ఇటీవల కాలంలో ఎంతలా ట్రాఫిక్ నిబంధలు పెట్టినా..ఘెరమైన యాక్సిడెంట్‌లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేగాదు ఎందరో తల్లులకు కడుపుకోత, తీరని వ్యథ మిగులుతుంది. ప్రధానంగా మొబైల్ ఫోన్‌లు, నిర్లక్ష్య ధోరణి, తొందరపాటులే ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు.
అక్కడికి దీనిపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం లేదు. ఏం చేస్తే ఈ సమస్యని నివారించగలమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రేంజ్‌లోనే హైవేలపై స్పీడ్ ఉండాలని నియంత్రించినా..ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే సమస్యను ఫేస్ చేస్తున్న వియత్నాం దేశం అమలు చేస్తున్న ట్రాఫిక్ చట్టాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలా అయినా ప్రమాదాలు తగ్గుతాయేమో అనే ఆశను రేకెత్తించింది. ఇంతకీ ఆ దేశం ఎలాంటి ట్రాఫిక్ చట్టాలను తీసుకొచ్చింది..? మన దేశంలో సాధ్యమేనా..?
వియత్నాం(Vietnam) రోడ్డు ప్రమాదాలను నివారించేలా ట్రాఫిక్ ఉల్లంఘనలు నియంత్రించేందుకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది. ఎవ్వరైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి గురించి సమాచారం అందిచినట్లయితే వారికి ప్రభుత్వం దాదాపు రూ. 17 వేలు వరకు ప్రోత్సహకాన్ని అందుకోవచ్చు.
ప్రజా భద్రతను పెంచేలా ట్రాఫిక్ క్రమశిక్షణ(Traffic Rules) అమలయ్యేందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వియత్నాం. నిజానికి గతేడాది ప్రారంభ నుంచే వియత్నాం ట్రాపిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి భరించలేని స్థాయిలో జరిమానాలు పెంచేసింది. రెడ్ సిగ్నల్ ఉండగానే పట్టించుకోకుండా వెళ్లిపోవడం, మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తదితరాలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ఏ పౌరుడైనా సమాచారం(reporting) అందిస్తే..వారి గోప్యతను భద్రంగా ఉంచడమే గాక వాళ్లకి పడిన జరిమానా నుంచి మినహాయింపు లేదా తగిన విధంగా ప్రోత్సాహకం ఇవ్వడం వంటివి చేస్తోంది. అంతేగాదు వారు నడిపే వాహనం అనుసరించి జరిమానాలను భారీగా పెంచింది. అలాగే పారితోషకం కూడా ఆ విధమైన డిఫరెన్స్‌తోనే భారీగా ముట్టచెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
దీంతో నెటిజన్లు ఆ దేశానికి దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఉన్న మనదేశంలో కూడా వాటిని అమలు చేస్తే చాలామంది మిలియనీర్లుగా మారతారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు(NITI Aayog member) అరవింద్ విర్మాణితో సహా చాలామంది మాత్రం తప్పనిసరిగా భారత్‌లో కూడా ఇలాంటి రూల్స్‌ని అమలు చేయాలని వాదిస్తూ పోస్టులు పెట్టారు.
ఇలా చేస్తే సంపాదన సామర్థ్యం కష్టమైపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఒకకంగా ఇది ఇరు దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎంతలా ఉన్నాయనేది హైలెట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒకరకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారన్ని అందించిందని చెప్పొచ్చు.
We should definitely introduce this for major traffic offenses like going the wrong way on a divided highway/street, and jumping red lights https://t.co/tTkpwoIXck
— Dr Arvind Virmani (Phd) (@dravirmani) January 5, 2025
(చదవండి: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుకలో మెనూ ఇలా ఉంటుందా..! 24 క్యారెట్ల బంగారం..)
Comments
Please login to add a commentAdd a comment