
తిరువనంతపురం: ప్రపంచంలోనే అత్యంత భారీ కంటైనర్ షిప్‌లలో ఒకటైన ఎంఎస్‌సీ తుర్కియే తాజాగా కేరళలోని విఝింజం ఇంటర్నేషనల్ సీపోర్టుకు వచ్చింది. భారతీయ పోర్టుకు ఇంత భారీ నౌక రావడం ఇదే ప్రథమమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఏపీసెజ్‌కి) నిర్వహిస్తోంది.
మెడిటేరేనియన్ షిప్పింగ్ కంపెనీ (ఎంఎస్‌సీ)కి చెందిన ఈ నౌక ఒక అధునిక ఇంజినీరింగ్ అద్భుతం. 399.9 మీటర్ల పొడవు, 61.3 మీటర్ల వెడల్పు, 33.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. 24,346 టీఈయూల (ట్వెంటీ–ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) సామర్థ్యం దీని సొంతం. ఇంధనాన్ని అత్యధికంగా ఆదా చేయడం ద్వారా ఇది కర్బన ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.