Golkonda
-
చార్మినార్,గోల్కొండకు యునెస్కో గుర్తింపు కోసం కృషి
దూద్‌బౌలి: చార్మినార్, గోల్కొండలకు యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం చార్మినార్ కట్టడానికి శాశ్వతంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పర్యాటకులను మరింతగా ఆకర్షించే విధంగా గోల్కొండ కట్టడానికి సైతం శాశ్వత ఇల్యూమనేషన్ చేస్తున్నామని దాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించగానే హైదరాబాద్ నగరంలో నేషనల్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సాలార్జంగ్ మ్యూజియంలో ఐదు నూతన బ్లాక్‌లను ఏర్పాటు చేశామని... వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. హైటెక్ సిటీలో సంగీత నాటక అకాడమీ హాల్ హైదరాబాద్‌లో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుతో పాటు వరంగల్ కోటకు సైతం త్వరలో పర్యాటకులను ఆకర్షించే విధంగా శాశ్వత విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న వరంగల్ వేయి స్తంభాల గుడిని సైతం పున:నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడమీ హాల్‌ను ప్రారంభించనున్నామన్నారు. తెలంగాణ పర్యాటకం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక స్థలాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ జాన్వీ శర్మతో పాటు వినయ్ కుమార్ మిశ్రా, చంద్రకాంత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీరుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కోండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో ప్రతీ ఇంటా జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, తెలంగాణ త్రివర్ణ శోభితమైంది. ఎందరో వీరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. తెలంగాణ నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో తుర్రేబాజ్‌ఖాన్, రాంజీగోండు, పీవీ సహా అనేక మంది పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలోనే అన్ని రంగాల్లో ముందుంది. హైదరాబాద్‌ను గంగాజమునా తెహజిబ్‌గా మహాత్మాగాంధీ అభివర్ణించారని తెలిపారు. Watch live: Hon’ble CM Sri KCR taking part in Independence Day celebrations at Golconda Fort in Hyderabad. #IndiaIndependenceDay #IndiaAt75 #స్వాతంత్ర్యదినోత్సవం https://t.co/tHPxUgwVEc — Telangana CMO (@TelanganaCMO) August 15, 2022 -
గోల్కొండలో వజ్రోత్సవాల రిహార్సల్స్
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంలో ఈనెల 15న నిర్వహించే 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి పూర్తిస్థాయి రిహార్సల్స్‌ను శనివారం గోల్కొండ కోటలో నిర్వహించారు. పంద్రాగస్టున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోట నుంచి జాతీయ పతాకావిష్కరణ చేయ నున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్స్ జరిపారు. ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. 10.30 గంటలకు సీఎంకు గౌరవవందనం ఈనెల 15న ఉదయం పదిన్నరకు గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం పతాకావిష్కరణ కోసం సీఎం వచ్చేటప్పుడు వేయిమంది జానపద కళాకారులు స్వాగతం పలుకుతారు. జాతీయ పతా కావిష్కరణ చేసిన అనంతరం సీఎంకు రాష్ట్రీయ సెల్యూట్‌ను పోలీస్ దళాలు అందజేస్తాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేకపాసులు జారీ చేశారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా సమాచార శాఖ ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసింది. హాజరయ్యేవారికి మంచినీటి సౌకర్యంతోపాటు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. రిహార్సల్స్‌ను పరిశీలించినవారిలో పోలీస్ శాఖ అదనపు డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ పోలీస్ కమి షనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమ య్ కుమార్, సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
గోల్కొండలో ర‘కూల్’ గోల్ఫ్ (ఫోటోలు)
-
రాగరంజితమైన గోల్కొండ కోట
-
చరిత్రకు వారసత్వం..
‘ప్రత్యేకత’ ఉంటే హెరిటేజ్‌గా గుర్తింపు సాక్షి, హైదరాబాద్: చార్మినార్, రామప్ప, వేయి స్తంభాల గుడి.. అద్భుత నిర్మాణానికి, కట్టిపడేసే శిల్పకళకు తార్కాణాలు. నాటి నైపుణ్యానికి ప్రతీకలు. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఇలాంటి కట్టడాలను భావితరాలకు అందించడం మన కర్తవ్యం. దీని కోసమే భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ), హెరిటేజ్ తెలంగాణ కృషి చేస్తున్నాయి. యునెస్కో గుర్తింపు కోసం రామప్ప ఆలయాన్ని ప్రతిపాదించడం.. ఎర్రమంజిల్ కూల్చివేత నేపథ్యంలో ‘హెరిటేజ్’ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అసలు హెరిటేజ్ అంటే ఏమిటి?.. ఎలా గుర్తిస్తారు?... ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ప్రస్తుతం తెలంగాణలో ఏఎస్ఐ ఆధీనంలో 8 కట్టడాలే ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ, రామప్ప, వేయిస్తంభాల గుడి ఇందులో ప్రముఖమైనవి. దేశానికి ప్రాధాన్యాన్ని కల్పించే ప్రాంతం/ కట్టడాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) తన ఆధీనంలోకి తీసుకుంటుంది. హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 హెరిటేజ్ తెలంగాణలో ప్రస్తుతం 337 రక్షిత కట్టడాలు ఉన్నాయి. స్థానిక ప్రాంతానికి ప్రత్యేకతదిగా ఉన్న కట్టడం/ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని రక్షిత కట్టడాల జాబితాలోకి చేరుతుంది. నాటి హుడా ఆధ్వర్యంలో ఏర్పడ్డ హెరిటేజ్ కమిటీ గుర్తించిన కట్టడాలు 137. ఇటీవల వీటిని రక్షిత కట్టడాల జాబితా నుంచి సవరించారు. ఇవి అటు ఏఎస్ఐ అధీనంలో, ఇటు హెరిటేజ్ తెలంగాణ అధీనంలో లేవు. ప్రస్తుతం 3,693 కేంద్ర ప్రభుత్వ అధీనంలో (బ్రిటిష్ కాలంలో) 1861లో ప్రారంభమైన ఏఎస్ఐ తొలుత ఢిల్లీలోని 20 చారిత్రక కట్టడాలను రక్షిత కట్టడాలుగా గుర్తించింది. స్వాతంత్రం సిద్ధించే నాటికి వీటి సంఖ్య 151కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ జాబితాలో 3,693 ఉన్నాయి. వారసత్వ కట్టడాలంటే.. ఒక మానవ కట్టడం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రాంతం కొన్ని ప్రత్యేక లక్షణాలతో కనీసం వందేళ్లుగా మనుగడ సాగిస్తూ ఉంటే దాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించొచ్చు. చారిత్రకంగా ఆ ప్రాంతానికి ప్రత్యేక లక్షణాలుండాలి. లేదా నిర్మాణ శైలి అసాధారణ విలక్షణతతో కూడుకుని ఉండాలి. ఆ నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం దాగి ఉండాలి. దాని సౌందర్యం గొప్పగా అనిపించాలి. ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరమైనదై ఉండాలి. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. ప్రకృతి రమణీయతలో విలక్షణం కనపడాలి. అది ఆ ప్రాంత ప్రత్యేకత అని చాటి చెప్పేలా ఉండాలి.... ఇలా ఏదో ఓ అంశాన్ని అది కలిగి ఉంటే దాన్ని వారసత్వ ప్రాంతం కట్టడంగా గుర్తిస్తారు. -
మాట వినలేదని భార్య గొంతుకోసి..
సాక్షి, హైదరాబాద్ : తన ఇష్టప్రకారం నడుచుకోలేదన్న కోపంతో భార్య గొంతు కోశాడో కసాయి భర్త. ఈ సంఘటన బుధవారం గోల్కొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోల్కొండకు చెందిన రియాజ్‌కు రుబీనా అనే యువతితో ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. రియాజ్ పనిపాటా లేకుండా జులాయిగా తిరుగుతుండటంతో రుబీనా అతడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. గత వారం రోజులుగా పుట్టింటివద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో రియాజ్ బుధవారం అత్తగారింటి వద్దకు వచ్చాడు. ఆమెను తనతో పాటు ఇంటికి రావాలని బలవంతం చేశాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోగా రానని తెగేసి చెప్పడంతో అతడు ఆగ్రహించాడు. కోపంతో విచక్షణ కోల్పోయిన రియాజ్ కత్తితో భార్య మెడపై బలంగా కోయటంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో రియాజ్ అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రుబీనాను ఉస్మానియాకు తరలించారు. -
అమ్మకు బోనం
-
ఇదిగో ఆషాడం..అదిగో బోనం
-
బాలుడిపై లైంగికదాడికి యత్నం
గోల్కొండ: ఓ బాలుడిపై అరబిక్ టీచర్ లైంగికదాడికి పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టోలిచౌకి పారామౌంట్ కాలనీకి చెందిన జీషాన్ ఎండీలైన్స్లోని మజీద్ అల్ కౌసర్లో అరబిక్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మదర్సాలో నిర్వహిస్తున్న సమ్మర్ ఇస్లామిక్ క్యాంపులో విద్యార్థులకు అరబిక్ నేర్పుతున్నాడు. గత కొంత కాలంగా మదర్సాకు వస్తున్న ఓ బాలుడిని వేధించడమేగాక, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. పాటు తన మాట వినాలంటూ లేదంటే నీకు చదువు రాదంటూ భయపెట్టించాడు. ఈ నెల 13న అతను బాలుడిని మదర్సాలోని గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. అతడి భారినుంచి తప్పించుకున్న బాధితుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో బుధవారం రాత్రి వారు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
రేపు, ఎల్లుండి స్కూళ్లు యథాతథం
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తామని గోల్కొండ ఎస్సై రాంలాల్ తెలిపారు. ఈ నెల 28, 29వ తేదీల్లో పాఠశాలకు సెలవు ఉందని వదంతులు రావడంతో గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ హైదరాబాద్ శాఖ ప్రతినిధి సయ్యద్ ఆసిఫ్ ఎస్సై రాంలాల్‌ను కలిశారు. పాఠశాలలకు సెలవులనే విషయంపై వివరణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే పాఠశాలలకు సెలవు లేదని, పాఠశాలలకు చెందిన బస్సులను ప్రత్యేకమార్గాల ద్వారా వారి పాఠశాలలకు పంపుతామన్నారు. లంగర్‌హౌస్ నుంచి రాందేవ్‌గూడ మీదుగా వచ్చే వాహనాలకు లంగర్‌హౌస్ నుంచి గోల్కొండకు వచ్చే వాహనాలను మోతిదర్వాజ గుండా పంపుతామన్నారు. -
గోల్కొండ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు
-
కోట కిటకిట
-
మైనర్ బాలికకు ఇంట్లో పని ఇప్పిస్తానని చెప్పి
-
డెబిట్ కార్డుతో పట్టుచీరలు కొన్న మంత్రి
ఆ పాలసీకి అనుగుణంగా బడ్జెట్‌ను పెంచుతాం: కేటీఆర్ వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తాం.. మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడి చౌటుప్పల్: రాష్ట్రంలో త్వరలోనే నూతన చేనేత పాలసీని తీసుకువస్తామని చేనేత, టెక్స్టైల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. వారంలో ఒకరోజు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు విధిగా చేనేత దుస్తులు ధరించే విధంగా ఆదేశాలు జారీచేస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని అపెరల్ టెక్స్టైల్స్ పార్కును ఆయన గురువారం సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. చేనేత, టెక్స్టైల్ రంగాలకు నూతన పాలసీని అమల్లోకి తెస్తామని.. ఆ పాలసీకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను సైతం పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో మాదిరిగా కాకుండా వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తామన్నారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకల గ్రామంలోని హ్యాండ్లూమ్ పార్కులో ఉత్పత్తయ్యే వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆదుకునే చర్యలు చేపడతాం.. రాష్ట్రవ్యాప్తంగా 70 వేల పవర్‌లూమ్స్ ఉంటే ఒక్క సిరిసిల్ల ప్రాంతంలోనే 40 వేలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. పవర్‌లూమ్స్ నిర్వాహకులకు వర్క్ ఆర్డర్ ఇస్తామన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఉన్న లేపాక్షి కొనుగోలు కేంద్రాన్ని ‘గోల్కొండ’ పేరుతో రీబ్రాండింగ్ చేశామని.. అలాంటి స్టోర్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామని చెప్పారు. దండుమల్కాపురంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలాలు ఉన్నాయని.. ఇక్కడికి భారీ కం పెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అక్కడి చేనేత వస్త్రాలకు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు అందించనున్న పాఠశాలల యూనిఫారాల తయా రీని జనవరి నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చేనేత–జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, అసిస్టెంట్ డైరెక్టర్ రాముగోపాల్, కలెక్టర్ అనితారామచంద్రన్, చేనేత జిల్లా ఏడీ పద్మ తదితరులు ఉన్నారు. కార్డుతో చీరలు కొన్న కేటీఆర్ భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని హ్యాండ్లూమ్ పార్క్‌ను గురువారం సందర్శించిన మంత్రి కేటీఆర్.. అక్కడ తయారైన పట్టు చీరలు, డిజైన్లను చూసి మంత్రముగ్ధులయ్యారు. తన తల్లి, చెల్లెలు, సతీమణి కోసం ప్రముఖ డిజైనర్ చెల్న దేశాయ్ రూపొందించిన మూడు పట్టు చీరలు, కుమార్తె కోసం రెండు పట్టు పావడాలు కొనుగోలు చేశారు. రూ.45 వేల బిల్లును డెబిట్ కార్డు ద్వారా స్వైప్ చేసి ‘నగదు రహితం’గా చెల్లించారు. -
జయహో గోల్కొండ
-
మీకు గన్మెన్లు ఉండరు జాగ్రత్త..
లంగర్‌హౌస్: అధికారులకు పోలీసు భద్రత, గన్మెన్లు ఉండరు... వారికి ఆ సమయంలో ఏదైనా కావచ్చని గోల్కొండ తహసీల్దార్, వీఆర్ఓను ఉద్దేశించి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ అన్నారు. వివరాలు... లంగర్‌హౌస్ డిఫెన్స కాలనీలో మూసీ పరివాహక ప్రాంతంలో టీఎస్ నెంబర్ 1–3 లో దాదాపు 1500 గజాల స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గోల్కొండ మండల తహసీల్దార్ చంద్రకళ రెండు రోజుల క్రితం తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్.. వీఆర్ఓ, సర్వేయర్ షహీద్‌కు ఫోన్ చేసి బెదిరించారు. నువ్వు మా మతం వాడివేనా? అంటూ తిట్టారు. ఒక వైపు తమకు ప్లాన్ చెప్పి... మరో వైపు అధికారికి ఇది కబ్జా స్థలం అని చూపించి కూల్చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రేపటి నుంచి ఉద్యోగం ఎలా చేస్తావు చూస్తా?.. ఏసీబీకి పట్టించి జైలుకు పంపిస్తానన్నారు. అంతేకాకుండా.. మీకు పోలీసులుగాని, గన్మెన్లుగానీ వెంట ఉండరని ఆ విషయం గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని హెచ్చరించారు. నిజామాబాద్ నుంచి వచ్చిన తహసీల్దార్‌కు ఇక్కడి పరిస్థితులు ఏమి తెలుసు? తహసీల్దార్ మేడమ్ చూసి చూడనట్లుగా ఉండమని చెప్పాలంటూ ఫోన్ లో చెప్పారు. అయితే... ఈ విషయమై ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే దూషిస్తున్న సమయంలో రికార్డు చేసిన ఫోన్ వాయిస్‌ను మీడియాకు అందించారు. ఈ వాయిస్ రికార్డు వాట్సాఫ్ గ్రూప్‌ల్లో కూడా హల్చల్ చేస్తుంది. కాగా, ఈ విషయం అధికారులను ఆరా తీసేందుకు ప్రయత్నించగా ఎవ్వరూ అందుబాటులోకి రావడంలేదు. -
డబ్బు కోసం అన్న కూతురి కిడ్నాప్
గోల్కొండ: అన్న కూతురిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశాడో ప్రబుద్ధుడు. నిందితుడిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సుందరయ్య కథనం ప్రకారం... గోల్కొండ రిసాలాబజార్‌కు చెందిన ఖలీల్, జాకీర్ అన్నదమ్ములు. ఖలీల్‌కు హజేరాబేగం అనే మూడేళ్ల కూతురు ఉంది. పెయింటర్‌గా పనిచేసే జాకీర్ తన అన్న ఖలీల్ వద్ద బాగా డబ్బు ఉందని, ఎలాగైన అన్న వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం అన్న కూతురు హజేరాబేగంను కిడ్నాప్ చేయాలని పథకం వేశాడు. బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్న హజేరాబేగంను షాప్‌కెళ్లి చాక్లెట్ తెచ్చుకుందామని బైక్‌పై ఎక్కించుకొని ఉడాయించాడు. ఆ తర్వాత అన్నకు ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే నీ కూతుర్ని చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని బుధవారం రాత్రి ఖలీల్ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం రాత్రి లంగర్‌హౌస్‌లో జాకీర్‌ను అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న చిన్నారిని రక్షించారు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు. -
గోల్కొండలో త్రివర్ణ పతాకం రెప రెప
-
సంక్షేమంలో మనమే నంబర్ వన్
70వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో సీఎం కేసీఆర్ ఏటా రూ.30 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు ♦ ఎస్టీలు, మైనారిటీలకు జనాభా ♦ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం ♦ 4 నెలల్లో రాష్ట్రానికి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ♦ కాళేశ్వరంపై 23న ‘మహా’ ఒప్పందం ♦ దసరా కానుకగా కొత్త జిల్లాల ఏర్పాటు ♦ అరాచక శక్తుల ఆట కట్టించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడి ♦ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్ సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. నిజమైన అభివృద్ధి అంటే పేదలకు భరోసా, భద్రత కల్పించడమేనని చెప్పారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.30వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తూ 35 పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం చారిత్రక గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగించారు. అభివృద్ధి నిరోధక శక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా ప్రజాబలమే అండగా భావించి రాష్ట్ర ప్రభుత్వం స్థిరంగా పురోగమిస్తున్నదని కేసీఆర్ చెప్పారు. లక్ష్య సాధనకు అవసరమైన మనో బలాన్ని, మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇదే గోల్కొండపై తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం రెండు నెలల పసిబిడ్డ.. బాలారిష్టాలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ స్థిరమైన పాలనను అందిస్తున్నాం. రెండేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో సాధించిన ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీ, ఈబీసీలకు కూడా అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం 250 గురుకుల విద్యాలయాలను కొత్తగా మంజూరు చేసి.. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందించాలనే బృహత్ సంకల్పానికి బీజం వేశాం. హాస్టళ్లలో, స్కూళ్లలో విద్యార్థులకు పెడుతున్న సన్న బియ్యం అన్నం కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీల వసతి గృహాల విద్యార్థులకు సైతం అందిస్తున్నాం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న ఎస్టీలు, మైనారిటీలు పేదరికంలో మగ్గుతున్నారని.. వారికి త్వరలోనే జనాభా దామాషా అనుసరించి రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. పేద బ్రాహ్మణుల కోసం బడ్జెట్లో రూ. వంద కోట్లు కేటాయించామని.. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం తగిన పథకాలను త్వరలో రూపొందిస్తామని చెప్పారు. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా హుస్సేన్‌సాగర్ తీరంలో ఆయన 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నామని తెలిపారు. లుంబినీ పార్కులో తెలంగాణ అమర వీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దసరా పండుగ కానుకగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో సత్సంబంధాలు కేంద్రంతో సఖ్యత, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాల కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సయోధ్య సాధించుకోగలిగామన్నారు. మరో 4 నెలల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి అందుతుందని తెలిపారు. మహారాష్ట్రతో ఉన్న వివాదాల పరిష్కారం కోసం తీసుకున్న చొరవ ఫలించిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 23న చరిత్రాత్మక ఒప్పందం కుదరనుందని పేర్కొన్నారు. ఇటీవలే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆరు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యం రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ చెప్పారు. మన రాష్ట్రానికి ఉన్న నీటి కేటాయింపులకు అనుగుణంగా కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోతల పథకాలను శరవేగంగా నిర్మించడానికి పూనుకున్నామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం ద్వారా ఈ ఖరీఫ్ నుంచే మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ పథకాల కింద ప్రస్తుతం 4.5లక్షల ఎకరాలకు నీరందుతోందని తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి పనులన్నీ పూర్తి చేసి ఆ జిల్లాలో 6లక్షల ఎకరాలకు నీరందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీమ్, మత్తడివాగు, గడ్డెన్నవాగు, నీల్వాయి, గొల్లవాగు ప్రాజెక్టుల ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని.. వచ్చే ఏడాది నాటికి లక్ష ఎకరాలకు నీరందనుందని చెప్పారు. మిషన్ కాకతీయతో జలకళ మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 8 వేల చెరువులు బాగుపడ్డాయని కేసీఆర్ చెప్పారు. రెండో దశలో 9 వేల చెరువుల పనులను చేపట్టామన్నారు. మిషన్ కాకతీయతో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల చెరువులు నిండడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇక మిషన్ భగీరథ ద్వారా 2018 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ఇళ్లకు నల్లా ద్వారా మంచినీటిని సరఫరా చేస్తామన్నారు. ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని.. చాలినన్ని ఎరువులు, విత్తనాలను సకాలంలో సమకూర్చిందని కేసీఆర్ తెలిపారు. ఈ ఏడాది లక్షా 26 వేల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమైందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.420 కోట్లతో రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామని చెప్పారు. కూరగాయలు, పండ్లు, పూల పెంపకం కోసం 75 శాతం సబ్సిడీతో గ్రీన్‌హౌజ్, పాలీహౌజ్ సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు. 1,311 వ్యవసాయ విస్తరణాధికారులు, 120 వ్యవసాయాధికారులు, 75 మంది హార్టికల్చర్ అధికారుల నియామకాన్ని చేపట్టామని.. కొత్తగా హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ వచ్చే నాటికి 4.17 లక్షల టన్నుల సామర్థ్యం గల 176 గోదాములు మాత్రమే ఉండేవని... ఈ రెండేళ్లలోనే 17.07 లక్షల టన్నుల సామర్థ్యం గల 330 గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 2,303 పరిశ్రమలకు అనుమతులివ్వడంతో రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని... లక్షా 75 వేల కొత్త ఉద్యోగాలు లభించాయని సీఎం పేర్కొన్నారు. ఐటీ రంగంలో 13.26 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని.. గతేడాది రూ.75 వేల కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు చేసిందని తెలిపారు. 2018లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌కు హైదరాబాద్ వేదిక కానుండడం గర్వకారణమన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 37 వేల నియామకాలు జరిపిందని.. వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ నడుస్తున్నదని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నామని కేసీఆర్ తెలిపారు. 40 డయాలసిస్ సెంటర్లు, 40 డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. భావి తరాల కోసమే హరితహారం విచక్షణారహితంగా సాగిన అడవుల విధ్వంసం పర్యావరణానికి ముప్పు తెచ్చిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడంతో రెండు మూడేళ్లకోసారి కచ్చితంగా కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితి దాపురించిందని చెప్పారు. అందువల్లే పచ్చదనాన్ని పెంచి భవిష్యత్ తరాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పచ్చదనం పెంపునకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన మూడో అతిపెద్ద మానవ ప్రయత్నమే హరితహారమని... తొలి ప్రయత్నం ఆస్ట్రేలియాలో, రెండోది చైనాలో గోబి ఎడారి విస్తరణ నిరోధించడానికి జరిగిందని తెలిపారు. అరాచక శక్తుల ఆటకట్టిస్తున్నాం శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో దృఢ చిత్తంతో వ్యవహరిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అరాచక శక్తుల ఆట కట్టించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని.. ఫలితాలు మీ కళ్ల ముందే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందన్నారు. జాతీయ పోలీసు పతకాల్లో అత్యధికం తెలంగాణ పోలీసులే దక్కించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టడానికి మన పోలీసులు ప్రదర్శిస్తున్న సాహసం, చొరవకు యావత్ జాతి గర్విస్తోందన్నారు. -
ఆర్టీసి బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ
-
గోల్కొండ కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో
-
ఆనంద తాండవం
-
ఆషాఢ మాసం అమ్మకు బోనం
-
కోహినూరు కాంతులు గోల్కొండవే..
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కిరీటంలోని కోహినూర్ ధగధగలు గోల్కొండ రాజ్యానివే... అప్పటి కుతుబ్‌షాహీ రాజ్యంలోని కొల్లూరు(గుంటూరు జిల్లా) వజ్రపు గనులకు ప్రసిద్ధి... కెంపులు, రత్నాలు, గోమేధికాలతో పాటు విలువైన రాళ్లు దొరికేవి. వజ్రాలు దొరికితే... గోల్కొండ కోటకు రావాల్సిందే. 793 క్యారెట్ల కోహినూర్ వజ్రం గోల్కొండ రాజుల నుంచి మొగల్ చకవర్తి షాజహాన్ వద్దకు చేరింది. పర్షియా, అఫ్గానిస్తాన్, లాహోరుల మీదుగా 1849లో మహారాజ దులీప్‌సింగ్ చేతికి చిక్కింది. ఆయన దాన్ని బ్రిటన్ రాకుమారికి అందచేశాడు. అప్పట్లో గోల్కొండ వీధుల్లో విలువైన రాళ్లు, రత్నాలతో పాటు ముత్యాల్ని వీధుల్లో రాసులు పోసి అమ్మేవారు. గోల్కొండ సమీపంలోని కార్వాన్లో వజ్రాలకు సానబట్టే పరిశ్రమే ఉండేది... కోహినూర్ భారతదేశ సంపదని దాన్ని ఇచ్చేయాలంటూ 2008లో బ్రిటీష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 1849లో మహారాజ దులీప్‌సింగ్ కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ రాకుమారికి అందచేశాడు. -
పెళ్లింట్లో భారీ చోరీ
గోల్కొండ: ఆసుపత్రికి వెళ్లొచ్చేలోగా కూతురి పెళ్లి కోసం తెచ్చిన డబ్బు, నగలు దొంగలు ఎత్తుకెళ్లారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్‌పాషా కథనం ప్రకారం... టోలీచౌకి బృందావన్‌కాలనీ నివాసి మహ్మద్ ముస్తఫా మాసబ్‌ట్యాంక్‌లో స్నూకర్ పార్లర్ నిర్వహిస్తున్నారు. ఈయన కూతురి పెళ్లి డిసెంబర్ 17న జరగనుంది. కొంత కాలం క్రితం ప్రమాదంలో ముస్తఫాకు కాలు విరిగింది. భోజగుట్టలో చికిత్స చేయించుకుంటున్నారు. ఇతని తల్లి కూడా మోకాలి నొప్పితో బాధపడుతోంది. శనివారం రాత్రి 9 గంటలకు తల్లి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి వైద్య పరీక్ష చేయించుకొనేందుకు ముస్తఫా భోజగుట్టకు వెళ్లారు. రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చేసరికి బెడ్రూం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. పెళ్లి ఖర్చుల కోసం బీరువాలో భద్రపర్చిన రూ. 6 లక్షలతో పాటు 23 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ గౌస్ మొహియుద్దీన్, గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్‌పాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు వంటగది కిటికీ తలుపు పగులగొట్టి ఇంట్లోకి చొరబడినట్టు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
గోల్కొండ PS పరిధిలో భారీ చోరి
-
గోల్కొండలో భారీ చోరీ
గోల్కొండ: కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి దొంగలు పడి భీభత్సం సృష్టించారు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు స్థానిక నీరజ కాలనీకి చెందిన తారీక్ అన్వర్ సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే అనువుగా ఇంటి వెనక వైపు ఉన్న కిటికీ సువ్వలు వంచి చొరబడిన దొంగలు 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 20 వేల నగదుతో పరారయ్యారు. దీంతో అన్వర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హస్తకళలకు ‘గోల్కొండ’ బ్రాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పరిధిలోని విక్రయ కేంద్రాలకు ‘గోల్కొండ’ పేరు బ్రాండ్ నేమ్‌గా ఖరారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధి సంస్థ షోరూంలను ‘లేపాక్షి’ పేరుతో వ్యవహరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థకు కొత్త పేరు, లోగోను సూచించాలంటూ గత ఏడాదే ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా కొత్త పేరును ప్రతిపాదించాలని, 2014 డిసెంబర్ 15వ తేదీలోగా సూచనలు పంపాలని కోరింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి 60కి పైగా ప్రతిపాదనలు అందాయి. అందులో ఎక్కువ మంది సూచించిన ‘బతుకమ్మ, శాతవాహన, కాకతీయ, గోల్కొండ, కోహినూర్, ఏకశిల, నిర్మల్, మంజీరా, చార్మినార్, రామప్ప’ తదితర పది పేర్లను ఎంపిక చేసి... ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఈ ఏడాది జూలైలో పంపించారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వం, పూల రంగుల మేళవింపు, పేర్చడంలో మహిళల నైపుణ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది బతుకమ్మ పేరును సూచించారు. అయితే ఈ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం కేసీఆర్ చివరకు గోల్కొండ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హస్తకళల సంస్థ నూతన లోగో, పేరు 2016 జూన్ నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థకు రాష్ట్రంలో ఎనిమిది షోరూంలు ఉన్నాయి. బిద్రీ, ఫిలిగ్రీ, డోక్రా, నిర్మల్ కొయ్య బొమ్మలు, పెంబర్తి ఇత్తడి కళాకృతులు తదితర హస్తకళా ఉత్పత్తులను ఈ షోరూముల ద్వారా విక్రయిస్తున్నారు. వీటి ద్వారా ఏటా రూ.40 కోట్ల మేర హస్త కళల ఉత్పత్తుల లావాదేవీలు జరుగుతున్నాయి. తెలంగాణలో వరంగల్ మినహా మిగతా షోరూమ్‌లన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. సంస్థ లోగో, పేరును మార్చడంతో పాటు షోరూమ్‌ల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. -
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు
-
ఈసారీ 'కోట'లోనే పంద్రాగస్టు
గోల్కొండ: ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు కూడా గోల్కొండ కోటలోనే జరుగనున్నాయి. పంద్రాగస్టు ఏర్పాట్ల కోసం మంగళవారం తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీ సుదీప్ లక్డాకియా, ఐజీపీ శ్రీనివాసరావుతో కలిసి గోల్కొండలో పర్యటించారు. గత ఏడాది పతాకావిష్కరణ జరిగిన ప్రదేశంతో పాటు వీవీఐపీలు, వీఐపీల కోసం కేటాయించిన ప్రదేశాలను వారు పరిశీలించారు. కోటలోని రాణీమహల్ ప్రాంగణాన్నీ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి.. కోటలోకి ప్రవేశించే రూట్ మ్యాప్‌ను సందర్శించారు. పతాకావిష్కరణ అనంతరం తొక్కిసలాట జరుగకుండా వివిధ మార్గాల గుండా సందర్శకులను బయటకు పంపే విషయంపై పోలీసు అధికారులతో చర్చించారు. -
‘కోట’లో కోలాహలం
-
‘కోట’లో కోలాహలం
బోనాలతో భారీగా తరలివస్తున్న భక్తులు ఉత్సవాలపై విదేశీయుల ఆసక్తి గోల్కొండ: గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడింది. కోటలో కొలువుదీరిన శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా గురువారం రెండవ పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ‘అమ్మా.. చల్లంగ చూడ మ్మా..’అంటూ భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు వర్షాలు కురవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా కోటలోని నగినాబాగ్ పూజా ఏర్పాట్లు, అమ్మవారి నైవేద్యం తయారీలతో సందడిగా మారింది. నెత్తిమీద అందంగా అలంకరించిన బోనంలతో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారి వద్దకు బారులుగా బయలుదేరారు. మరోవైపు సంప్రదాయ డప్పు, డోలుపై యువకులు నృత్యాలు చేస్తూ మెట్ల మార్గం గుండా అమ్మవారిని దర్శించుకున్నారు. పాతనగరం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన తొట్టెలను ఊరేగింపుగా తె చ్చి అమ్మవారికి సమర్పించారు. గోవింద్రాజ్ కోయల్కర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గడ్డి, చంద్రకాంత్, ఆలయ కార్యనిర్వహణాధికారి మహేందర్‌కుమార్ తదితరులు భక్తులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పూజారులు అనంతచారి, బొమ్మల సాయిబాబచారి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. ఇక కోటలో జరుగుతున్న బోనాలను విదేశీ సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను చూసి ముచ్చపడిపోతూ ఫోటోలు తీసుకుంటున్నారు. స్థానికులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. -
ప్రారంభమైన గోల్కొండ బోనాలు!
-
నేటి నుంచి బోనాలమహోత్సవం
-
గోల్కొండకు ఫిదా
‘ఎత్తయిన కొండ... దానిపై దుర్భేద్యమైన కోట... గోల్కొండ చూసి ఫిదా అయ్యూ. అంత పెద్ద కోటను అసలెలా నిర్మించారో..! ఎన్నేళ్లు కష్టపడ్డారో..! తలుచుకుంటేనే ఆశ్చర్యం... ఆ వెంటనే ఆనందం’... అంటూ చెప్పుకొచ్చింది వర్ధమాన తార ప్రియూంక. ఈ అవ్ముడు నటించిన ‘ఐ యూమ్ ఇన్ లవ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అమీర్‌పేట కవ్ముసంఘం హాల్లో గురువారం ఏర్పాటు చేసిన ‘స్టైల్ అండ్ వీవ్స్ ఎక్స్పో’ ప్రారంభోత్సవంలో తళుక్కుమంది. ఈ సందర్భంగా పలకరించిన ‘సిటీ ప్లస్’తో హైదరాబాద్‌తో తన అనుబంధాన్ని పంచుకుంది... సరిగ్గా ఏడో క్లాస్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌తో అనుబంధం మొదలైంది. నేను క్లాసిక్, ఫోక్, వెస్ట్రన్ డ్యాన్సర్‌ని. టీవీల్లో డ్యాన్స్ షోలు ఇవ్వడానికి తరచూ నగరానికి వచ్చిపోతుండేదాన్ని. ఇప్పుడు సినివూ చాన్స్ వచ్చింది. దీంతో సిటీలోనే మకాం. సొంతూరు వైజాగ్ అరుునా... ఆరు నెలలుగా ఇక్కడే ఉంటున్నా. షూటింగ్లో భాగంగా గోల్కొండ కోటకు వెళ్లినప్పుడు నా కళ్లను నేనే నవ్ములేకపోయూ. కోటను అలా చూస్తూ ఉండిపోయూ. అప్పటి వరకూ ప్రత్యక్షంగా చూడలేదు. అంత అద్భుతంగా ఉంటుందని ఊహించలేదు. జీవితాంతం అక్కడే ఉండాలన్నంతగా నచ్చేసింది నాకు. ఇట్స్ మై బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఆ తరువాత చార్మినార్ బాగా నచ్చింది. అక్కడ దొరికే గాజులు చాలా ఇష్టం. విభిన్నం: ఈ ఎక్స్పోలోని 75 స్టాల్స్‌లో కొలువుదీరిన వస్త్రాభరణాలు వేటికవే విభిన్నంగా ఉన్నాయి. దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియుల్స్, చేనేతలు, కిడ్స్‌వేర్, గృహాలంకరణ వస్తువులు, బెడ్‌షీట్స్ వంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి. రూ.200 నుంచి రూ.30 వేల వరకు విలువ చేసే ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రియూంకతో పాటు ‘ఐ యూమ్ ఇన్ లవ్’ హీరో కిరణ్, సంగీత దర్శకుడు ప్రదీప్ పాల్గొన్నారు. ప్రదర్శన శనివారం వరకు కొనసాగుతుంది. -
ప్రచార యావ తప్ప.... ఆలోచన లేదు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రచార యావ తప్ప ..ఆలోచన లేదని సాక్షి టీవీ హెడ్ లైన్ షోలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం దుయ్యబట్టారు. కొత్త రాష్ట్రం ...కొత్త ప్రభుత్వ ...ప్రత్యేకతను చాటుకోవడానికి ఆరాటపడినట్లుగా కేసీఆర్ ప్రసంగం సాగిందన్నారు. కేసీఆర్ భారత ప్రధానమంత్రిని నియంతగా అభివర్ణించడం సరికాదన్నారు. కేసీఆర్ ఆలోచన సరళి మార్చుకోవాలని కోరారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా దళితలను చేస్తానని ప్రచారం చేసిన కేసీఆర్...పంద్రాగస్టు వేడుకల్లో గోల్కొండ పై దళితుడితో జెండా ఎగరేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
గోల్కొండ కోటకు ఎందుకు మార్చారు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య వేడుకల వేదికను గోల్కొండ కోటకు ఎందుకు మార్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ విభజన చట్టంలో విద్య ఉమ్మడి అంశంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి వెంటనే కౌన్సిలింగ్ ప్రారంభించాలని సూచించారు. మార్పులేమైనా ఉంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేసుకోవచ్చని, కౌన్సిలింగ్ ఆలస్యమైతే తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదముందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
అంగరంగ వైభవంగా గోల్కొండలో బోనాలు ప్రారంభం
-
హోలీ వేడుకల్లో అపశ్రుతి
హిమాయత్‌నగర్(మొయినాబాద్), న్యూస్‌లైన్: హోలీ వేడుకల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందారు. ఓ వ్యక్తి గండిపేట చెరువులో మునిగి, మరో ఘటనలో ఘట్కేసర్ మండలం నారపల్లిలో కార్మికుడు మృత్యువాత పడ్డాడు. మొయినాబాద్ ఏఎస్సై అంతిరెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మాసూరి సురేష్‌కుమార్(32) సెంట్రింగ్ కార్మికుడు. గతేడాది భార్యాపిల్లలతో కలిసి మండలంలోని హిమాయత్‌నగర్‌కు వలస వచ్చాడు. అదే గ్రామానికి చెందిన సెంట్రింగ్ కాంట్రాక్టర్ యాదయ్య వద్ద పనిచేస్తూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. సురేష్‌కుమార్ సోమవారం హోలీ పండుగ సందర్భంగా గ్రామంలో స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న గండిపేట చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. బట్టలు ఉతికేసుకున్న తర్వాత స్నానం చేసేం దుకు నీళ్లలోకి దిగాడు. మట్టిగుంతలు లోతుగా ఉండడంతో సురేష్‌కుమార్ నీట మునిగాడు. ఆయనకు ఈత రాకపోవడంతో నీళ్లలో విలవిల్లాడుతున్నాడు. సమీపంలో స్నానం చేస్తున్న కొందరు యువకులు గమనించి సురేష్‌కుమార్‌ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అతడు మృతిచెందాడు. స్థాని కులు సమాచారం ఇవ్వగా పోలీ సులు అలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పం చనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాధిక, కూతురు రుతిక(3), కొడుకు మనీష్‌కుమార్(1) ఉన్నారు. మిన్నంటిన రోదనలు.. స్నానం చేసేందుకు వెళ్లిన సురేష్‌కుమార్ మృత్యువాత పడడంతో కుటుం బసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మమ్మల్ని వదిలేసి పో యావా..? అంటూ రాధిక రోదించిన తీరు హృదయ విదారకం. హోలీ పండుగ రోజు నీటమునిగి వ్యక్తి మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. వరుస ఘటనలు.. గండిపేట చెరువులో అక్రమార్కులు మట్టిని తరలించడంతో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. చెరువులోకి స్నానం కోసం వెళ్తున్న చాలా మంది గుంతల్లో మునిగి మృత్యువాత పడుతున్నారు. దాదాపు రెండు నెలల క్రితం నగరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఇరవై రోజుల క్రితం హిమాయత్‌నగర్‌కు చెందిన కుమార్ గుంతల్లో మునిగి దుర్మరణం చెందారు. ఘట్కేసర్: నీటి సంపులో ఈతకొట్టిన ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ టౌన్ తాలుకా, ఎవతీ గ్రామానికి చెందిన అశోక్నర్సింగ్ పేర్వార్(27) మండలం పరిధి నారపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో తన స్వగ్రామానికి చెందిన మరో పదిమందితో కలిసి కొంతకాలంగా పనిచేస్తున్నాడు. హోలీ కావడంతో సోమవారం పరిశ్రమ యాజమాన్యం సెలవు ప్రకటించింది. పేర్వార్ మిత్రులతో కలసి హోలీ ఆడాడు. అనంతరం వారంతా కంపెనీ ఆవరణలోని పెద్ద నీటి సంపులో ఈత కొట్టారు. ఈక్రమంలో పేర్వార్ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు పేర్వార్ను చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రికి.. అక్కడి నుంచి నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్ఐ వీరభద్రం తెలిపారు. -
ఫ్యాన్సీ సెల్ నెంబర్ల పేరుతో టోకరా
గోల్కొండ: ఫ్యాన్సీ నెంబర్లు గల మొబైల్ సిమ్‌కార్డులు ఇస్తానని అధిక మొత్తంలో డబ్బు తీసుకొని సెల్‌ఫోన్ వినియోగదారులకు టోకరా వేస్తున్న ఓ కేటుగాడిని గోల్కొండ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఇతడు ఇప్పటి వరకూ నగర వ్యాప్తంగా సుమారు వంద మందిని మోసం చేసినట్టు తెలిసింది. సోమవారం ఎస్ఐ పి.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ ముస్తఫా యాకుబ్(24) మొబైల్ వినియోగదారులకు ఫ్యాన్సీ నెంబర్లపై ఉన్న మోజును క్యాష్ చేసుకోవాలని పథకం వేశాడు. మొదట నగరంలోని పలువురి ఫోన్ నెంబర్లు సేకరించాడు. వారికి ఫోన్ చేసి తన వద్ద ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీకి చెందిన ఫ్యాన్సీ సిమ్‌కార్డులున్నాయని, అధిక మొత్తం చెల్లిస్తే మీరు కోరుకున్న నెంబర్‌తో సిమ్‌కార్డు ఇస్తానని చెప్తాడు. ఫలానా చోటకు డబ్బు తీసుకురావాలని సూచిస్తాడు. వారు వెళ్లగానే సిమ్ కార్డుకు రూ. 5 వేలు నుంచి రూ. 7 వేల వరకూ తీసుకొని.. సిమ్‌కార్డు గల కవర్ ఇచ్చి వెళ్లిపోతాడు. కవర్‌ను విప్పి చూస్తే వేరే నెంబర్‌తో ఉన్న సిమ్‌కార్డు ఉంటుంది. దాన్ని ఫోన్లో వేస్తే యాక్టివేట్ కూడా కాదు. దీంతో సిమ్‌కార్డు కొన్నవారు మోసపోయామని తెలుసుకుంటారు. గత ఆరు నెలలుగా యాకుబ్ అబిడ్స్, సంతోష్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలువురిని మోసగించాడు. ఒకసారి సంతోష్‌నగర్ ఠాణా పరిధిలో పట్టుబడ్డ యాకుబ్.. సిమ్‌కార్డు కొన్న వారితో రాజీ చేసుకొని కేసు లేకుండా బయటపడ్డాడు. ఇదిలా ఉండగా, ఈనెల 4న హుమాయున్‌నగర్‌కు చెందిన మహెబూబ్ అలీకి యాకుబ్ ఫ్యాన్సీ నెంబర్ ఇస్తానని ఫోన్ చేసి.. రూ. 7 వేలకు బేరం కుదర్చుకున్నాడు. మరునాడు మహెబూబ్ అలీకి యాకుబ్ ఫోన్ చేసి టూంబ్స్ రోడ్‌లోని గోల్డెన్ ఫంక్షన్‌హాలు వద్దకు రమ్మన్నాడు. రూ.7 వేలు తీసుకొని సిమ్‌కార్డు ఉన్న కవరు ఇచ్చి బైక్‌పై వెళ్లిపోయాడు. తర్వాత అందులో తాను కోరుకున్న ఫ్యాన్సీ నెంబర్ లేకపోవడంతో మహెబూబ్ అలీ అదేరోజు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈనెల 14న రాత్రి యాకుబ్ టోలిచౌకీలో వేరే కస్టమర్ కోసం వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 8 సిమ్‌కార్డు అప్లికేషన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.