BEL
-
బిగ్ డీల్: బీఈఎల్‌కు రూ.5,900 కోట్ల ఆర్డర్లు
ముంబై: ప్రభుత్వ రంగ భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్) తాజాగా రూ.5,900 కోట్ల ఆర్డర్లకు చేజిక్కించుకుంది. ఇందులో ఆకాశ్ ప్రైమ్ వెపన్ సిస్టమ్ నుంచి రూ.3,914 కోట్ల ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్లలో భాగంగా శక్తి ఈడబ్లు్య, సాంకేత్, ఎంకే–3 (నావల్ సిస్టమ్స్), జామర్ సిస్టమ్స్, ఎంకేబీటీ సిస్టమ్స్, ఎంకే–12 క్రిప్టో మాడ్యూల్స్ తయారీ, రోహిణి రాడార్స్ ఎస్డీపీ డిస్ప్లే ఆధునీకరణ చేపడుతుంది. ఇవీ చదవండి: హైదరాబాద్‌లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు WhatsApp Latest Features: స్పాం కాల్స్‌తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్ -
ఉపాధికి రక్షణ కవచం!
సాక్షి, అమరావతి : పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. మరో వైపు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి మార్గాలు చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాల సముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు వేగం అందుకున్నాయి. ఐదు దశల్లో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన దశలకు సంబంధించి ఆమోదం లభించనుందని బీఈఎల్ అధికారులు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్‌లో రాడార్, మిసైల్, సబ్మెరైన్లకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేయడమే కాకుండా వీటిని పరీక్షించేలా టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశకు సంబంధించి క్షిపణుల అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను రూ.148 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బిడ్ దక్కించుకున్న సంస్థ క్షిపణుల తయారీకి సంబంధించి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డ్‌లతో పాటు ఒక ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వరద నీటి కాల్వలు, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాలు వంటి వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు మే 23లోగా బిడ్లను దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే ఈ 914 ఎకరాల చుట్టూ సుమారు రూ.50 కోట్లతో ప్రహరీ నిర్మించింది. గోడ చుట్టూ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, సొంత అవసరాల కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. చకచకా అనుమతులు గత ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి బీఈఎల్ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 2016లోనే బీఈఎల్ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టిలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా, కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బీఈఎల్ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, తొలి దశలో రూ.384 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 2025 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిఫెన్స్ హబ్‌గా ఏపీ దేశ రక్షణ అవసరాల తయారీ హబ్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర రక్షణ సంస్థ 914 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తుండగా ఏపీఐఐసీ కూడా 1,200 ఎకరాల్లో ఏపీ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ (ఏపీ–ఏడీఈ) పార్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరిగే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు రాష్ట్రం రక్షణ రంగ ఉత్పత్తులకు తయారీ కేంద్రంగా తయారవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా 2,800 మందికి, పరోక్షంగా 8,000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. యాంకర్ యూనిట్‌గా బీఈఎల్ భారీ ప్రాజెక్టును చేపడుతుండటంతో అనేక అనుబంధ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కానున్నాయి. -
AP: 2 నెలల్లో 2వేల ఐటీ ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: ఐటీ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖపట్నానికి విస్తరిస్తుండటంతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్న ఇన్ఫోసిస్‌తో పాటు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, రాండ్‌శాండ్, టెక్నోటాస్క్, భారీగా విస్తరిస్తున్న టెక్ మహీంద్రా, డబ్ల్యూఏఎన్ఎస్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఎదురుచూస్తున్నాయి. విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలకు వచ్చే రెండు నెలల్లో కనీసం రెండు వేల మంది ఐటీ నిపుణులు అవసరమవుతారని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్) అంచనా వేసింది. విశాఖలోని ఐటీ కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తికాగానే ఉపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకోసం రెండు నెలల్లో కనీసం రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పలు ఐటీ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయని, ఈ పెట్టుబడులను తక్షణం వాస్తవ రూపంలోకి తీసుకురావడంతో పాటు ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలను తీర్చడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అదానీ డేటా సెంటర్ పనులు ప్రారంభించగా, త్వరలో మిగిలిన కంపెనీలు కూడా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ఏపీ ప్రభుత్వ హెల్ప్ లైన్ -
విశాఖలో బీఈఎల్ ‘ఎస్డీసీ’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్(ఎస్డీసీ)ను ప్రారంభించింది. రక్షణతోపాటు వివిధ రంగాలకు సంబంధించి సురక్షితమైన ఐటీ సేవలను అందించడమే లక్ష్యంగా విశాఖలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఈ ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు బీఈఎల్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. 150 మంది ఇంజనీర్లు పని చేసేవిధంగా ఏర్పాటు చేసిన ఎస్డీసీ కేంద్రాన్ని ఇటీవల బీఈఎల్ డైరెక్టర్ (బెంగళూరు కాంప్లెక్స్) కె.వినయ్‌కుమార్ ప్రారంభించినట్లు వెల్లడించింది. బెంగళూరులోని స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ (ఎస్‌బీయూ)ను విస్తరిస్తూ విశాఖలో ఎస్డీసీని ఏర్పాటు చేసినట్లు వివరించింది. బీఈఎల్‌కు చెందిన సాఫ్ట్వేర్ డివిజన్ ఇప్పటికే అతి కీలకమైన రక్షణ, ఎయిర్‌స్పేస్, ఈ–గవర్నెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అనేక ప్రాజెక్టులను విజయవంతంగా అమలుచేసింది. అత్యంత కీలకమైన విభాగాల్లో సురక్షితమైన ఐటీ సేవలను అందించే లక్ష్యంతో విశాఖలో ఎస్డీసీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇక్కడ నుంచి డీఆర్డీవోతో కలిపి నేవీకి సంబంధించిన అన్ని రకాల ఐటీ ఆధారిత ప్రాజెక్టులను చేపట్టనుంది. వీటితోపాటు స్మార్ట్ సిటీ, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ రంగాల్లో అవసరమైన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అందించనున్నట్లు పేర్కొంది. ఆహ్లాదకరమైన, అత్యంత సురక్షిత వాతావరణంలో ఉద్యోగులు పనిచేసే విధంగా ఎస్డీసీ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇప్పటికే ఐటీ రంగంలో దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, రాండ్‌స్టాడ్ వంటి ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలను ఆకర్షించిన విశాఖ... తాజాగా మరో నవరత్న కంపెనీ బీఈఎల్ కూడా తమ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర విద్యార్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. -
సత్యసాయి జిల్లాలో క్షిపణుల తయారీ
సాక్షి, అమరావతి: దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకమైన అధునాతన క్షిపణులు (మిస్సైల్స్) రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద 914 ఎకరాల్లో వీటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. క్షిపణులతోపాటు రాడార్ టెస్ట్ బెడ్, ఇతర రక్షణ రంగ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనుంది. ఈ యూనిట్‌కు రూ.384 కోట్లు కేటాయిస్తూ శనివారం మచిలీపట్నంలోని బీఈఎల్‌లో జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టును వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రకాల అనుమతులు మంజూరు చేయించింది. 2016లో ఉమ్మడి అనంతపురం జిల్లా పాలసముద్రం వద్ద కేటాయించిన భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంతో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించింది. దీంతో ఈ యూనిట్ నిలిచిపోయింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దీనిపై దృష్టి సారించారు. త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్‌కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టీలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బోర్డు సమావేశం అనంతరం బెంగళూరు బీఈఎల్ డైరెక్టర్లు భాను పి.శ్రీవాత్సవ, వినయ్ కుమార్ కత్యాల్, మనోజ్ జైన్, డాక్టర్ పార్థసారధి మంగళగిరిలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసి ప్రభుత్వం చొరవను అభినందించారు. ఏమాత్రం ఆలస్యం కాకుండా వెంటనే టెండర్లు పిలిచి త్వరలోనే పనులు మొదలుపెడతామని తెలిపారు. 6 నెలలకు ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షిస్తామన్నారు. -
బీఈఎల్‌తో హెచ్ఏఎల్ రూ. 2,400 కోట్ల ఒప్పందం
బెంగళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ నుంచి రూ. 2,400 కోట్ల కాంట్రాక్టును భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్) దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తేలికపాటి యుద్ధ విమానాలు (ఎల్సీఏ) తేజాస్ ఎంకే1ఏలకు అవసరమైన 20 రకాల ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్‌ను (ఎల్‌ఆర్‌యూ మొదలైనవి) బీఈఎల్ తయారీ చేసి, సరఫరా చేయాల్సి ఉంటుంది. 2023 నుంచి 2028 వరకూ అయిదేళ్ల వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంటుంది. మరోవైపు, 83 తేజాస్ ఎంకే1ఏలను భారత వైమానిక దశానికి 2023–24 నుంచి అందించడం మొదలవుతుందని హెచ్ఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశా: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్-ఎన్జీ(న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆకాష్-ఎన్జీ అనేది కొత్త తరం సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి. ఇది భారత వైమానిక దళం కోసం తయారుచేయబడింది. భారత వాయుసేన ఉపరితలం నుంచి గగన తలంలో శత్రుదేశాల చెందిన అధిక శక్తి గల వైమానిక దళాలను చేధించడానికి తోడ్పడుతుంది. ఈ క్షిపణి పరిక్ష సమయంలో అత్యంత కచ్చితమైన టైమింగ్‌తో లక్ష్యాన్ని చేధించింది.(చదవండి: వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ ఏవియానిక్స్, క్షిపణి యొక్క ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ యొక్క పనితీరు ట్రయల్ సమయంలో విజయవంతంగా పనిచేసాయి అని డీఆర్డీవో ధ్రువీకరించింది. క్షిపణి పరీక్ష ప్రయోగ సమయంలో గగన తల విమాన మార్గాన్ని పర్యవేక్షించారు. తాజా ప్రయోగాన్ని భారతీయ వైమానిక దళం ప్రతినిధుల సమక్షంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), బీడీఎల్, బీఈఎల్ సంయుక్త బృందం ఈ పరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నాటి నుంచి భారత్ తరచూ క్షిపణుల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
బీఈఎల్- భారతీ ఇన్ఫ్రాటెల్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే సానుకూల వార్తల కారణంగా ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్), మరోపక్క టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ పూర్తి ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్ తాజాగా తెలియజేసింది. ఎల్సీఏ, ఆకాష్ వెపన్ సిస్టమ్, స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తదితరాల నుంచి రూ. 15,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఆశిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని అంచనా వేసింది. అంతేకాకుండా 20-21 శాతం స్థాయిలో ఇబిటా మార్జిన్లు సాధించగలమని అభిప్రాయపడింది. దీంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీఈఎల్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. వెరసి రెండు రోజుల్లో 13 శాతం లాభపడినట్లయ్యింది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 443 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. భారతీ ఇన్ఫ్రాటెల్ టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ ఇండస్ టవర్స్‌తో విజయవంతంగా విలీనాన్ని పూర్తిచేసుకున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. తద్వారా ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఈ సంయుక్త సంస్థలో మాతృ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు 36.73 శాతం వాటా లభించగా.. వొడాఫోన్ గ్రూప్ 28.2 శాతం వాటాను పొందింది. ప్రావిడెన్స్‌కు సైతం 3.25 శాతం వాటా దక్కింది. ఈ నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 210 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 214 వరకూ ఎగసింది. నేటి ట్రేడింగ్ తొలి గంటలోనే (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) ఈ కౌంటర్లో 10 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! -
దిగుమతులపై నిషేధం- డిఫెన్స్ షేర్ల హవా
ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర రక్షణ శాఖ వివిధ డిఫెన్స్ పరికరాల దిగుమతులపై దృష్టి పెట్టింది. తద్వారా 101 ప్రొడక్టుల దిగుమతులపై నిషేధానికి తెరతీసింది. 2020 ముసాయిదా విధానం కింద వారాంతాన 101 ప్రొడక్టులతో కూడిన జాబితాను రూపొందించింది. ఆయుధాలు, విభిన్న పరికరాలు తదితర 101 ప్రొడక్టులపై రక్షణ శాఖ దశలవారీగా నిషేధాన్ని విధించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వీటిలో చాల ప్రొడక్టులను దేశీయంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 2020-2024 మధ్యకాలంలో దశలవారీగా పలు ప్రొడక్టుల దిగుమతులను నిషేధించే యోచనలో ప్రభుత్వమున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో దేశీ కంపెనీలు సొంత డిజైన్, తయారీ సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకునే వీలు చిక్కనున్నట్లు వివరించాయి. కాగా.. దేశీయంగా రక్షణ రంగ పరికరాలు, ఆయుధాల తయారీకి వీలుగా రానున్న 6-7ఏళ్లలో రూ. 4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులకు అవకాశమున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. తద్వారా దేశీయంగా తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహం లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ రంగ సంబంధిత కంపెనీల షేర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్ఏఎల్ దూకుడు రక్షణ రంగ పరికరాల దిగుమతులపై నిషేధ వార్తలతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ షేరు 11.5 శాతం దూసుకెళ్లి రూ. 1058ను తాకింది. డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ 5.2 శాతం పెరిగి రూ. 963 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో డైనమాటిక్ టెక్నాలజీస్ 10 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ. 596 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదేవిధంగా వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ 5 శాతం ఎగసి రూ. 55 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో భారత్ ఎలక్ట్రానిక్స్ దాదాపు 9 శాతం దూసుకెళ్లి రూ. 108 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఫోర్జ్ దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 423ను తాకగా.. మిశ్రధాతు నిగమ్(మిధానీ) 4 శాతం పెరిగి రూ. 213కు చేరింది. ఇక ఆస్ట్రా మైక్రోవేవ్ 5 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద, భారత్ డైనమిక్స్ 5.2 శాతం పురోగమించి రూ. 441 వద్ద ట్రేడవుతున్నాయి. -
ఈవీఎం ఎక్చేంజ్
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మ రం చేసింది. ఇప్పటికే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన అధికారులు.. ఇప్పు డు ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లపైనా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న పాత ఈవీఎంల స్థానంలో కొత్తవాటిని తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పుడున్న ఈవీఎంల టెక్నాలజీ వీవీపీఏటీ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రాయల్)కి సపోర్టు చేయదు. దీంతో వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేసేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసీఐఎల్, బీఈఎల్‌లకు 3,400 ఈవీంలు ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల సంఘం ప్రత్యేక గోదాములు నిజామాబాద్‌లో ఉన్నాయి. గత ఎ న్నికల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎం లను ఇందులో భద్రపరిచారు. మొత్తం 20,826 ఈవీఎంలు ఉన్నాయి. వీటిలో కొన్ని హైదరాబాద్‌కు చెందిన ఈసీఐఎల్ సంస్థ తయారు చేసినవి కాగా, మరికొన్ని బెంగుళురులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. వీవీపీఏటీ యూనిట్లకు సపోర్టు చేయని వీటి స్థానంలో వీవీపీఏటీ యూనిట్లకు అనుసంధానించేలా అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 3,400 ఈవీఎంలను ఆయా సంస్థలకు పంపారు. మిగిలినవి కూడా విడతల వారీగా పంపుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలకు వీవీపీఏటీ యూనిట్లు సపోర్టు చేయగల అప్డేటెడ్ ఈవీఎంలను తెప్పిస్తున్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 2,142 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. వీటికి అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. పార్టీల అభ్యంతరాల నేపథ్యంలో.. ఈవీఎంలో ఏ గుర్తు మీట నొక్కినా ఒకే అభ్యర్థికి ఓటు పడుతుందనే అపోహ.. ఈవీఎంల పనితీరుపై పలు రాజకీయ పార్టీల అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సం ఘం ఈ ఎన్నికల్లో వీవీపీఏటీ యూనిట్లను వినియోగించాలని నిర్ణయించింది. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారనేది ఈ వీవీపీఏటీ యూనిట్లలో నిక్షిప్తం అవుతుంది. ఓటరుకు తన ఓటు ఏ గుర్తుకు వేశామనేది ఈ యూ నిట్‌లో కనిపిస్తుంది. ఓటు వేసిన అనంతరం 7 సెకన్ల వరకు ఈ సమాచారం ఓటరు అం దుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైతే పోలింగ్ అధి కారులను అడిగి కూడా తన ఓటు ఏ గుర్తుకు పడిందనేది ఈ యూనిట్ల ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఆయా వీవీపీఏటీ యూనిట్లలో పోలింగ్‌కు సంబంధించిన సమాచారం ఐదేళ్ల వరకు నిక్షిప్తంగా ఉం టుందని అధికారులు పేర్కొంటున్నారు. -
బీఈఎల్ వాటాల విక్రయం ప్రారంభం
⇒ 2.3 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయిన సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ⇒ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు వాటా విక్రయం ⇒ ఫ్లోర్ ధరలో 5 శాతం డిస్కౌంట్ న్యూఢిల్లీ: వైమానిక, రక్షణ రంగ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) వాటా విక్రయానికి బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. బీఈఎల్‌లో 5 శాతం వాటాను (1.11 కోట్ల షేర్లు)ను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ప్రభుత్వం విక్రయిస్తున్నది. ఒక్కో షేర్‌కు కనీస బిడ్డింగ్(ఫ్లోర్) ధర రూ.1,498గా వుంది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.1,600 కోట్లు సమకూరుతాయని అంచనా. మొత్తం వాటా విక్రయంలో సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 89.34 లక్షల షేర్లకు గాను 2.09 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. వీటి విలువ రూ.3,100 కోట్లు. సంస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 2.34 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. నేడు(గురువారం) రిటైల్ ఇన్వెస్టర్లకు వాటా విక్రయించనున్నారు. షేర్ అలాట్మెంట్ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో బీఈఎల్ షేర్ 3% క్షీణించి రూ.1,510 వద్ద ముగిసింది. బీఈఎల్‌లో ప్రభుత్వానికి 74.41 శాతం వాటా ఉంది. -
రైతుల భూములపై ప్రభుత్వ కన్ను
త్వరలో 211 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తాం.. గన్నవరం పోర్టు – మచిలీపట్నం పోర్టు మధ్య నాలుగు లైన్ల రహదారి పామర్రు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన మళ్లీ రైతుల గుండెల్లో గుబులు సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ లక్షల విలువైన భూముల్ని ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నించడంపై మచిలీపట్నం ప్రాంత రైతాంగం ఆందోళన చెందుతోంది. పామర్రు మండలం నెమ్మలూరులో రూ.300 కోట్లతో నిర్మించే ‘చీకట్లో కనిపించే పరికరాల తయారీ’ కర్మాగారానికి’ సోమవారం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం రైతుల గుండెల్లో గుబులు పుట్టించింది. మచిలీపట్నం పోర్టుకు 33వేల ఎకరాల భూమి తీసుకోవాలనే ప్రభుత్వ ఆలోచనపై ఇప్పటికే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మచిలీపట్నంకు చెందిన వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 50 ఎకరాల భూమిని బెల్ కంపెనీకి ఇచ్చారు. తాజాగా రూ.22వేల కోట్లతో 211 కి.మీ పొడవైన ఔటర్ రింగ్‌రోడ్డు నిరిస్తామని చెబుతున్నారు. దీంతో పాటు గన్నవరం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టు మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తామని ప్రకటించారు. వీటికోసం ఇంకా ఎంత భూమి సేకరిస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం పోర్టుకు రైతులు భూములు ఇస్తే పనులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. పరిశ్రమలకు భూములు ఇస్తేనే అభివద్ధి సాధ్యమంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు చెప్పడాన్ని రైతాంగం జీర్ణించుకోలేకపోతోంది. పరిశ్రమలతో పాటు వ్యవసాయానికి.. ఈ సమావేశంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయమంత్రి జి.సుజనాచౌదరి మాట్లాడుతూ గతంలో పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని, ఇప్పుడు చంద్రబాబు 24 గంటలు ఇస్తున్నారని ప్రకటించారు. వ్యవసాయానికి కనీసం 9 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ఇచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని, కాలువ చివరి భూములకూ నీరు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందని పలువురు రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కొనకళ్ల వకల్తా బెల్ కంపెనీ నైట్‌విజన్ గ్లాసెస్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేయడంపై మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ హర్షం వ్యక్తం చేస్తూ మచిలీపట్నం పోర్టు ఏర్పాటుకు భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. బెల్, పోర్టు వంటి పరిశ్రమల వల్ల ఈ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఒకవైపు పోర్టు భూములపై రైతులు పోరాడుతుంటే.. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని ఎంపీ కొనకళ్ల చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మెప్పుకోసమే ఇలా చెప్పారని భావిస్తున్నారు. పరిశ్రమలు రావడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతాంగానికి ఎంతో విలువైన భూముల్ని తీసుకోవడం సరైన పద్ధతి కాదని రైతు సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ నేతలు నెమ్మలూరులో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు స్థానిక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో పాటు తోట్లవల్లూరు ఎంపీపీ కల్లం వెంకటేశ్వరరెడ్డి, కొండిపర్రు ఎంపీటీడీ బీవీ రాఘవులు తదితర ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు వచ్చారు. ఉప్పులేటి కల్పనను మాత్రం వేదిక మీదకు అనుమతించారు. మిగతా వారిని పోలీసులు అడ్డుకుని పామర్రు పోలీస్ స్టేషన్‌కు తరలించి సాయంత్రం వదలిపెట్టారు.