
గోల్కొండ కోటకు ఎందుకు మార్చారు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. స్వాతంత్ర్య వేడుకల వేదికను గోల్కొండ కోటకు ఎందుకు మార్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ విభజన చట్టంలో విద్య ఉమ్మడి అంశంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి వెంటనే కౌన్సిలింగ్ ప్రారంభించాలని సూచించారు. మార్పులేమైనా ఉంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేసుకోవచ్చని, కౌన్సిలింగ్ ఆలస్యమైతే తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదముందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.