డిసెంబర్‌ 15,16న గ్రూప్‌–2 పరీక్షలు | Group-2 Exams on 15th and 16th December | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 15,16న గ్రూప్‌–2 పరీక్షలు

Published Fri, Aug 23 2024 5:10 AM | Last Updated on Fri, Aug 23 2024 5:10 AM

Group-2 Exams on 15th and 16th December

షెడ్యూల్‌ విడుదల చేసిన టీజీపీఎస్సీ

రెండు సెషన్ల చొప్పున నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షల షెడ్యూ­ల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీ­పీ­ఎస్సీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో నాలుగు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. మధ్యా­హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఐదోసారి ప్రకటన
వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్‌–2 ఉద్యో­గ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 26న నోటిఫికేషన్‌ విడుదల చేయడం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హ­త పరీ­క్షలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడగా తాజాగా టీజీపీఎస్సీ ఐదోసారి పరీక్షల తేదీ­లను ప్రకటించింది. గతేడాది ఆగస్టులో జరగా­ల్సిన ఈ పరీక్షలను ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవ­హా­రంతో అక్టోబర్‌కు రీ–షెడ్యూల్‌ చేస్తూ టీజీపీఎస్సీ తేదీలను ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు కమిషన్‌ మరో ప్రకటన చేసింది. 

అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడటం, టీజీపీఎస్సీని ప్రక్షాళనతో ఏర్పాటైన కమిషన్‌... గ్రూప్‌–2 పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ విడుదల చేసింది. కానీ డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌–2 పరీక్షల తేదీలను మార్చాలంటూ క్షేత్రస్థాయి నుంచి అభ్యర్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం... పరీక్షల తేదీలను మార్చాలని కమిషన్‌కు సూచించింది. ఈ క్రమంలో డిసెంబర్‌లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన కమిషన్‌ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గ్రూప్‌–2 ఉద్యోగాల కోసం 5.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement