CRPF
-
భీకర ఎన్కౌంటర్.. మధ్యలో బిస్కెట్!
శ్రీనగర్: సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్‌తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడేవేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగి్నని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్కౌంటర్ వివరాలను సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. మొరిగితే అసలుకే మోసం కశ్మీర్లో కీలకమైన ఉగ్రకమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్స్పెక్టర్ మస్రూర్ వనీని చంపేసిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.ఏకే47తో సిద్ధం ఉస్మాన్ ఎల్లప్పుడూ అత్యాధునిక ఏకే47 గన్‌తో అప్రమత్తంగా ఉంటాడు. గ్రనేడ్లు, పిస్టల్ ధరిస్తాడు. వేగంగా దాడిచేస్తాడు. దీంతో తమ రాక విషయం తెలీకుండా జాగ్రత్తపడుతూ బలగాలు అతడిని సమీపించాయి. చివరి నిమిషంలో ఉస్మాన్ దీనిని కనిపెట్టి బలగాలపైకి ఎదురుకాల్పులు జరిపాడు. గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు గాయపడినా ఎట్టకేలకు ఉస్మాన్‌ను సైన్యం హతమార్చింది. గత రెండేళ్లలో కశీ్మర్ లోయలో సైన్యం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ ఘటనను చెబుతారు. లష్కరే తోయిబా విభాగమైన రెసిస్టెంట్ ఫ్రంట్‌కు ఈ ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బ. స్థానికేతర కారి్మకులు, భద్రతా బలగాలపైకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సభ్యులు తరచూ కాల్పులకు తెగబడటం తెల్సిందే. వీరికి సూచనలు చేసే ఉస్మాన్‌ను సైన్యం ఎట్టకేలకు తుదముట్టించి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాల్లో ఘన విజయం సాధించింది. -
నగరంలో సీఆర్పీఎఫ్ స్కూల్‌కు బాంబు బెదిరింపు
జవహర్‌నగర్: ఢిల్లీలోని ఓ సీఆర్పీఎఫ్ పాఠశాల ప్రహరీ వద్ద మూడు రోజుల కిందట బాంబు పేలుడు సంభవించిన ఘటనను మరువక ముందే హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలకు వచ్చిన బాంబు బెదిరింపు సందేశం మంగళవారం కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి సీఆర్పీఎఫ్ పాఠశాలకు ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశం పంపారు. జవహర్‌నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాలతోపాటు ఢిల్లీలోని రోహిణి, ద్వారకాలోగల సీఆర్పీఎఫ్ పాఠశాలలో బాంబులు అమర్చినట్లు అందులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పాఠశాల ప్రారంభమయ్యాక యాజమాన్యం ఈ–మెయిల్‌ను చూసి అప్రమత్తమైంది. వెంటనే విద్యార్థులను బస్సుల్లో ఇళ్లకు తరలించడంతోపాటు పోలీసులకు సమాచారం అందించింది.దీంతో సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ పోలీసులతోపాటు రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఏసీపీ మహేశ్, జవహర్‌నగర్ సీఐ సైదయ్య పాఠశాలకు చేరుకొని పరిసర ప్రాంతాలను, పాఠశాల భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జాగిలాలతో, బాంబు స్క్వాడ్‌తో అనువనవూ గాలించి బాంబు లేదని నిర్ధారించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం సతీమణి పేరున కొందరు దుండగులు ఫేక్ ఐడీ సృష్టించి ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. -
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడపై పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత.. ఒకేసారి దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోమవారం రాత్రి పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు ఈ-మెయిల్స్‌ను దుండగులు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నారు. ఢిల్లీ తోపాటు హైదరాబాద్‌లోని అన్ని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపుల సందేశాలు రావటంతో అన్ని స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్‌గా భద్రత అధికారులు భావిస్తున్నారు.ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్ ధృవీకరించింది. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది. గత వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న పలు భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. టార్గెట్ చేసిన ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా మరియు అకాసా ఎయిర్ ఉన్నాయి.చదవండి: ‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’ -
ఢిల్లీలో సీఆర్పీఎఫ్ స్కూలు వద్ద పేలుడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.50 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కలకలం రేపిన ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి. అక్కడ లభించిన తెల్లటి పదార్థం అమోనియం నైట్రేట్, క్లోరైడ్ల మిశ్రమం కావచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇంకా పేలుడు పదార్థాలుండొచ్చనే అనుమానంతో ఎన్ఎస్జీ కమాండోలు సమీప ప్రాంతాల్లో రోబోలతో గాలింపు జరిపారు. ‘పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పేలుడుకు కొద్ది క్షణాల ముందే ఘటనాస్థలి మీదుగా కొన్ని ద్విచక్ర వాహనాలు వెళ్లాయని, లేకుంటే పెనుప్రమాదమే జరిగి ఉండేది’ అని అధికారులు వివరించారు. పేలుడుతో మంటలు చెలరేగలేదని ఫైర్ అధికారులు తెలిపారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్ పోలీసులు పేలుడు పదార్థాల చట్టం తదితర వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
నేడు సీఆర్పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం.. ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 86వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతా బలగాలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ పాత్ర అత్యంత కీలకమని అభివర్ణించారు. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌లో.. దేశం పట్ల సీఆర్పీఎఫ్ జవాన్ల అంకితభావం, అవిశ్రాంత సేవ నిజంగా అభినందనీయమన్నారు. వారు ఎల్లప్పుడూ ధైర్యం, నిబద్ధతలతో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి పాటుపడుతున్నారన్నారు.ఇదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఆర్పీఎఫ్ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఆర్పీఎఫ్ ప్రారంభమైనప్పటి నుంచి జాతీయ భద్రతను తన మిషన్‌గా తీసుకుంది. దళంలోని వీర సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయక దేశరక్షణకు తమ శక్తిమేరకు కృషి చేసి, విజేతలుగా నిలుస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన సీఆర్పీఎఫ్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు.1939లో బ్రిటిష్ వారు సీఆర్పీఎఫ్ను స్థాపించారు. నాడు ఈ దళం పేరు క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఈ దళం పేరును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌గా మార్చారు. జునాగఢ్, హైదరాబాద్, కతియావార్, కశ్మీర్ రాచరిక రాష్ట్రాలను భారతదేశంలోకి చేర్చడంలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషించింది. అలాగే రాజస్థాన్, కచ్, సింధ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడంలోనూ సీఆర్పీఎఫ్ ముఖ్యపాత్ర పోషించింది. Greetings to CRPF personnel and their family members on their Raising Day.Since its inception, the @crpfindia has taken national security as its mission. The brave soldiers of the force have exerted all their might to accomplish this goal without ever caring for their lives and… pic.twitter.com/NhbmeRZvi3— Amit Shah (@AmitShah) July 27, 2024 -
మణిపూర్‌లో కాల్పులు.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
ఇంపాల్: మణిపూర్‌లో సాయుధ దుండగుల హింసాత్మక దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం మణిపూర్‌లోని జిరిబామ్‌లో సెంట్రల్ రిజర్వుడు పోలీసు ఫోర్స్, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో సాయుధ తిరుగుబాటు దారులు కాలుపు జరిపారు. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జనాన్తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. ఉదయం 9. 40 గంటలకు గుర్తుతెలియని దుండగుడు 20వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌పై కాల్పులు జరిపినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. సీఆర్పీఎస్ బలగాలు, పోలీసులు మాన్బంగ్ గ్రామంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో జరిగినట్లు పేర్కొన్నారు.ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ (43), జిరిబామ్ ఎస్ఐతో సహా ముగ్గురి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. ఇక.. ఇటీవల కాలంలో జిరిబామ్ ప్రాంతంలో పలు హింసాత్మక ఘటనలు చేటుచేసుకుంటున్నాయి. జూన్‌లో కుకీ, మైతేయి వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో సుమారు 70 ఇళ్లు, పోలీసు పోస్టులకు తిరుగుబాటు దారులు నిప్పంటించారు. -
స్వగ్రామానికి అమర జవాను మృతదేహం
రెండు రోజల్లో ఇంటికి వస్తానని చెప్పిన ఆ జవాను ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడు. ఈ విషయం తెలియని అతని తల్లి కొడుకు రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో అతని మృతదేహాన్ని సీఆర్పీఎఫ్ అధికారులు ఇంటికి తీసుకురావడంతో, ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది.జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను కబీర్ సింగ్ ఉయికే అమరుడయ్యాడు. అతని మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకురాగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కబీర్ సింగ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో వస్తానని చెప్పిన కుమారుడు ఇలా విగతజీవిగా వస్తాడని అనుకోలేదని అన్నారు.జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం చాలా కాలంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో జూన్ 11న సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కబీర్ సింగ్ ఉయికే తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు.సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు కబీర్ మృతదేహాన్ని అతని ఇంటికి తీసుకువచ్చారు. కబీర్ తల్లిని డీఐజీ నీతూ ఓదార్చారు. కథువా ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒక సీఆర్పీఎఫ్ జవాను వీరమరణం పొందారు. కాగా కథువాలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ఆనంద్ జైన్ తెలిపారు. #WATCH | CRPF jawan Kabir Das Uikey's mother, Indravati Uikey says, "Before the incident, he spoke to me around 2 pm. He was supposed to return home on soon." pic.twitter.com/O5k04CwAVx— ANI (@ANI) June 13, 2024 -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్‌తో నాగాలాండ్‌ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్‌ను నాగాలాండ్‌లోని దిమాపూర్‌తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్‌బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్‌ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్‌లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్‌లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
మణిపూర్‌లో కాల్పులు.. ఇద్దరు సీఆర్పీఎఫ్ పోలీసులు మృతి
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ అవుట్‌పోస్ట్ లక్ష్యంగా బాంబులు విసిరారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మిలిటెంట్లు విసిరిన ఒక బాంబు అవుట్‌పోస్ట్‌కు సమీపంలో పేలుడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ‘ఎతైన కొండ ప్రాంతాల నుంచి మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్‌పై కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ 128 బెటాలియన్ లక్ష్యంగా తెల్లవారుజామున 12.30 నుంచి 2.15 వరకు కాల్పులు జరిపారు. కాల్పులతో పాటు మిలిటెంట్లు బాంబులు కూడా విసిరారు. ఒక బాంబు సీఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంప్‌కు సమీపంలో పేలింది’అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మృతి చెందినవారు.. సీఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎన్. శంకర్, హెడ్ కానిస్టేబుల్ అనుప్ సైనీగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘అడవి రాముడి’కి నవ వసంతం
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మూతబడిన ఒక రామాలయం తలుపులు సీఆర్పిఎఫ్ అధికారుల చొరవతో 21 ఏళ్ల అనంతరం తెరుచుకున్నాయి. సుక్మా జిల్లాలోని చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపొంద గ్రామంలో పురాతన రామమందిరం ఉంది. ఆ గుడిలో గ్రామస్తులు ప్రతిరోజూ పూజలు నిర్వహించేవారు. దీనిపై ఆగ్రహించిన మావోయిస్టులు 2003 సంవత్సరంలో గుడి మూసేసి తాళాలు వేశారు. అప్పటి నుంచి ఆలయం నిరాదరణకు గురైంది. మావోయిస్టుల భయంతో స్థానికులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది. అయితే, కేరళపొంద గ్రామంలో నెల రోజుల క్రితం సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మించారు. ఈ క్రమంలో అధికారులు తరచుగా గ్రామస్తులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటుండగా.. 21 ఏళ్లుగా తెరుచుకోని రామాలయ అంశం బయటపడింది. అయితే, తమకు తాముగా గుడి తెరిస్తే మావోయిస్టులు ఇబ్బంది పెడతారని గ్రామస్తులు చెప్పడంతో సీఆర్పీఎఫ్ అధికారులు చొరవ తీసుకుని మంగళవారం ఆలయాన్ని తెరిచారు. 74వ బెటాలియన్‌కు చెందిన అధికారులు, జవాన్లతో పాటు గ్రామస్తులు ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రం చేశారు. ఈ రామమందిరంలో సీతారామలక్ష్మణుల విగ్రహాలు సుందరంగా ఉన్నాయని, గుడి శిఖరంపై ఆంజనేయస్వామి విగ్రహం ఉందని పోలీసులు తెలిపారు. గుడి తలుపులు తెరుచుకోవడంతో గ్రామస్తులు సంతోషంతో నృత్యం చేశారు. ఇక నుంచి ప్రతిరోజూ పూజలు చేస్తామని, ఈ ఏడాది శ్రీరామనవమి కూడా ఘనంగా నిర్వహిస్తామని గ్రామస్తులు వెల్లడించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్ ఎస్ఐ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందగా రాము అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బద్రేలోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుంచి ఉర్సంగల్ వైపు జవాన్లు కూంబింగ్ సాగిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సుధాకర్‌రెడ్డి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు. ఈ నెలలో బస్తర్ డివిజన్లో మావోయిస్టుల సంబంధిత ఘటనల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. 13న నారాయణ్‌పూర్ జిల్లా మావోయిస్టుల దాడిలో ఒక జవాను, 14న కాంకేర్ జిల్లా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి మరో బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. -
అయోధ్య భద్రత ఒక సవాలు: సీఆర్పీఎఫ్
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆలయంలో భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన మౌలిక సదుపాయాల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 27 ఎకరాల్లో అభివృద్ధి చేసిన క్యాంప్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ సత్యపాల్ రావత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలు తెలియజేశారు. రామ మందిర నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని, అది ఇక్కడ పనిచేసే భద్రతా బలగాలకు సవాల్‌గా మారుతుందని సత్యపాల్ తెలిపారు. అయోధ్యలో పలు భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయని, వీటిలోని సిబ్బంది మధ్య ఎంతో సమన్వయం ఉందన్నారు. భద్రతా పరంగా ఇక్కడ నూతన ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా భద్రతకు ఉపయుక్తమయ్యే ఆధునిక పరికరాలు కూడా తీసుకురానున్నామన్నారు. అయోధ్యలో భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఆర్పీఎఫ్ అన్నివేళలా, అన్ని పరిస్థితుల్లో సన్నద్ధంగా ఉంటుందన్నారు. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు! -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ మవోయిస్టు పేలుళ్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత ఎన్నికలు ప్రారంభమైన వేళ మావోయిస్టులు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ గాయాలపాలయ్యాడు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. విధుల్లో భాగంగా తొండమార్కా నుంచి ఎల్మగుండ గ్రామానికి సీఆర్పీఎఫ్ జవాను వెళుతున్నాడు. ఈ క్రమంలో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపాడు. ఈ పేలుడులో జవాను తీవ్ర గాయాలపాలయ్యాడు. జవాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడని జిల్లా పోలీసు అధికారి కిరణ్ ఛవాన్ తెలిపారు. జవాన్‌ను శ్రీకాంత్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కూడా ఓ బీఎస్ఎఫ్ జవానుతోపాటు ఇద్దరు పెట్రోలింగ్ బృందం నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలుడులో గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటివిడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిర్విగ్నంగా నిర్వహించేందుకు 600 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. నవంబర్ 17న 90 సీట్లలో రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: Assembly Elections Polling Live Updates: మిజోరం, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్ -
అన్న సీఐఎస్ఎఫ్.. చెల్లి సీఆర్పీఎఫ్
కరీంనగర్: వ్యసాయం మీదనే ఆ కుటుంబం ఆధారపడి బతుకుతోంది. కానీ వారి పిల్ల లను మాత్రం కేంద్ర బలగాలకు పంపాలనుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు సీఐఎస్ఎఫ్, సీఆర్పీఫ్కు ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన పోతుల ప్రభాకర్–రాజమణి కూతురు పోతుల స్రవంతి పదోవ తరగతి వరకు స్థానిక మోడల్ స్కూల్లో విద్యనభ్యసించిది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఇటీవల సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకుంది. ఆదివారం విడుదలైన ఫలితాలలో కానిస్టేబుల్‌గా ఎంపికై ంది. అంతకుముందు ఎస్సైకి దరఖాస్తు చేసుకోగా విఫలమైంది. కానీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అదేవిధంగా పోతుల స్రవంతి చిన్నాన పోతుల చంద్రయ్య–ఇందిరల కుమారుడు పోతుల శ్రావణ్ కూడా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శ్రావణ్ పదో తరగతి వరకు స్థానిక మోడల్ స్కూల్లో చదివాడు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇద్దరు ఒకే కుటుంబం నుంచి కేంద్ర సాయుధ బలగాలకు ఎంపిక అవ్వడం పట్ల గ్రామస్తులు వారిని అభినందించారు. ఇద్దరు ఒకేసారి దరఖాస్తు చేసుకున్నారు, కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఈవెంట్స్‌కు ప్రిపేర్ అయ్యారు. -
కేంద్ర పోలీస్ విభాగాల్లో 1.14 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసు వంటి కేంద్ర పోలీస్ విభాగాల్లో 1,14,245 ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉందని కేంద్రప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా బుధవారం ఈ వివరాలు తెలిపారు. ఈ ఏడాది 31,879 పోస్టులకు ప్రకటనలు జారీచేయగా ఇప్పటిదాకా 1,126 పోస్టులే భర్తీ అయ్యాయి. కేంద్ర హోం శాఖ, దాని విభాగాలైన బీఎస్ఎఫ్, సశస్త్ర సీమా బల్, సీఆర్పీఎఫ్, ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్, కేంద్ర పోలీసు సంస్థలు, ఢిల్లీ పోలీస్ ఇలా అన్ని విభాగాల్లో మొత్తంగా 1,14,245 ఖాళీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో షెడ్యూల్ కులాల పోస్టులు 16,356 ఉన్నాయి. షెడ్యూల్ తెగలకు 8,759, ఇతర వెనుకబడిన వర్గాలకు 21,974, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 7,394 పోస్టులు, మిగతా 59వేలకుపైగా జనరల్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. -
ముంబై-జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఫైరింగ్ కలకలం
-
టూరిస్టులతో గుంజీలు తీయించిన రైల్వే పోలీసులు
పనాజీ: కర్ణాటక గోవా సరిహద్దులో పర్యాటక ప్రాంతమైన దూధ్ సాగర్ జలపాతాలను దగ్గరగా చూసేందుకు నిబంధనలకు విరుద్ధంగా రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న పర్యాటకులను రైల్వే పోలీసులు అడ్డుకుని వారితో గుంజీలు తీయించారు. రైలులో గోవా వెళ్తుండగా మార్గమధ్యలో కిటికీల్లోంచి కనిపించే అందమైన పర్యటక దృశ్యం దూద్ సాగర్ జలపాతాలు. దూరం నుంచి చూస్తేనే అంత ఆహ్లాదంగా ఉండే ఈ జలపాతాలను దగ్గరగా చూడాలని కొందరు ఔత్సాహికులైన పర్యాటకులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. గతంలో అడవి గుండా జలపాతాలను చేరేందుకు మార్గం ఉండేది. కానీ ఇటీవల ఇక్కడికి సమీపంలోని మైనాపీ జలపాతాల వద్ద ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో ఈ దోవను మూసివేశారు. దీంతో పర్యాటకులు దూధ్ సాగర్ చేరుకోవడానికి రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. అది ఇంకా ప్రమాదమని రైల్వే పోలీసులు అనేకమార్లు పర్యాటకులను హెచ్చరిస్తున్నా వారు దీన్ని పట్టించుకోవడం లేదు. ఆదివారం అయితే వందల కొద్దీ పర్యాటకులు ఈ మార్గం గుండా వెళ్తూ రైల్వే పోలీసుల కంటపడ్డారు.దీంతో చిర్రెత్తుకొచ్చిన రైల్వే పోలీసులు నిబంధనలను అతిక్రమించిన వందల టూరిస్టులతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. A huge crowd who set out to watch Dudhsagar Waterfalls in Goa were seen on the railway tracks after authorities denied them entry As per social media accounts, some of them were also asked to perform squats by Railway Police personnel as punishment#Dudhsagarwaterfall pic.twitter.com/jh7uzHcJiR — ET NOW (@ETNOWlive) July 16, 2023 దక్షిణ పశ్చిమ రైల్వే వారు ట్విట్టర్ వేదికగా దయచేసి దూధ్ సాగర్ జలపాతాలను రైలులో నుండే చూసి ఆస్వాదించండి. రైలు పట్టాలెక్కి కాదు. అలా చేస్తే ఇకపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. We urge you to savour the beauty of Dudhsagar Falls from WITHIN your coach. Walking on/along tracks not only endangers your own safety but is also an offence under Section 147, 159 of Railway Act. It can also endanger safety of trains. (1/2) pic.twitter.com/Puj7hKh5JF — South Western Railway (@SWRRLY) July 16, 2023 ఇది కూడా చదవండి: విహారం మిగిల్చిన విషాదం.. కళ్ళముందే ఘోరం.. -
రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి..
పూణే: పూణే రైల్వే స్టేషన్లో అమానుషమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రైలు రావడం ఆలస్యమైన కారణంగానో మరేదైనా కారణం వల్లనో ఆదమరిచి నిద్రిస్తున్న ప్రయాణికులు కొంతమందిని నిద్ర లేపడానికి నిర్దాక్షిణ్యంగా వారి మొహం మీద నీళ్లు చల్లాడు ఓ సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్. ఈ దృశ్యాన్ని చరవాణిలో బంధించిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీనిపై స్పందిస్తూ పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ ఇందు దూబే ఇది అమానుషం అన్నారు. రైళ్ల రాకపోకలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని అనిశ్చితిలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో సేదదీరడం సర్వసాధారణంగానే మనం చూస్తూ ఉంటాం. రైల్వే ప్లాట్ ఫారం మీద నిద్రించడం నిబంధనలకు విరుద్ధమే. అయినా ఆ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఒక రైల్వే కానిస్టేబుల్ మాత్రం కర్కశంగా వ్యవహరించాడు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గాఢంగా నిద్రిస్తున్న ప్రయాణికుల మొహం మీద బాటిల్ తో నీళ్లు కుమ్మరించాడు. దీంతో ఏమైందోనని ఉలిక్కిపడి లేచారు ప్రయాణికులు. వారిలో ఒక పెద్దాయన కూడా ఉన్నారు. మానవత్వాన్ని తుంగలో తొక్కిన ఈ సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో "మానవత్వానికి నివాళులు" అని రాసి పోస్ట్ చేశాడు ఒక యువకుడు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోను ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. వీరిలో అత్యధికులు రైల్వే కానిస్టేబుల్ పై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు. RIP Humanity 🥺🥺 Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn — 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) June 30, 2023 రైల్వే స్టేషన్లలో ఇతరులకు అడ్డంకిగా ఎక్కడ పెడితే అక్కడ నిద్రించడం నిబంధనలకు విరుద్ధం. ఆ విషయాన్ని వారికి మర్యాదపూర్వకంగానూ, గౌరవంగా అర్ధమయ్యేలా కౌన్సెలింగ్ చెయ్యాలి గానీ ఈ విధంగా మొహాన నీళ్లు చల్లడం తీవ్ర విచారకరమని అన్నారు రైల్వే డివిజనల్ మేనేజర్ ఇందు దూబే. నెటిజన్లు ఈ సంఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. కొంతమంది రైల్వే కానిస్టేబుల్ ను నిందించగా మరికొంత మంది అతడికి మద్దతుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే.. -
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ పోలీసు ఆత్మహత్య
తిరువొత్తియూరు: కుటుంబ సమస్యల కారణంగా తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడు. కోయంబత్తూరు సమీపంలోని కురుదంపాళయంలో సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ శిక్షణా కళాశాల ఉంది. ఇక్కడ సీఆర్పీఎఫ్గా జగన్ (32) పని చేస్తున్నాడు. అతని స్వస్థలం తూత్తుకుడి జిల్లాలోని సాతాన్ కుళం సమీపంలోని పెరుమాళ్ కులం. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్ పనిలో ఉన్నారు. ఆ తరువాత అకస్మాతుగా తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. అతని మెడలోకి రెండు బుల్లెట్లు దూసుకుని వెళ్ళాయి. దీంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది చూసిన సహ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు. జగన్ తన మొదటి భార్యకు మూడు నెలల క్రితం విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఈ స్థితిలో కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియవచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
Vande Bharat: వందే భారత్‌పై దాడులు ఆగవా?
తిరువనంతపురం: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన అల్లరి మూకలు.. ఈ మధ్య ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కఠిన చర్యలు ఉంటాయని, జైలు శిక్ష తప్పదనే రైల్వే శాఖ హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టి మరీ రైలుపై దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే సెమీ హైస్పీడ్ రైళ్లుగా పేరున్న వందే భారత్ రైళ్లపై దాడులపరంపరకు చెక్ పెట్టడం ఎలాగనే ఆలోచనలో పడిపోయింది రైల్వే శాఖ. తాజాగా.. కేరళలో కొత్తగా ప్రారంభమైన వందే భారత్‌పైనా రాళ్ల దాడి జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి.. తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ మధ్య కేరళ తొలి వందేభారత్‌ను ప్రారంభించారు. అయితే.. తాజాగా తిరునవయా-తిరూర్ మధ్య వందే భారత్‌పై రాళ్లు రువ్వారు ఆగంతకులు. ఈ దాడిలో అద్దం పగిలిపోగా.. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపటినట్లు వెల్లడించారు. Flagged off Kerala’s first Vande Bharat Express, which will enhance connectivity from Thiruvananthapuram to Kasaragod. pic.twitter.com/u1RqG5SoVU — Narendra Modi (@narendramodi) April 25, 2023 ఇదిలా ఉంటే.. వందేభారత్ రైళ్లపై గత కొంతకాలంగా రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకు సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో స్వల్ప కాలవ్యవధిలోనే వందేభారత్‌పై మూడుసార్లు రాళ్ల దాడి జరిగింది. అంతకు ముందు మార్చిలో పశ్చిమ బెంగాల్ ఫన్సిదేవా వద్ద, అదే నెలలో హౌరా-న్యూ జల్పైగురి మధ్య మాల్దా సమీపంలో వందేభారత్ రైళ్ల పై రాళ్ల దాడులు జరిగాయి. మొత్తంగా దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత.. ఇలాంటి దాడుల కేసులే పాతిక దాకా నమోదు అయినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో రైల్వే శాఖ సీఆర్పీఎఫ్ ద్వారా ఈ తరహా నేరాల కట్టడికి సమాలోచనలు చేస్తోంది. ఇదీ చదవండి: కవితక్క ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
Hyd: ప్రేమ విఫలమైందని రివాల్వర్‌తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా ఇంట తుపాకీ పేలింది. ఆయన వద్ద పని చేసే ఓ జవాన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్ బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతున్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్ కుమార్‌గా గుర్తించారు. సీఆర్పీఫ్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా వద్ద విధులు నిర్వహిస్తున్నాడు దేవేందర్. సూసైడ్‌కు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు! -
తమిళంలో పరీక్షకు.. అనుమతి ఇవ్వండి
సాక్షి, చైన్నె:సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షలను తమిళంలో రాసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. ఇందులో రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ పేర్కొన్న అంశాల మేరకు తమిళంతో పాటుగా పలు ప్రాంతీయ భాషలు అధికారిక భాషలుగా గుర్తించినట్టు వివరించారు. అయితే అయితే రిక్రూట్మెంట్ కోసం జరిగే కంప్యూటరైజ్డ్ టెస్ట్ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే నిర్వహించడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, త మిళనాడులోని యువకులకు అవకాశం దక్కనివ్వకుండా చేస్తుండడం షాక్‌కు గురి చేసిందన్నారు. మొత్తం 9,212 పోస్టుల్లో తమిళనాడులో 579 పోస్టులు ఉన్నట్లు వివరించారు. 12 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరీక్షలను మాతృభాషల్లో రాయడానికి అవకాశం కల్పించాలని కోరారు. హిందీ మాట్లాడే వారికి అవకాశం కల్పించే విధంగా, అనుకూల వాతావరణం సృష్టించే రీతిలో పరీక్షల నిర్వహించడం తగదన్నారు. తమిళనాడులోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నోటిఫికేషన్, దరఖాస్తులు తమ రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా, ఏకపక్షంగా ఉందని ఆరోపించారు. వివక్ష అనేది చూపించకుండా అందరికీ అవకాశం కల్పించే విధంగా, నోటిఫికేషన్లో మార్పులు చేయాలని కోరారు. ఆయా రాష్ట్రాల యువత వారి వారి మాతృ భాషల్లో పరీక్షలు రాసేందుకు వీలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పీఎంకు వినతిపత్రం అందజేత.. చైన్నె పర్యటనకు శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం స్టాలిన్ ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందులో పేర్కొన్న సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం ప్రకటన రూపంలో ఆదివారం తెలియజేసింది. చైన్నె విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విజ్ఞప్తిని అందజేసినట్టు అధికారులు ఇందులో గుర్తు చేశారు. చైన్నె మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి విమానాశ్రయాల విస్తరణ పనులు, పరందూరు కొత్త విమానాశ్రయం పనులపై త్వరితగతిన దృష్టి పెట్టాలని కోరినట్లు వెల్లడించారు. పాదరక్షల తయారీకి కొత్త ఉత్పాదక ప్రోత్సాహకాలు, యువజన సంక్షేమం, క్రీడల శాఖ తరపున తమిళనాడులో స్పోర్ట్ కమిషన్ ఆఫ్ ఇండియా జోన్ ఏర్పాటు, రామేశ్వరం నుంచి ధనుస్కోటి వరకు కొత్త బ్రాడ్ గేజ్ మార్గం పనులు, కచ్చదీవుల స్వాధీనం, తమిళ జాలర్లపై జరుగుతున్న దాడులకు అడ్టకట్ట వేయడం తదితర అంశాలను ఆ వినతిపత్రంలో వివరంగా తెలియజేశామన్నారు. -
అన్ని భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశమివ్వాలి
సాక్షి, హైదరాబాద్ః కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ పరీక్ష రాసేందుకు వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) ఉద్యోగాల కోసం కేవలం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పోటీ పరీక్షల నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన అమిత్ షాకు ఓ లేఖ రాశారు. సీఆర్పీఎఫ్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంతో పాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కోరారు. కేవలం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఈ పోటీ పరీక్షలను నిర్వహించడంతో తీవ్ర వివక్ష ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదవని లేదా హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 2020 నవంబర్ 18న ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయమై లేఖ కూడా రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది యువకుల పట్ల ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా వారికి సమాన అవకాశాలు దక్కేలా సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్‌కు సవరణ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. -
అమ్మ ప్రేమకు సజీవ సాక్ష్యం: నిలువెత్తు జ్ఞాపకం
బిడ్డల భవిష్యత్తు కోసం కలలు కంటూ వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది అమ్మ. రెక్కలొచ్చి పిల్లలు ఎగిరెళ్లినా వారి జ్ఞాపకాలు మాత్రం ఆమె మెడ చుట్టూ చిట్టి చేతుల్లా అల్లుకుపోతూనే ఉంటాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన కంది నాగమణి పాతికేళ్ల క్రితం దేశసేవలో కానరాని దూరాలకు వెళ్లిన కొడుకును మళ్లీ కళ్లారా చూడాలనుకుంది. కొడుకు గొప్పతనాన్ని ఆ ఊరి ప్రజల ముందుకు తేవాలనుకుంది తనలాంటి కొడుకు వీధికొక్కరు పుట్టాలని నడివీధిలో విగ్రహాన్ని నిలబెట్టింది. కంది నాగమణి, శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగునీటి వసతులు లేక వర్షాధారంపై ఆధారపడి సేద్యం చేస్తుండే వాళ్లు. నాగమణి ఇల్లు, వ్యవసాయపనులే కాదు బీడీలు చుట్టే పని కూడా చేస్తుండేది. పెద్ద కొడుకు సిద్దరాములు ఏడో తరగతి వరకు చిట్యాలలో చదువుకున్నాడు. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు తాడ్వాయి మండల కేంద్రానికి వెళ్లి చదువుకున్నాడు. 1990 లో సీఆర్పీఎఫ్ జవానుగా సెలెక్టయ్యాడు. అప్పట్లో వాళ్ల గ్రామంలో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. పోలీస్ డిపార్టుమెంటులో చేరుతానని ముందుకెళ్లాడు. వద్దని వారించినా వెనకడుగువేయలేదు. ఇంకో అడుగు ముందుకేసి దేశం కోసం సేవ చేస్తానంటూ వెళ్లాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. గుండెలో పేలిన బాంబు 1997 డిసెంబర్ 14న అస్సాంలోని కొక్రా జిల్లాలో బోడో తీవ్రవాదులు పేల్చిన మందుపాతరలో పది మంది వరకు జవాన్లు చనిపోయారు. అందులో సిద్దరాములు ఒకరు. ఇంటికి కబురందింది. తల్లి గుండె చెరువయ్యింది. సీఆర్పీఎఫ్ అధికారులు శవాన్ని తీసుకుని తాడ్వాయికి వచ్చారు. ఆ జ్ఞాపకాల్లోనే.. కొడుకు చనిపోయి పాతికేళ్లు దాటింది. అయినా, ఆ తల్లి మాత్రం కొడుకు జ్ఞాపకాల్లోనే కాలం గడుపుతోంది. చిన్నతనంలో చేసిన అల్లరి, పెద్దయ్యాక చూపిన గుండెధైర్యం ఆమెను రోజూ వెంటాడుతూనే ఉన్నాయి. ఆమె ఆలనా పాలనా చిన్న కొడుకు విఠల్ చూసుకుంటున్నాడు. బీపీ, షుగర్ సమస్యలకు మందులు వాడుతోంది. నిత్యం కొడుకు గురించిన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వచ్చింది. బీడీ కార్మికురాలిగా రిటైర్ అయ్యాక పీఎఫ్‌లో జమ అయిన డబ్బులపై నెలనెలా పెన్షన్ వస్తోంది. ఆ డబ్బులతో కొడుకు విగ్రహం ఏర్పాటు చేయాలని పూనుకుంది. విగ్రహం తయారీకి, ఏర్పాటుకు ఎంతోమందిని కలిసి, తన కల గురించి చెబుతుండేది. దాదాపు రూ.లక్షా 60 వేలు ఖర్చు చేసి సిద్దరాములు నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించింది. జై జవాన్.. గ్రామంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈ నెల 27న జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది నాగమణి. కొడుకు జ్ఞాపకాలతో విగ్రహం ఏర్పాటు చేసిన తల్లిని అందరూ అభినందించారు. నాగమణి మాత్రం నాడు తన కొడుకుతో పాటు మరో పది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేసుకుంది. దేశసేవలో జవాన్ల త్యాగం గురించి ఈ సందర్భంగా అందరూ గుర్తుచేసుకున్నారు. పిల్లలు సైతం జై జవాన్ అంటూ దేశసేవలో జవాన్ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు. కండ్ల ముందే తిరుగుతున్నట్టుంది చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఎంతో కష్టపడి చదువుకున్నరు. తాడ్వాయికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లు. పెద్దోడు ఉద్యోగంలో చేరిన తరువాత మా కష్టాలు తీరినయి. ఆరేడేండ్లు ఉద్యోగం చేసిండో లేదో చనిపోయిండు. వాడు కనుమరుగై ఇరవై ఐదేండ్లవుతున్నా నా కండ్ల ముందర ఇంకా తిరుగున్నట్టే ఉంటది. యాది జేసుకోని రోజు ఉండది. ఊళ్లో అందరితో ఎంతో ప్రేమగా ఉండేటోడు. రోజూ వాని ఫోటో చూసుకుంటూ ఇన్నేళ్లు గడిపినా. నా కొడుకు లెక్కనే ఉండే విగ్రహం అందరికీ తెలిసేలా పెట్టించాలనుకున్నా. అది ఇన్నాళ్లకి తీరింది. సైనికుడైన నా కొడుకు నాకే కాదు మా ఊరికి కూడా గొప్ప పేరు తెచ్చిపెట్టిండు. – కంది నాగమణి, అమర జవాన్ సిద్దరాములు తల్లి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి