
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తామని గోల్కొండ ఎస్సై రాంలాల్ తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో పాఠశాలకు సెలవు ఉందని వదంతులు రావడంతో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ హైదరాబాద్ శాఖ ప్రతినిధి సయ్యద్ ఆసిఫ్ ఎస్సై రాంలాల్‌ను కలిశారు. పాఠశాలలకు సెలవులనే విషయంపై వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే పాఠశాలలకు సెలవు లేదని, పాఠశాలలకు చెందిన బస్సులను ప్రత్యేకమార్గాల ద్వారా వారి పాఠశాలలకు పంపుతామన్నారు. లంగర్‌హౌస్ నుంచి రాందేవ్‌గూడ మీదుగా వచ్చే వాహనాలకు లంగర్‌హౌస్ నుంచి గోల్కొండకు వచ్చే వాహనాలను మోతిదర్వాజ గుండా పంపుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment