రేపు బీజేపీ అభ్యర్థుల జాబితా | Telangana Lok Sabha Election Tomorrow BJP First List Released | Sakshi
Sakshi News home page

రేపు బీజేపీ అభ్యర్థుల జాబితా

Published Fri, Mar 15 2019 12:42 AM | Last Updated on Thu, Mar 28 2019 8:40 PM

Telangana Lok Sabha Election Tomorrow  BJP First List Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకు ఆశావహులతో బీజేపీ జాబితా సిద్ధమైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం గురువారం రాత్రి నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.

ఈ భేటీలో ముఖ్య నేతలు అరవింద లింబావలి, మురళీధర్‌రావు, బండారు దత్తాత్రేయ, కె.లక్ష్మణ్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో స్థానానికి మూడు పేర్ల చొప్పున జాబితా రూపొందించారు. ఈ జాబితాను రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి తీసుకెళ్లారు. శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ నేతలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement