్లు, ఆలోచనలకు చేతు లు సమన్వయం లోపించడం, తీవ్రమైన అయో మయం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఇక హెల్మెట్ పెట్టుకున్నా కింద బెల్ట్ సక్రమంగా పెట్టుకోకుంటే ప్రమాద సమయాల్లో ఊడిపోయితలకు గాయాలవుతున్నాయి. పూర్తి స్థాయిలో సక్రమంగా ధరించినప్పుడే ప్రమాదవేళరక్షణ లభిస్తుందని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. సెల్..హెల్.. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్‌కాల్ వస్తే బండి నడుపుతూనే మాట్లాడటానికి వాహనచోదకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఐదు నెలల్లో 4341 మంది ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ ఐదు నెలల్లో ఏకంగా 24,396 కేసులు నమోదయ్యాయి. దీనికితోడు మైనర్ డ్రైవింగ్ కేసులూ భారీగా పెరుగుతున్నాయి. మాదాపూర్ జోన్లో 784, బాలానగర్ జోన్లో 186, శంషాబాద్ జోన్లో 185 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడిపిన 6,955 మందికి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలాన్లు జారీ చేశారు. తప్పించుకోలేరు... ట్రాఫిక్ జంక్షన్లలోని సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ పోలీసులు చేతిలోని కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు అసంపూర్తి, అసమగ్ర నంబర్ ప్లేట్లతో రోడ్లపై చక్కర్లు కొడుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. స్పాట్ ఈ–చలాన్లు జారీ చేసి వారి భరతం పడుతున్నారు. ఇలా ఈ ఐదు నెల్లో ఏకంగా 16,239 నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలకు జరిమానా విధించారు. ఐటీ కారిడార్‌తో పాటు బాలానగర్, శంషాబాద్ జోన్లలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 28,810 ఆటోవాలాలకు ఈ–చలాన్లు జారీ చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకున్న 1,310 వాహనాలకు కూడా జరిమానా విధించామన్నారు. డ్రంకన్ డ్రైవర్లకు జైలే... మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రంకన్ డ్రైవర్లను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఐదు నెలల్లో 8987 డ్రంకన్ డ్రైవర్లపై కేసులు నమోదుచేశారు. వీరిలో 2,418 మందికి ఒకటి నుంచి పది రోజుల పాటుజైలు శిక్ష పడింది. జరిమానా విధిస్తున్నా మారడం లేదు... వాహనచోదకులు ఎక్కువగా హెల్మెట్ లేకుండా బైక్ నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. జరిమానాలు విధించినా తీరు మార్చుకోవడం లేదు. ఫలితంగా రోడ్డుప్ర మాదాలు జరిగితే తలకు తీవ్రగాయాలై మృత్యువాత పడుతున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉంటుండడంతో కళాశాలల్లో రోడ్డు ప్రమాదాలకు దారి తీసే పరిస్థితులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.–విజయ్ కుమార్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ -
పోలీసులూ..తస్మాత్ జాగ్రత్త
సాక్షి, చెన్నై : ‘ పోలీసులూ...తస్మాత్ జాగ్రత్త’ అంటూ చెన్నై కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. హెల్మెట్ ధరించకుండా వెళ్లే పోలీసులకు జరిమానా విధించాలని, మద్యం మత్తులో వాహనం నడిపే పోలీసులపై కేసులు నమోదు చేయాలని ట్రాఫిక్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మద్యం మత్తులో పట్టుబడే పోలీసుల వివరాలతో నివేదికను కమిషనరేట్‌కు పంపిస్తే, క్రమశిక్షణ చర్య తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య çకట్టడి లక్ష్యంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గతంలో మద్రాసు హైకోర్టు హుకుం జారీ చేయడంతో వాహన చోదకుల నెత్తిన హెల్మెట్లు కొంతకాలం దర్శనం ఇచ్చాయి. ఈ సమయంలో ధరలు ఆకాశాన్ని అంటినా హెల్మెట్లను కొనుగోలు చేయకతప్పలేదు. ఇందుకు కారణం పోలీసులు జరిమానా మోత మోగించడమే. కొంతకాలం హెల్మెట్ తప్పనిసరి అన్న నినాదం మిన్నంటినా, క్రమంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో వాహనం నడిపేవారే కాదు, వెనుక సీట్లో కూర్చున్న వాళ్లూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో హెల్మెట్ గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించి చైతన్యం తీసుకొచ్చే విధంగా కమిషనర్ విశ్వనాథన్ నేతృత్వంలో కార్యక్రమాలు సాగాయి. అలాగే, చెన్నైలో అనేక ప్రాంతాల్ని, ప్రధాన మార్గాల్ని కలుపుతూ హెల్మెట్ జోన్స్ ప్రకటించారు. ఈ మార్గాల్లో హెల్మెట్ తప్పనిసరి చేసి, కొరడా ఝుళిపించారు. చివరకు ఈ ప్రయత్నం కూడా కొన్నాళ్లే అన్నట్టుగా సాగింది. దీంతో హెల్మెట్ ధరించే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. పోలీసులు సైతం హెల్మెట్లు ధరించడం లేదన్న వాదన తెరపైకి వచ్చింది. వ్యవహారం మరో మారు మద్రాసు హైకోర్టుకు చేరగా, గత వారం విచారణ సమయంలో పోలీసులు న్యాయమూర్తుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. హెల్మెట్ ధరించాల్సిందే.. గత వారం విచారణ సమయంలో న్యాయమూర్తులు పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేయడంతో పాటుగా అక్షింతలు వేసే విధంగా స్పందించారు. అలాగే, హెల్మెట్లు ధరించని వాహన చోదకులు లైసెన్స్‌లు ఎందుకు రద్దు చేయ కూడదని ప్రశ్నించారు. వాహనం నడిపే వాళ్లు, వెనుక సీట్లు ఉన్న వాళ్లు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని, అలా ధరించని వారి వాహనాలు సీజ్ చేయాలన్నట్టుగా కోర్టు స్పందించింది. కోర్టు తీవ్ర హెచ్చరికలు, ఆగ్రహం నేపథ్యంలో ఇక, హెల్మెట్ కొరడా ఝుళిపించేందుకు తగ్గట్టుగా పోలీసులు సిద్ధమయ్యారు. వాహన చోదకులతో కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా తమ సిబ్బందికి సైతం హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వడమే కాదు, హెల్మెట్ ధరించని పోలీసులకు సైతం జరిమానా విధించే విధంగా కమిషన్ ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. అధికారులతో కమిషనర్ సమాలోచన.. కమిషనరేట్ ఆదివారం పోలీసు అధికారులతో ఏకే విశ్వనాథన్ భేటీ అయ్యారు. గంటన్నర పాటుగా సాగిన భేటీ అనంతరం ట్రాఫిక్ విభాగానికి ›ప్రత్యేక ఆదేశాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెన్నై కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి పోలీసులు ఇక, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని ఆదేశించారు. హెల్మెట్ లేకుండా ఎవరైనా పోలీసులు రోడ్డెక్కినా, అట్టి వారికి జరిమానా విధించాలన్నారు. నిబంధనలు అన్నది అందరికీ వర్తిస్తుందని, సోమవారం నుంచి హెల్మెట్ ధరించని పోలీసులకు జరిమానా విధించే విధంగాముందుకు సాగాలని ఆదేశించారు. విధి నిర్వహణ నిమిత్తం వెళ్తున్నా, సొంత పని మీద వెళ్తున్నా, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారు. అలాగే, ఎవరైనా పోలీసు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ పక్షంలో కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇలా పట్టుబడే వారి వివరాలను నివేదిక రూపంలో కమిషనరేట్‌కు పంపించాలని, దీని ఆధారంగా మద్యం తాగి వాహనాలు నడిపే పోలీసుల మీద శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగం ఈ ఆదేశాలు, ఉత్తర్వులను తప్పనిసరిగా అనుసరించాలని, జరిమానా విధింపు, కేసుల నమోదులో వెనక్కు తగ్గ వదని హుకుం జారీ చేశారు. కాగా, పోలీసులకే జరిమానా మోత మోగించే విధంగా ఆదేశాలు జారీ చేసి ఉన్న నేపథ్యంలో ఇక, సామాన్యులు నెత్తిన హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన పక్షంలో, జరిమాన కొరడా మరింతగా మోగడం ఖాయం. ఈ దృష్ట్యా, ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం. -
శకటమా.. వీరంతా క్షేమమా..?!
బాపట్లటౌన్: రవాణాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు వాహన చోదకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తత్ఫలితంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. మైనర్లు, లైసెన్స్ లేని వారు వాహనాలు నడుపుతున్నా నియంత్రించడంలో రవాణా, పోలీస్ శాఖలు విఫలమయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆటోలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి మరీ ప్రయాణికులను ఎక్కిస్తూ వాహనాలను నడుపుతున్నారు. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. దీంతో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం ఖాయం. పరిమితిని మించిన ప్రయాణాలు అరికడితే ప్రమాదాలను చాలావరకు నియంత్రించవచ్చు. అవగాహన సదస్సులు సరే...ఆచరణేది? ఇటీవల నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందిన తర్వాతే వాహనాలు నడపాలని, పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అధికలోడుతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం అని చెప్పిన అధికారులు ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపే వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవింగ్ పూర్తిగా రాని వారికి కూడా అధికారులు లైసెన్స్‌లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హడావుడి చేయటం తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మైనార్టీ తీరని వారు కూడా వాయువేగంగా బైక్‌లపై దూసుకెళ్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ కూడా రోడ్లపై కనిపిస్తూనే ఉంది. చర్యలు తీసుకోవాల్సిన మోటారు వాహనాల తనిఖీ అధికారులు, పోలీస్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆటోవాలాలు, ట్రాక్టర్ల వాళ్లు సామారŠాధ్యనికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటోలో వెనుక డోర్‌పై నిలబడి ప్రయాణిస్తున్నప్రజలు గజిబిజిగా నంబర్ ప్లేట్లు ద్విచక్ర వాహనాలపై నంబర్ ప్లేట్లు ఎవరికిష్టమొచ్చినట్లు వారు వేయించడం వలన ఆ బండి నంబర్ చూసేవారికి అర్ధం కావడం లేదు. మరికొంత మంది నంబర్‌పై ఉన్న మోజుతో కొన్ని నంబర్లు పెద్దవిగానూ, మరికొన్ని నంబర్లు చిన్నవిగా వేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు చూసే వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని వలన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాల వారు నంబర్‌ను సరిగా గుర్తించని కారణంగా బీమా రాని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకొందరు నంబర్‌ప్లేట్లపై సినీహీరోల బొమ్మలు వేసి, నంబర్‌ను చిన్నగా రాయిస్తున్నారు. ఈ విషయాలు రవాణా, పోలీస్ శాఖాధికారులకు తెలియంది కాదు. అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వలనే అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వాహన చోదకులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. గత 20 రోజుల వ్యవధిలో సుమారు 70 వాహనాలను సీజ్ చేశాం. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి వాహనచోదకులపై చర్యలు తీసుకుంటాం. – జి.రామచంద్రరావు, ఎంవీఐ కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం లైసెన్స్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుం టున్న వాహనచోదకులపై కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం. ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి ప్రమాదాలను నివారించేందుకు కృషిచేస్తాం. – జి.రవికృష్ణ, ఎస్ఐ -
నీకు వేరే దారే లేదా .. రూల్స్ బ్రేక్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఎందుకు పాటించడంలేదని ప్రశ్నిస్తూ ప్రజాప్రతినిధిని ఓ యువతి వీడియో తీస్తే.. మమ్మల్నే వీడియో తీస్తావా అంటూ ప్రజాప్రతినిధి కూతురు కూడా ఫోన్‌తో చిత్రీకరిస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిజాంపేటలో ఎంపీటీసీ సురేష్ యాదవ్ సర్వీస్ రోడ్డుకు అడ్డంగా కారును పార్క్ చేశారు. అయితే అదే రోడ్డుగుండా వెలుతున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ రిషికా రోడ్డుపైనే కారును పార్క్ ఎందుకు చేశారంటూ నిలదీసింది. నీ ఇష్టమొచ్చింది చేసుకో, అసలు నువ్వెందుకు ఈ రూట్లో వచ్చావు, నీకు వేరే దారే లేదా అంటూ సురేష్ యాదవ్ దబాయించాడు. అంతేకాకుండా సురేష్ యాదవ్ కూతురు కూడా వీడియో తీస్తూ యువతిని ఇట్స్ నాట్ యువర్ ప్రాపర్టీ, నువ్వేం పోలీసువు కాదంటూ ర్యాష్‌గా మాట్లాడింది. అయితే ఈ ఘటనపై రిషికా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. ఎంపీటీసీ కారుకు చలానా విధించారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
అతిక్రమణకు తప్పదు మూల్యం
విజయవాడ, గుడ్లవల్లేరు(గుడివాడ): రకరకాల పనులపై ఇంటినుంచి తమతమ వాహనాల్లో ప్రజలు బయటకు వెళుతుంటారు. అలా వెళ్లిన వారిలో చాలామంది ప్రమాదాలు జరిగి మృత్యువాతకు గురవుతున్నారు. మరికొందరు దివ్యాంగులుగా మారుతున్నారు. బాధిత కుటుంబాల్లో చీకట్లు నెలకొంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను ఫిట్‌గా ఉంచుకుంటే ప్రయాణాలు సుఖవంతంగా జరుగుతాయి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ప్రయాణాల్లో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు రవాణా శాఖాధికారుల నుంచి వస్తున్నట్లే రవాణాలో తమకు రక్షణ ఉండటం లేదని ప్రయాణికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బైకిస్టులు, వాహన చోదకులు అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్కూల్ పిల్లలను ఎక్కించే బస్సులు కండీషన్లో లేవనే ఆరోపణలు తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణాల్లో కొన్ని నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను అదుపు చేసుకోవచ్చు. స్కూల్ బస్సుకు నిబంధనలు పాటించాలి ఏపీ మోటారు వాహనాల నియమావళి ప్రకారం 1989లో 185 (జి)ప్రకారం పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోరాదు. 60 ఏళ్ల వయసు దాటినవారు డ్రైవింగ్ చేయకూడదు. పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించరాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటారు వాహన చట్టం సెక్షన్ 86 ప్రకారం జరిమానా, పర్మిట్‌పై చర్య కూడా ఉంటుంది. డ్రైవింగ్‌లో సెల్ మాట్లాడితే ప్రమాదమే సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే మోటారు వాహన చట్టం 184 ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. లేదా సీఎంవీ రూల్ 21 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేస్తారు. సెల్లో మాట్లాడుతూ ఏ వాహనాన్ని డ్రైవ్ చేసినా ఇవే చర్యలుంటాయి. హెల్మెట్‌తో ప్రాణానికి రక్ష వాహన చోదకుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రమాదాల సమయంలో ప్రాణానికి హాని తక్కువగా ఉంటుంది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 129 ప్రకారం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే సెక్షన్ 177 ప్రకారం జరిమానా రూ.వంద విధిస్తారు. అతి వేగం ప్రమాదం అతివేగం అత్యంత ప్రమాదకరం. అతివేగం వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎందరో అభాగ్యులు ప్రమాదాల బారిన పడతారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి. మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 112, 183(1)ప్రకారం జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు. మద్యం సేవించి నడిపితే మృత్యు కౌగిలే.. మద్యం సేవించి వాహనం నడిపితే మృత్యువాత పడాల్సిందే. మద్యం సేవించిన సమయంలో చిన్న మెదడు పని చేయకపోవడం వల్ల ఎదుట వచ్చే వాహనాలను గుర్తించే శక్తి తగ్గుతుంది. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మద్యం సేవించి వాహనం నడిపితే వాహన చట్టం సెక్షన్ 185 ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష విధిస్తారు. సిగ్నల్ అధిగమిస్తే చర్యలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సిగ్నల్ జంపింగ్ చేస్తే నేరం. ఈ దుందుడుకు చర్య వల్ల సిగ్నల్ ఇచ్చిన వైపు నుంచి వచ్చే వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతారు. ఇలా చేస్తే వాహన చట్టం సెక్షన్ 184 ప్రకారం ఆరు నెలల వరకు జైలుశిక్ష లేదా రూ. వెయ్యి జరిమానా విధిస్తారు. వాహనం నడపాలంటే ఇవి తప్పనిసరి వాహనం నడుపుటకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందే. రిజిస్ట్రేషన్ లేకుంటే మోటారు వాహన చట్టం సెక్షన్లు 39, 192 ప్రకారం జరిమానా ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే మోటారు సెక్షన్ 3, 4, 180, 181 ప్రకారం జరిమానా లేదా జైలుశిక్ష తప్పదు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహన చోదకునికి సెక్షన్ 190 (2) ప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇన్సూరెన్స్ లేకపోతే సెక్షన్ 196 (ఎ) ప్రకారం మూడు నెలల జైలశిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా ఉంటుంది. సీట్బెల్ట్తో ప్రయాణం సురక్షితం కారులో సీట్‌బెల్ట్ పెట్టుకుని ప్రయాణిస్తే గమ్యస్థానానికి సురక్షితంగా చేరవచ్చు. డ్రైవింగ్ సీట్లో ఉన్నవారే కాకుండా ఫ్రంట్ సీట్లో కూర్చున్నవారు కూడా బెల్ట్ పెట్టుకుంటే మంచిది. సీఎంవీ రూల్ 138 (3) ప్రకారం విధిగా సీట్‌బెల్ట్ ధరించాల్సిందే. సీట్‌బెల్ట్ ధరించనిచో మోటారు వాహన చట్టం సెక్షన్ 177ప్రకారం రూ.వెయ్యి జరిమానా తప్పదు. -
27 చలానాలు పెండింగ్.. వాహనం సీజ్
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి 27 పెండింగ్ చలనాలు కట్టకుండా ఉన్న ఓ వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనాన్ని సుల్తాన్‌బజార్ పోలీసులు సీజ్ చేసారు. ఆదివారం విస్తృత తనిఖీలలో భాగంగా సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలోని హానుమాన్‌టేకిడి క్రాస్‌రోడ్స్ వద్ద ఇన్స్పెక్టర్ సుబ్బారామిరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు మధుసూధన్, నర్సింగ్‌రావులు వారి సిబ్బందితో వాహనాల తనిఖిలు నిర్వహిస్తున్నారు. హుస్సేనీహాలం, దూద్‌బౌలికి చెందిన మిర్జా రజాఅలీ(42), టీఎస్ 12 ఎబి 8383 నెంబర్ గల ఫ్యాషన్ ప్రో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అతని వాహనాన్ని ఆపిన పోలీసులు అతని బండిపై ఉన్న చలానా చిట్టాను చూసి ఆశ్చర్యపోయారు. రూ.4650 గల 27 పెండింగ్ చలానాలు ఉండడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సోమవారం మిర్జా ఈ సేవలో చలానాలు చెల్లించడంతో అతని వాహనాన్ని పోలీసులు రిలీజ్ చేశారు. -
తస్మాత్.. జాగ్రత్త!
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సీసీ కెమెరాల సహాయంతో జరిమానాలు విధించేందుకు పోలీసులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరంలో పలు కూడళ్లలో నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తూ అత్యాధునికి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ కెమెరాలు ఏర్పాటు తరువాత ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా క్షణాల్లో సీసీ కెమెరాల్లో నమోదై జరిమానా కట్టేందుకు ఈ చలానా అందుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం హైస్పీడ్ సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో నగరంలో పలు ప్రాంతాలకు 325 సీసీ కెమెరాలు మంజూరు చేసింది. తొలి విడతగా నగరంలో ప్రధాన కూడళ్లలో 95 కెమెరాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టింది పోలీస్‌శాఖ. ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల్లో కెమెరా అమర్చేందుకు అవసరమైన స్తంభాలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క స్తంభానికి నాలుగు కెమెరాల ఏర్పాటు చేయనున్నారు. ఈ నిఘా వ్యవస్థ వల్ల పాత నేరస్తులతో పాటు చోరీకి గురైన వాహనాలను గుర్తించవచ్చని, అలాగే నిబంధనలు అతిక్రమించిన వారితో పాటు, ఆ వాహన చోదకుని ఫొటో, వాహనం నంబర్ ప్లేట్ ఫొటో ఇలా నిఘా వ్యవస్థ ఏర్పాటుకు అర్బన్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇకపై వాహన చోదకులు జాగ్రత్తగా వ్యవహరించి వాహనాల అధిక స్పీడు, రాంగ్‌రూట్, లైన్ దాటడం వంటి తప్పిదాలు చేయకుండా వాహనాలు నడపాల్సి ఉంటుందని అడిషనల్ ఎస్పీ రమణ్‌కుమార్ తెలిపారు. -
ఒక్క క్షణం ఆలోచిస్తే కుటుంబానికి శోకం ఉండదు: కళ్యాణ్‌రామ్
రోడ్డు ప్రమాదాలకు కారణం నిర్లక్ష్యం...తొందరపాటు...మితిమీరిన వేగమే. ఒక్క క్షణం దీనిపై యువత ఆలోచించాలి. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాలి. ట్రాíఫిక్ రూల్స్ పాటించాలి. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాలు 40 కిలోమీటర్లు మించి వేగంతో వెళ్లరాదని సూచిస్తున్నాం’ అని హోం మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. సోమవారం సరూర్‌నగర్‌లో రహదారి భద్రతా వారోత్సవంలో ఆయన మాట్లాడారు. సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 70 శాతం యువతే ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాల్సిన యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన 30వ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ ఆలీ పాల్గొన్నారు. మోటార్ సైకిల్ ర్యాలీతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు సేఫ్టీ ఆథారిటీ డైరెక్టర్ టి.కృష్ణ ప్రసాద్, లా అండ్ అర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, సినీ నటుడు కళ్యాణ్ రామ్, ట్రాపిక్ డీసీపీ దివ్యచరణ్ పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణఖు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.707 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో రహదారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసుల పనితీరుతో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు వాహనాలు 40 కిలోమీటర్లు మించి వెళ్లరాదని సూచించారు. ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో ‘రోడ్డు ప్రమాదాల వీడియో’లను ప్రదర్శించాలని సూచించారు. ‘మోటార్ వెహికల్ యాక్ట్ కింద 2014లో 71 లక్షల కేసులు నమోదు కాగా 2018లో 1.30 కోట్ల కేసులు నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర రోడ్డు సేఫ్టీ ఆథారిటీ డైరెక్టర్ టి.కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు. ధ్వంసమైన రోడ్లు, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించి మరమ్మతులు చేపట్టామన్నారు. అతివేగం, డ్రంకన్ డ్రైవ్ కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు వసూలు చేస్తారన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలు తమ సంస్థలో ఎవరూ రోడ్డు ప్రమాదం బారిన పడలేదని నివేదిక ఇస్తే అవార్డు అందజేస్తామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండలో ట్రాఫిక్ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రాణం కంటే మించినది లేదు... ‘డ్రైవింగ్ చేసేటప్పుడూ హెల్మెట్ ధరించాలి. సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆగాలి. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయవద్దు. ఇలా ట్రాఫిక్ నిబంధనలన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతో మంది కుటుంబాలకు శోకసంద్రాన్ని మిగిల్చింద’ని సినీ నటుడు కళ్యాణ్‌రామ్ అన్నారు. 2014, 2018లో తాను అన్న య్య, నాన్నను కోల్పోయానని, ప్రాణం కంటే మించింది ఏదీ లేదన్నారు.రహదారిపై వెళ్లేటప్పు డు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, సిగ్నల్ దగ్గర ఒక్క నిమిషం ఆగి వెళ్లడం వల్ల సమయం మించిపోదన్నారు. ప్రజల బాగోగుల కోసమే పోలీసులున్నారని, వారికి సహకరించాలని కోరారు. ఆలోచింపచేసిన వీడియోలు... హెల్మెట్ ధరించకపోవడం, సిగ్నల్ జంపింగ్, అతివేగం వల్ల జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాల వీడియోలను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించారు. హెల్మెట్ ధరించిన బైకర్‌కు ప్రమా దం జరిగినప్పుడు గాయాలు కాని వీడియోలను ప్రదర్శించారు. అభి బృందం రోడ్డు ప్రమాదాలపై చేసిన నాటకం విద్యార్థులను ఆలోచింపచేసింది. -
నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు చెక్
విశాఖపట్నం ,అనకాపల్లిటౌన్: ట్రాఫిక్ నిబంధనలు పాటిం చడం వల్ల రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని డీఎస్పీ ఎస్.వి.వి. ప్రసాదరావు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద 30వ జాతీయ రోడ్డు భద్రతావారోత్సవాలను ఎస్పీ అట్టాడ బాబూజీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నెహ్రూచౌక్ నుంచి పెరుగుబజారు మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్, కారు డ్రైవర్లు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. డివిజన్ పరిధిలో ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనకాపల్లి పట్టణంలో పార్కింగ్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వారోత్సవాలు 10వతేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.బుచ్చిరాజు మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే 80 «శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ సీఐ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, వన్‌వే ప్రయాణం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పట్టణ సీఐ ఎస్.తాతారావు మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడితే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మద్యం సేవించి వాహనాలు నడిపితే అపరాధ రుసుంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు అప్పన్న, శ్రీనివాసరావు, వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు, ఉషా తదితరులు పాల్గొన్నారు. -
ఎవరైతే మాకేంటి.. రూల్ రూలే.!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా విమానాశ్రయ భద్రతా సిబ్బంది కఠినంగా వ్యవహరించక తప్పడం లేదు. ఇక్కడ వీఐపీలు, వీవీఐపీల పేరిట ఇష్టానుసారంగా కార్లు పార్కింగ్ చేసిన వారు అపరాధ రుసుం చెల్లించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. విమానాశ్రయ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం భద్రతా సిబ్బందితో అధికారులు చర్యలు చేపట్టారు. విమానాశ్రయం ముందు పార్కింగ్ చేసిన వారి వాహనాలకు కళ్లాలు వేశారు. దీంతో ఆ కార్లను డ్రైవర్లు స్టార్ట్ చేసినా.. ముందుకు కదలలేదు. ఇదేంటని వెతికితే బెట్లు కట్టిన కార్ల చక్రాలకు చట్రాలు బిగించేసి ఉన్నాయి. ఇలా నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేసిన చాలా వాహనాలకు రూ. 3 వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించారు. ఓ తెలుగు మహిళా నాయకురాలు కారుకు ఎంపీ స్టిక్కర్ అతికించుకుని వస్తే అదేదో ఎంపీ కారని భద్రతా సిబ్బంది భావించారు. అయితేనేం నిబంధనలకు వ్యతిరేకంగా పార్కింగ్ చేశారని ఆ కారు చక్రానికి తాళం వేసేశారు. రూ.3 వేలు చెల్లిస్తే గానీ కదలనీయలేదు. మరో చోట ఓ పోలీసు అధికారి వెంట వచ్చిన మరో వ్యక్తి కారును జరిమానా వేశారు. ఇలా.. విమానాశ్రయంలో పార్కింగ్ క్రమబద్ధీకరణ కట్టుదిట్టం చేయడానికి నిర్మోహమాటంగా భద్రతా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. -
స్విగ్గి, జోమాటో, ఉబర్ డెలి‘వర్రీ’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో ‘ఇంటి వద్దకే ఫుడ్ డెలివరీ’ చేసే కంపెనీల వాహన చోదకులు ఇకపై జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో సైబరాబాద్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జోమాటో, ఉబర్ ఈట్స్ తదితర సంస్థలకు చెందిన అధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ వీసీ సజ్జనార్ అధ్యక్షతన ఆదివారం ‘సెన్సిటైజేషన్ కమ్ సేఫ్టీ’ సమావేశం నిర్వహించారు.ఫుడ్ డెలివరీ వాహనాల ప్రమేయమున్న ప్రజల భద్రత, రోడ్డు భద్రత, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై జరిగిన ఈ సమావేశంలో ట్రాఫిక్, శాంతిభద్రతలు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. తీరు మార్చుకోవాల్సిందే... మద్యం తాగి వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్, వ్యతిరేక దశలో డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హారన్లు ఇష్టారీతిన మోగించడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ టాంపరింగ్ తదితర చర్యలతో ప్రజల్లో ఫుడ్ డెలివరీ వాహనచోదకులు ఆందోళన కలిగిస్తున్నారు. మొదటిసారి కావడంతో ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నామని, తీరు మార్చుకోకపోతే ట్రాఫిక్ పాయింట్ సిస్టమ్‌తో కఠిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిథులను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్లపై ఆయా కంపెనీలు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే డ్రైవర్లను తీసుకునే సమయంలో వారి పూర్వపరాలు, కస్టమర్ డాటా నిర్వహణ, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన, ప్రజా సమస్యల పరిష్కరానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అయితే ట్రాఫిక్ నిబంధనలు తరచూ అతిక్రమించే వారిపై నిఘా వేసి తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు పోలీసులకు హామీ ఇచ్చారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ సమావేశానికి ఆహ్వనించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించే తమ కంపెనీ వాహన డ్రైవర్లపై కఠినంగా ఉంటామన్నారు. సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీలు ప్రవీణ్‌కుమార్, అమర్‌కాంత్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్ పాల్గొన్నారు. -
భాయ్... జర దేఖ్‌కె చలో..
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ జంక్షన్ల వద్ద రెడ్‌లైట్ ఉండగానే రయ్యిమని దూసుకెళ్లే వాహనచోదకులు...ఇప్పుడు అలా వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అనుకునే వారిని ‘సీసీటీవీ’ కెమెరాలు హడలెత్తిస్తున్నాయి. ఆటోమేటిక్ రెడ్‌లైట్ కెమెరా, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఆపరేట్ చేసే స్పీడ్ లేజర్ గన్లు, డిజిటల్ కెమెరా, ట్యాబ్‌లు ట్రాఫిక్ ఉల్లంఘనుల పట్ల తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఫలితంగా నేరుగా ఇంటికే ఈ చలాన్లు అందుతున్నాయి. 15 రోజుల్లో ఫైన్ కట్టకపోతే లీగల్ నోటీసులు, అయినా స్పందించకపోతే చార్జిషీట్ దాఖలవుతున్నాయి. కొన్ని సార్లు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘనుల సంఖ్య గతేడాది 12,034 కాగా, ఈ ఏడాది 11,423కు తగ్గిందక?్షవదుకు జంక్షన్ల వద్ద సీసీటీవీ కెమెరాలు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కెమెరాల ప్రభావమే కారణంగా గుర్తించారు. ‘స్పీడ్’ పట్టుకుంటున్నా తగ్గని వేగం... ఔటర్ రింగ్ రోడ్డులో వాహన వేగం పరిమితిపై సూచన బోర్డులు కనిపిస్తాయి. ఉదహరణకు 40 కి లోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ప్రాంతంలో 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళితే ఈ స్పీడ్ లేజర్ గన్లు ఇట్టే పసిగడతాయి. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 1,19,933 మందికి ఈ చలా న్లు జారీ అయ్యాయి. గతేడాది పరిమితికి మించి వేగంతో వెళ్లిన వారు రాచకొండ పరిధిలోని ఓఆర్ఆర్లో 45,212 మంది ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య ఏకంగా 1,19,933కు పెరగడం గమ నార్హం. అతివేగం కారణంగా ఓఆర్ఆర్లో ఈ ఏ డా ది 34 రోడ్డు ప్రమాదాలు జరగగా 20 మంది దు ర్మరణం పాలయ్యారు. 34 మంది గాయపడ్డా రు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. జంపింగ్ ఈ ప్రాంతాల్లోనే... ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో సిగ్నల్ జంపింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి తార్నాక వచ్చే మార్గంలో రాంగ్ సైడ్ డ్రై వింగ్ చేస్తూ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. జంక్షన్లతో పాటు రోడ్డుపై నో పార్కింగ్ జోన్లో నిలిపిన వాహనాలను కానిస్టేబుళ్లు కెమెరాలో బంధించి...ఆ ఫొటోలను ఆయా పోలీసు స్టేషన్ల నుంచి అప్లోడ్ చేసి ఈ చలాన్‌కు పంపుతున్నారు. ఈ ఏడాది 7,93,441 ఈ–చలాన్లు జారీ చేయగా, వీటిలో ఎక్కువగా రాంగ్‌సైడ్ డ్రై వింగ్, నో పార్కింగ్ జోన్లో ఉన్న వాహన కేసులే ఉన్నాయి. ఒకప్పుడు 80 శాతం వరకు ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తే, 20 శాతం టెక్నాలజీని ఉపయోగించుకునేవారు. ఇప్పుడు 80 శాతం టెక్నాలజీతోనే పనులు చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే వాహనదారుల్లోనే మార్పురావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. -
పట్టుకోండి చూద్దాం..!
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్): శంషాబాద్ పట్టణానికి చెందిన రమేష్ నిత్యం ద్విచక్రవాహనంపై తన అవసరాల నిమిత్తం స్థానికంగా తిరుగుతుంటాడు. ఇటీవల బెంగళూరు జాతీయ రహదారిని దాటే క్రమంలో అతడు హెల్మెట్ ధరించని కారణంగా పలుమార్లు ట్రాఫిక్ చలాన్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి తన మదిలో ఓ ఆలోచన తట్టింది. వాహనానికి వెనక ఉన్న నంబర్ ప్లేటుపై ఒక అంకెను తొలగించాడు. ఇంకేముంది.. ఇప్పుడు తలపై హెల్మెట్ లేకున్నా దర్జాగా రోడ్లపై నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్నాడు. ఇది ఒక రమేష్ విషయమే కాదు. శంషాబాద్ పట్టణంలో నిత్యం చాలామంది వాహనదారులు ఇదే తరహాలో ట్రాఫిక్ నిబంధనలపై నీళ్లు చల్లుతూ చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి. నాలుగుచక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలి. డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్లో మాట్లాడకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ట్రాఫిక్ పోలీసులు గుర్తించి చలాన్లు విధిస్తుంటారు. శంషాబాద్ పట్టణంలో బెంగళూరు జాతీయ రహదారిపై రెండు చోట్ల ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను పోలీసులు నియంత్రిస్తుంటారు. దీంతోపాటు ఇక్కడ నిత్యం ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను ఉల్లంఘించే వారిపై నిఘా వేస్తుంటారు. ఇందులోభాగంగా.. ట్రాఫిక్ సిబ్బంది చేతిలో ఉన్న కెమెరాతో ఉల్లంఘనుల వాహనాల ఫొటోలను తీసి వాటి ఆధారంగా చలాన్లు విధిస్తున్నారు. అయితే, చలాన్లను తప్పించుకునేందుకు, తమ వాహనాల వివరాలు తెలియకుండా.. అక్రమార్కులు నంబర్ ప్లేట్లపై అంకెలను తొలగించి లేదా తారుమారు చేసి యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో దర్జాగా తప్పించుకుంటున్నారు. దీంతో ఉల్లంఘనదారులకు విధించే చలాన్లను వాహనదారుల చిరునామాలకు పంపించలేకపోతున్నారు. వాహనదారుల పాట్లు పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వాహనదారులు వివిధ పనుల నిమిత్తం ప్రధాన వీధుల్లో వా హనాలపై తిరుగుతుంటారు.ముఖ్యంగా పట్టణం జాతీయ రహదారికి రెండు వైపులా ఉండడం.. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్, కూరగాయల మార్కెట్‌కు వెళ్లే వారు జాతీయ రహదారి దాటాల్సి ఉంటుంది. ఏ చిన్న పని ఉన్నా ద్విచక్రవాహనాన్ని వినియోగించక తప్పడం లేదు. కొద్దిదూరం కోసం హెల్మెట్ పెట్టుకోవడం ఎందుకని చాలామంది మామూలుగానే వాహనంపై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి ఫొటోలు తీసి చలాన్లు విధిస్తున్నారు. వీటితో విసిగిపోతున్న వాహనదారులు చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొత్తదారులు వెతుకుతున్నారు. నంబరు ప్లేట్లపై అంకె లేదా అక్షరం తొలగించడం.. పూర్తిగా నంబర్ కనిపించకుండా ప్లేట్లుపై స్టిక్కర్లు అతికించడం, నంబరు ప్లేటును మడతపెట్టడం తదితర పనులు చేస్తున్నారు. నిందితులను గుర్తించడం కష్టమే.. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు నంబరు ప్లేట్లపై మార్పులు చేస్తుండగా.. వీరి ముసుగులో నేరస్తులు తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదైనా నేరం చేయడానికి వాహనాలపై వచ్చిన నిందితులు ఇలాగే నంబర్లు కనిపించకుండా జాగ్రత్త పడితే.. ఆయా కేసులను ఛేదించడం పోలీసులకు ఇక సవాల్‌గానే మారుతుంది. అయితే, వాహ నాల నంబర్ ప్లేట్లపై అంకెలు, అక్షరాలు తొలగించిన వాహనదారులు నిత్యం పోలీసుల ఎదుటే తిరుగుతున్నా వారు దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వినిపిఉ్తన్నాయి. మరోవైపు శంషాబాద్ పట్టణంలో పార్కిగ్ సమస్య జఠిలంగా మారింది. నో పార్కింగ్ ఏరియాలో, ప్రధాన వీధుల వెంబడి నిలిపే వాహనాల ఫొటోలను సేకరించి పోలీసులు చలాన్లు విధిస్తుండగా.. నంబర్లు సరిగా లేని వాహ నదారులు యథేచ్ఛగా తప్పించుకుంటున్నారు. వాహనాన్ని సీజ్ చేస్తాం వాహనాలకు నంబరు ప్లే ట్లు నిబంధనల మేరకు ఉండాలి. నంబర్ ప్లేట్లపై అంకెలు, అక్షరాలు తొల గించిన వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే సీజ్ చేస్తాం. నిబంధనల మేరకు నడుచుకోకపోతే చర్యలు తప్పవు. – జి.నారాయణరెడ్డి,ట్రాఫిక్ సీఐ, శంషాబాద్ -
గీత దాటితే వాతే!
సాక్షి, సిటీబ్యూరో: ‘‘ట్రాఫిక్ నియమాలను తొంబై తొమ్మిది సార్లు ఉల్లంఘించినా ఇబ్బంది రాకపోవచ్చు. ఆ ధోరణి మారకుంటే వందోసారైనా మూల్యం చెల్లించుకోక తప్పదు’’ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల విషయంలో అధికారులు పదేపదే చెప్పే మాట ఇది. ఈ మూల్యం ఉల్లంఘనకు పాల్పడిన వాహన చోదకుడు చెల్లించడం ఒక ఎత్తు.. ఏ పాపం ఎరుగని ఎదుటి వ్యక్తిపై ప్రభావం చూపితే ఆ కుటుంబం పడే బాధ, వ్యధ మరో ఎత్తు. ప్రస్తుతం నగరంలో నిత్యం అనేక కుటుంబాలు ఈ క్షోభను అనుభవిస్తున్నాయి. ఉల్లంఘనుల దృష్టిలో ‘పొరపాటు’గా అనుకున్న అనేక సంఘనలు బాధితుల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నాయి. ఇలాంటి ‘పొరపాట్ల’లో రాంగ్ రూట్, నో ఎంట్రీ మార్గాల్లోకి వాహనాలతో రావ డం ప్రధానమైంది. వీటికితోడు మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అడ్డదిడ్డంగా ఆటోలు తిప్పడం వంటి ఉల్లంఘనలు సైతం ఎదుటి వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలతో నగరంలో పదేపదే చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఒకరి నిర్లక్ష్యానికి మరో కుటుంబం బలి రోడ్డుపై ప్రయాణిస్తూ కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు.. అది వన్‌వేగా కనిపిస్తున్నా.. రాంగ్ రూట్ అని తెలిసినా పట్టించుకోకుండా దూసుకుపోతున్నారు. ‘నో ఎంట్రీ’ మార్గాల్లో ఇలాగే ప్రవర్తిస్తున్నారు. బైకర్ల నుంచి భారీ వాహనాల డ్రైవర్లు సైతం నో ఎంట్రీల్లోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాహనచోదకులు చిన్న చిన్న ప్రమాదాలకు గురవడంతో పాటు అనేక దారుణమైన సంఘటనలకూ కారణమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి రాంగ్‌రూట్/ నిర్లక్ష్య డ్రైవింగ్ ఎదుటి వారి ఉసురు తీయడంతో పాటు వారి కుటుంబాన్నే కకావికలం చేస్తున్నాయి. 2013లో ముషీరాబాద్ ఏఎస్సై సత్యనారాయణ ఉసురు తీసిన మరణమే దీనికి నిదర్శనం. మూడు కేటగిరీలుగా ఉల్లంఘనలు రహదారి నిబంధనల ఉల్లంఘనలను ట్రాఫిక్ విభాగం అధికారులు మూడు కేటగిరీలు పరిగణిస్తారు. వాహన చోదకుడికి ప్రమాదకరంగా మారే వి మొదటిది కాగా, ఎదుటి వ్యక్తికి నష్టం కలిగిం చేవి రెండోది. వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పు తెచ్చేవి మూడో కేటగిరీకి చెందినవి. ప్రస్తుతం నగర ట్రాఫిక్ అ«ధికారులు ఈ మూ డో కేటగిరీపై దృష్టి పెట్టారు. పదేపదే ప్రమాదాలకు కారణమవుతున్న ఏడు రకాలైన అంశాలను గుర్తించారు. వీరిపై అనునిత్యం స్పెష ల్ డ్రైవ్స్ చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాల ను రంగంలోకి దింపారు. అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్‌కుమార్ పర్యవేక్షణలోనే ఇవి పనిచేస్తున్నాయి. కొన్ని చర్యలు తీసుకున్నా.. ‘మూడో కేటగిరీ’ ఉల్లంఘనలకు చెక్ చెప్పడానికి ఇప్పటికే నగర ట్రాఫిక్ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ‘రాంగ్ రూట్, నో ఎంట్రీ’ ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినా ఉల్లంఘనుల్ని పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డులను మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కం ట్రోల్ రూమ్ ద్వారా ఈ–చలాన్ పంపుతున్నారు. అయితే అన్ని వేళల్లో ఈ పాయింట్లలో సిబ్బంది లేకపోవడంతో ఉల్లంఘనులు రెచ్చిపోయి ప్రాణాలు తీసుకోవడం/తీయడం చేస్తున్నారు. రంగంలోకి నాలుగు బృందాలు ట్రాఫిక్ ఉల్లంఘనులకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పాలని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నగర వ్యాప్తంగా తనిఖీల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రస్తుతం స్థానిక పోలీసుల ఆధీనంలో పనిచేస్తున్న టీమ్స్ అన్ని తరహా ఉల్లంఘనలు, రెగ్యులేషన్‌పై దృష్టి పెడతాయి. అయితే, ఈ ప్రత్యేక బృందాలు మాత్రం కేవలం ఏడు రకాలైన ఉల్లంఘనల్నే పరిగణలోకి తీసుకుని డ్రైవ్స్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఒక్కో బృందంలో ఎస్సై, ఏఎస్సై, హెడ్–కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉంటారు. ప్రతిరోజు ట్రాఫిక్ చీఫ్ ఆదేశాల మేరకు వీరు నగరంలోనే ఏ ప్రాంతంలో అయినా తనిఖీలు చేస్తారు. ఏ ఠాణా పరిధిలో డ్రైవ్ చేస్తుంటే అక్కడి స్థానిక ఎస్సై వీరికి సహకరిస్తారు. బుధవారం నుంచే ఈ టీమ్స్ రంగంలోకి దిగి తొలిరోజు 66 కేసులు నమోదు చేశాయి. -
బండెక్కితే బాదుడే..!
ఖమ్మంక్రైం: సిగ్నల్స్ వద్ద మార్కింగ్ లేకపోవడం.. దుకాణాల ఎదుట వాహనాలు నిలిపేందుకు స్థలం లేకపోవడం.. వాహనదారులు, ప్రయాణికులు ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని గందరగోళం. నిత్యం వేలాది వాహనాలు నగరంలోకి వచ్చిపోతుండడంతో ట్రాఫిక్ వ్యవస్థ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రధాన కూడళ్లలో మరీ దారుణంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ట్రాఫిక్ పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ–చలానా విధానంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి తీరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఐదు సెక్టార్లుగా విభజించారు. ఒకటో సెక్టార్ గాంధీ చౌక్ నుంచి త్రీటౌన్ ప్రాంతం, రెండో సెక్టార్ వన్‌టౌన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి, మూడో సెక్టార్ వైరారోడ్ నుంచి జెడ్పీసెంటర్ వరకు, నాలుగో సెక్టార్ జెడ్పీసెంటర్ నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు, ఐదో సెక్టార్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైపాస్ రోడ్డు వరకు విభజించారు. వీటిలో ప్రధాన కూడళ్లు అయిన గాంధీచౌక్, కాల్వొడ్డు, వైరా రోడ్, కిన్నెర పాయింట్, మయూరి సెంటర్ ప్రాంతాల్లో నిత్యం వాహనదారులు, పాదచారులు నరకం చూడాల్సిందే. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్య ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కస్బాబజార్‌లో పలు వస్త్ర దుకాణాల వద్ద, అజీజ్ గల్లీ ప్రాంతంలో సైతం ఇదే సమస్య. ముఖ్యంగా అత్యంత రద్దీ ప్రాంతమైన కిన్నెర పాయింట్, కమల మెడికల్ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడి పాయింట్లో విధులు నిర్వర్తించాల్సిన కానిస్టేబుళ్లు ఉండడం లేదని, దీంతో ట్రాఫిక్ సమస్య ఆ ప్రాంతంలో మరింత తీవ్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పాయింట్ల వద్ద ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాలి. కానీ.. ప్రధాన పాయింట్ల వద్ద సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉండగా.. అందులో 20 మంది వరకు ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయభ్రాంతులకు గురిచేస్తున్న సిబ్బంది ఇటీవల కాలంలో ఈ–చలానా, క్యాష్‌లెస్ లావాదేవీల పేరుతో హైదరాబాద్ స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారు చేపట్టిన కార్యక్రమం మంచిదే అయినప్పటికీ ఖమ్మం వంటి నగరంలో దీనిపై 90 శాతం మంది వాహనదారులకు అవగాహన లేదు. ఈ విధానాన్ని ఇక్కడ ప్రారంభించిన మొదటి రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి తప్ప దీనిపై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. కొందరు సిబ్బందికి డిజిటల్ కెమెరాలు ఇచ్చి విధి నిర్వహణకు పంపిస్తుండడం.. వారు ఒక్కసారిగా రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుల ఫొటోలు తీయడంతో ఏమీ అర్థంకాక వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా అసలు ఫొటోలు తీస్తున్న సిబ్బందికి కూడా ఈ ఫొటోలు ఎందుకు తీయాలి.. ఈ–చలానా అంటే ఏమిటో కూడా సరిగా తెలియదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అతిక్రమించడం, హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి వాటిని ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి.. నేరుగా వాహనదారుడి సెల్‌కు జరిమానా ఎంత కట్టాలి అనే దానిపై మెసేజ్ పంపిస్తారు. పార్కింగ్ ఏర్పాటు గాలికి.. హైదరాబాద్ స్థాయిలో ఈ–చలానా ప్రవేశపెట్టిన పోలీసులు.. హైదరాబాద్ స్థాయిలో కాకుండా కనీసం ఖమ్మం కమిషనరేట్ స్థాయిలో వాహనాల పార్కింగ్ కోసం ఏళ్లు గడిచినా సరైన స్థలం చూపించలేదు. నిత్యం నగరానికి సుమారు 1.50 లక్షల వాహనాలు వచ్చి పోతుంటాయి. వీటిలో 20వేలకు పైగా ఆటోలు ఉండగా.. మిగతావి ఇతర వాహనాలు ఉన్నాయి. ఆటోలకు అడ్డాలు లేకపోవడంతో నిత్యం రోడ్లపైనే వాటిని నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఆస్పత్రికి.. వ్యాపార సముదాయాలకు వెళ్లాలనుకున్నా.. తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక సతమతమవు తున్నారు. ఇంత జరుగుతున్నా పార్కింగ్ స్థలాల గురిం చి ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. వాహనదారులకు వివరించాలి.. అలాగే ఈ–చలానాపై వాహనదారులకు అవగాహన కల్పించడం ఎంతోముఖ్యం. ఈ–చలానా అంటే ఏమి టి? ఎందుకు ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తారు? అనే దానిపై తమకు కూడా అవగాహన కల్పించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. ఆ తర్వాతే దీనిని పూర్తిస్థాయిలో అమలుచేస్తే బాగుం టుందని వాహనదారులు, ప్రజలు చెబుతున్నారు. -
బాప్రే చలాన్ నెం.136
సాక్షి, సిటీబ్యూరో: మీరు బైక్‌పై తిరుగుతున్నారా.. ఎప్పుడన్నా హెల్మెట్ పెట్టుకోవడం మరిచిపోయారా..! ఎవరు చూస్తార్లే.. అని డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నారా..! అయితే, ఒక్కసారి ‘ఈ–చలాన్’ చెక్ చేసుకోండి. మీ వాహనంపై ఎన్ని చలాన్లు జారీ అయ్యాయో చూసుకోండి. లేదంటే నగరంలో ఏదో ఒకచోట పోలీసులు మీ బండిని స్వాధీనం చేసుకుంటారు. ఆపై కోర్టులో అభియోగపత్రం దాఖలు చేస్తారు. దాంతో మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిదే. పోలీసులు లేని ప్రాంతంలో హెల్మెట్ లేకుండా తిరిగినా.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేసినా సీసీ కెమెరాల్లో గుర్తించి మరీ చలాన్లు జారీ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి గురువారం ట్రాఫిక్ పోలీసుల కంటబడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుతున్న ఓ వ్యక్తిని ఆపితే ఏకంగా 136 ఈ చలాన్లు ఉన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళితే.. నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు గురువారం సాయంత్రం హిమాయత్‌నగర్ ‘వై జంక్షన్’ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో అటుగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చిన వ్యక్తిని ఆపారు. ఈ ఉల్లంఘనపై చలాన్ జారీ చేస్తూనే.. సదరు బైక్‌పై ఉన్న పెండింగ్ చలాన్లు తెలుసుకోవడానికి ‘పీడీఏ మిషన్’లో బండి నెంబర్ (టీఎస్10ఈడీ9176) నమోదు చేశారు. మిషన్ నుంచి వచ్చిన ప్రింట్ ఔట్ చూసి పోలీసులకే కళ్లు తిరిగాయి. ఆ ద్విచక్ర వాహనంపై 28 నెలల్లో 136 సార్లు జారీ అయిన ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లించాల్సిన పెనాల్టీ మొత్తం రూ.31,590కి చేరినట్లు అందులో ఉంది. వీటిలో జరిమానాల మొత్తం రూ.26,900 కాగా.. సర్వీస్ చార్జి మరో రూ.4690 ఉంది. ఆ ద్విచక్ర వాహనం కేకే ప్రకాష్ పేరుపై రిజిస్ట్రర్ అయింది. 2016 జూన్ 9న తొలిసారిగా హెల్మెట్ లేకుండా సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయడంతో రూ.1100 చలాన్ జారీ చేశారు. అప్పటి నుంచి గురువారం వరకు మొత్తం 136 ఈ–చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో కేవలం ఆరు మాత్రం సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు సంబంధించినవి కాగా.. మిగతా 127 హెల్మెట్ లేకుండా వాహనం నడపడం వల్ల జారీ చేసినవి. మిగిలినవి నో పార్కింగ్ ఏరియాలో వాహనం నిలిపిన ఉల్లంఘనకు సంబంధించినవి. ఈ పెండింగ్ చలాన్లలో కేవలం ఒక్కటి మాత్రమే సైబరాబాద్ పోలీసులు జారీ చేయగా మిగిలినవన్నీ సిటీకి సంబంధించినవే. క్యాష్‌లెస్ ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల నుంచి స్పాట్లో జరిమానా వసూలు చేయట్లేదు. కేవలం ఈ–చలాన్ మాత్రమే జారీ చేస్తూ ఈ–సేవ, మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, ఆన్లైన్లో వీటిని చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ వాహన చోదకుడు హెల్మెట్నే కాదు.. ఈ–చలాన్ల చెల్లింపునూ మర్చిపోవడంతో పెండింగ్ జాబితా చాంతాడంత అయింది. ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి ముందు అతగాడికి ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ సైతం ఇవ్వనున్నారు. -
ఉల్లంఘనులు
సాక్షి, అమరావతి బ్యూరో : పటమటకు చెందిన విశాల్ తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ 73 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను బేఖాతరు చేసిన ప్రతిసారీ అతనికి ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానాలు పంపుతానే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అపరాధ రుసుం చెల్లించలేదు.సత్యనారాయణపురంలో ఉండే సురేష్ 63 సార్లు ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించకుండా కారు నడుపుతూ నిబంధనలను బేఖాతరు చేశాడు. పోలీసులు ఈ–చలానాలను పంపారు. కానీ ఒక్క సారీ అపరాధ రుసుం కట్టలేదు. ఇలాంటి విశాల్, సురేష్‌లు నగరంలో మరో పది వేల మందికి పైడి ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత నూతన రాజధానిలో భాగమైన బెజవాడలో నాలుగేళ్లుగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘనులపై కొరడా ఝళిపించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా వాహనాలను ఇష్టానుసారం నడుపుతున్న వాహనచోదకులను కట్టడి చేయనున్నారు. విజయదశమి తర్వాత స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టి అప్పటికీ దారికి రాని వాహనచోదకుల వాహనాలను సీజ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దసరా తర్వాత చిక్కులు తప్పవంటున్నారు ట్రాఫిక్ ఉన్నతాధికారులు. నాలుగేళ్లలో 23 లక్షల మందిపై కేసులు.. రాజధానిగాలో అంతర్భాగమయ్యాక బెజవాడలో 2014 నుంచి 2018 సెప్టెంబరు నెల వరకు 23,07,318 మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించారు. దీంతో వీరందరిపై కేసులు నమోదు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు ఈ–చలానాలను పంపుతూ వచ్చారు. ఇందులో 12,83,998 మంది స్పందించి ఈ–చలానాల్లో పేర్కొన్నట్లుగా దాదాపు రూ.20 కోట్లకుపైగా అపరాధ రుసుం చెల్లించారు. మిగిలిన 10,23,320 మంది వాహనచోదకుల నుంచి స్పందన లేకుండా పోయింది. వీరిలో 200 మందికిపైగా వాహనచోదకులు తరచూ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న ఘటనలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఒక్కొక్కరూ 10 నుంచి 70 సార్లుకుపైగా నిబంధల్ని ఉల్లంఘించడం గమనార్హం. మిగిలిన వారు మాత్రం ఎక్కువ సార్లు నిబంధనల్ని బేఖాతరు చేయకపోయినా అపరాధ రుసుం మాత్రం కట్టకుండా మిన్నకుండిపోయారు. వీరంతా కూడా దాదాపు రూ.20 కోట్ల వరకు ఫైన్ కట్టాల్సిఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారం రోజులు స్పెషల్ డ్రైవ్.. ఒకరికంటే ఎక్కువ మంది ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్నా.. అతివేగంగా వాహనాన్ని నడుపుతున్నా.. హెల్మెట్ లేకపోయినా.. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నా.. ఇప్పటి వరకు చూసీచూడనట్లు వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై కొరడా ఝళిపించనున్నారు. అయితే దసరా పండుగ వరకు వారందరికీ ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటిలోగా ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినా వాహనదారులు అపరాధ రుసుం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామని.. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. విజయదశమి తర్వాత ఒక వారం రోజులపాటు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నారు. కాబట్టి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనదారులు తస్మాత్ జాగ్రత్త. -
జరిమానాల జమానా
కడప కార్పొరేషన్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలకు ముకుతాడు వేయాల్సిందే. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తే జరిమానా వసూలు చేయాల్సిందే. మద్యం తాగి వాహనం నడిపితే మత్తు దించాల్సిందే...వీటిని ఎవరూ కాదనలేరు. అవగాహనతో కూడిన జరిమానాలు వేస్తే జనం హర్షిస్తారుగానీ జరిమానాలే పరమావధి కాకూడదు. నెలలో ఇన్ని డ్రంకన్ డ్రైవ్ కేసులు పెట్టాలి, ఇన్ని చలానాలు రాయాలని ఒత్తిడి తెస్తుంటే పోలీసులు తమ టార్గెట్లు అందుకోవడానికి వక్రమార్గాలు అన్వేషిస్తున్నారు. తమ లక్ష్యసాధన కోసం వైన్‌షాపుల వద్ద కాపుకాసి, మద్యం తాగి వాహనం ఎక్కే వారిని పట్టుకొని డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి వాటివల్లే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదులో వైఎస్ఆర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 2016లో 1701 కేసులు పెట్టి రూ.2.52కోట్లు ఆదాయంఆర్జించిపెట్టిన ఆర్టీఏ, పోలీసు అధికారులు 2017 సంవత్సరంలో 6230 కేసులు పెట్టి రూ.7.43కోట్లు జరిమానాలు వేశారు. 2018లో కేవలం మూడు మాసాల్లోనే 7,208 కేసులు పెట్టి రూ.6.43 కోట్లు ఫైన్లు వేశారంటే పోలీసుల ఉత్సాహం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం వద్ద, ఉన్నతాధికారుల వద్ద మెప్పు పొందడానికి ఇలా ప్రజల నడ్డి విరుస్తున్నారనేది ఈ లెక్కల ద్వారా తేటతెల్లమవుతోంది.కడప నగరానికి సిటీ కల్చర్ ఇంకా అలవాటు కాలేదు. చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు నిత్యం కూలీ పనుల నిమిత్తం వచ్చి రాత్రికి ఇంటికెళ్లిపోతుంటారు. వారికి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన ఉండదు కాబట్టి అలాంటి వారే ఈ కేసుల్లో ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మద్యాన్ని హెల్త్ డ్రింగ్గా ప్రచారం చేస్తూ ఏరులై పారిస్తోంది. విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చి ఎక్సైజ్ శాఖకు టార్గెట్(లక్ష్యం) విధించి మద్యం ద్వారా ఆదాయం సంపాదిస్తోంది. ఇదే క్రమంలో ఆర్టీఏ, పోలీసు శాఖలకు కూడా నెలకు ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ చలానాలు వేయాలని టార్గెట్లు విధిస్తున్నారు. ఇవిగాక రాంగ్ పార్కింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్టు పెట్టుకోకపోవడం వంటి వాటిపై కెమెరాలతో రికార్డు చేసి పోలీసులు చలానాలు వేస్తున్నారు. వీటి వల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుండటంతో ఎక్కువ టార్గెట్లు పెట్టి నెలనెలా సమీక్షలు నిర్వహించి వాహనదారులను జేబులు ఖాళీ చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ రహదారుల్లో వాహనాలు వేగంగా Ðð వెళ్తుంటాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చలానాలు వేస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికే ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఉండే ట్రాఫిక్‌కు 20–30 కిలోమీటర్లు స్పీడ్ వెళ్లలేని చోట కూడా ఫైన్లు వేయడమంటే ఆదాయం పెంచుకోవడానికిగాక మరేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సౌకర్యాలు అరకొరే... అయినా జిల్లాలోని పట్టణాల్లో ఇప్పటికీ మెరుగైన రోడ్డు సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు, ట్రాఫిక్ పో లీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు వంటి వాటిని ఎప్పుడో మర్చిపోయారు. ఫైన్లు వేయడమే వారికి పరమావధిగా మారిపోయింది. విదేశాల్లో అయితే డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనం విక్రయించేందుకు అవకాశం ఉండదు. కానీ ఇక్కడ లైసెన్స్ లేకపోయినా యథేచ్ఛగా వాహనాలు విక్రయించవచ్చు. దీంతో లక్షల సం ఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి.వీటికి సరిపడా రోడ్లు విస్తరణ కాలేదు సరికదా అటూ, ఇటూ గుంతలతో ఇబ్బందులు తప్పడం లేదు. మద్యాన్ని ఏరులై పారించమని ఎక్సైజ్ శాఖకు, ఫైన్లు వేయమని ఆర్టీఏ, పోలీసుశాఖకు, కేసులు రాయాలని విద్యుత్ శాఖకు, పన్నులు పెంచుకోవాలని మున్సిపాలిటీలకు లక్ష్యాలు(టార్గెట్లు) విధించి వసూళ్లు చేస్తున్న ప్రభుత్వం పెరుగుతున్న పెట్రో«ల్, గ్యాస్ «ధరలు, నిత్యావసర ధరలకు కళ్లెం వేయడంలో ఈ టార్గెట్లు పెట్టకపోవడం పట్ల ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లక్షల్లో్ల పేరుకుపోయిన బకాయిలు ఈ చలానా వేసిన 15 రోజుల్లోపు రుసుం చెల్లించాలి. 16వ రోజు నుంచి పెండింగ్‌లోకి వెళ్లిపోతుంది. అదే వాహనానికి రెండోసారి ఈ చలానా వస్తే.. మొదటిసారి పెండింగ్‌లో ఉన్న రుసుం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్‌లాంటి నగరాల్లో అయితే ఈ చలానా ద్వారా ఫైన్ వేసిన విషయం ఫోన్ నంబర్లకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడంతో వాహనదారులకు తమకు ఈ చలానాలో జరిమానా వి«ధించారన్న విషయం పోలీసులు ఆపినప్పుడుగానీ తెలియడం లేదు. దీంతో ఈ చలా నా బకాయిలు లక్షల్లో పేరుకుపోయినట్లు సమాచారం. వాటిని వసూలు చేయడానికి ఒక వాహ నం, ఏఎస్ఐ, ముగ్గరు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా ఒక బృందాన్ని కేటాయించి వసూళ్లు చేస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు వీరికి చలానాలు రాబట్టడమే పని. ఈ చలానాలో వారి బండినంబర్లు తనిఖీ చేయడం, వాహనం తమ వద్దనే ఉంచుకొని డబ్బులు కట్టి రసీదు తీసుకురమ్మని చెప్పడం నిత్యకృత్యంగా మారింది. సా ధారణంగా రెండు, మూడుసార్లు ఈ చలానా డబ్బు చెల్లించకపోతే ఆ వాహనం కనిపిస్తే పోలీసులు సీజ్ చేస్తారు. కానీ కడపలో పోలీసులు మా త్రం ఒకసారి చెల్లించకపోయినా వాహనం ఆపి, దాన్ని వారి వద్దనే ఉంచుకొని డబ్బు కట్టి రమ్మని చెబుతున్నారు. అతని వద్ద డబ్బు ఉందా, లేదా అప్పటికప్పుడు కట్టమంటే ఏం చేస్తాడన్న ఆలోచ న లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ చలానా వేసిన విషయం నాకు తెలీదు, రేపు చెల్లిస్తానని చెప్పినా వినిపించుకోకపోవడంతో వాహనదారులు ఇదేం న్యాయం, ఇప్పటికిప్పుడు చెల్లించమంటే ఎలా అని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అపరాధ రుసుములు ఇలా... మోటారు వెహికల్ యాక్టు కింద నిబంధనలు ఉల్లంఘించిన అన్ని రకాల వాహనాలకు కింద చూపిన విధంగా అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 500, రిజిస్ట్రేషన్ లేకుంటే రూ. 2వేలు, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.1000, మైనర్ డ్రైవింగ్‌కు రూ.500, వన్‌వే, నో ఎంట్రీలో ప్రవేశిస్తే రూ.200, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే రూ.2వేలు, హెల్మెట్ ధరించకపోతే రూ.100, దివ్యాంగులు అనుమతి లేకుండా ద్విచక్రవాహనం నడిపితే రూ.200, ర్యాష్ డ్రైవింగ్‌కు రూ.1000, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1000, హారన్ లేకపోతే రూ.100, లైన్ క్రాసింగ్‌కు రూ.100, సిగ్నల్ జంపింగ్‌కు రూ.1000, సిగరెట్ త్రాగుతూ డ్రైవింగ్ చేస్తే రూ.100, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200, వాహన యజమానికి కాకుండా ఇతర వ్యక్తులు డ్రైవింగ్ చేస్తే రూ.1000, మితిమీరిన వేగానికి, భీమా లేకపోతే వెయ్యి రూపాయల చొప్పున అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. ప్రమాదకరంగా, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే రీతిలో వాహనం నడిపినా, పర్మిట్ లేకపోయినా కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. -
అష్టదిగ్బంధనంలో సిక్కోలు
శ్రీకాకుళం సిటీ : నగరంలో ట్రాఫిక్ ఆంక్షలపై జిల్లాస్థాయి అధికారులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ట్రాఫిక్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడుతున్నారు. మరోవైపు రోడ్డును ఆనుకుని ఉన్న షాపులు, దుకాణాల తొలగింపు చర్యలు చేపడుతున్నారు. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్ కూడలి, డే అండ్ నైట్ కూడలి, ఆర్ట్స్ కళాశాల రోడ్డు నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ముందస్తు సమాచారం ఇవ్వని అధికారులు అంబేడ్కర్ కూడలి వద్ద నుంచి ఆర్ట్స్ కళాశాల వరకూ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు, వాహనదారులు, విద్యార్థులు, రోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అటు రామకృష్ణానగర్, శాంతినగర్ కాలనీల వద్ద కూడా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. ఎంపీ కార్యాలయానికి వెళ్లే రహదారికి కూడా ఈ నిబంధనలు తప్పలేదు. ఆర్ట్స్ కళాశాలకు వెళ్లే రహదారిలో బ్యాంకులు, ఆర్సీఎం కళాశాల, ఆసుపత్రులు, కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలుతో నిత్యం కిటకిటలాడుతుంది. ముందస్తు సమాచారం లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో అటువైపు వచ్చే వాహనదారులు, ప్రజలను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులతో వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ ఎస్సై నాగరాజు తీరుపై ప్రజలు, వాహనదారులు బాహాటంగానే దుయ్యబట్టారు. రోడ్డు పనులు, ట్రాఫిక్ మళ్లింపు తదితర విషయాలపై ముందస్తు సమాచారం ఇచ్చి ప్రజలు, వాహనదారులను అప్రమత్తం చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు.