DRDO Recruitment 2021: Apply Online JRF Vacancies, Eligibility, Salary - Sakshi
Sakshi News home page

డీఆర్‌డీవో, హైదరాబాద్‌లో 10 జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు

Published Sat, May 29 2021 12:04 PM | Last Updated on Sat, May 29 2021 12:55 PM

DRDO Recruitment 2021: Apply Online JRF Vacancies, Eligibility, Salary - Sakshi

డీఆర్‌డీఎల్‌.. జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌).. జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 10
విభాగాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికిల్‌/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌.

జేఆర్‌ఎఫ్‌ (మెకానికల్‌ ఇంజనీరింగ్‌): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంఈ /ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ అర్హత సాధించాలి.

జేఆర్‌ఎఫ్‌ (ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌): సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. గేట్‌ అర్హత సాధించాలి.

వయసు: 28 ఏళ్లు మించకూడదు. స్టైపెండ్‌: నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.

రీసెర్చ్‌ కాలవ్యవధి: రెండేళ్లు.

ఎంపిక విధానం: గ్రాడ్యుయేషన్‌లో మార్కులు, గేట్‌ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్‌), ఏపీజే.అబ్దుల్‌కలాం, మిసైల్‌ కాంప్లెక్స్, కంచన్‌బాగ్‌ పీవో, హైదరాబాద్‌–500058 చిరునామాకు పంపించాలి.

ఇంటర్వ్యూ వేదిక: డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరీ(డీఆర్‌డీఎల్‌), ఏపీజే.అబ్దుల్‌కలాం, మిసైల్‌ కాంప్లెక్స్, కంచన్‌బాగ్‌ పీవో, హైదరాబాద్‌–500058.

► దరఖాస్తులకు చివరి తేది: 14.06.2021
► వెబ్‌సైట్‌: www.drdo.gov.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, ఆర్‌కే పురంలో టీచర్‌ పోస్టులు

ఎయిమ్స్, భువనేశ్వర్‌లో 90 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement