contract
-
సత్తెన్నకు సెవెన్ పర్సంట్!
సాక్షి, అమరావతి: వివిధ పనులకు కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియలో కూటమి ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అస్మదీయుడు, లేదంటే ఎక్కువ మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకు అడ్డగోలుగా పనులు కట్టబెడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ విమర్శలను బలపరుస్తూ ఓ ప్రజా ప్రతినిధికి ఏడు శాతం కమీషన్ ఇచ్చేలా డీల్ చేసుకున్న పలు సంస్థలు.. తప్పుల తడకగా బిడ్లు వేసినా ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్య శాఖలోని డీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఏపీఎంఎస్ఐడీసీ టెండర్లు పిలిచింది. మూడేళ్ల కాలపరిమితికి దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లు ఇవి. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి టెండర్లు పిలిచారు. బిడ్ల పరిశీలన పూర్తవడంతో ఎల్1 కంపెనీలను ఎంపిక చేయడం కోసం గురువారం వైద్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తప్పు చేసినా అర్హత తప్పుల తడకగా బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు అర్హత కల్పించి, కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని టెండర్లలో పాల్గొన్న వారు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రుల్లో పడకల ఆధారంగా సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాలు, ఇతర అవసరాల కింద ఎంత ఖర్చు చేయాలనే దానిపై టెండర్ నిబంధనల్లోనే పొందుపరిచారు. సర్వీస్ చార్జీ 3.85 శాతం నుంచి 5 శాతం మధ్య ఉండాలని సూచించారు. ఇంత స్పష్టమైన నిబంధనలున్నా రెండు సంస్థలు సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల విషయంలో నిర్దేశించిన దాని కంటే తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేశాయి. ఈ రెండు సంస్థల్లో ఒకటి శానిటేషన్, మరొకటి సెక్యూరిటీ టెండర్లలో పాల్గొన్నాయి. శానిటేషన్‌కు సంబంధించిన సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రిది. మరోవైపు ప్రస్తుతం జోన్–2(కోస్తాంధ్ర)లో శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సంస్థ తప్పుడు ధ్రువపత్రాలతో బిడ్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఈ సంస్థ గతంలో బోధనాస్పత్రుల్లో 300 మందికి గానూ 250 మంది సిబ్బందితో పనులు నిర్వహించేలా ఎంవోయూ కుదుర్చుకుని టెండర్ నిబంధనలను అతిక్రమించింది. తక్కువ మంది ఉద్యోగులతోనే అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం నిర్వహించి రూ.కోట్లలో ప్రభుత్వ నిధులను దండుకుంది. ఈ సంస్థ ఏపీఎంఎస్ఐడీసీలో పనిచేసే ఇంజినీర్ల సన్నిహితులది కావడం.. వారే టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించడంతో తిమ్మిని బమ్మిని చేసి బిడ్‌కు అర్హత కల్పించారని వెల్లడైంది. టెండర్ నిబంధనలతో పనిలేకుండా ప్రజాప్రతినిధితో సదరు సంస్థలు డీల్ కుదుర్చుకున్న క్రమంలో ఈ మూడు సంస్థలకు కాంట్రాక్ట్‌లు కట్టబెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. కూటమి పెద్దలు అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే 108, 104 టెండర్లను ఓ సంస్థకు కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ టెండర్లలో సైతం ఓ సంస్థను ముందే అనేసుకుని.. దానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించారు. కేవలం ఆ సంస్థ ఒక్కటే బిడ్ దాఖలు చేసినా ఆమోదించేందుకు వీలుగా నిబంధనల్లో వెసులుబాటు పెట్టుకున్నారు.బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారు? నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిన కంపెనీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి.. గత కొద్ది రోజులుగా ఏపీఎంఎస్ఐడీసీలో తిష్ట వేశారు. ఆయనకు ప్రభుత్వ పెద్దల అండదండలూ ఉన్నాయి. అధికారుల వెంటపడి మరీ తన బిడ్‌కు అర్హత కల్పించుకున్నారని ఎంఎస్‌ఐడీసీలో చర్చించుకుంటున్నారు. టెండర్ల ప్రక్రియ ముగియకుండానే తనకు కాంట్రాక్ట్ వచ్చేసిందని డీఎంఈ అధికారులను కలిసి.. బిల్లులు ఎలా ప్రాసెస్ చేస్తారని ఆరా తీసినట్టు సమాచారం. సిబ్బందికి వేతనాలు ఎగ్గొట్టి, అనుభవం లేకున్నా ఉన్నట్టు కొన్ని సంస్థలు ఆధారాలు చూపించాయని, ఈ నేపథ్యంలో ఆడిట్ చేసి సక్రమంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాశారు. -
కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస
ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Congress government) ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంపై రాజ్యసభలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఆమోదించడాన్ని కేంద్ర మంత్రి నడ్డా,బీజేపీ ఎంపీలు ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ ఆందోళనకు దిగారు.దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలంటూ రాజ్యసభ(Rajya Sabha)లో జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో నెలకొన్న గందరగోళం మధ్య రాజ్యసభను రెండు గంటలకు వాయిదా పడింది. కర్నాటక ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కర్నాటక బీజేపీ హెచ్చరించింది.కర్నాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకువచ్చి, కేటగిరీ 2బీ కింద రిజర్వేషన్(Reservation) విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కేటగిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారని ఆయన తెలిపారు. కేటగిరీ వన్‌లో ఎస్సీ, ఎస్టీలు, క్యాటగిరీ 2ఏలో వెనుకబడిన తరగతులు వారు ఉంటారన్నారు. కేటీపీపీ చట్టం కింద ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రెండు కోట్ల మేరకు విలువ కలిగిన ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులు కానున్నారు.ఇది కూడా చదవండి: యోగి సర్కారుకు ఎనిమిదేళ్లు.. యూపీలో సంబరాలు -
కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్టు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తాగునీటి అవసరాలకు గాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. గోదావరి ఫేజ్– 2లో భాగంగా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి శామీర్‌పేట్ సమీపంలో నిర్మించే కేశవాపురం రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించేలా గత ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసింది. ఆరేళ్ల క్రితమే మేఘా కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది. అయితే పనులు ప్రారంభించకపోవడంతో ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ తాజాగా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేశవాపురం ప్రాజె క్టుకు అయ్యే రూ. 2 వేల కోట్లతోనే గోదావరి ఫేజ్–2 పథకాన్ని మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తాగునీటికి 10, జంట జలాశయాలకు 5 టీఎంసీలు మల్లన్నసాగర్ నుంచి తరలించే 15 టీఎంసీల జలాల్లో 10 టీఎంసీలు హైదరాబాద్ ప్రజల తాగు నీటికి, 5 టీఎంసీలు జంట జలాశయాలకు అందించనున్నారు. మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ ప్రతిపాదన ఇలా.. గత ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం.. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు తరలించి అక్కడినుంచి ఎత్తిపోతల ద్వారా 5 టీఎంసీల కేశవాపురం చెరువును నింపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఘన్పూర్ మీదుగా హైదరాబాద్‌కు తాగునీటి కోసం 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. అయితే ఆరేళ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూ సేకరణ చిక్కులతో పాటు అలైన్మెంట్ లోపాలతో పనులు ముందుకు సాగలేదని ప్రభుత్వం గుర్తించింది. పనులు ప్రారంభించని నిర్మాణ సంస్థ బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్ నిర్మాణ టెండర్లను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వివిధ కారణాలతో పనులు ప్రారంభించలేదు. అ యితే 2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పను లు చేపట్టలేమని, 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని కోరుతూ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా ఆ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త డిజైన్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కూడా.. కాంగ్రెస్ సర్కార్ మార్చిన డిజైన్‌లోని కొత్త రూట్ ప్రకారం.. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్‌కు అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేస్తారు. దీనితో పాటు మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు 5 టీఎంసీలు సరఫరా చేస్తారు. ఎక్కువ శాతం నీరు గ్రావిటీతో వచ్చేలా పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మల్లన్నసాగర్ బెస్ట్ ఆప్షన్!కొండపోచమ్మ సాగర్‌కు 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే ఉండగా.. మల్లన్నసాగర్‌కు 50 టీఎంసీల కెపాసిటీ ఉంది. కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల నీళ్లుంటే తప్ప నీటిని పంపింగ్ చేయడం వీలుకాదు. అదే మల్లన్నసాగర్లో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేసుకునే వీ లుంది. అందుకే కొండపోచమ్మ సాగర్‌కు బదులు మల్లన్నసాగర్‌ను ఎంచుకున్నట్లు అధికార వర్గా లు తెలిపాయి.పాత ప్రతిపాదనలో అక్కారం, మర్కూర్, కొండపోచమ్మ సాగర్, బొమ్మరాసిపేట, ఘన్పూర్.. మొత్తం 5 చోట్ల నీటిని పంపింగ్ చేయాలి. కానీ కొత్త డిజైన్‌లో మల్లన్నసాగర్, ఘన్‌పూర్‌ల వద్ద నీటిని పంపింగ్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఒక కిలో లీటర్‌కు రూ.48 వరకు ఖర్చు అవుతుండగా, కొత్త ప్రాజెక్టు పూర్తయితే కేవలం రూ.4 ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. -
నాలుగు ప్యాకేజీలు నలుగురికి!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో పాతకథే పునరావృతమవుతోంది. టెండర్ నోటిఫికేషన్ జారీచేయకముందే ఏ ప్యాకేజీ పనులను ఎవరికి ఏ ధరకు అప్పగించాలో లోపాయికారీగా నిర్ణయించేస్తున్నారు. ఆ కాంట్రాక్టరుకే పనులు కట్టబెట్టేలా అధికారులకు కనుసైగ చేస్తున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధికధరకు కట్టబెట్టి.. ఖజానాపై భారం మోపి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు రాబట్టుకోవడానికి ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిచిందనే చర్చ జలవనరులశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దోపిడీకి అడ్డొస్తుందనే నెపంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని గతనెల 15న ప్రభుత్వం రద్దుచేసింది. 2019 మే 30కి ముందు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.పోలవరం ఎడమకాలువలో నాలుగు ప్యాకేజీల్లో మిగిలిన రూ.787.38 కోట్ల విలువైన పనులకు నిర్వహించే టెండర్ల నుంచే పాతపద్ధతికి తెరతీశారు. టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే 2014–19 తరహాలోనే ముఖ్యనేత రంగంలోకి దిగారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే సంస్థకు రూ.293.66 కోట్లు, మిత్రపక్షానికి చెందిన తన సమీప బంధువైన ఎంపీ కుమారుడి సంస్థకు రూ.317.77 కోట్ల విలువైన ప్యాకేజీల పనులు.. మిగతా రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన ప్యాకేజీల పనులను ఆదినుంచి ఆ స్థానంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా మౌఖిక ఒప్పందం కుదిరినట్లు కాంట్రాక్టుసంస్థల వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించిన వారికే పనులు కట్టబెట్టాలంటూ పోలవరం అధికారులకు సంకేతాలు పంపారు. 6న ఫైనాన్స్ బిడ్ పోలవరం ఎడమకాలువ నాలుగు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో శుక్రవారం రాత్రి పోలవరం అ«ధికారులు బిడ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. ఒకటో ప్యాకేజీ (0 కిలోమీటర్ల నుంచి 25.6 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనులకి రూ.68.71 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో ప్యాకేజీ (51.6 కిలోమీటర్ల నుంచి 69.145 కిలోమీటర్లు+1,009 మీటర్లు)లో మిగిలినపని అంచనా విలువను రూ.107.84 కోట్లుగా ఖరారు చేశారు.ఐదు, ఐదు (ఏ) ప్యాకేజీ (93.7 కిలోమీటర్ల నుంచి 111 కిలోమీటర్ల వరకు+1,351 మీటర్లు)లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.293.66 కోట్లుగా, ఆరు, ఆరు (ఏ) ప్యాకేజీ (111 కిలోమీటర్ల నుంచి 136.78 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లుగా నిర్ణయించారు. ఈ నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి 12 నెలలు గడువు పెట్టారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. టెక్నికల్ బిడ్ నవంబర్ 2న, ఫైనాన్స్ బిడ్ నవంబర్ 6న తెరిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.ఖజానా దోపిడీకి రంగం సిద్ధంరాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య పనులకు నిర్వహించిన టెండర్లలో అధికశాతం టెండర్లను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టింది. అప్పట్లో 4.85 శాతం అధిక ధరను ‘ఫ్యాన్సీ’ నంబరు అంటూ కాంట్రాక్టు సంస్థలు, అధికారవర్గాలు వ్యంగ్యోక్తులు విసిరేవారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాన్సీ నంబరును పాటిస్తూ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధికధరకు పనులు అప్పగిస్తారా.. లేదంటే అంతకంటే ఎక్కువధరకు పనులు కట్టబెట్టి ఖజానాకు తూట్లు పొడుస్తారా అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే. -
ఎయిర్‌బస్‌తో టాటా అడ్వాన్స్డ్ జత
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తాజాగా ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో చేతులు కలిపింది. తద్వారా దేశీయంగా ఒకే ఇంజిన్గల హెచ్125 చోపర్స్ తుది అసెంబ్లీ లైన్(ఎఫ్ఏఎల్) ఏర్పాటుకు తెరతీయనున్నాయి. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో దేశీ వైమానిక రంగానికి భారీస్థాయిలో ప్రోత్సాహం లభించనుంది.ఎఫ్ఏఎల్ ద్వారా దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలిసారి హెలికాప్టర్ అసెంబ్లీ సౌకర్యం ఏర్పాటు కానుంది. వెరసి ఎయిర్‌బస్ అత్యధికంగా విక్రయిస్తున్న హెచ్125 చోపర్స్ను దేశీ అవసరాలతోపాటు.. ఇరుగుపొరుగు దేశాలకు సరఫరా చేసేందుకు వీలు చిక్కనుంది. ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో కాంట్రాక్టుపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలియజేశాయి.నిజానికి ఎఫ్ఏఎల్ ఏర్పాటుకు ఈ ఏడాది జనవరి 26న ఎయిర్‌బస్ సీఈవో గిలౌమ ఫారీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తొలిసారి వెల్లడించారు. తొలి మేడిన్ ఇండియా హెచ్125 చోపర్స్ డెలివరీలు 2026లో ప్రారంభంకావచ్చని అంచనా. -
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్‌తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
సైబర్ నిపుణులు కావాలి!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ నిపుణులను రంగంలోకి దించనుంది. ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు సైబర్ సాంకేతిక నిపుణులు కావాలంటూ కేంద్ర హోంశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు అంశాలకు సంబంధించి నిపుణులకు వారి అనుభవం ఆధారంగా నెలకు రూ.65 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు వేతనం ఇవ్వనున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నా రు. ఆసక్తి ఉన్న, అర్హులైన అభ్యర్థులు https://tcil.net.in/ current &opening.php పై క్లిక్ చేసి అందు లోని వివరాలు చూడవచ్చని తెలిపారు. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసే వీరికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి సంబంధం ఉండబోదని స్పష్టం చేశారు. అర్హతలు, అనుభవం, వేతనం... సీనియర్ టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్: ఉండాల్సిన స్కిల్స్..సైబర్ సెక్యూరిటీలో పనిచేసిన అనుభవం, సెక్యూరిటీ స్ట్రాటజీ, పాలసీ ఫార్ములేషన్, ప్లానింగ్. నెలకు వేతనం..రూ. 2,50,000 థ్రెట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్: ఉండాల్సిన స్కిల్స్..సెక్యూరింగ్ క్రిటికల్, సెన్సిటివ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెలకు వేతనం..రూ.1,60,000 డాటా ఎనలైటిక్స్ ప్రొఫెషనల్: నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్..యూపీఐ, ఐఎంపీఎస్, ఏఈపీఎస్ వంటి పేమెంట్స్ టెక్నాలజీపై అవగాహన, ఆర్బీఐ, ఇతర నిబంధనలపై అవగాహన..నెలకు వేతనం..రూ. 1,60,000. మాల్వేర్ రీసెర్చర్: ఉండాల్సిన స్కిల్స్.. ఫిషింగ్ ఎటాక్స్, మాల్వేర్ ఎటాక్స్లపై పూర్తి అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 సైబర్ క్రైం రీసెర్చర్–టెలీకాం అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: ఉండాల్సిన స్కిల్స్..4జీ, 5జీ వంటి టెలికమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై, సిమ్‌బాక్స్, వీఓఐపీ వంటి అంశాల్లో అవగాహన ఉండాలి. నెలకు వేతనం..రూ.1,60,000 టెక్నికల్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. ఎంఎస్ ఎక్సెల్, ఫైనాన్స్ అంశాలపై అవగాహన ఉండాలి.. నెలకు వేతనం.. రూ.65,000 సైబర్ థ్రెట్ అనలిస్ట్: ఉండాల్సిన స్కిల్స్.. సోషల్ మీడియా అనాలసిస్, రిపోర్ట్ క్రియేషన్, క్రైం రీసెర్చ్‌లో అవగాహన..నెలకు వేతనం.. రూ.65,000 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: ఉండాల్సిన స్కిల్స్.. మోరాకో ప్రోగ్రామింగ్ ఎక్సెల్ ఆటోమైజేషన్లో అవగాహన.. నెలకు వేతనం..రూ.65,000 -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్‌లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్‌లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్‌లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్‌లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్‌లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్‌ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్‌లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్‌లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
104 కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
సుల్తాన్‌బజార్: తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని కోరుతూ 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో ధర్నా చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది 104 సిబ్బంది పాల్గొన్నారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న 104 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్‌చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్ కృష్ణప్రసాద్, ఎండీ మాజిద్ పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఏఎన్ఎంలకు 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఎంపికైన ఏఎన్ఎం–2 (సెకండ్ ఏఎన్ఎం)లకు తాజాగా తలపెట్టిన నియామకాల ప్రక్రియలో 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మరో 10 శాతం మార్కులను వెయిటేజీ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. శనివారం కోఠిలోని తన కార్యాలయంలో ఆయన ఏఎన్ఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో ప్రభుత్వం 5,198 మందిని రెండో ఏఎన్ఎంగా నియమించిందన్నారు. వీరి సర్వీసును క్రమబద్దికరించేందుకు ఎలాంటి ప్రాతిపదికలు లేవన్నారు. దీంతో క్రమబద్దికరణ అసాధ్యమని ప్రభుత్వం తేల్చిందని, ఈ క్రమంలో పోస్టుల లభ్యత ఆధారంగా నియామకాలు చేపడుతున్నప్పటికీ సర్వీసు ఆధారంగా గరిష్టంగా 30 శాతం మార్కులు వెయిటేజీ రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,520 ఏఎన్ఎం ఖాళీల భర్తీకి తొలుత మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత మరిన్ని పోస్టులు మంజూరు కావడంతో 411 పోస్టులను అదనంగా కలిపామని, దీంతో పోస్టుల సంఖ్య 1,931కి పెరిగిందని చెప్పారు. తుది నియామకం జరిగే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అయితే వాటిని కూడా కలిపి నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను క్రమబద్దికరించడం సాధ్యం కాదని, అందుకే అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ రెండో వారంలో ఏఎన్ఎం అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి ఆర్నెళ్లకు రెండు పాయింట్లు.. రాష్ట్రంలో సెకండ్ ఏఎన్ఎంలుగా 2008 నుంచి నియమితులైన వారున్నారని, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరునెలలకు 2 పాయింట్లు ఇస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండున్నర పాయింట్లు ఇస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వారికి 30 శాతం వెయిటేజీ వస్తుందని, ఈ క్రమంలో తాజా నియామకాల ప్రక్రియలో వంద శాతం అవకాశాలు వీరికే వస్తాయని వెల్లడించారు. తాజాగా నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 53 సంవత్సరాలుగా ఖరారు చేశామని తెలిపారు. ఎన్హెచ్ఎం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు నెలవారీగా రూ.27,300 వేతనంగా ఇస్తున్నామన్నారు. ఏఎన్ఎంలు మొండిగా సమ్మె కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
సీఎం గారూ రెగ్యులర్ చేయండి
సాక్షి, నాగర్‌కర్నూల్: పదహారేళ్లుగా పనిచేస్తున్నామని, తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ సెకండ్ ఏఎన్ఎంలు పోస్టుకార్డులు రాసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏజ్ లిమిట్‌తో కొత్త నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. 2007లో మంది 4025 మంది నియామకం ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2007లో సెకండ్ ఏఎన్ఎంలను కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,025 మంది సెకండ్ ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలులో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. శిశువులు, గర్భిణులకు టీకాలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్, పీహెచ్‌సీల్లో విధులు, ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీ తదితర విధులతోపాటు మొత్తం 40 వరకు జాతీయ కార్యక్రమాలు, 32 వరకు ఆన్లైన్ రిపోర్టుల అందజేత వంటి విధుల్లో పాలుపంచుకుంటున్నారు. జీతమూ తక్కువే...: రెగ్యులర్ ఏఎన్ఎంలు నిర్వర్తించే అన్ని విధులు తాము నిర్వర్తిస్తున్నా జీతం మాత్రం రూ.25 వేలు ఉందని సెకండ్ ఏఎన్ఎంలు వాపోతున్నారు. అదనంగా టీఏ, డీఏలు సైతం ఇవ్వడం లేదని లేవని, 16 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని వృద్ధాప్యానికి చేరువవుతున్నా తమ ఉద్యోగాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 1,520 పోస్టులతో ఏఎన్ఎం భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఏళ్లుగా ఆశతో చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎసరు పెట్టినట్లయ్యిందని సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. వయోపరిమితితో అనర్హత.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఏఎన్ఎం నోటిఫికేషన్లో ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వందకు 20 పాయింట్లు వెయిటేజీ కలి్పంచింది. అయితే ఇందులో జనరల్ అభ్యర్థులకు గరిష్టంగా 45 ఏళ్ల వయోపరిమితి విధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు కలి్పంచింది. కానీ, సెకండ్ ఏఎన్‌ఎంలలో చాలావరకు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు పైబడినవారే ఉన్నారు. ఏళ్లుగా చాలీచాలని జీతాలతో వైద్యసేవలు అందిస్తూ వృద్ధాప్య దశకు చేరుకుంటున్నా, ఉద్యోగ భద్రత కరువైందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. వయసు పైబడుతోంది.. ప్రభుత్వపరంగా చేపట్టే అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలకంగా పనిచేస్తున్నాం.16 ఏళ్ల సర్విసుతో అందరి వయస్సు 45 ఏళ్లు దాటింది. ప్రభుత్వ నోటిఫికేషన్ రద్దు చేసి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. – హైమవతి, సెకండ్ ఏఎన్ఎం, తాడూరు పీహెచ్సీ, నాగర్‌కర్నూల్ జిల్లా -
సీఎం జిల్లా వారైతే అనర్హులా.!
సాక్షి, అమరావతి: విదేశీయులు మన దేశంలో కంపెనీలు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఎంతో మంది దేశ, విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేదు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా అర్హత ఉన్న ఎవరైనా చట్టం, నిబంధనల మేరకు ఏదైనా చేయవచ్చు. దీనిని విశ్యవ్యాప్తంగా ఎవరూ కాదనరు. కానీ ఈనాడుకు మాత్రం సీఎం సొంత జిల్లా వారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని, టెండర్లు దక్కించుకోకూడదన్న అభిప్రాయం నరనరానా జీర్ణించుకుపోయింది. అందుకే వారు వ్యాపారాలకు అనర్హులనేలా కథనాలు అల్లుతోంది. పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చ డానికి సీలేరులో రెండు అదనపు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా బిడ్లు ఆహ్వానించి, రివర్స్ టెండరింగ్ ద్వారా టెండరు ఖరారు చేసింది. కానీ ఇదంతా తప్పన్నట్టు ‘ఈనాడు’ శుక్రవారం ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక అధినేత రామోజీరావు పచ్చళ్లు అమ్ముకోవచ్చు.. పత్రికనూ నడుపుకోవచ్చు.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి మాత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు టెండర్ ఇవ్వకూడదు. వారికి, వారు కొమ్ముకాస్తున్న వారికి ఒక న్యాయం.. సీఎం సొంత జిల్లా వారైతే మరో న్యాయం.. ఇదేం రామోజీ జర్నలిజం. ఏపీ జెన్కో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ టెండర్లలో వాస్తవాలు అంశాల వారీగా ఇలా ఉన్నాయి. ఆరోపణ: వైఎస్సార్ జిల్లాకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టింది. ఈ సంస్థ వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తికి సంబంధించినది కావడమే దానికి ఉన్న ఏకైక అర్హత. వాస్తవం: ఏపీ జెన్కో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఇందులో ఏపీ జెన్కో, ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. ఈ కన్సార్టియం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రతిష్టాత్మక బీహెచ్ఈఎల్తో ఈ ప్రాజక్టు యంత్ర పరికరాల సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఉన్న యూనిట్లకు కూడా బీహెచ్ఈఎల్ యంత్ర పరికరాలు సరఫరా చేసింది. కన్సార్టియంలోని మరో కంపెనీ పీఈఎస్‌కు ఇదివరకే ఈ ప్రాజక్టులో సివిల్ పనులు చేసిన అనుభవముంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది. ఈ ప్రాజక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2024కల్లా పూర్తవుతాయి. ఆరోపణ: దిగువ సీలేరులో రెండు అదనపు యూనిట్ల నిర్మాణానికి అయ్యే వ్యయం, జీఎస్టీ, ఆలస్యానికి అయ్యే వడ్డీతో కలిపి రూ. 571 కోట్ల రుణాన్ని గ్రామీణ విద్యుత్ సంస్థ (ఆర్ఈసీ) నుంచి ప్రభుత్వం తీసుకుంది. వాస్తవం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రాజెక్టుల నిర్మాణం కోసం రుణం తీసుకో వడం సర్వసాధారణం. ఇందులో తప్పేముంది? ఆరోపణ: ఇప్పటికే షిర్డీ సాయి, దాని అనుబంధ సంస్థలకు రూ. 92 వేల కోట్ల విలువైన వివిధ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: ఏపీ జెన్కోగానీ, డిస్కంలు గానీ నామినేషన్ పద్ధతిలో ఏ పనులూ ఎవరికీ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టుల కోసం పారదర్శకంగా టెండర్లు నిర్వహించాయి. అర్హతల మేరకు పోటీ బిడ్డింగ్‌లో పాల్గొని ఏ సంస్థ అయినా పనులు దక్కించుకోవచ్చు. ఆరోపణ: ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం కట్టబెట్టింది. వాస్తవం: అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ (గ్లోబల్ టెండర్లు– ఇ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫారం) ద్వారా ఏపీ జెన్కో టెండర్లు పిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జుడిషియల్ కమిషన్ కూడా సమీక్షించి ఈ ప్రాజెక్టు టెండర్లకు ఆమోదం తెలిపింది. రాఘవ ఎంటర్ప్రైజెస్, ఎన్సీసీ, పీఈఎస్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిపి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ జాయింట్ వెంచర్ సంస్థ బిడ్లు దాఖలు చేసింది. టెండర్లలో కోట్ అయిన అతి తక్కువ మొత్తాన్ని గరిష్టంగా తీసుకుని ఏపీజెన్కో రివర్స్ టెండర్లు నిర్వహించింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ తక్కువ మొత్తానికి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చి కాంట్రాక్టు దక్కించుకుంది. రెండు దశల (సాంకేతిక, ఆర్ధిక) బిడ్డింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు సంస్థను ఎంపిక చేసింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల ఏపీ జెన్కోకు దాదాపు రూ.10 కోట్లు ఆదా అయ్యింది. ఆరోపణ: ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతులు రాకముందే హడావుడి చేసింది. వాస్తవం: విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను ఏపీఈఆర్సీకి ముందే చెప్పారు. ప్రతిపాదనను పరిశీలించి డిస్కంలు, జెన్కో కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుని కమిషన్ అనుమతి కోసం అప్పుడు పంపాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఈ నెల 7న వచ్చింది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం రూ.1000 కోట్లు దాటనందున కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ (సీఈఏ) అనుమతి అవసరం లేదు. ఆరోపణ: రెండు కొత్త యూనిట్లు నిర్మించడం వల్ల దిగువ సీలేరు ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. వాస్తవం: జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మన గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు 115 మెగావాట్ల యూనిట్లు ఏటా దాదాపు 1100 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దిగువ సీలేరు విద్యుత్ కేంద్రం మొట్టమొదట నిర్మించినప్పుడే ఆరు యూనిట్ల ఏర్పాటుకు కావలసిన ప్రధాన మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో అదనంగా మరో రెండు 115 మెగావాట్ల యూనిట్లు నిర్మించాలని ఏపీ జెన్కో నిర్ణయించింది. కొత్త యూనిట్లు నెలకొల్పడం వల్ల ఈ విద్యుత్ కేంద్రం గరిష్ట లోడ్ సామర్ధ్యం పెరుగుతుంది. దాంతో మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనవలసిన అవసరం తగ్గుతుంది. ప్రతి 115 మెగావాట్ల యంత్రం పీక్ డిమాండ్ సమయంలో సగటున 175 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల డిస్కంలకు ఏటా 350 మిలియన్ యూనిట్లు విద్యుత్ మార్కెట్లో కొనాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు లాభం చేకూరుతుంది. పీక్ సమయాల్లో మార్కెట్ రేటు యూనిట్‌కు దాదాపు రూ.10 ఉంటోంది. సరాసరి పీక్ లోడ్ విద్యుత్ ధర రూ.8.0 అనుకున్నా ఈ రెండు యూనిట్ల వల్లా ఏటా దాదాపు రూ .280 కోట్లు ఆదా అవుతుంది. -
‘హండ్రెడ్’ టోర్నీకి జెమీమా
లండన్: భారత మహిళా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వరుసగా మూడో ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే ‘హండ్రెడ్’ టోర్నమెంట్లో ఆడనుంది. గత రెండేళ్లుగా నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టుకు ఆడుతున్న ఆమెను ముందుగా ఈ సీజన్ నుంచి తప్పించాలని ఆ ఫ్రాంచైజీ అనుకుంది. అయితే నార్తర్న్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆసీస్ ప్లేయర్ హీథెర్ గ్రాహమ్ గాయంతో వైదొలగడంతో చివరి నిమిషంలో 22 ఏళ్ల జెమీమాతో ఆ ఫ్రాంచైజీ మళ్లీ కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ సీజన్ ‘హండ్రెడ్’ టి20 టోర్నీ వచ్చేనెల 1 నుంచి 27 వరకు జరుగనుంది. ఇందులో నలుగురు భారత క్రికెటర్లు పాల్గొంటున్నారు. లండన్ స్పిరిట్ జట్టుకు రిచా ఘోష్, ట్రెంట్ రాకెట్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, సదర్న్ బ్రేవ్‌కు స్మృతి మంధాన ఆడనున్నారు. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్‌వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
IPL కోసం ఇంగ్లాండ్ కాంట్రాక్ట్ వదులుకున్న KKR స్టార్ బ్యాటర్
-
జియో ఇన్ఫోకామ్‌తో ఐఆర్ఎం ఇండియా ఒప్పందం
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఈఆర్ఎం) విధానాలను పటిష్టం చేసే దిశగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఆర్ఎం) ఇండియా అఫీలియేట్ వెల్లడించింది. ఈ ఒప్పందం కింద ఈఆర్ఎంపై అవగాహన పెంచేందుకు ఇరు సంస్థలు వెబినార్లు, రౌండ్టేబుల్స్, సమావేశాలు మొదలైనవి నిర్వహించనున్నాయి. 140 పైచిలుకు దేశాల్లో ఈఆర్ఎంకు సంబంధించిన నిపుణుల సమాఖ్యగా ఐఆర్ఎం వ్యవహరిస్తోంది. ఐఆర్ఎం ఇటీవలే సిప్లా, అల్ట్రాటెక్ తదితర సంస్థలతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకుంది. -
ఎన్ఎస్ఈలో చమురు, గ్యాస్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: నైమెక్స్ క్రూడ్, నేచురల్ గ్యాస్‌లలో ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. కమోడిటీ డెరివేటివ్స్ విభాగంలో మే 15 నుంచి వీటిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి గత నెలలో అనుమతులు లభించడంతో రుపీ ఆధారిత నైమెక్స్ డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ ఫ్యూచర్ కాంట్రాక్టులకు తెరతీసింది. దీంతో ఎన్ఎస్ఈ ఎనర్జీ బాస్కెట్లో మరిన్ని ప్రొడక్టులకు వీలు చిక్కనుంది. కమోడిటీ విభాగం మరింత విస్తరించనుంది. వీటి ద్వారా మార్కెట్ పార్టిసిపెంట్ల(ట్రేడర్లు)కు ధరల రిస్క్ హెడ్జింగ్‌కు ఇతర అవకాశాలు లభించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డబ్ల్యూటీఐ చమురు, నేచురల్ గ్యాస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులను రుపీ ఆధారితంగా సెటిల్ చేసేందుకు ఎన్ఎస్ఈ సీఎంఈ గ్రూప్‌తో డేటా లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
మంత్రి కేటీఆర్‌కు కోమటిరెడ్డి సవాల్..
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వర్సెస్ బీజేపీ నేతలు అన్నట్టుగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇది పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఉప ఎన్నికల అనంతరం, కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు.. తాజాగా మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీలో చేరినందుకు కాంట్రాక్ట్ తీసుకున్ననని నాపై ఆరోపణలు చేశారు. ఆ 18వేల కోట్ల కాంట్రాక్ట్ నిరూపించండి. గోబెల్స్ ప్రచారం నాపై పనిచేస్తుందని భావించకండి అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. అయితే, మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 18వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలో చేరారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని హైలైట్ చేశారు. ఈ క్రమంలో దీనిపై కోమటిరెడ్డి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. KTR if you have an iota of credibility and honesty, once again I challenge you to prove that I got the 18000 cr contract for joining BJP and don’t think Goebbels propaganda will work in my case. — Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) March 10, 2023 -
Banjara Hills: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని..
సాక్షి, బంజారాహిల్స్: అస్సాంలోని దోమ తెరలు, బ్లాంకెట్ల సరఫరాకు సంబంధించి 60 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌కు చెందిన కె.నర్సింహారెడ్డి వ్యాపారి. ఆయనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.నారాయణతో పరిచయం ఉంది. కొద్ది రోజుల కిత్రం నారాయణ ద్వారా మాదాపూర్ జైహింద్ రోడ్డులో నివాసం ఉండే గుండుబోయిన వినయ్, కాకాని మనోహర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు తమకు వివిధ ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని నమ్మించారు. అనంతరం అస్సాం రాష్ట్రంలో 60 కోట్ల రూపాయల విలువ చేసే దోమ తెరలు, బ్లాంకెట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగింత పని తమ చేతిలో ఉందని తెలిపారు. ఎవరైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నర్సింహారెడ్డికి ఆశ కల్పించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ తామే తీసుకుంటున్నట్టు చెప్పడంతో కొంత పెట్టుబడి పెడితే వాటా ఇస్తామని చెప్పారు. నర్సింహారెడ్డి వారి మాటలను నమ్మి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత వారిద్దరు మోసగాళ్లని తెలిసింది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని నర్సింహారెడ్డి ఇద్దరిని పలుమార్లు అడిగాడు. కాని వారు స్పందించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా జూబ్లీహిల్స్ పోలీసులు వినయ్, కాకాని మనోహర్‌రెడ్డిలపై ఐపీసీ 406,420, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేమ్ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: టెండర్లలో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్టును అప్పగించే విషయంలో నెలకొన్న వివాదం సకాలంలో బస్సులు రోడ్డెక్కకుండా చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికల్లా 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ విషయం కోర్టుకు చేరటంతో బస్సులు రావటానికి మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో తాజాగా ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇన్ ఇండియా)–2 పథకం కింద 10 వేల బస్సులను రాయితీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. తెలంగాణకు 300 బస్సులు మంజూరయ్యాయి. ఇటీవల కేంద్ర భారీ పరిశ్రమల శాఖ టెండర్లు పిలిచి ఖరారు చేసింది. ఇందులో ఎల్–1(తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీ)గా వచ్చిన కంపెనీకి ఎక్కువ బస్సులు సరఫరా ఉన్న రాష్ట్రాల బాధ్యత అప్పగించింది. ఎల్–2గా ఉన్న కంపెనీ జాబితాలో తెలంగాణ ఉంది. కాగా ఎల్–2గా ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకునే సమయంలో వివాదం తలెత్తింది. ఆ కంపెనీ కోర్టుకు వెళ్లటంతో.. తొలుత టెక్నికల్ బిడ్ తెరిచినప్పుడు ఓ కంపెనీ బిడ్‌కు అర్హమైంది కాదని భావించిన అధికారులు దాన్ని తిరస్కరించారు. నిజానికి ఆ కంపెనీ కోట్ చేసిన మొత్తం ప్రకారం ఎల్–2 స్థానంలో అదే ఉంటుంది. మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారించారు. దీనికి తెలంగాణకు బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. ఇంతలో అన ర్హమైందిగా అధికారులు తేల్చిన కంపెనీ కోర్టును ఆశ్రయించిందని, తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో స్థానంలో ఉన్న కంపెనీని ఎల్–2గా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలుత ఎల్–2గా నిర్ధారించిన కంపెనీకే బస్సుల సరఫరా బాధ్యత అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఆ కంపెనీతో చర్చించే సమయంలో, కేంద్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని దీనిపై ఎలాంటి నిర్ణయానికి రావద్దని, తాము కోర్టు తీర్పును సవాల్ చేయబోతున్నామని చెప్పినట్టు సమాచారం. త్వరలో 500 అద్దె ఎలక్ట్రిక్ బస్సులు.. ఫేమ్–2 పథకం బస్సుల పరిస్థితి ఇలావుండగా, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి పిలిచిన టెండర్లలో రెండు బడా కంపెనీలు పాల్గొన్నాయి. టెక్నికల్ బిడ్ ఓకే అయింది. ఫైనాన్షియల్ బిడ్‌లో తక్కువ మొత్తం కోట్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇవ్వనున్నారు. మరో నెలరోజుల్లో ఈ బస్సుల రాక ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. -
హెచ్‌సీఎల్ టెక్కు స్విస్ సంస్థ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ కంపెనీ ఎస్ఆర్ టెక్నిక్స్ నుంచి కొన్నేళ్లపాటు అమల్లో ఉండే(మల్టీ ఇయర్) కాంట్రాక్టును కుదుర్చుకున్నట్లు దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తాజాగా పేర్కొంది. ఆర్డర్లో భాగంగా టెక్నిక్స్ కార్యకలాపాలను డిజిటల్ రూపేణా మార్పు చేసేందుకు అనుగుణమైన సర్వీసులు అందించనున్నట్లు తెలియజేసింది. వైమానిక నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్(ఎంఆర్వో) సర్వీసులందించే టెక్నిక్స్ కొన్ని భాగస్వామ్య సంస్థలతో కలసి పనిచేస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా, మధ్యప్రాచ్యంలో బిజినెస్ డెవలప్మెంట్ కార్యలయాలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 500 కస్టమర్లకు విమానాల ఇంజిన్లు, ఎయిర్‌ఫ్రేమ్, విడిభాగాలు, సాంకేతిక మద్దతుసహా అవసరమైన(కస్టమైజ్డ్) సేవలు సమకూరుస్తోంది. కాగా.. హెచ్‌సీఎల్ టెక్ డీల్ విలువను వెల్లడించలేదు. -
ఆల్‌స్తోమ్‌కు చెన్నై మెట్రో ఆర్డర్
న్యూఢిల్లీ: రోలింగ్ స్టాక్ తయారీలో ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం ఆల్‌స్తోమ్‌కు తాజాగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి ఓ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఈ డీల్ విలువ రూ.798 కోట్లు. ఇందులో భాగంగా 78 అత్యాధునిక మెట్రో కోచ్‌లను చెన్నై మెట్రోకు ఆల్స్టమ్ సరఫరా చేయనుంది. వీటిలో 26 యూనిట్లు (త్రీ–కార్ కాన్ఫిగరేషన్) కూడా ఉన్నాయి. ఇవి గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ మెట్రో ట్రెయిన్స్ డ్రైవర్లు లేకుండానే పూర్తిగా సిగ్నల్స్ ఆధారంగా నడుస్తాయి. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఆల్స్టమ్ ప్లాంటులో మెట్రో కార్స్ తయారు కానున్నాయి. ఏటా 480 యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. చెన్నై మెట్రోకు ఇప్పటికే 208 మెట్రో కార్స్‌ను ఆల్స్టమ్ సరఫరా చేసింది. ఢిల్లీ, చెన్నై, లక్నో, కొచ్చి నగరాల్లో సంస్థ తయారీ మెట్రో ట్రెయిన్స్ పరుగెడుతున్నాయి. ముంబై మెట్రో లైన్–3, ఆగ్రా–కాన్పూర్ మెట్రో, ఇందోర్–భోపాల్ ప్రాజెక్టులకు కావాల్సిన మెట్రో కోచ్‌లు ప్రస్తుతం తయారీలో ఉన్నాయి. -
‘వెడ్డింగ్ కాంట్రాక్ట్’ బాగుందబ్బా.. కాకపోతే అదే టూ మచ్
‘‘నెలకోసారే పిజ్జా తినాలి.. ఇంట్లో వంటనే తినాలి.. ప్రతిరోజూ జిమ్‌కి వెళ్లాలి.. ప్రతిరోజూ చీర కట్టుకోవాలి.. 15 రోజులకోసారి మాత్రమే షాపింగ్ చేయాలి.. ప్రతి పార్టీలో మంచి ఫొటోస్ తీసుకోవాలి..’’ ఇదేంటి న్యూఇయర్ రిజల్యూషన్స్లా ఉన్నాయి అనుకుంటున్నారా. రిజల్యూషన్స్ అన్నమాట నిజమే కానీ.. న్యూ ఇయర్‌కు తీసుకున్నవి కాదు. అస్సాంకు చెందిన నూతన వధూవరులు శాంతి, మింటూ పెళ్లి తరువాత చేసుకున్న కాంట్రాక్ట్లోనివి. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు, ప్రీవెడ్డింగ్ షూట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు సంప్రదాయాలను బ్రేక్ చేస్తున్నారు... ఇంకొందరు వింత పద్ధతుల్లో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ జంట పెళ్లి తరువాత ఉండాల్సిన పద్ధతులపై కాంట్రాక్ట్ చేసుకున్నారన్నమాట. ఎర్రని లెహంగాలో వధువు, తెల్లని పెళ్లి దుస్తుల్లో వరుడు కాంట్రాక్ట్ పేపర్‌పై సంతకం పెడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ సంస్థ వెడ్లాక్... పోస్ట్ చేసిన ఆ వీడియోకు నెటిజన్స్ మామూలుగా స్పందించలేదు. ‘వెడ్డింగ్ కాంట్రాక్ట్’ బాగుందని కొందరంటే.. ‘ఇదేం పద్ధతి’ అంటూ కొందరు చిరాకు పడ్డారు. ‘అది పెళ్లి కాదు... షేర్వానీలో చేసుకున్న కాంట్రాక్ట్’ అంటూ ఓ నెటిజన్, ‘కండీషన్స్ ఓకేనబ్బా... కానీ ప్రతిరోజూ చీర అంటే టూ మచ్’ మరొకరు, ‘ఇండియాలో ఇంకా అసమానతలు కొనసాగడం బాధాకరం’ అని ఇంకొకరు స్పందిస్తూనే ఉన్నారు. -
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయి టేజీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు. వివిధ విభా గాల్లో 10,028 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వంటి స్పెషలిస్టు వైద్యులు.. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంపీహెచ్ఏ (స్త్రీ)/ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. ►స్పెషలిస్ట్ వైద్యులను పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివినవారికి గ్రేడ్లు, మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని అనుసరిస్తారు. గ్రేడ్ ఏలో 60%, ఆపై మార్కులుంటే ఎక్సలెన్స్.. బీగ్రేడ్‌లో 55%, ఆపై ఉంటే ‘గుడ్’.. 50%, అంతకంటే తక్కువ ఉంటే పాస్ గ్రేడ్‌గా నిర్ధారిస్తారు. ►సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంఓ ఎస్ తదితర పోస్టులకు ఎంబీబీఎస్‌లో పొందిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. ఎంబీబీఎస్‌లో అన్ని సంవత్సరాల్లో పొందిన మొత్తం మార్కులను కలిపి 80%కి మార్చుతారు. ►విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినవారికి సంబంధించి.. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కుల ఆధారంగా 80వరకు పాయింట్లను నిర్ధారిస్తారు. ►స్టాఫ్‌నర్సులు, ఏఎన్ఎంలకు రాతపరీక్షలో పొందిన మార్కులకు 80 పాయింట్లు ఇస్తారు. ►అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్లు, జీడీఎంఓఎస్, ఆయుష్ వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ (స్త్రీ), ల్యాబ్–టెక్నీషియన్ గ్రేడ్– ఐఐ, ఫార్మసిస్ట్ గ్రేడ్– ఐఐ, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్తాల్మి క్ ఆఫీసర్, ఫిజియో థెరపిస్ట్ పోస్టులన్నింటిలో.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులకు 20 పాయింట్ల వరకు వెయిటేజీ ఇస్తారు. ►అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న నిర్దిష్ట కేటగిరీలో అన్ని పోస్టులకు ప్రాధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ధ్రువీకరణ తీసుకుని.. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అనుభవమున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అధికారులు ఈ దరఖాస్తులను 15 రోజుల్లోగా ఆమోదించి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి లేదా తిరస్కరించాలి. అభ్యర్థులు ఈ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరునెలల అనుభవానికి.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరునెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. ఏ సేవ అందిస్తే.. అదే కేటగిరీ ఉద్యోగానికి మాత్రమే వెయి టేజీ పాయింట్లు వర్తిస్తాయి. ►కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్ఐ, ఈపీఎఫ్, హాజరు రిజిస్టర్లు వంటి రికార్డులను సూచించవచ్చు. వాటి కాపీలను జత చేయవచ్చు. ►సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి అనుభవ ధ్రువీకరణను జిల్లా వైద్యాధికారులు ఇవ్వొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసేవారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. -
ఈ పెళ్లి ప్రత్యేకం.. వరుడు చేత బాండ్ పేపర్‌పై సంతకం.. మాట తప్పితే తిప్పలే!
‘నాతిచరామి’ అంటూ వధూవరులు చేసే వాగ్దానం ప్రతి పెళ్లిలోనూ చూసే తంతే. కానీ ఈ పెళ్లి ప్రత్యేకం. అందుకే హర్షు సంగ్తానీ అనే యువతి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. హర్షు.. తనకు కాబోయే భర్త కరణ్ నుంచి కొన్ని వాగ్దానాలను కోరుకుందట. వాటిని 100 రూపాయల బాండుపై కండిషన్స్ అప్లై అంటూ ఐదంటే ఐదు షరుతుల్ని వివరంగా రాయించి, కాబోయే భర్తతో సంతకం పెట్టించుకుంది. దాన్ని లామినేషన్ చేయించి కాన్ఫిడెన్షియల్ అంటూ దాచి పెట్టుకుంది. ఇంతకీ అందులో ఏం షరతులు ఉన్నాయి? పాపం పెళ్లికొడుకు ఏం బేజారెత్తుతున్నాడో అనుకునేరు! ఆ షరతులు తెలిస్తే నవ్వుకుంటారు. మొదటి షరతు... ప్రతిరోజూ రాత్రివేళ వరుడు తన దగ్గరే పడుకోవాలట. రెండో షరతు... వెబ్ సిరీస్ కలిసే చూడాలట. మూడో షరతు.. రోజుకి మూడుసార్లు తనకి ఐలవ్యూ చెప్పాలట. నాలుగో షరతు.. బార్బెక్యూ ఫుడ్స్‌ని ఆమె లేకుండా ఒక్కడే తినకూడదట. ఐదో షరతు... ఆమె ఎప్పుడు ఏది అడిగినా అతను నిజమే చెప్పాలట. ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ బాండ్ పేపర్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా హల్చల్ చేస్తోంది. దీన్ని ఫిబ్రవరి 20న హర్షు పెళ్లికి మేకప్ చేసిన భూమికా సాజ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. హర్షు చాలా సరదా మనిషి అని అదే అకౌంట్లో మిగిలిన వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతిచోట ఫుల్ జోష్‌తో డాన్స్ చేసే హర్షు.. ఏదో సరదగా ఈ కండిషన్స్ పెట్టి ఉంటుందని, ఇలాంటి కాంట్రాక్ట్ ఇంతకుముందెప్పుడూ చూడలేదంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు. అయితే హర్షు మాత్రం తన అకౌంట్‌ని ప్రైవసీగానే ఉంచుకుంది. దాంతో పూర్తి వివరాలు వెలువడలేదు. -
బీఈఎల్‌తో హెచ్ఏఎల్ రూ. 2,400 కోట్ల ఒప్పందం
బెంగళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ నుంచి రూ. 2,400 కోట్ల కాంట్రాక్టును భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్సీఏ) తేజాస్ ఎంకే1ఏలకు అవసరమైన 20 రకాల ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్‌ను (ఎల్‌ఆర్‌యూ మొదలైనవి) బీఈఎల్ తయారీ చేసి, సరఫరా చేయాల్సి ఉంటుంది. 2023 నుంచి 2028 వరకూ అయిదేళ్ల వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంటుంది. మరోవైపు, 83 తేజాస్ ఎంకే1ఏలను భారత వైమానిక దశానికి 2023–24 నుంచి అందించడం మొదలవుతుందని హెచ్ఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఏపీ: డీఎస్సీ–2008 కాంట్రాక్టు ఎస్జీటీ మిగులు పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2008 డీఎస్సీలో అర్హులైన వారిని కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియమించగా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆర్జేడీలకు విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు సోమవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,193 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో మినిమమ్ టైం స్కేల్ మీద తీసుకోవాలని జూన్ నెలలో ఆదేశాలు వెలువడ్డాయి. వీరిలో 144 మంది వివిధ కారణాల వల్ల డ్యూటీలలో చేరలేదు. ఈ మిగులు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ డీఈవోలకు సూచించారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక నేతలు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కరణం హరికృష్ణ, సింహాచలం పేర్కొన్నారు. ఇవీ చదవండి: తాగుబోతు రాతలేల? పాతాళ గంగ.. కరువు తీరంగ -
ఊహించని పరిణామం: 21 ఏళ్ల బంధానికి గుడ్‌బై
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు, మెస్సీ ఫ్యాన్స్‌కు మింగుడుపడని వార్త ఇది. స్టార్ ఆటగాడు, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఊహించని పరిణామం ఎదురైంది. 21 ఏళ్ల సుదీర్ఘ బార్సిలోనా క్లబ్(Catalan club) పయనం ముగిసింది. ఇకపై ఈ స్పెయిన్ క్లబ్ తరపున మెస్సీ ఆడబోవడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆయనతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని క్లబ్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం క్లబ్ తరపు అధికారిక సమాచారం వెలువడింది. దీంతో సాకర్ అభిమానులు నివ్వెరపోతున్నారు. నిజానికి క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్ ముగిసి చాలా రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని క్లబ్‌లు పోటాపోటీ పడగా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు తమతోనే కొనసాగుతాడని క్లబ్ చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే కోపా అమెరికా 2021 అర్జెంటీనా విక్టరీ తర్వాత.. మెస్సీ సెలవుల్లో ఉన్నాడు. తిరిగి బుధవారం క్లబ్లో చేరాడు. దీంతో ఈ వారాంతంలో కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని కథనాలు వెలువడ్డాయి. ఇంతలోపే మెస్సీతో బంధం ముగిసిందని బార్సిలోనా ప్రకటించడం ఫుట్‌బాల్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. చదవండి: ఏం తమాషాగా ఉందా? అయితే వ్యక్తిగత కారణాలతో కిందటి ఏడాదే మెస్సీ.. బార్సిలోనా నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నించాడు. అయితే అప్పుడే క్లబ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న జోవాన్ లపోర్టా.. మెస్సీని బతిమాలి కొనసాగేలా చూశాడు. తిరిగి ఈ ఏడాది జూన్ 30న మెస్సీ -బార్సిలోనా క్లబ్ ఒప్పందం ముగియగా.. 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే లపోర్టా మాత్రం మరో ఐదేళ్లు మెస్సీ తమతోనే కొనసాగుతాడంటూ కాన్ఫిడెంట్‌గా ప్రకటనలు ఇచ్చాడు. ఈ తరుణంలో నిన్న(గురువారం) ఉదయం క్యాంప్‌నౌ స్టేడియం దగ్గర జరిగిన చర్చల అనంతరం.. మెస్సీ కాంట్రాక్ట్ ముగిసినట్లు క్లబ్ ఈ ప్రకటన చేయడం విశేషం. 50 శాతం కోతలు, ఒప్పందంలో క్లబ్ కండిషన్లకు మెస్సీ విముఖత వ్యక్తం చేయగా.. కాంట్రాక్ట్ రద్దుకే క్లబ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల వయసులో బార్సిలోనా క్లబ్ యూత్ వింగ్‌లో చేరిన మెస్సీ.. 16 ఏళ్లకు క్లబ్ జట్టులో చేరాడు. ఈ స్పెయిన్ క్లబ్ తరపున 778 మ్యాచ్‌లు ఆడి.. 672 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే బార్సిలోనా నుంచి తన ఎగ్జిట్‌పై మెస్సీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న మెస్సీ.. ఏ క్లబ్లో చేరేది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
సగం జీతం కట్! మరో ఐదేళ్లకు ఒప్పందం?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫుట్‌బాలర్‌గా పేరున్న లియోనెల్ మెస్సీ.. రాజీకి సిద్ధపడినట్లు తెలుస్తోంది. స్పానిష్ ఫుట్‌బాల్ క్లబ్ బార్సిలోనాతో మెస్సీ కాంట్రాక్ట్ ఇటీవలె ముగిసిందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యం ఏంటన్న దానిపై చర్చ మొదలైంది. అయితే ఊహాగానాలకు తెరదించుతూ మెస్సీ మరోసారి బార్సిలోనా కాంట్రాక్ట్‌కే మొగ్గుచూపించినట్లు తెలుస్తోంది. మరో ఐదేళ్లపాటు బార్సిలోనా క్లబ్‌తో ఒప్పందం చేసుకోబోతున్న మెస్సీ.. 50 శాతం జీతం కట్టింగ్‌కు సైతం సిద్ధపడినట్లు గోల్.కామ్ బుధవారం ఒక కథనం ప్రచురించింది. రీ-సైన్ నేపథ్యంలో వార్షికాదాయంలో ఈ కట్టింగ్లు పోతాయని, దీనిపై క్లబ్ త్వరలోనే అధికార ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా బార్సిలోనా క్లబ్ నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లాక్డౌన్ ప్రభావంతో ఆటగాళ్లకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్లు ఇవ్వలేకపోతోంది కూడా. ఈ నేపథ్యంలో క్లబ్‌కు ఊరట ఇచ్చేలా మెస్సీ తన జీతంలో త్యాగానికి సిద్ధపడినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో మెస్సీ మాస్టర్ ప్లాన్ అమలుచేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మెస్సీకి బార్సిలోనా కంటే ఎక్కువ జీతం ఆఫర్ చేస్తున్నాయి కొన్ని క్లబ్‌లు. అయితే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న మెస్సీ.. వాటి ద్వారా గణనీయమైన ఆదాయం వెనకేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మెస్సీ వేరే క్లబ్‌లకు వెళ్తే గనుక.. విశ్వసనీయత దెబ్బతిని ఆ ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని భావిస్తున్నాడు. అందుకే బార్సిలోనా ఆఫర్‌కు తలొగ్గడం లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోగలిగాడని విశ్లేషకుల అభిప్రాయం. ఇదిలా ఉంటే ఈ అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు 2004 నుంచి బార్సిలోనాతో కొనసాగుతున్నాడు. Messi in call with his fam after he got his champion’s medal  😍🔟📱🥇#Argentina #LeoMessi #LionelMessi #MessiTHEGOAT #ArgentinavsBrazil #CopaAmerica2021 #CopaAmerica #ARGBRA #ArgentinaBrazil #Messi #MessiCampeon pic.twitter.com/ChZeNPbyZZ — Leo Messi (@xlionelmessix) July 11, 2021 గత ఐదేళ్ల కాంట్రాక్ట్ కోసం 550 మిలియన్ల యూరోస్తో మెస్సీ ఒప్పందం చేసుకుని.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించాడు. తాజాగా కాంట్రాక్ట్ ముగిశాక ‘పారిస్ సెయింట్ జెర్మాయిన్, మాంచెస్టర్ సిటీ, ఇంటర్ మిలన్లు మెస్సీకు బంపరాఫర్లు ప్రకటించాయి కూడా. ప్రస్తుత కథనాలు నిజమైతే 2026 వరకు మెస్సీ బార్సిలోనాతోనే కొనసాగుతాడు. -
లంక క్రికెట్లో కుదుపు.. కాంట్రాక్ట్‌కు నో చెప్పిన ఐదుగురు క్రికెటర్లు
కొలొంబో: భారత్‌తో కీలకమైన వన్డే, టీ20 సిరీస్ ముంగిట శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్ట్‌కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు శ్రీలంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేసేది లేదని బోర్డుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్లో బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయిన నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. -
డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు
సాక్షి, విశాఖపట్నం: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జీటీ పోస్ట్‌లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా రేపటి నుంచి అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 306-1918 ర్యాంక్ వరకు 110 మంది అభ్యర్థులకు రేపు కౌన్సెలింగ్ జరగనుండగా, 1921-8659 ర్యాంక్ వరకు 119 మందికి ఈనెల 26న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. deovsp.netలో విల్లింగ్ జాబితా, చెక్‌లిస్ట్ అందుబాటులో ఉంచామని డీఈవో లింగేశ్వర్రెడ్డి తెలిపారు. చదవండి: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
రైనాకు మరోషాక్.. కాంట్రాక్టు రద్దు..!
దుబాయ్ : హాట్ ఫేవరెట్‌గా ఐపీఎల్ లీగ్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు (సీఎస్కే) అంచనాలను అందుకోలేపోతుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ధోనీ జట్టు వరుస రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో వారంలోనే పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. హిట్టింగ్‌లేని బ్యాటింగ్‌తో పాటు పసలేని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లతో పోటీపడలేక వెనుకబడుతోంది. అయితే ఈ జట్టు సీనియర్ ఆటగాడు, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతుండగా.. ఇక రైనా వైపు తిరిగిచూసే ప్రసక్తేలేదని సీఎస్కే సీఈవో విశ్వనాథన్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ('రైనా.. ప్లీజ్ తిరిగి రావా') తన వ్యక్తిగత కారణాల వల్ల రైనా లీగ్ నుంచి నిష్క్రమించాడని, అతను లేని లోటును రిజర్వుబెంచ్‌లోని ప్లేయర్ల ద్వారా భర్తీచేస్తామని ప్రకటించాడు. ఈ క్రమంలోనే రైనాతో పాటు మరోసీనియర్ ఆటగాడు హర్బజన్ సింగ్ పేర్లను సీఎస్కే అధికార వెబ్సైట్ నుంచి తొలగించించింది. సీఎస్కే నిర్ణయంతో రైనాకు పూర్తిగా దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. మొన్నటి వరకు రైనా తిరిగి వస్తాడనుకున్న రైనా ఆశలు కూడా అడియాశలై పోయాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు ఈ ఇద్దరు ఆటగాళ్లపై మరో చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన స్టార్ బ్యాట్స్‌మెన్ రైనాతో పాటు సీనియర్ స్పిన్నర్ హర్బజన్‌తో తమకున్న కాంట్రాక్టులను పూర్తిగా రద్దు చేసుకోవాలని సీఎస్కే భావిస్తున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకున్న ఇరువురి ఆటగాళ్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. దీనిపై జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనాకు సీఎస్కే ప్రస్తుత సీజన్లో రూ.11కోట్లు వెచ్చిస్తోంది. (చెన్నైకి అదనపు బౌలర్ కావాలి!) మిస్టర్ కూల్ ముందుకు వస్తాడా..? మరోవైపు వరుస రెండు మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన సీఎస్కే.. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. మొదటి మ్యాచ్‌లో మెరిపించిన అంబటి రాయుడు నేటి మ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కెప్టెన్ ధోనీపై అభిమానులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. రైనాలేని లోటును ఏ ఆటగాడు కూడా భర్తీచేయకపోవడంతో టాప్ఆర్డర్లో కొంత వెలితి కనిపిస్తోంది. గత మూడు మ్యాచ్‌ల్లో బ్యాంటింగ్ ఆర్డర్లో వెనుక వచ్చిన ధోనీ హైదరాబాద్‌తో మ్యాచ్ నుంచి ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక దుబాయ్ వేదికగా జరిగే నేటి మ్యాచ్‌లో మిస్టర్ కూల్ ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతాడో వేచి చూడాలి. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కించుకున్న టాటా
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా దక్కించుకుంది. ఆర్థిక బిడ్స్‌లో బుధవారం ఎల్అండ్టీతో పోటీ పడి టాటా ప్రాజెక్ట్స్ పార్లమెంట్ నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టును 861.90 కోట్ల రూపాయలతో పూర్తి చేయనున్నట్టు టాటా ప్రాజెక్ట్ పేర్కొంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ఎల్అండ్టీ దాఖలు చేసిన రూ .865 కోట్ల కంటే తక్కువ మొత్తం దాఖలు చేసి టాటా గ్రూప్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దక్కించుకుంది. నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ ఈ రోజు ఆర్థిక వేలం నిర్వహించింది. కాగా, పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. త్రిభుజాకారంలో నిర్మించనున్న ఈ భవనానికి మొత్తంగా 940 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని ప్రభుత్వ ప్రజా పనుల శాఖ అంచనా వేసింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ప్రస్తుత భవనానికి మరమ్మత్తులు చేసిన అనంతరం ఇతర అవసరాల కోసం వినియోగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి సంబంధించి ఈ ఏడాది ఆరంభంలోనే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు త్రిభుజాకార భవనంగా దీన్ని నిర్మాణం చేపట్టనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు సమాచారం. నూతన పార్లమెంట్ భవనంపై భారత జాతీయ చిహ్నం ముద్రిస్తారని తెలిసింది. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్‌లోని 118వ నెంబర్ ప్లాట్‌లో 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నూతన భవనం కొలువుతీరనుంది. సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్‌లో భాగంగా తొలి ప్రాజెక్టుగా పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చదవండి : ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన -
కరోనా ఎవరినీ వదిలి పెట్టదు : బ్రెజిల్ అధ్యక్షుడు
బ్రసిలియా: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దురదృష్టవశాత్తు ప్రతి ఒక్కరూ బహుశా ఏదో ఒక సమయంలో కరోనావైరస్ మహమ్మారి బారిన పడక తప్పదని ఆయన పేర్కొన్నారు. వైరస్ ఎవరినీ వదిలిపెట్టదు..కాబట్టి భయం వద్దు దాన్ని ఎదుర్కోండి అంటూ చెప్పుకొచ్చారు. కరోనా మరణాల పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన ప్రతిరోజు చాలా కారణాలతో జనం చనిపోతారు. అదే జీవితం అంటూ వేదాంత ధోరణి ప్రదర్శించడం గమనార్హం. కరోనావైరస్ నిర్ధారణ తరువాత బలహీనంగా ఉన్నానని, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నానని బోల్సొనారో చెప్పిన ఒక రోజు తర్వాత శుక్రవారం దక్షిణ రియో గ్రాండే దో సుల్ రాష్ట్ర పర్యటన సందర్భంగా విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కోవిడ్-19 ఒక సాధారణ ఫ్లూ లాంటిదే నని వ్యాఖ్యానించిన బోల్సొనారో, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందంటూ లాక్ డౌన్ ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. జూలై 7న బోల్సొనారోకు కరోనా సోకింది. 20 రోజులకు పైగా హోం ఐసోలేషన్ లో ఉంటూ అధికారిక నివాసం నుంచే కార్యకలాపాలను చక్కబెట్టారు. 18 రోజుల్లో మూడుసార్లు పాజిటివ్ రాగా గత శనివారం నాల్గవసారి నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే ఆయన భార్య, ప్రథమ మహిళ మిచెల్ బోల్సొనారోకు వైరస్ సోకింది. అలాగే ఆయన ఇద్దరు సహాయకులతోపాటు సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మంత్రి మార్కోస్ పోంటెస్ కు పాజిటివ్ వచ్చిందని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటివరకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఈ వైరస్ బారిన పడ్డారు. కాగా బ్రెజిల్ ప్రభుత్వ సమాచారం ప్రకారం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,662,485 గా ఉండగా, 92,475 మరణాలు సంభవించాయి. (బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా) -
అదానీకి మెగా ‘సౌర’భం
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ తాజాగా ప్రపంచంలోనే అత్యంత భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకుంది. ఇందులో భాగంగా 8 గిగావాట్స్ ఫొటోవోల్టెయిక్ (పీవీ) విద్యుత్ ప్లాంటుతో పాటు దేశీయంగా సోలార్ ప్యానెళ్ల తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కంపెనీ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ప్రభుత్వ రంగ ఎస్ఈసీఐ (గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నుంచి దక్కించుకున్న ఈ కాంట్రాక్టు కింద 2 గి.వా. (2,000 మె.వా) సామర్థ్యంతో దేశీయంగా సోలార్ పయానెల్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలి. అలాగే 8 గి.వా. విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు నిర్మించాలి. ‘ఎస్ఈసీఐతో తయారీ ఆధారిత సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ తరహా ఒప్పందాల్లో ఇదే మొదటిది‘ అని అదానీ గ్రీన్ ఎనర్జీ (ఏజీఈఎల్) తెలిపింది. ఈ ప్రాజెక్టుతో కలిపి అదానీ గ్రీన్ వద్ద ప్రస్తుతం 15 గి.వా. పునరుత్పాదక విద్యుదుత్పత్తి అసెట్స్ ఉన్నట్లవుతుంది. రూ. 2.92 టారిఫ్..: కాంట్రాక్టు ప్రకారం 25 ఏళ్ల పాటు యూనిట్‌కు స్థిరంగా రూ. 2.92 చొప్పున కంపెనీకి టారిఫ్ లభిస్తుంది. ఇంత భారీ సామర్థ్యం గల ప్రాజెక్టు కాంట్రాక్టు ఇదేనని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద పునరుత్పాదక విద్యుత్ కంపెనీగా ఎదగాలన్న లక్ష్యానికి మరింత చేరువయ్యేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడుతుంది. ఈ ఏడాదే మరో 10 గి.వా. సామర్థ్యంగల ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా 25 గి.వా. సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోగలం‘ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్తాన్, గుజరాత్లో ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజస్తాన్‌లోని జైసల్మేర్, బికనీర్, జోధ్‌పూర్‌లో అటు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో నెలకొల్పవచ్చని వివరించాయి. సుమారు 4,00,000 దాకా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నాయి. 2025 నాటికి పూర్తి.. ముందుగా 2022 నాటికి తొలి 2 గి.వా. ఉత్పత్తి సామర్థ్యం ప్రాజెక్టు మొదలవుతుందని, మిగతాది 2 గి.వా. చొప్పున 2025 నాటికి పూర్తవుతుందని అదానీ తెలిపారు. ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్నట్లు, 2022 నాటికి సోలార్ తయారీ కేంద్రం సిద్ధం కానున్నట్లు చెప్పారు. ఏకంగా 25 ఏళ్ల పాటు స్థిరంగా రూ. 2.92 మాత్రమే టారిఫ్ ఉండనుండటంపై స్పందిస్తూ ‘మాకు తగినంత మార్జిన్ ఉంటుంది. అంతేగాక ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3–5 ఏళ్ల వ్యవధి ఉంటుంది. తగినంత మార్జిన్ ఉండటం వల్ల టారిఫ్ విషయంలో సమస్యేమీ లేదు‘ అని అదానీ తెలిపారు. ఇక, ఆగ్నేయాసియా దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి చౌకగా దిగుమతుల వల్ల దేశీ సంస్థలు నష్టపోకుండా తగు రక్షణాత్మక సుంకాలు అమలవుతుండటం కూడా ఊరటనిచ్చే అంశమని ఆయన వివరించారు. 900 మిలియన్ టన్నుల మేర కర్బన ఉద్గారాలను ఈ భారీ ప్రాజెక్టు తగ్గిస్తుందని, తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకోవాలన్న భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ఉపయోగపడగలదని పేర్కొన్నారు. మొత్తం మీద వచ్చే అయిదేళ్లలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో తమ సంస్థ రూ. 1,12,000 కోట్ల మేర (దాదాపు 15 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసేందుకు ఈ కాంట్రాక్టు ఊతమివ్వగలదని అదానీ చెప్పారు. -
జేమీసన్‌కు తొలిసారి చోటు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తాజా సంచలనం కైల్ జేమీసన్‌కు న్యూజిలాండ్ క్రికెట్ 2020–21 సీజన్‌కుగానూ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన సిరీస్ ద్వారా వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల జేమీసన్ అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర వన్డేలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడంతో పాటు... అనంతరం జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 9 వికెట్లతో పాటు బ్యాట్‌తోనూ రాణించి కివీస్ సిరీస్‌ను 2–0 తో క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇతడితో పాటు ఎడంచేతి వాటం స్పిన్నర్ ఎజాజ్ పటేల్, డేవన్ కాన్వేలు కూడా తొలిసారి ఈ జాబి తాలో చోటు దక్కించుకోగా... ఓపెనర్ మన్రో, జీత్ రావల్, ఇటీవల టెస్టుల నుంచి రిటైరైన టాడ్ ఆస్టల్లు తమ కాంట్రాక్టును కోల్పోయారు. మొత్తం 20 మంది ఆటగాళ్లకు కాంట్రాక్టు లభించింది. న్యూజిలాండ్ కాంట్రాక్ట్ క్రికెటర్ల జాబితా: విలియమ్సన్, బౌల్ట్, గ్రాండ్‌హోమ్, ఫెర్గూసన్, గప్టిల్, హెన్రీ, జేమీసన్, టామ్ లాథమ్, నికోల్స్, సాన్ట్నెర్, నీషమ్, సౌతీ, రాస్ టేలర్, వాగ్నర్, వాట్లింగ్, ఎజాజ్ పటేల్, సోధి, బ్లన్‌డెల్, డేవన్ కాన్వే, విల్ యంగ్. -
కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభకాలంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని మరిన్ని ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో సుమారు 200 పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా రద్దు చేసింది. పదవీ విరమణ తర్వాత తిరిగి ఉద్యోగం పొందిన 200 మంది పైలట్ల కాంట్రాక్టులను తాత్కాలికంగా నిలిపివేశామని ఎయిరిండియా సీనియర్ అధికారి గురువారం తెలిపారు. గత కొన్ని వారాలలో దాదాపు అన్ని విమానాలు నిలిచిపోవడంతో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిరిండియా ప్రకటించింది. రానున్న మూడు నెలల కాలానికి క్యాబిన్ సిబ్బంది మినహా అన్ని ఇతర ఉద్యోగుల జీత భత్యాల్లో 10 శాతం కోతను ఇప్పటికే తగ్గించింది. తాజాగా పైలట్ల నెత్తిన మరో పిడుగు వేసింది. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడానికి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ పరిస్థితి కొనసాగనుంది. ఈ క్రమలో ఎయిరిండియా దేశంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. అటు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల విక్రయానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఒలింపిక్స్ వరకు కోచ్‌ల కొనసాగింపు!
న్యూఢిల్లీ: ప్రత్యేకించి ఒలింపిక్స్ కోసమే విదేశీ కోచ్‌లను నియమించుకున్న భారత క్రీడా సమాఖ్యలు ఇప్పుడు ఆ కోచ్‌ల కాంట్రాక్టు గడువు పొడిగించాలని భావిస్తున్నాయి. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ వల్ల టోక్యో మెగా ఈవెంట్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఆ పోటీలు ముగిసే వరకు కోచ్‌లను కొనసాగించాలని భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)కి పలు క్రీడా సమాఖ్యల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. మహిళా రెజ్లింగ్ కోచ్ ఆండ్రూ కుక్, షూటింగ్ (పిస్టల్) కోచ్ పావెల్ స్మిర్నోవ్, బాక్సింగ్ కోచ్‌లు శాంటియాగో నియెవా, రాఫెల్లె బెర్గమస్కొ, అథ్లెటిక్స్ హైపెర్ఫార్మెన్స్ డైరెక్టర్ హెర్మన్ తదితర విదేశీ కోచ్‌లకు ‘సాయ్’ పొడిగింపు ఇచ్చే అవకాశాలున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా క్రీడా శిబిరాలేవీ కొనసాగడం లేదు. ఈ లాక్డౌన్ ముగిశాక కోచ్‌ల సేవలు, శిబిరాలు మొదలవుతాయి. ‘విదేశీ కోచ్‌ల జీతాలను ‘సాయ్’ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉన్న అసాధారణ పరిస్థితులు వారికి తెలుసు. కాబట్టి సహకరించేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు’ అని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కార్యదర్శి వీఎన్ ప్రసూద్ తెలిపారు. కుక్ (అమెరికా), టెమొ గెబిష్విలి (జార్జియా), బజ్రంగ్ పూనియా కోచ్ షాకో బెంటినిడిస్ (జార్జియా)లతో డబ్ల్యూఎఫ్ఐ కాంట్రాక్టు పొడిగించుకుంటుంది. 21 రోజుల లాక్డౌన్ పూర్తయ్యాక ఆటగాళ్ల సన్నాహకాలు మొదలవుతాయని ప్రసూద్ ఆశిస్తున్నారు. -
‘నో’ కాంట్రాక్ట్ ‘లో’ కాంట్రాక్ట్
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాబోయే ఏడాది కాలానికి కొత్తగా వార్షిక కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 27 మందితో రూపొందించిన ఈ జాబితాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కలేదు. గత జులైలో ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించని ధోని భవిష్యత్తుపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 2019 అక్టోబర్ నుంచి 2020 సెప్టెంబరు వరకు ఈ కాంట్రాక్ట్ వర్తిస్తుంది. టాప్ గ్రేడ్ అయిన ‘ఎ ప్లస్’లో ఎప్పటిలాగే ముగ్గురు క్రికెటర్లు కోహ్లి, రోహిత్, బుమ్రాలకే అవకాశం దక్కింది. రాహుల్‌కు ప్రమోషన్... టాపార్డర్ బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ ఇటీవల నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దాంతో అతడిని ‘బి’ గ్రేడ్ నుంచి ‘ఎ’ గ్రేడ్‌లోకి ప్రమోట్ చేశారు. టెస్టు ఓపెనర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న మయాంక్ అగర్వాల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ‘సి’నుంచి ‘బి’లోకి వచ్చారు. ముగ్గురు ఆటగాళ్లు అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. కొత్తగా సైనీ, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్‌లకు తొలిసారి గ్రేడ్ ‘సి’ కాంట్రాక్ట్ దక్కింది. సమాచారమిచ్చారట..! ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత ధోని మైదానంలో కనిపించలేదు. మళ్లీ ఆడతాడా లేదా తెలీదు. తాను ఏ ప్రకటన ద్వారానూ చెప్పడు. సెలక్షన్ కమిటీకి సమాచారమే ఉండదు. బోర్డు అధ్యక్షుడు గంగూలీ త్వరలోనే తేలుస్తామంటాడు గానీ స్పష్టతనివ్వడు. ఇలాంటి నేపథ్యంలో కోచ్ రవిశాస్త్రి నోటినుంచి వచ్చిన మాటలే బ్రహ్మపలుకులుగా భావించాల్సి వస్తోంది. టెస్టులకు ఎప్పుడో దూరమైన ధోని ఇక వన్డే కెరీర్ కూడా ముగిసినట్లేననే అతను పరోక్షంగా చెప్పాడు. ఇప్పుడు కాంట్రాక్ట్‌నుంచి తప్పించడం ద్వారా బీసీసీఐ కూడా తమ నిర్ణయం వెలువరించిందనే అర్థం చేసుకోవచ్చు. గత అక్టోబరు నుంచి ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వచ్చే సెప్టెంబరులోగా ఆడతాడనే నమ్మకం లేదు. ఒక వేళ ఐపీఎల్లో అద్భుతంగా ఆడి టి20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చినా ఆ టోర్నీ అక్టోబరులో ఉంది. కాబట్టి నిబంధనల ప్రకారం చూస్తే ధోనికి కాంట్రాక్ట్ అర్హత లేదు. ఈ విషయంపై మాజీ కెప్టెన్‌కు ముందే సమాచారం ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. స్వయంగా గంగూలీయే దీనిని చెప్పినట్లు తెలుస్తోంది. ‘బోర్డు అత్యున్నత అధికారి ఒకరు కాంట్రాక్ట్ విషయం గురించి ధోనితో మాట్లాడారు. తనకు అర్హత లేదు కాబట్టి తన పేరు పరిశీలించవద్దని అతనే చెప్పాడు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. మళ్లీ అతను జట్టులోకి వస్తే కాంట్రాక్ట్ తిరిగి రావడం పెద్ద విషయం కాదు’ అని బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. రంజీ టీమ్‌తో కలిసి... రూ. 5 కోట్ల విలువ గల కాంట్రాక్ట్‌లో చోటు కోల్పోయిన రోజే ధోని మైదానంలోకి దిగడం విశేషం. తన స్వస్థలం రాంచీలో జార్ఖండ్ జట్టు రంజీ జట్టు సభ్యులతో కలిసి అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. బ్యాటింగ్‌తో పాటు రెగ్యులర్ ట్రైనింగ్‌లో కూడా అతను భాగమైనట్లు జార్ఖండ్ టీమ్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ప్రత్యేక బౌలింగ్ మెషీన్ ద్వారా అతను సాధన చేయడం విశేషం. రంజీ ఆటగాళ్లంతా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేస్తే ధోని మాత్రం తెల్ల బంతితో ఆడాడు. తద్వారా పోటీ క్రికెట్ కోసం తాను సిద్ధమవుతున్నట్లు మహి పరోక్షంగా చూ పించాడు. ఐపీఎల్‌తోనే పునరాగమనం చేయవచ్చు. కొత్త కాంట్రాక్ట్ జాబితా (గ్రేడ్లవారీగా) ‘ఎ ప్లస్’ (రూ. 7 కోట్లు) కోహ్లి, రోహిత్, బుమ్రా ‘ఎ’ (రూ. 5 కోట్లు) అశ్విన్, జడేజా, భువనేశ్వర్, పుజారా, రహానే, ధావన్, షమీ, ఇషాంత్, కుల్దీప్, పంత్, రాహుల్ ‘బి’ (రూ. 3 కోట్లు) ఉమేశ్, చహల్, పాండ్యా, సాహా, మయాంక్ ‘సి’ (రూ. 1 కోటి) జాదవ్, మనీశ్ పాండే, విహారి, సైనీ, దీపక్ చాహర్, శార్దుల్, అయ్యర్, వాషింగ్టన్ సుందర్. ‘బి’ గ్రేడ్‌కు మిథాలీ రాజ్ మహిళల జట్టు కాంట్రాక్ట్‌లలో వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ దిగువకు పడిపోయింది. ఇప్పటి వరకు ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆమెను ‘బి’ గ్రేడ్‌లోకి మార్చారు. టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ప్రస్తుతం మిథాలీ ఒకే ఫార్మాట్లో ఆడుతోంది. ‘ఎ’ గ్రేడ్‌లో టి20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ , ఓపెనర్ స్మృతి మంధాన తమ స్థానాలు నిలబెట్టుకోగా, కొత్తగా లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. ఇటీవల భారత్ విజయాల్లో పూనమ్ కీలక పాత్ర పోషించింది. రాధ యాదవ్, తాన్యా భాటియాలకు ‘సి’ గ్రేడ్‌నుంచి ‘బి’లోకి ప్రమోషన్ లభించగా, 15 ఏళ్ల షఫాలీ శర్మకు తొలిసారి కాంట్రాక్ట్ దక్కింది. మహిళల జట్టు కాంట్రాక్ట్‌లు కూడా 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబర్ వరకు వర్తిస్తాయి. కొత్త కాంట్రాక్ట్ జాబితా (గ్రేడ్లవారీగా) ‘ఎ’ (రూ. 50 లక్షలు) హర్మన్, స్మృతి, పూనమ్ యాదవ్ ‘బి’ (రూ. 30 లక్షలు) మిథాలీ, ఏక్తా బిష్త్, జులన్, శిఖా పాండే, దీప్తి శర్మ, జెమీమా, తాన్యా, రాధ ‘సి’ (రూ. 10 లక్షలు) హేమలత, అనూజ, వేద, మాన్సి, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి, పూజ, హర్లీన్, ప్రియ పూనియా, పూనమ్ రౌత్, షఫాలీ వర్మ -
బందరు పోర్టు కాంట్రాక్టు రద్దు
సాక్షి, అమరావతి: మచిలీపట్నం (బందరు) పోర్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచింది. ఈ పోర్టు నిర్మించడానికి 2010 జూన్ 7న నవయుగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, పోర్టు నిర్మాణం దిశగా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవయుగ సంస్థ ఇప్పటికే మరో ఓడరేవును నిర్వహిస్తుండడంతో ఆ ప్రాజెక్టు లాభదాయకతను దృష్టిలో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగానే బందరు పోర్టు నిర్మాణం విషయంలో జాప్యం చేస్తోందని అధికారులు అంటున్నారు. బందరు పోర్టు నిర్మాణం పేరిట ఇప్పటికే నవయుగ సంస్థ తీసుకున్న 471.28 ఎకరాల భూమికి పైసా కూడా లీజు చెల్లించలేదు. దీంతో నవయుగ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే రద్దు చేయడంతో పాటు ఇప్పటికే ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన నష్ట పరిహారాన్ని మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వసూలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్ నుంచి సుమారు రూ.685 కోట్ల విలువైన ఆర్డరును దక్కించుకుంది. ఇందులో భాగంగా బరాక్–8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ కోసం 1,000 కిట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటిని రఫేల్.. బీడీఎల్‌కు అప్పగిస్తుంది. బీడీఎల్‌లో తుదిమెరుగులు దిద్దుకుని ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చేరతాయి. గురువారమిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రఫేల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పిని యంగ్మన్ చేతుల మీదుగా కళ్యాణి గ్రూప్ చైర్మన్ బాబా కళ్యాణి ఈ మేరకు ఆర్డరు పత్రాలను అందుకున్నారు. రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కళ్యాణి గ్రూప్ సంయుక్తంగా కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ వద్ద ఈ కంపెనీకి తయారీ కేంద్రం ఉంది. 2017 ఆగస్టులో ఈ ప్లాంటు ప్రారంభమైంది. మరో తయారీ కేంద్రం.. హైదరాబాద్ సమీపంలో మరో తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు బాబా కళ్యాణి వెల్లడించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఎంత పెట్టుబడి, ఏ సమయంలోగా పూర్తి అవుతుందో ఇప్పుడే చెప్పలేనని వివరించారు. అయితే 100 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. భారత్‌తోపాటు పొరుగు దేశాలకు ఇక్కడి నుంచి ఉత్పత్తులను సరఫరా చేస్తామన్నారు. దేశీయంగా తయారీకి అవసరమైన టెక్నాలజీని రఫేల్ సమకూరుస్తోందని చెప్పారు. ప్రైవేటు రంగంలో కళ్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారత్‌లో తొలి మిస్సైల్ తయారీ కేంద్రమని పిని యంగ్మన్ గుర్తు చేశారు. ఇక్కడి కేంద్రంలో ఇంటర్‌సెప్టార్స్, మిస్సైల్స్, డిఫెన్స్ సిస్టమ్స్ తయారు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, రూ.3,400 కోట్ల విలువైన స్పైక్ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌ను రఫేల్ నుంచి కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ డీల్ రద్దు అయినట్టు వస్తున్న వార్తల్లో నిజమెంత అని పినియంగ్మన్ను సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధి ప్రశ్నించగా.. దీనిపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
కదులుతున్న డొంక
ఆ మూడు కాంట్రాక్టుల్లో కుంభకోణం ఎంత?ఎన్నికల ముందేఎందుకీ పనులు?రూ.120 కోట్లుఎవరి జేబుల్లోకెళ్లాయి?విజిలెన్స్ నివేదికనుతొక్కిపెట్టిందెవరు?రాజధాని ప్రాంత విద్యుత్లైన్ల ఏర్పాట్లలో అక్రమాలుప్రభుత్వ పెద్దలు, అధికారులపాత్రపై అనుమానాలు సాక్షి, అమరావతి ఎన్నికల ముందు ఏపీ ట్రాన్స్‌కో ఇచ్చిన మూడు కాంట్రాక్టులు వివాదాస్పదమయ్యాయి. కాంట్రాక్టుల అప్పగింతలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. దీనిపై ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌తో పాటు రాష్ట్ర విజిలెన్స్ విభాగం కూడా ఇందుకు సంబంధించిన వాస్తవాలను ప్రభు త్వం దృష్టికి తెచ్చాయి. అయితే, ఇవేవీ పరిగణన లోనికి తీసుకోకుండానే హడావిడిగా కాంట్రాక్టులు ఇచ్చినట్లు సీఎస్ గుర్తించారు. ఎక్కడా లేని విధంగానిబంధనలు పెట్టడం, కొన్ని కంపెనీలకు మేలుచేసే ప్రయత్నం చేయడం, కాంట్రాక్టులు ఎక్కువ రేటుకు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలు, అధికారుల పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిసింది. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. అక్రమాల బాగోతం ఇదీ.. రాజధాని ప్రాంతానికి అన్ని వైపుల నుంచి విద్యుత్ లైన్లు వేయాలని ఏపీ ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులతో సీఆర్డీఏ చేపట్టే పనులను ముందుకు తీసుకొచ్చారు. గుడివాడ, చిలకలూరిపేట, ఏలూరుల్లో 400 కేవీ సబ్స్టేషన్లు, లైన్లకు సరిగ్గా ఎన్నికల ముందే ట్రాన్స్‌కో టెండర్లు పిలిచింది. నిజానికి చాలా కంపెనీలు పోటీకి సిద్ధమయ్యాయి. తక్కువ రేటుకే పనులు చేసేందుకూ ముందుకొచ్చాయి. గుడివాడ లైన్, సబ్‌స్టేషన్ పనులకు రూ.600 కోట్లను ట్రాన్స్‌కో కోట్ చేస్తే అంతకన్నా తక్కువకే చేస్తామని పలు కంపెనీలు వచ్చాయి. దీంతో ఏపీ ట్రాన్స్‌కో ఎక్కడలేని నిబంధనలు పెట్టింది. ఈ టెండర్లలో పాల్గొనే కంపెనీలు ఎప్పుడైనా, ఎక్కడైనా మౌలిక సదుపాయాల పనులకు సంబంధించిన కాంట్రాక్టును ఏడాదిలో 10 శాతం పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టింది. అంటే.. ట్రాన్స్‌కో లైన్లు వేసే కంపెనీలు గృహ నిర్మాణ పనులుచేసి ఉన్నా ఫర్వాలేదని పేర్కొంది. అదే విధంగా లైన్, సబ్‌స్టేషన్ ఒకే కంపెనీ, ఒకేసారి చేసి ఉండాలి. మునుపెన్నడూ కూడా ఈ నిబంధనలు పెట్టలేదు. దీంతో కేవలం మూడే మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. ఈ మూడు కూడబలుక్కుని మరీ టెండర్లు వేశాయి. ఈ మూడింటికీ వేర్వేరు పనులు అప్పగించారు. ఆరు నెలల క్రితం వరకూ ట్రాన్స్‌కో కోట్‌చేసిన ధర కన్నా నాలుగు శాతం తక్కువకే పనులు అప్పగిస్తే, కంపెనీలు రింగ్ అవ్వడంవల్ల ఏకంగా నాలుగు శాతం ఎక్కువకు పనులు ఇచ్చారు. మొత్తం రూ.1200 కోట్ల విలువైన టెండర్లలో కనీసం రూ.120 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఎన్నికల కోడ్ సమీపిస్తుండడంతో టెండర్ల ప్రక్రియను హడావుడిగా పూర్తిచేసి మార్చి మొదటి వారంలోనే పనులు అప్పగించారు. వీటన్నింటినీ విజిలెన్స్ విభాగం ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడాన్ని ప్రస్తుత సీఎస్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జేఎండీ కథానాయకుడా? ప్రభుత్వాధినేత కనుసన్నల్లో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో ట్రాన్స్‌కో జేఎండీ కీలకపాత్ర పోషించినట్టు సీఎస్‌కు ఫిర్యాదు అందినట్లు తెలిసింది. ఆదాయ పన్నుశాఖ నుంచి డిప్యుటేషన్‌పై ట్రాన్స్‌కో డైరెక్టర్‌గా వచ్చిన ఆయనకు.. ప్రభుత్వం మొదటి నుంచి పెద్దపీట వేసింది. డైరెక్టర్ స్థాయి నుంచి ఏకంగా ఆయనకు జేఎండీగా పదోన్నతి కల్పించింది. డిప్యూటేషన్ కాలం పూర్తయినా కేంద్ర స్థాయిలో మేనేజ్ చేసి ఆయనను ఇక్కడే ఉంచేందుకు టీడీపీకి చెందిన ఓ ఎంపీ విశ్వప్రయత్నం చేశారు. జేఎండీపై ఆయన మాతృ సంస్థకు ఫిర్యాదులు వెళ్లడంతో తప్పనిసరై ఆయన తిరిగి వెళ్లినట్టు ట్రాన్స్‌కో వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. మూడు కాంట్రాక్టులు తెరిచి, ఖరారు చేసే వరకూ ఆయన జేఎండీగానే కొనసాగారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి మాతృసంస్థకు వెళ్లారు. ఈ వ్యవహారంలో ఆయనకు ఏవైనా ముడుపులు అందాయా అనే కోణంలోనూ సీఎస్ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. -
బ్రీఫ్స్
సీఎంఐకి ఇండియన్ రైల్వేస్ భారీ కాంట్రాక్ట్ కేబుల్ తయారీ సంస్థ సీఎంఐ లిమిటెడ్ ఇండియన్ రైల్వేస్ నుంచి రూ.107 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. కాడ్మియం క్యాటనరీ వైర్ సరఫరాకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్‌ను అత్యంత తక్కువ బిడ్డింగ్ ద్వారా దక్కించుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రివర్స్ ఆక్షన్ విధానంలో ఈ టెండర్ నిర్ణయమైనట్లు బీఎస్ఈకి తెలియజేసింది. కంపెనీ షేర్ మంగళవారం నిఫ్టీలో 1.75 శాతం (రూ.3.10) పెరిగి 180.35 వద్ద ముగిసింది. రాఘవ్ కమోడిటీస్‌పై రూ.25 లక్షల జరిమానా రాఘవ్ కమోడిటీస్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ.25 లక్షల జరిమానా విధించింది. మోసపూరిత ట్రేడ్‌కు సంబంధించి ఆరోపణలపై ఈ జరిమానా విధించినట్లు ఒక నోట్లో పేర్కొంది. బీఎస్ఈలో ఇల్విక్విడ్ స్టాక్ ఆప్షన్స్ సెగ్మెంట్లో కృత్రిమ వ్యాల్యూమ్స్ సృష్టించినందుకు ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. శిల్పా మెడికేర్ క్యాన్సర్ చికిత్స ఇన్‌జెక్షన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సలకు వినియోగించే ఐరినోటికాన్ హెచ్‌సీఎల్ ఇంజెక్షన్‌కు అమెరికా హెల్త్ రెగ్యులేటర్– అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి ఆమోదం లభించింది. 40 ఎంజీ (2ఎంఎల్), 100 ఎంజీ (5 ఎంఎల్), 20ఎంజీ (ఎంల్) సింగిల్ డోస్ ఇన్‌జెన్షన్‌కు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించినట్లు శిల్పా మెడికేర్ సంస్థ బీఎస్ఈకి తెలియ జేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ నిఫ్టీలో 2 శాతం పెరిగి రూ.392.60 వద్ద ముగిసింది. సెంట్రల్ కోల్ ఫీల్డ్ చరిత్రాత్మక ఉత్పత్తి ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజం– కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్ ఫీల్డ్స్... డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించింది. ఈ నెల్లో ఉత్పత్తిలో 17.7 శాతం వృద్ధి నమోదయ్యింది. 5.7 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సంస్థ నమోదుచేసినట్లు సీఎండీ గోపాల్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2018–19 మూడు త్రైమాసికాల్లో సంస్థ 41.65 మిలి యన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే, ఇది 12 శాతం (37.2 శాతం) అధికం. కాగా కోల్ ఇండియా ఉత్పత్తి ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో 7.4 శాతం వృద్ధితో 412.45 మిలియన్ టన్నులకు చేరింది. షావోమీ టీవీ మోడళ్లపై తగ్గిన ధరలు చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం– షావోమీకి చెందిన కొన్ని టీవీ మోడళ్లపై ధరలు రూ.2,000 వరకు తగ్గాయి. ఇది ఇటీవలి జీఎస్టీ రేటు తగ్గింపు ప్రభావమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 32 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏపై ధర రూ.1,500 తగ్గింది. ఇక 32 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సీప్రోపై ధర రూ.2,000 వరకూ తగ్గింది. తక్షణం తగ్గిన చార్జీలు అమల్లోకి వస్తాయి. టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. -
మా దారి.. అడ్డదారి
సాక్షి, గుంటూరు: గత ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు మళ్లీ అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా కన్నెత్తి చూడని ప్రాజెక్టులు హఠాత్తుగా ఆయనకు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. ఇందులో భాగమే నేడు పేరేచర్ల–కొండమోడు రహదారి విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన. పేరేచర్ల–కొండమోడు మార్గాన్ని ‘నాలుగు వరుసల రోడ్డుగా మారుస్తాం.. 50 కిలోమీటర్లు పొడవునా 22.5 మీటర్లు వెడల్పుతో తీర్చిదిద్దుతాం’ అంటూ గతంలో సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. ఈ రహదారి విస్తరణకు గతంలో సర్వేలు చేపట్టారు. మేడికొండూరులో నాలుగు నుంచి ఐదు కిలో మీటర్లు, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ మేరకు రూ.512 కోట్లతో గతంలో టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. కప్పం కట్టలేక కాంట్రాక్టర్ల వెనుకంజ.. రూ. 500 కోట్లకుపైగా నిధులతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న వారు అధికార పార్టీ కీలక నేత తనయుడికి భారీగా కమీషన్ల ఇవ్వాల్సి రావడంతో ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను కమీషన్ల కోసం ముఖ్యనేత తనయుడు వేధించిన తీరును చూసి మిగిలిన కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేరేచర్ల–కొండమోడు రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో నాలుగున్నరేళ్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది వికలాంగులయ్యారు. ఈ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారడమే దీనికి కారణం. మేడికొండూరు భీమినేనివారిపాలెం వద్ద గత ఏడాది మే 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 27న సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇలా అనేక మంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలయ్యారు. ఈ రోడ్డు ప్రమాదాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో నిలదీసినప్పటికీ పాలకుల్లో చలనం రాలేదు. -
మూడేళ్లయినా ముందుకు సాగట్లే !
పర్యాటకులను అలరించే ప్రకృతి అందాలకు నిలయం కిన్నెరసాని. నెమళ్లు, దుప్పులు, బాతులు.. ఇలా పలు రకాల పక్షులు, వన్యప్రాణులతో పాటు రిజర్వాయర్‌లో బోటు షికారు చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే దీన్ని మరింత సుందరంగా తీర్చి దిద్దాలని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఆహ్లాదం పెంచాలని ప్రభుత్వం యోచించింది. ఇందుకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కూడా మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం పర్యాటకులకు శాపంగా మారింది. పాల్వంచరూరల్: కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు నిత్యం వందలాది మంది ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు, వివిధ రకాల పక్షులు వారిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. తదనుగుణంగా పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశాయి. కానీ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం అభివృద్ధికి ఆటంకంగా మారింది. మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇంకా పూర్తికాకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితమే కేటాయింపు.. కిన్నెరసాని పర్యాటక అభివృద్ధికి 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎకో టూరిజం అభివృద్ధి కింద రూ.7.53 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో కొత్తగూడెంలో టూరిజం హోటల్, కిన్నెరసానిలో అద్దాలమేడ, పది కాటేజీల పునర్నిర్మాణం, ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. పనులను దక్కించుకున్న హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ 9 కాటేజీలకు స్లాబ్‌లు వేశారు. రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న అద్దాల మేడకు ఇంకా స్లాబ్ వేయలేదు. ఈ పనులన్నీ గత మూడేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. నిర్దేశిత గడువు పూర్తయి కూడా ఏడాది దాటింది. ఇంకా ఎంత కాలానికి నిర్మాణ పనులు పూర్తిచేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గతంలో శిథిలమైన కాటేజీలు, అద్దాలమేడ స్థానంలో కొత్తగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఇవి ఎప్పుడు పూర్తవుతాయా అని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫుడ్‌కోర్టు సైతం అసంపూర్తిగానే మిగిలింది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.. గత ఏడాది రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌తోపాటు అప్పటి కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు కిన్నెరసానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అంసతృప్తి, ఆశ్చర్యానికి లోనయ్యారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అయితే ఆ ఆదేశాలను కాంట్రాక్టర్ పట్టించుకున్న పాపాన పోలేదు. 2018 డిసెంబర్ వస్తున్నా పనులు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆదేశిస్తే పనుల్లో వేగం పెంచకపోగా.. దీపావళి పండగ తర్వాత ఇప్పటివరకు పూర్తిగా నిలిపివేశారు. ఇక అద్దాలమేడ, తొమ్మిది కాటేజీలు, ఫుడ్‌కోర్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు నీళ్లొదిలి దొడ్డు ఇసుకను వినియోగిస్తున్నారని పర్యాటకులు అంటున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి గడువు విధించాం కిన్నెరసాని, కొత్తగూడెంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. కిన్నెరసానిలో అద్దాలమేడ రెండు అంతస్తుల భవనానికి స్లాబ్ నిర్మాణం చేయాల్సి ఉంది. పది కాటేజీలకు స్లాబ్‌ల నిర్మాణం పూర్తయింది. కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్ నిర్మాణం పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రెండోసారి విధించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – శంకర్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ -
# మీటూ : మరో వికెట్ ఔట్
న్యూఢిల్లీ: మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాండ్ కన్సల్టెంట్ సుహెల్ సేథ్ (55)కు భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో పలువురి గోముఖ వ్యాఘ్రాల బండారం బట్టబయలవుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దమనుషులపై సంబంధిత చర్యలకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం విశేషం. ఈ క్రమంలో టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్ చర్యలకు దిగింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సుహేల్ సేథీతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. టాటా గ్రూపులో ప్రధాన భాగామైన టాటా సన్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోసించిన సేథ్తో కలిసి పనిచేయమని తేల్చి చెప్పింది.నవంబర్ 30, 2018 నముగియనుంది కానీ, నెల రోజుల నోటీసుతో నెలముందే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టాటా సన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే ఆరోపణలు వెల్లువెత్తిన సమయం నుంచి టాటా సన్స్ కౌన్సెల్జీ అతనితో సంబంధాలను నిలిపివేసినట్టు చెప్పారు. కాగా ఇటీవల ఇండియాలో సోషల్ మీడియా ద్వారా మీడియా రంగంలో మీటూ ఉద్యమ ప్రకంపనలు క్రమంగా అన్ని రంగాల్లోని ‘పెద్దమనుషు’ల బండారం వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలోనే సుహేల్ సేథ్‌పై కూడా వరుస ఆరోపణల వెల్లువ కురిసింది. మోడల్,మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ డియాండ్రా సోర్స్, చిత్రనిర్మాత నటాషా రథోర్, జర్నలిస్టు మందాకిని గెహ్లాట్, రచయిత ఇరా త్రివేదిలతో సహా ఆరుగురు మీటూ పేరుతో సేథ్ పై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
కమీషన్ల ‘ఆధునికీకరణ’
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలకు మరో తార్కాణమిది. నాగావళి కాలువ లైనింగ్ పనుల్లో ఇద్దరు మంత్రులు కమీషన్ల వేట సాగిస్తున్నారు. తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టు సంస్థకే 4.29 శాతం అధిక ధరలకు(ఎక్సెస్)కు పనులు కట్టబెట్టేలా చక్రం తిప్పారు. కాంట్రాక్టర్ నుంచి చెరో రూ.25 కోట్లు కమీషన్లుగా ఇద్దరు మంత్రులు వసూలు చేసుకోనున్నారు. నాగావళి నదిపై 1907–08లో బ్రిటీష్ ప్రభుత్వం తోటపల్లి రెగ్యులేటర్‌ను నిర్మించింది. ఈ రెగ్యులేటర్ నుంచి కుడి కాలువను 37.626 కి.మీ.లు, ఎడమ కాలువను 20.016 కి.మీ.ల దూరం తవ్వారు. వీటి ద్వారా 1934లోనే 64,000 ఎకరాలకు నీళ్లందించారు. రూ.162.49 కోట్లతో ఈ కాలువలను ఆధునికీకరించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ వెంచర్లు(ఇద్దరు కాంట్రాక్టర్లు కలిసి సంస్థను ఏర్పాటుచేయడం) టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధన పెట్టారు. కానీ, ఏలేరు కాలువల ఆధునికీకరణ టెండర్లలో మాత్రం జాయింట్ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చని నిబంధన విధించడం గమనార్హం. జీవో 94 ప్రకారం టెండర్లు నిర్వహించాలంటూ జలవనరుల శాఖ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు తుంగలో తొక్కడానికి ప్రధాన కారణం కీలక మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిళ్లేనని సమాచారం. మాట వినకపోతే బ్లాక్‌లిస్టులో.. నాగావళి కాలువల ఆధునికీకరణ పనులకు అంచనాలు రూపొందించే సమయంలోనే అక్రమాలకు పాల్పడ్డారు. అంచనా వ్యయం పెంచేలా ఇద్దరు మంత్రులు చక్రం తిప్పారు. ఆ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. వారిని ‘బ్లాక్‌లిస్ట్’లో పెడతామని హెచ్చరించారు. దాంతో ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. అధికారులు ఆగస్టు 31న టెక్నికల్ బిడ్ తెరిచారు. కేవలం రెండు సంస్థలు(ష్యూ ఇన్ఫ్రా, సాయిలక్ష్మి)మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేశాయి. సాయిలక్ష్మి కంటే ‘ష్యూ ఇన్ఫ్రా’ తక్కువ ధర కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ష్యూ ఇన్ఫ్రాకు పనులు దక్కే అవకాశం ఉందని గ్రహించిన మంత్రులు.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆ సంస్థపై అధికారులు అనర్హత వేటు వేశారు. కానీ, గత నెలలో తెలుగుగంగ కాలువల ఆధునికీకరణ పనులకు రూ.239.03 కోట్లతో పిలిచిన టెండర్లలో ష్యూ ఇన్ఫ్రా అర్హత సాధించినట్లు ఇదే జలవనరుల శాఖ అధికారులు ప్రకటించడం గమనార్హం. సింగిల్ షెడ్యూల్‌కు పచ్చజెండా ఒక సంస్థపై అనర్హత వేటు వేయడంతో బరిలో మరో సంస్థ మాత్రమే మిగిలింది. సింగిల్ షెడ్యూల్ ఉంటే ఫైనాన్స్(ఆర్థిక) బిడ్‌తెరవకూడదు. సర్కార్ జారీ చేసిన జీవో 174 ప్రకారం.. ఆ టెండర్లను రద్దు చేసి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. కానీ, ఇద్దరు మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇటీవల ఆర్థిక బిడ్‌ను తెరిచారు. 4.29 శాతం అధిక ధరలకు షెడ్యూల్ దాఖలు చేసిన సాయిలక్ష్మి సంస్థకు నాగావళి కాలువ ఆధునికీకరణ పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపారు. సీవోటీ ఆమోదముద్ర వేయడమే తరువాయి.. పనులను సాయిలక్ష్మి సంస్థకు అప్పగించి, రూ.25 కోట్ల చొప్పున కమీషన్లు వసూలు చేసుకోవడానికి ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారు. 7న తమిళనాడుకు రెడ్ అలెర్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈనెల 7న తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ కేంద్రం రెడ్ అలñ ర్ట్ ప్రకటించింది. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఈ నెల 7న 25 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ గురువారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లంతా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని, సహాయక శిబిరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ కమిషనర్ సత్యగోపాల్ ఆదేశించారు. ఏసీబీ వలలో ఈవో విశాఖ క్రైం: దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవో పెదిరెడ్ల సత్యనారాయణ ఉద్యోగుల వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. దేవదాయ «ధర్మదాయ శాఖ ఉద్యోగులకు 2015 సంవత్సరానికి రావాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపుల కోసం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ కొంత సొమ్ము ముడుపుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు రికార్డు అసిస్టెంట్ గాలి వెంకటశివతో కలెక్షన్ చేయించి చివరకు రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. -
ఖాకీ కాంప్లెక్స్‌కు ‘కుచ్చుటోపీ’..!
సాక్షి, కడప అర్బన్ : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. అలాంటి పోలీసు శాఖ పర్యవేక్షణలో ఉన్న పోలీసు కాంప్లెక్స్ దుకాణాల నిర్వాహకులు కొందరు ఆ శాఖ ఆదాయానికి గండిపడేలా ప్రవర్తించి ఏకంగా వారికే ‘కుచ్చుటోపీ’ పెడుతున్నారు. ఈ వ్యవహారంపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జిల్లా పోలీసు యంత్రాంగం సంక్షేమం కోసం కడప నగరం నడిబొడ్డున పాతబస్టాండ్ సమీపంలో 14 సెంట్ల స్థలంలో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంతో అక్కడే ఉన్న పోలీస్ గెస్ట్‌హౌస్ నిర్వహణ, ఇతర ఖర్చులు, సంక్షేమం కోసం అప్పట్లో కడప ఒన్‌టౌన్ సీఐ పర్యవేక్షణలో వినియోగించేవారు. 2002కు ముందు ఈ దుకాణాల అద్దె నామమాత్రంగా ఉండేది. తర్వాత 2003లో 22 దుకాణాలకు గానూ టెండర్లను ఆహ్వానించి అద్దెలను దుకాణం విస్తరణ స్థలాన్ని బట్టి నిర్ణయించారు. తర్వాత ఇప్పటి వరకు టెండర్ల ఆహ్వానం లేకుండా అద్దెలను చెల్లిస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే స్థలంలో ఓ మూలన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను నిర్మించారు. ప్రస్తుతం ఈ గదుల నుంచి పోలీస్‌శాఖకు రూ.1.87 లక్షలు మాత్రమే నెలసరి ఆదాయం వస్తోంది. పేరుకే 22 దుకాణాలు.. ఉన్నవి ఇంకెన్నో.. పోలీసుశాఖ పాతబస్టాండ్‌లోని తమ కాంప్లెక్స్‌కు కేవలం 22 దుకాణాలను కేటాయించి, తద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నామమాత్రపు అద్దెకు ఇచ్చారు. కానీ ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతోందనుకుంటే పొరపాటే.. పోలీసు శాఖ నిర్ణయించిన అద్దెను చెల్లిస్తూనే మరికొంతమందికి అనధికారికంగా తమ దుకాణాల ముందు ప్రజలకు ఇబ్బందికరంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించారు. మరికొంతమంది ఇది పోలీసు కాంప్లెక్స్ అనే ధీమాతో ఇష్టానుసారంగా తాము ఉంటున్న దుకాణానికి ముందు స్థలాన్ని అక్రమిస్తున్నట్లు, ఈ వ్యవహారాన్ని కూడా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. పోలీస్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెల గడువు ఈనెలాఖరుకు ముగియనుంది. ఈ క్రమంలో పోలీసు కాంప్లెక్స్ అద్దె నిర్ణయ కమిటీ దుకాణాల కొలతలు చేపట్టారని, అయితే ఇదే దుకాణాల్లో పూల వ్యాపారం చేస్తున్న ఓ ప్రముఖుడు తాను అధికార పార్టీ నేతలతో మాట్లాడి టెండర్లు లేకుండానే చూస్తాననీ ధీమాగా ఇతరులకు చెబుతున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.పోలీసు అధికారులచేత కేవలం అద్దె పెంచేలా చూస్తామనీ ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.వేలల్లో వసూలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు దుకాణాల్లో అద్దెలకుంటున్న కొందరు అద్దెను చెల్లిస్తూనే, విద్యుత్ మీటర్లను తమ పేర్లతో తీసుకుని బిల్లులను కడుతున్నట్లు కూడా సమాచారం. 2003 నుంచి ప్రతి మూడేళ్లకోసారి టెండర్ల ద్వారా ఆశావహులను పిలిపించి అద్దెలను నిర్ణయిస్తే.. ఇప్పటికి నెలసరి అద్దె రూ.10–12 లక్షలు అవవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి ఆదాయ వనరుకు చక్కటి ఉదాహరణగా కడప నగరంలోని ఉమేష్‌చంద్ర కల్యాణ మండపానికి సంబంధించి అద్దెను పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు వివాహాది ఫంక్షన్ల కోసం నామమాత్రంగా కేటాయించారు. అయితే ఇదే కల్యాణ మండపానికి ఇతరులు శుభకార్యాల సమయంలో డెకరేషన్‌కు సంబంధించి కాంట్రాక్ట్‌ను గతంలో రూ.2 లక్షలు ఏడాదికి కేటాయించారు. ఇదే కాంట్రాక్ట్‌ను ఈ ఏడాది 2018 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఏడాదికి డెకరేషన్ కాంట్రాక్ట్‌ను రూ.30 లక్షలుగా నిర్ణయించారు. -
కాంట్రాక్టు ఉద్యోగినులకూ ప్రసూతి సెలవులు: సీఐసీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రసూతి ప్రయోజన చట్టం శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులందరికీ వర్తిస్తుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) పేర్కొంది. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌కు చెందిన కాంట్రాక్టు ఉద్యోగిని శ్వేతా పాఠక్ ప్రసూతి ప్రయోజన చట్టం ప్రకారం ప్రయోజనాలు తనకు వర్తిసాయోలేదో చెప్పాలని తన సంస్థను, అప్పిలేట్ అధికారిని సమాచార హక్కు చట్టం కింద కోరంగా వారు స్పందించలేదు. దీంతో ఆమె సీఐసీని ఆశ్రయించారు. ఈ చట్టం శాశ్వత ఉద్యోగులతోపాటు, తాత్కాలిక, కాంట్రాక్టు సిబ్బందికి కూడా వర్తిస్తుందని ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఆర్టీఐ దరఖాస్తుకు స్పందించకపోవడమే కాకుండా సీపీఐవో, ప్రథమ అప్పిలేట్ అథారిటీ ప్రసూతి ప్రయోజన చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. -
గూగుల్‌కు షాక్; రాజీనామాలతో ఉద్యోగుల నిరసన
న్యూయార్క్ : మంచి జీతం, అనువైన పనివేళలు, ఆకర్షణీయమైన వసతులు... మొత్తంగా చెప్పాలంటే ఇంట్లో ఉండే పనిచేస్తున్నామనే భావన. ఇంత మంచి వసతులతో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం ఎవరికి మాత్రం ఇష్టంగా ఉంటుంది. కానీ గూగుల్ ఉద్యోగులు మాత్రం ఈ సాహసం చేశారు. కారణం విలువలకు వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టం లేక. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి.. కంపెనీ కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టు కంపెనీ విలువలకు వ్యతిరేకంగా ఉందని భావించిన ఉద్యోగులు కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, తమ నిరసన వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ విభాగం డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ‘ప్రాజెక్ట్ మావేన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌లో డ్రోన్లు ఆకాశంలో విహరిస్తూ భూఉపరితలం ఫొటోలను తీయడమే కాక, ఆటోమెటిక్‌గా ఆ ఫొటోల్లో ఉన్న మనుషులను, వస్తువులను వేరు చేసి చూపించనున్నాయి. ఇందుకు అవసరమైన ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్‌ను అందించేందుకు మూడు నెలల క్రితం అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ, గూగుల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కంపెనీలో పనిచేసే చాలామంది ఉద్యోగులకు నచ్చలేదు. యంత్రాలకు మానవుని కంటే ఎక్కువ శక్తి ఇవ్వడం విలువలకు విరుద్ధం. అంతేకాక సైన్యానికి సంబంధించిన పనుల్లో పాలుపంచుకోవడం వల్ల కంపెనీ మీద ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుందని భావించి చాలామంది ఉద్యోగులు కంపెనీ సీయివో సుందర్ పిచాయ్‌కు తమ రాజీనామాలు అందచేసి, నిరసనను తెలుపుతున్నారని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. వీరితో పాటు కంపెనీలోని మరో 4వేల మంది ఉద్యోగులు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కాక తక్షణం ఈ ప్రాజెక్టును వెనక్కు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాక ఇక మీదట భవిష్యత్తులోనూ సైన్యానికి సంబంధించి ఎటువంటి ప్రాజెక్టులను చేపట్టవద్దనే నిబంధనను కూడా తీసుకురావాలని తెలిపారు. అయితే ఈ చర్యలేవి ఫలించలేదు, కంపెనీ ఉన్నాతాధికారులు తమ వైఖరిని మార్చుకోలేదు. పైగా ఈ నిరసనల మధ్యనే గూగుల్ పెంటగాన్ కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారిత డిఫెన్స్ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. -
గోధుమ మర కాంట్రాక్ట్‌లో గోల్మాల్!
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సరఫరా చేసే గోధుమలను మర ఆడి, గోధుమ పిండి (ఆటా)గా తయారుచేసి తిరిగి కార్పొరేషన్‌కు సరఫరా చేసే కాంట్రాక్ట్ కేటాయింపులో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. చినబాబు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రోలర్ ఫ్లోర్‌మిల్‌కు కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలను చివరి నిమిషంలో అధికారులు మార్చారు. కేవలం ఒక రోలర్ ఫ్లోర్‌మిల్‌కే కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలు మార్చడంపై ఇతర కాంట్రాక్టర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాత నిబంధనలివే.. పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెలా 1839.970 మెట్రిక్ టన్నుల గోధుమలు తీసుకుని వాటిని ఆటాగా మార్చి తిరిగి ఒక కిలో ప్యాకెట్లుగా తయారుచేసి, వాటిని 50 కిలోల సంచుల్లో నింపి రాష్ట్రంలోని పౌరసరఫరాల గోదాములకు సరఫరా చేయడం కోసం ఈ– టెండర్లు పిలిచారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను ఒకటో జోన్‌గాను, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను రెండో జోన్గానూ, కర్నూలు, అనంతపురం జిల్లాలను మూడో జోన్ కింద పెట్టారు. ఏ జోన్లో మిల్లర్లు ఆ జోన్లోనే టెండర్లు దాఖలు చేయాలి. టెండర్ల ప్రకారం రోజుకు 100 మెట్రిక్ టన్నుల గోధుమలు మరపట్టే సామర్థ్యం ఉండాలి. ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్ చేసి ఉండాలి. టెండర్‌ను సోమవారం (ఏప్రిల్ 23) సాయంత్రంలోగా దాఖలు చేయాలని, 24న టెండర్లు తెరిచి తక్కువ కొటేషన్ ఉన్నవారికి టెండర్లు ఇస్తామని పేర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రం టెండర్ నిబంధనలను మార్చుతూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం గత ఆర్థిక ఏడాదిలో 3వేల మెట్రిక్ టన్నుల ఆటాను ప్రభుత్వ సంస్థకు సరఫరా చేసి ఉండాలనే కొత్త నిబంధన విధించారు. కొత్త నిబంధనలకు అనుకూలంగా టెండర్‌ను ఈ నెల 26 వరకు దాఖలు చేయొచ్చని, 27న టెండర్లు వేలం నిర్వహిస్తామని ప్రకటించారు. చినబాబు సన్నిహితుడికి కట్టబెట్టేందుకే.. చినబాబు సహకారంతో చిత్తూరులోని జయరామ్ చౌదరికి చెందిన సుద్దలగుంట ఫ్లోర్‌మిల్ గతేడాది ఆటా సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రన్న కానుకతో సహా నెలవారీ ఇచ్చే ఆటా టెండర్లూ ఆ మిల్కే దక్కాయి. కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది కూడా అదే మిల్కు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ టెండర్ విలువ రూ.35 కోట్ల వరకు ఉంటుందని, కనీసం 2 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రాయలసీమనే కాకుండా రాష్ట్రమంతా ఈ మిల్కే వచ్చినా ఆశ్చర్యం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాగా సుద్దలగుంట ఫ్లోర్‌మిల్‌పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ మిల్ సరఫరా చేసే గోధుమపిండిలో నాణ్యత లేదనే విమర్శలున్నాయి. -
తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత..
న్యూఢిల్లీ : సరిహద్దులో కాపలా కాసే సైనికుల కోసం భారత ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. బుల్లెట్‌ఫ్రూఫ్ జాకెట్లను సైనికులకు అందించాలన్న ప్రభుత్వం ఆశ తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత నెరవేరబోతుంది. ఈ మేరకు ‘మేకిన్ ఇండియా’ లో భాగంగా ప్రభుత్వం ఎస్ఎంపీపీ అనే ఢిల్లీకి చెందిన ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ.639 కోట్లు. మొత్తం బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను మూడు సంవత్సరాల్లో సైనికులకు అందేలా ఒప్పందం కుదిరిందని కంపెనీ తెలిపింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అన్ని రకాల బుల్లెట్లను తట్టుకునేలా తయారు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. బోరాన్ కార్బైడ్ సెరామిక్ మెటీరియల్‌తో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ తయారు చేయడం వల్ల తేలికగా ఉంటుందని అలాగే బాలిస్టిక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒప్పందంలో భాగంగా 1.86 లక్షలకు పైగా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కంపెనీ ఆర్మీకి అందించనుంది. కొత్త బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లలో మాడ్యులర్ భాగాలు ఉంటాయని, దీని వల్ల మరింత భద్రత లభిస్తుందని, వివిధ పరిస్థితుల్లో సైనికులకు కూడా ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. లేటెస్ట్ హార్డ్ స్టీల్ కోర్ బుల్లెట్లను కూడా తట్టుకునేలా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2009లో 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న భారత ఆర్మీ ప్రతిపాదనకు అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ ఆర్మీ నిర్వహించిన ట్రయల్ టెస్టుల్లో బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు తయారు చేసే కంపెనీలు ఆ స్థితికి చేరుకోలేకపోయాయి. బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ల అందిస్తామని ముందుకు వచ్చిన నాలుగు కంపెనీల్లో ఒక్క కంపెనీ మాత్రమే మొదటి రౌండ్లో పాసైంది. ఆ కంపెనీ కూడా రెండో రౌండ్లో ఫెయిల్ కావడంతో ఆ విషయం అప్పటి నుంచి మరుగున పడిపోయింది. 2016, మార్చిలో ఆర్మీ సుమారు 50 వేల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను కొనుగోలు చేసింది. ఇవి కూడా అనుకున్న స్టాండర్డ్స్‌ను అందుకోలేకపోయాయి. ప్రస్తుత భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఒప్పందంలో భాగంగా రానున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో భారత సైనికుల విశ్వాసం పెరగడంతో పాటు, భద్రతా దళాలకు నైతిక ప్రాబల్యాన్ని అందిస్తుందనడంతో సందేహం లేదు. -
సస్పెన్స్ కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ కుదిరింది. కానీ.. ఎవరు? ఎవరితో? దేనికోసం? కాంట్రాక్ట్ కదుర్చుకున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. అర్జున్ హీరోగా సంజయ్ గొడావత్ సమర్పణలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ఎస్ సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు్తన్న చిత్రం ‘కాంట్రాక్ట్’. కన్నడ నటి రాధికా కుమారస్వామి కథానాయిక. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నటుడు జేడీ చక్రవర్తి విలన్ పాత్రధారి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ ఈ సినిమాతో సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ తొలివారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక–నిర్మాత సమీర్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అర్జున్ మల్టీ మిలియనీర్ పాత్రలో నటిస్తున్నారు. టాకీపార్ట్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తి అయింది. ఓ పాటను మహారాష్ట్రలో, రెండు పాటలను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్. కెమెరా: అమీర్లాల్. -
వేతనాల్లేవ్..ఇక ఏడుపే
పాల్వంచ: జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా ప్రతి నెలా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు 86 ఉండగా వాటిలో 450 మంది కార్మికులు (స్వీపర్లు, కుక్‌లు, వాచ్మెన్లు, హెల్పర్లు, స్కావెంజర్లు) పనిచేస్తున్నారు. వీరికి రావాల్సిన వేతనాలు రూ.60 లక్షల మేర పేరుకు పోయాయి. అంతేగాక 2016లో వేసవి శిబిరాల సమయంలో పనిచేసిన వేతనాలు కూడా ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో పనిచేసిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈఎల్స్(సంపాదిత సెలవులు) ఇచ్చారు. సీఆర్టీలకు కూడా వేతనాలు అందించారు. వారితో పాటు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇంత వరకూ అతీగతీ లేదు. వేతనాలు అందించాలని ప్రపోజల్స్ పంపి నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. వెట్టి కష్టాలు ఇంకెన్నాళ్లో.. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ, మున్సిపాలిటీల పరిధిలో గల ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులందరిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రెండు, మూడు దశాబ్దాలకు పైగా ఐటీడీఏ పరిధిలోనే పనిచేసున్న వారు అనేక మంది ఉన్నారు. వీరిని పర్మనెంట్ చేయాలని కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. మరోవైపు జీతాలు కూడా సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెరిగిన పనిభారం.. హాస్టళ్లు, పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగింది. గతంలో ఉన్న మెనూకు, ప్రస్తుత మెనూకు చాలా తేడా ఉంది. విద్యార్థులకు ఉదయం రకరకాల టిఫిన్లు, భోజనం, వెజ్, నాన్ వెజ్ వంటలు పెడుతున్నారు. పాఠశాలల్లో తరగతి, వసతి గదులు కూడా పెరిగాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలి. ఇలా పనిభారం నానాటికీ పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగడం లేదు. సెలవులు వస్తే జీతాల్లో కోత విధిస్తున్నారని, ఆరోగ్యం సరిగా లేక సెలవులు తీసుకున్నా వేతనాలు తగ్గించి ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ సీహెచ్.రామ్మూర్తిని వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులో లేరు. జీతాలు సకాలంలో రావడం లేదు. జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మావి. ప్రతి నెలా జీతాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఐదారు నెలలకు కూడా ఇవ్వక పోతే కుటుంబాల పోషణ ఇబ్బందిగా ఉంది. – కాంతమ్మ, హెల్పర్ పనిభారం పెరిగింది గతం కంటే ఆశ్రమ హాస్టళ్లలో పనిభారం పెరిగింది. ఇప్పుడు మెనూ కూడా పెంచారు. అయినా కష్టపడి విద్యార్థులకు సమయానికి వండి పెడుతున్నాం. పనిభారం ఎక్కువైనా వేతనాలైతే పెరగలేదు. ఇన్ని నెలల పాటు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. – రాంబాయి, హెల్పర్ పర్మనెంట్ కాక ఇబ్బందులు రెండు, మూడు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి కూడా పనిభద్రత కరువైంది. ఐటీడీఏను నమ్ముకుని పనిచేస్తున్న మాకు పర్మనెంట్ చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. కష్టానికి తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సరోజిని, హెల్పర్ -
వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ నేతల మధ్య తగువు
-
టీసీఎస్‌కు మరో భారీ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో భారీ డీల్‌ను చేజిక్కించుకుంది. యూకే, యూరోప్‌ల్లో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ వ్యాపారాన్ని నిర్వహించే ప్రుడెన్షియల్ పీఎల్‌సీకి చెందిన ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ నుంచి డీల్‌ను సాధించామని టీసీఎస్ తెలిపింది. ఈ డీల్ విలువ 69 కోట్ల డాలర్లని (50 కోట్ల పౌండ్లు––సుమారుగా రూ.4,400 కోట్లు) వివరించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ వ్యాపారాన్ని డిజిటలైజ్ చేస్తామని, ఆ కంపెనీకి ఐటీ సేవలను పదేళ్లపాటు అందిస్తామని పేర్కొంది. గత పదేళ్లుగా తమ సంస్థకు చెందిన 40 లక్షల మంది క్లయింట్ల జీవిత, పెన్షన్ కాంట్రాక్ట్‌లను నిర్వహిస్తున్న క్యాపిటా సంస్థను తొలగించి ఈ కాంట్రాక్ట్‌ను టీసీఎస్ డిలిజెంటాకు అప్పగించామని ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ తెలిపింది. ఇటీవల కాలంలో టీసీఎస్ భారీ డీల్స్‌ను సాధిస్తోంది. అమెరికా బీమా సంస్థ, ట్రాన్సమెరికా నుంచి 200 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్‌తో పాటు టెలివిజన్ రేటింగ్‌ల సంస్థ నీల్సన్, బ్రిటిష్ రిటైలర్ మార్క్స్ అండ్ స్పెన్సర్ల నుంచి కూడా భారీ డీల్స్‌ను సాధించింది. తాజా డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 4 శాతం లాభపడి రూ.2,855 వద్ద ముగిసింది. -
క్రికెటర్‌కు షాక్: జాతీయ కాంట్రాక్ట్ రద్దు.. భారీ జరిమానా!
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ షబ్బీర్ రెహ్మాన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ సంఘం (బీసీబీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా షబ్బీర్ తో జాతీయ జట్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలపాటు దేశవాలీ క్రికెట్ ఆడకుండా వేటు వేయడంతో పాటుగా 20 లక్షల టాకాల (బంగ్లా కరెన్సీ) జరిమానా విధించింది బీసీబీ. ఇటీవల అభిమానిపై దాడి చేసిన ఘటనలో షబ్బీర్ రెహ్మాన్ తీవ్ర విమర్శల పాలైన విషయం తెలిసిందే. మరోసారి క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనలకు పాల్పడితే శాశ్వతంగా నిషేధం విధించేందుకు సిద్ధమని బోర్డు ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. గత డిసెంబర్ 21న రాజ్‌షాహిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ పన్నెండేళ్ల బాలుడిపై క్రికెటర్ షబ్బీర్ చేయి చేసుకున్నాడు. మరోవైపు మ్యాచ్ రిఫరీతోనూ అతడు ఇష్టానుసారంగా ప్రవర్తించడంపైనా బోర్డు అతడిని మందలించింది. 2016లో బంగ్లా ప్రీమియర్ లీగ్ సమయంలో డ్రెస్సింగ్ రూముకు మహిళను తీసుకురావడంతో బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. జరిమానాతో పాటు కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నా అతడి వైఖరిలో మార్పురాలేదని బంగ్లా క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున షబ్బీర్ రెహ్మాన్ 10 టెస్టులు, 46 వన్డేలు, 33 ట్వంటీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. -
ఫీజులు పెరుగుతాయ్!
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు శుభవార్త! ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఫీజులు త్వరలో పెరుగనున్నాయి. వార్షిక కాంట్రాక్టు చెల్లింపులు పెంచేందుకు కొత్త పరిపాలక కమిటీ (సీఓఏ), భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సానుకూలంగా స్పందించాయి. టీమిండియా సారథి విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ధోని, కోచ్ రవిశాస్త్రిలు క్రికెట్ వర్గాలతో గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. ఇందులో సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి పాల్గొన్నారు. ‘ఆటగాళ్లతో విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఇందులో ఆడాల్సిన మ్యాచ్‌ల సంఖ్య, భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ), వేతన భత్యాలపై కూలంకషంగా చర్చించాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కెప్టెన్, కోచ్‌లు త్వరలోనే మాకు అందజేయగానే తుది నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్లకు ఆటే కాదు... విశ్రాంతి కూడా అవసరమే’ అని వినోద్ రాయ్ అన్నారు. ఎంత పెరిగేది కచ్చితంగా చెప్పనప్పటికీ పెంపు మాత్రం అనివార్యమని ఆయన పేర్కొన్నారు. ఆడుతున్న మ్యాచ్‌లకు, చెల్లిస్తున్న పారితోషికాలకు మధ్య ఆర్థిక సమతౌల్యం తెస్తామని చెప్పారు. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్ ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులో భాగంగా రూ. 2 కోట్లు.. బి, సి గ్రేడ్ ఆటగాళ్లకు వరుసగా రూ. కోటి, రూ. 50 లక్షలు చెల్లిస్తున్నారు. టెస్టులాడే తుది జట్టు సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20లకైతే రూ.3 లక్షల చొప్పున ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుగా ఇస్తున్నారు. తుది జట్టులో లేని ఆటగాళ్లకు అందులో సగం మొత్తాన్ని ఇస్తారు. దీనిపై ఈ నెల 11న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్)లో తుది నిర్ణయం వెలువడనుంది. -
వారిది దుర్భర జీవితం
♦ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటాం ♦ ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు విజయనగరం గంట స్తంభం : కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు పోరాడుతారని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. ఆదివారం విజయనగరం ఏపీ ఎన్జీఓ సంఘం భవనంలో జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ భాగమన్నారు. 2001లో ఈ వ్యవస్థ ప్రారంభం అయినప్పటి నుంచి వారు బానిసలుగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ప్రసూతి సెలవులు కూడా దక్కడం లేదని తెలిపారు. ఏడాదిలో పదిన్నర నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో 28 వేల మంది కాంట్రాక్ట్, 55 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. వారి పక్షాన ఏపీ ఎన్జీఓల సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వివరించారు. అందుకే ఇక్కడ పోరాటానికి కార్యాచరణ కోసం సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు కూడా సామాజిక బాధ్యతగా ఈ పోరాటంలో పాల్గొనాల్సిందిగా సూచించారు. కొంతమందికే పరిమితమైన పెంపు.. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం వేతనాలు పెంచినప్పటికీ అది కొంతమందికే పరిమితమైనట్లు తెలిపారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సమానపనికి సమానవేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి వర్గ ఉపసంఘం దీనిపై తొందరలోనే చర్చించనుందని, వారి దృష్టికి సమస్య తీసుకెళ్తామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సి ంగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిందని, ఇప్పుడు హామీని అమలు చేయాలన్నారు. న్యాయ పరమైన సమస్య ఉంటే ముందుగా వారి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో అంతా కలిసి ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి.రమణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జరిగే పోరాటంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు ప్రభూజీ మాట్లాడుతూ జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి ఏపీ ఎన్జీఓల సంఘం అండగా ఉంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్వి.రమణమూర్తి, విజయనగరం తాలూకా సంఘం అధ్యక్షుడు సురేష్‌కుమార్, ఇతర సంఘం నాయకులు, ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎల్ అండ్ టీకి భారీ ఆర్డర్
ముంబై: ఇంజనీరింగ్ మేజర్ లార్సన్ అండ్ టర్బో భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. విదేశీ ప్రభుత్వంనుంచి వేలకోట్ల విలువైన ప్రాజెక్టును సాధించింది. మారిషస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెట్రోఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ నుంచి ఈ భారీ ఆఫర్ కొట్టేసింది. రైలు ఆధారిత పట్టణ రవాణా వ్యవస్థ రూపకల్పన,మరియు నిర్మాణానికిగాను రూ. 3,375 కోట్ల రూపాయల కాంట్రాక్టును గెలుచుకుంది. ఇది తమకు చాలా కీలకమైన ఆర్డర్‌ని ఎల్ అండ్ టీ బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది. ఆఫ్రికన్ ద్వీప దేశంలో సమీకృత లైట్ రైలు ఆధారిత రవాణా వ్యవస్థకు ప్రధాన పురోగతి ఈ ఒప్పందమని పేర్కొంది. 26 కిలోమీటర్ల మార్గం క్యూరీపైప్ తో పోర్ట్ లూయిస్‌లోని ఇమ్మిగ్రేషన్ స్క్వేర్ కు అనుసంధానిస్తుందని, 19 స్టేషన్లను కలిగి ఉంటుందని తెలిపింది. మారిషస్ ప్రధాన మంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ సమక్షంలో జూలై 31 న ఒప్పందంపై సంతకాలు జరిగాయని కంపెనీ తెలిపింది. తమ నైపుణ్యంపై విశ్వాసం ఉంచిన మారిషస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఈ కొత్త లైట్సిస్టం ద్వారా రూటు అభివృద్ధితోపాటు పరిపుష్టమైన ఆర్థిక లాభాలను గణనీయంగా ఆర్జించనుందని ఎల్ అండ్ ఎండీ, సీఈవో ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ తెలిపారు. -
పని బారెడు..జీతం మూరెడు
ఎస్ఎస్ఏలో కాంట్రాక్ట్ సిబ్బంది ఆవేదన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ కొత్తపేట : విద్యాభివృద్ధి, ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ ఫలితాలే లక్ష్యమంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులు ఆచరణలో మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. విద్యాశాఖలో సర్వ శిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ)లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల పనితో పోలిస్తే ఎక్కువ పనిచేస్తున్నా తగిన ఫలితం మాత్రం పొందలేకపోతున్నారు. తమకు ఉద్యోగ భద్రత ,సమాన పనికి సమాన వేతనం, మహిళలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఏమాత్రం కరుణించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. జిల్లాలో ఎస్ఎస్ఏ ద్వారా 1,175 మంది పని చేస్తుండగా వారిలో 287 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ), 64 మంది చొప్పున కంప్యూటర్ ఆపరేటర్స్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, ఎంఆర్సీ అసిస్టెంట్స్, పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు 696 మంది ఉన్నారు. చాలిచాలని వేతనాలు 2011లో అప్పటి ప్రభుత్వం జిల్లా కమిటీ ఇంటర్వూలు ద్వారా గ్రాడ్యుయేట్‌తో బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారిని రూ.5,500 వేతనంతో నియమించింది. 2013,14 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రూ.1,500 చొప్పున పెంచింది. ప్రస్తుతం రూ.8,500 జీతంతో తీవ్ర కష్టాల నడుమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు 2004లో అప్పటి ప్రభుత్వం రూ.1,500 వేతనంతో నియమించింది.తరువాత 2007 నుంచి 2014 వరకూ 5 దఫాలుగా రూ.8,500 పెంచాయి.ప్రస్తుతం రూ 10,000 జీతంతో పనిచేస్తున్నారు. 2012 లో అప్పటి ప్రభుత్వం ఎంఐఎస్ కోర్డినేటర్స్ను రూ.8,500 వేతనంతో నియమించింది. 2013,14ల్లో రూ.3,500 పెంచింది.ప్రస్తుతం రూ.12 వేలు జీతానికి పనిచేస్తున్నారు. 2005లో చేరిన ఎంఆర్సీ అసిస్టెంట్లు ప్రస్తుతం రూ.7,500కు పని చేస్తున్నారు. రూ 6 వేలతో ఎలా బతికేదెలా? 2012–13 సంవత్సరంలో ఎస్ఎస్ఏ లో పార్టటైం ఇన్స్ట్రక్టర్లు (డ్రాయింగ్,క్రాప్టు, పీఈటీలు)గా జిల్లాలో సుమారు 696 మంది నియమితులయ్యారు. మొదట వారికి రూ.4,500 గౌరవ వేతనంగా చెల్లించారు.2014–15 లో రూ.6 వేలకు పెంచారు. గతంలో పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లను విద్యా సంవత్సరం నిర్వహించిన విధులకు సంబంధించి వేతనాలు చెల్లించగా ఈ ఏడాది మే 3 నుంచే విధుల్లోకి తీసుకోవాలని ఆర్సీ నెంబరు 1707/ఏపీ ఎస్ఎస్ఏ/ఏ9-2017 ప్రకారం స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) మే 3న జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జిల్లాలో అధికారులు లేనిపోని సాకులు చూపుతూ అమలు చేయలేదని వారు వాపోయారు. కేవలం తమ టీచింగ్ విధులే కాక అదనంగా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తమను ఉపయోగించుకుంటున్నారని, తాజాగా విద్యార్థి గణన కార్యక్రమంలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పీఏబీ ప్రతిపాదిత జీతాలేవి? ఎస్ఎస్ఏ కు సంబంధించిన ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) ప్రతిపాదించిన రూ.20,755 చొప్పున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ మిగిలిన నిధులను వేరే పథకాలకు మళ్లిస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగుల పొట్టకొడుతోందని వాపోతున్నారు. ఆర్పీ, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కోర్డినేటర్లు, ఎంఆర్సీ అసిస్టెంట్లకు మే నుంచి, పీటీఐలకు కూడా ఎస్పీడీ ఉత్తర్వుల ప్రకారం 2 నెలలుగా జీతాలు విడుదల కావడం లేదు. ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేస్తామని మరచిపోయారని విమర్శిస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 7న ఔట్సోర్సింగ్ సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయలేదు సరికదా టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి పెంచలేదు. ఈ మూడేళ్లలో సుమారు 100 మెమోరాండాలు ఇచ్చాం. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. అరకొర జీతాలతో కుటంబాల పోషణ చాలా ఇబ్బందిగా ఉంది. -ఎం శ్రీనివాసరావు,ప్రెసిడెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్, అల్లవరం -
శిల్పా వర్సెస్ మాండ్ర
- పనుల కోసం టీడీపీ నాయకుల కుమ్ములాట - టెండర్లువేసి పనులను చేస్తున్న శిల్పా వర్గీయులు - అడ్డుకున్న మాండ్ర వర్గీయుల - డీఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసిన పోతిరెడ్డిపాడు డీఈ రమేష్‌బాపూజీ పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): కాంట్రాక్ట్ పనుల విషయంలో టీడీపీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పా చక్రపాణి రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. తమ అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారని మాండ్ర వర్గీయలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా వర్గీయులు..పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రూ.6.55కోట్ల పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అప్రోచ్ కాల్వ ఆధునికీకరణ పనులకు టెండర్లు వేసి శిల్పా వర్గీయులు 26శాతం లెస్‌కు దక్కించుకున్నారు. పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లకు మాండ్ర వర్గీయులు ఫోన్‌చేసి తమ అనుమతిలేకుండా మీరెలా పనులు చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయమై.. మాండ్ర తాను చెప్పిన తరిగోపుల, తాటిపాడు గ్రామాలకు చెందిన నాయకులకు తలా రూ.2కోట్ల పనులను అప్పగించాలని డిమాండ్ చేశారు. అందుకు పనులు దక్కించుకున్న వారు అంగీకరించకపోవటంతో వాటిని నిలుపుదలచేయించాలని మాండ్ర తన అనుచరులను పురమాయించారు. దీంతో పగిడ్యాలకు చెందిన పలుచాని మహేశ్వరరెడ్డి, జయసూర్యలతో పాటు మరికొంత మంది వచ్చి పనులను నిలిపివేయించారు. దీంతో కాంట్రాక్టర్ జరిగిన విషయాన్ని నందికొట్కూరు సీఐ వెంకరటమణకు తెలియజేయటంతో ఆయన పట్టించుకోలేదు. దీంతో పోతిరెడ్డిపాడు డీఈ రమేష్ బాపూజీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన పనులను అడ్డుకున్న వారిపై ఆత్మకూరు డీఎస్పీ సుప్రజకుఫిర్యాదు చేశారు. సంఘటన సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని ఆత్మకూరు సీఐ కృష్ణయ్యయాదవ్‌ను డీఎస్పీ ఆదేశించారు. రెండోపర్యాయంగా సాయంత్రం సుమారు 20 మంది వ్యక్తులు ట్రాక్టర్లో వచ్చి పనులను అడ్డుకున్నారు. దీంతో విషయాన్ని కాంట్రాక్టర్ నేరుగా జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణకు వివరించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు సీఐ, నందికొట్కూరు సీఐ వారి సిబ్బందితో పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని అడ్డుకుంటున్న వారిని మందిలించి పంపించారు. డీఎస్పీకి పిర్యాదు చేశాం: రమేష్‌బాపూజీ, డీఈ పోతిరెడ్డిపాడు పనులను అడ్డుకున్న వారిపై డీఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసిన మాటవాస్తవమే. ప్రభుత్వం తలపెట్టిన పనులను అడ్డుకోవటం చట్ట రీత్యానేరం రెండునెలల్లో పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఆదిలోనే పనులను అడ్డుకుంటే పనులు మందగించే అవకాశం ఉంది. -
ఏటా అదే తంతు..
వేసవిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉచిత సేవలు జిల్లాలో 348 మందికి తప్పని అవస్థలు నెరవేరని ప్రభుత్వ హామీ కాంట్రాక్టు అధ్యాపకులు.. విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున వారిని విధుల నుంచి తొలగిస్తారు. అలాగని వేసవి సెలవుల్లో వారిని ఖాళీగా కూర్చోనివ్వరు. ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. సెలవుల్లో వీరితో పనులు చేయించుకున్నారే తప్ప వారికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వం.. వీరి విషయంలో మాత్రం చిన్న చూపు చూస్తోంది. ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి ఇదీ. రాయవరం (మండపేట) : జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 348 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కాగానే ఈ ఏడాది మార్చి 28 నుంచి వారిని విధుల నుంచి తొలగించారు. తిరిగి జూన్‌లో రెన్యువల్ చేస్తామంటూ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల నుంచి తొలగించినప్పటికీ పనుల నుంచి మాత్రం తొలగించలేదు. ఏప్రిల్ 7వ తేదీ వరకు వారు ఇంటర్మీడియేట్ మూల్యాంకన విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత విద్యార్థులను కళాశాలల్లో చేర్పించేందుకు క్యాంపైన్లలో నిమగ్నమయ్యారు. కళాశాలలో తగిన విద్యార్థుల సంఖ్య లేకుంటే పోస్టులు ఉండవన్న బెదిరింపుల నేపథ్యంలో, విద్యార్థులను చేర్పించేందుకు వారు కళాశాలల పరిధిలోని గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంటర్మీడియేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను జూన్ 15 నుంచి నిర్వహించే సప్లమెంటరీ పరీక్షలకు వీరే సిద్ధం చేయాలి. ఉత్తీర్ణతా శాతం పెంపుదలకు, సప్లమెంటరీ పరీక్షలకు ఇన్విజిలేటర్ విధులు కూడా వారే నిర్వర్తించాలి. విధుల నుంచి తొలగించిన తర్వాత రెండు నెలలుగా ఇన్ని పనులు చేయించుకుంటున్నారు. ఈ పనులు చేసినందుకు వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. హామీలేమయ్యాయి? కనీస వేతనాలు చెల్లించాలంటూ గతేడాది డిసెంబర్ రెండు నుంచి జనవరి 4వ తేదీ వరకు 32 రోజుల పాటు కాంట్రాక్టు అధ్యాకులు ధర్నాలు, దీక్షలు చేపట్టారు. బెదిరింపులకు దిగినా దీక్షలు విరమించకపోవడంతో చేసేదీమీ లేక కనీస వేతనం, డీఏ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా ఆ హామీ నెరవేర్చలేదు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించినా.. జీఓ మాత్రం విడుదల కాలేదు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. తెలంగాణలో కాంట్రాక్టు అధ్యాపకులకు కనీస వేతనం అమలు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫైల్‌పై అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేయడంతో ఆ రాష్ట్ర అధ్యాపకులు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఇప్పటికే ఒకసారి రూ.18 వేల నుంచి రూ.26 వేలకు వేతనాలను పెంచారు. తిరిగి కనీస వేతనం రూ.37,100 చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మన రాష్ట్రంలో మాత్రం అటువంటి చర్యలు లేకపోవడంతో ఇక్కడి కాంట్రాక్టు అధ్యాపకుల్లో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటున్నాయి. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మోసగిస్తోందని కాంట్రాక్టు అధ్యాపకులు మండిపడుతున్నారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నాం.. కాంట్రాక్టు అధ్యాపకులుగా 17 ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనానికి నోచుకోలేక పోతున్నాం. ఉద్యోగ భద్రత లేదు. అరకొర వేతనాలతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న చెబుతున్న ప్రభుత్వం మా విషయంలో అమలు చేయకపోవడం దారుణం. – పందిరి సాంబశివమూర్తి, 475 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మండపేట జీఓ విడుదల చేయాలి.. వేతనాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం జనవరిలో ఇచ్చిన హామీ మేరకు జీఓ విడుదల చేయాలి. పక్క రాష్ట్రంలో జీతాలు పెంచుతున్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెలవుల్లో విధుల్లో ఉన్నప్పటికీ రెండు నెలలుగా వేతనాలు లేక కాంట్రాక్టు అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. – యార్లగడ్డ రాజాచౌదరి, 461 కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, కాకినాడ -
2,101 కాంట్రాక్టు వైద్య పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా వైద్య పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాల ని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో 2,101 వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్లు తదితర పోస్టులను భర్తీ చేయ నుంది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వు లు విడుదల కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారం భం కానుందని చెబుతున్నారు. ఉత్తర్వులతో పాటు మార్గదర్శకాలను విడుదల చేయను న్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. 2,118 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో ఆమోదం తెలిపి వాటిని భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఆదేశించింది. కానీ నెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ నోటిఫి కేషన్ జారీ చేయకపోవడంతో అందులోని 2,101 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. టీఎస్పీ ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ పోస్టులను నేరుగా భర్తీ చేశాక కాంట్రాక్టు పోస్టులను రద్దు చేస్తారు. కాంట్రాక్టు పద్ధతిన నియమితుల య్యే వారే రెగ్యులర్ పోస్టుల్లోకి వచ్చే అవకాశ మున్నందున ఆ అభ్యర్థులకు ఎలాం టి నష్టం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొత్త పథకాల నేపథ్యంలోనే... సీఎం కేసీఆర్ కలల పథకం అమ్మ ఒడి. దాని ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయిం చుకునే గర్భిణులకు రూ. 12 వేల ప్రోత్సా హకం ఇవ్వాలని నిర్ణయించారు. బాలింతలు, నవజాత శిశువుల కోసం కేసీఆర్ కిట్లు ఇవ్వ నున్నారు. ఇప్పటికే 4 లక్షల కేసీఆర్ కిట్లకు టెండర్లు పిలిచారు. ఇంత చేస్తున్నా గర్భిణు లు ఏ మేరకు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తార న్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖను వేధిస్తోం ది. మౌలిక వసతులు లేకపోవడం, సరిపడా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవ డంతో గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారా రారా అనే అనుమానాలున్నాయి. ఇలాగైతే అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాలు ఫెయిల్ అవుతాయన్న భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కా లంటే తక్షణమే పోస్టుల భర్తీ చేయాలని ఆ శాఖ వర్గాలు భావించాయి. అందుకే టీఎస్పీ ఎస్సీ ద్వారా భర్తీ చేసే వరకు ఆగకుండా ఆగ మేఘాల మీద కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులన్నింటి లోనూ అవసరమైన చోట కాంట్రాక్టు సిబ్బందిని తీసుకుంటారు. మరోవైపు అమ్మ ఒడి పథకాన్ని వచ్చే నెలలో ప్రారంభిం చనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్పీ సింగ్ సోమవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ నున్నారు. -
ఉసూరుమనిపిస్తున్న ఉద్యోగం
వైద్యశాఖలో కాంట్రాక్టు కొలువు ఏడు నెలలుగా జీతాలు అందని వైనం విధులు మానేస్తామంటున్న సిబ్బంది నిరుద్యోగులకు ఉపాధి అందనిపండే అవుతోంది. ఏదో అదృష్టం కొద్దీ కాంట్రాక్టు ఉద్యోగమైనా దొరికిందనుకుంటే జీతభత్యాల్లేని వెట్టి చాకిరీ కావడంతో వారిలో నిరాశ అలుముకుంది. వైద్యశాఖలో 14 పోస్టులను తొమ్మిది నెలల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేశారు. అయితే వారికి ఏడు నెలలుగా జీతాల్లేవు. వారికి జీతాలెవరు ఇచ్చేదీ తేలకుండానే వారి గడువు మరో రెండు నెలల్లో ముగుస్తుండడం విశేషం. చింతూరు: అదిగో ఉద్యోగం.. వేలల్లో జీతం.. అంటూ కళ్లముందు రంగుల ప్రపంచాన్ని చూపుతూ గిరిజన నిరుద్యోగులను ఊహాల్లోకాల్లో విహరింపజేశారు. వాస్తవంలోకి వచ్చేసరికి ఆ రంగుల కల కరిగిపోయింది. తొమ్మిది నెలల కాంట్రాక్టు పద్ధతిపై వైద్యశాఖ విధుల్లో చేరిన వారికి ఏడు నెలలుగా జీతాలు రావడం లేదు. మరో రెండు నెలల్లో వారి గడువు ముగుస్తుండడంతో ఏం చేయాలో వారికి దిక్కుతోచడం లేదు. ఐటీడీఏ, వికాస ద్వారా భర్తీ విలీన మండలాల్లోని నిరుద్యోగుల కోసం గతేడాది సెప్టెంబర్‌లో రంపచోడవరం ఐటీడీఏ, వికాస సంస్థ ద్వారా వైద్యశాఖలో 14 పోస్టులను భర్తీ చేశారు. చింతూరు, కూనవరం, ఏడుగురాళ్లపల్లి, నెల్లిపాక, గౌరిదేవిపేట పీహెచ్‌సీల్లో ఎంఎన్‌వో, ఎఫ్ఎన్వో, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, కుక్, స్వీపర్ పోస్టులకు వారిని ఎంపిక చేశారు. ఒక్కొక్కరికీ రూ. 12 వేల జీతం ఇస్తామని తొమ్మిది నెలలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో విధుల్లో చేరిన ఈ 14 మందికి ఈ ఏడాది జూన్‌తో కాలపరిమితి ముగుస్తోంది. ఏడు నెలలుగా జీతాల్లేవు తాము విధుల్లో చేరి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంతవరకు ఒక్కనెల జీతం కూడా అందుకోలేదని, తమవి వెట్టిచాకిరి బతుకులే అయ్యాయని ఆ కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. తమకు జీతాలు చెల్లించాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రంపచోడవరం, చింతూరు పీవోలు, ఆర్డీవో, డీఎం అండ్ హెచ్‌వో, అడిషనల్ డీఎం అండ్ హెచ్వోలను కలసి మొరపెట్టుకున్నామని వారు తెలిపారు. ఏ అధికారి వద్దకు వెళ్లినా బడ్జెట్ లేదు, చూస్తాం, చేస్తాం అన్న మాటలే తప్ప ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు ఎవరివ్వాలనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. తమకు ఉద్యోగాలివ్వడమే పాపం అన్నట్టుగా అధికారుల చీత్కారాలతో విసిగి వేసారి పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కొలువులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని.. తమ ఆశలన్నీ ఆవిరయ్యాయన్నారు. గడువు ముగుస్తుండడంతో తిరిగి తమను కొనసాగిస్తారో లేదో కూడా అనుమానంగా ఉందని వారు వాపోయారు. ఇళ్లలో ఒత్తిడి అధికమవుతోంది ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు. దాంతో ఇళ్లలో సైతం మాపై ఒత్తిడి అధికమవుతోంది. కుటుంబపోషణ కోసం కొలువుల్లో చేరితే జీతాలు ఇవ్వకపోవడం అన్యాయం. -మోసం రాములమ్మ, స్వీపర్, శబరికొత్తగూడెం, కూనవరం మండలం మానేయడమే శరణ్యం ఇతర మండలాల నుండి వచ్చి గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నాం. జీతాలు ఇవ్వకపోతే విధులు ఎలా నిర్వహించాలి? అందుకే అందరం కలసి మూకుమ్మడిగా మానేయాలని ఆలోచిస్తున్నాం. -ఆసు దుర్గాప్రసాద్, ఎఫ్ఎన్వో, రేపాక, కూనవరం మండలం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం 14 మందికి జీతాలు రానిమాట వాస్తవమే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. జీతాలకు సంబంధించిన ఫైల్ పంపమన్నారు. కానీ ఆ ఫైల్ మావద్ద లేదు. -డాక్టర్ శేషిరెడ్డి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ, చింతూరు -
టాటా టెలీ యూజర్లకు జీవిత బీమా కవరేజీ
ఏపీ, తెలంగాణల్లో ప్రయోగాత్మకంగా ఎం – ఇన్సూరెన్స్ సర్వీసులు ముంబై: ఎం–ఇన్సూరెన్స్ సేవలు అందించేందుకు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్) చేతులు కలిపాయి. ఈ ఒప్పందం కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు రూ. 1,00,000 దాకా జీవిత బీమా కవరేజీ అందించనున్నాయి. నిర్దిష్ట రీచార్జ్‌లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టాటా టెలీ ప్రీపెయిడ్ యూజర్లకు ప్రయోగాత్మకంగా ఈ ఎం–ఇన్సూరెన్స్ పాలసీ అందించనున్నట్లు టాటా ఏఐఏ లైఫ్ తెలిపింది. అన్ని వర్గాలకు బీమా ప్రయోజనాలు అందుబాటులోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్లుగా, బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించినట్లు సంస్థ చైర్మన్ ఇషాత్ హుసేన్ తెలిపారు. -
ఏసీబీ వలలో మహానంది దేవస్థానం ఉద్యోగి
- కాంట్రాక్టర్‌ను రూ. 10 వేలు డిమాండ్ చేసిన డ్రాఫ్ట్స్‌మెన్ - ఏబీసీ అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్టర్ - పథకం ప్రకారం పట్టుకున్న వైనం మహానంది: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మహానంది దేవస్థానం ఉద్యోగి, డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు ఆలియాస్ సర్వేశ్వరరావు ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ కర్నూలు డీఎస్పీ జయరామరాజు తెలిపిన వివరాల మేరకు....మహానంది దేవస్థానంలో 2013లో అన్నదాన భవనం, అభిషేక మండపాల నిర్మాణానికి రూ. 1.98 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిర్మాణాలను నెల్లూరుకు చెందిన రమేష్‌రెడ్డి దక్కించుకున్నారు. ఆయన పేరు మీద తన మిత్రుడు శ్యాంసుందర్‌రెడ్డి పనులు చేశాడు. గత ఏడాది నవంబర్‌లో భవనాలను ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి సంబంధిత కాంట్రాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డికి రూ. 6 లక్షలు ఎఫ్ఎస్డీ వెనక్కి రావాలి. దీనికి సంబంధించిన బిల్లులు, రికార్డులను ఎం–బుక్‌లో రూపొందించి బిల్లులు తయారు చేసి దేవస్థానం కార్యనిర్వహణాధికారితో సంతకం చేయించాల్సి ఉంది. అయితే ఈ పనులకు డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు రూ. 10 వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు పథకంలో భాగంగా సోమవారం స్థానిక అన్నదానం భవనం వద్ద కాంట్రాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి ఉద్యోగికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు సీతారామారావు, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీశైలంలోనూ అవినీతి ఆరోపణలు: డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా శ్రీశైలం నుంచి మహానందికి వచ్చారు. అయితే ఆయన శ్రీశైలం దేవస్థానంలో పనిచేసే సమయంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో ‘సాక్షి’లో సైతం లోగుట్టు సర్వేశ్వరుడికెరుక అన్న శీర్షికతో అతని అక్రమాలపై కథనం ప్రచురించింది. మహానంది దేవస్థానంలో పనిచేస్తూ ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడం ఇదే ప్రథమం కావడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
జెట్ ఎయిర్‌వేస్‌తో ఉబెర్ జట్టు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా జెట్ ఎయిర్వేస్, ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం జెట్ ఎయిర్వేస్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు ఉబెర్ ట్యాక్సీని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా యాప్ ద్వారా ఫ్లయిట్ బుక్ చేసుకునే ప్రయాణికులు తమ సర్వీసులను తొలిసారి వినియోగించుకుంటున్నట్లయితే తొలి మూడు రైడ్స్‌కి రూ. 150 డిస్కౌంట్ లభిస్తుందని ఉబెర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కణ్ణన్ తెలిపారు. 29 నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. -
పరువు హత్యల్లో పరువు ఎక్కడుంది?
అర్జున్, జేడీ చక్రవర్తి హీరోలుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘కాంట్రాక్ట్’. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. అర్జున్ మాట్లాడుతూ – ‘‘పోలీసాఫీసర్ కావాలని కరాటే నేర్చుకున్న నేను అనుకోకుండా ‘మా పల్లెలో గోపాలుడు’తో హీరో అయ్యా. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నా. అందుకు కారణమైన కోడి రామకృష్ణగారికి, తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. సమీర్ మాట్లాడుతూ – ‘‘మైండ్ గేమ్ నేపథ్యంలో నడిచే చిత్రమిది. ‘పరువు హత్యల్లో అసలు పరువు లేదు’ అనేది చిత్ర మూలకథ. జేడీ చక్రవర్తిగారి ప్రోత్సాహంతో ఈ సినిమా తీశా. దీని తర్వాత మరో భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు. కృతీ కట్వా, దివ్యా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: జానీ లాల్, సంగీతం: సుభాశ్ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: వి. సునీల్‌కుమార్, ఎం. రమేశ్, సమర్పణ: సంజయ్ గద్వక్. -
మాపై చిన్నచూపేల?
విద్యాశాఖ ఉద్యోగుల ఆవేదన రెగ్యులర్ చేస్తామన్న ఎన్నికల హామీ గాలికే కనీసం జీతాలు కూడా పెంచకుండా చిన్నచూపు కాంట్రాక్ట్ సిబ్బంది అరకొర జీతాలతో ఆర్థిక ఇబ్బందులు కొత్తపేట :‘‘అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తాం’’ ఇది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో చేసిన హామీ. రెగ్యులర్ చేయడం అటుంచితే ఆయన అధికారం చేపట్టాక కనీసం ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని విద్యాశాఖ ఉద్యోగులు వాపోతున్నారు. విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా వివిధ విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 1,200 మంది పనిచేస్తున్నారు. వారిలో పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్స్ (డ్రాయింగ్, క్రాఫ్ట్, పీఈటీ)గా ప్రతి మండలం నుంచీ 10 నుంచి 12 మంది చొప్పున 692 మంది, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స (సీఆర్పీ)లుగా ప్రతి మండలంలో నలుగురి నుంచి ఆరుగురు చొప్పున సుమారు 300 మందితో పాటు కంప్యూటర్ ఆపరేటర్స్, మండల ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్స్, మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ) అసిస్టెంట్స్‌గా 64 మంది చొప్పున పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు సుమారు పదేళ్లు క్రితం రూ.1,500 నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.10 వేలకు పని చేస్తున్నారు. ఎంఆర్సీ అసిస్టెంట్స్ కూడా పదేళ్ల నుంచి రూ వెయ్యితో ప్రారంభమై ప్రస్తుతం రూ 7,500కు పనిచేస్తున్నారు. సీఆర్పీలు 2011 నుంచి, పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్స్ 2012లో రూ 4,500 జీతంతో చేరి ప్రస్తుతం రూ 8,500కు, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ రూ.6,500కు జీతానికి చేరి ప్రస్తుతం రూ.12 వేలకు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి 2013 వరకూ ఏటా అలాగే టీచర్స్ పీఆర్సీ ప్రకటించినప్పుడల్లా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ జీతం పెరుగుతూ వచ్చింది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి పెంచిన దాఖలాలు లేవని ఆ ఉద్యోగులు వాపోయారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఆ ఉత్తర్వులు వర్తింపజేయలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం తాజాగా గత ఏడాది సెప్టెంబర్‌లో జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం ఆదిశగా ఆలోచనే చేయడం లేదని పలువురు ఉద్యోగులు వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
దొంగ కోళ్లు
కార్పొరేషన్లో టెండర్ ఆట - రింగ్ చేసేందుకు ఒక నేత యత్నం - అందరూ టెండర్లు వేయాలని మరో నేత ఆదేశం - బరిలో పలువురు కాంట్రాక్టర్లు - కార్పొరేషన్ ఖజానాకు సంక్రాంతి కిక్కు సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్లో దొంగ కోళ్ల సందడి మొదలయింది. కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి.. కేవలం ఒకరిద్దరే టెండర్లో పాల్గొనేలా చేసి సులభంగా ‘ఆట’ గెలిచేందుకు అధికార పార్టీ నేత ఒకరు ప్రయత్నం చేశారు. అయితే, టెండర్లో అందరూ పాల్గొనాలంటూ మరో నేత ఆదేశించడంతో కార్పొరేషన్లో గెలుపు కోడి ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. రింగ్ కావడం ద్వారా ఏకపక్షంగా పందెం గెలవాలనుకున్న నేత కాస్తా మెత్తపడ్డారు. ఫలితంగా రూ.10.2 కోట్ల విలువ చేసే ఈ పనులన్నింటిలో ఇప్పుడు పోటీ మొదలయ్యింది. మొదట్లో కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరను కోట్ చేసి టెండర్ దక్కించుకుందామనుకున్న సదరు నేత ఆలోచనకు బ్రేకులుపడ్డాయి. తాజాగా కాంట్రాక్టర్లు పోటీపడటంతో తక్కువ ధరకే పనులు దక్కే అవకాశం ఉంది. ఈ మొత్తం రూ.10.2 కోట్ల పనుల్లో సుమారు కోటి రూపాయల మేరకు కార్పొరేషన్ ఖజానాకు మిగలనుందని సమాచారం. అంతిమంగా ఈ ఆటలో కార్పొరేషన్ ఖజానాకు సంక్రాంతి కిక్కు వచ్చినట్లయింది. ఇవీ పనులు....! – రూ.70 లక్షల విలువైన కల్లూరు దర్వాజా నుంచి ఉస్మానియా కాలేజీ మీదుగా ఉమర్ అరబిక్ కాలేజీ వరకు రోడ్డు వెడల్పు పనులు. – రూ.80 లక్షల అంచనా వ్యయంతో రేణుక ఆసుపత్రి నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు వెడల్పు పనులు. – గాయత్రీ ఎస్టేట్ నుంచి మద్దూరు నగర్ మీదుగా సి–క్యాంపు సర్కిల్ వరకు రోడ్డు వెడల్పు పని. ఈ పని అంచనా వ్యయం రూ.85 లక్షలుగా కార్పొరేషన్ అధికారులు తేల్చారు. – కోటి రూపాయల విలువ కలిగిన విష్ణుటౌన్‌షిప్ నుంచి జాతీయ రహదారి–44 వరకు(ఈద్గా పశ్చిమవైపునకు) – కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యుబీ) వద్ద పశ్చిమ వైపునకు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి పనులు. ఈ పనుల విలువ రూ.2 కోట్లు. – కృష్ణానగర్‌లో రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యుబీ) వద్ద తూర్పు వైపునకు అప్రోచ్ రోడ్డు అభివృద్ధి పనులు. ఈ పనుల విలువ రూ.2 కోట్లు. – రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నంద్యాల రోడ్డు (ఎన్‌హెచ్–18) నుంచి గుత్తి రోడ్డు (ఎన్‌హెచ్–44) వరకు మాస్టర్‌ప్లాన్ రోడ్డు నిర్మాణం. కోటి ఖన్నానికి బ్రేకులు మొత్తం ఎనిమిది పనుల విలువ రూ.10.2 కోట్లు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లను రింగు చేసి.. టెండర్లో కేవలం ఒక్కరిద్దరే పాల్గొని అధిక ధరకు టెండర్ వేయించాలనేది అధికార పార్టీలోని ఒక నేత ప్రయత్నం. తద్వారా కనీసం 5 శాతం అధిక ధర అంటే టెండర్ విలువ కంటే రూ.50 లక్షల మేరకు అధికంగా కొట్టేయాలనేది పన్నాగం. అంటే రూ.10.2 కోట్ల విలువైన పనులను రూ.10.7 కోట్లకు కొట్టేయాలని నిర్ణయించారు. అయితే, తాజాగా అందరూ టెండర్లో పాల్గొనడంతో ఈ మొత్తం టెండర్లన్నీ తక్కువ ధరకే(లెస్సుకే) పనులు దక్కే అవకాశం ఉంది. కనీసం 5 శాతం లెస్సు లెక్కించినా.. టెండర్ ధర కంటే రూ.50 లక్షలు తగ్గుతుంది. అంటే రూ.9.7 లక్షలకే కాంట్రాక్టర్లు పనులు చేయనున్నారు. ఒకవేళ టెండర్లో రింగు అయితే.. కోటి రూపాయల మేరకు అధికంగా పనులు కొట్టేయాలనుకున్న సదరు నేత పన్నాగంగా ఉంది. తాజా పరిణామాలతో దీనికి బ్రేక్ పడినట్లయింది. ఫలితంగా కార్పొరేషన్‌కు ఆ మేరకు లబ్ధి చేకూరనుంది. -
కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె విరమణ
కంబాలచెరువు : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 33 రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మె బుధవారం విరమించారు. ఈ మేరకు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి హేప్సీరాణిని కలిసి సమ్మె విరమణ పత్రం అందజేశారు. స్పెషల్ క్వాలిఫైడ్ టెస్ట్ ద్వారా కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మె విరమించినట్టు ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు యార్లగడ్డ రాజాచౌదరి, వి.కనకరాజు తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారందరికీ మూడు దశలుగా టైం స్కేలు వర్తింపజేసి ఉద్యోగభద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సంక్రాంతి సెలవులు అనంతరం జీవోను విడుదల చేస్తామని చెప్పారన్నారు. సమ్మె కారణంగా విద్యార్థులు వెనుకబడిన పాఠాలను అదనపు తరగతుల ద్వారా బోధిస్తామని చెప్పారు. తమ సమ్మెకు మద్దతిచ్చిన విద్యార్థి, కార్మిక, ప్రజాసంఘాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జి.ఎల్.మాణిక్యం, కె.ఎన్.వి.ఎల్.నరసింహం, లక్ష్మణరావు, గణేశ్వరరావు, ప్రకాశ్‌బాబు, రెడ్డి రాజబాబు పాల్గొన్నారు. -
సర్కారు కక్ష.. ఎలా పరీక్ష
ఏలూరు సిటీ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. విద్యార్థులకు ప్రాక్టికల్, థియరీ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. సిలబస్ పూర్తికాక వారంతా ఆందోళన చెందుతున్నారు. జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు 33 రోజులుగా సమ్మె చేస్తుండగా.. వారిని శాంతింప చేయాల్సిన ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సమ్మె విరమించకుంటే ఉద్యోగాలు తొలగించడం ఖాయమంటూ బెదిరింపులకు దిగుతోంది. అటు ఇంటర్ విద్యార్థుల జీవితాలు.. ఇటు కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పరీక్షల వేళ.. ఏమిటిలా! విద్యార్థుల భవిష్యత్‌కు ఇంటర్మీడియెట్ అత్యంత కీలకం. వారికి ఈ నెలాఖరున ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాంట్రాక్ట్ అధ్యాపకులు 33 రోజులుగా సమ్మెలో ఉండటంతో సిలబస్ పూర్తికాలేదు. వారం రోజుల్లో సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. అనంతరం ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జూనియర్ కళాశాలల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 32 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సుమారు 16వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 2,500 మంది సైన్స్ విద్యార్థులు. సైన్ గ్రూపులతోపాటు ఆర్ట్స్ గ్రూపుల సిలబస్ పూర్తికాక.. పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. హామీ ఏమైంది ? టీడీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. ఆ హామీ నెరవేరకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. బాబు వస్తే జాబు రెగ్యులర్ అవుతుందనుకున్నామని.. ఇలా ఉద్యోగాలకు ఎసరు పెడతారనుకోలేదని వారంతా ఘొల్లుమంటున్నారు. 32 జూనియర్ కళాశాలలు.. 264 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు జిల్లాలో 32 జూనియర్ కళాశాలల్లో 264 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. మరో 100 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 60 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు, 50 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులంతా 16 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. 4 నుంచి 6 నెలలకు ఒకసారి జీతాలు చెల్లిస్తున్నా.. ఏదో ఒక రోజున ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని వారంతా సమ్మెకు దిగటంతో డిసెంబర్ 27న ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
కాంట్రాక్టు అధ్యాపకులకు ‘షో’కాజ్
ఎన్నికల హామీలకు గ్రహణం చంద్రబాబు తీరుపై కాంట్రాక్టు అధ్యాపకుల ఆగ్రహం షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై మండిపాటు రెగ్యులరైజ్ చేయాలని ఆందోళనలు కాంట్రాక్టు అధ్యాపకులపై ప్రభుత్వం రెండు నాల్కల «ధోరణి అవలంబిస్తోంది. తమను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా దానిని అమలుచేయకపోగా తిరిగి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో కాంట్రాక్టు అధ్యాపకుల్లో ఆగ్రహాం పెల్లుబికుతుంది. మొక్కుబడిగా నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ నియమించి..రెగ్యులరైజ్‌పై తాత్సారం చేస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా జిల్లాలో ఆందోళనలు, ఆమరణ దీక్షలు మిన్నంటాయి. - కంబాలచెరువు (రాజమండ్రి) జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అత్యధికశాతం పాలిటెక్నిక్, డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఉన్నారు. 40 జూనియర్ కళాశాలల్లో 352 మంది, 15 డిగ్రీ కళాశాలల్లో 90 మంది, మూడు పాలిటెక్నిక్ కళాశాలల్లో 22 మందితో కలిపి మొత్తం 464 మంది పని చేస్తున్నారు. వీరంతా 27 రోజులుగా విధులు బహిష్కరించి కలెక్టరేట్, ఇంటర్‌బోర్డు, ఆర్జేడీ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వీరిని క్రమబద్దీకరిస్తామని నాలుగో తేదీ ఫిబ్రవరి 2012న రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో చంద్రబాబు ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు. నష్టపోతున్న విద్యార్థులు కాంట్రాక్టు అధ్యాపకుల దీక్షలు, ఆందోళనలతో విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాలపై పడే ప్రభావముంది. ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఈ సమ్మెతో చంద్రబాబు ఆగ్రహాంతో ఉన్నారని మంత్రులు పలు ధపాలుగా చెప్పడంతో కాంట్రాక్టు అ«ధ్యాపకులు మండిపడుతున్నారు. యనమల ‘యు’ టర్న్ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన హామీని తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కాంట్రాక్టు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఉద్యమ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం కాకినాడలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసిన కాంట్రాక్టు అధ్యాపకులతో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని 60 ఏళ్ల వరకు ఎవరూ విధుల నుంచి తొలగించరని, ఉద్యోగభద్రత కల్పిస్తామని, వేతనాలు సవరిస్తామని చెప్పారు. దీనిపై ఈ నెల 26న తుదినిర్ణయం తీసుకుంటామని చెప్పారు. షోకాజ్ నోటీసులు జారీ తీరా ఆశగా ఎదురుచూసిన కాంట్రాక్టు అధ్యాపకులు తుది నిర్ణయం ఏమిటో తెలిసేసరికి హతాశులయ్యారు. ఉద్యమాలతో తమను బ్లాక్ మెయిల్ చేయలేరని, దీనికి తాము భయపడేదిలేదంటూ దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందరికీ మంగళవారం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నాలుగు యూనియన్లు ఉండగా వారిలో విబేధాలు కల్పిస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. అంతేకాక ఆర్జేడీలు, ఇంటర్‌బోర్డు అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో బెదిరింపు చర్యలకు పూనుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమని వారు అంటున్నారు. దీనికితోడు కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని వారు కనిపించిన నాయకులందరినీ కాళ్లువేళ్లూ పట్టుకుంటున్నారు. -
ఒప్పంద అధ్యాపకుల వినూత్న నిరసన
కర్నూలు(న్యూసిటీ): కొంగ జపం చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఒప్పంద అధ్యాపకులు శనివారం వినూత్న నిరసన తెలిపారు. ముందుగా.. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు వీరు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసంఘం జిల్లా అధ్యక్షుడు ఎంఎ నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కర్నూలులో 23రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సరైన హామీ ఇవ్వకపోతే అమరణ నిరహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఒప్పంద అధ్యాపకులు చాంద్‌బాషా, మల్లికార్జున స్వామి, రామకృష్ణ, షఫీ, అన్వర్, నజీర్, రాగమంజరి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా ఎస్ఈసీతో విప్రో 5 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం నాటి నిధుల గోల్మాల్ వివాద పరిష్కారానికి సంబంధించి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో ఐటీ దిగ్గజం విప్రో ఒప్పందం కుదుర్చుకుంది. 5 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించేందుకు అంగీకరించామని విప్రో పేర్కొంది. 2009 నవంబర్, డిసెంబర్ మధ్య కాలంలో తమ ఉద్యోగుల్లో ఒకరు రూ. 22.8 కోట్ల మేర (సుమారు 4 మిలియన్ డాలర్లు) నిధులను స్వాహా చేసినట్లు విప్రో గుర్తించింది. ఆ తర్వాత సదరు ఉద్యోగి నుంచి సింహభాగం రాబట్టింది. 2010 సెప్టెంబర్‌లో దర్యాప్తు ప్రారంభించిన ఎస్ఈసీ తాజాగా సెటిల్మెంట్కు అనుమతించింది. -
ఎంపీ ఇల్లు ముట్టడి
న్యాయం చేయాలని కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్ భానుగుడి (కాకినాడ) : కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన కార్యక్రమాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇంటిని ముట్టడించగా, సోమవారం కాకినాడలోని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఇంటిని ముట్టడించి, నిరసన తెలిపారు. ఎంపీని కలిసి తమ సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించడమా, వేతన సవరణ చేయడమా అన్న విషయాలను ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు. ప్రభుత్వం సైతం దీనిపై సానుకూలంగా ఉందని, వారు సంయమనం పాటించాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం జిల్లా అ«ధ్యక్షుడు యార్లగడ్డ రాజాచౌదరి మాట్లాడుతూ కళాశాలల్లో పాఠాలు బోధించాల్సిన తమను రోడ్డెక్కెలా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఇకనుంచి జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లను ముట్టడించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామన్నారు. -
డ్రైవర్ల శిక్షణకు మారుతీ, ఓలా భాగస్వామ్యం
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ఓలా’తో జతకట్టింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కూడా కుదిరింది. తాజా ఒప్పదంలో భాగంగా ‘మారుతీ ఓలా ట్రైనింగ్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తామని, దీని ద్వారా మూడేళ్లలో 40,000 మంది డ్రైవర్లకు శిక్షణనిస్తామని మారుతీ సుజుకీ తెలిపింది. ఔత్సాహికులు తాజా కార్యక్రమం ద్వారా ఎంట్రప్రెన్యూర్షిప్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అభిప్రాయపడింది. ‘మారుతీ ఓలా ట్రైనింగ్ ప్రోగ్రామ్’ను తొలిగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ప్రారంభిస్తామని పేర్కొంది. కాగా మారుతీ సుజుకీ తన డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా అభ్యర్థులకు డ్రైవింగ్ శిక్షణనివ్వడంతోపాటు లెసైన్‌స ఇప్పించడంలోనూ, వాహన కొనుగోలుకు రుణాన్ని అందించడంలోనూ సాయమందిస్తుంది. ఇక ఓలా ఈ శిక్షణ పొందిన డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. శిక్షణ కాలం నెల రోజులు ఉంటుంది. -
ఇలాగైతే ఎలా?
సమ్మెలో అధ్యాపకులు.. సాగని తరగతులు అయోమయంలో ఇంటర్ విద్యార్థులు సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె తప్పదంటున్న అధ్యాపకుల జేఏసీ రాయవరం : కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరవధిక సమ్మెబాట పట్టడంతో జూనియర్ కళాశాలల్లో తరగతులు సాగడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ అధ్యాపకుల జేఏసీ ప్రకటించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ దశల వారీ పోరాటానికి కాంట్రాక్టు అధ్యాపకులు దిగారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. దీని ప్రభావం జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాలల విద్యార్థుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. జిల్లా వ్యాప్తంగా.. జిల్లాలో 40 ప్రభుత్వ జూనియర్, 15 డిగ్రీ, రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరంతా 16ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికైనా రెగ్యులర్ కాకపోతాయా..అన్న ఆశతో వీరు చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ అవుతాయన్న ఆశలు అడియాశలు కావడంలో పోరుబాట పట్టారు. 80వేల మంది విద్యార్థులపై ప్రభావం.. ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని, నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రభుత్వం ఒక పక్క ప్రచారం చేస్తోంది. మరో పక్క కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరన్న వాస్తవాన్ని చెప్పడం లేదు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ కళాశాలల్లో తమ పిల్లలను చేర్పిస్తే ఇప్పుడు కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో తమ చిన్నారుల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. సబ్జెక్టు చాప్టర్లు కూడా పూర్తికాలేదని, ఇప్పుడు అధ్యాపకులు సమ్మెతో సిలబస్ ఎలా పూర్తవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. సమ్మెపై ప్రభుత్వం స్పందించక పోవడం..అధ్యాపకులు సమ్మె విరమించేది లేదని భీష్మించడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 80వేల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. -
మీ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తా
కాంట్రాక్టు అధ్యాపకులకు జగన్ భరోసా మధురపూడి/రాజానగరం : ‘మీ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తా, మీకు మేలు జరిగేలా ప్రయత్నిస్తా’ అని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ భద్రత కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులు బుధవారం కోరుకొండ మండలం, బూరుగుపూడి సెంటర్లో జగన్‌ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 16 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తూ, కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతాన్ని పెంపొందిస్తున్నా తమకు ఉద్యోగ భద్రతను కల్పించడంలో ప్రభుత్వ కాలయాపన చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కారిస్తామంటూ త్రిసభ్య కమిటీని వేసిన ప్రభుత్వం ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ఆచరణలోకి తీసుకురావడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పదో పీఆర్సీ సూచించినట్టు వేతనాల్లో పెరుగుదల తీసుకురావాలన్నారు. తమ కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నాయని, వీధిన పడకుండా ఆదుకోవాలంటూ వేడుకున్నారు. దీని పై స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పై విధంగా భరోసానిస్తూ మీకు అండగా మేముంటామన్నారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ యువతను మాయమాటలతో మోసంగించాడన్నారు. అలాగే రైతులను, డ్వాక్రా మహిళలను కూడా రుణ మాఫీ అంటూ మోసగించిన మాయలమరాఠీ చంద్రబాబు అన్నారు. ఉద్యమతీవ్రతను పెంచితేగాని ఆయన స్పందించరంటూ వారి ఉద్యమానికి ఆయన పూర్తి మద్దతును ప్రకటించారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో ఏపీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులు జేఏసీ నాయకులు యార్లగడ్డ రాజాచౌదరి, జిల్లా అధ్యక్షుడు వలుపు కనకరాజు, వీరబాబుచౌదరి, కె.లక్ష్మిదేవి, దడాల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బోధనను వీడి పోరుపథంలోకి..
మళ్లీ మొదలైన కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యమం రాజమహేంద్రవరంలో దీక్షా శిబిరం ప్రారంభం -చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందన్నాడో మహానుభావుడు. తాము సముపార్జించిన జ్ఞాననిధులను అలాంటి తరగతి గదుల్లో భావిపౌరులకు బోధించే కాంట్రాక్టు అధ్యాపకులు వర్తమానంలో తాము నిశ్చింతగా జీవించలేకపోతున్నామంటూ రోడ్లెక్కాల్సి వస్తోంది. పాఠాలు చెప్పిన నోటితో నినాదాలు చేయాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఉద్యమించాల్సి వస్తోంది. ప్రతిపక్ష నాయకునిగా గతంలో చంద్రబాబునాయుడు కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తానని రాజమహేంద్రవరం దీక్షా శిబిరం వద్దకు వచ్చి హామీ ఇచ్చి ఇప్పుడు మొహం చాటేయడం పట్ల అధ్యాపకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలపై గతంలో 37 రోజులుగా తీవ్రపోరు చేసారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం వారికి బేసిక్ పే మంజూరు చేసింది. దీంతో పాటు రెగ్యులర్ చేస్తామని చెప్పింది. అదేసమయంలో 2012 ఫిబ్రవరి 4న చంద్రబాబు రాజమహేంద్రవరంలోని దీక్షాశిబిరం వద్దకు వచ్చి తాను అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులందరినీ పర్మనెంట్ చేస్తానన్నారు. ఉద్యోగభద్రతకు ఆడబిడ్డలు రోడ్డెక్కడం దుస్థితి అని వాపోయారు. తానొస్తే ఆ పరిస్థితి ఉండదని భరోసా ఇచ్చివెళ్లారు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం తమను పట్టించుకోవడంలేదని కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 40 జూనియర్, 15 డిగ్రీ, రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో 460 మంది కాంట్రాక్టు అధ్యాపకులు గత 16 ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఆరునెలలకోసారి జీతం ఇచ్చినా పంటి బిగువున పనిచేశారు. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామనే ఆశతో జిల్లాలో పని చేస్తున్న కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెంచామని కొత్తపేటకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకుడు తనికెళ్ల శాస్త్రి ‘సాక్షి’తో అన్నారు. మంత్రివర్గం ఉపసంఘం నియమించి రెగ్యులర్ చేస్తామన్న చంద్రబాబు రెండున్నరేళ్లుగా తమతో ఆడుకున్నారని రాజవొమ్మంగి ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుడు వాగు మాధవ్ మండిపడ్డారు. తమకు న్యాయం చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజల్లో మోసకారి సర్కారుగా ప్రచారం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆశ అడియాస కాగా.. అప్పట్లో పోరాటం చేసి కొంత ఫలితం దక్కించుకున్నా కాంట్రాక్టు అధ్యాపకులు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేసుకోలేకపోయారు. నాయకుల హామీలతో కొలువులు స్థిరమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారికి అడియాస ఎదురయ్యేసరికి తిరిగి ఉద్యమం ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం రాజమహేంద్రవరం ఇంటర్‌బోర్డు వద్ద దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం నడుస్తుందని ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ నాయకులు తెలిపారు. ఉదయం నుంచి జిల్లాలోని కాంట్రాక్టు అధ్యాపకులంతా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పి.వీరబాబు, వి.కనకరాజు, యు.లక్ష్మణరావు, అమర్‌కళ్యాణ్, వి.మాధవ్, జీఎల్ మాణిక్యం పాల్గొన్నారు. రేపు బూరుగుపూడిలో 'కడుపుకోత' సభ ఈనెల ఏడున జిల్లా పర్యటనకు వస్తున్న ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డితో బూరుగుపూడి వద్ద భేటీ కానున్నామని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర జేఏసీ నాయకుడు యార్లగడ్డ రాజాచౌదరి తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు బూరుగుపూడి గేట్ వద్ద జరిగే కడుపుకోత సభకు రాష్ట్రంలోని కాంట్రాక్టు అధ్యాపకులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
యనమలా..నాటి లేఖల మాటేమిటి?
ఆర్థిక మంత్రికి కాంట్రాక్టు అధ్యాపకుల ప్రశ్న భానుగుడి(కాకినాడ) : అధికారం లేనపుడు ఒకలా.. అధికారం చేతికొచ్చాక మరోలా..రంగులు మార్చే ఊసరవెల్లిలా యనమల ప్రవర్తన ఉండడం దురదృష్టకరమని కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ పేర్కొంది. సోమవారం పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ యరమాటి రాజాచౌదరి మాట్లాడుతూ అధికారంలో లేనపుడు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి తమ కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెగ్యులరైజేషన్ విçషయమై లేఖలు రాసి, ఎన్నికల సమయంలో హామీలిచ్చి, అధికారంలోకొచ్చాక తమ గురించి పట్టించుకోకుండా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా వేలమంది అరకొర వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిన కొన్నేళ్లుగా పనిచేస్తున్నామని, ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని కాంట్రాక్టు› లెక్చరర్లు వాపోయారు. ఈ సందర్భంగా యనమల చిత్రపటానికి మోకాళ్లపై మొక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నేడు కలెక్టరేట్ ఎదుట భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొంటున్నారని, పలువురు వామపక్ష నాయకులు తమకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. -
లక్ష పోస్టుకార్డులతో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన
రాజానగరం :రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే తాత్కాలిక ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోనందుకు ప్రభుత్వానికి తమ నిరసనను ఒక లక్ష పోస్టు కార్డుల ద్వారా తెలియజేస్తున్నామని కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వి. కనకరాజు తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 16 నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొంటున్నారన్నారు. 2014 సెప్టెంబర్‌లో మంత్రి వర్గ ఉపసంఘాన్ని వేస్తున్నట్టుగా సీఎం ప్రకటించి, చేతులు దులుపుకున్నారన్నారు.16 సంవత్సరాలుగా తాము చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామన్నారు. -
జీఈతో ఆర్ఐఎల్ జట్టు
ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స కోసం న్యూఢిల్లీ: రిలయన్స ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారుు. ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స వ్యాపారం కోసం డిజిటల్ సొల్యూషన్స ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని రెండు కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నారుు. ఆరుుల్, గ్యాస్, విద్యుత్తు, ఫార్మా, టెలికం ఇతర రంగాల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్స అందించడానికి రెండు దిగ్గజ సంస్థల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరడం ఇదే తొలిసారని ఆ ప్రకటన పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా డేటా కనెక్టివిటీ ఉపయోగించడం ద్వారా ఇంటర్నెట్తో అనుసంధానమై ఉన్న ఉత్పత్తులను ఐఓటీ పరికరాలు ఆపరేట్ చేస్తారుు. ఉదాహరణకు మనం ఎక్కడ ఉన్నా, కారును లాక్ చేయవచ్చు. సీసీటీవీని నియంత్రించవచ్చు. రిలయన్స జియో అందిస్తున్న హై బ్యాండ్విడ్త కనెక్టివిటీ, క్లౌడ్ సర్వీసుల వల్ల భారత్‌లో ఐఐఓటీకి మంచి వృద్ధి అవకాశాలున్నాయని ఆర్ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ చెప్పారు. జీఈ సంస్థ ప్రిడిక్స్ క్లౌడ్‌ను, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ అప్లికేషన్‌సను, డేటా సైన్స నైపుణ్యాలను అందిస్తుందని, తాము ఒక ఇండిపెండెంట్ సాఫ్ట్వేర్ వెండార్‌గా ప్రిడిక్స్పై సొల్యూషన్స ఆఫర్ చేస్తామని వివరించారు. డిజిటల్ దిశగా భారత్ అడుగులు వేయడం హర్షించదగ్గ విషయమని జీఈ చైర్మన్, సీఈఓ జెఫ్ ఇమ్మెల్ట్ చెప్పారు. -
గోవా ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఉత్తర గోవాలోని మోపాలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి గోవా ప్రభుత్వంతో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశ పనులు 2019-20 నాటికి పూర్తి కాగలవని అంచనా. నిర్దేశిత కాల వ్యవధిలోనే ప్రాజెక్టులను పూర్తి చేయగలమని జీఎంఆర్ గ్రూప్ ఎరుుర్పోర్ట్స్ విభాగం చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల తెలిపారు. గోవాలో కీలకమైన దబోలిమ్ తర్వాత రెండో విమానాశ్రయమైనప్పటికీ.. ఈ ప్రాజెక్టు లాభదాయకతపై సందేహాలు అక్కర్లేదని, మోపా విమానాశ్రయంలోనూ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగగలదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ట్రాఫిక్ 16-18 శాతం వృద్ధి చెందుతోందని శ్రీనివాస్ చెప్పారు. మోపా విమానాశ్రయంతో స్థానికులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నందున, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయ రూపకల్పన, నిర్మాణం, 40 ఏళ్ల పాటు నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో జీఎంఆర్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకునేందుకు 60 ఏళ్ల వ్యవధికి కంపెనీకి 232 ఎకరాల స్థలం లభిస్తుంది. జీఎంఆర్ గ్రూప్ ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోండగా, ఫిలిప్పీన్సలో మక్టాన్ సెబు ఇంటర్నేషనల్ ఎరుుర్‌పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్ చేపట్టింది. ఇటీవలే గ్రీస్‌లోని హెరాక్లియోన్ విమానాశ్రయ ప్రాజెక్టును దక్కించుకుంది. -
ఐఆర్సీటీసీతో మోబిక్విక్ ఒప్పందం
ముంబై: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో మొబైల్ పేమెం ట్స్ నెట్వర్క్ సంస్థ మోబిక్విక్ జతకట్టింది. ఇరు సంస్థలు ఒప్పందంలో భాగంగా ప్రయాణికులకు తత్కాల్ బుకింగ్సకు ఈ-క్యాష్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారుు. ‘ఐఆర్సీటీసీ యాప్, ఐఆర్సీటీసీ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్‌లలో డిజిటలైజ్ పేమెంట్స్ కోసం మేం ఇప్పటికే ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తాజాగా ఇప్పుడు మళ్లీ తత్కాల్ బుకింగ్సకి ఆన్లైన్ పేమెంట్ సేవలను ఆవిష్కరించాం. దీంతో యూజర్లు తత్కాల్ టికెట్లను తక్షణం బుక్ చేసుకోవచ్చు’ అని మోబిక్విక్ సహవ్యవస్థాపకురాలు ఉపాసన టకు తెలిపారు. -
ఆమ్జెన్తో డాక్టర్ రెడ్డీస్ జట్టు
భారత్‌లో మూడు ఔషధాల మార్కెటింగ్‌కు ఒప్పందం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) తాజాగా అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఆమ్జెన్తో భాగస్వామ్యాన్ని మరిన్ని ఔషధాలకు విస్తరించింది. ఈ ఒప్పందం ప్రకారం ఆమ్జెన్కి చెందిన మూడు ఔషధాలను డీఆర్ఎల్ భారత్‌లో మార్కెటింగ్, పంపిణీ చేస్తుంది. ఆంకాలజీ, ఆస్టియోపోరోసిస్ చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు. ఎక్స్జెవా (డెనోసుమాబ్), వెక్టిబిక్స్ (పానిటుముమాబ్) ప్రోలియా (డెనోసుమాబ్) ఔషధాలు ఇందులో ఉన్నాయి. వాస్తవానికి క్యాన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే వివిధ ఔషధాలకు సంబంధించి 2015లోనే ఇరు సంస్థలు వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఆమ్జెన్కి చెందిన కిప్రోలిస్, బ్లిన్సైటో, రెపాథా ఔషధాలను భారత్‌లో ప్రవేశపెట్టేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది. ఇక, తాజా పరిణామం ఆంకాలజీ, ఆస్టియోపోరోసిస్ సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన ఔషధాలు అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడగలదని డీఆర్ఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రమణ తెలిపారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్‌తో భాగస్వామ్యంలో భారత్‌లోని మరింత మంది పేషంట్లకు అవసరమైన ఔషధాలను ప్రవేశపెట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఆమ్జెన్ వైస్ ప్రెసిడెంట్ పెన్నీ వాన్ తెలిపారు. శుక్రవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ షేరు స్వల్పంగా పెరిగి రూ. 3,151 వద్ద ముగిసింది. -
కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
– పెట్రోల్ తాగి.. ఆపై ఒంటిపై పోసుకుని.. – నిప్పంటించుకుంటుండగా అడ్డుకున్న సహచరులు – ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని ఆరోపణలు – మోత్కూరులో ఘటన మోత్కూరు: ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నాని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. బాధిత లెక్చరర్‌తో పాటు సహచర లెక్చరర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఎం.మల్లిఖార్జున్ జనరల్ఫౌండేషన్ కోర్సు ఓకేషనల్ (జీఎఫ్‌సీ) కాంట్రాక్ట్ లెక్చరర్‌గా మర్రిగూడ కాలేజీలో 13 సంవత్సరాలుగా పనిచేశాడు. మూడేళ్ల క్రితం బదిలీపై వచ్చి మోత్కూరు జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. మల్లికార్జున్ గురువారం ఉదయం కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ తన బాండ్‌ను రెన్యూవల్‌కు పంపడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే మల్లిఖార్జున్ తన బైక్‌లో ఉన్న పెట్రోల్ బాటిల్‌తీసి కొంత తాగి శరీరంపై పోసుకునిఅగ్గిపుల్లతో నిప్పంటించుకోబోయాడు. గమనించిన తోటి లెక్చరర్లు అతడిని అడ్డుకున్నారు. అనంతరం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. మూడు సంవత్సరాలుగా ఇంటర్‌పబ్లిక్ వార్షిక, సప్లమెంటరీ పరీక్షల రెమ్మునరేషన్ కోసం విధులు నిర్వహించిన వారితో ప్రిన్సిపాల్ ఎక్వీటెన్స్లో సంతకాలు చేయించుకుని డబ్బులు చెల్లించలేదని మల్లిఖార్జున్‌తో పాటు పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ల్చెరర్స్ను పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న ఇన్చార్జీ ప్రిన్సిపాల్ చొప్పరి పరమేశ్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ గురువారం కళాశాల ఆవరణలో ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాయంత్రం ప్రిన్సిపాల్ తన కారులో వెల్లిపోతుండగా లెక్చరర్లు అడ్డుకుని ఘెరావ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.కొండల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరుమాల్ల రాజులు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పరమేశ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను, అధ్యాపకులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యతీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్ అనే లెక్చరర్‌ను ప్రిన్సిపాల్ మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. మహిళా లెక్చరర్లపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రెన్యూవల్ బాండ్కోసం ఒక్కో లెక్చరర్ వద్ద రూ. 10వేలు ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడని ఆరోపించారు. విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.అన్సారీ, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు విజయ్‌కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫయాజ్, నర్సిరెడ్డి, పరుశరాములు, వెంకట్‌రెడ్డి, శ్వేత, మంజుల, వై.నర్సిరెడ్డి, శ్యామ్, లింగస్వామి, నర్సింహ్మ ఉన్నారు. వేధించలేదు : ప్రిన్సిపాల్ కాంట్రాక్ట్ లెక్చరర్లను వేధించడంలేదని , విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ పరమేశ్ తెలిపారు. ప్రిన్సిపాల్ అని కూడా చూడకుండా తిరుగుబాటు ధోరణిలో మల్లికార్జున్ అనే లెక్చరర్ మాట్లాడాడని చెప్పాడు. అటెండెన్స్, బయోమెట్రిక్ విధానం ద్వారా జరుగుతున్నందున ఎవ్వరి రెన్యూవల్ బాండ్లు ఆపడం లేదని చెప్పారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
– పెట్రోల్ తాగి.. ఆపై ఒంటిపై పోసుకుని.. – నిప్పంటించుకుంటుండగా అడ్డుకున్న సహచరులు – ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని ఆరోపణలు – మోత్కూరులో ఘటన మోత్కూరు: ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నాని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. బాధిత లెక్చరర్‌తో పాటు సహచర లెక్చరర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఎం.మల్లిఖార్జున్ జనరల్ఫౌండేషన్ కోర్సు ఓకేషనల్ (జీఎఫ్‌సీ) కాంట్రాక్ట్ లెక్చరర్‌గా మర్రిగూడ కాలేజీలో 13 సంవత్సరాలుగా పనిచేశాడు. మూడేళ్ల క్రితం బదిలీపై వచ్చి మోత్కూరు జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. మల్లికార్జున్ గురువారం ఉదయం కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ తన బాండ్‌ను రెన్యూవల్‌కు పంపడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే మల్లిఖార్జున్ తన బైక్‌లో ఉన్న పెట్రోల్ బాటిల్‌తీసి కొంత తాగి శరీరంపై పోసుకునిఅగ్గిపుల్లతో నిప్పంటించుకోబోయాడు. గమనించిన తోటి లెక్చరర్లు అతడిని అడ్డుకున్నారు. అనంతరం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. మూడు సంవత్సరాలుగా ఇంటర్‌పబ్లిక్ వార్షిక, సప్లమెంటరీ పరీక్షల రెమ్మునరేషన్ కోసం విధులు నిర్వహించిన వారితో ప్రిన్సిపాల్ ఎక్వీటెన్స్లో సంతకాలు చేయించుకుని డబ్బులు చెల్లించలేదని మల్లిఖార్జున్‌తో పాటు పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ల్చెరర్స్ను పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న ఇన్చార్జీ ప్రిన్సిపాల్ చొప్పరి పరమేశ్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ గురువారం కళాశాల ఆవరణలో ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాయంత్రం ప్రిన్సిపాల్ తన కారులో వెల్లిపోతుండగా లెక్చరర్లు అడ్డుకుని ఘెరావ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.కొండల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరుమాల్ల రాజులు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పరమేశ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను, అధ్యాపకులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యతీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్ అనే లెక్చరర్‌ను ప్రిన్సిపాల్ మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. మహిళా లెక్చరర్లపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రెన్యూవల్ బాండ్కోసం ఒక్కో లెక్చరర్ వద్ద రూ. 10వేలు ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడని ఆరోపించారు. విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.అన్సారీ, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు విజయ్‌కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫయాజ్, నర్సిరెడ్డి, పరుశరాములు, వెంకట్‌రెడ్డి, శ్వేత, మంజుల, వై.నర్సిరెడ్డి, శ్యామ్, లింగస్వామి, నర్సింహ్మ ఉన్నారు. వేధించలేదు : ప్రిన్సిపాల్ కాంట్రాక్ట్ లెక్చరర్లను వేధించడంలేదని , విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ పరమేశ్ తెలిపారు. ప్రిన్సిపాల్ అని కూడా చూడకుండా తిరుగుబాటు ధోరణిలో మల్లికార్జున్ అనే లెక్చరర్ మాట్లాడాడని చెప్పాడు. అటెండెన్స్, బయోమెట్రిక్ విధానం ద్వారా జరుగుతున్నందున ఎవ్వరి రెన్యూవల్ బాండ్లు ఆపడం లేదని చెప్పారు. -
అసెంబ్లీలో లేవనెత్తుతాం
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ప్రస్తుతమున్న వారినే తొలగించడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గురువారం తెలంగాణ హౌజింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యగులు రేవంత్‌కు వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. గత మార్చిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 1,179 మందిని ప్రభుత్వం తొలగించడంతో అంతా వీధుల్లో పడ్డామని ఆ ఉద్యోగులు ఆవేదన వెలిబుచ్చారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం నిరుద్యోగులను మోసగించడమేనన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
నల్లగొండ రూరల్ ః ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలు, పెరిగిన వేతనాల కోసం శనివారం జెడ్పీ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న వారికి బకాయి వేతనాలను, పెరిగిన వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల కోసం మూడు సంవత్సరాల నుంచి వేతన ఒప్పందం చేసి అమలు పర్చకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలపై రాతపూర్వక ఒప్పందం చేసుకున్నప్పటికీ జడ్పి సీఈవో, ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండి. సలీం, సులోచన, అద్దంకి నర్సింహ, సత్తయ్య, బయ్యన్నలు కూడ మాట్లాడారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.సైదులు, శ్రీనివాస్‌లు, అశోక్, సంజీవరెడ్డి, వెంకటేష్, రంగయ్య, సత్యం, పరమేష్, తదితరులున్నారు. -
కాంట్రాక్ట్ అధ్యాపకుల మౌన ప్రదర్శన
ఏఎన్‌యూ: యూనివర్సిటీల్లో చేపట్టనున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామక ప్రక్రియలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టటాన్ని నిరసిస్తూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని గాంధీ విగ్రహం నుంచి పరిపాలన భవన్ వరకు మౌన ప్రదర్శనగా వెళ్లి అక్కడ బైఠాయించారు. అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ నియామకాల్లో నూతన విధానాలను ప్రవేశపెట్టే ఆలోచనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పీ సుధాకర్ , డాక్టర్ డీ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ డీ రవిశంకర్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ కే కస్తూరి తదితరులు పాల్గొన్నారు. -
‘స్కాచ్ అండ్ సోడా’తోరిలయన్స్ బ్రాండ్స్ భాగస్వామ్యం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ‘రిలయన్స్ బ్రాండ్స్’ తాజాగా ఆమ్స్టర్డామ్కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ‘స్కాచ్ అండ్ సోడా’తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. రిలయన్స్ బ్రాండ్స్ దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లో ‘స్కాచ్ అండ్ సోడా’ స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. ఇది 2017 నాటికి పూర్తవుతుంది. అలాగే రిలయన్స్ బ్రాండ్స్ ఈ ఫ్యాషన్ బ్రాండ్‌కు చెందిన ప్రొడక్ట్‌లను దేశంలో విక్రయిస్తుంది. ప్రస్తుతం ‘స్కాచ్ అండ్ సోడా’కు అంతర్జాతీయంగా 160 స్టోర్లున్నాయి. భారత్ వంటి ప్రధానమైన మార్కెట్లో తమ బ్రాండ్ మరింత మందికి చేరువ చేయడానికి రిలయన్స్‌తో ఒప్పందం దోహదపడుతుందని ‘స్కాచ్ అండ్ సోడా’ సీఈవో డిర్క్ జాన్ స్టోఫెలెన్బర్గ్ తెలిపారు. ప్రీమియం రిటైల్ మార్కెట్లో వృద్ధికి ఈ భాగస్వామ్యం తమకు ఉపయోగపడుతుందని రిలయన్స్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ దర్శన్ మెహ్తా పేర్కొన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల పోరుబాట
‘హైపవర్’ వేతనాల కోసం డిమాండ్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు శ్రీకారం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మిక మహిళలు గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 2013లో జేబీసీసీఐ నిర్ణయించిన హైపవర్ కమిటీ (హెచ్పీసీ) వేతనాల కోసం ఇక పెద్ద ఎత్తున ఉద్యమం సాగనున్నారు. అన్ని ఏరియాలలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు కాంట్రాక్టు కార్మిక సంఘాల నేతృత్వంలో పోరుబాట పట్టనున్నారు. ఇందుకోసం ఇటీవల కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోగా...ఈ నెల 21వ తేదీన గోదావరిఖనిలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. సింగరేణిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేయూ, ఐఎన్టీయూసీ, బీఐటీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీవీ సంఘాల ఆధ్వర్యంలోని కాంట్రాక్టు కార్మిక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. వీరికి ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. గడిచిన మూడున్నర సంవత్సరాలుగా హైపర్ కమిటీ వేతనాలు, బోనస్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని డివిజన్లలోని జీఎం కార్యాలయాల ఎదుట దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంట్రాక్టు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇవీ డిమాండ్లు.... సకలజనుల సమ్మె వేతనాలను కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాల. ఎన్సీడబ్ల్యూయూ–9లో కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, అలవెన్స్‌లు, సౌకర్యాలను నిర్ణయించి అమలు చేయాలి. సింగరేణిలో సీఐఎల్ ఆదేశాల ప్రకారం 8.33 శాతం బోనస్‌ను అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు చెల్లించాలి. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతన చట్టం అమలు చేయాలి. ఓబీ డ్రైవర్లను ఆపరేటర్లుగా గుర్తించాలి. ఇతర విభాగాల వారిని సెమీ స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలి. సెలవులు, బట్టలు, విద్య, వైద్యం, రక్షణ, నష్టపరిహారం చర్యలు, సౌకర్యాలను అమలు చేయాలి. చట్టబద్ద హక్కులను అమలు చేయాలి. సింగరేణి వ్యాప్తంగా ఖాళీగా ఉన్న కంపెనీ క్వార్టర్లను వెంటనే కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి. అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు సీఎంపీఎఫ్‌ను వర్తింపజేయాలి. సింగరేణి లాభాలలో ఇస్తున్న బోనస్‌ను పర్మినెంట్ కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలి. -
కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయండి
13న భవిష్యత్తు కార్యచరణ కోసం గుంటూరులో సమావేశం రాజానగరం : రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులకు సరైన న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయమై సమావేశంలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు ఈనెల 13న గుంటూరులోని యూటీఎఫ్ స్టేట్ కౌన్సిల్ భవనంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర స్థాయి సమావేశం జరుగనుందని సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ వి. కనకరాజు తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయం (2000 సం)లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులై, నేటికీ చాలీచాలని జీతాలతో విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్న తమపై ప్రభుత్వం కరుణ చూపకపోవడం విచారకరమన్నారు. 2014 ఎన్నికలల్లో టీ డీపీ తిరిగి అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించామన్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారన్నారు. అయితే ఆ సంఘాన్ని వేసి రెండేళ్లవుతున్నా ఇంత వరకు ఎటువంటి ప్రగతి లేదన్నారు. కనీసం జీతాలు కూడా సకాలంలో విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత మార్చి నెల నుంచి జీతాలు రావలసి ఉన్నాయన్నారు. ఇకనైనా కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల సరైన నిర్ణయం ప్రకటించకపోతే న్యాయ పోరాటం చేయకతప్పదని హెచ్చరించారు. -
కాంట్రాక్టు వైద్య సిబ్బంది వేతనాలకు బ్రేక్
ఎన్హెచ్ఎంలో నిధులు లేకపోవడమే కారణం రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఇబ్బందుల్లో 8 వేల మంది సిబ్బంది హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలోని 8 వేల మందికిపైగా కాంట్రాక్టు సిబ్బంది వేతనాలకు బ్రేక్ పడింది. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద పని చేసే వీరికి కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన వద్దే ఉంచుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడగా, తాజాగా వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎన్హెచ్ఎం చేరుకుంది. దీంతో ఉద్యోగులు గొల్లుమంటున్నారు. ఎన్హెచ్ఎం కింద 24 గంటలూ పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 2 వేల మంది స్టాఫ్ నర్సులున్నారు. ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో 4,500 మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. 300 మంది వరకు డాక్టర్లు పని చేస్తున్నారు. వీరితోపాటు ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరి వేతనాలకు నెలకు సుమారు రూ.10 కోట్లు అవసరం. కానీ ఈ నెల వేతనాలు ఇవ్వడానికి కూడా నిధులు లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. కేంద్ర నిధులూ రాష్ట్ర ప్రభుత్వం వద్దే.. రాష్ట్రంలో చేపట్టే ఎన్హెచ్ఎం కార్యక్రమాలకు గతేడాది రూ. 143.28 కోట్లను కేంద్రం ఒక విడతగా కేటాయించింది. వాటితోపాటు ఇప్పటివరకు రాష్ట్రవాటాతో కలిపి తెలంగాణ ప్రభుత్వం ఎన్హెచ్ఎంకు రూ.458 కోట్ల బకాయి పడింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రెండు దఫాలుగా రాష్ట్రానికి కేంద్రం విడుదల చేయాల్సిన రూ.300 కోట్లకు బ్రేక్ పడే అవకాశం ఉందని ఎన్హెచ్ఎం అధికారులు అంటున్నారు. దీంతో కనీసం వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ఈ విషయంపై నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. నిధులు విడుదల చేయాలని సీఎంను కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో జనని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందులు, పరికరాల కొనుగోలు ప్రక్రియ ఆగిపోయింది. -
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్య
మహానంది: తమ్మడపల్లె గ్రామంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు(పోల్టూపోల్) తిరుమలయ్య (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు విద్యుత్ శాఖ ఉద్యోగి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. గ్రామానికి చెందిన కె.తిరుమలయ్య మసీదుపురం గ్రామంలో పోల్టూపోల్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే అక్కడే పనిచేస్తున్న అప్పటి ఏఎల్ఎం పాపన్న రైతులకు ఇచ్చే ఎజీఎల్(వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు) కనెక్షన్ల కోసం వసూలు చేసిన రెండున్నర లక్షల డబ్బులను వాడుకున్నాడు. అప్పటి నుంచి తిరుమలయ్యపై రైతుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకుని మృతి చెందినట్లు లేఖలో తెలిపారు. తన భార్యాబిడ్డలను ఆదుకోవాలని లేఖలో అధికారులను వేడుకున్నాడు. మృతుడికి భార్య మరియమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా రాత్రి 8.15 వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపారు. -
ఒంటి కాలిపై నిల్చొని రెండో ఏఎన్ఎంల నిరసన
మంచిర్యాల టౌన్ : తమను రెగ్యులరైజ్ చేయాలని, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలు బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో గత పది రోజులుగా చేస్తున్న సమ్మె శిబిరంలో ఒంటి కాలిపై నిల్చొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులర్ ఏఎన్ఎంలతో సమానంగా పనిచేస్తున్న, తమకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని,. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ. 21,500లు ఇస్తూ, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే తమకు 35 రోజుల క్యాజువల్ లీవ్‌లు, 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, విధుల్లో ఉండి మతి చెందిన వారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఐ. సుజాత, జిల్లా కార్యదర్శి బి. పద్మ, డివిజనల్ అధ్యక్షురాలు ఎన్. మంజుల, సభ్యులు తిరుమల, నలిత, విజయ, రాజేశ్వరీ, విమల, భవాని, సత్యవతి పాల్గొన్నారు. -
కాంట్రాక్టు అధ్యాపకుల దుస్థితి
రెగ్యులర్ చేస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు హామీ కళాశాలలు ప్రారంభమై రెండు నెలలవుతున్నా కనీసం రెన్యువల్ కూడా చేయని సర్కారు గత ఏడాది వేతన బకాయిలూ చెల్లించని వైనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : ‘మా పార్టీ అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను’ అంటూ గత ఎన్నికల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. రెగ్యులర్ సంగతలా ఉంచితే.. కళాశాలలు తెరచి రెండు నెలలు గడుస్తున్నా.. ఈ ఏడాది కాంట్రాక్టు అధ్యాపకులను ప్రభుత్వం ఇంతవరకూ రెన్యువల్ కూడా చేయలేదు. దీంతో అటు రెగ్యులర్ కాక, ఇటు రెన్యువల్ జరగక వారు త్రిశంకుస్వర్గంలో మగ్గిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 447 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 6,081 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ 1600 మంది రెగ్యులర్, 3,776 మంది కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రమే బోధన సాగిస్తున్నారు. జిల్లాలో 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిల్లో 550 మంది అధ్యాపకులు ఉండాలి. వీరిలో రెగ్యులర్ 110 మంది, కాంట్రాక్టు అధ్యాపకులు 325 మంది ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులకు ఏటా జూన్ ఒకటిన రెన్యువల్ ఇచ్చి మార్చి 28 వరకూ కొనసాగిస్తారు. 16 ఏళ్లుగా ఇదే విధానం కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులవల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లుగా జూన్ ఒకటిన వీరిని రెన్యువల్ చేయడంలేదు. విద్యా సంవత్సరం మధ్యలో రెన్యువల్ ఇచ్చి దానిని డిసెంబర్ వరకూ మాత్రమే కొనసాగిస్తున్నారు. తెల్లకాగితాలపై హాజరు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికే రెండు నెలల కావస్తోంది. అయినప్పటికీ కాంట్రాక్టు అధ్యాపకులను ఇప్పటివరకూ రెన్యువల్ చేయలేదు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, స్పాట్ వేల్యుయేషన్ అనంతరం జూన్ ఒకటి నుంచి కళాశాలల్లో వీరిచేత అనధికారికంగానే విద్యాబోధన సాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల హాజరును సైతం ప్రిన్సిపాల్ తెల్లకాగితంపై నమోదు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం తమను రెన్యువల్ చేస్తుందో చేయదో తెలియని పరిస్థితిలో కాంట్రాక్టు అధ్యాపకులు అభద్రతాభావంతో విధులు నిర్వర్తిస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో సరి కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు పొందుపర్చారు. తదనంతరం వీరిని రెగ్యులర్ చేసే అంశంపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలతో 2014 సెప్టెంబర్ 9న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఈ కమిటీ సేకరించలేదు. ఈ కమిటీ సమావేశమై, నివేదిక ఇచ్చేదెప్పుడు? తమ ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేదెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు.. కనీసం తమను రెన్యువల్ కూడా చేయని సర్కారు తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణలో స్వయంగా అక్కడి ముఖ్యమంత్రి కేసీఆరే పర్యవేక్షిస్తూ కాంట్రాక్టు అ«ధ్యాపకులను క్రమబద్ధీకరిస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు రెగ్యులరైజేష¯Œæపై మాట ఇచ్చి కూడా తప్పారని ఇక్కడివారు ఆవేదన చెందుతున్నారు. అందని వేతన బకాయిలు మరోపక్క కాంట్రాక్టు అధ్యాపకులకు గత విద్యా సంవత్సరం వేతన బకాయిలను కూడా ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదు. దీంతో వారికి పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్కారీ కళాశాలల్లో బోధన మెరుగుపర్చేందుకు తమను వెంటనే రెన్యువల్ చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర నాయకుడు యార్లగడ్డ రాజాచౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..!
– విద్య, వైద్యారోగ్యశాఖల్లో భర్తీకాని పోస్టులు – నత్తనడకన ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకం – సగం స్టాఫ్ నర్సు పోస్టులనే భర్తీ చేసిన వైనం – విడుదల కాని వైద్య ఆరోగ్య మిత్రల ఇంటర్వ్యూ ఫలితాలు – కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఖాళీలపై ఆలసత్వం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది జిల్లాలోని పోస్టుల భర్తీ ప్రక్రియ. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీల్లో ఆయా పోస్టులను ఔట్సోర్సింగ్/కాంట్రాక్ట్/రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాల్సి ఉంది. ఇందు కోసం ఆయా శాఖల అధికారులు పలుమార్లు కలెక్టర్‌కు ఫైల్‌ను పంపినా పలు కారణాలతో తిరస్కరిస్తున్నారు. దీంతో జిల్లాలో సుమారు 250 పోస్టుల భర్తీకి ఆమోదం లభించడంలేదు. సా...గుతున్న ప్రక్రియ జిల్లాలోని 33 మోడల్ స్కూళ్లలో ఒక్కోదానికి ఒక్క కంప్యూటర్ టీచర్, ఒక్క జూనియర్ అసిస్టెంటు, ఒక్క అటెండర్, ఒక్క వాచ్‌మన్ మొత్తం 132 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకోవడానికి 2015–16 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో జూనియర్ అసిస్టెంటు, అటెండర్, వాచ్‌మన్ పోస్టులకు గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో జూనియర్ అసిస్టెంటు, వాచ్‌మన్ పోస్టులకు నెల రోజుల క్రితం రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయినా ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించలేదు. ఇక అటెండర్ పోస్టుకు పరీక్షగాని, ఇంటర్వ్యూకాదని జరపలేదు. మరోవైపు కంప్యూటర్ టీచర్ పోస్టులకు ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఫలితంగా మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఏడాదిగా కంప్యూటర్ విద్యకు నోచుకోవడంలేదు. ఫలితాలు ఎప్పుడో? జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు 150 ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో భాగంగా పోస్టులకు ఇంటర్వ్యూలు కూడా జరిపారు. మూడు నెలలు గడిచిన ఫలితాలను ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖల అధికారులను ఫలితాలపై వాకబు చేస్తే కలెక్టర్ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటున్నారు. తప్పని ఎదురుచూపు.. జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, జిల్లా కేంద్రంలో ఉన్న జనరల్ హాస్పిటల్లో పనిచేయడానికి 150 స్టాఫ్ నర్సు పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో కలెక్టర్ అనుమతి మేరకు వైద్యారోగ్యశాఖాధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా మెరిట్ ప్రతిపాదికన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మొత్తం పోస్టుల్లో 98 పోస్టులను మూడు నెలల క్రితం భర్తీ చేశారు. అందులో మరో ఏడు పోస్టులకు నియామకాలు జరిగాయి. అయితే మిగిలిన 45 పోస్టుల భర్తీ విషయంలో కలెక్టర్ నోరు మెదపడం లేదు. ఈ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా, పెద్దాసుపత్రిలో 29 ప్యారామెడికల్ సిబ్బంది పోస్టులకు భర్తీ చేసుకోవాల్సి ఉండగా అందులో 22మంది తీసుకున్నారు. మిగిలిన ఏడు పోస్టులను భర్తీ చేయలేదు. వీటి భర్తీ కోసం మెరిట్లో ఉన్న అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం.. జిల్లాలో దాదాపుగా ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇందులో పదో తరగతి మొదలు కొని పీహెచ్డీ చేసిన వారి వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అత్రుతతో ఎదురు చూస్తున్నారు. అయితే రెగ్యులర్/ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకోవాలని పలు పోస్టులకు రాష్ట్రం ప్రభుత్వం అనుమతిఇచ్చినా ఏళ్లకు ఏళ్లు నియమించకపోవడంపై నిరుద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం: లెనిన్‌బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టులను భర్తీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. మోడల్ స్కూళ్లలో ఏడాది నుంచి పోస్టులను భర్తీ చేయకపోవడం దారుణం. జిల్లా కలెక్టర్ తీరు బాధాకరం. వైద్య ఆరోగ్యశాఖల భర్తీకి చర్యలు తీసుకోవాలి. లేదంటే నిరుద్యోగులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం. -
సామూహిక సెలవులో కాంట్రాక్ట్ అధ్యాపకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేసే అధ్యాపక పోస్టులను ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో వారందరూ సామూహిక సెలవుల్లో వెళ్లారు. దీంతో జిల్లాలో విద్యా బోధన నిలిచిపోయింది. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 303 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 28వ తేదీతో వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయినా రెన్యువల్ అవుతుందనే ఆశతో అప్పటి నుంచి కళాశాలలకు వచ్చి పని చేస్తున్నారు. అయితే వారి పోస్టులను ప్రభుత్వం ఇప్పటి వరకు రెన్యువల్ చేయలేదు. ఈ విషయమై పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో సోమవారం సామూహిక సెలవుల్లో వెళ్లిపోయారు. పత్తికొండ, కోడుమూరు, హŸళగుంద, కేవీఆర్ కళాశాలల్లో అందరూ సెలవులో వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 15 కళాశాలల్లో 46 మంది సెలవులో ఉన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే మంగళవారం మరిన్ని కళాశాలల అధ్యాపకులు సెలవులో వెళ్లిపోయే అవకాశం ఉంది. ఆర్జేడీకి నివేదిక పంపాం: సీడీ కబీరు, డీవీఈఓ -
కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఇంటికేనా...?
కానరాని పునరుద్ధరణ ఆందోళనలో ఉపాధ్యాయులు మంచిర్యాల సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి చదువుతోపాటు కళలు, వ్యాయామం, కంప్యూటర్ విద్య కూడా అందించాలనే సదుద్దేశంతో 2012–13 విద్యాసంవత్సరంలో కాంట్రాక్టు ప్రాతిపదికన అర్హత ఉన్న వారిని ఉపాధ్యాయులుగా నియమించింది. జిల్లాలో ఇలా నియామకమైన వారు సుమారు 250 మంది ఉన్నారు. 2016–17 విద్యాసంవత్సరం ఆరంభమై నెలరోజులు కావస్తున్నా నేటికీ వీరి పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. దీంతో వారంతా ఆందోళనకు గురై ఇంటికే పరిమితం కావాల్సిందేనా అంటూ ఆవేదన చెందుతున్నారు. 2012–13 నుంచి నాలుగేళ్లపాటు కంప్యూటర్ ఆపరేటర్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, పీఈటీ ఉపాధ్యాయులుగా రూ.6 వేల వేతనంతో పనిచేశారు. పాఠశాలల ప్రారంభం రోజున విధులకు వెళ్లగా సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు విధులకు రావొద్దని, మీ పునరుద్ధరణపై ఎలాంటి ఆదేశాలు విద్యాశాఖ నుంచి రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ నుంచి నేటి వరకు కూడా జిల్లా విద్యాశాఖకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో నాలుగేళ్లపాటు సేవలందించిన వీరంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉన్న వారంతా కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో సంతోషపడ్డారు. నేటì కీ ఉత్తర్వులు రాకపోవడంతో అసంతప్తిలో ఉండిపోయారు. ప్రజాప్రతినిధులను కలుస్తూ తమను ఆదుకోవాలంటూ వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఏటా పాఠశాలల ప్రారంభానికి ఒక రోజు ముందుగానే రెన్యువల్‌కు సంబంధించిన ఉత్తర్వులు రావడం ఆనవాయితీ. కొత్తగా నియామకం.. ప్రభుత్వ పాఠశాలల్లో నియామక ప్రకటన జారీ చేసి కొత్తగా నియమించాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు పనిచేసిన వారంతా కూడా నియామక ప్రకటన ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ప్రకటన ఇవ్వడం నుంచి మొదలుకొని నియామకం అయ్యే వరకు కనీసం మూడు నుంచి నాలుగు నెలల కాలం పట్టే అవకాశాలు ఉంటాయి. తద్వార ఉన్న పుణ్యకాలం కాస్త దగ్గర పడుతుంది. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కాంట్రాక్ట్ జవాన్ ఆత్మహత్య
lకమిషనర్ విధుల నుంచి తొలగించడంతో మనస్థాపం చెందాడని బంధువుల ఆరోపణ నర్సంపేట : ఉరివేసుకొని నగర పంచాయతీలో కాంట్రాక్ట్ జవాన్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని కుమ్మరికుంట కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన జెట్టి రాజయ్య కుమారుడు శ్రీనివా స్ 15 ఏళ్లుగా నగర పంచాయతీలో కాంట్రాక్ట్ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో పంచాయతీ కమిషనర్ చెప్పినట్లుగా నడుచుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుండడంతో కమిషనర్ మల్లికార్జునస్వామి శ్రీనివాస్‌ను 45 రోజుల క్రితం విధుల నుంచి తొలగించారన్నారు. దీంతో శ్రీనివాస్ తీవ్ర మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి వాసానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కవారు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య సం ధ్య, కొడుకు ఉన్నారు. ఇదే విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా విధి నిర్వహణ నిబంధనలో భాగంగా శ్రీనివాస్‌ను కొన్ని రోజులు పక్కకు పెట్టి విధులకు తీసుకోవడం జరిగిందని, తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. -
చేతులు కలిపిన టాటా, బెల్ హెలికాప్టర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానయానం, రక్షణ రంగ ఆధునికీకరణ ప్రక్రియలో కలిసి పనిచేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), బెల్ హెలికాప్టర్స్ గురువారం చేతులు కలిపాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వాణిజ్య, మిలిటరీకి అవసరమైన హెలికాప్టర్ల తయారీ, అసెంబ్లింగ్తోపాటు సిబ్బందికి శిక్షణ ఇస్తాయి. నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్ సేవలతోపాటు పరిశోధన, అభివృద్ధి చేపడతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి. -
సీ-డాక్ తో ఈసీఐఎల్ ఒప్పందం..
హైదరాబాద్: నిత్యజీవితంలో వాడే అనేక పరికరాలకు ఇంటర్నెట్ అనుసంధానం చేయడానికి సీ-డాక్ సంస్థ రూపొందించిన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతిక పరిజ్ఞాణాన్ని వృద్ది చేసే బాద్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేటషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సంస్థకు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ సంచాలకులు అరుణాశర్మ సమక్షంలో సీ-డాక్ డెరైక్టర్ రజత్మూనా చేతుల మీదుగా ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ పి. సుదాకర్ ఒప్పంద పత్రాలు అందుకున్నారు. సీ-డాక్ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞాణంతో ఐఓటీ అవసరాలతో పాటుగా పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. -
అల్ట్రాటెక్తోడీల్ విలువను పెంచిన జేపీ
న్యూఢిల్లీ: తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకర్ల చేతికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్(జేపీ) గ్రూప్.. అల్ట్రాటెక్‌తో ఒప్పందం విలువను పెంచింది. ఐదు రాష్ట్రాల్లో ఉన్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) విక్రయించడం కోసం గతంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్‌తో జేపీ రూ.15,900 కోట్లకు ఒప్పం దాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువను ఇప్పుడు రూ.16,189 కోట్లకు పెంచుతూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జేపీ అసోసియేట్స్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న 4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్ ప్లాంట్ పూర్తయ్యాక మరో రూ. 470 కోట్లు అదనంగా చెల్లించేందుకు కూడా అల్ట్రాటెక్ అంగీకరించినట్లు జేపీ గ్రూప్ వెల్లడిం చింది. కాగా, జేపీ రుణ ఖాతాను మొండిబకాయిగా మార్చిన బ్యాంకర్ల కన్సార్షియం వ్యూహా త్మక రుణ పునర్వ్యవస్థీకరణ(ఎస్డీఆర్) ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఎస్డీఆర్ అమల్లోకివస్తే.. బ్యాంకర్లు తమ రుణ బకాయిలకుగాను కంపెనీలో వాటాలను తీసుకుం టాయి. దీంతో జేపీ గ్రూప్ నియంత్రణ పూర్తిగా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. -
డేటింగ్ చేయబోమని సంతకం చేస్తేనే ఛాన్స్..
సినిమాలు, టీవీ షోలు, సీరియళ్లలో నటించేముందు నటీనటులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తుంటారు. ఎవరికీ ఎలాంటి అవాంతరాలు, సమస్యలు రాకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే హిందీ టీవీ షో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేసి ఒప్పంద పత్రంలో 'నో డేటింగ్' క్లాజ్ చేర్చడం విమర్శలకు దారితీస్తోంది. తాము ఎవరితోనూ డేటింగ్ చేయడంలేదని, సింగిల్‌గా ఉంటామని హామీ ఇస్తూ ఒప్పంద పత్రంలో నటీనటులు సంతకాలు చేయాలి. రిష్టన్ కా సౌదాగర్- బాజీగర్ అనే టీవీ సిరీస్ కోసం నటీనటులు వత్సల్ సేథ్, ఇషితా దత్తా 'నో డేటింగ్' క్లాజ్ కూడిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సీరియల్ త్వరలో ప్రసారంకానుంది. కాగా ఒప్పంద పత్రంలో 'నో డేటింగ్' క్లాజ్‌ను చేర్చడాన్ని పలువురు నటులు వ్యతిరేకించారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని, కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించే హక్కు లేదని అన్నారు. ప్రేమ, బంధాలకు.. ఒప్పందాలతో సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
గో-బిజ్తో టీహబ్ ఒప్పందం
హైదరాబాద్: అమెరికాలోని ‘ఐ హబ్’లతో తెలంగాణ ‘టీ హబ్’ను అనుసంధానం చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం కాలిఫోర్నియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. సంయుక్త ఆవిష్కరణలు, ప్రత్యామ్నాయ ఇంధనంలో పరస్పర సహకారం, పర్యావరణ సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక రంగం, వాణిజ్య ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగం తదితరాలపై ఇరు ప్రాంతాల నడుమ ఒప్పందం కుదిరింది. సిలికాన్ వ్యాలీ, తెలంగాణ నడుమ వినూత్న ఆలోచనల మార్పిడికి.. కాలిఫోర్నియా ఒప్పందంతో కొత్తమార్గం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐ హబ్‌లతో అనుసంధానం రెడ్డింగ్ మొదలుకుని సాన్‌డీగో వరకు సుమారు 15 ప్రముఖ ఐహబ్‌లు.. అమెరికాలోనే అతి పెద్ద ‘గో-బిజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్’గా ఏర్పడ్డాయి. ప్రస్తుత ఒప్పందం ద్వారా గో బిజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌తో టీ హబ్ అనుసంధానమవుతుంది. తద్వారా టీ హబ్‌లోని తమ భాగస్వామ్య సంస్థలు, కంపెనీలతో కాలిఫోర్నియాలోని ఐ హబ్‌లు వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు వీలవుతుంది. -
నకిలీ వీసాల కేసులో నలుగురి అరెస్టు
నకిలీ వీసాల మంజూరు కేసులో దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) ఉద్యోగిని.. జైలుపాలైంది. నకిలీ వీసాలను సృష్టించిన కేసులో ఆమెకు సహాయపడిన మరో కంపెనీ ప్రతినిధి, ఇద్దరు టైపిస్టులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీసాల ప్రాసెసింగ్ లో మోసపూరిత ఒప్పందాలు కుదుర్చుకున్నఆరోపణలతో సదరు అధికారిణి సహా నిందితులను పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. నకిలీ డాక్యుమెంట్తతో 127 వీసాలను జారీచేసిన ఉద్యోగినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమిరటీ కంపెనీ ప్రతినిధి జెడ్ హెచ్, నకిలీ ఫ్యామిలీ వీసాలకోసం ఇద్దరు భారతీయ టైపిస్టులు, ఎస్పీ, సీఏ లతో కలసి మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది. మొత్తం 90 ఎజారి కాంట్రాక్ట్ కాపీలను ఫోర్జరీచేసి, జీడీఆర్ఎఫ్ఏ కార్పోరల్ కు సమర్పించగా... పరిచయస్తులే కావడంతో గుడ్డిగా ఆమోదించిన అధికారిణి మొత్తం 127 ఫ్యామిలీ వీసాలను జారీ చేసింది. నకిలీ వీసాలకోసం సుమారు 920,000 దుబాయ్ ఎమిరేట్స్ దిర్హామ్ లు, అంటే సుమారు రూ. 1.69 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఎస్పీ, సీఏలు సృష్టించి ఇచ్చిన నకిలీ ఎజారీ డాక్యుమెంట్లను ఆపయోగించి తన పరిచయాలతో అధికారుల ద్వారా అక్రమంగా ఫ్యామిలీ వీసాలను పొందినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ ధ్రువపత్రాల తయారీలో ఇద్దరు ఇండియన్ల పాత్ర కూడ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికారిక పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పత్రాల దిద్దుబాటు, లంచగొండితనం వంటి కారణాలతో సదరు అధికారిణిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. ఆదివారం దుబాయ్ కోర్టు ముందు హాజరైన ఆమె.. లంచం తీసుకున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను అంగీకరించినట్లు తెలిపారు. -
తరాలు మారినా.. మారని తలరాత
♦ పెరగని వేతనాలు.. కరువైన భద్రత ♦ దీనావస్థలో కార్మికుల ‘బతుకులు’ ♦ నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం తాండూరు రూరల్/జవహర్‌నగర్: తరాలు మారినా.. ప్రభుత్వాలు మారుతున్నా కార్మికుల తలరాత మాత్రం మారడం లేదు. ఎన్నోఏళ్లుగా పని చేస్తున్నా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులుగానే మిగిలిపోతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెరగడంలేదు. శ్రమదోపిడీకి గురవుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో మూడు ప్రధానమైన సిమెంట్ ఫ్యాక్టరీలు, 500లకు పైగా నాపరాతి గనులు, 600లకు పైగా నాపరాతి పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. మూడు సిమెంట్ ఫ్యాక్టరీల్లో 600లకు పైగా పర్మినెంట్ ఉద్యోగులు, 3వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల భద్రత గాలిలో దీపంలా మారింది. బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన ‘కోల్‌మిల్’ వద్ద నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పని చేస్తున్నారు. రాష్ట్రం వచ్చినా అంతే.. తెలంగాణ ప్రభుత్వంలో కార్మికుల బతుకులు మారుతాయని ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కాంట్రాక్టు కార్మిక వ్యవ స్థే తెలంగాణలో లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను నిలబెట్టుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కపట ప్రేమను చూపిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలగానే ఈఎస్ఐ ఆస్పత్రి.. వ్యాపార పరంగా పేరుగాంచిన తాండూరు ప్రాంతంలో కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్న ఈఎస్ఐ ఆస్పత్రి కాగితాలకే పరిమితమైంది. పది సంవత్సరాలుగా తాండూరులో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. కనీస వేతనం కరువు.. ఓగిపూర్, మల్కాపూర్ గ్రామ శివార్లలో 500లకు పైగా నాపరాతి గనులు ఉన్నాయి. ఇక్కడ సూర్యోదయంతోనే వడ్డెరబస్తీలో సందడి నెలకొం టుంది. కూలి పనులు కోసం వడ్డెరులు ప్రతి రోజు వందల సంఖ్యలో నాపరాతి గనులకు వెళ్తుంటారు. గనుల్లో కనీస వేతనం కూడా యాజమాన్యాలు చెల్లించడం లేదని వడ్డెర సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రమాదకరమైన నాపరాతి గనుల్లో పని చేస్తే.. కనీసం రోజు వారి కూలీ గిట్టడం లేదని వాపోతున్నారు. -
‘మహా’ సంబురం!
♦ ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం ♦ ఒప్పందంతో దశాబ్దాల కల సాకారం ♦ లెండి, ప్రాణహిత ప్రాజెక్టులకు మేలు ♦ సరిహద్దు ప్రాజెక్టులకు అనుమతులు సులభం ♦ కేసీఆర్‌కు అభినందనలు తెలిపేందుకు నేతలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ-మహారాష్ర్ట ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రెండు రోజులుగా జరిపిన చర్చలతో మంగళవారం చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు, ఇతర ఉన్నతాధికారుల ప్రయత్నం ఫలించింది. సోమవారం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో ముంబై రాజ్‌భవన్‌లో చర్చలు జరిపిన కేసీఆర్ బృందం.. మంగళవారం అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి న ఆరు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఈ ఒప్పందం జరగ్గా.. జిల్లాకు చెందిన లెండి ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టులు ఉండటం జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దశాబ్దాల కల సాకారం.. ప్రాజెక్టుల నిర్మాణంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడంతో దశాబ్దాల కల సాకారమైనట్లుగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలో మూడు పర్యాయాలు మంత్రుల బృందాలు అక్కడి సీఎంను కలిశాయి. సీఎం కేసీఆర్ రెండు సార్లు లేఖలు కూడా రాశారు. ఎట్టకేలకు సోమవారం, మంగళవారం రెండు రోజులు జరిపిన చర్చలు సఫలం కావడం, ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డంకులు తొలగేలా రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, ఫడ్నవీస్‌లు ఒప్పందం సంతకాలు చేయడం చరిత్రాత్మక ఘట్టంగా చెప్తున్నారు. కాగా, జిల్లా సరిహద్దు ప్రాంతానికి పడమర గోదావరి నది ఆనుకొని ఉంది. ఈ నదిపై జిల్లా ప్రాంతంలో అనేక లక్షలాది ఎకరాల భూములు సాగులో ఉన్నాయి. తాగునీటికి కూడా ఇది ప్రధానంగా ఉంది. దీనిపై ప్రాజెక్టుల నిర్వహణ సంబంధించి మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కీలకంగా మారింది. ఈ ఒప్పందంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ, సాగు, తాగునీరుకు గతంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం దొరికినట్లయ్యింది. జిల్లాలో గోదావరి నది 110 కిలోమీటర్లు ప్రవేశించి కరీంనగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఇది నది గుండా ఇప్పటికే సాగు, తాగునీరు అందుతుంది. దీనిపై లెండి, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులు నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి. మహా ఒప్పందంతో ఈ ప్రాజెక్టులకు ఆటంకాలు తొలగిపోనున్నాయి. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మహా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో ఇరురాష్ట్రాల మధ్య అంతరంగాలు, ఆటంకాలు తొలగిపోనున్నాయి. రాష్ట్రంలో తొలి అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేసుకోవడం ప్రథమం. నీటి అవసరాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఈ బోర్డు పరిశీలన చేపడుతుంది. స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర జలవివాదాలకు పుల్‌స్టాఫ్ పెడుతూ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా నుంచి పెద్దమొత్తంలో ప్రజాప్రతినిధులు, నాయకులు హైదరాబాద్ విమానాశ్రయానికి తరలి వెళ్లారు. కీలక ఒప్పందాలతో స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సోమవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదాలను పరిష్కరించుకొని గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించేందుకు మహా ఓప్పందం జరిగిందని, గతంలో ఒప్పందాలు కుదిరినా కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటిని ఒకే గొడుకు కిందికి తీసుకరావడం మంచి నిర్ణయమని నేతలు అభిపాయ పడుతున్నారు. గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలన్నింటికి రెండు ప్రభుత్వాలు కట్టుబడి ఉండేలా నిర్ణయాలు జరగడం, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల సాంకేతిక అంశాలన్నింటిని నూతనంగా ఏర్పడిన బోర్డు పరిష్కారం చేయాలనడం మంచి పరిణామాలని వారు పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ఒప్పంద.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఏర్పర్చుకున్న తొలి అంతర్రాష్ట్ర బోర్డుగా వారు పేర్కొన్నారు. -
అనుకోకుండా అగాధంలోకి...
నిప్పులు చిమ్ముతు నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో వీరే... నెత్తురు కక్కుతు నేలకు నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే... ఎప్పుడో మన శ్రీ శ్రీ రాసిన ఈ మాట ఇప్పుడు టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు అతికినట్టు సరిపోతుంది. టెన్నిస్ చరిత్రలో అత్యంత ‘ఖరీదైన’ క్రీడాకారిణిగా ఆకాశానికెత్తిన సమాజం... ఇప్పుడు డోపింగ్‌లో విఫలం కావడంతో విమర్శల వర్షం కురిపిస్తోంది. తెలిసి చేసినా, పొరపాటున చేసినా షరపోవా చాలా ఖరీదైన తప్పు చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిన్నప్పుడు అమెరికా వెళ్లిన ఓ అమ్మాయి... 1200 కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచంలోనే ఎక్కువ సంపాదన ఉన్న క్రీడాకారిణిగా ఎదిగింది. ఇన్నాళ్లూ ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం. కానీ డోపింగ్ వివాదంతో ఆ పేరు పోగొట్టుకుంది. సాక్షి క్రీడావిభాగం: సాధారణంగా ఆట, అందం ఒకే చోట ఉండటం అరుదు. కానీ షరపోవాలో ఈ రెండూ ఉన్నాయి. అందుకే ఆమె కోట్లాది మంది టెన్నిస్ అభిమానులకు ఆరాధ్య దేవత. ఆట విషయంలో, మార్కెటింగ్ విషయంలోనూ ఆమె చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఏ రోజూ ట్రైనింగ్ షెడ్యూల్‌ను తప్పదు. డైట్ దగ్గరి నుంచి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక తనని తాను మార్కెట్ చేసుకోవడంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తుంది. అందుకే ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లు ఆమె కోసం క్యూ కట్టాయి. కానీ ఒకే ఒక చిన్న నిర్లక్ష్యానికి ఇంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. ఒక ఈ-మెయిల్‌ను తెరచి జాగ్రత్తగా చదవకపోవడం వల్ల ఇంత అనర్థం జరిగింది. తన కెరీర్‌నే అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాన్న సంకల్పం టెన్నిస్‌లో షరపోవా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడంలో తండ్రి యూరీ పాత్ర ఎనలేనిది. 1987లో ఏప్రిల్ 19న రష్యాలోని న్యాగన్ పట్టణంలో యూరీ, యెలానా దంపతులకు షరపోవా జన్మించింది. అంతకుముందు ఏడాది చెర్నోబిల్ అణు కర్మాగారంలో సంభవించిన విస్ఫోటం వల్ల ఆ ప్రభావం తమ ఆరోగ్యంపై పడకూడదనే ఉద్దేశంతో షరపోవా కుటుంబం 1989లో సోచి పట్టణానికి మకాం మార్చింది. అక్కడే టెన్నిస్ కోచ్ అలెగ్జాండర్ కఫెల్నికోవ్తో యూరీకి పరిచయం ఏర్పడింది. 1991లో షరపోవాకు అలెగ్జాండర్ కఫెల్నికోవ్ ఒక రాకెట్ ఇచ్చారు. ఈ రాకెట్‌తో షరపోవా తన తండ్రితో కలిసి స్థానిక పార్క్‌లో టెన్నిస్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ తర్వాత తన కూతురిని మేటి టెన్నిస్ ప్లేయర్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తండ్రి యూరీ వెటరన్ కోచ్ యూరీ యుట్కిన్ వద్ద శిక్షణ ఇప్పించారు. 1993లో మాస్కోలో దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నిర్వహించిన టెన్నిస్ క్లినిక్‌కు షరపోవా హాజరైంది. అక్కడే ఆరేళ్ల షరపోవా ఆటతీరును గమనించిన నవ్రతిలోవా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న విఖ్యాత నిక్ బొలెటరీ టెన్నిస్ అకాడమీలో చేర్పించాలని తండ్రి యూరీకి సూచించింది. తల్లికి దూరంగా... ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇంగ్లిష్ భాష తెలియనప్పటికీ... తన కూతురు భవిష్యత్ బాగుండాలనే లక్ష్యంతో యూరీ అప్పు చేశాడు. 1994లో చేతిలో 700 డాలర్లు పెట్టుకొని యూరీ, షరపోవా అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో అడుగుపెట్టారు. వీసా సమస్యల కారణంగా షరపోవా వెంట ఆమె తల్లి రాలేకపోయింది. రెండేళ్లు తల్లికి దూరంగానే షరపోవా ఉండాల్సి వచ్చింది. మరోవైపు తాము తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో యూరీ చిన్నా చితకా పనులు చేసి సంపాదించారు. చివరికి హోటళ్లలో ప్లేట్లు కూడా కడిగారు. కొంతకాలం స్థానిక రిక్ మాకీ అకాడమీలో శిక్షణ పొందిన షరపోవా కెరీర్ 1995లో మలుపు తిరిగింది. ఆమె ప్రతిభను గమనించిన ఐఎంజీ సంస్థ షరపోవాతో 1995లో ఒప్పందం చేసుకుంది. నిక్ బొలెటరీ అకాడమీలో ఉండి శిక్షణ పొందేందుకు ఏడాదికి అవసరమయ్యే 35 వేల డాలర్ల ఫీజును చెల్లించడానికి ఐఎంజీ సంస్థ అంగీకరించింది. దాంతో తొమ్మిదేళ్ల ప్రాయంలో షరపోవా నిక్ బొలెటరీ అకాడమీలో చేరింది. అక్కడి నుంచి షరపోవాకు ఎదురులేకుండా పోయింది. 2000లో 13 ఏళ్ల ప్రాయంలో ఎడ్డీ హెర్ అంతర్జాతీయ టోర్నీలో షరపోవా అండర్-16 విభాగంలో టైటిల్ సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తన ఆటకు మరింత పదును పెట్టుకొని 14 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్‌గా మారింది. 2003 చివరికొచ్చేసరికి టాప్-50లోకి వచ్చింది. టెన్నిస్‌లో రష్యా విప్లవం ఒక్కో మెట్టు ఎక్కిన షరపోవా 2004లో మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ ఏడాది వింబుల్డన్ ఫైనల్లో షరపోవా వరుస సెట్లలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. వింబుల్డన్ టైటిల్ గెలిచినందుకు వచ్చిన ప్రైజ్‌మనీతో షరపోవా తన తండ్రి పేరిట ఉన్న అప్పులను తీర్చేసింది. 2005 ఆగస్టులో ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగిన షరపోవా ఈ ఘనత సాధించిన తొలి రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత 2006లో ఆమె యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. షరపోవా విజయాల స్ఫూర్తితో రష్యాలో టెన్నిస్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. మరీ ముఖ్యంగా అమ్మాయిలు టెన్నిస్ క్రీడను కెరీర్‌గా ఎంచుకోవడం మొదలుపెట్టారు. 2007లో భుజం గాయంతో షరపోవా కొంతకాలంపాటు ఆటకు దూరమైంది. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి ఫామ్‌లోకి వచ్చిన ఈ రష్యా స్టార్‌కు భుజం గాయం తిరగబెట్టింది. దాంతో పది నెలలపాటు ఆటకు దూరమైంది. 2012లో ఫ్రెంచ్ ఓపెన్ సాధించి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతను పూర్తి చేసుకున్న షరపోవా లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించింది. 2013లో అంతగా ఆకట్టుకోలేకపోయినా... 2014లో రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించి తనలో చేవ తగ్గలేదని నిరూపించుకుంది. 2015లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా... సెరెనా ధాటికి రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు, వింబుల్డన్‌లో సెమీస్‌కు చేరిన షరపోవా గాయంతో యూఎస్ ఓపెన్‌కు దూరమైంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న షరపోవా ఈ టోర్నీ సందర్భంగా డోప్ టెస్టులో పట్టుబడింది. ఏం జరిగినా... ఇకపై మహిళల టెన్నిస్‌కు కొంత కళ తగ్గుతుందనేది వాస్తవం. షరపోవా కోసమే టెన్నిస్ చూసే అభిమానులు లక్షల్లో ఉంటారు. వాళ్లందరికీ నిరాశ తప్పదు. అయితే నాలుగేళ్ల తర్వాతైనా తిరిగి మళ్లీ వచ్చి కొంతకాల ఆడి సగర్వంగా వైదొలగాలనే షరపోవా ఆశ తీరాలనేది ఆమె అభిమానుల ఆకాంక్ష. -
హతవిధీ!
ఓ చిన్న తప్పు... టెన్నిస్ క్రీడకు మచ్చ తెచ్చింది. ఓ చిన్న నిర్లక్ష్యం... గొప్ప క్రీడాకారిణి కెరీర్‌కు కళంకం తెచ్చింది. తెలిసి చేసిందో... తెలియక చేసిందోగానీ.. చేసిన చిన్న తప్పిదానికి రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా భారీ మూల్యం చెల్లించింది. ఎండకు ఎండి... చెమటకు తడిచి నిర్మించుకున్న 15 ఏళ్ల ఉజ్వల కెరీర్‌కు ఊహించని రీతిలో బ్రేక్ పడింది! ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్టులో షరపోవా విఫలమైంది. నిషేధిత ఉత్ప్రేరకం వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. షరపోవా డోప్ టెస్టులో విఫలమైన వార్తతో టెన్నిస్ ప్రపంచం ఉలిక్కి పడింది. * డోపింగ్ టెస్టులో విఫలమైన షరపోవా * మెల్డోనియం వాడినట్లు నిర్ధారణ * నాలుగేళ్లు నిషేధం పడే అవకాశం లాస్ ఏంజిల్స్ (అమెరికా): రష్యా టెన్నిస్ స్టార్, ఐదు గ్రాండ్‌స్లామ్‌ల విజేత మరియా షరపోవా డోపింగ్ టెస్టులో పట్టుబడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా ఆమె నిషేధిత ఉత్ప్రేరకం ‘మెల్డోనియం’ను వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో షరపోవాపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ప్రకటించింది. ఇది ఈనెల 12 నుంచి అమల్లోకి రానుంది. జనవరి 26న నిర్వహించిన డోప్ పరీక్షలో షరపోవా మెల్డోనియం వాడినట్లు తేలడంతో మార్చి 2న ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. సోమవారం అర్ధరాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రష్యా క్రీడాకారిణి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కేసు విచారణలో ఉండటంతో నిషేధం, జరిమానా ఎంత విధిస్తారన్న దానిపై స్పష్టత లేదు. అయితే ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిబంధనల ప్రకారం అథ్లెట్లు ఉద్దేశపూర్వకంగా ఈ మందును తీసుకున్నారని తేలితే గరిష్టంగా నాలుగేళ్ల నిషేధం, తెలియక జరిగిన తప్పుగా భావిస్తే రెండేళ్ల నిషేధం, స్వల్ప జరిమానా విధించే అవకాశాలున్నాయి. అసలు కథ ఇది! వాస్తవానికి షరపోవా 2006 నుంచే మెల్డోనియంను వాడుతోంది. కానీ ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ డ్రగ్‌ను ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ విషయాన్ని అథ్లెట్లందరికీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ మెయిల్‌ను చదివిన షరపోవా కాస్త నిర్లక్ష్యపు ధోరణితో నిషేధిత డ్రగ్స్ జాబితాకు సంబంధించిన లింక్‌ను మాత్రం తెరచి చూడలేదు. దీంతో యధావిధిగా మెల్డోనియం ఉపయోగించడంతో డోపింగ్‌లో పట్టుబడింది. రక్త ప్రసరణ పెంచుతుంది తాను తరచుగా ఫ్లూ బారిన పడుతుండటం, కుటుంబంలో చాలా మందికి షుగర్ వ్యాధి ఉండటం, శరీరంలో మెగ్నీషియం స్థాయి తక్కువగా ఉండటం, గుండె సంబంధిత సమస్యల వంటి అనేక అంశాలతో గత పదేళ్ల నుంచి మెల్డ్రోనేట్ (మెల్డోనియం)ను వాడుతున్నట్లు షరపోవా తెలిపింది. అయితే మెల్డ్రోనేట్, మెల్డోనియం ఒకే రకమైన డ్రగ్ అనే విషయం తనకు తెలియదని చెప్పింది. మరోవైపు ఐషిమియా (శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటం) వ్యాధిగ్రస్తుల్లో రక్త ప్రసరణ పెంచడానికి మెల్డోనియంను ఉపయోగిస్తారు. దీనివల్ల ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యం పెరుగుతుంది. మెల్డోనియం తీసుకోవడం వల్ల అథ్లెట్లలో ఎక్స్‌ర్‌సైజ్ చేసే సామర్థ్యం గణనీయంగా పెరగడంతో పాటు మైదానంలో మెరుగైన ప్రదర్శనకు కారణం అవుతుందని వివిధ పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకున్న ‘వాడా’ ఎస్-4 నిషేధిత జాబితాలో చేర్చింది. లాత్వియా దేశంలో తయారయ్యే ఈ మందును రష్యా, బాల్టిక్ దేశాల్లో మాత్రమే అమ్ముతారు. అమెరికా ఎఫ్‌డీఏతో పాటు యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీనికి ఆమోదం లేదు. మరికొంత మంది కూడా... ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ మందును వాడిన మరికొంత మంది అథ్లెట్లు కూడా డోప్ పరీక్షలో విఫలమయ్యారు. అబెబీ అర్గెవీ (మహిళల 1500 మీటర్లు), ఎండేషా నెగేస్సి (మారథాన్), ఓల్గా అబ్రామోవా, అర్టెమ్ టైచెంకో (ఉక్రెయిన్ బైఅథ్లెట్స్), ఎడ్వర్డ్ ఓర్గనోవ్ (రష్యా సైక్లిస్ట్), ఎకతెరినా (రష్యా ఐస్ డాన్సర్)లు డోపీలుగా తేలడంతో తాత్కాలిక నిషేధం విధించారు. నైకీ బై బై డోపింగ్ ఉదంతం బయటకు రావడంతో వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు కుమ్మరించే స్పా న్సర్లు ఒక్కొక్కరుగా తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు. ప్రముఖ క్రీడావస్త్రాల సంస్థ ‘నై కీ’... షరపోవాతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుం ది. స్విస్ వాచ్ కంపెనీ ‘టాగ్ హ్యుయేర్’ ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడానికి నిరాకరించింది. ‘నేను డోప్ పరీక్షలో విఫలమయ్యా. ఇందుకు పూర్తి బాధ్యత నాదే. చాలా పెద్ద తప్పు చేశా. నా అభిమానులకు, టెన్నిస్‌కు తలవంపులు తీసుకొచ్చా. నాలుగేళ్ల వయసులో రాకెట్ పట్టా. అప్పట్నించీ ఆటలోనే మునిగితేలా. ప్రస్తుత పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలుసు. నా కెరీర్‌ను ఇలా ముగించాలని అనుకోవడంలేదు. టెన్నిస్ ఆడేందుకు నాకు ఇంకో అవకాశం ఉంటుందని ఆశిస్తున్నా.’ - షరపోవా ప్రొఫైల్ పూర్తి పేరు: మరియా షరపోవా పుట్టిన తేదీ: ఏప్రిల్ 19, 1987 పుట్టిన స్థలం: న్యాగన్, రష్యా నివాసం: ఫ్లోరిడా, అమెరికా ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు బరువు: 59 కేజీలు ప్రొఫెషనల్‌గా మారింది: 2001లో అత్యుత్తమ ర్యాంక్: 1 (2005, ఆగస్టు) ప్రస్తుత ర్యాంక్: 7 కెరీర్ సింగిల్స్ టైటిల్స్: 35 కెరీర్ డబుల్స్ టైటిల్స్: 3 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్: వింబుల్డన్ (2004), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008), ఫ్రెంచ్ ఓపెన్ (2012, 2014), యూఎస్ ఓపెన్ (2006) గెలుపోటములు: 601-145 సంపాదించిన ప్రైజ్‌మనీ: 3,67,66,149 డాలర్లు (రూ. 247 కోట్లు) -
షరపోవాకు దెబ్బ మీద దెబ్బ!
లాస్ ఏంజిల్స్: డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవాకు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. గత పదేళ్లుగా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడుతున్నట్టు షరపోవా స్వయంగా వెల్లడించడంతో.. ఆమెతో వేలకోట్ల రూపాయల వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఇప్పుడు రాంరాం చెప్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ నైకీ షరపోవాతో కాంట్రాక్టు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ఆమెతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించుకోబోమని ప్రఖ్యాత గడియారాల కంపెనీ ట్యాగ్ హోయర్ తెలిపింది. ఐదు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన మరియా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడినట్టు ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని షరపోవా స్వయంగా వెల్లడించడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. 2006 నుంచి డ్రగ్ తీసుకుంటున్నానని, అయితే దీన్ని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా చెప్పింది. 28 ఏళ్ల షరపోవాపై ఈ నెల 12 నుంచి తాత్కాలిక నిషేధం అమల్లోకి రానుంది. ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది. ఆరు అడుగులకుపైగా ఎత్తుతో ఉండే ఈ అందాల సుందరి తిరుగులేని ఆటతో కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను ఏలింది. అత్యద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అందంతోపాటు ఆట కూడా ఉండటంతో ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షరపోవాతో కుదుర్చుకున్న 70 మిలియన్ డాలర్ల (రూ. 472 కోట్ల) కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్టు నైకీ ప్రకటించింది. అదేదారిలో ఇతర కంపెనీలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు షరపోవా మళ్లీ టెన్నిస్ మైదానంలో అడుగుపెట్టడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నప్పటికీ, రష్యా తరఫున ఆమె బ్రెజిల్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశముందని ఆ దేశ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఎన్ఐఓఎస్, కేవీ మధ్య ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) అధ్యయన, పరీక్ష కేంద్రాలుగా ఇకపై కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) పని చేయనున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఎన్ఐఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ సీబీ శర్మ, కేవీ కమిషనర్ సంతోష్‌కుమార్ మల్ ఒప్పందం చేసుకున్నట్లు ఎన్ఐఓఎస్ హైదరాబాద్ రీజనల్ డెరైక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. దీంతో కేంద్రీయ విద్యాలయాల్లోని అధ్యయన కేంద్రాల్లో ఎన్ఐఓఎస్ శిక్షణ తరగతులు, బోధన, పరీక్షలు నిర్వహించుకునే వీలు కలిగిందన్నారు. -
జీతాల సమస్య పరిష్కారం!
కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన 12 మంది విండీస్ ఆటగాళ్లు సెయింట్ జాన్స్: జీతాల చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ), ఆటగాళ్లకు మధ్య తలెత్తిన సంక్షోభం ఎట్టకేలకు పరిష్కారమైంది. బోర్డు తాజా కాంట్రాక్ట్‌పై 12 మంది క్రికెటర్లు సంతకాలు కూడా చేశారు. దీంతో టి20 ప్రపంచకప్‌లో స్టార్ ఆటగాళ్లు పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. అయితే డారెన్ బ్రేవో మాత్రం టెస్టులపై దృష్టిపెట్టేందుకు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు. గేల్, స్యామీ, బెన్, హోల్డర్, ఫ్లెచర్, బ్రేవో, బద్రీ, సిమ్మన్స్, టేలర్, రస్సెల్, శామ్యూల్స్, రామ్‌దిన్ సంతకాలు చేసిన వారిలో ఉన్నారని విండీస్ బోర్డు తెలిపింది. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న పొలార్డ్ (గాయం), నరేన్ (సందేహాస్పద బౌలింగ్)ల స్థానంలో ఆష్లే నర్స్, కార్లోస్ బ్రాత్‌వైట్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే డారెన్ స్థానంలో త్వరలోనే మరొకర్ని తీసుకుంటామని బోర్డు వెల్లడించింది. ఐసీసీ నుంచి ఒత్తిడి లేదు: పాక్ కరాచీ: భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనాల్సిందిగా ఐసీసీ నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. తమ ప్రభుత్వ అనుమతిపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉందని తేల్చింది. టోర్నీ నుంచి వైదొలిగితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఐసీసీ ఇటీవల హెచ్చరించినట్టు కథనాలు వెలువడడంతో పీసీబీ స్పందించింది. ‘ఐసీసీ నుంచి మాకెలాంటి సమాచారం లేదు. ఇటీవలి సమావేశంలోనూ భారత్‌లో పాక్ ఆటగాళ్ల భద్రతపై చర్చించాం. ఇదే కారణంగా పాక్ ప్రభుత్వం జట్టుకు అనుమతినివ్వకపోతే పీసీబీ చేసేదేం లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఏ విషయమూ తేల్చలేదు’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. -
సంతకం చేస్తేనే ప్రపంచకప్ కు....
కవిండీస్ క్రికెటర్లకు బోర్డు హెచ్చరిక చెల్లింపులపై ముదిరిన సంక్షోభం కింగ్స్టన్: దాదాపు ఏడాదిన్నర క్రితం వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెల్లింపుల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా ఆరలేదు. ఇప్పుడు టి20 ప్రపంచకప్‌కు ముందు కూడా మళ్లీ అదే కారణంతో ఇరు వర్గాల మధ్య సమస్య తీవ్రమైంది. ప్రపంచకప్ కోసం ఎంపికైన 15 మంది ఆటగాళ్లు కూడా బోర్డు ప్రతిపాదించిన అన్ని నిబంధనలను అంగీకరిస్తూ కాంట్రాక్ట్‌పై సంతకం చేయాలని సీఈఓ మైకేల్ ముర్హెడ్ ఆటగాళ్లకు హెచ్చరిక జారీ చేశారు. అందుకు ఆదివారం తుది గడువుగా నిర్దేశించారు. అయితే బోర్డు చెబుతున్న మొత్తం చాలా తక్కువని, ఇది దుర్మార్గమంటూ జట్టు కెప్టెన్ స్యామీ తమ అసంతృప్తిని తెలియజేస్తూ లేఖ రాయడంతో పరిస్థితి ముదిరింది. తమ వేతనాలను 80 శాతం తగ్గించారని... డబ్బులు పెంచకపోతే కుదరదని స్యామీ అంటున్నాడు. ప్రస్తుత నిబంధనల్లో ఒక్క మార్పూ చేయమని, అవసరమైతే ఈ ఆటగాళ్లను తప్పించి ద్వితీయ శ్రేణి జట్టును పంపించడానికైనా తాము సిద్ధమని ముర్హెడ్ గట్టిగా చెప్పడంతో వరల్డ్‌కప్‌కు గేల్, బ్రేవోలాంటి స్టార్లు దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. -
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
కొత్తూర్ (శ్రీకాకుళం) : కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఏపీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కొత్తూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు సాయిరాం, డివిజన్ అధ్యక్షుడు టి.చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
యూఎస్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఐఐఎస్సీ
వాషింగ్టన్ : బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)కు అరుదైన అవకాశం దక్కించుకుంది. యూఎస్ మిలటరీకి చెందిన సోలార్ పవర్ మైక్రో గ్రిడ్ అభివృద్ధి పరిశోధన కాంట్రాక్ట్‌ను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ కింద రూ. 52,900 యూఎస్ డాలర్లను యూఎస్ పసిఫిక్ ఎయిర్ పోర్స్ నిధులు కేటాయించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దక్కిన అరుదైన అవకాశాల్లో యూఎస్ మిలటరీ కాంట్రాక్ట్ ఒకటి. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్, యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి అస్టోన్ కార్టర్ గురువారం పెంటగాన్‌లో భేటీ అయ్యారు. భారత్ - అమెరికా దేశాల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్చల్లో భాగంగా పారికార్ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. -
కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నోట్లో మట్టి
-
రూ.3వేల కోట్లు సర్కారు పెద్దల జేబుల్లోకి..!
-
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్: ఈటల
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలో పర్మినెంట్ చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రంలో 89లక్షల కుటుంబాలకు ఆహార పంపిణీ కార్డుల పంపకం జరుగుతుందని అన్నారు. పౌరసరఫరాల్లో లొసుగులు ఉన్నాయన్నమాట వాస్తవమేనని మంత్రి చెప్పారు. అయితే, ఈ శాఖలో తప్పు చేసేవారిని అంత తేలికగా వదిలిపెట్టబోమని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమార్కులపై తొలిసారి పీడీ, టాడా యాక్ట్ ప్రకారం కేసులు పెట్టామని చెప్పారు. -
గాయత్రి ప్రాజె క్ట్స్‌కు భారీ ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గాయత్రి ప్రాజెక్ట్స్ రూ. 3,318 కోట్ల విలువైన కాంట్రాక్టును జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి దక్కించుకుంది. జాతీయ రహదారులు 233, 56లకు సంబంధించి మొత్తం 4 కాంట్రాక్టులను పొందినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ వార్తల నేపథ్యంలో గాయత్రీ ప్రాజెక్ట్స్ షేరు సుమారు నాలుగు శాతం పెరిగి రూ. 428 వద్ద ముగిసింది. -
అంతా నాలుగు రోజుల్లోనే..
- ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అల్టిమేటంతో స్పందించిన సర్కార్ - బంద్ హెచ్చరికతో దిగొచ్చిన వైనం విజయవాడ సెంట్రల్ : మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమ్మె అంశంలో నాలుగు రోజుల్లోనే అద్భుతం జరిగింది. నాలుగు రోజుల్లో విధుల్లో చేరకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామంటూ ప్రభుత్వం డ్వాక్వా, సీఎంఈవై కాంట్రాక్టర్లకు ఈనెల 22న నోటీసులు జారీ చేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ అధినేత, శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే రాష్ట్రబంద్ తప్పదని ప్రభుత్వానికి ఈనెల 23వ తేదీన అనంతపురం జిల్లా కంబదూర్ మండలం తిమ్మాపురం నుంచి అల్టిమేటం ఇచ్చారు. జగన్ ఇచ్చిన భరోసా కార్మిక వర్గానికి ఊపిరులూదింది. 24న చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం కావడానికి దోహదపడింది. దీంతో కంగుతిన్న సర్కార్ యూనియన్ నాయకుల్ని చర్చలకు ఆహ్వానించింది. దిగిరాక తప్పలేదు ఈనెల 17న బందరురోడ్డులోని గేట్‌వే హోటల్లో ట్రేడ్ యూనియన్ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా కోరగా, సీఎం ససేమిరా అన్నారు. కార్మికులకు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి పోరాటంలో కీలక భూమిక పోషించారు. మెడలు వంచాం.. వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన రాష్ట్ర బంద్‌తో సర్కార్ దిగిరాక తప్పలేదు. మొండిపట్టు వీడి జీతాల పెంపుదలకు అంగీకరించింది. ప్రభుత్వం మెడలు వంచిన ఘనత జగన్‌కే దక్కుతుంది. కార్మికుల పోరాటానికి వైఎస్సార్ సీపీ మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచింది. ఇది సమష్టి విజయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మార్చుకోవాలి. ఉద్యోగ, కార్మికుల సమస్యలపై సానుకూల ధోరణిలో వ్యవహరిస్తే మంచిది. - బీఎన్ పుణ్యశీల, వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ -
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బందికి ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రులు, హెడ్ ఆఫీసుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 1,039 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సహా ఇతర సహాయ సిబ్బందిని మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి31 వరకు వీరిని కొనసాగిస్తారు. -
హెటిరోతో...డాక్టర్ రెడ్డీస్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ హెపటైటిస్-సి వ్యాధి చికిత్సకు వినియోగించే సొవాల్డి జెనరిక్ వెర్షన్ ‘రిసాఫ్’ పేరుతో దేశీయ మార్కెటో విక్రయించనుంది. ఈ మేరకు హెటిరో ల్యాబ్‌తో డాక్టర్ రెడ్డీస్‌కి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హెటిరో ల్యాబ్ తయారు చేసే సోఫాస్బువిర్ 400 ఎంజీ ట్యాబ్లెట్లను రిసాఫ్ బ్రాండ్‌తో డాక్టర్ రెడ్డీస్ దేశీయ మార్కెట్లో విక్రయించనుంది. రోగులకు అందుబాటు ధరలో ఔషధాలను అందించాలన్న కంపెనీ ఆలోచనలో భాగంగా ఈ ఒప్పం దాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. అమెరికాకు చెందిన గిలీడ్ సెన్సైస్ హెపటైటిస్ -సి చికిత్సకు వినియోగించే ట్యాబ్లెట్లను సొవాల్డి బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. ఈ మధ్యనే వీటి జెనరిక్ వెర్షన్‌ను విక్రయించడానికి హెటిరో ల్యాబ్‌తోపాటు నాట్కో, జైడస్ క్యాడిలాలకు అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. -
పారిశుధ్య కార్మికుల కన్నెర్ర
నెల్లూరు, సిటీ: కాంట్రాక్టు విధానాన్నే కౌన్సిల్ ఆమోదించిన నేపథ్యంలో పారి శుధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్‌ను దిగ్బంధించారు. సొసైటీ కార్మికుల కాంట్రాక్టు విధానాన్ని నిరసిస్తూ కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే కార్యాలయం గేటు ఎదుట ఉదయం నుంచే ధర్నాకు దిగారు. అయితే కార్పొరేషన్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ సభ్యులు ఏకపక్షంగా కాంట్రాక్టు విధానానికి ఆమోదం తెలపటంతో కార్మికుల భగ్గుమన్నారు. అంతవరకు గేటు ముందు నిరసన తెలియజేస్తున్న వారంతా ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా గోడలు దూకి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో కార్యాలయం ఎదుట బైఠాయించారు. పారిశుధ్య కార్మికులను టెండర్ల పద్ధతి ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టు విధానం ఆమోదించిన మేయర్ అజీజ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. శాపనార్థాలు పెడుతూ.. తిట్టడం ప్రారంభించారు. ‘మేము ఓట్లేస్తే గెలిచిన అజీజ్ మేయరై మా పొట్టకొడతావా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిందని తెలియగానే కార్మికుడు శీనయ్య సృహతప్పి పడిపోయారు. హుటాహుటిన తోటి కార్మికులు అతడిని 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన కార్మికులు మరింత రెచ్చిపోయారు. ‘మేయర్ డౌన్ డౌన్. మేయర్ దొంగ’ అంటూ నినాదాలు చేస్తూ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో పాటు సీపీఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. కార్మికులతో పాటు వారూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికుల ఆందోళన కొనసాగింది. మేయర్ వాహనాన్ని అడ్డుకున్న కార్మికులు కౌన్సిల్ సమావేశం ముగిసిన మేయర్, టీడీపీ కార్పొరేటర్లు బయటకు రాకుండా కార్యాలయంలోనే ఉండిపోయారు. కార్మికులు ఎంతకీ ఆందోళనను విరమించుకోకపోవటంతో చేసేది లేక మేయర్, మరికొందరు టీడీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చారు. మేయర్ అజీజ్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు మేయర్‌ను మాట్లాడనివ్వకుండా మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మేయర్ అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే కార్మికులు వాహనాన్ని అడ్డుకున్నారు. కొందరు మహిళలైతే చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. మరికొందరు చెప్పులు చూపుతూ శాపనార్థాలు పెట్టటం కనిపించింది. పోలీసుల సాయంతో మేయర్ వాహనంలో వెళ్లిపోయినా కార్మికులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బిల్లు ఆమోదించడంపై కార్మికులు మేయర్‌కు శాపనార్థాలు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మా పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల క్రితం నుంచి ఈ జీఓ ఉన్నప్పటికీ ఏ పార్టీ ఆమోదించని బిల్లును మేయర్ ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అరెస్ట్.. బిల్లు ఆమోదం తర్వాత ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికుల వద్దకు మేయర్ వచ్చి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వమని, న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ సమయంలో ఓ కార్మికుడు నగర మేయర్‌ను మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డాడు. బిల్లు ఆమోదించి మాకడుపు కొట్టారని మేయర్‌ను నిలదీశారు. మేయర్ మాటలకు కార్మికులు అడ్డుతగులుతుండటంతో ఆయన కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు ఆయన వాహనం చక్రాల కింద పడుకొన్నారు. దీంతో పోలీసులు కార్మికులను, సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బంగారు తెలంగాణ కాదు.. కన్నీటి తెలంగాణ
ఖమ్మం మయూరిసెంటర్ : పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం బంగారు తెలంగాణ కాదని, కన్నీటి, కష్టాల, బాధల తెలంగాణగా మారిందని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ అన్నారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. మహిళలపై సామ్రాజ్యవాద విషసంస్కృతిని ప్రేరేపిస్తున్నారని, దేశంలో భ్రూణహత్యలు పెరిగిపోయాయని, వాటిని నిరోధించాల్సిన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దేశంలో బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని, స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా మహిళలపై హింస, దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మహిళను ఆట వస్తువుగా చూపుతున్నారని, ప్రభుత్వాలు గృహహింస చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళలు, పురుషుల సమానత్వం కోసం పోరాడాలన్నారు. అనంతరం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 4వేల మంది ప్రాణత్యాగాలు చేశారని, వారి బలిదానంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజల బాధలను మర్చిపోయి హైదరాబాద్ బల్దియా ఎన్నికల కోసం ఆరాటపడుతున్నారని, నిజాం పాలననే పొగుడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ మాటే ఉండదని, అందరినీ పర్మినెంట్ చేస్తామని మాటలు చెప్పిన కేసీఆర్ వాటిని మరచి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 59 జీఓ అక్రమార్కులకు అండగా ఉందని, దీనిని వెంటనే రద్దు చేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కూలీలకు, రైతులకు రూ.వెయ్యి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు గాదె ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.రమ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, పీఓడబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు జి.సరోజని, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్‌లు మాట్లాడారు. అనంతరం కదలిరా.. ఓ మహిళా కదలిరా.. అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె.కల్పన, జిల్లా కార్యదర్శి సిహెచ్.శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ ఒప్పందానికి చట్టం వర్తించదట!
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో న్యాయం, చట్టం వర్తించని ఒప్పందాలేమైనా ఉంటాయా? అదీ.. రెండు ప్రభుత్వాల మధ్య చేసుకున్న ఒప్పందం న్యాయానికి, చట్టానికి అతీతంగా ఉంటుందా? ఉంటుందనే సమాధానం చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి మహా ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపకల్పనకు సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందానికి న్యాయం, చట్టం వర్తించవని అదే ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. సింగపూర్, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఏమైనా వివాదాలు ఏర్పడితే అంతర్జాతీయ ట్రిబ్యునల్, ఇతర ఫోరంలు, మూడో వ్యక్తి దగ్గరకు, ఆఖరికి న్యాయ స్థానం దగ్గరకు కూడా వెళ్లకూడదని ఒప్పందంలో పేర్కొన్నారు. సింగపూర్ కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సమస్యనైనా పర స్పర ప్రయోజనాలు కలిగేలా ఇరువురు పరిష్కరించుకోవాలని ఒప్పందంలో రాసుకున్నారు. అలాగే ప్రణాళిక రూపకల్పనలో మరి న్ని సింగపూర్ ప్రైవేటు కంపెనీలను నియమించుకోవచ్చునని కూడా అందులో స్పష్టం చేశారు. సింగపూర్ ప్రైవేటు కంపెనీలు కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీతో కలసి పనిచేస్తాయని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై అధికారవర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఒప్పందం ఎక్కడైనా ఉంటుందా అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రణాళిక రూపకల్పన పేరుతో హడావుడిగా సింగపూర్ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకోవడంలో తెర వెనుక బాగోతం ఏదో ఉందనే అనుమానాలను అధికారవర్గాలే వ్యక్తంచేస్తున్నాయి. మరోపక్క.. ప్రణాళిక రూప కల్పనకు సింగపూర్ కంపెనీలకు ఎంత చెల్లిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందంలో పేర్కొన కుండా దాచి పెట్టడాన్ని కూడా అధికారవర్గాలు తప్పుప డుతున్నాయి. ఏ విషయంలోనైనా పార దర్శకంగా ఉండాలని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు నోరు విప్పడంలేదని అంటున్నాయి. ప్రణాళిక తయారీకి ఎంత ఖర్చవు తుందో సింగపూర్ కంపెనీలు అంచనాలు పంపాక ఆ మొత్తాన్ని చెల్లించేలా ఉన్నారని, అందుకే ఇప్పుడు ఆ అంశంపై నోరు విప్పడం లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకపక్క సింగపూర్ ప్రభుత్వం అంటూనే, మరో పక్క సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ఐఏఎస్‌కు టెండర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంట్రాక్టు కార్మికుల నియామక టెండర్ల గోల్మాల్ వ్యవహారాన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో బల్దియా అధికారుల్లో వణుకు మొదలైంది. నిబంధనలను అడ్డంగా తోసిరాజని శ్రీరాజరాజేశ్వర సంస్థకు టెండర్‌ను కట్టబెట్టిన అధికారుల మెడకు ఉచ్చు బిగిసుకుంది. సాక్షాత్తు కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఐఏఎస్ అధికారి శ్రీకేష్ లట్కర్ ప్రమేయం ఉండటంతో ఈ ఉచ్చు నుంచి బయటపడేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఒకవైపు నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌తో రాజీ యత్నాలు కొనసాగిస్తూనే.. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మంతనాలు జరుపుతున్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కిందిస్థాయి అధికారులను నమ్మి ఫైలుపై సంతకం చేశానని, ఎలాగైనా ఈ ఉచ్చు నుంచి బయటపడేయాలని ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. అర్హతల్లేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ అడ్డంగా దొరికిపోవడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతోందననే భయం పట్టుకుంది. పూర్తి ఆధారాలతో దొరికిపోయినందున ఈ వ్యవహారం నుంచి బయటపడటం అంత సులువు కాదని హైదరాబాద్‌లోని సీనియర్ ఐఏఎస్‌లు, ఇంజనీరింగ్ ఇన్ ఛీప్ స్థాయి అధికారులు చెబుతుండటంతో సదరు ఐఏఎస్‌కు సైతం వణుకు మొదలైంది. ‘సాక్షి’లో కథనం రావడంతో శనివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలా? అనే అంశంపై సదరు ఐఏఎస్ అధికారి అటు ఉన్నతస్థాయి అధికారులు, ఇటు తన సన్నిహితులతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి శనివారం ఉదయం బల్దియా కమిషనర్‌కు ఫోన్ చేసి ఈ వ్యవహారంపై ఆరా తీశారు. అర్హత లేని సంస్థకు కాంట్రాక్టు కట్టబెడుతూ రూపొందించిన ఫైళ్లపై సంతకం చేసినందున దీనినుంచి తప్పించుకోవడం అంత సులువు కాదని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఏం చేయాలో పాలుపోని శ్రీకేష్ లట్కర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఐఏఎస్‌ల కేటాయింపుల్లో లట్కర్‌ను ఏపీకి కేటాయించినప్పటికీ దీనిపై ఇంకా అధికారిక ఆదేశాలు వెలువడకపోవడంతో తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఉచ్చు నుంచి బయటపడి తిరిగి ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటివరకు సెలవు పెట్టాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగా ఈనెల 22 నుంచి 27 వరకు సెలవు పెట్టినట్లు తెలిసింది. ఎస్ఈ, ఈఈ గుండెల్లో వణుకు ఈ అక్రమాలకు మూల సూత్రధారులుగా భావిస్తున్న ఎస్ఈ రాజేంద్రప్రసాద్, ఈఈ లక్ష్మయ్య ఏకంగా కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. వ్యవహారం రాష్ర్ట స్థాయికి వెళ్లడం, తప్పు చేసి అడ్డంగా దొరికిపోవడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ కావడం ఖాయమని, అదే సమయంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశాలున్నాయని, కేసు తీవ్రతను విశ్లేషిస్తున్న సహచర ఇంజనీర్లు చెబుతుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉన్నతాధికారులతో, మరోవైపు నగర మేయర్‌కు తప్పు జరిగి పోయిందని ఒప్పుకుంటూనే ఎలాగైనా ఈ వ్యవహారం నుంచి బయటపడేయాలని ప్రాధేయపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఉన్నతాధికారులను కలిసేందుకు ఎస్ఈ ఏకంగా హైదరాబాద్ వెళ్లారు. మరోవైపు నగర పాలక సంస్థ డిప్యూటీ ఈఈ సంపత్‌రావు ఈ బాగో తం తనకు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో రెండ్రోజుల క్రితమే ఓ మంత్రి ద్వారా మెట్‌పల్లికి బదిలీ చేయించుకున్నారు. ఆ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు! రద్దు దిశగా టెండర్ అక్రమార్కులంతా టెండర్ల బాగోతం నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ వ్యవహారం ఇంతటితో ఆగే అవకాశాలు కన్పించడం లేదు. మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని నగర పాలక మండలి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. మరోవైపు టెండర్ల గోల్మాల్ వ్యవహారం బట్టబయలు కావడంతో వాటిని రద్దు చేసేందుకు నగర మేయర్ సిద్ధమైనట్లు తెలిసింది. తద్వారా టెండర్ బాగోతంతో నగర పాలక సంస్థపై పడిన అవినీతి మకిలీని కడిగేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. నేడో, రేపో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. లోకాయుక్తకు ఫిర్యాదు నగరపాలక సంస్థలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని న్యాయవాది, 32వ డివిజన్ కార్పొరేటర్ ఏవీ రమణ శనివారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను అందించాలన్న ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఉన్నతాధికారులే అత్యుత్సాహం చూపించి ఇలాంటి తప్పిదాలు చేయడం దురదృష్టకరమని, అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై తక్షణమై స్పందించి అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంకు ఎమ్మెల్యే ఫిర్యాదు టెండర్లలో జరిగిన అవకతవకలపై స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంతోపాటు బల్దియా కమిషనర్, అధికారుల వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సమర్పిస్తూ లిఖిత పూర్వక లేఖను పంపినట్లు తెలిసింది. మరోవైపు నగర పాలక సంస్థకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఖాళీల భర్తీపై అయోమయం?
పాలమూరు: రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ మూడున్నర నెలలుగా అభ్యర్థుల ఓపికను పరీక్షిస్తోంది. 2014-15 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు జూలైలో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు గానీ, ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఆర్వీఎం ద్వారా చేపడుతున్న కార్యక్రమాల అమలుకు కాంట్రాక్టు విధానంతో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల పేరిట పీఈటీ, చేతివృత్తులు, కళల విభాగంలో జిల్లావ్యాప్తంగా 692 పోస్టులు మంజూరయ్యాయి. ఇందుకు గతేడాది 345 మందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు. ఈ విద్యా సంవత్సరానికి కూడా నియామకాలను పునరుద్ధరించేందుకు అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన అధికారులు ప్రక్రియను పెండింగ్‌లో పెట్టి తాత్సారం చేయడం ఇబ్బందిగా మారింది. దీనికితోడు మొత్తం పోస్టుల్లో మిగిలిపోయిన 347 ఖాళీ పోస్టుల భర్తీపై అధికారులు దృష్టి పెట్టక పోవడంతో అయోమయం నెలకొంది. నోటిఫికేషన్‌తోనే గందరగోళం... ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ నియామకాల పునరుద్ధరణ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికతపై స్పష్టత ఇవ్వలేదు. మండలం యూని ట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొందరు, స్కూ ల్ కాంప్లెక్స్ యూనిట్‌గా స్థానికతను ఆధారం చేసుకొని కొన్నిచోట్ల ఎంపిక పూర్తి చేశారు. స దరు అభ్యర్థుల వివరాలు జిల్లా ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ఈ ప్రక్రియ ముగి సి నెలలు గడుస్తున్నా నియామకం గురించి అభ్యర్థులకు సమాచారం ఇవ్వలేదు. పెరిగిన పని గంటల బాధ్యతలను ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయా మ ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే ఉపాధ్యాయులే లేనప్పుడు విధులు ఎలా పంచుకుంటారనే ప్రశ్న వ్యక్తమవుతోంది. తమకు నియామ కం విషయంలో అధికారిక ప్రకటన చేస్తే ఈ ఎంపిక కోసం ఆగి ఉండాలో లేక మరేదైనా మా ర్గం చూసుకోవాలో నిర్ణయించుకుంటామని అభ్యర్థులు వాపోతున్నారు. -
సీజ్డ్ ఇసుక ముసుగులో..
శ్రీకాకుళం: సీజ్డ్ ఇసుక ముసుగులో..ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. సీజ్ చేసిన ఇసుక తరలింపు గడువును పెంచుకునేం దుకు కాంట్రాక్టుదారులు కొత్త ఎత్తుగడలను అవలంబిస్తున్నారు. ఇటీవల సీజ్డ్ ఇసుక తరలింపునకు టెండర్లు పిలవడం, నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తి టెండర్ దాఖలు చేసినా.. వారికే కాంట్రాక్టును అప్పగించిన విషయం విదితమే. అనంతరం సంబంధిత గుత్తేదారు.. శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడ సమీపంలో నదీతీరం నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తీసుకువచ్చి లారీల ద్వారా తరలిస్తున్న వైనాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం గార మండలం బూరవెల్లి, గార, శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నాం సమీపం నుంచి రాత్రి వేళల్లో తీరం నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు. రోజూ రూ.10 లక్షలకు పైగా ఆదాయం గుత్తేదారునికి అక్రమ ఇసుక రవాణా ద్వారా రోజుకు రూ. 10 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని అనధికార లెక్క లు ప్రకారం తెలుస్తోంది. టెండర్ సమయంలో విధించిన షరతుల ప్రకారం నెల రోజుల్లో సీజ్ చేసిన ఇసుకను తరలించాల్సి ఉంది. కానీ గుత్తేదారు సీజ్ చేసిన ఇసుకను కాకుండా నదీతీరంలోని ఇసుకను తరలించేస్తున్నారు. సీజ్డ్ ఇసుకను మాత్రం అలాగే ఉంచేస్తున్నారు. గడువు ముగిసిన తరువాత సీజ్డ్ ఇసుక గుట్టలను చూపిం చి, తాము గడువులోగా తరలించలేక పోయామని మరికొద్ది గడువు కావాలని అధికారులను కోరాలనేది ఎత్తుగడగా తెలుస్తోంది. ఈ కాలంలో అక్రమంగా మరింత ఇసుకను రవాణా చేసుకోవచ్చని వ్యూహం. ఇటువంటి యోచనతోనే బినామీ పేరుతో జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు కాంట్రాక్టును దక్కించుకున్నారని, ఆయన అండతోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు చెబుతున్న మాటలు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మైన్స్ ఏడీ తీరు విడ్డూరం ఇసుక అక్రమ తరలింపు, గడువు పెంపునకు సం బంధించి మైన్స్ ఏడీ రౌతు గొల్ల వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తాము నిఘా ఉంచామని చెబుతూనే.. గార మండలంలోని బూరవెల్లి వద్దకు వెళ్తున్నట్టు చెప్పారు. అదే సమయానికి సాక్షి ప్రతినిధి కూడా అక్కడకు వస్తారని ఏడీకి చెప్పగా మీరెందుకు అంటూ..కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. రావాలనుకుంటే..ప్రస్తుతం కరజాడ తీరంలో ఉన్నానని కూడా సలహా ఇచ్చారు. ఇసుక రవాణా ఆగిపోయిన చోటుకు ఎందుకు రావాలని ప్రశ్నించగా..సమాధానాన్ని దాటవేశారు. గడువు పెంచాలని కోరితే.. అప్పుడు మాట్లాడవచ్చని.. ముందుగా ఊహించుకోవడం ఎందుకని ఎదురు ప్రశ్నవేశారు. కరజాడ నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఆ ప్రాంత వాసులు ఆగ్రహిస్తూ.. దారికి అడ్డంగా కొద్దిరోజుల క్రితం ట్రాక్టర్ ట్రక్కును అడ్డుగా ఉంచినప్పుడు పోలీసులు అక్రమ తరలింపు వాహనాలను కాకుండా.. ట్రక్కును పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై అనుమానాలు వెల్లువెత్తాయి. -
కంప్యూటర్ మిథ్య
ముగిసిన టీచర్ల కాంట్రాక్టు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు కంప్యూటర్ పాఠాలు దూరం పామర్రు : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ కంప్యూటర్ శిక్షణ అందించాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ లక్ష్యం నీరుగారుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో బోధకుల గడువు ముగియడంతో కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. పలు పాఠశాలల్లో కంప్యూటర్ల గదులకు తాళాలు పడ్డాయి. లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్లకు బూజు పడుతోంది. టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ప్రభుత్వం సమకూర్చిన కంప్యూటర్ సామగ్రి, జనరేటర్లు నిరుపయోగంగా మారాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో బోధకుల కాంట్రాక్ట్ ముగియడంతో విద్యార్థులకు శిక్షణకు దూరమయ్యారు. కార్పొరేట్‌కు దీటుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనూ తీర్చిదిద్దాలనే ఆశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. పాఠాలు చెప్పేందుకు ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. జిల్లాలోని 236 సక్సెస్ పాఠశాలల్లో 472 మంది కంప్యూటర్ టీచర్లు పని చేసేవారు. ప్రస్తుతం వారి కాలపరిమితి ముగిసింది. తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల రోడ్డన పడ్డారు. పామర్రు మండల పరిధిలోని ఐదు జెడ్పీ పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, జనరేటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేవారు. లెక్కలు, తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులను ఆడియో వీడియోల ద్వారా విద్యార్థులకు బోధన చేసేవారు. నెల నెలా పరీక్షలు కూడా నిర్వహించేవారు. వైఎస్ అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కంప్యూటర్ విద్యపై దృష్టి పెట్టలేదు. వేతనాలు సరిపోవడం లేదని టీచర్లు నాలుగు నెలలు సమ్మె కంప్యూటర్ శిక్షణ కుంటు పడింది. ఆ తర్వాత ఐదేళ్ల కాంట్రాక్టు గత సెప్టెంబర్‌తో ముగియడంతో ప్రైవేటు సంస్థ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులతో కంప్యూటర్ తరగుతులు కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఉపాధ్యాయుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక శిక్షణ మూలనపడింది. పైగా ఇప్పటికే చాలా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. కంప్యూటర్ విద్యకు సంబంధించిన ప్రత్యేక టీచర్లు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి బోధకులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
తెలంగాణలో కాంగ్రెస్-టిడిపి మధ్య ఒప్పందం
-
‘కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్’ కొనసాగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలాన్ని తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా శాఖల్లో వారి అవసరం తీరే వరకు... లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు... వీటిల్లో ఏదీ ముందయితే దానిని అమలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఆర్థిక శాఖ.. మూడు నెలల పొడిగింపు మాత్రమే ఇవ్వాలంది. ఆలోగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అవసరం నిజంగా ఉందా లేదా అన్న అంశంపై పూర్తి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. అధికారులు మూడు నెలల కాలపరిమితికి ఫైలు పంపిం చగా.. సీఎం కె.చంద్రశేఖర్‌రావు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వీరిని కొనసాగించేలా కాలపరిమితి లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలి సింది. దాని ఆధారంగా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ప్రభుత్వంలోనే కాక గ్రామ, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, డివి జన్లు.. జిల్లా, జోనల్, మల్టీజోనల్ కార్యాలయాలు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వారందరికీ ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యక్తిగత, కాంట్రాక్టు ఏజెన్సీలతో కుదుర్చుకునే ఒప్పం దాల కాల పరిమితి ఏడాదికి మించకుండా, నియమ నిబంధనలు స్పష్టంగా పేర్కొంటూ ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
మరో ఏడాది ‘కాంట్రాక్టే’
ఉద్యోగుల క్రమబద్ధీకరణకు బ్రేక్ కలెక్టరేట్ : జూన్ 30 వరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సిం గ్ సేవలను వినియోగించి కొనసాగింపుపై నిర్ణ యం తీసుకుంటామని గత ఉమ్మడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు జీవో నంబర్ 84 జారీచేసింది. గడువు సమీపించినా ప్రస్తుత సర్కార్ స్పష్టతనివ్వలేదు. రెండు రోజు లుగా అధికార పార్టీ మంత్రులు బహిరంగంగా గడువు పొడిగింపుపై పలు రకాలుగా ప్రకటిస్తుండడం.. తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ఉత్తర్వులు వెలువరించకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సందిగ్ధంలో పడేసింది. దీంతో ఉద్యోగ భద్రత కోసం సోమవారం అన్ని జిల్లాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో యూనియన్ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్థికశాఖ మంత్రి సమక్షంలో హైదరాబాద్‌లో చర్చలు సాగించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జీవో వచ్చేంత వరకు చర్చల్లో తీసుకున్న నిర్ణయం మౌఖిక ఆదేశాలతో అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రమబద్ధీకరణకు బ్రేక్ ఎన్నికలు ముందు, తర్వాత కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో అన్ని క్యాడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలా? లేక మూడో, నాలుగో తరగతి ఉద్యోగులకే అవకాశం కల్పించాలా? దశలవారీగా క్రమబద్ధీకరించా లా? ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చాలా.. కొనసాగించాలా..? అనే అంశాలపై ఇంకా అధ్యయనం జరుగుతోంది. వీటన్నింటిపై సమగ్ర అధ్యయనం కోసమే మరో ఏడాది పాటు సేవలను పొడిగించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 12,670 కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా, ఔట్సోర్సింగ్ సేవల ఏజెన్సీల ద్వారా నియమితులైన ఆరు వేలకు పైగా సిబ్బందిలో ఆందోళన నెలకొంది. హౌసింగ్, రెవెన్యూ, బీసీ, సాంఘిక సంక్షేమం, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, విద్యాశాఖ, పుర, నగర పాలక సంస్థ, డీఆర్డీఏల్లో వందలాది మంది ఏజెన్సీల ద్వారా నియమితులై పదేళ్లుగా పనిచేస్తున్నారు. మరికొన్ని ప్రభుత్వ శాఖల్లో ఆయా శాఖలే నేరుగా పరీక్షలు నిర్వహించుకుని రోస్టర్ కం మెరిట్ పద్ధతిన అవసరమైన సిబ్బందిని నియమించుకున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బంది ని పర్మినెంట్ చేయడానికి సాంకేతిక సమస్యలుంటాయని చెబుతుండడం వారిని ఆందోళన కలిగిస్తోంది. -
కాంట్రాక్టు ఉద్యోగుల తరపున పోరాటం
-
కాంట్రాక్టు ఉద్యోగుల తరపున పోరాటం
* వైఎస్ జగన్మోన్రెడ్డి ప్రకటన * బాబు సీఎం అయినప్పటినుంచీ ఉద్యోగుల్లో అభద్రతా భావం సాక్షి, పులివెందుల: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబ్లీలోనే పోరాటం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి బాబు వచ్చి జాబు తీసేస్తారన్న అభద్రతా భావం కాంట్రాక్టు ఉద్యోగులలో కనిపిస్తున్నదని అవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని ఐటీఐలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, జెఎన్టీయూలో పనిచేస్తున్న పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి శుక్రవారం ఉదయం ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా తమ ఉద్యోగాలను రెగ్యులైజ్ చేసేందుకు కృషి చేయాలని కోరగా.. వైఎస్ జగన్ పైవిధంగా స్పందించారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా అవసరమైతే న్యాయపరంగా ముందుకెళతామని తెలిపారు. ఈ సమయంలో వైఎస్ జగన్‌తోపాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి ఉన్నారు. -
భక్తులకు క్షవరమే..
టికెట్‌తో పాటు అదనపు వసూళ్లు చేస్తున్న క్షురకులు అప్పన్న భక్తుల నిరసన పట్టించుకోని దేవస్థానం అధికారులు సింహాచలం : మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి క్షురకులు అదనంగా సొమ్ము డిమాండ్ చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామికి తలనీలాలు సమర్పించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సింహగిరికి తరలి వస్తుంటారు. వీరంతా దేవస్థానం విక్రయించే రూ.10 టికెట్ కొంటారు. ఈ సొమ్ములో రూ.5 ఆలయానికి, మరో రూ.5 కాంట్రాక్టు క్షురకులకు వెళ్తుంది.కేశఖండనశాలలో దేవస్థానానికి చెందిన శాశ్వత ఉద్యోగులు ఏడుగురు మినహాయిస్తే 63 మంది వరకు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో కొంతమంది క్షురకులు తలనీలాలు తీసిన తర్వాత నగదు డిమాండ్ చేస్తుండటంపై భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమశక్తిననుసరించి భక్తులు ఐదో, పదో అదనంగా బహుమతిగా చేతిలో పెడితే క్షురకులు తీసుకోకుండా రూ. 20కి తక్కువ కాకుండా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో భక్తులు అవాక్కవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందయినా వారడిగింది ఇవ్వవలసి వస్తోంది. ఈ సంఘటనలపై దేవస్థానం అధికారులకు గతంలో పలువురు భక్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వచ్చేనెల 1 నుంచి తలనీలాల టికెట్ 15 రూపాయలకు దేవస్థానం పెంచింది. ఈ మొత్తంలో రూ. 10 క్షురకులకు, రూ. 5 దేవస్థానానికి వచ్చేలా నిర్దేశించింది. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాతైనా క్షురకులు తమ నుంచి నగదు డిమాండ్ చేసే పద్ధతి విడనాడాలని పలువురు భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
ఉంటుందా..? ఊడుతుందా?
నల్లగొండ : జిల్లావ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 10వేల మంది ఉన్నారు. దీంట్లో కాంట్రాక్టు ఉద్యోగులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి శాఖలో ఉన్నారు. నాలుగో తరగతి శ్రేణిలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ పథకంతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో వెయ్యి మంది వరకు స్వీపర్లుఉంటారు. వీరితోపాటు వైద్యఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలు, జీఎంలు, పశు సంవర్థక శాఖలో అంటెండర్లతోపాటు, సంక్షేమ శాఖల హాస్టళ్లలో కుక్‌లు, కామాటీలు, వాచ్మన్లు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది, ఏపీఎంఐపీ, ఉద్యావనశాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులున్నారు. రాష్ర్టపతి పాలనలో జీఓ 84 జారీ.. రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి జీఓ నెం. 84 జారీ చేశారు. దీని ప్రకారం జూన్ 30వ తేదీ వరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని, అప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం ఖజానా ద్వారానే వారి జీతభత్యాల చెల్లింపులు ఉంటాయని జీఓలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం పైనే ఆ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం.. మరి కొద్దిరోజుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఒప్పందం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏజెన్సీలను రెన్యువల్ చేస్తూ ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తే తప్ప జూలై 1 నుంచి వారు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే జిల్లాలో వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. వీరికి మినహాయింపు ఇచ్చే అవకాశం... ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధి హామీ పథకం, ఐకేపీలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా నియమితులైన ఉద్యోగులను కూడా మినహాయించి రెగ్యులర్ పోస్టులకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఎక్కువగా అటెండర్లు, స్వీపర్లు, కుక్‌లు, కామాటీలు, వాచ్మన్లు, సెక్యూరిటీ గార్డులు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు ఉన్నారు. ఇలాంటివారు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, పశుసంవర్థక శాఖ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు. సేవల రద్దుపై ఆదేశాలు... గవర్నర్ జారీ చేసిన జీఓ ప్రకారంగా పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న 56మంది అటెండర్ల సేవలను ఈ నెల 30వ తేదీ తర్వాత వినియోగించుకోవద్దని ఆ శాఖ జాయింట్ డైరక్టర్ డివిజన్‌స్థాయి ఏడీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఏడీలకు ఈ ఆదేశాలు వె ళ్లాయి. దీంతో అటెండర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇదిలాఉంటే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని నమ్మబలికిన ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేశాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఇప్పడా ఆ చిన్నజీవుల పరిస్థితి ఏమిటన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి ఎనిమిదేళ్లుగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ హామీని వెంటనే అమలుచేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఉద్యోగస్తులు, వారి వయోపరిమితి దాటినందున వేరొక ఉద్యోగాలకు అర్హులయ్యే అవకాశం లేదు. వీరిని పర్మనెంట్ చేయకుంటే వందలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఉంది. - సీహెచ్.సంజీవ్ కుమార్, తెలంగాణ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఈ ఉద్యో గుల పదవీకాలం ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. అయితే వీరిని కొనసా గిస్తారా..తొలగిస్తారా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కొత్త రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీపైనే ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులను కొనసాగించాలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. 2011నుంచి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తే వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. ఉద్యోగులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. - పి.వేణు, డేటా ఎంట్రీ ఆపరేటర్, పశుసంవర్థక శాఖ ప్రధానశాఖల్లోని సిబ్బంది వివరాలు.. ప్రభుత్వ శాఖ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగులు పశుసంవర్థక శాఖ - 72 డ్వామా 600 150 ఐకేపీ 350 - పంచాయతీరాజ్ - 60 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ - 156 మున్సిపాలిటీలు - 800 సంక్షేమ హాస్టళ్లు - 100 మహాత్మాగాంధీ యూనివర్సిటీ - 123 ఆరోగ్యశ్రీ - 127 రాజీవ్ విద్యామిషన్ - 100 గృహ నిర్మాణ శాఖ - 223 విద్యుత్‌శాఖ - 1000 -
షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకున్నారు!
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : జిల్లాలోని పలు విద్యుత్ సబ్స్టేషన్లలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం చేసి షిప్ట్ ఆపరేటర్ పోస్టులను ఎస్ఈ నాగశయనరావు అమ్ముకున్నారని జిల్లా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి హజరత్తయ్య ఆరోపించారు. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలను ప్రశ్నించేందుకు సోమవారం నెల్లూరులోని విద్యుత్ భవన్‌కు వచ్చిన కాంట్రాక్టర్లను ఎస్ఈ లోనికి అనుమతించలేదు. దీంతో వారు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ అంశం తమ పరిధిలోది కాదని, ఉన్నతాధికారులకు నివేదిస్తామని కార్యాలయ పీఓ చిన్నయ్య వా రికి సర్దిచెప్పారు. హజరత్తయ్య మాట్లాడుతూ జిల్లాలో 130 షిప్ట్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయన్నారు. వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇ వ్వాల్సి ఉండగా, ఏఈలు, ఏడీఈల సహకారంతో ఎస్ఈ నాగశయనరావు అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షలు వసూలు చేశారని ధ్వజమెత్తారు. మంత్రి పేరు చెప్పి భారీ అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించామని, కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో చట్టా న్ని అతిక్రమించి ఎస్ఈ నియామకాలు చేపట్టారని చెప్పారు. ఈ విషయాన్ని తాము లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. మానవ హక్కుల సంఘం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. ఆ సంఘం ప్రతి నిధులు వస్తే వారిని లోపలికి కూడా అనుమతించకపోవడం దారుణమని, ఎస్ఈ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను కోరారు. కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం పబ్లిక్ అడ్వైజర్ దత్తాత్రేయ, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ప్రతినిధి చిట్టిబాబు, కాంట్రాక్ట్ అసోసియేషన్ నేతలు రమణారెడ్డి, శ్రీనివాసులు, గౌస్‌బాషా, రాఘవేంద్ర పాల్గొన్నారు. -
‘అమ్మహస్తం’ అదృశ్యమయ్యేనా?
మే నెల రేషన్ సరఫరా ఏదీ? నిలిచిపోయిన ఏడు రకాల సరుకులు సరుకుల పంపిణీకి ముగిసిన కాంట్రాక్టు పట్టించుకోని పౌరసరఫరాల శాఖ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో నిరుపేదలకు రేషన్ సరుకుల పంపిణీ అరకొరగా మారింది. మే నెల రేషన్ లో రెండు, మూడు మినహా మిగతా సరుకుల సరఫరా లేకుండా పోయింది. నెల ప్రారంభమై వారం రోజులు గడిచినా బియ్యం, గోధుమ పిండి తప్ప మిగిలిన సరుకులు చౌకధర దుకాణాలకు చేరలేదు. ముఖ్యంగా పామాయిల్‌తో పాటు చక్కెర, కందిపప్పు, చింతపండు, పసుపు, కారం, ఉప్పు సరఫరా లేకుండా పోయింది. గతేడాది ‘అమ్మహస్తం’ కింద తొమ్మిది సరుకుల సరఫరాకు కుదుర్చుకున్న కాంట్రాక్టు గడువు ఏప్రిల్ మాసంతో పూర్తికావడంతో ఈ నెల సరుకుల సరఫరా నిలిపోయింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాత కాంట్రాక్టు పునరుద్ధరణ, లేక కొత్త కాంట్రాక్టుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితం మే నెలకు సంబంధించి సుమారు ఏడు రకాల సరుకుల సరఫరా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి పాలసీ నిర్ణయాలు తీసుకుంటే గానీ సరుకుల సరఫరాకు మోక్షం లభించే అవకాశాలు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. సబ్సిడీ సరుకులపై అనుమానాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. రూపాయికి కిలో బియ్యం మినహాయిేస్తే మిగిలిన సరుకుల సరఫరా లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం ప్రస్తుతం లబ్ధిదారులకు అందించిన తెల్లరేషన్ కార్డులను అమలు చేస్తుందా.? లేక వాటిని రద్దు చేసి వేరే కార్డులను జారీ చేస్తుందా? అనేది నిరుపేదలకు తొలిచేస్తున్న ప్రశ్న. మరోవైపు సబ్సిడీ సరుకులు కొనసాగించేనా.. లేదా అనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 17.69 లక్షల వరకు తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం ప్రతి నెలా గ్రేటర్‌కు కోటా ప్రకారం పెద్దఎత్తున సరకుల సరఫరా జరుగుతుంది. ఈ నెల సరుకుల సరఫరా లేకుండా పోవడంతో లబ్ధిదారులు చౌకధర ల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
పర్మినెంట్ చేయాలని డిమాండ్ మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ మహారాణిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ శాఖ లు, స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య కన్వీనర్ పి.మణి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు. రాష్ట్రంలో 5.5లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నట్టు తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పిం చాలని, వేతనాలు పెంచాలని కోరారు. ప్రసూతి సెలవులు, ఇంక్రిమెంట్లు, డీఏ తదితర సదుపాయాలు కల్పించాలన్నారు. సిటు నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభు త్వ సేవలలో కీలకపాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామనే రాజకీయ పార్టీలకే మద్దతు తెలపాలన్నారు. వీరి రెన్యువల్ కాల పరిమితిని ఏడాది నుంచి మూడు నెలలకు కుదించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని వాపోయారు. పర్మినెంట్ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పర్యాటక, ఈఎస్ ఐ, 108, యూహెచ్‌సీ, కాలుష్య నియంత్రణ మండలి, ఏపీఐఐసీ, హౌసింగ్, ఏయూ, అటవీశాఖ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఐకేపీ, ఐసీడీఎస్, డ్వామా తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు సంఘీభావం తెలిపారు. -
కాంట్రాక్టు ఉద్యోగులు మీకు పట్టరా?
-
కాంట్రాక్ట్ ఎవరిది?
ప్రత్యర్థి మనసు తెలుసుకుని ఎత్తుకు పై ఎత్తు వేయడం అంటే చిన్న విషయం కాదు. తెలివితేటల్లో ఎవరికి వారే అన్నట్లు ఉండాలి. మరి.. తమ తెలివితేటలను ఉపయోగించుకుని ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో అర్జున్, జేడీ చక్రవర్తిల్లో ఎవరు బెస్ట్ అనే విషయం తెలుసుకోవాలంటే ‘కాంట్రాక్ట్’ సినిమా చూడాల్సిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ గొడావత్ సమర్పణలో రంజిత్ గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. సమీర్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ మినీషా లాంబా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథ ఇది. అర్జున్, జేడీ చక్రవర్తి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. ఇందులో మొత్తం 6 పాటలుంటాయి. సుభాష్-విశ్వాస్ సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్నారు. పాటలు చాలా బాగా వచ్చాయి’’ అని చెప్పారు. రంజిత్ గోగినేని మాట్లాడుతూ -‘‘ఫిబ్రవరి 1 నుంచి హైదరాబాద్, కొల్హాపూర్ల్లో జరిపే మూడో షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. మార్చిలో పాటలను, సమ్మర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, అలీ, కె.విశ్వనాథ్, గజల్ ఖాన్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జానీలాల్, ఎడిటింగ్: వెంకటేశ్, ఫైట్స్: నందు, కొరియోగ్రఫి: జాని. -
పేగుబంధం తెంచుకున్నారు
జమ్మికుంట, న్యూస్‌లైన్ : కని పెంచిన చేతులే కన్నకొడుకును అంతమొందించాయి. జులాయి తిరుగుళ్లు, వేధింపులు భరించలేక తల్లిదండ్రులే పేగు బంధా న్ని తెంపుకున్నారు. కాంట్రాక్ట్ మాట్లాడుకుని మరీ మట్టుబెట్టించారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. జమ్మికుంట మండ లం బిజిగిరి షరీఫ్ గుట్టల్లో యువకుడి హత్యకేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, సోదరుడే కాంట్రాక్ట్ హత్య చేయించారని తేల్చారు. నిందితులను ఆదివారం అరెస్టు చూపిన డీఎస్పీ సుధీంద్ర, ఎస్సై పాపయ్యనాయక్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన బొల్లు సుదర్శన్‌రెడ్డి-రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు రంజిత్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి(26) ఉన్నారు. రంజిత్‌రెడ్డికి పెళ్లి కాగా, హోటల్ మేనేజ్మెంట్ చదివిన రణధీర్‌రెడ్డికి ఖాళీగా ఉంటున్నాడు. అతడికి పెళ్లి కాలేదు. తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటున్న రణధీర్‌రెడ్డి ఆస్తి పంచాలంటూ కొన్నేళ్లుగా తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాడు. అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలంటూ తరచూ వేధిస్తున్నాడు. ఆస్తి పంచిస్తే అమ్ముకుంటానంటూ గొడవకు దిగుతున్నాడు. అతడి వేధింపులు నానాటికి ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేని తల్లిదండ్రులు... ఆస్తి పంచిస్తే మొత్తం అమ్ముకుం టాడనే ఉద్దేశంతో కొడుకును మట్టుబెట్టాలని పథకం వేశారు. ఇందుకు తమ బంధువైన వీణవంక మండలం చల్లూరుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. రణధీర్‌రెడ్డిని చంపిస్తే రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి చల్లూరుకు చెందిన దోతుల రమేశ్‌తో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. రూ.20 వేలు అప్పగించాడు. ఒప్పందం ప్రకారం గత నెల 25న పర్లపల్లిలో శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌లు రణధీర్‌రెడ్డికి పర్లపల్లిలో మద్యం తాగించి బైక్‌పై బిజిగిరి షరీఫ్ గుట్టల వద్దకు పని ఉందం టూ తీసుకెళ్లారు. అక్కడ రణధీర్‌రెడ్డిని బండతో మోది చంపారు. అనంతరం శరీరాన్ని ఎవరూ గుర్తించకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. రెండు రోజులకు స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై లభించిన దుస్తుల ఆధారంగా విచారణ ప్రారంభించారు. అప్పటికే పర్లపల్లిలో రణధీర్‌రెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులకు లభించిన క్లూ ఆధారంగా మృతుడు రణధీర్‌రెడ్డి అని గుర్తించారు. కేసును లోతుగా విచారించగా మృతుడి కుటుంబసభ్యులపైనే అనుమానం కలిగింది. వారిని విచారించగా కుటుంబసభ్యులే కాంట్రాక్ట్ హత్య చేశారని నిర్ధారించారు. హత్యకు సంబంధించి చేసుకున్న ఒప్పందపత్రంతోపాటు నిందితుడి వద్ద ఉన్న రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు సుదర్శన్‌రెడ్డి, రమాదేవి, సోదరుడు రంజిత్‌రెడ్డితోపాటు ప్రధాన నిందితుడు రమేశ్, శ్రీనివాస్‌రెడ్డిలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
సిండికేట్ల చేతికి ఇసుక రేవులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు :జిల్లాలో బుధవారం జరిగిన ఇసుక రీచ్‌లకు పాటదారులు వేరైనా చివరకు సిండికేట్లు ఏకమై రేవుల్లో వ్యాపారం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ప్రజలకు తక్కువ ధరకు ఇసుకను అందించాలనే మంచి ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం లాటరీ విధానంలో ఇసుక రీచ్‌లను కేటాయించింది. క్యూబిక్ మీటరు రూ.450 లకు మించి అమ్మరాదనే నిబంధన విధించింది. ఇది కచ్చితంగా అమలైతే ఆరు క్యూబిక్ మీటర్ల లారీ ఇసుక రూ.2600 లకు రేవు వద్ద లభిస్తుంది. లారీ కిరాయి అదనంగా ఉంటుంది. మొత్తం మీద లారీ ఇసుక రూ.7 వేల నుంచి 8 వేలలోపు లభిస్తుంది. ప్రస్తుతం లారీ ధర రూ.12 వేలకుపైగానే ఉంది. జిల్లా యంత్రాంగం ఇసుక ధరను నియంత్రిస్తేనే లాటరీ విధానం సక్రమంగా అమలులోకి వచ్చినట్టుగా పేర్కొనవచ్చు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల ఇసుక వ్యాపారులు అధికారుల ప్రయత్నాలకు ప్రారంభంలోనే గండికొట్టారు. టెండరు తేదీకి రెండు రోజులు ముందుగానే సమావేశమై లాటరీ విధానాన్ని అపహాస్యం చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. తమతో ఏకాభిప్రాయానికి వచ్చిన వ్యాపారులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేశారు. వారితో దరఖాస్తు తీయించారు. టెండరు రోజు దరఖాస్తుతో కట్టాల్సిన ఈఎండిని తీయించారు. వీరందరూ విడివిడిగా దరఖాస్తులు ఇచ్చారు. ఈ గ్రూపులో ఎవరికి లాటరీ తగిలినా అంతా కలిసి ఇసుక వ్యాపారం చేసే విధంగా అంగీకారానికి వచ్చి అందులో విజయం సాధించారు. సిండికేట్ల తంత్రం జిల్లాలో నాలుగు రీచ్‌లకు పిలిచిన టెండర్లలో తాడేపల్లి రీచ్‌కు 182 దరఖాస్తులు వచ్చాయి.లాటరీ తీయగా గుడే మూర్తయ్య అనే వ్యాపారికి రీచ్ లభించింది. అమరావతి మండలం మల్లాది రీచ్‌కు 153 దరఖాస్తులు రాగా లాటరీలో రాజకోటయ్యకు,. కొత్తపల్లి-చింతపల్లి ఇసుక రీచ్‌కు 210 దరఖాస్తులు అందగా 9 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 201 దరఖాస్తులకు లాటరీ తీయగా తెనాలికి చెందిన ఆకుల సురేంద్రకుమార్‌కు రీచ్ లభించింది. రికార్డుల ప్రకారం ఇదీ అంతా సవ్యంగానే కనపడుతుంది.అయితే రెండు రీచ్‌లకు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడినట్టు వ్యాపార వర్గాల కథనం. ఒక్కో సిండికేట్‌లో 60 మంది సభ్యులు న్నారు. ఒకొక్కరు రూ.5 వేలు చెల్లించి (తిరిగి చెల్లించరు) దరఖాస్తు తీసుకున్నారు. దరఖాస్తుతోపాటు రూ.10 లక్షల వరకు ఈఎండి కట్టారు. ఈ 60 మంది సిండికేట్‌లోని ఒకరికి లాటరీలో రీచ్ లభించింది. ఆ వ్యాపారి పేరు మీద 60 మంది ఇసుక వ్యాపారం చేసుకోనున్నారు. ఈ సిండికేట్ వ్యవహారంపై డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ ఢిల్లీరావును వివరణ కోరగా, కార్యాలయం బయట జరిగిన విషయాలు తమకు సంబంధం లేదన్నారు. అయితే జిల్లా యంత్రాంగం నిర్ణయించిన ధరకు మించి ఇసుక అమ్మకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇసుక ధర నియంత్రణ సాధ్యమేనా? జిల్లా అధికారులు ఇసుక ధరను నియంత్రిస్తామని చెబుతున్నారు. అయితే సిండికేట్లు టెండరు దక్కించుకోడానికి చేసిన ఖర్చును పరిశీలిస్తే ఇది సాధ్యమేనా అనే సందేహాలు కలగక మానవు. ఒక గ్రూపు 60 దరఖాస్తులు తీసుకున్నది. ఒక్కో దరఖాస్తుకు రూ.5 వేల చొప్పున రూ.3 లక్షలు ఖర్చుచేసింది. రీచ్ లభించిన వ్యాపారి మినహా మిగిలిన దరఖాస్తులకు ఇచ్చిన రూ.2.95 లక్షలు తిరిగి వెళ్లవు. అదే విధంగా ఒక్కొక్కరు రూ.10 లక్షల వరకు ఈఎండి తీసుకున్నారు. టెండరు లభించని వ్యాపారి ఆ డిడిని రద్దు చేసుకోడానికి కనీసం రూ.3 వేల ఖర్చు చేయాల్సి ఉంటుంది. 59 మంది వ్యాపారులకు కలిపి రూ.1.77 లక్షలు ఖర్చులు అవుతాయి. వీటన్నింటినీ భరించిన సిండికేట్ అధికారులు నిర్ణయించిన ధరకు ఇసుక అమ్ముతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే! మరి జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందో చూడాలి మరి.! -
పండగ పూట పస్తులేనా
సాక్షి, నల్లగొండ :జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆనందోత్సాహాల నడమ పండగ జరుపుకోవడం అటుంచితే... కనీసం కడుపు నిండా భోజనం చేయలేని దుస్థితి దాపురించింది. సుమారు ఐదువేల మంది సిబ్బందికి కొన్నినెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుతెచ్చి పూట గడుపుతున్నారు. దసరా పండగకైనా జీతాలు వస్తాయని ఎదురు చూస్తున్నవారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందితో సమానంగా పని చేస్తున్నా వేతనాలు అందజేయడానికి ప్రభుత్వానికి మనసొప్పడం లేదు. ఇచ్చే అరకొర వేతనం కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో నరకం అనుభవిస్తున్నారు. వెరసి వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది అంటీముట్టనట్లు పండగ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. చితికిపోతున్న కోఆర్డినేటర్లు... సాక్షర భారత్ కోఆర్డినేటర్లకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. సాక్షరభారత్లో జిల్లాలో 59మంది మండల కో ఆర్డినేటర్లు, రెండు వేలకుపైగా గ్రామ కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. గ్రామ కో ఆర్డినేటర్లు గతేడాది సెప్టెంబర్ నుంచి జీతాలకు నోచుకోలేదు. మండల కోఆర్డినేటర్లు ఈ ఏడాదిలో ఇంతవరకు వేతనం అందుకున్న దాఖలాలు లేవు. వేతనాలకుతోడు ఎఫ్‌టీఏ, టీఏ, డీఏ ఇస్తున్న పాపాన ప్రభుత్వం పోలేదు. దీంతో అప్పుతెచ్చి కుటుంబాలు పోషిస్తున్నారు. పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల పరిస్థితి అంతే.. గ్రామీణ పేద విద్యార్థులకు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్ అందించడానికి పార్ట్‌టైమ్ ఇన్ స్ట్రక్టర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన ప్రభుత్వం నియమించింది. జిల్లాలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 436 మంది పనిచే స్తున్నారు. ప్రతిఒక్కరికి నెలనెలా రూ.4500 వేతనం ఇవ్వాల్సి ఉంది. అయితే గత జూన్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు జీతాలు ఇవ్వడం మరిచారు. దీంతో బతుకు దుర్భరంగా మారింది. వైద్య ఆరోగ్య శాఖలో.. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న గ్రామీణ సంచార వాహనాలు 104లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 104 పరిధిలో అవుట్ సోర్సింగ్ విధానంలో సుమారు 200 మంది ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, వాచ్మెన్లు పనిచేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి వేతనాలు అందాల్సి ఉంది. ఎన్‌ఆర్‌హెచ్‌ఎంలో.... జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)పరిధిలో జిల్లాలో 450 మంది కాంట్రాక్ట్ పద్ధతిన ద్వితీయ ఏఎన్ఎంలు విధులునిర్వహిస్తున్నారు. వీరికి గత రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. వీరి వేతనం మీదే కుటుంబాలన్నీ ఆధారపడడం, వేతనాలు అందకపోవడంతో సంకట పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టు బోధకులకూ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లుగా దాదాపు 130 మంది పనిచేస్తున్నారు. ఒక్కో కాంట్రాక్ట్ లెక్చరర్‌కు వేతనంగా నెలకు రూ.20,700 చెల్లించాల్సి ఉంది. గతంలో వీరికి రెండు మూడు నెలలకోసారి అందజేసేవారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించిన పాపాన పోలేదు. దీంతో 70మంది లెక్చరర్ల కుటుంబాలు తీవ్ర అవస్థలపాలవుతున్నాయి. గెస్ట్ లెక్చరర్లుగా 60మంది వరకు బోధిస్తున్నారు. వీరికి ఈ ఏడాదిలో జీతాలు ఇచ్చారు. అయితే గత రెండేళ్లకు సంబంధించిన జీతాలు ఇంకా అందలేదు. ‘జూనియర్’లదీ ఇదే పరిస్థితి... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన 330మంది లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. సగటున ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేలు వేతనం. ఆర్వీఎంలో... ఆర్వీఎం పరిధిలో దాదాపు 600 మందికి రెండు నెలల నుంచి వేతనాలు అందడంలేదు. 284మంది సీఆర్పీలు, మండలానికి ఒకరు చొప్పున ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఎల్డీఎల్లు, ఐఈఆర్టీలు, మెసెంజర్లు వేతనాలకు నోచుకోలేదు. వీళ్లేగాక వేతనాలు నోచుకోని వారు ఇంకా పలు శాఖల్లో వందల సంఖ్యలో ఉన్నారు. పండగలోపైనా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే పండగ పూట తమకు పస్తులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆత్మ సంతకం చేసింది!
సాక్షి, నిజామాబాద్ : కాసులు కురిపించే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. * 93 లక్షల అంచనా వ్యయం కలిగిన అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు ఓ కాంట్రాక్టర్ మాయాజాలం చేశాడు. పదేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఇటీవలే మరణించిన ఆర్అండ్బీ ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. అసలు ప్లాంటే లేకు న్నా.. ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. అనుమానం వచ్చి ఆ పత్రాలను పరిశీలించగా అవి బోగస్‌వని తేలాయి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పాత జాతీయ రహదారి (చర్చి) నుంచి రైల్వేగేట్ వరకు ఉన్న రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని భా వించారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పథకాల కింద మంజూరైన నిధులతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రెండు (*48 లక్షలు, *45 లక్షలు) బిట్లుగా మార్చి రెండు నెలల క్రితం మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. పలువురు కాంట్రాక్టర్లు ఈ పనుల కోసం పోటీ పడ్డారు. కాంట్రాక్టర్‌గా అవతారమెత్తిన ఓ పార్టీ నేత ఒకరు అంచనా వ్యయం కంటే 3.55 శాతం తక్కువకు కోట్ చేసి ఈ టెండరు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ పనులకు టెండర్లు వేయాలంటే ఆ కాంట్రాక్టరుకు హాట్‌మిక్స్ ప్లాంట్ ఉండాలి. కానీ ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తాను ఓ వ్యక్తి వద్ద హాట్‌మిక్స్ ప్లాంటును లీజుకు తీసుకున్నానని పేర్కొంటూ భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఈ ప్లాంటుకు సంబంధించి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ అధికారులకు సమర్పించారు. మున్సిపల్ అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనా అని నిర్ధారించుకునేందుకు నిజామాబాద్‌లోని ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయానికి పంపారు. ఆర్అండ్బీ అధికారులు ఈ పత్రాలను పరిశీలించగా అవి బోగస్‌వని తేలింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు వారు గుర్తించారు. మరో విశేషమేంటే ఈ పత్రాలపై సంతకం చేసిన అధికారి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేశారని, ఆయన ఇటీవలే మరణించారని ఆర్అండ్బీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తే ఆసలు ప్లాంటే లేదని తేలింది. చర్యలపై అనుమానాలు? బోగస్ పత్రాలను సృష్టించిన సదరు కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, బ్లాక్‌లిస్టులో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలా లేని ప్లాంటును ఉన్నట్లు చూపి.. పలు శాఖల ఉన్నతాధికారుల సంతకాలను ఫొర్జరీ చేసి బోగస్ పత్రాలు సృష్టించిన సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకునే సాహసం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్‌తో చర్చించి నిర్ణయం - బాలోజీనాయక్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ టెండరును ఫైనల్ చేసేందుకు పత్రాలను పరిశీలనకు పంపగా అవి బోగస్‌వని తేలింది. మున్సిపల్ ప్రత్యేక అధికారితో చర్చించాక బోగస్ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన కాంట్రాక్టర్‌పై చర్యల విషయమై నిర్ణయం తీసుకుంటాం.