10 రోజుల్లో సీఎం యోగి రాజీనామా చేయకుంటే.. | yogi adityanath treth call | Sakshi
Sakshi News home page

10 రోజుల్లో సీఎం యోగి రాజీనామా చేయకుంటే..

Published Sun, Nov 3 2024 10:15 AM | Last Updated on Sun, Nov 3 2024 11:06 AM

yogi adityanath treth call

ముంబై: ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ రావడం పరిపాటిగా మారింది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులకు ఒక బెదిరింపు సందేశం వచ్చింది. దానిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు.

ఈ మెసేజ్ అందుకున్న మహారాష్ట్ర పోలీసులు  అప్రమత్తం కావడంతో పాటు ఈ మెసేజ్ పంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు  ఒక నంబర్ నుండి యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయకపోతే, బాబా సిద్ధిఖీ మాదిరిగా చంపేస్తాం' అని రాసి ఉంది. ఈ సందేశం శనివారం (నవంబర్ 2) సాయంత్రం అందింది. ఈ నేపధ్యంలో భద్రతా వ్యవస్థ అప్రమత్తమయ్యింది. ముంబై పోలీసులు నిందింతుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 



ఇది కూడా చదవండి: లక్నోలో ఎన్‌కౌంటర్‌.. ఒక దుండగునికి గాయాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement