అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌–1 మెయిన్స్‌ | Group-1 Mains from October 21 | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌–1 మెయిన్స్‌

Published Thu, Jun 13 2024 5:06 AM | Last Updated on Thu, Jun 13 2024 8:10 AM

Group-1 Mains from October 21

షెడ్యూల్‌ ప్రకటించిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

వరుసగా వారం రోజులపాటు హైదరాబాద్‌లో పరీక్షల నిర్వహణ 

ఒక్కో పరీక్షకు సమయం 3 గంటలు, మార్కులు 150  

ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హత

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్‌లో హెచ్‌ఎండీఏ పరిధిలో జరగనున్నాయి. 

ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషన్‌ వెల్లడించింది. జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష ప్రశ్నపత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. కన్వెన్షనల్, డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ తెలిపింది. 


ఆరు పరీక్షలను ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుందని, ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదని పేర్కొంది. అలా రాసినట్లైతే వాటిని పరిగణనలోకి తీసుకోమని కమిషన్‌ స్పష్టంచేసింది. జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్‌ పరిధిలోకి తీసుకోరు.. కానీ ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను వాల్యుయేషన్‌ చేస్తారు. 



ఇందులో ఫెయిలైతే తక్కిన పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హతకు గురవుతారు. మెయిన్‌ పరీక్షలకు సంబంధించిన సిలబస్, విధానం తదితర పూర్తిస్థాయి సమాచారం కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement