యుద్ధం మొదలై నాలుగు వారాలైనప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులతో ఉక్రెయిన్‌ని అల్లాడిస్తోంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ నగరంతో పాటు పలు నగరాలపై విధ్వంసం సృష్టిస్తోంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న నగరం పేరు మరియుపోల్. ఇక్కడి ప్రాంతాలు, ఫ్యాక్టరీలపై రష్యా బలగాలు నిర్విరామంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎలాగైనా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యాసేనలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిక్కులా చ్టుటుముట్టి అదుపులోకి లక్ష్యంగా రష్యన్ బలగాలు పని చేస్తున్నాయి. తాజాగా రెండు శక్తివంతమైన ‘సూపర్’ బాంబులను మరియుపోల్ నగరంపై రష్యా ప్రయెగించింది.
ఉక్రేనియన్ అధికారులు అదుపులో ఉన్న దక్షిణ ఓడరేవు నగరం మరియుపోల్ నుంచి పౌరులను రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఆ నగరంలో చిక్కుకుపోయారని, దాడి అనంతరం మృతదేహాలతో, ధ్వంసమైన భవనాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందని స్థానిక హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. అత్యాధునిక మిస్సైళ్ల దాడితో రష్యా దళాలు రాజధాని కీవ్‌పై తమ పట్టును కొనసాగిస్తున్నందున బుధవారం ఉదయం వరకు ఆ నగరం కర్ఫ్యూ నీడలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment