
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్ బ్రిక్‌తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లికి చెందిన మహ్మత్ బస్రత్(32) కోల్‌కత్తాకు చెందిన షబానా పర్వీన్(22)ను 2024 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నాడు.
హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. బస్రత్ తల్లిదండ్రులతో పర్వీన్ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్‌కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్ హాస్పిటల్‌లో చేర్పించాడు. ఏప్రిల్1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు.

కోపంతో బస్రత్ తన్నడంతో షబానా పర్వీన్ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్ బ్రిక్‌లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025