హైదరాబాద్:సూర్య గ్యాంగ్ మూవీ చూశారుగా?. ఐటీ అధికారులుగా వెళ్లి.. నిమిషాల్లో కోట్ల సంపదను దోచేస్తారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఐటీ అధికారులుగా గోల్డ్ షాపులోకి వెళ్లి 1.7కిలోల బంగారాన్ని నిమిషాల్లోనే దర్జాగా ఎత్తుకెళ్లారు కెటుగాళ్లు.
మోండా మార్కెట్‌లో ఓ బంగారం షాపు రోజూలాగే ఉదయం ప్రారంభమైంది. యజమాని వేరే ఊరికి వెళ్లిన కారణంగా దగ్గరి బంధువు షాప్‌ను చూసుకుంటున్నారు. కస్టమర్లు ఒక్కరొక్కరుగా వస్తున్నారు. ఈ క్రమంలోనే సూటు.. బూటు ధరించిన కొంతమంది షాపులోకి ప్రవేశించి హడావిడి చేశారు. ఐటీ అధికారలమంటూ.. ఫేక్ ఐడీలను చూపించి దుకాణంలోని స్టాఫ్‌ను పక్కకు కూర్చోబెట్టారు. అధికారుల లాగే స్వరం పెంచి షాపులోని బంగారం అమ్మకాల అకౌంట్ బుక్కులను చెక్ చేశారు.
ట్యాక్స్ చెల్లించలేదంటూ 1.7కిలోల బంగారం బిస్కెట్‌లను దుండగులు తీసుకువెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది ఇతర షాపు ఓనర్లకు ఫోన్ చేసి కనుక్కోగా అసలు విషయం బయటపడింది. ఐటీ అధికారులు నేరుగా షాపులోకి వచ్చేయరని, ముందు నోటీసులు ఇస్తారని ఇతర షాపు యజమానులు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు సికింద్రబాద్ నుంచి ఉప్పల్ మార్గంలో వెళ్లినట్లు పోలీసులు గుర‍్తించారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..:
Comments
Please login to add a commentAdd a comment