
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కిషన్ రెడ్డిపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా అన్ని జిల్లాలకు సోకిందని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమరిపోతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించారు. 800 నుంచి 1000 వెంటిలేటర్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందని గుర్తు చేశారు. గాంధీ ఆస్పత్రిలో సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ పని చేయడం లేదని పేర్కొన్నారు. సర్కారు దవాఖానాల్లో పనిచేసే సిబ్బంది డ్యూటీకి రావడానికి భయపడుతున్నారని తెలిపారు. వైద్య సిబ్బందిలో భరోసా నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేయడం లేదని విమర్శించారు. వారికి అందిస్తున్న ఎన్-95 మాస్కుల్లో క్వాలిటీ లేదని బండి సంజయ్ చెప్పారు.
(సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ)
Comments
Please login to add a commentAdd a comment