
విజయవాడ: ఏపీ పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో సీఐడీ చీఫ్ గా ఉన్న వినీత్ బ్రిజ్ లాల్ డిప్యూటేషన్ పై సీఆర్పీఎఫ్ ఐజీగా వెళ్లనున్నారు. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజలాల్ కేంద్ర సర్వీస్ లకు రిలీవ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లపాటు కేంద్ర సర్వీస్ లో ఉండనున్నారు వినీత్ బ్రిజ్ లాల్.
ప్రస్తుతం ఏపీలో సీఐడీ చీప్ తో పాటు కాకినాడ పోర్టు రేషన్ బియ్యం సిట్ కి చీఫ్ గా ఉన్నారు వినీత్ బ్రిజ్ లాల్. ముక్కుసూటి అధికారిగా గుర్తింపు ఉన్న వినీత్.. కొద్ది నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలోని రెడ్ బుక్ అక్రమ కేసులపై వినీత్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నుండి వెళ్లిపోవానలి నిర్ణయించుకున్న వినీత్.. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న వినీత్ కు డిప్యూటేషన్ పై సీఆర్పీఎష్ ఐజీగా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతి లభించింది.