Green Energy
-
గ్రీన్ హైడ్రోజన్‌కు రెడ్ కార్పెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్(Green Energy), అనుబంధ ఉత్పత్తుల (డెరివేటివ్స్) పరిశ్రమ లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. ఎలక్ట్రోలైజర్ ఆధా రిత గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల ప్లాంట్లను స్థాపించే డెవలపర్లకు ఎలక్ట్రోలైజర్ స్టాక్ ప్లాంట్, పరికరాలపై 30 శాతం పెట్టుబడి రాయితీని అందించనుంది. ప్రతి మెగావాట్‌కి/ 1,400 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి రూ.కోటి చొప్పున రూ.30 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి ఒక్కో ప్లాంట్‌కు పెట్టుబడి రాయితీ ఇస్తామని ‘తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025’(Green Energy Policy 2025) ప్రభుత్వం హామీ ఇచ్చింది. ‘ఇంటిగ్రేటెడ్’ ప్రాజెక్టులకూ సబ్సిడీలు..ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ (బయోజనిక్ కార్బన్‌తో సహా) పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పాలసీలో ప్రాధాన్యతనిచ్చింది. ప్లాంట్, పరికరాల (ఎలక్ట్రోలైజర్తో సహా) వ్యయంలో 30 శాతాన్ని పెట్టుబడి రాయితీగా అందించనుంది. గ్రీన్ అమోనియా ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.1.85 కోట్లు, గ్రీన్ మిథనాల్ ప్లాంట్ల ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి రూ.2.25 కోట్ల గరిష్ట పరిమితికి లోబడి సబ్సిడీలు ఇస్తుంది.గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లలో వినియోగించే ఎలక్ట్రోలైజర్ పరికరాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తయారీ పరిశ్రమల స్థాపనకు పెట్టే పెట్టుబడులపై 25 శాతాన్ని రాయితీగా ప్రభుత్వం అందించనుంది. కనీసం 500 మెగావాట్ల వార్షిక ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ హైడ్రోజన్/డెరివేటివ్స్, ఎలక్టోల్రైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పరిశ్రమలకు వర్తించే కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు..⇒ రాష్ట్రంలో జరిపే గ్రీన్ హైడ్రోజన్, అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలపై 100 శాతం ఎస్జీఎస్టీని 5 ఏళ్ల పాటు రీయింబర్స్ చేస్తారు. ⇒ ఎలక్టోల్రైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలపై ఏడేళ్ల పాటు 100 శాతం ఎస్జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు. ⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలకు 10 ఏళ్ల పాటు, ఎలక్ట్రోలైజర్ పరిశ్రమలకు 5 ఏళ్ల పాటు 100 శాతం విద్యుత్ పన్ను మాఫీ. ⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు రాష్ట్ర డిస్కంల నుంచి కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ.3 చొప్పున 20 ఏళ్ల పాటు విద్యుత్ బిల్లులను తిరిగి చెల్లిస్తారు. ఎలక్టోల్రైజర్ పరిశ్రమలకు ఐదేళ్ల పాటు యూనిట్ విద్యుత్‌పై రూపాయి చొప్పున ఈ రాయితీ వర్తిస్తుంది. ⇒ గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమల ఏర్పాటుకు కొనుగోలు చేసే స్థలాలకు 100 శాతం స్టాంప్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఎలక్ట్రోలైజర్, హైడ్రోజన్ ఫ్యూయల్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు⇒ రూ.2 లక్షల పరిమితికి లోబడి 50 శాతం వరకు క్వాలిటీ సర్టిఫికేషన్ చార్జీలను ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ⇒ పేటెంట్ ఫైలింగ్ చార్జీల్లో 50 శాతాన్ని రూ.2 లక్షల పరిమితికి లోబడి చెల్లిస్తారు. ⇒ మహిళలు ఏర్పాటుచేసే ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు రూ.10 లక్షల పరిమితికి లోబడి అదనంగా 10 శాతం వరకు పెట్టుబడి రాయితీ ఇస్తారు. ⇒ గ్రీన్ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి 30 శాతం పెట్టుబడి రాయితీలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇది తొలి 10 యూనిట్లకు మాత్రమే.గ్రీన్ హైడ్రోజన్ అంటే ?గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన ఇంధన వనరు. సౌర విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టుతారు. కాలుష్య రహిత సౌర, ఇతర పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించి ఇలా తయారు చేసిన హైడ్రోజన్‌ను గ్రీన్ హైడ్రోజన్ అంటారు. వాహనాలతో పాటు ఎరువులు, ఉక్కు, సిమెంట్ వంటి భారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్న సాంప్రదాయ ఇంధనాలకు బదులుగా గ్రీన్ హైడ్రోజన్‌ను వినియోగిస్తే ‘నెట్ జీరో’ కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని అందుకోవచ్చని ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సౌర, పవన విద్యుత్‌తో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసుకుని అవసరమైనప్పుడు ఇంధనంగా వాడుకోవచ్చు. -
పెట్టుబడులు రూ.1.98 లక్షల కోట్లు..ఉద్యోగాలు 1.14 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుఎల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ (బ్యాటరీ స్టోరేజీ+ పంప్డ్ స్టోరేజీ) ప్రాజెక్టులు, జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ వంటి పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటును భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం (కాంట్రాక్టెడ్ కెపాసిటీ) 10,095.20 మెగావాట్లు ఉండగా, 2029–30 నాటికి సుమారు 20,000 మెగావాట్ల అదనపు సామర్థ్యాన్ని జత చేసి మొత్తం 31,400 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించింది.2034–35 నాటికి అదనంగా మరో 18,100 మెగావాట్ల సామర్థ్యాన్ని జత చేసి మొత్తం సామర్థ్యాన్ని 49,500 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం వచ్చే పదేళ్లలో రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2025ని రాష్ట్ర మంత్రివర్గం శనివారం ఆమోదించింది. పదేళ్లపాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. బిడ్డింగ్ ద్వారా డెవలపర్లకు ఆహ్వనం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం, జియో థర్మల్, మినీ హైడల్, వేస్ట్ టూ ఎనర్జీ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి, ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. చౌకగా లీజుకు సర్కారీ భూములు.. డెవలపర్లకు ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇస్తారు. బిడ్డింగ్‌లో గెలిచిన సంస్థకు మార్కెట్ రేటులో 10 శాతం లీజు రేటుగా నిర్ణయిచి భూములను కేటాయిస్తారు. అనంతరం ప్రతి రెండేళ్లకోసారి 5 శాతం లీజు ధరను ప్రభుత్వం పెంచనుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పంద (పీపీఏ) జరిగాక జిల్లా కలెక్టర్లతో లీజు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. కరెంటు ప్రైవేటుకూ అమ్ముకోవచ్చు డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ అమ్ముకోవచ్చు. సొంత అవసరాలకూ వాడుకోవచ్చు. ఎకరాకు రూ.లక్ష ధరతో ఇలాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం 25 ఏళ్లు లేదా ప్రాజెక్టు జీవిత కాలానికి స్థలాలను కేటాయిస్తుంది. ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత సబ్ స్టేషన్ పరిధిలో కొత్త విద్యుదుత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు ఎంత సామర్థ్యం లభ్యత ఉందో.. ఆ మేరకు మాత్రమే అనుమతిస్తారు. ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత లభించనుంది. సౌర, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లను రెండేళ్లలో, పవన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వీటి ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్ విధానంలో కేటాయించనున్నారు. మహిళా సంఘాలతో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపన 500 కిలోవాట్ నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) నుంచి ఆసక్తి వ్యక్తీకరణను డిస్కంలు విడతలవారీగా ఆహ్వనించనున్నాయి. వారి నుంచి నిరీ్ణత ధరకు విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేస్తాయి. భారీ ప్రోత్సాహకాలు.. ⇒ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే భూములకు నాలా కన్వర్షన్ నుంచి మినహాయింపు. ⇒ టీజీ–ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో అన్ని అనుమతులను సత్వరం జారీ చేస్తారు. ⇒ పారిశ్రామిక హోదా కల్పించి రాష్ట్ర పారిశ్రామిక విధానం కింద అందించే అన్ని రకాల ప్రోత్సాహకాలను వర్తింపుజేస్తారు. ⇒ప్రతి మెగావాట్‌కు 4 ఎకరాలు చొప్పున భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. ⇒ భూముల కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ 100 శాతం తిరిగి చెల్లిస్తారు. ⇒వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. ⇒ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ చెల్లింపుల నుంచి మినహాయింపు ఇస్తారు. ఇతర కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లుఅందుతాయి. జెన్కో, ట్రాన్స్‌కో సాంకేతిక సహకారం అందిస్తాయి. ⇒ పీసీబీ నుంచి ఎన్ఓసీ మినహాయింపు. ⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సౌర, పవన విద్యుత్ వాడుకుంటే 8 ఏళ్ల పాటు విద్యుత్ సుంకం మినహాయింపు కల్పిస్తారు. ⇒ పీఎస్పీ ప్రాజెక్టులకు నీటి సుంకాన్ని తిరిగి చెల్లిస్తారు. డిస్కంలకు విద్యుత్ విక్రయిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు ⇒ సూపర్వైజేషన్ చార్జీల మినహాయింపు. ⇒ ఇతర సౌర, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ, ఇతర ప్రాజెక్టులకు 50 శాతం రాష్ట్ర జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. ⇒ ఎస్‌హెచ్‌జీలు/గ్రామ సమాఖ్యలు ఏర్పాటు చేసే సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత గృహాలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ స్కూల్స్, కార్యాలయాలపై ఏర్పాటు చేసే రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులకు 100 శాతం స్టేట్ జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. పీఎస్పీ ప్రాజెక్టులకు 45 ఏళ్ల లీజుకు స్థలాలు పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను 45 ఏళ్ల లీజుకు కేటాయిస్తారు. వీటి స్థాపన కోసం ప్రైవేటు డెవలపర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తే, ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. 6 ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలి. 45 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. పీఎస్పీ విద్యుత్‌లో 80 శాతం తొలి హక్కు రాష్ట్రమే కలిగి ఉంటుంది. హైబ్రిడ్ పవర్‌కు ప్రాధాన్యత.. ఒకే ప్రాంతంలో సౌర+పవన, పవన+ఫ్లోటింగ్ సోలార్, విండ్+ స్టోరేజీ, హైబ్రిడ్+స్టోరేజీ వంటి పునరుత్పాదక ఇంధన స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ఈ పాలసీ ద్వారా ప్రోత్సహించనున్నారు. -
20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ!
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పాదకతను ప్రోత్సహించి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి త్వరలో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ(Green Energy Policy) ప్రకటించబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. కాలుష్య కారక థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో ప్రపంచవ్యాప్తంగా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ(Green energy) ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రం కూడా ఆ దిశలో అడుగులు వేస్తోందని చెప్పారు. రాష్ట్రం 11,399 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ(Green energy) ఉత్పత్తితో దేశంలో ముందంజలో ఉండగా, 2030 నాటికి ఈ సామర్థ్యాన్ని 20,000 మెగావాట్లకు పెంచడమే పాలసీ లక్ష్యమన్నారు. శుక్రవారం హెచ్ఐసీసీలో పారిశ్రామిక, వ్యాపార, ఇతర రంగాల భాగస్వాములతో నిర్వహించిన సదస్సులో భట్టి మాట్లాడారు. అనంతరం వివరాలను వెల్లడించారు. భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్ ‘సాంకేతిక, ఫార్మా, ఉత్పత్తి, వ్యవసాయ రంగాల అభివృద్ధికి రాష్ట్రం కేంద్రంగా ఆవిర్భవించింది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీ, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, పారిశ్రామిక కారిడార్లు అధిక విద్యుత్ డిమాండ్(Electricity Demand) కు దోహదపడతాయి. 2024–25లో రాష్ట్రంలో 15,623 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడగా, 2029–30 నాటికి 24,215 మెగావాట్లకు, 2034–35 నాటికి 31,809 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా’అని భట్టి చెప్పారు. భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు ‘పునరుత్పాదక విద్యుత్ రంగం(electricity sector) లో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం 7,889 మెగావాట్ల సౌర విద్యుత్, 2,518 మెగావాట్ల జల విద్యుత్, 771 మెగావాట్ల డి్రస్టిబ్యూటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ, 128 మెగావాట్ల పవన విద్యుత్ సహా 221 మెగావాట్ల ఇతర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. పాలసీలో భాగంగా సౌర విద్యుత్‌తో పాటు ఫ్లోటింగ్ సోలార్, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ ప్రాజెక్టులు తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులతో పాటు సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తాం..’అని భట్టి తెలిపారు.రాష్ట్రంలో ఈ ఏడాది కూడా విద్యుత్ చార్జీల(electricity charge) ను పెంచబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ అలీ, కె.వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు ఇందనంగా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్నామని భట్టి చెప్పారు. ఆ్రస్టేలియా– ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఐఐటీలో రెండురోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పరిశోధన, సంబంధిత సైన్స్ ఆధారిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వైఎస్సార్ నాయకత్వంలోనే హైదరాబాద్ ఐఐటీకి పునాదులు పడ్డాయని, ఐఐటీలు దేశ నిర్మాణానికి వేదికలని చెప్పారు. ఈ సందర్భంగా సింగరేణిలో పరిశోధనకు సంబంధించిన ప్రాజెక్టుపై హైదరాబాద్ ఐఐటీ ఆ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. సింగరేణి డైరెక్టర్ బలరామ్ నాయక్, ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి ఎంఓయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఆ్రస్టేలియా కాన్సులేట్ జనరల్ (బెంగళూరు) హిల్లరీ మెక్గేచి, భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, కేంద్ర గనుల శాఖ జాయింట్ సెక్రటరీ దినేష్ మహోర్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ హైడ్రోజన్.. గేమ్ చేంజర్!
హైడ్రోజన్ కార్లు.. బస్సులు.. రైళ్లు.. నౌకలు.. పరిశ్రమలు... ఇలా ప్రపంచమంతా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ నామ జపం చేస్తోంది! పునరుత్పాదక ఇంధన రంగంలో గేమ్ చేంజర్‌గా అభివరి్ణస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ కూడా వేట మొదలుపెట్టింది. దేశీ కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, అదానీ గ్రూపులతో పాటు అవాడా, హైజెన్కో గ్రీన్ ఎనర్జీస్, థెర్మాక్స్ వంటి సంస్థలు ఈ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలతో చకచకా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ నయా ఇంధనాన్ని వినియోగదారులకు చౌకగా అందించేందుకు ఉత్పాదక వ్యయాన్ని రెండింతలకు పైగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయం ఒక్కో కేజీకి 4–5 డాలర్లు (దాదాపు రూ.340–430)గా ఉంటోంది. అదే గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు 1–2 డాలర్లు (రూ.85–170) మాత్రమే. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తి కాలుష్యకరమైనది కావడంతో ప్రపంచవ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కంపెనీలు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదక వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాయి. సరికొత్త టెక్నాలజీలతో పాటు వినూత్న ఉత్పత్తులు, ఇతరత్రా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 2030 నాటికి భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్దేశించుకున్న 50 లక్షల వార్షిక టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాకారం కావాలంటే, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించడం చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. టెక్నాలజీ దన్ను... గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు అధునాతన ఎనలిటిక్స్‌ను అవాడా గ్రూప్ ఉపయోగిస్తోంది. ‘అత్యాధునిక ఎలక్ట్రోలైజర్ టెక్నాలజీ వల్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం మెరుగుపడి, హైడ్రోజన్ ఉత్పత్తికి తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. దీంతో వ్యయం భారీగా దిగొస్తోంది’ అని కంపెనీ చైర్మన్ వినీత్ మిట్టల్ పేర్కొన్నారు. హైజెన్కో సంస్థ అయితే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), ఏఐతో పాటు మెషీన్ లెరి్నంగ్‌ను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటోంది. కంపెనీ ఒడిశాలోని గోపాల్‌పూర్‌లో 1.1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ అమోనియా ప్రాజెక్టును నెలకొల్పే ప్రణాళికల్లో ఉంది. వెల్స్పన్ న్యూ ఎనర్జీ కూడా గ్రీన్ హైడ్రోజన్‌ను చౌకగా అందించేందుకు సౌర, పవన విద్యుత్‌తో పాటు బ్యాటరీల్లో స్టోర్ చేసిన విద్యుత్‌ను కూడా ఉపయోగిస్తోంది. అంతేకాకుండా పెద్దయెత్తున జల విద్యుత్‌ను కూడా వినియోగించే సన్నాహాల్లో ఉన్నట్లు కంపెనీ సీఈఓ కపిల్ మహేశ్వరి పేర్కొన్నారు. ఇక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన మాడ్యూల్స్ తయారీ, విక్రయం, సరీ్వస్ కోసం థర్మాక్స్ బ్రిటన్‌కు చెందిన సెరెస్తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దాని ఆక్సైడ్ ఎల్రక్టాలిసిస్ టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన ఎలక్ట్రాలిసిస్ సాంకేతికతతో పోలిస్తే ఇది 25% మెరుగైనదని సంస్థ సీఈఓ ఆశిష్ భండారీ వెల్లడించారు.అంబానీ, అదానీ గిగా ఫ్యాక్టరీలుదేశంలో గ్రీన్ హైడ్రోజన్ సమగ్ర వ్యవస్థ (ఎకో సిస్టమ్) నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) 10 బిలియన్ డాలర్లను వెచి్చంచనుంది. 2030 నాటికి కేజీ గ్రీన్ హైడ్రోజన్‌ను ఒక డాలరుకే ఉత్పత్తి చేయాలనేది కంపెనీ లక్ష్యం. 2026 కల్లా తొలి ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తాజా ఏజీఎంలో ప్రకటించారు కూడా. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచి, కొత్త తరం ఎలక్ట్రోలైజర్ల కోసం పెట్టుబడి వ్యయాలను తగ్గించుకోవడానికి అధునాతన ఎల్రక్టాలిసిస్ ఆధారిత టెక్నాలజీలను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా అదానీ న్యూ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దే సన్నాహాల్లో అదానీ గ్రూప్ నిమగ్నమైంది. 2030 నాటికి 10 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడేలా సమగ్ర ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. తదుపరి పదేళ్లలో ఈ సామర్థ్యాన్ని 30 లక్షల టన్నులకు పెంచాలనేది అదానీ లక్ష్యం. ఈ వ్యవస్థలో గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్, పర్యావరణానుకూల విమాన ఇంధనం వంటి పలు ఉత్పత్తులు ఉంటాయి. గ్రీన్ హైడ్రోజన్: ప్రకృతిలో అపారంగా దొరికే నీటిని పునరుత్పాదక ఇంధనాలైన సౌర, పవన, జల విద్యుత్‌ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. ఎలక్ట్రోలైజర్లో జరిపే ఈ ప్రక్రియను ఎల్రక్టాలిసిస్గా పేర్కొంటారు. ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 100 శాతం పర్యావరణానుకూలమైనది కావడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీన్ని నిల్వ చేయడం చాలా సులభం. అంతేకాకుండా, వాహనాల నుండి పరిశ్రమల వరకు అనేక అవసరాల కోసం వాడుకోవచ్చు. గ్రే హైడ్రోజన్: హైడ్రోజన్ ఉత్పత్తిలో ఇది అత్యంత సాధారణ ప్రక్రియ. స్టీమ్ మీథేన్ రిఫారి్మంగ్ (ఎస్ఎంఆర్) అనే ప్రక్రియలో సహజవాయువును ఉపయోగిస్తారు. తయారీలో గణనీయంగా కార్బన ఉద్గారాలను విడుదల చేయడం వల్ల దీనిపై వ్యతిరేకత నెలకొంది. వినియోగంలో మాత్రం 100% పర్యావరణ హితమైనదే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అదానీపై లంచం ఆరోపణల్లేవు!
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, కంపెనీ బోర్డు సీనియర్ డైరెక్టర్ వినీత్జైన్పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ‘‘న్యూయార్క్ కోర్టులో గత వారం అమెరికా న్యాయ శాఖ (యూఎస్ డీఓజే) దాఖలు చేసిన అభియోగ పత్రంలో, యూఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ (ఎఫ్‌సీపీఏ/అవినీతి నిరోధక) చట్టం నిబంధనలను ఉల్లంఘించే కుట్రకు పాల్పడినట్టు వ్యవస్థాపక చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ లేదా వినీత్జైన్పై అభియోగాలు మోపలేదు’’అని స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) బుధవారం వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం కింద మోసం, కుట్ర, ఉద్దేశపూర్వక కుట్ర ఆరోపణలే మోపినట్టు తెలిపింది. ఈ అభియోగాలకు చట్టం పరిధిలో శిక్షలు లంచం కంటే చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు సెక్యూరిటీల చట్టం నిబంధనలు ఉల్లంఘించారంటూ.. చట్ట ఉల్లంఘన దిశగా అదానీ గ్రీన్ ఎనర్జీకి సాయం అందించారంటూ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ మరో సివిల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు ఏజీఈఎల్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీస్ చట్టం 1933, సెక్యూరిటీస్ చట్టం 1934లోని పలు సెక్షన్లను వీరు ఉల్లంఘించారని.. ఏజీఈఎల్ సైతం ఇవే చట్ట ఉల్లంఘనలకు పాల్పడేందుకు సాయం లేదా ప్రోత్సాహం అందించినట్టు సివిల్ కేసులో అభియోగాలు మోపినట్టు వెల్లడించింది. ఏజీఈఎల్ సోలార్ విద్యుత్ సరఫరా కాంట్రాక్టులను దక్కించుకునేందుకు వీలుగా భారత అధికారులకు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారంటూ అదానీ తదితరులపై కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదానీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇవన్నీ నిరాధార ఆరోపణలు అని, ఈ విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ ఇప్పటికే వివరణ ఇచ్చింది.అదరగొట్టిన అదానీ షేర్లు...అమెరికా లంచం ఆరోపణలపై అదానీ గ్రూప్ వివరణ ఇవ్వడంతో అదానీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అదానీ టోటల్ గ్యాస్ 20%, అదానీ పవర్ 20%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 10%, అదానీ గ్రీన్ ఎనర్జీ 10% లాభపడ్డాయి. ఈ షేర్లన్నీ ఇంట్రాడేలో అప్పర్‌సర్క్యూట్ తాకాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 12%, ఎన్డీటీవీ 9%, అదానీ విల్మార్ 8%, అదానీ పోర్ట్స్ 6%, సంఘీ ఇండస్ట్రీస్ 5%, అంబుజా సిమెంట్స్ 4.50%, ఏసీసీ 4% పెరిగాయి. పదకొండు కంపెనీల షేర్లూ రాణించడంతో ఒక్కరోజులో అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.24 లక్షల కోట్లు పెరిగింది. -
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని మరో దశాబ్ద కాలంలో 50,500 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 10,095 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగి ఉండగా, 2034–35 నాటికి మరో 40,405 మెగావాట్ల సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో సౌర, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టులు, జియోథర్మల్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈమేరకు తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2024ని ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. లీజుకు చౌకగా సర్కారీ స్థలాలు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు టారిఫ్ ఆధారిత కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా కొత్త సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్లు, పవన విద్యుత్ కేంద్రాల స్థాపనకు డెవలపర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనున్నాయి. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాటితో వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేయనున్నాయి. డెవలపర్లు ప్రైవేటు, ప్రభుత్వ స్థలాల్లో ఈ ప్రాజెక్టులను స్థాపించడానికి అవకాశం ఇవ్వనున్నారు. సర్కారు స్థలాలను నామమాత్రపు అద్దెతో ప్రభుత్వం లీజుకు ఇవ్వనుంది. బిడ్డింగ్ విజేతలకు మార్కెట్ రేటులో 10శాతం లీజు రేటుతో భూములను కేటాయించనుంది. టీజీ–ఐపాస్ ద్వారా డెవలపర్లకు అన్ని అనుమతులు సత్వరంగా జారీ కానున్నాయి. డెవలపర్లు రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు సంస్థలకు ఓపెన్ యాక్సెస్ ద్వారా అమ్ముకునే అవకాశాన్ని కల్పించనున్నారు. సొంత అవసరాలకూ సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు వీలుంటుంది. జలాశయాలపై ఫ్లోటింగ్ ప్రాజెక్టులు నీటిపారుదల శాఖ భాగస్వామ్యంతో కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటును సైతం ప్రభుత్వం ప్రోత్సహించనుంది. జలాశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించనుంది. ఇందుకుగాను నీటిపారుదల శాఖకు డిస్కంలు విద్యుత్‌లో వాటా/ నామమాత్రపు అద్దెను చెల్లిస్తాయి. = రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజులు సౌరవిద్యుదుత్పత్తికి అనుకూలత ఉంటుంది. దేశంలో బలంగా గాలులు వీచే 8 రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ 5500 మెగావాట్ల పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. = రాష్ట్రంలోని సబ్స్టేషన్ల వారీగా సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు ఎక్కడ అవకాశం ఉందో వెల్లడిస్తూ డిస్కంలు ప్రకటన జారీచేయనున్నాయి. ఆ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానించనున్నాయి. ప్రోత్సాహకాలివీ.. –పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వినియోగించే స్థలాలను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు. –డిస్కంలకు విద్యుత్ విక్రయించే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించనున్నారు. –సూపరై్వజింగ్ చార్జీల మినహాయింపు. –ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసే యంత్రాలు, పరికరాలకు 100 శాతం రాష్ట్ర జీఎస్టీ వాటాను తిరిగి చెల్లిస్తారు. –భూగరిష్ట పరిమితి చట్టం నుంచి మినహాయింపు కల్పిస్తారు. మెగావాట్ ప్రాజెక్టుకు 4 ఎకరాల వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. – ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ గృహాలు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ప్లాంట్ల స్థాపనను ప్రోత్సహించనున్నారు. –పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను నామమాత్రపు లీజు ధరతో 45 ఏళ్ల కాలానికి ప్రభుత్వం కేటాయించనుంది. -
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌లో భారీ ఆర్డర్
దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్ ఆర్డర్.1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంట్‌లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్‌లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్‌లతో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసి గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు.ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ 640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది. ఏఎం గ్రీన్ గురించి.. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది. -
2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరం
భారత్ తన లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు రూ.32 లక్షల కోట్లు అవసరమవుతాయని ఐఆర్ఈడీఏ ఛైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. 23వ ఇండియా పవర్ ఫోరమ్ 2024లో పాల్గొని ఆయన మాట్లాడారు. రుణదాతలు కస్టమర్ల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సకాలంలో ఆర్థిక అవసరాలు తీర్చేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పునరుత్పాదక ఇంధన రంగంలో ఎలాంటి హానికర ఉద్గారాలు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం 2030 నాటికి ఈ రంగంలో సుమారు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇందుకోసం రుణదాతలు కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టాలి. భవిష్యత్తులో దేశీయ విద్యుత్ అవసరాలు తీర్చే ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరాలంటే ఈ విభాగం కీలకంగా మారనుంది. ఈ రంగంలో మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్‌షోర్ విండ్(సముద్ర అలల సాయంతో విద్యుత్ ఉత్పత్తి), ఇ-మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక సాంకేతికతలకు రానున్న రోజుల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం -
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యా న్ని నిర్దేశించుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు తెలంగా ణలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్ల డించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. భట్టికి రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధి కారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకా షీ తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి భట్టి విక్రమార్క పిలుపుని చ్చారు. భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రోహ్మ్ సంస్థ తెలిపింది. సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానసోనిక్ కంపెనీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరించారు. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పానసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని, ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు. వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ పర్యటనలో భట్టితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
భారత్..డేటా సంపన్న దేశం: అంబానీ
మలిదశ వృద్ధి ప్రయాణానికి రిలయన్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. 2016లో జియో 4జీ టెలికం సేవలను ప్రారంభించడం ద్వారా భారత్‌ను డేటా పరంగా సంపన్న దేశంగా మార్చినట్టు కంపెనీ వార్షిక నివేదికలో అంబానీ పేర్కొన్నారు. జియో ద్వారా దాదాపు దేశంలోని ప్రతి ఇంటికీ అధిక వేగంతో కూడిన 4జీ డేటాను అందుబాటు ధరలకు అందిస్తున్నట్టు చెప్పారు.ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతర్జాతీయ అనిశ్చితులున్నా ప్రపంచంలో భారత్ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ అవసరాలను తీర్చే స్థాయిలో రిలయన్స్ రిటైల్ ఉంది. 100 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) విలువ కలిగిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నార’ని చెప్పారు.ఇదీ చదవండి: ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‘2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదలే(నెట్ జీరో) లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు వీలుగా జామ్‌నగర్‌లో దీరూభాయి అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల తయారీకి సంబంధించి రిలయన్స్ సమగ్ర కేంద్రంగా ఉంటుంది. వయకామ్ 18, స్టార్ ఇండియా వ్యాపారాల విలీనంతో జాయింట్ వెంచర్ టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్‌లో అగ్రగామిగా అవతరిస్తున్నాం’ అని ముఖేశ్ అన్నారు. -
అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై, ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై వచ్చే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ పార్కులను నిరి్మంచడం నుంచి హరిత హైడ్రోజన్, పవన విద్యుత్ టర్బైన్లు మొదలైన వాటికోసం ఎలక్ట్రోలైజర్లను తయారు చేయడం వరకు భారీ ప్లాంట్లను గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాలు తెలిపారు. ఇంధన పరివర్తన, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో లక్షల కోట్ల (ట్రిలియన్ల) డాలర్లకు వ్యాపార అవకాశా లు ఉన్నాయని, ఇవి భారత్ రూపురేఖలను దేశీయంగానూ, అంతర్జాతీయంగాను మార్చేయగలవన్నారు. అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన మార్కెట్ 2023లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ఇది 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని, అటుపైన 2050 వరకు ప్రతి పదేళ్లకు రెట్టింపు కానుందని అదానీ చెప్పారు. భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు సాధించాలంటే ఏటా 150 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు అవసరమన్నారు. -
ఏపీ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు అంతర్జాతీయ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న ఏఎం గ్రీన్ (గతంలో గ్రీన్కో జీరోసీ) సంస్థకు చెందిన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. యూరప్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన ప్రోత్సాహక సంస్థ సర్టిఫ్‌హై నుంచి ప్రీ-సర్టిఫికేషన్ పొందింది.పునరుత్పాదక ఇంధనాల కోసం కఠినమైన యూరోపియన్ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫ్‌హై ఈయూ పునరుత్పాదక ఇంధనాలు నాన్-బయోలాజికల్ ఆరిజిన్ (ఆర్ఎఫ్ఎన్బీఓ) ప్రీ-సర్టిఫికేషన్ పొందిన మొదటి భారతీయ ప్రాజెక్టుగా ఏఎం గ్రీన్ నిలిచింది. ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జగన్ ప్రభుత్వంలో ఏర్పాటైంది.కార్బన్ రహిత ఇంధన వనరులను ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియాను ఉత్పత్తి చేయడానికి ఏఎం గ్రీన్ నిబద్ధతను ప్రీ-సర్టిఫికేషన్ నొక్కి చెబుతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగాలను డీకార్బోనేట్ చేయడానికి కీలకమైన ఈ దశలో రవాణా, పరిశ్రమలో సుస్థిరత కోసం ఈయూ నియంత్రణ ప్రమాణాలను చేరుకోవడానికి కంపెనీ సంసిద్ధతను ఈ ప్రీ-సర్టిఫికేషన్ ధ్రువీకరిస్తుంది. లాభదాయకమైన ఈయూ ఆర్ఎఫ్ఎన్బీఓ మార్కెట్‌ను సమర్థవంతంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫ్‌హై ప్రీ-సర్టిఫికేషన్ ప్రాముఖ్యతను ఏఎం గ్రీన్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి నొక్కి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏఎం గ్రీన్ పాత్రను పునరుద్ఘాటించారు. 2030 నాటికి కాకినాడలో ఏడాదికి 10 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.మహేష్ కొల్లి, ఏఎం గ్రీన్ అధ్యక్షుడు -
మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఈఆర్సీ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు, విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, చార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను ఏపీఈఆర్సీ ‘నియంత్రణ’ పేరుతో రూపొందించింది. గతేడాది డ్రాఫ్ట్ రూపంలో తీసుకువచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న ఏపీఈఆర్సీ... వీటికి ఆమోదం తెలిపింది. దేశంలో 2070కి కర్భన ఉద్గారాలను నెట్‌జీరో స్థాయికి తీసుకురావాలని, ఇందుకోసం 2030కి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పాలన్న కేంద్రం లక్ష్యానికి కూడా ఈ నిబంధనలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ పేర్కొంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లు, డిస్కంలకు ఈ ‘నియంత్రణ’ వర్తిస్తుంది.ఇవీ నిబంధనలు... » గ్రీన్ ఎనర్జీ నూతన నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను పొందడానికి దివాలా తీసిన, డిస్కంలకు రెండు నెలలు కంటే ఎక్కువకాలం బకాయిలు ఉన్న, అనధికారికంగా విద్యుత్ వినియోగం, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు అర్హత లేదు. » అర్హులైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి (ఏపీఎస్‌ఎల్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. » దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం ఏపీ ట్రాన్స్‌కో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌కు అన్ని దరఖాస్తులు నేరుగా రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి.» సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌కు సంబంధించిన మొత్తం çసమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలు(జనరేటర్ల)కు కనెక్టివిటీ మంజూరు చేస్తారు.» ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, ఉత్తత్పి సంస్థలు, ఒప్పందాలు, ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను పొందడం కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాల్లో పేర్కొన్న విధంగానే చార్జీలు వర్తిస్తాయి.» గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్ చార్జీలు, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలు, స్టాండ్‌బై చార్జీలు, బ్యాంకింగ్, రియాక్టివ్ ఎనర్జీ చార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు.» 2032 డిసెంబర్ లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్‌లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్‌చార్జ్ వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యస్థ కాలవ్యవధిలో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. బ్యాంకింగ్ నెలవారీ బిల్లింగ్ సైకిల్ ఆధారంగా ఉండాలి. -
ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో సన్నాహాలు
ముంబై: పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ను షార్ట్‌లిస్ట్ చేసింది. -
పునరుత్పాదక విద్యుత్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు
న్యూఢిల్లీ: దేశీయంగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన తొలి కంపెనీగా తమ సంస్థ నిలి్చందని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. గుజరాత్‌లోని ఖావ్డా సోలార్ పార్క్‌లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటు ద్వారా దీన్ని సాధించినట్లు సంస్థ వివరించింది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 7,393 మెగావాట్ల సౌర విద్యుత్, 1,401 మెగావాట్ల పవన విద్యుత్, 2,140 మెగావాట్ల విండ్–సోలార్ హైబ్రిడ్ ప్లాంట్లు (మొత్తం 10,934 మెగావాట్ల ) ఉన్నాయి. 2030 నాటికల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని కంపెనీ నిర్దేశించుకుంది. -
Ashwini Vaishnav: వచ్చే పదేళ్లలో 6 నుంచి 8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ వచ్చే 10 సంవత్సరాలలో 6 నుంచి 8 శాతం స్థిరమైన వృద్ధి రేటును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి మంత్రి అశ్విని వైష్ణవ్ వ్యక్తం చేశారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి భారత్ తగిన స్థానంలో ఉందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. రైసినా డైలాగ్ 2024లో ఆయన ఈ మేరకు మాట్లాడుతూ, 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వచ్చే ఐదేళ్లలో కేంద్రం మరింత పటిష్ట పునాదులు వేస్తుందని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా భారత్ ఆవిర్భవించాలి: జీ20 షెర్పా అమితాబ్ కాంత్ పెట్టుబడులకు సంబంధించి కీలక మూలధనాన్ని ఆకర్షించడానికి 2047 నాటికి భారతదేశం గ్రీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా మారాల్సిన అవసరం ఉందని జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ ఇదే కార్యక్రమంలో అన్నారు. ‘రైసినా డైలాగ్ 2024’లో కాంత్ ప్రసంగిస్తూ, నేటి ప్రధాన సవాలు వాతావరణ మార్పు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ప్రపంచ బ్యాంక్ ‘వాతావరణ బ్యాంకుగా’ మారాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో, అన్ని పెట్టుబడులు పునరుత్పాదక రంగంలోకి ప్రవహిస్తాయని అంచనావేశారు. పర్యావరణానికి పెద్దపీట వేసిన దేశాతే మూలధనాన్ని ఆకర్షించగలవని ఆయన అన్నారు. -
గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణహిత ఇంధనం (గ్రీన్ ఎనర్జీ) ఉత్పత్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుండటంతో దిగ్గజ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్ గ్రూప్ సుమారు రూ.1,920 కోట్ల పెట్టుబడితో 15 చోట్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి దశలో 8 యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వ్యవసాయ వ్యర్థాలు.. వరిగడ్డి, వేరుశెనగ పొట్టు, జొన్న కంకులు, ఖాళీ కొబ్బరి బొండాలు, చెరకు పిప్పి, మునిసిపాలిటీల నుంచి రోజూ వచ్చే వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ 15 యూనిట్ల ద్వారా పూర్తిగా పర్యావరణహితమైన గ్యాస్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా సేంద్రియ ఎరువులను కూడా తయారుచేయొచ్చు. ఇప్పటివరకు ఈ వ్యర్థాలను తరలించే అవకాశం లేకపోవడంతో రైతులు పొలాల్లోనే వాటిని తగులబెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం వెలువడుతోంది.. నేలసారం కూడా తగ్గిపోతోంది. ఇప్పుడు ఇలా కాకుండా నేరుగా రైతుల నుంచే రిలయన్స్ ఈ వ్యర్థాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రతి యూనిట్‌కు కనీసం ఐదు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వ్యర్థాల కొనుగోలు చేయడం ద్వారా కనీసం 70 వేల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా. ప్రతి రైతుకు అదనంగా రూ.6,250 చొప్పున ఏటా రైతులకు రూ.45 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించనుంది. అంతేకాకుండా ఈ సీబీజీ యూనిట్లకు అనుబంధంగా మరో రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని రిలయన్స్ అధికారులు వెల్లడించారు. తగ్గనున్న కర్బన ఉద్గారాలు, దిగుమతులు.. దేశవ్యాప్తంగా రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న 100 సీబీజీ యూనిట్లకు ఏటా 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు అవసరమవుతాయని అంచనా. తద్వారా 2.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. ఈ యూనిట్ల ద్వారా సీబీజీనే కాకుండా 2.5 మిలియన్ టన్నుల సేంద్రియ ఎరువులు కూడా ఉత్పత్తవుతాయి. అంతేకాకుండా ఏటా ఏడు మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతులు తగ్గడం ద్వారా విదేశీమారక నిల్వలు పెరగనున్నాయి. వాటికి ప్రత్యామ్నాయంగా సీబీజీ.. రానున్న కాలంలో ఎల్ఎన్జీ (లిక్విడ్ నేచురల్ గ్యాస్), సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)లకు ప్రత్యామ్నాయంగా సీబీజీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్, అదానీ వంటి సంస్థలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. రిలయన్స్ అనుబంధ కంపెనీ.. రిలయన్స్ బయోఎనర్జీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 100 సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ 100 యూనిట్లలో 15 యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. సుమారు రూ.130 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో యూనిట్ ఉంటుంది. తొలి దశలో భాగంగా కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద 2, విజయవాడ పరిటాల వద్ద, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనుంది. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభమైన ఈ 8 యూనిట్లు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో మరో ఏడు యూనిట్లను 2026 సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం ఈ 15 యూనిట్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో యూనిట్ ద్వారా ఏటా 7,000 టన్నుల సీబీజీ, 34,300 టన్నుల సేంద్రియ ఎరువులు ఉత్పత్తి కానున్నాయి. -
పెట్టుబడులకు 'ఎనర్జీ'
సీఎంతో సీఐఐ ప్రతినిధులు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన పలు పరిశ్రమల సీఈవోలు బుధవారం దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులతో భేటీ అయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను కొనియాడారు. పారిశ్రామికాభివృద్ధి కోసం తీసుకునే అన్నిరకాల నిర్ణయాలకు సీఐఐ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) 54వ వార్షిక సదస్సులో భాగంగా.. రెండో రోజు బుధవారం పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం.. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు నిర్వహించి, ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా రూ.37,800 కోట్ల పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరినట్టు, కీలక ప్రకటనలు వెలువడినట్టు తెలిపింది. సీఎంవో తెలిపిన వివరాల మేరకు.. రాష్ట్రంలో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఏరోస్పేస్–డిఫెన్స్ విభాగం సీఈఓ ఆశిశ్ రాజ్‌వంశీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. గ్రీన్ ఎనర్జీ.. స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్.. అదానీ గ్రూప్‌తో ఒప్పందాల్లో భాగంగా రూ.5వేల కోట్ల పెట్టుబడితో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. అనుబంధ సంస్థ అదానీ కొనెక్స్ మరో రూ.5వేల కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ క్యాంపస్‌ను చందన్‌పల్లిలో ఏర్పాటు చేస్తుంది. ఇక అంబుజా సిమెంట్స్ సంస్థ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యమున్న సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను రూ.1,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. అదానీ ఏరోస్పేస్, డిఫెన్స్ పార్క్‌లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతలో నైపుణ్యాలు (స్కిల్స్) పెంపొందించేందుకు త్వరలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రేవంత్‌తో భేటీ సందర్భంగా అదానీ సంసిద్ధత వ్యక్తం చేశారు. ► తెలంగాణలో రూ.9వేల కోట్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై ‘జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ’తో రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 1,500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో సీఎం రేవంత్ చర్చించారు. ► రాష్ట్రంలో రూ.8వేల కోట్ల పెట్టుబడితో 12.5 జీడబ్ల్యూహెచ్ (గిగావాట్ ఫర్ అవర్) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధన, అభివృద్ధి కేంద్రంతోపాటు, గిగాస్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటవుతుంది. ప్రాజెక్ట్ మొదటి దశలో 6వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొదటి దశలో 2.5 గిగావాట్ల సామర్థ్యముండే సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి.. రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. ► డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్ తెలంగాణలో రూ.5,200 కోట్లతో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీలతో సీఎం రేవంత్ భేటీలో రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చించారు. హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్వర్కింగ్–హెవీ డేటా సెంటర్లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా రూ.4,000 కోట్లకుపైగా పెట్టుబడులతో భవిష్యత్తులో గ్రీన్‌ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. ► రాష్ట్రంలో ఆయిల్‌పామ్ మిషన్‌లో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఖమ్మంలో దేశంలోనే మొట్టమొదటి ఆయిల్‌పామ్ సీడ్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ కొత్త సీడ్ గార్డెన్ ద్వారా ఏటా 70లక్షల మొక్కలను సరఫరా చేయడం ద్వారా పది లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును చేపట్టవచ్చని పేర్కొంది. దీంతోపాటు రూ.వెయ్యి కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని గోద్రెజ్ సంస్థ ప్రకటించింది. నైపుణ్య శిక్షణ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, పాడి పరిశ్రమ విస్తరణ వంటి అంశాలపైనా గోద్రెజ్ సీఎండీ నాదిర్ గోద్రెజ్‌తో సీఎం చర్చించారు. ► రాష్ట్రంలోని మల్లాపూర్‌లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఆరాజెన్ లైఫ్ సైన్సెస్’ సంస్థ రూ.2వేల కోట్ల పెట్టుబడులు, 1,500 మందికి కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యకలాపాలను విస్తరించనుంది. సీఎం రేవంత్‌తో ఆరాజెన్ సీఈఓ మణి కంటిపూడి భేటీ సందర్భంగా దీనిపై ఒప్పందం కుదిరింది. ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్‌గా మారనుందని ఆ సంస్థ పేర్కొంది. ► దావోస్ రెండోరోజు పర్యటనలో భాగంగా రేవంత్ బుధవారం హెయిన్కెన్ ఇంటర్నేషనల్ సీఈఓ డాల్ఫ్ వాన్‌డెన్ బ్రింక్, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషబ్ ప్రేమ్‌జీ తదితరులతోనూ భేటీ అయ్యారు. వరంగల్‌లో ఐటీ కార్యకలాపాల విస్తరణకు సంబంధించి రిషబ్ ప్రేమ్‌జీతో చర్చించారు. ఈ భేటీల్లో ఐటీ–పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ ఎనర్జీపై అదానీ దృష్టి
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ పర్యావరణహిత(గ్రీన్) ఇంధనం(ఎనర్జీ)కి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. 2030కల్లా 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తోంది. ఇందుకు అనుగుణంగా అదానీ కుటుంబం రూ. 9,350 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధపడుతోంది. గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్(ఏజీఈఎల్) ప్రమోటర్ కుటుంబీకులతోపాటు ఆర్డౌర్ ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ లిమిటెడ్, అదానీ ప్రాపర్టిస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు మొత్తం 6.31 కోట్ల వారంట్లను జారీ చేయనుంది. ఒక్కో వారంట్‌ను రూ. 1,480.75 ధరలో కేటాయించేందుకు కంపెనీ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. తాజా పెట్టుబడుల కారణంగా కంపెనీలో ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 3.83 శాతం వాటా లభించనుంది. వచ్చే ఏడాది 1.2 బిలియన్ డాలర్ల విలువైన బాండ్ల గడువు తీరనుంది. ఇప్పటికే వీటి చెల్లింపులు లేదా రీఫైనాన్సింగ్‌కు కంపెనీ ప్రణాళికలు వేసింది. 19.8 గిగావాట్ల విద్యుత్ కొనుగోలుకి అదానీ గ్రీన్ ఇప్పటికే ఒప్పందాన్ని పీపీఏ కుదుర్చుకుంది. ప్రమోటర్ పెట్టుబడుల వార్తలతో అదానీ గ్రీన్ షేరు బీఎస్ఈలో 4.3 శాతం ఎగసి రూ. 1,600 వద్ద ముగిసింది. -
నాలుగు సంస్థల ఏర్పాటులో అదానీ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా నాలుగు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ టూ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ త్రీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్టీ ఫోర్ వీటిలో ఉన్నాయి. పవన, సౌర, ఇతరత్రా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం తదితర లావాదేవీల కోసం ఈ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. -
జపాన్ సంస్థలతో సెంబ్‌కార్ప్ జట్టు
న్యూఢిల్లీ: హరిత విద్యుత్ శక్తి విభాగంలో స్థానం పటిష్టం చేసుకునే దిశగా సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో హరిత అమ్మోనియాను ఉత్పత్తి చేసేందుకు జపాన్‌కు చెందిన రెండు సంస్థలతో చేతులు కలిపింది. దీనికి సంబంధించి సోజిజ్ కార్ప్, క్యుషు ఎలక్ట్రిక్ పవర్‌తో తమ అనుబంధ సంస్థ సెంబ్‌కార్ప్ గ్రీన్ హైడ్రోజన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ ఒప్పందం ప్రకారం జపాన్‌కు ఎగుమతి చేసే లక్ష్యంతో భారత్‌లో హరిత అమోనియాను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిసీలించనున్నట్లు సెంబ్‌కార్ప్ వివరించింది. 2030 నాటికి జపాన్ 3 మిలియన్ టన్నుల అమోనియాను దిగుమతి చేసుకోనుంది. సోజిజ్ సంస్థ ఎనర్జీ ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపార దిగ్గజం కాగా క్యుషు ఎలక్ట్రిక్ ప్రధానంగా జపాన్‌లోని క్యుషు ప్రాంతానికి విద్యుత్ అందిస్తోంది. -
‘హరిత ఇంధనం’లో ఏపీ బెస్ట్
సాక్షి, అమరావతి: భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరుల్ని సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గుర్తించింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల్ని స్థాపించేలా పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం–2020ని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగున్నరేళ్లలో పవన, సౌర, చిన్న జల, పారిశ్రామిక వ్యర్థాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 8,998.323 మెగావాట్లకు చేరినట్టు న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీ ఏపీ) తన అధికారిక వెబ్సైట్ ద్వారా తాజాగా వెల్లడించింది. పునరుత్పాదక విద్యుత్‌తో ఉపాధి ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్ట్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్, 3 వేల మెగావాట్ల సోలార్, 550 మెగావాట్ల విండ్ పవర్ చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 30 ఏళ్లపాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 8,025 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు సంబంధించి సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. వీటిద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరో 2 వేల మందికి ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. భారీగా పెరిగిన సామర్థ్యం నెడ్‌క్యాప్ లెక్కల ప్రకారం.. 2019లో రెండు మెగావాట్లు, 2021లో 4.20 మెగావాట్ల చొప్పున కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పవన విద్యుత్ పెరిగింది. సౌర విద్యుత్ విషయానికి వస్తే.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ ప్రకటించింది. 2019లో 241.50 మెగావాట్లు, 2020లో 337.02 మెగావాట్లు, 2021లో 335.375 మెగావాట్లు, 2022లో 113.685 మెగావాట్లు, 2023లో ఇప్పటివరకూ 13.8 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం పెరిగింది. చిన్న జల శక్తి ప్రాజెక్టులు 2021లో 3 మెగావాట్లు, 2023లో 1.20 మెగావాట్లు చొప్పున కొత్తగా వచ్చాయి. మునిసిపాలిటీల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే సాలిడ్ వేస్ట్ పవర్ ప్రాజెక్టులు 2021లో గుంటూరులో 15 మెగావాట్లు, 2022లో విశాఖలో 15 మెగావాట్లు సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. పరిశ్రమల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 0.125 మెగావాట్ల ప్రాజెక్టు తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిద్వారా దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. ఈ చర్యల ద్వారా పునరుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ దూసుకుపోతోంది. -
అందరికీ అందుబాటులోకి స్వచ్ఛ ఇంధనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అందరికీ కాలుష్యం లేని స్వచ్ఛ ఇంధనం అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి, వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను తయారు చేసింది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తేవాలని, దాని కోసం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ వెల్లడించింది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022లో నిబంధనలు జారీ చేసింది. వాటిని అనుసరించి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వినియోగదారులు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181 (1) ప్రకారం నడుచుకోవడానికి రాష్ట్ర కమీషన్లు చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజా డ్రాఫ్డ్‌ను తీసుకువచ్చినట్లు ఏపీఈఆర్సీ పేర్కొంది. ఈ నియంత్రణ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లు (సరఫరా వ్యవస్థలు), విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వర్తిస్తుంది. కొత్త నిబంధనలివీ.. ♦ గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం.. దివాలా తీసిన సంస్థలు, డిస్కంలకు రెండు నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న సంస్థలు, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు ఓపెన్ యాక్సెస్‌ను పొందడానికి అర్హత లేదు.అరు్హలైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ♦ దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం స్టేట్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ(ఏపీ ట్రాన్స్‌కో) నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులన్నీ నేరుగా సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి. ♦ సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ♦ అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ జనరేటర్లకు కనెక్టివిటీ మంజూరు చేస్తారు ♦వినియోగదారులు, జనరేటర్ల మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాలలో పేర్కొన్న విధంగానే ఛార్జీలు వర్తిస్తాయి. ♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలు, స్టాండ్‌బై ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, రియాక్టివ్ ఎనర్జీ ఛార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ వర్తించవు. ఉదాహరణకు 2032 డిసెంబర్‌లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్‌లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్‌ఛార్జి వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 1 లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. ♦ రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారులకు వార్షిక ప్రాతిపదికన గ్రీన్ సర్టిఫికేట్ అందించాలి. ఓపెన్ యాక్సెస్ అంటే.. విద్యుత్తు వినియోగదారులు ఎవరైనా వారికి నచ్చిన పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ నుంచి నేరుగా కరెంటును పొందే వెసులుబాటు. ఇందుకు ఈ వినియోగదారులు నోడల్ ఏజెన్సీ అనుమతి పొంది తగిన చార్జీలు చెల్లించి ఈ విద్యుత్తును పొందవచ్చు. -
కొత్త దారి రైతుబిడ్డ
‘ఇక వ్యవసాయం చేయవద్దు అనుకుంటాను. కాని చేయక తప్పేది కాదు. దీనివల్ల తలపై అప్పులు తప్ప నాకు జరిగిన మేలు లేదు. అయినా సరే భూమి నాకు అమ్మతో సమానం’ అన్నాడు మహారాష్ట్రలోని ఒక రైతు. ‘లాభనష్టాల సంగతి పక్కన పెడితే, ఒక్కరోజు పొలం వైపు వెళ్లక పోయినా నాకు ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది’ అంటాడు రాజస్థాన్‌లోని ఒక రైతు. మన దేశంలో రైతుకు, భూమికి మధ్య ఆత్మీయ బంధం ఉంది. ఆ బంధాన్ని బలోపేతం చేయడానికి కెనడా నుంచి వచ్చిన షర్మిల జైన్ తన లక్ష్యసాధనలో విజయం సాధించింది... రైతుల ఆత్మహత్యలతో వ్యవసాయరంగం కల్లోలంగా ఉన్న కాలం అది. ఆ సమయంలో షర్మిలజైన్ కెనడాలో నివాసం ఉంది. స్వదేశంలో రైతుల ఆత్మహత్యల గురించి చదివిన తరువాత ఆమె మనసు మనసులో లేదు. ఎన్నో ఆలోచనలు తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా?’ అని ఆమె ఆలోచించింది. ఆ సమయానికి కదిలిపోయి మరోరోజుకు మామూలై పోయే వ్యక్తి కాదు షర్మిల. కనిపించే సమస్య వెనకాల కనిపించని సమస్యలను అధ్యయనం చేయడానికి రంగంలోకి దిగింది. అంతేకాదు, రైతుల కోసం కెనడాను వదిలి స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ‘నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసా? భావోద్వేగాలపై తీసుకునే నిర్ణయాలు బెడిసికొడతాయి. తీరిగ్గా ఆలోచించు. వెళ్లడం సులభమేకాని ఇక్కడికి మళ్లీ రావడం అంత సులభమేమీ కాదు’ అన్నారు సన్నిహితులు.బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పింది షర్మిల. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన షర్మిలకు రైతుజీవితం కొత్తేమీ కాదు. వారికి సంబంధించి తాను చిన్నప్పుడు విన్న సమస్యలే ఇప్పుడు కూడా వినాల్సి వస్తుంది. మరాఠీ మీడియం స్కూల్లో చదువుకున్న షర్మిల స్నేహితులలో చాలామంది రైతు బిడ్డలే. ఆ కుటుంబాల ఆర్థి«క కష్టాలతోపాటు గృహహింసకు సంబంధించిన విషయాలను తరచుగా వినేది. ఆ సమయంలోనే లాయర్ కావాలని అనుకుంది. కెనడా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన షర్మిల క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అర్థం చేసుకోవడానికి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలోని ఎన్నో పల్లెలు తిరిగింది. ఇంటింటికి వెళ్లి రైతులతో మాట్లాడింది. వారితోపాటు పొలానికి వెళ్లింది. ‘ఇలా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి రాసుకోవడం, తరువాత కనిపించకపోవడం మామూలే. అయితే షర్మిలజీ కళ్లలో నిజాయితీ కనిపించింది. ఆమె మా కోసం ఏదో చేయగలదు అనే ఆశ కలిగింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు చౌహాన్ అనే రైతు. వ్యవసాయ సంబంధిత అంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి... ఇంగ్లాండ్‌లో ఎన్విరాన్మెంటల్ లా, అగ్రికల్చరల్ లా లో మాస్టర్స్ చేసింది షర్మిల. రెండు సంవత్సరాల కాలంలో ఎంతోమంది రైతులతో, వ్యవసాయరంగ నిపుణులతో మాట్లాడిన తరువాత ‘గ్రీన్ ఎనర్జీ ఫౌండేషన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. చెరువులను పునరుద్ధరించడం, నవీన వ్యవసాయ పద్ధతులను రైతులకు పరిచయం చేయడం, చిరుధాన్యాలు పండించడంపై అవగాహన కలిగించడం... మొదలైనవి ఈ ఫౌండేషన్ లక్ష్యాలు. తొలిసారిగా మహారాష్ట్రలోని బుచ్కెవాడి గ్రామంలో నాబార్డ్ గ్రాంట్‌తో వాటర్ మేనేజ్మెంట్ ప్రోగాం చేపట్టారు. నిరంతరం నీటిఎద్దడితో సతమతం అవుతున్న ఆ గ్రామం వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా బాగు పడింది. వేసవి సమయంలోనూ నీటి కష్టాలు రాని పరిస్థితి వచ్చింది. రాజస్థాన్‌లోని దుంగర్పుర్ గ్రామంలోని రైతులకు నీటి అవసరం ఎక్కువగా లేని పంటల గురించి అవగాహన కలిగించారు. ‘గ్రీన్ ఎనర్జీ మా ఊరిలో అడుగు పెట్టకపోతే వ్యవసాయానికి శాశ్వతంగా దూరం అయ్యేవాళ్లం. గ్రీన్ఎనర్జీ కార్యక్రమాల ద్వారా అనేక రకాలుగా లబ్ధిపొందాం. ఇప్పుడు కూరగాయలు కూడా పండిస్తున్నాం. గతంలో పంటలు పండనప్పుడు నా భర్త కూలిపనుల కోసం పట్నం వెళ్లేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు’ అంటుంది దీప్తి అనే మహిళా రైతు. షర్మిల తన తండ్రి నుంచి రెండు విలువైన మాటలు విన్నది. ఒకటి... చిరుధాన్యాల ప్రాముఖ్యత. రెండు... కార్పోరేట్ కంపెనీల సామాజిక బాధ్యత. ఇప్పుడు బాగా వినిపిస్తున్న సీఎస్ఆర్ (కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఆరోజుల్లోనే విన్నది షర్మిల. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల కోసం, చిరుధాన్యాలను పండించే రైతులకు సహాయపడడానికి ‘గుడ్ మామ్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది షర్మిల జైన్. ‘గుడ్ మామ్’ ద్వారా మిల్లెట్ నూడుల్స్ నుంచి హెర్బ్ స్టిక్స్ వరకు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. చిరుధాన్యాలపై ఆసక్తి వేలం వెర్రిగా మారకుండా, దాన్ని ఇతరులు సొమ్ము చేసుకోకుండా ఉండడానికి ‘గుడ్ మామ్’ ద్వారా ‘ఏది అబద్ధం?’ ‘ఏది నిజం’ అంటూ అవగాహన కలిగిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అయిదు రాష్ట్రాలలో వేలాదిమంది రైతులకు వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, కెపాసిటీ–బిల్డింగ్ ప్రోగామ్స్ ద్వారా సహాయపడుతున్నాం. చిరుధాన్యాలు, కూరగాయలు పండించడంపై అవగాహన కలిగిస్తున్నాం. చిరుధాన్యాలు అనే పేరు పెద్దగా వినిపించని కాలంలోనే వాటి ప్రాముఖ్యత గురించి ప్రచారం చేశాం. – షర్మిల జైన్ -
45 గిగావాట్లు లక్ష్యం! అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రణాళిక
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ పునరుత్పాదక ఇంధన సంస్థ 2030 నాటికి 45 గిగావాట్ల (జీడబ్ల్యూ)పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్గారాలను తగ్గించి, భారత్ తన కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని చేరుకోవడానికి తన వంతు సహాయ సహకారాలను అందించాలని సంస్థ భావిస్తున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వర్గాలు తెలిపాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8,316 మెగావాట్ల (8.3 జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని ప్రస్తుతం కలిగి ఉంది. మరో 12,118 మెగావాట్ల సామర్థ్యం నిర్మాణ దశలో ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందు కోసం ప్రతి సంవత్సరం సౌర, పవన శక్తి నుంచి 3 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారయి. ఫ్రెంచ్ ఎనర్జీ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 19.7 శాతం వాటాను కలిగి ఉంది. ఇటీవల యూఎస్ పెట్టుబడి సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ కంపెనీలో 6.8 శాతం వాటాను, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మరో 2.8 శాతం వాటాను కొలుగోలు చేశాయి.