Chandrayaan 3 Engraved on the Sand Congratulated Independence Day - Sakshi
Sakshi News home page

‘ఇసుకపై చంద్రయాన్‌-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Published Tue, Aug 15 2023 7:25 AM | Last Updated on Tue, Aug 15 2023 9:53 AM

Chandrayaan 3 Engraved on the Sand Congratulated Independence Day - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో శాండ్‌ ఆర్ట్‌ మాధ్యమంలో చంద్రయాన్‌-3ని తీర్చిదిద్ది దేశప్రజలకు వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శాండ్‌ ఆర్ట్‌లో నిపుణుడైన విద్యార్థి అజయ్‌ త్రివర్ణాలతో కూడిన చంద్రయాన్‌-3ని అద్భుతంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అజయ్‌ మాట్లాడుతూ మన దేశం ఏనాడో స్వాతంత్ర్యం సాధించిందని, అయితే ఇప్పుడు చంద్రయాన్‌-3 పూర్తి స్థాయిలో సఫలమైతే మనదేశంలో ప్రపంచంలోనే సర్వశ్రేష్టమైన స్వతంత్ర్య దేశంగా రూపొందుతుందన్నారు. 

ఇస్రో ఇటీవలే చంద్రయాన్‌-3ని చంద్రుని నాల్గవ కక్ష్యలోకి పంపింది. ప్రస్తుతం చంద్రయాన్ దాదాపు 150 కి.మీ x 177 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. ఇస్రో ఆగస్టు 14న ఉదయం 12 గంటల ప్రాంతంలో చంద్రయాన్-3లోని థ్రస్టర్‌లను ఆన్ చేసింది. దాదాపు 18 నిమిషాల పాటు ఇంజన్ ఆన్‌ చేశారు. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని మొదటి కక్ష్యలోకి చేరుకుంది. 
ఇది కూడా చదవండి: సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు.. ఆన్‌లైన్‌ సెల్ఫీ కంటెస్ట్..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement