హిమాయత్‌నగర్(మొయినాబాద్), న్యూస్‌లైన్: హోలీ వేడుకల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతిచెందారు. ఓ వ్యక్తి గండిపేట చెరువులో మునిగి, మరో ఘటనలో ఘట్‌కేసర్ మండలం నారపల్లిలో కార్మికుడు మృత్యువాత పడ్డాడు. మొయినాబాద్ ఏఎస్సై అంతిరెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన మాసూరి సురేష్‌కుమార్(32) సెంట్రింగ్ కార్మికుడు. గతేడాది భార్యాపిల్లలతో కలిసి మండలంలోని హిమాయత్‌నగర్‌కు వలస వచ్చాడు.
అదే గ్రామానికి చెందిన సెంట్రింగ్ కాంట్రాక్టర్ యాదయ్య వద్ద పనిచేస్తూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. సురేష్‌కుమార్ సోమవారం హోలీ పండుగ సందర్భంగా గ్రామంలో స్నేహితులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నాడు. మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న గండిపేట చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. బట్టలు ఉతికేసుకున్న తర్వాత స్నానం చేసేం దుకు నీళ్లలోకి దిగాడు. మట్టిగుంతలు లోతుగా ఉండడంతో సురేష్‌కుమార్ నీట మునిగాడు. ఆయనకు ఈత రాకపోవడంతో నీళ్లలో విలవిల్లాడుతున్నాడు. సమీపంలో స్నానం చేస్తున్న కొందరు యువకులు గమనించి సురేష్‌కుమార్‌ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అతడు మృతిచెందాడు. స్థాని కులు సమాచారం ఇవ్వగా పోలీ సులు అలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పం చనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాధిక, కూతురు రుతిక(3), కొడుకు మనీష్‌కుమార్(1) ఉన్నారు.
మిన్నంటిన రోదనలు..
స్నానం చేసేందుకు వెళ్లిన సురేష్‌కుమార్ మృత్యువాత పడడంతో కుటుం బసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మమ్మల్ని వదిలేసి పో యావా..? అంటూ రాధిక రోదించిన తీరు హృదయ విదారకం. హోలీ పండుగ రోజు నీటమునిగి వ్యక్తి మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
వరుస ఘటనలు..
గండిపేట చెరువులో అక్రమార్కులు మట్టిని తరలించడంతో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. చెరువులోకి స్నానం కోసం వెళ్తున్న చాలా మంది గుంతల్లో మునిగి మృత్యువాత పడుతున్నారు. దాదాపు రెండు నెలల క్రితం నగరానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఇరవై రోజుల క్రితం హిమాయత్‌నగర్‌కు చెందిన కుమార్ గుంతల్లో మునిగి దుర్మరణం చెందారు.
ఘట్‌కేసర్: నీటి సంపులో ఈతకొట్టిన ఓ యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ టౌన్ తాలుకా, ఎవతీ గ్రామానికి చెందిన అశోక్‌నర్సింగ్ పేర్వార్(27) మండలం పరిధి నారపల్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో తన స్వగ్రామానికి చెందిన మరో పదిమందితో కలిసి కొంతకాలంగా పనిచేస్తున్నాడు. హోలీ కావడంతో సోమవారం పరిశ్రమ యాజమాన్యం సెలవు ప్రకటించింది. పేర్వార్ మిత్రులతో కలసి హోలీ ఆడాడు. అనంతరం వారంతా కంపెనీ ఆవరణలోని పెద్ద నీటి సంపులో ఈత కొట్టారు. ఈక్రమంలో పేర్వార్ అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు పేర్వార్‌ను చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రికి.. అక్కడి నుంచి నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ వీరభద్రం తెలిపారు.
హోలీ వేడుకల్లో అపశ్రుతి
Published Mon, Mar 17 2014 11:45 PM | Last Updated on Thu, Apr 4 2019 5:53 PM
Advertisement
Advertisement