
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గడ్‌లో మరోసారి మావోయిస్టులు పంజా విసిరారు. భీజాపూర్ జిల్లా కేశ్‌కుతుల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఘటనాస్థలిలో మారణ ఆయుధాలను, రోజువారీ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, జూన్ మొదటివారంలో దామ్‌తారి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే మవోయిస్టులు ఈ దాడికి తెగబడ్డారని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment