viatnam
-
నో డౌట్ ఇలా చేస్తే..చచ్చినట్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు..!
ఇటీవల కాలంలో ఎంతలా ట్రాఫిక్ నిబంధలు పెట్టినా..ఘెరమైన యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేగాదు ఎందరో తల్లులకు కడుపుకోత, తీరని వ్యథ మిగులుతుంది. ప్రధానంగా మొబైల్ ఫోన్లు, నిర్లక్ష్య ధోరణి, తొందరపాటులే ఈ రోడ్డు ప్రమాదానికి కారణాలు. అక్కడికి దీనిపై ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. పెద్దగా ప్రయోజనం లేదు. ఏం చేస్తే ఈ సమస్యని నివారించగలమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రేంజ్‌లోనే హైవేలపై స్పీడ్ ఉండాలని నియంత్రించినా..ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. అయితే ఇదే సమస్యను ఫేస్ చేస్తున్న వియత్నాం దేశం అమలు చేస్తున్న ట్రాఫిక్ చట్టాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇలా అయినా ప్రమాదాలు తగ్గుతాయేమో అనే ఆశను రేకెత్తించింది. ఇంతకీ ఆ దేశం ఎలాంటి ట్రాఫిక్ చట్టాలను తీసుకొచ్చింది..? మన దేశంలో సాధ్యమేనా..?వియత్నాం(Vietnam) రోడ్డు ప్రమాదాలను నివారించేలా ట్రాఫిక్ ఉల్లంఘనలు నియంత్రించేందుకు ప్రోత్సాహకాలను అందజేస్తామని ప్రకటించింది. ఎవ్వరైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి గురించి సమాచారం అందిచినట్లయితే వారికి ప్రభుత్వం దాదాపు రూ. 17 వేలు వరకు ప్రోత్సహకాన్ని అందుకోవచ్చు. ప్రజా భద్రతను పెంచేలా ట్రాఫిక్ క్రమశిక్షణ(Traffic Rules) అమలయ్యేందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది వియత్నాం. నిజానికి గతేడాది ప్రారంభ నుంచే వియత్నాం ట్రాపిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి భరించలేని స్థాయిలో జరిమానాలు పెంచేసింది. రెడ్ సిగ్నల్ ఉండగానే పట్టించుకోకుండా వెళ్లిపోవడం, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం తదితరాలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ఏ పౌరుడైనా సమాచారం(reporting) అందిస్తే..వారి గోప్యతను భద్రంగా ఉంచడమే గాక వాళ్లకి పడిన జరిమానా నుంచి మినహాయింపు లేదా తగిన విధంగా ప్రోత్సాహకం ఇవ్వడం వంటివి చేస్తోంది. అంతేగాదు వారు నడిపే వాహనం అనుసరించి జరిమానాలను భారీగా పెంచింది. అలాగే పారితోషకం కూడా ఆ విధమైన డిఫరెన్స్తోనే భారీగా ముట్టచెబుతోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.దీంతో నెటిజన్లు ఆ దేశానికి దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఉన్న మనదేశంలో కూడా వాటిని అమలు చేస్తే చాలామంది మిలియనీర్లుగా మారతారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సభ్యుడు(NITI Aayog member) అరవింద్ విర్మాణితో సహా చాలామంది మాత్రం తప్పనిసరిగా భారత్‌లో కూడా ఇలాంటి రూల్స్‌ని అమలు చేయాలని వాదిస్తూ పోస్టులు పెట్టారు. ఇలా చేస్తే సంపాదన సామర్థ్యం కష్టమైపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఒకకంగా ఇది ఇరు దేశాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎంతలా ఉన్నాయనేది హైలెట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఇది ఒకరకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారన్ని అందించిందని చెప్పొచ్చు.We should definitely introduce this for major traffic offenses like going the wrong way on a divided highway/street, and jumping red lights https://t.co/tTkpwoIXck— Dr Arvind Virmani (Phd) (@dravirmani) January 5, 2025 (చదవండి: గోల్డెన్ గ్లోబ్స్ 2025 అవార్డుల వేడుకలో మెనూ ఇలా ఉంటుందా..! 24 క్యారెట్ల బంగారం..) -
విస్తరణవాదం కాదు.. అభివృద్ధి కావాలి: మోదీ
న్యూఢిల్లీ: విస్తరణవాదం కాదు... అభివృద్ధి కావాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా చైనాకు చురక అంటించారు. తమ మద్దతు ఎల్లప్పుడూ అభివృద్ధికేనని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్చిన్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–వియత్నాం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర సహకారంపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. వియత్నంలో భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరువురు ప్రధానమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంధనం, సాంకేతికత, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాల్లో ఆరు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు చేశారు. మరో మూడు ఒప్పందాలను ఖరారు చేశారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఫామ్ మిన్చిన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. -
మన వెయ్యి రూపాయలు.. అక్కడ లక్షపైమాటే!
మనం డాలర్‌తో భారత రూపాయిని పోల్చి చూసినప్పుడు మన కరెన్సీ విలువ చాలా తక్కువనిపిస్తుంది. అయితే కొన్ని దేశాల్లో భారత కరెన్సీకి అత్యధిక విలువ ఉంది. ఆ దేశానికి మనం మన వెయ్యి రూపాయలు తీసుకెళ్తే, అది అక్కడ లక్షలకు సమానమవుతుంది. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇదే వాస్తవం. వియత్నాం.. సంస్కృతికి, ప్రకృతి సౌందర్యానికి, ఫుడ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం వియత్నాంలో ఒక భారతీయ రూపాయి విలువ 291 వియత్నామీస్ డాంగ్. అంటే ఆ దేశానికి మనం వెయ్యి రూపాయలు తీసుకువెళితే, అది అక్కడ 2,91,000 వియత్నామీస్ డాంగ్ అవుతుంది. వియత్నాం వెళ్లడానికి ఏదోఒక ప్రత్యేక సీజన్ కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఏ సీజన్లోనైనా వియత్నాంను సందర్శించవచ్చు. అయితే చాలా మంది పర్యాటకులు డిసెంబర్-జనవరి మధ్య ఇక్కడికి వెళ్లడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో అక్కడ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. వియత్నాంలొని హాలాంగ్ బే ప్రముఖ పర్యాటక ప్రదేశం. దీనిని ‘బే ఆఫ్ డిస్కవరింగ్ డ్రాగన్స్’ అని కూడా అంటారు. 1994లో యునెస్కో ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చింది. వియత్నాం రాజధాని హనోయి కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఈ నగరానికి చారిత్రాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. వియత్నాం ఉత్తర భాగంలో ఉన్న హువా గియాంగ్ కూడా పర్యాటకపరంగా ప్రాచుర్యం పొందింది. ఇది కూడా చదవండి: యమునలో కరసేవకులకు పిండ ప్రధానం -
విశాఖ తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరిన ఐఎన్ఎస్ ఐరావత్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి ఐఎన్ఎస్ ఐరావత్ నౌక గురువారం ఆక్సిజన్, కోవిడ్ మందులతో చేరుకుంది. కాగా ఐఎన్ఎస్ ఐరావత్ సింగపూర్ , వియత్నాం నుంచి 158 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, 2722 ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చింది. సముద్ర సేతు ప్రాజెక్టులో భాగంగా సింగపూర్, వియత్నాం భారత్‌కు కోవిడ్ సామాగ్రిని అందించింది. ఇప్పటికే సింగపూర్, ఇతర మిత్ర దేశాలు రెండు సార్లు కోవిడ్ సామాగ్రిని అందించాయి. కాగా తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరుకున్న సామాగ్రిని సిబ్బంది ఏపీతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు. -
ముగ్గురికి పాజిటివ్.. 80 వేల మంది తరలింపు
హో చి మిన్: కరోనా మహమ్మారి కట్టడిలో వియాత్నం విజయవంతమైనట్లు గతంలో వినే ఉన్నాం. ఈ దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనం. అయినప్పటికి అక్కడి ప్రభుత్వం వైరస్ కట్టడి కోసం కఠినాతికఠినమైన లాక్డౌన్ అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ తర్వాత వియాత్నంలో తాజాగా నిన్న(ఆదివారం) మూడు కరోనా కేసులు వెలుగు చూశాయి. దాంతో వియాత్నం ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అంతేకాకా దనాంగ్ సెంట్రల్ టూరిజమ్ హాట్‌స్పాట్ నుంచి దాదాపు 80 వేల మంది స్థానిక పర్యాటకులను తలిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. వీరిని తరలించడానికి దేశీయ విమాన సంస్థలు దనాంగ్ నుంచి దేశంలోని ఇతర నగరాలకు రోజు సుమారు 100 విమానలను నడపనున్నట్లు తెలిపింది. ఈ తరలింపు ప్రక్రియకు నాలుగు రోజులు పడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాక దనాంగ్ నుంచి వెళ్లిన వారు తప్పని సరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. దనాంగ్‌లో కఠినమైన సామాజిక దూరం అమల్లోకి రానున్నుట్లు తెలిపింది. (చిన్న దేశాలు.. పెద్ద విజయాలు) వియాత్నంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనం. అయినప్పటికి కూడా కరోనా కట్టడి కోసం విస్తృతంగా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటివరకు ఇక్కడ నమోదైన కేసుల సంఖ్య కేవలం 420 మాత్రమే. కొత్త కేసులు వెలుగులోకి రావడంతో అక్రమ వలసలపై అణిచివేత చర్యలను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నూగూయెన్ షువాన్ ఫుక్ పోలీసులను ఆదేశించారు. చైనా నుంచి వియత్నాంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రజలకు సహాయపడే ఒక క్రిమినల్ గ్రూపుకు అధిపతి అయిన 42 ఏళ్ల చైనా వ్యక్తిని దనాంగ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. -
‘మరో జన్మంటూ ఉంటే అక్కడే పుడతా’
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) తీవ్ర అస్వస్ధతతో మంగళవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మంగుళూరులో జన్మించిన ఫెర్నాండెజ్ దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా పనిచేశారు. ఎన్నో దేశాలు పర్యటించిన ఫెర్నాండెజ్ వియత్నాం దేశం పట్ల అమితమైన అభిమానం చూపేవారు. వారి నిబద్ధతను మెచ్చుకునేవారు. అంతేకాక వియత్నాన్ని సందర్శించిన భారతదేశ తొలి రక్షణశాఖ మంత్రి కూడా ఆయనే. (జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత) అటల్ బిహారి వాజ్‌పేయి కేబినెట్లో రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక ప్లాంటర్స్ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌కి హాజరయ్యారు ఫెర్నాండెజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇలా చెప్పుకోవడానికి నేనేం సిగ్గు పడటం లేదు. మరో జన్మంటూ ఉంటే వియత్నాంలో జన్మించాలని ఉంది. నమ్మిన దాని కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా వారు సిద్ధంగా ఉంటార’న్నారు. (‘ఫెర్నాండెజ్ అంటే ఇందిర కూడా భయపడేది’) అంతేకాక తాను వియత్నాంలో పర్యటించినప్పుడు.. అమెరికా, చైనా, ఫ్రాన్స్ దేశాలతో ఉన్న వివాదాల కారణంగా దాదాపు 30 లక్షల మంది వియత్నాం వాసులు చంపబడ్డారని తెలిసినప్పుడు తాను ఎంతో బాధపడ్డానని చెప్పుకొచ్చారు. ‘తలసరి ఆదాయంలో వియాత్నం ఇప్పటికి మనకంటే వెనకబడే ఉంది... కానీ ఇన్ని అవరోధాలను ఎదుర్కొని నిలబడగలిగింది’ అని ప్రశంసించారు. రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు వినూత్న ఆలోచనలు చేసే దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క వియాత్నం మాత్రమేనని అప్పట్లో ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. -
అక్కడ పెళ్లి ఓ మాయ!
మన సమాజంలో పెళ్లి అంటే ఏడడుగులతో.. వేదమంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై.. జీవితాంతం కలసి మెలసి తోడూనీడగా ఉండాలని కోరుకుంటారు. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరుపుకొంటారు. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లి కూడా కమర్షియల్ పుంతలు తొక్కుతోంది. అంటే అన్నీ రెడీమేడ్‌గా దొరికేస్తున్నాయి. అయితే వస్తువుల వరకు సరే కానీ.. పెళ్లి కొడుకు.. బంధువులు.. అందరూ అద్దెకు దొరికితే.. ఏంటీ పెళ్లి కొడుకును కూడా అద్దెకు తీసుకుంటారా అని ఆశ్చర్యపోకండి. ఇదంతా నిజమే కానీ మన దగ్గర కాదులెండి.. వియత్నాంలో! ఇప్పుడు నకిలీ పెళ్లి అక్కడ పెద్ద వ్యాపారంగా వర్ధిల్లుతోంది. ఇలా ఎందుకు చేసుకుంటారంటే అక్కడి యువతులు పెళ్లి కాకముందే గర్భం దాల్చడం సర్వసాధారణం. అందుకే వారు అబార్షన్ చేసుకుంటారు. అలా వియత్నాంలో ఏటా 3 లక్షలకు పైగా అబార్షన్లు జరుగుతాయట. వాటిలో 20 నుంచి 30 శాతం అబార్షన్లు పెళ్లికాని వారే చేయించుకుంటారట. అయితే ఆ బిడ్డను చంపుకోవడం ఇష్టం లేని వారు మాత్రం అబార్షన్ చేయించుకోరు. ఇక్కడే ఉంది ట్విస్ట్. అలా పెళ్లి కాకముందు బిడ్డను కనడం మాత్రం సమాజం ఒప్పుకోదట. దీంతో ఏదో ‘పెళ్లి జరిగింది’ అనిపించేందుకు ఓ పెళ్లి చేసుకుంటారట. నకిలీ పెళ్లి కొడుకులతో పాటు బంధువులు.. ఏర్పాట్లన్నీ సంబంధిత సంస్థలకు డబ్బులు ముట్టజెపితే చేసిపెడతాయి. అంతేకాదు భవిష్యత్తులో ఏవైనా చుట్టాల పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉంటే ఆ ‘భర్త’లను తిరిగి నియమించుకోవచ్చు. దీనివల్ల యువతులకు పెళ్లి అయిందనే ఒకరకమైన సంతృప్తి కలుగుతుందని వారి నమ్మకం. -
కుక్క డ్రైవింగ్.. ఓనర్‌కు భారీ ఫైన్
కౌలాలంపూర్: సాధారణంగా మనం వెనుక కూర్చొని మరో వ్యక్తి బైక్ డ్రైవింగ్ చేస్తుంటేనే బయపడిపోతుంటాం.. అలాంటిది కుక్క డ్రైవింగ్ చేస్తుంటే మనం వెను కూర్చుంటే ఎలా ఉంటుంది. గుండెలు అదిరిపోవు. కానీ, వియత్నాంలో మాత్రం ఓ యజమాని కుక్కను తనతో బైక్‌పై తీసుకెళ్లడంతోపాటు దానికి డ్రైవింగ్ బాధ్యతలు అప్పజెప్పాడు. అంతేకాదు.. తన కుక్క ఎలా డ్రైవింగ్ చేస్తుందో ముందుముందు చూసుకునేందుకు ఓ వీడియో కూడా తీసే ఏర్పాట్లు చేసింది. ఇక అంతే ఆ కుక్క ఏమాత్రం జంకు లేకుండా రయ్‌మంటూ బైక్ నడిపింది. గాల్లో తేలిపోయే వేగంతో బైక్‌ను పరుగులు పెట్టించింది. అయితే, ఆ వీడియోను ముచ్చటతో ఓనర్ ఆన్లైన్ లో పెట్టగా.. అది కాస్త భారీ బహుమతిగా ఫైన్ తీసుకొచ్చి పెట్టింది. ఆమె చేసిన చర్య చాలా భయంకరమైన చర్య అని, వాహన చోదకులకు, మూగజీవానికి ఇబ్బందిని కలిగించే చర్య అని వియత్నాంలోని ట్రాఫిక్ పోలీసులు దాదాపు 20 వేలకు పైగా ఫైన్ వేశారు.