ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ముంబై పోలీసు విభాగానికి చెందిన నిర్భయ స్క్వాడ్ వెంటనే ఆదుకుంది. ఆమెకు రోడ్డుపైనే డెలివరీ చేయించి, తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
వివరాల్లోకి వెళితే ముంబైలోని డోంగ్రీ పోలీస్ స్టేషన్‌కు చెందిన నిర్భయ స్క్వాడ్ రోడ్డుపై 45 ఏళ్ల మహిళకు బిడ్డను ప్రసవించడంలో సహాయం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను ఆమె నవజాత శిశువును జేజే ఆస్పత్రికి తరలించింది. డోంగ్రీలోని చార్ నల్ జంక్షన్‌లో ఫుట్‌పాత్‌పై ఓ మహిళ ప్రసవ నొప్పితో బాధపడున్నదని నిర్భయ స్క్వాడ్‌కు తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్క్వాడ్‌లో ఉన్న మహిళా పోలీసులు బాధితురాలిని ఆదుకునే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వారు బాధిత మహిళ చుట్టూ కవర్ కట్టి, స్థానికుల సహాయంతో డెలివరీ చేశారు. ఈ మహిళకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తరువాత పోలీసులు ఆ శిశువును, తల్లిని జేజే ఆస్పత్రికి తరలించారు. నిర్భయ స్క్వాడ్‌ను ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ అభినందించారు.
Short of words to express my appreciation for the presence of mind & composure displayed by Dongri Pstn Nirbhaya Squad, in helping a lady deliver a baby on road.
The Dongri Pstn Nirbhaya squad while patrolling found a 45-year-old lady bleeding in labour pain on the road near… pic.twitter.com/QPKqmkOhTc— पोलीस आयुक्त, बृहन्मुंबई - CP Mumbai Police (@CPMumbaiPolice) September 20, 2024
ఇది కూడా చదవండి: సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు
Comments
Please login to add a commentAdd a comment