న్యూఢిల్లీ: విస్తరణవాదం కాదు... అభివృద్ధి కావాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా చైనాకు చురక అంటించారు. తమ మద్దతు ఎల్లప్పుడూ అభివృద్ధికేనని తేలి్చచెప్పారు. ప్రధాని మోదీ, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్ మిన్‌చిన్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్–వియత్నాం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర సహకారంపై చర్చించారు.
ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. వియత్నంలో భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్‌వేర్ పార్కును ఇరువురు ప్రధానమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంధనం, సాంకేతికత, రక్షణ రంగంలో పరస్పర సహకారం తదితర అంశాల్లో ఆరు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు చేశారు. మరో మూడు ఒప్పందాలను ఖరారు చేశారు. మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఫామ్ మిన్‌చిన్ మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment