bomb
-
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు
-
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. నిందితులు ఎవరంటే?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గత శుక్రవారం ఢిల్లీలోని పలు స్కూళ్లకి బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈ బెదిరింపు మెయిల్స్ చేసింది విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు.సాధారణంగా స్కూల్స్, కాలేజీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందు కోసం విద్యార్థులు రేయింబవళ్లు శ్రమిస్తుంటారు. కానీ వారిలో కొంత మంది విద్యార్థులు పరీక్షల ముందు రోజు బుక్ తీసి మమ అనిపిస్తుంటారు. సరిగ్గా చదవక.. స్కూల్‌కో,లేదంటే కాలేజీకి వెళ్లి పరీక్ష రాయాల్సి వస్తుందనే భయంతో ఆరోగ్యం సరిగా లేదని, ఊరెళుతున్నామని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటుంటారు.ఇదిగో ఢిల్లీలోని రోహిణి జిల్లాకు చెందిన స్కూల్ విద్యార్థులు కూడా అంతే. పరీక్ష రాయాల్సి వస్తుందని స్కూల్లో బాంబు తామే పెట్టామని బెదిరించినట్లు ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు.తాజాగా రోహిణి జిల్లాలో రెండు స్కూల్స్‌కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపు ఈ-మెయిల్స్ విచారణ చేపట్టారు. తమ విచారణలో ‘ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రెండు వేర్వేరు పాఠశాలలకు ఇ-మెయిల్స్ పంపినట్లు తేలింది’అని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులిద్దరూ స్కూల్లో పరీక్ష రాయాల్సి వస్తుందని బెయిరింపు ఇ - మెయిల్స్ పంపినట్లు వెల్లడించారు. విద్యార్థులు కావడంతో, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. #BreakingNews | #DelhiBombThreat : Major update has come in that students were behind the bomb threat that has been sent to 2 schools.@_pallavighosh | @shankar_news18 decodes#delhibombthreat #delhi #schools pic.twitter.com/FGAquLsFzV— News18 (@CNNnews18) December 22, 2024 11 రోజులుగా వందకు పైగా బాంబు బెదిరింపులుఢిల్లీ పోలీసులు గత 11 రోజులుగా 100కి పైగా పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు పంపడంపై దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఉపయోగించి ఇ-మెయిల్స్ పంపడంతో నేరస్థులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది.ఢిల్లీలో బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ సంవత్సరం మే నుండి, నగరంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలను లక్ష్యంగా చేసుకుని 50కి పైగా బాంబు బెదిరింపు ఇ-మెయిల్లు వచ్చాయి. ఈ కేసుల్లో పోలీసులు ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
బాంబు షెల్టర్లకు గిరాకీ వరల్డ్ వార్-3కి సంకేతమా?
-
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
పట్నా: ఇటీవలి కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఎక్కువైంది. అయితే ఇప్పుడు రైలులో బాంబు ఉందంటూ ఓ వార్త వచ్చింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే బీహార్‌లోని దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళుతున్న బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందంటూ ఢిల్లీ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. వెంటనే రైల్వే అధికారులు రైలును యూపీలోని గోండా స్టేషన్లో నిలిపివేసి, రైలులో అణువణువుగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను గోండా ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలు ఒక సివిల్ సివిల్ పోలీసులు నిర్వహించారు. ఇదేవిధంగా డాగ్ స్క్వాడ్‌తో సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో బాంబు బెదిరింపు కేవలం వదంతేనని తేలింది. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలును గొండా స్టేషన్లో శుక్రవారం రాత్రి 7:32 గంటలకు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబు లేదని తేలడంతో, రాత్రి 9:45 గంటలకు రైలు ముందుకు కదిలేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ వదంతు వచ్చిన ఫోన్ నంబర్‌కు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేశ్ కుమార్ సింగ్ -
19 ఏళ్ల క్రితం దీపావళి ఆనందాలను చిదిమేసిన బాంబు పేలుళ్లు
న్యూఢిల్లీ: ఈరోజు (అక్టోబరు 29) దేశ చరిత్రలో ఒక విషాద సంఘటన నమోదైంది. 19 ఏళ్ల క్రితం ఇదేరోజున ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లు దీపావళి ఆనందాన్ని హరింపజేశాయి. అక్టోబర్ సాధారణంగా ఢిల్లీలో పండుగల సీజన్. మొదట రామలీల ప్రదర్శనలు తరువాత దసరా కోలాహలం ఇది ముగిసిన వెంటనే ధన్తేరస్ షాపింగ్, దీపావళి, చివరిగా గోవర్ధన పూజ, భయ్యా దూజ్... ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఈ నేపధ్యంలో మార్కెట్లలో కొనుగోలుదారుల సందడి నెలకొంటుంది.2005 అక్టోబరు 29న ధన్‌తేరాస్ నాడు ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే మార్కెట్లలో జరిగిన ఈ పేలుళ్లలో 60 మంది మరణించగా, 200 మందికి పైగా జనం గాయపడ్డారు. నాడు ఢిల్లీలోని సరోజినీ నగర్, పహర్‌గంజ్, కల్కాజీ ప్రాంతాల్లోని మూడు చోట్ల డీటీసీ బస్సుల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో చాలా మంది అయినవారిని కోల్పోయారు. నేటికీ సరోజినీ నగర్ మార్కెట్లోని దుకాణదారుల నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుని భయపడుతుంటారు.30 ఏళ్లుగా సరోజినీ నగర్ మార్కెట్లో దీపావళి వస్తువులు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడు నాటి రోజును గుర్తు చేసుకుంటూ మీడియాతో మాట్లాడారు. నేటికీ నాటి భయానక దృశ్యం కళ్ల ముందు మెదులుతోందని, ఆరోజు ధన్తేరస్ రోజు కావడంతో మార్కెట్ అంతా కొనుగోలుదారులతో నిండివుందన్నారు. పేలుడు సంభవించినప్పుడు తాను ఘటనా స్థలానికి సమీపంలోని తన కొవ్వొత్తుల దుకాణంలో ఉన్నానని, అకస్మాత్తుగా భారీ పేలుగు శబ్ధం వచ్చి, అంతటా చీకటి అలుముకుందన్నారు. తొలుత తాను దుకాణంలో అమర్చిన బల్బు పేలివుంటుందని భావించానని తెలిపారు. అయితే ఆ పేలుడులో తన తలకు బలమైన గాయమైందని, స్పృహలోకి వచ్చేసరికి అక్కడ కుప్పలుగా పడి ఉన్న మృతదేహాలను చూసి భయపడ్డానన్నారు. బాంబు పేలుడు సంభవించిన దుకాణం యజమాని మృతదేహం రెండు భాగాలుగా విడిపోయి కనిపించిందన్నారు. నాటి ఘటనతో పలువురు సజీవదహనమయ్యారని అతను ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
తిరుపతిలో బాంబు బెదిరింపుల టెన్షన్
-
బాంబు బెదిరింపులతో హడల్
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల్లో 400 బెదిరింపులువిమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపుబాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మరో విమానానికి బాంబు బెదిరింపువిశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులుతనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణసాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
-
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు విమానయాన సంస్థల విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం రాత్రి ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన 30 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.ఇండిగో ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన నాలుగు విమానాలకు సోమవారం భద్రతా హెచ్చరికలు అందాయని తెలిపారు. ఈ జాబితాలో 6ఈ 164 (మంగుళూరు నుండి ముంబై), 6ఈ 75 (అహ్మదాబాద్ నుండి జెడ్డా), 6ఈ 67 (హైదరాబాద్ నుండి జెడ్డా), 6ఈ 118 (లక్నో నుండి పూణే) ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.ఇదేవిధంగా ఎయిర్ ఇండియా విమానాలకు కూడా బెదిరింపులు వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. నిర్దేశించిన ప్రోటోకాల్‌ను అనుసరించి, సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారని, భద్రతా సంస్థల మార్గదర్శకాల ప్రకారం అన్ని భద్రతా విధానాలను అమలు చేశామన్నారు.విస్తారా ప్రతినిధి మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన కొన్ని విమానాలకు సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తమయ్యారని, అన్ని భద్రతా విధానాలను అమలు చేశారన్నారు.గడచిన వారం రోజుల్లో 120కి పైగా భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే బాంబు బెదిరింపులను కేవలం వదంతులుగా తేలికగా తీసుకోలేమని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కాగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చట్టబద్ధమైన చర్యలకు ఉపక్రమిస్తోంది. నేరస్తులను నో-ఫ్లై జాబితాలో ఉంచే యోచనలో ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: ఉద్యోగుల తొలగింపు అవాస్తవం: ఫోన్‌పే -
విమానాలకు బాంబు బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నాం
-
మరో విమానానికి బాంబు బెదిరింపు.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్
జైపూర్: విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నంబర్ IX-196కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం దుబాయ్ నుంచి జైపూర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులున్నారు. ల్యాండింగ్ తర్వాత భద్రతా బలగాలు విమానం మొత్తం గాలించగా, వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ‘విస్తారా’ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరువక ముందు తాజా ఉదంతం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని దర్యాప్లు తరువాత తేలింది. విమానయాన సంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు అందకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. Jaipur, Rajasthan | An Air India Express flight IX-196 flying from Dubai to Jaipur, with 189 passengers onboard, received a bomb threat via email. The plane landed at the Jaipur International Airport at 1:20 am. After a thorough check by the security forces, nothing suspicious…— ANI (@ANI) October 19, 2024ఇది కూడా చదవండి: US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం -
మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మరోమారు హింస చెలరేగింది. కుకీ-జో కమ్యూనిటీ కోరుతున్న ప్రత్యేక పరిపాలన డిమాండ్‌ను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తిరస్కరించడంతో మరోమారు హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి నేపధ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిలిటెంట్లు.. కోట్రుక్, పొరుగున ఉన్న కదంగ్‌బండ్‌లోని లోయ దిగువ ప్రాంతాలలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతోపాటు, బాంబు దాడులు చేశారు. కదంగ్‌బండ్ ప్రాంతంలోని ఒక ఇంటిపై డ్రోన్ నుంచి బాంబు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, తొమ్మదిమంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పలు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర, కేంద్ర విభాగాలతోపాటు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొట్రుక్ గ్రామస్తులపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. వారిని భయభ్రాంతులకు గురిచేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మణిపూర్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. -
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడి.. ఏడుగురి మృతి
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా సైన్యం శుక్రవారం ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ నగరంలోని అపార్టుమెంట్లు, ఆటస్థలాల్లో వైమానికి దాడులతో విరుచుకుపడింది. రష్యా బాంబుల దాడిలో ఎడుగురు మృతి చెందగా.. సుమారు 77 మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. బాంబు దాడిలో 12 అంతస్థుల అపార్టుమెంట్లో భారీగా మంటలు చెలరేగాయని ఖర్కీవ్ నగర మేయర్ వెల్లడించారు. అపార్టమెంట్ శిథిలాల నుంచి ఓ మహిళ మృతదేహాన్ని బయటకు తీశామని.. మృత సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఉక్రెయిన్- రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా సైన్యం ఖర్కీవ్ నగరమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పటికే పలుసార్లు ధ్వంసం అయింది. అయితే ఇటీవల కాలంలో ఖర్కీవ్‌పై రష్యా దాడులు తగ్గినప్పటికీ.. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రేయిన్ సైన్యం చొచ్చుకుపోవటంతో ప్రతీకారంగా బాంబులు వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
Pakistan: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి
పాకిస్తాన్లో నిత్యం ఏదో ఒక అలజడి చోటుచేసుకున్నదనే వార్లలను వింటుంటాం. తాజాగా పాక్‌లోని బలూచిస్థాన్ బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు పోలీసులతో సహా 16 మంది గాయపడ్డారు.పిషిన్ జిల్లాలోని సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్లో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఇటీవల బలూచిస్థాన్‌లోని పోలీసు స్టేషన్లపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. యాంటీ టెర్రరిజం డిపార్ట్మెంట్, బాంబ్ స్క్వాడ్ విచారణ జరిపి కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సీలు చేశారు.తాజా ఘటనలో గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిని ఖండించారు. చిన్నారులు, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
Rajasthan: రెండు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్.. తనిఖీలు ముమ్మరం
రాజస్థాన్‌లోని జైపూర్లోగల రెండు ప్రముఖ ఆస్పత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ఆస్పత్రులకు చేరుకున్నారు. బాంబ్ స్క్యాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. రోగులను ఆస్పత్రి నుంచి బయటకు తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జైపూర్‌లోని సీకే బిర్లా, మోనిలెక్ ఆసుపత్రులలో బాంబులు ఉన్నాయనే సమాచారం అందుకోగాగానే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ఆస్పత్రులలో పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు ఉన్నారు. దీంతో పోలీసులు రోగులను బయటకు తరలించారు. వైద్యులు బయటనే రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌గా మారింది.ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తనిఖీల అనంతరం అవి ఫేక్ అని తేలుతోంది. అయితే ఇలాంటి వదంతుల వలన సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. जयपुर के सीके बिरला और मोनीलेक हॉस्पिटल में बम की सूचना पर बड़ी संख्या में पहुंची पुलिस. बम स्क्वायड वहां मरीजो को बाहर निकाल कर रहा है जांच @BhajanlalBjp @abplive pic.twitter.com/swl1p0s6Id— Santosh kumar Pandey (@PandeyKumar313) August 18, 2024 -
‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు
కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్‌కుమార్(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్ వద్ద తన బ్యాగ్ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్‌పోర్టు ఎక్స్‌రే బ్యాగేజ్ స్కాన్ పాయింట్ వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. మనోజ్‌కుమార్ క్యాబిన్ బ్యాగులతో పాటు చెకిన్ బ్యాగేజీని బాంబు డిటెక్షన్ మెషిన్‌తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్‌కుమార్‌ను పోలీసులకు అప్పగించారు. మనోజ్‌కుమార్ ఎయిర్ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. -
Mumbai: 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపు
మహారాష్ట్రలోని ముంబైలో గల బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయంతోపాటు నగరంలోని 50 ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. ఈ నేపధ్యంలో బీఎంసీ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే బీఎంసీ కార్యాలయంతో పాటు బాంబు బెదిరింపులు అందిన అన్ని ఆసుపత్రులలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యం కాలేదు.వీపీఎన్ నెట్వర్క్ ద్వారా ఈ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు ముంబై పోలీసులు ధృవీకరించారు. బెదిరింపులకు పాల్పడిన వారు ఎవరనేది ఇంకా తెలియలేదని పోలీసులు పేర్కొన్నారు. ముంబైలోని బీఎంసీ ప్రధాన కార్యాలయం, జస్లోక్ హాస్పిటల్, రహేజా హాస్పిటల్, సెవెన్ హిల్స్ హాస్పిటల్, కోహినూర్ హాస్పిటల్, కేఈఎం హాస్పిటల్, జేజే హాస్పిటల్, సెయింట్ జార్జ్ హాస్పిటల్ సహా 50కి పైగా ఆస్పత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. గతంలో దేశంలోని 41 విమానాశ్రయాలకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. 'కేఎన్ఆర్’ అనే ఆన్లైన్ గ్రూప్ ఈ నకిలీ బెదిరింపు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ బృందం మే ఒకటిన ఢిల్లీలోని వివిధ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. -
ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్
-
ప్రజాభవన్‌లో బాంబు కలకలం
పంజగుట్ట: ‘‘ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు పెట్టాం.. మరో కొద్దిసేపట్లో అది పేలబోతుంది..’’ అంటూ ఒక అగంతకుడు పోలీస్ కంట్రోల్‌రూం డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు నాలుగు గంటలపాటు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ మొత్తం తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 12:06 నిమిషాలకు పోలీస్ కంట్రోల్‌రూం 100కు ఓ అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్‌లోని మల్లు భట్టి విక్రమార్క ఇంటివద్ద బాబు పెట్టామని ఫోన్ చేశాడు. కంట్రోల్‌రూం సిబ్బంది 12:15కు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్, సిటీ సెక్యురిటీ వింగ్ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన నాలుగు డాగ్ స్క్వాడ్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలో అణువణువూ తనిఖీ చేశారు.ఇకపై అక్కడ భారీ బందోబస్తు..: భట్టి ఇంటితోపాటు మంత్రి సీతక్క ఇంటిని, పరిసర ప్రాంతాలనూ చెక్ చేశారు. తరువాత ప్రజాభవన్ లోపల, పక్కనే ఉన్న మరోభవనం, అమ్మవారి ఆలయం సహా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 4 గంటలకు పైగా తనిఖీలు చేసి ఎక్కడా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. సందర్శకులను క్షుణంగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. కాగా, ప్రజాభవన్‌లో బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రజా భవన్ కు బాంబు బెదిరింపు
