
ఒడిశా: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్-ఎన్‌జీ(న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆకాష్-ఎన్‌జీ అనేది కొత్త తరం సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి. ఇది భారత వైమానిక దళం కోసం తయారుచేయబడింది. భారత వాయుసేన ఉపరితలం నుంచి గగన తలంలో శత్రుదేశాల చెందిన అధిక శక్తి గల వైమానిక దళాలను చేధించడానికి తోడ్పడుతుంది. ఈ క్షిపణి పరిక్ష సమయంలో అత్యంత కచ్చితమైన టైమింగ్‌తో లక్ష్యాన్ని చేధించింది.(చదవండి: వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?)
కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆన్బోర్డ్ ఏవియానిక్స్, క్షిపణి యొక్క ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ యొక్క పనితీరు ట్రయల్ సమయంలో విజయవంతంగా పనిచేసాయి అని డీఆర్‌డీవో ధ్రువీకరించింది. క్షిపణి పరీక్ష ప్రయోగ సమయంలో గగన తల విమాన మార్గాన్ని పర్యవేక్షించారు. తాజా ప్రయోగాన్ని భారతీయ వైమానిక దళం ప్రతినిధుల సమక్షంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), బీడీఎల్, బీఈఎల్ సంయుక్త బృందం ఈ పరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నాటి నుంచి భారత్ తరచూ క్షిపణుల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment