missiles
-
గర్వించేలా గణతంత్రం
న్యూఢిల్లీ: భారత సైనిక శక్తిని, ఆయుధ పాటవాన్ని, సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. అత్యాధునిక క్షిపణులు, యుద్ధ విమానాల ప్రదర్శన, జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. ‘సశక్త్ ఔర్ సురక్షిత్’ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆదివారం జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, ప్రముఖుల పాల్గొన్నారు. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో కలిసి రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు. త్రివిధ దళాల సైనికులు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ ప్రారంభమైంది. మొదట లెఫ్టినెంట్ అహన్‌కుమార్ నేతృత్వంలో 61 కావల్రీ సైనిక బృందం ముందుకు సాగింది. జాట్ రెజిమెంట్, గర్వాల్ రైఫిల్స్, మహర్ రెజిమెంట్, జమ్మూకశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ వంటి దళాల కవాతు ఆకట్టుకుంది. దేశాభివృద్ధిని, ప్రజల సంక్షేమం, సాధికారతను కళ్లకు కడుతూ పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ థీమ్‌తో 31 శకటాలను ప్రదర్శించారు. వైమానిక దళానికి చెందిన 40 యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను అలరించాయి. 10 వేల మంది ప్రత్యేక అతిథులు రిపబ్లిక్ డే పరేడ్‌కు ప్రముఖులు సహా 10 వేల మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. వీరిలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, విపత్తు సహాయక చర్యల సిబ్బంది, ఆశా వర్కర్లు, పారా ఒలింపిక్ అథ్లెట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కృషి సఖీలు, ఉద్యోగ్ సఖీలు తదితరులు ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, రోడ్డు నిర్మాణ కార్మికులు, పేటెంట్ హోల్డర్లు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరంతా జాతీయ యుద్ధ స్మారకం, పీఎం సంగ్రహాలయ్ తదితర కట్టడాలను సైతం సందర్శించారు. నాలో ఇండియన్ డీఎన్ఏ సుబియాంటో సరదా వ్యాఖ్యలు ఆహ్లాదంగా ‘ఎట్ హోమ్’గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి నిలయంలో ఆదివారం రాత్రి ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండొనేసియా అధ్యక్షుడు సుబియాంటో గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విందు ఆసాంతం సరదా సరదాగా సాగింది. తనకు భారతీయ మూలాలున్నాయని ఈ సందర్భంగా సుబియాంటో చెప్పారు. ‘‘కొన్ని వారాల క్రితమే జెనెటిక్ సీక్వెన్సింగ్, డీఎన్ఏ పరీక్షలు చేయించుకున్నా. నాలో ఇండియన్ డీఎన్ఏ ఉన్నట్లు తేలింది. భారతీయ సంగీతం విన్నప్పుడల్లా నేను డ్యాన్స్ చేస్తానని అందరికీ తెలుసు. నాలోని ఇండియన్ జీన్స్‌లోనే భారతీయ సంగీతం, నృత్యం దాగున్నాయి’’ అని సుబియాంటో చెప్పడంతో అతిథులంతా హాయిగా నవ్వేశారు. తమ భాషలో చాలా భాగం సంస్కృతం నుంచే వచ్చిందిన సుబియాంటో ఈ సందర్భంగా అన్నారు. తమ దేశంలో పేర్లు చాలావరకు సంస్కృతంలోనే ఉంటాయని చెప్పారు. తమరోజువారీ జీవితాల్లో భారతీయ ప్రాచీన నాగరికత ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించారు. భారత్, ఇండొనేసియా మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని ఆయన గుర్తు చేశారు. మోదీ తలపాగా గణతంత్ర వేడుకల్లో ప్రధాని మోదీ ఎరుపు, పసుపు రంగు గీతలతో కూడిన తలపాగా ‘సఫా’ను ధరించారు. దాంతోపాటు తెల్లరంగు కుర్తా–పైజామా, దానిపై ఊదారంగు బంద్గలా జాకెట్ ధరించారు. మోదీ ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర వేడుకల్లో రంగురంగుల తలపాగాలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది గణతంత్ర ఉత్సవాల్లో ఆయన బహుళ రంగులతో కూడిన బాంధానీ ప్రింట్ సఫా ధరించారు. గూగుల్ డూడుల్ 76వ గణతంత్ర వేడుకల సందర్భంగా గూగుల్ ఆదివారం తీసుకొచ్చిన ప్రత్యేక డూడుల్ అందరినీ ఆకట్టుకుంది. లద్దాఖీ దుస్తులు ధరించిన మంచు చిరుత, ధోతీ–కుర్తా ధరించిన పులి వంటి జంతువులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వాయిద్యాలను ఇవి వాయిస్తున్నట్లుగా ఈ డూడుల్‌ను రూపొందించారు. ఇది జంతువుల పరేడ్‌లా ఉందని చెప్పొచ్చు. అంతర్లీనంగా గూగుల్ అనే అక్షరాలు పొందుపర్చారు. విదేశాల్లోనూ ఉప్పొంగిన దేశభక్తి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశా ల్లోనూ భారత గణతంత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులతోపాటు స్థానికులు వాటి లో ఉత్సాహంగా పా ల్గొన్నారు. భారతీ యులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. భార తీయ నృత్యాలను ప్రదర్శించారు. నేపాల్, ఆ్రస్టేలియా, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇజ్రాయెల్, జపాన్, ఇండొనేసియా, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో రిపబ్లిక్ డే నిర్వహించారు. భారత రాయబార కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేశారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. హైలైట్స్ → రాజ్యాంగానికి 75 ఏళ్లయిన సందర్భంగా వేడుకలు మరింత వైభవంగా జరిగాయి.→ గణతంత్ర వేడుకల్లో ఇండొనేసియా అధ్యక్షుడు పాల్గొనడం ఇది నాలుగోసారి. ఆ దేశ సైనిక బృందం కూడా పాలుపంచుకుంది.→ పరేడ్‌లో పరమ్‌వీర్ చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, అశోక చక్ర అవార్డు గ్రహీత లెఫ్టినెంట్ కల్నల్ జస్రామ్ సింగ్ పాల్గొన్నారు.కర్తవ్య పథ్‌పై... మోదీ స్వచ్ఛభారత్ కర్తవ్యపథ్‌పై ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ చేసి చూపించారు. ఆదివారం జరిగిన గణతంత్ర వేడుకలు ఇందుకు వేదికయ్యాయి. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌ను స్వాగతించేందుకు వెళ్తుండగా దారిలో చెత్త కన్పించింది. దాంతో వేడుకల్లో పాల్గొన్న వేలాదిమంది చూస్తుండగా ఆయన కిందకు వంగి దాన్ని ఏరారు. డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందిగా సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మోదీ చర్యను నెటిజన్లంతా ప్రశంసిస్తున్నారు. సాయుధ శక్తిదేశీయంగా అభివృద్ధి చేసిన షార్ట్–రేంజ్ టాక్టికల్ మిస్సైల్ ‘ప్రళయ్’, టీ–90 భీష్మా యుద్ధ ట్యాంక్, నాగ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిస్సైల్, పినాక మల్టీ–లాంచర్ రాకెట్ సిస్టమ్, అగ్నిబన్ మల్టీ–బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ వంటి వాటిని ప్రదర్శించారు. బజరంగ్ లైట్ స్పెషలిస్టు వాహనం, ఐరావత్ మోర్టర్ సిస్టమ్, నందిఘోష్, త్రిపురాంతక్ వాహనాలు సైతం దర్శనిమిచ్చాయి. -
విమానాల పైనుంచి దూసుకెళ్లిన మిసైల్స్..ఏం జరిగిందంటే..
వాషింగ్టన్:ఇజ్రాయెల్‌పై ఈ ఏడాది అక్టోబర్‌లో ఇరాన్ జరిపిన మిసైళ్ల దాడికి సంబంధించి సంచలన విషయం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ప్యాసింజర్ విమానాలకు ముప్పుగా మారిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇరాన్ ప్రయోగించిన దాదాపు 200 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయాణికులతో నిండిన విమానాలపై నుంచి నిప్పులు చిమ్ముకుంటూ ఎగురుతూ వెళ్లినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది.ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ దిశగా దూసుకు వెళ్లిన మార్గంలో అదే సమయంలో సుమారు డజను ప్యాసింజర్ విమానాలు ఎగురుతున్నట్లు కథనంలో పేర్కొన్నారు. విమానాల్లోని ప్రయాణికులు, పైలట్లు తమపై నుంచి నిప్పులు చిమ్ముతూ వెళుతున్న ఇరాన్ మిసైల్స్‌ను చూసినట్లు కథనంలో రాసుకొచ్చారు. సాధారణంగా బాలిస్టిక్ మిసైల్స్ ప్యాసింజర్ విమానాల కంటే ఎత్తులో ఎగురుతాయి.అయితే ప్యాసింజర్ విమానాలు తమ అవసరాల మేరకు పైకి కిందికి వెళ్లేటపుడు మిసైల్స్ ప్రమాదకరంగా మారతాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసే సమయంలో పౌర విమానాలకు ఇరాన్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకపోవడం గమనార్హం. అక్టోబర్ మొదటి వారంలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగించింది.ఈ దాడులను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ కూడా పూర్తిగా అడ్డుకోలేకపోయింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు కొంతమేర దెబ్బతిన్నాయి. -
రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్‌కు అందజేసిన లాంగ్రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్‌పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యాఅమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్‌పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు. -
ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తూ వస్తోంది.కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకువచ్చిన డ్రోన్లను రష్యా వినియోగించినట్లు సమాచారం. కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నారని, వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకుల్లోనే ఉండాలని ఉక్రెయిన్ అధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది.మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేవారు. ఈ యుద్ధాన్నిశాంతింపజేయడంపై దృష్టి పెడతామని ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం -
వారి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మిసైల్స్ కావాలి: ఉక్రెయిన్
కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సైనిక దాడులను ఎదుర్కొవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భావిస్తున్నారు. అందులో భాగంగానే రష్యాపై క్షిపణులను ప్రయోగించేందుకు తమ మిత్రదేశాల నుంచి అనుమతి అవసరమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు.‘‘రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతి స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. మేం రష్యా దాడులకు నివారణగా కచ్చితంగా ప్రతిదాడిచేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయటం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం ఉంది. మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తాం’’అని వెల్లడించారు.చదవండి: ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు -
ఇజ్రాయెల్ మిలిటరీ కంపెనీపై హెజ్బొల్లా మిసైల్స్ దాడి
ఇజ్రాయెల్, లెబనాన్ హెజ్బొల్లా గ్రూప్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ టెల్ అవీవ్ శివార్లలోని తా అని పిలువబడే ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌పై హెజ్బొల్లా క్షిపణులతో విరుచుకుపడింది.తాము చేసిన దాడుల్లో మిసైల్స్ ఖచ్చితమైన లక్ష్యాలను చేరుకొన్నాయి. ఈ మేరకు బుధావారం రాత్రి హెజ్బొల్లా ఓ ప్రకటన విడుదల చేసింది. లెబనాన్ నుంచి సెంట్రల్ ఇజ్రాయెల్ వైపు నాలుగు మిసైల్స్‌ను హెజ్బొల్లా ప్రయోగించిందని వాటిలో రెండింటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది. మరో రెండు నివాసస్థలాలు లేని ప్రాంతాల్లో పడిపోయాయని పేర్కొంది. ఈ మిసైల్స్ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.#BRAKING Hezbollah claims to have launched rockets at the suburbs of Tel Aviv.The Glilot military industry company in the suburbs of Tel Aviv was hit by a high-quality rocket salvo, which hit the target precisely, Hezbollah announced, as reported by Al Jazeera.The opposing… pic.twitter.com/IqH4WYR8pB— Sujon Ahmed (@SAexploring) October 23, 2024 మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాన్ టీవీ న్యూస్.. వెస్ట్ బ్యాంక్‌లోని కల్కిలియా నగరం సమీపంలో ఒక మిసైల్ పడిపోయిందని ప్రసారం చేసింది. ఆ మిసైల్ దాడికి ఒక వ్యక్తికి స్వల్పంగా గాయాలు కాగా, ఒక కారు దెబ్బతిందని పేర్కొంది.ఇక.. సెప్టెంబర్ 23 నుంచి ఇజ్రాయెల్ సైన్యం హెజ్బొల్లాను అంతం చేయటమే టార్గెట్‌గా లెబనాన్‌పై తీవ్రమైన వైమానిక దాడులను ప్రారంభించింది. అక్టోబరు నెల ప్రారంభంలో.. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనీస్ సరిహద్దుకు సమీపంలో ఒక గ్రౌండ్ ఆపరేషన్‌ను కూడా ప్రారంభించింది. హెజ్బొల్లా ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను బలహీనపరచటమే లక్ష్యంగా దాడులు చేస్తోంది.చదవండి: ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు -
అటు డోమ్..ఇటు ఫతాహ్!
ప్రాచీన మత సంబంధ కట్టడాల్లోకి పాలస్తీనియన్లను అనుమతించకపోవడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం లెబనాన్ మీదుగా ఇప్పుడు ఇరాన్‌ను తాకింది. హమాస్, లెబనాన్ కంటే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు ప్రధాన యుద్ధక్షేత్ర పోటీదారుగా నిలిచింది. ఫతాహ్–2 హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించి ఇరాన్.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల సమర్థతను ప్రశ్నార్థకం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల సైనికసత్తాపై మరోమారు చర్చ మొదలైంది. అనూహ్యంగా దూసుకొచ్చే శత్రు క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేసే గగనతల రక్షణ వ్యవస్థలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. అలాంటి వ్యవస్థలనూ ఇరాన్‌కు చెందిన ఫతాహ్ క్షిపణులు చేధించుకుని రావడం రక్షణ రంగ నిపుణులనూ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మొహరించిన భిన్న శ్రేణుల గగనతల రక్షణ వ్యవస్థలుసహా ఇరుదేశాల సైనికపాటవంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సైనిక బలగాల్లో ఇరాన్ పైచేయి ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ సైనికబలం పెద్దది. ఇరాన్లో 3,50,000 మంది ఆర్మీ, 1,90,000 ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, 18వేల మంది నేవీ, 37 వేల మంది వాయుసేన, 15వేల మంది ఎయిర్‌డిఫెన్స్ సైనికులున్నారు. మరో 3,50,000 మంది రిజర్వ్ బలగాలున్నారు. ఇజ్రాయెల్‌లో కేవలం 1,26,000 మంది ఆర్మీ, 9,500 మంది నేవీ, 34,000 మంది ఎయిర్‌ఫోర్స్, 4,65,000 మంది రిజర్వ్బలగాలున్నాయి. రక్షణ బడ్జెట్లో ఇజ్రాయెల్ ముందంజ ఇరాన్ 2023 ఏడాదిలో రక్షణ కోసం 10.3 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తే ఇజ్రాయెల్ గత ఏడాది ఏకంగా 27.5 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. 2022తో పోలిస్తే ఈ బడ్జెట్ 24% అధికం కావడం విశేషం.పదాతిదళంలో ఇరాన్ మేటి 10,513 యుద్ధట్యాంకులు, 6798 శతఘ్నులు, 640 ఆయుధాల రవాణా వాహనాలు, 55 సైనిక హెలికాప్టర్లు ఇరాన్ సొంతం. ఇజ్రాయెల్ వద్ద 400 యుద్ధట్యాంకులు, 530 శతఘ్నులు, 1,190 ఆయుధాల రవాణా వాహనాలున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో ఇజ్రాయెల్ హవా ఇజ్రాయెల్ వద్ద అమెరికా తయారీ అత్యాధునిక ఎఫ్రకం జెట్ యుద్ధవిమానాలున్నాయి. మొత్తంగా 345 యుద్ధవిమానాలున్నాయి. 43 ఆర్మీ హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద 312 యుద్ధవిమానాలు, 23 ఆర్మీ విమానాలు, 57 హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద అధిక జలాంతర్గాములు ఇరాన్ వద్ద 17 జలాంతర్గాములు, 69 గస్తీ, నిఘా నౌకలు, 7 యుద్ధనౌకలు, 23 విమానవాహక నౌకలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద కేవలం ఐదు జలాంతర్గాములు, 49 గస్తీ/యుద్ధ నౌకలున్నాయి. విభిన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌లో మొత్తంగా 10 ఐరన్‌డోమ్ వ్యవస్థలున్నాయి. ఇవిగాక డేవిడ్స్ స్లింగ్, ఆరో సిస్టమ్స్ మొహరించాయి. ఇరాన్ వద్ద ‘పరారుణ’గుర్తింపు వ్యవస్థ ఉంది. వీటి సాయంతో ఎస్–200, ఎస్–300, దేశీయ 373 క్షిపణి వ్యవస్థలను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూలుస్తుంది. ఇదిగాక ఎంఐఎం–23 హాక్, హెచ్‌క్యూ–2జే, కోర్డాడ్–15, చైనా తయారీ సీహెచ్–ఎస్ఏ–4, 9కే331 టోర్ ఎం1 క్షిపణులున్నాయి. అణ్వాయుధాలుఇజ్రాయెల్ వద్ద దాదాపు 90 దాకా అణ్వా్రస్తాలున్నాయి. అయితే ఇరాన్ వద్ద అణ్వయుధాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలీదు. కానీ అణ్వాయుధాల్లోని వార్‌హెడ్‌లో వాడే యురేనియంను మిలటరీ గ్రేడ్‌కు తెచ్చేందుకు ఆ మూలకం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వేగవంతంచేసింది. బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద తాండార్ 69, ఖొరమ్షహర్, సెఝిల్ బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇజ్రాయెల్ వద్ద లోరా, జెరికో పేర్లతో 150 కి.మీ.ల నుంచి 6,500 కి.మీ.లు దూసుకుపోయే విభిన్న బాలిస్టిక్ క్షిపణులున్నాయి.ఐరన్ డోమ్ (స్వల్పశ్రేణి)పరిధి4 నుంచి 70 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన క్షిపణులను ఈ వ్యవస్థ కూల్చేస్తుంది. స్వల్పదూర రాకెట్లు, బాంబులను తమిర్ క్షిపణులుఅడ్డుకుంటాయి. ఏమేం ఉంటాయి? ఐరన్‌డోమ్ వ్యవస్థలో తమిర్ క్షిపణులు, లాంఛర్, రాడార్, కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి డేవిడ్స్ స్లింగ్ (మధ్య శ్రేణి)పరిధి40 నుంచి 300 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, పెద్ద రాకెట్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? స్టన్నర్ ఇంటర్సెప్టార్ క్షిపణులు, నిట్టనిలువుగా ప్రయోగించే వేదిక, రాడార్, నియంత్రణ వ్యవస్థ ఇందులో ఉంటాయి ఆరో సిస్టమ్ (దీర్ఘ శ్రేణి)పరిధిఇజ్రాయెల్ నుంచి 2,400 కి.మీ.ల దూరంలో ఉండగానే శత్రువులకు చెందిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? తక్కువ ఎత్తులో సమాంతరంగా వస్తే ఆరో–2 మిస్సైళ్లు, ఎక్కువ ఎత్తులో వస్తే ఆరో–3 మిస్సైళ్లు అడ్డుకుంటాయి. లాంఛర్, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మధ్యప్రాచ్యంలో యుద్ధ భేరి.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులు
జెరుసలేం/టెహ్రాన్/వాషింగ్టన్: మధ్యప్రాచ్యం అగ్నిగుండమైంది. దాడులు, ప్రతి దాడులు, ప్రతీకార దాడులతో భగ్గుమంటోంది. లెబనాన్‌ను కొద్ది రోజులుగా వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తున్న ఇజ్రాయెల్ మంగళవారం భూతల దాడులను తీవ్రతరం చేసింది. లెబనాన్‌కు దన్నుగా నిలుస్తున్న ఇరాన్ కూడా కాసేపటికే ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.నిమిషాల వ్యవధిలో వందలాది మిసైళ్లు, రాకెట్లు దూసుకొచ్చాయి. టెల్ అవీవ్‌తో పాటు సమీపంలోని జెరుసలేం తదితర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్‌కు దన్నుగా హెజ్బొల్లా కూడా టెల్ అవీవ్‌పైకి మిసైళ్లు ప్రయోగించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నింటినీ మూసేసింది. ప్రజలందరినీ అప్రమత్తం చేసింది. బంకర్ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం బంకర్లు, సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీశారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్పైకి కూడా మిసైళ్లు దూసుకెళ్లి కలకలం రేపాయి.రంగంలోకి అమెరికా యుద్ధనౌకలుఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. స్వీయరక్షణ చేసుకునేందుకు ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇరాన్ మిసైళ్లను నేలకూల్చడంలో ఇజ్రాయెల్‌కు సహకరించాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు. దాంతో మధ్యదరా సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలు కూడా రంగంలోకి దిగి పలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చేశాయి. ఇరాన్ దాడులకు తెగబడితే ఇజ్రాయెల్‌కు దన్నుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఆ దిశగా రంగంలోకి దిగే సూచనలు కని్పస్తున్నాయి.ఇరాన్ తాజా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్యంలో తాము చేరలేని చోటంటూ ఏదీ లేదని పునరుద్ఘాటించారు. మొత్తానికి హమాస్‌ను ఏరివేసేందుకు గాజాపై ఏడాది క్రితం ఇజ్రాయెల్ తెరతీసిన దాడులు చివరికి లెబనాన్, ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం దిశగా దారి తీసేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. గత ఏప్రిల్‌లో కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ అనూహ్యంగా దాడికి దిగడం తెలిసిందే. అయితే అది ప్రయోగించిన క్షిపణులన్నింటినీ ఇజ్రాయెల్ మధ్యలోనే అడ్డుకుంది. ప్రతిదాడులకు దిగారో...: ఇరాన్ ఇజ్రాయెల్‌పైకి భారీగా మిసైళ్లు ప్రయోగించినట్టు ఇరాన్ సైన్యం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)’ ప్రకటించింది. ‘‘గత జూలైలో హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్»ొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్ఫొరుషన్ను హతమార్చినందుకు, అసంఖ్యాకులైన అమాయక లెబనీస్, పాలస్తీనా ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాం’’ అని పేర్కొంది.‘‘ఇది ఆరంభం మాత్రమే. మాపై ప్రతి దాడులకు దిగితే మరింత భారీగా విరుచుకుపడతాం’’ అని హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్ దాడులను ధ్రువీకరించింది. వాటిని అడ్డుకునేందుకు భారీగా ఇంటర్‌సెప్టర్ మిసైళ్లు ప్రయోగించింది. ఇరాన్ దాడులు విస్తరించవచ్చని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగరీ అభిప్రాయపడ్డారు. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిందని ప్రకటించారు. ఇరాన్ దాడులు ఆగాయని. ప్రస్తుతానికి ముప్పు లేనట్టేనని పేర్కొన్నారు. హెచ్చరించి మరీ లెబనాన్‌లోకి... ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దు ప్రాంతాలు కూడా బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. హెజ్»ొల్లా మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అర్ధరాత్రి నుంచే లెబనాన్‌లోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లోని లెబనాన్ ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలాలని ముందుగానే హెచ్చరించి మరీ రంగంలోకి దిగింది. దక్షిణ సరిహద్దుకు, లితానీ నదికి మధ్యన 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో ఉన్నవారంతా తక్షణం ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం ఇజ్రాయెల్ దళాలు భారీ సంఖ్యలో సరిహద్దు దాటి కిలోమీటర్ల కొద్దీ చొచ్చుకెళ్లాయి. లెబనాన్‌పై లక్షిత భూతల దాడులు మొదలైనట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.‘‘అక్కడి హెజ్»ొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకున్నాం. మిలిటెంట్లు భారీగా ఆయుధాలను దాచిన బంకర్లు, టన్నెళ్లు తదితరాలను స్వా«దీనం చేసుకున్నాం’’ అంటూ వీడియోలు విడుదల చేసింది. ఇరు పక్షాల మధ్య భారీగా కాల్పులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. ఒక రాకెట్ బీరూట్‌లో ఇరాన్ దౌత్య కార్యాలయానికి అతి సమీపంలో పడింది. దాంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఎర్రసముద్రంలోని హొడైడా నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం వేళ ఇజ్రాయెల్ తొలి దాడి జరిగినట్టు తెలుస్తోంది. తర్వాత కాసేపటికే అక్కడి ఉత్తర దిశగా రెండో దాడి జరిగిందని బ్రిటన్ సముద్ర వర్తక కార్యకలాపాల కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో లెబనాన్‌లోని అతి పెద్ద శరణార్థుల శిబిరాల్లో ఒకటైన సిడాన్‌లోని ఎన్ ఆల్ హిల్వే శిబిరంపై జరిగిన బాంబు దాడిలో ఆరుగురి దాక మరణించినట్టు చెబుతున్నారు. వీరిలో పాలస్తీనా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్‌కు చెందిన ఫతా గ్రూప్ సారథి జనరల్ మునీర్ మగ్దా కొడుకు, కోడలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఉగ్ర కాల్పుల్లో ఆరుగురి మృతియుద్ధజ్వాలల నడుమ ఇజ్రాయెల్‌లో భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. జెరూసలేంలో ఇద్దరు ఉగ్రవాదులు విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి ముష్కరులిద్దరినీ మట్టుబెట్టారు.లెబనాన్‌లో 900 మంది భారత సైనికులు!లెబనాన్ దక్షిణ సరిహద్దుల వద్ద ఐరాస శాంతి పరిరక్షక దళంలో 900 మంది దాకా భారత సైనికులున్నట్టు తెలుస్తోంది. అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐరాస దళంలో భాగంగా ఉన్న దృష్ట్యా వారిని ఇప్పటికిప్పుడు వెనక్కు పిలవడం సరైన చర్య కాబోదని కేంద్రం అభిప్రాయపడుతోంది. ‘‘మన సైనికులంతా సురక్షితంగా ఉన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’ అని తెలిపింది. -
‘అగ్ని’ అగర్వాల్ ఇక లేరు
భారత్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్ ఇంజనీర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఇక లేరు. 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం(ఆగస్టు 15) ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భూతల (surface-to-surface missile) క్షిపణి.. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే ఆర్ఎన్ అగర్వాల్‌ను ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిస్సైల్స్‌గా పిలుస్తుంటారు.రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్‌గా (AGNI), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశారు.అగర్వాల్ 1983 నుంచి అగ్ని ప్రయోగానికి నాయకత్వం వహించారు. 33 ఏళ్ల క్రితం మే 22 1989న.. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న అగర్వాల్.. తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీపైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌లోని చండీపూర్‌లో ప్రయోగించారు.రక్షణ రంగంలో ఈయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. దేశ రక్షణ కోసం అవిరామంగా కృషి చేసిన అగర్వాల్.. స్వాతంత్ర దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం. AgniWall, the father of India’s Agni missile (ICBM), R N Agarwal passes away on Independence Day today in Hyderabad. pic.twitter.com/eiRnEk1fi1— M Somasekhar (@Som_mulugu) August 15, 2024 ఆర్ ఎన్ అగర్వాల్ మృతితో.. దేశం ఓ గొప్ప సైంటిస్ట్‌ను కోల్పోయింది. అగ్ని క్షిపణి కోసం అగర్వాల్ విశేషంగా పని చేశారు. తన కృషిని విస్తృతస్థాయికి తీసుకెళ్లి.. వేరుర్వేరు క్షిఫణుల తయారీకి దోహదపడ్డారు. క్షిపణి రంగంలో అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారాయన. ::: జి. సతీష్‌రెడ్డి, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, డీఆర్డీవో మాజీ చైర్మన్ -
‘బ్రహ్మోస్’తో యుద్ధ నౌకలకు మరింత బలం
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ రీజియన్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత రక్షణ దళం మరో కీలక అడుగు ముందుకువేసింది. సముద్ర జలాల్లోకి అడుగు పెట్టాలంటే దాయాది దేశాలకు భయం పుట్టేలా చేసేందుకు ఆయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటున్న భారత నౌకాదళం... మిసైల్స్ మహారాజుగా ఎదిగే దిశగా దూసుకుపోతోంది. అత్యంత శక్తిమంతమైన, భారత నౌకాదళ ప్రధాన ఆయుధమైన బ్రహ్మోస్ క్షిపణులను ప్రతి యుద్ధ నౌకలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు భారత్, రష్యా జాయింట్ వెంచర్‌గా ఉన్న బ్రహ్మోస్ ఏరోస్పేస్ మన దేశంలోనే రూపొందిస్తున్న బ్రహ్మోస్ క్షిపణులను భారీగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.19 వేల కోట్లతో 200 మిసైల్స్ కొనుగోలు చేసేలా బ్రహ్మోస్ ఏరోస్పేస్తో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఢిల్లీలో ఎంవోయూ చేసుకుంది. భారత యుద్ధ నౌకలన్నింటిలోనూ బ్రహ్మోస్లని ఏర్పాటు చేయడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బ్రహ్మోస్ కొనుగోలుకు ఫిలిప్పీన్స్ ఒప్పందం భారతదేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ జాబితాలో తొలి కొనుగోలుదారుగా ఫిలిప్పీ¯న్స్ నిలిచింది. దాదాపు 375 మిలియన్ డాలర్లతో మిసైల్స్ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదర్చుకుంది. ఇటీవల చైనా నుంచి కవ్వింపు చర్యలు ఎదుర్కొంటున్న ఫిలిప్పీన్స్ ఇబ్బందులు పడుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు బ్రహ్మోస్‌ను కీలక ఆయుధంగా మలచుకోవాలని ఫిలిప్పీన్స్ భావించి ఈ ఒప్పందం చేసుకుంది. బ్రహ్మోస్ మాత్రమే కాకుండా తేజస్ యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేందుకు ఫిలిప్పీన్స్ ఆసక్తి చూపిస్తోందని భారత నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌తో భాగస్వామ్యం కోసం అన్ని దేశాల ఆసక్తి సాగర జలాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కష్టాల్లో ఏ దేశం ఉన్నా సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటోంది భారత నౌకాదళం. ఇటీవల సముద్రపు దొంగల దాడుల్లో పలు దేశాల వర్తక నౌకలు చిక్కుకోవడంతో వాటిని కాపాడే బాధ్యతను ఇండియన్ నేవీ తీసుకుని సఫలీకృతమైంది. అందువల్ల భారత్‌తో భాగస్వామ్యం పెంచుకునేందుకు అన్ని దేశాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా జరుగుతున్న మిలాన్–2024లో రికార్డు స్థాయిలో ఏకంగా 51 దేశాలు పాల్గొనడమే ఇందుకు నిదర్శనం. మరోవైపు నౌకాదళంలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచేందుకు భారత్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. స్వావలంబన దిశగా భారత్ బ్రహ్మోస్ క్షిపణి ఎగు మతి వల్ల దేశ రక్షణ రంగంలో స్వావలంబన పెరుగుతుంది. భారతదేశంలోని ప్రతి నౌక, జలాంతర్గామి, విమానాలు, ఆయుధ వ్యవస్థ తయారీలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో దూసుకుపోతోంది. భారత నావికాదళం 2047 నాటికి పూర్తిగా స్వావలంబన సాధించేదిశగా అడుగులు వేస్తోంది. -
Russia Ukrain War: మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం !
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడులు నివాసాలతో పాటు పరిశ్రమల భవనాలు లక్ష్యంగా సాగాయి. ఈ దాడుల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. ‘శత్రువు ప్రశాంత ప్రదేశాలను కూడా వదిలిపెట్టడం లేదు’అని దేశంలోని ప్రధాన పట్టణం కీవ్ మేయర్ తెలిపారు. ‘రష్యన్లు దేనిని టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఈ దాడుల్లో పారిశ్రామిక వాడలు లక్ష్యంగా మిసైళ్లు పేల్చారు’అని కార్కివ్ మేయర్ తెలిపారు. మరోవైపు సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడుల కారణంగా తమ తమ దేశంలోని బెల్గార్డ్ పట్టణంలోని 300 మంది స్థానికులను అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలించినట్లు రష్యాలోని బెల్గార్డ్ గవర్నర్ తెలిపారు. బెల్గార్డ్ పట్టణం ఉక్రెయిన్ సరిహద్దులోనే ఉండటం గమనార్హం. 2022 ఫిబ్రవరి 14న ప్రారంభమైన రెండవ దశ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అప్పటి నుంచి కొనసాగుతోంది. నిజానికి ఉక్రెయిన్ భూ భాగంపై వెళుతున్న మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కూల్చివేసిన తర్వాత 2014లోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య తొలిదశ యుద్ధం ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్ దేశంపై సుదీర్ఘ దాడి జరగడం ఇదే తొలిసారని పరిశీలకులు చెబుతున్నారు. ఇదీచదవండి..అమెరికాలో రోడ్డు ప్రమాదం ఖమ్మం యువకుడు మృతి -
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. ఇజ్రాయెల్‌కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్‌పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
ఇప్పుడు పుతిన్‌కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్‌తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్‌తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్‌ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్‌లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్‌కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్‌కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
క్షిపణుల డిజైన్‌లో స్టార్టప్‌లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
క్షిపణుల నుంచి సంగీతం దాకా..
న్యూఢిల్లీ: ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ మహిళలు క్షిపణుల నుంచి సంగీతం వరకు వివిధ రంగాల్లో ఎంతో సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా శక్తిపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని మానెక్ షా సెంటర్లో సోమవారం జరిగిన ఆర్మీ అధికారుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘మహిళల సాధికారిత దిశగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ సాగిస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను’అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాత సామెత. కానీ, ఈ రోజు దానిని విజయం సాధించిన ప్రతి పురుషుడి పక్కన ఒక మహిళ ఉంది అని చెప్పుకోవచ్చని ముర్ము అన్నారు. ‘నారీశక్తి అందించే సేవలు సమాజానికే కాదు, యావత్తు దేశం పురోగతికి కీలకంగా మారాయి. క్షిపణుల నుంచి సంగీతం వరకు, మహిళలు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు’అని ఆమె అన్నారు. -
ఉక్రెయిన్‌పై మళ్లీ నిప్పుల వాన
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మళ్లీ విరుచుకుపడింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో సాధారణ నివాస ప్రాంతాలపై దాడికి దిగింది. ఉక్రెయిన్ నుంచి జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా, రష్యా నుంచి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వెళ్లిపోయిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. జపొరిజాజియా నగరంలో తొమ్మిది అంతస్తుల అపార్టుమెంట్‌పై రష్యా మిస్సైల్ దాడి వీడియో దృశ్యాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాజధాని కీవ్ సమీపంలో విద్యార్థుల వసతి గృహంపై రష్యా సైన్యం దాడి చేయడంతో నలుగురు మృతిచెందారు. 20 మందికిపైగా గాయపడ్డారు. కీవ్‌కు దక్షిణాన ఉన్న రిజీసిచివ్ సిటీలో ఓ ఉన్నత పాఠశాల, రెండు డార్మిటరీలు సైతం పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఓ డార్మిటరీ ఐదో అంతస్తు నుంచి 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. మొత్తం ఎంతమంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. రష్యా 21 డ్రోన్లను ప్రయోగించగా, అందులో తాము 16 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. రష్యా ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు భీకర దాడులకు ఆదేశాలకు జారీ చేస్తోందని జెలెన్స్కీ మండిపడ్డారు. పౌరుల నివసాలపై రష్యా క్షిపణి దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం స్వదేశానికి తిరిగివచ్చారు. జపాన్ ప్రధాని కిషిదా ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు చేరుకున్నారు. -
తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..మరో క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా దూకుడుగా వరుస క్షిపణి ప్రయోగాలకు తెగబడుతోంది. ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన రెండు రోజుల్లోనే మరో రెండు బాలిస్టిక్ కిపణులను ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ధృవీకరిచింది కూడా. ఎలాంటి హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వరుస క్షిపణి ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. వాస్తవానికి ఉత్తర కొరియా గత శనివారమే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని జపాన్ పశ్చిమ తీరంలో ప్రయోగించింది. దీంతో ఆదివారం అమెరికా ఆదివారం దక్షిణ కొరియా, జపాన్‌తోనూ విడిగా ఉమ్మడి వైమానికి విన్యాసాలను నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా సోమవారం తూర్పు తీరంలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణులను బహుళ రాకెట్ లాంచర్‌తో సుమారు 395 కి.మీ, 337 కి.మీ దూరంలోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వ్యూహాత్మక అణ్వాయుధం శత్రు ఎయిర్ ఫీల్డ్‌ను నిర్వీర్వం చేయగలదని ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అలాగే కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ పసిఫిక్‌ను ఫైరింగ్ రేంజింగ్ మారుస్తామని హెచ్చరించింది. అంతేగాదు అధిక ఫ్రీక్వెన్సీతో మరిన్ని సైనిక చర్యలకు తెగబడటం అనేది యూఎస్ దళాల చర్యలపై ఆదారపడి ఉంటుందని ఆమె గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. మరోవైపు జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించిందని, అవి గరిష్టంగా 50 కి.మీ నుంచి 100 కి.మీ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ పరీక్షల విషయమై అత్యవసర యూఎన్ భద్రతా మండలి సమావేశానికి పిలుపునిచ్చినట్లు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చెప్పారు. ఐతే ఉక్రెయిన్ సంక్షోభం, అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్ వ్యవహారం నేపథ్యంలో అమెరికా చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తదితర కారణాల రీత్యా యూఎన్ ఆంక్షాలు విధించే అవకాశం తక్కువగా ఉంది. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియా మాత్రం ఈ ప్రయోగాలను తీవ్రమైన రెచ్చగొట్టే చర్యగా పేర్కొంది. వెంటనే ఇలాంటి వాటిని నిలిపివేయాలని ఉత్తర కొరియాను హెచ్చరించింది. అలాగే ప్రతిఘటనలపై చర్చించడానికి జాతీయ భద్రత మండలి సమామేశాన్ని నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ కార్యాలయం తెలిపింది. అంతేగాదు ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాలకు సంబంధించి నలుగురు వ్యక్తులను, ఐదు సంస్థలపై ఆంక్షలను ప్రకటించింది. పైగా దీన్ని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిస్పందనగా పేర్కొంది దక్షణ కొరియా. కచ్చితంగా దీనికి తగిన పర్యవసానాన్ని ఎదుర్కొనక తప్పదంటూ హెచ్చరించింది. దీని గురించి అమెరికా, జపాన్‌తోనూ చర్చిస్తానని దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, యూఎన్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ భద్రతా మండలి తీర్మానాలు ప్రకారం నిషేధించిన కవ్వింపు చర్యలను నిలిపేయాలని, అణ్వాయుధీకరణపై చర్చలు పునఃప ప్రారంభించాలని ఉత్తర కొరియాను కోరారు. -
కిమ్ అంటే అట్లుంటది! కొత్త ఏడాది తొలిరోజునే కీలక ప్రకటన
ప్యొంగ్యాంగ్: మిరుమిట్లు గొలిపే బాణసంచా, విద్యుత్తు దీపాల కాంతులతో ప్రపంచం మొత్తం కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అయితే, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన రూటే సపరేట్ అని మరోమారు చాటుకున్నారు. తూర్పు జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగించి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఆదివారం జరిగిన అధికార పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేశారు కిమ్. దేశంలో అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులు ఐసీఎంబీలను తయారు చేస్తామని తెలిపారు. అమెరికా సహా ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠపరుస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా అమెరికా, దక్షిణ కొరియాలపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. వేగవంతమైన, ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త తరం ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్థానిక మీడియా తెలిపింది. అలాగే.. తొలి స్పై శాటిలైట్‌ను త్వరలోనే ప్రయోగించే యోచనలో కిమ్ ఇన్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
సత్యసాయి జిల్లాలో క్షిపణుల తయారీ
సాక్షి, అమరావతి: దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన అధునాతన క్షిపణులు (మిస్సైల్స్) రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. క్షిపణులతోపాటు రాడార్ టెస్ట్ బెడ్, ఇతర రక్షణ రంగ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనుంది. ఈ యూనిట్‌కు రూ.384 కోట్లు కేటాయిస్తూ శనివారం మచిలీపట్నంలోని బీఈఎల్‌లో జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించింది. 2016లో ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద కేటాయించిన భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంతో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. దీంతో ఈ యూనిట్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దీనిపై దృష్టి సారించారు. త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టీలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బోర్డు సమావేశం అనంతరం బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్, మనోజ్ జైన్, డాక్టర్ పార్థసారధి మంగళగిరిలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసి ప్రభుత్వం చొరవను అభినందించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు మొదలుపెడతామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. -
2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై 10 నెలలు కావస్తున్నా ఇంకా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఉన్నప్పటికీ కాల్పులను తాత్కాలికంగా కూడా విరమించే ప్రసక్తే లేదని రష్యా తేల్చి చెప్పింది. కీవ్‌పై మరోసారి భీకర దాడులకు సిద్ధమవుతోంది. రానున్న రోజుల్లో 2,00,000 బలగాలతో తమపై విరుచుకుపడేందుకు రష్యా వ్యూహం పన్నుతోందని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వలేరియ్ జులుజ్నీ తెలిపారు. ది ఎకానమిస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. తమకు మరిన్ని ఆయుధాలు, క్షిపణి వ్యవస్థలు కావాలన్నారు. రిజర్వ్ బలగాలను, అవసరమైతే పౌరులను కదన రంగంలోకి దించి రష్యా దాడులను తిప్పికొడతామని చెప్పారు. రష్యాపై ఆంక్షలు.. మరోవైపు రష్యా వెనక్కి తగ్గకపోవడంతో ఐరోపా సమాఖ్య మరోమారు ఆ దేశంపై ఆంక్షలు విధించింది. ఇలా చేయడం ఇది 9వ సారి కావడం గమనార్హం. అలాగే రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు 18 బిలియన్ యూరోల ప్యాకేజీని సాయంగా అందించనున్నట్లు ప్రకటించింది. అమెరికా అండ.. ఉక్రెయిన్‌కు యుద్ధంలో సాయం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అమెరికాను రష్యా హెచ్చిరింది. అయితే అగ్రరాజ్యం మాత్రం మాస్కో వార్నింగ్‌ను లైట్ తీసుకుంది. ఉక్రెయిన్‌కు సాయం చేసి తీరతామని స్పష్టం చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రష్యాకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ వెనుకడుగు వేయడం లేదు. గురువారం కూడా కీవ్‌పై క్షిపణులతో భీకర దాడులు చేసింది. చదవండి: బ్రిటన్ కోర్టులో నీరవ్ మోదీకి షాక్.. త్వరలోనే భారత్‌కు అప్పగింత! -
ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా పట్టుకోల్పోతోందనే వాదనల వేళ మాస్కో సేనలు రెచ్చిపోయాయి. ఉక్రెయిన్‌పై మంగళవారం మిసైల్స్ వర్షం కురిపించాయి. విద్యుత్తు రంగాలే లక్ష్యంగా రష్యా బలగాలు 100కుపైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీంతో తమ దేశంలో మరోమారు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడి అంధకారంలోకి వెళ్లినట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ‘100కుపైగా మిసైల్స్‌ను రష్యా బలగాలు ప్రయోగించాయి. అక్టోబర్ 10వ తేదీన అత్యధికంగా 84 మిసైల్స్‌ను ప్రయోగించగా.. ఆ సంఖ్యను మంగళవారం దాటేశాయి మాస్కో సేనలు. వారి ప్రాథమిక టార్గెట్ కీలకమైన మౌలిక సదుపాయాలు. కొన్ని క్షిపణులను కూల్చివేశం. అయితే వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతినిధి యూరీ ఇగ్నాత్. ఇదీ చదవండి: చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్ హ్యండ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి! -
‘రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. మళ్లీ ప్రయోగిస్తారేంటి?’
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. రాహుల్ గాంధీ ఓ విఫలమైన క్షిపణిగా అభివర్ణించారు. భారత్ జోడో యాత్ర పేరుతో మరోమారు ఫెయిల్డ్ మిసైల్‌ను కాంగ్రెస్ ప్రయోగిస్తోందని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ఏకమైందని, ఫెడరలిజాన్ని నమ్ముతున్న తరుణంలో ఇలాంటి యాత్రలు అర్థరహితమని దుయ్యబట్టారు. ‘దేశం బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలోనే రాహుల్ గాంధీ అనే మిసైల్ విఫలమైందని నేను చెప్పాను. ఇప్పుడు, మళ్లీ ఆయన్నే కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. దానిని పక్కనబెడితే.. అసలు ఈ యాత్రకు అర్థమే లేదు.’ అని పేర్కొన్నారు బొమ్మై. దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్న తరుణంలో క్రమంలో దేశాన్ని ఏకం చేస్తామనేందుకు అసలు అవకాశమేలేదన్నారు బొమ్మై. జీ7తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే.. భారత్ 7 శాతం వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ చేపట్టిన జన సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయి.. అందుకే పాదయాత్రకు ఆ పేరు.. -
పెచ్చరిల్లిన యుద్ధకాండ
రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ మళ్ళీ క్షిపణిదాడులతో దద్దరిల్లుతోంది. విద్యుత్ సరఫరా ఆగింది. జనం ప్రాణాలు అరచేత పట్టుకొని బంకర్లలో తలదాచుకుంటున్నారు. వరుసగా రెండురోజులుగా రష్యా క్షిపణిదాడులు. పిల్లల ఆటస్థలాలపైనా దాడులతో పదుల మంది ప్రాణాలు కోల్పోతే, వంద మందికి పైగా గాయాల పాలయ్యారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పెంచిన ఈ దాడులతో యుద్ధం ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వప్రతినిధిసభలో చర్చనీయాంశమైంది. ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ఆక్రమిత ప్రాంతాలను రెఫరెండమ్ల మాటున తమ దేశంలో కలిపేసుకున్నట్టు ఇటీవలే రష్యా అక్రమంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ముందుకొచ్చింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై ఓటింగ్ జరగనుంది. వెరసి పెచ్చరిల్లిన యుద్ధకాండతో అంతర్జాతీయంగా ఉద్విగ్నత నెలకొంది. తమ దేశ గగనతల రక్షణకు మరిన్ని ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ అభ్యర్థిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అత్యవసరంగా ‘జీ7’ దేశాల నేతలతో సమావేశమయ్యారు. రష్యన్ చమురుపై కఠినతరమైన ఆంక్షలు పెట్టాలన్నారు. మరోపక్క ‘నాటో’ సైతం యుద్ధంలో కడ దాకా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. యుద్ధాన్ని ప్రారంభించిన రష్యాయే దీనికి ముగింపు పలకా లంది. ఈ వారంలోనే ‘నాటో’ రక్షణ మంత్రులూ సమావేశం కానుండడం మరో కీలక పరిణామం. రష్యా మాత్రం పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచి, యుద్ధాన్ని పెంచిపోషిస్తున్నాయని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్‌లో ఎదురుదెబ్బల నేపథ్యంలో ఓ నిరంకుశ కొత్త సైనిక కమాండర్‌ను బరిలోకి దింపింది. వరస చూస్తుంటే, యుద్ధం మరింత సంక్లిష్ట దశకు చేరుకొన్నట్టు కనిపిస్తోంది. తాజా దాడి ఘటనల్ని గమనిస్తే – రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అభిమాన ప్రాజెక్టు క్రిమియా – రష్యా మధ్య రోడ్డు, రైలు వంతెన. ఇటు సైనికపరంగా, అటు ప్రతీకాత్మకంగా అది ముఖ్యమైనది. ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యాకు కలిపే ఆ ‘కెర్చ్ వంతెన’ను 370 కోట్ల డాలర్ల ఖర్చుతో నిర్మించారు. నాలుగేళ్ళ క్రితం 2018 మే నెలలో పుతిన్ స్వయంగా దానిపై వాహనం నడుపుతూ ఆర్భాటంగా ప్రారంభించారు. రష్యా ఆక్రమణకు ఓ కీలక ప్రతీక లాంటి ఆ వంతెన పుతిన్ 70వ జన్మదినం మర్నాడే అక్టోబర్ 8 భారీ పేలుడుతో ధ్వంసమైంది. అందుకు ఉక్రెయినే కారణమంటూ పుతిన్ 48 గంటలు గడిచేలోగా భీకర ప్రతీకార దాడులకు దిగారు. తత్ఫలితమే – ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో సోమ, మంగళవారాల్లో ఉక్రెయిన్ నగరాలపై రష్యా చేసిన దాడులు. ఏడునెలల క్రితం ప్రత్యేక సైనిక చర్య అంటూ మొదలుపెట్టిన పుతిన్ ఉక్రెయిన్ను రష్యాలో భాగం చేసుకోవాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయచట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. తక్షణం, బేషరతుగా వెనక్కి రావాలని మార్చిలో సాక్షాత్తూ ఐరాస 141 దేశాల మద్దతుతో తీర్మానించినా, మాస్కో జంకూగొంకూ లేకుండా దాడులు చేస్తూనే ఉంది. రెండున్నరేళ్ళుగా భయపెడుతున్న కోవిడ్ లానే ఈ యుద్ధకాండ ఫలితాలు సైతం ఒక్క ఉక్రెయిన్‌కే కాక మొత్తం ప్రపంచానికి విస్తరిస్తున్నాయి. ఐరాస పట్టు కోల్పోతోంది. ఆహార ధరలు పెరిగిపోయాయి. శరణార్థుల సమస్య, సాంస్కృతిక – క్రీడా రంగాల్లో బహిష్కరణలు సరేసరి. అంతర్జాతీయ సహకారానికి పెద్ద దెబ్బ తగిలింది. అణ్వస్త్ర ప్రయోగంపై పుతిన్ చీటికీమాటికీ చేస్తున్న హెచ్చరికలు ఆయన నిర్లక్ష్య నేరధోరణికీ, అంతకంతకూ పెరుగుతున్న అసహనానికీ ప్రతీకలు. పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచం అణ్వస్త్ర మహా సంగ్రామానికి అతి దగ్గరగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు గతవారం హెచ్చరించడం గమనార్హం. ఇవి చాలదన్నట్టు పుతిన్ యుద్ధకాంక్ష ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాలపై, విపణిపై మును పెన్నడూ లేని ప్రభావం చూపింది. తాజాగా రష్యా సహా ఒపెక్ ప్లస్ దేశాలు ప్రపంచ చమురు ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించడమూ దెబ్బే. చమురు కొరతతో ఈ శీతకాలంలో యూరోపి యన్ ప్రపంచానికి కష్టాలు పెరగనున్నాయి. అసలైతే ఒపెక్ సభ్యదేశాల్లో అనేకం పాశ్చాత్యానికి మిత్రపక్షాలే. ఇప్పుడవి తమ వైఖరిని మార్చుకున్నాయా అనిపిస్తోంది. అదే గనక నిజమైతే, రెండు వర్గాలుగా దేశాలు చీలుతాయి. నిరంకుశాధికార ఇరాన్ సహా రష్యాను సమర్థించే దేశాలు ఒకపక్క, అమెరికా – బ్రిటన్ – ఇతర జి7 దేశాలు – ఐరోపా సమాజం మరోపక్క మోహరిస్తాయి. ఇక, రష్యాతో పోరుతో పాటు ఉక్రెయిన్ను ఆర్థిక కష్టాలూ వెన్నాడుతున్నాయి. అమెరికా నెలకు 150 కోట్ల డాలర్ల సైనికేతర సాయం ఇస్తానని హామీ ఇచ్చింది కానీ, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటేనే నెలకు 500 కోట్ల డాలర్లు అవసరం. మరోపక్క యూరోపియన్ యూనియన్ (ఈయూ) తన వంతు సాయం చేయడంలో విఫలమైంది. 900 కోట్ల యూరోలు ఇస్తా మంటూ మేలో చెప్పిన బ్రస్సెల్స్ ఇప్పటికి 100 కోట్ల యూరోలే చెల్లించింది. ఉక్రెయిన్‌కు సైనిక సరఫరాలు, రష్యాపై ఆంక్షలపైనా ఈయూలో అభిప్రాయ భేదాలున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ లాంటివి కీలక ఆయుధాలు ఇవ్వనేలేదు. రష్యా అనుకూల హంగరీ ఈయూ ఐక్యతకు తూట్లు పొడుస్తోంది. పుతిన్ పరిస్థితీ గొప్పగా లేదు. సైనికవైఫల్యాలు, యుద్ధనేరాల ఆరోపణలు, ప్రజల్లో అసంతృప్తి రేపిన సైనిక సమీకరణ ఆలోచనలు ఆయన ప్రతిష్ఠను దెబ్బతీశాయి. వంతెన విధ్వంసంతో తల కొట్టేసినట్టయి తెగబడేసరికి మళ్ళీ కలకలం రేగింది. ఈ ఉద్రిక్తత, దాడులు ఎవరికీ మంచిది కాద నేది భారత్ వాదన. అంతా అది అంగీకరించినా, ఆపే దిశగా ఆచరణ శూన్యం. భయపెడుతున్న అణుయుద్ధంలో ఎవరూ గెలవలేరు. ఆ ఉన్మాదంలో పరాజయం యావత్ మానవ ప్రపంచానిదే! -
ఉక్రెయిన్‌పై క్షిపణుల మోత.. యూరప్‌కు కరెంటు కట్
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్ వంతెనపై బాంబు పేలుళ్లకు ప్రతీకారంగా దాడులను రష్యా మంగళవారం మరింత తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా సోమవారం ఏకంగా 84 క్షిపణులతో విరుచుకుపడటం తెలిసిందే. మంగళవారం ఉక్రెయిన్‌లోని మిలటరీ కమాండ్ సెంటర్లు, ఇంధన కేంద్రాలే లక్ష్యంగా భారీ దాడులకు దిగింది. దాంతో జెలెన్స్కీ ప్రభుత్వం యూరప్ దేశాలకు విద్యుత్ సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది. సుదూర ప్రాంతాలను ఛేదించే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యా విధ్వంసం సృష్టిస్తోంది. క్షిపణి దాడుల తో లివీవ్ నగరం అల్లాడుతోంది. వేలాది మంది బంకర్లలో తలదాచుకుంటున్నారు. మంగళవారం దాడుల్లో 20 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అండగా గగనతల రక్షణ వ్యవస్థలను తరలించడానికి అమెరికా, జర్మనీ అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను పంపుతామని హామీ ఇచ్చారు. ఫేస్‌బుక్‌పై ఉగ్ర ముద్ర ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంల మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్ కంపెనీని ఉగ్రవాద సంస్థగా రష్యా ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్‌స్టా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు అది ఊతమిస్తోందని ఆరోపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు ఐరాస: ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలను రష్యా దురాక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న రష్యా డిమాండ్‌ను భారత్ తిరస్కరించింది. దీనిపై జరిగిన ఓటింగ్‌లో మరో 100కు పైగా దేశాలతో కలిసి రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బేనియా తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై రష్యా రహస్య ఓటింగ్ డిమాండ్‌ను భారత్ సహా 107 సభ్య దేశాలు తిరస్కరించాయి. 13 దేశాలు రష్యా డిమాండ్‌కు అనుకూలంగా ఓటేయగా చైనా సహా 39 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. -
కీవ్‌పై రష్యా భీకర దాడులు
కీవ్: వ్యూహాత్మకంగా కీలకమైన క్రిమియా వంతెనపై జరిగిన బాంబు పేలుడును ఉగ్ర చర్యగా అభివర్ణించిన రష్యా.. ఉక్రెయిన్ వ్యాప్తంగా సోమవారం వరుసగా రెండో రోజు భీకర దాడులు కొనసాగించింది. కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న రాజధాని కీవ్ సహా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. దాడులపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉదయం ఏకధాటిగా నాలుగు గంటలపాటు సైరన్లు మోగాయి. దాడుల్లో కనీసం 10 మంది మృతి చెందగా 60 మంది వరకు గాయపడినట్లు సమాచారం. కీలక ఇంధన, సైనిక వ్యవస్థలను టార్గెట్‌గా గగనతలం, సముద్రం, భూమిపై నుంచి తమ సైన్యం దాడులు సాగించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ఉగ్రదాడులు కొనసాగిస్తే అందుకు తామిచ్చే జవాబు అత్యంత కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. అంతకుముందు ఆయన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. మరో పరిణామం..రష్యా, బెలారస్ ఉమ్మడి బలగాలను మోహరించనున్నట్లు బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో ప్రకటించారు. బెలారస్‌పై దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అయితే, బలగాలను ఎక్కడ మోహరించేదీ లుకషెంకో వివరించలేదు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పోరాటం కొనసాగుతున్నా రాజధాని కీవ్‌లో జనజీవనం యథాప్రకారం కొనసాగుతోంది. కీవ్ ప్రజలు కొద్ది నెలలుగా ప్రశాంతతకు అలవాటుపడ్డారు. సోమవారం ఉదయం ఆ పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా మొదలైన సైరన్ల మోతతో జనం ఉలిక్కిపడ్డారు. బాంబు షెల్టర్లలోకి పరుగులు తీశారు. అధికారులు రైలు సర్వీసులను రద్దు చేశారు. జనం రైల్వే స్టేషన్లనే షెల్టర్లుగా చేసుకున్నారు. -
Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాల విలీనం ఒప్పందంపై సంతకాలు చేయడానికి కొన్ని గంటల ముందే రష్యా క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై విరుచుకుపడింది. జపోరిజియా నగరంలోని మానవతా కాన్వాయ్‌పై జరిపిన దాడిలో 30 మంది మరణించారు. రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న తమ బంధువులకి వస్తు సామాగ్రిని అందించడం కోసం వెళుతుండగా ఆ మానవతా కాన్వాయ్‌పై దాడులు జరిగాయి. రష్యాలో తయారైన ఎస్–300 క్షిపణులతో ఈ దాడులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. విలీన ఒప్పందంపై పుతిన్ సంతకం ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకునే ఒప్పందంపై అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం సంతకాలు చేశారు. డాంటెస్క్, లుహాన్సŠక్, ఖెర్సాన్, జపోరిజియా ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామని ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనమవడానికి అంగీకరించాయని ఇప్పటికే రష్యా ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు చెందిన రష్యా అనుకూల పాలకులు హాజరవగా క్రెమ్లిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పుతిన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను అన్ని విధాల కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ఏడు నెలలుగా సాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు రావాలని కోరారు. తమ దేశంలో విలీనమైన ప్రాంతాలను మళ్లీ వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని పుతిన్ తేల్చి చెప్పారు.తమ దేశాన్ని ఒక కాలనీగా మార్చి, తమ ప్రజల్ని పిరికివాళ్లయిన బానిసలుగా మార్చడానికి పశ్చిమ దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, పశ్చిమ దేశాలు ఆ విలీనాన్ని అంగీకరింబోమని స్పష్టం చేశాయి. ప్రజాభిప్రాయం పేరుతో వారిపై తుపాకులు పెట్టి బలవంతంగా విలీనం చేసుకున్నారని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో కూటమిలో తమ దేశాన్ని చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యాకి చెందిన వెయ్యి మంది ప్రజలు, సంస్థలు తమ దేశానికి రాకుండా అమెరికా వారి వీసాలపై నియంత్రణ విధించింది. -
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన యూఎస్ సౌత్ కొరియా
Washington and Seoul officials Warned: ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మేరకు సియోల్ రక్షిణ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నెలరోజుల విరామం తర్వాత ఉత్తర కొరియా రికార్డు బ్రేక్ చేస్తూ రెండు క్షిపణులను ప్రయోగించిందని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున దక్షిణ కొరియా ప్యోంగాన్ ప్రావిన్స్‌లోని ఓంచోన్ నుంచి పశ్చిమ సముద్రంలోకి ఉత్తర కొరియా రెండు క్రూయిజ్ క్షిపణులను పేల్చినట్లు గుర్తించామని రక్షణ మంత్రిత్వశాఖ అధికారి పేర్కొన్నారు. దీంతో యూఎస్, దక్షిణ కొరియా సైనిక అధికారులు ఎంద దూరం నుంచి ఈ క్షిపణుల ప్రయోగం జరిగిందని పూర్తి స్థాయిలో వివరణాత్మకంగా విశ్లేషిస్తున్నరు. ఈ మేరకు ఉత్తర కొరియా చివరిసారిగా జులై 10న ఆయుధ పరీక్షను నిర్వహించింది. ఇది బహుళ రాకెట్ లాంచర్లను ఫైర్ చేయగల క్షిపణి. ఐతే ఉత్తరకొరియా న్యూస్ ఛానెల్ ఒక్క క్రూయిజ్ క్షిపణినని ప్రయోగించలేదని, తమ దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించలేదని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఉత్తరకొరియా 2017 నుంచి పూర్తి తొలిసారిగా పూర్తి స్థాయిలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అప్పటి నుంచి పలుమార్లు ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘిస్తూ పరీక్షలు నిర్వహిస్తూనే ఉంది. ఉత్తర కొరియా దూకుడు వ్యవహరంతో యూఎస్, దక్షిణ కొరియా అధికారులు కూడా అణు పరీక్షలకు సిద్ధమవుతున్నమని గట్టిగా హెచ్చరించారు. తదుపరి ఉత్తర కొరియా ఏడోవ అణు పరీక్ష ఏం నిర్వహించనుందో తెలియదు కానీ తాము మాత్రం అణుపరీక్ష నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు కరాఖండీగా చెప్పాయి. (చదవండి: కిమ్ జోంగ్ ఉన్కి పుతిన్ లేఖ) -
తీవ్రతరమవుతున్న యుద్ధం... తదుపరి దశ దాడులకు దిగుతున్న రష్యా!
Russian rockets and missiles have pounded cities in strikes: రష్యా బలగాలు క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌లోని నగరాలను నేలమట్టం చేశాయి. దీంతో ఆయా నగరాల్లో వేలాదిమంది మృతి చెందారు. తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులు జరిపిన రష్యా బలగాలు ఆయా ప్రాంతాల్లోని ఉక్రెయిన్ దాడులను నిరోధించేలా తమ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది రష్యా. అదీగాక ఉక్రెయిన్ సైన్యాన్ని నిరోధించేలా దాడులు తీవ్రతరం చేయమని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదేశించారు కూడా. ఈ మేరకు రష్యా భూ, వాయు, జల మార్గాల్లో దాడులను వేగవంతం చేసింది. ప్రస్తుతం డోనెట్స్క్కి తూర్పు ప్రాంతమైన ఉక్రెయన్‌లోని కీలక నగరం స్లోవియన్స్క్‌పై దాడి చేసేందుకు రష్యా బలగాలు రెడీ అవుతున్నట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఈ మేరకు తూర్పు ఉక్రెయిన్ నుంచి దాడులకు తెగబడ్డ రష్యా ఒక్కో నగరాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంటూ...తదుపరి దశ దాడులకు సన్నహాలు చేస్తోంది. అంతేకాదు రష్యా దక్షిణ ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్రాంతాలలో రష్యా తన రక్షణ స్థానాలను పటిష్టం చేసుకుంటూ దాడులుకు సమయాత్తమవుతోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలు సాయంతో సుమారు 30 రష్యన్ లాజిస్టిక్స్, మందుగుండు సామగ్రి కేంద్రాలపై విజయవంతమైన స్ట్రైక్స్ స్ట్రింగ్ జరిపింది. దీనికి ప్రతస్పందనగా రష్యా దాడులను తీవ్రతరం చేయడమే కాకుండా క్షిపిణి దాడులతో ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడింది. ఏదీఏమైన రష్యా ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ... ఉక్రెయిన్‌ని మట్టికరిపించే దిశగా విధ్వంసకర దాడులకు తెగబడుతోంది -
చైనాకు చెక్ పెట్టేలా... భారత్‌కి అమెరికా అండ
US House of Representatives has passed by voice vote: చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్‌కి అమెరికా మద్దతు ఇచ్చింది. ఈ మేరకు యూఎస్‌కి సంబంధించిన కాట్సా వంటి శిక్షార్హమైన ఆంక్షల చట్టానికి వ్యతిరేకంగా భారత్‌కి మినహయింపును ఇచ్చే శాసన సవరణను యూఎస్ ప్రతినిధులు సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ) పరిశీలనకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ ఎన్‌బ్లాక్ సవరణలో భాగంగా ఈ శాసన సవరణను ఆమోదించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధి భారత అమెరికన్ రో ఖన్నాప్రవేశ పెట్టిన ఈ సవరణ.. చైనా నుంచి తమను తాము రక్షించుకునేలా భారత్‌కి అండగా ఉండేలా ఈ అమెరికా చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని బైడెన్ పరిపాలన యంత్రాంగాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే భారత్‌కి యూఎస్ కఠిన చట్టం నుంచి మినహియింపు ఇచ్చేలా ప్రవేశ పెట్టిన సవరణకు ఆమెదం లభించింది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాల కోసం చేసిన యూఎస్ ఆమోదించిన ఈ సవరణ చట్టం అతి ప్రాముఖ్యతను సంతరిచంకుంటుందని కూడా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వాస్తవానికి కాట్సా అనేది కఠినమైన యూఎస్ చట్టం. ఇది 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం, 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం తదితర కారణాల రీత్యా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించేలా ఈ కఠినమైన చట్టాన్ని 2017లో అమెరికా తీసుకువచ్చింది. దీంతో రష్యా రక్షణ ఇంటెలిజెన్స్ రంగాలతో లావాదేవీలు జరుపుతున్న ఏ దేశంపైనైనా యూఎస్ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా శిక్షాత్మక చర్యలను తీసుకుంటుంది. అక్టోబర్ 2018లో ఎస్400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లను కొనుగోలు చేయడానికి రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఐతే ఈ ఒప్పందంతో ముందుకు సాగడం భారత్‌కి అసాథ్యం అని యూఎస్ శిక్షర్హమైన చట్టానికి సంబంధించిన ఆంక్షలు వర్తిస్తాయంటూ అప్పటి ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది కూడా. అదీగాక ఇప్పటికే ఎస్ 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్‌కి భయాలు అధికమయ్యాయి. ఐతే ఈ శాసన సవరణను యూఎస్ ఆమోదించడంతో ప్రస్తుతం భారత్‌కి కాస్త ఊరట లభించింది. There is no relationship of greater significance to US strategic interests than the US-India partnership. My bipartisan NDAA amendment marks the most significant piece of legislation for US-India relations out of Congress since the US-India nuclear deal. pic.twitter.com/uXCt7n66Z7 — Rep. Ro Khanna (@RepRoKhanna) July 14, 2022 (చదవండి: తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం) -
ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్..అందించిన టీఏఎస్ఎల్, ఎల్అండ్టీ!
బెంగళూరు: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), ఎల్అండ్టీ ఉమ్మడిగా 100వ ఆకాశ్ ఎయిర్‌ఫోర్స్ లాంచర్‌ను భారత వాయుసేనకు విజయవంతంగా అందించినట్టు ప్రకటించాయి. ఈ లాంచర్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. 100వ ఎయిర్‌ఫోర్స్ లాంచర్‌ను విజయవంతంగా అందించడం తమకు, భారత రక్షణ తయారీ రంగానికి ఓ మైలురాయిగా టీఏఎస్ఎల్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్ జయంత్ పాటి ల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. అమెరికా స్పందన ఇదే!
సియోల్: జలాంతర్గామి నుంచి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా శనివారం నిర్వహించినట్లు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు పంపేందుకే ఉత్తర కొరియా ఈ ప్రయోగం చేపట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు రేవు నగరం సిన్పో సమీపంలో సముద్ర జలాల్లో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. అయితే, ఏ జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం చేపట్టారన్న సమాచారాన్ని బహిర్గతం చేయలేదు. షార్ట్–రేంజ్ మిస్సైల్‌ను ప్రయోగించిందన్నారు. ఇది 600 కిలోమీటర్లు(373 మైళ్లు) ప్రయాణించిందని చెప్పారు. ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్షతో తమకు గానీ, మిత్ర దేశాలకు గానీ తక్షణమే ముప్పు ఉన్నట్లు భావించడం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉత్తర కొరియా క్షిపణి తమ ప్రత్యేక ఆర్థిక జోన్ సమీపంలో సమద్రంలో కూలిపోయిందని, దానివల్ల తమ నౌకలకు, విమానాలకు నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని జపాన్ తెలిపింది. చదవండి: Bali: పవిత్రమైన చోట నగ్నంగా ఫొటోలు దిగింది.. సారీ చెప్పించుకుని మరీ వెళ్లగొట్టారు -
ఉక్రెయిన్ దాడి.. ఆకాశంలో రష్యా హెలికాప్టర్ రెండు ముక్కలు.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై రష్యా మొదలెట్టిన యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతోంది. అయితే మొదట్లో రష్యా దాడిని అడ్డుకుంటూ వచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ గత రెండు వారాలుగా ఎదురు దాడులు చేస్తోంది. పేరుకి చిన్న దేశం, ఆయుధ సంపత్తి, సైన్యం పరంగా రష్యాతో సమఉజ్జీ కాకపోయినా ధీటుగా నిలబడి ఉక్రెయిన్ పోరాడుతోంది. తాజాగా రష్యాకు చెందిన ఎంఐ-28 హెలికాప్టర్‌ను ఉక్రెయిన్ సైన్యం రెండు ముక్కలు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దర్శనమిస్తోంది. ఉక్రెయిన్ సైనికులు స్టార్ స్ట్రీక్ అనే మిస్సైల్‌తో దాడి చేయగా రష్యా ఎంఐ28 హెలికాప్టర్‌కు చెందిన టెయిల్ పార్ట్ ధ్వంసం కావడంతో రెండుగా విడిపోయి కుప్పకూలింది. లుహన్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్టార్‌స్ట్రీక్ మిస్సైల్ యూకే అత్యంత అధునాతన మానవసహిత పోర్టబుల్ క్షిపణి వ్యవస్థ. ఇది తక్కువ ఎత్తు ఎగిరే శత్రు జెట్లను పడగొట్టడానికి, హెలికాప్టర్లపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. స్టార్ స్ట్రీక్‌కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఇది ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని వేగం సహాయంతో గాల్లో ఎగిరే టార్గెట్లను సునాయాసంగా పేల్చేయవచ్చు. ఉక్రెయిన్‌కు 6,000 క్షిపణుల కొత్త ప్యాకేజీతో సహా మరింత రక్షణాత్మక మద్దతును అందిస్తుందని బ్రిటన ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. ప్రస్తుతం రష్యా దళాలు తాజాగా తూర్పు ఉక్రెయిన్ వైపు దృష్టి సారించాయి. The Times is reporting that this shootdown of a Russian Mi-28 was by a British Starstreak SAM pic.twitter.com/zsQb1DkQ74 — OSINTtechnical (@Osinttechnical) April 2, 2022 చదవండి: Russia Ukraine War: రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు! ఈ ఒక్క ఫొటో చాలు -
ఉక్రెయిన్‌పై రష్యా ‘కింజల్’ దాడి..హైపర్ సోనిక్ మిసైల్ అంటే?
ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచదేశాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఇరు దేశాలకు చెందిన వేలాదిమంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అందిరినీ కలచివేస్తోంది. ఇక ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో ఎలాగైనా పట్టు సాధించేందుకు రష్యా అణు దాడి చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో తొలిసారి ప్రయోగించడంతో భయాలు రెట్టింపయ్యాయి. ఈక్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి కింజల్ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల వద్ద ఈ తరహా క్షిపణులు ఉన్నాయో తెలుసుకుందాం... హైపర్ సోనిక్ మిసైళ్లను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలను ఇప్పటివరకు ఎవరూ తయారు చేయలేదని నిపుణులు అంటున్నారు. అమెరికా, రష్యా, చైనా దగ్గర అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైళ్లున్నాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. రష్యా సాయంతో కలిసి ఇండియా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను తయారు చేస్తోంది. సూపర్ సోనిక్ అంటే ధ్వని వేగం కన్నా ఎక్కువ వేగం (మాక్ 2 నుంచి 3)తో దూసుకెళ్లేవి. బ్రహ్మోస్ 2 హైపర్ సోనిక్ మిసైల్‌ను కూడా ఇండియా తయారు చేస్తోంది. హైపర్ సోనిక్ అని ఎందుకంటారు? ధ్వని వేగం కన్నా 5 రెట్లు ఎక్కువ వేగంతో వెళ్తే హైపర్ సోనిక్ అంటారు. ధ్వని వేగం గంటకు 1,234 కిలోమీటర్లు. మాక్ 5తో వెళ్లే మిసైళ్ల వేగం గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్లకు పైనే ఉంటుందన్నమాట. మామూలుగా మిసైళ్లను బాలిస్టిక్, క్రూయిజ్ అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ హైపర్ సోనిక్ మిసైల్ క్రూయిజ్ మిసైళ్ల వర్గానికి చెందింది. హైపర్ సోనిక్ మిసైళ్లు లక్ష్యాన్ని ఛేదించే వరకు శక్తితోనే (ఇంధనం) నడుస్తుంటాయి. భూ వాతావరణంలోనే ఉంటూ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. పరావలయ మార్గంలో వెళ్లినా అవసరమైతే దిశను మార్చుకోవడం వీటి ప్రత్యేకత. ఇవి తక్కువ బరువునే మోసుకెళ్లగలవు. కింజల్ ప్రత్యేకతలు పేరు: కేహెచ్ 47ఎం2 కింజల్ వేగం: గంటకు 12 వేల కిలోమీటర్లకు పైనే పరిధి: 1,500 కిలోమీటర్ల నుంచి 2 వేల కిలోమీటర్లు ఎంత బరువును మోసుకెళ్లగలదు: 500 కిలోలు సంప్రదాయ, అణు బాంబులను ప్రయోగించవచ్చు – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మరియుపోల్‌లో మారణహోమం? రెండు సూపర్ బాంబులతో అటాక్!
యుద్ధం మొదలై నాలుగు వారాలైనప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతూనే ఉంది. బాంబులతో ఉక్రెయిన్‌ని అల్లాడిస్తోంది. ఈ క్రమంలో రాజధాని కీవ్ నగరంతో పాటు పలు నగరాలపై విధ్వంసం సృష్టిస్తోంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న నగరం పేరు మరియుపోల్. ఇక్కడి ప్రాంతాలు, ఫ్యాక్టరీలపై రష్యా బలగాలు నిర్విరామంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఎలాగైనా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని రష్యాసేనలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ నగరాన్ని నలుదిక్కులా చ్టుటుముట్టి అదుపులోకి లక్ష్యంగా రష్యన్ బలగాలు పని చేస్తున్నాయి. తాజాగా రెండు శక్తివంతమైన ‘సూపర్’ బాంబులను మరియుపోల్ నగరంపై రష్యా ప్రయెగించింది. ఉక్రేనియన్ అధికారులు అదుపులో ఉన్న దక్షిణ ఓడరేవు నగరం మరియుపోల్ నుంచి పౌరులను రక్షించే ప్రయత్నం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. దాదాపు 1,00,000 మంది ప్రజలు ఆ నగరంలో చిక్కుకుపోయారని, దాడి అనంతరం మృతదేహాలతో, ధ్వంసమైన భవనాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందని స్థానిక హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది. అత్యాధునిక మిస్సైళ్ల దాడితో రష్యా దళాలు రాజధాని కీవ్‌పై తమ పట్టును కొనసాగిస్తున్నందున బుధవారం ఉదయం వరకు ఆ నగరం కర్ఫ్యూ నీడలో ఉంది. -
ఉక్రెయిన్‌పై రష్యా ‘కింజల్’ ప్రయోగం.. అమెరికా ఏం చెప్పిందో చూడండి!
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టి 27 రోజులైనప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. ఈక్రమంలో భారీ ఎత్తున బాంబులు కూడా రష్యన్ బలగాలు ప్రయోగిస్తున్నాయి. ఇటీవల అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’ను కూడా ప్రయోగించినట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి అని కూడా చెప్పింది. దీంతో రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. (చదవండి: ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్ ప్రత్యేకతలివే!) అయితే తాజాగా ఆ ప్రకటనలను అగ్రరాజ్యం అమెరికా తోసిపుచ్చింది. దీనిపై అమెరికా రక్షణశాఖ అధికారి మాట్లాడుతూ.. సైనికులు అలాంటి ఆయుధాన్ని ఉపయోగించడం అంత సులువు కాదని, చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ తరహా ఆయుధాల్ని ఉపయోగిస్తారని పేర్కొన్నారు. అయితే రష్యా ఇటువంటి ప్రకటనల ద్వారా పశ్చిమ దేశాలకు హెచ్చరిక సందేశాలు పంపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. కింజల్ ప్రయోగించడంపై అసలు స్పష్టతే లేదని ఆయన అన్నారు. కాగా రష్యా మిలిటరీ అధికారుల ప్రకారం.. ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి కింజల్‌ను ప్రయోగించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: Ukraine Russia War: ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే ) -
మిస్సైల్ రచ్చ! పాక్ సంచలన ఆరోపణలు.. స్పందించిన భారత రక్షణ శాఖ
భారత సూపర్ సోనిక్ నిరాయుధ మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంలో పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల ప్రకారం.. 9 మార్చి 2022న, భారత క్షిపణి సాధారణ నిర్వహణ సమయంలో, సాంకేతిక లోపం కారణంగా ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో ఆ క్షిపణి పేలిందని భారత రక్షణ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ( చదవండి: PM Modi: పంజాబ్‌లో ప్రభంజనం.. ‘ఆప్’కు మోదీ అభినందనలు.. కేజ్రీవాల్ రిప్లై ఇదే ) ఈ క్షిపణి పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో పడిన ఘటన తీవ్ర విచారం కలిగిస్తోందని, ప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది.కాగా బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది పాక్ అధికారి వెల్లడించాడు. -
ఉరిమి ఉరిమి.. యూఏఈ నెత్తిన! ఎందుకిలా జరుగుతోంది?
బలమైన శత్రు కూటమిని నేరుగా ఎదుర్కొని విచ్ఛిన్నం చేయడం అంత ఈజీ కాదు. అదే కూటమిలో ఒక భాగస్వామి నాకెందుకీ తలనొప్పి అనుకునేలా చేయగలిగితే తప్పక కూటమిలో చీలికలు వస్తాయి. ఈ సూత్రాన్నే ప్రస్తుతం హౌతీ రెబెల్స్ అనుసరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ కూటమి నుంచి యూఏఈ వైదొలిగేలా చేసేందుకు ఆ దేశాన్ని టార్గెట్‌గా చేసుకొని దాడులు చేస్తున్నారు. తిరుగుబాటుదారుల ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో కాలమే చెప్పాలి.. కొన్ని వారాలుగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు యూఏఈని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. నిజానికి హౌతీ రెబెల్స్ ప్రధాన టార్గెట్ సౌదీ అరేబియా, కానీ సౌదీ లాంటి దేశాన్ని నేరుగా ఎదుర్కోలేక పక్కనే ఉన్న యూఏఈపై ప్రతాపం చూపేందుకు తిరుగుబాటుదారులు యత్నిస్తున్నారు. దీంతో మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లు యెమెన్ విషయంలో జోక్యం చేసుకున్నందుకు యూఏఈకి ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే యెమెన్ యుద్ధం వల్ల వేలాదిమంది మరణించారు, కానీ ఈ సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. 2014లో ఆరంభమైన ఈ అతర్యుద్ధంలో యెమెన్ కీలుబొమ్మ ప్రభుత్వానికి పాశ్చాత్య దేశాల అండ ఉన్న సౌదీ కూటమి మద్దతునిస్తుండగా, హౌతీ రెబెల్స్‌కు ఇరాన్ అండ ఉంది. 2014లో తిరుగుబాటుదారులు యెమెన్ రాజధానిని ఆక్రమించుకున్నారు. దీన్ని ఇష్టపడని సౌదీ కూటమి 2015లో నామమాత్ర ప్రభుత్వానికి నేతగా ఉన్న అబెద్ రబ్బో మన్సూర్ హదికి మద్దతుగా నేరుగా యుద్ధంలోకి దిగింది. ఇప్పటికి ఆరంభమై ఏడేళ్లైనా ఈ అంతర్యుద్ధం కొలిక్కి రాలేదు. దీంతో తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచేందుకు వారిపై ఉగ్రముద్ర వేయాలని యూఎస్ భావిస్తోంది. యూఏఈపై దాడులు జరిపి ఆ దేశ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి సౌదీ కూటమి నుంచి తనంతతానే యూఏఈ వైదొలిగేలా చేయాలని రెబెల్స్ భావిస్తున్నారు. యూఏఈపై కోపం ఎందుకు? యెమెన్ అంతర్యుద్ధంలో తాము వెనుకంజ వేయడానికి యూఏఈ కారణమని హౌతీ రెబల్స్ ఆగ్రహిస్తున్నారు. యూఏఈ జోక్యంతో తమకు యెమెన్ ఉత్తరదిశలో భారీగా ఎదురుదెబ్బలు తగిలాయని, దీంతో రాజధానిపై పట్టు పోయిందని తిరుగుబాటుదారులు భావిస్తున్నారు. గతేడాది యెమెన్‌లో కీలకమైన మరిబి నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు తిరుగుబాటుదారులు యత్నించారు. వీరి ప్రయత్నాలు దాదాపు ఫలవంతమయ్యే దశకు వచ్చాయి. ఈ సమయంలో యూఏఈకి చెందిన జెయింట్ బ్రిగేడ్ సైనికులు రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. ఈ బ్రిగేడ్ తిరుగుబాటుదారులు ఆధీనంలోని షబ్వా నగరాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో తిరుగుబాటుదారులకు నిత్యవసరాల రాకపోకలు ఆగిపోయి మరిబి నగర స్వాధీనం కుదరలేదు. ఇది యూఏఈపై తిరుగుబాటుదారులు ఆగ్రహం ప్రజ్వరిల్లేందుకు దోహదం చేసింది. అప్పటినుంచి వీలున్నప్పుడల్లా యూఏఈపై దాడులకు తిరుగుబాటుదారులు యత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా డ్రోన్ దాడులు, మిసైల్ దాడులను ముమ్మరం చేశారు. తిరుగుబాటుదారులు దాడులు యూఏఈ పర్యాటక, వ్యాపార వాతావరణంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఈ యుద్ధం నుంచి బయటపడాలని యూఏఈ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సౌదీ కూటమి నుంచి యూఏఈ వైదొలిగేలా చేసేందుకే తిరుగుబాటుదారులు తరుచూ యూఏఈ భూభాగాన్ని టార్గెట్‌గా చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కనుగొనాలని పాశ్చాత్య దేశాలు యత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ముఖ్యంగా తిరుగుబాటుదారులు యూఎస్‌ను నమ్మడం లేదు. ఇరాన్ జోక్యం చేసుకొని మధ్యవర్తిత్వం జరిపితే పరిస్థితిలో మార్పు ఉం డొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిరేలోపు ఈ అంతర్యుద్ధంలో యెమెన్ ప్రజానీకం సమిధలవడమే అసలైన విషాదం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హౌతీ మిస్సైల్స్ కూల్చేసిన యూఏఈ
దుబాయ్: రాజధాని అబుదాబి లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు క్షిపణులను మధ్యలోనే పేల్చేసినట్లు యూఏఈ సోమవారం ప్రకటించింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. దాడులకు ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన మిప్సైల్ లాంచర్‌ను యూఏఈ రక్షణ వర్గాలు పేల్చేశాయి. దీనికి సంబంధించిన వీడియోను యూఏఈ రక్షణ శాఖ ట్వీట్ చేసింది. ఎలాంటి దాడులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పుకార్లు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. -
INS Khukri: ‘సాహసిక’.. సెలవిక
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి సేవల నుంచి నిష్క్రమించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ యుద్ధనౌక శత్రు నౌక ఎటువంటిది, ఏ దేశానికి చెందినది అనేది లెక్క చెయ్యకుండా మిసైల్ దాడులతో ధ్వంసం చేయగలదు. మజ్గావ్ డాక్లో తయారైన ఐఎన్ఎస్ ఖుక్రి 1989లో భారత నౌకాదళంలో చేరింది. 32 ఏళ్లపాటు భారత రక్షణలో పాలుపంచుకున్న ఖుక్రి వీడ్కోలు కార్యక్రమాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాస్తమయం సమయంలో ఖుక్రి నౌకపై ఉన్న జాతీయ జెండా, నౌకాదళ పతాకాన్ని అవనతం చేసి, డీకమిషనింగ్ పెనెంట్‌ని కిందికి దించారు. అనంతరం ఖుక్రీలో పని చేసి రిటైర్ అయిన కమాండింగ్ అధికారుల్ని వైస్ అడ్మిరల్ బిస్వజిత్ అభినందించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఆర్మీ గూర్ఖా బ్రిగేడ్ లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ అనంతనారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా నిర్మించిన తొలి క్షిపణి కార్వెట్టి ఐఎన్ఎస్ ఖుక్రీ సేవలు ఉపసంహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాహసానికి ప్రతీక ఖుక్రి అంటే సాహసోపేతం అని అర్థం. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధ సమయంలో శత్రువుల్ని మట్టికరిపించేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి పాక్ సముద్రజలాల వైపు దూసుకెళ్లింది. అయితే.. సబ్‌మెరైన్ పీఎన్ఎస్ హన్‌గోర్‌లో పొంచి ఉన్న పాక్ సైనికులు డయ్యు సమీపంలో ఖుక్రీని టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఖుక్రీతో పాటు ఆ నౌకలోని 18 మంది అధికారులు, 176 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఖుక్రి కమాండింగ్ అధికారి కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా తన లైఫ్ జాకెట్‌ని జూనియర్ ఆఫీసర్‌కి ఇచ్చి రక్షించి.. తాను ప్రాణాలు వదిలారు. ఖుక్రిని నాశనం చేసిన 48 గంటల్లోనే కరాచీ రేవుని భారత రక్షణ దళం స్వాధీనం చేసుకొని పాక్‌పై విజయం సాధించింది. భారత రక్షణ శాఖలో తిరుగులేని పోరాట స్ఫూర్తి రగిలించిన ఖుక్రి పేరుతో ఈ నౌకని నిర్మించారు. 1989 ఆగస్టు 23న పాత ఖుక్రి నౌకలో అసువులు బాసిన కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా సతీమణి సుధా ముల్లా దీనిని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సేవలందించింది. కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. ఇప్పటివరకూ ఖుక్రిలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. మొత్తం 6,44,897 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం 30 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చినంత. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. -
సాంట్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సాంట్ (స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్) మిస్సైల్‌ను భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. హెలికాప్టర్ నుంచి లాంచ్ చేయగలగడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో దీన్ని పరీక్షించారు. ఈ ఫ్లైట్ టెస్టింగ్‌ను డీఆర్డీఓ, భారతీయ వాయు దళం సంయుక్తంగా నిర్వహించాయని రక్షణ శాఖ వెల్లడించింది. మిసైల్ అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని తెలిపింది. పది కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాలను ఈ మిస్సైల్ ఛేదించగలదు. మిస్సైల్ రిలీజ్ మెకానిజం, గైడెన్స్, ట్రాకింగ్, అంతర్గత సాఫ్ట్వేర్ అన్నీ బాగా పనిచేశాయని రక్షణ శాఖ ప్రకటన తెలిపింది. ప్రాజెక్టు విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పరిశోధక బృందాన్ని అభినందించారు. హైదరాబాద్‌లోని ఆర్సీఐ (ఇమారత్)లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పరీక్షించిన దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల్లో ఇది మూడోదని రక్షణ శాఖ తెలిపింది. దేశీయ రక్షణ సామర్థ్యాలకు మరింత జోరునిచ్చేందుకు సాంట్ పరీక్ష విజయవంతం కావడం దోహదం చేస్తుందని డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి చెప్పారు. -
వెలుగులోకి చైనా కుతంత్రాలు.. ఎక్కడి నుంచైనా దాడి చేసేలా
China Hiding Missiles in Shipping Containers Plans to Attack Anywhere in the World: నయానో, భయానో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న చైనా.. అందుకోసం ఎన్నో దుష్టపన్నాగాలను పన్నుతోంది. ఇప్పటికే హంకాంగ్ను ఆక్రమించేందుకు హాంకాంగ్ లా పేరిట కొత్త సెక్యూరిటీ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంపై హాంకాంగ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికి ఫలితం లేకుండా పోతుంది. ఈ క్రమంలో తాజాగా చైనా దుష్ట పన్నాగం ఒకటి వెలుగులోకి వచ్చింది. (చదవండి: ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?) చైనా షిప్పింగ్ కంటైనర్లలో క్షిపణులని అక్రమంగా తరలిస్తోన్నట్లు సన్ పత్రిక వెల్లడించింది. ఈ మిస్సైల్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఓడరేవులకు అక్రమంగా చేరవేస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. వీటిని ప్రయోగించేందుకు చైనా సిద్ధపడుతోన్నట్లు తెలిసింది. ‘ది సన్’ నివేదిక ప్రకారం, ప్రపంచ మహాసముద్రాలలో చైనాకు చెందిన భారీ నౌకలు ఉన్నాయి. కొంతమంది పాశ్చాత్య పరిశీలకులు చైనా ఈ విధంగా క్షిపణులను అక్రమ రవాణా చేయడం.. కొత్త యుద్ధనౌకలను కొనుగోలు చేయడంతో సమానమని భావిస్తున్నారు. ఈ కంటైనర్లు సాధారణ కంటైనర్ల వలె కనిపిస్తాయి, కాబట్టి వాటిని ఇతర కంటైనర్లతో కలిపి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. (చదవండి: దుబాయ్‌లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా) అదే సమయంలో, శత్రు దేశ నౌకాశ్రయాలకు ఈ క్షిపణులను చేరవేయడం ద్వారా చైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా ఆకస్మిక దాడిని ప్రారంభించగలదు. చైనా వద్ద స్టెల్త్ క్షిపణులు ఉండే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటజీ సెంటర్ రిక్ ఫిషర్ తెలిపింది. అమెరికా, చైనా ఇరు దేశాలు ఆర్థికంగా, సైనిక శక్తి పరంగా ప్రపంచంలోని అగ్రరాజ్యంగా నిలవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇక తైవాన్ భవిష్యత్తుపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో చైనా పావులు కదుపుతుండగా.. డ్రాగన్ నుంచి తైవాన్ను కాపాడతామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలో చైనా ఇలా కంటైనర్లలో మిస్సైల్స్‌ని రవాణా చేస్తుందనే వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది. (చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!) ఈ కొత్త క్షిపణుల నమూనా 2016 ఆర్మ్స్ ఫెయిర్‌లో కనిపించింది. అప్పటి నుంచి చైనా వీటిని ఎప్పుడైనా ప్రయోగించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన కోరిక మేరకు అరాచకాలను సృష్టించేందుకు కంటైనర్ క్షిపణులను పూర్తిగా ఉపయోగించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్ -
తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం
భారత తీరప్రాంత రక్షణ కోసం ప్రత్యేకించి హిందూ మహాసముద్ర ప్రాంతంలో రక్షణ కోసం దేశీయంగా నిర్మించిన అధునాతనమైన క్షిపణి విధ్వంస వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం జలప్రవేశం చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబై తీరంలో ఈ ఆధునిక యుద్ధనౌకను ప్రారంభించారు. శత్రు రాడార్లు గుర్తించలేని ఈ యుద్ధనౌక ద్వారా ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి కూడా క్షిపణులను ప్రయోగించవచ్చు. ‘ఐ.ఎన్.ఎస్. విశాఖపట్టణం’ పేరుతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెజగావ్ డాక్ యార్డ్ లో రూ. 35 వేల కోట్లతో అత్యంత ఆధునిక హంగులతో క్షిపణి విధ్వంస వాహకనౌకను నిర్మించింది. అమెరికా చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ అడ్మిరల్ మైఖేల్ గిల్డే విశాఖపట్టణం నేవల్ డాక్ యార్డ్ నుంచి మన రక్షణశాఖ అధికారులతో కలిసి, గత నెలలో బంగాళాఖాతంలో జరిగిన ‘మలబార్–2’ యుద్ధ నౌకా విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇది జరిగిన నెలరోజుల్లోనే, నేరుగా ఒక క్షిపణి విధ్వంసక నౌక– ‘ఐ.ఎన్.ఎస్. విశాఖపట్టణం’ పేరుతో అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, భారత రక్షణశాఖ ‘మ్యాప్’లో పెరిగిన విశాఖపట్టణం నగరం ప్రాధాన్యతను తెలియచేస్తున్నది. అయితే, విశాఖ నగరంపై అంతర్జాతీయ ‘ఫోకస్’ పెట్టడం అనేది ఇప్పటి మాట కాదు. బరాక్ ఒబామా ప్రభుత్వం ఇండియాలో ‘స్మార్ట్ సిటీలు’గా అభివృద్ధి చేయడానికి, జనవరి 2015లో భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో– అజ్మీర్, అలహాబాద్, విశాఖపట్టణం నగరాలు ఉన్నాయి. అయితే, డోనాల్డ్ ట్రంప్ హయాంలో అది ఆగిపోయింది. అంతే కాదు, ట్రంప్ నిర్లక్ష్యంతో అమెరికా–ఇండో–ఫసిఫిక్ విధానా నికి ‘ఆసియాన్’ దేశాల్లో ఐదేళ్ళు స్తబ్దత తప్పలేదు. జనవరిలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా వచ్చాక, ఈ ఏడాది చివరి నాటికి ఈ అంశంపై కొత్త కదలిక మొదలవడం తెలిసిందే. (చదవండి: ఇప్పుడు గుర్తొచ్చిన జాతీయ ప్రయోజనం!) అంతర్జాతీయ విపణిపై చైనా పట్టును నిలువరించడం అగ్ర రాజ్యాల అవసరం అయ్యాక, జరుగుతున్న ప్రతి పరిణామా నికి ఆసియా కేంద్రంగా మారింది. ఒకప్పటి ‘ప్రచ్ఛన్నయుద్ధం’ స్థానంలోకి విశ్వ వాణిజ్యం లక్ష్యంగా – భౌగొళిక ప్రాతిపదిక రాజకీయాలు... నూతన దౌత్య ప్రత్యామ్నాయాలు అయ్యాయి. గత దశాబ్దంలో ‘యూపీఏ–2’ చొరవతో ‘ఆసియాన్’ సభ్యదేశా లతో జరిగిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంతో ఆ జాబితాలోకి అలా చేరినదే కేరళ రబ్బరు, మన అరకు – ‘గిరిజన్ కాఫీ’. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరిస్తున్న క్షిపణి విచ్చిన్న యుద్ధ నౌకకు ‘ఐ.ఎన్.ఎస్. విశాఖ పట్టణం’ అని నామకరణం చేస్తున్నట్లు నవంబర్ 16న ఢిల్లీలో నేవీ వైస్–చీఫ్ వైస్ ఎడ్మిరల్ ఎస్, ఎన్. ఘోర్మాడే ప్రకటిం చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మన నౌకానిర్మాణ యార్డుల్లో 39 యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. త్రివిధ దళాల బలగాలను ఒక్కటిగా సమీకృతం చేసి, మన పోరాట శక్తిని పెంచుకునే వ్యూహం అమల్లో ఉందని, దాని ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు ఘోర్మాడే. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) ఇకముందు ‘విశాఖపట్టణం’ నగరం పేరు ఇలా ఆసియా ‘మారిటైమ్’ పటంపై కనిపించడం తెలుగు ప్రజలకు ప్రతిష్ఠా త్మకమైన అంశం. అయినా ఇలా విశాఖ నగరం కీలకం కావడం ఇది మొదటిసారి కాదు. పన్నెండేళ్ల క్రితం అప్పట్లో భారతీయ నౌకాదళం అధునికీకరణలో భాగంగా– ‘సీక్రెటివ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సల్ ప్రాజెక్ట్’ కింద ఐదు స్వదేశీ నిర్మాణ జలాం తర్గాములను మనదేశం నిర్మించాలని తలపెట్టింది. అప్పుడు కూడా ఇదే విశాఖపట్టణం నేవల్ డాక్ యార్డ్‌లోనే 26 జూలై 2009న వాటిలో మొదటి సబ్–మెరైన్– ‘ఐ.ఎన్.ఎస్. అరి హంత్’ను నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అవిష్కరించారు. అప్పటినుండి 2016 ఫిబ్రవరి వరకు ‘అరిహంత్’ సామర్థ్యంపై సముద్ర జలాల్లో విస్తృత పరీక్షలు జరిగాక, 2018 నుంచి మన నౌకాదళంలో ‘అరిహంత్’ భాగం అయింది. ఈ పరిణామాల మధ్యలోనే, 2014లో ఉమ్మడి రాష్ట్ర విభ జన, ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ మార్పు రెండూ జరి గాయి. మరి దేశానికీ, తూర్పుతీరంలో రక్షణ శాఖకూ ఇంతగా ప్రాధాన్యత వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వంతంగా నిలదొక్కు కోవడానికి, చేయూత అందించే విషయంలో– ‘విభజన చట్టం’ లోని అంశాల అమలు పరిధులు దాటి కేంద్రం చూపించిన చొరవ కనిపించదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాజకీయ ప్రయోజనం లేకపోవడం, అనే ఒక్క కారణం తప్ప దీనికి మరో కారణం ఇప్పటికీ కనిపించదు. అయితే, ప్రభుత్వాల దేశీయ అంశాల ప్రాధాన్యతలు ఎలావున్నప్పటికీ, దేశ ప్రాదేశిక సరిహద్దుల భద్రతకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో, రక్షణశాఖ ప్రాధాన్యతలు మాత్రం అలా ఉండ వని– ‘ఐ.ఎన్.ఎస్. విశాఖపట్టణం’ నామకరణంతో స్పష్టం అవుతున్నది. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
భారత్‌కు ఎస్–400 క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఎస్–400 క్షిపణుల సరఫరా ప్రక్రియను రష్యా ప్రారంభించింది. భారత్‌కు ఈ క్షిపణులను అందజేస్తున్నామని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలటరీ టెక్నికల్ కోపరేషన్ డైరెక్టర్ దిమిత్రి షుగావ్ చెప్పారు. ‘‘ముందుగా అనుకున్న ప్రకారమే భారత్‌కు ఎస్–400 క్షిపణుల్ని సరఫరా చేసే ప్రక్రియ ప్రారంభమైంది’’అని దుబాయ్ ఎయిర్ షో ప్రారంభానికి ముందు వెల్లడించారు. సుదూర లక్ష్యాలను ఛేదించడంలో, గగనతలం నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడంలో ఎస్–400 క్షిపణులు మన దేశానికి అండగా నిలవనున్నాయి. మొదటి క్షిపణిని చైనాతో సంక్షోభం నెలకొని ఉన్న లద్దాఖ్ సెక్టార్లో మెహరించాలని భారత వాయుసేన భావించినట్టు తెలుస్తోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్ల నుంచి ఏకకాలంలో వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి వీలుగా పశ్చిమ ప్రాంతంలో ఈ క్షిపణుల్ని మోహరించే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టుగా రక్షణ శాఖలోని కొందరు అధికారులు చెబుతున్నారు. చైనా ఇప్పటికే ఎస్–400 రెండు క్షిపణుల్ని లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మోహరించింది. 2018లో రూ.35 వేల కోట్లతో 5 ఎస్–400 క్షిపణుల కొనుగోలుకు రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. సముద్రం, గగనతలం మీదుగా ఈ క్షిపణుల అందజేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 5 క్షిపణులు భారత్‌కు చేరనున్నాయి. ఇప్పటికే ఈ క్షిపణుల వినియోగంపై భారత వైమానిక దళం అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది. అమెరికా అభ్యంతరాలు భారత్, రష్యాతో క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని మొదట్నుంచీ అమెరికా వ్యతిరేకిస్తోంది. రష్యాతో ఎలాంటి లావాదేవీలు చేయొద్దని ఒత్తిడి పెంచుతోంది. అయితే ప్రాంతీయ భద్రత, రక్షణ రంగంలో అవసరాల దృష్ట్యా ఎస్–400 ఒప్పందానికి మినహాయింపు ఇవ్వాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు. దీనిపై ఎలాంటి స్పందన రాకుండానే క్షిపణి వ్యవస్థ భారత్‌కు చేరుకునే ప్రక్రియ ప్రారంభం కావడం గమనార్హం. -
మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!
న్యూయార్క్: ఇప్పటి వరకు దేశాల మధ్య పారిశ్రామిక ఒప్పందం, అణ్యాయుధాల ఒప్పందం, సరిహద్దుల ఒప్పందం విఫలం కావడం వంటి కారణాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందేమోనని దేశాధి నేతలు భయపడుతున్నారు. పరిస్థితి మరీ దిగజారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సంప్రదింపులు, చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది గ్రహాంతరవాసులతోటే అంటున్నారు యూఎస్ మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ అంటున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్ అంటున్నారు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో అవి కొన్ని క్షిపణులను యాక్టివేట్ చేయడం మొదలు పెట్టడమే కాకా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా సలాస్ అన్నారు. సలాస్ యూఎస్ ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్ వెపన్ కంట్రోలర్‌గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించాడు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
'నిర్ణయ్' క్షిపణి ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ రూపొందించిన బూస్టర్ ఇంజిన్ అమర్చిన 'నిర్భయ్' క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బుధవారం ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కిమీల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేధించగలదు. బుధవారం ఉదయం పదింటికి క్షిపణిని ప్రయోగించగా 15 నిమిషాలపాటు గాల్లో దూసుకెళ్లి 100 కి.మీ.ల దూరంలోని నిర్దేశత లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని డీఆర్డీవో పేర్కొంది. ' 'నిర్భయ్' ప్రాజెక్టు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒక దశలో ఏకంగా ఈ ప్రాజెక్టునే పక్కనపెట్టేయాలని రక్షణ శాఖ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల లేమి, పలు సాంకేతిక సమస్యలు ఇందుకు కారణాలయ్యాయి.. ఇటీవల గత ఏడాది అక్టోబర్‌లో సైతం క్షిపణిని ప్రయోగించాక ఎనిమిది నిమిషాల తర్వాత పరీక్షను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇన్ని అడ్డంకుల్ని తట్టుకుని తాజా పరీక్షలో 'నిర్భయ్' తన సత్తా చాటింది. పరీక్ష విజయవంతమవడంతో వీలైనంత త్వరగా సైన్యానికి అందించేలా దీన్ని సంసిద్ధం చేయాలని డీఆర్డీవో భావిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్‌లో సైన్యంలోకి తీసుకున్నాక చైనా సరిహద్దుల్లో దీన్ని మోహరించే వ్రతిపాదనలూ ఉన్నాయి. భూతల లక్ష్యాలను చేధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రయోగించే. క్రూయిజ్ క్షిపణి రకానికి చెందిన “నిర్భయ్” ఏకంగా 800 కేజీల పేలుడు పదార్దాలను మోసుకుపోగలదు. దాదాపు 0.7 మ్యాక్ స్పీడ్‌తో ఇది ప్రయాణిస్తుంది. అరు మీటర్ల పోడవు, 0.52 మీటర్ వెడల్పుండే ఈ క్షిపణిని గగనతల, సముద్ర, భూతలాల నుంచి ప్రయోగించవచ్చు. తొలి దశలో ఘన ఇంధనాన్ని తర్వాత ద్రవ ఇంధనాన్ని వాడుకునే మిస్సైల్ ఇది. జలాంతర్భాగంలో ప్రయాణించడంతోపాటు, అత్యంత తక్కువ ఎత్తుల్లో ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో దీని జాడను శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవు. -
ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించేది అందుకేనా
వాషింగ్టన్: అమెరికా రక్షణ, దౌత్యాధికారులు ఉత్తర కొరియాను సందర్శించిన కొద్ది రోజులకే ఉ.కొ అనేక క్షిపణులను పరీక్షించిందని మంగళవారం వైట్ హౌస్ తెలిపింది. ఆదివారం రెండు క్షిపణులను పరీక్షించడం ద్వారా వాషింగ్టన్ ,సియోల్‌ను రెచ్చగొట్టడానికి ప్యాంగ్యాంగ్ మళ్లీ తన పాత పద్ధతులను అనుసరిస్తోందని తెలుస్తోంది. ఈ పరిణామాలను చూస్తుంటే ప్యాంగ్యాంగ్ వైపునుంచి బిడెన్ ప్రభుత్వానికి ఎదురుకాబోయే మొదటి సవాలు ఇదేనని తెలుస్తోంది. అయితే, దీనిపై అమెరికా పరిపాలనా అధికారులు మాట్లాడుతూ.. క్షిపణుల పరీక్ష "సాధారణ" సైనిక పరీక్షే అని అన్నారు. అలాగే అణ్వాయుధీకరణపై ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపుతున్న వాషింగ్టన్కు ఈ చర్యలు అడ్డు కావని తెలిపారు. అవి తక్కువ రెంజ్ కలిగిన, నాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలు అని, అలాగే ఈ క్షిపణిలు ఏవీ కూడా యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు నిరోధించిన పరిధిలోకి రావని అమెరికా పరిపాలన సీనియర్ అధికారి విలేకరులతో అన్నారు. గత అమెరికా ప్రభుత్వాలను రెచ్చగొట్టడానికి అప్పట్లో ప్యాంగ్యాంగ్ ప్రయోగించిన అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు వంటివి ఏవీ ఇందులో లేవన్నారు. ప్రస్తుతం పరీక్షించిన ఈ క్షిపణులు ఆ కోవలోకి రావని తెలిపారు. ఉత్తర కొరియా తమ వివిధ వ్యవస్థలను పరీక్షించడంలో భాగంగా ఇలాంటివి చేయటం అక్కడ సర్వ సాధారణమని, తాము ప్రతి రకమైన పరీక్షకు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ( చదవండి : ఈ నాలుగేళ్లు ప్రశాంతంగా నిద్ర పోవాలంటే.. ) -
ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్
ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల్లో భారత్ ఒకటి. అదే సమయంలో అసాల్ట్ రైఫిల్ నుంచి బాలిస్టిక్ మిసైల్స్ వరకు ప్రపంచంలోని అత్యుత్తమ ఆయుధ వ్యవస్థలకు భారతీయ పరిశ్రమలు విడి భాగాలను అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధరంగంలో స్వావలంభన సాధించడం కోసం మేకిన్ ఇండియా పథకం ద్వారా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఆయుధ దిగుమతుల నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో గడచిన ఐదేశ్లలో భారత్ ఆయుధ దిగుమతులు 33 శాతం తగ్గాయి. సాయుధ దళాల ఆధునీకరణకు గడచిన ఐదేళ్లలో 304 ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇందులో 190 ఒప్పందాలు దేశీయ సంస్థలతోనే జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో తెలిపింది. గతేడాది ఆగస్టులో 101 రకాల ఆయుధాల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న ఏడేళ్లలో దేశీయ ఆయుధ పరిశ్రమలతో కేంద్రం రూ.4 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చు కుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆయుధాల విలువ రూ.1.3 లక్షల కోట్లు చొప్పున ఉండగా, నౌకాదళానికి చెందిన ఆయుధాల విలువ రూ. 1.4 లక్షల కోట్లు ఉండనుంది. దెబ్బతిన్న రష్యా మార్కెట్ భారత్ ఆయుధ దిగుమతులను తగ్గించుకోవడంతో ఆ ప్రభావం రష్యా మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోందని స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) తన నివేదికలో పేర్కొంది. రష్యా ఆయుధాలపై ఆధార పడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి సంక్లిష్ట నిబంధనల కారణంగానే రష్యా నుంచి భారత్ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోయాయని వివరించింది. అదే సమయంలో ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి ఆయుధ ఎగుమతులు పెరిగాయని పేర్కొంది. భారత్ 2019లో రక్షణ రంగానికి 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు ఎస్ఐపీఆర్ఐ 2020 ఏప్రిల్‌లో వెల్లడించింది. దీంతో రక్షణరంగ వ్యయంలో అమెరికా, చైనా తరువాత భారత్ మూడో స్థానంలో నిలిచిందని తెలిపింది. అమెరికా వాటా 37 శాతం ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ఎస్ఐపీఆర్ఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా తన వాటాను 32 నుంచి 37 శాతానికి పెంచుకున్నట్లు తెలిపింది. 2016-20 మధ్య అమెరికా 96 దేశాలకు కీలక ఆయుధాలను ఎగుమతిచేసింది. మొత్తం ఎగుమతుల్లో 47శాతం మధ్య ఆసియా దేశాలకే జరిగాయి. అమెరికా ఆయుధ ఎగుమతుల్లో ఒక్క సౌదీ అరేబియా వాటానే 24 శాతం ఉన్నట్లు ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. అమెరికా ఆయుధ ఎగుమతులు భారీగా వృద్ధి చెందడంతో ప్రధాన పోటీదారు అయిన రష్యాకు అందనంత ఎత్తుకు చేరుకుంది. అదే సమయంలో రష్యా, చైనా ఆయుధ ఎగుమతులు భారీగా క్షీణించినట్లు ఈ నివేదిక వివరించింది. 2016-20 మధ్య కాలంలో రష్యా ఆయుధ ఎగుమతులు 20 శాతం వరకు తగ్గిపోయాయి. దీనికి ప్రధాన కారణం రష్యా నుంచి భారత్ ఆయుధ దిగుమతులు 54 శాతం వరకు తగ్గిపోవడమేనని నివేదిక తెలిపింది. చైనా, అల్జీరియా, ఈజిప్ట్ దేశాలకు రష్యా ఆయుధ ఎగుమతులు పెరిగినప్పటికీ భారత్‌లో తగ్గిపోయిన మార్కెట్‌ను అవి పూరించలేకపోయాయని ఎస్ఐపీఆర్ఐకు చెందిన ఆయుధ, సైనిక వ్యయ పరిశీలకుడు అలెగ్జాండర్ క్విమోవ్ పేర్కొన్నారు. మరో కీలక ఆయుధ ఎగుమతిదారు అయిన ఫ్రాన్స్ 2016-20 మధ్య ఎగుమతుల్లో 44% వృద్ధి సాధించిందని నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో ఫ్రాన్స్ వాటా 8.2 శాతానికి చేరుకుందని తెలిపింది. ఫ్రాన్స్ ఆయుధ ఎగుమతుల్లో 59శాతం భారత్, ఈజిప్ట్, ఖతార్ దేశాలకే జరిగాయి. రక్షణ విభాగంలో దేశీయ పబ్లిక్, ప్రైవేట్ రంగ సంస్థలు 1. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్): యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వాటి ఇంజన్ల డిజైన్, డెవలప్మెంట్, ఉత్పత్తి, మరమ్మతుల పనులు చూస్తుంది. 2. భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్): రక్షణ రంగం, పారామిలిటరీ విభాగాలు వినయోగించే సున్నితమైన ఎల్రక్టానిక్ విభాగాల ఉత్పత్తి, డిజైన్, అభివృద్ధి పనులను చేపడుతుంది. 3. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్): రక్షణ శాఖ కోసం వివిధ రకాల ప్రత్యేకతలతో కూడిన భారీ వాహనాలను తయారు చేస్తుంది. 4. మజగావ్ డాక్ లిమిటెడ్ (ఎండీఎల్): భారత నౌకా దళం కోసం జలాంతర్గాములు, మిసైల్ బోట్స్, నౌకలను ధ్వంసం చేసే ఆయుధాలు, ఫ్రిగేట్స్లు తయారు చేస్తుంది. 5. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ): భారత నౌకాదళం కోసం యుద్ధ నౌకలు, వాటిని అనుబంధంగా ఉండే సహాయక ఓడలు తయారీ, మరమ్మతుల పనులు చేపడుతుంది. 6. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్): మిసైల్స్, టార్పెడోల దాడిని అంచనా వేసే సిస్టంలను తయారు చేస్తుంది. 7. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని): ఏరోనాటిక్స్, అంతరిక్ష వాహకనౌకలు, మిలటరీ, నేవీ వాహనాలకు కావాల్సిన విడిభాగాలను రూపొందిస్తుంది. 8. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్): వాయుసేనకు సంబంధించిన విమానాల విడిభాగాల ఉత్పత్తి, మిలిటరీ ఆయుధాలు, మిలిటరీ వాహనాల్లోని ఆయుధాలకు కావాల్సిన అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేస్తుంది. 9. లార్సన్ అండ్ టూబ్రో: భూతలం, యుద్ధనౌకలపై నుంచి వాడే మిసైల్స్ డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి చేస్తుంది. 10. మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్: తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆయుధాలు, చిన్నసైజు ఆయుధాల ఉత్పత్తితో పాటు మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది. 2015-19 మధ్య వివిధ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధ వివరాలు స్కాంటర్ 6000 రాడార్లు - డెన్మార్క్ ఎంబ్రేర్ ఈఆర్జే - 145 జెట్లు - బ్రెజిల్ ఏసీటీఏఎస్ సోనార్ సిస్టమ్స్ - జర్మనీ సూపర్ ర్యాపిడ్ 76 ఎంఎం నావెల్ గన్స్ - ఇటలీ కే9 థండర్ 155 ఎంఎం ఆర్టిలరీ గన్స్ - దక్షిణ కొరియా 2014-18 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో తొలి పది దేశాల వాటా.. సౌదీ అరేబియా 12% ఇండియా 9.5% ఈజిప్ట్ 5.1% ఆస్ట్రేలియా 4.6% అల్జీరియా 4.4% చైనా 4.2% యూఏఈ 3.7% ఇరాక్ 3.7% ద. కొరియా 3.1% వియత్నాం 2.9% -
ఎంఆర్ఎస్ఏఎం క్షిపణి ప్రయోగం విజయవంతం
భువనేశ్వర్: ఒడిశా తీరంలో గల చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఆర్మీ వెర్షన్ నుండి ప్రయోగించిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్(MRSAM) పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా డీఆర్డీవో స్వదేశీ పరిజ్ఞానంతో భారత సైన్యం కోసం ఈ క్షిపణిని రూపొందించింది. పరిక్షదశలో ఈ క్షిపణి వేగవంతమైన మానవరహిత వైమానిక లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా మొదట బ్రిటిష్ డ్రోన్ మానవరహిత వైమానిక వాహనం(యుఎవి) బాన్షీని గగన్ తలంలోకి పంపించి.. ఆ తర్వాత మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్‌తో దాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రయోగించిన మొదటి దశలోనే లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగానికి ముందు డీఆర్డోవో ప్లాంట్‌కు 2.5కి.మీ పరిధిలో గల ప్రజలను ఖాళీ చేయడంతో పాటు స్థానిక మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని రెవిన్యూ అధికారులు సూచించారు. దాదాపు 100కి.మీ దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అలాగే 60కేజీ పేలోడ్, 4.5 మీటర్ల పొడవైన అణు సామర్థ్యం గల క్షిపణిలను ఇది మోసుకెళ్లగలదు. దీని బరువు సుమారు 2.7 టన్నులు. మెరుపువేగంతో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ మిషన్‌లో పాల్గొన్న డీఆర్డీఓ, అనుబంధ బృంద సభ్యుల కృషిని ప్రశంసించారు. స్వదేశీ ఆధునిక ఆయుధ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో భారతదేశం ఉన్నత స్థాయి సామర్థ్యాన్ని సాధించిందని అన్నారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్డీఓ బృందాన్ని డీఫెన్స్ ఆర్ అండ్ డీ కార్యదర్శి, ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి అభినందించారు. -
నేటి నుంచి సూర్యలంక తీరంలో మిస్సైల్ ఫైరింగ్
బాపట్ల టౌన్: గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో మంగళవారం నుంచి మిస్సైల్ ఫైరింగ్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో తీరప్రాంతానికి దగ్గరగా దట్టమైన అడవుల మధ్య ఫైరింగ్ చేసేందుకు అనుకూలంగా ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్‌కు ఈ తీరాన్ని ఎన్నుకున్నారు. ఆకాశమార్గం గుండా దేశంలోకి చొరబడే శత్రు విమానాలను నింగిలోనే గుర్తించి ఆ విమానాలను వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే మట్టికరిపించడం ఈ మిస్సైల్ ఫైరింగ్ ముఖ్య ఉద్దేశం. ఫైరింగ్‌కు కేరాఫ్ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో సహజసిద్ధమైన తీరంగా ఖ్యాతిని సొంతం చేసుకుంది సూర్యలంక తీరం. వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంలోనూ ప్రత్యేకత చాటుతోంది. త్రివేండ్రం కమాండ్ పరిధిలో ఉన్న వాటిలో ఫైరింగ్‌కు అనుకూలమైన స్టేషన్ సూర్యలంక ఒక్కటే. ఫైరింగ్ చేసే ప్రతిసారీ మిస్సైల్ తయారీకి ఉపయోగించే శకలాలు భూమ్మీద పడితే వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇనుప వస్తువులు, ఉక్కుసామగ్రి వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సముద్రానికి ఆనుకుని ఉండటంతో మిస్సైల్ ఫైరింగ్ అనంతరం శకలాలు సముద్రంలో పడిపోతుంటాయి. దీంతో ఎవరికీ ఎలాంటి హాని వాటిల్లే అవకాశం లేదు. అందుకే దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకంటే సూర్యలంక స్టేషన్ శిక్షణ రంగంలో ముందంజలో ఉంది. తీరప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ సూర్యలంక సముద్ర తీరంలో మంగళవారం నుంచి డిసెంబర్ 2 వరకు జరిగే మిస్సైల్ ఫైరింగ్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, రాష్ట్ర రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖాధికారులు తీరప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తం చేశారు. ఫైరింగ్ జరిగే ప్రాంతం నుంచి తీరం వెంబడి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ప్రజలు ఉండకూడదని, ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు ఫైరింగ్‌పై అవగాహన కల్పించారు. సూర్యలంకకు ప్రత్యేక స్థానం భారతదేశంలో మొత్తం 7 కమాండ్లు ఉన్నాయి. వాటిలో డబ్ల్యూఏసీ (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్– ఢిల్లీ), సౌత్ ఎయిర్ కమాండ్ (త్రివేండ్రం), సౌత్ వెస్ట్ ఎయిర్ కమాండ్ (గుజరాత్), మెయింటెనెన్స్ కమాండ్ (నాగపూర్), సెంట్రల్ కమాండ్ (అలహాబాద్–యూపీ), ట్రైనింగ్ కమాండ్ (బెంగళూరు), అండమాన్ నికోబార్ కమాండ్ (పోర్ట్‌బ్లెయిర్)లో ప్రధానమైన కమాండ్లు ఉన్నాయి. ఒక్కో కమాండ్ పరిధిలో పదుల సంఖ్యలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు ఉంటాయి. త్రివేండ్రంలో ఉన్న సౌత్ ఎయిర్ కమాండ్ (సదరన్ కమాండ్) పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన 15 ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏకైక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సూర్యలంక మాత్రమే. -
చైనా కవ్వింపు..‘ఇగ్లా’ను రంగంలోకి దించిన భారత్
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇప్పటికే హెలికాప్టర్లను మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో భారత్ బలగాలు ఎక్కడికైనా మోసుకుపోగలిగే పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల్ని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో మోహరించాయి. సైనికులు భుజం మీద మోస్తూనే ఈ క్షిపణులతో శత్రువులపై గుళ్ల వర్షం కురిపించవచ్చు.(చదవండి : వినకుంటే సైనిక చర్యే.. చైనాకు రావత్ వార్నింగ్) ఈ క్షిపణి వ్యవస్థను ఆర్మీ, వైమానిక దళం వినియోగిస్తాయి. చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు నిఘాను పెంచారు. భూమ్మీద నుంచే గగన తలంలో జరిగే ప్రతీ కదలికను పసిగట్టేందుకు రాడార్లు ఏర్పాటు చేశారు. దౌత్య చర్చలు విఫలమైతే సైనిక చర్యలు తప్పవంటూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరికలు జారీ చేశారు. -
‘మానవ తప్పిదం వల్లే ఆ 176 మంది మృతి’
టెహ్రాన్: ఈ ఏడాది జనవరిలో ఇరాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 176 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదానికి గల కారణాలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. మానవ తప్పిదం వల్ల వాయు రక్షణ విభాగం రాడార్ సిస్టమ్ విఫలమయయ్యిందని తెలిపింది. రాడార్‌ను సమలేఖనం చేయడంలో వైఫల్యం తలెత్తిందని.. ఫలితంగా వ్యవస్థలో 107 డిగ్రీల లోపం ఏర్పడిందని ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ తప్పిదం వల్ల వరుస ప్రమాదాలు సంభవించి చివరకు విమానం కూలిపోయిందని అధికారులు ఒక వాస్తవిక నివేదికను విడుదల చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే టెహ్రాన్ విమానాశ్రయానికి సమీపంలో ఉక్రేయిన్‌కు చెందిన ఈ బోయింగ్ 737 విమానం కుప్ప కూలింది. అందులో ప్రయాణిస్తున్న 167 మంది ప్రయాణికులతో పాటు మరో 9 మంది ఫ్లైట్ సిబ్బంది కలిపి మొత్తం 176 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. అయితే ఆ విమానాన్ని తమ రెండు ‘టార్ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని ఇరాన్ అప్పట్లోనే ప్రకటించింది. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్) ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదం జరిగిన నాడు ఇరాన్, అమెరికా దళాలపై దాడులు జరిపింది. ఇందుకు ప్రతీకారంగా అమెరికా తిరిగి మా దళాలపై దాడులు చేస్తుందనే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఈ క్రమంలో డిఫెన్స్ యూనిట్ ఆపరేటర్ ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్‌ను గుర్తించాడు. దాంతో ఎలాంటి సమాచారం లేకుండానే రెండు రాడార్లను ఎయిర్‌క్రాఫ్ట్ మీదకు ప్రయోగించాడు. ఫలితంగా ప్రమాదం సంభవించింది’ అన్నాడు. -
లద్దాఖ్‌కు క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ముందుకు చొచ్చుకువచ్చిన చైనా ఆర్మీ వెనక్కి తగ్గేది లేదంటూ మొండికేసింది. పైపెచ్చు వివాదాస్పద ప్రాంతాల్లోకి భారీగా సైనిక బలగాలను దించుతోంది. దీంతో భారత్ అదే స్థాయిలో చర్యలు చేపడుతోంది. లద్దాఖ్‌కు ఆర్మీతోపాటు వైమానిక బలగాలను తరలించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు కీలకమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను తరలించింది. గల్వాన్ ఘటన జరిగిన పెట్రోల్ పాయింట్–14 వద్దకు రెండు దేశాలు బలగాలను, సైనిక సంపత్తిని భారీగా తరలించాయి. ఈ ఘటన జరిగిన అనంతరం అదే రోజు రెండు దేశాల కార్ప్స్ కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక వైపు సాగుతుండగానే చైనా అబ్జర్వేషన్ పోస్టులు, టెంట్లతోపాటు గోడను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. అక్కడి నుంచి వెనక్కి తగ్గేందుకు చైనా నిరాకరించడంతో ఆ రోజు జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా గల్వాన్ లోయను తమ మ్యాప్‌లో చైనా చూపించుకోలేదు. అయినప్పటికీ, అది తమ భూభాగం కాబట్టే అక్కడికి వచ్చామనీ, తిరిగి ఎందుకు వెనక్కి వెళ్లాలని చైనా ప్రతినిధులు వాదించినట్లు సమాచారం. ఆ తర్వాత జరగాల్సిన చర్చల తేదీలు కూడా ఖరారు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రెండు దేశాలు ఎల్ఏసీ వెంట ఆయుధ సంపత్తిని, బలగాలను మోహరించడం కొనసాగిస్తున్నాయి. మరో మూడు నెలల తర్వాత లద్దాఖ్‌లో మళ్లీ మంచు కురియడం మొదలవుతుంది. ఆ సమయంలో లద్దాఖ్‌కు మిగతా భారత దేశంతో దాదాపు 6 నెలలపాటు సంబంధాలు తెగిపోతాయి. భారత సైన్యం కూడా అటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లకు సిద్ధమైంది. చైనా మోహరింపులిలా.. ► ఎల్ఏసీ వెంట చైనా భారీగా బలగాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధ విమానాలను మోహరించింది. పాంగాంగ్ త్సోలోని ఫింగర్4 వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేసింది. ► సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లను అక్కడ మోహరించింది. ఇవి భారత్‌తో సరిహద్దులకు 10 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి పహారా కాస్తున్నట్లు సమాచారం. ► దౌలత్ బేగ్ ఓల్డీ, పెట్రోలింగ్ పాయింట్–14 సమీపంలోని గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్–15,17, 17ఏ, ఫింగర్ పాయింట్, పాంగోంగ్ త్సోలకు సమీపంలోని చైనా సైనిక హెలికాప్టర్లు గస్తీ చేపట్టాయి. భారత్ ఏం చేస్తోందంటే.. ► ఉత్తర భారతదేశంలోని ఎయిర్ బేస్‌లు, కంటోన్మెంట్లలో ఉన్న బలగాలు, ఫిరంగులు, శతఘ్ని దళాలు, నిఘా రాడార్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు గత నెల నుంచి లద్దాఖ్‌కు తరలుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ప్రస్తుతం 45వేల సైన్యం మోహరించి ఉంది. ► చైనా బలగాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తక్షణమే తప్పికొట్టేందుకు వైమానిక, నావికా దళాలకు చెందిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలతోపాటు డ్రోన్లను సైతం రెప్పపాటులోనే నేలకూల్చే సామర్ధ్యం ఉన్న ఆకాశ్ క్షిపణులు ఇందులో ఉన్నాయి. ► చండీగఢ్‌లోని వైమానిక స్థావరం నుంచి 46 టన్నుల భారీ టి90 యుద్ధట్యాంక్‌ను సి17 గ్లోబ్‌మాస్టర్ విమానం లద్దాఖ్‌కు మోసుకెళ్లింది. ► దౌలత్ బేగ్ ఓల్డీ, ఫుక్చే, నియోమాల్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను ఎయిర్ ఫోర్స్ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎస్యు30 ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరించింది. శ్రీనగర్, లేహ్‌లో జాగ్వార్, మిరాజ్–200 యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ► సముద్రంలో చైనా కదలికలపై కన్ను వేసి ఉంచేందుకు నేవీ తన పి–81 నిఘా విమానాన్ని గస్తీకి పంపింది. ► లద్దాఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన చైనా సరిహద్దుల్లో ఉన్న 65 పాయింట్లలో పహారాను మరింత పెంచింది. ► సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గల్వాన్ లోయ, లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, డెప్సంగ్ మైదానాలు, ప్యాంగాంగ్ త్సోతోపాటు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉండటంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నిపుణులు ఏమన్నారంటే.. ► ‘అతిక్రమణలను, భారత భూభాగం వైపు నిర్మాణాలు చేపట్టడం చైనా నిలిపివేయాలి. సైనిక ప్రతిష్టంభన తొలగిపోవడానికి ఏకైక పరిష్కారం ఇదే’ అని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ అన్నారు. ► వెనక్కి తగ్గేందుకు రెండు పక్షాలు ఏమేరకు సానుకూలంగా ఉన్నాయనే దానిపైనే వివాద పరిష్కారం ఆధారపడి ఉంది’ అని మాజీ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. ► ‘సరిహద్దుల్లో మోహరింపులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయి. బలగాల ఉపసంహరణ టి–20 మ్యాచ్‌లాగా వెంటనే ఫలితం తేలేది కాదు, టెస్ట్ మ్యాచ్ వంటిది. ఇందుకు 2, 3 నెలల వరకు పట్టవచ్చు. అంతకంటే, ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు’ అని సైనిక ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి అంచనా వేశారు. ► భారత్‌తో సరిహద్దుల వెంట చైనా అనుసరిస్తున్న వైఖరితో ఆ దేశం భవిష్యత్తులో సుదీర్ఘ కాలం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్(రిటైర్డు) లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి తీరుతో ఆ దేశం అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతుందన్నారు. ప్రపంచమంతా కోవిడ్–19 మహమ్మారితో పోరాడుతుంటే చైనా మాత్రం లద్దాఖ్‌లో దుశ్చర్యకు పాల్పడటం ఆ దేశం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని అమెరికాతో టారిఫ్ యుద్ధం, ఆస్ట్రేలియాతో విభేదాలు, హాంకాంగ్‌లో దిగజారుతున్న పరిస్థితులతో చైనాకు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. గల్వాన్ ఘటనతో చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒక రాజకీయ బలగమే తప్ప దానికి ఎలాంటి సైనిక ప్రమాణాలు లేనట్లు అర్థమవుతోందని చెప్పారు. -
పాక్ క్షిపణి ప్రయోగం విఫలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం మరోసారి విఫలమైంది. బెలుచిస్తాన్లో సోన్మియానీ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన బాబర్ 2 క్షిపణి ప్రయోగం విఫలమైంది. ఈ క్షిపణిని ఉపరితలం నుంచి 750కిలోమీటర్లు నింగికి ప్రయాణించే లక్ష్యంగా రూపొందించారు. కాగా, బాబర్ 2 క్రూయిజ్ క్షిపణి కేవలం రెండు నిమిషాలు మాత్రమే నింగిపై ప్రయాణించి నేలపై కుప్పకూలింది. గత ఏప్రిల్‌లో పాక్ ప్రయోగించిన బాబర్ 2 సబ్ సోనిక్ క్షిపణి ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. డీఆర్డీవో అభివృద్ధి చేసిన నిర్బయ్ ప్రయోగానికి దీటుగా పాక్ చైనాతో కలిసి క్షిపణి ప్రయోగానికి సిద్దమైందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాక్‌కు వైఫల్యాలతో పాటు క్షిపణి ప్రయాగాలలో కొన్ని విజయవంతమయ్యాయి. ఫిబ్రవరి 2020లో అణుసామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్–2ను 600 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించి విజయం సాధించింది. ఈ ప్రయోగం భూమిపై, సముద్రంలో సైనిక ‘నియంత్రణ సామర్థ్యం’ను పెంచిన విషయం విదితమే. -
ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్
టెహ్రాన్: అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో జనవరి 8న తాము పొరపాటున కూల్చేసిన ఉక్రెయిన్ విమాన ఘటనపై మంగళవారం ఇరాన్ మరింత వివరణ ఇచ్చింది. ఆ రోజు ఉదయం టెహ్రాన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే విమానం నగర శివార్లలో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ విమానాన్ని తమ రెండు ‘టార్ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని తాజాగా ప్రకటించింది. విమానంలోని బ్లాక్ బాక్స్‌లను డీకోడ్ చేసే అత్యాధునిక సాంకేతికత తమ వద్ద లేదని, డీకోడ్ చేసేందుకు అమెరికా, ఫ్రాన్స్‌ల సాయం కోరామని, వారి నుంచి సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ఇరాన్ పౌర విమానయాన విభాగం తెలిపింది. టార్ ఎం1 భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలపై ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి. దీన్ని విమానాలు, క్షిపణులు లక్ష్యంగా నాటి సోవియట్ యూనియన్ రూపొందించింది. ఉక్రెయిన్‌లోని కీవ్‌కు వెళ్లాల్సిన ఆ బోయింగ్ 737 విమానంలో సిబ్బంది, ప్రయాణికులు 176 మంది ఉండగా, వారంతా దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు నిరసనగా ఇరాన్‌లోనూ విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5–7 ఏళ్లలో ఏకంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు. ఐఏఎఫ్‌కు 110 ఫైటర్ జెట్లు.. అలాగే వాయుసేన(ఐఏఎఫ్) కోసం 110 మల్టీరోల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మరో మెగా ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 5,000 కి.మీ దూరం లోని శత్రు లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని–5’ భారత అమ్ములపొదిలో చేరనుందన్నారు. -
చైనా భూగర్భంలో ఉక్కు గోడ
బీజింగ్: దాడుల నుంచి అణ్వస్త్రాలను కాపాడుకునేందుకు పర్వతాల కింద, భూగర్భంలో పెద్ద ఉక్కు గోడను చైనా నిర్మించిందని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేసే శాస్త్రవేత్త క్వియాన్ క్విహు (82) వెల్లడించారు. ఇటీవలే ఈయనకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, చైనా రక్షణ శాఖలో అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఈ భారీ ఉక్కు గోడ చైనా వ్యూహాత్మక ఆయుధాలకు రక్షణగా నిలుస్తుందనీ, ఎవరైనా చైనాపై దాడులు చేసినపక్షంలో ఆయుధాలు ధ్వంసం కాకుండా కాపాడుతుందని క్విహు వెల్లడించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. పర్వతాల కింద భాగాల్లో చైనాకు రక్షణ స్థావరాలున్నాయి. సాధారణంగా శత్రు దాడుల నుంచి ఆ పర్వతాలే ఆయుధాలకు రక్షణ కల్పిస్తాయి. రక్షణ స్థావరాల్లోకి ప్రవేశించే, నిష్క్రమించే చోట్ల మాత్రం ఎవరైనా దాడులు చేస్తే ఆయుధాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉండటంతో ద్వారాల దగ్గర మరింత భద్రంగా ఉండేలా చేసే బాధ్యతను చైనా ప్రభుత్వం క్విహుపై పెట్టింది. ఆయన ఆ పనిని పూర్తి చేయడంతో 2018 ఏడాదికి ‘స్టేట్ ప్రీమినెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్’ను చైనా ప్రభుత్వం క్విహుకు ప్రదానం చేసింది. ఓ కార్యక్రమంలో క్విహు మాట్లాడుతూ ‘బల్లెం పదును ఎక్కువవుతున్నప్పుడు కవచం కూడా దృఢంగా తయారైతేనే రక్షణను ఇవ్వగలదు. సవాళ్లకు దీటుగా ఈ భూగర్భ ఉక్కు గోడను నిర్మించాం’ అని చెప్పారు. -
ఎట్టకేలకు ఎస్–440 ఒప్పందం
భారత్–రష్యాల మధ్య ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ(ఏడీఎంఎస్) విషయంలో సాగుతున్న చర్చలు ఫలించి ఒప్పందం కుదురుతుందా, లేదా అన్న అంశంపై చెలరేగుతున్న ఊహాగానాలకు తెరపడింది. రెండురోజుల పర్యటన కోసం గురువారం మన దేశం వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీతో వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిపాక ఇరు దేశాల మధ్యా అత్యంత కీలకమైన ఈ ఒప్పందంపై సంతకాలయ్యాయి. దీంతోపాటు మరో ఏడు ఒప్పం దాలపై కూడా రెండు దేశాలూ సంతకాలు చేశాయి. ఎస్–400 మన సైన్యానికి ఎంతో అవసరమై నదే అయినా, అది మన రక్షణ వ్యవస్థ తీరుతెన్నులను మలుపు తిప్పేదే అయినా కొన్నేళ్లుగా మన దేశం తటపటాయిస్తోంది. దీనిపై ఒక ఒప్పందానికి వచ్చినా చివరి నిమిషంలో ఆగిపోయిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. ఈసారి కూడా ఎంతో అనిశ్చితి నెలకొంది. అమెరికా నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లే ఒప్పందం కుదరడం లేదని గతంలో కథనాలు వెలువడినా దానిపై అటు రష్యాగానీ, ఇటు మన దేశంగానీ ఎప్పుడూ వివరణనివ్వలేదు. సోవియెట్ యూనియన్ పతనమై అమెరికా ప్రభావం ప్రపంచ దేశాలపై పెరిగిన తర్వాత ఇత రుల తరహాలోనే మన దేశం కూడా అమెరికాకు దగ్గరవుతూ వచ్చింది. రష్యా ఆధ్వర్యంలో పూర్వపు సోవియెట్ దేశాల్లో అత్యధికం ఒక కూటమిగా ఏర్పడి క్రమేపీ కోలుకున్నాక పాత మిత్రులకు మళ్లీ సన్నిహితం కావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. దాంట్లో భాగంగానే ఇకపై ఏటా వార్షిక శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలని భారత్–రష్యాలు 2000 సంవత్సరంలో నిర్ణయించాయి. అప్పటినుంచీ అవి క్రమం తప్పకుండా సాగుతూనే ఉన్నా, ఇరు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబం ధాలూ ఉన్నతస్థాయికి చేరినా... అమెరికాతో మనకు అణు ఒప్పందం కుదిరిన అనంతరకాలంలో అనుమానాలు ముసురుకోవడం మొదలైంది. తన ప్రయోజనాలకు విరుద్ధంగా మనం అమెరికాతో సన్నిహితమవుతున్నామని రష్యా భావించడం మొదలుపెట్టింది. ఏటా శిఖరాగ్రసమావేశాలు సాగు తున్నా ఆ అనుమానాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. భారత్ తన వ్యూహాత్మక వైఖరిని మార్చుకుంటున్నదని, అమెరికాకు మాత్రమే కాక దాని మిత్ర దేశాలైన జపాన్, ఆస్ట్రేలియా వగైరా లతో కూడా కలిసి అడుగులేస్తున్నదని రష్యా అంచనా వేసింది. మన విషయంలో రష్యాకు అనుమా నాలున్నట్టే, మనకూ పలు సందేహాలున్నాయి. అది చైనాతో జట్టు కడుతున్న తీరు మన దేశానికి నచ్చటం లేదు. చైనాతో మనకున్న సరిహద్దు వివాదాలు కావొచ్చు, పాకిస్తాన్‌కు అది అన్నివిధాలా అండగా నిలుస్తున్న తీరువల్ల కావొచ్చు... ఆ దేశంతో రష్యా దగ్గరైతే భారత్ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న భావన మనకుంది. ఈమధ్య రష్యా చైనాకు యుద్ధ విమానాలను విక్ర యించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. భద్రత పరంగా ఇది చేటు తెస్తుందని మన దేశం విశ్వసి స్తోంది. అలాగే ఆ దేశానికి అత్యంతాధునాతన కిలో క్లాస్ జలాంతర్గాముల అమ్మకం కూడా భార త్‌కు ససేమిరా ఇష్టం లేదు. వీటికితోడు రష్యా తొలిసారిగా పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకుని, కరాచీలోని అణుశక్తి కర్మాగారానికి శత్రుదేశాలనుంచి ముప్పు కలగకుండా కాపాడే రాడార్‌ను అంద జేయడానికి అంగీకరించింది. అయితే రష్యాతో మనకున్న అనుబంధం దశాబ్దాలనాటిది. అది వెనువెంటనే తెగేది కాదు. ఇప్పటికీ రక్షణ రంగ కొనుగోళ్ల విషయంలో మనం రష్యాపైనే ఆధారపడతాం. మన రక్షణ అవస రాల్లో 73 శాతం అక్కడినుంచే దిగుమతి అవుతాయి. అలాగే అణు జలాంతర్గాములతోసహా అత్యంత కీలకమైన సాంకేతికతలను మనకు అందించడంలో రష్యా ఎప్పుడూ ముందుంది. అమె రికా తదితర దేశాలతో పోలిస్తే రష్యా విధానం మనకు అనుకూలంగా ఉంటుంది. అది అమ్మకా లతో సరిపెట్టకుండా సాంకేతికతను కూడా బదిలీ చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణులు, బహువిధ సైనిక రవాణా విమానాలు, యుద్ధ విమానాలు, టి–90 ట్యాంకులు రష్యా సాంకేతిక సాయంతో మన దేశంలోనే తయారవుతున్నాయి. ఇలా ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉన్నా, తెలియని వెలితి రెండు దేశాలనూ వెంటాడుతోంది. ఈలోగా రష్యాపై అమెరికా ఆంక్షలు అమల్లోకొచ్చాయి. ఆ దేశంతో రక్షణ, నిఘా రంగాల్లో ఒప్పందం కుదుర్చుకునే దేశాలపై ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తా మని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. రష్యాతో ఎస్–400 క్షిపణి ఒప్పందం కుదిరితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనని మన దేశం ఆందోళన పడింది. అయితే మా మిత్రుల సైనిక సామ ర్థ్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం లేదని అమెరికా ప్రకటించింది. ఎస్–400 ఒప్పందం విషయంలో భార త్‌పై ఆంక్షలు విధించబోమని అమెరికా రక్షణమంత్రి జేమ్స్ మాటిస్ కూడా ఇంతక్రితం చెప్పారు. సాంకేతికంగా చూస్తే ఎస్–400 గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ మైనది. బాలిస్టిక్ క్షిపణుల రాకను చాలా ముందుగానే పసిగట్టి వాటిని నేరుగా ఢీకొని తుత్తినియలు చేసే సామర్థ్యం దీనికుంది. బహుళ ప్రయోజనకర రాడార్ వ్యవస్థ, మూడు రకాల క్షిపణుల్ని ఏకకా లంలో సంధించగల శక్తి, 400 కిలోమీటర్ల పరిధిలోని, 30 కిలోమీటర్ల ఎత్తులోని విమానాలను, మానవరహిత విమానాలను, బాలిస్టిక్ , క్రూయిజ్ క్షిపణులను పసిగట్టి ధ్వంసం చేసే నేర్పు దీని సొంతం. ఏకకాలంలో గగనతలంలోని 100 లక్ష్యాలను పసిగట్టగలదు. మెరుపు వేగంతో దూసు కొచ్చే అమెరికా తయారీ ఎఫ్–35 యుద్ధ విమానాలైనా ఆరింటిని ఒకేసారి ఎదుర్కొనగలదు. మాస్కో మహానగర రక్షణ వ్యవస్థకు రష్యా దీన్నే వినియోగిస్తోంది. మూడేళ్లక్రితం చైనా సైతం దీన్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాతే మన దేశం ఇది అత్యవసరమని భావించింది. మొత్తానికి రష్యాతో కుదిరిన తాజా ఒప్పందాలు ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడేందుకు దోహదపడ్డాయి. మున్ముందు మనతో అమెరికా వ్యవహారశైలి ఎలా ఉంటుందో వేచిచూడాలి. -
ఎమ్ఎస్ఎస్ డీజీగా ఎమ్మెస్సార్ ప్రసాద్
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ (ఎమ్ఎస్ఎస్)కు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రముఖ శాస్త్రవేత్త ఎమ్మెస్సార్ ప్రసాద్ (57) నియమితులయ్యారు. ఆయన ఐఐటీ మద్రాస్‌లో బీటెక్, బాంబే ఐఐటీ నుంచి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1984లో డీఆర్డీవోలో చేరి మిస్సైల్ టెక్నాలజీలో కీలక శాస్త్రవేత్తగా ఎదిగారు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పలు క్షిపణుల తయారీలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆయన ఆవిష్కరణలకు గుర్తింపుగా 2003, 2007, 2011లో డీఆర్డీవో పలు అవార్డులతో సత్కరించింది. మిసైల్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్‌లో ఆయన చేసిన విశేష కృషికి 2014లో బెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. -
రష్యాతో క్షిపణి ఒప్పందానికే మొగ్గు
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్–400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుపై తన నిర్ణయాన్ని తర్వలో అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రులతో జరగనున్న సమావేశంలో భారత్ స్పష్టం చేయనుంది. రష్యాపై అమెరికా ఆంక్షలకు విరుద్ధంగా ఉన్న రూ. 40 వేల కోట్ల ఈ ఒప్పందంపై ముందుకెళ్లాలని అమెరికాకు మనం దేశం తేల్చిచెప్పనుంది. ప్రాంతీయ రక్షణ వ్యవస్థను పటిష్టపర్చడం అత్యవసరమైన నేపథ్యంలో ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ భారత్‌కు తప్పనిసరి.. అందువల్ల ఒప్పందాన్ని ఆంక్షల పరిధి నుంచి తప్పించాలని ట్రంప్ యంత్రాగాన్ని కోరనుంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్పర ప్రయోజనాలపై సెప్టెంబర్ 6న భారత్, అమెరికా రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరగనున్నాయి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మ్యాటిస్‌లతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో రష్యాతో ఒప్పందంపై మన మంత్రులు ఒత్తిడి తేనున్నారు. -
గగనతల పటిష్టతకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: ముంబై, ఢిల్లీలతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గగన తలాన్ని మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే వైమానిక రక్షణ వ్వవస్థకు అవసరమైన క్షిపణులు, లాంచర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్లను అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే దీనిలో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు మిలటరీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్నేళ్లుగా డ్రాగన్ కంట్రీ చైనా వైమానిక శక్తిని గణనీయంగా పెంచుకుందని.. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా గగన తలాన్ని పటిష్టపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు వివరించాయి. వైమానిక పటిష్టతకు అవసరమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్స్, యుద్ధ విమానాలను కొనుగొలు చేసేందుకు అమెరికాతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే సుమారు 2 బిలియన్ల డాలర్ల విలువ గల సముద్ర పరిరక్షణ డ్రోన్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వం లేని దేశానికి డ్రోన్లను విక్రయించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతోపాటు సుమారు రూ.40 వేల కోట్లతో రష్యా నుంచి ఎస్–400 ట్రియాంప్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను కొనుగొలుకు సంబంధించిన ఒప్పందం తుది చర్చల్లో ఉంది. అలాగే 5 వేల కిలోమీటర్ల లక్ష్యాలను చేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. -
సిరియా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు
-
మా వ్యూహాల్ని భారత్ అమలు చేసింది: పాక్ మంత్రి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్థికవేత్త, మాజీ మంత్రి సత్రాజ్ అజీజ్ వ్యూహాల్ని చక్కగా అమలు చేయడం వల్లే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని పాక్ మంత్రి అసన్ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు తమ వ్యూహాల్ని అమలు చేయడం ద్వారా ప్రస్తుతం తమ కంటే ఆర్థికంగా ఎంతో మెరుగ్గా ఉన్నాయంటూ అక్కసు వెళ్లగక్కారు. 90వ దశకంలో భారత్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని.. ఆ సమయంలో భారత ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ సత్రాజ్ అజీజ్ సలహా కోరారని వ్యాఖ్యానించారు. సత్రాజ్ అజీజ్ వ్యూహాల్ని చక్కగా అమలు చేసిన మన్మోహన్.. భారత్‌లో పలు ఆర్థిక సంస్కరణలు చేపట్టారని ఆయన పేర్కొన్నారు. యుద్ధట్యాంకులు, క్షిపణులు మాత్రమే సరిపోవు.. పాకిస్తాన్ నేషనల్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీని ప్రారంభించిన అసన్ ఇక్బాల్.. 2013లో 2జీ వైర్లెస్ టెక్నాలజీని వినియోగించిన పాక్ ప్రస్తుతం 5జీ టెక్నాలజీని వినియోగిస్తున్న దేశాల్లో ముందుందని ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి దేశంలో తలెత్తిన రాజకీయ అస్థిరతే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధట్యాంకులు, క్షిపణులు మాత్రమే దేశాన్ని కాపాడలేవని, ఆర్థికంగా బలోపేతమైనపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే శాంతి స్థిరీకరణ, కొనసాగింపు అవసరమని ఆయన పేర్కొన్నారు. -
భారత్ ‘గగన’ విన్యాసం..!
సాక్షి, హైదరాబాద్ : భారత వాయుసేన భారీ సైనిక కసరత్తుకు తెరతీసింది. శత్రుదేశాల నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా అతి తక్కువ సమయంలోనే కార్యరంగంలోకి దూకేలా తన సన్నద్ధతకు మరింత పదునుపెడుతోంది. దీనిలో భాగంగా గతంలో కనీవినీ ఎరుగని విధంగా దేశవ్యాప్తంగా ఉన్న తన స్థావరాల్లోని మొత్తం విమానాలు, సిబ్బందిని పరీక్షించేలా పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపడుతోంది. ‘గగన్‌శక్తి–2018’ పేరిట ఈ నెల 10 నుంచి 23 తేదీ వరకు అత్యు న్నతస్థాయి సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. రెండు దశల్లో పాకిస్థాన్, చైనా సరిహద్దులలో చేపడుతున్న అత్యంత విస్తృత శిక్షణా కార్యక్రమాల ద్వారా తన అపార సైనిక శక్తిని, యుద్ధానికి ఎప్పుడైనా రెడీ అనేలా వాయుసేన బలాన్ని ప్రదర్శిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతమంతా విస్తరించేలా భారత్ చేపట్టిన ఈ కసరత్తు గత కొన్ని దశాబ్దాల కాలంలోనే అతి పెద్దది. భారత సైన్యం (ఆర్మీ), నావికా (నేవీ)దళంతో కూడా కలిసి వాయుసేన సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం దీని ప్రత్యేకత. ఇందులో వాయుసేనకు సంబంధించిన యావత్ యుద్ధవిమాన శ్రేణులు పాల్గొంటున్నాయి. ఎందుకు ? వైమానిక దళానికి సంబంధించి ప్రతిదాడులతో సహా అన్ని బలాలు పరీక్షించడం యుద్ధసన్నద్ధతలో భాగంగా వివిధ విభాగాలు,రంగాల సమన్వయంపై సమీక్ష వాయుసేనకున్న బలం,బలగాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ రంగంలో తనకున్న అధిపత్యం చాటడం. ప్రత్యేకతలు... ఈ కసరత్తులో 1,100 యుద్ధ (సిబ్బంది, ఆయుధాల రవాణాతో సహా) విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. 300 మందికి పైగా ఫైటర్ పైలట్లు, ఇతర ఉన్నతస్థాయిఅధికారులు, 15 వేల మంది వైమానికదళ సభ్యులు పాల్గొన్నారు. ఎడారి ప్రాంతాలు మొదలుకుని, అత్యంత ఎల్తైన ప్రాంతాలు, సముద్రజలాలు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించే ఆపరేషన్లు, గరుడ కమాండోల దాడుల వరకు విస్తృతస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకాశంలో, ఆకాశం నుంచి భూమిపైకి దాడి, పారాట్రూపర్ల ద్వారా మెరుపుదాడి, యుద్ధంలో గాయపడిన సైనికుల తరలింపు వంటి వాటిని పరీక్షించింది. ఏవేవి పరీక్షించారు... బ్రహ్మోస్, హార్పూన్ యాంటీ–షిప్ క్షిపణులతో కూడిన సుఖోయ్ (ఎస్‌యూ)–30, జాగ్వార్ యుద్ధ విమానాలు తమ లక్ష్యాలు చేధించడాన్ని పరిశీలించారు. సీ–17 గ్లోబ్‌మాస్టర్, ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు, సీ–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాల పనితనాన్ని పరీక్షించారు. పాకిస్థాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులో కేవలం మూడురోజుల్లోనే 5వేల సార్లు యుద్ధవిమానాలు రాకపోకలు సాగించడం విశేషం. భారత వాయుసేనకు చెందిన పీ–8ఐ ఎమ్మార్ విమానాన్ని ఉపయోగించి సుదూర లక్ష్యాల చేధన పరీక్ష. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి ఇటీవలే ప్రవేశించిన ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) తేజాస్‌ను తొలిసారి పరీక్షించారు. తేజాస్ మార్క్–1ను ఇప్పటికే ఆమోదించిన ఐఏఎఫ్, దానిని త్వరలోనే మరింత నవీకరించి తేజస్ మార్క్–1ఏ, తేజస్–మార్క్ 2 లను రంగంలోకి దించనుంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ట్రంప్ క్షిపణి పేలుతుందా ?
మా క్షిపణులొస్తున్నాయ్ కాచుకోండి అంటూ హుంకరించి సిరియాలో ఉద్రిక్తతలు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మర్నాటికే కాస్త స్వరం తగ్గించారు. సిరియాపై దాడులు త్వరలోనే జరగవచ్చు, అలాగని అతి త్వరలో అని అనుకోవాల్సిన పనిలేదు అంటూ ట్వీట్ చేశారు. ఇటీవల సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు ఘౌటా ప్రాంతంలోని డౌమా పట్టణంలో సర్కార్ సేనలు జరిపిన రసాయన దాడిలో వంద మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా సిరియాపై సమరశంఖం మోగించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచింది. సిరియాపై ఎలా దాడులు జరపాలా అంటూ తమ ముందున్న మార్గాలను పరిశీలిస్తోంది. మరోవైపు అమెరికాకు మద్దతుగా బ్రిటన్ తన జలాంతర్గాముల్ని మోహరించింది. అమెరికా ఎన్ని రకాలుగా దాడులు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అన్న అంశంపై అంతర్జాతీయ విశ్లేషకులు రకరకాలుగా అంచనాలు వేస్తున్నారు. గగనతల దాడులు సిరియాపై గగనతలం ద్వారా దాడులు చేయడం.ఇది అన్నింటికంటే సులభమైన ప్రక్రియ. గత ఏడాది సిరియాపై అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేసి ఒక ఎయిర్‌బేస్‌ను కూల్చేశాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో సిరియా ప్రభుత్వ అనుకూల ప్రాంతాలపై తోమహక్ క్షిపణి దాడులు జరిపే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు గత ఏడాది మాదిరిగా లేవు. అసద్ ప్రభుత్వం ఇటీవల కాలంలో బాగా బలపడింది. దేశంలో అన్ని ప్రాంతాలపై పట్టు సాధించింది. అమెరికా దాడుల్ని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతూ ఎయిర్‌బేస్‌లను ఖాళీ చేయిస్తోంది. రష్యా అండదండలు కూడా సిరియాకి ఉండడంతో గగనతలం దాడులు వల్ల ఫలితం ఉంటుందో లేదోనన్న ఆలోచనలో అగ్రరాజ్యం ఉంది. నిరంతర దాడులు సిరియాలో అసద్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేకూరేలా నిరంతర దాడులకు పాల్పడడం. సిరియాలో అత్యంత ముఖ్యమైన సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు నాశనమయ్యేలా నిరంతర దాడులకు దిగడం.. ఇలా చేయడం వల్ల రష్యాతో సంఘర్షణ తీవ్రతరమవుతుంది. రెండు దేశాలు ముఖాముఖి పోరాటానికి తలపడాల్సి వస్తుంది. పూర్తి స్థాయి యుద్ధం ఈ పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పితే ఇక పూర్తి స్థాయి యుద్ధం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే అమెరికాకు దాని మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ యుద్ధంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. సిరియాకు మద్దతుగా రష్యా, ఇరాన్‌లు కదన రంగంలోకి దిగితే ఏదైనా జరగవచ్చునని, మూడో ప్రపంచ యుద్ధం రావచ్చుననే అంచనాలున్నాయి. సిరియాకి రష్యా ఎందుకు మద్దతు ఇస్తోంది ? సిరియాకి, రష్యాకి మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచే ఉన్నాయి. 1970వ దశకంలో అప్పటి సోవియెట్ యూనియన్ నాయకుడు లియోనిడ్ బ్రెజ్నావ్ కాలం నుంచే సిరియాకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆ దేశానికి ఆయుధాలు, ఇతర సహాయాలు అందిస్తూ వచ్చారు. 1991లో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక ఆ రెండు దేశాల మధ్య సంబ«ంధాలు తెగిపోయాయి. అయితే 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నికయ్యాక తన ఆధిపత్యాన్ని పెంచుకోవడం కోసం సిరియాతో మళ్లీ సంబంధాలను పునరుద్ధరించాలని అనుకున్నారు. అదే సమయంలో బషర్ అల్ అసద్ సిరియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఇక 2011 సంవత్సరంలో అరబ్ దేశాల్లో ఉద్యమాల (అరబ్ స్ప్రింగ్) ప్రేరణతో సిరియాలో కూడా అసద్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఆ సమయంలో పుతిన్, అసద్‌తో చేతులు కలిపారు. కేవలం సిరియాకు మాత్రమే కాదు ఈజిప్టు, లిబియా, ఇరాక్ వంటి దేశాలకు ఆయుధ సరఫరా చేస్తూ వచ్చారు. సిరియాలో తమ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే అసద్ ప్రభుత్వం మనుగడ సాగించాలి. అంతేకాదు ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ దేశంలోకి చొరబడకుండా ఉండాలంటే సిరియాకు మద్దతు ఇవ్వాలని భావించారు. అందుకే 2015 సంవత్సరంలో అసద్ ప్రభుత్వానికి మద్దతుగా రష్యా తమ బలగాల్ని మోహరించింది. దాడులు చేయించింది. తూర్పు సిరియాలో ఐఎస్ తన పట్టు కోల్పోయేలా చేయడంలో రష్యా కీలకభూమిక పోషించింది. ఐక్యరాజ్యసమితి అధ్యక్షతన సమావేశం పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు నెలకొనడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఉద్రిక్తతలు పెంచిపోషిస్తున్న అగ్రరాజ్యాలకు హెచ్చరికలు పంపింది. సిరియాలో శాంతి స్థాపన దిశగా అన్ని దేశాలు కృషి చేయాలని పేర్కొంది. సిరియా సంక్షోభం పరిష్కారానికి అన్ని పక్షాల అనుమతితో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యూఎన్ ఎప్పట్నుంచో చెబుతూ వస్తోంది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
500 అమెరికా క్షిపణులతో వచ్చినా...
మాస్కో : అణ్వాయుధ దేశాల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ఒక దేశానికి మించి మరొక దేశం అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి.అగ్రదేశాల మధ్య ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. తాజాగా రష్యా సర్మట్ ఖండాంతర క్షిపణిని రెండోసారి పరీక్షించింది. ఈ ప్రయోగం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని క్షిపణి చేరుకున్నట్లు రష్యా రక్షణ శాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్క సర్మట్ క్షిపణిని అడ్డుకోవడానికి 500 అమెరికా ఏబీఎస్ క్షిపణులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఏకకాలంలో 10 టన్నుల పేలోడ్(సాధరణ, అణు పదార్థాలు)ను సర్మట్ మోసుకెళ్లగలదని వివరించారు. ప్రయోగం అనంతరం దాదాపు 20 మాక్‌ల వేగాన్ని(ధ్వని వేగానికి 20 రెట్లు) ఒక సెకన్ కాలంలో అందుకుంటుందని చెప్పారు. దేశ రక్షణకు 2021 నుంచి సర్మట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. -
ఆయుధ సంపత్తి పోరుకు నాందీ!
చిత్రంలో కనిపిస్తున్నది రష్యా రహస్యంగా పరీక్షించిన అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణి. శత్రు దేశాలు గుర్తించలేనంత సామర్థ్యంతో కూడిన కొత్త తరం అణ్వాయుధాలను అభివృద్ధి చేశామని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో హైపర్సోనిక్ క్షిపణులు, అధునాతన జలాంతర్గాములు ఉన్నట్లు తెలిసింది. దీంతో అమెరికా, రష్యాల మధ్య ఆయుధాల తయారీకి సంబంధించి రసవత్తర పోరు మొదలయ్యే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. -
జస్ట్.. డ్రోన్లు ఎక్కుపెట్టింది..
యుద్ధం మొదలైంది.. శత్రు సేనలు క్షిపణులు ఎక్కుపెడుతున్నాయి.. ఇటువైపు పక్షం మాత్రం నింపాదిగా ఉంది.. క్షిపణులు ఎక్కుపెట్టలేదు.. జస్ట్.. డ్రోన్లు ఎక్కుపెట్టింది.. వీడియో షూట్ కోసం కాదు.. శత్రు క్షిపణులను షూట్ చేయడానికి..!! ప్రస్తుతం పెళ్లిళ్లు.. మ్యాచుల్లో వీడియో షూటింగ్ కోసం.. పిజ్జాలను డెలివరీ చేయడం కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు.. భవిష్యత్తులో దేశం తరఫున యుద్ధం చేయనున్నాయి! ఇందుకోసం అమెరికా క్షిపణి రక్షణ సంస్థ(ఎండీఏ) లో–పవర్ లేజర్ డెమాన్స్ట్రేటర్(ఎల్‌పీఎల్‌డీ) ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన లేజర్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ లేజర్ వ్యవస్థతో కూడిన డ్రోన్లు.. లాంచింగ్ పాడ్ నుంచి క్షిపణులను ప్రయోగించకముందే వాటిపై లేజర్ కిరణాలను ప్రయోగించి.. నాశనం చేస్తాయట. 2019 కోసం తమకు రూ.63 వేల కోట్ల బడ్జెట్ కావాలంటూ అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన ఎండీఏ.. అందులో భాగంగా ఎల్‌పీఎల్‌డీ ప్రాజెక్టు గురించి వివరించింది. లేజర్ టెక్నాలజీ కోసం రూ.420 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కొరియా నుంచి ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వీటి ఆవశ్యకతను తెలియజెప్పింది. ఒకవేళ క్షిపణిని ప్రయోగించినా.. దానిని దారిలోనే అడ్డుకుని.. నిర్వీర్యం చేసే శక్తిసామర్థ్యాలు దీని సొంతమట. 2020లో ఎల్‌పీఎల్‌డీని పరీక్షించనున్నారు. వివిధ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల రక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్న నిపుణులు.. ఎల్‌పీఎల్‌డీని ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీగా పేర్కొంటున్నారు. -
క్షిపణి హెచ్చరికలతో హవాయిలో కలకలం!
వాషింగ్టన్: ఉత్తరకొరియా నుంచి ఖండాంతర క్షిపణి దూసుకొస్తోందనీ, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మొబైల్స్‌కు సందేశాలు రావడంతో అమెరికాలోని హవాయి రాష్ట్ర ప్రజలు వణికిపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. ఇదంతా ఓ ఉద్యోగి తప్పిదమని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘ఓ ఖండాంతర క్షిపణి హవాయి వైపు దూసుకొస్తోంది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లండి’ అని మొబైల్స్‌కే కాకుండా టీవీ, రేడియో కేంద్రాలకూ శనివారం సందేశాలు అందాయి. దీంతో పలువురు రెస్టారెంట్లు, హోటళ్ల బేస్మెంట్లలో దాక్కుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. 10 నిమిషాల అనంతరం ఇది పొరపాటున వచ్చిన హెచ్చరికని అధికారులు వివరణ ఇచ్చారు. ఓ ఉద్యోగి పొరపాటున హెచ్చరిక బటన్‌ను నొక్కాడని హవాయి గవర్నర్ డేవిడ్ ఇగ్ తెలిపారు. -
కొత్తరకం విధ్వంసక నౌకను నిర్మిస్తున్న చైనా
బీజింగ్: శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకలు, జలాంతర్గాములను నాశనం చేయగలిగిన కొత్తరకం విధ్వంసక నౌకను చైనా నిర్మిస్తోందని ఆ దేశ మీడియా శుక్రవారం వెల్లడించింది. పది వేల టన్నుల బరువుండే ఈ విధ్వంసక నౌక నిర్మాణం ప్రస్తుతం తుది దశలో ఉందనీ, షాంఘైలోని జియాంగ్నన్ రేవులో పనులు జరుగుతున్నాయని జిన్హువా న్యూస్ తెలిపింది. ఆర్మీ అధికారులు, సైనికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం విధ్వంసక నౌకలో ప్రస్తుతం స్వల్ప మార్పులు చేస్తున్నారనీ, తర్వాత సముద్రంలో పరీక్షించాల్సి ఉందని వార్తా సంస్థ పేర్కొంది. -
క్షిపణుల కొనుగోలు ఒప్పందం రద్దు!
జెరూసలెం: ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఆయుధాల కంపెనీతో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే క్షిపణుల (స్పైక్) కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన 1,600 క్షిపణుల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంపై ఆ కంపెనీ విచారం వ్యక్తం చేసింది. త్వరలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్‌కు రానున్న సమయంలో ఒప్పందం రద్దు చేసుకోవడం గమనార్హం. ‘ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ రక్షణ శాఖ నుంచి అధికారిక సమాచారం అందింది’ అని రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రతినిధి వెల్లడించారు. -
యుద్ధట్యాంక్‌నుంచే క్షిపణి ప్రయోగం
సాక్షి, న్యూఢిల్లీ : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అర్జున్ యుద్ధ ట్యాంక్‌కును మరింత శక్తివంతంగా డీఆర్డీఓ రూపొందిస్తోంది. అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంక్‌గా ఇప్పటికే గుర్తింపు దీనికి గుర్తింపు లభించింది. వచ్చే ఏడాది నాటికి ఈ యుద్ధ ట్యాంక్‌కు క్షిపణులు ప్రయోగించే సామర్థ్యాన్ని అందించనున్నట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఉన్నతాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉందని డీఆర్డీఓ అధికారులు తెలిపారు. అర్జున్ ఎంకే2 ట్యాంక్ సైనిక అవసరాలకు అద్వితీయంగా ఉపయోగ పడుతుందని వారు చెబుతున్నారు. అర్జున్ ట్యాంక్‌నుంచి 1200 మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం చేధించేలా.. రూపొందించామని అధికారులు తెలిపారు. మొదట 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల పరిధి సైన్యానికి సరిపోతుందని భావించినా.. తరువాత దానిని 1200 మీటర్లకు పొడిగించినట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. అర్జున్ ఎంకే-1తో పోలిస్తే.. అర్జున్ ఎంకే-2 యుద్ధట్యాంక్ అత్యంత అధునాతనమైందని, అందులో పలు ఫీచర్లను అప్డేట్ చేసినట్లు వారు చెప్పారు. ఇదిలావుండగా ఇప్పటికే సైన్యం దగ్గర అర్జున్ ఎంకే-1 యుద్ధట్యాంకులు 119 ఉండగా.. అందులో 80 యుద్ధట్యాంకులను పూర్తిగా ఆధునీకరించారు. -
హైపర్‌సానిక్ క్షిపణులపై గురి
న్యూఢిల్లీ : ఇప్పటివరకూ అణుబాంబులు.. హైడ్రోజన్ బాంబులు.. తాజాగా హైపర్‌సానిక్ మిస్సైల్స్.. యుద్ధగతిని మార్చే ఆయుధాలివే. సాధారణ క్షిపణులకన్నా.. 5రెట్లు వేగంగా.. ఖచ్చితత్వంలో దూసుకెళ్లే వీటి కోసం అమెరికా, రష్యా, చైనాలు పోటీ పడుతున్నాయి. వీటి రూపొందించడం పూర్తయితే యుద్ధరంగ స్వరూపస్వభావాలే పూర్తిగా మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక ఆయుధాలు అగ్రదేశాల చేతిలో ఉన్నంత వరకూ ప్రపంచానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. అయితే పొరపాటున ఉగ్రవాద దేశాల చేతిలో పడితే మాత్రం ప్రపంచం సర్వనాశనం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైపర్‌సానిక్ క్షిపణులు రడార్ల వ్యవస్థకు అందవు.. అందువల్ల వ్యూహాత్మక యుద్ధం చేసేందుకు ఆయా దేశాలకు అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ ఆయా దేశాలకు మంచిదేకానీ.. పొరపాటు జరిగితే మాత్రం ఫలితం ఊహలకు అందదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైపర్‌సానిక్ మిస్సైల్స్ రూపకల్పనలో అమెరికా, రష్యా, చైనాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. చైనా ఈ దిశగా ముందడుగు వేస్తే భారత్ లాంటి దేశాలకు ప్రమాదమేనని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
మళ్లీ జూలు విదిల్చిన కిమ్
సాక్షి, టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ శనివారం వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను హడలెత్తించారు. ఉత్తరకొరియా పరీక్షించిన మూడు క్షిపణులు జపాన్ సముద్ర జలాల్లో పడ్డాయి. అమెరికా, దక్షిణ కొరియా దళాల సంయుక్త యుద్ధ కసరత్తులు చేసిన తర్వాత ఈ పరీక్షలు జరగడం గమనార్హం. అమెరికా-దక్షిణ కొరియాల యుద్ధ కసరత్తులను ఉత్తరకొరియా ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. తమ దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకే యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నారని ఆ దేశం భావిస్తోంది. నెల రోజుల క్రితం వరకూ అమెరికా-ఉత్తరకొరియాలు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. అయితే వారం రోజుల కిందట ఇరు దేశాధినేతలు మెత్తబడినట్లు కనిపించారు. దీంతో యుద్ధ జ్వాలలు ఆరినట్లనని నిపుణులు భావించారు. కానీ, తాజా పరిణామం మరింత ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉంది. ఉత్తరకొరియా శనివారం పరీక్షించిన క్షిపణుల్లో మొదటిది, మూడోది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. రెండో క్షిపణి మాత్రం టార్గెట్‌ను చేరుకుందని అమెరికాకు చెందిన పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ప్రయోగించినవన్నీ చిన్న శ్రేణి క్షిపణులేనని వెల్లడించింది. -
టీ–90 ట్యాంకులను ఆధునీకరిస్తున్న సైన్యం
న్యూఢిల్లీ: భారత సైన్యం వినియోగిస్తున్న రష్యన్ తయారీ టీ–90 యుద్ధ ట్యాంకుల్ని మరింత ఆధునీకరిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ట్యాంకుల్లో వాడుతున్న ఇన్వర్ లేజర్ గైడెడ్ మిస్సైళ్ల స్థానంలో మూడోతరం గన్ లాంచింగ్ మిస్సైళ్లను అమర్చే ప్రాజెక్టును చేపట్టినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ మిస్సైళ్లు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేస్తాయని తెలిపారు. 125 ఎంఎం బ్యారెల్ గన్ల ద్వారా ప్రయోగించే ఈ క్షిపణులు ముందస్తు ప్రోగ్రామింగ్ ద్వారా లక్ష్యాన్ని ఛేదిస్తాయన్నారు. స్థిరంగా ఉండే శత్రు స్థావరాలతో పాటు కదులుతున్న వాహనాలను ఇవి ఏ సమయంలోనైనా లక్ష్యంగా చేసుకోగలవని వెల్లడించారు. -
ఆ క్షిపణులు 14 నిమిషాల్లోనే.....
వాషింగ్టన్: గువాం ప్రాంతంపై క్షిపణి దాడులతో చెలరేగుతామని ఉత్తర కొరియా చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఉత్తర కొరియా గువాం ద్వీపంపై క్షిపణులతో విరుచుకుపడితే అవి కేవలం 14 నిమిషాల్లోనే అక్కడకి చేరుకుని విధ్వంసం సృష్టిస్తాయని హోంల్యాండ్ భద్రతా ప్రతినిధి జెన్నా గమిండె చెప్పారు. ఉత్తర కొరియా దాడులకు ఉపక్రమిస్తే 15 హెచ్చరిక సంకేతాలతో ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. గువాంలోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలున్నాయని తెలిపారు. కాగా ఏడువేలకు పైగా అమెరికన్ సైనికులు మోహరించిన గువాం ద్వీపంపై క్షిపణి దాడులకు పూర్తి ప్రణాళికతో సంసిద్ధంగా ఉన్నట్టు గురువారం ఉత్తర కొరియా ప్రకటించిన విషయం తెలిసిందే. -
విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: సముద్ర ఉపరితల లక్ష్యాలను ఛేదించడంలో భారత్ మరో ముందడుగు వేసింది. ప్రాజెక్టు 75 ద్వారా నిర్మించిన స్కార్పియో తరగతి కల్వరి జలాంతర్గామి నుంచి తొలిసారి నావికా దళం ప్రయోగించిన నౌక విధ్వంసక క్షిపణి.. ఉపరితలంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదిం చింది. ఈ మేరకు రక్షణ శాఖ గురువారం ప్రయోగం వివరాలు వెల్లడించింది. ‘ ఈ క్షిపణి ఆవిష్కరణతో మరో మైలురాయిని అధిగమించాం. తాజా ప్రయోగంతో నావికాదళం ఉపరితల రక్షణ సామర్థ్యం పెరిగింది’ అని పేర్కొంది. సముద్ర ఉపరితల ప్రమాదాలను ఎదుర్కోడానికి భారత్ వద్ద ఉన్న 6 డీజిల్/ఎలక్ట్రిక్ జలాంతర్గాముల్లో ఈ క్షిపణులను ప్రవేశపెడతామని వెల్లడించింది. భారత్‌లో నిర్మించిన స్కార్పియో తరగతికి చెందిన తొలి జలాంతర్గామి కల్వరిని ఫ్రెంచ్ నావికా రక్షణ, ఇంధన సంస్థ డీసీఎన్ ఎస్ రూపొందించగా.. ముంబైలోని మజ్‌గావ్‌డక్‌లో నిర్మించారు. క్షిపణిని విజయ వంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. -
ఏమీ చేయలేక భారత్‌పై పాక్ ఆక్రోశం
-
ఏమీ చేయలేక భారత్‌పై పాక్ ఆక్రోశం
న్యూఢిల్లీ: భారత్‌కు మరోసారి పాకిస్థాన్ అడ్డుతగులుతోంది. దేశం నిర్వహిస్తున్న అణు క్షిపణుల పరీక్షలకు మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. ఏనాడు శాంతిమంత్రం పటించని ఆ దేశం కూడా తాజాగా శాంతియుత పరిస్థితులకు భారత్ భంగం కలిగిస్తోందంటూ తాజాగా ఆరోపణలు లేవనెత్తింది. ఈ మేరకు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్(ఎంటీసీఆర్)కు ఫిర్యాదు చేసింది. భారత్ అణు క్షిపణుల పరీక్షల కారణంగా మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి, సుస్థిరత్వానికి భంగం కలిగిస్తుందని ఎంటీసీఆర్కు చెప్పినట్లు పాక్ మీడియా కథనాలు చెబుతున్నాయి. భారత్ గత వారం అగ్ని 4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అంతకుముందు అగ్ని 5 పరీక్ష కూడా విజయవంతమైంది. అయితే, గత సోమవారం పాక్ బాబర్ 3 క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు కథనాలతోపాటు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, అలాంటి పరీక్ష చేయలేదని, గ్రాఫిక్స్ మిసైల్‌తో భారత్‌ను, ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని భారత శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో తెల్లబోయన పాక్ ఏమీ చేయలేక చివరికి భారత్ క్షిపణుల పరీక్షలకు అడ్డుతగులుతోంది. -
‘కత్తి’లాంటి విజయం
స్టావెంజర్: ఇప్పుడైతే యుద్ధమనగానే క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, లైట్ మెషిన్ గన్లు గుర్తుకొస్తాయి కాని...ప్రాచీన కాలంలో యుద్ధమంటే...కత్తి దుయ్యటమే కదా.. అప్పటి యుద్ధాల్లో కత్తిదే ప్రథమ ప్రాధాన్యం. రాచరిక కాలంలో ప్రపంచవ్యాప్తంగా కత్తిని పౌరుషానికి, విజయానికి ప్రతీకగా భావించేవారు. చిత్రంలో కనిపిస్తున్న 10 మీటర్ల ఎత్తున్న ఈ మూడు కాంస్య కత్తులు కూడా ఇలా ఏర్పాటు చేసినవే.. నార్వేలోని స్టావెంజర్ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండ అంచున సుమారు 1100 సంవత్సరాల క్రితం వీటిని ఏర్పాటు చేశారు. అప్పటివరకు చిన్న చిన్న రాజ్యాల సమాహారంగా ఉన్న నార్వేని కింగ్ హెరాల్డ్ హఫ్రస్ఫ్జార్డ్ యుద్ధంతో మొత్తం తన పాలన కిందకు తీసుకొచ్చాడు. నార్వే చ రిత్రలోనే దీన్నొక కీలక పరిణామంగా భావిస్తారు. తన విజయానికి గుర్తుగా హెరాల్డ్ ఈ కాంస్య కత్తులను ఏర్పాటు చేశాడు. -
క్షిపణుల తయారీపై వేల్‌టెక్ ఒప్పందం
ఫ్రాన్స్ సంస్థతో వేల్‌టెక్ వర్సిటీ ఒప్పందం చెన్నై: క్షిపణుల తయారీపై పరిశోధనలు సాగించేందుకు అంతర్జాతీయ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీడీఏ మిసైల్ సిస్టమ్స్(ఫ్రాన్స్)తో చెన్నై వేల్‌టెక్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు రోజుల పాటూ చెన్నైలో నిర్వహించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వర్సిటీ వీసీల సమావేశంలో వేల్‌టెక్ వర్సిటీ ఫౌండర్, చాన్స్‌లర్ డాక్టర్ ఆర్.రంగరాజన్, ఎంబీడీఏ మిసైల్ సిస్టమ్స్(ఫ్రాన్స్) ప్రతినిధి ఓలివర్ లూకాస్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో వేల్‌టెక్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ, ప్రొ ైవె స్ చాన్స్‌లర్ చంద్రశేఖర్ మాట్లాడారు. వేల్‌టెక్ అధ్యాపకులు మిస్సైల్ తయారీలో పరిశోధనలు చేసేందుకు, విద్యార్థుల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన కార్యక్రమాలను ఫ్రాన్స్ సంస్థతో కలిసి నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రెండురోజులపాటూ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో ఆటోమొబైల్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌పై చర్చలు సాగాయన్నారు. ఐదు దేశాల నుంచి శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థులు, విశ్వవిద్యాలయ కులపతులు పాల్గొన్నారని వారు చెప్పారు. అలాగే భారతదేశం నుంచి డీఆర్డీఓ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంస్థలు, వర్సిటీలు, సీఎస్ఆర్ లాబ్స్ ప్రతినిధులు ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో టెక్నాలజీపై విశేష పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు విసై అనే ఎగ్జిబిషన్‌ను ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి 117 బృందాలు హాజరై తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. డిజైన్, అనాలసిస్, తయారీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టాపిక్స్‌లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వేల్‌టెక్ వర్సిటీకి చెందిన బీటెక్ విద్యార్థులు తైవాన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని పెద్ద పెద్ద ల్యాబ్స్‌లో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండ్రెస్ ప్రెసిడెంట్ డాక్టర్ శకుంతలా రంగరాజన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ, సింగపూర్, తైవాన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.