pregnant woman
-
పురిటి నొప్పులు భరిస్తూ.. పరీక్ష రాసి..
నాగర్‌కర్నూల్ క్రైం: ఉద్యోగం సాధించాలన్న తపనతో ఓ నిండు గర్భిణి గ్రూప్–2 పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తుండగానే పురిటినొప్పులు వచ్చి నా ఆమె చలించలేదు.. పట్టుబట్టి పరీక్ష రాసిన తర్వాతే కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లింది. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి (25) నిండు గర్భిణి. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చాలా కష్టపడి చదివి గ్రూప్–2 పరీక్షల కోసం వేచి చూసింది. ఈ మేరకు సోమ వారం పరీక్ష రాస్తుండగా అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. విష యం తెలుసుకున్న అధికారులు కలెక్టర్ బదావత్ సంతోశ్‌కు సమాచారం అందించగా.. ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అయితే అందుకు నిరాకరించిన గర్భిణి.. పరీక్ష పూర్తయిన తర్వాతే కాన్పు కోసం వెళ్తానని పట్టుబట్టింది. తీవ్రమైన పురిటి నొప్పులను భరిస్తూనే పరీక్ష రాసిన అనంతరం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రా రియల్ ఎస్టేట్.. టీడీపీ విజన్ డాక్యుమెంట్ -
టెస్టులు.. స్కాన్.. ఉంటాయా?
నాకు 35 ఏళ్లు. యూరిన్ టెస్ట్‌లో గర్భవతి అని తెలిసింది. మూడు నెలల తర్వాత డాక్టర్‌ను సంప్రదించమని సలహా ఇస్తున్నారు కుటుంబ సభ్యులు. అందాకా ఆగొచ్చా? ఇప్పుడేమైనా టెస్టులు, స్కాన్స్ ఉంటాయా? సూచించగలరు. – వాసవి, ఆదిలాబాద్ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని కలవటం మంచిది. 30 ఏళ్లు దాటాక ప్రెగ్నెన్సీ వస్తే కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. థైరాయిడ్, బీపీ, సుగర్ టెస్ట్లైతే వెంటనే చేయించుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. రోజూ ఫోలిక్ యాసిడ్, మల్టీ విటమిన్ మాత్రలను వేసుకోవాలి. మీ లాస్ట్ పీరియడ్ తేదీ నుంచి రెండు నెలలకి వయబిలిటీ స్కాన్ అని.. ఫస్ట్ స్కాన్ చేస్తారు. ఇందులో గర్భసంచిలో సరైన ప్లేస్లోనే పిండం ఫామ్ అయిందా.. లేదా? పిండం వయసు, ఎదుగుదల ఆరోగ్యంగా ఉందా.. లేదా? వంటివన్నీ తెలుస్తాయి. కొన్నిసార్లు ట్యూబల్ ప్రెగ్నెన్సీ వంటి కాంప్లికేటెడ్ పరిస్థితులు ఉంటాయి. అలాంటి కండిషన్‌ని ఈ స్కాన్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు జెనెటిక్ లేదా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. వాటిని గుర్తించేందుకు 3వ నెలలో కొన్నిరకాల రక్తపరీక్షలు, స్కానింగ్‌ని చేయాల్సి ఉంటుంది. వీటిని చేయించుకునే తేదీని కూడా ఫస్ట్ స్కాన్లోనే కన్ఫర్మ్ చేస్తారు. ఈ స్కాన్‌ను ఇంటర్నల్/ఎక్స్టర్నల్ రెండు విధాలుగా చేస్తారు. ఇందులో బిడ్డ సైజు, హార్ట్ బీట్ తెలుస్తాయి. అండాశయాల్లో ఏమైనా సిస్ట్స్ ఉన్నాయా అని కూడా చూస్తారు. పిండానికి రక్తప్రసరణ సరిగా ఉందా? ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారు. 8–9 వారాల్లో ట్విన్ ప్రెగ్నెన్సీని కనిపెట్టొచ్చు. మూడవ నెల నిండిన తర్వాత చేసే ఎన్టీ స్కాన్ ( (Nuchal Translucency)లో డౌన్‌సిండ్రోమ్ లాంటి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా తెలుస్తాయి. దీంతోపాటు ఇంకా టీ18, టీ13 అనే సమస్యలనూ గుర్తించే వీలుంటుంది. డెలివరీ అయ్యే సుమారు తేదీ కూడా ఈ స్కాన్లోనే తెలుస్తుంది. ఈ ఎన్టీ స్కాన్‌ను 12–13 వారాల మధ్య చేస్తారు. ఈ టెస్ట్‌లో ఒకవేళ ఏదైనా సమస్య కనపడితే తదుపరి ఏ డాక్టర్ని కలవాలి, చెకప్స్, హై రిస్క్ అబ్‌స్టెట్రీషియన్ కేర్ వంటివి సూచిస్తారు. తొలి మూడు నెలల్లోనే బిడ్డకు అవయవాలన్నీ ఏర్పడటం మొదలవుతుంది కాబట్టి తీసుకోవలసిన పోషకాహారం, జాగ్రత్తల గురించి వివరిస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్‌లో ఒకవేళ బిడ్డకేవైనా ఎదుగుదల సమస్యలు కనిపిస్తే వేసుకోవలసిన మాత్రలు, తీసుకోవలసిన ఇంజెక్షన్స్‌ను ప్రిస్క్రైబ్ చేస్తారు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ సమయంలో లేదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. నాకు 37 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పీరియడ్స్‌లో విపరీతమైన పెయిన్ ఉంటుంది. రొటీన్ స్కాన్‌లో లో అడినోమయోసిస్ అని తేలింది. వేరే పరీక్షలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. తెలిసిన డాక్టర్ చూసి, గర్భసంచి తొలగించాలని చెప్పారు. వేరే మార్గం లేదా?– ప్రదీప్తి, విజయనగరంపీరియడ్స్లో పెయిన్ తప్ప ఇతర ఇబ్బందులేమీ లేవంటున్నారు. కాబట్టి మేజర్ సర్జరీ అవసరం లేదు. నెలసరిలో నొప్పి తగ్గేందుకు కొన్ని మందులు వాడొచ్చు. అడినోమయోసిస్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. గర్భసంచిలో ఉండే టిష్యూ గర్భసంచి గోడలోకి వెళ్లి నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం అవటం, పొత్తి కడుపు నొప్పి, వెన్ను నొప్పి వంటివి ఉంటాయి. సాధారణమైన పెయిన్ కిల్లర్ మాత్రలతో నొప్పి తగ్గకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రొజెస్టిరాన్ మాత్రలు, ఇంట్రాటెరైనా డివైస్ – MIRENA లాంటివి నొప్పిని, బ్లీడింగ్నీ తగ్గిస్తాయి. మీరు డాక్టర్ని సంప్రదిస్తే.. పరీక్షించి.. మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో, ఏది మంచిదో చెబుతారు. అడినోమయోసిస్ అనేది దానికదే తగ్గే అవకాశం తక్కువ. అందుకని ఏడాదికోసారి స్కాన్ చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. మెనోపాజ్ వయసుకి హార్మోన్లు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ఇదీ తగ్గిపోవచ్చు. ఆల్రెడీ పిల్లలున్న వారు MIRENA కాయిల్ ఆప్షన్ని ఎంచుకోవచ్చు. హిస్టరెక్టమీ లాంటి మేజర్ సర్జరీని నివారించవచ్చు. కేవలం నొప్పి, అధిక రక్తస్రావం మాత్రమే ఉన్నవారికి (థైరాయిడ్, హై బీపీ, సుగర్ లాంటి సమస్యలేవీ లేకపోతే) ఈ కాయిల్ లేదా మాత్రలతో త్వరగానే రిలీఫ్ వస్తుంది. అలాగే మీ ఏజ్ గ్రూప్ వాళ్లు తప్పకుండా పాప్ స్మియర్ అనే సర్వైకల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకసారి అన్ని పరీక్షలు చేయించుకొని ఆ రిపోర్ట్స్‌తో గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి. సరైన చికిత్సను సూచిస్తారు. -
