DRDO
-
భాగ్యనగరంలో..‘విజ్ఞాన్ వైభవ్ 2 కే 25’ (ఫొటోలు)
-
గచ్చిబౌలి స్టేడియంలో ‘విజ్ఙాన్ వైభవ్-2025’ ప్రదర్శన (ఫొటోలు)
-
డీఆర్డీవో శాస్త్రవేత్తకు ఐదు కిడ్నీలు
ముంబై: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒక్కటి..! జనవరి 8వ తేదీన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి (Amrita Hospital) వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి ఐదో మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. మూడోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (Kidney Transplant) చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్ సాంకేతికతలో ఇది కీలక మలుపని చెప్పారు.డీఆర్డీవో శాస్త్రవేత్త (DRDO Scientist) దేవేంద్ర బర్లేవర్(45) తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్లపాటు ఇబ్బందిపడ్డారు. హైపర్‌టెన్షన్‌తో 2008లో రెండు మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో, ఆయనకు 2010లో, తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి ఫెయిలయ్యాయి. పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో అమర్చిన రెండు కలిపి మొత్తం నాలుగు మూత్రపిండాలున్నా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్–19 బారినపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో, ఆయనకు డయాలసిస్ (dialysis) తప్పనిసరయ్యింది.ఈయన్ను పరీక్షించిన ఫరీదాబాద్‌లోని అమృత ఆస్పత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సంసిద్ధత తెలిపారు. అదే సమయంలో, బ్రెయిన్‌డెడ్ అయిన ఓ రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనుకోని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది. అయితే, పనిచేయని నాలుగు కిడ్నీల వద్దే మరో కిడ్నీని అమర్చడం వారికి సవాల్‌గా మారింది. వ్యాధి నిరోధకతకు సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగా దాటాల్సి వచ్చింది.ఇందులో భాగంగా, కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా చేసేందుకు ముందుగా ఇమ్యునో సప్రెషన్ అనే ప్రత్యేక ప్రక్రియ చేపట్టామని బృందంలో ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు. రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందున స్థల పరిమితి కారణంగా ఐదో మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడమనే ప్రధాన సవాల్‌ను కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు.చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?ఎట్టకేలకు నాలుగు గంటల అనంతరం ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనబరచడంతో పది రోజుల అనంతరం బర్లేవర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో ఆయన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు. -
వ్యవసాయ నేపథ్యం.. కానీ రూ. 52 లక్షల జాబ్ ఆఫర్‌ని కొట్టేసింది..!
కొందరూ కార్పొరేట్ స్కూల్స్‌లో చదవకపోయినా వారికి ధీటుగా కళ్లు చెదిరే రేంజ్లో జాబ్ ఆఫర్లు అందుకుంటారు. కనీసం పట్టణ ప్రాంత నేపథ్యం కాకపోయినా అలవోకగా అందివచ్చిన ప్రతి అవకాశంలోనూ తమ ప్రతిభా పాటవాలు చాటుకుంటారు. ఎవ్వరూ ఊహించని రీతీలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వాళ్లు నోరువిప్పి చెబితేగానీ తెలియదు వారు అంతటి స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చారా అని... !. అలాంటి కోవకు చెందిందే అశ్రిత. ఆమెకు డీఆర్డీవో, ఇస్రో వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు జాబ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అయితే వాటన్నింటిని వద్దనుకుని ఏకంగా అమెరికా మల్టీనేషనల్ కంపెనీలో మంచి వేతనంతో కూడిన జాబ్ ఆఫర్‌ని అందుకుని శెభాష్ అనుపించుకుంది. ఎవరా అశ్రిత అంటే..తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి అశ్రిత. కుటుంబం జీవనోపాధి వ్యవసాయం. చిన్ననాటి నుంచి సాధారణంగానే చదివేది. ఇంటర్ పూర్తి అయ్యిన వెంటనే ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలనే ఆలోచనలు కూడా పెద్దగా ఏమిలేవు. అందిరిలా బీటెక్ చేద్దాం అనుకుంది అంతే. అలా జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్‌లో బిటెక్ డిగ్రీ పూర్తి చేసింది. అయితే అశ్రితకి అక్కడ నుంచి ఆమె కెరీర్‌పై సరైన స్పష్టత ఏర్పడింది. అందరూ సాఫ్ట్వేర్ వైపు మళ్లితే ఆమె మాత్రం హార్డ్‌వేర్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యం సంపాదించాలనుకుని అటువైపుగా కెరీర్‌ని ఎంచుకుంది. ఆ నేపథ్యంలో ఎంటెక్ చేయడం కోసం గేట్‌కి ప్రిపేరయ్యింది. అయితే తొలి ప్రయత్నంలో మూడువేల ర్యాంకు రావడంతో ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో జాయిన్ అవకాశం కోల్పోయింది. దీంతో ఆమె మరోసారి గేట్‌కి ప్రిపేరవ్వాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుంది. అలా 2022లో ఆల్ ఇండియా 36 ర్యాంకు సాధించింది. ఈ విజయంతో ఆమెకు ఇస్రో, డీఆర్డీవో, బార్క్, ఎన్పీసీఐఎల్ వంటి అగ్ర సంస్థల్లో ఉద్యోగ ఆఫర్‌ని అందుకుంది. అయితే వాటన్నింటిని కాదనుకుని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎంటెక్ పూర్తి చేయడం వైపే మొగ్గు చూపింది. ఆ తర్వాత అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ ఎన్వీఐడీఐఏ(NVIDIA)లో రూ. 52 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజ్‌తో ఉద్యోగాన్ని పొందింది. వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న ఆమె తల్లిదండ్రులు కూడా తమ కూతురు అశ్రిత అసాధారణమైన విజయం సాధించిందంటూ మురిసిపోయారు.(చదవండి: 'బయోనిక్ బార్బీ': ఆమె చేయి ప్రాణాంతకంగా మారడంతో..!) -
Nag Mark 2: ఆర్మీ అమ్ములపొదిలోకి నాగ్ మార్క్-2
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్-2(Nag MK-2) పరీక్ష విజయవంతమైంది. రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో సోమవారం పరీక్షను నిర్వహించారు. అత్యంత కచ్చితమైన లక్ష్యాలను ఇది చేధించడంలో విజయవంతమైందని భారత రక్షణ పరిశోధన సంస్థ(DRDO) ప్రకటించింది.ఇది మూడోతరం(Third Generation) ‘ఫైర్ అండ్ ఫొర్గెట్’ క్షిపణి. లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. అలాగే.. లక్ష్యాలను చేధించడంలో క్షిపణి కనిష్ఠ, గరిష్ఠ పరిధి నిర్ధారణ అయింది. మొత్తం మూడుసార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. నాగ్ క్షిపణికి సంబంధించిన క్యారియర్ వెర్షన్(NAMICA) -2ని కూడా పరీక్షించినట్లు తెలిపారు. ‘‘ఈ పరీక్షలతో నాగ్ ఆయుధ వ్యవస్థ మొత్తం.. భారత సైన్యం(Indian Army)లో ప్రవేశించేందుకు సిద్ధమైంది’’ అని రక్షణ మంత్రిత్వశాఖ ఒక అధికార ప్రకటనలో పేర్కొంది. -
పిచ్చుకలకు కుచ్చులు
గతం ఎక్కడికో పోదు. వర్తమానమై పలకరిస్తుంది. భవిష్యత్ ఆశాకిరణమై మెరుస్తుంది. ఘనంగా చెప్పుకోవడానికి గతంలో ఎన్నో ఉన్నాయి. ‘ఇది మా ఇల్లు మాత్రమే కాదు... పక్షులది కూడా’ అనుకోవడం అందులో ఒకటి. పిచ్చుకలకు ఇంట్లో చోటివ్వడంతోపాటు వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంత సీన్ ఉందా?పక్షుల ప్రపంచం, మన ప్రపంచం వేరైపోయాయి. ఇప్పుడు పక్షుల నుంచి చుట్టపు చూపు పలకరింపు కూడా లేదు. ఎప్పుడో ఒకసారి పిట్ట కనిపించినా వాటిని పలకరించే ఓపిక మనకు లేదు. ఇలాంటి నేపథ్యంలో విజయలక్ష్మిలాంటి పక్షిప్రేమికులు ఆశాదీపాలను వెలిగిస్తున్నారు. ఆ వెలుగును చూడగలిగితే మరెన్నో దీపాలు వరుస కడతాయి. పక్షులతో చెలిమి చేయడానికి స్వాగత తోరణాలు అవుతాయి.తమ ఇంటి పిట్టగోడపై వాలిన ఆ పిట్టను చూడగానే నిర్మల్‌కు చెందిన విజయలక్ష్మికి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ‘‘మా ఊళ్లో.. మా ఇంట్లో.. మా నాన్నగారు ఇలాంటి పిచ్చుకల కోసం ఏదో చేసేవారే..! దానికోసం గూడు కట్టడంతో పాటు తినడానికి ఏదో పెట్టేవారే..!’ అని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసింది. బంధువులకు ఫోన్లు కలిపింది. నానమ్మ తరపువాళ్లు ‘దాన్ని వరికుచ్చు అంటారే..’ అని చెప్పడంతోనే ‘హమ్మయ్యా.. తెలిసింది..’ అని అనుకుని ఊరుకోలేదు.‘ఇక ఇప్పుడు కుచ్చులు కట్టడమెలా..!?’ అంటూ ఆలోచనల్లో పడింది. యూట్యూబ్‌లో ‘వరికుచ్చుల తయారీ’ గురించి సెర్చ్ చేసింది. ఆ వీడియోలను చూస్తూ ప్రాక్టీస్ చేసి నేర్చేసుకుంది. నిర్మల్ జిల్లాలో డీఆర్డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి)గా పనిచేస్తున్న విజయలక్ష్మి తన సిబ్బందికి కూడా వరి కుచ్చులు తయారు చేయడం ఎలాగో నేర్పించింది. వీరు చేసిన వరికుచ్చులు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సామాన్యుల నుంచి మంత్రుల వరకు ఈ వరికుచ్చులపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇళ్లల్లో వేలాడదీస్తున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో మనుషులు మాత్రమే కాదు... అందమైన పిచ్చుకలు కూడా కనిపిస్తున్నాయి.ఎన్నో ఎన్నెన్నో!పచ్చదనమన్నా, పల్లెవాసులతో కలిసిపోవడమన్నా ఇష్టపడే విజయలక్ష్మి డీఆర్డీవోగా నిర్మల్ జిల్లాలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది...→ గ్రామీణ, ఆదివాసీ మహిళలు రుతుక్రమ సమయంలో ఇంటికి దూరంగా ఉండటాన్ని చూసి చలించిన విజయలక్ష్మి వారికి అవగాహన కలిగించేందుకు షార్ట్ఫిలిమ్ తీసింది. తక్కువ ధరలోనే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి కుంటాల మండల మహిళ సమాఖ్య ద్వారా రేలా (రూరల్ వుమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆక్టివేషన్) పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్నిప్రారంభించారు → నిర్మల్ కొయ్యబొమ్మల కోసం మూడుచోట్ల పొనికిచెట్లను పెంచుతున్నారు → మండల మహిళల ద్వారా సమీకృత సాగుప్రారంభించి అందులో వరితో పాటు కూరగాయలు, బీట్రూట్, క్యారట్, వట్టివేరు, కర్రపెండలం పండిస్తున్నారు. చేపలు, నాటుకోళ్లు పెంచుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే ‘ప్యాషన్’ఫ్రూట్నూ ఇక్కడ పండిస్తున్నారు→ ఉపాధిహామీ పథకంలో కూలీలు, పనుల సంఖ్యను పెంచి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్‌ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలిపారు. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో, వసూలు చేయడంలోనూ నిర్మల్‌ను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లా సంక్షేమాధికారి ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు చేపట్టారు. ‘మన వంట–అంగన్వాడీ ఇంట’ ‘న్యూట్రిబౌల్’లాంటి కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు.వరికుచ్చుల సరిగమలుపాతకాలపు లోగిళ్లు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ చోటిచ్చేవి. చిలుకచెక్కతో ఉండే ఇళ్ల స్లాబుల్లోనే పిచ్చుకల కోసమూ గూళ్లను కట్టించేవారు. వాటిలో కాపురం పెట్టే జంటల కోసం తమ పంటల్లో నుంచి భాగాన్ని పంచేవారు. ధాన్యం ఇంటికొచ్చే వేళ పిచ్చుకల కోసం ప్రత్యేకంగా వరికుచ్చులను తయారు చేసిపెట్టేవారు. అలా చేసిన కుచ్చులను పిచ్చుకల గూళ్లకు దగ్గరగా వేలాడదీసేవారు. పొద్దుపొద్దున్నే వాటిపై వాలే పిచ్చుకలు ఒక్కో వడ్లగింజను నోటితో ఒలుస్తూ ఆరగిస్తూ, కిచకిచమంటూ ఇంటిల్లిపాదిని మేలుకొల్పేవి.ఆ మంత్రదండం మన దగ్గరే ఉంది!భవిష్యత్ గురించి మాత్రమే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. గతంలోకి కూడా తొంగిచూస్తే... విలువైన జ్ఞాపకాలే కాదు విలువైన సంప్రదాయాలు కనిపిస్తాయి. వాటికి మళ్లీ ఊపిరి పోస్తే విలువైన గతాన్ని వర్తమానంలోకి ఆవిష్కరించినట్లే. ప్రతిప్రాంతానికి తనదైన విలువైన గతం ఉంటుంది. విలువైన సంప్రదాయాలు, కళలకు ఊపిరిపోస్తే ‘ఇప్పుడా రోజులెక్కడివి!’ అని నిట్టూర్చే పరిస్థితి రాదు. గతాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చే మంత్రదండం మన దగ్గరే ఉంది.– విజయలక్ష్మి – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: సుదూర శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని భారత్ రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్డీఓ) ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ హైపర్ సోనిక్ క్షిపణిని భారత సాయుధ దళాలలో వివిధ సేవలను అందించేందుకు రూపొందించారు.ఈ క్షిపణి 1,500 కి.మీకి మించిన పరిధి వరకూ వివిధ పేలోడ్లను మోసుకెళ్లగలదు. పలు డొమైన్లలో అమర్చిన వివిధ రేంజ్ సిస్టమ్‌ల ద్వారా ఈ క్షిపణిని ట్రాక్ చేశారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుండి అందిన డేటా ప్రకారం ఈ క్షిపణి అధిక ఖచ్చితత్వంతో తన ప్రభావాన్ని నిర్ధారించింది.ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లోని ప్రయోగశాలలు, డీఆర్డీఓకి చెందిన ఇతర ప్రయోగశాలలు, పరిశ్రమ భాగస్వాములతో స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. డీఆర్డీఓతో పాటు సాయుధ దళాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఈ క్షిపణ పరీక్ష అధునాతన హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను కలిగి ఉన్న దేశాలలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ క్షిపణి భారతదేశంలో పెరుగుతున్న స్వావలంబనను ‘మేక్ ఇన్ ఇండియా’పై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. India has achieved a major milestone by successfully conducting flight trial of long range hypersonic missile from Dr APJ Abdul Kalam Island, off-the-coast of Odisha. This is a historic moment and this significant achievement has put our country in the group of select nations… pic.twitter.com/jZzdTwIF6w— Rajnath Singh (@rajnathsingh) November 17, 2024డీఆర్డీఓ సాధించిన ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక విజయంలో భాగస్వాములైన డీఆర్డీఓ బృందం, సాయుధ దళాలు, పరిశ్రమ భాగస్వాములను ఆయన అభినందించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారతదేశం మరో ఘన విజయాన్ని సాధించిందన్నారు. హైపర్సోనిక్ క్షిపణులు గంటకు 6,174 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. -
బిట్స్ పిలానీ సీనియర్ ప్రొఫెసర్‌గా డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి ప్రముఖ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో సీనియర్ ప్రొఫెసర్‌గా చేరారు. ముఖ్యంగా జాతీయ భద్రతా రంగానికి సంబంధించి పరిశోధనలు ఆవిష్కరణలకు ఆయన సేవలు అందిస్తారని బిట్స్ పిలానీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నియామకంపై సతీష్ రెడ్డి స్పందించారు. ‘డీఆర్డీఓలో దాదాపు 39 ఏళ్ల నుంచి చేస్తున్న పరిశోధనను ఓ విద్యాసంస్థలో కొనసాగించటం చాలా సహజం. బిట్స్ పిలానీ చాలా కాలంగా పరిశోధనా కార్యక్రమాల్లో డీఆర్డీఓకు భాగస్వామిగా ఉంది. ఇక్కడ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ (CRENS)ను ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ విషయం. నేను ఈ కేంద్రానికి సహకరించాలని, పరిశ్రమలు, భద్రతా సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి జాతీయ భద్రత కోసం ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతిని అందించాలని ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.పరిశోధన, విద్యాపరమైన అంశాలకు ఆయన నాయకత్వం వహిస్తారు.అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ పరిశోధనా విశిష్టత కోసం సీఆర్ఈఎన్ఎస్లో అధునాతన పరిశోధన కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తారు. రీసెర్చ్ అడ్వైజరీ బోర్డుకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఇక.. ఆయన డీఆర్డీఓలో చేపట్టిన అత్యంత ప్రభావశీల ప్రాజెక్టుల్లో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. -
ఆయుధ వ్యవస్థల ప్రదర్శనకు ‘తరంగ్ శక్తి’
రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైన ‘తరంగ్ శక్తి 2024’ మొదటిదశ యుద్ధవిన్యాసాలు రేపటితో ముగియనున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొన్నట్లు తెలిసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించేందుకు ‘తరంగ్ శక్తి’ మంచి వేదికని మంగళవారం డీఆర్డీఓ ఛైర్పర్సన్ సమీర్ వి కామత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారత వైమానిక దళం ఆధ్వర్యంలో జరుగుతున్న తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించేందుకు మంచి వేదిక. అవసరమైనప్పుడు దేశాన్ని రక్షించగల సామర్థ్యం ఉందని భారత ప్రజలకు తెలియజేసే అవకాశంగా ఈ కార్యక్రమం నిలిచింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఏఎంసీఏ ఫైటర్ జెట్(స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్) డిజైన్ పూర్తయింది. అభివృద్ధి ట్రయల్స్‌ను త్వరలో నిర్వహించి 2034 నాటికి దాన్ని సైన్యానికి అందిస్తాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసే అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి’ అని అన్నారు.ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!తరంగ్ శక్తి యుద్ధ విన్యాసాలు రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు ఈసారి రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ–130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్–16, స్పెయిన్‌కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్‌కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం
డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీల్లో ఆయన విశేష కృషిని ఇస్రో గుర్తింపుగా స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఎస్ఎస్ఎంఈ) సతీష్ రెడ్డికి గౌరవ జీవితకాల సభ్యత్వం ప్రదానం చేసింది.అహ్మదాబాద్‌లోని ఇస్రో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, ఎస్ఏసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ డి.కె.సింగ్ ల సమక్షంలో రక్షణ మంత్రి మాజీ శాస్త్రీయ సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి.సతీష్ రెడ్డికి గౌరవ జీవితకాల సభ్యత్వం ప్రదానం చేశారు. -
రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ఆకాశంలో నుంచి భూమి పైనున్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర ఎం–2 మిస్సైల్‌ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి ఎస్‌యూ–30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర ఎం–2 మిస్సైల్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. డీఆర్డీఓకు చెందిన పలు లాబోరేటరీలు రూపొందించిన సాంకేతికతలను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలురకాల శత్రు లక్ష్యాలను చేధించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర ఎం–2ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభినందించారు. రుద్ర ఎం–2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు. -
యాంటీ రేడియేషన్ మిసైల్... ‘రుద్ర ఎమ్-2’ పరీక్ష సక్సెస్
భువనేశ్వర్: ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ సెంటర్ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్‌ను పరీక్షించారు.ఈ సూపర్‌సానిక్ మిసైల్‌ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ మిసైల్‌ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్ రష్యాకు చెందిన కేఎహెచ్-31 యాంటీ రేడియేషన్ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు. రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. -
TG: ‘ఘంటసాల’ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఆర్డీవో మాజీ చైర్మన్
సాక్షి,మహబూబ్‌నగర్:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) మాజీ చైర్మన్ డాక్టర్.జిసతీష్‌రెడ్డి బుధవారం(మే29) తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత జిల్లాలోని దిండి చింతపల్లి గ్రామంలో ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర్రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో శంకర నేత్రాలయ ఐ సర్జరీ క్యాంపులో జరిగిన ఫేర్వెల్ వేడుకలో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
Mission Divyastra: శత్రువుకు వణుకే...!
ఖండాంతర లక్ష్యాలను అతి కచి్చతత్వంతో ఛేదించగల రేంజ్, బహుళ సామర్థ్యం. అత్యాధునిక పరిజ్ఞానం. వీటన్నింటి మేలు కలయికగా అగ్ని–5 క్షిపణి రూపుదిద్దుకుంది. ఇందుకోసం డీఆర్డీఓ సైంటిస్టులు ఏళ్ల తరబడి నిరంతర తపస్సే చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొన్నేళ్లుగా భారత్ సాధిస్తున్న అద్భుత ప్రగతి ఇందుకు తోడైంది. 5,000 కిలోమీటర్ల పై చిలుకు రేంజ్‌తో కూడిన అగ్ని–5 క్షిపణి రాకతో దేశ రక్షణ వ్యవస్థ దురి్నరీక్ష్యంగా మారింది... ఆద్యంతం ఆత్మనిర్భర్... ► చైనా వద్ద ఉన్న డాంగ్‌ఫెంగ్ తదితర క్షిపణుల రేంజ్ 10 వేల నుంచి 15 వేల కి.మీ. దాకా ఉంది! ► వాటిని దృష్టిలో ఉంచుకుని, లక్ష్యఛేదనలో కచ్చితత్వానికి పెద్దపీట వేస్తూ అగ్ని–5ని అభివృద్ధి చేశారు. ► దీని తయారీకి అవసరమైన వైమానిక వ్యవస్థలను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. ► అంతేగాక అత్యంత కచి్చతత్వంతో కూడిన సెన్సర్లను కూడా ఈ వ్యవస్థలో అమర్చారు. ► వీటి సాయంతో అణు వార్హెడ్లు లక్ష్యాన్ని అణుమాత్రమైనా తేడా లేకుండా ఛేదించగలవు. గురి తప్పదంతే! అగి్న–5లో వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత దీన్ని మరింత విధ్వంసకంగా, ప్రమాదకారిగా మారుస్తోంది. ఒకే క్షిపణి ప్రయోగంతో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించేందుకు వీలు కలి్పంచడం దీని ప్రత్యేకత. ఈ టెక్నాలజీ 1960ల్లో తొలుత తెరపైకి వచి్చంది. 1968లో అమెరికా దీన్ని అభివృద్ధి చేసింది. మైన్యూట్‌మ్యాన్–3 క్షిపణి వ్యవస్థలో దీన్ని వాడింది. 1970ల నుంచి ఎంఐఆర్వీ సాంకేతికత ఖండాంతర క్షిపణుల్లో పూర్తిస్థాయిలో వాడకంలోకి వచి్చంది. ► ఖండాంతర క్షిపణుల తయారీ, పేలోడ్ వ్యవస్థ తదితరాల్లో విప్లవాత్మక మార్పులకు ఎంఐఆర్వీ శ్రీకారం చుట్టింది. ► ఈ పరిజ్ఞానం సాయంతో ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన సంఖ్యలో సంప్రదాయ, అణు వార్హెడ్లను ప్రయోగించవచ్చు. ► ఇందుకోసం ఒకే పెద్ద వార్‌హెడ్ బదులుగా పలు చిన్న చిన్న వార్హెడ్లను క్షిపణికి సంధిస్తారు. ► వీటిలో ప్రతి వార్‌హెడ్ స్వతంత్రంగా భిన్న లక్ష్యంపై దాడి చేయగలదు. ► తద్వారా ఒకే క్షిపణి ద్వారా ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించవచ్చు. ► ఒకటికి మించిన వార్హెడ్ల కారణంగా శత్రు దేశాల మిసైల్ డిఫెన్ వ్యవస్థలను ఏమార్చడంతో పాటు వాటి ఖండాంతర క్షిపణి విధ్వంస దాడులను తట్టుకుని లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఛేదించే సంభావ్యత ఎంతగానో పెరుగుతుంది. ► అంతేగాక లక్ష్యఛేదన కచ్చితత్వంతో జరిగేలా చూడటం ఎంఐఆర్వీ ప్రత్యేకత. ► అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా వద్ద మాత్రమే ఈ సాంకేతికత ఉంది. ► పాకిస్తాన్ కూడా ఈ సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉంది. ఇటీవల అబాబీల్ మధ్య శ్రేణి క్షిపణి ప్రయోగంలో దీన్ని ప్రయతి్నంచి చూశారు. -
Mission Divyastra: అమ్ములపొదిలో దివ్యాస్త్రం
బాలాసోర్/న్యూఢిల్లీ: మన అమ్ములపొదిలోకి తిరుగులేని ‘దివ్యాస్త్రం’ చేరింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అద్భుతం చేసింది. ఒకటికి మించిన లక్ష్యాలను ఒకేసారి అత్యంత కచి్చతత్వంతో ఛేదించగల అత్యాధునిక ఖండాంతర అణు క్షిపణి అగ్ని–5ను తొలిసారి ప్రయోగించింది. నిర్దేశించిన ఒకటికి మించిన లక్ష్యాలను అది విజయవంతంగా ఛేదించింది! శత్రు దేశాలకు వణకు పుట్టించగల ఈ ‘దివ్యాస్త్రం’ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిచ్చేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. దీనిలో తొలిసారిగా వాడిన మలి్టపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికిల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత ద్వారా ఒకే క్షిపణితో వేర్వేరు లక్ష్యాలపై అనేక వార్ హెడ్లను పూర్తి కచి్చతత్వంతో ప్రయోగించవచ్చు. 5,000 నుంచి 5,800 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను అగ్ని–5 ఛేదించగలదు. తక్కువ బరువున్న వార్హెడ్లను అమర్చే పక్షంలో క్షిపణి రేంజ్ ఏకంగా 8,000 కి.మీ. దాకా పెరుగుతుంది! ‘మిషన్ దివ్యాస్త్ర’ పేరిట జరిగిన ఒడిశా తీర సమీపంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి సోమవారం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మిషన్ దివ్యాస్త్రను దిగ్విజయం చేసిన డీఆర్డీఓ సైంటిస్టులకు హృదయపూర్వక అభినందనలు. వారి ఘనతను చూసి గరి్వస్తున్నా’’అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అతి కొద్ది దేశాల సరసన... అగ్ని–5 పరీక్ష విజయవంతం కావడంతో ఎంఐఆర్వీ సామర్థ్యమున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘‘దేశ దీర్ఘకాలిక రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అగ్ని–5ని అభివృద్ధి చేశాం. భారత శాస్త్ర, సాంకేతిక నైపుణ్యానికి ఇది మచ్చుతునక. ఈ ప్రాజెక్టు డైరెక్టర్ మహిళ కావడం విశేషం. రక్షణ రంగంలోనూ దేశ ప్రగతికి నారీ శక్తి ఎంతగా దోహదపడుతోందో చెప్పేందుకు ఇది తాజా తార్కాణం’’ అని వివరించాయి. అగ్ని–1 నుంచి అగ్ని–4 దాకా ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన క్షిపణుల రేంజ్ 700 కి.మీ. నుంచి 3,500 కి.మీ. దాకా ఉంది. ఇవిప్పటికే రక్షణ దళంలో చేరాయి. భూ వాతావరణ పరిధిలోనూ, దాని ఆవల కూడా ఖండాంతర క్షిపణులను ప్రయోగించడంతో పాటు విజయవంతంగా అడ్డగించే సామర్థ్యాల సముపార్జనలో భారత్ ఏటేటా ప్రగతి సాధిస్తూ వస్తోంది. మొత్తం ఆసియా ఖండంతో పాటు యూరప్‌లో కూడా పలు ప్రాంతాలు అగ్ని–5 పరిధిలోకి వస్తాయి! అణు దాడులు చేయడమే గాక వాటిని అడ్డుకునే సత్తా దీని సొంతం. -
మిషన్ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్(ఎంఐఆర్వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. అగ్ని-5 క్షిపణి ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిందించి. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వి) సాంకేతికతతో డీఆర్డీవో మిస్సైల్‌ను రూపొందించింది. ఎంఐఆర్వీ సాంకేతికతతో అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్‌గా తెలుస్తోంది. దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్వీ టెక్నాలజీతో ఒక మిసైల్‌ను ఉపయోగించి బహుళ వార్ హెడ్స్‌ను వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్‌ను ఛేదించవచ్చని పేర్కొన్నాయి. అయితే, ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య తక్కువగా ఉండగా.. ఆయా దేశాల సరసన భారత్ సైతం చేరినట్లయ్యింది. ఈ అగ్ని-5 మిసైల్‌లో ఇండీజీనియస్ ఏవియోనిక్స్ సిస్టస్స్ ఉంటాయి. హై ఎక్యురసీ సెన్సార్ ప్యాకేజ్ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. -
అనారోగ్యంతో ఏపీడీ తీవ్ర నిర్ణయం..
నిజామాబాద్: అనారోగ్య కారణాలతో డీఆర్డీఏలో ఏపీడీగా పని చేస్తున్న సంజీవ్‌కుమార్(57) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్సై మహేశ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సంజీవ్‌కుమార్ కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో ఏపీడీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య సింధు, కుమారుడు ఉన్నారు. సంజీవ్‌కుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. 15 రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆరోగ్యం బాలేదని ఇంటికి వెళ్లాడు. తిరిగి విధులకు రాకపోవడంతో సంబంధిత శాఖకు చెందిన డ్రైవర్ ఇంటికి వెళ్లి పిలవగా ఎంతకు తలుపు తీయలేదు. దీంతో డ్రైవర్ ఏపీడీ భార్యకు సమాచారం అందించాడు. ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమె వచ్చి కిటికీలో నుంచి చూడగా సంజీవ్‌కుమార్ ఇంట్లో చున్నీతో ఉరి వేసుకొని ఉన్నాడు. తలుపులు బద్దలుకొట్టి కిందికి దించగా అప్పటికే సంజీవ్‌కుమార్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రెండేళ్ల క్రితం పదోన్నతి జిల్లాలో ఎంపీడీవోగా సంజీవ్‌కుమార్ అందరికీ సుపరిచితులు. గతంలో అనంతపూర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయన పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, మెపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ఎంపీడీవోగా సేవలందించి రెండేళ్ల క్రితం జిల్లా ఏపీడీగా పదోన్నతి పొందారు. అందరితో కలుపుగోలుగా ఉండే సంజీవకుమార్ ఆత్మహత్యను తోటి ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవి చదవండి: ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్ మోసం చేశాడని ఓ యువతి.. -
దేశీయ ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్-ఎన్జీ( న్యూ జెనరేషన్) క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు భారత్ రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) ప్రకటించింది. ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)లో శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు తక్కువ ఎత్తులో ఉన్న మానవరహిత వేగవంతమైన లక్ష్యాన్ని చేధించే ఆకాశ్-ఎన్జీ మిసైల్ పరీక్ష విజయవంతం అయిందని పేర్కొంది. ఇకపై ఈ క్షిపణిని భారత సైన్యం, వాయుసేన ఉపయోగించుకోనుందని తెలిపింది. ఆకాశ్-ఎన్జీ క్షిపణ వ్యవస్థ అత్యాధునిక, హైస్పీడ్‌తో వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షిపణి పరిధి దాదాపు 80 కిలో మీటర్లు. ఆకాశ్ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్డీఓ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది. Next Generation Akash missile successfully flight tested from ITR , Chandipur off the coast of Odisha today at 10:30hrs against a high speed unmanned aerial target at very low altitude. @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/ShRNi4dfAj — DRDO (@DRDO_India) January 12, 2024 పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థ విజయవంతమైన పనితీరును భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ క్షిపణ దేశియంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడిన క్షిపణి అని రక్షణ శాఖ పేర్కొంది. చదవండి: Ram Mandir: ‘నా సోదరులు కన్న కల నిజమైంది!’ -
డీఆర్డీవో తయారీ అస్సాల్ట్ రైఫిల్ ‘ఉగ్రమ్’
పుణే: కేంద్ర ప్రభుత్వ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) సొంతంగా అభివృద్ధి చేసిన అస్సాల్ట్ రైఫిల్ ఉగ్రమ్ను సోమవారం పరీక్షించింది. డీఆర్డీవోకు చెందిన పుణేలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్(ఏఆర్డీఈ)విభాగం భారత సైన్యం అవసరాలకు అనుగుణంగా దీనిని రూపొందించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో 4 కిలోల కంటే తక్కువ బరువుండే ప్రొటోటైప్ అస్సాల్ట్ రైఫిల్‌ను సోమవారం పరీక్షించారు. ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి గత మూడేళ్లుగా అస్సాల్ట్ రైఫిల్‌ను డిజైన్ చేసినట్లు ఏఆర్డీఈ డైరెక్టర్ ఎ.రాజు చెప్పారు. క్షేత్ర స్థాయిలో ప్రయోగాలు జరిపేందుకు ముందుగా స్వతంత్ర నిపుణుల కమిటీ పర్యవేక్షణలో ట్రయల్స్ ఉంటాయని చెప్పారు. -
క్షిపణుల డిజైన్‌లో స్టార్టప్‌లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది..
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్07 ఎ–14 రకం డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్డీఓ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ (ఏటీఆర్) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్డీవో అధికారులు చెప్పారు. -
పొలాల్లో కుప్పకూలిన డీఆర్డీఓ డ్రోన్.. దృశ్యాలు వైరల్..
బెంగళూరు: రక్షణ శాఖ(డీఆర్డీఓ)కు చెందిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో పంట పొలాల్లో ఈ మానవ రహిత డ్రోన్ కూలిపోయింది. ప్రమాద ఘటనకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాద ప్రదేశానికి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు గుమిగూడారు. #WATCH | A Tapas drone being developed by the DRDO crashed today during a trial flight in a village of Chitradurga district, Karnataka. DRDO is briefing the Defence Ministry about the mishap and an inquiry is being carried out into the specific reasons behind the crash: Defence… pic.twitter.com/5YSfJHPxTw — ANI (@ANI) August 20, 2023 డీఆర్డీఓ మానవ రహిత డ్రోన్లపై పరిశోధనలో భాగంగా.. ఆదివారం తాపస్ అనే డ్రోన్‌ను ట్రయల్ రన్ చేశారు. ఈ క్రమంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై రక్షణ శాఖ దర్యాప్తు చేపడుతోంది. ప్రమాద స్థలంలో డ్రోన్ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: చంద్రయాన్-3: చంద్రుడికి అడుగు దూరంలో ఇస్రో ‘విక్రమ్’.. ఇక చివరి ఘట్టం అదే -
ఆడిటర్ కం డిక్టేటర్!
నిజామాబాద్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ఆడిటింగ్ విభాగం అవినీతిమయంగా మారింది. వ్యవస్థలో తప్పులను సరిదిద్దాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. లోపాలను ఎత్తిచూపి వాటిని బయటకు రానివ్వకుండా ‘ముడుపు లు’ అందుకుంటున్నారు. ఇవ్వకపోతే బయపెట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందు లో ప్రధానంగా ఓ ఆడిట్ అధికారి(సీబీవో) పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎంతలా అంటే శాఖతో పాటు అందులోని అధికారులను శాసించే స్థాయికి చేరా డు. నియంతలా మారి అందినకాడికి దండు కోవడమే పరమావధిగా పని చేస్తున్నాడని శాఖలో జోరు గా ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల అండదండలతో బదిలీ కాకుండా ఏళ్లకు ఏళ్లు ఒకే చోట తిష్ట వేయడంతో అక్రమాలకు పాల్పడే విషయంలో ఆరితేరాడని తీవ్ర విమర్శలు సైతం వస్తు న్నాయి. ఆడిటర్ ఉద్యోగంతో ఐకేపీ సిబ్బందిని బలవంతపె ట్టి ‘చిట్టీల’ దందాను నడిపిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘నేనింతే’.. ‘నన్నేం చేయలేరు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, ఆయనతో వేగలేకపోతున్నామని బాధిత వీవోఏలు, సీసీ లు ఉన్నతాధికారులకు అంతర్గతంగా చాలాసార్లు మొరపెట్టుకున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసు కోవడానికి వారు మీనమేషాలు లెక్కించడం గమనార్హం. ఫోన్‌పే, గూగుల్‌పే, దావత్‌లు.. ఐకేపీ శాఖ ద్వారా ప్రభుత్వం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను అందిస్తోంది. అ యితే, రుణాలందించడానికి క్షేత్రస్థాయిలో వీవోఏలు కీలకంగా పనిచేస్తారు. మహిళా సంఘాల పు స్తకాల నిర్వహణ, రికార్డులు రాయడం అంతా వీరే చూస్తారు. పుస్తకాల్లో రాసిన రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో చూసేందుకు ప్రతి ఆర్నెళ్లు, ఏడా దికోసారి ఆడిటింగ్ చేస్తారు. ఏమైనా లోపాలు బ యటపడితే ఆడిట్ రికార్డుల్లో రాయాల్సిన బాధ్యత ఆడిటింగ్ అధికారులదే. కానీ, ఆరేడు మండలాల కు కలిపి ఆడిటర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆడి ట్ వ్యవస్థను తనకు అనుకూలంగా చేసుకుని లోపాలతో వీవోఏల దగ్గర వసూళ్లకు పాల్పడినట్లు, ఇంకా పాల్పడుతున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఒక గ్రామ సమాఖ్య నుంచి రూ. 2లక్షలు అప్పుగా తీసుకున్న విషయాన్ని ఆడిట్లో చూపకుండా ఉండేందుకు సదరు వీవోఏ నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిసింది. లెక్కలు రాయలేదని మరో వీవోఏ వద్ద రూ. వేలల్లో దండుకున్నట్లు స మాచారం. వసూళ్లు చేసే క్రమంలో లిక్విడ్ క్యాష్ లే కున్నా పర్వాలేదని ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డ బ్బులు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆడిట్లో అభ్యంతరం తెలుపకుండా తన వద్ద చిట్టీ వేయాలని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా తాను టూర్లకు వెళితే కూడా డబ్బులు ఆశిస్తాడని, అధికారులకు తెలిసినా వారిని మచ్చిక చేసుకునేందుకు దావత్‌లు ఇచ్చి మేనేజ్ చేస్తారనే పేరు కూడా ఉంది. ‘ఆడిటర్’ బాధితుల్లో సీసీలు కూడా ఉన్నారని, వారిని చులకన చేసి మాట్లాడతారనే ఆరోపణలున్నాయి. ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న సద రు ఆడిటర్‌ను బదిలీ చేయడమో, చర్యలు తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలని ఐకేపీ శాఖకు చెందిన బాధిత ఉద్యోగులు కొందరు కోరుతున్నారు. ఒకసారి హెచ్చరించా.. మహిళా సంఘాల పుస్తకాలను ఆడిట్ చేసే అధికారుల్లో ఒక ఆడిటర్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారిని పిలిచి హెచ్చరించా. బాధిత ఉద్యోగులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. – చందర్ నాయక్, డీఆర్డీవో, నిజామాబాద్ -
తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదు
మంచిర్యాల రూరల్: ఉపాధి హామీ పథకం అమలులో ఎలాంటి తప్పులు జరిగినా ఉపేక్షించేది లేదని డీఆర్డీఓ బి.శేషాద్రి స్పష్టం చేశారు. మంగళవారం హాజీపూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం 2వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 17గ్రామ పంచాయతీల్లో 2020 డిసెంబర్ ఒకటి నుంచి 2023 మార్చి 31వరకు చేపట్టిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాయి. ఈ సందర్భంగా పనుల్లో జరిగిన తప్పులు, నిధుల దుర్వినియోగం గుర్తించారు. పక్కదోవ పట్టిన నిధులను రికవరీ చేయాలని అధికారులు స్పష్టం చేశారు. మండలంలో 835 ఉపాధి పనులు చేపట్టగా రూ.7.45 కోట్లపై విలువైన పనులు జరిగాయని, పంచాయతీ రాజ్ పరిధిలో 160 పనులకు రూ.4.51 కోట్లకు పైగా విలువైన పనులు జరిగాయని, అటవీ శాఖ పరిధిలో రూ.2.68 లక్షలతో పనులు జరిగినట్లు తెలిపారు. కొలతలు, రికార్డుల విషయంలో లోపాలు జరిగాయని, ఉపాధి హామీ పనులు తప్పుల తడకగా జరిగాయని తనిఖీ బృందాలు తేల్చిచెప్పాయి. డీఆర్డీఓ శేషాద్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, జెడ్పీ కో ఆప్షన్ నహీంపాషా, అదనపు డీఆర్డీఓ దత్తారావు, డీవీఓ సురేశ్, ఎస్టీఎం నరేందర్, అంబుడ్స్‌మెన్ పర్సన్ శివరామ్, క్వాలిటీ కంట్రోలర్ చంద్రశేఖర్, విజిలెన్స్ మేనేజర్ కిరణ్, ఎస్ఆర్పీ భగవంత్‌రావు, ఎంపీడీఓ అబ్దుల్‌హై, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి, ఏపీఓ మల్లయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
పాక్ యువతి ట్రాప్‌లో డీఆర్డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..
పుణె: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్ ఏజెంట్‌కు రక్షణ రంగ రహస్యాలను లీక్ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్‌గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్తో వాట్సాప్ చాట్ ద్వారా మిస్సైల్ సిస్టమ్‌లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న కురుల్కర్ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. ప్రదీప్ కురుల్కర్కు పాక్ యువతి జరా దాస్‌గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్‌కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్ యువతి ప్రదీప్ కురుల్కర్‌ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్ ఐడీ పాకిస్థాన్‌గా గురించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్‌కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్‌గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్‌పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్‌ను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి.. -
దేశ రహస్యాలు పాక్‌కు లీక్ చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్త.. నిఘా వైఫల్యమేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు.. అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం కంటికి రెప్పలా ఉంటుందని భావిస్తాం. నిజమే.. మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు వెనక్కు రారు. అలాంటి వారిలో అత్యున్నత అధికారులు ఉండడమే ఆశ్చర్యకరం. పైగా పాకిస్తాన్, చైనాలాంటి దేశాలు విసిరే హానీ ట్రాప్‌లో చిక్కడం మరింత విస్మయకరం. మహిళ అందాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే జాబితా పెరిగిపోతోంది. గత నెల రోజులుగా భారత రక్షణ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న వ్యక్తి ప్రదీప్ కురుల్కర్. భారత రక్షణ వ్యవస్థలోని కీలక వింగ్ DRDOలో అత్యున్నత అధికారిగా ఉన్న ప్రదీప్.. ఇప్పుడు దేశ రహస్యాలను లీక్ చేసిన మాయగాడిగా మిగిలిపోయాడు. వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేశాడు డీఆర్డీవో టాప్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటి శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడు. ప్రదీప్‌కు వలపు వల విసిరి రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జర్దాస్ గుప్తా. లండన్ లో నివసిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన్ను ట్రాప్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్‌ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసెజ్‌లు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్, రాత్రుళ్లు కవ్వించే మాటలు.. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేక పోయిన ప్రదీప్ ఆమె మాయలో పడ్డాడు. వేరే దేశానికి రమ్మని పిలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను కూడా తిలకించారు. ఇద్దరూ కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఈ మహిళ అందానికి దాసోహమైన ప్రదీప్.. ఆమె ఏం అడిగినా కాదనకుండా అన్ని వివరాలు వెల్లడించాడు. దేశభద్రత గురించి పట్టించుకోకుండా తెలిసిన రహస్యాలన్నీ లీక్ చేశాడు. ఈ మత్తులో జరుగుతున్న ద్రోహం గురించి ప్రదీప్ కనిపెట్టలేకపోయాడా అన్నది ఓ మిలియన్ డాలర్ క్వొశ్చన్. ఇలాంటి ఆపరేషన్స్‌పై సైన్యంలో ఎందరికో అవగాహన కల్పించిన ప్రదీప్.. తానే ఆ గోతిలో పడ్డాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయాడు. 1988 నుంచి డీఆర్డీఓలో 1988 నుంచి పనిచేస్తున్నారు ప్రదీప్. గ్రేడ్-హెచ్ ఔట్ స్టాండింగ్ కేటగిరీ సైంటిస్ట్‌గా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైన హోదా. కేంద్రంలో అదనపు కార్యదర్శి హోదాతో సమానం. ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి దేశ సమాచారాన్ని లీక్ చేయడం ఒకింత విస్మయం కలిగించే విషయం. దీన్ని ఆరంభంలోనే నిఘావర్గాలు కనిపెట్టలేకపోడవంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశభద్రతలో డీఆర్డీఓ అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 50 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5వేల మందికిపైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పడు ప్రదీప్ వలపు వ్యవహారం బహిర్గతం కావడంతో వీరిపైనా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. ప్రదీప్ విషయం తెలిసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)పుణెలో రెండు వారాల క్రితం అతడ్ని అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ ఏ ఏ రహస్యాలు చేరవేశాడన్నది లెక్క తేలాల్సిన అంశం. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలో అంతర్గత లోపాలను బయటకు రానివ్వరు. సైన్యంలో టాప్ అధికారులకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రదీప్ ఎంతవరకు ఉప్పందించాడు, ఎక్కడెక్కడ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని మార్చుకోవాలి? ఇవీ ఇప్పుడు సైన్యంలోని టాప్ అధికారుల ముందున్న పెద్ద ఛాలెంజ్. చదవండి: చైనా చాట్‌జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా? -
మిస్సైల్ విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. -
సైన్యానికి దన్నుగా స్వయ
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగ అవసరాల కోసం దేశంలోనే తొలిసారిగా నాలుగు కాళ్ల రోబో, సైనికులు ధరించగల ఎక్సోస్కెలిటన్ నమూనాలు సిద్ధమయ్యాయి. డీఆర్డీవో అనుబంధ సంస్థలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, డిఫెన్స్ బయో–ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీల సహాయ సహకారాలతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్వయ రొబోటిక్స్ వీటిని రూపొందించింది. ఈ నమూనాలను రక్షణశాఖ సలహాదారు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి సోమవారం ఆయన పరిశీలించారు. రక్షణ, డీఆర్డీవో వర్గాలతో కలసి రోబో తయారీ అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగంలో రానున్న కాలంలో రోబోలదే కీలకపాత్రని స్పష్టం చేశారు. ప్రతికూల భౌగోళిక పరిస్థితులను అధిగమించి నిఘా పనులు చేసేందుకు, సైనికుల మోతబరువును తగ్గించడంలోనూ రోబోల సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ‘‘అతితక్కువ కాలంలో స్వయ రోబోటిక్స్ వీటిని (రోబో, ఎక్సోస్కెలిటన్లను) రూపొందించడం హర్షణీయం. దేశ రొబోటిక్స్ రంగం పురోగతికి ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతో ఉపయోగపడతాయి. క్షేత్ర పరీక్షలు వేగంగా పూర్తి చేసి అటు రక్షణ, ఇటు పరిశ్రమ వర్గాలకు ఉపయోగపడే ఈ రకమైన రోబోలను వేగంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం’’అని సతీశ్‌రెడ్డి చెప్పారు. డీఆర్డీవో ‘మేకిన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా స్వయ రోబోటిక్స్ వంటి ప్రైవేటు సంస్థలతో రోబోలను తయారు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇలాంటి సైనిక రోబోలను అమెరికా, స్విట్జర్లాండ్ల నుంచి దిగుమతి చేసుకుంటుండగా లేహ్, లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో అవి పనిచేయలేవు. ఎందుకంటే వాటిని నిర్దిష్ట పరిసరాల్లోనే పనిచేసేలా రూపొందించారు. పైగా వాటిల్లో ఫీచర్లు కూడా తక్కువ. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు స్వయ రోబోలు ఉపయోగపడతాయని అంచనా. రెండేళ్లలో మిలటరీకి: విజయ్ శీలం రక్షణ శాఖ అవసరాలకోసం సిద్ధం చేసిన రోబో నమూనా తొలి తరానిదని.. మరిన్ని ఫీచర్లు, సామర్థ్యాలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్వయ రోబోటిక్స్ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ ఆర్.శీలం తెలిపారు. అమెరికాలో బోస్టన్ డైనమిక్స్‌తో పాటు ఇతర దేశాల్లోని కొన్ని సంస్థలు కూడా ఇలాంటి రోబోలు తయారు చేస్తున్నా... మిలటరీ అవసరాల కోసం తామే తొలిసారి తయారు చేశామని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. సైనికులు వాడే ఆయుధాలు, సమాచార పరికరాలను ఈ రోబో సునాయాసంగా మోసుకెళ్లగలదని, ప్రమాదకర పరిస్థితుల్లోనూ శత్రు స్థావరాలను పరిశీలించి రాగలదని ఆయన తెలిపారు. జమ్మూకశ్మీర్ సరిహద్దులపై నిఘా ఉంచే రోబోలను ఇతర ప్రాంతాల నుంచి కూడా నియంత్రించొచ్చని వివరించారు. తొలితరం నమూనాలో నడక మాత్రమే సాధ్యమవుతుందని, సమీప భవిష్యత్తులోనే వాటికి చూపును కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ రోబో సైన్యానికి సేవలందించే అవకాశం ఉందన్నారు. పాదాల్లో ఏర్పాటు చేసిన సెన్స ర్లు, ఇతర పరికరాల ద్వారా ఈ రోబో నేల, కాంక్రీట్, రాయిల మధ్య తేడాలను గుర్తించి నడకను నియంత్రించుకోగలదని వివరించారు. -
శత్రు సైన్యంపై మూషికాస్త్రం!
యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నించడం తెలిసిందే. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ల్యాబ్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది. ఏమిటీ ప్రయోగం? సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్ ౖసైబర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల జరిగిన 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. యానిమల్ సైబర్గ్స్ అంటే? జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత పెంచుతారు. ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాదు, పరిశోధనలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, భూమిల పాతిపెట్టిన బాంబుల జాడ కనుక్కోవడంతోపాటు శస్త్రచికిత్సల్లోనూ యానిమల్ సైబర్గ్స్ సేవలను వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురిచేయడమే అవుతుందని అంటున్నారు. ఎలుకలే ఎందుకు? భారత్‌లో ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇక సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్షించబోతున్నారు. కొండలను ఎంత వరకు అధిరోహించగలవో చూస్తారు. మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కొంత ఇబ్బందికి గురయ్యాయని డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ వెల్లడించారు. కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి? ఎంత దూరంగా వెళ్లాలి? ఎక్కడ ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనేదానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎన్నుకోవడానికి కారణంగా ఏమిటంటే.. అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం తేలిగ్గా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. యానిమల్ ౖౖసైబర్గ్స్ను చైనాలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. యానిమల్ సైబర్గ్స్ సినిమాల్లో కూడా ఉన్నాయి. స్టార్‌వార్స్ సినిమాలోని చ్యూబాకా కూడా ఇలాంటిదే. ఒళ్లంతా రోమాలతో కనిపించే వింత జంతువు చ్యూబాకాలో శరీరం లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా కంటే మిన్నగా.. దేశ రక్షణకు భారత నేవీ కీలక అడుగులు
సాక్షి, విశాఖపట్నం: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత నౌకాదళం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. అండర్ వాటర్ డొమైన్ అవేర్‌నెస్‌లో పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మానవ రహిత సాంకేతికత, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు చర్యలు చేపట్టింది. డీఆర్డీవో సాయంతో సముద్ర గర్భంలోనూ పహారా కాసే మానవ రహిత వాహనాలను తన అమ్ములపొదిలో చేర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. డీఆర్డీవో తయారు చేసిన మానవ రహిత విమాన ప్రయోగాలు ఇటీవలే విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్మ్యాన్డ్ పవర్‌ను మరింత పెంపొందించే దిశగా భారత రక్షణ దళం సిద్ధమైంది. నీటి అంతర్భాగంలో కూడా దూసుకెళ్లే మానవ రహిత వాహనాలు తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేవలం నిఘాకు మాత్రమే కాకుండా యుద్ధ సమయంలోనూ సత్తా చాటే విధంగా డిజైన్ చేస్తున్నారు. అమెరికా కంటే మిన్నగా.. ఇప్పటికే అమెరికా నౌకాదళం రిమోట్‌తో నడిచే మానవ రహిత అండర్ వాటర్ వెహికల్స్‌ను రూపొందించి అగ్రస్థానంలో నిలిచింది. దానికంటే మిన్నగా వాహనాలను తయారు చేసేందుకు భారత్ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం ఉన్న టార్పెడో ట్యూబ్ సముద్ర గర్భంలో 2 రోజుల పాటు, హెవీ వెయిట్ ట్యూబ్ 3 నుంచి 4 రోజుల పాటు ఉండగలవు. కానీ త్వరలో అభివృద్ధి చేయనున్న అటానమస్ అన్మ్యాన్డ్ వెహికల్స్(ఏయూవీ) కనీసం 15 రోజుల పాటు సముద్ర గర్భంలో ఉండి పహారా కాయగలవు. ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ అదమ్య, అమోఘ్ పేరుతో ఏయూవీలను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. ఈ నేపథ్యంలో డీఆర్డీవో తయారు చేసిన అండర్ వాటర్ లాంచ్డ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి.. కీలక కార్యకలాపాలకు ఉపయోగించాలని నిర్ణయించారు. మజ్గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. తొలి దశలో జలాంతర్గాముల పర్యవేక్షణ కోసం, తర్వాత శత్రు సబ్మెరైన్ల రాకను పసిగట్టేలా, తుది దశలో సైనిక దాడులకు కూడా ఈ మానవ రహిత సముద్రగర్భ వాహనాలు ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నారు. -
AD-1: భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం
స్వదేశీ పరిజ్ఞానంతో.. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరబోతోంది. ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను తునాతునకలు చేసేలా ఏడీ-1 మిస్సైల్‌ను రూపొందించింది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO). ఈ మేరకు బుధవారం ఒడిశా తీరంలో జరిపిన రెండో దశ ప్రయోగం విజయవంతం అయినట్లు డీఆర్డీవో ప్రకటించింది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. రెండు దశల అభివృద్ధి కార్యక్రమంగా ఏడీ-1 మిస్సైల్‌ను రూపొందించింది డీఆర్డీవో. గతంలో మొదటి దశ ప్రయోగంలో.. 2 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకుంది ఈ మిస్సైల్. అయితే.. బుధవారం జరిగిన ప్రయోగంలో ఏకంగా ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోగలిగిందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ కామత్ వెల్లడించారు. మన రాడార్లు దానిని (శత్రువు క్షిపణిని) పసిగట్టగానే.. AD-1 దానిని ట్రాక్ చేస్తుంది. ఇది ప్రధానంగా ఎండో-వాతావరణానికి సంబంధించినది కానీ తక్కువ ఎక్సో-వాతావరణ ప్రాంతంలో కూడా పనిచేస్తుంది అని డీఆర్డీవో తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులు, తక్కువ ఎత్తులో ప్రయాణించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేసే సామర్థ్యం ఏడీ-1కి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి శత్రు దేశాల లక్ష్యాలను ఈ మిస్సైల్ నాశనం చేస్తుంది. 2025 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యంతో అందుబాటులోకి తెస్తామని డీఆర్డీవో ప్రకటించింది. ఇదీ చదవండి: ‘ఈ నాన్చుడెందుకు.. డైరెక్ట్‌గా అరెస్ట్ చేయండి’ -
డీఆర్డీవో చీఫ్‌గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్‌డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్‌గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్‌రెడ్డిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్‌రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్‌గా జి.సతీశ్‌రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్‌లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
ఆత్మనిర్భర్ భారత్‌కు ఐఐసీటీ సాయం
సాక్షి, హైదరాబాద్: దేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) గణనీయమైన సాయం చేస్తోందని డీఆర్డీవో చైర్మన్, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ టీకాలకు అవసరమైన కీలక రసాయనాలు మొదలుకొని అనేక ఇతర అంశాల్లోనూ విదేశాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని ఐఐసీటీ తప్పించిందని ఆయన అన్నారు. ఐఐసీటీ 79వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సతీశ్‌రెడ్డి దేశం ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరాన్ని... అందుకు చేస్తున్న ప్రయత్నాలను సోదాహరణంగా వివరించారు. ప్రభుత్వం ప్రకటించక ముందు కూడా ఐఐసీటీ పలు అంశాల్లో రక్షణ శాఖ అవసరాలను తీర్చిందని ఆయన గుర్తుచేశారు. నావిగేషనల్ వ్యవస్థల్లో కీలకమైన సెన్సర్ల విషయంలో దేశం స్వావలంబన సాధించడం ఐఐసీటీ ఘనతేనని కొనియాడారు. ప్రస్తుతం అత్యాధునిక బ్యాటరీలు, ఎలక్ట్రోడ్లు, ఎలక్ట్రోలైట్ల విషయంలోనూ ఇరు సంస్థలు కలసికట్టుగా పనిచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్‌కు ముందు దేశంలో ఏడాదికి 47 వేల పీపీఈ కిట్లు మాత్రమే తయారయ్యేవని.. ఆ తరువాత కేవలం నెల వ్యవధిలోనే ఇది రోజుకు 6 లక్షలకు పెరిగిందని చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ తయారీ విషయాల్లోనూ ఇదే జరిగిందని, అనేక సృజనాత్మక ఆవిష్కరణల కారణంగా దేశం వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతోపాటు ఉత్పత్తి చౌకగా జరిగేలా కూడా చేశామని వివరించారు. డిజైన్‌తో మొదలుపెట్టి... ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే దేశానికి అవసరమైనవన్నీ ఇక్కడే తయారు కావాలని డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివిధ ఉత్పత్తుల డిజైనింగ్ మొదలుకొని అభివృద్ధి వరకు అవసరాలకు తగ్గట్టుగా భారీ మోతాదుల్లో వాటిని తయారు చేయగలగడం, ఆధునీకరణకు కావాల్సిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడం కూడా ఆత్మనిర్భర భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. అతితక్కువ ఖర్చు, మెరుగైన నాణ్యత కూడా అవసరమన్నారు. అదే సమయంలో దేశం కోసం తయారయ్యేవి ప్రపంచం మొత్తమ్మీద అమ్ముడుపోయేలా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్ కార్యక్రమం కారణంగా ఇప్పుడు దేశంలోని యువత రాకెట్లకు అవసరమైన ప్రొపల్షన్ టెక్నాలజీలు, గ్రహగతులపై పరిశోధనలు చేస్తున్నాయని... స్టార్టప్ కంపెనీలిప్పుడు దేశంలో ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయని ప్రశంసించారు. సృజనాత్మక ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద అన్ని రకాల మద్దతు లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, మాజీ డైరెక్టర్లకు ఏవీ రామారావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఐఐసీటీలో ప్రతిభ కనపరిచిన సిబ్బంది, శాస్త్రవేత్తలకు మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ అవార్డులు అందజేశారు. -
కంచన్‌బాగ్ డీఆర్డీవో హనీ ట్రాప్ కేసులో కీలక ట్విస్ట్
-
హనీట్రాప్: భారత క్షిపణుల డేటా పాకిస్థాన్, చైనాలకు అందిందా?
సాక్షి, హైదరాబాద్: నటాషారావు అనే యువతి హనీట్రాప్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధీనంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కాంప్లెక్స్ (ఆర్సీఐ) ఇంజనీర్ డి.మల్లికార్జున్‌రెడ్డి అత్యంత కీలకమైన క్షిపణుల డేటాను దేశం దాటించినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవే అభియోగాలపై మల్లికార్జున్‌రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గత నెల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ నష్టనివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. జర్నలిస్టుగా పరిచయం చేసుకుని.. మల్లికార్జున్‌రెడ్డి ఆర్సీఐలోని అడ్వాన్స్డ్ నావెల్ సిస్టం ప్రోగ్రామ్‌లో 2018 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నాడు. ఇతడికి 2019లో ఫేస్బుక్ ద్వారా నటాషారావు అనే యువతితో పరిచయమైంది. హనీట్రాప్ కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ షేర్నీలో ఈమె పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ జర్నలిస్ట్‌గా మల్లికార్జున్‌తో పరిచయం పెంచుకున్న నటాషా తన పని ప్రారంభించింది. తాను రాస్తున్న ఆర్టికల్స్‌లో వినియోగించడానికంటూ ఇతడి నుంచి న్యూక్లియర్ డిటరెన్స్ ప్రోగ్రామ్ (అణ్వస్త్ర కార్యక్రమం)కు సంబంధించిన వివరాలను ముందు సేకరించింది. ఆపై ఇతడి బ్యాంకు ఖాతా నంబర్ తీసుకున్న నటాషా ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తానంటూ నమ్మబలికినట్లు నిఘా వర్గాల విచారణలో తేలినట్లు తెలిసింది. వలపు వలతో ముగ్గులోకి దింపి.. ఓ దశలో మల్లికార్జున్‌రెడ్డి దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తెచ్చి, వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసి పూర్తిగా ముగ్గులోకి దింపింది. అత్యంత కీలక సమాచారం సంగ్రహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణులతో పాటు దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం తయారవుతున్న కె–సిరీస్ క్షిపణులకు సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా ఇతడి నుంచి రాబట్టింది. నావికాదళం వినియోగించే అణు ఇంధన ఆధారిత జలాంతర్గామి అయిన అరిహంత్ కోసం డీఆర్డీఓ కె–సిరీస్ మిస్సైల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. కాగా తాను పని చేస్తున్న మాసపత్రికలో ఆర్టికల్స్ రాయాల్సి ఉందని, దానికి నిర్ణీత గడువు ఉందని చెప్తూ మల్లికార్జున్ నుంచి కీలక సమాచారం సేకరించింది. 2020–21 మధ్య డీఆర్డీఓ, ఆర్సీఐల్లో అభివృద్ధి చేసిన మిస్సైల్స్‌కు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. న్యూక్లియర్ క్యాపబుల్ సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌గా (ఎస్ఎల్బీఎం) పిలిచే 3,500 కి.మీల రేంజ్‌తో కూడిన కె–4, 6 వేల కి.మీల రేంజ్ కె–5, 1,500 కి.మీల రేంజ్ కె–15 సిరీస్‌లతో పాటు సాగరిక సిరీస్‌కు చెందిన బీ–05 సిరీస్ మిస్సైల్ డేటా సైతం నటాషాకు చేరింది. సిమ్రన్, ఓమీషా పేర్లతో.. ఈమె ఫేస్బుక్లో సిమ్రన్ చోప్రా, ఓమీషా హడ్డీ పేర్లతోనూ ప్రొఫైల్స్ నిర్వహించింది. మల్లికార్జున్‌రెడ్డితో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్, కాల్స్, వాయిస్ మెసేజ్‌లు చేసిన నటాషా ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయలేదు. ఇతడు కోరినప్పటికీ ఆమె దాటవేస్తూ వచ్చింది. అనేక అంశాలను పరిశీలించిన నిఘా వర్గాలు ఈ సమాచారం పాక్ నుంచి చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్డీవో, ఆర్సీఐలో భద్రతా లోపాలపై నిఘా వర్గాలు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్: డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి
(గరికిపాటి ఉమాకాంత్) సాక్షి, తిరుపతి: ‘శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గత ఏడేళ్లుగా ఎంతో పురోగతి సాధించింది. మన అవసరాలకు మించి ఉత్పత్తులను తయారుచేస్తున్నాం. ఇప్పటివరకు మేడ్ ఇన్ ఇండియా (దేశంలో తయారీ) దిశగా సాగాం. ఇప్పుడు ప్రపంచం కోసం తయారీ (మేక్ ఫర్ వరల్డ్) దిశగా మన ప్రయోగాలు, ఆవిష్కరణలు చేస్తున్నాం’ అని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి,సతీష్‌రెడ్డి వెల్లడించారు. ‘ప్రపంచ దేశాల అవసరాల కోసం తయారయ్యే ఉత్పత్తులకు మన దేశమే కేంద్రం కావాలి. ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి. రక్షణ శాఖ ఆ దిశగానే సరికొత్త ఆలోచనలు ఉన్నవారిని, పరిశోధనలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తోంది. త్వరలోనే భారత్ రక్షణ ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఎదుగుతుంది. దేశంలో తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే సంక్లిష్టమైన, కీలకమైన ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై డీఆర్డీవో దృష్టి పెట్టింది. 5 బిలియన్ డాలర్ల (రూ.39 వేల కోట్ల) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా డీఆర్డీవో పని చేస్తోంది’ అని ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా సొంతంగా రక్షణ ఉత్పత్తులు తయారీపై దృష్టి సారించాం. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, జనాభా, డిమాండ్.. ఈ ఐదూ మూల సూత్రాలుగా భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా ఎదగడమే ప్రాజెక్టు లక్ష్యం, అందులో భాగంగా ధ్వనికంటే వేగంగా దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణిలో ఎలక్ట్రానిక్ వ్యవస్థలన్నింటినీ భారత్‌లోనే తయారు చేశాం. ప్రపంచంలోనే దీర్ఘ శ్రేణి కలిగిన తుపాకీ (అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్)ను కూడా అభివృద్ధి చేయగలిగాం. సేవా రంగంలోనూ డీఆర్డీవో సేవలు దేశ రక్షణతో పాటు సామాజిక సేవా రంగంలోనూ డీఆర్డీవో విస్తృత సేవలు అందిస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయంలో వైద్య రంగంలోని ఉత్పత్తులపై దృష్టి సారించాం. శానిటైజర్, గ్లౌజులు, పీపీఈ కిట్లు తయారు చేశాం. ప్రధానమంత్రి సూచన మేరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు తయారు చేశాం. సాంకేతికతను పెంపొందించుకొని ఒక్క రోజులో 30 వేల వెంటిలేటర్లను తయారు చేసే స్థాయికి ఎదిగాం. మూడు నెలల్లోనే దేశ అవసరాలను అధిగమించాం. ఎన్నో దేశాలకు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, కరోనా రక్షణ పరికరాలను పెద్దసంఖ్యలో ఎగుమతి చేశాం. డేర్ టు డ్రీం దేశంలో నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు డీఆర్డీవో ‘డేర్ టు డ్రీం’ పేరిట వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తోంది. మంచి స్టార్టప్‌లు, ఆలోచనలు ఇచ్చిన వారికి రూ.10 లక్షల వరకు ప్రైజ్ మనీ ఇస్తోంది. ఆలోచనలను ఆవిష్కరణల రూపంలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు, మెకానిజం కూడా డీఆర్డీవో అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచే లబ్ధ ప్రతిష్టులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్ళే వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్టులై ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులు, విద్యార్ధుల మధ్య బంధం తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం వంటిది. నేను కూడా సర్కారు బడిలోనే చదివాను. నెల్లూరు జిల్లాలోని మారుమూల పల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. స్కూలు టీచర్ ఎస్ఆర్ నరసింహం గారు లెక్కలు ఎక్కువగా నేర్పారు. ఆట పాటలతో పాటు క్రికెట్‌కు కూడా ఆయనే గురువు. అమ్మ కోరిక మేరకే ఇంజనీరింగ్ అప్పట్లో మా ఊళ్ళో మొదటి గ్రాడ్యుయేట్ నేనే. మా అమ్మ ఎప్పుడూ నువ్వు ఇంజనీర్ కావాలని అంటుంటేది. అమ్మ కోరిక మేరకే ఇంజనీర్‌ను అయ్యాను. అబ్దుల్ కలాం డీఆర్డీవో చైర్మన్‌గా ఉన్నప్పుడే ఉద్యోగంలో చేరాను. ఆయనే స్ఫుర్తి. దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి ప్రతి ఒక్కరికీ దేశ భక్తితో పాటు దైవ భక్తి కూడా ఉండాలి. సైన్స్‌ను, సత్సంప్రదాయాలను సమానంగా గౌరవించాలి. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను మన పురాణాలు, ఇతిహాసాల్లో ఎప్పుడో చెప్పారు. సైన్స్ అభివృద్ధి చెందక ముందే జీరోను కనుగొన్న చరిత్ర మన సొంతం. నంబర్ వన్‌గా నిలవడమే యువత లక్ష్యం శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో నంబర్ వన్‌గా నిలవడమే యువత ముందున్న లక్ష్యం. 75 కోట్ల మంది యువత ఉన్న ఏకైక దేశం. ఆ యువ శక్తిని, మేథో సంపత్తిని సమృద్ధిగా వినియోగించుకుని తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాలి. గతంలో ఐఐటీ పూర్తి చేసుకున్న నిపుణులు 75 శాతం మంది విదేశా>లకు వెళ్లిపోయే వాళ్లు. ఇప్పుడు 75 శాతం మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది మన దేశం సాధించిన ప్రగతికి నిదర్శనం. -
రీసెర్చ్ కారిడార్‌గా తిరుపతి
తిరుపతి రూరల్: కేంద్ర పరిశోధన సంస్థలతో పాటు దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా తొమ్మిది యూనివర్సిటీలున్న తిరుపతిని రీసెర్చ్ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్, కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన కార్యదర్శి డాక్టర్ సతీష్‌రెడ్డి తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యా సంస్థలు నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్(ఐఎస్టీఎఫ్)ను శనివారం ఆయన ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. పలు కాలేజీలు, యూనివర్సిటీలను నాలెడ్జ్ పాట్నర్స్‌గా చేసుకుని వారికి సర్టిఫికెట్లు అందించారు. యువకులు, అ«ధ్యాపకులు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పరిశోధనల పరంగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు చాలా అవకాశాలున్నాయని చెప్పారు. వాతావరణ పరిశోధన కేంద్రంతో పాటు.. వేలాది మంది యువత ఈ నగరానికి అదనపు బలమని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశంలో గత పదేళ్లలో ఊహించని పురోగతి సాధించినట్లు తెలిపారు. ఐఐటీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఉపాధి కోసం గతంలో 75 శాతం మంది విదేశాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు వారంతా దేశంలోనే ఉంటున్నారని తెలిపారు. 70 వేలకు పైగా నూతన ఆవిష్కరణలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయ్యాయని, ఇది మన పురోగతికి నిదర్శనమన్నారు. నూతన ఆవిష్కరణలకు ఇండెక్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ విభాగాల ద్వారా డీఆర్డీవో రూ.కోటి నుంచి రూ.15 కోట్ల వరకూ ఫండింగ్ చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 60 నూతన ఆవిష్కరణలకు ఫండింగ్ చేశామని, ఈ ఏడాది కనీసం 5 వేల వరకూ పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, పరిశోధనలపై ఆసక్తి కలిగిన వారు రక్షణ రంగం అందిస్తున్న ఈ ఫండింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలతో సాంకేతిక రంగంలో దేశం సంపదను సృష్టిస్తోందని, రానున్న రోజుల్లో 39,475 వేల కోట్ల ఎగుమతులే లక్ష్యమన్నారు. దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాలంటే అన్ని రంగాల్లోనూ అధునాతన పరిశోధనలు అవసరమని, వీటిని ప్రోత్సహించే ఇంక్యూబేషన్ సెంటర్లు, విద్యా సంస్థలు, రీసెర్చ్ సంస్థలకు అన్ని విధాలా ప్రోత్సాహకాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు సరికొత్త వేదికగా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని, ఈ సందర్భంగా దాని రూపకర్త డాక్టర్ నారాయణరావును డాక్టర్ సతీష్‌రెడ్డి అభినందించారు. నూతన ఆవిష్కరణలకు వేదిక.. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు వేదికగా ఐఎస్టీఎఫ్ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్టు దాని అధ్యక్షుడు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రో–వైస్ చాన్సలర్ ఆచార్య నారాయణరావు చెప్పారు. తిరుపతిలో డీఆర్డీవో ల్యాబ్, ఐఐటీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ కోరారు. ఐఎస్టీఎఫ్ మూడు దశల్లో సేవలందించాలని సూచించారు. స్కూల్ స్థాయి విద్యార్థులకు క్షేత్ర స్థాయి పరిశీలన, కళాశాల స్థాయి విద్యార్థులకు.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్న ఉపాధిపై, రీసెర్చ్ స్థాయి విద్యార్థులకు నూతన ఆవిష్కరణల రంగంపై శిక్షణ, వారికి తోడ్పాటు వంటి అంశాలపై ఫౌండేషన్ దృష్టి పెట్టాలని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ గణేష్ సూచించారు. కార్యక్రమంలో గాదంకి ఎన్ఏఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ ఏకే పాత్రో, ఎస్వీయూ, పద్మావతి మహిళా వర్సిటీ, మోహనబాబు వర్సిటీల వీసీ ఆచార్య రాజారెడ్డి, జమున, నాగరాజన్, ఫౌండేషన్ కోశాధికారి వాసు, విజయభాస్కరరావుసభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై ఉన్న వకుళమాత అమ్మవారిని, తిరుమల శ్రీవారిని డాక్టర్ సతీష్‌రెడ్డి దర్శించుకున్నారు. -
పైలట్ రహిత విమానం.. ప్రయోగం విజయవంతం
సాక్షి బెంగళూరు: రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో తన తొలి మానవ రహిత విమానాన్ని విజయవంతంగా ఎగరవేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో శుక్రవారం ఈ పరీక్ష చేపట్టింది. పైలట్ లేకుండా ఎగిరిన ఈ విమానం ల్యాండింగ్ వరకు అన్ని పనులను స్వయంగా నిర్వహించింది. విమానం చక్కగా ఎగిరిందని అధికారులు తెలిపారు. ఇది పూర్తిగా సెల్ఫ్ కంట్రోల్ డ్రైవింగ్‌తో పనిచేస్తుందన్నారు. మానవ రహిత విమానాల అభివృద్ధిలో ఇదొక గొప్ప విజయమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. -
వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం పరీక్ష సక్సెస్
బాలసోర్: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి శుక్రవారం చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుందని, రాడార్ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఈ క్షిపణి హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఛేదించడాన్ని అంచనా వేసేందుకు పలు ట్రాకింగ్ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం డీఆర్డీవో, నేవీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందన్నారు. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవో, నేవీలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ విజయంతో భారత నావికాదళం గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ నేవీ, డీఆర్డీవో బృందాల కృషిని ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి అభినందించారు. భారత నావికా దళం సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ ఇనుమడింప జేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ‘‘ఆత్మనిర్భర్ భారత్’’లో ఇది మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. -
హనీట్రాప్స్ కోసం ప్రాజెక్ట్ షేర్నీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్ చేయడానికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ‘ప్రాజెక్టు షేర్నీ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో పని చేయడానికి 300 మంది ఆకర్షణీయమైన యువతులను ఎంపిక చేసుకుని వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. డీఆర్డీఓలో పని చేస్తున్న ఓ సీనియర్ సైంటిస్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఇంజినీర్ దుక్కా మల్లికార్జున్ రెడ్డి శుక్రవారం అరెస్టు అయ్యారు. వీరిద్దరూ ప్రాజెక్ట్ షేర్నీలో పని చేస్తున్న యువతుల వల్లో చిక్కి రహస్య సమాచారం చేరవేశారు. షేర్నీ అంటే ‘ఆడసింహం’ అని అర్థం. ఆరు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ.. వీరంతా తమ తమ ప్రాంతాల్లోనే ఉండి ఐఎస్ఐ కోసం పని చేస్తున్నారు. వీరికి ఐఎస్ఐ ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసిందంటే... టార్గెట్ చేసిన వ్యక్తిని హనీ ట్రాప్ చేయడానికి వీడియో కాల్లో నగ్నంగా కనిపించడానికీ వెనుకాడరు. ఎంపికైన 300 మందికీ వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భారత్‌లోని జీవనస్థితిగతులు, భాష, మతపరమైన నమ్మకాలతో పాటు డార్క్ వెబ్ వినియోగం, హనీ ట్రాప్ చేయడం తదితర అంశాల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చింది. విదేశాలకు చెందిన ఒక్కో యువతికి దాదాపు 50 వరకు భారతీయుల పేర్లతో ప్రొఫైల్స్ ఏర్పాటు చేసిన ఐఎస్ఐ వీటి ద్వారానే హనీట్రాప్స్ చేయిస్తోంది. వీరి కట్టు, బొట్టు, నడక, నడత ప్రతీ అంశమూ భారతీయ యువతుల మాదిరిగా ఉండేలా వీరిని తయారు చేసింది. హనీట్రాప్‌లో విజయం సాధించి, రహస్య సమాచారం సేకరించిన వారికి ప్రత్యేక నజరానాలూ ఐఎస్ఐ అందిస్తోంది. అబోటాబాద్‌లో సోషల్‌మీడియా యూనిట్... దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న అధికారులు, సైంటిస్టులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఐఎస్ఐకి వారి సోషల్‌మీడియా ఖాతాల ద్వారానే తెలుస్తోంది. వీటిని విశ్లేషించడం కోసం ఐఎస్ఐ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ప్రత్యేక సోషల్‌మీడియా యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుశిక్షితులైన ఐఎస్ఐ ఉద్యోగులతో పాటు పాక్ ఆర్మీ సిబ్బంది, కొందరు హ్యాకర్లు పని చేస్తున్నారు. వీరి ప్రతినిత్యం భారతీయులకు సంబంధించిన సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను విశ్లేషిస్తుంటారు. వీటిలో తమకు అవసరమైన వారివి ఎంపిక చేసుకుని అధ్యయనం చేస్తారు. అలా తుదిజాబితా రూపొందించిన తర్వాత దాన్ని ప్రాజెక్ట్ షేర్నీలోని యువతకులకు అందిస్తుంది. వీటి ఆధారంగానే ఈ యువతులు టార్గెట్లకు వల వేసి ఆకర్షిస్తారు. అందచందాలతో పాటు డబ్బు ఎర వేసి రహస్య సమాచారం సేకరిస్తారు. తమ పని పూర్తయ్యే వరకు ఐఎస్ఐ కోసం పని చేస్తున్నట్లు ఎదుటి వారికి అనుమానం కూడా రానీయరు. హనీట్రాప్స్‌ను కనిపెట్టడానికి నిఘా వర్గాలతో పాటు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) పని చేస్తున్నాయి. పాకిస్థానీయులు లేకుండా బెటాలియన్.. ప్రాజెక్టు షేర్నీ కోసం కొన్నేళ్లుగా వ్యహాత్మకంగా పని చేసింది. ఇందులో పని చేయడానికి యువతుల ఎంపిక, వారికి శిక్షణ తదితర అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంది. 300 మందితో ఏర్పడిన ఈ బెటాలియన్‌లో కనీసం ఒక్క పాకిస్థానీ యువతి కూడా లేదు. ఇందులో పని చేస్తున్న వారంతో భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వీరి ఎంపికను రహస్యంగా పూర్తి చేశారు. అక్కడ ఉన్న తమ ఏజెంట్ల ద్వారా ప్రధానం మధ్య, దిగువ మ«ధ్య తరగతి వర్గాల్లో ఆకర్షణీయమైన యువతులను ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆపై డబ్బు ఆశచూపి వారిని ప్రాజెక్టు షేర్నీలో పని చేసేలా ఐఎస్ఐ ఒప్పించింది. (చదవండి: మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ట్వీట్) -
శతమానం భారతి: భారత రక్షణ వ్యవస్థకు వెన్నుదన్నుగా డి.ఆర్.డి.ఓ
భారత సాయుధ దళాల కోసం అత్యాధునిక రక్షణ సాంకేతికతలను, యుద్ధంలో గెలిపించే ఆయుధ వ్యవస్థలను రూపొందించేందుకు స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరమే 1948 లో డాక్టర్ డి.ఎస్.కొఠారి ప్రారంభించిన రక్షణ సర్వీసు వ్యవస్థ (డి.ఎస్.ఓ.) భారత రక్షణ రంగానికి వెన్ను దన్నుగా నిలిచింది. 1958 జనవరి 1న డి.ఆర్.డి.ఓ.గా పేరు మార్చుకున్న డి.ఎస్.ఓ. సాయుధ దళాలకు కావలసిన ఆయుధాలు, ఇతర సామగ్రిని తయారు చేసి అందించే స్థాయికి చేరుకుంది. ప్రారంభంలో ఈ సంస్థ నుంచి రక్షణ రంగానికి సలహాలు మాత్రమే లభించేవి. 1970–80 లలో డి.ఆర్.డి.ఓ. శాంతియుత ప్రయోజనాలకోసం అణుపరీక్షలు నిర్వహించింది. దూరాన్ని కచ్చితంగా కొలిచే సాధనాలను; రాకెట్లకు ఘన, ద్రవ ఇంధనాలను కనిపెట్టింది. మోర్టార్లు, క్షిపణులు, ఫిరంగులు, నిఘా రాడార్లు తయారు చేసింది.1980–90 మధ్య సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమం, ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్, తేలికపాటి యుద్ధ విమానం తేజస్ తయారీకి డి.ఆర్.డి.ఓ. ఆధ్వర్యంలో సన్నాహాలు మొదలయ్యాయి. సఫలం అయ్యాయి. డి.ఆర్.డి.ఓ. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, వచ్చే 25 ఏళ్లలో దేశం ఆయుధాల ఎగుమతి సామర్థ్యం పెంచుకునే దిశగా, ప్రధాని మోదీ పిలుపు మేరకు రక్షణ రంగంలో ఆత్మనిర్భరతసాధన వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. డి.ఆర్.డి.ఓ. కు దేశవ్యాప్తంగా 50 కి పైగా çపరిశోధనాలయాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ఉంది. ఈ భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థలో సుమారు 5000 మంది సైంటిస్టులు, 25 వేల మంది సహాయక సిబ్బంది పని చేస్తున్నారు. (చదవండి: భారత్-చైనా యుద్ధం) -
ఈవీ ప్రమాదాలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు.. వాహనదారుల్లో ఆందోళన రెకెత్తిస్తోంది. మరణాలు సైతం సంభవించడంతో.. కేంద్రం సైతం విషయాన్ని సీరియస్‌గా పరిగణించి దర్యాప్తులకు ఆదేశించింది. ఈ తరుణంలో.. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలపై డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమవుతుండడం వెనక.. ఎండాకాలం సీజన్ కారణం కావొచ్చంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి తొలుత. అయితే కారణం అది కాదని డీఆర్డీవో తన నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ లోపాలు కారణంగానే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఓ నివేదిక రూపొందించింది. బ్యాటరీ ప్యాక్స్ డిజైన్లు, సరైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండానే బ్యాటరీ బండ్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తన నివేదికలో డీఆర్డీవో స్పష్టం చేసింది. అంతేకాదు.. ఖర్చు తగ్గించుకునేందుకు లో-గ్రేడ్ మెటీరియల్‌ను ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించడం.. ప్రమాదాలకు కారణమైందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-మోటర్‌సైకిల్‌ల వినియోగాన్ని 2030 నాటికి 80 శాతానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వరుస ప్రమాదాలు, కంపెనీల వైఖరి ఆ లక్ష్యాన్ని అందుకుంటుందో.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే సమయంలో.. కంపెనీల వైఖరి బయటపడడంపై మంత్రి నితిన్ గడ్కరీ ఎలా స్పందిస్తారో చూడాలి. -
‘రక్షణ’లో అగ్రభాగాన నిలుపుతాం
ఇబ్రహీంపట్నం రూరల్: రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతామని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ అనే సంకల్పాన్ని నెరవేరుస్తామని చెప్పారు. ఆదిభట్లలోని టాటా ఏరోస్పేస్ పార్కులో ఎస్‌కెఎం టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సతీశ్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమలకు అపార అవకాశాలు ఉన్నాయని.. ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ పరీక్ష వ్యవస్థలను, సౌకర్యాలను వినియోగించుకోవచ్చని సతీశ్‌రెడ్డి చెప్పారు. భారత రక్షణ పరిశ్రమలను బలోపేతం చేయడం కోసం డీఆర్డీవో ఎలాం టి రాయల్టీ తీసుకోకుండానే వెయ్యికిపైగా పేటెంట్ ఉత్పత్తులను వినియోగించుకునే వీలు కల్పించిందని వివరించారు. దేశీ సంస్థలకు మద్దతుగా అనేక రక్షణ దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించిందని తెలిపారు. మన దేశానికి భారీగా రక్షణ ఎగుమతులు చేసే సామర్థ్యం ఉందని, రాబోయే రోజుల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పగలదని పేర్కొ న్నారు. రక్షణ పరికరాలకు సంబంధించి ప్రస్తు తం అతిపెద్ద దిగుమతిదారుల్లో ఒకటిగా ఉన్న మన దేశాన్ని అతిపెద్ద ఎగుమతిదారుల్లో ఒకటిగా మార్చేందుకు డీఆర్డీఓ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇప్పటికే బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, ఏటీజీఎం, ఎస్ఏఎం, టార్పెడోలు, రాడార్లను ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరిం చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ, మిధాని శాస్త్రవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. -
45 రోజుల్లో ఏడంతస్తుల భవనం
సాక్షి, బెంగళూరు: యుద్ధ విమానాల (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏఎంసీఏ) తయారీ కోసం బెంగళూరులో డీఆర్డీఓ 1.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఏడంతస్తుల భవనాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం ప్రారంభించారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో డీఆర్డీఓ సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం 45 రోజుల్లో విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదో తరం మీడియం వెయిట్ డీప్ పెన్ట్రేషన్ ఫైటర్ జెట్‌కు అవసరమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సదుపాయాలు ఇందులో ఉన్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. దేశ వైమానిక సామర్థ్యం మరింత పెంచేందుకు ఈ ఫైటర్ జెట్ అభివృద్ధి పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం రూ.15 వేల కోట్లని తెలిపారు. ప్రధాని నేతృత్వంలోని భద్రతావ్యవహారాల కేబినెట్ కమిటీ త్వరలోనే దీనికి ఆమోదం తెలపనుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, డీఆర్డీఓ చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ భవనానికి 2021 నవంబర్ 22వ తేదీన శంకుస్థాపన జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన వాస్తవ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు చెప్పారు. సంప్రదాయ, ప్రీ ఇంజినీర్డ్ ప్రీ కాస్ట్ మెథడాలజీతో రికార్డు స్థాయిలో 45 రోజుల్లోనే డీఆర్డీవో ఈ భవనాన్ని నిర్మించిందని తెలిపారు. ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులు డిజైన్‌కు సంబంధించి సహకారం అందించారన్నారు. -
కేవలం 45 రోజుల్లో ఏడంతస్తుల భవనం...దేశ నిర్మాణ చరిత్రలోనే రికార్డు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కోసం బహుళ-అంతస్తుల భవన నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేసింది. ఈ ఏడంతస్తుల భవనాన్ని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(ఏడీఈ) వద్ద నిర్మించింది. దీన్ని సంప్రదాయ, ప్రీ-ఇంజనీరింగ్, ప్రీకాస్ట్ మెథడాలజీతో కూడిన హైబ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేసింది. స్వదేశీ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ) ప్రోగ్రాం కోసం నిర్మించిన ఈ భవనాన్ని ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఏవియోనిక్స్ అభివృధికి వినియోగిస్తారు. ఈ ఐదవతరం స్వదేశీ ఏఎంసీఏ రీసెర్చ్ అండ్ డెలవలప్మెంట్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ఏడంతస్తుల భవనాన్ని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బెంగళూరులో గురువారం ప్రారంభించారు. అంతేకాదు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భవనంలోనే ప్రాజెక్ట్‌పై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు డిఆర్డిఓ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయన 45 రోజుల తక్కువ వ్యవధిలో కాంపోజిట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ద్వారా మౌలిక సదుపాయాలు అందిచాలని చెప్పారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన నవంబర్ 22, 2021న జరిగిందని, నిర్మాణం ఫిబ్రవరి 1, 2022న ప్రారంభమైందని తెలిపారు. హైబ్రిడ్ నిర్మాణ సాంకేతికతతో ఏడు అంతస్తుల శాశ్వత భవనాన్ని పూర్తి చేయడం ఒక ప్రత్యేకమైన రికార్డు అని అన్నారు. దేశ నిర్మాణ పరిశ్రమ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. అంతేకాదు ఇది సాంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సమయం, శ్రమను తీవ్రంగా తగ్గిస్తుందని చెప్పారు. ఈ అత్యాధునిక భవనంలో ప్రామాణిక జాతీయ భవనం కోడ్ ప్రకారం విద్యుత్ వ్యవస్థ, ఫైర్ ప్రోటెక్షన్ తోపాటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని అన్నారు. ఈ భవన నిర్మాణాం అన్ని నిబంధనలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నిర్మాణంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ బృందాలు సాంకేతిక సహాయాన్ని అందించాయని తెలిపారు. (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేయండి
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. ‘ఆజాదీ అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఇస్రో, డీఆర్డీవో, ఎన్ఐటీలు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా)లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అనంతరం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశ ప్రగతిని, భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధిని అక్కడికి వచ్చిన విద్యార్థులకు వివరించారు. స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లలోనే భారతదేశం అన్ని రంగాల్లోనూ గణనీయమైన ప్రగతి సాధించిందని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన నిలిచిందని తెలిపారు. స్వాతంత్య్రం సాధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి.. అంటే 2047కు అన్ని రంగాల్లోనూ దేశాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రధాని దిశానిర్దేశం చేశారని తెలిపారు. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వీరిలో అధికశాతం పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఉత్సుకత చూపుతున్నారని చెప్పారు. ఇటీవల 60 వేల స్టార్టప్‌లు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా మహమ్మారి ప్రబలిన మూడున్నర నెలల్లోనే.. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించిన ఘనత మనకు దక్కిందన్నారు. కరోనా మహమ్మారి తొలి దశలో విరుచుకుపడినప్పుడు డీఆర్డీవో అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా రోజుకు నాలుగు లక్షల పీపీఈ కిట్లు, 60 వేలకుపైగా వెంటిలేటర్లను తయారుచేసి, దేశంతో పాటు ప్రపంచానికీ అందించామన్నారు. రక్షణ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో వివిధ రకాల క్షిపణులను తయారుచేశామని వివరించారు. వీటిని దేశ రక్షణ అవసరాలకు వినియోగించడంతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలతో అర్జున్ ట్యాంక్‌ను తయారుచేశామని చెప్పారు. రోదసీ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో ఇస్రో పోటీ పడుతోందన్నారు. చంద్రుడు, అంగారక గ్రహాలపై పరిశోధనలకు చంద్రయాన్, మంగళయాన్‌లను చేపట్టామని వివరించారు. ప్లాస్టిక్‌ను నిర్మూలించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగ్‌ల స్థానంలో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ బ్యాగ్‌లను డీఆర్డీవో రూపొందించిందన్నారు. ఈ పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని, ఆ బ్యాగ్‌లను విరివిగా తయారుచేయాలని యువతకు సూచించారు. -
పొరుగింటి లాయర్‌పై కక్షతో..
న్యూఢిల్లీ: పొరుగింట్లో ఉండే లాయర్‌పై కక్ష పెంచుకుని, అతడిని చంపేందుకు ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు పెట్టిన డీఆర్డీవో (రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ) సీనియర్ శాస్త్రవేత్త ఒకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఆర్డీవో సీనియర్ సైంటిస్ట్ భరత్ భూషణ్ కటారియా (47), లాయర్‌గా పనిచేసే అమిత్ వశిష్ట్ స్థానిక అశోక్ విహార్ ఫేజ్–1 భవనంలోని వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. పాత తగాదాలున్న వీరిద్దరూ పరస్పరం పలు కేసులు పెట్టుకున్నారు. అయితే, లాయర్ వశిష్ట్‌ను చంపాలని కటారియా ప్రణాళిక వేశాడు. మార్కెట్లో సులువుగా దొరికే రసాయనాలను వాడి టిఫిన్ బాక్స్ బాంబు తయారు చేశాడు. ఈ నెల 9వ తేదీన కటారియా లాయర్ మాదిరి దుస్తులు వేసుకుని ఎవరికీ అనుమానం రాకుండా రోహిణి కోర్టు భవనంలో వశిష్ట్ హాజరయ్యే కోర్ట్ నంబర్ 102లో బాంబున్న బ్యాగ్‌ను వదిలేసి వచ్చాడు. కానీ, సరిగ్గా అమర్చని కారణంగా బాంబు బదులు డిటొనేటర్ మాత్రమే పేలింది. దీంతో ఒకరు గాయపడ్డారు. దర్యాప్తు చేపట్టిన విచారణ బృందాలు..ఘటన జరిగిన రోజున కోర్టు సీసీ ఫుటేజీని పరిశీలించి కటారియానే బాధ్యుడిగా తేల్చాయి. బాంబు తయారీలో వాడిన సామగ్రి, రసాయనాలు, రిమోట్ తదితరాలు కటారియా ఇంట్లో లభించాయి. ఈ మేరకు శాస్త్రవేత్త భరత్ భూషణ్ కటారియాను శనివారం అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా తెలిపారు. -
అగ్రదేశాల్లో.. మనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘భారతీయులు ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోరు. యుద్ధాలు జరగకుండా చూడటానికే ప్రయత్నిస్తాం. అదే సమయంలో మన రక్షణ రంగ సామర్థ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉంటాం. శత్రు దుర్బేధ్య దేశంగా నిర్మించుకోవడం కోసం ఆధునిక సాంకేతికతతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రస్తుతం శాస్త్రసాంకేతిక, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అగ్రగామిగా వెలుగొందుతోంది’ అని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి చెప్పారు. జేఎన్టీయూ–అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. సతీష్‌రెడ్డి ఇదే కళాశాలలో విద్యనభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలివీ.. అన్నింటా స్వదేశీ పరిజ్ఞానమే.. అంతరిక్ష, రక్షణ రంగ పరిశోధనల్లో టాప్–5 దేశాల్లో భారత్‌కు స్థానం దక్కింది. ఇస్రో ప్రయోగాలకు సొంత సాంకేతిక పరిజ్ఞానాన్నే ఉపయోగిస్తున్నాం. అటామిక్ ఎనర్జీ, రక్షణ రంగంలోనూ ఆధునిక దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఇప్పుడు మన దేశం ‘మేకిన్ ఇండియా నుంచి మేడ్ ఫర్ ద వరల్డ్’ స్థాయికి ఎదుగుతోంది. ఉపగ్రహాల కాల వ్యవధి ముగిసిన వెంటనే.. వాటిని కూల్చివేయడానికి వీలుగా ఏ–శాట్‌ను అభివృద్ధి చేశాం. తద్వారా భారత్ టాప్–4(అమెరికా, రష్యా, చైనా సరసన)లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాల్లో ఉండే లక్ష్యాన్ని చేరుకునే గన్ 155 ఎం.ఎం ఆవిష్కరణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కు చైనా, పాకిస్తాన్ వంటి దేశాలతో తరచూ సరిహద్దుల్లో సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పటికప్పుడు అత్యాధునిక సర్వైలెన్సు వ్యవస్థ ఏర్పాటు చేసి, దీనిని సరిహద్దు భద్రతకు ఉపయోగిస్తున్నాం. పరిశోధన రంగాల వైపు వచ్చే ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇది శుభపరిణామం. విద్యార్థులు గొప్ప ఆవిష్కరణలతో వస్తే.. ఆ ప్రాజెక్టుకు రూ.10 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ‘అనంత’లో ఉండగానే.. అగ్ని ప్రైమ్ శుభవార్త అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం శనివారం విజయవంతమైంది. కళాశాలలో పైలాన్ ఆవిష్కరించిన వెంటనే ఈ శుభవార్త నాకు తెలిసింది. ఆ వెంటనే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు అభినందనలు తెలిపారు. నేను విద్యనభ్యసించిన కళాశాలలో ఉండగా ఇలాంటి ఘనత దక్కడం సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఆప్యాయత చాలా గొప్పది. యువ ఇంజనీర్లకు డీఆర్డీవో చేయూత అనంతపురం విద్య: యువ ఇంజనీర్లకు డీఆర్డీవో తగిన చేయూతనిస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి తెలిపారు. శనివారం అనంతపురంలో జరిగిన జేఎన్టీయూ(ఏ) ఇంజనీరింగ్ కళాశాల వజ్రోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ(ఏ)విద్యార్థులు ఎంటెక్ (డిఫెన్స్ టెక్నాలజీ) కోర్సు చదవడానికయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఎంటెక్(డిఫెన్స్ టెక్నాలజీ) రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామన్నారు. జేఎన్టీయూ(ఏ)లో డీఆర్డీవో ఎక్స్‌లెన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, వీసీ జింకా రంగ జనార్దన, రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, ప్రిన్సిపాల్ పి.సుజాత పాల్గొన్నారు. -
అగ్ని ప్రైమ్ పరీక్ష విజయవంతం
బాలాసోర్: అగ్ని ప్రైమ్(అగ్ని– పి) క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న ఈ బలాస్టిక్ మిసైల్‌ను ఒడిషా తీరంలోని అబ్దుల్‌కలామ్ ద్వీపం నుంచి శనివారం దిగ్విజయంగా పయ్రోగించినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని తెలిపింది. 1000– 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు. పరీక్షలో క్షిపణి కచ్ఛితమైన లక్ష్యసాధన చేసిందని డీఆర్డీఓ వెల్లడించింది. ఈ సందర్భంగా సైంటిస్టుల బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాధ్ ప్రశంసించారు. అగ్ని– పి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్డీఓ చైర్మన్ సతీశ్‌రెడ్డి హర్షం ప్రకటించారు. తొలిసారి ఈ క్షిపణిని జూన్ 28న పరీక్షించారు. నేడు జరిపిన రెండో పరీక్షతో క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందని, వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్డీఓ తెలిపింది. -
ఆలిమ్కో, కాన్పూర్‌లో 74 అప్రెంటిస్‌లు
కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్కో).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 74 ► ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్, మెషినిస్ట్, టర్నర్, ప్లంబర్ తదితరాలు. ► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.11.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(పదో తరగతి, ఐటీఐ) సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అలిమ్కో, జీటీ రోడ్, కాన్పూర్–209217 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 ► వెబ్సైట్: alimco.in డీఆర్డీఓ–టీబీఆర్ఎల్, చండీగఢ్‌లో 61 ట్రేడ్ అప్రెంటిస్‌లు చండీగఢ్‌లోని డీఆర్డీఓ–టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(టీబీఆర్ఎల్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 61 ► ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), మెకానిక్ మెకట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఆర్కిటెక్చర్ అసిస్టెంట్, హౌస్‌కీపర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా తదితరాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ► ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: admintbrl@tbrl.drdo.in ► దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021 ► వెబ్సైట్: drdo.gov.in ఫ్యాక్ట్, కేరళలో 98 ట్రేడ్ అప్రెంటిస్‌లు కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్).. ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 98 ► విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ తదితరాలు. ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 23 ఏళ్లు మించకూడదు. ► స్టయిపండ్: నెలకు రూ.7000 వరకు చెల్లిస్తారు. ► ట్రెయినింగ్ వ్యవధి: ఏడాది ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:18.12.2021 ► వెబ్సైట్: fact.co.in -
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశాలోని ఎపీజె అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ అక్టోబర్ 27న విజయవంతంగా పరీక్షించింది. అత్యంత ఖచ్చితత్త్వంతో 5,000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ఈక్షిపణి కలిగి ఉంది. ఈ క్షిపణి సుమారు 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, సుమారు 50 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ఒక టన్ను కంటే ఎక్కువ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ.. తాజా ప్రయోగంతో భారత్ ఆ దేశానికి గట్టి సందేశం పంపింది. హైపర్ సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్న దేశాలలో భారతదేశం ఒకటని ఇటీవల ఒక యుఎస్ కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. ఈ ఖండాతర క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యంతో రూపొందించారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. అలాగే, మ్యాక్ 7 హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ 2ని భారత్ రష్యాతో కలిసి అభివృద్ది చేస్తుంది. భారతదేశం తన హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ, ద్వంద్వ సామర్థ్యం కలిగిన హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా అభివృద్ధి చేస్తోంది. జూన్ 2019, సెప్టెంబర్ 2020లో మ్యాక్ 6 స్క్రామ్ జెట్ ను విజయవంతంగా పరీక్షించింది. (చదవండి: ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!) -
డీఆర్డీవో, ఐటీఆర్ చాందీపూర్‌లో అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న డీఆర్డీవో–ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరాఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 116 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–50, డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు–40, ట్రేడ్ అప్రెంటిస్‌లు–26. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీబీఏ, బీకాం, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్,సివిల్,సినిమాటోగ్రఫీ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► ట్రేడ్ అప్రెంటిస్‌లు: ట్రేడులు: కంప్యూటర్ నెట్వర్కింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు.అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► 2019, 2020, 2021లో అర్హత కోర్సు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు/ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 01.11.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.drdo.gov.in -
చైనాపై భారత్ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..
సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగుతోంది! లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లలో... చడీచప్పుడు లేకుండా బలగాలను మోహరించడం... రోడ్లు, వంతెనలు మాత్రమే కాదు.. రాత్రికి రాత్రి డజన్ల కొద్దీ నిర్మాణాలను కూడా కట్టేస్తూ ఇబ్బంది పెట్టేస్తోంది! ఈ నేపథ్యంలో రోజురోజుకూ క్లిష్టతరమవుతున్న సరిహద్దుల రక్షణకు... భారత ప్రభుత్వం కృత్రిమ మేధను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది!! వాస్తవాదీన రేఖకు ఆవల.. చీమ చిటుక్కుమన్నా గుర్తించేందుకు... అందుకు తగ్గట్టుగా ప్రమాదాన్ని అంచనా వేసేందుకూ మనుషుల్లా ఆలోచించే సాఫ్ట్వేర్లు 24 గంటలూ పనిచేయనున్నాయి!! సాక్షి, హైదరాబాద్: చైనా, పాకిస్తాన్ వంటి శత్రుదేశాల నుంచి తనను తాను కాపాడుకునేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకవైపు సరిహద్దుల్లో రోడ్లు వంతెనలు, విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలను పెంచుకుంటూనే... ఇంకోవైపు అత్యాధునిక టెక్నాలజీల సాయంతో శత్రువు ఆనుపానులు పసిగట్టే ప్రయత్నాలనూ వేగవంతం చేసింది. ఇటీవలి కాలంలో చైనాతో కొనసాగుతున్న సరిహద్దు సమస్యల నేపథ్యంలో దేశం తూర్పు విభాగంలో నిఘాను మరింత కట్టుదిట్టం చేసేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకుంటోంది. జంతువుల కదలికలూ గుర్తించేలా... వాస్తవాదీన రేఖ వెంబడి నిఘా పెట్టేందుకు మానవరహిత విమానాలు, రాడార్లు అమర్చిన హెలికాప్టర్లు ఇప్పటికే పని చేస్తున్నాయి. వీటితోపాటు ఉపగ్రహాల నుంచి అందే ఛాయాచిత్రాలు, నేలపై వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సెన్సర్లు అన్నీ ఎప్పటికప్పుడు చైనా సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇలా వేర్వేరు మార్గాల ద్వారా అందే సమాచారాన్ని అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘రూపా’లో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రంలో విశ్లేషిస్తుంటారు. కృత్రిమమేధ సాయంతో వీడియోలను, ఛాయాచిత్రాలను కలిపి కదలికలను స్పష్టంగా గుర్తిస్తున్నారు. ఈ శ్రమ వృథా పోవడం లేదు. చైనా సైన్యంలో ఎంత మంది ఉన్నారు? ఏ రకమైన వాహనాలు వాడుతున్నారు? సరిహద్దుల వెంబడి ఎలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణం జరిగిందన్న సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది. వీటి ఆధారంగా చైనా దూకుడుకు కళ్లెం వేసే అవకాశం లభిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సరిహద్దులకు అవల సైనికుల రవాణా జరగుతోందా? లేక గొర్రెలు, ఆవుల్లాంటి జంతువులు కదులుతున్నాయా? అన్నది కూడా కృత్రిమ మేధ సాయంతో పనిచేసే నిఘా సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోగలగడం!! డీఆర్డీవో ప్రయత్నాలూ ముమ్మరం... భవిష్యత్తు యుద్ధాలన్నీ సైబర్ యుద్ధాలే అన్న అంచనా రూఢీ అవుతున్న నేపథ్యంలో దేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను అన్ని స్థాయిల్లో వాడేందుకు రంగం సిద్ధం చేస్తోంది. యుద్ధరంగంలో కృత్రిమ మేధ ఆధారిత ఆయుధ వ్యవస్థలను దింపడం చాలా సులువు. శత్రు భయంకరం కూడా. కంటికి కనిపించకుండానే శత్రువుకు విపరీతమైన నష్టాన్ని కలుగచేస్తాయి. ఇదంతా జరిగేందుకు కేవలం మూడు నాలుగేళ్లు సరిపోతుందని... అయితే ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందంటున్నారు మిలటరీ నిపుణులు. డీఆర్డీవోకు చెందిన సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ దాదాపు 150 మంది ఇంజినీర్ల సాయంతో ఏఐ రోబోటిక్స్, నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. శత్రువులకు చిక్కకుండా రహస్యంగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు అవసరమైన నెట్‌వర్క్‌లూ ఇందులో ఉన్నాయి. ఫేషియల్ రికగ్నిషన్కూ... ఏఐ! బస్టాండ్లు మొదలుకొని విమానాశ్రయాల వరకూ చాలాచోట్ల ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్లతో కూడిన కెమెరాలు సహజంగానే ఉం టాయి. కానీ.. మిలటరీ విషయానికి వచ్చేసరికి వీటి పాత్ర పరిమితమైంందే! ఈ నేపథ్యంలోనే కృత్రిమ మేధను ఉపయోగించుకుని అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ముఖాలను గుర్తించే సాఫ్ట్వేర్ ఒకదాన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇజ్రాయెల్ సంస్థ కోర్‌సైట్ ఏఐలు కలిసికట్టుగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయనున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌తో వెలుతురు బాగా తక్కువగా ఉన్న చోట్ల మాత్రమే కాదు... అతిక్లిష్టమైన కోణాల్లోంచి.. వేగంగా కదులుతున్నా, గుంపులో కొందరిని మాత్రమే కూడా గుర్తుపట్టి ఫొటోలు తీయవచ్చు. అంతేకాకుండా.. ముఖంలో సగం కప్పి ఉంచుకున్నా గుర్తించేలా ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నారు. మానవ రహిత వాహనాలు డీఆర్డీవో సంస్థలు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలు కొన్నింటిని ఇప్పటికే తయారు చేశాయి. వీటిల్లో శత్రుస్థావరాల పరిశీలన, నిఘా పెట్టే ఓ రోబో ఉంది. గోడలెక్కే, నాలుగు, ఆరు కాళ్లతో నడవగలిగిన రోబోలూ రెడీగా ఉన్నాయి. యుద్ధం లేదా ఘర్షణల్లో గాయపడ్డ సైనికులను వేగంగా యుద్ధభూమి నుంచి బయటకు తరలించేందుకు స్మార్ట్ వీల్‌చె యిర్లు, ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై నిఘా పెట్టేందుకు నెట్వర్క్ ట్రాఫిక్ అనాలసిస్ (నేత్ర) వ్యసవ్థలను కూడా సిద్ధం చేసింది డీఆర్డీవో. గత ఏడాది జనవరిలో లక్నోలో జరిగిన ‘డిఫెన్స్ ఎక్స్పో’లో వీటిని ప్రదర్శించారు కూడా. -
రక్షణ రంగ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: డజనుకు పైగా డీఆర్డీవో పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో హైదరాబాద్ రక్షణ రంగ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ఏర్పాటుకు సంబంధించి వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి విమాన, రక్షణ రంగ విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో వేయికి పైగా లఘు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎస్ఎంఎస్ఈ) ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో పలు ఎంఎస్ఎంఈలు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా రక్షణ రంగం లేదా పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, దేశాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో అతి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మెగాప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా, అన్ని రకాల సహకారం అందిస్తోందని అన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని, రెండు వేల కంటే ఎక్కుమందికి ఉపాధి అవకాశం కల్పించనుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కంపెనీ భారతదేశ లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికాలో అతిపెద్ద రక్షణ రంగ తయారీ సంస్థ) అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని మంత్రి కొనియాడారు. లక్ష కోట్ల రూపాయలకుపైబడే: సతీశ్ రెడ్డి రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ చాలాకాలం కేంద్రంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా వీటికి మరింత ఊతం లభించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఆకాశ్, ఎంఆర్ సామ్ వంటి అనేక క్షిపణులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేర్వేరు కేంద్రాల్లో తయారవుతున్నాయని, వీటన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలకుపైబడే ఉంటుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంలో ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగం ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధవిమానం తయారు చేయడమే లక్ష్యం: వెంకట్ రాజు కూకట్‌పల్లిలోని ఓ చిన్న ఇంటిలో 1988లో మొదలైన వెమ్ టెక్నాలజీస్ ఈ 33 ఏళ్లలో ‘‘అసిబల్’’పేరుతో సొంతంగా ఓ క్షిపణిని తయారు చేసే స్థాయికి ఎదిగిందని వెమ్ టెక్నాలజీస్ అధ్యక్షుడు వెంకట్ రాజు అన్నారు. భారత్‌లో 2029 కల్లా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వాషింగ్ మెషీన్ల టైమర్లతో మొదలుపెట్టి.. ఒక క్రమపద్ధతిలో రక్షణ రంగంలోని వేర్వేరు విభాగాలకు చెందిన విడిభాగాలను తయారు చేయడం మొదలుపెట్టామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఉండగా.. జహీరాబాద్ సమీపంలోని యల్గోయి వద్ద సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యుద్ధవిమానం తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీరింగ్ కేంద్రం అవసరమని, ఐదువేల మంది ఇంజనీర్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆయన ‘‘సాక్షి’’కి వివరించారు. -
డీఆర్డీవో హైదరాబాద్‌లో అప్రెంటిస్‌లు ఖాళీలు
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో)కు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ(ఏఎస్ఎల్).. ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 40 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–30, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–10. ► విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తదితరాలు. అర్హత ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 వరకు చెల్లిస్తారు. ► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.8000 వరకు చెల్లిస్తారు. ► శిక్షణ వ్యవధి: 12 నెలలు ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ(ఏఎస్ఎల్), డీఆర్డీవో, కాంచన్‌బాగ్, హైదరాబాద్–500058 చిరునామకు పంపించాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021 ► వెబ్సైట్: https://www.drdo.gov.in యూసీఐఎల్, తుమ్మలపల్లిలో 30 అప్రెంటిస్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 30 ► విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, కార్పెంటర్, మెకానికల్ డీజిల్, టర్నర్/మెషినిస్ట్. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్వీసీటీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 02.11.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 02.11.2021 ► వెబ్సైట్: www.ucil.gov.in -
ఏడు రక్షణ సంస్థలు జాతికి అంకితం?
కంది(సంగారెడ్డి): రక్షణరంగ ఉత్పత్తులకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు కార్పొరేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణరంగ ప్రముఖుల సమక్షంలో వీటిని జాతికి అంకితం చేశారు. ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం ఆయుధ కర్మాగారంలో జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ ఇతర అధికారులు లైవ్ ద్వారా వీక్షించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్ ప్రొడక్షన్, డిఫెన్స్ మినిస్ట్రీ కింద దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో ఈ కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు సాయుధ దళాలకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (ఎద్దు మైలారం)గ్రోత్ అండ్ గ్లోరీ అనే అశంపై వీడియోను ప్రదర్శించారు. అనంతరం ఎద్దుమైలారం యూనిట్ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్, ఏజీఎం శివకుమార్ మాట్లాడుతూ రక్షణ రంగంలో ఏడు కొత్త సంస్థలు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. కార్పొరేషన్ల ఏర్పాటుతో కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తుకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. మరింత పట్టుదలతో పనిచేసి కొత్తరకం ఉత్పత్తులను తయారు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
యాంటీ డ్రోన్ కొత్త టెక్నాలజీని అభివృద్ధి పరిచాం
జమ్మూ: తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) చీఫ్ జి.సతీశ్‌రెడ్డి వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో డ్రోన్లను ఎదుర్కొనే విధంగా రూపకల్పన చేసిన వ్యవస్థలను ఈ పరిశ్రమలు రక్షణ, భద్రతా సంస్థలకు అవసరమైన విధంగా తయారు చేసి అందజేస్తాయని ఆయన తెలిపారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు. వాటిని స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సమయంలో మోహరించినట్లు వివరించారు. గురువారం జమ్మూలో సెంట్రల్ యూనివర్సిటీలో డీఆర్డీవో ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. -
ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశా రాష్ట్రం చండిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్'ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్‌ను మెరుగుపరిచి ఆ తర్వాత పరీక్షించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను డీఆర్డీఓ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. "ఆకాశ్ ప్రైమ్ క్షిపణిలో మెరుగైన ఖచ్చితత్త్వం కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. అధిక ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచి పనితీరును కనబరుస్తుంది" అని ఒక అధికారి మీడియాతో పంచుకున్నారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ), భారత సైన్యం, భారత వైమానిక దళం, ఇతర వాటాదారులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశ్ ప్రైమ్ వ్యవస్థపై భారత సైన్యం, భారత వైమానిక దళం విశ్వాసం మరింత పెరుగుతుందని డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. (చదవండి: నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల) DRDO today conducts Successful Maiden Flight Test of Akash Prime Missile from Integrated Test Range (ITR), Chandipur, Odisha. pic.twitter.com/QlvMHtTWVj — DRDO (@DRDO_India) September 27, 2021 -
పాక్ ఏజెంట్లకు రహస్య సమాచారం.. నలుగురు డీఆర్డీఓ ఉద్యోగుల అరెస్టు
సాక్షి, బాలాసోర్(భువనేశ్వర్): పాకిస్తాన్ ఏజెంట్లకు రహస్య సమాచారం అందిస్తున్న నలుగురు డీఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. బాలాసోర్‌జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్లో పనిచేస్తున్న వీరిని తొలుత ప్రశ్నించి అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్ రేంజ్ ఐజీ హిమాంన్షు కుమర్ చెప్పారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందన్నారు. కొందరు వ్యక్తులు రహస్య సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు అందించేందుకు యత్నిస్తున్నారని, వీరికి పలు ఐఎస్డీ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం అందిందన్నారు. వెంటనే నలుగురు డీఎస్పీలతో ఏర్పాటైన పోలీసు టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ఆరంభించామని చెప్పారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి నుంచి నేరాలు రుజువు చేసే పలు ఆధారాలు కూడా దొరికాయని చెప్పారు. వీరిపై చాందీపూర్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డీఆర్డీఓ స్పందించేందుకు నిరాకరించింది. 2014లో కూడా బాలాసోర్ నుంచి రహస్య సమాచారం విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చదవండి: క్రిమినల్ కేసుల వివరాల్లేవ్.. మమత నామినేషన్ తిరస్కరించండి -
పరిశోధనలను ముమ్మరం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఎదురు కాబోయే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనే దిశగా పరిశోధనలను మరింత ముమ్మరం చేయాలని డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. కోవిడ్ –19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో డీఆర్డీఓకు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డి.ఐ.పి.ఏ.ఎస్) శాస్త్రవేత్తల సహకారం అభినందనీయమని ఆయన తెలిపారు. సోమవారం డి.ఐ.పి.ఏ.ఎస్.కు చెందిన దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డి.ఐ.పి.ఏ.ఎస్., ఇతర డీఆర్డీఓ ల్యాబ్‌లను వెంకయ్య అభినందించారు. అంతేగాక ఎ లాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవం తంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్ –19 చికిత్స, నిర్వహణ కోసం డీఆర్డీఓ ల్యాబ్స్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన వివిధ ఉత్పత్తులు, పరికరాల గురించి డాక్టర్ జి. సతీష్ రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
తిరుమల లడ్డూల కోసం పర్యావరణహిత సంచి..
తిరుమల: తిరుమల శ్రీవారిని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, డీఆర్డీవో డైరెక్టర్ ఆఫ్ జనరల్ విక్రమసింహ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల (పర్యావరణ హిత సంచుల) విక్రయ కేంద్రాన్ని సతీష్‌రెడ్డి, టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న, పశువులకు ప్రాణసంకటంగా మారిన ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ కవర్లను డీఆర్డీవో రూపొందించిందన్నారు. మొక్కజొన్న వ్యర్థాలతో తయారయ్యే ఈ సంచుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ కవర్లను పశువులు తిన్నా ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఇవి 90 రోజుల్లోనే పూర్తిగా భూమిలో కలసిపోతాయని చెప్పారు. -
స్టార్టప్స్‌కు ఆర్థిక సాయం అందిస్తాం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు)/గోపాలపట్నం (విశాఖ పశి్చమ): రక్షణ రంగానికి ఎదురవుతోన్న అనేక సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు చూపే స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ కేంద్రాలకు ఆర్థిక సహకారం అందిస్తామని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ సతీష్‌రెడ్డి తెలిపారు. ఒక్కో సమస్యకు రూ.కోటి వరకు అందించే వెసులుబాటు తమకు ఉందన్నారు. ఈ దిశగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో నెలకొల్పుతున్న ఇంక్యుబేషన్ కేంద్రం దృష్టిసారించాలని సూచించారు. శుక్రవారం సతీష్‌రెడ్డి ఏయూని సందర్శించి ఆచార్యులతో సమావేశమయ్యారు. ముందుగా వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. తర్వాత ఆచార్యులతో మాట్లాడుతూ.. రక్షణ రంగ పరిశోధనలకు సంబంధించి ఏయూతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఏయూలో ఏర్పాటవుతున్న ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీ.. మైసూరులోని డీఆర్డీవో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీతో మౌలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని ఆహా్వనించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సైతం పరిశోధన భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బెంగళూరు, ఢిల్లీల్లో ఉన్న తమ ప్రయోగశాలల్లో కలసి పనిచేస్తూ తగిన పరిష్కారాలు చూపాలన్నారు. డిఫెన్స్ టెక్నాలజీపై ఏఐసీటీఈ సహకారంతో పలు ఎంటెక్ కోర్సులను నిర్వహిస్తున్నామని.. వీటిని ఏయూలోనూ ప్రవేశపెట్టాలని కోరారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు విద్యార్థులకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే విధంగా వర్సిటీ ఆచార్యులకు తమ ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి.. వర్సిటీ ఆచార్యులు చేస్తోన్న రక్షణ రంగ పరిశోధన ప్రాజెక్టుల వివరాలు, వాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సతీష్‌రెడ్డిని వర్సిటీ తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి.హరిప్రసాద్, డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ కామత్ తదితరులు పాల్గొన్నారు. స్వయం ప్రతిపత్తిని సాధించాలి.. కాగా, స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు నేవల్ సైన్స్ టెక్నాలజీ లే»ొరేటరీ (ఎన్ఎస్టీఎల్) కృషి చేయాలని, దిగుమతులు తగ్గించుకునేలా వృద్ధి చెందాలని సతీష్‌రెడ్డి సూచించారు. విశాఖ మానసి ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన ఎన్ఎస్టీఎల్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీఎల్ రూపొందించిన హైపవర్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని పుణేకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) సంస్థకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను సతీష్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వాయుసేనకు అందుబాటులో అధునాతన చాఫ్ టెక్నాలజీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు శత్రు రాడార్ పరిధి నుంచి రక్షించుకొనేందుకు చాఫ్ టెక్నాలజీని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. జోధ్‌పూర్‌లోని డీఆర్డీఓ డిఫెన్స్ ల్యాబొరేటరీ, పుణేలోని డీఆర్డీఓ ప్రయోగశాలలు సంయుక్తంగా ఐఏఎఫ్ అవసరాలకు అనుగుణంగా ‘అధునాతన చాఫ్ మెటీరియల్, చాఫ్ క్యాట్రిడ్జ్–118/ఐ’ను అభివృద్ధి చేసింది. శత్రువులు ప్రయోగించే రాడార్ నిర్దేశిత మిస్సైల్స్‌ను ఇది తప్పుదోవ పట్టిస్తుంది. తద్వారా వాయుసేన విమానాలకు ముప్పు తప్పుతుంది. చాఫ్ అనేది యుద్ధ విమానాలను శత్రు రాడార్ నుండి రక్షించడానికి ఉపయోగించే ఒక క్లిష్టమైన రక్షణ సాంకేతికత అని రక్షణశాఖ తెలిపింది. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతల్లో ‘ఆత్మ నిర్భర్ భారత్’ దిశగా డీఆర్డీఓ మరొక అడుగు ముందుకేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడానికి సహకరించిన రక్షణ శాఖ ఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి బృందాలను రాజ్‌నాథ్ అభినందించారు. -
యుద్ధ విమానాల కోసం సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
శత్రు రాడర్ల నుంచి భారత వైమానిక దళం(ఐఎఎఫ్) యుద్ధ విమానాలను రక్షించడం కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) అధునాతన చాఫ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ(హెచ్ఈఎంఆర్ఎల్) సహకారంతో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని డీఆర్డీఓ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. భారత యుద్ధ విమానాలు ఆకాశంలో ప్రయాణించేటప్పుడు శత్రువుల మిసైల్స్ ను తప్పుదోవ పట్టించడానికి ఈ టెక్నాలజీ ఒక డెకాయ్ గా పనిచేస్తుంది. ఇప్పటికే విజయవంతంగా యూజర్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ టెక్నాలజీ వినియోగించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపింది. (చదవండి: టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు) ప్రస్తుత ఆధునిక రాడార్ టెక్నాలజీ కాలంలో మన యుద్ద విమానాలను రక్షించడానికి ఇలాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. ఈ క్రిటికల్ టెక్నాలజీని స్వదేశీ అభివృద్ధి కోసం తయారు చేసిన డీఆర్డీఓ, ఐఎఎఫ్ & విమానయాన పరిశ్రమను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది ఆత్మనీర్భర్ భారత్ దిశగా మరో ముందు అడుగు అని అన్నారు. ఐఎఎఫ్ ను మరింత బలోపేతం చేసే ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు రక్షణ శాఖ కార్యదర్శి ఆర్ అండ్ డీ, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ.సతీష్ రెడ్డి బృందాలను అభినందించారు. ఆధునిక రాడార్ టెక్నాలజీ పురోగతి చెందటంతో యుద్ధ విమానాల మనుగడ ప్రధాన ఆందోళన కలిగిస్తోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఎయిర్ క్రాఫ్ట్ మనుగడ కోసం ఇన్ ఫ్రారెడ్ & రాడార్ టెక్నాలజీ నుంచి తప్పించుకోవడానికి కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సీస్టమ్ (సీఎమ్ డీఎస్) ఉపయోగపడుతుంది అని అన్నారు. -
'నిర్ణయ్' క్షిపణి ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ రూపొందించిన బూస్టర్ ఇంజిన్ అమర్చిన 'నిర్భయ్' క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న పరీక్ష కేంద్రం నుంచి క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బుధవారం ప్రకటించింది. ఈ క్షిపణి 1000 కిమీల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేధించగలదు. బుధవారం ఉదయం పదింటికి క్షిపణిని ప్రయోగించగా 15 నిమిషాలపాటు గాల్లో దూసుకెళ్లి 100 కి.మీ.ల దూరంలోని నిర్దేశత లక్ష్యాన్ని ధ్వంసం చేసిందని డీఆర్డీవో పేర్కొంది. ' 'నిర్భయ్' ప్రాజెక్టు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒక దశలో ఏకంగా ఈ ప్రాజెక్టునే పక్కనపెట్టేయాలని రక్షణ శాఖ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల లేమి, పలు సాంకేతిక సమస్యలు ఇందుకు కారణాలయ్యాయి.. ఇటీవల గత ఏడాది అక్టోబర్‌లో సైతం క్షిపణిని ప్రయోగించాక ఎనిమిది నిమిషాల తర్వాత పరీక్షను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇన్ని అడ్డంకుల్ని తట్టుకుని తాజా పరీక్షలో 'నిర్భయ్' తన సత్తా చాటింది. పరీక్ష విజయవంతమవడంతో వీలైనంత త్వరగా సైన్యానికి అందించేలా దీన్ని సంసిద్ధం చేయాలని డీఆర్డీవో భావిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్‌లో సైన్యంలోకి తీసుకున్నాక చైనా సరిహద్దుల్లో దీన్ని మోహరించే వ్రతిపాదనలూ ఉన్నాయి. భూతల లక్ష్యాలను చేధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రయోగించే. క్రూయిజ్ క్షిపణి రకానికి చెందిన “నిర్భయ్” ఏకంగా 800 కేజీల పేలుడు పదార్దాలను మోసుకుపోగలదు. దాదాపు 0.7 మ్యాక్ స్పీడ్‌తో ఇది ప్రయాణిస్తుంది. అరు మీటర్ల పోడవు, 0.52 మీటర్ వెడల్పుండే ఈ క్షిపణిని గగనతల, సముద్ర, భూతలాల నుంచి ప్రయోగించవచ్చు. తొలి దశలో ఘన ఇంధనాన్ని తర్వాత ద్రవ ఇంధనాన్ని వాడుకునే మిస్సైల్ ఇది. జలాంతర్భాగంలో ప్రయాణించడంతోపాటు, అత్యంత తక్కువ ఎత్తుల్లో ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో దీని జాడను శత్రు దేశాల రాడార్లు పసిగట్టలేవు. -
డ్రోన్ విధ్వంసక వ్యవస్థ త్వరలోనే సైన్యానికి..
భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి రానుంది. డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. సాక్షి, అమరావతి: శత్రు దేశాలు, ఉగ్రవాద సంస్థలు, అసాంఘిక శక్తులు ప్రయోగించే డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేసే పరిజ్ఞానాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేసిందని సంస్థ చైర్మన్ జి. సతీశ్‌రెడ్డి వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలకు దీటుగా అభివృద్ధి సాధిస్తోందని ఆయన చెప్పారు. భారత సైన్యం, ఇతర భద్రతా దళాలకు ఈ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్రోన్ విధ్వంసక వ్యవస్థతోపాటు రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతున్న తీరును ఇలా వివరించారు.. ►డ్రోన్లను గుర్తించడం, జామ్ చేయడం, ధ్వంసం చేయడం కోసం రూపొందించిన పరిజ్ఞానాన్ని విజయవంతంగా పరీక్షించి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రదర్శించాం. ►ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు అందించాం. మరికొన్ని పరిశ్రమలకు కూడా త్వరలో అందించి వాటి ద్వారా డ్రోన్ విధ్వంసక వ్యవస్థ ఉత్పత్తిని చేపడతాం. ►టీటీడీతో సహా ఎవరైనా సరే ఆ పరిశ్రమల నుంచి డ్రోన్ విధ్వంసక టెక్నాలజీని కొనుగోలు చేసి అవసరమైనచోట్ల నెలకొల్పుకోవచ్చు. టాప్ ఫైవ్‌లో భారత్ ►రక్షణ రంగంలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించి ప్రపంచంలోనే మొదటి ఐదు అగ్రరాజ్యాల జాబితాలో స్థానం సాధించింది. ►బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగి ఉన్న నాలుగు దేశాల్లో భారత్ ఒకటి. ►అత్యాధునిక తేజస్ యుద్ధ విమానాలను రూపొందించిన ఆరు దేశాల్లో మన దేశం ఉంది. ►అణు ట్యాంకర్లు కలిగిన ఏడు దేశాల్లో భారత్ ఉంది. ►క్షిపణి విధ్వంసకర వ్యవస్థను అభివృద్ధి చేసిన ఆరు దేశాల్లో భారత్‌కు చోటు దక్కింది. ►ఉపగ్రహాలను న్యూట్రలైజ్ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగిన నాలుగు దేశాల్లో భారత్ కూడా ఉండటం గర్వకారణం. ►ప్రపంచంలోనే అత్యంత దూరంలోని అంటే 48 వేల కి.మీ. వరకు షెల్స్ ప్రయోగించే 155 ఎంఎం గన్ను రూపొందించాం. ►దేశంలో 2 వేల ప్రధాన పరిశ్రమలతోపాటు మొత్తం 11వేల పరిశ్రమలు రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. ►రాబోయే ఐదారేళ్లలో రక్షణ రంగంలో దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం.. అగ్రరాజ్యాలకు దీటుగా నిలబడాలన్నదే ప్రస్తుత లక్ష్యం. ►కృష్ణాజిల్లాలోని నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం దేశంలో కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం, డీఆర్డీఓ పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని సతీశ్‌రెడ్డి చెప్పారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ప్రతి జిల్లాలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతుండటంతోపాటు లిక్విడ్ ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ట్యాంకర్లను సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. కరోనాను అరికట్టేందుకు మొత్తం 75 రకాల ఉత్పత్తులను కనిపెట్టడంతోపాటు 190 రకాల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. -
తిరుమలలో యాంటీ డ్రోన్ అటాక్ మిషన్లు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంపై డ్రోన్ల సంచారం, దాడిని ఎదుర్కొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యాంటీ డ్రోన్ ఎటాక్ మిషనరీని సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. మిషనరీ కొనుగోళ్లకు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. తిరుమలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఇప్పటికే పలుమార్లు నిఘా సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక స్థలాలపై డ్రోన్లతో దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో టీటీడీ ఆ మేరకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఈ విషయమై టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గోపీనాథ్‌జెట్టి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కౌంటర్ డ్రోన్ టెక్నాలజీపై ఇటీవల డీఆర్డీవో, బీహెచ్ఈఎల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి టీటీడీ తరఫున హాజరయ్యామని చెప్పారు. భవిష్యత్తులో డ్రోన్ల దాడిని తిప్పికొట్టగలిగే సామర్థ్యాన్ని టీటీడీ సమకూర్చుకునే క్రమంలో భాగంగానే తిరుమలలో సైట్ సర్వే చేయాల్సిందిగా డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అధికారులకు ప్రతిపాదన పంపామని చెప్పారు. -
డీఆర్డీవో చేపట్టిన ఆకాష్ మిసైల్ ప్రయోగం విజయవంతం
భూ ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం ఆకాష్ మిసైల్‌ను బుధవారం రోజున డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఒడిషా తీరాన ఉన్నఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ప్రయోగించారు. మిసైల్‌కు సంబంధించిన ఫ్లైట్ డేటా ప్రకారం టెస్ట్ విజయవంతమైందని డీఆర్డీవో నిర్థారించింది.ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రాడార్, టెలిమెట్రీ వంటి అనేక పర్యవేక్షణ విధానాలను టెస్ట్‌రేంజ్‌లో ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 12 . 45 నిమిషాలకు ఆకాష్ మిసైల్‌ను పరిక్షించినట్లు పేర్కొంది. కొత్తగా అప్డేట్ చేసిన ఈ మిసైట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నలక్ష్యాలను మాక్ 2.5 వేగంతో ఛేదించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కొత్త క్షిపణి వ్యవస్థను హైదరాబాద్‌కు చెందిన డీఆర్డీవో ల్యాబ్ అభివృద్ధి చేసింది. ఆకాష్-ఎన్జీ క్షిపణి ఆయుధ వ్యవస్థతో భారత వైమానిక దళానికి మరింత బలం చేకూరతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించినందుకుగాను డీఆర్డీవో, భారత వైమానిక దళం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలను తెలిపారు. -
చెన్నై, బెంగళూరులలో అప్రెంటిస్ ఖాళీలు
బెంగళూరులోని భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) ప్రధాన కార్యాలయం.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 43 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–13, డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్‌లు–10, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసెస్–20. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ. అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా.. సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► డిప్లొమా(టెక్నీషియన్) అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసెస్: అర్హత: 60శాతం మార్కులకు తగ్గకుండా కమర్షియల్ ప్రాక్టీసెస్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► 2018, 2019, 2020, 2021లో ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో సాధించిన అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ పంపిస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ► ఈమెయిల్: hqapprentice@isro.gov.in ► వెబ్సైట్: www.mhrdnats.gov.in డీఆర్డీఓ, సీవీఆర్‌డీఈలో 57 అప్రెంటిస్‌లు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని అవడిలో ఉన్న డీఆర్డీఓ –కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 57 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–31, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–26. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, లైబ్రరీ సైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్: విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషనల్, మెకానికల్ ఇంజనీరింగ్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల రిజిస్టర్డ్ ఈమెయిల్‌కి సందేశాలు పంపుతారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021 » సీవీఆర్డీఈ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021 ► వెబ్సైట్: www.mhrdnats.gov.in -
2-డీజీ కోసం డీఆర్డీఓతో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఒప్పందం
భారతదేశంలో 2 - డీయోక్సీ-డీ-గ్లూకోజ్(2-డీజీ) తయారీ, పంపిణీ కోసం ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్.. డీఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్‌డీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డీఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) సంస్థలతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఈ రోజు ప్రకటించింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీకి దేశంలో మార్కెటింగ్ కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చేరిన బాధితులు త్వరగా కోలుకోవడానికి, ఆక్సిజన్‌పై ఆధారపడడాన్ని తగ్గించడానికి 2-డీజీ యాంటీ–కోవిడ్ డ్రగ్ ఉపయోగపడుతుంది. ఎంఎస్ఎన్ ల్యాబ్‌లు 2-డీజీని రోజుకు రెండుసార్లు సాచెట్ రూపంలో 2.34 గ్రాముల శక్తితో ఎంఎస్ఎన్ 2డీ బ్రాండ్ పేరుతో విడుదల చేయనున్నాయి. కరోనా చికిత్సలలో భాగంగా, ఎంఎస్ఎన్ ఇప్పటికే ‘‘OSELOW’’ బ్రాండ్ పేరుతో ఒసెల్టామివిర్ క్యాప్సూల్స్ వంటి ఇతర యాంటీ-వైరల్ ఔషధాలను విడుదల చేసింది. 'ఫావిలో' బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ వంటి యాంటీ కోవిడ్ మందులు, 'బారిడోజ్' బ్రాండ్ పేరుతో బారిసిటినిబ్, పోసాకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మందులను 'పోసాన్' బ్రాండ్ పేరుతో తీసుకొచ్చింది. -
డిఫెన్స్ టెక్నాలజీలో రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ: డిఫెన్స్ టెక్నాలజీలో కొత్తగా రెగ్యులర్ ఎంటెక్ ప్రోగ్రామ్‌ను డీఆర్డీఓ, ఏఐసీటీఈ సంయుక్తంగా ప్రారంభించాయి. డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డి, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి.సహస్రబుద్ధి గురువారం వర్చువల్‌గా ఈ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. రక్షణ సాంకేతిక రంగంలో అభ్యర్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ కొత్త కోర్సు పునాది వేస్తుందని నిపుణులు సూచించారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. కోర్సు నిర్వహణకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ సైంటిస్ట్స్ టెక్నాలజిస్ట్స్(ఐడీఎస్‌టీ) సహకారం అందించనుంది. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో అభ్యసించవచ్చు. ఇందులో కాంబాట్ టెక్నాలజీ, ఏరో టెక్నాలజీ, నావల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సెన్సార్స్, డైరెక్టెడ్ ఎనర్జీ టెక్నాలజీ, హై ఎనర్జీ మెటీరియల్స్ టెక్నాలజీ అనే ఆరు విభాగాలు ఉంటాయి. -
డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్
కొద్ది రోజుల క్రితం జమ్ము ఎయిర్‌బేస్‌పై డ్రోన్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే, భవిష్యత్ కాలంలో డ్రోన్ల ద్వారా దాడి ఎక్కువ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయిల్ తరహా "ఐరన్ డోమ్" వ్యవస్థ రూపొందించాలని దేశంలోని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డ్రోన్ల దాడులను నివారించేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. డీ-4 యాంటీ డ్రోన్ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు. డీఆర్డీఓలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జిల్లెలమూడి మంజుల తెలిపిన వివరాల ప్రకారం.. "డీ-4 డ్రోన్ వ్యవస్థ ఆదివారం జమ్మూలో జరిగిన డ్రోన్ దాడులను ఇది గుర్తించగలదు. 4 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించి వాటిపై దాడి చేస్తుంది. అత్యంత దుర్బల ప్రదేశాలపై దాడి చేసే అవకాశం ఉన్న రోగ్ డ్రోన్లను గుర్తించి నాశనం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. రోగ్ డ్రోన్లను నాశనం చేయడానికి ఈ వ్యవస్థలో బహుళ సెన్సార్లు, రెండు వేర్వేరు విధ్వంసకర పరికరాలు ఉన్నట్లు" ఆమె తెలిపారు. డి-4 డ్రోన్ వ్యవస్థ ద్వారా శత్రు డ్రోన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ జామ్ చేయడంతో పాటు, మైక్రో డ్రోన్ల హార్డ్ వేర్ నాశనం చేయగలదని డాక్టర్ మంజుల తెలిపారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భద్రత కోసం ఈ డి-4 డ్రోన్ వ్యవస్థను ఉపయోగించారు. డి-4 డ్రోన్ వ్యవస్థతో ప్రమాదకర డ్రోన్ల ఉనికిని త్వరగా గుర్తించి ధ్వంసం చేయడం ద్వారా వాటి దాడుల నుంచి ప్రముఖ ప్రాంతాలను రక్షించుకోవచ్చని ఆమె వివరించారు. చదవండి: ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ -
Agni-Prime: భారత దేశ సరికొత్త ఆయుధం ఇదే!
‘‘పిట్ట కొంచెం.. కూత ఘనం’’ ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ ద్వీపంలో సోమవారం... నిప్పులు చిమ్ముకుంటూ పైకెగసిన క్షిపణి ‘‘అగ్ని–ప్రైమ్’’... ఈ సామెతకు ప్రత్యక్ష ఉదాహరణ. చిన్న సైజులో ఉండటం మాత్రమే దీని విశేషం కాదు... అత్యాధునిక టెక్నాలజీలు నింపుకుని... తొలి అగ్ని క్షిపణికి రెట్టింపు దూరపు లక్ష్యాలనూ తుత్తునియలు చేయగలదు!! భారత రక్షణ తూణీరపు సరికొత్త ఆయుధం కూడా ఇదే!! భారతదేశం తనకంటూ సొంతంగా క్షిపణులు ఉండాలని 1980లలోనే భావించి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలామ్ నేతృత్వంలో మొదలైన ఈ కార్యక్రమం తొలి ఫలం ‘‘అగ్ని’’. సుమారు 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణి తరువాత దశల వారీగా మరిన్ని అగ్ని శ్రేణి క్షిపణుల తయారీ జరిగింది. అయితే, ఆ కాలం నాటి టెక్నాలజీలతో పనిచేసే క్షిపణులను ఈ 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చుకోవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఐదేళ్ల క్రితం చెప్పుకున్న సంకల్పానికి అనుగుణంగానే సరికొత్త అగ్ని–ప్రైమ్ సిద్ధమైంది. ఇరుగుపొరుగు దేశాలతో ముప్పు ఏటికేడు పెరిగిపోతున్న నేపథ్యంలో అణ్వస్త్రాలను కూడా మోసుకెళ్లగల అగ్ని–ప్రైమ్ మన అమ్ముల పొదిలోకి చేరడం విశేషం. తొలి తరం అగ్ని పరిధి 1,000 కిలోమీటర్ల లోపు కాగా.. అగ్ని–ప్రైమ్ సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా అత్యంత కచ్చితత్వంతో మట్టుబెట్టగలదు. ఇంకోలా చెప్పాలంటే తొలి తరం అగ్ని క్షిపణి పాకిస్తాన్‌ను దృష్టిలో ఉంచుకుని తయారైతే.. అగ్ని–ప్రైమ్ కొత్త శత్రువు కోసం సిద్ధం చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే.. 2,000 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటే.. చైనా మధ్యలో ఉండే లక్ష్యాన్ని కూడా ఢీకొట్టవచ్చు. కొంగొత్త టెక్నాలజీలు... అగ్ని శ్రేణి క్షిపణుల ఆధునీకరణకు 2016లోనే బీజం పడింది. ఇందులో భాగంగా సిద్ధమైన అగ్ని–ప్రైమ్‌లో అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల్లో వాడిన టెక్నాలజీలను ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ స్థాయి క్షిపణుల్లో ఈ టెక్నాలజీల వాడకం ప్రపంచంలో మరెక్కడా జరగలేదని డీఆర్డీవో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. రెండు దశల అగ్ని–ప్రైమ్‌లో పూర్తిస్థాయిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దాదాపు వెయ్యి కిలోల అణ్వస్త్రాలను సులువుగా మోసుకెళ్లగలదు. రెండు దశల్లోనూ మిశ్రధాతువులతో తయారైన రాకెట్ మోటార్లను ఉపయోగిస్తున్నారు. క్షిపణిని లక్ష్యం వైపునకు తీసుకెళ్లే గైడెన్స్ వ్యవస్థలో ప్రత్యేకమైన ఎలక్ట్రో మెకానికల్ ఆక్చుయేటర్స్ వినియోగించారు. కచ్చితత్వాన్ని సాధించేందుకు అత్యాధునిక రింగ్ లేజర్ జైరోస్కోపులు ఉంటాయి దీంట్లో. ఉక్కుతో చేసిన మోటార్ల స్థానంలో మిశ్రధాతువులను వాడటం ద్వారా సైజు, బరువు తగ్గడం, మరింత ఎక్కువ దూరం ప్రయాణించడం సాధ్యమైంది. ఎలక్ట్రో మెకానికల్ ఆక్చుయేటర్స్ కారణంగా గతంలో మాదిరిగా క్షిపణుల్లో లీకేజీల్లాంటివి ఉండవు. నావిగేషన్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా లక్ష్యాన్ని ఢీకొట్టే అవకాశాలు పెరుగుతాయి. గతంలో మాదిరిగా వేర్వేరు వైమానిక వ్యవస్థల స్థానంలో పవర్ పీసీ ప్లాట్ఫార్మ్పై ఒకే ఒక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా క్షిపణిని మరింత శక్తిమంతంగా మార్చడం సాధ్యమైంది. ఈ టెక్నాలజీలన్నింటినీ 2011లో అభివృద్ధి చేసిన అగ్ని–4లో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసినవే. అగ్ని–2.... 2004లో అందుబాటు లోకి వచ్చింది. మధ్య శ్రేణి క్షిపణి. 20 మీటర్ల పొడవు, 2.3 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో దీని బరువు 16 వేల కిలోలు. వెయ్యి కిలోల అణ్వస్త్రాన్ని క్షిపణిని మోసుకెళ్లగలదు. దీని పేలుడు హిరోషిమా, నాగసాకీ అణు బాంబుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అంచనా. లక్ష్యాన్ని కేవలం 40 మీటర్ల తేడాలో ఢీకొట్టగలదు. పేలుడు పదార్థం బరువును తగ్గిస్తే ఈ క్షిపణి పరిధిని మరింతగా పెంచవచ్చు. అగ్ని –3... మూడు వేల నుంచి ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు అభివృద్ధి చేసిన క్షిపణి ఇది. బీజింగ్, షాంఘైలనూ ఢీకొట్టగలదు. దాదాపు 16.7 మీటర్ల పొడవు, 1.85 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రయోగించే సమయంలో బరువు 48,000 కిలోలు. రెండు వేల కిలోల బరువున్న అణ్వాస్త్రాన్ని మోసుకెళ్లగలదు. కొన్నింటిలో ఒకే రాకెట్ ద్వారా వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టగల మల్టిపుల్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్స్ టెక్నాలజీని అమర్చుకోవచ్చు. ఈ టెక్నాలజీతో ఒకే రాకెట్‌ను ఉపయోగించి వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టవచ్చు నన్నమాట. 2011 నుంచి దేశసేవకు అందుబాటులో ఉంది. అగ్ని–4... నుంచి అందుబాటులో ఉన్న అగ్ని–4 పరిధి 3,500– 4,000 కిలోమీటర్లు. ఇరవై నుంచి 45 కిలోటన్నుల పేలుడు సామర్థ్యమున్న ఫిషన్ అణ్వాయుధాన్ని, 200– 300 కిలోటన్నుల సామర్థ్యం ఉన్న ఫ్యూజన్ బాంబును మోసుకెళ్లగలదు. ఇరవై మీటర్ల పొడవుండే రెండు దశల ఘన ఇంధనపు క్షిపణి ప్రయోగ సమయంలో 17,000 కిలోల బరువు ఉంటుంది. అగ్ని – 5 2018 డిసెంబర్లో విజయవంతంగా ఏడో పరీక్ష ముగించుకున్న అగ్ని –5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా పది మీటర్ల తేడాతో ఢీకొట్టగలదు. దీని పరిధి అనధికారికంగా 8 వేల కిలోమీటర్లపై మాటే అని అంచనా. వేర్వేరు లక్ష్యాలను ఛేదించేందుకు ఎంఆర్ఐవీ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దీంట్లో. అవసరాన్ని బట్టి రెండు నుంచి పది వేర్వేరు లక్ష్యాలను ఢీకొట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. దాదాపు 1,500 కిలోల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. – సాక్షి, హైదరాబాద్. -
ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ
ఉగ్రవాద మహమ్మారి ఎక్కడ, ఎప్పుడు విరుచుకుపడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇన్నాళ్లూ నగరాల్లోని జనసమ్మర్థం వున్న ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడటం, భద్రతా దళాలపై పొంచివుండి దాడులు చేయడం వంటి పనులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు తొలిసారి డ్రోన్లు ఉపయోగించి బాంబు పేలుళ్లు జరిపారు. ఆదివారం జమ్మూ విమానాశ్రయం ఆవరణలో వున్న వైమానిక దళ స్థావరంపై వారు డ్రోన్లతో చేసిన బాంబు దాడి తీవ్రత పెద్దగా లేకపోవచ్చు. వైమానిక దళ సిబ్బందిలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావటం, ఒక భవనం పైకప్పు ధ్వంసం కావడం మినహా పెనునష్టం జరిగి వుండకపోవచ్చు. కానీ కాటేయడానికి వారు కొత్త మార్గం ఎంచుకున్నారని, మన భద్రతా బలగాలు ఇకపై ఈ బెడదను కూడా ఎదుర్కొనక తప్పదని ఈ దాడి నిరూపించింది. వైమానిక స్థావరంపై దాడి జరిగిన మరికొన్ని గంటలకు జమ్మూలోనే మరో సైనిక ప్రాంతంపై ఇలాంటి దాడికే ఉగ్రవాదులు తెగబడ్డారు. అయితే వెంటనే క్విక్ రియాక్షన్ టీం సభ్యులు అప్రమత్తం కావటంతో ఆ రెండు డ్రోన్లూ తప్పించుకున్నాయి. వాస్తవానికి వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడిలో ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్టయితే భారీ నష్టం వాటిల్లేది. ఎందుకంటే అక్కడి హ్యాంగర్‌లో యుద్ధ విమానాలు, ఎంఐ 17 హెలికాప్టర్లు, డోన్లు ఉన్నాయి. పైగా ఆ స్థావరానికి దగ్గరలో నివాస ప్రాంతా లున్నాయి. డ్రోన్ల ద్వారా ప్రయోగించిన పేలుడు పదార్థాలు అక్కడ జారవిడిచివుంటే జన నష్టం అధికంగా వుండేది. ఉగ్రవాదులు, ఇతర రాజ్యేతర శక్తులూ డ్రోన్ల ద్వారా దాడి చేసే ప్రమాదం వున్నదని కొంత కాలంగా నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. తాజా దాడి వెనక ఏ సంస్థ హస్తం ఉందో, ఇందులో ఇంటి దొంగల ప్రమేయం ఏపాటో దర్యాప్తులో తేలుతుంది. సాధారణంగా సైనిక స్థావరాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో వుంటాయి. చుట్టూ భారీ కుడ్యాలు, వాటిపై విద్యుత్ తీగలు, చాలా దూరం నుంచే శత్రువుల కదలికలు తెలిసేలా నిఘా వగైరాలుంటాయి. వైమానిక, హెలికాప్టర్ దాడులు జరగకుండా రాడార్ వ్యవస్థ ఉ#ంటుంది. కానీ మారిన పరిస్థితుల్లో ఇవి ఎంతమాత్రం సరిపోవని తాజా దాడి హెచ్చరించింది. గగనతలంలో ఎగిరే విమానాలనూ, హెలికాప్టర్లను పసిగట్టినంత తేలిగ్గా, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను ఈ రాడార్లు పోల్చుకోలేవు. దరిదాపు రూ. 20,000 వ్యయంతో లభించే డ్రోన్లు పటిష్ఠమైన భద్రత వుండే ప్రాంతాల్లోకి సైతం ఎలా చొచ్చుకురాగలవో, అవి ఏ స్థాయిలో నష్టం కలగజేయగలవో జమ్మూ దాడి తేటతెల్లం చేసింది. 20 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించే డ్రోన్లు మొదలుకొని వేలాది కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే సైనిక డ్రోన్లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇవి రెండురోజులు ఏకబిగిన ప్రయాణించి రాకెట్లనూ, క్షిపణులనూ కూడా మోసుకెళ్లి జారవిడవగలవని చెబుతున్నారు. ఈమధ్యకాలంలో మారు మనసు తెచ్చుకున్నట్టు కనబడుతున్న పాకిస్తాన్ ప్రమేయం లేకుండా ఈ దాడులు జరిగి వుంటాయని భావించలేం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఆంక్షల పరిధినుంచి తప్పించుకోవటానికో, అమెరికా ఒత్తిడి వల్లనో ఇటీవలకాలంలో అది తగ్గివున్నట్టు కనబడుతోంది. అధీన రేఖ వద్ద గతంలో మాదిరి మన సైన్యంపై, పౌర ప్రాంతాలపై అది కాల్పులు జరపడాన్ని విరమించుకుంది. సరిహద్దుల్లో చొరబాట్లు కూడా గణనీయంగా తగ్గి పోయాయి. అమెరికా ప్రమేయంతో భారత్, పాకిస్తాన్ల మధ్య లోపాయికారీగా జరిగిన చర్చల ఫలితంగానే ఈ మార్పు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కానీ అంతమాత్రం చేత అది వెనకటి గుణం మానుకోదు. జమ్మూ–కశ్మీర్లో సాధారణ పరిస్థితి ఏర్పడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్న సూచనలు కనబడటం పాక్‌కు ససేమిరా ఇష్టం లేదు. తమ ప్రమేయం లేకుండానే అక్కడ దాడులు జరుగుతున్నాయని ప్రపంచ దేశాలకు అభిప్రాయం కలిగిం చటమే దాని లక్ష్యం. ఇప్పుడు దాడికి ఉపయోగించిన డ్రోన్ల వంటివి సరిహద్దుల్లో గత రెండేళ్లుగా పాకిస్తాన్ వినియోగించటం, వాటి ద్వారా ఆయుధాలను, పేలుడు పదార్థాలనూ జారవిడవటం మన సైన్యానికి కొత్తగాదు. అయితే ప్రస్తుత దాడిలో తన ప్రమేయం లేదని చెప్పుకోవటానికి పాకిస్తాన్‌కు అన్ని రకాల అవకాశాలూ వున్నాయి. దాడి జరిగిన ప్రాంతం సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలోవున్నా, డ్రోన్ల కదలికలను వైమానిక దళ స్థావరం సమీప ప్రాంతంనుంచి నియంత్రించి వుండొచ్చని అంచనా. కనుక స్థానికంగా వున్నవారే దాడికి పాల్పడివుంటారని చెప్పటానికి, అమా యకత్వం నటించటానికి పాకిస్తాన్‌కు వీలుంటుంది. పాకిస్తాన్లో పేరుకు ప్రజా ప్రభుత్వం సాగు తున్నా వెనకుండి నడిపించేదంతా సైన్యమూ, దాని ప్రధాన అంగమైన ఇంటర్ సర్వీస్ ఇంటెలి జెన్స్(ఐఎస్ఐ). యెమెన్‌లో తమపై తరచు దాడులు చేస్తున్న సౌదీ అరేబియాపై కక్ష తీర్చుకునేందుకు హౌతీ తిరుగుబాటుదార్లు సౌదీలోని కీలక చమురు కేంద్రాలపైనా, చమురు సరఫరా జరిగే పైప్లైన్లపైనా దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు భారీ నష్టం కలగజేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు మన అప్రమత్తతను మరింత పెంచాలి. మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) రూపొందించిన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకోవటంతోపాటు సాధ్యమైనంత త్వరగా ఇజ్రాయెల్ సైనిక డ్రోన్లను కూడా రప్పించాలి. కొత్త సవాళ్లకు దీటైన వ్యవస్థ వేగిరం అందుబాటు లోకొస్తేనే ఉగ్రమూకల దాడులకు దీటుగా జవాబివ్వటం సాధ్యమవుతుంది. -
గుడ్ న్యూస్: 2 డీజీ సాచెట్ కమర్షియల్ లాంచ్
సాక్షి, ముంబై: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ డెల్టా ప్లస్ ప్రజలను భయపెడుతోంది. ఈ క్రమంలో దేశీయ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా చికిత్సలో ప్రభావవంతగా పనిచేస్తున్న, డీఆర్డీవో, రెడ్డీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) డ్రగ్ ఇక మార్కెట్లో లభ్యం కానుంది. సోమవారం 2డీజీ ఔషధాన్ని కమర్షియల్‌గా లాంచ్ చేసింది. దేశంలోని ప్రధాన ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ ఉత్పత్తిని సరఫరా చేయనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 99.5 శాతం సమర్ధత కలిగిన ఈ 2డీజీ సాచెట్ 990 రూపాయల వద్ద ప్రభుత్వ సంస్థలకు సబ్సిడీ రేటుతో అందించనుంది. మొదట్లో తమ ఉత్పత్తి 2డీజీ ఔషధం మెట్రో, టైర్-1 నగరాల్లోని ఆసుపత్రులలో అందుబాటులో ఉంటుందనీ, ఆతరువాత భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని అని కంపెనీ ఒక ప్రకటన తెలిపింది. దీంతో రెడ్డీస్ ఉదయం సెషన్లో షేర్ ధర ఒక శాతం ఎగిసింది. డాక్టర్ రెడ్డీస్ సహకారంతో డీఆర్డీవో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ భాగస్వామ్యంతో ఈ 2 డీజీ డ్రగ్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరిన సాధారణ నుంచి తీవ్ర లక్షణాలున్న కరోనా రోగులకు అనుబంధ చికిత్సగా దీన్ని ఉపయోగిస్తున్నారు. చదవండి : కోవిషీల్డ్‌కు గ్రీన్ పాస్ షాక్! సీరం సీఈవో భరోసా -
DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి చికిత్సలో డా.రెడ్డీస్‌తో కలిసి అభివృద్ధి చేసిన 2-డీజీ ఉత్పత్తికి సంబంధించి డీఆర్డీవో కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ డ్రగ్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఇతర ఔషధ సంస్థలకు బదిలీ చేయనుంది. ఇందుకు కంపెనీలనుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ (ఈఓఐ)ను ఆహ్వానిస్తోంది. ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని కోరింది. ఆయా కంపెనీలు దరఖాస్తులను సమర్పించడానికి జూన్ 17 చివరి తేదీగా వెల్లడించింది. పరిశ్రమలు సమర్పించిన ఈఓఐను తమ టెక్నికల్ అసెస్మెంట్ కమిటీ పరిశీలిస్తుందని వీటి ఆధారంగా 15 పరిశ్రమలకు మాత్రమే ఉత్పత్తికి అనుమతి ఉంటుందని డీఆర్డీవో స్పష్టం చేసింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్, సామర్ధ్యం, తమ సాంకేతిక హ్యాండ్‌హోల్డింగ్ సామర్ధ్యం ఆదారంగా కేటాయింపు ఉంటుందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ఆధారంగా కరోనా నివారణలో తమ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2డీజీ) ఆసుపత్రులో చేరిన రోగులు వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని, ఆక్సిజన్‌పై ఆదారపడటాన్ని కూడా తగ్గిస్తుందని డీఆర్డీవో గతంలోనే ప్రకటించినసంగతి తెలిసిందే. ఈ మందు తయారీకి బిడ్డర్లకు డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీలనుండి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్ (ఏపీఐ), డబ్ల్యూహెచ్ఓ జీఎమ్‌పి (మంచి తయారీ పద్ధతులు) ధృవీకరణ తయారీకి డ్రగ్ లైసెన్స్ ఉండాలి. కాగా వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనావైరస్ను 2డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. అలాగే కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం సమర్థంగా పనిచేస్తుందని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు. చదవండి : DRDO 2G Drug: వైరస్ రూపాంతరాలపైనా 2-డీజీ ప్రభావం! -
DRDO 2G Drug: వైరస్ రూపాంతరాలపైనా 2–డీజీ ప్రభావం!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2–డీఆక్సీ–డీ గ్లూకోజ్ (2–డీజీ) సమర్థంగా పనిచేస్తుందని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంగళవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ... కరోనా నిర్వహణలో 2–డీజీ కీలకం అవుతుందని ఆయన పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో 2–డీజి సామర్థ్యాన్ని గుర్తించిన తర్వాతే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ మందు అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసిందని చెప్పారు. అదే విధంగా... మధ్యమ స్థాయి లక్షణాలున్న కోవిడ్ రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వివరించారు. మానవ ప్రయోగాల్లో ఇది 65 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న రోగుల్లోనూ సమర్థంగా పని చేసిందని తెలిపారు. గతే డాది ఏప్రిల్‌లో తాము సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సాయంతో ఈ మందుపై పరిశోధనలు ప్రారంభించామని చెప్పారు. 2–డీజీ పనితీరు వినూత్నం: సతీశ్‌రెడ్డి వినూత్నమైన పనితీరు కారణంగానే కరోనా వైరస్‌ను 2–డీజీ సమర్థంగా నిరోధించ గలుగుతోందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ఈ మందు తయారీ, పంపిణీ సులువుగా ఉంటుందన్నారు. 2–డీజీపై జరిగిన పరిశోధనలు అది సురక్షితమైందేనన్న విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు రమాకాంత్ ఇన్నాని, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నతాధికారి దీపక్ సప్రా, హెల్త్‌కేర్ కమిటీ చైర్ పర్సన్ శేఖర్ అగర్వాల్ వెబినార్‌లో పాల్గొన్నారు. చదవండి: బరువు తక్కువ.. పవరెక్కువ.. ప్రపంచాన్ని వణికిస్తోంది 3 కిలోల కరోనా! -
డీఆర్డీఓ 2-డీజీ డ్రగ్ ఎవరు వాడాలి? ఎవరు వాడొద్దు?
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నిరోధానికి డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్) డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఎవరెవరికీ డ్రగ్ వేయాలి.. వేయకూడదో స్పష్టం చెప్పింది. కోవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించినట్టు గుర్తు చేసింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని సూచించింది. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చు అని పేర్కొంది. అయితే ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది. నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ, శ్వాసకోస, హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలు ఉన్నవారిపై ఈ డ్రగ్‌ను పరీక్షించలేదని, అలాంటివారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అని డీఆర్డీఓ సూచించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదు అని డీఆర్డీఓ స్పష్టంగా పేర్కొంది. రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించవచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సరఫరాకు విజ్ఞప్తి చేయవచ్చు. డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. చదవండి: మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్ విడుదల చదవండి: 2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్ -
డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ
-
డీఆర్డీవో, హైదరాబాద్‌లో జేఆర్ఎఫ్ ఖాళీలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్డీఎల్).. జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 10 ► విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికిల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ► జేఆర్ఎఫ్ (మెకానికల్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ /ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత సాధించాలి. ► జేఆర్ఎఫ్ (ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్ అర్హత సాధించాలి. ► వయసు: 28 ఏళ్లు మించకూడదు. స్టైపెండ్: నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు. ► రీసెర్చ్ కాలవ్యవధి: రెండేళ్లు. ► ఎంపిక విధానం: గ్రాడ్యుయేషన్‌లో మార్కులు, గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్), ఏపీజే.అబ్దుల్‌కలాం, మిసైల్ కాంప్లెక్స్, కంచన్‌బాగ్ పీవో, హైదరాబాద్–500058 చిరునామాకు పంపించాలి. ► ఇంటర్వ్యూ వేదిక: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్డీఎల్), ఏపీజే.అబ్దుల్‌కలాం, మిసైల్ కాంప్లెక్స్, కంచన్‌బాగ్ పీవో, హైదరాబాద్–500058. ► దరఖాస్తులకు చివరి తేది: 14.06.2021 ► వెబ్సైట్: www.drdo.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురంలో టీచర్ పోస్టులు ఎయిమ్స్, భువనేశ్వర్‌లో 90 సీనియర్ రెసిడెంట్ పోస్టులు -
DRDO రూపొందించిన 2DG సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్
-
2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్
సాక్షి, హైదరాబాద్: డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. కరోనా చికిత్సలో 2-డీజీ సాచెట్ అద్భుతంగా పని చేస్తుందన్ని డీఆర్డీవో తెలిపింది. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’ ఔషధాన్నిడాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విదితమే. ముందుగా 10వేల సాచెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే. 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. చదవండి: భారత్: మరోసారి 2 లక్షలకు దిగువన కరోనా కేసులు Corona Vaccine: మిక్స్ చేస్తే పర్లేదా! -
కరోనా: మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్ విడుదల
సాక్షి,హైదరాబాద్: కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’ ఔషధాన్నిడాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా 10వేల సాచెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే. 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. చదవండి: డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం -
డీఆర్డీవో మందుల కొనుగోలు
సాక్షి, అమరావతి: కోవిడ్–19 చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన మందులు కొనుగోలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా శనివారం జరిగే కొనుగోలు కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. మంగళగిరిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాల నిమిత్తం మే నెలలో 13,41,700 కోవిషీల్డ్ డోసులను, 3,43,930 కోవాగ్జిన్ డోసులను సొంతంగా కొనుగోలు చేశామని తెలిపారు. మే నెలలో 16.85 లక్షల డోసులు, జూన్ నెలకు సంబంధించి 14.86 డోసులు కలిపి మొత్తం 31.71 లక్షల డోసులు కొనుగోలు చేశామని వివరించారు. ఆయుర్వేద మందు ఫలితాలపై శాస్త్రీయ అధ్యయనం కృష్ణపట్నం ఆయుర్వేద మందు శాస్త్రీయతపై పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్రస్థాయి అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని సింఘాల్ చెప్పారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు కృష్ణపట్నం వెళ్లి అక్కడి వారితో మాట్లాడటమే కాకుండా ఆయుర్వేద మందును హైదరాబాద్‌లోని ల్యాబ్‌లో పరీక్షలు కూడా చేయించారన్నారు. ఇందులో నష్టం కలిగించే వివరాలు తెలియరాలేదన్నారు. ప్రజలు నమ్ముతున్నా.. సైంటిఫిక్‌గా రుజువు కావాల్సి ఉందన్నారు. ఆయుష్ కమిషనర్, కొందరు సాంకేతిక అధికారులు ప్రస్తుతం కృష్ణపట్నంలోనే ఉన్నారని, మందును వినియోగించిన కరోనా బాధితులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని రాష్ట్ర అధికారులకు శనివారం స్థానిక తయారీదారులు వివరిస్తారన్నారు. విజయవాడలో ఉన్న ఆయుర్వేద విభాగం ప్రాంతీయ అధికారులు కొందరు సోమవారం కృష్ణపట్నం వెళ్లి శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన జరుపుతారని చెప్పారు. ఆ తరువాతే దీని ఫలితాలపై అవగాహన వస్తుందన్నారు. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగం రాష్ట్రవ్యాప్తంగా 6,408 ఐసీయూ బెడ్లు ఉండగా.. 5,889 కరోనా బాధితులతో నిండాయని తెలిపారు. ఆక్సిజన్ బెట్లు 23,876 బెడ్లు ఉండగా.. 22,492 బెడ్లు రోగులతో నిండాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో 18 వేల మంది చికిత్స పొందుతున్నారన్నారు. రోజువారీ కేటాయింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గడచిన 24 గంటల్లో 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగించుకున్నట్టు తెలిపారు. గడచిన 24 గంటల్లో ప్రభుత్వాస్పత్రుల్లో 24,352, ప్రైవేట్ ఆస్పత్రులకు 16,713 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు సరఫరా చేశామన్నారు. 10 రోజుల క్రితం వరకు కాల్ సెంటర్‌కు 18 వేల ఫోన్ కాల్స్ వరకూ వచ్చేవని, ఇపుడా సంఖ్య తగ్గుముఖం పట్టిందని తెలిపారు. గడచిన 24 గంటల్లో 10,919 ఫోన్ కాల్స్ రాగా.. అందులో 3,508 కాల్స్ వివిధ సమాచారాలకు సంబంధించి ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ కింద 77 శాతం మందికి ఉచిత వైద్యం కోవిడ్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాల వివరాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్షా నిర్వహించారని సింఘాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లో 38,763 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 28,189 మంది (77 శాతం) ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందుతున్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 23,03,655 మందికి రెండు వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని, 30,48,265 మందికి ఒక డోసు ఇచ్చామని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి 1,33,532 మందికి కోవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్రం నుంచి మే 15 నుంచి జూన్ 15 వరకూ 11,18,000 డోసులు రావాల్సి ఉందన్నారు. -
మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
కరోనా మహమ్మరి విజృంభిస్తున్న సమయంలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ శుభవార్త చెప్పింది. డీఆర్డీఓ ప్రయోగశాల డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్(డీఐపీఏఎస్) యాంటీబాడీ డిటెక్షన్-బేస్డ్ కిట్ 'డీప్ కోవాన్(DIPCOVAN)'ను అభివృద్ధి చేసింది. ఢిల్లీకి చెందిన వాన్గార్డ్ డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఆర్డీఓ శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ కిట్, కరోనా వైరస్ తీవ్రత, దాని న్యూక్లియోక్యాప్సైడ్ ప్రొటీన్లను అది డిటెక్ట్ చేస్తుంది. వైరస్ తీవ్రత స్థాయిని 97 నుంచి 99 శాతం వరకు ఈ కిట్ పసిగట్టగలదని డీఆర్డీఓ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం మొన్నటికి మొన్న 2డీజీ మెడిసిన్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. డీఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం.. డీప్ కోవాన్ ఇతర వ్యాధులతో ఎటువంటి క్రాస్ రియాక్టివిటీ లేకుండా శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కేవలం 75 నిమిషాల కాలంలో పరీక్ష నిర్వహించవచ్చు. ఈ కిట్ జీవిత కాలం 18 నెలలు. ఈ కిట్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) ఏప్రిల్ 2021లో ఆమోదించింది. 2021 మేలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ), ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల నుంచి అమ్మకాలు & పంపిణీ కోసం ఆమోదం పొందింది. డీప్ కోవాన్ జూన్ మొదటి వారం నుంచి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ ద్వారా వాణిజ్యపరంగా అందుబాటులో ఉంటుంది. కీలక సమయంలో దేశానికి అండగా నిలుస్తున్న డీఆర్డీఓని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. డిప్కోవన్ అంటే ఏమిటి? డిప్కోవన్ కోవిడ్ -19 యాంటీబాడీ డిటెక్షన్ కిట్. ఒక వ్యక్తి గతంలో కోవిడ్ -19 వైరస్‌కు గురిఅయ్యడా?, అతని శరీరంలో ప్రతిరోధకాలు ఉన్నాయో లేదో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. ఇది దేనికి ఉపయోగించబడుతుంది? ప్రతిరోధకాలను గుర్తించడం దీని ప్రాథమిక ఉద్దేశ్యం. ఇది సెరో-సర్వేల వంటి కోవిడ్-19 ఎపిడెమియాలజీ అధ్యయనాలలో ఉపయోగించబడుతుంది. మీకు కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎంత ఖర్చు అవుతుంది? డీఆర్డీవో తెలిపిన వివరాల ప్రకారం.. దాని పరిశ్రమ భాగస్వామి వాన్ గార్డ్ డయాగ్నోస్టిక్స్ కిట్‌ను ఒక్కొక్కటి 75 రూపాయలకు విక్రయిస్తుంది. చదవండి: నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ -
సెకండ్ వేవ్ ముగిసిందనుకోవద్దు..
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ముగింపు దశకు వచ్చిందా? గత 4 రోజులుగా కేసుల్లో తగ్గుదల నమోదవుతుండటాన్ని చూస్తే.. అలాగే అనిపించవచ్చు కానీ.. ఈ విషయంలో అంత తొందర వద్దంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా. వారం రోజుల సగటులో కేసుల తగ్గుదల ఉంటేనే వ్యా ధి తగ్గుముఖం పడుతున్నట్లు భావించాలని ఆ యన ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరించారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4 రోజులుగా తగ్గు తూ వస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న దశ నుంచి 2.6 లక్షల స్థాయికి కేసులు తగ్గాయి. కానీ దీని ఆధారంగా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందన్న అంచనాకు రావడం సరికా దని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తం గా కరోనా నిర్ధారణ పరీక్షలు గరిష్ట స్థాయిలో జరుగుతున్నా అత్యధికం నగర ప్రాంతాలకే పరిమితమయ్యాయన్నా రు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తప్పులు, మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసు కుంటే సెకండ్ వేవ్ తగ్గిందా.. లేదా అన్నది తెలిసేందుకు ఇంకో వారం పట్టొచ్చన్నారు. గ్రామా ల్లో పరీక్షలు, నిఘా మరింత పెంచాలని, తద్వా రా వ్యాధి మరోసారి ప్రమాదకరంగా మారకుం డా చూడొచ్చని సూచించారు. జన్యుక్రమ నమోదు కొనసాగుతోంది.. దేశంలో వైరస్ రూపాంతరితాలను గుర్తించేందు కు వాటి జన్యుక్రమాలను గుర్తించే ప్రక్రియ కొన సాగుతోందని రాకేశ్ మిశ్రా తెలిపారు. ‘ఈ ఏడా ది జనవరిలో దాదాపు 6 వేల వైరస్ జన్యుక్రమాలను విశ్లేషించాం. ఇప్పటివరకు దేశంలో దాదా పు 7,500 రూపాంతరితాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలకు ఇప్పటికే తెలుసు’ అని వివరించారు. ‘ఈ రూపాంతరితాల్లో కొన్నింటితో మాత్రమే ప్రమా ద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి యూకే వేరియంట్ దేశంలో ఎక్కువగా వ్యాపిస్తోంది. కొత్తగా గుర్తించిన రూపాంతరితాల్లో ఆందోళన కలిగించేవి ఏవీ లేవు’ అని తెలిపారు. వ్యాక్సిన్లు పని చేస్తాయి: ‘కరోనా వైరస్ జన్యుమార్పులకు గురవుతున్నా ఇప్పటివరకు అభివృ ద్ధి చేసిన టీకాలు వాటిని సమర్థంగా అడ్డుకుంటున్నాయి. యాంటీబాడీలు తక్కువున్నంత మా త్రాన టీకా పనిచేయట్లేదని కాదు. వైరస్‌ను అడ్డుకునేందుకు కావాల్సినన్ని యాంటీబాడీలు ఉత్ప త్తి అయితే చాల’ని రాకేశ్‌మిశ్రా వివరించారు. జంతుజాలంపై నిఘా: కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిన నేపథ్యంలో భ విష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించేందు కు జంతుజాలంపై నిఘా కొనసాగాలని రాకేశ్ మిశ్రా తెలిపారు. కరోనా కుటుంబంలో 32 వైరస్‌లున్నా.. మనిషికి ఏడింటి గురించే తెలుసని, ఎప్పుడు ఏ వైరస్ మనుషులకు ప్రబలుతుందో తెలుసుకునేందుకు అటవీ జంతువులను పరిశీలిస్తూనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2–డీజీతో మేలే.. కరోనా చికిత్స కోసం భారత రక్షణ ప రిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) త యారు చేసిన 2–డీజీపై సీసీఎంబీలో పరీక్ష లు జరిగాయని, ఇది సమర్థంగా పనిచేస్తుం దని స్పష్టమైందని రాకేశ్ మిశ్రా తెలిపారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) అభివృద్ధి చేసిన ఈ మందుతో ఆక్సిజన్ అవసరం తగ్గిపోవడ మే కాకుండా.. ఆస్పత్రిలో ఉండాల్సిన స మయం తగ్గుతుందని చెప్పారు. ఈ మం దును ఇప్పటికే పలు ప్రాంతాల్లో వినియోగి స్తున్నారని.. ఫలితాలేమిటన్నది మరికొన్ని రోజుల్లో స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. -
‘‘2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది’’
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం డీఆర్డీఓ, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్ (2–డీజీ) అనే ఔషధాన్ని అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ 2-డీజీ డ్రగ్ భారత్‌ను మాత్రమే కాక ప్రపంచాన్ని కాపాడగలుగుతుంది అన్నారు. హర్ష వర్ధన్ ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మద్దతుతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ 2-డీజి మొదటి దేశీయ పరిశోధన ఆధారిత ఫలితం. దీని వినియోగం వల్ల కోవిడ్ వ్యాప్తిని అరికట్టడమే కాక ఆక్సిజన్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఈ ఔషధం రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మాత్రమే కాక మొత్తం ప్రపంచాన్ని కోవిడ్ బారి నుంచి కాపాడుతుంది’’ అన్నారు. ఇక డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ ఔషధం పౌడర్ రూపంలో ఉంటుంది. దీన్ని నీటిలో కలుపుకుని నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్ సోకిన కణాలలో పేరుకుపోయి వైరల్ సంశ్లేషణ, శక్తి ఉత్పత్తిని ఆపడం ద్వారా వైరస్ పెరుగుదలను నిరోధిస్తుంది అని డీఆర్డీఓ తెలిపింది. చదవండి: 2–డీజీ.. గేమ్ చేంజర్.. అన్ని స్ట్రెయిన్ల మీదా పని చేస్తుంది -
యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డీజీ ఔషధం విడుదల
న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్, డీఆర్డీవో అభివృద్ధి చేసిన కోవిడ్–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్ (క్లుప్తంగా 2–డీజీ) ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ తెలిపింది. -
2 DG: నేడు కరోనా ఔషదం ‘2–డీజీ’ విడుదల
న్యూఢిల్లీ: డీఆర్డీవో అభివృద్ధి చేసిన కోవిడ్–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్ సోమవారం విడుదల కానుంది. నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కేంద్ర కార్యాలయంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్ సోమవారం 2–డీజీని విడుదల చేయనున్నారు. 2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్ (క్లుప్తంగా 2–డీజీ) ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ ఈనెల 8న వెల్లడించింది. -
పీఎం కేర్ నిధులతో 1.5 లక్షల ఆక్సీమీటర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులు ఎదుర్కొంటున్న ఆక్సిజన్ సమస్యను తీర్చేందుకు డీఆర్డీవో బృహత్తర కార్యక్రమం చేపట్టింది. బాధితుల శరీరంలోని మోతాదులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరాను సరిచేసుకోగల టెక్నాలజీ ఉన్న ఆక్సిజన్ వ్యవస్థలను సేకరించనుంది. దాదాపు 1.5 లక్షల ఈ వ్యవస్థలను అందుబాటులోకి తేనుంది. పీఎం కేర్స్ నిధుల నుంచి రూ.322.5 కోట్లతో కొనుగోలు చేసేందుకు అనుమతులు లభించినట్లు డీఆర్డీవో బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవస్థను కొద్ది నెలల కిందట డీఆర్డీవోలోని డెబెల్ సంస్థ ఆక్సికేర్ పేరుతో స్వయంగా అభివృద్ధి చేసింది. ఎత్తయిన ప్రాంతాల్లో పనిచేసే సైనికుల కోసం అభివృద్ధి చేసిన ఈ ఆక్సికేర్ వ్యవస్థలను కరోనా చికిత్సకు సమర్థంగా ఉపయోగించొచ్చని తెలిపింది. ఈ 1.5 లక్షల ఆక్సికేర్ యూనిట్లలో లక్ష యూనిట్లు సాధారణమైనవి కాగా.. మిగిలినవి ఆటోమేటిగ్గా పనిచేసేవి. సాధారణ ఆక్సికేర్ యూనిట్లో 10 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్, పీడన, ప్రవాహాలను నియంత్రించే కంట్రోలర్, తేమను చేర్చే హ్యుమిడిఫయర్, ముక్కుకు అనుసంధానించుకునే నాసల్ క్యానులా ఉంటాయి. రక్తంలోని ఆక్సిజన్ మోతాదుకు అనుగుణంగా కంట్రోలర్ సాయంతో ఆక్సిజన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ ఆక్సీమీటర్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఏర్పాటు చేశా రు. ఇందులో రక్తంలోని ఆక్సిజన్ మోతాదు గుర్తిం చి లెక్కకట్టేందుకు ఓప్రోబ్ ఉంటుంది. ప్రోబ్ గుర్తిం చిన ఆక్సిజన్ మోతాదులకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఆక్సిజన్ విడుదలను నియంత్రిస్తుంది. ఈ ఆటోమేటిక్ ఆక్సీమీటర్ వినియోగం ద్వారా అవసరమైనంత మాత్రమే ఆక్సిజన్‌ను అందిం చొచ్చు. ఆక్సిజన్‌ను 30 నుంచి 40 శాతం ఆదా చేయొచ్చని డీఆర్డీవో వివరించింది. పరిమితులను ముందుగానే నిర్ధారించడం ద్వారా ఈ ఆక్సీ మీటర్లను ఉపయోగిస్తున్న రోగులను నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఆక్సీమీటర్ పనిచేయని పక్షంలో అలారం మోగి, వైద్య సిబ్బందిని హెచ్చరిస్తుంది. ఇళ్లు, క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులన్నింటిలోనూ వీటిని వాడుకోవచ్చని వివరించింది. -
డీఆర్ డీవో చైర్మన్ సతీష్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ
-
2–డీజీ.. గేమ్ చేంజర్.. అన్ని స్ట్రెయిన్ల మీదా పని చేస్తుంది
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఆశాకిరణంగా నిలుస్తూ.. ‘2డీజీ (2 డీఆక్సి డీ గ్లూకోజ్)’ మందును తెస్తున్నట్టు ప్రకటించింది. కరోనా చికిత్సలో ఇది చాలా ప్రభావంతంగా పని చేస్తుందని వెల్లడించింది. దీంతో అందరి దృష్టీ ఈ మందుపై పడింది. అసలు ఈ మందు ఏమిటి, ఎలా తయారు చేశారు. ఎలా పనిచేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డిని ‘సాక్షి’ సంప్రదించింది. ఆ ఇంటర్వ్యూ వివరాలివీ.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ‘2డీజీ’ జనరిక్ మాలిక్యూల్. కొన్ని ప్రయోగాల్లో భాగంగా దానిని రూపొందించాం. సీసీఎంబీ దగ్గరికి వెళ్లి కరోనాపై టెస్టులు చేయించాం. పనిచేస్తోందని సీసీఎంబీ చెబితే.. క్లినికల్ ట్రయల్స్‌కోసం డీజీసీఐకి వెళ్లాం. ఏ మోతాదులో ఇస్తే ఎలా ఉంటుందని రెండు దశలుగా ప్రయోగాలు చేశాం. తర్వాత ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాం. ఫలితాలు బాగా వచ్చాయి. ఈ డ్రగ్ వాడితే మూడు రోజుల ముందే కోలుకుంటున్నారు. ఈ ఫలితాలతో డీజీసీఐకి వెళితే.. మందును వాడొచ్చంటూ అత్యవసర అనుమతి ఇచ్చారు. ఉత్పత్తిపై రెడ్డీస్ ల్యాబ్స్‌తో సంప్రదింపుల్లో ఉన్నాం. 11, 12 తారీఖుల్లో 10 వేల ప్యాకెట్లు రానున్నాయి. వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎక్కువ మంది ప్రజలకు అందించేలా చూస్తున్నాం. చదవండి: (డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం) భారీగా తయారు చేయడం వీలవుతుందా? ‘2డీజీ’ గ్లూకోజ్ ఆధారిత మాలిక్యూల్. దీని తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు సులువుగానే దొరుకుతాయి. అయితే ఒకేసారి భారీగా ఉత్పత్తి చేయడం కష్టం కావొచ్చు. అన్నీ సమకూరితే నెల రోజుల్లో ఉత్పత్తిని అందుబాటులోకి తేవచ్చు. దీనిని గేమ్ చేంజర్‌గా భావించొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మందును కచ్చితంగా ఓ గేమ్ చేంజర్‌గా భావించొచ్చు. దీనితో చికిత్స సులువు అవుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో పరిశీలించినప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చాయి. 330 మంది పేషెంట్లకు ఇచ్చి పరిశీలిస్తే.. వారు చాలా త్వరగా ఆక్సిజన్ వినియోగం నుంచి బయటికి రావడం, త్వరగా కోలుకోవడం జరిగింది. అయితే ఇది వ్యాధి వచ్చిన తర్వాత తగ్గించడానికి వాడే మందు, వ్యాధి రాకుండా ఆపే మందు కాదు. వ్యాక్సిన్లు బ్లాక్ మార్కెట్‌కు వెళుతున్నాయి? మరి ఈ మందు సజావుగా జనానికి అందేందుకు మీ ప్రణాళిక? తగిన సంఖ్యలో ఉత్పత్తి లేనప్పుడే బ్లాక్ మార్కెట్ ఏర్పడుతుంది. మేం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ మందును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. డిమాండ్‌కు తగినట్టుగా అందుబాటులో ఉంటే.. బ్లాక్ మార్కెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ప్రాంతాన్ని బట్టి మందు పనిచేసే తీరులో తేడా ఉందా? భద్రత ఎంత? దేశవ్యాప్తంగా అన్ని మూలల్లో కలిపి 9, 10 రాష్ట్రాల్లో క్లినికల్ ట్రయల్స్ చేశాం. అన్నిచోట్లా మంచి ఫలితాలు వచ్చాయి. ఈ మందు భద్రమైనది కూడా. దీనివల్ల ఏవైనా సైడ్ ఎఫెక్టŠస్ ఉంటాయా అని రెండు సార్లు పరీక్షించాం. పూర్తిగా భద్రమని గుర్తించాం. డీఆర్డీవో అంటే రక్షణ సంస్థ అనే భావనే ఉంది. కరోనాకు మందు ఎలా కనిపెట్టారు? నిజానికి డీఆర్డీవో సైన్యం కోసం పనిచేసే సంస్థ. అయితే సైనికులకు సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపేలా లైఫ్ సైన్సెస్ పరిశోధనలు కూడా ఉంటాయి. వారు తీసుకోవాల్సిన ఆహారం, ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతాల్లో పనిచేయడం వంటి అన్ని విషయాలపై ప్రయోగాలు చేస్తుంటాం. యుద్ధాలకు సంబంధించి అణు, బయోలాజికల్, కెమికల్ వార్ వంటివి కూడా ఉంటాయి. ఈ క్రమంలో రేడియేషన్ వల్ల వచ్చే నెగెటివ్ ఎఫెక్ట్స్‌ను ఎలా తట్టుకోవచ్చనే పరిశోధనలో భాగంగా 2డీజీ మాలిక్యూల్‌పై ప్రయోగాలు చేశాం. తర్వాత ఈ మందు కరోనాపై కూడా పనిచేస్తుందని మా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గత ఏడాదే సీసీఎంబీతో పరీక్షలు చేయించి.. అనుమతికోసం దరఖాస్తు చేశాం. కరోనా మొదటి వేవ్‌ను ఎదుర్కోగలరా? ఇలా కరోనా సెకండ్ వేవ్ వస్తుందని, ప్రభావం ఇంత తీవ్రంగా ఉంటుందన్నది ఎవరికీ తెలియని విషయం. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కూడా రోగులపై నిరంతరంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. అలా చేశాం కాబట్టే.. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఈ డ్రగ్ రెడీగా అందుబాటులోకి వస్తోంది. సెకండ్ వేవ్ ప్రమాదాన్ని ఇతర దేశాలు గుర్తించినట్టు మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం? నేను అలా అనుకోవడం లేదు. మనలాగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చిన దేశాలేమీ లేవు. భారత్‌లో చాలా వేగంగా పెరిగిపోయాయి. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, ఆక్సిజన్ అవసరం పడే పేషెంట్ల సంఖ్య ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. ఎవరూ ఊహించనంతగా ఈ స్థాయిలో వచ్చిన ఉధృతిని ఎదుర్కోవడానికి సిద్ధం కావడం కష్టం. అయినా పది పదిహేను రోజుల్లోనే అవసరమైన మేర ఆస్పత్రులు, మందులు, ఆక్సిజన్ వంటివి రెడీ చేసుకోవడం గొప్ప విషయమే. ఆక్సిజన్ జనరేటర్ల తయారీపై డీఆర్డీవో దృష్టి పెట్టింది.. ఆ వివరాలు ఏమిటి? తేజస్ (ఎల్సీఏ) విమానాలు అత్యంత ఎత్తులో ప్రయాణిస్తాయి. అక్కడ పైలట్లకు సరిపడా ఆక్సిజన్ ఉండదు. అందుకే అక్కడిక్కడ ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి అత్యాధుకమైన ఆన్‌బోర్డ్ ఆక్సిజన్ జనరేటర్‌ను తయారు చేశాం. ఆ టెక్నాలజీని ఉపయోగించే భారీగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను రూపొందించాం. వీటిని ఇప్పటికే హిమాలయాలు, ఇతర ఎత్తైన ప్రాంతాల్లో ప్రజలు, ఆస్పత్రులకు ఆక్సిజన్ కోసం వినియోగిస్తున్నాం. ఈసారి ఆక్సిజన్ అవసరం చాలా ఎక్కువగా ఉండటంతో.. పలు సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా మూడు నెలల్లో 850 ప్లాంట్ల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యాక్సిన్లు విదేశాలకు సరఫరా చేసిన ఖ్యాతి దక్కించుకున్నాం. ఇప్పుడీ మందును ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తారా? మన దగ్గర ఇంకా ఉత్పత్తే మొదలు కాలేదు. ముందుగా మన దేశంలో సరిపడా ఉత్పత్తి చేయడంపైనే దృష్టి పెడతాం. మన అవసరానికి మించి ఉత్పత్తి చేయగలిగినప్పుడు.. విదేశాలకు ఇవ్వడమా, ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ‘2డీజీ’ మందు వాడితే.. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందా? రోగం మన దగ్గరికి రాకుండా తోడ్పడేది వ్యాక్సిన్. ఈ మందు రోగం వచ్చాక తగ్గడానికి వాడేది. దానికి దీనికి సంబంధం లేదు. అయితే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా అందరం వ్యాక్సిన్లు వేసుకోవడం చాలా మంచిది. వ్యాక్సిన్ వేసుకున్నాక కోవిడ్ వచ్చినా.. ఈ మందును ఉపయోగించవచ్చు. ఆక్సిజన్ అవసరం ఏమేర తగ్గుతుంది, ఆస్పత్రిలో చేరే అవసరం ఉంటుందా? ఈ మందు వాడితే వేగంగా రికవరీ అవుతారు. ఆక్సిజన్ పెట్టాల్సిన స్థాయికి వెళ్లే రోగులకు ఆ అవసరం లేకుండా చేస్తుంది. ఒకవేళ అప్పటికే ఆక్సిజన్ వాడుతున్నా.. త్వరగా బయటపడేలా చేస్తుంది. అంటే ఆస్పత్రిలో చేరాల్సిన అవసరాన్ని, ఎక్కువ రోజులు ఉండాల్సిన రావడాన్ని తగ్గిస్తుంది. కొత్త కొత్త కరోనా స్ట్రెయిన్లు వస్తున్నాయి? మరి ఈ మందు పనిచేస్తుందా? అన్ని స్ట్రెయిన్ల మీద మేం పరీక్షలు చేయలేదు. కానీ ఈ మందు పనిచేసే తీరు వేరు. దీనికి నేరుగా కరోనా వైరస్‌తో సంబంధం లేదు. కరోనా సోకిన మన శరీర కణాల మీద ఈ మందు పనిచేస్తుంది. కణాల్లోకి 2డీజీ ప్రవేశించాక దానిని పూర్తిగా స్తంభింపజేస్తుంది. దాంతో అక్కడ వైరస్ పెరగడం ఆగిపోతుంది. అంటే ఏ స్ట్రెయిన్ అనే తేడా లేకుండా పనిచేస్తుంది. -
పరిశ్రమలు సామాజిక బాధ్యతను చాటాలి: మంత్రి మేకపాటి
సాక్షి, ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గానికి 100 ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చిన డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి గారికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తమ వంతు సహయం అందించిన వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ సంస్ధలకు గౌతమ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతను చాటాలని మంత్రి విన్నవించారు.ఆత్మకూరు నియోజకవర్గానికి మరో వంద మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు చేరుకున్నాయని తెలిపారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా ఏషియన్ పెయింట్స్,ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు చెరో 50 ఆక్సిజన్ సిలిండర్లను ఆత్మకూరు నియోజకవర్గానికి పంపాయి. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలశాఖ మంత్రి పిలుపు మేరకు డీఆర్డీవో, ఏషియన్ పెయింట్స్,ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌తో సహా, కాల్గేట్ పామాయిల్, , జిందాల్ స్టీల్, దాల్మియా సిమెంట్స్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), అర్జాస్ స్టీల్, వంటి అనేక సంస్థలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించడానికి ముందుకొచ్చాయి.కోవిడ్ నియంత్రణ, చికిత్సలో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు -
కరోనా కట్టడికి అందుబాటులో కి మరో ఔషధం
-
డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం
1. పై ఫొటోలో ఆకుపచ్చ రంగువి ఆరోగ్యకరమైన కణాలు, ఎరుపురంగు చుక్కలు కరోనా వైరస్, నారింజ రంగులో మసకగా ఉన్నవి వైరస్ సోకి దెబ్బతిన్న కణాలు. 2–డీజీ ఇవ్వక ముందు వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది. 2. మందు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే వైరస్ లోడ్ చాలా వరకు తగ్గింది. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో శుభవార్త చెప్పింది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ’ ఔషధాన్ని త్వరలో మార్కెట్లోకి తేనున్నట్టు ప్రకటించింది. కరోనా బాధితులపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’ మంచి ఫలితాలు ఇచ్చిందని, ఈ మేరకు అత్యవసర వినియోగానికి ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)’అనుమతులు వచ్చాయని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి శనివారం వెల్లడించారు. డీఆర్డీవో అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్) ఈ ‘2–డీజీ’మందును అభివృద్ధి చేసిందని.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కలిసి ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. ‘2–డీజీ’ఇచ్చిన కోవిడ్ రోగుల్లో చాలా మందికి నాలుగైదు రోజుల్లోనే కోవిడ్ నెగెటివ్ వచ్చిందని వివరించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోయిన కోవిడ్ కేసులు, ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న సమయంలో ‘2–డీజీ’అందుబాటులోకి వస్తుండటంతో సంతోషం వ్యక్తమవుతోంది. ఏడాది కిందే ప్రయోగాలు మొదలు.. కరోనా వైరస్ పంజా విసరడం మొదలైన కొత్తలోనే.. అంటే గత ఏడాది ఏప్రిల్‌లోనే ఈ వైరస్‌కు మందు కనిపెట్టడంపై ఇన్మాస్ సంస్థ దృష్టి పెట్టింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)తో కలిసి పరిశోధనలు చేసి.. ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’మందును రూపొందించింది. ఇది కరోనా వైరస్ పెరుగుదలను సమర్థవంతంగా అడ్డుకుంటోందని గుర్తించి.. క్లినికల్ ట్రయల్స్ కోసం ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌డీఓ)’కు దరఖాస్తు చేసింది. ఈ మేరకు అనుమతి రావడంతో గత ఏడాది మే నెలలోనే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా కంపెనీతో కలిసి.. కోవిడ్ రోగులపై ప్రయోగాత్మక పరిశీలన చేపట్టింది. ఈ మందు సామర్థ్యం, భద్రత ఏమేరకు ఉన్నాయనేది నిర్ధారించేందుకు ప్రయోగాలు నిర్వహించింది. కరోనా వైరస్ ఉన్న శాంపిల్స్.. ఇన్ఫెక్ట్ అయిన కణాలకు 2–డీజీ మందు వాడిన తర్వాత మందు సురక్షితమే.. గత ఏడాది మే – అక్టోబరు మధ్య నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ‘2–డీజీ’మందు సురక్షితమైనదేనని, రోగులు వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడుతోందని గుర్తించారు. తర్వాత రెండో దశలో ఫేజ్–2ఏ కింద ఆరు ఆస్పత్రుల్లో, ఫేజ్–2బీ కింద 11 ఆస్పత్రుల్లో పరిశీలన చేపట్టారు. మొత్తం 110 మంది రోగులకు 2–డీజీ మందును ఇచ్చి ఫలితాలను బేరీజు వేశారు. సాధారణ చికిత్సా పద్ధతులతో పోలిస్తే 2–డీజీ మందు ఇచ్చిన రోగులు.. కోవిడ్ లక్షణాల నుంచి వేగంగా బయటపడుతున్నట్టు నిర్ధారించారు. మరోలా చెప్పాలంటే 2–డీజీ తీసుకున్నవారు మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని తేల్చారు. మూడో దశలోనూ సత్ఫలితాలు తొలి, రెండు దశల ప్రయోగాలు విజయవంతమైన నేపథ్యంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు గత ఏడాది నవంబరులోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. గతేడాది డిసెంబరు – ఈ ఏడాది మార్చి మధ్య 220 మంది రోగులకు ఈ మందును ఇచ్చి పరిశీలించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 27 కోవిడ్ ఆస్పత్రుల్లో పేషెంట్లపై ప్రయోగాలు చేశారు. 2–డీజీ మందు ఇవ్వడం మొదలుపెట్టిన మూడో రోజు నుంచే దాదాపు 42 శాతం మంది రోగుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. అరవై ఐదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. మూడు దశల ఫలితాల ఆధారంగా.. మధ్యమ, తీవ్ర స్థాయి కోవిడ్ రోగుల చికిత్సలో 2–డీజీని ఉపయోగించేందుకు డీసీజీఐ ఈ నెల ఒకటో తేదీనే అనుమతులు జారీ చేసింది. తాజాగా ఈ మందుకు సంబంధించిన వివరాలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పొడి.. నీళ్లలో కలుపుకొని తాగడమే 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔష ధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. ఈ మందులోని అణువులు.. సాధారణ గ్లూకోజ్ అణువులను పోలి ఉండటం వల్ల విస్తృతంగా ఉత్పత్తి చేయడానికి వీలుందని డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే వారం, పదిరోజుల్లోనే ఈ మందు తొలి విడత మార్కెట్లోకి వచ్చేస్తుందని.. మూడు వారాల్లో మరింత మోతాదులో అందుబాటులోకి వస్తుందని వివరించారు. -
కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూడిల్లీ : కోవిడ్ మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీవో)కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో ఢిల్లీలోని ఐఎన్ఎంఏఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్) ల్యాబ్ రూపొందించిన యాంటీ కరోనా డ్రగ్‌కు అనుమతి సాధించింది. ఇప్పటికే నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ అద్భుతమైన ఫలితాల నేపథ్యంలో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ-కోవిడ్ 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధానికి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. తీవ్రమైన కోవిడ్ బాధితుల్లో ఈ మందు అమోఘంగా పని చేస్తుందని, వేగంగా కోలుకోవడంతోపాటు ఆక్సిజన్‌పై అధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుందని డీఆర్డీవో తాజాగా ప్రకటించింది. గ్లూకోజ్ రూపంలో ఉండే 2-డీజీ ఔషధాన్ని దేశంలో సులభంగా ఉత్పత్తి చేయడంతోపాటు, విరివిగా అందుబాటులో తీసుకరాచ్చని కంపెనీ చెబుతోంది. ఈ డ్రగ్ సాజెట్‌లలో పొడి రూపంలో లభిస్తుంది. దీన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇది వైరస్ వ్యాపించిన భాగాల్లోకి చేరి అక్కడ సెల్స్‌లోని కరోనా శక్తిని అడ్డుకోవడంతోపాటు, విస్తరణను గణనీయంగా నిరోధిస్తుంది. దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి విస్తరణ, బాధితులు ఆక్సిజన్‌పై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ డ్రగ్ ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే రోగులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని కూడా బాగా తగ్గిస్తుందని అంచనా. ఐఎన్ఎంఏఎస్- డీఆర్డీవో శాస్త్రవేత్తలు హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సహాయంతో ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని తేలింది. దీంతో గత ఏడాది మేలో కోవిడ్ -19 రోగులలో పరీక్షలకు డీసీజీఐ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) రెండో దశకు అనుమతినిచ్చింది. వీటి ఫలితాల ఆధారంగా డిసెంబర్ 2020 - మార్చి 2021 మధ్య 220 మంది రోగులపై మూడో క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు గుజరాత్‌కు చెందిన 27 కోవిడ్ ఆసుపత్రులలో ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. '2-డియోక్సీ-డి-గ్లోకోజ్' (2-డీజీ)గా వ్యవహరిస్తున్న ఈ యాంటీ-కోవిడ్-19 చికిత్స ఔషధాన్ని కోవిడ్ బాధితుల మీద పరీక్షించినప్పుడు వారిలో అత్యధిక శాతం మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాల వచ్చాయి. ఈ ఫలితాల వివరణాత్మక డేటాను డీసీజీఐకి సమర్పించిన నేపథ్యంలో తాజా అనుమతి లభించింది. చదవండి : కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! An anti-COVID-19 therapeutic application of the drug 2-deoxy-D-glucose (2-DG) has been developed by INMAS, a lab of DRDO, in collaboration with Dr Reddy’s Laboratories, Hyderabad. The drug will help in faster recovery of Covid-19 patients. https://t.co/HBKdAnZCCP pic.twitter.com/8D6TDdcoI7 — DRDO (@DRDO_India) May 8, 2021 -
విశాఖలో రక్షణ రంగ తయారీ పరిశ్రమ
సాక్షి, విశాఖపట్నం: ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలకు నిలయంగా ఉన్న విశాఖపట్నం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. బంగాళాఖాతానికి రక్షణ కవచంలా ఉంటూ శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షిస్తున్న తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రక్షణకు అవసరమైన కీలక ఆయుధాలు, క్షిపణులను రూపొందిస్తున్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) విశాఖపై తన దృష్టి సారించింది. కార్యాలయంతోపాటు రక్షణ రంగ విడిభాగాల తయారీ పరిశ్రమను నగరంలోని మధురవాడలో నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వదేశీ తయారీకి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌ను అమలు చేసేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల రక్షణ రంగ విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు నెలకొల్పేందుకు డీఆర్డీవో సిద్ధమవుతోంది. దేశ రక్షణ రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న విశాఖ నగరంతో పాటు మచిలీపట్నం, అనంతపురం, కృష్ణా, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రక్షణరంగ విడి భాగాల తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు ప్రధాన కేంద్రంగా డీఆర్డీవో విశాఖను ఎంపిక చేసుకుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన డీఆర్డీవో అధికారులు మధురవాడలోని ఏపీఐఐసీ హిల్స్‌లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో హిల్ నంబర్–4లో 5 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) డీఆర్డీవోకి కేటాయించింది. యుద్ధ విమానాలు, నౌకల పరికరాల తయారీ 5 ఎకరాల స్థలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, తదితరాలకు కావాల్సిన పరికరాలు తయారు చేసే కేంద్రాన్ని నెలకొల్పాలని డీఆర్డీవో భావిస్తోంది. దీంతోపాటు డీఆర్డీవో ప్ర«త్యేక కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో ముఖ్యంగా శత్రు మూకల నుంచి సైబర్ దాడిని ఎదుర్కొనేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ రెండింటి కోసం రూ.330 కోట్లు వెచ్చించనుంది. ఇటీవల నేవల్ సైన్స్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎన్ఎస్టీఎల్)ని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్ సతీష్‌రెడ్డి విశాఖలో రక్షణ రంగ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ యతిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మధురవాడ హిల్ నం.4లో డీఆర్డీవో కోసం 5 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ చేసినట్లు తెలిపారు. -
వాతావరణంలోని గాలితో..! నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా దేశంలో ఏర్పడ్డ ఆక్సిజన్ కొరత నివారణకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) నడుం బిగించింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో అక్కడికక్కడే ఆక్సిజన్ తయారు చేసేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించి.. దేశవ్యాప్తంగా 500 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పాటయ్యే కేంద్రాలు ఒక్కొక్కటీ నిమిషానికి వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఒక్కో కేంద్రంతో 190 మందికి ఆక్సిజన్ అందించవచ్చని.. అదనంగా 195 సిలిండర్లను నింపవచ్చని డీఆర్డీవో బుధవారం ఓ ప్రకటన వెల్లడించింది. బెంగళూరులోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, కోయంబత్తూరుకు చెందిన ట్రైడెంట్ న్యూమాటిక్స్‌లకు ఇప్పటికే టెక్నాలజీని బదలాయించామని.. ఆ రెండు సంస్థలు 380 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను తయారు చేసి డీఆర్డీవోకు అందిస్తాయని తెలిపింది. సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం మరో 120 ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేస్తుందని వివరించింది. పీఎస్ఏ టెక్నాలజీతోనే.. డీఆర్డీవో తయారు చేస్తున్న మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు అన్నీ ‘ప్రెషర్ స్వింగ్ అబ్జార్ప్షన్ (పీఎస్ఏ)’టెక్నాలజీతో పనిచేస్తాయి. వాతావరణం నుంచి గాలిని పీల్చుకుని.. జియోలైట్ పదార్థం సాయంతో అందులోని ఇతర వాయువులను తొలగించి 933% గాఢతతో ఆక్సిజన్‌ను వేరు చేస్తారు. దీన్ని నేరుగా కోవిడ్ రోగులకు అందించవచ్చు. అవసరమైతే సిలిండర్లలో నింపుకోవచ్చు. ఆస్పత్రుల్లో అక్కడికక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడం వల్ల ఖర్చులు కలిసివస్తాయని.. సుదూర, ఎత్తైన ప్రాంతాల్లోని ఆస్పత్రులకు ఎంతో ఉపయోగపడుతుందని డీఆర్డీవో పేర్కొంది. పీఎం కేర్స్ నిధుల ద్వారా నెలకు 120 చొప్పున ఆక్సిజన్ ఉత్పత్తి వ్యవస్థలను తయారు చేస్తామని వెల్లడించింది. డీఆర్డీవో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టడంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
ఉన్నచోటనే ఆక్సిజన్! డీఆర్డీవో వినూత్న పరికరం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలు కావద్దనుకుంటే రక్తంలోని ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పల్స్ ఆక్సీమీటర్ పరికరంతో రక్తంలోని ఆక్సిజన్ ఎంతుందో తెలుసుకోవచ్చు కానీ.. తక్కువ ఉంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ కావాలంటే మాత్రం ఆసుపత్రికి పరుగెత్తాల్సిందే. అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఓ పరికరం ఇప్పుడు కరోనా బాధితులకు వరంగా మారనుంది. బెంగళూరులోని డీఆర్డీవోకు చెందిన ‘ది డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ’తయరుచేసిన ‘ఎస్పీవో-2 సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టం’లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్ సరఫరా మొదలుపెడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్పీఓ2ను పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్యసిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. ఒక లీటర్ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. రోగికి అవసరమైనంత ఆక్సిజన్ మాత్రమే ఉపయోగిస్తున్న కారణంగా వృథా తగ్గుతుందని తెలిపింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఈ పరికరం కరోనా బాధితులకు ఓ వరం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలు కావద్దనుకుంటే రక్తంలోని ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పల్స్ ఆక్సీమీటర్ పరికరంతో రక్తంలోని ఆక్సిజన్ ఎంతుందో తెలుసుకోవచ్చు కానీ.. తక్కువ ఉంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ కావాలంటే మాత్రం ఆసుపత్రికి పరుగెత్తాల్సిందే. అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఓ పరికరం ఇప్పుడు కరోనా బాధితులకు వరంగా మారనుంది. ఈ పరికరం కరోనా బాధితులకు ఓ వరం బెంగళూరులోని డీఆర్డీవోకు చెందిన ‘ది డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ’తయరుచేసిన ‘ఎస్పీవో–2 సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టం’లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్ సరఫరా మొదలుపెడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్పీఓ2ను పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. ఒక లీటర్ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. రోగికి అవసరమైనంత ఆక్సిజన్ మాత్రమే ఉపయోగిస్తున్న కారణంగా వృథా తగ్గుతుందని తెలిపింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ( చదవండి: తీవ్రతను బట్టే రెమ్‌డెసివర్ ) -
సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేసిన డీఆర్డీఓ
సాక్షి, న్యూఢిల్లీ: శత్రు క్షిపణి దాడుల నుంచి నౌకాదళ నౌకలను రక్షించేందుకు ‘అడ్వాన్స్డ్ చాఫ్ టెక్నాలజీ’ని ’రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ’(డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. డీఆర్డీవోకు చెందిన ‘డిఫెన్స్ లాబొరేటరీ జోధ్‌పూర్’(డీఎల్‌జే) ఈ కీలక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివద్ధి చేసి షార్ట్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎస్‌ఆర్‌సీఆర్), మీడియం రేంజ్ చాఫ్ రాకెట్ (ఎంఆర్‌సీఆర్), లాంగ్ రేంజ్ చాఫ్ రాకెట్ (ఎల్‌ఆర్‌సీఆర్) అనే మూడు రకాల రాకెట్లను రూపొందించింది. నౌకాదళ గుణాత్మక అవసరాలను తీర్చేలా వీటిని డీఎల్‌జే తీర్చిదిద్దింది. ఈ మూడు విభాగాల రాకెట్లను భారత నౌకాదళం ఇటీవల అరేబియా సముద్రంలో పరీక్షించింది. శత్రు రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత క్షిపణుల నుంచి రక్షణ నౌకలను రక్షించేందుకు చాఫ్ పరిజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా శత్రువుల భవిష్యత్ దాడులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని డీఆర్డీవో సాధించింది. ఈ విజయాన్ని సాధించిన డీఆర్డీఓ, నౌకాదళాన్ని, డిఫెన్స్ ఇండస్ట్రీని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ అభినందించారు. నౌకాదళ నౌకల రక్షణ పరిజ్ఞాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్డీవో ఛైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి ప్రశంసించారు. తక్కువ వ్యవధిలో దీన్ని అభివృద్ధి చేయడానికి డీఆర్డీవో చేసిన ప్రయత్నాలను నౌకాదళ ఉప అధిపతి అడ్మిరల్ జి.అశోక్ కుమార్ కూడా అభినందించారు. DRDO has developed an Advanced Chaff Technology to safeguard the naval ships against enemy missile attack. The three variants namely Short Range Chaff Rocket, Medium Range Chaff Rocket, and Long Range Chaff Rocket met Indian Navy’s qualitative requirements. #AtmaNirbharBharat pic.twitter.com/T1RVu3elaK — DRDO (@DRDO_India) April 5, 2021 చదవండి: డిజిటల్ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
యుద్ధ ట్యాంకర్ల హబ్‌గా తమిళనాడు
సాక్షి, చెన్నై: మోటార్ వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధ ట్యాంకర్ల ఉత్పత్తిలోనూ హబ్‌గా తమిళనాడు మారుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీని అపార శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. డీఆర్డీఓ దేశీయంగా తయారు చేసిన అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంక్(ఎంకే–1ఏ)ను భారతీయ సైన్యానికి అప్పగించారు. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలతో కలిసి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. మెట్రో సేవలు.. రూ.3,770 కోట్లతో పూర్తయిన చెన్నై వాషర్మెన్ పేట–విమ్కోనగర్ మధ్య మెట్రో రైలు, రూ.293 కోట్లతో పూర్తి చేసిన చెన్నై బీచ్–అత్తిపట్టు మధ్య 4వ ట్రాక్‌లో, రూ.423 కోట్లతో విద్యుద్దీకరించిన విల్లుపురం–తంజావూరు – తిరువారూర్ మార్గంలో రైలు సేవలకు జెండా ఊపారు. తంజావూరు, పుదుకోట్టైలకు సాగు నీరు అందించడం లక్ష్యంగా రూ. 2,640 కోట్లతో చేపట్టనున్న కళ్లనై కాలువ పునరుద్ధరణ పనులకు, రూ.1000 కోట్లతో చెంగల్పట్టు జిల్లా తయ్యూరు సమీపంలో 163 ఎకరాల్లో నిర్మించనున్న ఐఐటీ డిస్కవరీ క్యాంపస్ పనులకు శంకుస్థాపన చేశారు. చెన్నై ఆవడిలోని ఆర్మీ ఫ్యాక్టరీలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో 71 సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న అర్జున యుద్ధ ట్యాంకర్‌ను భారత ఆర్మీకి అందించారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన దివంగత సీఎంలు ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలకు మోదీ పుష్పాంజలి ఘటించారు. ఈ దశాబ్దం భారత్‌దేనని, కోవిడ్–19పై పోరు విషయంతో సహా అన్ని విషయాలలో ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని తెలిపారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలతో కలిసి ప్రధాని మోదీ చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను తన ప్రసంగంలో ప్రధాని కొనియాడారు. తమిళ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. శ్రీలంక తమిళుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి కోసం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జాఫ్నాలో పర్యటించిన ఏకైక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తానే కావడం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. శ్రీలంకలోని తమిళుల హక్కుల గురించి ఆ దేశంతో చర్చించామని వెల్లడించారు. దేశీయంగా తయారు చేసిన మార్క్1ఏ ట్యాంక్‌ను ఆర్మీకి అప్పగిస్తున్న సందర్భంగా సైన్యంతో మోదీ ప్రతి నీటి చుక్క కీలకం.. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళంలో వణక్కం చెన్నై.. వణక్కం తమిళనాడు అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. తమిళనాడు రైతులు ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుని ఆహార ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్నారని కొనియాడారు. ప్రతి నీటి చుక్క కీలకం అని, పొదుపు గురిం చి వివరిస్తూ భావితరాల కోసం జల, వనరుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తక్కువ జల వినియోగంతో ఎక్కువ దిగుబడి సాధించే దిశగా మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. చెన్నై మెట్రో ఫేజ్–2కు బడ్జెట్లో రూ. 63 వేల కోట్లను ప్రకటించామని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు భారత వైపు చూస్తున్నాయని, ఇది 130 కోట్ల మంది శ్రమ ఫలితమని పేర్కొన్నారు. పుల్వామా అమరులకు నివాళి.. రెండేళ్ల క్రితం ఇదే రోజున (ఫిబ్రవరి 14) పుల్వామా దాడి జరిగిందని గుర్తు చేస్తూ, ఆ దాడిలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ రాసిన ‘ఆయుధం సెయ్‌వోం...(ఆయుధం తయారు చేద్దాం)’ అన్న కవితను గుర్తు చేస్తూ, డిఫెన్స్ కారిడార్‌కు తమిళనాడు ఎంపికైనట్టు తెలిపారు. మోటారు వాహన ఉత్పత్తిలోనే కాదు, యుద్ధట్యాంకర్ల ఉత్పత్తికి హబ్‌గా తమిళనాడు మారిందని పేర్కొంటూ, తాజాగా ఆర్మీకి అంకితం ఇచ్చిన ఎంకే–1ఏ గురించి వివరించారు. భారత ఆర్మీ శాంతియుతంగా సరిహద్దుల్లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. ప్రపంచ స్థా యి ప్రమాణాలతో ఐఐటీ డిస్కవరీ రూపుదిద్దుకోబోతున్నదని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానికి బ్రహ్మరథం పట్టే రీతిలో చెన్నైలో ఆహ్వానం లభించింది. ప్రధాని పర్యటన సందర్భం గా చెన్నైలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. బీపీసీఎల్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ జాతికి అంకితం కొచ్చి: కేరళలో పలు అభివృద్ధి పథకాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ. 6 వేల కోట్ల విలువైన బీపీసీఎల్‌కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను, మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ‘విజ్ఞాన సాగర్’ను ప్రారంభించారు. పెట్రో కెమికల్ ప్రాజెక్టుతో అక్రిలిక్ యాసిడ్, ఆక్సో ఆల్కహాల్, అక్రిలేట్స్ తదితర ఉత్పత్తుల దిగుమతులు తగ్గి గణనీయ మొత్తంలో విదేశీ మారకం ఆదా అవుతుందన్నారు. బోల్గట్టి, విలింగ్డన్ ఐలండ్ మధ్య జల మార్గ రవాణా కోసం రెండు నౌకలను ప్రారంభించారు. కేరళలో పర్యాటక రంగ మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. కొచ్చిలో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఏర్పాటు అందులో భాగమేనన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేరళ బీజేపీ నేతలతో మోదీ సమావేశమయ్యారు. ఎన్నికల్లో కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రధానంగా ప్రచారం చేయాలన్నారు. -
ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో హిమానీనదం కారణంగా వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో అత్యంత ప్రమాదకరమైన భారీ సరస్సు ఏర్పడిందని ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. నదీ ప్రవాహ మార్గంలో భారీగా రాళ్లు, మట్టి పడడంతో ప్రవాహం పాక్షికంగా ఆగి కృత్రిమంగా ఓ సరస్సు తయారైంది. ఈ సరస్సుతో మళ్లీ ముప్పు రాకుండా ఉండడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఒ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ ఎన్డీటీవీతో చెప్పారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించిన ప్రాంతంలో సరస్సు ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో తెలుసుకోవడం కోసం ఇప్పటికే కొన్ని బృందాలు హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాయి. డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని కూడా ఆ ప్రాంతానికి పంపించి అవి తీసిన చిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్టుగా ప్రధాన్ వెల్లడించారు. ఆ సరస్సు మహోగ్రరూపం దాల్చకుండా నిరోధించేలా డీఆర్డీఓ, ఎన్డీఆర్ఎఫ్లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఈ సరస్సు వల్ల కలిగే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ‘‘ఇప్పుడు మనం ఆందోళన పడకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొన్ని బృందాలు ఆ సరస్సు గురించి తెలుసుకునే పనిలో ఉన్నాయి’’అని రావత్ చెప్పారు. ఫుట్‌బాల్ స్టేడియం కంటే మూడింతలు పెద్దది డ్రోన్లు, ఇతర విమానాలు తీసిన చిత్రాల్లో సరస్సు చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ గ్రౌండ్ కంటే మూడు రెట్లు పొడవున సరస్సు ప్రవహిస్తోంది. 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 10 డిగ్రీల లోతు ఉన్న ఈ సరస్సు నుంచి మంచు పెళ్లలు, బురద, రాళ్లతో కూడిన నీళ్లు రిషిగంగ నదిలోకి ప్రవహించి రెండు విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఏర్పడిన కృత్రిమ సరస్సుని మట్టి పెళ్లలు, రాళ్లతో కూడిన శిథిలాలు అడ్డుగోడగా ఉన్నాయి. అయితే బుధవారం నాడు తీసిన శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ అడ్డుగోడని ఛేదించుకొని సరస్సు ప్రవహిస్తే ఏ స్థాయిలో ముప్పు జరుగుతుందో ఎవరి అంచనాకి అందడం లేదు. ఆ సరస్సు చాలా ప్రమాదకరంగా మారుతోందని శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేను రిషిగంగ నదికి ఈశాన్యంవైపు ఉన్నాను. ఆ పై నుంచే నీటి ప్రవాహం ముంచుకొస్తోంది. ప్రస్తుతానికి రాళ్లు ఒక గోడలా అడ్డుగా ఉండడం ఊరట కలిగించే అంశం. కానీ ఏ క్షణంలోనైనా అది కొట్టుకుపోతే చాలా ప్రమాదం. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది’’అని చెప్పారు. 38కి చేరుకున్న మృతుల సంఖ్య ఉత్తరాఖండ్‌లోని తపోవన్ సొరంగ మార్గం దగ్గర వరుసగా ఆరో రోజు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న 30–35 మందిని కాపాడడానికి సహాయ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. సొరంగానికి అడ్డంగా కొట్టుకొచ్చిన రాళ్లను డ్రిల్లింగ్ చేయడం, బురదని తోడడం వంటి పనులు ఏక కాలంలో నిర్వహిస్తున్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. మరోవైపు శుక్రవారం నాడు మరో రెండు మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. మరో 166 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రిషిగంగ హైడల్ ప్రాజెక్టు దగ్గర ఒక మృతదేహం లభిస్తే, మైథన ప్రాంతంలో మరొకటి గుర్తించినట్టుగా సహాయ బృందాలు తెలిపాయి. సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల ఆవేదనకు అంతే లేదు. లోపల వాళ్లు ఏ స్థితిలో ఉన్నారో ఊహించుకోవడానికే వారు భయపడుతున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు తమ ప్రాంతానికి ఒక శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రాంతానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తపోవన్ గ్రామ సభకు చెందిన మహిళలు అత్యధికులు వచ్చి తమ నిరసన తెలిపారు. మొదట మా పొలాలను పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా ప్రియమైన వారినే పోగొట్టుకున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. -
విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త
న్యూఢిల్లీ: విద్యార్థులు, నిరుద్యోగులకు డీఆర్డీఓ శుభవార్త తెలిపింది. భారత ప్రభుత్వ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో స్వల్ప కాలనికి రెండు షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోర్సులను ప్రారంభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీపై రెండు స్వల్పకాలిక ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. ఈ రెండు కోర్సులు 12వారాల పాటు కొనసాగుతాయి. వారంలోని ఐదు రోజులలో రోజుకి రెండు గంటల చొప్పున ఈ ఆన్లైన్ క్లాస్ నిర్వహించనున్నారు.(చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్) ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ కోర్సులలో ఏదైనా స్ట్రీమ్‌లో ప్రవేశం పొందవచ్చు. డిగ్రీ ఫైనల్ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష రుసుము ఉచితం కాగా, ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒక్కో కోర్సు ధరఖాస్తు కోసం అభ్యర్థులు 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సుల ప్రవేశ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ జనవరి 28 నుంచి అధికారిక వెబ్సైట్ https://onlinecourse.diat.ac.in/DIATPortal/ ద్వారా ప్రారంభమవుతుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజును ఫిబ్రవరి 26లోగా చెల్లించాల్సి ఉంటుంది. డీఆర్డీఓ ఆన్లైన్ కోర్సుల 2021: రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జనవరి 28 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: ఫిబ్రవరి 15 ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 20 సైబర్ సెక్యూరిటీ ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 21 మూడు కోర్సుల ఫలితాలు విడుదల తేదీ: ఫిబ్రవరి 22 రుసుము చెల్లించాల్సిన చివరి తేదీ: ఫిబ్రవరి 26 ఆన్లైన్ క్లాస్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 28 -
ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశా: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్-ఎన్జీ(న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆకాష్-ఎన్జీ అనేది కొత్త తరం సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి. ఇది భారత వైమానిక దళం కోసం తయారుచేయబడింది. భారత వాయుసేన ఉపరితలం నుంచి గగన తలంలో శత్రుదేశాల చెందిన అధిక శక్తి గల వైమానిక దళాలను చేధించడానికి తోడ్పడుతుంది. ఈ క్షిపణి పరిక్ష సమయంలో అత్యంత కచ్చితమైన టైమింగ్‌తో లక్ష్యాన్ని చేధించింది.(చదవండి: వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ ఏవియానిక్స్, క్షిపణి యొక్క ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ యొక్క పనితీరు ట్రయల్ సమయంలో విజయవంతంగా పనిచేసాయి అని డీఆర్డీవో ధ్రువీకరించింది. క్షిపణి పరీక్ష ప్రయోగ సమయంలో గగన తల విమాన మార్గాన్ని పర్యవేక్షించారు. తాజా ప్రయోగాన్ని భారతీయ వైమానిక దళం ప్రతినిధుల సమక్షంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), బీడీఎల్, బీఈఎల్ సంయుక్త బృందం ఈ పరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నాటి నుంచి భారత్ తరచూ క్షిపణుల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
వ్యూహాత్మక అవసరాలపై దృష్టి పెట్టాలి
సాక్షి, హైదరాబాద్/సంతోష్‌నగర్: క్షిపణి వ్యవస్థల తయారీలో భారత్ ఆత్మనిర్భరత సాధించడంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) పాత్ర ఎనలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. క్షిపణి వ్యవస్థల విషయంలో ఇతర దేశాలు భారత్‌పై ఆధారపడేలా చేయడంలో డీఆర్డీవో విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రాన్ని సోమవారం సందర్శించిన ఉపరాష్ట్రపతి.. ఇంటిగ్రేటెడ్ వెపన్ సిస్టం డిజైన్ సెంటర్ (ఐడబ్ల్యూఎస్‌డీసీ)ని, కొత్త క్షిపణి సాంకేతిక ప్రదర్శన, సెమినార్ హాల్‌ను ప్రారంభించారు. క్షిపణి కేంద్రంలో తయారైన రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఈ సందర్భంగా తిలకించారు. అనంతరం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబనకు గట్టి ప్రయత్నాలు జరుగుతూండటం అభినందనీయం అన్నారు. పలు రక్షణ రంగ ఉత్పత్తులు పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం భారతీయులందరికీ గర్వకారణంగా పేర్కొన్నారు. (చదవండి: గణతంత్ర దినోత్సవం; అలా ఇది నాలుగోసారి!) వ్యూహాత్మక అవసరాలపై దృష్టిపెట్టాలి.. దేశ భవిష్యత్ రక్షణ అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మక రక్షణ సాంకేతికత అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి శాస్త్రవేత్తలకు సూచించారు. కరోనా మహమ్మారిని యంత్రణలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, రికార్డు సమయంలో టీకా తయారీతో పాటు ఎగుమతులు కూడా ప్రారంభించిందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీఆర్డీవో చైర్మన్ జి.సతీశ్‌రెడ్డి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఎన్సీడీసీకి స్థలం ఇవ్వండి: కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయనున్న జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ)కి స్థలం కేటాయించాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కేంద్రం 2019లోనే ఎన్సీడీసీ ఏర్పాటును ప్రతిపాదించి నిధులను కూడా కేటాయించిందని, దీనికోసం మూడెకరాల స్థలం కేటాయించాలని రాష్ట్రాన్ని అడిగిందని గుర్తు చేశారు. ఎన్సీడీసీ స్థాపనకు భూమిని కేటాయిస్తే కేంద్రం తగిన చర్యలు తీసుకునేలా తాను బాధ్యత తీసుకుంటానని పేర్కొన్నారు. -
బైక్ అంబులెన్స్ రూపొందించిన డీఆర్డీవో
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పిఎఫ్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) సంయుక్తంగా కలిసి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బైక్ అంబులెన్స్ "రక్షిత"ను నేడు ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అత్యవసర తరలింపు కోసం ఈ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్ల సమయంలో ఏదైనా గాయాలు జరిగితే ఈ బైక్‌లు సిఆర్పిఎఫ్ జవాన్లు, పారామెడిక్స్‌కు సహాయ పడనున్నాయి అధికారులు తెలిపారు.(చదవండి: ఫేస్బుక్, ట్విటర్‌కు కేంద్రం షాక్) "ఈ బైక్‌లు బీజాపూర్, సుక్మా, దంతేవాడ మొదలైన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మరింత ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే, పెద్ద అంబులెన్స్‌లను అడవి లోపలికి తీసుకెళ్లడం సాధ్యం కాదు కాబట్టి" అని సీఆర్పిఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. ఇటువంటి బైక్‌లు సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్‌లు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. ముఖ్యంగా నక్సలైట్ జోన్లలో ఇరుకైన రోడ్లలో వేగంగా చేరుకోవడానికి సీఆర్పిఎఫ్ గమనించిన తరువాత ఈ బైక్ అభివృద్ధి చేసారు. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు చోట్ల ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్‌ను రక్షణ పరిశోధన సంస్థ తయారుచేసింది. -
2024కల్లా 36 వేల కోట్ల లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో దేశ రక్షణ రంగంలో కొత్త శకం మొదలైంది. ‘మేడిన్ ఇండియా’ రక్షణ ఉత్పత్తులు విదేశాలకు విస్తరించనున్నాయి.. ఆకాశ్ ఎగుమతులు సరే.. కానీ ఎగుమతుల జాబితాలో తర్వాత ఉన్నవేమిటి? ఏయే దేశాలు భారత రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నాయి? ఆత్మనిర్భర్ భారత్ సాకారంలో డీఆర్డీవో భాగస్వామ్యమెంత..? తదితర ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ సమాధానాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ప్రశ్న: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఏయే దేశాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి? జవాబు: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులు దేశ రక్షణ రంగ చరిత్రలో ఓ కీలక మలుపనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని భారత్ ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.. రక్షణ పరిశ్రమ రంగానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చే పరిణామం. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి చాలా ఆసియా దేశాలు ఆకాశ్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యూఏఈ కూడా ఆసక్తి కనబరిచింది. ఆకాశ్ ఎగుమతులు మొదలైతే అందులోని ఉప వ్యవస్థల గురించి కూడా అంతర్జాతీయ సమాజానికి తెలుస్తుంది. తద్వారా ఆ ఉప వ్యవస్థల అమ్మకాలు, నిర్వహణల్లోనూ దేశానికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఎగుమతులు ఎప్పుడు ప్రారంభం కావచ్చు? వీటి విలువపై మీ అంచనా? మిలటరీ ఉత్పత్తులను వీలైనంత వేగంగా ఎగుమతి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఆయా దేశాల అవసరాల ఆధారంగా ఎగుమతి ప్రక్రియ ప్రారంభిస్తాం.. 2024 నాటికల్లా భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.36,566 కోట్ల వరకు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో డీఆర్డీవో భాగస్వామ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ఆకాశ్ తర్వాత ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఇతర క్షిపణి, రక్షణ వ్యవస్థలేవి? తీరప్రాంత నిఘా వ్యవస్థపై చాలాదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ధ్వని కంటే వేగంగా ప్రయాణించగల క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, అత్యాధునిక ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి వ్యవస్థల్లోని పలు రకాలపై, సోనార్లు, యుద్ధభూమిలో ఉపయోగించే రాడార్ల కోసం దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు సమాచారం కోరుతున్నాయి. కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి కూడా.. కొన్ని దేశాలు భారత్ సొంతంగా తయారు చేసుకున్న దృశ్య కాంతికి ఆవల కూడా పని చేయగల ‘అస్త్ర’కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. వేర్వేరు యుద్ధ విమానాలతో అనుసంధానించగలగడం ఈ అస్త్ర ప్రత్యేకత.. క్షిపణి వ్యవస్థల ఎగుమతుల కారణంగా భారత్‌కు వ్యూహాత్మకంగా ఏమైనా నష్టం జరుగుతుందా? అలాంటిదేమీ ఉండదు.. ఎందుకంటే ఈ క్షిపణి వ్యవస్థల్లోని సాంకేతిక పరిజ్ఞానాలు అన్నింటినీ డీఆర్డీవో శాస్త్రవేత్తలు సున్నా నుంచి మొదలుపెట్టి పూర్తి చేశారు కాబట్టి. ఈ టెక్నాలజీలను ఎలా ఒక రూపంలోకి చేర్చాలన్నది మనకు మాత్రమే తెలిసిన విషయం.. కమాండ్ కంట్రోల్ సిస్టమ్, సాఫ్ట్వేర్, అల్గారిథమ్స్ వంటివి పూర్తిగా దేశీయంగానే తయారు చేసుకున్నాం.. ఈ కారణంగానే అతితక్కువ ఖర్చుతో, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం.. మన టెక్నాలజీలు అంతర్జాతీయ మార్కెట్లోకి చేరితే మనకు లాభమే తప్ప నష్టమంటూ ఏదీ లేదు. భారత్ తన మిత్ర దేశాలకు మాత్రమే రక్షణ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తుండటం వల్ల భవిష్యత్తులో ఆయా దేశాలతో సహకారానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.. ఆత్మనిర్భర్ భారత్ కోసం డీఆర్డీవో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ఎప్పటివరకు పూర్తవుతాయి? ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో రక్షణ రంగం ఓ కీలకమైన అంశం. రానున్న ఐదు, పదేళ్లలో భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించనుంది. కీలకమైన టెక్నాలజీలను దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రులు, టోర్పెడోలు, సమాచార వ్యవస్థల విషయంలో మనం ఇప్పటికే స్వావలంబన సాధించాం. భారత్‌కు తనదైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ట్యాంకులను కూడా సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఎంత శాతం రక్షణ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం? రక్షణ అవసరాలకు సంబంధించి 2020 డిసెంబర్లో దిగుమతులపై నిషేధం విధించారు. మన అవసరాల్లో చాలావాటిని దేశీయ పారిశ్రామిక వర్గాల ద్వారా తీర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న ఆరు, ఏడేళ్లలో ఇది అవుతుంది. రక్షణ అవసరాలు ఎంతమేరకు తగ్గించుకోగలుగుతామన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే దేశీయంగా తయారుచేసుకుంటున్న పలు వ్యవస్థలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. డిజైన్, డెవలప్మెంట్తో పాటు తయారీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఐదేళ్లలో పూర్తిస్థాయి స్వదేశీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2020 నాటికి మన రక్షణ అవసరాల్లో దిగుమతుల శాతమెంత? అవి ఏయే రంగాల్లో ఉన్నాయి? దిగుమతులపై ఆధారపడటం క్రమేపీ తగ్గుతోంది. ఇప్పటికే సుమారు 4,700 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిల్లో చాలావాటిని సొంతంగా తయారు చేసుకునే ప్రక్రియలో డీఆర్డీవో ఉంది. రాడార్లు, సోనార్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, టొర్పెడోలు, మందుపాతరల వంటి వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. హోవిట్జర్ ఏటీఏజీఎస్, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించల క్షిపణుల్లోనూ భారత్ తన సామర్థ్యాన్ని చాటుకుంది. కార్బైన్ల పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. ఈ కార్బైన్లతోపాటు అనేక ఇతర చిన్న ఆయుధాలను కూడా దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. -
ఆర్మీ స్వదేశీ వారధి
సాక్షి, హైదరాబాద్: ఆత్మనిర్భర భారత్ ప్రస్థానంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఇంకో ముందడుగు వేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు వీలుగా పది మీటర్ల పొడవైన తాత్కాలిక వారధిని అభివృద్ధి చేసింది. వాగులు, వంకల వంటి అడ్డంకులను వేగంగా దాటేందుకు ఆర్మీ ఈ వారధులను ఉపయోగిస్తుంది. లార్సెన్ అండ్ టూబ్రోకు చెందిన తాలేగావ్ కార్యాలయంలో సిద్ధమైన ఈ తాత్కాలిక వారధిని మంగళవారం ఆర్మీకి అందజేశారు. డీఆర్డీవో, ప్రైవేట్ కంపెనీలు సంయుక్తంగా పనిచేయడం ద్వారా ఈ వారధిని త్వరగా అభివృద్ధిచేయగలిగినట్లు డీఆర్డీవో తెలిపింది. ఇన్నాళ్లూ ఇలాంటి వారధులను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. తొలిసారి పూర్తి స్వదేశీ టెక్నాలజీ, డిజైన్లతో దీన్ని రూపొందించారు. -
ఎంఆర్ఎస్ఏఎం క్షిపణి ప్రయోగం విజయవంతం
భువనేశ్వర్: ఒడిశా తీరంలో గల చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఆర్మీ వెర్షన్ నుండి ప్రయోగించిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్(MRSAM) పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా డీఆర్డీవో స్వదేశీ పరిజ్ఞానంతో భారత సైన్యం కోసం ఈ క్షిపణిని రూపొందించింది. పరిక్షదశలో ఈ క్షిపణి వేగవంతమైన మానవరహిత వైమానిక లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా మొదట బ్రిటిష్ డ్రోన్ మానవరహిత వైమానిక వాహనం(యుఎవి) బాన్షీని గగన్ తలంలోకి పంపించి.. ఆ తర్వాత మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్‌తో దాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రయోగించిన మొదటి దశలోనే లక్ష్యాన్ని ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ప్రయోగానికి ముందు డీఆర్డోవో ప్లాంట్‌కు 2.5కి.మీ పరిధిలో గల ప్రజలను ఖాళీ చేయడంతో పాటు స్థానిక మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని రెవిన్యూ అధికారులు సూచించారు. దాదాపు 100కి.మీ దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. అలాగే 60కేజీ పేలోడ్, 4.5 మీటర్ల పొడవైన అణు సామర్థ్యం గల క్షిపణిలను ఇది మోసుకెళ్లగలదు. దీని బరువు సుమారు 2.7 టన్నులు. మెరుపువేగంతో భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ మిషన్‌లో పాల్గొన్న డీఆర్డీఓ, అనుబంధ బృంద సభ్యుల కృషిని ప్రశంసించారు. స్వదేశీ ఆధునిక ఆయుధ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో భారతదేశం ఉన్నత స్థాయి సామర్థ్యాన్ని సాధించిందని అన్నారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు డీఆర్డీఓ బృందాన్ని డీఫెన్స్ ఆర్ అండ్ డీ కార్యదర్శి, ఛైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి అభినందించారు. -
త్రివిధ దళాలకు డీఆర్డీఓ వ్యవస్థలు
న్యూఢిల్లీ: రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) అభివృద్ధి చేసిన మూడు భద్రత వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు. ఇండియన్ మారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్(ఇమ్‌సాస్)ను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌కు, అస్త్ర ఎంకే –1 క్షిపణి వ్యవస్థను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియాకు, బోర్డర్ సర్వీలెన్స్ సిస్టమ్(బాస్)ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు రాజ్‌నాథ్ అందజేశారని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో రక్షణ శా ఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు. క్షిపణుల కంటే సెల్ ఫోన్లే శక్తివంతం మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ భద్రత విషయంలో కొత్త ముప్పు పొంచి ఉంటోందని, యుద్ధ రీతులు సైతం మారిపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన శుక్రవారం చండీగఢ్‌లో జరిగిన మిలటరీ లిటరేచర్ ఫెస్టివల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశాల మధ్య ఘర్షణల విషయంలో సోషల్ మీడియా అధిక ప్రభావం చూపుతోందని గుర్తుచేశారు. క్షిపణుల కంటే మొబైల్ ఫోన్ల పరిధే ఎక్కువ అని తెలిపారు. శత్రువు సరిహద్దు దాటకుండానే మరో దేశంలోని ప్రజలను చేరుకొనే సాంకేతికత వచ్చిందని, అందుకే ప్రతి ఒక్కరూ సైనికుడి పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. -
బస్సుల్లో అగ్ని ప్రమాదాలు నివారించే టెక్నాలజీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణ సమయాల్లో ప్రజారవాణా బస్సుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి, నివారించే ‘ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం’ (ఎఫ్డీఎస్ఎస్)కు సంబంధించిన డెమోను కేంద్రానికి చూపించింది. ఈ డెమోను సోమవారం∙రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. ప్యాసింజర్ కంపార్ట్మెంట్ భద్రత కోసం నీటి ఆధారిత ఎఫ్డీఎస్ఎస్ విధానాన్ని, ఇంజన్లో చెలరేగే మంటలను కట్టడి చేసేందుకు ఏరో సొల్యూషన్ ఆధారిత ఎఫ్డీఎస్ఎస్ విధానాన్ని వారికి అధికారులు వివరించారు. æప్యాసింజర్ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగిన 30 సెకన్లలో గుర్తించి 60 సెకన్లలో చల్లార్చే విధంగా నూతన ఫైర్ డిటెన్షన్ అండ్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను తయారుచేశారు. ఇందులో భాగంగా బస్సులో 80 లీటర్ల నీటి ట్యాంకును, 6.8కేజీల నైట్రోజన్ సిలిండర్‌ను అమర్చారు. కొత్త విధానం ద్వారా మంటలను 5 సెకన్లలోనే ఆర్పివేయవచ్చు. దీనిని రూపొందించిన శాస్త్రవేత్తలను రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి అభినందించారు. అనంతరం డీఆర్డీవోలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ సిస్టమ్ మోడల్‌ను రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ( పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది: రాజ్‌నాథ్) -
అమ్ముల పొదిలో నాగాస్త్రం
జైపూర్: మన దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్ తుది దశ ప్రయోగాలను రక్షణ అధ్యయన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో గురువారం ఉదయం 6:45 గంటలకి నాగ్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను కచ్చితంగా ఛేదించినట్టు డీఆర్డీఓ వెల్లడించింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్ గైడ్ (ఏటీజీఎం)ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. నాగ్ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రయినా, పగలైనా శత్రువుల యుద్ద ట్యాంకుల్ని, ఇతర సాయుధ వాహనాల్ని ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి క్యారియర్ని రష్యాకు చెందిన బీఎంపీ–2 పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఈ తరహా పరిజ్ఞానం ‘లాక్ బిఫోర్ లాంచ్’ వ్యవస్థని కలిగి ఉంటుంది. అంటే క్షిపణిని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో కేంద్రం క్షిపణి ప్రయోగాలను వేగవంతం చేసింది. తుది దశ ప్రయోగం విజయవంతం కావడం పగలు, రాత్రి కూడా క్షిపణి కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంతో ఈ క్షిపణి ఉత్పత్తి దశకు చేరుకుందని డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ క్షిపణి ఇక భారత అమ్ముల పొదిలోకి చేరడానికి సిద్ధంగా ఉంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో నాగ్ క్షిపణిని మోహరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పోఖ్రాన్లో నింగిలోకి దూసుకెళ్తున్న నాగ్ క్షిపణి -
నాలుగైదేళ్లలో సంపూర్ణ క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసేందుకు మరో నాలుగైదు ఏళ్లు పడుతుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధ్యక్షుడు డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. డీఆర్డీవో రెండు నెలల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పది క్షిపణులను విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో సతీశ్‌రెడ్డి ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. డీఆర్డీవో ప్రస్తుతం దేశ రక్షణ దళాలకు అవసరమైన ఏ రకమైన క్షిపణి వ్యవస్థనైనా తయారు చేసి ఇవ్వగల సత్తా కలిగి ఉందని ఆయన ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒకవైపు చైనాతో లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యలు కొనసాగుతున్న ఈ తరుణంలో డీఆర్డీవో అధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. శత్రుదేశాల రాడార్లను గుర్తించి నాశనం చేయగల రుద్రం–1తోపాటు బ్రహ్మోస్, అతిధ్వని క్షిపణి ఆధారిత జలాంతర్గామి వ్యతిరేక వ్యవస్థ, ధ్వనికి ఏడు ఐదారు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగల, అణ్వాయుధ సామర్థ్యమున్న శౌర్య తదితరాలను డీఆర్డీవో రెండు నెలల్లో పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ నినాదంలో భాగంగా డీఆర్డీవో స్వదేశీ ఆయుధ వ్యవస్థల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాము ఒకవైపు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఇంకోవైపు రక్షణ దళాలకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని సతీశ్‌రెడ్డి తెలిపారు. కోవిడ్–19 పరిస్థితుల్లోనూ డీఆర్డీవో శాస్త్రవేత్తలు ఆయుధ వ్యవస్థల తయారీని కొనసాగిస్తున్నారని, ఒక్కో వ్యవస్థ సిద్ధమైన కొద్దీ వాటిని అప్పటికప్పుడు పరీక్షిస్తున్నామని, తద్వారా తయారీ ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నామని ఆయన వివరించారు. పారిశ్రామికవేత్తలకు సాయం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేం దుకు డీఆర్డీవో చేస్తున్న కృషికి దేశీ పారిశ్రామిక వేత్తలూ తమవంతు సహకారం అందిస్తున్నారని సతీశ్‌రెడ్డి తెలిపారు. రక్షణ అవసరాలకు తగ్గట్టుగా వ్యవస్థలను డిజైన్ చేయడంతోపాటు అభివృద్ధి చేయగలుగుతున్నారని చెప్పారు. పారిశ్రామివేత్తలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీ నిధి ఒకదాన్ని ఏర్పాటు చేయడంతోపాటు వారు పరీక్షలు జరిపేందుకు డీఆర్డీవో పరిశోధన శాలను వారి అందుబాటులో ఉంచామని వివరించారు. రక్షణ దళాల కోసం అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేసేందుకు డీఆర్డీవో చాలా కాలంగా ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే రెండు నెలల్లో అనేక క్షిపణి వ్యవస్థల పరీక్షలు జరిగాయని తెలిపారు. క్షిపణులు, రాడార్లు, ఎలక్ట్రానిక్స్ యుద్ధం, టొర్పెడోలు, తుపాకులు, సమాచార వ్యవస్థ తదితర అంశాల్లో భారతదేశం పూర్తిస్థాయి స్వావలంబన సాధించిందని చెప్పారు. -
రుద్రం.. శత్రు రాడార్లు ఇక ధ్వంసం
బాలాసోర్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మన దేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత వాయుసేనను బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి కచ్చితంగా తన లక్ష్యాలను ఛేదించడం ఒక మైలురాయిగా నిలి చిపోయింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్రం ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేసి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇప్పటికే నిర్భయ, శౌర్య వంటి క్షిపణుల్ని ప్రయోగించి చూసిన భారత్ ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి ప్రయోగంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రుద్రం ప్రత్యేకతలు ► దీన్ని సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు. ► శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు. ► 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (ఎన్‌జీఏఆర్‌ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది ► గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్ హోమింగ్ హెడ్ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్‌ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది. ► ఐఎన్ఎస్–జీపీఎస్ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ► దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు. ► 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం. -
‘స్మార్ట్’ విజయవంతం
బాలాసోర్(ఒడిసా): భారత నావికా దళం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం చేరనుంది. దేశీయంగానే అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. యాంటీ–సబ్‌మెరైన్ యుద్ధ తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ‘స్మార్ట్’తో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ తెలియజేసింది. సోమవారం ఉదయం 11.45 గంటలకు ఒడిశా తీరంలో ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్)లో ‘స్మార్ట్’ను పరీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుం డా పరీక్ష పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ‘స్మార్ట్’పరీక్ష నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. -
దేశ రక్షణలోకి 'స్మార్ట్'గా...
ఒడిశా: భారత్ సైనికుల చేతిలోకి మరో ఆయుధం చేరింది. 'సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పెడో '(స్మార్ట్)ను ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణికి సంబంధించిన అన్ని లక్ష్యాలు అనుకున్న స్థాయిలో ఉన్నాయని డీఆర్డీవో అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోకు అభినందనలు తెలిపారు. సాంకేతిక పరంగా ఇది గొప్ప విజయమని...యుద్ధ సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. 'యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్'లో స్మార్ట్ క్షిపణి కీలకంగా వ్యవహరిస్తుంని డీఆర్డీవో ఛైర్మన్ డి. సతీశ్ రెడ్డి అన్నారు. ఈ నెల ఆరంభంలో 'లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్' క్షిపణిని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. -
స్క్రామ్‌జెట్ పరీక్ష విజయవంతం
చండీపూర్: భారత రక్షణ పరిశోధన సంస్థ మరో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. క్షిపణుల వేగాన్ని ఆరు రెట్లు ఎక్కువ చేసే స్క్రామ్‌జెట్ ఇంజిన్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఘనత సాధించిన అతితక్కువ దేశాల సరసన భారత్‌ను సగర్వంగా నిలిపింది. పూర్తిగా దేశీయంగానే తయారైన ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్లు భవిష్యత్తు అగ్ని –5, బ్రహ్మోస్ వంటి క్షిపణులను నడిపిస్తాయని అంచనా. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీ పారిశ్రామిక రంగం సాయంతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్షిస్తున్న డీఆర్డీవో ఆ దిశగా మరో ముందడుగు వేసినట్లే. ఒడిశాలోని వీలర్ ఐల్యాండ్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలామ్ కాంప్లెక్స్‌లో సోమవారం ఉదయం 11.03 గంటలకు ప్రయోగం జరగ్గా... హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ వెహికల్ (హెచ్‌ఎస్‌టీటీవీ) విజయవంతంగా నింగికి ఎగసిందని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒక ప్రకటనలో తెలిపింది. హెచ్‌ఎస్‌టీటీవీ 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత ఏరడైనమిక్ హీట్‌షీల్డ్స్ వేరుపడ్డాయని, ఆ తరువాత క్రూయిజ్ వాహనం ముందుకు దూసుకెళ్లిందని ఆ ప్రకటన వివరించింది. ముందుగా నిర్దేశించిన మార్గంలో సెకనుకు రెండు కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం మొదలుపెట్టిందని, లాంచ్ వెహికల్ నుంచి వేరుపడిన వెంటనే స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరిసరాల్లోని గాలికి ఇంధనాన్ని జోడించి మండటం మొదలుపెట్టిందని, అన్ని వ్యవస్థలూ సక్రమంగా పనిచేసినట్లు టెలిమెట్రీ స్టేషన్లలోని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు గుర్తించాయి. స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరును పరిశీలించేందుకు బంగాళాఖాతంలో ఒక ప్రత్యేక నౌకను ఏర్పాటు చేయడం గమనార్హం. దశాబ్దాల పరిశోధనల ఫలితంగా ఈ స్క్రామ్‌జెట్ ఇంజిన్ ప్రయోగం విజయవంతమైందని, సంక్లిష్టమైన టెక్నాలజీలను సైతం దేశీయంగానే అభివృద్ధి చేయగలమన్న నమ్మకాన్ని పెంచిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నో ప్రయోజనాలు... స్క్రామ్‌జెట్ ఇంజిన్ల వల్ల ధ్వనికి ఆరురెట్ల వేగంతో ప్రయాణించడం ఒక్కటే ప్రయోజనం కాదు. రాకెట్లు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఆక్సిజన్‌ను మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంజిన్‌లో తిరిగే భాగాలు ఏవీ ఉండవు కాబట్టి ప్రస్తుతం రాకెట్లలో వాడుతున్న టర్బోజెట్ల కంటే సులువుగా స్క్రామ్జెట్లను తయారు చేయవచ్చు. అందించే ప్రతి లీటర్ ఇంధనానికి ఈ ఇంజిన్లు అందుకునే వేగం సాధారణమైన వాటికంటే చాలా ఎక్కువ. వేగం కూడా చాలా ఎక్కువ కాబట్టి అంతరిక్ష ప్రయోగాలు చాలా చౌక అవుతాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయం నుంచి స్క్రామ్జెట్లను అభివృద్ధి చేసేందుకు పలు దేశాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే 1991లో రష్యా తొలిసారి ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఆ తరువాతి కాలాల్లో ఫ్రాన్స్, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలు ఈ టెక్నాలజీని అందుకున్నాయి. ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ఇంజిన్లు సాధించిన గరిష్ట వేగం ధ్వనికి 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2007లో నాసా, ఆస్ట్రేలియాకు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్లు సంయుక్తంగా ఈ ఘనతను సాధించాయి. ప్రధాని అభినందనలు స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీవోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘హైపర్సోనిక్ టెస్ట్ డెమాన్‌స్ట్రేషన్ వెహికల్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవోకు అభినందనలు. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్క్రామ్‌జెట్ ఇంజిన్ ధ్వని వేగం కన్నా ఆరురెట్లు అధికవేగాన్ని అందుకొంది. అతికొద్ది దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది’అని మోదీ ట్వీట్ చేశారు. స్క్రామ్‌జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఓ చరిత్రాత్మక ఘనత అని వ్యాఖ్యానించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. -
డీఆర్డీఓ మరో అరుదైన ఘనత
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్త్రేషన్ వెహికిల్‌ని విజయవంతంగా పరీక్షించింది. ఒరిస్సా తీరంలో సోమవారం ఈ పరీక్షను నిర్వహించారు. వాతావరణంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ధ్వని వేగం కంటే ఆరు రెట్లు వేగంతో పనిచేయనున్న హైపర్ సోనిక్ వెహికల్ స్క్రామ్ జెట్ ఇంజన్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ అరుదైన ఘనత సాధించిన దేశాల జాబితాలో భారత్ నాలుగో దేశంగా గుర్తింపు పొందింది. హైపర్ సైనిక్ టెక్నాలజీ టెస్ట్ విజయవంతంతోమరిన్ని క్లిష్టమైన సమస్యలకు సమాధానాలు సులువుగా దొరికే అవకాశం ఉంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాజా ప్రయోగంతో భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలిపారని ప్రశంసించారు. -
‘ఆత్మ నిర్భర్’తో నూతనోత్తేజం
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగంలో స్వావలం బనకు సరికొత్త ప్రయత్నం మొదలైంది. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా 108 వ్యవస్థలు, ఉపవ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు డీఆర్డీవో శ్రీకారం చుట్టింది. ఈ టెక్నాల జీలు మనకు చేసే మేలు ఏమిటి? ఆత్మ నిర్భర్ భారత్‌తో రక్షణ రంగంలో వచ్చిన మార్పులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనేందుకు డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీశ్‌రెడ్డితో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: రక్షణ రంగంలో స్వావలంబన కోసం ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో వచ్చిన మార్పులేమిటి? జవాబు: స్వావలంబన సాధించాలన్నది దేశ చిరకాల వాంఛ. నిజానికి డీఆర్డీవో ఏర్పాటు ఉద్దేశాల్లో ఇది ఒకటి. ఆరు దశాబ్దాలుగా డీఆర్ డీవో కీలకమైన రక్షణరంగ వ్యవస్థల్లో ఇతరు లపై ఆధారపడకుండా ఉండేందుకు పరిశోధ నలు సాగిస్తోంది. స్వావలంబన సాధించేం దుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ ద్వారా పిలుపునిచ్చారు. దీనివల్ల అక్కడక్కడా జరుగుతున్న వేర్వేరు ప్రయత్నాలు ఏకతాటి పైకి వస్తాయి. ఫలితంగా లక్ష్యాన్ని వేగంగా అందుకోవచ్చు. ప్రధాని పిలుపు రక్షణ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో కొత్త చైతన్యం నింపిందనడంలో సందేహం లేదు. శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పును నేను కూడా ప్రత్యక్షంగా గమనిస్తున్నా. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం డీఆర్డీవో అంతర్గత శక్తియుక్తులను బహిర్గతం చేస్తోందంటే అతిశయోక్తి కాదు. ప్ర: దేశానికి అవసరమైన అన్ని రకాల మైక్రోప్రాసెసర్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లను సొంతంగా తయారు చేసుకొనే అవకాశం ఉందా? జ: కచ్చితంగా ఉంది. ఆధునిక ప్రపంచంలో యుద్ధం తీరుతెన్నులు మారిపోతున్నాయి. సైబర్ యుద్ధం నేపథ్యంలో వ్యూహాత్మక వ్యవస్థలు, ఆస్తులను కాపాడుకోవడం అత్యవసరం. డీఆర్డీవో ఇందుకోసం అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తోంది. మనదైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాం. డీఆర్డీవో ఇప్పటికే సొంత ఓఎస్‌ను అంతర్గతంగా ఉపయోగిస్తోంది. మైక్రోప్రాసెసర్ల తయారీలో కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని తప్పించుకొనేందుకు పరిశ్రమ వర్గాలతో కలసి సిస్టమ్ ఆన్ చిప్‌తోపాటు కొన్ని ప్రాసెసర్ల అభివృద్ధి కూడా చేపట్టాం. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితాలను మనం త్వరలోనే చూడబోతున్నాం. ప్ర: ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కోసం డీఆర్డీవో గుర్తించిన 108 రకాల రక్షణ వ్యవస్థల వల్ల లాభాలేమిటి? జ: భారతీయ పరిశ్రమ వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఈ 108 రక్షణ వ్యవస్థలు, ఉప వ్యవస్థలపై పనిచేసే క్రమంలో పరిశ్రమ వర్గాలు అత్యాధునిక టెక్నాలజీల డిజైనింగ్, డెవలప్మెంట్ సామర్థ్యాన్ని సంపాదించుకుంటాయి. ఈ సామర్థ్యం కాస్తా పరిశ్రమ మరింత ప్రగతి సాధించేందుకు తద్వారా భవిష్యత్తులో దేశ రక్షణ అవసరాలను తీర్చగలిగేవిగా మారతాయి. ఆత్మనిర్భర్ భారత్‌కు పరిశ్రమ తోడ్పాటు అందించడమే కాకుండా రక్షణ రంగంలో మరిన్ని ఎగుమతులు సాధించేందుకు వీలు ఏర్పడుతుంది. ప్ర: డీఆర్డీవో టెక్నాలజీలను సామాన్యులకు దగ్గర చేసేందుకు ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? జ: సరిహద్దు ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న ప్రజలు చాలా మంది ఇప్పటికే డీఆర్డీవో టెక్నాలజీలతో లాభం పొందుతున్నారు. కొండ ప్రాంతాల్లోనూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు అనువైన టెక్నాలజీలను మేం రూపొందించాం. ఈ పద్ధతిలో పండిస్తున్న పంటలను సమీపంలోని భద్రతా దళాలు వినియోగిస్తున్నాయి. డెంగీ, చికన్ గున్యా, దోమల్లాంటి కీటకాలను పారదోలే మందు, ఆహార కాలుష్యాన్ని గుర్తించే కిట్లను చాలా మంది వాడుతున్నారు. మానవ వ్యర్థాలను ఇంధనంగా మార్చేందుకు డీఆర్డీవో బయో డైజెస్టర్‌ను అభివృద్ధి చేసింది. హిమాలయాల్లో విధులు నిర్వహించే సైనికుల కోసం సిద్ధం చేసిన ఈ టెక్నాలజీ ఇప్పుడు సమాజం మొత్తానికి ఉపయోగపడుతోంది. తాజాగా ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గుర్తించిన 108 వ్యవస్థల్లోనూ కొన్నింటిని సామాన్య ప్రజల వినియోగానికి తెచ్చే ప్రతిపాదన ఉంది. పౌరుల వాడకానికి ఉపయోగపడే టెక్నాలజీలను డీఆర్డీవో పరిశ్రమలకు ఉచితంగా బదలాయిస్తోంది. ప్ర: రక్షణ రంగంలో ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యం వల్ల ధరలు ఎక్కువ కావా? జ: కానేకావు. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... ఇందుకోసం పలు మార్పులు చేశాం. ఆరోగ్యకరమైన పోటీ కారణంగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా రక్షణ వ్యవస్థల ధరలు తక్కువగానే ఉంటాయి. ఎగుమతులు చేసుకొనేందుకూ అవకాశం కల్పిస్తుండటం వల్ల పరిశ్రమలకూ తగిన లాభాలు ఉంటాయి. ప్ర: ఆత్మనిర్భర భారత్ సాకారమైతే ఎంత డబ్బు ఆదా చేయవచ్చు? జ: రక్షణరంగ వ్యవస్థల అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది కొనసాగుతూనే ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చే మార్పులను జోడించడం, మెరుగైన వ్యవస్థలను సిద్ధం చేసుకోవడం అవసరం. అయితే దిగుమతుల ఖర్చులతో పోలిస్తే స్థానికంగా తయారు చేసుకోవడం వల్ల మూడింట రెండొంతులు ఆదా అవుతుందని ఆశిస్తున్నాం. విదేశీ మారకద్రవ్యం రూపేణా పెద్ద మొత్తంలోనే ఆదా చేసుకోవచ్చు. -
డీఆర్డీఓ: సతీష్‌రెడ్డి పదవీ కాలం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చైర్మన్ శాస్త్రవేత్త జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండుళ్ల పాటు పొడిగించింది. ప్రస్తుతం డీఆర్డీఓ చీఫ్‌గా కొనసాగుతున్న సతీష్‌రెడ్డిని మరో రెండేళ్లు అదే పదవిలో కొసాగించాలని సోమవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్వర్వులు సైతం జారీచేసింది. ప్రస్తుతం సతీశ్‌రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామానికి చెందిన సతీశ్‌రెడ్డి హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులయ్యారు.1985లో డీఆర్డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు. హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్‌గా పనిచేశారు. -
దేశ భద్రతలో మరో కీలక ఆవిష్కరణ
న్యూఢిల్లీ: 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థను ఎర్ర కోట సమీపంలో శనివారం మోహరించారు అధికారులు. ఈ లేజర్ వెపన్ ఆకాశంలో 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను గుర్తించడమే కాక జామ్ చేయగలదు. అలానే 1-2.5 కిలోమీటర్ల దూరంలోని లేజర్ వెపన్ టార్గెట్లను వాటేజ్‌ను బట్టి చేధించగలదని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ, ఉత్తర భాగాలలో పెరిగిన డ్రోన్ ఆధారిత కార్యకలాపాలకు ఇది తగిన సమాధానం అవుతుందని భావిస్తున్నామన్నారు అధికారులు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను గుర్తు చేసుకుని వారికి నివాళులు ఆర్పించారు. ‘ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత మాత స్వాతంత్ర్యం కోసం పోరాడిన లక్షలాది మంది కుమారులకు, కుమార్తెలకు మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనందరం స్వతంత్ర భారతంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం అంటే వారి ప్రాణత్యాగ ఫలితమే. వారి త్యాగాలను మనం స్మరించుకోవాలి. అలానే మా భద్రత కోసం ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసులతో సహా ఇతర భద్రతా సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది’ అన్నారు నరేంద్ర మోదీ. అలానే స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో (అరవింద్ ఘోష్) ను ఆయన జయంతి సందర్భంగా ప్రధాని జ్ఞాపకం చేసుకున్నారు. -
భారత అమ్ములపొదిలో మరో అద్భుతం
భువనేశ్వర్: ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను భారత వైమానికి దళం విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువస్త్రా అని నామకరణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలసోర్‌లో జూలై 15, 16 తేదీల్లో క్షిపణి ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిస్సైల్) ప్రత్యక్ష హిట్ మోడ్‌తో పాటు టాప్ అటాక్ మోడ్‌లోనూ లక్ష్యాలను చేధించగలదని అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్యవస్థ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్‌లో పనిచేసే ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్) ద్వారా దీనికి మార్గదర్శకాలు అందుతాయి. దీనిలో అమర్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకులను విచ్చిన్నం చేయగలదు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి హెలీనా సహాయపడుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మరో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువస్త్రా)ని అభివర్ణిస్తున్నారు. (లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు ) #WATCH Trials of Helicopter-launched Nag Missile (HELINA), now named Dhruvastra anti-tank guided missile in direct and top attack mode. The flight trials were conducted on 15&16 July at ITR Balasore (Odisha). This is done without helicopter. pic.twitter.com/Jvj6geAGLY — ANI (@ANI) July 22, 2020 -
వెంటిలేటర్ల ఎగుమతికి సిద్ధం : డీఆర్డీఓ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాడేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఇప్పటివరకూ 70 మేడిన్ ఇండియా ఉత్పత్తులను రూపొందించిందని సంస్థ చైర్మన్ జీ. సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే తాము ప్రతినెలా 25,000 వెంటిలేటర్లను తయారు చేస్తామని..విదేశాలకు ఎగుమతి చేసేందుకు తాము సిద్ధమని ఆయన వెల్లడించారు. డీఆర్డీఓ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్-19 ఆస్పత్రి ఆదివారం ప్రారంభమైన సందర్భంగా సతీష్ రెడ్డి పలు వివరాలు అందించారు. 11 రోజుల్లోనే 250 ఐసీయూ పడకలతో సహా 10000 పడకల ఆస్పత్రిని నిర్మించారు. సకల సదుపాయాలతో కూడిన ఈ ఆస్పత్రిలో రోగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సైనిక సిబ్బంది 24 గంటల పాటు రోగుల సేవల్లో నిమగ్నవుతారని అన్నారు. కాగా ఢిల్లీ కంటోన్మెంట్లో డీఆర్డీఒఓ నిర్మించిన ఈ ఆస్పత్రిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం సందర్శించారు. మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే గరిష్టంగా 24,850 తాజా కేసులు వెలుగుచూశాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. తాజా పాజిటివ్ కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73, 165గా ఉంది. కాగా కరోనాతో ఒక్కరోజులో 613 మంది మరణించడంతో మరణాల సంఖ్య 19,268కి చేరుకుంది. చదవండి : చైనాకు ధీటుగా.. ఢిల్లీలో -
చైనాకు ధీటుగా.. ఢిల్లీలో
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీలు కరోనాకు హాట్‌స్పాట్స్‌గా మారాయి. జూలై చివరినాటికి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 5.5లక్షలకు చేరుకుంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా రోగులకు చికిత్స చేయడం కోసం ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని దక్షిణ ఢిల్లీలో నిర్మించారు. ఈ ఆస్పత్రి వివరాలు.. చత్తర్‌పూర్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్ బియాస్ కాంప్లెక్స్‌నే ఈ తాత్కాలిక కరోనా ఆస్పత్రిగా మార్చారు. 15 ఫుట్‌బాల్ మైదానాలతో సమానమైన ఈ ప్రత్యేక ఆస్పత్రికి ‘సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్’ అని పేరు పెట్టారు. దీనిలో 10,000 పడకల సామర్థ్యం ఉంది. చైనాలో 10 రోజుల్లో నిర్మించిన కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి కన్నా ఇది పదింతలు పెద్దది కావడం విశేషం. (సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటానని చెప్పి..) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. దాదాపు 1000 మంది జనరల్ డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు. మొత్తం బెడ్స్ని 10 విభాగాలుగా విభజిస్తారు. వీటిలో 1000 పడకలకు ఆక్సిజన్ పాయింట్లు అమర్చుతారు. రోగుల కోసం 5 వేల ఫ్యాన్లు, 1000 మూత్రశాలలు ఏర్పాటు చేశారు. లక్షణాలు కనిపించని కరోనా పాజిటివ్ రోగులకు.. తక్కువ లక్షణాలు ఉన్న వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. అయితే ఈ ఆస్పత్రిలో తొలుత 2,000 పడకలు అందుబాటులోకి రానుండగా.. జూలై 3 వరకు పూర్తి స్థాయిలో బెడ్స్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఢిల్లీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఐటీబీపీ దేశంలో తొలిసారి కరోనా పేషంట్ల కోసం జనవరిలో నైరుతి ఢిల్లీలోని చావ్లాలో 1,000 పడకల కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. (స్మైల్ ప్లీజ్.. కరోనాతో క్లోజ్..!) ఇదేకాక డీఆర్డీఓ మరో 1,000 పడకల ఎయిర్ కండిషన్డ్ ఆస్పత్రిని సిద్ధం చేస్తోంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. వాటిలో ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. -
సరికొత్త అల్ట్రావయొలెట్ శానిటైజర్
ఆల్ట్రావయొలెట్ సిస్టంను ఉపయోగించుకొని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను, కాగితాన్ని శానిటైజ్ చేసే ఈ పరికరాన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీఓ విభాగం నిపుణులు తయారు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రావయొలెట్ శానిటైజర్‌గా పిలిచే ఈ పరికరం లోపల మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, కరెన్సీ నోట్లు, చెక్కులు, చలాన్లు, పాసుబుక్కులు ఉంచవచ్చు. అందులోని ప్రత్యేక పరికరం 360 డిగ్రీల్లో యూవీ కిరణాలు ప్రసరింపజేస్తుంది. దీంతో వాటిపై ఉన్న వైరస్ నాశనమవుతుంది. శానిటైజేషన్ పూర్తవ్వగానే ఆటోమేటిగ్గా స్లీప్ మోడ్లోకెళుతుంది. -
వైరస్‌ను అంతం చేసే యూవీ బ్లాస్టర్...
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన యూవీ డిసెన్ఫెక్షన్ టవర్ ఇది. అతినీలలోహిత కిరణాలను వెదజల్లడం ద్వారా ఇది పరిసరాల్లోని వైరస్‌ను చంపేస్తుంది. రసాయనాల వాడకాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని డీఆర్డీవో తెలిపింది. యూవీ బ్లాస్టర్ అని పిలుస్తున్న ఈ యంత్రాన్ని లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ అభివృద్ధి చేసిందని, న్యూఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మెటీరియల్స్ (గుర్‌గ్రామ్) తయారు చేసిందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. కార్యాలయాల్లో, పరిశోధనశాలల్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను, కంప్యూటర్లను ఈ యంత్రం సాయంతో శుద్ధి చేయవచ్చు. జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్, మెట్రో రైళ్లు, హోటళ్లు, ఫ్యాక్టరీల్లోనూ దీన్ని వాడుకోవచ్చని డీఆర్డీవో తెలిపింది. ఒక్కో యంత్రం 12 అడుగుల వెడల్బు, 12 అడుగుల పొడవు ఉన్న గదిని పది నిమిషాల్లో శుభ్రం చేస్తుందని, 400 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు 30 నిమిషాల సమయం పడుతుందని వివరించింది. మొబైలఫోన్/ల్యాప్‌టాప్‌ల ద్వారా కూడా పనిచేయగల ఈ యంత్రం శక్తిమంతమైన 254 నానోమీటర్ల అతినీలలోహిత కాంతితో వైరస్‌ను నాశనం చేస్తుంది. -
కరోనా పరీక్షలకు మొబైల్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి దేశ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) మరో అద్భుత సాధనాన్ని అందుబాటులోకి తెచ్చింది. కరోనా పరీక్షల నిర్వహణకు ‘మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లేబొరేటరీ (ఎంవీఆర్‌డీఎల్)’పేరుతో కదిలే పరిశోధనశాలను సిద్ధం చేసింది. డీఆర్డీవో, ఈఎస్ఐసీ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ల్యాబ్.. కరోనా పరీక్షలతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై పనిచేయనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనిని గురువారం లైవ్ వీడియో ద్వారా ప్రారంభించి హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రికి అందించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కే.తారకరామారావు, చామకూర మల్లారెడ్డి, డీఆర్డీఓ చైర్మన్ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు. రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న సమాయానుకూల నిర్ణయాలతో కరోనా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగామని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో దేశ రక్షణ దళాలు వివిధ స్థాయిల్లో సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. హైదరాబాద్‌కే ఈ తొలి సదుపాయం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి.. డీఆర్డీవో శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. ఇటువంటి సదుపాయం హైదరాబాద్‌లో మొదట అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా 304 టెస్టింగ్ ల్యాబ్‌లను, 755 కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు 1.86 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్ర మంత్రి కే.తారకరామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 20 రోజుల్లోనే 1,500 పడకలతో టిమ్స్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు లాక్‌డౌన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. లాక్డౌన్ రోజుల్లో 88 లక్షల మందికి బియ్యం, నగదు పంపిణీ చేశామన్నారు. డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ మొబైల్ వైరాలజీ ల్యాబ్‌లో వైరస్ నిర్ధారణ పరీక్షలతోపాటు టీకా అభివృద్ధి, మందుల తయారీ కార్యక్రమాలు వేగవంతమవుతాయన్నారు. రోజుకు వెయ్యి పరీక్షల సామర్థ్యం మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్స్ లేబరేటరీ అభివృద్ధిలో ఈఎస్ఐసీతో కలిసి డీఆర్డీవో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) కీలకపాత్ర పోషించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారైన ఈ వ్యాన్లలో బయోసేఫ్టీ లెవెల్ (బీఎస్ఎల్) –2, లెవెల్ –3 కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఇందులో అన్ని ఎలక్ట్రానిక్ కంట్రోలర్లతోపాటు కంప్యూటర్ నెట్‌వర్క్‌కు అవసరమైన ల్యాన్, టెలిఫోన్, సీసీటీవీలు ఉన్నాయి. దేశంలోనే తొలిదైన ఈ మొబైల్ ల్యాబ్‌లో వైరస్‌ను, దానికి మందులను గుర్తించేందుకు, అందుకు వీలుగా వైరస్‌ను పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ స్వరూప స్వభావాలను అర్థం చేసుకునేందుకు కావాల్సిన పరీక్షలూ నిర్వహించవచ్చు. కరోనా టీకా అభివృద్ధి, వైరస్ కల్చర్, డ్రగ్ స్క్రీనింగ్, వ్యాక్సిన్ డెవలప్మెంట్, ప్లాస్మా థెరపీ, ఇమ్యూన్ ప్రొఫైలింగ్ పరీక్షలతో పాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. అవసరాన్ని బట్టి దీన్ని దేశంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. రోజుకు సగటున వెయ్యి పరీక్షలు చేయవచ్చు. మొబైల్ వ్యాన్ తయారీలో ఐకామ్, ఐక్లీన్ సంస్థలు బీఎస్ఎల్–2, 3 ప్రమాణాలతో దీనిని డిజైన్ చేశాయని, హైటెక్ హైడ్రాలిక్స్ అనే సంస్థ స్థూల నిర్మాణాన్ని అందించిందని డీర్డీవో తెలిపింది. సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ల్యాబ్ తయారీకి ఆర్నెళ్లు పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో త్వరగా అందుబాటులోకి తేవాలని భావించిన డీఆర్డీఏ.. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ శాస్త్రవేత్తల సహకారంతో 15 రోజుల్లోనే దీనికి రూపకల్పన చేసింది. -
ఆ ప్రయోగాలు చేయడం లేదు: సతీష్ రెడ్డి
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నియంత్రణ కోసం డీఆర్డీఓ అనేక నూతన ఆవిష్కరణలు చేస్తోందని ఆ సంస్థ చెర్మన్ సతీష్‌రెడ్డి చెప్పారు. శానిటైజర్లు, మాస్క్‌లు, వెంటిలేటర్స్ తయారు చేయడంతో పాటు.. నాలుగైదు లక్షల లీటర్ల శానిటైజర్ బాటిల్స్ పంచినట్లు తెలిపారు. ప్రతిరోజు 25 వేల ఎన్ 99 మాస్క్‌లను తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న టెక్నాలజీని అవసరమైన పరిశ్రమలకు అందజేస్తున్నామని తెలిపారు. ఐసీయూలో పనిచేసే వైద్యుల కోసం ప్రత్యేకంగా ఫుల్ మాస్క్ కిట్లను రూపొందించామన్నారు. టెస్ట్ కిట్ల తయారీ ప్రయోగాలు తాము జరపడం లేదని తెలిపిన సతీష్‌రెడ్డి.. చిత్ర అనే సంస్థ దీనిపై పని చేస్తోందని పేర్కొన్నారు. అయితే తాము ఆ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఇన్ఫ్రారెడ్ థర్మమీటర్ని తయారు చేశాం. టచ్ చేయకుండా ఉపయోగించే శానీ టైసింగ్ కిట్లను రూపొందించాం. రేపటి నుంచి ఆఫీసులు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ కిట్లు చాలా ఉపయోగపడతాయి. కేవలం ఐదు వేల రూపాయలకు ఈ బాక్స్ అందుబాటులో ఉన్నాయి. డీఆర్డీఓలో తయారు చేసిన పీపీఈలు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి. పీపీఈ కిట్లను సర్టిఫై చేసేందుకు ప్రత్యేకంగా భూపాల్‌లో ఉన్న మా ల్యాబ్‌ను రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించాం. హైదరాబాదులో 20 వేల ఫుల్ ఫేస్ మాస్క్‌లను తయారు చేసి పంచాము. ఏరో సిల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ను కూడా డాక్టర్ల కోసం తయారు చేసి ఆసుపత్రులకు ఇచ్చాం. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆస్పత్రి సహకారంతో వీటిని రూపొందించాము. ఒక వెంటిలేటర్ అనేక మందికి ఉపయోగపడేలా.. ప్రతిసారీ పీపీఈ సూట్ ధరించకుండా నేరుగా ఒక ప్రత్యేక చాంబర్ తయారుచేశాం. ఈ చాంబర్ ద్వారా డాక్టర్లు రోగులను నేరుగా పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో డాక్టర్లు సేఫ్ ఉంటారు. ఒక వెంటిలేటర్‌ను అనేకమందికి ఉపయోగించేలా ప్రయోగం చేశాం. ఈ ప్రయోగాన్ని పరీక్షించి మరింతగా మెరుగులు దిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలో ఈ పరికరం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫుల్ బాడీ చాంబర్ లను తయారు చేస్తున్నాం. ప్రతిసారి బాటిల్ పట్టుకోకుండా రిమోట్ సెన్సింగ్‌తో బాటిల్ స్ప్రే చేసుకునేలా బాక్స్ రూపొందించాం. ప్రతి ఆఫీసు ఎంట్రెన్స్‌లో ఈ బాక్స్‌ను పెట్టుకోవచ్చు. అల్ట్రా వైలెట్ టెక్నాలజీ తో శానిటైజ్ చేసే టెక్నాలజీ రూపొందించాం. అందరు కలిసి ఎదుర్కోవాల్సి ఉంది.. టెస్ట్ కిట్ల తయారీ ప్రయోగాలు మేము జరపడం లేదు. చిత్ర అనే సంస్థ టెస్ట్ కిట్లపై పని చేస్తుంది. ఆ సంస్థలకు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. వీలైనంతవరకు టెస్టులు పెరగాలి. అయితే అందరికీ కరోనా టెస్టులు చేయడం సాధ్యం కాదు. బయో వార్ , వైరస్ లను ఎదుర్కొనేందుకు అన్ని మంత్రిత్వశాఖలు కలిసి ప్రయోగాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్లను తాము చేసే పనిలో భాగంగానే రూపొందిస్తున్నాయి. ఈ ప్రయోగాలు కొద్దిరోజుల్లోనే సఫలీకృతమవుతాయి. దాంతో దేశంలోని సొంతంగా వ్యాక్సిన్లను తయారు చేసే పరిస్థితి వస్తుంది. పరిశ్రమలు కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ముప్పు ను అందరు కలిసి ఎదుర్కోవాల్సి ఉంది. రక్షణ శాఖ అప్రమత్తంగా ఉంది.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్ కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సకాలంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వ్యాప్తిని అడ్డుకున్నారు. మాస్కులు, మందులు, వ్యాక్సిన్లు తయారీ ద్వారా ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల పరిజ్ఞానంతో ఈ ప్రయోగాలన్నీ సత్ఫలితాలు ఇస్తాయి. ముంబై నౌకాదళంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై రక్షణ మంత్రిత్వ శాఖ.. అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ పూర్తి సంసిద్ధత తో ఉంది. ఎక్కువ పరిశ్రమలకు టెక్నాలజీని బదిలీ చేయడం ద్వారా భారీ సంఖ్యలో వెంటిలేటర్లు తయారు చేస్తున్నాము. దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ సింగ్ అందరూ పాటించాలి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. దీని ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు’ అని తెలిపారు. -
కరోనా కట్టడిలో డీఆర్డీవో కీలక ముందడుగు
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి దేశ రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో మరో కీలక ఉత్పత్తులను తీసుకొచ్చింది. ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌తో సహా మరో రెండు ఉత్పత్తులను అభివృద్ధి చేసిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ముఖ్యంగా అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్, చేతితో తాకే అవసరం లేకుండానే ఉపయోగించే యూవీసీ శానిటైజర్ క్యాబినెట్‌ను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ ప్లోజివ్ అండ్ ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ సంస్థ అనుసంధానంతో అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా పనిచేసే ఆటోమేటిక్ మిస్ట్-బేస్డ్ శానిటైజర్ డిస్పెన్సింగ్ యూనిట్‌ను అభివృద్ధి చేసింది. దీంతోపాటు ఢిల్లీలోని డిఫెన్స్ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డిపాస్) ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ తో కలిసి అతినీలలోహిత సి లైట్-బేస్డ్ శానిటైజేషన్ బాక్స్ యూవీ-సీ(254 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో అతినీలలోహిత కాంతి రూపొందించాయి.తద్వారా రసాయనాలను ఉపయోగించి శుభ్రపరచలేని ఏ వస్తువునైనా శుభ్రపరచడానికి ఇది ఉపయోగ పడుతుంది. చెక్కులు, పాస్‌బుక్‌లు, పేపర్ కవర్లులాంటి రోజవారీ వినియోగించే వస్తువుల నుంచి కరోనా వ్యాపించకుండా నిరోధించవచ్చు. ఈ కిరణాలు కరోనా వైరస్ లోనిని జన్యు పదార్ధాలను నాశనం చేయడంలో, పునరుత్పత్తిని నిరోధిచండంలో చాలా బాగా పనిచేస్తాయిని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. డీఆర్డీవో డైరెక్టర్ బిహెచ్ఎస్వి నారాయణ మూర్తి నేతృత్వంలోని సిఎన్‌టి అత్యుత్తమ శాస్త్రవేత్త సౌరభ్ కుమార్, ఎస్. గోపీనాథ్ కేవలం రెండు వారాల రికార్డు సమయంలో రూపొందించచారు. అతినీలలోహిత (యూవీసి) కిరణాలు క్రిమిసంహారక ప్రభావాన్నికలిగి ఉన్నట్లు కనుగొన్నామని చెప్పారు. మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్, ల్యాప్‌టాప్, కరెన్సీ నోట్స్ వంటివాటితో పాటు, కరెన్సీ నోట్లు, పాస్‌బుక్‌లు, ఇతర ముఖ్యమైన పత్రాలను శుభ్రపరిచే క్రమంలో బ్యాంకర్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ఆసుపత్రులు, మాల్స్, కార్యాలయ భవనాలు, నివాస భవనాలు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు ఇతర క్లిష్టమైన ప్రదేశాలకు వెళ్లినపుడు చేతుల శానిటైజేషన్ కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల దగ్గర కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. కోవిడ్-19 తో పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని డీఆర్డీవో శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. అలాగే ఎన్-95 మాస్క్‌లు పునర్వినియోగతనుకూడా పెంచుతుందనీ తెలిపింది. అంతేకాదు శానిటైజర్ బాక్స్ ద్వారా కనీస వృధాతో చేతులను శుభ్రపరుచుకోవచ్చని చెప్పింది. ఒకసారికి 12 సెకన్ల పాటు 5-6 మి.లీ శానిటైజర్ మాత్రమే విడుదల అవుతుందని వెల్లడించింది. దీని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి హైదరాబాద్ లోని ఎర్రగడ్డలోని ఇఎస్ఐసికి అప్పగించామన్నారు. -
చైనా పీపీఈ కిట్లు నాసిరకం!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా కంపెనీలు వ్యక్తిగత రక్షణ ఉపకరణాల(పీపీఈ) కిట్లను ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే, వీటిలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన చైనా నుంచి 1,70,000 పీపీఈ కిట్లు భారత్‌కు చేరుకున్నాయి. ఇందులో 50 వేల కిట్లు నాణ్యతా పరీక్షలో విఫలమైనట్లు ఓ పత్రిక వెల్లడించింది. గ్వాలియర్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)ప్రయోగశాలలో ఈ నాణ్యతా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. ఈ 1,70,000 కిట్లు చైనా నుంచి విరాళంగా వచ్చినట్లు సమాచారం. తాము చైనా నుంచి సీఈ/ఎఫ్‌డీఏ సర్టిఫైడ్ పీపీఈ కిట్లను మాత్రమే దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. నాణ్యతపై సందేహాలు వద్దు చైనా సంస్థలు సరఫరా చేస్తున్న పీపీఈ కిట్ల నాణ్యతపై సందేహాలు అక్కర్లేదని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి రోంగ్ చెప్పారు. నాణ్యమైన కిట్లను చైనా ఎగుమతి చేస్తోందని చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల నుంచి టెస్టింగ్ కిట్లు, వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. -
రెండు పీపీఈ నమూనాలకు ఆమోదం
న్యూఢిల్లీ: ఉత్తర రైల్వే వర్క్‌షాపులో రూపొందించిన రెండు వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) నమూనాలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో రైల్వే యూనిట్లలో వీటి ఉత్పత్తికి మార్గం సుగమమైంది. శరీర భాగాల్లో రక్తం, ఇతర స్రావాల ప్రసరణ కోసం ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోజుకు 20 వరకు ఈ పరికరాలను తయారు చేస్తున్నామని, ఇకపై రోజుకు 100కు పైగా రూపొందిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న రైల్వే ఆసుపత్రుల్లో వీటిని ఉపయోగిస్తామని పేర్కొన్నాయి. దేశంలో పీపీఈ కొరత ఎక్కువగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది భయం భయంగా పనిచేయాల్సి వస్తోంది. సరిపడగా పీపీఈ అందుబాటులోకి వస్తే కరోనా మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఆర్డీవో పాటు పలు సంస్థలు వ్యక్తిగత రక్షణ పరికరాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చాయి. (చైనా ఎన్ని మాస్క్‌లు అమ్మిందంటే..?) -
కరోనా నియంత్రణకు డీఆర్డీవో టెక్నాలజీలు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో తక్షణ అవసరాల కోసం డీఆర్డీవో అనేక టెక్నాలజీలను రూ పొందిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే డీఆర్డీవో పరిశోధన సంస్థలు శానిటైజర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే వెంటిలేటర్లను ప్రైవేట్ సంస్థల సహ కారంతో తయారు చేస్తున్నట్లు ఆయన ‘సాక్షి’తో చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం ఊపిరితిత్తులపైనే ఎక్కువ కాబట్టి డీఆర్డీవోకి చెందిన సొసైటీ ఫర్ బయో మెడికల్ టెక్నాలజీ (ఎస్బీఎంటీ) కార్యక్రమం కింద డెబెల్ అనే పరిశోధనశాలలో వినూత్న వెంటిలేటర్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రెషర్ ఫ్లో సెన్సార్లు, బ్రీత్ రెగ్యులేటర్ల సాయంతో ఈ వెంటిలేటర్లను అభివృద్ధి చేశామని చెప్పారు. ఒకే వెంటిలేటర్ ద్వారా పలువురు రోగులకు సేవలందించే మల్టీ పేషెంట్ వెంటిలేటర్ తయారీకి కూడా పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. మరో వారంలో ఈ వెంటిలేటర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెప్పారు. దీంతోపాటు ఎన్–95, ఎన్–99 మాస్కుల ఉత్పత్తి ఇప్పటికే మొదలు కాగా.. తాజాగా చికిత్స చేసే వైద్యులకు వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు వినూత్నమైన బయో సూట్లను అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కొత్త బయో సూట్ల అవసరం చాలా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి తాము రోజుకు 15 వేల నుంచి 20 వేల బయో సూట్లను తయారు చేయగలమని ఆయన ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. డీఆర్డీవో గతంలోనే రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఒక బయో సూట్‌ను అభివృద్ధి చేసిందని, వీటిని మాత్రం రోజుకు లక్ష వరకు తయారు చేయగలమని చెప్పారు. పాత బయో సూట్‌ను కరోనా వైరస్‌ను కూడా తట్టుకునేలా మార్చడం ద్వారా కొత్త సూట్ సిద్ధమైం దని తెలిపారు. భవిష్యత్‌లో కరోనా తరహా వైరస్ల ముప్పును ఎదుర్కొనేందుకు డీఆర్డీవో కూడా పరిశోధనలు చేపడుతోందని తెలిపారు. -
డీఆర్డీవో శానిటైజర్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌పై యుద్ధంలో డీఆర్డీవో మరో ముందడుగు వేసింది. వేర్వేరు ఉపరితలాల నుంచి వైరస్‌లను తొలగించేందుకు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసింది. ఢిల్లీలోని డీఆర్డీవో సంస్థ ‘ద సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్)’అభివృద్ధి చేసిన ఈ యంత్రాల్లో ఒకటి అవసరమైన చోటుకు మోసుకెళ్లేది కాగా, రెండోది చక్రాలపై ఉంచి తరలించగలిగేది. మంటలు ఆర్పేందుకు పనికొచ్చే యంత్రాలను రీడిజైనింగ్ చేయడం ద్వారా తాము ఈ శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసినట్లు డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. పోర్టబుల్ యంత్రం ద్వారా ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లవచ్చని, బ్యాక్‌ప్యాక్ ద్వారా తీసుకెళ్లగలమని వివరించింది. గాలితోపాటు ద్రావణాన్ని కూడా చేర్చి స్ప్రే చేయడం దీని ప్రత్యేకతని తెలిపింది. ఒక యంత్రం ద్వారా దాదాపు 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శానిటైజేషన్ చేపట్టవచ్చని పేర్కొంది. చక్రాలపై ఉంచి తరలించగల రెండో యంత్రంలో హైపోక్లోరైట్ ద్రావణాన్ని మాత్రమే పొగమంచు మాదిరిగా మార్చి పిచికారీ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలిపింది. ఒక్కోటి 3,000 చదరపు మీటర్ల విస్తీర్ణాన్నిశుభ్రం చేయగలదని వివరించింది. 50 లీటర్ల ద్రావణాన్ని నింపుకోగల ట్యాంకు ఇందులో ఉంటుందని.. 12నుంచి 15 మీటర్ల దూరం వరకూ పిచికారీ చేయవచ్చని తెలిపింది. ఢిల్లీ పోలీసులకు ఇప్పటికే ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. -
కరోనా నుంచి రక్షణకు బయోసూట్
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులు, ఇతర సిబ్బంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు డీఆర్డీవో వినూత్న బయోసూట్‌ను రూపొందించింది. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) సూట్‌ను వివిధ డీఆర్డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు.. టెక్స్టైల్, కోటింగ్, నానోటెక్నాలజీ తదితర సాంకేతికతలను పరిశీలించి వినూత్నమైన కోటింగ్ ద్వారా ఈ సూట్ తయారుచేశారు. ఈ సూట్లను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసి, వైద్యులు, ఇతర సిబ్బందిని కరోనా నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమిస్తున్నట్టు డీఆర్డీవో గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కుసుంఘర్ ఇండస్ట్రీస్ అనే సంస్థ ఈ సూట్ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్ మెటీరియల్ ఉత్పత్తి చేయడమే కాకుండా, పూర్తి సూట్‌ను కూడా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం రోజుకు 7 వేల సూట్లను తయారుచేసే సామర్థ్యం ఉన్నట్టు పేర్కొంది. వస్త్ర రంగంలో అనుభవం ఉన్న మరో సంస్థతో కలసి రోజుకు 15వేల సూట్లను తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించింది. సూట్‌ను అతికించే టేప్‌ల కొరత కారణంగా వీటి ఉత్పిత్తి తగ్గుతోందని తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా సబ్మెరైన్ల తయారీలో ఉపయోగించే ఓ పదార్ధాన్ని వినియోగిస్తున్నట్టు వెల్లడించింది. -
మహిళలపై గౌరవం పెంచే బాధ్యత తల్లిదే: సాయిపల్లవి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహిళలకు సురక్షితమైన నగరమని డీఆర్డీవో శాస్త్రవేత్త డాక్టర్ టెస్సీ థామస్ అన్నారు. 33 ఏళ్లుగా ఉన్న హైదరాబాద్‌లో ఉన్న తాను కొంతకాలం క్రితం బెంగళూరుకు వెళ్లానని, అక్కడికి ఇక్కడికి మహిళల భద్రతలో వ్యత్యాసాలను చూడగలిగానన్నారు. సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సెల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్లో గురువారం నిర్వహించిన ‘షీ ఎం పవర్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్ మాట్లాడుతూ... జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నా దురదృష్టవశాత్తు ప్రపంచ సంపదలో ఒక శాతం వాటా మాత్రమే దక్కించుకున్నారన్నారు. పురుషుల కంటే మహిళలు మెరుగ్గా రాణిస్తున్నా అన్ని రంగాల్లో సమానం కావడమనేది కలగానే మిగిలిందన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మహిళలు సమర్థంగా ఎదుర్కోవాలన్నారు. మల్టీ టాస్కింగ్, పట్టుదల, అంకితభావం, సృజనాత్మకత, అభిరుచి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తదితర లక్షణాలను కలిగి ఉన్న మహిళలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సవాళ్లనే అవకాశంగా మలచుకోవాలని, విమర్శల నుంచి నేర్చుకోవాలని, వాటిని అభివృద్ధికి బాటలు వేసే దిశగా మార్చుకోవాలన్నారు.’ తెలంగాణ ఉమెన్ అండ్ సేఫ్టీ విభాగం ఐజీ ఇన్చార్జ్ స్వాతిలక్రా మాట్లాడుతూ...చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించడంతో పాటు మార్పు తీసుకురావల్సిన అవసరముందన్నారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ సేవలు విస్తరించడంతో పాటు భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ...ఆరు లక్షలకుపైగా సీసీటీవీ కెమెరాలు ఉన్న భాగ్యనగరంలో పటిష్టమైన నిఘా వ్యవస్థ భద్రతకు భరోసా ఇంస్తుందన్నారు., సేఫ్ స్టే, మార్గదర్శక్, షీ షటిల్, బాలమిత్ర, భరోసా కేంద్రాల సేవలతో భద్రతపై మరింత నమ్మకం కల్పిస్తున్నామన్నారు. కుటుంబసభ్యుల్లా భావించాలి... ఇంట్లో అక్క చెల్లెళ్లను గౌరవించినట్లుగానే వీధుల్లో వెళ్లే మహిళలను గౌరవించేలా బాలురను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిపైనే ఉందని సినీ నటి సాయిపల్లవి అన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మార్పు ఇంటి నుంచే రావాలని ఆమె పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి మహిళా కమాండో ట్రైనర్ డాక్టర్ సీమారావు మాట్లాడుతూ...మన ప్రతి ఒక్కరిలో యోధుడు ఉన్నారన్నారు. ‘జీవితంలో ఏదైనా సాధించడానికి భార్యభర్తలకు పరస్పర సహకారం అవసరం. నా భర్త నాకు భర్త కంటే ఎక్కువ. అంటే జీవితంలో అంత ప్రాధాన్యం ఇస్తా. అయితే నేను మాత్రం తేలికైన పనులను ఎంచుకోకుండా జీవితంలో కష్టమైన పనులను చేయడానికే ఇష్టపడతాన’ని అన్నారు. అనంతరం మహిళల భద్రత, సాధికారత కోసం కృషి చేసిన కార్పొరేట్ సంస్థలకు సీపీ అవార్డులను ప్రదానం చేశారు. ఎస్సీఎస్సీ సహకారంతో సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ‘షీ సేఫ్’ యాప్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినీ దర్శకుడు రాజమౌళి, హీరోయిన్ రష్మికా మండోనా, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, సోషల్ రీసెర్చ్ సెంటర్ ఎండీ డాక్టర్ రజనాకుమారి, సైబరాబాద్ ఉమెన్ అండ్ సేఫ్టీ డీసీపీ అనసూయ, ఎస్సీఎస్సీవైస్ చైర్మన్ భరణి, ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, జాయింట్ సెక్రటరీ ప్రత్యూష శర్మ, షీ టీమ్ ఇన్స్పెక్టర్ సునీత పాల్గొన్నారు. -
దేశ భద్రతకు భరోసా
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరులో సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి.. డీఆర్డీవో చైర్మన్‌గా ఎదిగిన తెలుగుతేజం డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి.. రక్షణరంగంలో సాగుతున్న పరిశోధనల గురించి ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు.. సాక్షి: డీఆర్డీవో చీఫ్ అయ్యారు.... రక్షణ శాఖ (పరిశోధన, అభివృద్ధి) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. వృత్తిపరంగా మీ ప్రయాణం చూస్తుంటే... విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జర్నీ గుర్తుకొస్తోంది. శాస్త్రవేత్త నుంచి అత్యున్నత బాధ్యతలు మోస్తూ సాగుతున్న మీ ప్రయాణం ఎలా ఉంది? సతీష్‌రెడ్డి: డీఆర్డీవోకు కలాం గారు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే నేను చేరాను. ఆయన నేతృత్వంలో ‘ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ కింద పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిసూల్, నాగ్ మిస్సైల్స్ రూపకల్పనలో నేను పాలుపంచుకోవడం భగవంతుడు ఇచ్చిన వరం. యువశాస్త్రవేత్తలకు కలాం గారి ప్రోత్సాహం అద్భుతం. సాక్షి: ‘ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలెప్మెంట్ ప్రోగ్రామ్’ను కలాం ప్రారంభించారు. మీ నేతృత్వంలో ఇంటర్ కాంటినెంటల్ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. ఇలాంటి ల్యాండ్‌మార్క్ ప్రోగ్రామ్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? సతీష్‌రెడ్డి: ‘మిషన్ శక్తి’ అలాంటిది. భూకక్ష్యలో తిరుగుతున్న మన శాటిలైట్ల భద్రతకు అవసరమైన ప్రాజెక్టు చేయమని ప్రధానమంత్రి సూచించారు. అందుకోసం యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేశాం. ఇలాంటి పరిజ్ఞానం, సామర్థ్యం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం ‘గ్లోబల్ స్పేస్ పవర్’గా ఎదిగాం. రక్షణ రంగానికి సంబంధించి స్పేస్, సైబర్ రంగంలో విస్తృత పరిశోధనలు అవసరం. ‘ఫ్యూచర్ టెక్నాలజీస్’ను అభివృద్ధి చేయాలి. అండర్ వాటర్ వెహికల్స్, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇది 5వ జనరేషన్ యుద్ధ విమానం. దీన్ని తయారు చేస్తే.. భారతదేశం యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సుదూరతీరంలోని చిన్న వస్తువును కూడా చూడగలిగిన రాడార్స్ తయారు చేయాలి. హైపర్ సానిక్ మిసైల్స్‌ను తయారు చేయనున్నాం. తేలికపాటి యుద్ధ విమానం మార్క్–2 పరిశోధన దశలో ఉంది. ఇవన్నీ ల్యాండ్‌మార్క్ కార్యక్రమాలే. సాక్షి: ‘మిషన్ శక్తి’తో దేశానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? సతీష్‌రెడ్డి: ప్రపంచ దేశాల్లో మన పట్ల గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించకుండా ఆపుదామనే ప్రయత్నాలు మానుకుంటాయి. అలాగే మన ఉపగ్రహాలకు హాని తలపెట్టేందుకు ఏ దేశమూ సాహసించదు. సాక్షి: రక్షణ రంగంలో నూరు శాతం స్వావలంబన జాతి ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దిశగా ప్రయత్నాలు... ప్రత్యేకించి మిస్సైల్ రంగంలో ప్రగతిని వివరించండి? సతీష్‌రెడ్డి: దిగుమతులు తగ్గించి స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం 45–50 శాతం మాత్రమే దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన వాటిని వాడుతున్నాం. దీన్ని 75–80 శాతానికి పెంచాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. వచ్చే 5–10 ఏళ్లలో ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాక్షి: క్రిటికల్ కాంపోనెంట్స్‌కి ఇప్పటికీ విదేశాలపై ఆధారపడుతున్నాం. పూర్తిగా మనదేశంలో తయారయ్యే రోజు ఎప్పుడు వస్తుంది? సతీష్‌రెడ్డి: ఇప్పుడు మనం పెద్దగా ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. చాలా వరకు మనం ఉత్పత్తి చేస్తున్నాం. సెన్సర్స్, చిప్స్ మనం కొంత మేర తయారు చేసుకోగలుగుతున్నాం. అడ్వాన్స్డ్ సెన్సర్స్, చిప్స్ కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అవి కూడా మనమే తయారు చేసుకొనే రోజు దగ్గర్లోనే ఉంది. సాక్షి: మానవ రహిత యుద్ధ విమానం మన సైన్యానికి అందుబాటులోకి రావడానికి ఎంతకాలం పడుతుంది? సతీష్‌రెడ్డి: చాలా దేశాలు దీని మీద పరిశోధనలు చేస్తున్నాయి. మనం ఇంకా దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం అనుమతి ఇస్తే.. డీఆర్డీవో పరిశోధనలు ప్రారంభిస్తుంది. పరిశోధన మొదలు పెడితే... తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సాక్షి: భవిష్యత్తులో మన సైన్యానికి అందనున్న ఆయుధాలు ఏమిటి? సతీష్‌రెడ్డి: ప్రపంచంలోనే లాంగెస్ట్ రేంజ్ గన్ మనం తయారు చేశాం. దీన్ని ‘అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్’ అంటారు. 48 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. 155 ఎంఎం క్లాస్ గన్‌లో ఇదే పెద్దది. త్వరలో దీన్ని సైన్యానికి అందిస్తాం. అండర్‌వాటర్ వెహికల్స్, తేలికపాటి యుద్ధ విమానాలు, సరికొత్త టెక్నాలజీ ట్యాంకులు, లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాం. సాక్షి: ఇప్పటికీ చిన్న, తేలికపాటి ఆయుధాలకు దిగుమతుల మీద ఆధారపడుతున్నాం. డీఆర్డీవో దీనిమీద పనిచేయడం లేదా? సతీష్‌రెడ్డి: కొరతను త్వరలో అధిగమించనున్నాం. కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మిగతావి ఇక్కడే తయారు చేస్తున్నాం. దిగుమతి చేసుకున్న టెక్నాలజీతో తయారు చేస్తున్నాం. సాక్షి: సియాచిన్ వంటి ప్రతికూల పరిస్థితులుండే ప్రాంతాల్లో సైనికులకు పనికొచ్చే చిన్న చిన్న పరికరాలు, ఆహార పదార్ధాలు, అత్యాధునిక దుస్తులు, బూట్లు... ఒక్కోసారి విజయాన్ని సాధించిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ దిశగా రక్షణరంగంలో పరిశోధనలు జరుగుతున్నాయా? సతీష్‌రెడ్డి: సైనికులకు ప్రతికూల పరిస్థితుల్లో మనగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్డీవో అందిస్తోంది. వారికి అందించాల్సిన ఆహారం, దాన్ని వేడిగా ఉంచడం, ఎముకలు కొరికే చలిలో వేసుకొనే డ్రెస్, చేతి గ్లౌజ్, హెల్మెట్, షూస్... అన్ని అంశాల్లోనూ పరిశోధనలు చేశాం.. చేస్తున్నాం. వాతావరణ ప్రతికూల పరిస్థితులను ముందే కనిపెట్టి హెచ్చరించే వ్యవస్థను రూపొందించాం. సైనికులకు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే పానీయాలు, తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తిని ఇచ్చే ఆహారం అందించడం మీద పరిశోధనలు చేశాం. ఇప్పుడు ‘గగన్‌యాన్’లో పాల్గొననున్న వ్యోమగాములకు ఈ ఆహారాన్నే ఇవ్వనున్నాం. పరిశ్రమల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సతీష్‌రెడ్డి: రక్షణరంగంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఒకప్పుడు మేము ఇచ్చిన డ్రాయింగ్స్ ఆధారంగా వస్తువులు తయారు చేసి ఇచ్చేవి. ఇప్పుడు మా పేటెంట్స్‌ను వాడుకోవడానికి అవకాశం ఇచ్చాం. టెక్నాలజీ బదిలీ చేసినప్పుడు గతంలో ఫీజు వసూలు చేసే వాళ్లం. ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నాం. ఆకాశ్ మిస్సైల్ తయారీకి రూ. 25 వేల కోట్ల విలువైన ఆర్డర్స్ వచ్చాయి. దాంట్లో 87 శాతం ప్రైవేటు పరిశ్రమల నుంచి తీసుకున్నాం. – మల్లు విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి -
కే 4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం సక్సెస్..
భువనేశ్వర్ : అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేధించేలా డీఆర్డీఓ అభివృద్ధి చేసిన కే 4 బాలిస్టిక్ క్షిపణిని విశాఖపట్నానికి 30 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో భారత్ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్ఎస్ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేసిన ఈ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం రెండేళ్లుగా పలుమార్లు విఫలమైన క్రమంలో తాజా ప్రయోగం విజయవంతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు. ఉన్నతమైన కచ్చితత్వాన్ని సాధించడమే ఈ క్షిపణి లక్ష్యమని డీఆర్డీఓ వెల్లడించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ క్షిపణి ప్రయోగానికి సర్వం సిద్ధమైనా బంగాళాఖాతంలో బుల్బుల్ తుపాన్ ప్రభావంతో ప్రయోగం వాయిదా పడింది. అణు జలాంతర్గాముల్లో దీన్ని అమర్చే ముందు భారత్ ఈ క్షిపణిపై మరికొన్ని ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉంది. భారత్ తన జలాంతర్గాముల శ్రేణుల కోసం అభివృద్ధి చేస్తున్న రెండు అండర్‌వాటర్ క్షిపణుల్లో కే 4 క్షిపణి ఒకటి. -
సీఎం జగన్‌తో డీఆర్డీఓ చైర్మన్ భేటీ
-
సీఎం జగన్‌తో డీఆర్డీఓ చైర్మన్ భేటీ
సాక్షి, అమరావతి: డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్‌రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సీఎం వైఎస్ జగన్‌తో పలు కీలక విషయాలపై చర్చించారు. రాష్ట్రంలోని రక్షణ రంగ ప్రాజెక్టులపై ఇరువురి మధ్యా చర్చ జరిగినట్టు సమాచారం. నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రం నిర్మాణం తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రికి సతీష్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది. ఆయనకు సీఎం జగన్ మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. (చదవండి: ముందే సంక్రాంతి) -
డీఆర్డీఓ చైర్మన్‌కు మాతృవియోగం
సాక్షి, నెల్లూరు: డీఆర్డీఓ చైర్మన్ గుండ్రా సతీష్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. నెల్లూరులోని స్వగృహంలో నివసిస్తున్న సతీష్ రెడ్డి తల్లి గుండ్రా రంగమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థత చెందిన ఆమె గురువారం ఉదయం కన్నుమూశారు. రంగమ్మ భౌతికకాయాన్ని ఆమె స్వస్థలమైన ఆత్మకూరు మండలం మహిమలూరుకు నేడు సాయంత్రం తరలించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన సతీష్‌రెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయలు దేరారు. రేపు ఉదయం 9 గంటలకు రంగమ్మ అంత్యక్రియలు చేపట్టనున్నారు. -
సైంటిస్టుగా నమ్మించి మహిళకు బురిడీ
న్యూఢిల్లీ : గతంలో పెళ్లై ఆవారాగా తిరిగే ప్రబుద్ధుడు తాను డీఆర్డీఓ సైంటిస్ట్‌నని, అవివాహితుడనని ఢిల్లీకి చెందిన ఓ మహిళను బురిడీ కొట్టించిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిందితుడు ఫోర్జరీ ఐడీ కార్డులను చూపాడని తీరా పెళ్లయిన తర్వాత అతడు మోసగాడని, ఎలాంటి ఉద్యోగం లేదని పైగా గతంలోనే వివాహమైందని తెలిసిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు జితేంద్ర సింగ్‌పై ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. -
రాజ తేజసం
బెంగళూరు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపి ఎంతో థ్రిల్‌కి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్నా›థే. బెంగళూరులోని హాల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది అని రాజ్‌నాథ్ చెప్పారు. రాజ్‌నాథ్ వెంట ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ ఉన్నారు. తేజస్‌లో పైలట్ వెనక సీట్లో కూర్చొని రాజ్‌నాథ్ ప్రయాణించారు. 68 ఏళ్ల వయసున్న రాజ్‌నాథ్ స్వదేశీ యుద్ధ విమానం కావడం వల్లే తాను ఇందులో ప్రయాణించే ధైర్యం చేశానని చెప్పారు పైలట్ అవతారం అరగంటసేపు యుద్ధ విమాన ప్రయాణంలో ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. పైలట్ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ విమానాన్ని రాజ్‌నాథ్ నియంత్రించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాజ్‌నాథ్ విమానాన్ని నడిపిన విషయాన్ని డీఆర్డీఓ చీఫ్ డా. జీ. సతీష్ రెడ్డి వెల్లడించారు. దీనికి రాజ్‌నాథ్ స్పందిస్తూ తాను చేసింది ఏమీ లేదని పైలెట్ తివారీ చెప్పింది చెప్పినట్టుగా చేశానని నవ్వుతూ వెల్లడించారు. తేజస్ వైపు ప్రపంచ దేశాల చూపు.. యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వాత విలేకరుల సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడారు. హాల్, డీఆర్డీఓతో పాటుగా ఈ యుద్ధ విమానం తయారీ కోసం పని చేసిన ఇతర సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనమూ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’అని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కుప్పకూలిన డీఆర్డీఓ డ్రోన్
బెంగళూర్ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా జోదిచిక్కెనహళ్లి వద్ద పంట పొలాల్లో మంగళవారం ఉదయం డీఆర్డీఓ డ్రోన్ కుప్పకూలింది. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో డ్రోన్ కూలిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనా స్ధలానికి డీఆర్డీఓ అధికారులు చేరుకుంటున్నారు. చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి సమీపంలో డీఆర్డీఓ చల్లకెరె ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)ను ఏర్పాటు చేస్తోంది. కూలిన డ్రోన్ డీఆర్డీఓకు చెందిన రుస్తోం-2 డ్రోన్ అని చిత్రదుర్గ ఎస్పీ తెలిపారు. ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో విఫలమవడంతో డ్రోన్ వ్యవసాయ క్షేత్రంలో కూలిందని, డ్రోన్ కూలడంతో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడగా, వారిని అక్కడి నుంచి పంపి తాము ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. -
తేజస్ ‘అరెస్టెడ్ ల్యాండింగ్’ సక్సెస్
న్యూఢిల్లీ: పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’మరో అరుదైన ఘనత సాధించింది. గోవాలోని ఓ నావికా కేంద్రంలో తొలిసారి విజయవంతంగా అరెస్టెడ్ ల్యాండింగ్‌ను పూర్తి చేసింది. అతి తక్కువ స్థలం మాత్రమే ఉండే విమాన వాహక నౌకలపై సమర్థవంతంగా దిగేందుకు అరెస్టెడ్ ల్యాండింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. విమానం ముందుభాగంలో ఉన్న కొక్కెం ల్యాండింగ్ సమయంలో డెక్‌పై ఉన్న ఓ తీగను అందుకోవడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటుంది. తద్వారా తక్కువ పొడవున్న విమాన వాహక యుద్ధ నౌక రన్‌వేపై సులువుగా ల్యాండ్ అవుతుంది. నిమిషానికి 1,500 అడుగుల వేగంతో ప్రయాణిస్తూ.. యుద్ధ విమానానికి ఏ మాత్రం నష్టం కలగకుండా ల్యాండ్ కావడం ఈ ప్రక్రియలోని విశేషం. ఇది విజయవంతంగా పూర్తవడంతో నేవీలోనూ తేజస్ సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. నేవీ కోసం ప్రస్తుతం రెండు తేజస్ విమానాలను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. ఒకే ఒక్క సీటుండే తేజస్‌తో అరెస్టెడ్ ల్యాండింగ్ విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తరువాత ఈ సామర్థ్యమున్న యుద్ధ విమానాన్ని రూపొందించిన ఘనత భారత్‌కే దక్కింది. మరి కొన్నిసార్లు ఇదే ఫలితాలను సాధిస్తే పరీక్ష కేంద్రంలో కాకుండా అసలైన యుద్ధనౌకపై అరెస్టెడ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నాలు మొదలవుతాయి. -
కశ్మీర్‌పై మీ ఏడుపు ఆపండి
లేహ్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఆ దేశం ఏడుపు ఆపాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్తాన్‌కు సూచించారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు ఒక విధానమంటూ లేదని, ఆ విషయంలో ఆ దేశం చేస్తున్న యాగీకి అంతర్జాతీయంగా ఏ దేశమూ మద్దతు ప్రకటించలేదని రక్షణ మంత్రి చెప్పారు. ‘నేను పాకిస్తాన్‌ను ప్రశ్నిస్తున్నా.. మీకేం సంబంధం ఉందని కశ్మీర్ విషయంలో రోదిస్తున్నారు? నిజానికి పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిన ప్రాంతమే. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, గిల్గిత్, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై రోదించండి’అని పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయంగా మద్దతు సంపాదించాలని పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నాలను ఏ దేశమూ సమర్థించలేదని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్–జవాన్ విజ్ఞాన్ మేళా’సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్న పొరుగు దేశంతో చర్చలు అసాధ్యమని ఆయన చెప్పారు. భారత్ పాకిస్తాన్‌తో సత్సంబంధాలనే కోరుకుంటోంది. అయితే పాకిస్తాన్ మొదట ఉగ్రవాదులను భారత్‌లోకి చొప్పించడం మానుకోవాలి. కశ్మీర్‌పై మాట్లాడేముందు వారు పీవోకే, బలూ చిస్తాన్‌పై మాట్లాడాలి అని రాజ్‌నాథ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. -
కలాం అప్పుడే దాని గురించి చెప్పారు
న్యూఢిల్లీ: భారత రత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతిచెందడానికి నెల రోజుల ముందు, పునర్వినియోగ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిందిగా తనకు సూచించారని డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి తాజాగా చెప్పారు. కలాం చనిపోయే నాటికి సతీశ్ రెడ్డి రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. తాను ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత కలాంను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లినప్పుడు కలాం ఈ సలహా ఇచ్చారని సతీశ్ రెడ్డి తెలిపారు. ‘క్షిపణులు వాటి పే లోడ్‌ను ప్రయోగించిన అనంతరం మళ్లీ వెనక్కు వచ్చి, ఇంకో పే లోడ్‌ను తీసుకెళ్లేలా ఉండాలి. అలాంటి సాంకేతికత అభివృద్ధి చేయండి’ అని కలాం తనకు సూచించారని సతీశ్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. -
చేసింది చాలు..!
సాక్షి, ఇందూరు (నిజామాబాద్ అర్బన్): జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో గల ఉపాధి హామీ విభాగం హరితహారం సెక్షన్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కీలకమైన సెక్షన్లో పని చేసిన ఓ ఉద్యోగి హరితహారానికి సంబంధించిన గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచీ ఈ సెక్షన్లో పని చేసిన సదరు ఉద్యోగిని ప్రస్తుతం మొక్కలు నాటే కీలక సమయంలో సెక్షన్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అనుకోకుండా సెక్షన్ తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చడంతో అక్రమ వసూళ్లు జరిగాయన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ప్రస్తుతం ఈ విషయం ఉపాధి హామీ విభాగంలో హాట్ టాపిక్‌గా మారింది. జిల్లాలో ఈ ఏడాది డ్వామా శాఖ ఆధ్వర్యంలో కోటి వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రతీ గ్రామంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. అయితే, టేకు మొక్కలను రైతులకు ఉచితంగా అందజేయడానికి టేకు స్టంపులను టెండరు ద్వారా కొనుగోలు చేసి జిల్లాకు తెప్పించి నర్సరీల్లో పెంచుతున్నారు. అయితే హరితహారం విభాగానికి మొన్నటి వరకు జిల్లా పరిషత్‌కు చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్ డ్వామాకు డిప్యూటేషన్‌పై వచ్చి పని చేశారు. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు, పాలిథిన్ కవర్లు, టేకు స్టంపులు, నీటి ట్యాంకుల కొనుగోలు ఇతర విషయాలను మొదటి నుంచీ సదరు ఉద్యోగే చూశారు. టెండర్లు దక్కించుకున్న గుత్తేదారుల నుంచి పర్సంటేజీలు వసూల్ చేసినట్లు ఆరోపణలున్నాయి. సెక్షన్ ఉద్యోగి పర్సంటేజీలు అడుగుతున్నట్లు నేరుగా డీఆర్‌డీవోకే గుత్తేదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అప్పటికే సదరు ఉద్యోగిపై అనేక ఫిర్యాదులు రావడం, విధుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి ఆరోపణలున్నాయి. కమీషన్లకు ఆశపడి డీఆర్డీవోనే తప్పుదోవ పట్టించి హరితహారంలో తెరచాటుగా వసూళ్ల పర్వం కొనసాగించినట్లు తెలిసింది. దీంతో ఉద్యోగి వ్యవహారంపై సీరియస్ అయిన డీఆర్డీవో నెల క్రితం హరితహారం సెక్షన్ నుంచి తొలగించి సోషల్ ఆడిట్ విభాగానికి మార్చారు. సదరు ఉద్యోగిని సొంత శాఖ జిల్లా పరిషత్‌కు సరెండర్ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఉపేక్షించని డీఆర్డీవో.. హరితహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై డీఆర్డీవో చర్యలు ఉపక్రమిస్తున్నారు. నర్సరీల్లో మొక్కలను పెంచకుండా నిర్లక్ష్యంగా ఉన్న వివిధ మండలాల్లోని ఐదారుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. మరి కొందరికి నోటీసులు జారీ చేసి హెచ్చరించారు. అయితే, డీఆర్డీవో కళ్లుగప్పి హరితహారం విభాగంలో గుత్తేదారుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లుగా ఉద్యోగిపై ఆరోపణలు రావడంతో సెక్షన్ నుంచి తొలగించినట్లు చర్చ జరుగుతోంది. సెక్షన్ మార్చిన విషయం వాస్తవమే.. హరితహారం విభాగం చూస్తున్న ఉద్యోగిని వేరే సెక్షన్‌కు మార్చిన విషయం వాస్తవమే. అయితే, ఆ ఉద్యోగిపై అవినితీ ఆరోపణలు లేవు. సహజంగానే ఇతర సెక్షన్‌కు బదిలీ చేశాం. ఆరోపణలున్నాయనే విషయం నా దృష్టికి రాలేదు. – రమేశ్ రాథోడ్, డీఆర్డీవో, నిజామాబాద్ -
స్క్రామ్‌జెట్ పరీక్ష సక్సెస్
బాలాసోర్: హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్(హెచ్ఎస్టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్‌జెట్ విమానాన్ని ఒడిశాలోని కలామ్ ద్వీపం నుంచి బుధవారం ఉదయం డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. హెచ్ఎస్టీడీవీ ఓ పునర్వినియోగ వాహనమనీ, దీంతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని రక్షణరంగ నిపుణుడొకరు చెప్పారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్ క్షిపణులనూ ప్రయోగించవచ్చన్నారు. హెచ్ఎస్టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్‌ల) వేగంతో దూసుకుపోగలదన్నారు. తాజాగా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికత ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరిందన్నారు. హెచ్‌ఎస్‌టీడీ తొలుత ఘనఇంధన మోటార్‌తో నిర్ణీత ఎత్తులోకి చేరుకుంటుంది. సరైన వేగం అందుకున్నాక హెచ్‌ఎస్‌టీడీలోని క్రూయిజ్ వాహనం విడిపోతుందనీ, స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను మండించడం ద్వారా ఇది లక్ష్యం దిశగా దూసుకెళుతుందని పేర్కొన్నారు.