group-1
-
దరఖాస్తుల జోరు.. పరీక్షకు రారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తూ, సన్నద్ధమవుతున్నవారు కూడా ఇందులో ఉంటున్నారు. కనీసం హాల్‌టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోనివారూ ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరమవుతుండగా.. నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతుండటం.. కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండటం.. ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉండటం గమనార్హం. సాగదీతలు.. వాయిదాలతో.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 11 వేల గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకాగా.. రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాక ఆ నోటిఫికేషన్ రద్దయింది. దాని స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగిస్తూనే... కొత్త అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చివరిదశకు చేరింది. ఇక గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2022 డిసెంబర్లో వెలువడ్డాయి. గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. గ్రూప్–2, 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో గ్రూప్–2 అర్హత పరీక్షలు మూడుసార్లు వాయిదా పడగా.. గ్రూప్–3 పరీక్షలు రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతుండటంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని.. వాటికోసం వేచి చూసే బదులుగా ప్రత్నామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హాజరుశాతం.. క్రమంగా పతనం.. గత ఏడాది జూలైలో గ్రూప్–4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. హాజరైనవారు సుమారు ఏడున్నర లక్షల మంది మాత్రమే. అంటే 80 శాతం మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైనవారు 74 శాతమే. ప్రిలిమినరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిలో నుంచి.. ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు 31,403 మందిని కమిషన్ ఎంపిక చేసింది. బాగా ప్రిపేరైన వారే మెయిన్స్‌కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్‌కు కూడా 67.17శాతం మందే హాజరవడం గమనార్హం. గ్రూప్–3 పరీక్షలకు కేవలం 50.24 శాతం మంది, గ్రూప్–2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57 శాతమే హాజరయ్యారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండటం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరాశలో కూరుకుపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు జారీ చేశాక పరీక్షల నిర్వహణ, వాయిదాలతో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. దరఖాస్తు చేసినవారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుండగా.. హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ.. భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి. – అబ్దుల్ కరీం, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేటు సెక్టార్లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరుగెత్తాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే.. పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి. – భవాని శంకర్ కోడాలి, నిపుణులు, కెరీర్ గైడ్ -
గ్రూప్–1కు తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్–1 రీనోటిఫికేషన్, భర్తీ ప్రక్రియ, ప్రశ్నపత్రాల కీ తదితర అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కాలేదని, మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ పమిడిఘటం శ్రీ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అవసరం లేదని, దీనివల్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని తేలి్చచెప్పింది. మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషనర్ల అభ్యంతరాలను తోసిపుచి్చంది. తదుపరి ప్రక్రియ చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. మెయిన్స్ ఫలితాల విడుదలే తరువాయి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా జూన్‌లో ప్రిలిమ్స్ నిర్వహించిన కమిషన్ అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలను కూడా నిర్వహించింది. అయితే గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పాటు మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో జీఓ 55కు బదులుగా జీఓ 29ని తీసుకురావడం, అదేవిధంగా ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నలకు జవాబులు, ‘కీ’లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దీంతో ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు రాసిన పలువురు అభ్యర్థుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనే ఆందోళన నెలకొంది. తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీంకోర్టులో, అంతకుముందు హైకోర్టులో గ్రూప్–1పై ఇప్పటివరకు నమోదైన అన్ని కేసుల విచారణ పూర్తికావడంతో ఉద్యోగాల భర్తీకి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లేనని టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఉద్యోగాల భర్తీ దాదాపు కొలిక్కిరానుంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో మెయిన్స్ పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగు తోంది. ఇందుకోసం కమిషన్ ప్రత్యేకంగా ప్రొఫెసర్లతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది. -
పరీక్షలను రీషెడ్యూల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం కలిగేలా రూపొందిన జీవో 29ను వెంటనే ఉపసంహరించుకోవాలని, గ్రూప్–1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెల్లవారితే పరీక్ష అని తెలిసి కూడా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారంటే.. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని లేఖలో కోరారు. నిరుద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి, వారి డిమాండ్ మేరకు మార్పులు చేయాలన్నారు.జీవో 29 వల్ల 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హులయ్యారని.. 563 పోస్టులకు గుండుగుత్తగా 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం అన్యాయమని సంజయ్ పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించిన రిజర్వ్డ్ అభ్యర్థులను.. రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. పరీక్షలను రీషెడ్యూల్ చేయని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించాలని లేఖలో కోరారు. అసలు రిజర్వేషన్లనే రద్దు చేస్తున్నారన్న చర్చకు ఈ జీవో దారితీసిందని పేర్కొన్నారు. -
Group-1 Exam: అట్టుడికిన సిటీ
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం అట్టుడికింది. ఆందోళనలు, ధర్నాలు, ముట్టడి, బంద్ పిలుపులతో నగరం గరం గరంగా మారింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఆందోళనకారుల అరెస్టులు, లాఠీచార్జ్‌లతో శనివారం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీఓ నం–29ను రద్దు చేయాలని గ్రూప్–1 అభ్యర్థుల మూడు రోజులుగా అశోక్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సెక్రటేరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులను, మంత్రిని పోలీసులు నిలువరించడంతో అశోక్‌నగర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సికింద్రాబాద్ బంద్‌లో లాఠీచార్జ్.. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచి్చన సికింద్రాబాద్ బంద్‌లో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నుంచి వేలాది మంది ర్యాలీగా బయలుదేరారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూవాహిని, బీజేపీ తదితర సంస్థలకు చెందిన ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి అక్కడి నుంచి బాటా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు, కురీ్చలు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జిలో నలుగురు యువకులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగిపోయింది. బంద్, ర్యాలీలతో సికింద్రాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.స్వచ్ఛందంగా షాపులు మూసిన వ్యాపారులు రాంగోపాల్‌పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచి్చన బంద్ శనివారం ప్రశాంతంగా సాగింది. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికారు. -
‘తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. అందుకు జీవో నంబర్ 29 ఓ సంకేతమన్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘ తెలంగాణలో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోంది. సోనియా జన్మదినం... నిరుద్యోగుల బలిదినం కాబోతోంది.ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాల్సిందే. నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా?, నిరుద్యోగ ర్యాలీలో విధ్వంసం చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర, కేటీఆర్ ఓ యూజ్ లెస్ ఫెలో. నేను పేపర్ లీకేజీ చేసినట్లు ప్యామిలీతో కలిసి ప్రమాణం చేసే దమ్ముందా?. డ్రగ్స్ తీసుకుని చీకటి దందాలు సాగించిన బతుకు నీది. నా జోలికొస్తే... నీ చీకటి బతుకులను బయటపెడతా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు బిడ్డా. కాంగ్రెస్‌తో కుమ్కక్కు రాజకీయాలు చేస్తోంది మీరు కాదా?, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కాళేశ్వరం కేసులు రాకుండా చీకటి రాజకీయాలు చేస్తోంది మీరే. కాంగ్రెస్ తో పగలు ఫైటింగ్... రాత్రిళ్లు లవ్వింగ్ బతుకు మీది. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది. జేసీబీ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు. 2028లో తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సికింద్రాబాద్ లో భజరంగ్ దళ్ కార్యకర్తలు, ప్రజలపై పోలీసుల లాఠీఛార్జ్ ను ఖండిస్తున్నా. ప్రశాంతంగా జరుగుతున్న ప్రదర్శనను అడ్డుకుని హింసను సృష్టించడం దారుణం.. పోలీసుల తీరు దుర్మార్గం’ అని ధ్వజమెత్తారు.చదవండి: TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1 మెయిన్స్‌పై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి.కాగా ఈనెల 15న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు యథావిధిగా మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. ఆ పిటిషన్లపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన అన్నీ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21 గ్రూప్-1 పరీక్షలు జరగనున్నాయి. -
కేటీఆర్ తో గ్రూప్-1 అభ్యర్థుల భేటీ
-
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్
-
ఇక్కడెందుకు పిటిషన్ వేశారు?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షకు సంబంధించి సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా, నేరుగా ఇక్కడ పిటిషన్ ఎందుకు వేశారని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. రాజ్యాంగ పరమైన ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయని అడిగింది. విచారణను రేపటికి వాయిదా వేస్తూ, ఇక్కడే విచారణ జరపాలా.. లేక సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్లకు అటాచ్ చేయాలా అనేది తేలుస్తామని స్పష్టం చేసింది. 2024, ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీఎస్పీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్.. అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలని, అధికారులు వరి్టకల్‌గా రోస్టర్ పాయింట్లు నిర్ధారిస్తున్నారని, మెయిన్స్‌కు 1ః50 గా ఎంపిక చేశారని, దీనిలో కూడా సమాంతర రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ లోకస్ లేకుండానే రూల్‌ను చాలెంజ్ చేస్తూ పిటిషన్ వేశారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘చట్టబద్ధమైన రూల్స్ లేనప్పుడు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేయాలి కదా, ఇక్కడ ఎందుకు’అని ప్రశ్నించింది. పిటిషనర్ న్యాయవాది సమయం కోరడంతో విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. -
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్‌ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్‌రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. -
అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ పరిధిలో జరగనున్నాయి. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషన్ వెల్లడించింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. కన్వెన్షనల్, డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. ఆరు పరీక్షలను ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుందని, ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదని పేర్కొంది. అలా రాసినట్లైతే వాటిని పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టంచేసింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్ పరిధిలోకి తీసుకోరు.. కానీ ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను వాల్యుయేషన్ చేస్తారు. ఇందులో ఫెయిలైతే తక్కిన పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హతకు గురవుతారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, విధానం తదితర పూర్తిస్థాయి సమాచారం కమిషన్ వెబ్సైట్లో ఉందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు తీవ్ర పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ మూడో సారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో రెండుసార్లు నిర్వహించి రద్దు చేసిన ప్రిలిమ్స్‌తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈసారి పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ రాసినట్లు కమిషన్ ప్రాథమికంగా వెల్లడించింది.దీనికితోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్య స్తంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్ ప్రాథమిక ‘కీ’విడుదల చేశాకే స్పష్టత కటాఫ్‌పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్హతకు కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు రద్దు కావడంతో..: వాస్తవానికి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్‌లో 503 ఉద్యోగాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు తేదీలు ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్‌ను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కారు.దీంతో కోర్టు ఆదేశంతో ప్రిలిమ్స్‌ను కమిషన్రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం... కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తును అప్డేట్ చేసుకొనే అవకాశం కల్పించడంతోపాటు కొత్తగా దరకాస్తు చేసుకొనే అవకాశం కలి్పంచింది. దీంతో కొత్తగా 23 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షల చేరింది. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ పరీక్ష ఉన్నందున గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చి0ది. అయితే పిటిషనర్లు ఈ నెల 1న ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. పిటిషన్లో విచారణను ముగించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ పరిధిలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్– ఐఐ/ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 2వ స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 9న ఉందని, అదేరోజు నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని కోరుతూ ఎం.గణేశ్, భూక్యా భరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ మంగళవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే ప్రకటించాం. 9న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ పరీక్షకు సిద్ధమయ్యారు. కొందరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం...పరీక్ష వాయిదా వేయడం సాధ్యం కాదు. అయినా పిటిషనర్ల వినతిపత్రంపై అధికారులు చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారు’అని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి...ఈ పిటిషన్లో మెరిట్స్‌లోకి వెళ్లడంలేదని, చట్టప్రకారం టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. -
AP: గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ.. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. గ్రూప్ వన్‌కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. కిందటి ఏడాది డిసెంబర్ 08వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 Group 1 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రెస్ నోట్లో ఏపీపీఎస్సీ పేర్కొంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి పోస్టుల వివరాలివే.. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6; కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. -
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
-
AP : గ్రూప్-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే
సాక్షి, గుంటూరు: APPSC (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యధావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ 27కి వాయిదా వేసింది. 2018 గ్రూప్ వన్ కింద 167 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 26, 2022న APPSC ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది. దీంతో.. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ క్రమంలో.. మాన్యువల్‌గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్‌కు సమర్పించింది ఏపీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్వర్వులపై క్షుణ్ణంగా విచారణ జరిపింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్. న్యాయస్థానం బెంచ్‌లో సభ్యులైన జస్టిస్ రవినాథ్ తిల్హారి, జస్టిస్ హరినాథ్ ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా విన్నారు. అన్ని పరిశీలించిన మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది డివిజన్ బెంచ్. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తుది ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయ్యింది. మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగానే దానికి నానా వక్రభాష్యాలు జోడించి తప్పుడు ప్రచారానికి దిగింది తెలుగుదేశం, జనసేన. APPSCమీద వచ్చిన తీర్పును అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఓ ఎలక్ట్రానిక్ బోర్డు, దాంట్లో నాలుగు గ్రాఫిక్స్ పెట్టుకుని చంద్రబాబు నానా హంగామా చేశారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో సదరు అసత్య ప్రచారాలకు ఫుల్స్టాప్ పడ్డట్టయింది. -
2018 గ్రూప్-1 మెయిన్స్‌పై రాజకీయ విమర్శలా? : గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: 2018 మెయిన్స్ పరీక్ష రద్దుపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సర్వీస్ కమిషన్, ప్రభుత్వంపైనా రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా జరిగిందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పకడ్బందీగా ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని స్పష్టం చేశారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయని చెప్పారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటి దాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో వేలాది పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు గౌతమ్ సవాంగ్. 2018 గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల్లో 14 మంది ఐఏఎస్‌కు ఎంపికవ్వడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసిందని తెలిపారు. బాబు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం జగన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్-1, గ్రూప్-2 వంటి గెజిటెడ్ పోస్టులతోపాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు జరిగాయని తెలిపారు. నాడే పడిన వివాదాల బీజం 2018లో బాబు హయాంలో గ్రూప్-1 విషయంలో వివాదాలు తలెత్తిన్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2018 మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్లో దాదాపు 62 తప్పులు దొర్లాయని చెప్పారు. వీటికి నాటి చంద్రబాబు ప్రభుత్వంగానీ, నాటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్గానీ సమాధానం చెప్పలేదని ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం ఎప్పటి నుంచో ఉండగా..డిజిటల్ మూల్యంకనం ప్రతిపాదన నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్‌దేనని అన్నారు. సంప్రదాయ పద్ధతి విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన చేయగా, నాటి కమిషన్‌లోని సభ్యులు కూడా ఆమోదం తెలిపి కొత్త ప్రభుత్వం ముందుంచారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయగా అందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేయాలని చూడగా.. నోటిఫికేషన్లో చెప్పని కారణంగా కోర్టు ద్వారా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ విధానంలోనే పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. ‘2018 గ్రూప్-1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక అయ్యారు. ఇందులో ఐఐటీ నుంచి 19 మంది, ఐఐఎం నుంచి 7, ఎన్ఐటీ నుంచి 17, బిట్స్ పిలానీ నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చేసినవారు 177 మంది, సాధారణ పీజీ 51, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో 40 మంది సివిల్స్ రాయగా.. వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా, ఇద్దరు కేంద్ర సర్వీసుకు ఎంపికయ్యారు. మరో 24 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 163 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వీరంతా 2018 గ్రూప్-1 కంటే ముందే పలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నవారు. వీరంతా మెయిన్స్‌లో ప్రతిభ చూపిన తర్వాతే ఇంటర్వ్యూని ఎదుర్కొన్నారు. సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని చదివినవారికి గ్రూప్-1లో గెలవడం లెక్కకాదు’ అని తెలిపారు. -
51 ఏళ్ల అర్హతను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు సడలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత భర్తీ చేస్తున్న గ్రూప్–1 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొందని, దీనిని 51 ఏళ్ల వరకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన నిరుద్యోగి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. గరిష్ట వయసు సడలింపు ఇస్తూ నోటిఫికేషన్లో మార్పు చేసేలా టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఫణిభూషణ్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల జారీలో చాలా జాప్యం జరిగిందన్నారు. దీంతో అనేక మంది గ్రూప్–1 పరీక్షలకు అర్హత కోల్పోయారని వివరించారు. ఈ దృష్ట్యా గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఆంశంలో మెరిట్ జోలికి వెళ్లడంలేదని, ఫిబ్రవరి 2న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 4 వారాల్లో దీనిపై నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేశారు. -
APPSC : జాబ్స్ పిలుపు.. 897 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్
త్వరలో గ్రూప్–1 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ త్వరలోనే వంద గ్రూప్–1 పోస్టులతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్‌తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను అధిగమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన కమిషన్ తాజాగా గ్రూప్–2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. సాక్షి, అమరావతి: యువత ఉత్కంఠకు తెర దించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మే నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కమిషన్ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ల పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో పాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కమిషన్ ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. వెబ్సైట్లో సిలబస్ అభ్యర్థుల అభ్యర్థన, సౌలభ్యం మేరకు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్–1, పేపర్–2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పరీక్ష సిలబస్‌ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఖాళీలు, వేతనం, వయసు, విద్యార్హతలతో పాటు పూర్తి సమాచారం కోసం కమిషన్ వెబ్సైట్ http://www.psc.ap.gov.inలో చూడవచ్చు. -
నాలుగు నెలల్లో 4 కొలువులు.. అయినా సివిల్స్ లక్ష్యంగా..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు. ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్‌పై గురి వీడలేదు. నిరంతర పరిశ్రమకు చిరునామాగా నిలిచే సూర్యకుమార్‌ను ఒకసారి పలకరిస్తే.. రాజమహేంద్రవరం: మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు. నాకు టెన్తులో మంచి మార్కులొచ్చాయి. స్టేట్‌లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్‌లో ఒకడిగా నిలిచాను. 2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్‌లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. త్రుటిలో చేజారిన అవకాశాలు ఎక్కువ జీతం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను. కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగుకు జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్‌కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు. అంతిమ లక్ష్యం సివిల్స్ 2023– ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. పేరు : చుక్కల సూర్యకుమార్ తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్ తల్లి : లక్ష్మి, గృహిణి చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు) ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి) లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం. – చుక్కల సూర్యకుమార్ -
గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు సబబే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది. నోటిఫికేషన్ నిబంధనలను సవరిస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం చట్ట వ్యతిరేకమేనని పేర్కొంది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారని, అందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. జూన్ 11న నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. బయోమెట్రిక్ సహా నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కి తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అప్పీల్లో ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు, నర్సింగ్, హసీనా సుల్తానా వాడీవేడిగా వాదనలు వినిపించారు. బయోమెట్రిక్‌పై వాదన ఆమోద యోగ్యం కాదు ‘గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారి గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు 2.83 లక్షల మంది వరకు హాజరయ్యారని కమిషన్ చెబుతోంది. అప్పుడు సమర్థవంతంగా బయోమెట్రిక్ నిర్వహించిన కమిషన్.. 2.33 లక్షల మంది పాల్గొన్న జూన్‌లో మాత్రం భారీ సంఖ్య కారణంగా తీసుకోలేదని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. కానిస్టేబుల్ పోస్టులు సహా ఇతర పలు పోస్టుల నియామక పరీక్షలకు బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు గ్రూప్–1కు తీసుకోకపోవడాన్ని కమిషన్ సమర్ధించుకోలేదు. ఇంకోవైపు 50 వేల మంది పరీక్షకు దూరం కావడం చిన్న విషయమేమీ కాదు. అభ్యర్థుల్లో కమిషన్ విశ్వసనీయత కోల్పోవడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్లపై ఇద్దరు ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండాలి. కానీ కొన్ని షీట్లపై ఒక్కరి సంతకమే ఉంది. దీనికి కమిషన్ సమాధానం సమంజసనీయంగా లేదు. గ్రూప్–1 కంటే ఎక్కువ మంది హాజరైన గ్రూప్–4కు ఓఎంఆర్ షీట్లపై ఫొటో ఇచ్చినప్పుడు గ్రూప్–1కు ఇవ్వకపోవడం అక్రమాలకు ఆస్కారం ఇచ్చేలా ఉంది..’అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ 258 మంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది.. ‘నోటిఫికేషన్ నిబంధనల్లో మార్పుచేర్పులు, సవరణలు చేసే అధికారం కమిషన్‌కు ఉంది. అయితే నోటిఫికేషన్ వెలువరించాక సవరణ చేయాలనుకుంటే ఆ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. గ్రూప్–4 పరీక్షలకు బయోమెట్రిక్ లేదంటూ అనుబంధ నోటిఫికేషన్ వెలువరించిన కమిషన్ గ్రూప్–1 విషయంలో అలా చేయకపోవడం సమర్థనీయం కాదు. జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తర్వాత 2,33,248 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పిన కమిషన్.. అనంతరం ఆ సంఖ్యను 2,33,506గా చెప్పింది. ఈ వ్యత్యాసం గ్రూప్–1 మొత్తం పోస్టుల్లో (503) సగం కంటే ఎక్కువ (258). ఒకవేళ నిజంగా అక్రమాలు చోటుచేసుకుని ఈ 258 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికైతే.. అంతమంది మెరిట్ అభ్యర్థులు అవకాశం కోల్పోతారు. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్ష అని, పట్టించుకోనవసరం లేదన్న కమిషన్ వాదన కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇరుపక్షాల వాదనలను లోతుగా పరిశీలించాక సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం కనబడటం లేదు..’అని బెంచ్ స్పష్టం చేసింది. ముగ్గురి వల్ల లక్షల మంది ఇబ్బందుల్లోకి.. ‘ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పరీక్షను రద్దు చేయాలని కోరారు. ముగ్గురి కోసం లక్షల మంది భవిష్యత్ ఇబ్బందుల్లో నెట్టడం సరికాదు. 2.33 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అప్పీల్‌ను ఆమోదించాలి..’అని ఏజీ కోరారు. కాగా.. ‘అభ్యర్థుల సంఖ్యలో తేడా అక్రమాలు తావిచ్చేదిగా ఉంది. పరీక్షల నిర్వహణలో కమిషన్‌కు చిత్తశుద్ధి లోపించింది. ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించాల్సిన కమిషన్.. రెండోసారి కూడా విఫలమయ్యింది. కాబట్టి పరీక్షను రద్దు చేసి నోటిఫికేషన్‌లోని నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలి..’అంటూ గిరిధర్‌రావు, నర్సింగ్ వాదించారు. -
గ్రూప్-1 రద్దు..హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
-
గ్రూప్–1 అభ్యర్థుల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్‌కు 3,09,323 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్‌నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఆగమాగం గతేడాది ఏప్రిల్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు. కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్‌చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్‌రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు జూనియర్ అసిస్టెంట్.. నేడు గ్రూప్–1 అధికారిణి
పొదలకూరు: ఆమె ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. కష్టపడి చదివి నేడు గ్రూప్–1 అధికారిణిగా మారారు. కుటుంబం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే విజయం సొంతమవుతుందని గ్రూప్–1కు ఎంపికై న ఎల్ఎస్ఆర్ రుధిర తెలిపారు. నెల్లూరులోని కొత్తూరుకు చెందిన ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. తండ్రి పద్మనాభరావు. తల్లి శాంతికుమారి. తల్లి గతంలో పొదలకూరు రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేశారు. రుధిర పొదలకూరు మండలం వరదాపురం శ్రీసాయినాథ్ స్కూల్లో 2014 – 15 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివారు. తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. 2021లో సివిల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. ఇంకా ఐజీఎన్ఓయూలో బీఏ పూర్తి చేశారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే పట్టుదలతో రాష్ట్ర హైకోర్ట్ పెట్టిన పరీక్ష రాసి జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై నెల్లూరు కోర్టులో పనిచేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల గ్రూప్–1 సాధించి ఖజానా శాఖకు ఎంపికయ్యారు. నా లక్ష్యం ఐఏఎస్ శ్రీసాయినాథ్ స్కూల్లో కరస్పాడెంట్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి విద్యార్థులను చదివించడంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ఇది నా భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడింది. పోటీ పరీక్షలు రాసేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం కఠోర శ్రమ పడాల్సి ఉంటుంది. పట్టుదల, కృషి ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు. – రుధిర -
ఆశయం ముందు తలవంచిన అవరోధాలు
కందుకూరు: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆమె చిన్ననాటి ఆశయం ముందు పెళ్లి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం వంటి అవరోధాలన్నీ చిన్నబోయాయి. పట్టుదల, నిరంతర కృషితో ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని నిరూపించింది ఉలవపాడు మండలం బద్దిపూడికి చెందిన చేజర్ల రమ్యరెడ్డి. ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో విజయం సాధించింది. ఎటువంటి కోచింగ్ లేకుండానే తన సొంత ప్రిపరేషన్‌తో రెండో ప్రయత్నంలోనే గ్రూప్–1 ఆఫీసర్‌గా ఎంపికై ంది. పబ్లిక్ సర్వీస్ చిన్ననాటి కోరిక బద్దిపూడికి చెందిన శ్రీనివాసులరెడ్డి, కృష్ణవేణి దంపతుల కుమార్తె చేజర్ల రమ్యరెడ్డి. తండ్రి సాధారణ రైతు కావడంతో రమ్య పాఠశాల విద్యను అమ్మనబ్రోలులోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పూర్తి చేసింది. విజయనగరం జిల్లా తాటిపూడి రెసిడెన్షిల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసింది. అనంతరం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో బీఫార్మసీ, ఏలూరు జిల్లాలోని నోవా కళాశాలలో ఎంఫార్మసీ పూర్తి చేసింది. ఆ తరువాత రెండేళ్ల పాటు అరబిందో ఫార్మా స్యూటికల్స్లో ఉద్యోగం చేసింది. 2010లో తల్లిదండ్రులు చూసిన సంబంధం మేరకు మాచవరానికి చెందిన వంశీకృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. భర్త మలేసియాలో ఎలక్ట్రికల్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ ఇంజినీర్‌గా పనిచేస్తుండడంతో అక్కడికి వెళ్లారు. ఆ తరు వాత 2018లో స్వదేశానికి వచ్చి కరోనా ప్రభావంతో ఇక్కడే ఉండిపోయారు. రెండో ప్రయత్నంలోనే.. రమ్యరెడ్డి తన రెండో ప్రయత్నంలోనే గ్రూప్–1 ఉద్యోగం సాధించింది. 2018 చివరిలో వెలువడిన గ్రూప్–1 నోటిఫికేషన్ సమయానికి రమ్యకు ఐదేళ్ల కుమారుడితో పాటు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే గ్రూప్–1 పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. ఇంటర్వ్యూలో సరైన మార్కులు రాకపోవడంతో త్రుటిలో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 2022 సెప్టెంబర్‌లో మళ్లీ గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవగా ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమైంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లు పాసై మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించింది. మెయిన్స్ సమయంలో సైనసైటిస్ మేజర్ ఆపరేషన్‌తో నెల పాటు ప్రిపరేషన్ నిలిచిపోయినా మళ్లీ కోలుకుని పరీక్షలు రాసి విజయం సాధించింది. తాను చిన్ననాటి నుంచి కలలు కన్న ప్రభుత్వ ఉద్యోగం ఆశయాన్ని నెరవేర్చుకుంది. ఇష్టపడి కష్టపడితే ఏదైనా సాధ్యమే చాలా మంది పెళ్లి అయిన తరువాత ఇంకేమి సాధిస్తాం అని చెప్తుంటారు. కానీ సరైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. నా ఉద్యోగ ప్రయత్నంలో నా భర్త వంశీకృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. అందుకే నాలుగేళ్ల పాటు పట్టు వదలకుండా నిరంతరం కష్టపడి చదివాను. చివరికి నాకు ఇష్టమైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లోనే ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా. – రమ్యరెడ్డి -
రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్.. అలా చేస్తే కోచింగ్ అనసవరం: షేక్ అయేషా
‘ఓటమి ఎదురైనప్పుడే మరింత శ్రమించడం అలవాటవుతుంది... అప్పుడే విజయం ముంగిటకు వచ్చి వాలుతుంది. పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యమైనా ఇదిగో ఇట్టే మన సొంతమవుతుంది..’ ఇదీ ఏపీపీఎస్సీ గ్రూప్–1 విజేత, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై న మదనపల్లెకు చెందిన షేక్ ఆయేషా చెప్పిన మాటలు. పేదరికంలో పుట్టినా.. కష్టాలు పలకరించినా వెనుదిరగలేదు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకుని డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయేషా విజయప్రస్థానం ఆమె మాటల్లోనే.. అన్నమయ్య : లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకసారి వైఫల్యం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి విజయానైన్నా ఇట్టే సాధించవచ్చు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, ఇంటర్నెట్ లాంటి సాధనాలు అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ప్రతి రోజు దినపత్రికలు చదివి , కరెంట్ ఎఫైర్స్ నోట్స్ సొంతంగా తయారు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలం. దానికి నేనే ఉదాహరణ. లక్షసాధనకు ఐదేళ్లు తపస్సు సివిల్స్ నా చిన్ననాటి కల. బీటెక్ పూర్తి చేసిన తరువాత పినాకా ఆర్గనైజేషన్ నిర్వాహకులు యాదగిరి ,ముంబైలోని ఆర్బిఐ గ్రేడ్–బి మేనేజర్ మిథున్ల సూచనలు, సలహాలతో సివిల్స్ వైపు దృష్టి సారించా. 2018లో బీటెక్ పూర్తి చేసే సమయంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో, టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యా. అయినా నా లక్ష్యం గ్రూప్స్ కావడంతో ఉద్యోగంలో చేరలేదు. 2004 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించే పినాకా స్టూటెండ్స్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాట్స్ప్ గ్రూపులో చేరాను. ఇందులో గ్రూప్స్‌కు ప్రిపేర్ కావడానికి అవసరమైన మెటీరియల్ లభించేది. దీనితో పాటు యాదగిరి పూర్తిగా సహకారం అందించారు. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసుకున్నాను. మొదటి ప్రయత్నంగా 2019లో గ్రూప్–1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్ పాసై ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కాని ఎంపిక కాలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని అందించారు. మరో ప్రయత్నం చేయడానికి మనోధైర్యాన్ని కల్పించారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. 2022 సెప్టెంబర్‌లో గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ కాగా ఆత్మస్థైర్యంతో మరింత కష్టపడి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాను. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాను. ఐదేళ్ల తపస్సు నెరవేరింది. సాధారణ విద్యార్థినే.. 1 నుంచి 10 వరకు ఆరోగ్యమాత ఎయిడెడ్ ఉన్నత పాఠశాలో చదివాను. ప్రాథమిక పాఠశాలలో సాధారణ విద్యార్థిని. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి, హెచ్ఎం వాసుదేవరావులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. మూడో తరగతి నుంచి నాకు మంచి ఫౌండేషన్ వేశారు. పదిలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్మీడియట్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో చేరాను. కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకులు గోవిందరాజులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్లో 982 మార్కులు సాధించాను. బీటెక్ తమిళనాడు తంజావూరులోని శస్త్ర యూనివర్శిటీలో చదివాను. 2018లో బీటెక్ పూర్తి చేశాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా... తమిళనాడు తంజావూరు శస్త్ర యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేశా. టెక్ట్స్ బుక్స్, ఎన్‌సీఈఆర్‌టి బుక్స్ చదివి సొంతంగానే నోట్స్ తయారు చేసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతి రోజూ దినపత్రికలు హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సాక్షి చదవడం అలవాటు చేసుకున్నా. ఆయా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్ కాలమ్స్,కరెంట్ ఎఫైర్స్ చదవడం అలవాటుగా మారింది. రోజుకు తొమ్మిది గంటల పాటు చదివాను. తల్లిదండ్రులే కొండంత అండ: గ్రూప్స్ ప్రిపరేషన్లో తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. నాన్న షేక్ అహ్మద్‌బాషా చిరు వ్యాపారి. అమ్మ గౌసియాబేగం సాధారణ గృహిణి. నా సక్సెస్‌లో వారి ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను. ఏ సమయంలోనైనా నేను ఒత్తిడికి గురైతే నన్ను వెన్నుతట్టి నాలో ఆత్మస్థైర్యాన్ని కల్పించేవారు. ఇక స్కూలు రోజుల్లో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి ,వాసు నా చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఐఏఎస్ కావాలనేది నా ఆకాంక్ష ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. అందుకు శక్తివంచన లేకుండా నా ప్రయత్నాలు చేస్తా. మహిళలను విద్యావంతులు చేయడం, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం, ఆర్థికంగా ఎదిగే విధంగా తోడ్పాటునందిస్తా. ఎక్కడ పని చేసినా అక్కడ నిరక్షరాస్యత లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతా. ఫ్రొఫైల్ పేరు : షేక్ ఆయేషా తండ్రి : షేక్ అహ్మద్‌బాషా తల్లి : షేక్ గౌసియా బేగం నివాసం : మదనపల్లె పాఠశాల విద్య : ఆరోగ్యమాత ఇంగ్లీషు మీడియం స్కూల్, మదనపల్లె కళాశాల విద్య : ఎన్ఆర్ఐ కాలేజీ, తిరుపతి బీటెక్ : శస్త్రా యూనివర్శిటీ, తంజావూరు, తమిళనాడు తన కలే మా కల ఆయిషా చిన్నప్పటి నుంచి సివిల్స్‌లో రాణించడమే లక్ష్యంగా ఎంచుకుంది. అందు కోసం నిరంతరం శ్రమించింది. తన కలను మాకలగా మార్చుకుని అన్ని విధాలుగా ప్రోత్సహించాం. ఈ సుదీర్ఘప్రయాణంలో చదువులో అవసరమైన అన్నింటిని సమకూర్చాం. దీంతో తన స్వప్నం సాకారం కావడం మాకు సంతోషాన్ని కలిగించింది. – షేక్ అహ్మద్‌బాషా, గౌసియాబేగం, తల్లిదండ్రులు -
గ్రూప్–1 ఫైనల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 111 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ ఫలితాల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను నిర్దేశిత తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఒక పోస్టుకు ఎంపికపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి నివేదిక రావాల్సి ఉంది. పోటీపడ్డ ఉన్నత విద్యావంతులు.. మొత్తం 111 పోస్టులకు గాను 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో పురుషులు 59 మంది (53.6 శాతం) మహిళలు 51 (46.4 శాతం) మంది ఉన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలుండగా నలుగురు పురుషులున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన 220 మందిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. వీరిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ రాసిన వారు 32 మంది ఉండగా ఇంటర్వ్యూలకు వరకు వెళ్లిన వారు 13 మంది ఉన్నారు. విద్యార్హతల పరంగా చూస్తే.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను, ఇంటర్వ్యూలను అత్యంత పకడ్బందీగా ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు అఖిల భారత సర్వీస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు, వైస్ చాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎం తదితర అత్యున్నత సంస్థల ప్రముఖులను సభ్యులుగా చేర్చింది. అత్యున్నత ప్రమాణాలతో ఎంపికలు జరిగి రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందించేలా తుది ఎంపికలను పూర్తి చేసింది. మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది ఎంపిక.. గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం 1,26,450 మంది దరఖాస్తు చేయగా జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 86,494 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలను కేవలం 19 రోజుల్లోనే కమిషన్ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 6,455 మందిని ఎంపిక చేసింది. జూన్ 6 నుంచి 10 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4,688 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని అత్యంత పారదర్శకంగా 34 రోజుల్లోనే ఏపీపీఎస్సీ పూర్తి చేయించింది. జూలై 14న మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. వీరిలో 220 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఆగస్టు 2 నుంచి 11 వరకు మూడు బోర్డులతో వీటిని నిర్వహించింది. టాప్–5 ర్యాంకర్లు వీరే.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష భూమిరెడ్డి పావని కంబాలకుంట లక్ష్మీప్రసన్న కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భానుప్రకాశ్‌రెడ్డి మిమ్మితి టాపర్స్ ఇలా.. పేరు: గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష విద్యార్హత: గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ స్వస్థలం: సీసలి, కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి తండ్రి: వెంకట రామాంజనేయులు ( ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీఈవో కార్యాలయంలో ఏపీవో) ► భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూప్–1లో మొదటి ర్యాంకు సాధించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రిలిమ్స్ పూర్తిచేసి సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టు తండ్రి రామాంజనేయులు తెలిపారు. పేరు: భూమిరెడ్డి పావని విద్యార్హత: బీటెక్ (ఈసీఈ) తండ్రి: భూమిరెడ్డి గంగయ్య (రైతు) తల్లి: లక్ష్మీదేవి స్వస్థలం: మైదుకూరు, వైఎస్సార్ జిల్లా ► పావని గ్రూప్–1 ఫలితాల్లో 2వ ర్యాంకు సాధించారు. 2016 నుంచి హైదరాబాద్‌లో గ్రూప్స్‌కి సన్నద్ధమవుతున్నారు. 2016, 2017లో గ్రూప్–2 మెయిన్స్వరకు వెళ్లారు. 2018లో గ్రూప్–1 ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగారు. తల్లిదండ్రులు, సోదరి భాగ్య, సోదరుడు గణేష్ సహకారంతో కష్టపడి చదివి ఈసారి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. పేరు: కె.లక్ష్మీప్రసన్న విద్యార్హత: బీటెక్ (ఐటీ) 2013, రాజంపేట స్వస్థలం: టంగుటూరు గ్రామం, అన్నమయ్య జిల్లా భర్త: పి.చంద్రదీప్ (పంచాయతీ సెక్రటరీ) తండ్రి: కె.సుబ్బారాయుడు (ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్) తల్లి: సరస్వతి ► లక్ష్మీ ప్రసన్న గ్రూప్–1 ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆమె టీవీ పురం పంచాయతీలో గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నారు. 2014 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. పేరు: కుప్పిరెడ్డి ప్రవీణ్ కుమార్‌రెడ్డి విద్యార్హత: బీటెక్ (ఈఈఈ), 2009, మదనపల్లె స్వస్థలం: ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా తండ్రిపేరు: కేసీ వెంకటరెడ్డి(డీసీసీబీ రిటైర్డ్ సూపర్వైజర్) తల్లి: కె.రామసుబ్బమ్మ ► ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో గ్రూప్–1 నోటిఫికేషన్లో పరీక్ష రాయగా.. 2022లో రిజల్ట్స్ వచ్చాయి. 47వ ర్యాంకు సాధించగా.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా సెలక్టయ్యారు. కానీ.. 2018లోనే గ్రూప్–2 పరీక్ష రాయగా.. 2020లో వెలువడిన ఫలితాల్లో 11వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఎంపికై ప్రస్తుతం మదనపల్లెలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. అంతకు ముందు ఎనిమిదేళ్లు ఒరాకిల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశారు. 2018 నాటి గ్రూప్–1 ఫలితాలు 2022లో వెలువడే నాటికే ఆయన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిపోవడంతో.. మరింత మెరుగైన ర్యాంకు కోసం శ్రమించారు. -
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. పోలీసుల నిఘా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కొనసాగుతోంది. చివరి నిమిషంలో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఐడీ కార్డుతో పాటు గుర్తింపు పత్రాలు తీసుకురాని అభ్యర్థులను పోలీసులు బయటికి పంపించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో గత అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు వెల్లడించిన టీఎస్పీఎస్సీ... ఈనెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. పోటీ తీవ్రమే.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ (గ్రూప్–1) ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. చెప్పులు వేసుకొస్తేనే అనుమతి అభ్యర్థులు ఒరిజినల్ హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. హాల్‌టికెట్‌పై ఫొటో సరిగ్గా లేకుంటే మూడు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన హాల్‌టికెట్‌తో హాజరుకావాలి. అభ్యర్థులు తప్పకుండా గుర్తింపు కార్డు (పాన్, ఆధార్, ఓటర్ ఐడీ తదితరాలు)ను వెంట తెచ్చుకోవాలి. పరీక్షా హాల్లోకి అభ్యర్థులను అనుతించే విషయంలో కమిషన్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు వేసేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు ధరించకూడదు. బెల్టు ధరించిన అభ్యర్థులను సైతం పక్కాగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. పరీక్ష తీరును పరిశీలించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. -
AP: ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నగారా మోగించింది. కీలకమైన గ్రూప్–1, గ్రూప్–2కు సంబంధించి మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో గ్రూప్–1 పోస్టులు 100కాగా గ్రూప్–2 పోస్టులు 900 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం గ్రూప్–1, 2 పోస్టుల భర్తీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. త్వరితగతిన ఈ పోస్టులను భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అధికారులు ఆయనకు తెలిపారు. వీలై నంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం సూచించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. బాబు పాలనంతా బూడిదే.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్లో మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించే సమయం లేకుండా కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఈ వ్యవహారమని అప్పట్లోనే విద్యావేత్తలు, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా తొలి రోజు నుంచే అడుగులు ముందుకు వేశారు. ఏపీపీఎస్సీ ద్వారా కూడా వేలాది పోస్టులను ఈ నాలుగేళ్లలో భర్తీ చేయించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ న్యాయవివాదాల్లో చిక్కుకొని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారగా వాటన్నింటినీ పరిష్కరింపజేశారు. అంతేకాకుండా వాటిని భర్తీ చేయించారు. ఏపీపీఎస్సీ ద్వారానే ఈ నాలుగేళ్లలో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కీలకమైన గ్రూప్–1తో సహా ఇతర పోస్టులూ వీటిలో ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 4.5 లక్షల ఉద్యోగులు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 6 లక్షలకు పెరిగిందంటే ఏ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, ఇతర సంస్థల్లో 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు యువతకు లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ ) రంగంలో ఉద్యోగాలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 1.10 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా ఒక్కోదానిలో కనీసంగా 10 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించాయి. వలంటీర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టుల్లోనూ.. గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించడానికి ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది. మొత్తం 2.65 లక్షల మందికి గౌరవ వేతనం అందిస్తూ ఉపాధి కల్పించింది. అలాగే గతంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ప్రైవేటు సంస్థలకు గుత్తాధిపత్యం ఇవ్వడం వల్ల వారికి ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు అందేవి కావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కాంట్రాక్టు పోస్టులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేయించారు. బ్రోకర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారికి పూర్తి వేతనాలు చెల్లించడంతోపాటు ఈఎస్ఐ వంటి సదుపాయాలూ కల్పించారు. వీరికి అరకొర వేతనాలు ఉండగా జీతాలను భారీగా పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఏకంగా మినిమమ్ టైమ్ స్కేల్‌ను అమల్లోకి తెచ్చారు. ఫలితంగా ఆ ఉద్యోగులకు ఎంతో న్యాయం జరిగింది. చదువులు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా శిక్షణ రాష్ట్రంలో విద్యార్థులను పూర్తి నైపుణ్యాలతో తీర్చిదిద్ది.. వారు చదువులు పూర్తిచేసి బయటకు రాగానే ఉద్యోగాలు సాధించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు చదువుతున్నప్పుడే వారికి అనేక ప్రతిష్టాత్మక సంస్థలతో శిక్షణ ఇప్పించి నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ ఇంటర్న్‌షిను తప్పనిసరి చేయించారు. డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పది నెలలు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసేలా కోర్సులను అమలు చేయిస్తున్నారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కళాశాలలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించారు. శిక్షణ సమయంలోనే ఉద్యోగాలు.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి వాటిని విద్యా సంస్థలతో అనుసంధానం చేసింది. తయారీ, సేవా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచేవారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 2018లో రాష్ట్రంలో ఏడాదికి 37 వేల మందికి మాత్రమే అవకాశాలు దక్కగా ఆ తర్వాత నుంచి ప్లేస్‌మెంట్స్‌లో భారీ వృద్ధి నమోదైంది. 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు ప్లేస్మెంట్లు పెరిగాయి. ఇక ఈ విద్యాసంవత్సరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 2020–21 వరకు మొత్తం 13,208 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5,111 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించాయి. ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్‌లో 2,610 మందికి, ఆర్కే వ్యాలీలో 2,501 మందికి ఐటీ కంపెనీలు కొలువులు ఇచ్చాయి. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, అచలా, పర్పుల్ టాక్, పర్పుల్ కామ్, సెలెక్ట్, నుక్కడ్ షాప్స్, సెవ్యా, సినాప్సిస్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్, రాంకీ, ఆర్వీ, హెటిరో, అటిబిర్, అమర్‌రాజా తదితర కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. అనలాగ్ డివైసెస్, ఫ్రెష్ డెస్క్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, సినాప్సిస్, జేవోటీటీఈఆర్, థాట్ వర్క్స్, ఏడీపీ, మేథ్ వర్క్స్, గోల్డెన్ హిల్స్ సంస్థలు అత్యధిక వేతనాలు అందించాయి. చదవండి: ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల -
గ్రూప్–1 టాపర్ ఎవరో చెబితే ప్రభుత్వం కూలుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్‌రెడ్డి, దాసరి కిషోర్‌లకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ‘టెన్త్’లో అలా.. టీఎస్పీఎస్సీలో ఇలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్‌కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు. 18న నిరసన దీక్ష... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఎంకు 25 ప్రశ్నలు రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
లీకేజీలో నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని... బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పనిచేసే వాళ్లు గ్రూప్–1 పరీక్షలో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం దీనిపై 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, కేసీఆర్ కొడుకు నిర్వాకంపై అతిత్వరలో వాస్తవాలు బయటపెడతాం. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందుంచుతాం’అని సంజయ్ పేర్కొన్నారు. జెడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్‌విండో చైర్మన్ పిల్లలు క్వాలిఫై... ‘జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అర్హత సాధించారు. వారంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లే. నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతోపాటు ఒక జెడ్పీటీసీ వద్ద బాడీగార్డ్‌గా పనిచేసే వ్యక్తి కొడుకు, ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యాడు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ క్వాలిఫై చేశారు’అని సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ సహకారంతోనే లీకేజీ... ‘కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్ సహకారంతోనే పేపర్ లీకేజీ జరిగింది. ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ఉంది. తక్షణమే కేసీఆర్ కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి’అని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నియమించిన సిట్‌తో విచారణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని పునరుద్ఘాటించారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ కేసుల తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. -
AP: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కీలక మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్‌లో ఏపీపీఎస్సీ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్–1లో పేపర్–1, పేపర్2గా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్ ఓఎమ్మార్ ఆధారిత పత్రాలతో పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గతంలో లేనివిధంగా ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లే కాకుండా జిల్లాస్థాయి అధికారి ఒకరిని ప్రత్యేక పర్యవేక్షకునిగా నియమిస్తున్నారు. కోడింగ్ తప్పయితే.. ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన సవివర సమాచారం ప్రశ్నపత్రాలు, ఓఎమ్మార్ పత్రాల్లో ముద్రించి ఉంటుంది. వాటిని ముందుగా తెలుసుకునేందుకు వీలుగా వాటి నమూనాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. దీనివల్ల అభ్యర్థికి సమయం కలసి రావడంతోపాటు పరీక్షపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ బుక్లెట్లపై కోడింగ్ సిరీస్ నంబర్లు సరిసమానంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. తప్పు కోడింగ్ ఉంటే కనుక ఆ జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. అభ్యర్థి తన రిజిస్టర్ నంబర్‌ను ప్రశ్నపత్రం బుక్లెట్పై నిర్ణీత స్థలంలోనే రాయాలి. అభ్యర్థులు హాల్‌టికెట్లతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ఆ తరువాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 వరకు మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు అనుమతిస్తారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 వరకు అవకాశమిస్తారు. తరువాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తు ఫారంలో బయోడేటా వివరాలను తప్పుగా సమర్పించి ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ రోల్స్‌లో డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇన్విజిలేటర్ సంతకాన్ని తీసుకోవాలి. ఓఎమ్మార్‌లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం రెండు కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థి పైన ఉండే ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు అందించాలి. దిగువన ఉండే డూప్లికేట్ సమాధాన పత్రాన్ని తన రికార్డుకోసం తీసుకువెళ్లాలి. అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను ఎంపిక చేయరాదు. కేవలం ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇచ్చిన స్థలంలో నీలం లేదా నలుపు బాల్‌పెన్నుతో బబుల్ చేయాలి. వైటనర్, మార్కర్, ఎరేజర్లను వినియోగించినా ఆ సమాధాన పత్రం చెల్లదు. అంధత్వం, రెండు చేతులకూ వైకల్యం, మస్తిష్క పక్షవాతం గల అభ్యర్థులకు స్క్రయిబర్లను అనుమతిస్తారు. ఈసారి అత్యధికంగా 714 మంది స్క్రయిబర్లు కావాలని దరఖాస్తు చేశారు. అభ్యర్థులు స్క్రయిబ్‌ను తామే తెచ్చుకుంటే వారికి ఆ పోస్టుకు నిర్ణయించిన అర్హత కన్నా తక్కువ అర్హత ఉండాలి. అభ్యర్థి తెచ్చుకున్న స్క్రయిబ్ అర్హుడు కాకుంటే చీఫ్ సూపరింటెండెంటు వేరొకరిని ఏర్పాటు చేస్తారు. ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు రాష్ట్రంలో గ్రూప్–1 క్యాడర్ పోస్టుల భర్తీకి ఈ నెల 8వ తేదీన ప్రిలిమనరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. గురువారం ఏపీపీఎస్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,26,449 మంది హాజరవుతారన్నారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి సకాలంలో పూర్తిచేయాలన్నది కమిషన్ లక్ష్యమని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఎస్సీ తరహాలోనే.. ఈ సారి గ్రూప్–1లో 92 పోస్టుల భర్తీకి వీలుగా నోటిఫికేషన్ ఇచ్చాం. గత గ్రూప్–1లో మిగిలిన 16 నుంచి 18 వరకు పోస్టులను క్యారీఫార్వర్డ్ కింద ఈ నోటిఫికేషన్‌కు జత చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. న్యాయపరమైన సలహాల అనంతరం ప్రిలిమ్స్ నిర్వహించే 8వ తేదీలోపు వాటిని ప్రకటిస్తాం. యూపీఎస్సీ మాదిరిగా గ్రూప్–1 పోస్టులను నిర్ణీత కాలపట్టిక ప్రకారం పూర్తి చేయించాలని భావిస్తున్నాం. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అదే రోజు రాత్రి లేదా మరునాడు ప్రకటిస్తాం. రెండు లేదా మూడు వారాల్లోపు ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటిస్తాం. అనంతరం మెయిన్స్ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తాం. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్‌కల్లా ఫలితాలు విడుదల చేస్తాం. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయిస్తాం. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మరో కొత్త గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేస్తాం. ప్రాథమిక కీపై అభ్యంతరాల సంఖ్య వేలల్లో ఉంటున్నందున ప్రశ్నకు రూ.100 చొప్పున చెల్లించాలన్న నిబంధన పెట్టాం. సరైన అభ్యంతరమైతే ఆ మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తాం. ఇంటర్వ్యూలకు మూడు బోర్డులు గ్రూప్–1లో ఇంటర్వ్యూలను గతంలో వద్దనుకున్నా ప్రజలతో నేరుగా సంబంధాలు నెరిపి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన క్యాడర్ పోస్టులు కాబట్టి అభ్యర్థుల పర్సనాలిటీకి సంబంధించిన అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూలను పునరుద్ధరించారు. గతంలో ఒకే బోర్డుతో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించగా.. ఇప్పుడు మూడు వరకు బోర్డులతో చేపడుతున్నాం. ఇందులో కమిషన్ చైర్మన్, సభ్యుడితో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులైన వీసీ లేదా సీనియర్ ప్రొఫెసర్లు, రిటైర్డు ప్రొఫెసర్లను బోర్డులో నియమిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా కేవలం మెరిట్ ప్రాతిపదికనే ఎంపికలు ఉంటాయి. కనుక ఏ ఒక్కరూ బయట వ్యక్తులు, మధ్యవర్తుల మాటలు విని మోసపోవద్దు. గ్రూప్–2 సిలబస్‌ను హేతుబద్ధీకరిస్తాం గ్రూప్–2 పోస్టుల భర్తీపైనా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నోటిఫికేషన్ ఇస్తాం. గ్రూప్–2కు సంబంధించి సిలబస్ విధానంలో మార్పులు తీసుకురానున్నాం. సిలబస్‌లో రేషనలైజేషన్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే రకమైన సిలబస్‌ను అనుసరిస్తున్నందున దానిని హేతుబద్ధం చేస్తాం. గ్రూప్–2 స్కీమ్, ప్యాట్రన్‌లో మాత్రం ఎలాంటి మార్పులుండవు. -
తుది తీర్పునకు లోబడే గ్రూప్–1 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్–1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. గ్రూప్–1 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 33ను విడుదల చేసిందని.. కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మెదక్ జిల్లా సర్ధనా హవేలీఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జీ. స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనా విభాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు వర్తింపజేయాలని కోరారు. 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్–1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని.. పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 50 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ..విచారణ వాయిదా వేశారు. -
గ్రూపు–1 ఫలితాల్లో కడప యువకుడి సత్తా
కడప : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూపు–1 ఫలితాల్లో కడప ఎర్రముక్కపల్లెకు చెందిన యువకుడు భార్గవ్ సత్తాచాటి జిల్లా రిజిస్టార్ కొలువును సాధించారు. ఇతని తల్లిదండ్రులు సూర్యుడు, ఆదిలక్ష్మిలది పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామం. అయితే ఇతని తండ్రి ఉద్యోగరీత్యా కడపలో స్థిరపడ్డారు. భార్గవ్ 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్లో చదివారు. ఇంటర్ హైదరాబాదులోని శ్రీచైతన్యలో చదివాడు. ఇంజినీరింగ్‌ను కడపలోని కేఎస్‌ఆర్‌ఎంలో పూర్తి చేశారు. హైదరాబాదులో శాప్ కన్సెల్టెంట్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేçస్తున్నాడు. 2018లో గ్రూపు–1 పరీక్షకు సిద్ధం అయ్యారు. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి ఇటీవల వెలువడిన ఫలితాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టుకు ఎంపికయ్యారు. భవిషత్తులో ఐఏఎస్ సాధించడమే లక్ష్యమని భార్గవ్ చెప్పారు. యువత పట్టుదలతో కృషి చేస్తే గ్రూపు–1, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. -
తొలి ప్రయత్నంలోనే డీఎస్పీ ఉద్యోగం
నెల్లూరు: ‘క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగినప్పుడే కలలను సాకారం చేసుకోగలం. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పుస్తక పఠానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవే తన విజయానికి బాటలు వేశాయి.’ అని గ్రూప్–1లో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికైన వల్లెం విష్ణుస్వరూప్‌రెడ్డి అన్నారు. నెల్లూరు మాగుంటలేఅవుట్‌లోని పావని అపార్ట్మెంట్లో నివాసముంటున్న వల్లెం ప్రతాప్‌రెడ్డి విశ్రాంత మున్సిపల్ ఉద్యోగి. ఆయన సతీమణి వెంకటరమణమ్మ గృహిణి. వారికి విష్ణుస్వరూప్‌రెడ్డి, సుక్రుతరెడ్డి సంతానం. విష్ణుస్వరూప్‌రెడ్డి చెన్నైలోని ఎస్ఆర్ఎంలో బీటెక్ ఈసీఈ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్ష అతడిలో బలంగా ఉండేది. మేనమామ శివారెడ్డి, ఇంకా డాక్టర్ వివేకానందరెడ్డి ప్రోత్సాహంతో ఢిల్లీలో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. గ్రూప్–1 ప్రకటన వెలువడడంతో ప్రణాళికతో సన్నద్ధమై రాశారు. తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. కుమారుడు డీఎస్పీగా ఎంపికవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం విష్ణుస్వరూప్‌రెడ్డి దుబాయ్‌లో ఎంబీఏ చదువుతున్నారు. -
Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ
రాప్తాడు (అనంతపురం): మండలంలోని రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చూపి ఆర్టీఓ పోస్టుకు ఎంపికయ్యారు. వివరాలు.. బుక్కచెర్లకు చెందిన రైతు గొర్ల సూర్యనారాయణరెడ్డి, సరోజ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారై గొర్ల మనీషా గ్రూప్–1లో సత్తా చాటి ఆర్టీఓగా ఎంపికయ్యారు. కాగా, ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం రాప్తాడు మండలంలోని ఎల్లార్జీ స్కూల్లో జరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకూ అనంతపురంలోని సీవీఆర్ మెమోరియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌లోని ఐఏఎస్ అకాడమీలో బీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2018లో గ్రూప్–1 పరీక్ష రాశారు. ఈ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక తల్లిదండ్రుల శ్రమ దాగి ఉందన్నారు. అమ్మ, నాన్న కోరిక మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. చదవండి: (ఆర్బీకే ఓ అద్భుతం!) -
APPSC Group 1 Results: గ్రూప్–1 ఫైనల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 (2018) తుది ఎంపిక జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. దీంతో నాలుగేళ్లుగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి కమిషన్ ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. 2018 గ్రూప్–1కు సంబంధించి మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. వాటిలో కోర్టు సూచనలతో 2 స్పోర్ట్స్ కోటా పోస్టులు, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేనందున మరో 2 పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం 163 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వీరిలో 67 మంది మహిళలు కాగా 96 మంది పురుషులున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత న్యాయస్థానం తుది తీర్పునకు లోబడి పోస్టుల ఎంపిక, నియామకాలు ఉంటాయన్నారు. కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటామని.. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12లోపు అండర్ టేకింగ్ (రాతపూర్వక హామీపత్రం) ఇవ్వాలని సవాంగ్ స్పష్టం చేశారు. ఆ పత్రం ఇచ్చాకే వారి జాబితాను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఏపీపీఎస్సీ పంపిస్తుందన్నారు. అనేక సవాళ్లను అధిగమించి.. అనేక సవాళ్లను అధిగమించి గ్రూప్–1 (2018) ఫలితాలను ప్రకటిస్తున్నామని సవాంగ్ వివరించారు. ‘2018 డిసెంబర్లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్ కోటాతో కలిపి) నోటిఫికేషన్ ఇచ్చాం. 2019 మేలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 58,059 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 9,679 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. 2020 డిసెంబర్లో మెయిన్స్ పరీక్షలను ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. తొలిసారిగా గ్రూప్–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్ విధానంలో చేయించాం. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతోమూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించాం. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచాం. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశాం. బోర్డుల్లో కూడా కమిషన్ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు’ అని సవాంగ్ వివరించారు. ఫలితాల్లో మహిళలదే హవా.. గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలుండడం గొప్ప విషయమని గౌతమ్ సవాంగ్ చెప్పారు. పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలేనని వివరించారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారేనన్నారు. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారని.. ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారని చెప్పారు. 55 మంది ఎంటెక్ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లున్నారని వివరించారు. వీరిలో 9 మంది సివిల్ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారన్నారు. వరుసగా రెండు ఉద్యోగాలు.. మాది కాకినాడ జిల్లా పిఠాపురం. తల్లిదండ్రులు.. పద్మప్రియ, శ్రీనివాస్. పదో తరగతి వరకు పిఠాపురం లో, ఇంటర్, డిగ్రీ కాకినాడలో, ఎంబీఏ హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను. ఎంబీఏలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నా. బెంగళూరులో పీహెచ్డీ చేశా. బెంగళూరులోనే కాలేజీ ప్రిన్సిపల్‌గా చేస్తుండగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇంతలో రెండు రోజుల్లోనే ఏపీపీఎస్సీలో టాపర్‌గా నిలిచానన్న వార్త తెలిసింది. నా భర్త రవికాంత్ ప్రోత్సాహంతో ఈ విజయం సాధించాను. ఈ విజయం మా తాత పేరి లక్ష్మీనరసింహ శర్మకు అంకితం. – రాణి సుస్మిత, డిప్యూటీ కలెక్టర్, గ్రూప్–1 ఫస్ట్ ర్యాంకర్ కష్టపడి చదివినందుకు ఫలితం.. మాది అన్నమయ్య జిల్లా పోతులగుట్టపల్లి. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం మాది. నాన్న రెడ్డయ్య రాజు, తులసమ్మలు వ్యవసాయం చేస్తారు. నా పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య రాయచోటిలో గడిచింది. కడపలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. 2017లో సివిల్స్ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. అనంతరం 2018లో గ్రూప్–1 రాశాను. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది. – కొండూరు శ్రీనివాసులురాజు, డిప్యూటీ కలెక్టర్, రెండో ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే.. మాది విజయవాడ. బీటెక్ చేశా. నాకు వివాహమయ్యాక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే నా భర్త, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. ఈ క్రమంలో గ్రూప్స్ కూడా రాసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను. – నీలపు రామలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్, నాలుగో ర్యాంకర్ సివిల్స్‌కు సన్నద్ధమవుతూ.. మాది అన్నమయ్య జిల్లా రాయచోటి. ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశా. అమ్మానాన్న సహదేవ రెడ్డి, కళావతి బోధన రంగంలో ఉన్నారు. 2022 సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించా. మెయిన్స్‌ను రాయడానికి సిద్ధమవుతున్నా. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. – నిమ్మనపల్లి మనోజ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్, ఆరో ర్యాంకర్ డిప్యూటీ కలెక్టర్ కావడం పట్ల ఆనందంగా ఉంది.. మాది అనంతపురం జిల్లా. తండ్రి నాగానందం, తల్లి లక్ష్మీదేవి. బీఎస్సీ నర్సింగ్ చేశాక 2013లో గ్రూప్–4కి ఎంపికయ్యాను. ప్రస్తుతం అనంతపురం కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నా. ఇప్పుడు గ్రూప్–1 రాసి డిప్యూటీ కలెక్టర్ కావడం ఆనందంగా ఉంది. ఎలాగైనా నేను విజయం సాధించాలని మా మామ గుండ్లమడుగు శివయ్య మాట తీసుకున్నారు. ఆయనకు ఇచ్చిన మాట కోసం, నా భర్త, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి చదవాను. – కురుబ మధులత, ఏడో ర్యాంకర్ ప్రజలకు మరింత మంచి చేస్తా.. మాది విశాఖపట్నం. నేను బీఎస్సీ, ఏయూలో పీజీ చేశాను. నా తల్లిదండ్రులు జగన్నాథరాజు, నిర్మల, నా భర్త ప్రదీప్ ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ స్థాయికి రాగలిగాను. 2009 నుంచి 2018 వరకూ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేశాను. ప్రస్తుతం విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నా. – దాట్ల కీర్తి, డిప్యూటీ కలెక్టర్, 8వ ర్యాంకర్ తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్ జాబ్ నా తల్లిదండ్రులు మోహన్, సునీత ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు వచ్చాను. 2017లో హెచ్‌సీయూలో ఎంఏ పూర్తి చేశాను. 2019లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. తొలి ప్రయత్నం లోనే డిప్యూటీ కలెక్టర్‌గా అవకాశం దక్కింది. – సాయిశ్రీ, డిప్యూటీ కలెక్టర్, పదో ర్యాంకర్ -
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఫలితాల ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్ వన్ పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. వైఎస్సార్ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. గ్రూప్-1 2018 నోటిఫికేషన్లో 167 పోస్టులకుగానూ.. 165 పోస్టులకు ఇప్పుడు ఫలితాలు ఇచ్చారు. వీటిలో 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన. వచ్చే నెలలోనే గ్రూప్-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15 నుంచి 29 వరకు యధాతథంగా ఇంటర్వ్యూలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నియమకాలు కూడా జరుపుకోవచ్చు. అయితే నియామకాలు ఈ వ్యాజ్యాల్లో కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. పిటిషనర్ల సమాధాన పత్రాలను, మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచాలని హైకోర్టు సర్వీస్ కమిషన్‌కి ఆదేశాలు జారీ చేసింది. చదవండి: (ప్రతీ దానికి పిల్ ఏంటి!?.. టీడీపీ ఎమ్మెల్యేకు ఏపీ హైకోర్టు చీవాట్లు) -
వచ్చే వారం గ్రూప్–1 నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నిర్దేశించిన పోస్టులకు సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు సమర్పిం చగా ఒకట్రెండు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనల్లో సందేహాలు తలెత్తడంతో వాటి నివృత్తికి కమిషన్ సవరణ ప్రతిపాదనలు కోరినట్లు తెలిసింది. ఆయా శాఖలు సవరణ ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే టీఎస్పీఎస్సీ సమావేశమై కోరం ఆమోదంతో ఉద్యోగ ప్రకటన జారీ చేయనుందని, ఈ ప్రక్రియకు ఎంతో సమయం పట్టదని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం సైతం టీఎస్పీఎస్సీ యంత్రాంగం గ్రూప్–1 ఉద్యోగ ప్రకటనపై పలు సమీక్షలు నిర్వహించి ప్రక్రియ పూర్తికి కసరత్తు చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రూప్–1 ఉద్యోగ నియామకాలు జరగలేదు. దీంతో కమిషన్ నుంచి ప్రకటన వస్తే రాష్ట్రంలో అదే తొలి ప్రకటన కానుంది. (చదవండి: ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!) -
APPSC: ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగాల భర్తీలో నిరుద్యోగ విద్యావంతులకు మేలు చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ ద్వారా భర్తీచేసే అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వ్యూలు నిర్వహించే విధానానికి స్వస్తి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జీఓ 58ను జారీచేశారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు పెద్దపీట వేయడం.. పోటీ పరీక్షల ప్రక్రియపై అభ్యర్థులకు నమ్మకం కలిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి సదరు ఆదేశాలు అమల్లోకి వస్తాయని జీఓలో పేర్కొన్నారు. దీంతో ఇక నుంచి ఏపీపీఎస్సీ రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీపీఎస్సీలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కమిషన్ కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేలా, సంస్థపట్ల నిరుద్యోగుల్లో నమ్మకం పెరిగేలా అనేక చర్యలు తీసుకున్నారు. ఇంటర్వ్యూల పేరిట జరిగిన అక్రమాలకు చెక్ పెట్టేలా.. నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు చోటుచేసుకోవడంతో అర్హులైన నిరుద్యోగ విద్యావంతులు ఎంతో నష్టపోయారు. ఇంటర్వ్యూల మాటున గత పాలకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఏ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగినా ఆ బోర్డు చైర్మన్‌గా ఏపీపీఎస్సీ చైర్మనే వ్యవహరించేలా చేశారు. తద్వారా తమకు నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టేలా అప్పటి పాలకులు వ్యవహరించారు. దీనివల్ల అర్హులైన వారికి తీరని అన్యాయం జరగడంతో పాటు కమిషన్ విశ్వసనీయత దెబ్బతింది. తాజాగా.. గ్రూప్1–2018 ఇంటర్వ్యూలకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది. ఇంటర్యూలకు ఒకటికి మించి బోర్డులు ఏర్పాటుచేయడంతో పాటు వాటిలోని సభ్యుల నుంచే ఒకరు చైర్మన్‌గా వ్యవహరించేలా చేసింది. తాము ఏ బోర్డులో ఉన్నామో చివరి నిమిషం వరకు కూడా సభ్యులకు కూడా ముందుగా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ రోజున కమిషన్ కార్యాలయానికి వచ్చి అక్కడ డబ్బాల్లో ఉన్న చిట్టీల నుంచి ఒకదాన్ని తీసుకుని అందులో ఏ బోర్డు నెంబర్ రాసి ఉంటే అక్కడికి ఇంటర్వ్యూకు వెళ్లేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు జీఓ–58 ద్వారా అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వ్యూ విధానాన్నే రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగ విద్యావంతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఇంటర్వ్యూల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాత పరీక్షల్లో మెరిట్ సాధించే అభ్యర్థులకు పోస్టులు దక్కుతాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక గత ప్రభుత్వం గ్రూప్–1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను తప్పనిసరి చేసింది. అంతకుముందు.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని టీడీపీ సర్కారు రద్దుచేసి 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసేలా ఏపీపీఎస్సీకి అధికారం ఇచ్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని నిరుద్యోగులు ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1:50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టించారు. గ్రూప్–1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజీ వంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా చేశారు. ఇదేకాక.. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో గత ప్రభుత్వం నెగిటివ్ మార్కులు పెట్టింది. పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం ఈ పరీక్షలు రాసే ఉద్యోగులు దీనివల్ల నష్టపోయారు. వీటిని రద్దుచేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి రాగానే నెగిటివ్ మార్కులను రద్దుచేసింది. రాత పరీక్షల్లోనూ గతంలో అక్రమాలు ఇంటర్వ్యూల్లోనే కాదు.. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలలో కూడా అనేక లోపాలతో పరీక్షల ప్రక్రియను టీడీపీ పాలకులు అస్తవ్యస్థం చేశారు. గతంలో జరిగిన గ్రూప్2–2018 ప్రిలిమ్స్‌లో ఏకంగా పరీక్ష ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ షాట్లు బయటకు రావడంతో గందరగోళం నెలకొంది. విశాఖపట్నం, తదితర పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో వీటిని నిలదీసిన వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులను పరీక్షల నుంచి తప్పించడంతో పాటు ఏకంగా కేసులు కూడా పెట్టించారు. గ్రూప్–1లో ఏకంగా 51 తప్పులు చోటుచేసుకోవడంతో ఆ పరీక్షలు న్యాయ వివాదాల మధ్య గందరగోళంలో పడ్డాయి. అలాగే, గ్రూప్–1 పోస్టులతో పాటు డిగ్రీ కాలేజీ లెక్చరర్ తదితర పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో భారీగా గోల్మాల్ జరిగింది. రాతపరీక్షల్లో మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేసి తమకు కావలసిన వారికి, డబ్బులు ముట్టచెప్పిన వారికి అత్యధిక మార్కులు వేసి పోస్టులు కట్టబెట్టారన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఇలా గతంలో జరిగిన అక్రమాలెన్నెన్నో. -
పారదర్శకత లక్ష్యంగా ప్రక్షాళన
సాక్షి, అమరావతి: ప్రశ్నలు, సమాధానాలు, ‘కీ’లు తప్పుల తడకలు... సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నలు... అర్థంపర్థం లేని తెలుగు అనువాదాలు.. ప్రశ్నపత్రాల లీకేజీలు... మూల్యాంకనంలో లోపించిన సమతూకం... మెరిట్ అభ్యర్థులకు అన్యాయం.. లెక్కలేనన్ని కోర్టు కేసులు... గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వాకాలివీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి సంస్థల సహకారంతో సమూల సంస్కరణల దిశగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగులు వేస్తోంది. కమిషన్ బుధవారం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. ఏపీపీఎస్సీ ఇన్చార్జి చైర్మన్ జింకా రంగ జనార్దన, సభ్యులు కె.విజయకుమార్, ప్రొఫెసర్ గుర్రం సుజాత, ప్రొఫెసర్ కె.పద్మరాజు, సేవారూప, ఎంవీ రామరాజు, జీవీ సుధాకర్‌రెడ్డి, ఎస్.సలాంబాబు, కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు, ప్రభుత్వ ఐటీ సలహాదారు లోకేశ్వరరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా, నియామకాల్లో అత్యుత్తమ విధానాలను అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి సూచనలు, అమలు చేయాల్సిన సంస్కరణలపై ఏపీపీఎస్సీ సభ్యులు చర్చించారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అన్ని పోస్టులకూ ఇంటర్వూ్యలను రద్దు చేసి, మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అన్ని లోపాలను సవరించి, పూర్తి పారదర్శకంగా పనిచేసేలా ఏపీపీఎస్సీని తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏపీపీఎస్సీలో అమలు చేయనున్న సంస్కరణలు - ప్రశ్నలు, సమాధానాలు, ‘కీ’లలో పొరపాట్లకు తావులేకుండా వాటి రూపకల్పన సమయంలోనే నిపుణులతో పునఃసమీక్ష నిర్వహిస్తారు. తప్పులను ముందుగానే సవరించడమో, తొలగించడమో చేస్తారు. - తెలుగు అనువాదంలో తప్పులు దొర్లకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, యూపీఎస్సీ, కేట్ వంటి సంస్థల సహకారం తీసుకోనున్నారు. - గ్రూప్–1 పరీక్షలో డిజిటల్ మూల్యాంకనం అమలు చేస్తారు. - మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను ట్యాబ్‌ల ద్వారా అందిస్తారు. ముందుగా అందించే పాస్‌వర్డ్‌తో పరీక్ష సమయానికి ఈ ట్యాబ్ తెరుచుకుని అభ్యర్థికి ప్రశ్నపత్రం దర్శనమిస్తుంది. సమాధానాలను బుక్‌లెట్‌లో రాయాలి. - ఆ సమాధానాలను స్కాన్ చేయించి, కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. - ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో ఏయే పాయింట్లుండాలి? వాటికి ఎన్ని మార్కులు వేయాలి? అన్నది ముందుగానే నిపుణులు నిర్ధారిస్తారు. - సమాధాన పత్రాలను తొలుత ఇద్దరు సబ్జెక్టు నిపుణులు ఒకేసారి మూల్యాంకనం చేస్తారు. వారిచ్చే మార్కుల మధ్య వ్యత్యాసం 50 శాతం, అంతకు మించి ఉంటే మూడో నిపుణుడు మూల్యాంకనం చేస్తారు. - ఆయా సమాధానాలకు వేసే మార్కులను ఏ కారణంతో అన్ని వేయాల్సి వచ్చిందో మూల్యాంకనం చేసిన నిపుణుడు తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పారదర్శకతకు వీలుంటుంది. - పరీక్షలు ప్రారంభమైన రెండో రోజు నుంచే మూల్యాంకనం చేపడతారు. గడువులోగా ఫలితాలు విడుదల చేస్తారు. - మార్కుల తారుమారుకు అవకాశం లేకండా మూల్యాంకన సమయంలోనే అభ్యర్థులు సాధించిన మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తారు. - ప్రిలిమ్స్‌లోనూ ప్రశ్నలు, సమాధానాలను జంబ్లింగ్ చేసి, మాల్‌ప్రాక్టీసుకు అడ్డుకట్ట వేయనున్నారు. - సిలబస్‌కు అనుగుణంగానే ప్రశ్నలుండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రశ్నలు అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటాయి. - ఎక్కడా లీకేజీకి ఆస్కారం లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తారు. - గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్ ఉంటే మంచిదని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ప్రస్తుతం పేపర్–1 జనరల్ స్టడీస్, పేపర్–2 జనరల్ ఆప్టిట్యూడ్ 120 మార్కుల చొప్పున నిర్వహిస్తున్నారు. జనరల్ ఆప్టిట్యూడ్‌లోని కొన్ని యూనిట్లను తీసుకొని ఒకే పేపర్‌గా చేయాలని యోచిస్తున్నారు. మ్యాథ్స్, ఆర్ట్స్ అభ్యర్థులకు సమన్యాయం జరిగేలా చర్యలు చేపడతారు. -
ఏపీ గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు) తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్ పేపర్–1, పేపర్–2 ఫైనల్ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్ నిర్వహించగా.. అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున 8,350 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఏపీపీఎస్సీ కటాఫ్ మార్కులను నిర్దేశించుకుని 1:12 చొప్పున ఎంపిక చేసే విధానాన్ని అనుసరించింది. దీనిపై అభ్యర్థులు అభ్యంతరం చెబుతూ 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలని విన్నవించినా గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రస్తుత సర్కారు అభ్యర్థుల విన్నపం పట్ల సానుకూలంగా స్పందించింది. 1:50 చొప్పునే అభ్యర్థుల్ని మెయిన్స్‌కు ఎంపిక చేయాలని, తద్వారా పరీక్షల నిర్వహణకు అదనంగా అయ్యే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే సర్దు బాటు చేస్తుందని ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది. మెయిన్స్ ఎంపికకు కటాఫ్‌గా 90.42 మార్కులను నిర్దేశించింది. వెబ్సైట్లో ఫైనల్ కీ గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫైనల్కీని ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో పొందుపరిచింది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 23వ తేదీ వరకు ఏడు సెషన్లలో ఆఫ్‌లైన్‌లో జరగనుంది. ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకులు పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఎత్తేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. దీంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయ్యింది. -
సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూ విధానాలపై చర్చించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి అవినీతి, అక్రమాలపై ప్రతి సందర్భంలో ఆరోపణలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీపీఎస్సీ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. వీటిపై కూలంకషంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి పారదర్శక విధానాలపై చర్చించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్–1, గ్రూప్–2సహా అన్ని విభాగాల ఉద్యోగాలకూ ఇంటర్వ్యూ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఐఐఎం, ఐఐటీల సహకారంపై దృష్టి.. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి ఏటా జనవరి 1వ తేదీన క్యాలెండ్ విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత పెంచేందుకు ప్రఖ్యాత ఐఐఎం, ఐఐటీల సహకారం, భాగస్వామ్యాలను తీసుకోవడంపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. నవంబర్ చివరిలో ఖాళీల జాబితా సిద్ధం! ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నవంబర్ మూడోవారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జాబితాను తయారు చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులు, బడ్జెట్ కేటాయింపులు తదితర ప్రతిపాదనలతో నవంబర్ నెలాఖరులోగా ముఖ్యమంత్రితో అధికారులు మరోసారి సమావేశం అవుతారు. అన్ని సన్నాహాలు పూర్తైన తర్వాత 2020 జనవరి 1వతేదీన ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా ఏటా ఉద్యోగాల భర్తీ చేపడతారు. -
గ్రూప్–1 సిలబస్‌తో గుండె గుభేల్!
సాక్షి, అమరావతి: గ్రూప్–1 సిలబస్‌ను మార్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తమ జీవితాలతో చెలగాటమాడుతోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఇచ్చినవీ సకాలంలో పూర్తి చేయకుండా ఇప్పటికే తమ తలరాతలు మార్చేస్తున్న ఏపీపీఎస్సీ ఇప్పుడు సిలబస్ మార్పుతో మరింత గందరగోళానికి గురి చేస్తోందని పేర్కొంటున్నారు. కొత్త సిలబస్ ప్రకటనతో రూ.లక్షలు ధారపోసి తాము పొందిన అంతా శిక్షణ అంతా వృథా కానుందని వాపోతున్నారు. మెయిన్స్‌లో ఏడు పేపర్లు.. గ్రూప్–1 సిలబస్‌లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్‌ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్‌తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు పేపర్‌ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు.. ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. మార్పులతో కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్‌ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. సిలబస్ రెట్టింపు.. –గతంలో మెయిన్స్‌లో ఇంగ్లీషుతో కలిపి ఆరు పేపర్లుండగా కొత్తగా తెలుగు చేర్చారు. ఇంగ్లిషు, తెలుగు రెండూ క్వాలిఫయింగ్ పేపర్లే. ఇంగ్లీషు సిలబస్‌ను కఠినం చేశారు. గతంలో మెయిన్స్‌లో ఒక్కో పేపర్‌కు 3 గంటల సమయం కేటాయించగా ఇప్పడు 2.30 గంటలకు తగ్గించారు. –మెయిన్స్ పేపర్–2 లో కొత్తగా ఇండియన్, ఏపీ జాగ్రఫీని 50 మార్కులకు చేర్చారు. పేపర్–3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ బేసిస్ నాలెడ్జి ఆఫ్ లా’ అంశాలను అదనంగా 120 మార్కులకు చేర్చారు. సివిల్స్‌లో ప్రధాన పేపర్‌గా ఉన్న ఎథిక్స్లోని అంశాలను ఇక్కడ కేవలం ఒక సెక్షన్లో పెట్టారు. హిస్టరీ, ఎకనామిక్స్‌లు పాత సబ్జెక్టులే అయినా వాటి అంశాలను మరింత ఎక్కువ చేశారు. దాదాపు రెట్టింపు అయిన సిలబస్‌కు సన్నద్ధం కావడానికి ఏడాది సమయం పడుతుందంటున్నారు. ఇప్పటికే పాత సిలబస్‌లో గ్రూప్–1 కోసం రూ.లక్షలు వెచ్చించి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ నిర్ణయం పిడుగుపాటులా మారింది. ఏడాదిన్నరగా తీసుకున్న కోచింగ్ అంతా వృథా అని వాపోతున్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి కింద చెల్లించిందంతా వృథా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ సెంటర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఇదంతా పాత సిలబస్‌లోనే కొనసాగింది. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రవేశపెట్టడంతో ఈ శిక్షణ అంతా వృథా కానుంది. సిలబస్ పెరగడంతో కోచింగ్ సెంటర్లు కూడా ఫీజు మూడు రెట్లు పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కొత్త సిలబస్‌ను ప్రస్తుతం ఇవ్వనున్న నోటిఫికేషన్లకు కాకుండా తరువాత వెలువడే వాటికి వర్తింపచేయాలని కోరుతున్నారు. దీనివల్ల సివిల్స్ అభ్యర్ధులకూ ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. మెయిన్స్‌లో ఏడు పేపర్లు గ్రూప్–1 సిలబస్‌లో కమిషన్ ఇటీవల మార్పులు చేయడంతో నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప మార్పులే ఉంటాయని చెప్పిన కమిషన్ పాత సిలబస్‌ను మార్చి రెట్టింపు చేయడం గగ్గోలు పుట్టిస్తోంది. గ్రూప్–1 సిలబస్, ఇతర అంశాల్లో మార్పులు చేస్తూ ఏపీపీఎస్సీ ఇటీవలే ముసాయిదా ప్రకటించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్‌తోపాటు 5 సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధిస్తే చాలు. ఇంటర్వ్యూల కోసం మిగతా ఐదు సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈసారి మాత్రం మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్‌తోపాటు తెలుగు పేపర్‌ను కూడా చేర్చారు. ఈ రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటితోపాటు తక్కిన ఐదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. ప్రిలిమ్స్‌లో 2 పేపర్లు ఇక గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు పెట్టారు. ఒక పేపర్లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ ఉండగా పేపర్–2లో మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాలు పొందుపరిచారు. కొత్త చిక్కులు ప్రిలిమ్స్ పేపర్–1లో పొలిటీలో సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని కొత్తగా చేర్చగా ఎకానమీలో ఏపీ ఎకానమీని చేర్చారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీస్ టాపిక్‌ను కొత్తగా చేర్చారు. ఈ అంశాలకు సరైన పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్ధులు పేర్కొంటున్నారు. ఈ సబ్జెక్టుల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు లేనందున న్యాయ వివాదాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. -
జూన్ 2న గ్రూప్–1 నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా గ్రూప్–1 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. జూన్ 2న నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్స్‌లు ఉన్న 76 గ్రూప్–1 పోస్టులకు సంబంధించిన ఇండెంట్లు టీఎస్పీఎస్సీ వద్ద ఉన్నాయి. తాజాగా 42 డీఎస్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వాటితో పాటు 2011 గ్రూప్–1లో జాయిన్ కాని పోస్టులు మరో 7 వరకు ఉన్నాయి. అవి కాకుండా ఇతర శాఖల్లోనూ పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. వాటి భర్తీకి అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా వాటి అనుమతులు, ఇండెంట్లతో పాటు డీఎస్పీ పోస్టులకు ఇండెంట్లు ఇస్తే జూన్ 2న టీఎస్పీఎస్సీ ద్వారా 150కి పైగా పోస్టులతో గ్రూప్–1 నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉంది. -
48 మందికి మెరుగైన పోస్టులు
సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తప్పిదంతో గ్రూప్–1 (2011 నోటిఫికేషన్) ఫలితాల్లో తారుమారైన అభ్యర్థుల ప్రాధాన్యతలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సవరించింది. అక్టోబర్ 28న ప్రకటించిన ఫలితాల్లో ప్రాధాన్యతలు తారుమారయ్యాయంటూ అభ్యర్థులు ఫిర్యాదు చేయడంతో వాటిని ఉపసంహరించుకున్న టీఎస్పీఎస్సీ...పూర్తిస్థాయి పరిశీలన అనంతరం సవరించిన ఫలితాలను శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం గతంలో కేటాయించిన పోస్టులతో పోలిస్తే తాజా జాబితాలో 48 మంది అభ్యర్థులకు అత్యుత్తమ పోస్టులు లభించాయి. గత జాబితాలో ఉన్న పది మందికి తాజా జాబితాలో చోటు దక్కలేదు. పోస్టింగ్‌లు మారడం, మారిన పోస్టుకు సంబంధించి రోస్టర్‌లో అభ్యర్థులు ఫిట్ కాకపోవడంతో వారి పేర్లను తొలగించారు. వారిలో ఇద్దరు అభ్యర్థులు ఎంపీడీఓ పోస్టుకు అర్హత సాధించినప్పటికీ ఆప్షన్లు ఇవ్వకపోవడంతో పోస్టులు కేటాయించలేదు. అదేవిధంగా కొత్తగా మరో పది మందికి అవకాశం కలిగింది. తాజాగా ఎంపికైన అభ్యర్థులు సాధించిన మార్కులు, సామాజికవర్గం, ఆప్షన్లు తదితర వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. తొలుత విడుదల చేసిన ఫలితాల్లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫలితాల జాబితా తప్పులతడకగా మారిపోయింది. టాప్ ర్యాంకర్లకు ప్రాధాన్యంలేని పోస్టులు దక్కగా.. దిగువన ఉన్నవారికి ప్రాధాన్యమున్న పోస్టులు లభించాయి. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తామిచ్చిన ఆప్షన్లకు, వచ్చిన పోస్టుకు సంబంధం లేదంటూ పలువురు అభ్యర్థులు తగిన ఆధారాలతో సహా టీఎస్పీఎస్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన టీఎస్పీఎస్సీ పొరపాట్లు దొర్లినట్లు గుర్తించింది. మొత్తం 127 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా... చివరకు 238 మంది అభ్యర్థులను మౌఖిక పరీక్షలకు పిలిచారు. వారికి తుది పరీక్షలు నిర్వహించి 121 పోస్టులు భర్తీ చేశారు. మరో 6 పోస్టులు దివ్యాంగుల కేటగిరీవి కావడం.. సరైన అభ్యర్థులు లేకపోవడంతో ఆ పోస్టులను టీఎస్పీఎస్సీ క్యారీ ఫార్వర్డ్ చేసింది. -
గ్రూప్–1 టాపర్ మాధురి
సాక్షి మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది గ్రూప్–1లో ఫస్ట్ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. మాది భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం మంగపేట. ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. మూడుసార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా ర్యాంకు రాలేదు. సాక్షి భవితను నిత్యం అనుసరించా, అందులో మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడింది. – ఆర్డీ మాధురి సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ శనివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఎక్కువ టాప్ ర్యాంకులు సాధించారు. రంగారెడ్డి జిల్లా హైదర్‌నగర్‌కు చెందిన ఆర్డీ మాధురి గ్రూప్–1లో అత్యధిక స్కోర్‌తో మొదటి ర్యాంకర్‌గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆమెతోపాటు మరో 9 మంది టాప్–10లోపు ర్యాంకులను సాధించి ఉత్తమ పోస్టులకు ఎంపికయ్యారు. నల్లగొండ పట్టణం హౌసింగ్ బోర్డుకు చెందిన ఎన్.ఉదయ్‌రెడ్డి రెండో ర్యాంక్ సాధించి డీఎస్పీ కేడర్‌ను ఎంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా సఫిల్‌గూడకు చెందిన రోహిత్ సింగ్ మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ కేడర్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన బెన్షలోమ్ 8వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకున్నారు. అభ్యర్థుల వయస్సు, సామాజిక వర్గం, పోస్టుల రోస్టర్ పాయింట్ల ఆధారంగా సర్వీసులను టీఎస్పీఎస్సీ కేటాయించింది. మరోవైపు టాప్–10లో ఏడుగురు పురుషులు ఉండగా, ముగ్గురు మహిళలు ఉన్నారు. 2011లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్ పరీక్షలను, ఇంటర్వ్యూలను ఇటీవల పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ 127 పోస్టుల్లో 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సుహృద్భావ వాతావరణంలో ఇంటర్వ్యూలు.. గ్రూప్–1 ఇంటర్వ్యూలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన అంశాల్లోనే ఎక్కువ ప్రశ్నలు అడిగారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎలా డీల్ చేస్తారన్న కోణంలో, ప్రజలకు అందించాల్సిన సేవలకు సంబంధించిన పనితీరుపైనే ప్రశ్నలు అడిగారని, దానికి తోడు రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగినట్లు అభ్యర్థులు వివరించారు. మొదటి ప్రయత్నంలోనే.. ఐబీఎం, డెలాయిట్, విప్రోలో పనిచేసిన వంశీకృష్ణ సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1 ర్యాంకు సాధించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆయన పదో తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. కరీంనగర్లో ఇంటర్.. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తండ్రి నాగేందర్, తల్లి లలిత. భార్య మేథ వ్యవసాయ అధికారిగా మంచిర్యాలలో పని చేస్తున్నారు. పిల్లలను చూసుకుంటూ.. తాను చదువుకుంటూ.. 9వ ర్యాంక్ సాధించిన వి.ప్రశాంతి పిల్లలను చూసుకుంటూ.. తానూ చదువుకున్నారు. ప్రస్తుతం రామంతాపూర్‌లో నివాసం ఉంటున్న ఆమెకు 18వ ఏటే వివాహమైంది. ఆ తర్వాత పట్టుదలతో ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు, ఎంబీఏ పూర్తి చేశారు. ఓయూ లా కాలేజీలో 5వ ర్యాంకు సాధించారు. ఎంబీఏలో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. భర్త రవి ప్రకాశ్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేస్తూనే.. ఆరో ర్యాంకు సాధించిన సంతోష్ బీహెచ్ఈఎల్ డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. మూడు సార్లు సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. గ్రూప్–1లో ఆరో ర్యాంకు సాధించారు. వరంగల్ ఎన్ఐటీ నుంచి ఈఈఈ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు భాస్కర్‌రెడ్డి, విజయభారతి, భార్య శ్రీదేవి ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు ప్రజలకు సేవ చేయాలనే కోరిక, ఐఏఎస్ కావాలనే బలమైన ఆకాంక్షతో పట్టువదలని విక్రమార్కుడిలా చదివి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని సంపాదించారు రోహిత్‌సింగ్. సివిల్స్ సాధించాలన్నా.. గ్రూప్–1 ఉద్యోగం పొందాలన్నా ధృడ సంకల్పం, అంతకుమించిన గుండె ధైర్యం ఉండాలంటున్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్ శివ్‌చరణ్‌సింగ్ కుమారుడైన రోహిత్ హైస్కూల్ చదువు ఖమ్మంలో ఇంటర్, బీఈ హైదరాబాద్‌లో సాగింది. ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండాలని, ఎన్ని గంటలు చదివామన్నది కాదు ఇష్టంతో ఆరు గంటలు కూర్చున్నా మంచి ఫలితాలు సాధించవచ్చని రోహిత్ చెప్పారు. వ్యవసాయ కుటుంబం నుంచి.. మహబూబ్‌నగర్ జిల్లా మర్రిపల్లిలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన దేప విష్ణువర్ధన్ రెడ్డి జెన్కో(నాగార్జునసాగర్)లో పనిచేస్తూనే గ్రూప్–1లో ఏడో ర్యాంకు సాధించి డివిజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. కల్వకుర్తిలో టెన్త్, హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీలో బీటెక్, వరంగల్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. -
సజావుగా గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష పేపర్–4 శనివారం సజావుగా జరిగింది. పరీక్ష జరుగుతున్న ఎస్ఎస్బీఎన్ డిగ్రీ, జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ జి.వీరపాండియన్ సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవిని అడిగి తెలుసుకున్నారు. మొత్తం 688 మంది అభ్యర్థులకుగానూ 410 మంది హాజరైనట్లు కలెక్టర్‌కి డీఆర్ఓ చెప్పారు. పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లను చేశామని, కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ మలోలా, ఏపీపీఎస్సీ సహాయ కార్యదర్శులు ఆర్.వి.రమణ, మహబూబ్‌బాషా, సుధాకర్‌బాబు, తదితరులు ఉన్నారు. -
2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు
-
కొలువుల జాతర
2,437 పోస్టులు..15 నోటిఫికేషన్లు 6వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు: టీఎస్పీఎస్సీ ♦ గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు విడుదల.. నేడు వెబ్సైట్లో జాబితాలు ♦ వారంలో గ్రూప్–1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ.. తరువాత గ్రూప్–2కు.. ♦ 29, 30 తేదీల్లో పీజీటీలకు మెయిన్ పరీక్ష.. టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో ♦ స్పెషల్ టీచర్లకు జూలై 30న రాతపరీక్షలు ♦ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుభవార్త అందించింది. వివిధ కేటగిరీల్లో 2,437 పోస్టులకు సంబంధించి 15 రకాల నోటిఫికేషన్లను గురువారం విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈ నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో (tspsc.gov.in) అందుబాటులో ఉంటాయని తెలిపింది. గురువారం కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి హైదరాబాద్‌లో ఈ వివరాలను వెల్లడించారు. అన్ని కేటగిరీల పోస్టులకు ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ పోస్టుల్లో గురుకుల డిగ్రీ లెక్చరర్లు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, ములుగులోని ఫారెస్ట్ కాలేజీలో ప్రొఫెసర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. గురుకుల డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్, గురుకుల జూనియర్ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్, జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్ష విధానం ఉంటుంది. గురుకుల డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాల్ పోస్టులకు ఇంటర్వూ్య మాత్రమే ఉంటుంది. ఫారెస్టు కాలేజీలో ప్రొఫెసర్స్, లైబ్రేరియన్లను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించే ఇంటర్వూ్యల ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల చివరి గడువు, పరీక్ష తేదీలను తాత్కాలికంగా నిర్ణయించారు. కచ్చితమైన తేదీలను నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. గ్రూప్–1, గ్రూప్–2 ఫలితాలు విడుదల 128 పోస్టుల భర్తీకి నిర్వహించిన 2011 గ్రూప్–1.. 1,032 గ్రూప్–2 పోస్టుల ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఘంటా చక్రపాణి వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను శుక్రవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రూప్–1కు 1:2 నిష్పత్తిలో 256 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, వారంలో వెరిఫికేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. అనంతరం గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని, దీనికి 1:3 నిష్పత్తిలో 3,096 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని.. ఇంటర్వూ్యకు మాత్రం 1:2 రేషియోలో అభ్యర్థులను పిలుస్తామని చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థులు చెక్ లిస్టులను చూసుకొని ఆయా సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని చక్రపాణి సూచించారు. సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. మధ్య దళారులను నమ్మొద్దు... ఇప్పటివరకు వివిధ పోస్టుల నియామకాలను పారదర్శకంగా నిర్వహించామని, భవిష్యత్‌లో మరింత పారదర్శకంగా ప్రక్రియ కొనసాగిస్తామని చక్రపాణి చెప్పారు. మధ్య దళారులు, వదంతులను అభ్యర్థులు నమ్మొద్దన్నారు. నియామకాల కోసం ప్రభుత్వం అప్పగించిన అన్ని ఇండెంట్లు పూర్తి చేశామని, ప్రస్తుతం ఎలాంటి ఇండెంట్లు æపెండింగ్‌లో లేవన్నారు. ఇప్పటికే 6 వేల పోస్టులను భర్తీ చేశామని, 4,432 మంది విధుల్లో చేరారని చెప్పారు. మరో 2 వేల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతందని, 7,306 గురుకుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వివరించారు. మొత్తంగా ఇప్పటివరకు 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన నిబంధనల ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చక్రపాణి చెప్పారు. ఆ తరువాత విద్యా శాఖ నుంచి జిల్లాల వారీగా పోస్టుల వివరాలతో కూడిన ఇండెంట్లు రావాలని, అవి వచ్చాకే నోటిఫికేషన్‌కు చర్యలు చేపడతామన్నారు. గురుకులాల టీచర్ల, పాఠశాలల టీచర్ల పరీక్ష స్కీం వేరుగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. త్వరలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. 29, 30 తేదీల్లో పీజీటీ పోస్టులకు మెయిన్ పరీక్షలు మే 31న రాత పరీక్ష నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల ‘కీ’లను ఒకటీ రెండు రోజుల్లో విడుదల చేస్తామని, ఫలితాలను వీలైనంత త్వరగా ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ వెల్లడించారు. పీజీటీలకు మెయిన్ పరీక్షలను ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని, టీజీటీలకు వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో నిర్వహించేలా తాత్కాలిక షెడ్యూలు రూపొందించామని చెప్పారు. మొత్తానికి వచ్చే నెల 15 లోగా పరీక్ష నిర్వహిస్తామని, కచ్చితమైన పరీక్ష తేదీల షెడ్యూలును త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్ తదితర స్పెషల్ టీచర్ పోస్టులకు రాత పరీక్షలను వచ్చే నెల 30న నిర్వహిస్తామని వెల్లడించారు. టీజీటీ, పీజీటీ పోస్టులకు మెయిన్ పరీక్ష షెడ్యూలు.. 29–6–2017, 30–6–2017: పీజీటీ గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ 12–7–2017, 13–7–2017: పీజీటీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్) 4–7–2017, 5–7–2017, 6–7–2017: టీజీటీ గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సైన్స్, సోషల్ స్టడీస్ 14–7–2017, 15–7–2017: టీజీటీ లాంగ్వేజెస్ (తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, సంస్కృతం) 30–7–2017: ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, స్పెషల్ టీచర్స్ (ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్) స్టాఫ్ నర్సు పోస్టులకు రాత పరీక్ష -
ఎస్సీ అభ్యర్థులకు గ్రూప్–1,3 శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వం గ్రూప్–1,3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎస్సీ అభ్యర్థులకు ఎంపానల్డ్ ఇనిస్టిట్యూషన్స్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని, వార్షిక ఆదాయం రూ. 6లక్షలకు మించరాదని పేర్కొన్నారు. -
‘గ్రూప్స్’ నోటిఫికేషన్లు విడుదల
గ్రూప్–1 పోస్టులు 78 - గ్రూప్–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు 100 - మొత్తం 1317 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1, గ్రూప్–3 సహా 1317 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9 నోటిఫికేషన్లను కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ మీడియా సమావేశంలో విడుదల చేశారు. 2017లో ఈ పోస్టులన్నిటికీ రాత పరీక్షలు, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గ్రూప్–1లో 78 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిప్యుటీ కలెక్టర్లు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్, జిల్లా బీసీ సంక్షేమాధికారులు, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్లు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులున్నాయి. గ్రూప్–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లు– 5, అగ్రికల్చర్ ఆఫీసర్లు–30, టౌన్, కంట్రీప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్లర్లు–5, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్లు–5, ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్లు–10, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు–13, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు–10, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు–6, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు–100 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1317 పోస్టులకు సంబంధించి 9 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆయా నోటిఫికేషన్ల పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ అర్హతలు, ఇతర సమాచారానికి సంబంధించి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్)ను పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్ వివరించింది. ఈ పోస్టులకు 1:50 చొప్పునే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్టులను ఆఫ్‌లైన్ మోడ్‌లో ఓఎమ్మార్ సమాధానాలతో నిర్వహించనున్నారు. కాగా, ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడ, లేదా గుంటూరులలో ఏర్పాటుచేయడానికి అద్దెభవనాలను అన్వేషిస్తున్నామని ఉదయభాస్కర్ తెలిపారు. గ్రూప్–1 దరఖాస్తుల గడువు జనవరి 30 గ్రూప్–1 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్/ ప్రిలిమనరీ పరీక్ష మే 7వ తేదీన ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కుల విధానం అమలు చేయనున్నారు. ప్రిలిమనరీ పరీక్షను రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఆగస్టు 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తారు. గ్రూప్–1లో స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీపై ఈ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిషుతో పాటు ఐదు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్–3 దరఖాస్తుల గడువు జనవరి 30 గ్రూప్–3 కింద భర్తీ చేయనున్న 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తును కమిషన్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు కమిషన్ అధికారిక వెబ్సైట్ ‘పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్’ నుంచి సంబంధిత కరస్పాండింగ్ లింకులోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా ‘హెచ్‌టీటీపీ:ఏపీపీఎస్‌సీఏపీపీఎల్‌ఐసీఏటీఐఓఎన్‌ఎస్17.ఏపీపీఎస్సీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్–3 పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 23న నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షను జులై 16న ఆన్లైన్లో కంప్యూటరాధారితంగా చేపడతారు. ఈ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇది డిగ్రీ స్టాండర్డ్‌లో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కుల పద్దతిని అనుసరిస్తారు. మెయిన్ పరీక్ష 300 మార్కులకు 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. రెండో పేపర్లో రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ ప్రాంతంలో సమస్యల (ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతగా)పై ప్రశ్నలుంటాయి. ► టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టులకు శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా జనవరి 30వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తులు 25 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 5, 6వ తేదీల్లో కంప్యూటరాధారితంగా చేపట్టనున్నారు. ఈ పరీక్షను విజయవాడ, గుంటూరులలో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది. ► అసిస్టెంటు టౌన్‌ప్లానర్ పోస్టులకు కూడా జనవరి 30వరకు ఆన్లైన్ దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. 25వేలకు మించి దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్ టెస్ట్ తేదీని తరువాత ప్రకటిస్తారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది. ► అగ్రికల్చరల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30తో ముగుస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ అవసరమైతే తేదీని తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్4న 450 మార్కులకు రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ► అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. స్క్రీనింగ్ టెస్ట్‌ను జూన్ 18న నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షను సెప్టెం బర్ 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ► మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టులకు అవసరమైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 5న నిర్వహిస్తారు. ► హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు జూన్11న స్క్రీనింగ్ టెస్ట్, సెప్టెంబర్ 21న మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ► అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ అవసరమైతే ఎప్పడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ పరీక్ష మే 4, 5 తేదీల్లో జరుగుతుంది. -
గ్రూప్-1, గ్రూప్-3 నోటిఫికేషన్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) శనివారం పది వేర్వేరు నియామక ప్రకటనలు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 1300 పోస్టుల భర్తీ జరగనుంది. అందులో గ్రూపు-1 పోస్టులు సుమారు 78 ఉండగా, 1055 వరకూ గ్రూపు-3 పోస్టులున్నాయి. వీటితో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖాధికారులు, వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. త్వరలో మూడు వేలకు పైగా మెడికల్ ఆపీసర్ల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. -
త్వరలో 1999 గ్రూప్–2, 2011 గ్రూప్–1 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్–2, 2011 గ్రూప్–1 తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయని కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. 1999 గ్రూప్–2 పోస్టుల మెరిట్ జాబితాను మళ్లీ రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నెలాఖరులోగా గ్రూప్1 ఫలితాలు ఇలా ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూప్–1 పోస్టులకు సంబంధించి మళ్లీ నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరులోగా వెలువరించాలని కమిషన్ భావిస్తోంది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 24వ తేదీవరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆరు పేపర్లకు గాను 5వ పేపర్లో కొన్ని తప్పులు దొర్లడంతో ఆ ప్రశ్నలను తొలగించి మూల్యాంకనాన్ని ప్రారంభించారు. ఇప్పటికి ఐదు పేపర్ల మూల్యాంకనం పూర్తయ్యింది. ఆరో పేపర్ మూల్యాంకనం జరుగుతోంది. -
గ్రూప్-1 మెయిన్స్ 13వ తేదీ పరీక్ష వాయిదా
హైదరాబాద్: 2011 గ్రూప్-1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను ఈనెల 13వ తేదీ నుంచి 24వ తేదీకి మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మెయిన్స్ పరీక్షలు ఈనెల 13 నుంచి ప్రారంభమై 23వ తేదీ వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే బక్రీద్ పండగను ఈనెల 12వ తేదీకి బదులు 13వ తేదీకి మార్పు చేయడంతో ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ తొలి రోజు పరీక్షను 13వ తేదీకి బదులు 24వ తేదీకి మార్పు చేసింది. విద్యార్ధులు ఈ మార్పును గమనించాలని సూచించింది. పరీక్ష కేంద్రాలు దూరాభారం ఇలా ఉండగా హైదరాబాద్ కేంద్రంగా పరీక్షలు రాయాలనుకున్నవారికి కేటాయించిన సెంటర్లు దూరాభారంగా ఉన్నాయని ఆయా అభ్యర్ధులు వాపోతున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షల కోసం తెలంగాణ ప్రాంత జిల్లాలవారే కాకుండా ఏపీలోని పలు జిల్లాల నుంచి అభ్యర్ధులు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రాల్లో చేరారు. వీరంతా పరీక్షలను హైదరాబాద్ కేంద్రం నుంచి రాయడానికి ఆప్షన్ ఇచ్చారు. అయితే వీరికి కేటాయించిన కేంద్రాలు హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లిరావడానికి దాదాపు 2గంటలకు పైగా సమయం పడుతోందని, ఇలా పరీక్షలన్ని రోజులూ అయిదారు గంటలు ప్రయాణానికే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కేంద్రాలుగా కేటాయింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు కావలసి ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. అనుమతుల విషయంలో ఇబ్బందులు ఉన్నందున ప్రైవేటు విద్యాసంస్థలను ఎంచుకుని అభ్యర్ధులకు కేటాయించామని పేర్కొన్నాయి. -
ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్!
► స్టేట్ సివిల్ సర్వీస్‌గా గ్రూప్-1 ► ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన అధికారులకు టీఏఎస్ హోదా ► మూడు గ్రేడ్లుగా నియామకానికి ప్రతిపాదనలు ► ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారుల కమిటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్)ను ఏర్పాటు చేయాలని గ్రూప్-1 అధికారుల సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతమున్న గ్రూప్-1 సర్వీసులను యథాతథంగా కొనసాగించాలని, ఈ సర్వీసునే రాష్ట్ర సివిల్ సర్వీస్‌గా గుర్తించాలని కోరింది. ఎనిమిదేళ్ల కనీస సర్వీసు పూర్తి చేసిన గ్రూప్-1 అధికారులతో టీఏఎస్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. విస్తృతంగా అధ్యయనం చేసి..తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టీఏఎస్) ఏర్పాటు, కొత్త అడ్మినిస్ట్రేటివ్ నిబంధనల రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ ఎం.జి.గోపాల్ ఆధ్వర్యంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. టీఏఎస్ ఏర్పాటు, కేడర్ సంఖ్య, ఏయే పోస్టులు, ఏయే విభాగాల ఉన్నతాధికారులను అందులో చేర్చాలి.., గ్రేడ్లు, పేస్కేళ్లు, నియామక విధానం, ప్రమోషన్లకు అనుసరించాల్సిన పద్ధతి, ఇప్పుడున్న గ్రూప్-1 అధికారులకు టీఏఎస్ పదోన్నతి, టీఏఎస్ అధికారులకు శిక్షణ తదితర అంశాలను అధ్యయనం చేయాలని గ్రూప్-1 అధికారుల అసోసియేషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రూప్-1 అధికారుల బృందం కేరళ, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి... అక్కడ అమల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రూల్స్‌ను అధ్యయనం చేసి వచ్చింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన విధివిధానాలపై ఓ సమగ్ర నివేదికను రూపొం దించింది. 197 పేజీలతో కూడిన ఈ నివేదికను శుక్రవారం సచివాలయంలో ఎంజీ గోపాల్ కమిటీకి అందజేసింది. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు ఆవశ్యకతను నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది. గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్‌గౌడ్, హన్మంతునాయక్, శశికిరణాచారి, అశోక్‌రెడ్డి, రఘుప్రసాద్, హరికిషన్, అరవిందరెడ్డి, అలోక్‌కుమార్, శ్రీనివాసులు, భాస్కరాచారి, చంద్రకాంత్‌రెడ్డి, రవీందర్రావు, అజయ్, సోమశేఖర్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. తమ ప్రతిపాదనలపై ప్రభుత్వం త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అధికారుల బృందం నివేదికలోని ప్రధాన అంశాలు.. ♦ వెంటనే తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఏర్పాటు చేయాలి. ♦ ప్రస్తుతమున్న గ్రూప్-1 ఆఫీసర్లతో టీఏఎస్ తొలి కేడర్ సంఖ్యను నిర్దేశించాలి. డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులై ఎనిమిదేళ్ల కనీస సర్వీసు ఉన్న వారికి ఈ అవకాశమివ్వాలి. ♦ కొత్త నియామకాలు చేపట్టేందుకు శాఖలవారీగా ప్రస్తుతమున్న గ్రూప్-1 సర్వీసుల నియామకాలు యథాతథంగా కొనసాగించాలి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక టీఏఎస్‌కు బదిలీ చేయాలి. ♦ టీఏఎస్‌లో మూడు గ్రేడ్లుండాలి. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని 12 ఏళ్ల వరకు జూనియర్ గ్రేడ్ (పేస్కేల్ 52,590-1,03,290)గా పరిగణించాలి. 12-16 వరకు సీనియర్ గ్రేడ్ (పేస్కేలు 73,270-1,08,330), 16 ఏళ్ల సర్వీసు నిండిన వారిని సూపర్ టైమ్ గ్రేడ్ (పేస్కేలు 87,130-1,10,850)గా పరిగణించాలి. సర్వీసు కాలాన్ని బట్టి పదోన్నతి కల్పించాలి. ఐఏఎస్‌లకు ఇచ్చిన తరహాలో శిక్షణను ఎంసీహెచ్ఆర్డీ కేంద్రంగా ఇప్పించాలి. ♦ టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-1 డెరైక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలి. ♦ వివిధ శాఖాధిపతులు (హెచ్‌వోడీ), ఎం డీలు, రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లుగా టీఏఎస్ అధికారులను నియమించాలి. ♦ ఐఏఎస్ పదోన్నతుల్లో అన్ని శాఖలకు అవకాశమివ్వాలి. డిప్యూటీ కలెక్టర్లతో పాటు నాన్ రెవెన్యూ అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను సంస్కరించాలి. ♦ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఐఏఎస్ అధికారుల కొరతను దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 సీనియర్ అధికారులను అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లుగా నియమించాలి. -
ఏపీ గ్రూప్స్ పరీక్ష విధానం ఖరారు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించి పరీక్షా విధానం ఖరారు అయింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష విధానాన్ని వెల్లడించింది. ఈ మేరకు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్ష విధానాలపై ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. గ్రూప్-2, 3లకు రెండు పరీక్షలు, ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మెయిన్స్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి
► 2011 నాటి నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వేర్వేరుగా పరీక్ష ► తెలంగాణలో పాత సిలబస్‌తోనే పరీక్ష ►3 నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలన్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్-1 (2011 నోటిఫికేషన్) మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటి నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని తెలి పింది. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం తీర్పు వెలువరిం చింది. 2011లో జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన 606 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో తప్పులు దొర్లిన కారణంగా కొందరు అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత కోల్పోయారనే వివాదం.. చివరకు సుప్రీంకోర్టుకు చేరడంతో మెయిన్స్ మళ్లీ నిర్వహించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర విభజన, ఇతర అంశాల నేపథ్యంలో ఈ తీర్పును అమలుపరచడంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు 2015లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చే శారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. తాజాగా బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా ఏపీపీఎస్సీ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదన వినిపించారు. మెయిన్స్ మళ్లీ నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రాష్ట్రం వరకు తెలంగాణ నిర్వహించుకుంటే సరిపోతుందని చెప్పారు. మీ వైఖరేంటని ధర్మాసనం తెలంగాణను ప్రశ్నించగా.. టీఎస్పీఎస్సీ తరఫున హాజరైన తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు.. పరీక్ష నిర్వహణకు తాము కూడా సిద్ధమేనని పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీఎస్ రావు మాత్రం పరీక్ష ఉమ్మడిగా జరగాలని, తెలంగాణలో సిలబస్ మారినందున వేర్వేరుగా నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని విన్నవించారు. అన్నిపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. తెలంగాణలో కూడా 2011 నాటి నోటిఫికేషన్లో పేర్కొన్న సిలబస్ ఆధారంగానే నిర్వహించవచ్చని తెలిపింది. ఈ ప్రక్రియ అంతా మూడు నెలల్లో పూర్తికావాలని స్పష్టం చేసింది. ఇలావుండగా ఇంటర్వ్యూకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పరీక్ష తిరిగి నిర్వహించవద్దని, ఫలితాలు ప్రకటించాలని కోరుతూ ఒక మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. 606 మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని, తమకు న్యాయం చేయాలని విన్నవించారు. తమను పరీక్ష నుంచి మినహాయించాలని విన్నవించారు. అయితే ధర్మాసనం.. తాము న్యాయపరమైన అంశాలను పరిశీలించి మాత్రమే ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, వ్యక్తిగత కోణంలో చూడడం లేదని పేర్కొంది. -
గ్రూప్ - 1 పరీక్షపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ -1 పరీక్షపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా ఏపీపీఎస్సీ, టీస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఈ పరీక్షల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. 2011 నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా పాత సిలబస్ ప్రకారం కూడా తెలంగాణ పరీక్ష నిర్వహించుకోవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది. -
సమగ్ర అవగాహనతోనే విజయం
* సిలబస్‌పై ఆందోళన అక్కర్లేదు * ప్రణాళికాబద్ధంగా చదివితే చాలు * మార్కెట్లో అనేక పుస్తకాలున్నాయ్ * ఎంపికలో జాగ్రత్త పడితే చాలు * గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొ. కోదండరాం * ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: ‘‘నూతన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించాల్సింది, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వారికి సేవలందించాల్సింది కొత్తగా ప్రభుత్వోద్యోగాలు చేపట్టేవారే. అందుకే వారికి జాతీయాంశాలతో పాటు స్థానికాంశాలపైనా సమగ్ర అవగాహన తప్పనిసరి. కాబట్టే టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ, జాతీయాంశాలతోపాటు తెలంగాణపై ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగేలా సిలబస్‌ను రూపొందించాం’’ అని టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన... వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధతపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధానంగా గ్రూప్-1, 2, 3 తదితర పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఆవిర్భావం తదితరాలపై ప్రవేశపెట్టిన ప్రత్యేక పేపర్లకు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై ఇలా వివరించారు... కొత్త రాష్ట్రంలో ఉద్యోగంలోకి వచ్చే వారికి ఇక్కడి చరిత్ర, సామాజికాంశాలపైనా, రాజ్యాంగంపైనా స్థూల అవగాహన ఉండాలి. గ్రూప్-1ను తీసుకుంటే జనరల్ ఎస్సేకు ప్రిపేరయ్యే వారు చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సంస్కృతి, భారత సమాజం, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివన్నీ చదువుకుంటే ఎస్సేతోపాటు ఇతర సబ్జెక్టులకూ బాగా సిద్ధం కావచ్చు. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా దేశ, రాష్ట్ర చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధిలో అభ్యర్థి అవగాహనపై ప్రశ్నిస్తున్నారు. అదే గ్రూప్-2లో అయితే భౌగోళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు తక్కువ. 90 శాతం రైతులు రుణభారంలోనే ‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి’ పేపర్‌పైనే అభ్యర్థులు కొంత టెన్షన్ పడతారు. కానీ ఎకనామిక్స్ సబ్జెక్టుపై అభ్యర్థుల నుంచి లోతైన అవగాహన కోరుకోవడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ, స్వరూప స్వభావాలే అడుగుతారు. తెలంగాణలో నూటికి 60 మంది రైతులే. భూ సంస్కరణలు అమలై వ్యవసాయ రంగంలో మార్పులు సాధించుకున్న తర్వాతి పరిస్థితులేమిటన్నది అడుగుతారు. ప్రస్తుతం తెలంగాణలో నూటికి 80 శాతం చిన్న రైతులే. వారిలోనూ 90 శాతం మందిపై రుణభారముంది. ఒక్కొక్కరిపై సగటున రూ.95 వేల రుణభారముంది. విదేశాల్లో ఇది గరిష్టంగా రూ.45 వేలే ఉంది. మన వ్యవసాయ పరిస్థితులు, అంటే ఎక్కువగా బోర్లపై ఆధారపడటం వంటివే ఇందుకు కారణం. పట్టణీకరణ పట్టణ జనాభా ఇటీవల పెరుగుతోంది గనుక పట్టణీకరణ లక్షణాలేమిటన్నది తెలుసుకోవాలి. మన దగ్గర హైదరాబాద్ ప్రధాన నగరం. మిగితావి చిన్న నగరాలు. పట్టణీకరణతోపాటు పారిశ్రామిక ప్రగతి, అందులో ఉపాధి వాటా చూడాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కంటే మన దేశంలో సేవా రంగంలో ఎక్కువ మంది పనిచేస్తుండటం విచిత్రం. తెలంగాణలో ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఇలాంటి ప్రధానాంశాలపై అవగాహన ఉండి తీరాలి. మన ఆర్థిక ప్రగతికి ప్రధానమైన వ్యవసాయ పరిస్థితిపై అవగాహన ఉండాలి. స్థూలంగా ఆయా రంగాలపై అవగాహన కావాలి. అలాగని దీనిపై గందరగోళం, టెన్షన్ అక్కర్లేదు. ప్రిపరేషన్ నిజానికి చాలా ఈజీ. ప్రామాణిక గ్రంథాలు దొరక్కపోయినా.. గ్రహించాల్సిందేమిటంటే చదివే ఇతర సబ్జెక్టుల్లో ఇవన్నీ కలిసే ఉంటాయి. ముల్కీ ఉద్యమం ఆలంబనగా తెలంగాణ అస్తిత్వ రూపకల్పన ముల్కీ ఉద్యమం ఆలంబనగా, దానిచుట్టూ అల్లుకొని సాగింది. 1952లో వచ్చిన ఉద్యమం దీనికి పరాకాష్ట. ఈ ముల్కీ ఉద్యమం ద్వారా తెలంగాణ వారు రెండు చెప్పారు. మేం వేరు. బయటి వారు రావచ్చు, బతుకవచ్చు. కానీ పెత్తనం చేయడానికి వీల్లేదు. రెండోది... మా సంస్కృతి ప్రత్యేకమైనది. అది వాణిజ్య సంస్కృతి కాదు. మాది సమష్టి తత్వం. ఇక్కడ భిన్న కులాలు, మతాలు, ప్రాంతాల వారు కలిసి జీవించగలరని చెప్పారు. నిజాం కాలంలో దీన్నే గంగా జమునా తెహజీబ్ అన్నారు. సహజీవనం నుంచి పెంపొందిన ఉమ్మడి సంస్కృతి తెలంగాణ జన జీవనానికి పునాది అని చెప్పుకొచ్చారు. ఇదే తెలంగాణ తెలంగాణ అస్తిత్వ రూపకల్పన. ‘ఇతర ప్రాంతాల వారు రావచ్చు. బతుకవచ్చు. అభ్యంతరం లేదు. కానీ మేం వారితో కలువం. ఎందుకంటే వారొస్తే పెత్తనం చేస్తారు’ అన్న ఆందోళన ఉంది. చారిత్రక నేపథ్యం కారణంగా భయాలున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తెలంగాణ అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతంతో కలిసేది లేదన్నరు. మా ప్రత్యేకతలు కాపాడుకుంటం, మా రాష్ట్రం మాకు కావాలని డిమాండ్ పెట్టారు. తెలంగాణ రక్షణలు తెలంగాణ ప్రత్యేకతలు, ఆకాంక్షలను గుర్తించి అప్పటి ప్రభుత్వాలు రక్షణలు కల్పించాయి. తెలంగాణ నిధులు తెలంగాణకే ఖర్చు చేయాలి, ముల్కీ నిబంధనలను అమలు చేసి తెలంగాణ ఉద్యోగాలను అక్కడి అభ్యర్థులకే ఇవ్వాలి, విద్యాలయాల్లో స్థానిక రిజర్వేషన్ల అమలును కొనసాగించాలి వంటివి పెట్టారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో 60వ దశకమంతా రక్షణల చరిత్ర, అవి అమలవుతాయా, లేదా అన్నదే. ఇవే ఇందులో ప్రత్యేకాంశాలు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన వైనం ఒక బలమైన ధనిక రైతాంగం ఆంధ్ర ప్రాంతంలో ఎదిగి, ప్రాంతీయ పార్టీల రూపంలో బలం పుంజుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టింది. తెలుగుజాతి నినాదంతో వచ్చిన రాజకీయాలు తెలంగాణ అస్తిత్వానికి స్థానం కల్పించలేకపోయాయి. తెలంగాణ ప్రజల ఆర్థిక అవసరాలను చూడలేక పోయిది. దాంతో 1996లో మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చింది. కనుక మనం చూడాల్సిందేమిటంటే... 1973 తరువాత జరిగిన పరిణామాల్లో తెలుగుజాతి రూపకల్పనలో తెలంగాణ అస్తిత్వం ఏమైపోయింది? తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమైంది? మలి దశ ఉద్యమం ఇక తరవాత వచ్చింది మలి దశ ఉద్యమం. 1996 నుంచి 2001 వరకు భావవ్యాప్తి జరిగింది. 2001లో ఒక రాజకీయ వ్యక్తీకరణ దొరికింది. తెలంగాణ ఒక రాజకీయ ఆకాంక్ష సాధన కోసం ఉద్యమించడం ప్రారంభమైంది. తొలి దశలో ఈ ఉద్యమం రాజకీయ ప్రక్రియ చట్టపరిధిలో జరిగింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ తెలంగాణ ఆకాంక్షను పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోనూ చోటిచ్చారు. తరవాత అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని అందరిని ఒప్పిస్తామన్నారు. దానికి ప్రణబ్, రోశయ్య కమిటీలు వేశారు. కానీ ఏ కమిటీ కూడా సమస్య పరిష్కారానికి పూనుకోలేదు. దాంతో 2009లో మళ్లీ ఉద్యమం వచ్చింది. అప్పుడు భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ మూడు ఏకమై సమ్మిళితంగా ఏకకాలంలో నడిచాయి. ఆఖరి భాగంలో పునర్వ్యవస్థీకరణ చట్టం ఆఖరి భాగంలో చదవాల్సింది... తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి. ఇది చాలా కీలకం. ఏ విభజనచట్టమై నా ఒకేలా ఉంటుంది. అయితే అంగాలుండాలి కదా. కొత్త రాష్ట్రం ఏర్పడితే సరిహద్దులను విభజించి, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను పేర్కొని, హైకోర్టు, కార్యనిర్వాహక ఏర్పాటుకు చర్యలు చేపడతారు. రాష్ట్ర విభజనకు, ఉద్యోగుల విభజనకు, కార్పొరేషన్ల విభజన కు నిబంధనలు పొందుపరిచారు. మన దగ్గర ప్రత్యేకాంశం ఏమంటే హైదరాబాద్ కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నది, ఇరు రాష్ట్రాలకూ గవర్నర్ ఒక్కరే ఉంటారన్నది. అవసరమైతే హైదరాబాద్‌లో శాంతిభద్రతల్లో ఆయన జోక్యం చేసుకునే వెసలుబాటు ఉంటుంది కూడా. తెలంగాణ చరిత్ర చదివితే ప్రస్తుతమున్న తెలంగాణ ఉద్యమ మూలా లు తెలుస్తాయి. రాష్ట్రావిర్భావం దిశగా ఉద్యమం ప్రయాణించడానికి దారి తీసిన ఆర్థిక పరిస్థితులు మూడోదైన ఆర్థికాభివృద్థి పేపర్లోనూ ఉంటాయి. మితిమీరిన విశ్వాసం వద్దు తెలిసిన విషయాలే కదా అన్న మితిమీరిన విశ్వాసం వద్దు. ఈ అంశాలకు శాస్త్రీయ దృక్పథంతో సమాధానాలు రాయాలి. ఆధారాల్లేకుండా భావోద్వేగాలతో రాస్తే నష్టం జరుగుతుంది. ప్రత్యేక పేపర్ విషయంలో ఇలా.. గ్రూప్-1, 2, ఇతర పోటీ పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌లో తెలంగాణ ఉద్యమం గురించి ఉంటుం ది. ఈ పేపర్లో స్థూలంగా తెలంగాణ అస్తిత్వం దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలు చేసిన ప్రయత్నం, దాన్ని గుర్తించి, గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితరాలు తెలుసుకోవాలి. అమలుకు నోచని ఒప్పందాలు తెలంగాణకు అప్పటి ప్రభుత్వాలు కల్పించిన రక్షణలో ప్రధాన అంశాలేమిటి, అవెలా అమలయ్యాయన్నది ముఖ్యం. రక్షణల అమలు కోసం ఏర్పడిందే ప్రాంతీయ రీజనల్ కమిటీ. అదేం చేసిందన్నది ముఖ్యం. రక్షణలు అమలు కానప్పుడు తెలంగాణ ప్రజలేం చేశారన్నది ప్రధానం. 1968 నుంచి రక్షణల అమలుకు ప్రయత్నం మొదలైంది. కానీ అవి అమలు కాకపోవడంతో ఆందోళన మొదలైంది. 1968లో ఉద్యమం వచ్చింది. 1972 వరకు సాగింది. రక్షణలను పటిష్టంగా అమలు చేయాలని, ముల్కీ నియామాలను గట్టిగా అమలు చేయాలని 1972లో కేంద్రం నిర్ణయించింది. రీజనల్ కమిటీ అధికారాలు పెంచింది. దీన్ని వ్యతిరేకిస్తూ, ‘రక్షణలైనా రద్దు చేయండి, రాష్ట్రాన్నయినా విడదీయండి’ అంటూ ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం మొదలైంది. దాంతో కేంద్రం వెనక్కి తగ్గి రక్షణలను రద్దు చేసింది. చివరకు అన్ని ప్రాంతాల్లోనూ వెనకబడిన ప్రాంతాలు ఎక్కడున్నా అభివృద్ధికి సమాన చర్యలు చేపడతామని పేర్కొంది. ఏ ప్రాంత ఉద్యోగాలను ఆ ప్రాంతం వారే పొందే హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ తెలంగాణలో ఈ హామీ అమలు కాలేదు. ఏ పుస్తకాలు చదవాలంటే.. జనరల్స్టడీస్కు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు. 9, 10 తరగతుల టెక్స్ట్‌బుక్స్. ఇక భారత రాజ్యాం గాన్ని స్థూలంగా అంతా టెన్త్ వరకు చదువుతారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం పేపర్‌కు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో చాలా సమాచారముంది. ఇది తెలుగులోనూ దొరుకుతుంది. వట్టికోట ఆళ్వారు స్వామి తెలంగాణం పుస్తకం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్ర, ప్రొఫెసర్ జయశంకర్ రాసిన తెలంగాణ రాష్ట్రం-ఒక డిమాండ్, ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసిన ఉద్యమ చరిత్ర-తెలంగాణపోరాటం, గౌతమ్ పింగ్లే రాసిన ఫాల్ అండ్ రైజ్ ఆప్ తెలంగాణ, తెలుగు అకాడమీ పుస్తకాలు, తెలంగాణ చరిత్రపై పరిశోధన చేసిన వి.ప్రకాశ్ వంటివారి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు. తెలంగాణ.ఆర్గ్‌లో చాలా సమాచారం ఉంది. తెలంగాణ ఉద్యమం సమీకరణ దశ దాటి ఆవిర్భావం దిశగా సాగిన దశపై ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి ఎడిట్ చేసిన ‘ప్రపంచబ్యాంకు పడగ నీడలో’ పుస్తకం బాగుంటుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పలు సెమినార్లపై వచ్చిన పుస్తకాలూ ఉపయోగపడతాయి. అయితే ఎంతసేపూ ప్రామాణిక గ్రంథాల కోసమే చూడటం కాకుండా, అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం. అలాగే గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుతెన్నుల్లో వచ్చిన మార్పులపైనా అవగాహన ఉండాలి. -
రాజకీయ అవగాహన తప్పనిసరి
* గ్రూపు-1, 2లో పాలిటీకి పెద్దపీట * ప్రిపరేషన్ పద్ధతే చాలా ముఖ్యం * మూడంచెల విధానంలో సన్నద్ధమవ్వాలి * టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొ. కృష్ణారెడ్డి * ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సాక్షి, హైదరాబాద్: ఏ పోటీ పరీక్షలకైనా దేశ, రాష్ట్ర రాజకీయాలపై అవగాహన కీలకం. గ్రూప్-1, 2 అధికారులకు ఇది మరీ ముఖ్యం. అన్ని స్థాయిల్లో రాజకీయ పరిస్థితులు తెలిసినప్పుడే వారు సమర్థంగా విధులు నిర్వహించగలరు. అందుకే గ్రూప్-1తో పాటు గ్రూప్-2లోనూ పొలిటికల్ సైన్స్‌కు స్థానం కల్పించారు. ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో 8వ అంశంగా భారత రాజ్యాంగం, రాజనీతి శాస్త్రం పొందుపరిచారు. గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేలో రెండో అంశంగా డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వం అంశాలను చేర్చారు. పేపరు-3లోనూ పొలిటికల్ సైన్స్ అంశాలున్నాయి. గ్రూపు-2లోనూ పేపరు-2లో ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్‌ను ప్రత్యేకంగా చేర్చారు. ఈ నేపథ్యంలో పాలిటిక్స్‌కు (పొలిటికల్ సైన్స్) సంబంధించిన వివిధ అంశాలపై ప్రిపరేషన్లో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహాలపై ఓయూ ప్రొఫెసర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... గ్రూపు-1కు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రధానంగా పాలిటీ పరిధిలోకి వచ్చే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, అంతర్రాష్ట్ర వివాదాలపై దృష్టి పెట్టాలి. పాలనకు సంబంధించి పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రధాని తదితర వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలి. పాలిటీలో అభ్యర్థులు దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యాంశం 73, 74 రాజ్యాంగ సవరణలు. స్థానిక సుపరిపాలనకు దోహద పడేలా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ పథకాలు, సమకాలీన అంశాలతోపాటు దేశ రాజకీయాలు, రిజర్వేషన్లు, సామాజిక ఉద్యమాలు, పార్టీల వ్యవస్థపై అవగాహన అవసరం. స్వాతంత్య్రానంతర కాలం నుంచి ఇప్పటిదాకా రాజకీయంగా జరిగిన ముఖ్య ఘటనలు, జాతీయ స్థాయిలో పలు పార్టీలు,రాజకీయ సమీకరణలపై అవగాహన ఉండాలి. ప్రభుత్వాలు ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైన పరిస్థితులూ తెలిసుండాలి. ఉదాహరణకు అన్నా హజారే దీక్ష, లోక్‌పాల్ బిల్లు వంటివి. గ్రూపు-2 (భారత రాజ్యాంగం, రాజకీయాలు-అవలోకనం) పేపరు-2లో మొదటి విభాగంలో ఇండియా, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, రెండో విభాగంలో భారత రాజ్యాంగం, పాలిటిక్స్ అవలోకనం ఉంటాయి. వీటిలో ప్రధానంగా రాజ్యాంగంపై సమగ్ర అవగాహన తెచ్చుకోవడంతోపాటు దేశ సాంఘిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు తెలుసుకోవాలి. ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, పార్టీల పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాధికారికి సమాజ స్థితిగతులపై స్పష్టమైన అవగాహన ఉండాలన్న లక్ష్యంతో సిలబస్‌ను రూపొందించారు. ఒక పేపర్లోని అంశాలకు, మరో పేపర్లోని అంశాలకు సంబంధం ఉంటుంది. నోట్సు రాసుకునేప్పుడే వీటిని జాగ్రత్తగా విభాగాలుగా చేసి సిద్ధం చేసుకోవాలి. పరీక్షలకు సంసిద్ధతే ప్రధానం తెలంగాణ వచ్చాక ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున ్న తొలి ఉద్యోగ పరీక్షలివి. సీమాంధ్ర ప్రాంతాల్లో విద్యా విధానానికి, తెలంగాణలో విద్యా విధానానికి తేడా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థుల ఆలోచన విధానం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, ఇన్నాళ్లు ఇక్కడి అభ్యర్థులకే తెలియని తెలంగాణ చరిత్ర, సామాజిక పరిస్థితులు, అసమానతలు, రాజకీయ స్థితిగతులపై ప్రశ్నించేలా సిలబస్ రూపకల్పన జరిగింది. కొత్త రాష్ట్రంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్న అభ్యర్థులను అధికారులుగా, ఉద్యోగులుగా తీసుకునేలా తెలంగాణలో పోటీ పరీక్షలుంటాయి. సంసిద్ధతలో ఇవీ ప్రధాన వ్యూహాలు అభ్యర్థులు ప్రధానంగా మూడు రకాల వ్యూహాలు అనుసరించాలి. ఒకటి ఎక్స్టెన్సిన్ స్టడీ, రెండోది ఇంటెన్సివ్ స్టడీ. మూడోది పాయింట్లవారీగా నోట్స్ సిద్ధం చేసుకోవడం. ప్రతి సబ్జెక్టు, అంశానికి సంబంధించి పరీక్షలకు సిద్ధమయేప్పుడు వీటిని కచ్చితంగా అనుసరించాలి. తద్వారా సబ్జెక్టుపై అవగాహన తెచ్చుకోవడంతోపాటు పరీక్షల్లో బాగా రాయడం వీలవుతుంది. 1. పరీక్షకు 4 నెలలుందనగా ప్రిపేరయ్యే పోటీపరీక్షకు సంబంధించిన పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ఇది ఎక్స్టెన్సివ్ స్టడీ. 2. ప్రధానాంశాలపై నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్షకు 2 నెలలుండగా వీటిని మాత్ర మే చదువుకోవాలి. ఇది ఇంటెన్సివ్ స్టడీ. 3. ఇక మూడోది పాయింట్స్. పరీక్షకు 15-20 రోజులుందనగా ఈ మూడో వ్యూహాన్ని అనుసరించాలి. ఇంటెన్సివ్ స్టడీ చేసి నోట్స్ రూపొందించుకున్న అంశాలపై పాయింట్లవారీగా మళ్లీ నోట్స్ సిద్ధం చేసుకోవాలి. పరీక్ష వరకూ ఈ పాయింట్లను చదువుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో పుస్తకాలను పట్టుకుని కూర్చోవద్దు. సరైన పుస్తకాలనే ఎంచుకోవడం చాలా ముఖ్యం. పక్కవారు చదువుతున్నారని ఏ పుస్తకం పడితే అది చదవొద్దు. సొంత వ్యూహం ముఖ్యం. ఉదాహరణకు జేఎన్‌యూ, సెంట్రల్ వర్సిటీల విద్యార్థులు చదివే తీరుకు, రాష్ట్ర వర్సిటీల విద్యార్థులు చదివే విధానానికి చాలా తే డా ఉంది.రాష్ట్ర విద్యార్థులే ఎక్కువ సమ యం చదువుతారు. కానీ సెంట్రల్ వర్సిటీ, జేఎన్‌యూ విద్యార్థుల సక్సెస్ రేటే ఎక్కువ. కారణం... పుస్తకాల ఎంపికే. కాబట్టి ఈ విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలి. ఏమేం చదవాలంటే.. సిలబస్ బయటికొచ్చి రెండు నెలలు కూడా కాలేదు. ఈ స్వల్ప కాలంలోనే తెలంగాణ చరిత్రంతా రాస్తామంటే కుదరు. ఇలాంటప్పుడు తెలంగాణ చరిత్రే కాదు, ఇతర సబ్జెక్టులకు సంబంధించి కూడా ఇప్పటికిప్పుడు వచ్చిన పుస్తకాలను గుడ్డిగా అనుసరిస్తే నష్టపోతారు. ఫేక్ పుస్తకాలు వందలకొద్దీ మార్కెట్లోకొచ్చాయి. అవన్నీ కొనేయొద్దు. బిట్స్ బ్యాంకులపైనా ఆధారపడొద్దు. పుస్తకాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. వర్సిటీల్లో లేని విద్యార్థులు అధ్యాపకుల సలహా మేరకు పుస్తకాలను కొనుక్కోవాలి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి వంటి వారు రాసినవి కొనవచ్చు. ఉద్యమంలో పాల్గొన్న వారు రాసిన పుస్తకాలూ చదవొచ్చు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు రూపొందించిన పుస్తకాలనూ చదవొచ్చు. ఇవన్నీ గణాంకాలతో కూడుకుని ఉన్నాయి. గ్రూప్-1 అభ్యర్థులు రొమిల్లా థాపర్, బిపిన్‌చంద్ర పుస్తకాలు చదవొచ్చు. ఓబీ గౌబా రాసిన ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ, ఏఆర్ దేశాయ్ రాసిన పొలిటికల్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా బాగుంటాయి. ప్రణాళిక విభాగం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్లుక్ చదవాలి. తెలంగాణకు సంబంధించి గౌతమ్ పింగ్లే రాసిన ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ పుస్తకం బాగుంటుంది. -
ప్రభుత్వ పాలనే కీలకం
⇒దీనిపై అభ్యర్థులు లోతుగా అధ్యయనం చేయాలి ⇒ గ్రూప్-1 మూడో పేపర్లో దీనిపై ప్రత్యేక యూనిట్ ⇒ గ్రూప్-2, గ్రూప్-3ల్లోనూ ప్రశ్నలు ⇒ పాలనలో విలువలపైనా ప్రత్యేక చర్చ ⇒ ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ భూపతిరావు సాక్షి, హైదరాబాద్: ‘సమాజంలో పాలనే ప్రధానం. ప్రజా సంక్షేమానికి పథకాలు రూపొందించాలన్నా.. రూపొందించిన పథకాలను అమలు చేయాలన్నా పాలనా వ్యవస్థ తప్పనిసరి. ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేసినప్పుడే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుంది. లేదంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన వ్యవస్థది కీలక పాత్ర. అందుకే ఏ పోటీ పరీక్షలోనైనా పాలనకు సంబంధించిన ప్రశ్నలు కచ్చితంగా ఉంటాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న వివిధ పోటీ పరీక్షల్లోనూ పాలనపై ప్రత్యేకంగా ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఒక యూనిట్‌గా సిలబస్‌లో చేర్చింది. గవర్నెన్స్ పేరుతో ఉన్న మూడో సెక్షన్లో పాలనకు సంబంధించిన సమకాలీన అంశాలపై అభ్యర్థులకు అవగాహన ఎంతో అవసరం. సమాజ, సామాజిక సమస్యలు, ప్రజలు, వారి జీవన విధానంపట్ల అవగాహన లేని వారు అధికారులైతే పాలన సరిగ్గా చేయలేరు. కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వ పాలనపట్ల కచ్చితంగా అవగాహన ఉండాల్సిందే’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ భూపతిరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన అంశంపై అభ్యర్థులు సిద్ధం కావాల్సిన తీరు గురించి ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు. సంపూర్ణ అవగాహన అవసరం.. సమాజం, ప్రభుత్వ పాలన ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సమాజంలో ప్రజలు కీలకమైతే పాలనలో అధికారులు, ఉద్యోగులే కీలకం. ప్రజా సంక్షేమం కోసం పాలన ను పక్కాగా కొనసాగించాలంటే వారికి పాలనపట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి. అందుకే గ్రూప్-1 సిలబస్‌లో ఈ అంశాన్ని చేర్చాం. గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3లో ఇండియన్ సొసైటీ, కాన్ిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఉన్నాయి. అందులో ప్రభుత్వ పాలన (గవర్నెన్స్) ఒక యూనిట్‌గా 50 మార్కులకు ఉంటుంది. ఇక గ్రూప్-1 ప్రిలిమినరీలోనూ 13 అంశాలు ఇస్తే అందులో 9వ అంశంగా భారతదేశంలో పరిపాలన, ప్రభుత్వ విధానం గురించి ఉంటుంది. గ్రూప్-2 జనరల్ స్టడీస్‌లోనూ తెలంగాణ రాష్ట్ర విధానాల అంశంలో దీని గురించి ఉంటుంది. అలాగే పేపర్-2 మూడో విభాగంలో సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్లో పాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయి. వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఉంటాయి. ఇందులో రెండో విభాగంలోనూ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్ిస్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ ఐదో అంశంలో గ్రామీణ పట్టణ పాలనలో 73, 74 రాజ్యాంగ సవరణల ప్రభావం గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఐదు విభాగాలపై దృష్టిపెట్టాలి... గ్రూప్-1 పేపర్-3లో మూడో యూనిట్‌గా గవర్నెన్స్ ఉంటుంది. అందులో ఐదు ప్రధాన విభాగాలు ఉంటాయి. వాటిపై అభ్యర్థులు దృష్టి సారించాలి 1. గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ-గవర్నెన్స్ తదితరాలు ఇందులో కేంద్ర స్థాయిలో పాలన వ్యవస్థ ఏ విధంగా వ్యవస్థీకృతమైందన్న అంశంపై అవగాహన ఉండాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు (ఎలక్షన్ కమిషన్, సర్వీస్ కమిషన్, కాగ్ తదితర) వాటి పని తీరుపై అవగాహన పెంపొందించుకోవాలి. ఎలక్షన్ కమిషన్, కాగ్ వంటివి శాసన వ్యవస్థపై చూపుతున్న ప్రభావం, వాటి పనితీరును విశ్లేషించగలగాలి. వాటికి సంబంధించిన నేపథ్యం, వాస్తవాలు తెలుసుకోవాలి. కేంద్ర మంత్రి మండలి, కేబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం, మంత్రి మండ లి సచివాలయం, కేంద్ర సచివాలయం, వివిధ శాఖలు, వాటి పనితీరు ఎలా ఉందన్నది తెలుసుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు (ఎలక్షన్ కమిషన్ వంటి), యూపీఎస్సీ, ఫైనాన్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ, మహిళా జాతీయ కమిషన్లు, వాటి పని తీరు, ప్రభావం గురించి ఇందులో ఉంటాయి. పార్లమెంటరీ కమిటీలు, ఎస్టిమేట్స్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలు వాటి ఉద్దేశాలు, లక్ష్యాలు, సాధించిన ప్రగతికి సంబంధించిన కీలక అంశాలను విశ్లేషించాలి. 2. రాష్ట్ర స్థాయిలో పాలనా వ్యవస్థ ఎలా వ్యవస్థీకృతమైందన్నది తెలుసుకోవాలి. రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో పాలన ఎలా ఉంది, జిల్లా కలెక్టర్ల పాత్ర ఏమిటి, సచివాలయం, డెరైక్టరేట్లు ఏం చేస్తాయి, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న దానిపై విశ్లేషించాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వారు పని తీరు ఎలా ఉందన్నది తెలియాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం విధులు ఏమిటి, పాలనపై లెజిస్లేటివ్ నియంత్రణ ఎలా ఉంది, ఎగ్జిక్యూటివ్ నియంత్రణ, జ్యుడీషియరీ నియంత్రణపట్ల అవగాహన పెంపొందించుకోవాలి. ఇటీవల కాలంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి పాలనాపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళా సాధికారత, ఆహార భద్రత వంటి పథకాలపైనా దృష్టి పెట్టాలి. కోఆపరేటివ్ విధానాలు ఏమిటి...వాటి పూర్వాపరాలను విశ్లేషించాలి. రాష్ట్ర స్థాయిలో ప్రధాన సంక్షేమ పథకాలు ఏమిటన్న అవగాహన ఉండాలి. ప్రస్తుతం అధికారాలన్నీ కేంద్ర స్థాయిలో ఉన్నాయి. బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. ఇలాంటప్పుడు ప్రజలకు ఆ ప్రయోజనాలు ఎలా అందుతున్నాయి.. అధికార వికేంద్రీకరణ ఎలా కొనసాగుతోందన్నది విశ్లేషించాలి. 3. ప్రధానంగా 73, 74 రాజ్యాంగ సవరణల తరువాత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ సంస్థలు ఎలా పని చేస్తున్నాయి... 73, 74 రాజ్యాంగ సవరణల ఫలితాలు, ప్రయోజనాలు ఏమిటన్నది రాయగలగాలి. వాటి ప్రభావాన్ని విశ్లేషించాలి. స్థానిక సంస్థల పరిస్థితి ఏమిటి... వాటికి నిధులు ఎలా సమకూరుతున్నాయి... ప్రజా సమస్యల పరిష్కారంలో వాటి కృషి ఏమిటన్నది చెప్పేలా పరీక్షలకు సిద్ధం కావాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివిధ సంస్థలు, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, ప్రయోజనాలు తెలియాలి. సామాజిక అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని వివరించాలి. వాటి పనితీరు, ఫలితాలపై అవగాహన ఉండాలి. మహిళా సాధికారతకు ప్రభుత్వ కృషి వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. 4. అభివృద్ధి, వివిధ అభివృద్ధి ప్రక్రియలపై చర్చించేలా అవగాహనను పెంపొందించుకోవాలి. సివిల్ సొసైటీ, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లు, పీపీపీ విధానం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వంటి అంశాలను విశ్లేషించాలి. సమాజ అభివృద్ధిలో ఎన్జీవోలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌ల పాత్ర ఏమిటన్నది తెలుసుకోవాలి. ప్రస్తుతం మరో ప్రధాన అంశం పీపీపీ విధానం. సమస్యలను కేవలం ప్రభుత్వమే పరిష్కరించలేదు కాబట్టి రోడ్లు, రైలు రంగాలను తీసుకుంటే.. పీపీపీ విధానంలో రోడ్లు వేయడం, మెట్రో రైలువంటి ప్రాజెక్టులు ప్రధానమైనవి ఈ కోవలోకే వస్తాయి. ప్రత్యేకంగా సామాజిక అభివృద్ధికి పారిశ్రామిక, వ్యాపార వర్గాల భాగస్వామ్యంపైనా విశ్లేషించాలి. 5. ప్రభుత్వ పాలనలో నైతిక విలువలు మరో ప్రధాన అంశం. ప్రభుత్వ పాలనలో స్మార్ట్ గవర్నెన్స్ కచ్చితంగా ఉండాల్సిందే. సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ విధానానికి ప్రాధాన్యం ఇచ్చేదే స్మార్ట్ గవర్నెన్స్. అధికారంలో ఎవరున్నా రాజకీయాలతో సంబంధం లేకుండా అధికారులు, ఉద్యోగులు తటస్థంగా ఉండాల్సిందే. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలను అమలు చేయాలి. క్షేత్రస్థాయిలో సరిగ్గా అవగాహన లేక ప్రస్తుతం నాయకులు, అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సందర్భాలున్నాయి. వాటి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టవచ్చని విశ్లేషించాలి. అవినీతిని ఎలా నిరోధించాలి.. అవినీతి నిరోధానికి ప్రస్తుతం ఉన్న లోకాయుక్త, ఏసీబీ, కన్జూమర్ ప్రొటెక్షన్ మెకానిజం, లోక్‌పాల్ వంటి వాటి పాత్ర ఏమిటన్న అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు, అధికారులు- రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండాలన్నది చెప్పగలగాలి. సత్సబంధాలు లేకపోతే జరిగే నష్టాలను విశ్లేషించాలి. ఎథిక్స్ అండ్ వ్యాల్యూస్‌లో పబ్లిక్ సర్వెంట్‌గా వ్యవహరించే వ్యక్తికి ఉండాల్సిన అంకితభావం, విలువలు, నైతికత గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే లోకాయుక్త ప్రభావం, ఏసీబీ పనితీరు, లోక్‌పాల్ పరిస్థితి వాటి పని తీరుపై విశ్లేషించమని అడిగే అవకాశం ఉంటుంది. ఏం చదవాలంటే.. ప్రభుత్వ పాలనకు సంబంధించి తె లుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ముద్రించిన పుస్తకాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ సిస్టం ఇన్ ఇండియా అనే పుస్తకం కూడా బాగుంటుంది. వీటితోపాటు జనరల్ బుక్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్, ఇతర వార్తాంశాలు, సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. ⇒ -
‘టెక్నాలజీ’తోనే పట్టం
* ప్రతి రంగంలోనూ శాస్త్ర సాంకేతికత కీలకం * ఏ పోటీ పరీక్షలోనైనా దానిపై కచ్చితంగా ప్రశ్నలు * గ్రూప్-1లో ప్రత్యేకంగా 100 మార్కుల పేపర్ * టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొ. రాజేశ్వర్‌రెడ్డి * ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ సైన్స్ అండ్ టెక్నాలజీని రెండు రకాలుగా విభజించుకోవాలి. దాని పాత్ర, ప్రభావం మొదటి యూనిట్ కాగా, శాస్త్ర విజ్ఞానంలో వస్తున్న నూతన మార్పులను రెండో యూనిట్‌గా తీసుకోవాలి. మొదటి యూనిట్‌లోనూ ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలి. సాక్షి, హైదరాబాద్: ఏ అభివృద్ధయినా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ లేని రంగమంటూ లేదు. అందుకే ప్రతి అధికారికీ, ఉద్యోగికీ దానిపై అవగాహన తప్పనిసరి. ముఖ్యంగా 20-30 ఏళ్ల పాటు సేవలందించాల్సిన అధికారులు పలు రంగాలు, వాటిలోని రోజువారీ మార్పులు, అభివృద్ధి తదితరాలను లోతుగా విశ్లేషించగలగాలి. అందుకే గ్రూప్-1లో సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేకంగా ఐదో పేపరుగా పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్‌లో రెండు యూనిట్లు దీనిపైనే ఉన్నాయి. వాటికే 100 మార్కులున్నాయి. డాటా ఇంటర్‌ప్రిటేషన్‌కు మరో 50 మార్కులుంటాయి. కాబట్టి అభ్యర్థులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందే’’ అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్-1లోనేగాక గ్రూప్-2, 3, ఇతర పోటీ పరీక్షల్లోనూ జనరల్ స్టడీస్‌లో భాగంగానూ సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయని గుర్తు చేశారు. కాబట్టి ఇందులో ఏయే అంశాలపై అవగాహన పెంచుకోవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏయే పుస్తకాలు చదవాలన్న అంశాలపై ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... 1. దేశాభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తున్న కృషి, ప్రధాన ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నమోదవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకోవాలి. తాజా ఉపగ్రహ ప్రయోగాలు, వాటి ఫలితాలు, సామాజికాభివృద్ధికి వాటి దోహదం తదితరాలపై దృష్టి పెట్టాలి. రోజువారీ జీవితంలో అవి ఉపయోగపడే తీరును తెలుసుకోవాలి. 2. ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై అవగాహన ఉండాలి. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో వాటి పాత్రను వివరించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కీలకమైన కంప్యూటర్ వినియోగం, రోబోటిక్స్, నానో టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి. 3. భారత అంతరిక్ష విధానంలో దేశంలో జరుగుతున్న కొత్త ఉపగ్రహ ప్రయోగా లు, కొత్త కార్యక్రమాలపై (చంద్రయాన్, ఎడ్యూశాట్ తదితర) అవగాహన పెంచుకోవాలి. 4. స్పేస్ టెక్నాలజీ సమాజాభివృద్ధికి దోహద పడుతున్న తీరుపై అధ్యయనం అవసరం. విద్య, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, వరదలు, తుపాను, సునామీ, వాతావరణ మార్పులు తదితరాలను తెలుసుకోవాలి. ఎ. వ్యవసాయ రంగంలో ఎలాంటి నూతన విధానాలు తీసుకురాగలుగుతున్నామన్నది చదువుకోవాలి. ఉపగ్రహ ప్రయోగాలతో రైతులకు ఉపయోగాలేమున్నాయి? తెలంగాణలో వాతావరణ పరిస్థితులేమిటి? ఇక్కడ ఏ టెక్నాలజీ ఉపయోగించాలి? ఎలాంటి పంటలు వే యొచ్చు? ఆధునిక వ్యవసాయ విధానాలేమిటి? ఏ పంటలు వేయాలి, ఏ పురుగు మందులు వినియోగించాలి వంటివాటిపై అవగాహన ఉండాలి. బి. మరో ప్రధానాంశం నీటి విధానం. తెలంగాణలో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సైన్స్ టెక్నాలజీ వల్ల మేలు చేయవచ్చన్నది విశ్లేషించాలి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటన్నది చెప్పాలి. సి. తుపానులు, సైక్లోన్లు, వరదలు ఎందుకు వస్తున్నాయి? వాతావరణంలో మార్పులేమిటి? వర్షాలు కురవాల్సిన సమయంలో ఎందుకు కురవడం లేదు? కారణాలేమిటి? సునామీ ప్రభావమేమిటి? ఎందుకొస్తోంది? ముందస్తు జాగ్రత్తలేం తీసుకోవచ్చు? ఇలాంటివి తెలుసుకోవాలి. వాతావరణ మార్పుల సమయంలో పంటల విధానం ఎలా ఉండాలన్నది చదువుకోవాలి. 5. జల, అణు శక్తి, వాటి వినయోగం, ప్రభుత్వ చర్యలను తెలుసుకోవాలి. బయో మాస్, వ్యర్థాల ఆధారిత ఇంధన వనరుల ఉత్పత్తి, సౌర, పవన విద్యుత్‌లపై దృష్టి పెట్టాలి. ప్రధానంగా వ్యవసాయ రంగ ఉప ఉత్పత్తులేమిటి? గ్యాస్ ఆధారిత పరిశ్రమల పరిస్థితేమిటి? గోబర్ గ్యాస్, వర్మి కంపోస్ట్ ఎరువులను ఎలా వాడుకోవాలి, వాటి ప్రయోజనాలేమిటన్నది తెలుసుకోవాలి. వనరుల విషయానికి వస్తే... పెట్రోల్ పరిస్థితేమిటి? పెట్రో వనరులు అయిపోతే ప్రత్యామ్నాయమేమిటి? సమస్యను ఎలా అధిగమించాలి? నైట్రోజన్ గ్యాస్ వస్తున్నందున దాని వినియోగమెలా? కంప్రెస్డ్ గ్యాస్ పరిస్థితేమిటన్న అంశాలపై దృష్టి పెట్టాలి. విద్యుత్తు వాడకం తగ్గించడానికి వాడుతున్న నియాన్ బల్బుల ప్రత్యేకతేమిటో తెలిసుండాలి. సౌర, పవన విద్యుత్‌పై పెట్టాల్సిన పెట్టుబడులు, ప్రయోజనాలేమిటన్నది విశ్లేషించాలి. శాస్త్ర విజ్ఞానంలో నూతన మార్పులు.. 1. సైన్స్‌లో ప్రాథమికాంశాల నుంచి తాజా పరిణామాల వరకు అవగాహన పెంచుకోవాలి. వ్యాధులు, టీకాలు, సరికొత్త వ్యాక్సిన్ ఆవిష్కరణలు తెలుసుకోవాలి. బ్యాక్టీరియా, వైరస్ల స్వభావం తెలియాలి. నివారణ చర్యలపైనా అవగాహన ఉండాలి.మొక్కలు, అటవీ కీటకాలు, ఔషధ మొక్కల వినియోగాన్ని విశ్లేషించాలి. ఔషధ మొక్కల ఉపయోగం, వాటి పెంపకం, అందులో జాగ్రత్తలను విశ్లేషించాలి. 2. బయో టెక్నాలజీకి సంబంధించి ఆహార భద్రత, ఆ దిశగా ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు, వాటి అమలు తీరు, డీ-ఫ్లోరినేషన్ వంటివాటిని తెలుసుకోవాలి. తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్య, కారణాలు, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఎందుకుంది వంటివాటిపై అవగాహన ఉండాలి. రాక్, సాయిల్ స్ట్రక్చర్ వల్ల ఇది వస్తుందన్న విషయం తెలియాలి. సమస్య నివారణకు ఏం చేయాలో సూచించగలగాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఇందుకెలా దోహదపడుతుందో విశ్లేషించాలి. రెజిన్స్ (ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఇనార్గానిక్ మాలిక్యూల్స్) ద్వారా ఫ్లోరోసిస్‌ను కాస్త తగ్గించవచ్చని, ఫ్లోరైడ్, హార్డ్ వాటర్‌ను తగ్గించవచ్చని అవగాహన పెంచుకోవాలి. సముద్ర జలాల్లో ఏముంటుంది, బావి నీటిలో, మినరల్ వాటర్‌లో ఏముంటాయన్న కనీస విషయాలు తెలియాలి. 3. బయో టెక్నాలజీ గురించి విస్తృతంగా అధ్యయనం చేయాలి. హ్యూమన్, ప్లాంట్, ఫార్మ్ బయో టెక్నాలజీల్లోని ముఖ్యాంశాలు, పూర్వాపరాలు తెలుసుకోవాలి. వ్యవసాయ రంగ అభివృద్ధిలో బయో టెక్నాలజీ పాత్రపై అధ్యయనం చేయాలి. బయో ఫెర్టిలైజర్ అంటే ఏమిటి, అదెలా పని చేస్తుంది. వ్యవసాయ అధికారుల సాయం ఎలా పొందాలన్న అంశాలను విశ్లేషించాలి. 4. నిత్యం జీవితంలో సైన్స్: వ్యాధులను తీసుకుంటే... డెంగీ జ్వరం ఎందుకొస్తోంది, దానిపై పరిశోధనలు ఏమున్నాయి, ఎలా నియంత్రించాలన్నది తెలియాలి. స్వైన్ ఫ్లూ, హెచ్ ఐవీ, రేబిస్, టీబీ, మలేరియా తదితరాల మౌలికాంశాలు కచ్చితంగా తెలిసుండాలి. గ్రూపు-2లో: గ్రూపు-2లో మొత్తం పది యూనిట్లున్నాయి. వాటిలో రెండు సైన్స్ టెక్నాలజీకి సంబంధించినవి. కాకపోతే గ్రూప్ 1 తరహాలో లోతైన విశ్లేషణ గ్రూప్-2, 3లకు అవసరం లేదు. ఏం చదవాలంటే... ఎన్ని రంగాలున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం. దీన్ని విస్మరిస్తే పురోగతి ఉండదు. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోవాలి. కానీ ఇది ఏవో నాలుగు పుస్తకాలు చదివితే రాదు. క్రమం తప్పకుండా పత్రికలు చదువుతుండాలి. 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ పుస్తకాలు చదవాలి. అంతేగాక పదజాలంపైనా పట్టు సాధించాలి. పరీక్షలో సాంకేతిక పదాలనే రాయాలి. లేదంటే మార్కులు సాధించడం కష్టం. వాటిని కచ్చితంగా చూస్తారు. -
కీలక పోస్టుల భర్తీ లేనట్లే!
* విభజన పూర్తయ్యే వరకూ ఆగిపోనున్న గ్రూప్-1 భర్తీ * విభాగాధిపతి కార్యాలయాల్లో ఖాళీల పరిస్థితీ అంతే.. * గ్రూప్-2, జోనల్, జిల్లా పోస్టుల భర్తీకి మాత్రం అవకాశాలు * అదీ ఉన్న రెండు జోన్లను యథాతథ ంగా కొనసాగిస్తేనే.. * లెక్చరర్ పోస్టుల భర్తీకి ‘క్రమబద్ధీకరణ’తో లింకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాల భర్తీలో మరింత ఆలస్యం తప్పేలా లేదు. పలు కేటగిరీలకు చెందిన జోనల్ పోస్టులు, జిల్లా స్థాయి ఉద్యోగాలు మినహా గ్రూప్-1, శాఖాధిపతుల కార్యాలయాల్లో పోస్టులు వంటివాటి భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉద్యోగుల విభజనలో భాగంగా రాష్ట్ర స్థాయి, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది విభజనను కమల్‌నాథన్ కమిటీ తేల్చాకే... ఆయా విభాగాల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఇక ఇంజనీర్లు, గ్రూప్-2 వంటి పోస్టుల భర్తీ అంశంలోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కీలకం. వీటికి సంబంధించి జోనల్ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలా? లేక జోన్లను పునర్విభజించాలా? అన్నదానిపై వాటి భర్తీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీ విషయం కూడా... కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. దీనిపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తీసుకోకపోతే జాప్యం తప్పదు. ఇక టీచర్ పోస్టుల వ్యవహారం పరిస్థితీ ఇంతే. 14 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించినా..వేసవిలో హేతుబద్ధీకరణతో వాటిల్లో ఎన్ని మిగులుతాయనేది సందేహమే. 20 శాఖల్లోనే ఆప్షన్లకు అవకాశం.. 127 ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు 20 శాఖల్లోని ఉద్యోగులు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశాన్ని కమిటీ కల్పించింది. ఇంకా 107 శాఖల ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించాల్సి ఉంది. ఆ తరువాత ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 1,07,774 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కమల్‌నాథన్ కమిటీ లెక్కలు వేసినా... పోస్టుల విభజన పూర్తయ్యాకే కేటగిరీల వారీగా ఖాళీలపై ప్రభుత్వానికి స్పష్టత రానుంది. కాంట్రాక్టు క్రమబద్ధీకరణతో లింకు.. లెక్చరర్ పోస్టుల భర్తీ అంశం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,377 డిగ్రీ లెక్చరర్, 3,173 జూనియర్ లెక్చరర్, 812 వొకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో... డెరైక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ వాటిని డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడితే... కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్థితి నెలకొంది. విభజనపై తేల్చేదెప్పుడు? కమల్‌నాథన్ కమిటీ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 127 శాఖల్లో 72 వేల పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం అందులో 52 వేల మంది రాష్ట్రస్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది తెలంగాణ వారు ఏపీ ప్రభుత్వంలో, ఏపీ వారు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వారందరి పంపకం పూర్తయ్యే వరకు గ్రూప్-1లోని వివిధ కేటగిరీలు, అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల మొత్తం ఖాళీల సంఖ్య తేలే అవకాశం లేదు. అప్పటిదాకా ఎన్ని పోస్టులను భర్తీ చేయాలన్న దానిపై స్పష్టత రాదు. అసలు ఈ విభజనకు ఎంత సమయం పడుతుందనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. జోన్లను యథాతథంగా కొనసాగిస్తేనే.. రాష్ట్ర పరిధిలో ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను యథాతథంగా కొనసాగిస్తే మాత్రం గ్రూప్-2, ఇంజనీర్లు వంటి జోనల్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ కోసం ఐదు వేలకుపైగా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తోంది. వాటికి కూడా ప్రస్తుత జోన్ల విధానాన్ని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం జోన్ల పునర్వ్యవస్థీకరణ దిశగా యోచిస్తే వాటి భర్తీకి అడ్డంకులు తప్పవు. ఏపీలో 13 జిల్లాలకు 4 జోన్లు ఉండగా, తెలంగాణలో పది జిల్లాలకు రెండే జోన్లు ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల్లో కూడా జోన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపైనే గ్రూప్-2, ఇంజనీఇర్ వంటి పోస్టుల భర్తీ ఆధారపడి ఉంది. ఇక జిల్లా స్థాయి పోస్టుల భర్తీపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఇక ఒకే ఒక్కటి
* అన్ని ఉద్యోగాల భర్తీ బాధ్యతా టీఎస్పీఎస్సీదే * కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 వరకు నియామకాలు * ఉపాధ్యాయ పోస్టులు కూడా కమిషన్ చేతుల్లోకి.. * ఇతర నియామక సంస్థల రద్దు లేదా టీఎస్పీఎస్సీ పరిధిలోకి.. * కేరళలోని విధానం అమలుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి * త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం * ఇప్పటికే కమిషన్‌కు సమాచారమిచ్చిన అధికారులు సాక్షి, హైదరాబాద్: పోలీస్, ఉపాధ్యాయ పోస్టులతో సహా అన్ని రకాల నియామకాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ద్వారానే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగబద్ధమైన సంస్థనే పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తోంది. కేరళలో అనుసరిస్తున్న ఈ విధానాన్నే రాష్ర్టంలోనూ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో ప్రస్తుతమున్న లక్షకుపైగా ఖాళీలను భర్తీ చేసే బాధ్యతను టీఎస్పీఎస్సీకే అప్పగించే అవకాశముంది. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల భర్తీని జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లు చేస్తుండగా, కానిస్టేబుల్, ఎసై్స వంటి పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపడుతోంది. మరికొన్ని శాఖలు సొంతంగానే నియామకాలు చేసుకుంటున్నాయి. వీఆర్ఏ/వీఆర్వో వంటి పలు నియామక పరీక్షలను రెవెన్యూ శాఖ నిర్వహిస్తుండగా.. ఫారెస్టు బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వంటి పోస్టుల భర్తీ అటవీ శాఖ నేతృత్వంలోనే జరుగుతోంది. ఇలా పలు శాఖలు వేర్వేరుగా నియామకాలు చేపడుతుండటంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, లెక్చరర్, ఇంజ నీర్ వంటి కొన్ని రకాల పోస్టుల భర్తీకే కమిషన్ పరిమితమవుతోంది. రాజ్యాంగబద్ధమైన సంస్థ ను వదిలేసి ప్రభుత్వ శాఖలే సొంతంగా నియామకాలు చేపట్టడం సరికాదన్న భావన ప్రభుత్వవర్గాల్లో నెలకొంది. అందుకే అన్ని రకాల నియామకాలను కొత్తగా ఏర్పడిన టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలోనే చేపట్టే అంశంపై తాజాగా దృష్టి సారించింది. దీన్ని అమలు చేస్తే, ప్రస్తుతమున్న పోలీస్ బోర్డు వంటి అన్ని రకాల నియామక సంస్థలను పూర్తిగా రద్దు చేయాలా? లేక వాటిని సర్వీస్ కమిషన్ పరిధిలోకి తీసుకురావాలా అన్న అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీకి ప్రభుత్వం తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం కమిషన్ తొలి సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా పలు అంశాలపై చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు సి.విఠల్, బానోతు చంద్రావతి చర్చించారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. వేర్వేరుగా నియామకాలతో తలనొప్పి ఎక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీ జరిగే విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాలను గతంలో పబ్లిక్ సర్వీసు కమిషనే చేపట్టింది. తర్వాత ఈ బాధ్యతను విద్యాశాఖ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) కన్వీనర్‌గా జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ)లను ఏర్పాటు చేసి ఉపాధ్యాయ నియామకాలను చేపడుతున్నారు. అయితే ఈ ప్రక్రియ విద్యాశాఖకు తలనొప్పి వ్యవహారంగా మారింది. తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. అదీ జిల్లాల్లోని సిబ్బంది నేతృత్వంలోనే జరగాల్సిరావడంతో పనిభారం తీవ్రమైంది. నిబంధనలు, రిజర్వేషన్లు, రోస్టర్ విధానంపై డీఈవోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓపెన్ కోటా పోస్టులను లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉన్నా.. మొత్తంగా నాన్‌లోకల్ అభ్యర్థులతోనే భర్తీ చేసిన సందర్భాలు ఉన్నాయి. పైగా ఈ పని ఒత్తిడి వల్ల డీఈవోలకు పాఠశాలలను పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతలను సర్వీస్ కమిషన్‌కే అప్పగించేందుకు విద్యాశాఖ సుముఖంగా ఉంది. మిగతా శాఖల పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కాగా, కార్పొరేషన్ల పరిధిలోని పోస్టుల భర్తీని కూడా టీఎస్పీఎస్సీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా పారదర్శకంగా నియామకాలు చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తోంది. రాష్ర్టంలో ప్రస్తుతమున్న ఖాళీలు పాఠశాల విద్యాశాఖ-24,861, ఉన్నత విద్యాశాఖ-10,592, హోంశాఖ-15,339, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ-11,834, రెవెన్యూ-10,142, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ-7,193, మహిళ, శిశు సంక్షేమ శాఖ-5,074, సాంఘిక సంక్షేమ శాఖ-3,376, నీటిపారుదల, ఆయక ట్టు అభివృద్ధి సంస్థ-2,584, వ్యవసాయ సహకార శాఖ-2,164, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ-2,759, పశుసంవర్థక శాఖ-1,761, ఆర్థిక శాఖ- 1,330, బీసీ సంక్షేమ శాఖ-748, రోడ్లు భవనాల శాఖ - 891, సాధారణ పరిపాలన శాఖ -710, వాణిజ్య, పరిశ్రమలు-383, ఐటీ శాఖ-192, సీఎఎఫ్-419, ఈఎఫ్ఎస్అండ్టీ-2,777, ఇంధన శాఖ-19, గృహ నిర్మాణ శాఖ-6, ఐ అండ్ ఐ-1, న్యాయ శాఖ-196, లెజిస్లేటివ్ సెక్రటేరియట్-227, ఎల్ఈటీ అండ్ ఎఫ్- 1,493, మైనారిటీ సంక్షేమ శాఖ-48, ప్లానింగ్-247, యువజన, పర్యాటక శాఖ-367, పబ్లిక్ ఎంటర్‌ప్రజైస్-7, రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్-4. -
పరిధి విస్తృతం.. స్కోరింగ్ సులభం
గ్రూప్-1,2 వంటి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో ముఖ్యమైన భాగం.. చరిత్ర. ఏ నేపథ్యం నుంచి వచ్చిన అభ్యర్థికైనా చక్కని స్కోరు సాధించడానికి ఈ సబ్జెక్టు తోడ్పడుతుంది. ఇతర సబ్జెక్ట్లతో పోల్చితే సిలబస్ పరిధి కొంచెం విస్తృతం.. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇందులోని అంశాలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి.. కాబట్టి కొద్దిగా శ్రమిస్తే చరిత్రలో మెరుగైన మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.. ఈ క్రమంలో చరిత్రకు సంబంధించి ముఖ్యాంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై సూచనలు... కె. యాకూబ్ బాష, సీనియర్ ఫ్యాకల్టీ. జనరల్ స్టడీస్‌లో చరిత్రలో భాగంగా ఇండియన్ హిస్టరీ నుంచి అత్యధికంగా ప్రశ్నలు వస్తాయి. రాజులు, వంశాలు, సాంఘిక-ఆర్థిక పరిస్థితులు, సామాజిక ఉద్యమాలు వంటి అంశాలు ప్రధాన నేపథ్యంగా ప్రశ్నలు అడుగుతుంటారు. దాదాపుగా ప్రశ్నలన్నీ అభ్యర్థుల అవగాహనను పరీక్షిస్తాయి. కాబట్టి సంబంధిత అంశాలను క్షుణ్నంగా చదవడం ప్రయోజనకరం. రెండు రకాల ప్రశ్నలు చరిత్రలో సాధారణంగా రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు. అవి.. నేరుగా అడిగే ప్రశ్నలు-వీటిని ఏక పద సమాధాన ప్రశ్నలు లేదా ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్నలుగా వ్యవహరిస్తారు. ఉదాహరణ-నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడెవరు? (సమాధానం- కుమారగుప్తుడు). ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే విషయ పరిజ్ఞానం సరిపోతుంది. ఇన్‌డెరైక్ట్ ప్రశ్నలు- వీటిని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అంటారు. ఉదాహరణకు-జూన్ 3, 1947 మౌంట్ బాటన్ ప్రణాళికలో లేని అంశం? 1) సమాఖ్య ఫ్రభుత్వ నిర్మాణం 2) రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు 3) {బిటిషర్ల నుంచి భారతీయులకు అధికార మార్పిడి 4) దేశంలో జరుగుతున్న మత ఘర్షణలను నిరోధించడం సమాధానం: 4. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఉండాలి. సరళి మారుతోంది హిస్టరీ నుంచి దాదాపుగా 20-30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ప్రశ్నల సరళి కూడా క్రమంగా మారుతోంది. కాబట్టి ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనను ఏర్పర్చుకోవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై స్పష్టత వస్తుంది. అంతేకాకుండా పునరావృతం అవుతున్న ప్రశ్నలను ఏయే అంశాల నుంచి ఏ కోణంలో అడుగుతున్నారనే విషయం అవగతమవుతుంది. దానికి అనుగుణంగా సంబంధిత అంశంపై సినాప్సిస్ రూపొందించుకోవాలి. తద్వారా అంశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రిపరేషన్ సాగించవచ్చు. మిగతా అంశాలపై కనీస అవగాహన స్థాయిని చేరుకుంటే తక్కువ సమయంలోనే మెరుగైన మార్కులు సాధించవచ్చు. తప్పనిసరిగా భారతదేశ చరిత్రలో కొన్ని చాప్టర్ల నుంచి ప్రతి పరీక్షలో ఏదో ఒక ప్రశ్నను తప్పనిసరిగా అడుగుతూనే ఉంటారు. ఉదాహరణకు-వైదిక నాగరికత, బౌద్ధ మతం, ఢిల్లీ సూల్తాన్లు, మొగలులు, స్వాతంత్రోద్యమం తదితరాలు. కాబట్టి ఈ అంశాలను సమయానుకూలంగా పునశ్చరణ చేయడం తప్పనిసరి. అంతేకాకుండా అభ్యర్థులు రిమోట్ ఏరియాస్గా భావించే అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. ఉదాహరణకు - మొదటిసారి వడ్డీ వ్యాపారం గురించి ప్రస్తావిస్తున్న గ్రంథం? (శతపత బ్రాహ్మణం). కాబట్టి ఇలాంటి అంశాలపైనా కూడా దృష్టి సారించాలి. గమనించాల్సిన విషయం నాన్ ఆర్ట్స్ అభ్యర్థులు చరిత్ర విషయంలో కొంత ఆందోళనతో ఉంటారు. వంశాల పేర్లు, రాజులు, రాజధానులు, సంవత్సరాలు వంటి వాటి విషయాలను గుర్తుంచుకోవడాన్ని క్లిష్టంగా భావిస్తుంటారు. కానీ గమనించాల్సిన విషయం.. ఈ మధ్య నిర్వహించిన కొన్ని పరీక్షలను పరిశీలిస్తే ఈ అంశాల నుంచి అడిగిన ప్రశ్నలు అతి స్వల్పం మాత్రమే. ఒకవేళ వచ్చినా గతంలో అడిగిన ప్రశ్నల్లోంచి అధిక శాతం ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. అంతేకాకుండా అధిక శాతం ప్రశ్నలు సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక అంశాల ఆధారంగా ఉంటున్నాయి. ఉదాహరణ-మొగల్ వంశస్థాపకుడెవరు? గుప్త వంశంలో ప్రముఖ రాజెవరు? వంటి ప్రశ్నలు గతంలో వచ్చేవి. ప్రస్తుతం బాబర్ రాసిన గ్రంథం? దాన్ని ఏ భాషలో రచించారు? గుప్తుల ఆస్థానంలోని నవరత్నాల్లో లేని వారెవరు? వంటి ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఆయా అంశాలను చదివేటప్పుడు.. మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక అంశానికి సంబంధించి నేపథ్యం మొదలు విస్తృతమైన అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల సబ్జెక్ట్‌పై పట్టు సాధించే అవకాశం లభిస్తుంది. ఇలా చదవాలి బిట్స్ రూపంలోని మెటీరియల్‌ను కాకుండా విషయంపై పూర్తి అవగాహనను కలిగించే లోతైన అధ్యయనానికి ఆస్కారముండే ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్‌కు ఎంచుకోవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడు దాన్నుంచి ఏయే కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో అంచనా వేసుకుంటూ చదవడం ప్రయోజనకరం. మూడు భాగాలుగా భారతదేశ చరిత్రను ప్రధానంగా మూడు భాగాలుగా విభజించుకోవాలి. అవి.. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మూడు యుగాల (ప్రాచీన, మధ్య, ఆధునిక)కు సమ ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర ఈ విభాగంలో ముఖ్యాంశాలు-సింధు నాగరికత, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులు, హర్ష సామాజ్య్రం మొదలైనవి. ఇందులో సింధు, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు.. భారతీయ బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోకి అనువదించిన భారతీయ బౌద్ధ మతాచార్యుడెవరు? 1) కశ్యప మాతంగుడు 2) ఆచార్య నాగార్జునుడు 3) ఆర్య అసంగుడు 4) ధర్మ కీర్తి సమాధానం: 2 కింది వాటిలో దాదాపుగా హరప్పా ముద్రికలన్నింటిపై ముద్రించిన జంతువు? 1) ఏక సింఘ 2) ఏనుగు 3) ఖడ్గమృగం 4) పులి సమాధానం: 1 వాసుదేవ కృష్ణునికి సమీప బంధువు కూడా అయిన జైన తీర్థంకరుడెవరు? 1) రుషభనాథుడు 2) పార్శ్వనాథుడు 3) నేమినాథుడు 4) మహావీరుడు సమాధానం: 3 మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఏ నెల నుంచి ప్రారంభమవుతుంది? 1) ఫాల్గుణం 2) ఆషాఢం 3) జ్యేష్టం 4) మాఘం సమాధానం: 2 కింది వాటిలో అత్యధిక సంఖ్యలో రోమన్ నాణేలు బయటపడిన ప్రాంతం? 1) కేరళ 2) ఆంధ్ర 3) తమిళనాడు 4) కర్ణాటక సమాధానం: 3 మధ్య యుగ భారతదేశ చరిత్ర ఈ యుగం హర్షుని అనంతర కాలం నుంచి ప్రారంభమవుతుంది. ఢిల్లీ సుల్తానులు, రాజపుత్ర రాజ్యాలు, చోళులు, చాళుక్యులు, విజయనగర సామాజ్య్రం, మొగలులు, మరాఠాలు తదితరాలు ఈ విభాగంలోని ముఖ్యాంశాలు. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు.. దక్షిణ భారతదేశంలో భూ దానాల వల్ల అత్యధికంగా లబ్ధి పొందిన వారెవరు? 1) సైనికులు, అధికారులు 2) బ్రాహ్మణులు 3) దేవాలయాలు 4) 2, 3 సమాధానం: 4 మహ్మద్ ఘోరీ తొలిసారిగా భారతదేశంపై దండెత్తిన ప్రాంతం? 1) గుజరాత్ 2) పంజాబ్ 3) సింధ్ 4) ముల్తాన్ సమాధానం: 3 మంగోలుల దాడులను అత్యధికంగా ఎదుర్కొన్న ఢిల్లీ సుల్తాన్? 1) ఫిరోజ్‌షా తుగ్లక్ 2) మహ్మద్ బిన్తుగ్లక్ 3) అల్లాఉద్దీన్ ఖిల్జీ 4) బాల్బన్ సమాధానం: 2 విజయనగర సామాజ్య్ర నిర్మాణంలో భాగంగా భావించే వ్యక్తి (కింది వారిలో)? 1) మాధవాచార్యులు 2) మాధవ విద్యారణ్యులు 3) సాయనాచార్యులు 4) వ్యాసరామాచార్యులు సమాధానం: 2 అక్బర్‌ను ఇస్లాం వ్యతిరేకి అని దూషించిన సమకాలీన చరిత్రకారుడెవరు? 1) అబ్బాస్ ఖాన్ షేర్వాణి 2) నిజాముద్దీన్ అహ్మద్ 3) అబ్దుల్ హమీద్ లాహోరి 4) బదౌని సమాధానం: 4 ఆధునిక భారతదేశ చరిత్ర క్రీ.శ. 1707 నుంచి 1947 వరకు గల కాలాన్ని ఆధునిక భారతదేశ చరిత్రగా చదవాలి. ఔరంగజేబు మరణించిన సంవత్సరం (1707) నుంచి ఈ యుగం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చివరి మొగల్ రాజులు, బ్రిటషర్ల రాక, భారతదేశ ఆక్రమణ, వారి పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు-ఉద్యమాలు, సామాజిక మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం, గవర్నర్ జనరల్‌లు, వైస్రాయ్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. మిగతా విభాగాల కంటే ఈ అంశం నుంచే ప్రశ్నలు అధికంగా అడిగే అవకాశం ఉంది. ఈ అంశాల నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలు.. శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి గత ఉద్యమాల కంటే భిన్నమైన అంశం? 1) రైతులు పాల్గొనడం 2) విద్యార్థులు పాల్గొనడం 3) వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొనడం 4) మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సమాధానం: 4 1928లో హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు? 1) లాహోర్ 2) ఢిల్లీ 3) అలహాబాద్ 4) కాన్పూర్ సమాధానం: 2 స్వదేశీ ఉద్యమాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారెవరు? 1) లాలాలజపతిరాయ్ 2) బిపిన్‌చంద్రపాల్ 3) బాలగంగాధర్ తిలక్ 4) అరబిందోఘోష్ సమాధానం: 3 భారతదేశంలో మహిళా ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా వీరిని భావించవచ్చు? 1) రాందేవ్ 2) సరోజినీనాయుడు 3) అనిబిసెంట్ 4) విజయలక్ష్మి పండిట్ సమాధానం: 1 భారతీ జాతీయ కాంగ్రెస్‌లో రెండో చీలికకు కారణం? 1) 1916 లక్నో ఒప్పందం 2) 1918 మాంటెగ్ ప్రకటన 3) అనిబిసెంట్ ఐఎన్‌సీ అధ్యక్షురాలిగా ఎన్నికవటం (1917) 4) 2, 3 సమాధానం: 2 {బిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మారు పేరు? 1) జాబ్ భార్నగ్ కంపెనీ 2) లండన్ వ్యాపారుల కంపెనీ 3) జాన్ కంపెనీ 4) జేమ్స్ కంపెనీ సమాధానం: 3 రాబర్ట్ క్లైవ్ జాకెట్‌గా ఏవరిని వర్ణించారు? 1) ఓమిచంద్ 2)మాణిక్ చంద్ 3) మీర్ జాఫర్ 4) సిరాజుద్దౌలా సమాధానం: 3 విక్టోరియా రాణి ప్రకటన చేసిన సంవత్సరం? 1) 1848, డిసెంబర్ 2) 1858, నవంబర్ 3) 1940, ఆగస్ట్ 4) 1930, ఆగస్ట్ సమాధానం: 2 -
ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?!
తప్పులుచేస్తూ పోవడంలో తన రికార్డులను తానే తిరగరాసుకునే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వాకంవల్ల రెండేళ్లక్రితం నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష వ్యవహారం మొదటికొచ్చింది. 2011లో మొదలుపెట్టి కొనసాగించిన ఈ ప్రక్రియ సరిగా లేదని అభిప్రాయపడి తిరిగి మెయిన్స్ పరీక్ష, అందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించాలని సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అన్నీ పూర్తయి పోస్టింగ్‌లకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులందరికీ ఇది నిరాశకలిగించేదే అయినా ఏపీపీఎస్సీ నిర్వాకంవల్ల సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయానికి రాకతప్పలేదు. నిరుడు మే 27న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు లక్షన్నరమంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ పరీక్షకోసం ఇచ్చిన ప్రశ్నపత్రం కీలో 13 ప్రశ్నలకిచ్చిన సమాధానాలు సరిగా లేవని అభ్యర్థులు అప్పట్లోనే గుర్తించి వాటిని ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకొచ్చారు. అయితే, అందులో ఏడింటిని మాత్రమే తొలగించి, మిగిలిన ఆరూ సరైనవేనని సంస్థ నిర్ధారణకొచ్చింది. వీటిని కూడా తొలగించాకే ప్రిలిమ్స్ ఉత్తీర్ణతను నిర్ధారించాలన్న అభ్యర్థుల డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. దాంతో కొందరు రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అటుతర్వాత హైకోర్టుకు వెళ్లారు. ఇరుపక్షాల వాదనలనూ విని పరిష్కారం కనుగొనాలని రాష్ట్ర హైకోర్టు యూపీఎస్సీని ఆదేశిస్తూ ఇచ్చిన ఆదేశాలను ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈలోగా మెయిన్స్‌ను నిర్వహించడంతోపాటు అందులో ఉత్తీర్ణత సాధించినవారికి ఇంటర్వ్యూలు కూడా పూర్తిచేసింది. ప్రిలిమ్స్‌లో వచ్చిన తప్పులగురించి చెప్పినప్పుడే ఏపీపీఎస్సీ ప్రతిష్టకు పోకుండా వాటిని తొలగించి ఉంటే నిరుద్యోగులకు ఈ అవస్థ వచ్చేది కాదు. మీరు నిర్వహించిన పరీక్ష లోపభూయిష్టంగా ఉన్నదని అభ్యర్థులు చెప్పిన ప్రతిసారీ సంస్థ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు తొలగించడానికి ససేమిరా ఇష్టపడని ఆరు ప్రశ్నలనూ చూస్తే దాని అజ్ఞానం ఏస్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. ఇది కేవలం గ్రూప్-1 పరీక్షలకు పరిమితమైనదే కాదు. అన్ని పరీక్షల నిర్వహణా ఇలాగే ఉంటోంది. చెప్పిన మాట వినకపోవడం, కోర్టుల్లో కేసులు పడినప్పుడు వాటిని ఎలాగైనా గెలవాలనుకోవడం తప్ప... తనవైపు జరిగిందేమిటో సమీక్షించుకోక పోవడం ఏపీపీఎస్సీకి అలవాటైపోయింది. అది ఏ పరీక్ష అనేదానితో నిమిత్తంలేదు. తప్పులు తప్పనిసరిగా రావాల్సిందే. 8 నెలలక్రితం పాలిటెక్నిక్ లెక్చెరర్ల పరీక్షకు ఇచ్చిన ప్రశ్న పత్రంలో ఒక గైడ్లోని ప్రశ్నలను యధాతథంగా వరసక్రమం కూడా మార్చకుండా దించిన వైనాన్ని ‘సాక్షి’ అప్పట్లో బయటపెట్టింది. జూనియర్ అకౌంటెంట్ గ్రేడ్-4 పోస్టుల భర్తీకి జరిపే పరీక్షలు, మునిసిపల్ అకౌంట్స్ విభాగంలో అకౌంట్స్ అధికారి రాత పరీక్షలు...ఏవైనా ఒకటే రకం ప్రశ్నలివ్వడం, కీలు మాత్రం వేర్వేరుగా నిర్ణయించి జవాబుపత్రాలను దిద్దడం రివాజైపోయింది. ఒక పరీక్షకైతే అసలు కీయే విడుదలచేయకపోవడంతో అనుమానంవచ్చిన అభ్యర్థులు ఆర్టీఐ ద్వారా దాన్ని సంపాదించారు. తీరాచూస్తే అందులోని 80శాతం జవాబులు పూర్తిగా తప్పుల తడకలేనని వెల్లడైంది. తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు వీటితోపాటు అదనపు ఇక్కట్లు తప్పడంలేదు. ఇంగ్లిష్‌లో అడిగే ప్రశ్నలకు తెలుగు అనువాదం దోషభూయిష్టంగా ఉండటం, తీరా దానినిబట్టి జవాబురాస్తే మార్కులు తెగ్గోయడం మామూలైపోయింది. బంగారు భవిష్యత్తును ఆశించి, జీవితంలో స్థిరపడదామని భావించి ప్రవేశపరీక్షల్లో ఎంపిక కావడంకోసం లక్షలమంది నిరుద్యోగులు అప్పో సప్పోచేసి నగరాలకు వస్తున్నారు. వారంతా ఏదో శిక్షణా సంస్థకు వేలాది రూపాయలు చెల్లించి రాత్రింబగళ్లు చదువుకుంటున్నారు. అలాంటివారందరినీ తన చర్యలతో ఏపీపీఎస్సీ దగా చేస్తున్నది. ఎప్పుడైనా తప్పులు దొర్లితే మానవసహజమని భావించి ఊరుకోవచ్చు. కనీసం చేసిన తప్పులు చేయకుండా ఉంటే తగిన స్థాయిలో పర్యవేక్షణ ఉంటున్నది... ఇకపై జాగ్రత్తలు తీసుకుంటారులేనన్న భరోసాతో ఉండవచ్చు. కానీ, పదే పదే అవే తప్పులు జరుగుతుంటే, చెవినిల్లు కట్టుకొని పోరినా వినకపోతుంటే ఏమనాలి? అవతలి అభ్యర్థికంటే ఒక్క మార్కు తక్కువొస్తే అభ్యర్థికి ఉద్యోగావకాశం చేజారిపోతుంటే...ఏకంగా 13 ప్రశ్నలు తప్పుల తడకగా ఉండటం, అందులో ఏడింటిని మాత్రమే గుర్తించి సరిచేస్తామనడం ఏం న్యాయం? ఏపీపీఎస్సీ కాస్త సున్నితంగా ఆలోచించివుంటే అభ్యర్థులకు ఇన్ని ఇక్కట్లు తప్పేవి. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఏపీపీఎస్సీ చేసిన వాదన కూడా వింతగా ఉంది. సవాల్ చేసినవారు ఇద్దరు అభ్యర్థులే గనుక వారిద్దరికీ తాము న్యాయం చేస్తామని... మొత్తం ప్రక్రియ పూర్తయింది గనుక ఈ దశలో మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశించవద్దని సంస్థ కోరడం విడ్డూరం. వివాదంలోని హేతుబద్ధతను గమనించి తనను తాను సరిచేసుకోవడం ఒక పద్ధతి. కనీసం సమస్య కోర్టు ముందుకు వెళ్లినప్పుడు ఇక ఆ ప్రక్రియను అక్కడితో నిలిపి, ఆ కేసును త్వరగా తెమల్చడానికి తనవైపుగా చేయాల్సినవి చేయడం మరో పద్ధతి. కానీ, ఈ రెండింటినీ కాదని ఏమీ పట్టనట్టుగా తన పని తాను చేసుకుపోవడం ఏపీపీఎస్సీకే చెల్లింది. ఏళ్ల తరబడి నిరీక్షించగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని నిరుద్యోగులు నానాకష్టాలూ పడుతుంటే ఏపీపీఎస్సీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వోద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం దశాబ్దాలుగా పరీక్షలు, ఇంటర్వ్యూలూ నిర్వహించే ఏపీపీఎస్సీ... ప్రతిసారీ అనుభవలేమినే ప్రదర్శిస్తోంది. ఎంతో పారదర్శకంగా, కర్తవ్య నిష్టతో, బాధ్యతగా నిర్వర్తించాల్సిన పనిని యాంత్రికంగా, యధాలాపంగా చేస్తున్నామని... దానివల్ల లక్షల మంది అన్యాయమైపోతున్నారని ఏపీపీఎస్సీ ఇకనైనా గుర్తించాలి. తన లోపాలను గుర్తెరిగి సరిచేసుకోవాలి.