అంబులెన్స్‌లో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గర్భిణీ, ఆమె కుటుంబం అంబులెన్స్‌లో భారీ పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం.. జల్గావ్లోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్ పేలుడు ఘటన జరిగింది. అంబులెన్స్‌లో గర్భిణీ, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జలగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. అంబులెన్స్ డ్రైవర్ తన వాహనం ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే దిగిపోయాడు. అప్రమత్తమైన డ్రైవర్.. అంబులెన్స్‌లో ఉన్నవారిని సైతం వెంటనే దిగాల్సిదిగా కోరాడు.Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes in Jalgaon of Maharashtra. pic.twitter.com/PvQPkQZJEY— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2024అదేవిధంగా వాహనం నుంచి దూరంగా ఉండమని సమీపంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేశాడు. వాహనం మొత్తం మంటల్లో చిక్కుకొని.. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌కు వ్యాపించింది. దీంతో భారీ శద్ధంతో పేలుడుకు సంభవించింది. అయితే ప్రమాదంలో డైవర్‌తో సహా.. గర్భిణీ,ఆమె కుటుంబం సురక్షింతంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్గ్రా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెట్రోల్ పంపు దగ్గర పార్క్ చేసిన అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో నిమిషాల తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానికి డబ్బుల డిమాండ్
ఐ.పోలవరం: నిండు గర్భిణి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించగా అక్కడ సిబ్బంది తీరుతో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మురముళ్ల గ్రామానికి చెందిన గోడ లావణ్య అనే గర్భిణికి పురుడునొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టి.కొత్తపల్లి సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి గైనకాలజిస్టు అన్ని పరీక్షలు చేసి, వెంటనే ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రమాదమని చెప్పారు. అయితే ఆపరేషన్ కోసం మత్తు డాక్టరుకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో లావణ్య బంధువులకు ఏం చేయాలో పాలుపోలేదు. డబ్బులు లేవని ప్రాధేయపడినా వైద్య సిబ్బంది కనికరం చూపకపోవడంతో గర్భిణిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. కాగా.. ఆస్పత్రిలో ఎదురైన చేదు అనుభవాన్ని లావణ్య స్వయంగా విలేకరులకు తెలిపారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ డయానాను వివరణ కోరగా ఆ విషయం తన దృష్టికి రావడంతో ఆస్పత్రికి వెళ్లానన్నారు. మత్తు డాక్టరుకు ఇవ్వాలంటూ అక్కడి వైద్యురాలు డబ్బులు డిమాండ్ చేశారన్న బాధితుల ఆరోపణపై విచారణ చేయిస్తామని తెలిపారు. -
రోడ్డుపై మహిళ డెలివరీ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ముంబై పోలీసు విభాగానికి చెందిన నిర్భయ స్క్వాడ్ వెంటనే ఆదుకుంది. ఆమెకు రోడ్డుపైనే డెలివరీ చేయించి, తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.వివరాల్లోకి వెళితే ముంబైలోని డోంగ్రీ పోలీస్ స్టేషన్‌కు చెందిన నిర్భయ స్క్వాడ్ రోడ్డుపై 45 ఏళ్ల మహిళకు బిడ్డను ప్రసవించడంలో సహాయం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను ఆమె నవజాత శిశువును జేజే ఆస్పత్రికి తరలించింది. డోంగ్రీలోని చార్ నల్ జంక్షన్లో ఫుట్‌పాత్‌పై ఓ మహిళ ప్రసవ నొప్పితో బాధపడున్నదని నిర్భయ స్క్వాడ్‌కు తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్క్వాడ్‌లో ఉన్న మహిళా పోలీసులు బాధితురాలిని ఆదుకునే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వారు బాధిత మహిళ చుట్టూ కవర్ కట్టి, స్థానికుల సహాయంతో డెలివరీ చేశారు. ఈ మహిళకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తరువాత పోలీసులు ఆ శిశువును, తల్లిని జేజే ఆస్పత్రికి తరలించారు. నిర్భయ స్క్వాడ్‌ను ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ అభినందించారు. Short of words to express my appreciation for the presence of mind & composure displayed by Dongri Pstn Nirbhaya Squad, in helping a lady deliver a baby on road. The Dongri Pstn Nirbhaya squad while patrolling found a 45-year-old lady bleeding in labour pain on the road near… pic.twitter.com/QPKqmkOhTc— पोलीस आयुक्त, बृहन्मुंबई - CP Mumbai Police (@CPMumbaiPolice) September 20, 2024ఇది కూడా చదవండి: సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు -
బలవంతంగా సిజేరియన్.. శిశువు మృతి
నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుర్చిలోనే ప్రసవించిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శంగా మరో ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గ్యారకుంట్లపాలెం గ్రా మానికి చెందిన చెరుకుపల్లి నాగరాజు భార్య శ్రీలత మూడో కాన్పు కోసం ఈ నెల 21న ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం పడుతుందని వేచిచూడాలని సలహా ఇచ్చారు. ఇటీవల ఆసుపత్రిలో కుర్చిలోనే ప్రసవించిన ఘటనపై స్పందించిన కలెక్టర్ బాధ్యులైన డాక్టర్‌తోపాటు అయిదుగురు నర్సింగ్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ శనివారం గైనిక్ వార్డులోని వైద్యులంతా మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తికి నోటీసులు అందజేసి విధులు బహిష్కరించారు. దీంతో గైనిక్ వార్డులో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందు బాబు బాగున్నాడని చెప్పి.. శనివారం సాయంత్రం వరకు నర్సులు మినహా డాక్టర్లు లేకపోవడంతో విసిగి వేసారిన గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులకు బయల్దేరారు. ఈక్రమంలోనే శ్రీలతను భర్త నాగరాజు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కిస్తుండగా ఆసుపత్రి సెక్యూరిటీ, సిబ్బంది అడ్డుకుని బలవంతంగా కా న్పుల వార్డుకు తరలించారు. మీరు బయటకు వెళ్లిపోతే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడి లోపలకు తీసుకు పోయి సేవలందిస్తామని సూచించారు. రాత్రి 9.30 సమయంలో శ్రీలతకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే అప్పటికే పుట్టిన బాబు మృతి చెందినట్లు తెలిసింది. అయితే ముందుగా బాబు బాగున్నాడని వైద్యులు చెప్పారని, ఆ తరువాత చనిపోయినట్లు చెప్పారని బంధువులు పేర్కొన్నారు. డాక్టర్ల నిర్వాకంపై బంధువులు అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. బాబు శరీరంపై గాయాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మరణించాడని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించి కేసు పెట్టాలని సూచించడంతో నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తిని వివరణ కోరగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, జిల్లా కలెక్టర్‌కు జరిగిన ఘటనపై వివరించామని తెలిపారు. -
దుబాయ్‌లో భర్త.. కన్నుమూసిన ఏడు నెలల గర్భిణి
ముస్తాబాద్(సిరిసిల్ల): కడుపులో పెరుగుతున్న బిడ్డను కళ్లారా చూడకుండానే ఓ గర్భిణి అనారోగ్యంతో మృతిచెందింది. గ్రామస్తులు, కుటుంబీకుల కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం మద్దికుంటకు చెందిన ఝాన్సీ అలియాస్ ఐశ్వర్య (20)కు గూడెం గ్రామానికి చెందిన ఈడుగురాళ్ల అంజయ్య, విజయ దంపతుల కుమారుడు హరీశ్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. ఝాన్సీ ప్రస్తుతం 7 నెలల గర్భిణి. ఇటీవలే భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఝాన్నీ అనారోగ్యానికి గురికాగా నెల రోజులుగా వైద్యం చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పెళ్లయిన ఏడాదిన్నరకే ఝాన్సీ మృతిచెందడంతో రెండు కుటుంబాలు దుఃఖంలో మునిగాయి. ఆమె కడసారి చూపునకు భర్త -
Hyderabad: ఆర్టీసీ బస్సులో పురుడు పోశారు..
కాచిగూడ (హైదరాబాద్): పురిటి నొప్పులు పడుతున్న గర్భిణికి బస్సులోనే డెలివరి చేసి ఆర్టీసీ సిబ్బంది మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నగరానికి చెందిన శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్‌లో ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో (టీఎస్వో 2జెడ్ 0341) శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎక్కారు. ఆ బస్సులో డ్రైవర్ ఎం.అలీ, కండక్టర్ బి.సరోజ విధుల్లో ఉన్నారు. బస్సు బహదూర్‌పురా వద్దకు రాగానే శ్వేతారత్నంకు నొప్పులు రావడంతో బస్సు డ్రైవర్ బస్సును పక్కనే ఆపి ప్రయాణికులను దించాడు. బస్సు కండక్టర్ బి.సరోజ తోటి ప్రయాణికుల సహాయంతో శ్వేతారత్నంకు డెలివరీ చేశారు. శ్వేతారత్నం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జజ్జిఖానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్ చేశారు. మహిళకు పురుడు పోసిన కండక్టర్ సరోజను పలువురు ప్రయాణికులు అభినందించారు. ముషీరాబాద్ ఇన్చార్జి డీఎం రఘు అలీ, సరోజలను అభినందించారు. ఆర్టీసీ హైదరాబాద్ సిటీ రీజినల్ మేనేజర్ వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎంఓ జగన్, కాచిగూడ డీఎం, ముషీరాబాద్ డిపో ఇన్చార్జి డీఎం రఘు, బర్కత్‌పుర డీఎం వేణుగోపాల్, ముషీరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ కళ్యాణి తదితరులు డ్రైవర్, కండక్టర్లను అభినందించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు తెలియజేశారు. -
అత్తింటి వేధింపులతో గర్భిణి బలవన్మరణం
పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌తో(31) వివాహమైంది. శ్రీకాంత్ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్‌తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్ చేస్తే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు కానిస్టేబుల్ శ్యామ్ తన పరపతితో అబార్షన్ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది. శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్ ద్వారా ఓ మెసేజ్ చేసింది. ‘తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని’ ఆ మెసేజ్‌లో పేర్కొంది. కావ్యశ్రీ బాత్రూమ్ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్రూమ్ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్‌కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
సాక్షి, కృష్ణా జిల్లా: యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీ సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య శ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. విజయవాడలో స్కానింగ్ తీయించిన భర్త శ్రీకాంత్.. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్‌కు కావ్యశ్రీ చెప్పిన కానీ తమకు వారసుడిని ఇవ్వాలంటూ అత్త, మామ వేధింపులకు పాల్పడ్డారు.శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.. మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ చేసింది. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
మంచిర్యాలక్రైం: నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కళ్లనిండా చూసుకోకుండానే కాటికి చేరుకున్న ఘటన సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం బెల్లంపల్లికి చెందిన బొల్లు వెంకటేశ్ భార్య రవళిక (26) సోమవారం ఉదయం జిల్లా కేంద్రంలోని నందిని ఆస్పత్రిలో ప్రసవం నిమిత్తం చేరింది. ఆస్పత్రి వైద్యురాలు సాధారణ డెలివరీ చేయడంతో బాబుకు జన్మనిచ్చింది. సదరు మహిళకు అధిక రక్తస్రావం కావడంతో వైద్యురాలు అర్జంటుగా రక్తం కావాలని బాధిత కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంకటేశ్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లి రక్తం తీసుకు వచ్చే లోగానే వైద్యురాలు నందిని బాధిత కుటుంబ సభ్యులకు చెప్పకుండానే మహిళను సమీపంలోని మెడిలైఫ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవళిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యురాలు నందిని, మెడిలైఫ్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే రవళిక మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీఐ బన్సీలాల్ సిబ్బందితో కలిసి ఆసుపత్రి వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. -
డివైడర్ మధ్యలోని పూలు తెంపుకొని వస్తుండగా గర్భిణి విషాదం!
నిజామాబాద్: సంప్రదాయం ప్రకారం గోదావ రి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్తున్న ఐదు నెలల గర్భిణి.. మార్గమధ్యలో డివైడర్‌పై ఉన్న పూలను తెంపి, వాహనం వద్దకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. వివరాలిలా ఉన్నా యి. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్‌కు చెందిన కొమిరె మాధవి(25) ఐదు నెలల గర్భిణి. ఐదు నెలల సమయంలో గంగమ్మ పూజలు చేయడం వారి కుటుంబంలో ఆనవాయితీ. శుక్రవారం ఉదయం మాధవి భర్త గంగసాగర్, కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ జిల్లా సోన్ వద్ద గల గోదావరిలో స్నానాలు ఆచరించడానికి ఆటోలో బయలుదేరారు. మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద ఆటోను ఆపి జాతీయ రహదారి డివైడర్ మధ్యలోనున్న పూలను తెంపడానికి మాధవి వెళ్లింది. పూలను తెంపి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యం : ఆసుపత్రి గేటు వద్దే ప్రసవం, చివరికి!
జైపూర్: నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు పట్టించుకోలేదు. అడ్మిషన్‌కు నిరాకరించారు. దీంతో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఆసుపత్రి గేటువద్దే బిడ్డను ప్రసవించిన ఘటన ఆందోళన రేపింది. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గర్భిణీ స్త్రీకి అడ్మిషన్ నిరాకరించి,నిర్లక్ష్యంగా వ్యవహరించి వైద్యులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగ్గురు రెసిడెంట్ వైద్యులను సస్పెండ్ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులు కుసుమ్ సైనీ, నేహా రాజావత్, మనోజ్‌ను సస్పెండ్ చేశామని వైద్య విద్య అదనపు ముఖ్య కార్యదర్శి శుభ్రా సింగ్ వెల్లడించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, తక్షణమే విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సరిగ్గా పర్యవేక్షించని కారణంగా కన్వాటియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాజేంద్ర సింగ్ తన్వర్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశామన్నారు. -
తల్లి కాబోతున్నారా? జాంపండు లాంటి బేబీ కోసం బెస్ట్ అండ్ హెల్దీ జ్యూసెస్
గర్భిణీ స్త్రీలు స్వయంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, పిండం పెరుగుదల, అభివృద్ధికి మంచి పోషకాహారం తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో అధిక ప్రోటీన్ ఆహారాలతో పాటు తొందరగా శక్తిని, పోషకాలను అందించే జ్యూస్‌లను సేవించాలి. దీంతోపాటు గర్భిణీ స్త్రీలు గుర్తు పెట్టుకోవాల్సి విషయం ఏమిటంటే..చక్కెర వాడకాన్ని తగ్గించాలి. కృత్రిమ స్వీట్నర్లు ,ప్రిజర్వేటివ్‌లు లేని సహజ పండ్ల రసాలను మాత్రమే తాగాలి. ప్రెగ్నెంట్ లేడీస్ మెచ్చే జ్యూస్‌లు కొన్ని చూద్దాం.. బనానా జ్యూస్ అరటిపండులో శరీరానికి కావల్సిన పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B6 కూడా ఉంటుంది, అరటి పండులో కొద్దిగా తాగా మీగడ వేసుకుని జ్యూస్, కొద్దిగా తేనె లేదా బెల్లం పొడి కలుపుకుని తాగి కడుపు నిండినట్టూ ఉంటుంది. ప్రారంభ నెలల్లో ఈ జ్యూస్ శక్తిని, బలాన్నిస్తుంది. వాంతులు, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్లు ,మినరల్స్ అధికంగా ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు ముఖ్యమైన ఫోలిక్ యాసిడ్ కంటెంట్ కూడా నారింజలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పిండంలోని లోపాలను నివారించడానికి , మెదడు , వెన్నెముకలో అసాధారణతలను నివారించడానికి సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ 1వ, 2వ , 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలకు క్యారెట్ రసం ఉత్తమమైన రసం. క్యారెట్లో విటమిన్ ఎ, ఐరన్, బి విటమిన్లు, పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఎ కంటెంట్ కడుపులోని పిండం ఎముకలు ,దంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గర్భిణీ స్త్రీలు క్యారెట్ రసాన్ని తగినంత పరిమాణంలోనే తీసుకోవాలి. రోజుకు 1 గ్లాసు చాలా ఎక్కువ విటమిన్ ఎ ఆరోగ్యానికి తగినది కాదు ఎందుకంటే ఇది విషపూరిత ప్రభావాలను కలిగిస్తుంది. ఆపిల్ జ్యూస్ ఆపిల్‌లో ఫైబర్‌తోపాటు విటమిన్ ఏ, విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించే ఫ్లేవనాయిడ్సీ , ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఐరన్ హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది , రక్తహీనతను నివారిస్తుంది.రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అవోకాడో జ్యూస్ అవకాడోస్లోని ఐరన్, ఫైబర్, విటమిన్ సి, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవకాడోలోని కోలిన్ శిశువు మెదడు, నరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అవకాడోలో అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి, ఇవి గర్భధారణ సమయంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మిక్స్డ్ జ్యూస్ సన్నగా తరిగిన అరకప్పు లేత పాలకూర, నాలుగు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు ఆవకాడో, అరకప్పు నీళ్లు తీసుకుని జ్యూసర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌ను వడగట్టకుండా అలాగే తాగాలి. గర్భిణులకు ఈ స్మూతీ అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. గర్భిణీ స్త్రీకి అధిక పోషకాహారం ఖచ్చితంగా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, పానీయాలను కూడా తీసుకోవాలి. అందులోనూ వేసవి కదా మరికొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్యూస్‌లు అందరికీ ఒకేలా పనిచేయవు. ఏదైనా ఎలర్జీలాంటివి ఉంటే ఈ జ్యుసెస్ను సేవించటేపుడు అప్రమత్తంగా ఉండాలి. సమతుల ఆహారం,చిన్నపాటి వ్యాయామం, ఎవరి టేస్ట్‌కు తగినట్టు, ఆయా జ్యూస్‌లను తాగుతూ, ఒత్తిడికి దూరంగా ఉంటూ, ప్రసూతి వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉంటే పండంటి బిడ్డ మీసొంతం. -
చాలాసేపు కదలకుండా కూర్చుంటున్నారా.. అయితే జాగ్రత్త!
'చాలాసేపు కదలకుండా కూర్చున్నా, అలా కూర్చుని చాలాసేపు ప్రయాణాలు చేసినా కాళ్లవాపులు రావడం మామూలే. గర్భవతుల్లోనైతే ప్రసవానికి ముందు చివరి మూడు నెలల్లో (చివరి ట్రైమిస్టర్లో) కాళ్ల వాపు రావడం ఇంకా సాధారణం. గర్భవతుల్లో కాళ్ల వాపు వచ్చే ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘జెస్టెషనల్ అడిమా’ అంటారు. ఇలా కాళ్లవాపులు రావడానికి కారణాలేమిటి, వాటితో వచ్చే సమస్యలూ – పరిష్కారాలపై అవగాహన కోసం ఈ కథనం.' గర్భవతుల్లో ప్రసవం ముందరి నెలల్లో కాళ్ల వాపులు రావడం.. అందునా అవి ఉదయం పూట కొద్దిగా ఉండి, క్రమంగా సాయంత్రానికి వాపులు పెరుగుతుండటం చాలామందిలో జరుగుతుంటుంది. కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల విశ్రాంతితో ఆ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి. దేహనిర్మాణ పరమైన (అనటామికల్) కారణం.. గర్భవతుల్లో ప్రసవానికి ముందు రోజుల్లో గర్భసంచి కుడి వైపునకు కాస్తంత ఒరుగుతుంది. కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే పెద్ద రక్తనాళమైన ఇన్ఫీరియర్ వీన కేవా శరీరానికి కుడివైపునే ఉంటుంది. గర్భసంచి కుడి వైపునకు ఒరగడం వల్ల.. అది ఇన్ఫీరియర్ వీన కేవాపై ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో కాళ్ల నుంచి గుండె వైపునకు రక్తప్రవాహం సాఫీగా సాగక కాళ్లవాపులు వస్తుంటాయి. అందువల్ల గర్భవతులు విశ్రాంతిగా పక్కమీద ఒరిగినప్పుడు తమ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది. కాళ్లవాపులు వస్తుంటే దృష్టి పెట్టాల్సిన మెడికల్ సమస్యలు.. గర్భవతుల్లో కాళ్ల వాపు వస్తున్నప్పుడు ముందుగా హైబీపీ ఉందేమోనని పరీక్షించుకోవాలి. మనదేశ మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కాళ్ల వాపులు రావడానికి ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్/కౌంట్ (సీబీపీ/సీబీసీ) వంటి రక్తపరీక్షలు నిర్వహించినప్పుడు మహిళల్లో హిమోగ్లోబిన్ మోతాదు కనీసం 11 ఉండాలి. కొందరిలో ఇది 7 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాళ్ల వాపు రావడం సాధారణం. మహిళల్లో గుండెజబ్బులు, కాలేయవ్యాధులు, కిడ్ని సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు కూడా కాళ్లవాపులు రావచ్చు. కాళ్లవాపు తగ్గడానికి చేయాల్సిందిదే.. మామూలుగానైతే ఈ కాళ్లవాపుల గురించి పెద్దగా ఆందోళన పడాల్సిందేమీ లేదు. వాపు ఎక్కువగా ఉంటే పక్క మీద ఒరిగి పడుకున్న గర్భవతులు మడమల కింద తలగడను పెట్టుకుని, కాళ్లను కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందుగాని, డెస్క్ ముందుగాని అదేపనిగా కూర్చుని పనిచేసే వారు తమ కాళ్ల కింద ఏదైనా పీటగానీ, స్టూల్‌గాని వేసుకుని, కాళ్లు కాస్తంత ఎత్తు మీద ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మూడు గంటలకు ఒకమారు లేచి, కాస్తంత నడవాలి. దాంతో కాళ్ల వాపు తగ్గుతుంది. పైన పేర్కొన్న జాగ్రత్తలు ΄ాటించాక కూడా కాళ్ల వాపులు తగ్గని వారూ,.. అలాగే ఆ సమస్యతో పాటు చేతులు, ముఖంలో వాపు కనిపిస్తున్నవారూ, ఆరేడు గంటల విశ్రాంతి తర్వాత కూడా కాళ్ల వాపులు తగ్గని వారు.. తప్పనిసరిగా హైబీపీ, అనీమియాతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు ఏవైనా ఉన్నాయేమోనని డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోవాలి. - డాక్టర్ రమ్యతేజ కడియాల, సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రీషియన్ ఇవి కూడా చదవండి: చలిగాలిలో వాకింగ్: ఊపిరితిత్తులు జాగ్రత్త! -
బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..
ప్రేమించిని వ్యక్తి మోసం చేస్తాడన్న ఆలోచన రాదు కాబట్టే భాగస్వామి చేతిలో సులభంగా ఓడిపోతారేమో!. అతడేంటి అనేది పరిస్థితులు ఎదురైతే గానీ అసలు నిజస్వరూపం బయటపడదు. వాస్తవం తెలిసే లోపు కథ ముగిసిపోతుంది. అలానే వెనెస్సె పియరీ అనే ఓ అమాయకురాలి ప్రాణంగా ప్రేమించాననుకుంది. ఇద్దరం కాస్తం ముగ్గురంగా మారి కుటుంబంగా ఏర్పడుతున్నాం అన్న ఆనందంలో ఉక్కిరిబిక్కిరయ్యింది. అదే తనకు మృత్యువుగా మారుతుందని ఊహించలేదు. ప్రేమించింది కిరాతకుడని అని తెలిసేలోపే.. భూమ్మీదే లేకుండా పోయింది. ఈ నిజం మూడేళ్ల తర్వాతగానీ వెలుగులోకి రాలేదు. అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన 33 ఏళ్ల గోయ్ చార్లెస్ అనే వ్యక్తి వెనెస్సా పియరీ ఇద్దరూ ప్రాణాంగా ప్రేమించుకున్నారు. పియరీకి అతడి ప్రేమలో సంతోషంగా రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి. వారివురి ప్రేమకు గుర్తుగా పియరీ తల్లి కాబోతోంది. ఈ ఆనందకర విషయం పియరీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాము ఇరువురం కాస్తా ముగ్గురమవుతున్నాం అన్న ఆనందంలో తేలియాడుతుంది. తమకంటూ కుంటుంబం ఏర్పడాలన్న కల నిజమవుతున్నా ఆనందంలోనే ఉంది. కానీ ప్రియుడు గోయ్ చార్లెస్ మనసులో ఏముందో గ్రహించలేకపోయింది. అతడు కూడా హ్యాపీగా ఉన్నాడనే అనుకుంది. ఓ పక్క పియరీకి నెలలు నిండుతున్నాయి. ఒక రోజు ఎప్పటిలానే తన ప్రియుడితో కలిసి కారులో బయటకి వెళ్తోంది. ఇదంత ఇష్టంలేని గోయ్ చార్లెస్ మంచి వాడిలా నటిస్తున్న ముసుగు తీసి తన క్రూరత్వాన్ని చూపించబోతున్నాడని తెలియని పియరీ నవ్వుతూనే అతడితో మాట్లాడుతోంది. సడెన్‌గా హైవే మీద ఆపినా కూడా ఎందుకుని అడగలేదు, అనుమానించ లేదు పియరీ. పక్కాప్లాన్‌తో ఉన్న చార్లెస్ ఆమె ఆరు నెలల నిండు గర్భిణి అన్న కనికరం లేకుండా ఆమెను గొంతు నులిమి చంపేసి హైవేమీద పడేసి కామ్‌గా వెళ్లిపోయాడు. ఎవ్వరూ చూడలేదు కదా అనే అనుకున్నాడు. ఈ దారుణ ఘటన అక్టోబర్ 23, 2020న జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళ పడి ఉందని బస్ డ్రైవర్ సమాచరం ఇవ్వడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె ఎవరని ఎక్వైయిరీ చేయగడం ప్రారంభించారు. విచారణలో బాధితురాలు 29 ఏళ్ల వెనెస్సా పియరీగా గుర్తించారు పోలీసులు. ఎందువల్ల చనిపోయిందన్న దిశగా బాధితురాలు బంధువులను విచారించగా..ఆమె సోదరి మెలిస్సా ప్రియరీ అసలు విషయం పోలీసులు చెబుతుంది. దీంతో పోలీసులు గోయ్ చార్లెస్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ అతడు నేరాన్ని అంగీకరించలేదు. దీంతో సాక్షాధారాల కోసం ముమ్మరంగా ఇన్విస్టేగేషన్ చేస్తున్న పోలీసులకు ఆ రోజు పియరీ, చార్లెస్ దంపతుల ప్రయాణించిన కారు ఆధారంగా సాక్షాధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఎందుకంటే ఆ కారు పియరీ పేరు మీదే రిజస్ట్రై అయ్యి ఉంది. అలాగే ఆ ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీఫుటేజ్ కూడా ఈ కేసులో కీలకమైంది. అందులో చార్లెస్ పియరీని ఈడ్చుకెళ్లి హైవే పై కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. ఇక పోస్ట్‌మార్టంలో సైతం ఆమెను గొంతు నులిమి చంపినట్లు వెల్లడైంది కూడా. దీంతో పోలీసులు వీటన్నింటిని కోర్టుకి సమర్పించడంతో గత బుధవారమే నిందితుడు చార్లెస్‌కి 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ హత్య జరిగిన మూడేళ్లకి ఆ కిరాతకుడికి శిక్షపడటం బాధగా ఉన్నా..ఎట్టకేలకు పియరీకి న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందని ఆమె సోదరి మెలిస్సా ఆనందంగా చెప్పింది. (చదవండి: సీక్రెట్ వైట్‌హౌస్! ప్రపంచంలోనే అందమైన భవంతి!) -
నిండు చూలాలికి ప్రాణం పోశారు
అనంతపురం మెడికల్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిండు చూలాలికి ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు సకాలంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి ఊపిరి పోశారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన వెంకటేష్, నాగబిందు దంపతులు. రెండో సారి గర్భం దాల్చిన నాగబిందును కాన్పు కోసం ఈ నెల 16న ఉదయం 7.30 గంటలకు జీజీహెచ్‌లో కుటుంబసభ్యులు చేర్పించారు. ఆ సమయంలో నిండు గర్భిణి తీవ్రమైన ఆయాసంతో ఊపిరి తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతుండడం గమనించిన గైనిక్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ సుచిత్ర, డాక్టర్ పార్వతి, డాక్టర్ పూజిత తదితరులు వెనువెంటనే వైద్య పరీక్షలు నిర్వహించారు. పల్మనరీ ఎడిమా (ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరడం)తో బాధపడుతున్నట్లు గుర్తించి ఏఎంసీలో వెంటిలేటర్‌పై ఉంచారు. ఆ సమయంలో ఆక్సిజన్ శాతం 52, గుండె పని శాతం 30 మాత్రమే ఉంది. ఆమె పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు దృష్టికి తీసుకెళ్లి, ఆయన ఆదేశాలతో డాక్టర్ షంషాద్‌బేగం, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్‌కుమార్, మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ బీమసేనాచార్ పర్యవేక్షణలో అడ్మిట్ అయిన రోజే ఉదయం 9.30 గంటలకు సిజేరియన్ చేసి 2.5 కిలోల బరువున్న మగబిడ్డను వెలికి తీశారు. సిజేరియన్ సమయంలో టాప్ లాక్ అనే నూతన విధానాన్ని అనస్తీషియా వైద్యులు అవలంబించారు. శస్త్రచికిత్స అనంతరం కూడా 24 గంటల పాటు నాగబిందును వెంటిలేటర్ పైనే ఉంచి వైద్యం అందించారు. అనంతరం సీ ప్యాప్ ద్వారా మూడ్రోజులపాటు ఆక్సిజన్ అందించారు. ఈ నెల 21న బాలింత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో లేబర్ వార్డులోని హై డిపెండెన్సీనిట్(ఐసీయూ)కు తరలించారు. ప్రస్తుతం బాలింత నాగబిందు, ఆమె బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. తల్లీబిడ్డకు ప్రాణం పోసిన గైనిక్, మెడిసిన్, అనస్తీషియా, చిన్నపిల్లల విభాగం వైద్యులను బుధవారం సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు అభినందించారు. సాధారణంగా ఈ తరహా కేసులకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.లక్షల్లో వసూలు చేస్తారని, ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉచితంగా అందించే ఈ చికిత్సపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. -
వైద్యుల నిర్లక్ష్యంపై నిరసన
రువళ్లూరు: ప్రసవనొప్పులు రావడంతో చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభు త్వ వైద్యశాలకు వచ్చిన గర్భిణిపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైద్యం కోసం సుమారు రెండు గంటల పాటు ఎదురుచూసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో దంపతులు అర్ధరాత్రి వేళ ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా మహ్మద్ అలీ వీధికి చెందిన మణిగండన్(35). ఇతని భార్య భారతి(32). ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారతి మూడోసారి గర్భం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో బఽంధువులు ప్రసవం కోసం తిరువళ్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే వైద్యశాలకు వచ్చి రెండు గంటలు దాటినా కనీసం నర్సులు కూడా పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. ఆమెకు ప్రసవనొప్పులు అధికం కావడంతో పాటు చలి జ్వరం రావడంతో విషయాన్ని ఆమెక భర్త వైద్యుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన మణిగండన్ భార్యతో కలిసి అక్కడే నిరసనకు దిగాడు. వైద్యులు, నర్సులకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో శుక్రవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ప్రభుత్వ వైద్యశాల నుంచి బయటకు వెళ్లి సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. -
బిడ్డకు ఐస్‌క్రీం కోసం వెళ్లి తల్లి దుర్మరణం: రాత్రంతా తల్లి శవం వద్దే చిన్నారి
మహారాష్ట్రలో కనిపించకుండా పోయిన గర్భిణి ఉదంతం చివరికి విషాదాంతమైంది. రాజురా-బల్లార్పూర్ రోడ్డులోని వార్ధా నది వంతెన సమీపంలో సుష్మ మృతదేహం కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంతేకాదు సుష్మ మృతదేహం పక్కనే ఆమె నాలుగేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించిన దృశ్యం మరింత కలిచి వేస్తోంది. ఈ ఘనటపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే చంద్రాపూర్‌కు చెందిన సుష్మా కక్డే బుధవారం రాత్రి అదృశ్యమైంది. ఐస్‌క్రీం కోసం తన నాలుగేళ్ల కుమారుడితో ఇంటినుంచి బైటికి వెళ్లి ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆమె భర్త, బ్యాంక్ ఉద్యోగి పవన్‌కుమార్, బంధువులు ఆమె కోసం వెతికారు. కానీ ఫలితం లేక పోవడంతో, బల్లార్పూర్ పోలీసులను ఆశ్రయించారు. గురువారం ఉదయం నది వంతెన సమీపంలో మృతదేహాన్ని గుర్తించామని పోలీసు ఉన్నతాధికారి రవీంద్ర సింగ్ పర్దేసి వెల్లడించారు. బుధవారం అర్థరాత్రి వంతెనపై నుండి పడి బురద ప్రాంతంలో కూరుకుపోయి ఉంటుందని పోలీసుల ప్రాథమిక అంచనా. అయితే, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామిన పరదేశి చెప్పారు. -
కత్తెర కాన్పులు ఇక కట్.. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన
మహిళలకు మాతృత్వం వరం. గర్భిణి అని నిర్ధారణ అవగానే ఆ యువతి కళ్లలో ఆనందం తొంగి చూస్తుంది. నెలలు నిండే కొద్దీ ఆ ఆనందం స్థానంలో క్రమంగా ఆందోళన చోటు చేసుకుంటుంది. తనకు సుఖప్రసవం అవుతుందా..?, సిజేరియన్ చేయాల్సి వస్తుందా..? అన్న ఆవేదనకు గురవుతుంది. ఇకపై ఆ చింత తొలగనుంది. షీ సేఫ్ విధానంతో కత్తెర కాన్పులకు చెక్ పడనుంది. ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెరగనుంది. సుఖప్రసవానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తూ అమ్మకు ఆలంబన చేకూర్చనుంది రాష్ట్రప్రభుత్వం. చిత్తూరు రూరల్: అమ్మ కడుపుకోతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షీ సేఫ్ పేరుతో సహజ ప్రసవాలకు రూపకల్పన చేసింది. గర్భిణులకు అవగాహన కలి్పంచి సిజేరియన్లు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై నిఘా పెట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వాస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్‌సీలు, 50 పీహెచ్‌సీలు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. గత నెల నుంచి పీహెచ్‌సీలు కూడా 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మాతాశిశు మరణాలు తగ్గించాలని, సహజ ప్రసవాల సంఖ్య పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాలు 70 నుంచి 80 శాతం నమోదవుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 500 పైగా ఉన్నాయి. వీటిలో 60 నుంచి 70 శాతం శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండడంతో మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. షీ–సేఫ్‌తో... బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అది సహజపద్ధతిలో జరిగితే తల్లీబిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహంతో అమ్మ కడుపును కోసేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్ ఆపరేషన్లు చేసేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేస్తే తప్పు కాదు, కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా ప్రైవేటు వైద్యులు శస్త్ర చికిత్సలను ప్రోత్సహిసున్నారు. సిజేరియన్‌కు రూ.50 వేల నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి (కోత కనబడని శస్త్రచికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్రచికిత్సలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్యశాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్లతో కలిగే అనర్థాలు, సహజ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు ప్రోత్సాహించేందుకు షీ–సేఫ్ విధానాన్ని రూపకల్పన చేసి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. షీ సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలన్నదే షీ–సేఫ్ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాత శిశుమరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఆఫరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తోంది. సాధారణ కాన్పు..సిజేరియన్‌కు తేడాలివీ.. సాధారణ కాన్పు జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితి ఆధారంగా రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్రచికిత్స చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ల కుదింపుపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా మే నుంచి ఆగస్టు వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 5,945 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం 3,092 ప్రసవాలు జరగ్గా, 2,173 సుఖ ప్రసవాలు, 919 మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,853 జరగ్గా.. 1,187 శస్త్ర చికిత్సలు, సాధారణ ప్రసవాలు 1,666 జరిగాయని అధికారులు వెల్లడిస్తున్నారు. సిజేరియన్ల సంఖ్యను మరింత కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనంత వరకు సుఖ ప్రసవం అయ్యేలా చూస్తున్నాం. ఆస్పత్రికి వచ్చే 50 శాతం కేసులు బీపీ, రక్తహీనత లోపంతో వచ్చేవారే. అలాంటి వారికి కూడా ఆస్పత్రుల్లో సుఖ ప్రసవం జరిగేలా చూస్తున్నాం. కానీ పక్షంలో సిజేరియన్ చేస్తున్నాం. దీంతో పాటు క్షేత్రస్థాయిలో సిజేరియన్తో కలిగే నష్టాలపై అవగాహన కలి్పంచాలి. – ఉషశ్రీ, గైన కాలజిస్ట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు వైద్యుల సలహాలు తీసుకోవాలి గర్భిణులు వైద్యుల సూచనలు పాటించాలి. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. రక్తహీనత లోపమే మాతా శిశుమరణాలు, ఆపరేషన్లకు కారణమవుతుంది. అనవసర సిజేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకోసం గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ క్రమంలో సీ–సీఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభావతిదేవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు -
HYD: యాచకురాలికి పురుడు పోసిన 108 సిబ్బంది, కానిస్టేబుల్
సాక్షి, జీడిమెట్ల: పురిటి నొప్పులు భరించలేక రోడ్డుపై పడిపోయిన ఓ యాచకురాలికి 108 సిబ్బంది ఓ మహిళా కానిస్టేబుల్ సహాయంతో పురుడు పోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఐడీపీఎల్‌లోని డొమినోస్ సందులో ఓ గర్బిని పురిటి నొప్పులతో అవస్థ పడుతున్నట్లు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు 108 సిబ్బంది రాజు, శ్రీనివాస్‌లకు విషయం తెలిపి ఐడీపీఎల్ వద్దకు వాహనం పంపించారు. అప్పటికే ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న మహిళకు 108 సిబ్బంది ఓ లేడీ కానిస్టేబుల్ పురుడు పోయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జీడిమెట్ల సీఐ వపన్ సూచన మేరకు సదరు మహిళను 108 సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరు ఆమె! సదరు మహిళను పోలీసులు, 108 సిబ్బంది వివరాలు అడగగా తన పేరు కృష్ణవేణి అని తాను యాచకురాలిని అని తెలిపింది. దీంతో పాటు తనకు ఎవరూ లేరంటూ ఒంటిరిగా ఉంటూ భిక్షాటన చేస్తున్నట్లు మాత్రమే తెలిపిందని పోలీసులు అంటున్నారు. -
ప్రెగ్నెన్సీలో షుగర్.. తల్లీ, బిడ్డకు ప్రమాదం, ఆ ట్యాబ్లెట్‌తో..
నాకిప్పుడు ఏడో నెల. షుగర్ ఉందని చెప్పారు. Metformin 100mg అనే మాత్రలు వేసుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చా? మాత్రలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? – పి. కృష్ణశ్రీ, భీమవరం Metformin అనే మాత్రలను ప్రెగ్నెన్సీలో వాడవచ్చు. డయాబెటిస్‌కి ఇది మంచి మెడిసిన్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్‌ని 80 శాతం స్ట్రిక్ట్ డైట్‌తో మేనేజ్‌చేస్తారు. కానీ షుగర్ పెరిగినప్పుడు మాత్రలు లేదా ఇన్సులిన్‌ను సజెస్ట్ చేస్తారు. షుగర్ నియంత్రణలో లేకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటిస్‌ని సులభంగా గుర్తించి .. స్ట్రిక్ట్‌గా హోమ్ మానిటరింగ్ చేసి నియంత్రణలోకి తెస్తే షుగర్ వల్ల తలెత్తే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండదు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం, ప్రసవమప్పుడు ఇబ్బందులు, అధిక రక్తస్రావం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి రావడం వంటి చాన్సెస్ తగ్గుతాయి. Metformin .. .. షుగర్ మరీ డౌన్ కాకుండా.. hypoglycemia episodes రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రతో ఉండే ఏకైక ఇబ్బంది.. కడుపు ఉబ్బరం. అందుకే మాత్రలను ఎప్పుడూ తిన్న వెంటనే వేసుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి.. నాలుగు రోజులకు మోతాదు పెంచి కావలసిన మోతాదుకు అడ్జస్ట్ చేస్తారు. షుగర్ రీడింగ్స్ నార్మల్ అయితే అదే మోతాదును కొనసాగిస్తారు. రెండు వారాల్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. మాత్రల విషయానికి వస్తే.. రోజూ ఇంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మానిటరింగ్ చేస్తూ మాత్రల మోతాదును నిర్ధారిస్తారు. -
ప్రేమించి పెళ్లి.. గర్భవతైన భార్యను దిండుతో అదిమిపట్టి..
నల్గొండ: మర్రిగూడ మండలం అజ్జలాపురంలో ఇటీవల వెలుగుచూసిన గర్భిణి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలు, క్షణికావేశంతో భర్తే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన నిందితుడిని శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టి ఎస్ఐ రంగారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మర్రిగూడ మండలం కమ్మగూడేనికి చెందిన సుష్మిత, అజ్జలాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రేమించుకుని ఈ ఏడాది జనవరిలో వివాహం చేసుకున్నారు. సుష్మిత ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడి గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 10వ తేదీన రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశానికి గురైన శ్రీకాంత్ దిండుతో సుష్మితను అదిమిపట్టి ఊపిరి ఆడనీయకుండా చేశాడు. అనంతరం మాల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత సుష్మిత మృతదేహాన్ని మర్రిగూడ ఆస్పత్రికి తీసుకొచ్చి అనారోగ్య కారణాలతో మృతిచెందినట్లు చిత్రీకరించాడు. మృతురాలి సోదరి శ్రీకాంత్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కుటుంబ కలహాలు, క్షణికావేశంలోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన దేవరకొండ కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ వివరించారు. -
ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు
లక్నో: యూపీలోని బారాబంకిలో నెలలు నిండిన తమ బిడ్డ డెలివరీకి ఏసీ వార్డులో చేర్పించలేదని కోపంతో ఓ గర్భవతి తల్లిదండ్రులు ఆమె అత్తమామలను చితక బాదారు. ఈ వీడియోని అక్కడున్నవారిలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. తమ బిడ్డకు నెలలు నిండడంతో డెలివరీ నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుసుకుని బిడ్డను చూసేందుకు ఆత్రుతతో హాస్పిటల్ కు వెళ్లారు గర్భవతి తల్లిదండ్రులు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏసీ వార్డులో కాకుండా నాన్ ఏసీ వార్డులో ఉన్న తమ బిడ్డను చూసి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట మాటల యుద్ధానికి తెరతీసిన వారు మెల్లగా ముష్టియుద్ధానికి తెగబడ్డారు. వియ్యంకుడు రామ్ కుమార్ తోపాటు అతని భార్యని ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకొట్టేశారు. వారు కూడా తిరగబడటంతో గొడవ మరీ పెద్దదైంది. రోడ్డు మీద నలుగురు చూస్తుండగానే ఈ వీరంగమంతా జరగడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో ఎక్కడెక్కడో చక్కెర్లు కొడుతోంది. #Barabanki में बहू के लिए अस्पताल में AC रूम न बुक करने पर मायके वालों ने की ससुराल पक्ष के लोगों की पिटाई, विडियो वायरल। pic.twitter.com/bfuKZ5j4uA — Priya singh (@priyarajputlive) July 5, 2023 ఇది కూడా చదవండి: కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం.. -
ఆస్పత్రి ఆవరణలో ప్రసవం
అనంతపురం క్రైం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం అప్పుడే పుట్టిన ఓ శిశువు మృతి చెందింది. ప్రసవ వేదనతో గర్భిణి ఆస్పత్రి ఆవరణలో ప్రసవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, ఎస్ఎన్సీయూ వైద్యులు డాక్టర్ దినకర్, సెక్యూరిటీ సిబ్బంది తెలిపిన మేరకు.. గుంతకల్లుకు చెందిన రాజా, షబానా దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడో కాన్పు కోసం షబానా అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తన ఇద్దరు పిల్లలతో కలసి ఆస్పత్రి ఆవరణలోని ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహం ఎదురుగా ఉన్న బల్లపై ఆమె కూర్చొని ఉండగా పురిటి నొప్పులు మొదలయ్యాయి. విషయాన్ని గమనించిన అక్కడున్న వారందరూ గుమిగూడేలోపు గర్భం నుంచి బాబు నేలపై పడ్డాడు. విషయం తెలుసుకున్న డాక్టర్ పద్మజ వెంటనే ఎఫ్‌ఎన్‌ఓల సాయంతో షబానాను లేబర్ వార్డుకు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న పసికందు(బాబు)ను ఎస్‌ఎన్‌సీయూలో చేర్చి, డాక్టర్ దినకర్ పర్యవేక్షణలో అత్యవసర చికిత్చ చేపట్టారు. అయితే చికిత్సకు స్పందించక బాబు మృతి చెందాడు. నెలలు పూర్తి స్థాయిలో నిండకనే ప్రసవమైందని, నవజాత శిశువు కిలో బరువు మాత్రమే ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. షబానా తరఫున పద్మావతి అనే మహిళ వచ్చి పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను కోల్పోవడంతో షబానా కన్నీటిపర్యంతమైంది.