గోల్కొండ: కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి దొంగలు పడి భీభత్సం సృష్టించారు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు స్థానిక నీరజ కాలనీకి చెందిన తారీక్ అన్వర్ సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు.
అదే అనువుగా ఇంటి వెనక వైపు ఉన్న కిటికీ సువ్వలు వంచి చొరబడిన దొంగలు 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 20 వేల నగదుతో పరారయ్యారు. దీంతో అన్వర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.