-
కేంద్ర హోం శాఖకు బాంబు బెదిరింపు.. నార్త్ బ్లాక్ హై అలర్ట్
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కొలువు దీరిన నార్త్ బ్లాక్ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోం శాఖకు బుధవారం(మే22) బాంబు బెదిరింపుల మెయిల్ అందినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ వెల్లడించింది. బాంబు బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు ఫైర్ ఇంజిన్లను నార్త్‌బ్లాక్ వద్దకు తరలించారు. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు, ఎయిర్‌పోర్టులకు ఫేక్ బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. -
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని పాండువా ప్రాంతంలో ఈ రోజు (సోమవారం) బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మీడియా కథనాల ప్రకారం కొంతమంది చిన్నారులు బంతిగా భావించి ఒక బాంబుతో ఆడుతుండగా, అది హఠాత్తుగా పేలింది. గాయపడిన వారిలో ఒకరు కుడి చేయి కోల్పోయినట్లు సమాచారం. కాగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇదే ప్రాంతంలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సివుందిఈ పేలుడులో గాయపడిన ఇద్దరు చిన్నారులను రూపమ్ వల్లభ్, సౌరభ్ చౌదరిగా గుర్తించారు. చిన్నారుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతం బాధితులు చుంచుర ఇమాంబర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం 8:30 గంటల సమయంలో తిన్నా ప్రాంతంలోని చెరువు దగ్గర పెద్ద పేలుడు శబ్ధం వినిపించింది. దీంతో సమీపంలోని వారు చెరువు గట్టు వద్దకు పరుగులు తీయగా, ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన స్థితిలో వారికి కనిపించారు. ఈ ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు.ఈ ఘటనపై హుగ్లీ రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతా లోపంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక నేత అభిషేక్ బెనర్జీ సమావేశం జరగాల్సిన స్థలంలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. -
TN: తమిళనాడులో స్కూళ్లకు బాంబు బెదిరింపు
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్, కాంచీపురంలలో సోమవారం( మార్చ్ 4) బాంబు కలకలం రేగింది. రెండు నగరాల్లోని అగ్రశ్రేణి స్కూళ్లకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూళ్లలోని విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. వీటిలో ఆదివారం రాత్రి ఒక మెయిల్ రాగా సోమవారం ఉదయం మరో బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు బాంబు స్క్వాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులు వచ్చిన రెండు స్కూళ్లలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. స్కూళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. కాగా, మార్చ్ 1వ తేదీ బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి.. అశ్లీల వీడియో వైరల్.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు -
ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పిన్ బాంబు లభ్యం
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో గల రాష్ట్రీయ స్వయం సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయంలో శనివారం రాత్రి పిన్ బాంబు కనిపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ బాంబు చూసేందుకు గ్రెనేడ్ బాంబును పోలివుంది. రాత్రి 12 గంటల సమయంలో వాలంటీర్ రామ్ మోహన్ అందించిన సమాచారం మేరకు ఎస్పీ అసిత్ యాదవ్ తన బృందంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు బాంబును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసే స్థలంలో వాలంటీర్ రామ్మోహన్ ఈ బాంబును గుర్తించారు. అక్కడున్న పిల్లలు ఆ బాంబును రామ్ మోహన్‌కు చూపించారు. వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుషా, ఎస్పీ అసిత్ యాదవ్, టీఐ కొత్వాలి ప్రవీణ్ చౌహాన్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు బాంబును తమ వెంట తీసుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాంబు చాలా ఏళ్ల క్రితం నాటిది. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ఫైరింగ్ రేంజ్ ఏరియా ఉండేది. అప్పట్లో ఈ బాంబు మట్టిలో పడి ఉండొచ్చని పేర్కొన్నారు. కాగా ఈ విషయంపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.