
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమార్కుల ఆటకట్టించేందుకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) మెరుపుదాడులు నిర్వహించింది. రెండు రోజులపాటు నిర్వహించిన ఆపరేషన్ నిఘాలో 269 ఎస్‌ఈబీ బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, రవాణా, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, గుట్కా, గంజాయిలపై ఎస్‌ఈబీ బృందాలు ఉక్కుపాదం మోపాయి. అక్రమాలకు పాల్పడుతున్న 1,537 మందిపై 1,088 కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను ఎస్‌ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ మీడియాకు వెల్లడించారు. ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్న వివరాలివీ..
నమోదైన కేసులు: 1,088
అరెస్టయిన వారు: 1,537
సీజ్ చేసిన వాహనాలు: 192
సుంకం చెల్లించని మద్యం బాటిల్స్ (ఎన్‌డీపీఎల్): 3,652
అక్రమ మద్యం బాటిల్స్ (డీపీఎల్): 11,230
నాటుసారా (ఐడీ లిక్కర్): 6,016.7 లీటర్లు
సారా తయారీ ఊట: 43,326 లీటర్లు
అక్రమంగా తరలిస్తున్న ఇసుక: 349 టన్నులు
గంజాయి: 530 కిలోలు
సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం: 140 కిలోలు
గుట్కా: 4,45,000 ప్యాకెట్లు (రూ.45 లక్షలు విలువ)
పేకాటలపై దాడుల్లో: రూ.11,76,678 నగదు,
గేమింగ్ కాయిన్స్: రూ.8.35 లక్షల విలువైనవి
ఎటువంటి ఆధారపత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర వెండి, రూ.13.80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.