మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు | Hyderabad Based Megha Engineering Bags Rs 12800 Crore Order From NPCIL, More Details Inside | Sakshi
Sakshi News home page

మేఘా ఇంజనీరింగ్‌కు భారీ కాంట్రాక్టు

Published Thu, Apr 24 2025 7:24 AM | Last Updated on Thu, Apr 24 2025 9:58 AM

Hyderabad based Megha Engineering bags Rs 12800 crore order

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) తాజాగా న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐఎల్‌) నుంచి భారీ ఆర్డరు దక్కించుకుంది. దీని విలువ రూ. 12,800 కోట్లని కంపెనీ  వెల్లడించింది. ఎన్‌పీసీఐఎల్‌ చరిత్రలోనే ఈ అతి పెద్ద కాంట్రాక్టుని బీహెచ్‌ఈఎల్, ఎల్‌అండ్‌టీలాంటి దిగ్గజాలతో పోటీపడి దక్కించుకున్నట్లు తెలిపింది. 

దీని కింద కర్ణాటకలోని కైగా వద్ద ఒక్కోటి 700 మెగావాట్ల సామర్థ్యం గల రెండు న్యూక్లియర్‌ రియాక్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించింది. ఈ కాంట్రాక్టుతో అణు ఇంధన రంగంలోకి ప్రవేశించినట్లయిందని కంపెనీ పేర్కొంది.  అత్యున్నత ప్రమాణాలు, భద్రత, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటూ ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఎంఈఐఎల్‌ డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) సీహెచ్‌ సుబ్బయ్య ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement