దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్ ఆర్డర్.
1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంట్‌లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్‌లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు.
ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్‌లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ 640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్‌లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది.
ఏఎం గ్రీన్ గురించి..
హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment