
సాక్షి, హైదరాబాద్ : తన ఇష్టప్రకారం నడుచుకోలేదన్న కోపంతో భార్య గొంతు కోశాడో కసాయి భర్త. ఈ సంఘటన బుధవారం గోల్కొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోల్కొండకు చెందిన రియాజ్‌కు రుబీనా అనే యువతితో ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. రియాజ్ పనిపాటా లేకుండా జులాయిగా తిరుగుతుండటంతో రుబీనా అతడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. గత వారం రోజులుగా పుట్టింటివద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో రియాజ్ బుధవారం అత్తగారింటి వద్దకు వచ్చాడు.
ఆమెను తనతో పాటు ఇంటికి రావాలని బలవంతం చేశాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోగా రానని తెగేసి చెప్పడంతో అతడు ఆగ్రహించాడు. కోపంతో విచక్షణ కోల్పోయిన రియాజ్ కత్తితో భార్య మెడపై బలంగా కోయటంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. దీంతో రియాజ్ అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స‍్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రుబీనాను ఉస్మానియాకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment