
బెంగళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ నుంచి రూ. 2,400 కోట్ల కాంట్రాక్టును భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్‌సీఏ) తేజాస్ ఎంకే1ఏలకు అవసరమైన 20 రకాల ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్‌ను (ఎల్‌ఆర్‌యూ మొదలైనవి) బీఈఎల్ తయారీ చేసి, సరఫరా చేయాల్సి ఉంటుంది. 2023 నుంచి 2028 వరకూ అయిదేళ్ల వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంటుంది. మరోవైపు, 83 తేజాస్ ఎంకే1ఏలను భారత వైమానిక దశానికి 2023–24 నుంచి అందించడం మొదలవుతుందని హెచ్‌ఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment