Threat Letter
-
సీఎం యోగికి బెదిరింపులు.. యువతి అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు.. బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సత్వర విచారణ జరిపి ఆ వాట్సాప్ మెసేజ్ చేసింది ఓ యువతిగా గుర్తించి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పది రోజుల్లోగా యోగి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే.. బాబాను సిద్ధిఖీని హతమార్చినట్లే చంపేస్తామని ఓ నెంబర్ నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూంకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ఈ నేరానికి పాల్పడిన యువతిని గుర్తించి, అరెస్టు చేశారు. నిందితురాలు థానేకు చెందిన ఫాతిమా ఖాన్(24)గా తేలింది. బీఎస్సీ(ఐటీ) చేసిన ఫాతిమాకు గత కొంతకాలంగా మానసిక స్థితి బాగోలేదని పోలీసులు తెలిపారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఉల్హాస్నగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నిందితురాలిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా మహారాష్ట్రలో బెదిరింపు సందేశాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ప్రాణహాని పొంచి ఉందన్న విషయం తెలిసిందే. ఈ మధ్యలోనే ఆయనకు కొన్ని బెదిరింపు సందేశాలు వచ్చాయి. మరోవైపు ఎన్సీపీ నేత బాబా సిద్ధికీ తనయుడు, బాంద్రా ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీకి కూడా చంపుతామంటూ ఆగంతకులు సందేశాలు పంపుతున్నారు. మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అయిన బాబా సిద్ధిఖీ అక్టోబర్ 12వ తేదీన తన కార్యాలయం వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యకు తామే బాధ్యులమంటూ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. అలాగే.. సిద్ధిఖీకి, సల్మాన్ ఖాన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.ఇదీ చదవండి: 2009లో ఇంటర్.. 2024లో 8వ తరగతి!! -
10 రోజుల్లో సీఎం యోగి రాజీనామా చేయకుంటే..
ముంబై: ఇటీవలి కాలంలో పలువురు ప్రముఖులకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం పరిపాటిగా మారింది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులకు ఒక బెదిరింపు సందేశం వచ్చింది. దానిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ నిందితులు బెదిరించారు.ఈ మెసేజ్ అందుకున్న మహారాష్ట్ర పోలీసులు అప్రమత్తం కావడంతో పాటు ఈ మెసేజ్ పంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు ఒక నంబర్ నుండి యోగి ఆదిత్యనాథ్ 10 రోజుల్లో రాజీనామా చేయకపోతే, బాబా సిద్ధిఖీ మాదిరిగా చంపేస్తాం' అని రాసి ఉంది. ఈ సందేశం శనివారం (నవంబర్ 2) సాయంత్రం అందింది. ఈ నేపధ్యంలో భద్రతా వ్యవస్థ అప్రమత్తమయ్యింది. ముంబై పోలీసులు నిందింతుణ్ణి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: లక్నోలో ఎన్కౌంటర్.. ఒక దుండగునికి గాయాలు -
మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా), 6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను అమలు చేశామన్నారు.విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్‌పే -
‘సల్మాన్‌ను బెదిరించి తప్పు చేశాం’.. నిందితుడు మరో మెసేజ్
ముంబై: కొద్దిరోజు క్రితం ఓ నిందితుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరింపులకు పాల్పడ్డాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముంబై పోలీసులకు మెసేజ్ చేశాడు. ఇప్పుడు ఆ నిందితుడే సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు మరో వాట్సప్ మెసేజ్ పంపించాడు. ప్రస్తుతం ఈ అంశం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది వారం రోజుల క్రితం సల్మాన్‌ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ హత్య జరిగింది. హత్యోదంతం తర్వాత అక్టోబర్ 18న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ సందేశం వచ్చింది. సిద్ధిఖీని హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సల్మాన్‌కు వైరానికి ముగింపు పలకాలని, ఇందుకోసం రూ.5కోట్లు చెల్లించాలని, లేదంటే బాబా సిద్ధిఖీకి పట్టిన గతి నీకూ పడుతుందంటూ ఓ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్‌కు హైసెక్యూరిటీ మధ్య భద్రత కల్పిస్తున్నారు. అంతేకాదు ఆ మెసేజ్ జార్ఖండ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ తరుణంలో సోమవారం, ముంబై ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. గతవారం సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడు మరో మెసేజ్ పంపించాడని, సల్మాన్ ఖాన్‌ను బెదిరించి తప్పు చేసినట్లు చెప్పాడని వెల్లడించారు. ప్రస్తుతం ఆ నిందితుడు కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. -
మరో విమానానికి బాంబు బెదిరింపు.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్
జైపూర్: విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నంబర్ IX-196కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం దుబాయ్ నుంచి జైపూర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులున్నారు. ల్యాండింగ్ తర్వాత భద్రతా బలగాలు విమానం మొత్తం గాలించగా, వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ‘విస్తారా’ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరువక ముందు తాజా ఉదంతం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని దర్యాప్లు తరువాత తేలింది. విమానయాన సంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు అందకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. Jaipur, Rajasthan | An Air India Express flight IX-196 flying from Dubai to Jaipur, with 189 passengers onboard, received a bomb threat via email. The plane landed at the Jaipur International Airport at 1:20 am. After a thorough check by the security forces, nothing suspicious…— ANI (@ANI) October 19, 2024ఇది కూడా చదవండి: US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం -
సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు చంపుతామని బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ కాస్త ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పాలి. ఇంతకీ అసలేం జరుగుతోంది?కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అని తేలింది. సల్మాన్‌కి స్నేహితుడు అయినందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు. తాజాగా సల్మాన్‌కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్‌ను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మెసేజ్‌ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. బిష్ణోయ్‌తో శతృత్వం ఆగాలన్నా, సల్మాన్ బతికుండాలన్నా ఐదు కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఈ మెసేజ్ ఎవరు పంపించారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. 1999లో కృష్ణ జింకల్ని వేటాడిన తర్వాత కొన్నాళ్ల పాటు సల్మాన్ జైలు జీవితం గడిపాడు. ఈ సంఘటనతో సల్మాన్‌పై బిష్ణోయ్ తెగకు చెందిన లారెన్స్ పగ పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.2022లోనూ బాంద్రాలోని సల్మాన్ ఇంటి దగ్గర అనుమానాస్పద రీతిలో ఉత్తరం దొరికింది. 2023లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి స్వయంగా సల్మాన్‌కే మెయిల్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు.. ఏకంగా సల్మాన్ ఫామ్ హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాబా సిద్దిఖీని చంపేయడంతో సల్మాన్‌కి పోలీసులు మరింత భద్రత పెంచారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
Bihar: సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
బీహార్‌లోని పట్నాలో గల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. ఈ నేపధ్యంలో సీఎం కార్యాలయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేశారు. కార్యాలయ ప్రాంగణంలో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.తీవ్రవాద సంస్థ అల్ ఖైదా పేరుతో సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీనిపై సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తరువాత ఏటీఎస్ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. కాగా గతంలో పట్నా విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ముమ్మర తనిఖీల తర్వాత బాంబులాంటిదేమీ లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.జూలైలో పట్నాలోని ఓ ఇంట్లో బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 35 లైవ్ కాట్రిడ్జ్‌లు, పొటాషియం నైట్రేట్ బాక్స్, ట్రీ ఫిల్ లిక్విడ్ బాక్స్ తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పవన్ మహతో అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘బీజేపీని వీడండి.. కాదంటే లేపేస్తాం’
పంజాబ్‌కు చెందిన నలుగురు నేతలకు ‘బీజేపీని వీడండి...లేదంటే ప్రపంచం నుంచి లేపేస్తాం’ అంటూ బెదిరింపు లేఖలు అందాయి. ఇవి ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.చండీగఢ్‌లోని పంజాబ్ బీజేపీ కార్యాలయానికి ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఒక బెదిరింపు లేఖ వచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంజీందర్ సింగ్ సిర్సా, బీజేపీ సిక్కు సమన్వయ కమిటీ, జాతీయ రైల్వే కమిటీ సభ్యుడు తేజిందర్ సింగ్ సరణ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి పర్మీందర్ బ్రార్‌లను చంపుతామని ఆ లేఖలో నిందితులు హెచ్చరించారు. వీరితోపాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు పేరు కూడా లేఖలో ఉంది.ఈ లేఖపై తక్షణం విచారణ జరిపించాలని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ డీజీపీ గౌరవ్ యాదవ్‌ను కోరారు. ఆ లేఖలో నిందితులు ప్రధానంగా బీజేపీ నేతలు పర్మీందర్ సింగ్ బ్రార్, తేజిందర్ శరణ్‌లను టార్గెట్ చేశారు. మీ తలలను తలపాగాలో చుట్టేశారని గతంలో తాము సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా మిమ్మల్ని హెచ్చరించామని నిందితులు ఆ లేఖలో పేర్కొన్నారు. మీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో కలిసి సిక్కులకు, పంజాబ్ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని నిందితులు ఆరోపించారు. మీరు తక్షణం బీజేపీని వీడండి. లేదంటే మేము మిమ్మల్ని ఈ లోకం నుండి దూరం చేస్తామని నిందితులు ఆ లేఖలో హెచ్చరించారు. లేఖను రాసిన గుర్తు తెలియని నిందితులు దానిలో ఖలిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు. -
Mumbai: 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు
మహారాష్ట్రలోని ముంబైలో గల బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఈ నేపధ్యంలో బీఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బీఎంసీ కార్యాలయంతో పాటు బాంబు బెదిరింపులు అందిన అన్ని ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.వీపీఎన్ నెట్వర్క్ ద్వారా ఈ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం, జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో దేశంలోని 41 విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. 'కేఎన్ఆర్’ అనే ఆన్లైన్ గ్రూప్ ఈ నకిలీ బెదిరింపు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బృందం మే ఒకటిన ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. -
అంబానీని బెదిరించింది తెలంగాణ కుర్రాడే! ఏం జరిగిందంటే..
Threat emails to Mukesh Ambani: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్‌లు పంపిన వ్యక్తిని ముంబై గాందేవి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తెలంగాణకు చెందిన 19 ఏళ్ల యువకుడు గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించిన పోలీసులు అతడిని ముంబైలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి నవంబర్ 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించినట్లు తెలిపారు. గత వారంలో ముఖేష్ అంబానీకి ఐదు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయని, కోట్ల కొద్దీ డబ్బు డిమాండ్ చేసి ఇవ్వకపోతే చంపేస్తానని నిందితుడు బెదిరించాడని పోలీసులు తెలిపారు. “ఇది కొంతమంది టీనేజర్లు చేసిన అల్లరి పనిగా తెలుస్తోంది. మా దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం ” అని ముంబై పోలీసు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ‘బిజినెస్‌మేన్’ సినిమాలో మాదిరిగా.. 2012లో వచ్చిన మహేష్‌బాబు సినిమా ‘బిజినెస్‌మేన్’ను నిందితుడు ఫాలో అయినట్టున్నాడు. అందులో హీరో ముంబైలో బడా వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు సంపాదిస్తాడు. అచ్చం అలాగే ఈ నిందితుడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని ఈమెయిల్స్ ద్వారా రూ.కోట్లు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించాడు. మా దగ్గర మంచి షూటర్లున్నారు.. గత అక్టోబరు 27న షాదాబ్ ఖాన్ అనే పేరుతో ముఖేష్ అంబానీకి మొదటి బెదింపు ఈమెయిల్ వచ్చింది. “మీరు (అంబానీ) మాకు రూ. 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా వద్ద దేశంలోనే అత్యుత్తమ షూటర్లు ఉన్నారు” అని అందులో పేర్కొన్నారు. తర్వాత మరొక ఈమెయిల్ వచ్చింది. అందులో మొదటి ఈమెయిల్ స్పందించనందుకు రూ. 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. "డిమాండ్లు నెరవేర్చకపోతే, డెత్ వారెంట్ (అంబానీకి) జారీ అవుతుంది" అని బెదిరించారు. అక్టోబర్ 31న అంబానీ అధికారిక ఈమెయిల్ ఐడీకి మూడో ఈమెయిల్ పంపించిన నిందితుడు ఈ సారి రూ.400 కోట్లు డిమాండ్ చేశాడు. నవంబర్ 1, 2 వ తేదీల్లో కూడా అలాంటి మరో రెండు ఈమెయిల్‌లు వచ్చాయి. ఈమెయిల్స్‌లోని ఐపీ అడ్రస్‌లను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని తెలంగాణకు చెందిన గణేష్ రమేష్ వనపర్ధిగా గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. -
షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల షారుక్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షారుక్ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) పఠాన్ సాంగ్ వివాదం గతంలో రిలీజైన పఠాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటకు దీపికా పదుకొణె కుంకుమపువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీకి వీఐపీ భద్రతా విభాగానికి చెందిన ఆరుగురు శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నలుగురు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని పెంచింది. గతంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కల్పించారు. బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు భద్రతను పెంచారు. కాగా.. ఇటీవలే షారుక్ నటించిన జవాన్ చిత్రం రిలీజైన బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలీవుడ్లో అత్యధికంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: 'నా ఎలిమినేషన్‌కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!) -
దక్షిణమధ్య రైల్వేకు బెదిరింపు లేఖ కలకలం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపులతో లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. ఒడిశా బాలాసోర్ తరహాలో వారం రోజుల్లో ప్రమాదం జరగబోతోందని లేఖలో సందేశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు గత వారం లేఖ రాగా.. దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులకు ఆ లేఖను దక్షిణమధ్య రైల్వే అందించినట్లు సమాచారం. ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ఈ ఘటన జరుగుతుందని లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ లేఖను వెస్ట్‌జోన్ డీసీపీ చందనా దీప్తి ధృవీకరించారు. మూడు రోజుల కిందట దక్షిణ మధ్య రైల్వే తమకు సమాచారం అందించిందని.. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై విచారణ చేపటినట్లు తెలిపారు. -
'ఆదిపురుష్' రైటర్‌కు బెదిరింపులు.. చంపేస్తామని!
'ఆదిపురుష్' మూవీ విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే.. రైటర్ మనోజ్ ముంతాషిర్ గత కొన్నిరోజుల నుంచి హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయం సినీ వర్గాలు, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? మాట మార్చడమే కారణమా? 'ఆదిపురుష్' సినిమాని రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు. అయితే ఒరిజినల్ స్టోరీతో పోల్చి చూస్తే.. ఇందులో కొన్ని సీన్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకొందరు ట్రోల్స్ చేశారు. ఈ విషయమై తాజాగా స్పందించిన రైటర్ మనోజ్.. తాము తీసింది రామాయణం కాదని, కేవలం స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పుకొచ్చారు. Mumbai Police provides security to dialogue writer of #Adipurush, Manoj Muntashir after he sought a security cover citing a threat to his life. Police say that they are investigating the matter. (File photo) pic.twitter.com/1WiWiOhclo — ANI (@ANI) June 19, 2023 (ఇదీ చదవండి: రావణుడు లుక్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!) ఫ్యాన్స్ కి మండింది! అయితే 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందు ఒకలా మాట్లాడిన రైటర్ మనోజ్.. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత మాట మార్చడం అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకు పర్వాలేదు గానీ ఓ వ్యక్తి మాత్రం చంపేస్తా అంటూ సదరు రైటర్ ఇంటికి లెటర్ పంపించాడు. దీంతో ఇతడు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్లు ఇతడికి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆ లేఖ ఎవరు పంపించారనేది దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. హద్దులు దాటుతున్న అభిమానం ఓ సినిమా నచ్చడం, నచ్చకపోవడం వ్యక్తిగత అభిప్రాయం. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం వరకు ఓకే. కానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం ఏదైనా సినిమాలో చిన్న సీన్ నచ్చకపోయినా సరే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. 'ఆదిపురుష్' రైటర్ విషయంలోనూ జరిగిందిదే అనిపిస్తోంది. ఏదేమైనా సరే ఈ సోషల్ మీడియా వల్ల విపరీత పోకడలు కనిపిస్తుండటం భయం కలిగిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) -
Kerala: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో
రెండు రోజుల కేరళ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని ఆత్మహుతి దాడి చేసి చంపేస్తామని వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ లేఖ నేపథ్యంలో..మోదీ తన రోడ్‌షోలకు విభిన్నంగా కొచ్చిలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఆయన కారుదిగి స్వయంగా కాలినడకన రోడ్ షో ప్రారంభించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా రోడ్ షో చేశారు. ఈ మేరకు ఆయన కేరళ సంప్రదాయ దుస్తులు, కసావు ముండు, శాలువా, కుర్తా ధరించి రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ భద్రత కోసం వేలాది మంది పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా మళయాళంలో కొచ్చి నివాసి రాసినట్లు వచ్చిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయం అందుకున్నారు. ఆయనే పోలీసు చీఫ్‌కు ఈ లేఖను అందజేసినట్లు చెప్పారు కూడా. ఐతే పోలీసుల నుంచి లీక్ అయిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌ని ఘోర తప్పిదమని మండిపడ్డారు. దీన్ని కేంద్ర సహాయం మంతి మురళీధరన్ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రధాని భద్రతా వివరాలు ఎలా వాట్సాప్‌లో లీక్ అయ్యి వైరల్ అయ్యిందనేది ముఖ్యమంత్రి వివరించాలన్నారు. దీని అర్థం హోం శాఖ కుదేలైందనే కదా అంటూ ఫైర్ అయ్యారు. కాగా, మోదీ కేరళ పర్యటలనో దాదాపు రూ. 3 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మోదీ కేరళలో బుధవారం తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ల ద్వారా కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 ద్వీపాలను కలిపే ఒక రకమైన ప్రాజెక్ట్ అయిన కొచ్చి వాటర్ మెట్రోను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. Thank you Kochi! pic.twitter.com/hbuY9FRivM — Narendra Modi (@narendramodi) April 24, 2023 (చదవండి: 'బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’) -
ప్రధాని పర్యటనలో ఆత్తాహుతి దాడి చేస్తాం
-
మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం
కొచ్చిన్: ఈనెల 24, 25వ తేదీల్లో కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీని సూసైడ్ బాంబర్‌తో చంపేస్తామన్న బెదిరింపులపై పోలీసులు, కేంద్ర నిఘా విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి గత వారం రాష్ట్ర బీజేపీ విభాగానికి అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ కె.సురేంద్రన్ దానిని పోలీసులకు అందజేశారు. ప్రధాని పర్యటన, బందోబస్తులో ఉండే అధికారుల వివరాలతో అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) తయారు చేసిన నివేదిక శనివారం వైరల్ అవుతోంది. అందులోనే బెదిరింపు లేఖ అంశం ఉంది. మలయాళంలో ఉన్న ఆ లేఖను కొచ్చిన్‌కు చెందిన ఎన్జే జానీ రాసినట్లుగా ఉంది. లేఖలో వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ స్పందించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన ముఖ్య విషయాలను లీక్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీరియస్ వ్యవహారమని, సీఎం విజయన్ స్పందించాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ డిమాండ్ చేశారు. అనుమానితుడిగా పేర్కొంటున్న ఎన్జే జానీ శనివారం మీడియాతో మాట్లాడారు. సదరు బెదిరింపు లేఖతో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులడిగిన అన్ని వివరాలను అందించానన్నారు. చర్చి వ్యవహారానికి సంబంధించి తనతో శత్రుత్వం ఉన్న వారే దీని వెనుక ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. -
మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు
ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్ డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్ కూడా అసలు మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ఫైర్ అయ్యారు. వాట్సాప్‌లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్ అయ్యి, వైరల్ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్ చెక్ చేశారు. ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ వెల్లడించారు. (చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్..నేడు అధికారులకు అప్పగింత) -
ఆ ప్రసారాలు ఆపండి.. కోర్టును ఆశ్రయించిన కన్నడ స్టార్ హీరో!
యశవంతపుర(బెంగళూరు): అపరిచిత వ్యక్తి రాసిన లేఖపై వస్తున్న వదంతులను పత్రికల్లో, టీవీల్లో ప్రసారం చేయరాదని కోరుతూ ప్రముఖ నటుడు సుదీప్ కోర్టు తలుపు తట్టారు. నగరంలో మెయో హాల్లోని కోర్టులో పిటిషన్ వేశారు. అపరిచిత వ్యక్తి రాసిన లేఖలోని వివరాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్‌కోర్టును కోరారు. ఇటీవల సుదీప్ సీఎం బొమ్మైను కలిసి మద్దతు ప్రకటించడం, ఆ వెంటనే నీ ప్రైవేటు వీడియోలను బయటపెడతామని రెండు బెదిరింపు లేఖలు రావడం తెలిసిందే. ప్రాణహాని బెదిరింపులతో పాటు సుదీప్ కుటుంబసభ్యుల పేర్లను అపరిచితులు లేఖలో రాశారు. వీటిపై అనేక రకాలుగా మాధ్యమాలలో వార్తలు వస్తుండగా, వాటిని నివారించాలని ఆయన లాయర్లు కోరారు. మరోవైపు సుదీప్‌కి గన్‌మాన్ రక్షణ కల్పించాలని నిర్మాత మంజు పోలీస్ కమిషనర్‌కు విన్నవించారు. -
కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియో.. అతని పనేనా?
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ వివాదం కర్ణాటక రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ఇటీవల ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే సుదీప్ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది. ‘బీజేపీలో చెరితే నీ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బహిరంగంగా ప్రజలందరి ముందు పెడతాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సుదీప్.. తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఇదంతా చేసింది సుదీప్ కారు డ్రైవరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఓ కారు డ్రైవర్ ను పనిలోనుంచి తీసేశారట సుదీప్. అతనే కక్ష్య పెంచుకొని ఈ పని చేసి ఉంటాడని సుదీప్ అండ్ టీమ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని భావిస్తున్నారు పోలీసులు. అయితే సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని సుదీప్ కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆ కారు డ్రైవర్ పరారీలో ఉండడం.. ఆ అనుమానాలకు మరితం బలం చేకూరినట్లైంది. అతని ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ఆ కారు డ్రైవర్ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. అతను దొరికితేగానీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది.