AP: గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల | Andhra Pradesh APPSC Group 1 2024 Prelims Results Released, Check Results Download Link Inside - Sakshi
Sakshi News home page

APPSC Group 1 Prelims Results: ఏపీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

Published Sat, Apr 13 2024 7:02 AM | Last Updated on Sat, Apr 13 2024 1:17 PM

Andhra Pradesh: APPSC Group 1 2024 Prelims Results Released - Sakshi

ఎన్టీఆర్‌,  సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్‌ నిర్వహించిన ఏపీపీఎస్సీ.. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. గ్రూప్ వన్‌కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 

కిందటి ఏడాది డిసెంబర్‌ 08వ తేదీన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 Group 1 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ 02, 09 తేదీల మధ్య మెయిన్స్‌ పరీక్ష  నిర్వహించే అవకాశం ఉందని ప్రెస్‌ నోట్‌లో ఏపీపీఎస్సీ పేర్కొంది.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

పోస్టుల వివరాలివే..
ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9; ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18; డీఎస్పీ (సివిల్‌) 26; రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6; కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌,  జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement