గోల్కొండ: ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు కూడా గోల్కొండ కోటలోనే జరుగనున్నాయి. పంద్రాగస్టు ఏర్పాట్ల కోసం మంగళవారం తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీ సుదీప్ లక్డాకియా, ఐజీపీ శ్రీనివాసరావుతో కలిసి గోల్కొండలో పర్యటించారు. గత ఏడాది పతాకావిష్కరణ జరిగిన ప్రదేశంతో పాటు వీవీఐపీలు, వీఐపీల కోసం కేటాయించిన ప్రదేశాలను వారు పరిశీలించారు. కోటలోని రాణీమహల్ ప్రాంగణాన్నీ తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి.. కోటలోకి ప్రవేశించే రూట్ మ్యాప్‌ను సందర్శించారు. పతాకావిష్కరణ అనంతరం తొక్కిసలాట జరుగకుండా వివిధ మార్గాల గుండా సందర్శకులను బయటకు పంపే విషయంపై పోలీసు అధికారులతో చర్చించారు.