జైపూర్: విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నంబర్ IX-196కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం దుబాయ్ నుంచి జైపూర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులున్నారు. ల్యాండింగ్ తర్వాత భద్రతా బలగాలు విమానం మొత్తం గాలించగా, వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.
ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ‘విస్తారా’ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరువక ముందు తాజా ఉదంతం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని దర్యాప్లు తరువాత తేలింది. విమానయాన సంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు అందకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.
Jaipur, Rajasthan | An Air India Express flight IX-196 flying from Dubai to Jaipur, with 189 passengers onboard, received a bomb threat via email. The plane landed at the Jaipur International Airport at 1:20 am. After a thorough check by the security forces, nothing suspicious…
— ANI (@ANI) October 19, 2024
ఇది కూడా చదవండి: US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం
Comments
Please login to add a commentAdd a comment