Recruitment
-
గ్రూప్–1కు తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్–1 రీనోటిఫికేషన్, భర్తీ ప్రక్రియ, ప్రశ్నపత్రాల కీ తదితర అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కాలేదని, మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ పమిడిఘటం శ్రీ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అవసరం లేదని, దీనివల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని తేలి్చచెప్పింది. మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచి్చంది. తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. మెయిన్స్ ఫలితాల విడుదలే తరువాయి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా జూన్‌లో ప్రిలిమ్స్ నిర్వహించిన కమిషన్ అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలను కూడా నిర్వహించింది. అయితే గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పాటు మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో జీఓ 55కు బదులుగా జీఓ 29ని తీసుకురావడం, అదేవిధంగా ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నలకు జవాబులు, ‘కీ’లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీంతో ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు రాసిన పలువురు అభ్యర్థుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనే ఆందోళన నెలకొంది. తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీంకోర్టులో, అంతకుముందు హైకోర్టులో గ్రూప్–1పై ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల విచారణ పూర్తికావడంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లేనని టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఉద్యోగాల భర్తీ దాదాపు కొలిక్కిరానుంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగు తోంది. ఇందుకోసం కమిషన్ ప్రత్యేకంగా ప్రొఫెసర్లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది. -
యూఎస్ ఎంబసీ రిక్రూట్మెంట్.. తొమ్మిది వారాల ట్రైనింగ్
ఢిల్లీలోని అమెరికన్ సెంటర్లోని.. ప్రీమియర్ బిజినెస్ ఇంక్యుబేటర్ 'నెక్సస్' తన 20వ కోహోర్ట్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇది 2025 ఫిబ్రవరి 2న నుంచి తొమ్మిది వారాల శిక్షణా కార్యక్రమం. ఈ విషయాన్ని ఎంబసీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్ కోసం జనవరి 5 లోపల అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.నెక్సస్ కోహోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా.. భారతీయ & అమెరికన్ నిపుణుల నుంచి ప్రత్యేక శిక్షణ పొందవచ్చు. 2017లో మొదటి కోహోర్ట్ ప్రారంభించినప్పటి నుంచి 230 మంది భారతీయ పారిశ్రామికవేత్తలు.. 19 కోహోర్ట్‌లు నెక్సస్ నుంచి పట్టభద్రులయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్‌లో స్టార్టప్ వెంచర్లపై కృత్రిమ మేధస్సు ప్రభావం, వ్యవస్థాపకులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత వంటి వాటిని గురించి తెలియజేస్తారు.తొమ్మిది వారాల శిక్షణా కార్యక్రమంలో నాలుగు కంపెనీలు నెక్సస్తోనే ఉంటాయి. ఈ కంపెనీలకు ఇంక్యుబేటర్ సౌకర్యాలు మాత్రమే కాకుండా.. నెట్‌వర్క్‌కు కావలసిన పూర్తి యాక్సెస్ కూడా నెక్సస్ అందిస్తుంది. ఈ సమయంలో నెక్సస్ నిపుణుల బృందం వారి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం.. కస్టమర్ & ఆదాయ స్థావరాలను పెంచుకోవడంలో సహాయం చేయడం ద్వారా వారి కంపెనీలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి వారితో కలిసి పని చేస్తుంది.నెక్సస్ 20 కోహోర్ట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ అందించడానికి.. యూఎస్ ఎంబసీ కార్యాలయం కనెక్టికట్ విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్(GTDI)తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి కావలసిన నిధులను యుఎస్ ఎంబసీ అండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అందిస్తాయి. -
ఏ కాలేజీలోనూ సీట్లు పొందని వారితో స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆ జిల్లాలోని విశ్వభారతి, అమలాపురంలోని కోనసీమ మెడికల్ కాలేజీల్లో కన్వీ నర్ కోటా కింద 76 సీట్లు పెరిగిన నేపథ్యంలో వాటి భర్తీకి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కింద కౌన్సెలింగ్ నిర్వహించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు గురువారం ఆదేశించింది. ప్రతిభ ఆధారంగానే ఈ సీట్ల భర్తీని చేపట్టాలని తేల్చి చెప్పింది. మొదటి మూడు రౌండ్లలో కన్వీనర్, యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా కింద ఏ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులందరి నుంచి ఆప్ష న్లు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు 76 సీట్లకే పరిమితమని స్పష్టం చేసింది.ఈ సీట్ల భర్తీ వల్ల ఖాళీ అయ్యే బీడీఎస్ సీట్ల భర్తీకి కన్వీనర్ కోటా కింద తిరిగి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని చెప్పింది. కౌన్సెలింగ్‌లో విశ్వవిద్యాలయం వ్యక్తం చేసిన వాస్తవ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్‌కు నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతించాలంటూ 25న ఇచ్చిన ఉత్తర్వుల ను కొంత మేర సవరిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటివరకు జరిగిన కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి పెరిగిన సీట్ల భర్తీలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, తరువాతి ర్యాంకుల్లో ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల తాము నష్టపోతా మంటూ నలుగురు విద్యార్థినులు హైకోర్టులో పి టిషన్లు దాఖలు చేశారు.దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నీట్లో అర్హత సాధించిన అందరినీ స్పెషల్ స్ట్రే కౌన్సెలింగ్‌కు అనుమతించాలంటూ ఈ నెల 25న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరినీ అనుమతిస్తే ఎన్ఎంసీ గడువైన డిసెంబర్ 6 లోగా కౌన్సెలింగ్‌ను పూర్తి చేయడం చాలా కష్టమ ని ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, జా యింట్ రిజిస్ట్రార్ (ప్రవేశాలు)తో పాటు యూనివర్సిటీ తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీని వాస్ ధర్మాసనానికి వివరించారు. పిటిషనర్ల తర ఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదించారు. ఇరుపక్షాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
కొలువుల్లోనూ విభిన్న ‘ప్రతిభావంతులు’
సాక్షి, అమరావతి: ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగ ప్రపంచంలో పోటీ తట్టుకుని నిలబడాలన్నా, నిలిచి గెలవాలన్నా విభిన్న ప్రతిభావంతులకు ఒకింత కష్టం. దీంతో సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు సైతం అన్ని అవయవాలూ బాగున్నవారిని ఉద్యోగంలో చేర్చుకుంటే ఉత్పాదకత బాగుంటుందని భావిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశీయ కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా విభిన్న ప్రతిభావంతులకు కొలువుల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనేక విభాగాల్లోని పోస్టుల్లో వారి నియామకాన్ని వేగవంతం చేయడమే కాకుండా సాధికారత సాధించేలా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాయి. దేశంలోని 155 భారతీయ కంపెనీలపై అవతార్ సంస్థ నిర్వహించిన ‘మోస్ట్ ఇన్‌క్లూజివ్ కంపెనీస్ ఇండెక్స్(ఎంఐసీఐ) సర్వే నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విభిన్న ప్రతిభావంతులకు అవకాశాలు ఇస్తున్న కంపెనీలు 2019లో 58శాతం ఉండగా తాజాగా 98శాతానికి పెరిగాయి. వీరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో మిడ్–క్యాప్ ఐటీ సేవల సంస్థ ఎంఫాసిస్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్(ఎన్సీపీఈడీపీ) అనే జాతీయ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగ నియామకాల్లో తన వంతు చొరవ చూపిస్తోంది. ఈ సంస్థ ‘ది మిస్సింగ్ మిలియన్’ ప్రాజెక్ట్‌లో దేశంలోని విభిన్న ప్రతిభావంతుల సంఖ్య, వారికి ఉన్న వైకల్య రకాలు, అవసరమైన నైపుణ్యం, అందించాల్సిన సహకారం వంటి వివరాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది.దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అన్ని రకాల వైకల్యాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా సర్వే నిర్వహిస్తే 10 కోట్లకుపైగా ఉంటారని అంచనా. వీరికి తగిన విద్యను అందించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగం..నైపుణ్యంయువతతో పోటీపడి విభిన్న ప్రతిభావంతులు రాణించాలంటే వారు చదువు ద్వారా సాధించిన ఉద్యోగానికి తోడు సరైన నైపుణ్య శిక్షణ కూడా అవసరమని అనేక కంపెనీలు గుర్తించి ఆదిశగా దృష్టిపెట్టాయి. వారి విద్యకు తగిన ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఏ విధమైన శిక్షణ అవసరమో గుర్తించి అందిస్తున్నామని స్పార్కిల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్–కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ దీపా నాగరాజ్ తెలిపారు. సామాజిక బాధ్యతగా ఐటీసీ సంస్థ బెంగళూరులో విభిన్న ప్రతిభావంతులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కోల్‌కతా, హౌరాల్లో నిర్వహించింది. ఇక్కడ సాంకేతిక నైపుణ్యంతోపాటు వ్యక్తిత్వ వికాసం, నిర్వహణ, నైపుణ్య శిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపు వంటి వాటిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పనిచేస్తున్న సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ సంస్థ గతేడాది గురుగ్రామ్‌లో గ్లోబల్ రిసోర్స్ సెంటర్(జీఆర్సీ)ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వారికి అవసరమైన సాయం, ఉద్యోగ అవకాశాలను అందించేలా తోడ్పడుతోంది. వినికిడిలోపం, దృష్టిలోపం, లోకోమోటర్ వైకల్యాలు ఉన్న వారికి తగిన శిక్షణ అందించి ఉపాధి చూపేలా దృష్టి సారించింది. డ్రోన్ ఆపరేషన్‌లో శిక్షణ గరుడ ఏరోస్పేస్ డ్రోన్ తయారీ కంపెనీ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈక్వాలిటీ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇటీవల చెన్నైలో పది రోజులపాటు వారికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించింది. అంధ సంఘాల నుంచి సేకరించిన సమాచారంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టిలోపం ఉన్న వారికి బ్రెయిలీ బీమా పాలసీని ప్రారంభించింది.విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వారు నిలదొక్కుకునేలా నైపుణ్య శిక్షణ అందించడం సామాజిక బాధ్యతగా కంపెనీలు భావిస్తున్నాయి. – సౌందర్య రాజేష్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ఐటీసీ హోటల్స్‌తో పాటు అనుబంధ సంస్థల్లో 390 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇచ్చాం. వారికి తగిన శిక్షణ ఇస్తున్నాం, బ్రెయిలీ సంకేతాలు, సులభంగా వెళ్లి వచ్చేందుకు అనుకూలమైన ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. – అమిత్ ముఖర్జీ, ఐటీసీ హెచ్ఆర్ హెడ్ -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్‌షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్‌లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్‌ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్‌లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
డీజీపీని చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం.. ఎందుకంటే?
పాట్నా: బీహార్ పోలీస్ కార్యక్రమంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్‌ను చేతులు జోడించి అభ్యర్థించారు.సోమవారం బీహార్‌లో కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్మెంట్ లెటర్లను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ తన ప్రసంగం మధ్యలో చేతులు జోడించి బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో మరిన్ని రిక్రూట్మెంట్లు జరిగేలా చూస్తారా? అని అడిగారు. సీఎం నితిష్ కుమార్ విజ్ఞప్తితో డీజీపీ అలోక్ రాజ్ మెరుపు వేగంతో స్పందించారు. వేదికపై కూర్చొన్న డీజీపీ ఒక్కసారి లేచి సెల్యూట్ చేశారు. వెంటనే నితీష్ కుమార్ లేదు ముందు మీరు పోలీస్ రిక్రూట్మెంట్ త్వరగా చేస్తారా? అని మరోసారి అడిగారు. అందుకు డీజీపీ స్పందిస్తూ.. సీఎం నితీష్ ఆదేశాలను అమలు చేసేందుకు బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. త్వరలో పోలీసు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తాం’ అని అన్నారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలువచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతవారం బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగనన్ని దారుణాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. కానీ చర్యలు లేవు. ఫిర్యాదు చేస్తే విచారణ శూన్యం. ప్రజలకు న్యాయం జరగదు. ఇకపై సీఎం నితీష్ కుమార్ బీహార్‌ను నడపలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ డీజీపీ అలోక్ రాజ్ పోలీస్ రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని కోరుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
పీఆర్ శాఖలో త్వరలో కారుణ్య నియామకాలు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈ ఈ) నాణ్యతపై రాజీలేకుండా, ప్రమాణాలు పాటిస్తూ శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. తమ శాఖ పరిధిలో త్వరలోనే 500కు పైగా కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకా రం తెలిపారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1, 375 కోట్లతో రోడ్లు వేయబోతున్నామని, ఏఈఈల ఆధ్వర్యంలో ఈ పనులు ప్రారంభం కావడం అదృష్టమని తెలిపారు. ‘అభివృద్ధి పనుల్లో మీ మార్కును చూపాలి. నాణ్యత లేని పనులు చేస్తే సస్పెండ్ అవుతారు’అని హెచ్చరించారు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు మంగళవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలు మూతపడుతున్నాయని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందపడుతున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే గురుకులాల అద్దె లు రూ. కోట్లలో పెండింగ్‌లో పెట్టారని చెప్పా రు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పార్టీ సమీక్ష అనంతరం ఆమె గాం«దీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. -
గెయిల్లొ 391 ఉద్యోగాలు (ఫోటోలు)
-
బిగ్.. హంబగ్!
సాక్షి, హైదరాబాద్: కాలేజీలో క్యాంపస్ నియామకాలున్నాయా? ఏయే కంపెనీలు వస్తాయి? వార్షిక ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్‌లో చేరే ప్రతీ విద్యార్థి ముందుగా వాకబు చేసే అంశాలివి. పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఐటీ కంపెనీల వల్ల ఇప్పుడు ట్రెండ్ మారిందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కన్నా... చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నైపుణ్యం ఉన్న వారికి పెద్ద సంస్థల కన్నా భారీగా జీతాలు చెల్లిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ‘ఎక్స్‌ఫెనో’ అధ్యయనంలో వెల్లడైంది.దూసుకెళ్లే అవకాశాలుదేశంలో ఐటీ సేవలు అందించే ఆరు కంపెనీల్లో దాదాపు 20 వేల మంది వేతనాలను పరిశీలించింది. వీళ్లంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే. వీళ్ళల్లో 74 శాతం మందికి ఏడాదికి రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. 12 శాతం మందికి రూ. 5.75 నుంచి రూ. 7 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రూ. 7.5 లక్షల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు⇒ మధ్యస్థంగా ఉండే 10 ఐటీ సర్వీస్ కంపెనీల్లో 5 వేల మంది వేతనాలపై అధ్యయనం చేశారు. 57 శాతం మందికి రూ. 2.5–5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తున్నారు. 30 శాతం మందికి రూ.5.75 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నాయి. 7 శాతం మందికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువ వేతనం చెల్లిస్తున్నాయి.⇒ ఆరు పెద్ద కంపెనీల్లో రెండేళ్ల తర్వాతే పదోన్నతులు లభిస్తున్నాయి. వేతనంలో హైక్ నిమిత్తం మధ్యస్థ కంపెనీలు ప్రతీ ఆరు నెలలకూ వృత్తి నైపుణ్య అంచనా వేస్తున్నాయి. 58 శాతం ఫ్రెషర్స్‌కు స్కిల్‌ను బట్టి ప్రమోషన్లు ఇచ్చారు.కోతకు చాన్స్ తక్కువేగడచిన ఐదేళ్లుగా టైర్–1 ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఆరు కంపెనీల్లో 15 శాతం మేర కోత పెట్టాయి. హై స్కిల్ ఉండి, మధ్యస్థ వేతనం ఉన్న వాళ్ళనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాయి. ఫ్రెషర్స్ విషయంలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా వచ్చే పరిస్థితులను పెద్ద కంపెనీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, స్కిల్స్ ఉంటే అంత తొందరగా తీసేసే అవకాశం ఉండదు. కాబట్టి వేగంగా ప్రమాదం ముంచుకొస్తుందన్న భయం ఉండదని ఉద్యోగులు భావిస్తున్నారు. పెద్ద కంపెనీల ఉద్యోగుల్లో అనుక్షణం భయం వెంటాడుతోంది.ట్రెండ్‌ను కాలేజీలూ పట్టుకోవాలిప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్యాంపస్ నియామకాలకు సంబంధించిన విభాగం ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. అయితే, పెద్ద కంపెనీల మనోభావాలనే ఈ శిక్షణలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దీంతో పాటు చిన్న, మధ్యస్థ ఐటీ సంస్థల అవసరాలు, అవి ఆఫర్ చేస్తున్న జాబ్ మార్కెట్‌పైనా అవగాహన కల్పించాలని హైదరాబాద్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ విశేష్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్‌లో ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీలకన్నా, చిన్న కంపెనీలే అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. ఈ దిశగా శిక్షణ ఇస్తే విద్యార్థుల ఉపాధి అవకాశాల్లో మార్పులుండే వీలుంది.వేతనాల్లో పెద్ద వాటితో పోటీ..ఉద్యోగి నిర్వహించే పాత్ర, అతని అనుభవాన్ని బట్టి కంపెనీల్లో వేతనాలుంటున్నాయి. ఈ విషయంలో పెద్ద కంపెనీలతో చిన్న కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇది ఈ మధ్య కన్పిస్తున్న కొత్త ట్రెండ్. - రోహన్ సిల్వెస్టర్ (టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్,ఇన్‌డీడ్ ఇండియా)నిలబడేందుకు పోరాటం చిన్న, మధ్యస్థ కంపెనీలు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఓ రకంగా పోరాటం చేస్తున్నాయి. మార్కెట్లో నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీల కన్నా 30 నుంచి 50 శాతం వేతనాలు ఎక్కువ ఇచ్చి చేర్చుకుంటున్నాయి. పదేళ్ళ నికర వృద్ధిలో ఇవి కూడా అత్యుత్తమ ప్రమాణాలకు చేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. - నీలమ్‌కౌర్ (ఐటీ ప్రొఫెషనల్, ముంబై) చిక్కులు తెస్తున్న ఆర్థికాంశాలు ఆర్థిక మాంద్యం పెద్ద కంపెనీ ఉద్యోగుల స్థితి గతులను మారుస్తోంది. ఈ ప్రభావం చిన్న, మధ్యస్థ కంపెనీల్లో తక్కువగా ఉంటోంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఐటీ సేవల్లో ఈ సంస్థలకే ప్రాధాన్యమిచ్చే ధోరణి కన్పిస్తోంది. కాబట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకు చిన్న కంపెనీల్లోనూ ఢోకా ఉండదు. ఎంఎస్ ప్రసాద్ (టైర్–1 కంపెనీలో వర్క్‌ఫోర్స్ హెడ్) -
డిసెంబర్ 15,16న గ్రూప్–2 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.ఐదోసారి ప్రకటనవివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్–2 ఉద్యోగ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 26న నోటిఫికేషన్ విడుదల చేయడం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడగా తాజాగా టీజీపీఎస్సీ ఐదోసారి పరీక్షల తేదీలను ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరగాల్సిన ఈ పరీక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో అక్టోబర్‌కు రీ–షెడ్యూల్ చేస్తూ టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్ మరో ప్రకటన చేసింది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, టీజీపీఎస్సీని ప్రక్షాళనతో ఏర్పాటైన కమిషన్... గ్రూప్–2 పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. కానీ డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్–2 పరీక్షల తేదీలను మార్చాలంటూ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం... పరీక్షల తేదీలను మార్చాలని కమిషన్‌కు సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్–2 ఉద్యోగాల కోసం 5.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
8,600 మంది కొత్త టీచర్లు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థలు కొత్త టీచర్లతో కళకళలాడనున్నాయి. వచ్చేవారంలో ఏకంగా 8,600 మంది విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వీరంతా నియామక పత్రాలు అందుకుని దాదాపు 4 నెలలు కావొస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగినా, ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అన్ని గురుకుల సొసైటీలు పూర్తి చేశాయి. 2,3రోజుల్లో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చేలా గురుకుల సొసైటీలు కార్యాచరణ రూపొందించాయి. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ మినహా మిగతా సొసైటీల్లో బదిలీల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించగా, ఆలోపు అన్ని కేటగిరీల్లో బదిలీల పూర్తికి చర్యలు వేగవంతం చేశాయి. బదిలీలు పూర్తి కాగానే... కొత్తగా రాబోయే గురుకుల టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించాలని గురుకుల సొసైటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ మేరకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఖాళీల జాబితాను సిద్ధం చేశాయి. ప్రస్తుతం అన్ని సొసైటీల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల్లో రెండ్రోజుల్లో బదిలీలు పూర్తవుతాయి. బీసీ గురుకుల సొసైటీలో శనివారం నాటికి పూర్తయ్యే అవకాశముంది. ఎస్సీ గురుకుల సొసైటీలో పలు కేటగిరీలు పెండింగ్‌లో ఉండడంతో నిర్దేశించిన తేదీల్లోగా పూర్తయ్యే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీలోరాత్రింబవళ్లు బదిలీల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే కొత్త టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల సరి్టఫికెట్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. వెబ్‌కౌన్సెలింగ్ ప్రారంభమైన వెంటనే వారికి లాగిన్ ద్వారా ఆప్షన్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అన్ని కేటగిరీల టీచర్లకు వెబ్‌ఆప్షన్లుకు గరిష్టంగా రెండ్రోజుల సమయం ఇవ్వాలని సొసైటీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత ఆప్షన్ల ఫ్రీజింగ్ అనంతరం పోస్టింగ్ ఉత్తర్వులు కూడా ఆన్లైన్ ద్వారానే జారీ చేసేలా సాంకేతికను సిద్ధం చేశారు. పోస్టింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తిగా మెరిట్ ఆధారంగానే ప్రాధాన్యం ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించి వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
జీసీసీల్లో హైరింగ్ జోరు
బడా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్‌సీలు) తమ సొంత అవసరాల కోసం దేశీయంగా ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు జోరుగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొదటిసారిగా ఐటీ సేవల కంపెనీలను మించి వీటిలో హైరింగ్ జరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి క్యూ1లో 46 శాతం అధికంగా జీసీసీల్లో నియామకాలకు డిమాండ్ నెలకొంది బహుళజాతి సంస్థలు భారత్‌లో కొత్తగా జీసీసీలను ఏర్పాటు చేయడం లేదా ఉన్నవాటిని విస్తరించడంపై అంతర్జాతీయ కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ సరీ్వసుల విభాగంలో సిబ్బంది సంఖ్య నికరంగా 50,000 పైచిలుకు పెరగ్గా జీసీసీల్లో 60,000 పైచిలుకు స్థాయిలో వృద్ధి చెందిందని వివరించాయి. అంతే గాకుండా ఐటీ సరీ్వసుల కంపెనీలతో పోలిస్తే కేపబిలిటీ సెంటర్లలో వేతనాలు 30–40 శాతం అధికంగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉండగా.. వచ్చే ఏడాదినాటికి ఇది 1,900కి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి. 70వేల పైచిలుకు నియామకాలు..పరిశ్రమ వర్గాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం గత ఆరు నెలల్లో తాత్కాలిక ఉద్యోగుల (గిగ్ వర్కర్లు) నియామకాలకు ఎంఎన్సీల జీసీసీల్లో డిమాండ్ 20–25 శాతం మేర పెరిగింది. బహుళజాతి సంస్థలు తక్కువ వ్యయాలతో అవసరాల మేరకు కార్యకలాపాలను విస్తరించుకునే వెసులుబాటుపై దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమనది విశ్లేషణ . ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో జీసీసీలు 70,000 వరకు గిగ్ వర్కర్లను నియమించుకునే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు మొదలైన వారు ఈ జాబితాలో ఉన్నారు. వ్యాపారపరమైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఫుల్–టైమ్ ప్రాతిపదికన కన్నా ఎప్పటికప్పుడు మారిపోయే అవసరాలను బట్టి తక్కువ వ్యయాలతో ఎంతమందినైనా తీసుకోవడానికి అవకాశం ఉండటం ఆయా కంపెనీలకు కలిసొచ్చే అంశమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫుల్–టైమ్ ఉద్యోగులతో పోలిస్తే గిగ్ వర్కర్లను నియమించుకోవడం ద్వారా కంపెనీ సగటున 25–40 శాతం వరకు వ్యయాలను ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నాయి. తాత్కాలిక, ప్రాజెక్ట్–ఆధారిత థర్డ్ పార్టీ నియామకాల విధానంలో మానవ వనరుల విభాగంపరమైన వ్యయాలు, హైరింగ్..ఆన్‌బోర్డింగ్ వ్యయాలు, అడ్మిని్రస్టేషన్ వ్యయాలు, ఎప్పటికప్పుడు వేతనాల పెంపు మొదలైన భారాలను కంపెనీలు తగ్గించుకోవచ్చని వివరించాయి. కొన్ని వర్గాలు వేస్తున్న అంచనాల ప్రకారం ప్రస్తుతం మొత్తం జీసీసీ సిబ్బందిలో 8 శాతంగా ఉన్న గిగ్ వర్కర్ల సంఖ్య వచ్చే 12 నెలల్లో సుమారు 11.6 శాతానికి చేరనుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఏపీ నిట్.. ప్లేస్‌మెంట్స్‌లో హిట్
తాడేపల్లిగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నవారికి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నా.. ఏపీ నిట్ విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు దక్కుతున్నాయి. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు. 2022 బ్యాచ్‌లో 98 శాతం, 2023లో 97 శాతం మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. ఏపీ నిట్ ప్రారంభించిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏడాదికి 300 మందికి తక్కువ కాకుండా ఉద్యోగాలు పొందడం విశేషం. త్వరలో 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆరో బ్యాచ్ బయటకు రానుంది. 258 మందికి ఉద్యోగాలుక్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఏకంగా 127 కంపెనీలు నిట్ ప్రాంగణానికి వచ్చాయి. ఆరో బ్యాచ్ విద్యార్థుల్లో ప్లేస్‌మెంట్స్ కోసం 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 258 మంది (65.82 శాతం)కి ఉద్యోగాలు లభించాయి. సరాసరి వేతనం రూ.7.15 లక్షలుగా ఉంది. బీటెక్ ఫైనలియర్ సీఎస్ఈ చదువుతున్న ఆదర్‡్ష, ఈసీఈ విద్యార్థి ఆకాష్‌కుమార్ సిన్హా అత్యధికంగా రూ.44.1 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు. వీరిని నివిధ కంపెనీ ఎంపిక చేసుకుంది. అలాగే సీఎస్ఈ విద్యార్థి సలాది వెంకట శశిభూషణ్.. పేపాల్ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో, సీఎస్ఈ బ్రాంచ్‌కే చెందిన స్వామి సక్సేనా జెడ్ఎస్ కేలర్‌లో రూ.26.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం విశేషం. కాగా డిసెంబర్ వరకు ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ కొనసాగనుంది.480 సీట్ల భర్తీనిట్లో 2024–25 సంవత్సరానికి సంబంధించి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మొదటి రౌండ్లో 480 సీట్లకు అలాట్మెంట్లు పూర్తయ్యాయని రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. నిట్‌లో సీఈసీ, ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్‌ల్లో 90 సీట్ల చొప్పున ఉన్నాయన్నారు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్‌ల్లో 60 చొప్పున, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎంఎంఈ బ్రాంచ్‌ల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 480 సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా కేటాయించామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24లోపు ఆన్లైన్ రిపోర్టింగ్‌తో పాటు ఫీజు చెల్లించాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో నిట్ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం నిట్‌లో ప్రత్యేక కేంద్రం పనిచేస్తోందన్నారు. -
నాడు ఏడాదికి 2 లక్షలు.. ఇప్పుడు 60 వేలు
సాక్షి, హైదరాబాద్: భారత సాఫ్ట్వేర్ కంపెనీలు గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్పంగా... 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్‌కు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఐటీ సేవల ఆర్డర్లు తగ్గుదలతో దేశీయ ఐటీ రంగం ఇప్పటికే ఇబ్బందుల్లో పడగా, తాజా పరిణామాలు మరింత ఆందోళన పరుస్తున్నాయి.కోవిడ్‌కు ముందు ఏడాదికి 2 లక్షల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌ను సాఫ్ట్వేర్ కంపెనీలు హైర్ చేయగా.. ఇప్పుడది 60–70 వేలకు పడిపోయింది. ఇదేకాకుండా వివిధ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 10 వేల మందికి పైగా విద్యార్థులు ఆఫర్లెటర్స్తో ఉద్యోగాల్లో చేరేందుకు ఎదురుచూపులు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలతో సహా ప్రతిష్టాత్మక కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్‌కు ప్లేస్‌మెంట్స్ గణనీయంగా తగ్గాయి. ఈ హైరింగ్‌లకు పెద్ద ఐటీ కంపెనీలు దూరంగా ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు సైతం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ పరిస్థితుల్లోనూ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, విద్యార్థులు ఐటీ వైపే మొగ్గు చూపడం ఓ చిక్కుముడిగా మారుతోంది. ఇదీ వాస్తవ పరిస్థితి... దేశంలో ఐటీ రంగంలో ఫ్రెషర్స్ అవకాశాల కల్పన తగ్గుదలకు సంబంధించి ఎక్స్–ఫెనో అనే హెచ్ఆర్ సంస్థ అధ్యయనం నిర్వహించింది. క్యాంపస్ ప్లేస్మెంట్లకు సంబంధించి గతేడాది నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు వివిధ కాలేజీల యాజమాన్యాలు చెప్పాయి. పెద్ద కంపెనీలు మార్చి, ఏప్రిల్‌లో ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా అంతకు ముందు ఏడాది జూలై, ఆగస్టుల నుంచే డిగ్రీ పూర్తిచేయబోయే విద్యార్థులకు ట్రయల్స్ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. అయితే ఈసారి క్యాంపస్‌లకు వచ్చేందుకూ కంపెనీలు సుముఖతను వ్యక్తంచేయకపోవడం యాజమాన్యాలు, విద్యార్థులను కలవరపరుస్తోంది. దాదాపు 70 శాతం విద్యార్థులు ఐటీ ఉద్యోగాలనే కోరుకుంటున్నా.. అందుకు తగ్గట్లు రిక్రూట్మెంట్ జరగకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. 2023లో కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులను కూడా కొన్ని కంపెనీలు ఇంకా ప్లేస్‌మెంట్స్‌కు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 70–80 శాతం దాకా ఆన్‌క్యాంపస్ హైరింగ్ తగ్గిపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వస్తున్న అవకాశాల్లో 85 శాతం దాకా ఏడాదికి రూ.3–6 లక్షల లోపు ప్యాకేజీల్లోనే వస్తున్నాయని చెబుతున్నారు. మరో 6 నెలలు ఇలాగే ఉండొచ్చు.. కనీసం వచ్చే ఆరునెలల దాకా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయి. ఫ్రెషర్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశాలపై ఇప్పుడే చెప్పలేం. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి మెరుగయ్యే అవకాశముంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగింపు, ఇజ్రాయెల్– హమాస్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగడం, వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు, యూఎస్, ఇతర దేశాల్లో వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం అనే అంశాలు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అదీగాక, ఉద్యోగాలపై కృత్రిమమేథ (ఏఐ) పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. 2008లోనూ ఇదే విధమైన గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. సాంకేతికంగా సమూలమార్పులు వస్తుండటంతో, అప్‌గ్రేడేషన్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటోమేషన్ పెరుగుదలతో క్లౌడ్, అనలిటిక్స్ తదితరాలకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. –వెంకారెడ్డి, వైస్‌ప్రెసిడెంట్, సీనియర్ హెచ్ఆర్ లీడర్, కో ఫోర్జ్ ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్‌లు కష్టమే.. ఫ్రెషర్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా నాన్‌ఐటీ ప్రాజెక్టులు, హెల్త్‌కేర్ సర్విసెస్, హాస్పిటల్ ఇన్సూరెన్స్ కలెక్షన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. కంటెంట్ మోడరేషన్, మ్యాపింగ్ వంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఫ్రెషర్స్ 2025 సంవత్సరమంతా కూడా లర్నింగ్ జాబ్‌గా చూసుకుని, ఇండియాలోనే ఎంబీఏ, డేటా/బిజినెస్ అనలిటిక్ వంటి కోర్సులు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాక... వడ్డీరేట్లు తగ్గించడం మొదలుపెడితే అక్కడ ఆర్థిక మాంద్యం మొదలయ్యే సూచనలున్నాయి. అందువల్ల మరో 6 నుంచి 9 నెలల దాకా అక్కడి నుంచి కొత్త ప్రాజెక్టులు రాకపోవచ్చు. ప్రస్తుతం దేశీయ సర్విస్ ప్రొవెడర్ సంస్థలు ‘డేటా మైగ్రేషన్’ ప్రాజెక్ట్‌లపై ఆధారపడుతున్నాయి. రాబోయేరోజుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌లు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. –ఎన్.లావణ్యకుమార్, సహ వ్యవస్థాపకుడు, స్మార్ట్‌స్టెప్స్ -
అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ పరిధిలో జరగనున్నాయి. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషన్ వెల్లడించింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. కన్వెన్షనల్, డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. ఆరు పరీక్షలను ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుందని, ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదని పేర్కొంది. అలా రాసినట్లైతే వాటిని పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టంచేసింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్ పరిధిలోకి తీసుకోరు.. కానీ ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను వాల్యుయేషన్ చేస్తారు. ఇందులో ఫెయిలైతే తక్కిన పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హతకు గురవుతారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, విధానం తదితర పూర్తిస్థాయి సమాచారం కమిషన్ వెబ్సైట్లో ఉందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
'పాలిటెక్నిక్' లో నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దాటని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్లో పాలిటెక్నిక్ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్ఐటీలు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్ విద్యార్థులకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్వర్క్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీ ల్, ఎఫ్ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్ ఎన్ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణసాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్ అమలు చేస్తోంది. అకడమిక్ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. కళాశాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్ స్థాయి వరకు మల్టీ లెవల్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడేరు, చీపురుపల్లి, శ్రీకాకుళం, అద్దంకి, శ్రీశైలం, చోడవరం వంటి మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది. రూ.8.60 లక్షల వేతనంతో.. మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్ కంపెనీ. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది. – ఎన్.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం‘రెడీ టూ వర్క్’ లక్ష్యంతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్మెంట్లు రెట్టింపయ్యాయి. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జి పోస్టుల నియా మకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. 9 జిల్లా జడ్డి పోస్టు (ఎంట్రీ లెవల్)లను వర్టికల్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, పూర్తిస్థాయి(డిటెయిల్డ్) నోటిఫికేషన్ ఈనెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నట్టు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9 ఉద్యో గాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రకటించింది. అయితే ఈ రోస్టర్ వర్టికల్ రిజర్వేషన్ల పద్ధతిలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జిల్లాజడ్జి పోస్టుల భర్తీలో వర్టికల్ రిజర్వేషన్ విధానం ఉండడంతో అయోమయం నెలకొంది.జిల్లా జడ్జి పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు అందులో వివరించారు. మే 13వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని, ఈ ఏడాది ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే 9 జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు నాలుగు పోస్టులు రిజర్వు చేసింది. ఖాళీ పోస్టులు, రోస్టర్ పాయింట్ల వారీగా ఎలా ఉంటుందో ప్రభుత్వం వెల్లడించింది. -
జూన్‌లో జాబ్‌ల జాతర
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీలో భాగంగా జూన్ నెలలో అపాయింట్మెంట్, పోస్టింగ్‌లు ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పార్ల మెంట్ ఎన్నికల కోడ్ ముగియగానే జాబ్‌ల జాతరకు లైన్‌క్లియర్ కానుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–4 కేటగిరీలో 9వేల ఉద్యో గాలకు సంబంధించి ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్(జీఆర్ఎల్)ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేటగిరీలో దాదాపు 2వేలకు పైబడి ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా జీఆర్ఎల్ విడుదల చేశారు. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇతర సంక్షేమ శాఖలు, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య ఇలా పలు విభాగాల్లో దాదాపు 5వేల ఉద్యోగాలకు సంబంధించిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హారిజాంటల్ రిజర్వేషన్లకు అనుగుణంగా ఆయా శాఖల నుంచి సవరించిన రోస్టర్ జాబితాలకు అనుగుణంగా ఖాళీల వివరాలను సైతం టీఎస్పీఎస్సీ తెప్పించింది. ఆ మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా ఒక్కో కేటగిరీలో జిల్లాస్థాయిలో 1:2 నిష్పత్తి, జోనల్, మల్టీ జోనల్ కేటగిరీల్లో 1:3 నిష్పత్తిలో ప్రాథమిక ఎంపిక జాబితాలను సైతం రూపొందిస్తోంది. ప్రాథమిక ఎంపిక జాబితాల ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ జూన్ రెండోవారంకల్లా పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఆలోపు పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి సైతం తొలగిపోనుంది. దీంతో టీఎస్పీఎస్సీ తుది జాబితాలను బహిర్గతం చేసిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారు. జూన్ మూడోవారం నుంచి నియామక పత్రాల పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గురుకుల పోస్టుల్లో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 1500 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కోడ్ ముగియగానే జూన్ మొదటివారం తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఫిబ్రవరి నుంచే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నియామక పత్రాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వరుసగా పోలీస్‌శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలతో పాటు వైద్య,ఆరోగ్య శాఖ పరిధిలో స్టాఫ్ నర్సులు, గురుకుల విద్యాసంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీల్లో దాదాపు 33వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా భర్తీ చేసినవే. మూడు బోర్డుల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు ఒక ఎత్తయితే... టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈ మూడు బోర్డుల పరిధిలోని ఉద్యోగాల సంఖ్యతో దాదాపు సమానంగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పలు కేటగిరీల్లో అర్హత పరీక్షలు నిర్వహించి ఫలితాల విడుదలకు కసరత్తు చేస్తోంది. -
రూ. 2 కోట్లకు ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రాలు!
రాజస్థాన్‌లో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను గత గెహ్లాట్ ప్రభుత్వం నిర్వహించింది. 2021 సెప్టెంబరులో ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. గత ఏడాది మే నెలలో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. విజయం సాధించినవారు ప్రస్తుతం రాజస్థాన్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇన్నాళ్లకు ఈ పరీక్షలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరీక్షలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులు మోసపూరితంగా ఉత్తీర్ణులయ్యారని ఆధార పూర్వకంగా తేలిందని కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 42 మంది భాగస్వాములు పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. రాజధాని జైపూర్‌లోని హస్నుపర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్‌ను వాట్సాప్‌లో పంపారు. ఇందుకోసం సదరు స్కూల్ డైరెక్టర్ పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పేపర్ రూ. 2 కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
9 వేల ఉద్యోగాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ రికార్డు స్థాయి వేగంతో జరిగింది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) భర్తీ చేసింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియ మొదట్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించింది. కానీ భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని భావించిన ప్రభుత్వం గురుకుల నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు దూకుడుగా భర్తీ ప్రక్రియ చేపట్టింది. గతంలో దాదాపు 4 వేల ఉద్యోగ నియామకాలను ఏడాది కాలంలో పూర్తి చేయగా.. ఇప్పుడు ఏకంగా 9వేల ఉద్యోగాల భర్తీని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసింది. గత నెలలో 2 వేలకు పైగా ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లైబ్రేరియన్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) ఉద్యోగాలకు అర్హత సాధించిన వారికి నియామక పత్రాలు అందజేయగా.. ఇప్పుడు మరో 6,500 మందికి అందించనుంది. గత ఏప్రిల్‌లో ప్రకటనలు జారీ చేసి.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ గతేడాది ఏప్రిల్ 5వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 9 వేల ఉద్యోగాలకు ఏక కాలంలో 9 నోటిఫికేషన్లు విడుదల చేసి రికార్డు సృష్టించింది. అదే నెల 17వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరించి గతేడాది ఆగస్టులో పరీక్షలను నిర్వహించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానం అవలంభించింది. సెప్టెంబర్ నెలలో అర్హత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను విడుదల చేసింది. దీనితో పాటు క్షేత్రస్థాయి నుంచి అభ్యంతరాలు స్వీకరించడం, తిరిగి తుది కీలను ఖరారు చేయడం దాదాపు నెలరోజుల వ్యవధిలో పూర్తి చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో కొంత జాప్యం జరిగింది. తాజాగా రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జీవోలు విడుదల చేయడంతో నియామకాల ప్రక్రియకు మార్గం సుగమమైంది. అర్హత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వివిధ కేటగిరీల్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాలు ప్రకటించడం, అనంతరం డెమో పరీక్షలు, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాలను వెబ్సైట్లో ప్రచురించడం లాంటివన్నీ కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసింది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. నేటి మధ్యాహ్నం నియామక పత్రాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 6,500 మంది ఎంపికయ్యారు. వీరికి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని లాల్ బహద్దూర్ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర మంత్రులు, గురుకుల సొసైటీ కార్యదర్శులు, సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సోమవారం నియామకపత్రాలు ఇస్తారా? లేదా? అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఆయా జిల్లాల అభ్యర్థులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. -
TSPSC: ఏ క్షణమైనా సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పలు కేటగిరీల్లో ఉద్యోగాలకు సంబంధించి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (175), డ్రగ్ ఇన్స్పెక్టర్ (18), హార్టీకల్చర్ ఆఫీసర్ (22), ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలోని లైబ్రేరియన్ (77), అసిస్టెంట్ మోటార్ Ððవెహికిల్ ఇన్స్పెక్టర్ (117), గ్రూప్–4 (8180) పోస్టులకు సంబంధించి వెబ్సైట్లో జీఆర్ఎల్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కేటగిరీల వారీగా మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను కమిషన్ అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వేగంగా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి ఆ తర్వాత తుది జాబితాలు విడుదల చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కోసం అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాలి. అదేవి ధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, వివిధ కమ్యూనిటీలకు చెందిన అభ్యర్థులు కమిషన్ నిర్దేశించిన తేదీలతో కూడిన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవా లి. ఏ క్షణంలోనైనా సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఖరారు కావచ్చునని టీఎస్పీఎస్సీ తెలిపింది. మున్సిపల్ శాఖలో వివిధ పోస్టులకు జీఆర్ఎల్ విడుదల పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ విడుదల చేసింది. ఈ జాబితాను కమిన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మహిళలకు రిజర్వేషన్లు.. ప్రతి కేటగిరీలో 33.3%
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల్లో మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతిలో 33 1/3 శాతం (33.333%) రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ (జీఓ.ఎంఎస్.3) చేశారు. వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ)తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, దివ్యాంగులు, ఎక్స్ సర్విస్‌మెన్, క్రీడాకారుల కోటాలో హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వర్టీకల్ పద్ధతి (పట్టికలోని పోస్టుల్లో కొన్నిటిని ప్రత్యేకంగా మహిళలకంటూ మార్కింగ్ ఇచ్చేవారు)లో ఉద్యోగ నియామ కాలు చేయగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్ చేయకుండా 33 1/3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం సూచించిన మెథడాలజీ ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేకంగా జీవో జారీ చేయనుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మెమోకు అనుగుణంగా ఉత్తర్వులు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున ఒక మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెమోను అన్ని నియామక సంస్థలకు పంపించారు. ఈ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమశాఖ 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 1996లో జారీ చేసిన జీవో నం.41కు, రాష్ట్ర సబార్డినేట్ సర్విసు నిబంధనలు రూల్.22కు సవరణలు చేయాలని పేర్కొంటూ టీఎస్పీఎస్సీ ఈనెల 8న మహిళా శిశు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. -
జీఓ 46 రద్దు ఇప్పటికి లేదు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని సీఎంకు అధికారులు సూచించడంతో రేవంత్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ నియామకాల్లో జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో హైపవర్ కమిటీతో రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా సూచనలను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడమే.. : పోలీస్ నియామక ప్రక్రియ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ అధికారులు తేల్చి చెప్పారు. ’’మార్చి 2022లో పోలీసు నియామకాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 4, 2023 నాటికి 15,750 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తయినా.. కోర్టు కేసుతో ప్రక్రియ పెండింగ్ లో పడింది’’అని అధికారులు తెలిపారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్, అధికారులు స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించారు. జీఓ 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టుల కేటాయింపు ఉండడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ కానిస్టేబుల్ పోస్టులు స్థానికులకు దక్కుతున్నాయనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అయితే నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఇప్పుడు జీఓ 46 ర ద్దు అసాధ్యం అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. -
కొలువుల పట్టిక తారుమారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లలో కొలువుల పట్టిక తారుమారు కానుంది. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లలో నిర్దేశించిన పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ మాయం కానుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేయని వాటిల్లో హారిజాంటల్ రిజర్వేషన్లతో ఉద్యోగాల భర్తీకి నియామక సంస్థలు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా ప్రభుత్వ శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించాలని సూచిస్తూ నియామక సంస్థలైన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లు నోటీసులు ఇచ్చాయి. వీలైనంత వేగంగా పోస్టుల క్రమాన్ని మార్చి పంపించాలని స్పష్టం చేశాయి. ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, గురుకుల కొలువులు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అనుసరించిన వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు 33 1/3 శాతం పోస్టులను ఆయా వరుస క్రమంలో రిజర్వ్ చేసి (నిర్దిష్ట పాయింట్ కింద ఉన్న పోస్టును మహిళలకని ప్రత్యేకంగా మార్క్ చేసి) చూపించేవారు. కానీ తాజా హారిజాంటల్ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్ చేయరు (ఎలాంటి మార్కింగ్ ఉండదు). భర్తీ సమయంలోనే ప్రతి మూడింటా ఒక్క పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు. అందువల్ల సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్‌తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారీగా కొత్త పట్టిక తయారు చేసి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉంది. ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి 3 పోస్టులను మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లైౖతే, తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్‌ను తొలగించి పది పోస్టులను జనరల్‌కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలి. అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మారవు. కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గ జనరల్ కేటగిరీకి మారుస్తారు. ఇలా శాఖలన్నీ హారిజాంటల్ విధానంలో కొత్తగా ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనుంది. -
క్యాంపస్ రిక్రూట్మెంట్లపై ఫ్రెషర్స్‌లో కంగారు