
న్యూఢిల్లీ: అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా నాలుగు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్‌టీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్‌టీ టూ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్‌టీ త్రీ, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ సిక్స్‌టీ ఫోర్ వీటిలో ఉన్నాయి.
పవన, సౌర, ఇతరత్రా పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడం, విక్రయించడం తదితర లావాదేవీల కోసం ఈ అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది.