
హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి తనకు పార్టీ నేతలు బర్త్ డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ కు అలకబూనారట. రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పగా, బీజేపీ నుంచి ముఖ్య నేతల ఎవరూ కూడా ఆయనకు విషెస్ చెప్పలేదట. దాంతో రాజాసింగ్ మళ్లీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హరిత ప్లాజాలో జరిగిన సమావేశానికి రాజాసింగ్ డుమ్మా కొట్టారట.
ఈటెల రాజేందర్‌తో సహా పలువురు ప్రముఖ నేతలు ఆ మీటింగ్ కు హాజరు కాగా, రాజాసింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. అందులోనూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికపై సమావేశం నిర్వహించిన సమయంలో రాజాసింగ్ ఇలా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పలేదనే కారణమా?.. లేక ఇంకేమైనా ఉందా? అనే కోణంలో చర్చ నడుస్తోంది.
బండి సంజయ్ రాజీ చేశారు.. కానీ
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి అలక పాన్పు ఎక్కిన రాజాసింగ్ఎం ను ఇటీవల ఎంపీ బండి సంజయ్ స్వయంగా కలిసి ఆయనకు నచ్చజెప్పి వచ్చారు. ప్రధానంగ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో బండి సంజయ్ స్వయంగా రంగంలోకి దిగారు.
గౌతంరావును ఆ స్థానంలో నిలబెట్టడానికి ప్రధాన కారణం బండి సంజయ్ కాబట్టి.. రాజాసింగ్ ను బుజ్జగించి వచ్చారు. అప్పుడు గౌతంరావుతో రాజాసింగ్ ను కరాచలనం చేయించడమే కాకుండా ఇరువురు నేతలు శాలువాలతో సత్కరించుకునే కార్యక్రమం కూడా జరిగింది. ఇంతలోనే రాజాసింగ్ మళ్లీ పార్టీ శ్రేణులపై కోపంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తును ప్రచారం జరుగుతోంది ఇందుకు తన బర్త్ డేకు పార్టీలోని ప్రముఖలు విషెస్ చెప్పకపోవడంగా సమాచారం.
సీఎం రేవంత్ విషెస్ చెప్పగా, తమ సొంత పార్టీలోని ముఖ్యులు ఎవరూ కూడా కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదనే కారణంతో రాజాసింగ్ కోపంగా ఉన్నారట, నేటి బీజేపీ కీలక సమావేశానికి రాజాసింగ్ దూరంగా ఉండటానికి ఇదే కారణమనే వాదన ప్రముఖంగా వినిపిస్తోంది.