
బీజింగ్: శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, నౌకలు, జలాంతర్గాములను నాశనం చేయగలిగిన కొత్తరకం విధ్వంసక నౌకను చైనా నిర్మిస్తోందని ఆ దేశ మీడియా శుక్రవారం వెల్లడించింది. పది వేల టన్నుల బరువుండే ఈ విధ్వంసక నౌక నిర్మాణం ప్రస్తుతం తుది దశలో ఉందనీ, షాంఘైలోని జియాంగ్నన్ రేవులో పనులు జరుగుతున్నాయని జిన్హువా న్యూస్ తెలిపింది. ఆర్మీ అధికారులు, సైనికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం విధ్వంసక నౌకలో ప్రస్తుతం స్వల్ప మార్పులు చేస్తున్నారనీ, తర్వాత సముద్రంలో పరీక్షించాల్సి ఉందని వార్తా సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment