రెచ్చిపోయిన నక్సల్స్‌.. నలుగురు జవాన్ల మృతి | Four Paramilitary Men Killed In Maoist Attack In Chhattisgarh | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 27 2018 7:27 PM | Last Updated on Sat, Oct 27 2018 7:28 PM

Four Paramilitary Men Killed In Maoist Attack In Chhattisgarh - Sakshi

బీజాపూర్‌ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు.అటవి ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన జవాన్ల వాహనాన్ని బాంబు పెట్టి పేల్చారు. అనంతరం వారిపై ఎదురుకాల్పులకు దిగారు. బీజాపూర్‌ జిల్లా ముర్దొండి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు.

అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న జవాన్ల వాహనాన్ని మవోయిస్టులు పవర్‌పుల్‌ ల్యాండ్‌మైన్‌తో పేల్చేశారు. ఆ సమయంలో వాహనంలో ఆరుగురు జవాన్లు ఉన్నారు. ఒక్క కిలోమీటర్‌ దూరంలో ఉన్న క్యాంప్‌ దగ్గరికి వారు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన జవాన్లు మావోయిస్టులలపై  కాల్పులు ప్రారంభించారు. కాల్పుల్లో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి అదనపు బలగాలు పంపుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement