CID Chief
-
ముఖ్యమంత్రి సమోసాలు ఎవరు తీసుకున్నారు?.. సీఐడీ దర్యాప్తు
‘నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నేనొచ్చిన కార్యక్రమానికి నాకు సమోసాలు పెట్టకుండా.. నా సిబ్బందికి పెడతారా? వెంటనే ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారెవరో గుర్తించి, కఠిన చర్యలు తీసుకోండి’ అని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమోస స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 21న హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు సీఐడీ సైబర్ వింగ్ స్టేషన్ క్వార్టర్స్ ప్రారంభించేందుకు వెళ్లారు. సీఎం సుక్కు పర్యటన రాక నేపథ్యంలో ఐజీ ర్యాంక్ అధికారి.. సీఎం వస్తున్నారు. వెంటనే స్నాక్స్ ఏర్పాటు చేయండి అంటూ ఎస్సైని ఆదేశించారు. దీంతో సదరు ఎస్సై (సమోసాలు సీఎం కోసమని చెప్పకుండా) .. తన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), హెడ్ కానిస్టేబుల్‌ను సమోసాలు తీసుకుని రావాలని పురమాయించారు. ఎస్సై ఆదేశాలతో ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థానిక లక్కర్ బజార్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి మూడు పెట్టెల సమోసాలను తీసుకొచ్చారు. సీఎం సుక్కు కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడే ఉన్న ఏఎస్సై, కానిస్టేబుల్ తెచ్చిన సమోసాల్ని పక్కనే ఉన్న మహిళా ఎస్సైకి అందించారు. స్నాక్స్ పెట్టాలని కోరారు. మహిళా ఎస్సై ఆ సమోసాలను సీఎం కోసం తెచ్చినవే అని తెలియక బదులుగా సీఎం సిబ్బందిలోని మెకానికల్ ట్రాన్స్పోర్ట్ (ఎంటీ) విభాగానికి పంపించారు. ఆ విభాగంలోని ఉద్యోగులే ఆ సమోసాల్ని తిన్నారు.మీటింగ్‌లో ఉన్న సీఎంతోపాటు, సీఐడీ బాస్, ఇతర ఉన్నతాధికారులు ఆకలితోనే వెనుదిరిగారు. అధికారుల తీరుపై సీఎంతో పాటు సీఐడీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశాలకు జారీ చేశారు. -
‘నాపై పోక్సో కేసు కొట్టేయండి’.. హైకోర్టుకు మాజీ సీఎం యడ్యూరప్ప
సాక్షి,బెంగళూరు : లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడ్యూరప్పకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో తనపై పోక్స్ చట్టం కింద కేసు నమోదైందని, ఆ కేసును కొట్టి వేయాలని కోరుతూ యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ, ఆమె కుమార్తె ఇద్దరూ డాలర్స్ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసానికి వెళ్లారు. అక్కడ తన కుమార్తెను యడ్యూరప్ప లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేస్తూ ఓ మహిళ మార్చి నెలలో సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గంటల వ్యవధిలో కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ఆ కేసును విచారణ నిమిత్తం సీఐడికి బదిలీ చేశారు.జూన్ 17న సీఐడీ అధికారులు యడ్యూరప్పను మూడు గంటల పాటు విచారించారు. పోక్స్ కేసు నమోదు చేశారు. ఆ కేసుపై మాజీ సీఎం స్పందిస్తూ ‘నాపై కుట్రలకు పాల్పడే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని’ ఆయన అన్నారు.తాజాగా,ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగడం లేదని బాధితురాలి కుటుంబసభ్యులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో యడ్యూరప్ప కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.ఆ రెండు పిటిషన్లపై ఇవాళ కోర్టులో విచారణకు రానున్నాయి.అనూహ్యంగా గురువారం సాయంత్రం సీఐడీ యడ్యురప్పపై 750 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో తనపై నమోదు చేసిన పోక్స్ కేసును కొట్టి వేయాలని కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
‘ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది నేర దర్యాప్తు సంస్థ(Crime Investigation Department..సీఐడీ). ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. ‘‘సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు. ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయి. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టాం’’ అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయి. అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నాం. ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారాయన. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నాం అని సంజయ్ తెలిపారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? గత ఏడాది 1450 పోస్టులు.. ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించాం. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వీరి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడం. ప్రతిపక్షాలపై అసభ్యకర పోస్టులపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ విధంగా 45 తప్పుడు పోస్టులని గుర్తించాం. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తాం. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించాం. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపాం. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టాం. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దు’’ అని సీఐడీ సూచించింది. సోషల్ మీడియా అకౌంట్స్‌ను వ్యక్తిగత దూషణలకు వినియోగించొద్దు. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్‌లు 19 మందికి నోటీసులు ఇచ్చాం. ఇందులో బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చాం. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశాం. సీఎం, ఆయన కుటుంబ సభ్యులని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న అకౌంట్లని గుర్తించాం. సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకరమెసేజ్‌లు పెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. -
తెలంగాణ సీఐడీ చీఫ్ కారు బోల్తా.. భార్య దుర్మరణం
-
రోడ్డు ప్రమాదానికి గురైన తెలంగాణ సీఐడీ చీఫ్, భార్య మృతి
జైపూర్: రాజస్తాన్‌లో తెలంగాణ సీఐడీ డీజీపీ గోవింద్ సింగ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జైసల్మేర్ జిల్లాలోని తనోత్ మాత ఆలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా.. రాంఘర్-టానోట్ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న మహీంద్రా కారు బొల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గోవింద్ సింగ్ భార్య షీలా సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గోవింద్ సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జవహర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోవింద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. రాజస్థాన్ లోని రాంఘర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐడీ. విభాగం చీఫ్ గోవింద్ సింగ్ సతీమణి మరణించడంపై డీజీపీ మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న తమ సహచర సీనియర్ అధికారి గోవింద్ సింగ్ త్వరితగతిన కోలుకోవాలని డీజీపీ ఆకాంక్షించారు. చదవండి: బీజేపీ షోకాజ్ నోటీసుకు రాజాసింగ్ సమాధానం.. ఏమన్నారంటే! -
గోరంట్ల మాధవ్ వీడియోపై టీడీపీ నివేదిక నిజం కాదు : సీఐడీ చీఫ్ సునీల్
-
టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు
-
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా పోస్టులు
-
బాబు సీఎం అయ్యాకే అగ్రిగోల్డ్ సమస్య
అగ్రిగోల్డ్ సదస్సులో బాధితుల ఆగ్రహం విజయవాడ : చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే అగ్రిగోల్డ్ సమస్య వచ్చిందని పలువురు బాధితులు ధ్వజమెత్తారు. స్థానిక అమ్మ కల్యాణమండపంలో శనివారం సీఐడీ ఏర్పాటుచేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారుల అవగాహన సదస్సులో పలువురు సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పలువురు బాధితులు సీఐడీ వారిని నిలదీయడంతో సదస్సు గందరగోళంగా మారింది. లక్షలాది మంది ఖాతాదారుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కొంతమంది ఖాతాదారులు పేర్కొన్నారు. డబ్బు చెల్లించిన ఖాతాదారులు తమ ఇళ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతున్నారని ఏజెంట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు వందమంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే మరెందరో ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఐడీ చీఫ్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ ఆవేశం, ఉద్రేకంతో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. స్పెషల్ కోర్టు నుంచి ఈ కేసు హైకోర్టుకు వెళ్లిందన్నారు. సీఐడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో హాయ్‌ల్యాండ్ కూడా ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లు ఇంకా ఏమైనా సమ్యలు ఉంటే సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఒక దశలో పలువురు బాధితులు సంయమనం కోల్పోవడంతో సీఐడీ చీఫ్ జోక్యం చేసుకుని ఈ కేసులో తమది దర్యాప్తు సంస్థ మాత్రమేనన్నారు. తాము ఖాతాదారులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, సహకరించాలన్నారు. ఎన్నాళ్లు ఆగాలి ఎన్నాళ్లు ఆగాలి. మా డబ్బు ఎప్పటికి వస్తుంది. అగ్రిగోల్డ్ కేసు విషయంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. ఆస్తులు వేలం ఎప్పుడు వేస్తారు. ఆస్తులు స్వాధీనం చేసుకున్నందున ప్రభుత్వ ప్యాకేజీ ఇవ్వాలి. ముందుగా కొంత డబ్బు విడుదల చేసి ఖాతాదారులకు చెల్లించాలి. చిల్లిగవ్వలేక నానా అగచాట్లు పడుతున్నాం. వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. - లక్ష్మి, రాయగడ, ఒడిశా మా సొమ్ము ఇప్పించండి.. అగ్రిగోల్డ్ ఎప్పటినుంచో నష్టాల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి రాక ముందు నుంచే చెక్కులు ఆలస్యంగా చెల్లుబాటు అవుతున్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి పాలపక్షం నేతలు ఎందరో అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మాట్లాడుకుని తమ చెక్కులు క్లియర్ అయ్యేలా చూసుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాకే ఈ సమస్య వచ్చింది. వెంటనే హాయ్‌ల్యాండ్‌ను విక్రయించి బాధితులకు సొమ్ము చెల్లించాలి. - యువరాజు, గుంటూరు