chhattisgarh
-
బీజాపూర్: 17 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. గంగుళూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున లొంగిపోయారు. లొంగిపోయిన 17 మంది మావోయిస్టుల్లో 9 మందిపై 24 లక్షల రివార్డ్ ఉందని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. గంగుళూరు ఏరియా కమిటీ డీవీసీఎం దినేష్ మొడియం దంపతులు లొంగిపోయారు.2025లో ఇప్పటి వరకూ 65 మంది మావోయిస్టులు లొంగిపోయారని..137 మందిని అరెస్టు చేశాం. 56 మంది వేర్వేరు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి రూ. 25 వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. -
30 ఏళ్ల తండ్లాట...అమ్మను చూడాలని !
తల్లిని కలిసేందుకు ఓ తనయ ఆరాటపడుతోంది. 30 ఏళ్లుగా ఆమెకు దూరమై తల్లడిల్లిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ఠాణాలో మీ అమ్మ ఉందంటూ భవానికి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో భవాని ఆదివారం కోరుట్లలో ఉంటున్న తన బంధువులతో కలిసి అక్కడకు బయలుదేరి వెళ్లింది. వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పసుల రాంరెడ్డి 1979లో పీపుల్స్‌వార్‌లో చేరారు. అప్పుడే అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఏడాదిపాటు ఇంటి వద్దే ఉండగా, కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన వసంతతో వివాహం జరిగింది. ఏడాది వ్యవధిలోనే రాంరెడ్డి–వసంత దంపతులిద్దరూ పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. అజ్ఞాతంలో ఉండగానే కూతురు జన్మించింది. ముంబైలో ఉండే తన అన్నసాయిబాబాకు కూతురు (భవాని)ని అప్పగించాడు రాంరెడ్డి. 2001లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మద్దిమల్ల సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పసుల రాంరెడ్డి హతమయ్యాడు. అయినా అజ్ఞాతం వీడని వసంత శాంతక్క, మమతక్క పేర్లతో దండకారణ్యంలోని బస్తర్ డివిజన్ కమిటీ సభ్యురాలిగా కొనసాగారు. చదవండి: Amrutha Pranay Case Verdict : పీవోడబ్ల్యూ సంధ్య స్పందన ఇదే!మోకాళ్ల నొప్పులు, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో 2024 నవంబర్‌లో వసంత కాంకేర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత కాంకేర్ పోలీసులు ఆమెతోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు 2025 జనవరిలో లొంగిపోయినట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కాంకేర్లోనే పోలీసుల అదీనంలో ఉంటోంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆమె గురించి ఆరా తీస్తూ తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులకు విషయం చెప్పారు. రెండురోజుల క్రితం తెలంగాణ పోలీసులు భవాని ఆచూకీ తెలుసుకున్నారు. ఆమెకు తల్లి సమాచారం చెప్పడంతో ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరింది. ఒకట్రెండుసార్లు అమ్మను కలిశాను ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా...చిన్నప్పుడు కోరుట్లలోనే ఓ చోట ఒకట్రెండు సార్లు అమ్మను కలిశా. అప్పుడు అమ్మానాన్న ఇద్దరూ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పుడు నేను వెళితే నన్ను అమ్మ తప్పకుండా గుర్తుపడుతుంది. ఇన్నాళ్లు పెద్దనాన్న దగ్గర దత్త పుత్రికగానే పెరిగాను. కొన్నేళ్ల క్రితమే పెద్దనాన్న దంపతులు ఇద్దరూ చనిపోయారు. అమ్మ వస్తుందంటే బంధువులంతా సంతోషపడుతున్నారు. – భవాని -
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | ED raids Congress leader Bhupesh Baghel's premises in Bhilai as part of a money laundering investigation against his son - Chaitanya Baghel - in an alleged liquor scam case.Chaitanya Baghel shares the Bhilai accommodation with his father and hence the premises are being… pic.twitter.com/AdUWic1y26— Press Trust of India (@PTI_News) March 10, 2025కేసు ఇదీ..ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. #WATCH | Chhattisgarh | Enforcement Directorate (ED) is conducting searches at the residence of former Chief Minister and Congress leader Bhupesh Baghel's son in an ongoing money laundering case. (Visuals from Durg) pic.twitter.com/k5Gmgew4K4— ANI (@ANI) March 10, 2025 -
టార్గెట్ మావోయిస్టు రాష్ట్ర కమిటీ
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీని కూడా తుడిచిపెట్టేందుకు కేంద్ర సాయుధ బలగాలతోపాటు గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బహుముఖ వ్యూహాలతో ముందుకుసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలో మావోయిస్టుల సంఖ్య ప్రస్తుతం 100 లోపే ఉంటుందని తెలిసింది. ఇందులోనూ ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు. వీరంతా స్థానికులు కావడంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కమిటీ సైతం ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి పరిమితమైంది. దీంతో భద్రత బలగాలు వారి కోసం మాటువేసి ఉన్నాయి. తెలంగాణ సరిహద్దు వైపు ఏ చిన్న కదలిక ఉన్నా...భారీదెబ్బ తీసేందుకు సిద్ధమయ్యాయి. అయితే తెలంగాణకమిటీలో ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్ స్థానికులు కావడంతో అక్కడి అటవీ ప్రాంతాలపై పూర్తి పట్టు ఉండడంతో చాలా సందర్భాల్లో తెలంగాణ కమిటీ చిక్కినట్టే చిక్కి మిస్సవుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు. » తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవుల్లో ఈ ఏడాది జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. » ఈనెల 9న ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భారీ ఎన్కౌంటర్ సైతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగానే జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ భారీ ఎన్కౌంటర్లో 31 మంది మృతి చెందగా ఇందులో తెలంగాణ కమిటీకి చెందినవారు ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. 60 మందికిపైగా వారే... మావోయిస్టు కీలక నేతల్లో తెలంగాణవారు ఉన్నా, రాష్ట్ర కమిటీలో మాత్రం ఛత్తీస్‌గఢ్ వారే అధికంగా ఉన్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్ర కమిటీలో మొత్తం 90 నుంచి 100 మంది ఉండగా..ఇందులో 60 మందికిపైగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారే అని తెలిసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కేవలం 25 మంది లోపే ఉంటారని సమాచారం. ఇందులోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినవారు అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, బస్తర్ ప్రాంతాల వారే ఎక్కువమంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీలోనూ భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు (బీకే–ఏఎస్ఆర్)డివిజన్ కమిటీ బలంగా ఉంది. రాష్ట్ర కమిటీలోని దాదాపు సగం మంది వరకు సభ్యులు ఇందులోనే ఉన్నట్టు తెలిసింది. అయితే, గతానికి భిన్నంగా మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బక్కచిక్కి పోవడానికి ప్రధాన కారణం..కొంతకాలంగా మావోయిస్టు రిక్రూట్మెంట్ దాదాపుగా లేకపోవడమే. తెలంగాణ నుంచి మావోయిస్టుల్లోకి చేరేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపకపోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సరిహద్దుల్లో రెఢీ మావోయిస్టుల ఏరివేతలో దేశంలో అత్యుత్తమ దళంగా పేరుపొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది, తెలంగాణ పోలీస్ ప్రత్యేక బలగాల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ మావోయిస్టుల ఏరివేతలో గ్రేహౌండ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతోపాటు తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టుల అంతానికి ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. -
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
ఛత్తీస్‌గఢ్ భారీ ఎన్కౌంటర్ : Chhattisgarh
-
ఎరుపెక్కిన ఇంద్రావతి!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. అక్కడి ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో ఆదివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకేచోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లకు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇన్సాస్, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వా«దీనం చేసుకున్నాయి. మృతుల్లో తెలంగాణ నేతలు? ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా, ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికిపైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. శనివారం రాత్రికల్లా మావోయిస్టులు బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితోపాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. టార్గెట్ చేసి.. రెండో సారి.. భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్‌గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా.. మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత.. దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. టైగర్ రిజర్వ్‌లపై ఫోకస్ ఇంద్రావతి నేషనల్ పార్క్ 2,779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికిపైగా మావోయిస్టుల ఆ«దీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి – సీతానది టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉన్న ఘరియాబండ్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్‌లో ఏకంగా 31 మంది మృతి చెందారు. గడువు కంటే ముందే మావోయిస్టుల అంతం: అమిత్షామావోయిస్టు ముక్త భారత్ లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్‌కు ‘ఇంద్రావతి’తో భారీ విజయం దక్కిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గడువుగా పెట్టుకున్న 2026 మార్చి కంటే ముందే దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నారు. ఎన్కౌంటర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. ఆ జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా దళాలకు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ వేగంగా జరుగుతున్నాయన్నారు.40 రోజుల్లో 81 మంది మృతిఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్‌లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్‌గఢ్‌లో 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. -
భారీ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ:ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో ఆదివారం(ఫిబ్రవరి 9) జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే క్రమంలో భద్రతాదళాలు భారీ విజయాన్ని సాధించాయన్నారు. వచ్చే ఏడాది మార్చినాటికి నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని తెలిపారు.‘ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్లోనే పెద్దఎత్తున ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. నక్సలిజాన్ని అంతం చేసే క్రమంలో ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లనూ కోల్పోయాం.ఆ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం’ అని అమిత్ షా పేర్కొన్నారు. -
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 31 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అడవుల్లో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన జవాన్లను హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ జిల్లా కేంద్రంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. నెలరోజుల్లో 100 మందికిపైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతిచెందారు. మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, నారాయణ్‌పూర్, బస్తర్ సహా పలు మావోయిస్టులు హవా ఉన్న జిల్లాల్లో భద్రతా బలగాలు, పోలీసుల ఆపరేషన్లు వేగవంతం చేశాయి. భద్రతా బలగాలు.. నక్సల్స్ ఎదురుపడగానే కాల్పులు జరుపుతున్నాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుంటున్నారు.ఈ ఎన్కౌంటర్లలో భారీగా నక్సల్స్ మృతి చెందుతున్నారు. గత కొన్ని నెలలుగా పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు, నక్సల్స్‌కు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మందికిపైగా మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో మరో మావోయిస్టు అగ్రనేత కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. -
బర్డ్‌ఫ్లూ కలకలం.. 11 వేల కోడిపిల్లలు, నాలుగువేల కోళ్లను చంపి..
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో బర్డ్ ఫ్లూ మరింతగా వ్యాపించకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం 11 వేల కోడిపిల్లలను, 4,356 కోళ్లను చంపి, పాతిపెట్టింది. ప్రభుత్వ కోళ్ల ఫారంలో చనిపోయిన కోళ్ల నమూనా పరీక్షల్లో వైరస్ హెచ్5 ఎన్1 నిర్ధారించిన తర్వాత అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ కోళ్ల ఫారంలో కోళ్లు చనిపోతున్న దరిమిలా అధికారులకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందనే అనుమానం వచ్చింది. దీంతో వెంటనే కోళ్ల నమూనాను పరీక్షల కోసం భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్స్టిట్యూట్కు పంపారు. అక్కడ ఆ నమూనాలలో హెచ్5 ఎన్1 నిర్ధారణ అయ్యింది.దీనిపై రాయ్‌గఢ్ కలెక్టర్ కార్తికేయ గోయల్ మీడియాతో మాట్లాడుతూ భోపాల్‌లోని నేషనల్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల రాయ్‌గఢ్‌లోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుండి పంపిన కోళ్ల నమూనాలలో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిదన్నారు. అందుకే కోళ్ల ఫారమ్‌లోని మిగిలిన కోళ్లను, కోడిపిల్లలను చంపి పాతిపెట్టారన్నారు. రాయ్‌గఢ్ కలెక్టర్ మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున, ప్రభుత్వ కోళ్ల ఫారం ఆవరణలో పూర్తి భద్రతా చర్యల నడుమ జేసీబీసహాయంతో ఒక గొయ్యి తవ్వి, చనిపోయిన కోళ్లు , కోడిపిల్లలను పూడ్చిపెట్టామని తెలిపారు. అలాగే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కోడి గుడ్లను కూడా నాశనం చేశారు. ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు -
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్
చత్తీస్‌గఢ్: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. గంగలూర్ పీఎస్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.కాగా, గత నెల ఛత్తీస్‌గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. -
ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
చర్ల: పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోయిస్టులు ఓ గిరిజనుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా బైరంఘడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశముండిపారా గ్రామానికి చెందిన సోడి భద్రు(45) ఇంటికి ఆదివారం రాత్రి 7 గంటలకు వచ్చిన మావోయిస్టులు భద్రును బయటకు లాక్కొచ్చారు. అడ్డొచ్చిన భార్య, కుటుంబసభ్యులను పక్కకు నెట్టి ఇంటి ఆవరణలోనే గొడ్డలితో తల, నుదిటిపై నరికారు. దీంతో భద్రు అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న బైరంఘడ్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బైరంఘడ్ తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. కాగా, పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నందునే హతమార్చామని, ఇలా ఎవరు వ్యవహరించినా ఇదే శిక్ష పడుతుందని హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ వదిలారు. -
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసిన కోబ్రాలు
-
అక్కడ ఎన్కౌంటర్.. ఇక్కడ కలకలం
ఛత్తీస్‌గఢ్ దక్షిణ బస్తర్ కాంకేర్, మారేడుబాక అడవుల్లో ఆరు రోజుల కిందట జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించగా.. మృతుల్లో కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగానది పేరిట వెలువడిన ప్రకటనతో గందరగోళం ఏర్పడింది. ఈ విషయమై దామోదర్ కుటుంబసభ్యులకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారమూ లేకపోగా, మూడు రోజుల ఆందోళన తర్వాత దామోదర్ క్షేమంగానే ఉన్నాడన్న వార్త కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ఊరట కలిగించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు నౌపాడ, గరియాబాద్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జ్ రాంచంద్రారెడ్డి అలియాస్ చలపతితోపాటు 20 మంది వరకు మృతి చెందినట్టు పోలీసులు మంగళవారం ప్రకటించారు. వరంగల్, కాజీపేట ప్రాంతాలకు చెందిన మోడెం బాలకృష్ణ, ఎం.సాంబయ్యలు కూడా మృతుల్లో ఉన్నట్టు మీడియా ద్వారా ప్రచారం జరిగింది. ఆ ఇద్దరి కుటుంబసభ్యులు, బంధువులు ఫోన్ల ద్వారా పలువురిని ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదించి చివరకు లేరని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.సాక్షిప్రతినిధి, వరంగల్ : ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా సరిహద్దు.. అబూజ్మడ్ దండకారణ్యం.. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలంగాణ పల్లెల్లో కలకలం రేపుతున్నాయి. సీపీఐ (మావోయిస్టు) పార్టీ దండకారణ్య కమిటీల్లో ఇప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన వారే కీలకంగా వ్యవహరిస్తుండగా, ప్రతీ ఎదురుకాల్పుల సంఘటనలో ఒక్కరిద్దరు ఉంటున్నారు. దీంతో ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస ఎదురుకాల్పుల సంఘటనలు మావోయిస్టుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో పోలీసులు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబాలను కలిసి జనజీవన స్రవంతిలో కలిసేలా చూడాలని కౌన్సెలింగ్ చేస్తుండగా, మావోయిస్టులు మాత్రం పోరుబాటలోనే సాగుతున్నారు. మోస్ట్ వాంటెడ్ల్లో వరంగల్ వారే 23 మంది తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ తదితర 11 రాష్ట్రాల్లో పని చేస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతల వివరాలపై కేంద్ర హోంశాఖ గతేడాది మార్చిలో ఆరా తీసింది. తెలంగాణలోని పాత 10 జిల్లాల నుంచి 64 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలలో పనిచేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 23 మంది అజ్ఞాతంలో ఉన్నట్టు ప్రకటించింది. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల నేతల వివరాలను జిల్లాలు, పోలీస్స్టేషన్ల వారీగా ఇటీవల ఎన్ఐఏ కూడా ఆరా తీసింది. హనుమకొండ, జేఎస్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి అజ్ఞాతంలో ఉన్న నేతల వివరాలను మోస్ట్‌వాంటెడ్ జాబితాలో చేర్చారు. ఇందులో కేంద్ర కమిటీతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, దండకారణ్యం కమిటీల్లో కీలకంగా ఉన్న మోడం బాలకృష్ణ అలియాస్ మహేశ్, బాబన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్, బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, గాదె రాజు, సుంకరి రాజ్, గీరెడ్డి పవనానందరెడ్డి అలియాస్ అర్జున్, ఉల్లెంగుల యాకయ్య అలియాస్ అంజన్న, పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ముప్పిడి సాంబయ్య అలియాస్ బాబన్న, అంకేశ్వరపు సారయ్య అలియాస్ ఎల్లన్నలతోపాటు మొత్తం 23 మంది పేర్లను వెల్లడించారు. కేంద్ర కమిటీల్లో కీలకంగా తెలంగాణ నేతలు సీపీఐ (మావోయిస్టు) పారీ్టలో కేంద్ర కమిటీ సభ్యులతోపాటు వివిధ బాధ్యతల్లో తెలంగాణకు చెందిన పలువురు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసీసీ) విలీనం సమయంలో 32 మందితో ఉన్న కేంద్ర కమిటీ ఆ తర్వాత అనేక కారణాల వల్ల 24 మందికి చేరినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. సెంట్రల్ రీజినల్ బ్యూరోగా ఉన్న కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరణం తర్వాత కమిటీ పునరుద్ధరణ జరిగినట్టు చెబుతున్నారు. కాగా, ఈ 24 మందిలో తొమ్మిది మంది జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారు కాగా, 15 మందిలో 12 మంది తెలంగాణ వారే. కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు నియామకం తర్వాత, అప్పటివరకు కేంద్రకమిటీ కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి.. ప్రస్తుతం సీసీ మెంబర్‌గా, అంతర్జాతీయ విప్లవపార్టీల సమాఖ్యకు ఇన్చార్జ్గా ఉన్నట్టు సమాచారం. -
భారీ ఎన్ కౌంటర్.. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు
-
నక్సలిజం కొన ఊపిరితో ఉంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది నక్సలైట్లు మృతిచెందడం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘నక్సలిజానికి మరో పెద్ద ఎదురుదెబ్బ. దేశాన్ని నక్సల్ రహితం చేయాలన్న లక్ష్యం దిశగా భద్రతాబలగాలు పెద్ద విజయం సాధించాయి. సీఆర్పీఎఫ్, ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఛత్తీస్‌గఢ్ పోలీసు బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో 14 మంది నక్సలైట్లు మృతి చెందారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇదొక ముందడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది..’ అని అమిత్ షా పేర్కొన్నారు.2026 నాటికి అంతం చేస్తాం: ఛత్తీస్‌గఢ్ సీఎంకేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కారు నక్సలిజం అణచివేతను విజయవంతంగా కొనసాగిస్తోందని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ పేర్కొన్నారు. ‘2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తాం. ఆ దిశగా భద్రతా దళాలు ముందుకెళుతున్నాయి’ అని ఆయన తెలిపారు. -
'దండకారణ్యం' నెత్తురోడింది
చర్ల/ మల్కన్‌గిరి/ సాక్షి, పాడేరు: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మృతి చెంది వారం తిరగకముందే.. ఛత్తీస్‌గఢ్– ఒడిశా సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లా కులారీఘాట్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చలపతి కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతుల సంఖ్య 25 నుంచి 30 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి తర్వాత కూడా ఎదురుకాల్పులు, కూంబింగ్ కొనసాగుతూ ఉండటంతో బుధవారం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 19వ తేదీ నుంచే కూంబింగ్.. దండకారణ్యంలోని కులారీఘాట్ అటవీ ప్రాంతంలో 60 మందికిపైగా మావోయిస్టులు సమావేశం అయ్యారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీఆర్పీఎఫ్, కోబ్రా, డి్రస్టిక్ట్ ఫోర్స్, ఒడిశాకు చెందిన ఎస్ఓజీ (స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్) బలగాలు ఈ నెల 19 నుంచి సరిహద్దుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 20వ తేదీన ఉదయం పోలీసు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ మొదలైంది. తొలిరోజు ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను రంగంలోకి దింపి.. సోమవారం మధ్యాహ్నం నుంచి కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. మంగళవారం తెల్లవారుజామున మళ్లీ మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కొన్ని గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ ఎన్కౌంటర్లో 14 మంది మృతి చెందారు. రెండు రోజుల్లో కలిపి మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 16కు పెరిగింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ మిలిటరీ కమిషన్ చీఫ్ చలపతి అలియాస్ ప్రతాపరెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం ఈ ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొందరు కీలక నేతలు కూడా మృతుల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చలపతి మృతిపై స్పష్టత ఇచ్చిన పోలీసులు మిగతా వారి వివరాలను వెల్లడించలేదు. మృతుల సంఖ్య 25 – 30 మంది వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. 1,500 మంది.. 15 కిలోమీటర్ల సర్కిల్‌గా.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన సుమారు 1,500 మంది పోలీసు బలగాలు కులారీఘాట్ అడవిని చుట్టుముట్టాయి. సుమారు 15–20 కిలోమీటర్ల సర్కిల్‌గా ఏర్పడి... కూంబింగ్ చేపడుతూ దగ్గరికి వచ్చాయి. సుమారు ఐదు కిలోమీటర్ల సర్కిల్‌లోకి రాగానే మావోయిస్టులు తారసపడినట్టు తెలిసింది. ఎన్కౌంటర్లో మరణించిన చలపతి సెంట్రల్ కమిటీ సభ్యుడు కావడంతో ఆయనకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ముందు వరుసలో సెంట్రీలు కాపలాగా ఉంటే చివరి వరుసలో ఫీల్డ్ పెట్రోలింగ్ టీమ్ రక్షణగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాంబులు అమర్చి ఉంటాయి. అయితే అగ్రనేతలు ఉన్నారనే పక్కా సమాచారంతోనే భద్రతా వలయాన్ని ఛేదించుకుని బలగాలు దాడి చేసినట్టు తెలిసింది. ఘటనాస్థలంలో ఇప్పటివరకు పది వరకు ఐఈడీలను గుర్తించి తొలగించినట్టు సమాచారం. సరిహద్దుల్లో హైఅలర్ట్! కులారీఘాట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటన జరిగిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీస్ స్టేషన్లు, ఔట్‌పోస్టుల పరిధిలో రెడ్ అలర్ట్ అమలు చేస్తున్నారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపి కూంబింగ్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతోనూ నిఘా పెట్టారు. -
మావోయిజం చివరి దశలో ఉంది: అమిత్ షా
-
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్
సాక్షి, ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్.. మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్లో పేర్కొన్నారు.మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్‌షా.. నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని.. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు.ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, మనోజ్ ఉన్నారు. గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయలు రివార్డ్ ప్రకటించింది. ఇదీ చదవండి: భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతిమావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్, నౌపాడలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన గాలింపులో మరో 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఇవాళ మధ్యాహ్నానికి 19కి పెరిగింది. భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.Another mighty blow to Naxalism. Our security forces achieved major success towards building a Naxal-free Bharat. The CRPF, SoG Odisha, and Chhattisgarh Police neutralised 14 Naxalites in a joint operation along the Odisha-Chhattisgarh border. With our resolve for a Naxal-free…— Amit Shah (@AmitShah) January 21, 2025 -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్
-
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్ట్ కీలక నేత చలపతి మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. ఎదురుకాల్పుల్లో 19 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. కోబ్రా బెటాలియన్, సీఆర్పీఫ్ సిబ్బంది కూంబింగ్‌లో పాల్గొన్నారు. కుటరిఘాట్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.ఈ ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు జైరామ్ అలియాస్ చలపతి మృతి చెందారు. చలపతిపై రూ.కోటి రివార్డ్ ఉంది. ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్ రైఫిల్‌తో పాటు భారీ ఎత్తున ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల 19 నుంచి రెండు రాష్ట్రాల బలగాల ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రెండు రోజులుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. నిన్న, ఇవాళ ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతిచెందారు.కాగా, తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గత గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఘటనలో బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు.తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు.ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు! -
మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
-
ఛత్తీస్‌గఢ్ అడవులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
-
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. 15 రోజుల్లో 34 మంది హతం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈ క్రమంలో 2025 ఏడాది ప్రారంభం నుంచే మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జనవరిలో ఎన్కౌంటర్ల కారణంగా 15 రోజుల వ్యవధిలో ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఛత్తీస్‌గఢ్(chhattisgarh)లో భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ఈనెల ఆరో తేదీన బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టుల(maoists) బెద్రే _కుట్రు ఘటనతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. మావోయిస్టుల ఘాతకంతో ఎనిమిది మంది జవాన్లు, డ్రైవర్ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనతో అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. ఇందులో భాగంగా 15 రోజల సమయంలో 34 మంది మావోయిస్టులను హతమార్చారు. తాజాగా బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాలకు చెందిన నక్సలైట్లు మృతి చెందారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్‌కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.రాష్ట్ర సరిహద్దుల్లో ఘటనతెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 19 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. అయితే, ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిలో అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు పార్టీకి మరో భారీ దెబ్బ తగిలింది. తెలంగాణ సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. వీరిలో తెలంగాణ కేడర్‌కే చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటన.. బిజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావో యిస్టులు అమర్చిన మందుపాతర పేలిన ఘటనలో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయపడ్డారు. వీరికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఘటనతెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం(కే) మండల సరిహద్దులోని మారేడుబాక –ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరం ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు గురువారం ఉదయం కూంబింగ్ ప్రారంభించాయి. మొత్తం రెండు వేల మంది జవాన్లు అడవులను జల్లెడ పట్టడం మొదలెట్టారు. ఉదయం 9 గంటల సమయంలో తొలిసారిగా కాల్పులు మొదలయ్యాయి. అప్పటి నుంచి రాత్రి 7 గంటల వరకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 17 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతులు ఎవరు? ఎంత మంది చనిపోయారనే అంశంపై అధికారిక సమాచారం వెలువడలేదు. ఇదీ చదవండి: సైఫ్‌పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్ -
ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల ఘాతుకం
-
ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్
-
సంచలనంగా జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రాకర్ కేసు.. ముగ్గురి అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ జర్నలిస్ట్ హత్యకు గురైన ఉదంతం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రోడ్డు పనుల్లో అవినీతి జరిగిందని ఈమధ్య ఆయన స్టోరీ చేశారు. అందుకే ఆయన్ని హతమార్చి ఉంటారనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అందులో ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు. బీజాపూర్‌కు చెందిన ముఖేశ్ చంద్రాకర్(mukesh chandrakar) గతంలో పలు పత్రికలు, చానెళ్లలో పనిచేయగా ప్రస్తుతం ఓ టీవీలో పనిచేస్తూనే.. సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ చానెల్ నడిపిస్తున్నారు. ఈనెల 1న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాకపోవడంతో ముఖేశ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా విచారిస్తుండగా బీజాపూర్‌లోని చట్టాన్పారా(Chattanpara) ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించారు. సదరు ఇల్లు కాంట్రాక్టర్ సురేష్ చంద్రాకర్దిగా తేలింది. సురేష్‌ను హైదరాబాద్‌లో బీజాపూర్ పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం.మధ్యవర్తిగా వార్తల్లో.. ఛత్తీస్‌గఢ్‌లో పలు సందర్భాల్లో కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పోలీసు సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే ముఖేశ్ అడవుల్లోకి వెళ్లి చర్చల ద్వారా వారిని విడిపించిన ఘటనలు ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దు తెర్రెం సమీపాన ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లను మావోయిస్టులు హతమార్చి సీఆర్పీఎఫ్(CRPF) కానిస్టేబుల్ రాకేశ్సింగ్ను కిడ్నాప్ చేశారు. దీంతో ఆయన ఉన్నతాధికారులు, జవాన్ కుటుంబీలకు వినతితో మావోయిస్టులతో చర్చలు జరిపి జవాన్‌ను బయటకు తీసుకొచ్చారు. అంతకు ముందు బీజాపూర్‌కు చెందిన ఎన్ఆర్ఈజీఎస్ ఏఈని మావోయిస్టులు కిడ్నాప్ చేస్తే సహచర జర్నలిస్టులతో కలిసి ఆయన మావోయిస్టులతో చర్చలు జరిపి విడిపించారు. -
బోర్ వెల్ నుంచి వస్తున్నయ్ మంటలు
-
సన్నీ లియోన్ పేరిట మోసం
నటి సన్నీ లియోన్ పేరును ఉపయోగించుకుని ప్రభుత్వం నుంచి నెలకు వెయ్యి రూపాయలు పొందుతున్న వ్యక్తిని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలలో ఇలాంటి మోసం జరిగిందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో అర్హత కలిగిన వివాహిత మహిళల కోసం ఆర్థిక సహాయ చేసేందుకు 'మహతారీ వందన్ యోజన'పథకాన్ని ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అయితే, కొందరు దీనిని ఆసరా చేసుకుని తప్పుడు పత్రాలు అందించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని తాలూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డాడు. సన్నీ లియోన్ పేరు మీద బ్యాంక్ ఖాతా తెరిచి, అందులో జమ అయ్యే 1,000 మొత్తాన్ని తన జేబులో వేసుకున్నాడు. తాజాగా మహిళల ఖాతాలను అధికారులు పరిశీలిస్తుండగా అందులో సన్నీలియోన్ పేరు ఉండడాన్ని గుర్తించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై లోతుగా విచారణ జరిపి బ్యాంకు ఖాతాను కలెక్టర్ హరీస్ సీజ్ చేశారు. అతను అందుకున్న డబ్బు రికవరీ చేయాలని మహిళా శిశు అభివృద్ధి శాఖను కలెక్టర్ ఆదేశించారు. మహిళలందరికీ వర్తించే మహతారీ వందన్ యోజన పథకంలో అతను మోసానికి పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సన్నీ లియోన్ పేరుతో బ్యాంకు ఖాతాకు అనుమతి ఇచ్చిన బ్యాంక్ అధికారులతో పాటు ప్రభుత్వ పథకం మంజూరు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈ వార్త వెలుగులోకి రావడంతో అధికార బీజేపీపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇరు పార్టీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. 'మహతారీ వందన్ యోజన'పథకం కింద సుమారు 50 శాతం మంది లబ్ధిదారులు నకిలీలే అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైజ్ ఆరోపించారు. సన్నీ లియోన్ పేరుతో నెలకు వెయ్యి రూపాయలు అందుకున్న ఈ కేటుగాడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
‘బస్తర్’లో మావోయిజం ఖాళీ!
ఒకప్పుడు పోలీసులపైకి మెరుపు దాడులు, మందుపాతరల పేలుళ్లు, తుపాకీ మోతలు, బుల్లెట్ల శబ్దాలు, వరుస ఎన్కౌంటర్లతో రక్తమోడిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బస్తర్ పేరు చెబితేనే భయపడేంతగా గజగజలాడించిన మావోయిస్టులు ఇప్పుడు అక్కడ తమ పట్టును కోల్పోయారని కేంద్రం పేర్కొంది. ప్రాభల్యం తగ్గిపోవడం, పోలీసుల ముమ్ముర ఏరివేత కార్యక్రమాలు, మరోవైపు పునరవాస కల్పనా చర్యలు, ఇంకోవైపు అభివృధ్ధి కార్యక్రమాల కారణంగా ఇప్పుడు ఆ ప్రాంతంలో మావోయిజం పూర్తిగా కనిపించకుండా పోయిందని వెల్లడించింది. కేంద్ర చర్యలతో .. బస్తర్ డివిజన్లో బస్తర్, దంతెవాడ, బీజాపూర్, కంఖేర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా మొత్తంగా ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటిల్లో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న జిల్లాగా బస్తర్ పేరొందింది. ముఖ్యంగా 2013 ఏడాది మే నెలలో కాంగ్రెస్ నేతలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 27 మందితో పాటు 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఈ దాడిలోనే కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి మహేంద్ర కర్మ చనిపోయారు. ఆ తర్వాత సైతం ఈ జిల్లా పేరు చెబితేనే పోలీసు బలగాల్లోనూ వణుకు పుట్టేంతస్థాయిలో మావోల మెరుపుదాడులు కొనసాగాయి. 2014 తర్వాత మావోల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దూకింది. ఈ జిల్లావ్యాప్తంగా భద్రతా బలగాల సంఖ్యను విపరీతంగా పెంచింది. లొంగుబాట్లను ప్రోత్సహించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో గడిచిన రెండేళ్లుగా పోలీసులు, మావోలకు మధ్య పరస్పర కాల్పుల ఘటన ఒక్కటి కూడా నమోదు కాలేదు. పైగా జిల్లాలో ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ కాగా, మరో 13 మంది కీలక సభ్యులు లొంగిపోయారు. ఈ ఏడాదిలో మావో సంబంధ ఘటన ఒక్కటి కూడా నమోదుకాలేదు. సమీప కొండగావ్ జిల్లాలోనూ ఒక్క ఘటన నమోదుకాలేదు. రెండు జిల్లాలకు పొరుగునే ఉన్న బీజాపూర్ జిల్లాలో 465 మంది, సుక్మా జిల్లాలో 253 మంది మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణపూర్, బీజాపూర్ జిల్లాలో రెండేళ్లలో 100 మందికి పైగా మావోలు పోలీసుల ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. గత ఐదు దశాబ్దాలుగా మావోల కదలికలతో నిత్యం వార్తలో ఉండే బస్తర్ జిల్లాలో ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క మావోయిస్టు దుశ్చర్యకు సంబంధించిన ఘటనలు జరగకపోవడం విశేషం. కొండగావ్లోనూ మావోల ఉనికి లేదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోలకు మధ్య జరిగిన పరస్పర ఎదురుకాల్పుల్లో 208మంది మావోలు చనిపోయారు. బస్తర్, కొండగావ్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగకపోవడం విశేషం. 802 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. బహుముఖ వ్యూహంతో ముందుకు 2026 నాటికి పూర్తిస్థాయిలో మావోలను ఏరివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ప్రభుత్వం ఈ లక్ష్యసాధన కోసం బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. ఓపక్క భద్రతా చర్యలను పటిష్టం చేస్తూనే, మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడంపై ప్రధానంగా దృష్టిసారించింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిపై దృష్టి పెట్టింది. చౌక ధరల దుకాణాలను పెంచడం, సమాచార వ్యవస్థల పటిష్టం, ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, రహదారులకు భారీగా నిధుల కేటాయింపు, లొంగిపోయే మావోలకు తక్షణ పునరావాస కార్యక్రమాలతో వారి ఉనికిని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తాజాగా పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నుంచి మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 12 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. అలాగే, దంతెవాడ-నారాయణ్‌పుర్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
లోన్ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్ మేనేజర్!
చత్తీస్‌గఢ్‌లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్‌కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్‌లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసి మేనేజర్‌కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్‌పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భద్రతా బలగాల బేస్ క్యాంప్‌పై మావోల మెరుపు దాడి
రాయ్‌పూర్ : తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దులోని పామేడు ఏరియాలో ఉద్రిక్తత నెలకొంది. పామేడు వద్ద భద్రత బలగాల బేస్ క్యాంప్‌పై మావోయిస్ట్‌లు మెరుపు దాడి చేశారు. మావోయిస్ట్‌ల దాడుల్ని భద్రతబలగాలు తిప్పుకొడుతున్నాయి. కాగా, మావోయిస్ట్‌ల చేసిన దాడిలో ఐదుగురు భద్రతా బలగాలకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా బలగాలు గాయపడ్డ జవాన్లను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఛత్తీస్ ఘడ్ లో కాల్పుల కలకలం
-
కాంగ్రెస్ వలసవాద మనస్తత్వానికి ఇదే ఉదాహరణ : ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్లో కాంగ్రెస్ వ్యవహార శైలిపై రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉన్న నమ్మకం.. మన దర్యాప్తు సంస్థలపై లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారాయన.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్ అసత్య ప్రచారానికి దిగింది. లోక్‌సభ వాయిదా తీర్మానంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తమ సొంత పార్టీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ వ్యవహారాన్ని పక్కన పెడుతోంది. దీనిని బట్టే ఆ పార్టీ అర్ధసత్యాలు ప్రచారం చేస్తోందని అర్థమవుతోంది.ఆ పార్టీకి భారత దర్యాప్తు సంస్థలపై లేని నమ్మకం విదేశీ దర్యాప్తు సంస్థలపై ఉండడం మన దౌర్భాగ్యం. విదేశీ దర్యాప్తు సంస్థలపై కాంగ్రెస్‌కు ఉన్న నమ్మకం.. వాళ్ల వలసవాద మనసత్వానికి ఉదాహారణ నిలుస్తోంది’ అని ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.The Congress’ adjournment motion in the Lok Sabha conveniently targets @ysjagan garu while conspicuously shielding their own CM in Chhattisgarh. This selective narrative exposes Congress’ penchant for telling only half the story. Their faith in foreign agencies over Indian…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 27, 2024 -
అడవిలో కాల్పుల మోత..
-
భారీ ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా భెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళలు సహా పది మంది మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతం ఏపీ, తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో మూడు రాష్ట్రాల పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. భెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరాజ్‌గూడ, దంతేస్పురం, నగరం, భండార్‌పదర్ గ్రామాల మధ్య అడవుల్లో కుంట– కిష్టారం ఏరియా నక్సల్స్ కమిటీ సమావేశమైంది. నక్సలైట్ల సమావేశంపై పక్కా సమాచారం అందుకున్న జిల్లా, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం భండార్‌పదర్ గ్రామ సమీపంలో మావోలకు పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో ఒక్కసారిగా పరస్పర కాల్పులు మొదలయ్యాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాల్పులు కొనసాగాయి. ఇందులో పది మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ ప్రకటించారు. మృతుల్లో డివిజినల్ కమిటీ సభ్యుడు మద్కం మాసా, మాసా భార్య దుధీ హునీ, ఏరియా కమిటీ సభ్యురాలు లఖ్మా మాధవి, గార్డ్ కొవసీ కోసా, మద్కం జితూ, మద్కం కోసీలుగా గుర్తించారు. మద్కం మాసాపై రూ.8 లక్షలు, లఖ్మాపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది. మిగతా నలుగురిని గుర్తించాల్సి ఉంది. ఘటనస్థలం నుంచి ఇన్సాస్, ఏకే 47, ఎస్ఎల్ఆర్, బ్యారెల్ గ్రనేడ్ లాంఛర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మావోలపై ఉక్కుపాదందేశంలో 2026 మార్చి నాటికి మావోయి స్టులను అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లలో 207 మంది మావోలు చనిపోగా 787 మంది అరెస్ట్ అయ్యారు. 789 మంది లొంగిపోయారు. దీంతో బస్తర్ అడవుల్లో సంచరించడం మావో యిస్టు దళాలకు కష్టంగా మారింది. నిర్బంధం పెరగడంతో దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల నుంచి ఇతర రాష్ట్రాల్లోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు మావోలు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పోలీసులు నిఘా పెంచారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దు మల్కన్‌గిరి జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు చనిపోయాడు.తెలుగు మాట్లాడే ప్రాంతంలో..ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఏపీలోని చింతూరు, తెలంగాణలోని దుమ్ముగూడెం ప్రాంతాలకు సరిహద్దుగా ఉంది. ఇక్కడ ఉన్న ఆదివాసీ గ్రామాల పేర్లు తెలుగులో ఉండడమే కాక వారు తెలుగు కూడా మాట్లాడగలరు. ఉపాధి, విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు వచ్చివెళ్తుంటారు. ఈ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో ఏపీ, తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెరిగిపోవడంతో ఈ గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా గాలిస్తున్నా ఇప్పటికీ మావోయిస్టు అగ్రనా యకత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం ఒక్కటే మావోయిస్టులకు ఊరటనిస్తోంది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కాంకేర్ – నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లోని నార్త్ అబూజ్‌మడ్‌లో గల పేకమెటాకపూర్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో రెండు జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ విభాగాల పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే కూంబింగ్ చేపట్టారు.ఈ క్రమంలో శనివారం బలగాలకు తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరపగా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మరి కొందరు తప్పించుకున్నారు. కాగా, ఈ ఘటనలో చిర్మాన్ యాదవ్, కైలేశ్వర్ గావ్డే అనే జవాన్లు తీవ్రంగా గాయపడడంతో నారాయణపూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, మందులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో చలి విజృంభణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌ను చలిపులి చంపేస్తోంది. నవంబర్ రెండో వారం నాటికే ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని సూరజ్‌పూర్, సుర్గుజా, మార్వాహి, కోర్బా, ముంగేలి, బిలాస్పూర్, రాజ్‌నంద్‌గావ్, బలోద్, కంకేర్, నారాయణపూర్, బీజాపూర్, బస్తర్, దంతెవాడ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ జిల్లాల్లో చలి తీవ్రంగా ఉంది.రానున్న మూడు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదని వాతావరణ నిపుణుడు హెచ్‌పీ చంద్ర తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.గత 24 గంటల్లో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూరజ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలు, బలరామ్‌పూర్ రామానుజ్గంజ్లో 29.4 డిగ్రీలు, సర్గుజాలో 28.9 డిగ్రీలు, జష్పూర్లో 29.9 డిగ్రీలు, కొరియాలో 29.4 డిగ్రీలు, మర్వాహిలో 28.9 డిగ్రీలు, కోర్బాలో 30.3 డిగ్రీలు, ముంగేలిలో 3.4 డిగ్రీలు, 3.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అదే సమయంలో, రాజ్‌నంద్‌గావ్‌లో 30.5 డిగ్రీలు, బలోద్‌లో 31.7 డిగ్రీలు, కంకేర్‌లో 30.7 డిగ్రీలు, నారాయణపూర్‌లో 29.4 డిగ్రీలు, బస్తర్‌లో 30.3 డిగ్రీలు, బీజాపూర్‌లో 30.9 డిగ్రీలు, దంతవాడలో 32 డిగ్రీల సెల్సియస్‌గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజధాని రాయ్‌పూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.ఇది కూడా చదవండి: National Education Day: ఉన్నత విద్యకు ఊపిరి పోసి.. -
ఆసియాలో అతిపెద్ద ఛత్ ఘాట్ ఇదే..
పూర్వాంచల్: ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో ఛత్ పండుగ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల పూర్వాంచల్‌లో ఉన్న ఛత్ ఘాట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అర్పా నది ఒడ్డున నిర్మించిన ఈ ఛత్ ఘాట్ ఆసియాలోనే అతిపెద్ద ఛత్ ఘాట్‌గా పేరొందింది. ఈ ఘాట్ మొత్తం పొడవు సుమారు ఒక కిలోమీటర్లు ఉంటుంది. ఛత్ పూజలు నిర్వహించేందుకు ఈ ఘాట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.ఈ ఏడాది 50 వేల మందికి పైగా ఛత్వర్తీలు ఈ ఛత్ ఘాట్‌లో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు లక్షల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి తరలిరానున్నారు. ఛత్ పండుగ సందర్భంగా అర్పా నది ఒడ్డును అందంగా అలంకరించారు. భద్రత దృష్ట్యా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ ఘాట్‌ను జిల్లా యంత్రాంగం, భోజ్‌పురి సొసైటీ కొన్నేళ్ల క్రితమే నిర్మించింది. ప్రతి ఏటా ఛత్ పూజ సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివచ్చి, సూర్య భగవానుని ఆరాధిస్తారు. గత 24 సంవత్సరాలుగా భోజ్‌పురి కమ్యూనిటీ ప్రజలు ఈ ఘాట్‌ను ప్రార్థనా స్థలంగా ఉపయోగిస్తున్నారు. ఛత్ పూజలు జరిగే సమయంలో భక్తులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తారు. భక్తులు నదిలో నిలబడి పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే ఛత్ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు -
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి
-
సుక్మా జిల్లాలో మావోయిస్ట్‌ల అలజడి
ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలో నక్సల్స్ అలజడి సృష్టించారు. జేగురుకొండ వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల దాడి చేశారు. ఈ దాడిలో జేగురుకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. గాయపడ్డ పోలిసుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలో వారపు సంతలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నక్సలైట్ల యాక్షన్ టీమ్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లు కరటం దేవా, సోడి కన్నాలకు గాయాలయ్యాయి. వారి వద్ద నుంచి రెండు తుపాకుల్ని అపహరించారు. -
తుల్తులీ ఎన్కౌంటర్ మృతులు 38 మంది
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ చరిత్ర లోనే అతి పెద్దదిగా పరిగణిస్తున్న తుల్తులీ ఎన్కౌంటర్లో రోజులు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఈనెల 4న నారాయణపూర్ జిల్లా పరిధిలోని తుల్తులీ, గవాడీ గ్రామాల మధ్య ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో తొలి రోజు 31మంది చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.అందులో 22మందిని గుర్తించగా మిగిలిన వారిని గుర్తించలేకపోయారు. ఘటన జరిగిన 10 రోజుల తర్వాత మావో యిస్టులు లేఖ విడుదల చేస్తూ ఈ ఎదురు కాల్పుల్లో మొత్తం 35మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఇక్కడితోనే మృతుల సంఖ్య ఆగిపోతుందని అంతా అనుకున్నారు. అయితే దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ శుక్రవారం ఈ ఎన్‌కౌంటర్‌పై మరిన్ని వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం తుల్తులీ ఎన్కౌంటర్లో మొత్తం 38మంది చనిపోయారని వెల్లడించారు. మృతులపై ఉన్న రివార్డు మొత్తం రూ.2.60 కోట్లుగా ఉంది. -
తుల్తులీ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మావోయిస్టులు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ మొత్తంగా 35 మంది సభ్యులను నష్టపోయింది. ఈ ఎదురుకాల్పులపై ముందుగా ప్రకటన చేసిన పోలీసులు 31 మంది చనిపోయినట్టుగా పేర్కొన్నారు. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న 31 మృతదేహాల్లో 22 మందినే గుర్తుపట్టగా, మిగిలిన వారు ఎవరనే అంశంపై సందిగ్ధత కొనసాగింది. అయితే ఎన్కౌంటర్ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ స్పందించింది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 35 మంది చనిపోయినట్టు ఆదివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఆ పార్టీ పేర్కొంది. ఘటన జరిగిన తీరుపైనా పోలీసులు వెల్లడించిన వివరాలకు మించి అనేక అంశాలను మావోయిస్టులు ప్రకటించారు.మూడో తేదీనే చేరుకున్న బలగాలు మావోయిస్టులు బస చేసిన దంతెవాడ – నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దు అబూజ్మడ్ అడవుల్లోకి పోలీసులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, డీఆర్జీ బలగాలు ఈనెల 3వ తేదీ రాత్రికే చేరుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు రోలింగ్ కాల్‌కు పిలుపునిచ్చి టీ, టిఫిన్లు చేసేందుకు తాము సిద్ధమవుతున్న సమయాన ఆ ప్రాంతంపై డ్రోన్లు ఎగురుతూ కనిపించాయని మావోయిస్టులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమై సమీప గ్రామంలో విచారిస్తే భద్రతా దళాలు చుట్టుముట్టునట్టు రూఢీ అయ్యిందని.. ఈ క్రమాన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే 4న ఉదయం 10 గంటలకు కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఆ తర్వాత 11:30 గంటలకు ఊపందుకున్న కాల్పులు రాత్రి 9 గంటల వరకు పలుమార్లు కొనసాగాయని మావోలు ప్రకటించారు.పట్టు సాధించిన బలగాలుబస్తర్ ప్రాంతంలో దండకారణ్యం, అబూజ్మడ్ ప్రాంతాల్లో మావోయిస్టులకు గట్టిపట్టు ఉండేది. దండకారణ్య ప్రాంతంలో జనతన సర్కార్‌ను బీజ దశ నుంచి ఆ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ రాగా, అబూజ్మడ్ ప్రాంతం షెల్టర్ జోన్‌గా ఉపయోగపడేది. కానీ గడిచిన రెండేళ్లుగా దండకారణ్యం ప్రాంతంపై భదత్రా దళాలు, పోలీసులు కలిసికట్టుగా మావోల ప్రభావాన్ని తగ్గించగలిగారు. అంతేకాక మావోయిస్టుల అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు 2 వేల మంది భద్రతా దళాలు, ఆధునిక సాంకేతిక సంపత్తితో అడవులను గాలిస్తూ మావోల అడ్డాకు చేరుకోవడమే పెద్ద విజయం అనుకునే అభిప్రాయం నుంచి మాడ్ అడవుల్లోనే ఏకంగా 35 మంది మావోయిస్టులు నేలకొరిగేలా చేయగలగడం ప్రభుత్వ పరంగా భారీ విజయంగానే ఉంది. కాల్పులు జరిగిన తీరుపై మావోయిస్టులు వెల్లడించిన అంశాలు ఈ అభిప్రాయాన్నే బలపరుస్తున్నాయి. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం 31 కాదు 35 మంది మృతి..తుల్తులీ–గవాడీ ఎదురు కాల్పుల్లో నేరుగా 14 మంది చనిపోగా తమ పార్టీకి చెందిన 17 మంది దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని మావోయిస్టులు లేఖలో వెల్లడించారు. దీంతో వీరిని అక్కడే పట్టుకున్న ప్రభుత్వ బలగాలు మరుసటి రోజైన అక్టోబర్ 5 ఉదయం 8 గంటలకు కాల్చిచంపారని ఆరోపించారు. దీంతో అధికారికంగా 31 మంది చనిపోయినట్టు నిర్ధారణ కాగా.. మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతూ మావోల చెంతే చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 35గా మావోయిస్టులు వెల్లడించారు. -
రౌడీ షీటర్ కిరాతకం: కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్య
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దారుణం చోటు చేసుకుంది. బెయిల్‌పై విడుదలైన ఓ రౌడీ షీటర్.. సూరజ్‌పూర్ జిల్లాలోని మార్కెట్ ఏరియాలో ఓ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలోకి చొరబడ్డాడు. హెడ కానిస్టేబుల్ భార్య, మైనర్ కుమార్తెను హత్యచేశారు. సూరజ్‌పూర్ ఎస్పీ ఎంఆర్ అహిరే తెలిపిన వివారాల ప్రకారం.. ‘‘హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడైన హిస్టరీ-షీటర్ కుల్దీప్ సాహు. ఆదివారం సాయంత్రం మార్కెట్ ప్రాంతంలో కానిస్టేబుల్ ఘన్‌శ్యాం సోన్వానీతో వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా ఆ కానిస్టేబుల్‌పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశాడు. సోన్వానీకి కాలిన గాయాలయ్యాయి. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. తర్వాత నిందితుడు దుర్గా ఊరేగింపులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆయన మైనర్ కుమార్తె , భార్యను హత్య చేశాడు. షేక్ తన ఇంటికి అర్థరాత్రి చేరుకొని చూడగా.. ఇంట్లో దోపిడి జరిగినట్లు, భార్య, కుమార్తె మృతి చెంది కనిపించారు. దీంతో తాలిబ్ పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం ఉదయం పిధా గ్రామంలో పోలీసులు మహిళ హెడ్ కానిస్టేబుల్ కుమార్తె, భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు’’ అని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. సూరజ్‌పూర్ పట్టణంలోని హెడ్ కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్యలను నిరసిస్తూ నిందితుడు సాహు నివాసం, బయట ఉన్న వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టారు. ఈ హత్య ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. -
అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినా.. మౌనం వీడని మావోయిస్టులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తుల్తులీ–గవాడీ ఎదురుకాల్పులపై మావోయిస్టుల నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొని ఆరు రోజులు గడుస్తున్నా మావోయిస్టు పార్టీ మౌనం వీడలేదు. దీంతో ఆ పార్టీకి తాజా ఎన్కౌంటర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై పోలీసు వర్గాలు చెప్పే వివరణను విశ్లేషిస్తూ.. కొన్నిసార్లు విమర్శలు చేస్తూ, మరికొన్నిసార్లు అన్ని అబద్ధాలే అంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తుంటారు. తాజా ఎన్కౌంటర్ ఎలా జరిగింది, దానికి కారణాలు ఏంటనే అంశాలపై మావోలకే ఇంకా స్పష్టత రాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నక్సలైట్ల అంచనాలకు అందని రీతిలో భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద లీడర్లు ఉంటారని ప్రచారం జరిగినా.. ఈ నెల 4న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యురాలు నీతి అలియాస్ ఊరి్మళ సహా 22 మంది పేర్లు, మావోయిస్టు పారీ్టలో వారి హోదాలు, వారిపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు వంటి వివరాలను పోలీసులు వెల్లడించారు. మరో తొమ్మిది మంది ఎవరనేది గుర్తించలేకపోయారు. పైగా ఎన్కౌంటర్ జరిగిన రోజు మృతుల్లో నంబాళ్ల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు వంటి టాప్‌మోస్ట్ లీడర్లు ఉన్నారనే పుకార్లు షికారు చేశాయి. రోడ్డు పనులు అడ్డుకోండి.. ఎన్కౌంటర్ చోటుచేసుకున్న తుల్తులీ–గవాడీ గ్రామాల నుంచి 30 కి.మీ. దూరంలో ఓర్చా పోలీస్‌స్టేషన్ ఉంది. అక్కడి నుంచి తుల్తులీ– గవాడీలకు చేరుకోవాలంటే దట్టమైన అడవిలో కొండలు, గుట్టలు ఎక్కుతూ.. దిగుతూ, ఎనిమిది వాగులను దాటాలి. ఓర్చా వరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చేపడుతున్న పారామిలిటరీ బలగాలు క్యాంపులను ఏర్పాటు చేశాయి. తదుపరి లక్ష్యంగా తుల్తులీ ఉంది. దీంతో తొలిసారిగా ఆ గ్రామానికి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. చదవండి: సేఫ్ జోన్ ఎక్కడ?.. తెలంగాణవైపు మళ్లీ వచ్చేందుకు మావోయిస్టుల ప్రయత్నాలుఅయితే రోడ్డు నిర్మాణ పనులు అడ్డుకోవాలంటూ ఊర్మిళ నేతృత్వంలో గవాడీ గ్రామంలో ఈనెల 2న పీఎల్జీఏ కంపెనీ 6కు చెందిన మావోయిస్టులు సమావేశం నిర్వహించినట్టు అక్కడి గ్రామస్తులు తెలిపారు. ‘రోడ్డు నిర్మాణం జరిగితే మన భూమి, మన నీరు, మన అడవిని దోచేస్తార’ని ఆ సమావేశంలో ఊర్మిళ మాట్లాడిందని చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే జరిగిన ఎదురుకాల్పుల్లో ఆమె చనిపోయారు. దళంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఊర్మిళకు ఉంది. -
నెత్తురోడుతున్న బస్తర్ అడవులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కాకులు దూరని కారడవిగా పేరున్న బస్తర్ జంగిల్లో నెత్తురు ఏరులై పారుతోంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం తలపెట్టిన పోరు కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌తో మొదలు..దేశ భద్రతకు మావోయిస్టులను ముప్పుగా పేర్కొంటూ 2009లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను ఛత్తీస్‌గఢ్‌లో అమలు చేసింది. అయితే తొలినాళ్లలోనే ఆపరేషన్ గ్రీన్‌హంట్‌కు ఎక్కువగా చెడ్డపేరు వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ గ్రీన్‌హంట్‌కు మరింత పదునుపెట్టి ఆపరేషన్ ప్రహార్ పేరుతో ఉధృతంగా దాడులు చేసింది. దీంతో ఛత్తీస్‌గఢ్ హింసపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆ తర్వాత 2018లో ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడి కాంగ్రెస్ అధికారంలోకి వచి్చంది. హస్తం పార్టీ సీఎంగా భూపేష్ బఘేల్ ఎన్నికయ్యారు. ఆయన హయాంలో మావోయిస్టులపట్ల కరుణ చూపారు. మరోవైపు కరోనా మహమ్మారి రావడంతో మావోయిస్టు ఆపరేషన్లలో తక్కువ స్థాయిలో హింస చోటుచేసుకుంది.సూర్యశక్తి, జల్‌శక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓటమిపాలై తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ పేరిట ఉక్కుపాదంతో విరుచుకుపడుతోంది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను రూపుమాపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా దళాలను బస్తర్ అడవుల్లోకి పంపిస్తోంది. వేసవి కాలంలో మావోయిస్టుల అడ్డాలపై సమర్థంగా దాడి చేసేందుకు వీలుగా ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేసింది. దీంతో జనవరి నుంచి జూన్ మధ్య 150 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులకు పట్టుండే వర్షాకాలంలో కూడా వేడి తగ్గకుండా ఉండేందుకు ఆపరేషన్ జల్‌శక్తి పేరుతో యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తోంది. ఫలితంగా అడవులు దట్టంగా పరుచుకున్నా ఎన్కౌంటర్లు ఆగడం లేదు. దీంతో బస్తర్ అడవులు అట్టుడికిపోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 187 మంది మావోయిస్టులు చనిపోగా 212 మంది అరెస్టయ్యారు. మరో 201 మంది లొంగిపోయారు. దీనికి ప్రతిగా ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు పదుల సంఖ్యలో అడవి బిడ్డలను చంపుతున్నారు. ఆర్మీ క్యాంపులపైనా దాడులకు తెగబడుతున్నారు.నాడు భారీగా ఏకే–47లు.. నేడు తూటాలకే కటకట.. పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టు పార్టీగా మారాక విస్తృతమైన ‘నెట్వర్క్’ అందుబాటులోకి రావడంతో ఆధునిక ఆయుధాలు మావోయిస్టుల చేతికి అందాయి. సల్వాజుడం, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరుతో ఎన్కౌంటర్లకు పాల్పడేందుకు రంగంలోకి దిగిన భద్రతా బలగాలపై తొలినాళ్లలో మావోయిస్టులు పైచేయి సాధించారు. ఈ క్రమంలో పలుమార్లు భద్రతా దళాల నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. ముఖ్యంగా 2007 మార్చి 15న సుక్మా జిల్లా తాడిమెట్ల దగ్గర జరిగిన దాడిలో భద్రతా దళాలకు చెందిన 145 ఆయుధాలను మావోయిస్టులు పట్టుకుపోయారు. అందులో ఏకంగా 125 ఏకే–47లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2001 నుంచి 2024 ఆగస్టు వరకు భద్రతా దళాలకు చెందిన 516 ఆటోమెటిక్ రైఫిల్స్‌ను మావోయిస్టులు ఎత్తుకుపోయారు. కానీ ఆపరేషన్ గ్రీన్‌హంట్, ఆపరేషన్ ప్రహార్, కగార్‌లతో తీవ్ర నిర్బంధం, దాడులు పెరగడం వల్ల మావోయిస్టు దళాల్లో రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి. దీంతో దళాల్లో సభ్యుల సంఖ్య కూడా కుచించుకుపోతోంది. దీంతో భద్రతా బలగాలను ఒత్తిడిలోకి నెట్టేందుకు వీలుగా తమ వైపు నుంచి ఎటాక్ తీవ్రంగా ఉండేలా డివిజన్ కమిటీ స్థాయి సభ్యులకు సైతం ఆధునిక ఆయుధాలు ఇచ్చేందుకు మావోయిస్టులు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ«టోమేటిక్ రైఫిల్స్ కలిగి ఉండే విషయంలో మావోలకు పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ వాటి కోసం ఉపయోగించే తూటాల విషయంలో కొరత ఎదురవుతున్నట్లు తెలిసింది. గతంతో పోలిస్తే తూటాల సరఫరాకు మార్గాలు చాలావరకు మూసుకుపోవడమే ఇందుకు కారణం. అందువల్లే గత నెలలో బస్తర్‌లో నాలుగైదుసార్లు భద్రతా దళాల క్యాంపులపై దాడులకు పాల్పడినా మావోలు భారీస్థాయిలో కాల్పులు చేపట్టలేదు. కేవలం అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంఛర్లతోనే దాడులు చేశారు.తెలంగాణలో నిలదొక్కుకోలేక..ఛత్తీస్‌గఢ్‌లో ఒత్తిడి పెరగడంతో తెలంగాణలో తిరిగి నిలదొక్కుకోవడానికి మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఏడుగురు నక్సల్స్ చనిపోయారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇటీవల జరిగిన కరకగూడెం ఎన్కౌంటర్ అతిపెద్దదిగా పేర్కొంటున్నారు. అక్కడ ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. -
ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో స్పష్టతకు రాని మృతుల సంఖ్య
నారాయణ్‌పుర్ - దంతెవాడ సరిహద్దులో శుక్రవారం పోలీసుల జరిపిన భారీ ఎన్కౌంటర్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 40 మంది మరణించగా.. పోలీసులు మాత్రం 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు.అయితే, మిగిలిన తొమ్మిది మంది ఎవరనేది చెప్పే ప్రయత్నం చేయలేదు పోలీసులు. పైగా ఆ తొమ్మది మంది మృతదేహాల్ని ఎవరివి అనేది దృవీకరించలేదు.ఇక ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళ మావోయిస్టులలో దళ కమాండర్ ఒకరు మరణించినట్లు ధ్రువీకరించారు. మహారాష్ట్ర నుండి 150 మంది మహిళ పోలీస్ కమాండోలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. మృతి చెందిన 31 మంది మావోయిస్టులపై సుమారు కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
-
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ 40 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి వార్షికోత్సవాల వేళ గట్టి ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులు చనిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్–దంతెవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ఘటనలో మరణించిన 40 మందిలో తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఈ భారీ ఎన్‌కౌంటర్‌తో సౌత్ అబూజ్‌మడ్‌తో పాటు నార్త్ బస్తర్ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. భారీ బలగాలతో ఆపరేషన్ భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా బస్రూర్, నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ల నడుమ గోవల్, నెందూర్, తుల్త్లీ గ్రామాల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన 1,500 మంది జవాన్లు ఆపరేషన్ ప్రారంభించారు.శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయానికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా బయటకు సమాచారం అందింది. రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వచి్చంది. రాత్రి 9 గంటల సమయానికి 36 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. భద్రతా దళాల ఘన విజయం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా బస్తర్ ఏరియా ఉంది. ఇక్కడ ఏడు జిల్లాలు ఉండగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలను దండకారణ్యంగా.. కాంకేర్, నారాయణపూర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగా, బీజాపూర్, దంతేవాడ జిల్లాలో కొంత భాగాన్ని అబూజ్‌మడ్‌గా పిలుస్తారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ మొదలయ్యాక దండకారణ్య ప్రాంతంలోనే మావోయిస్టులు, పోలీసుల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఉన్నట్టగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం అబూజ్‌మడ్‌లో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 36 మంది మావోయిస్టులు చనిపోవడం కామ్రేడ్లకు గట్టి ఎదురుదెబ్బగా, భద్రతా దళాల ఘన విజయంగా చెప్పుకోవచ్చు. మృతుల్లో.... అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లో తూర్పు బస్తర్ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి అలియాస్ ఊరి్మళ, కొప్పే, ఎస్‌జెడ్‌సీఎం రామకృష్ణ కమలేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు. ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తమ్ముల రోడ్డు పాలంకి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 30 మంది నక్సల్స్ మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పుర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగింది.దంతెవాడ, నారాయణ్‌పుర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి మృతి చెందిన 30 మంది మావోయిస్టుల మృత దేహాలతోపాటు, భారీ సంఖ్యలో ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.ఒకే రోజు 30 మంది మావోయిస్టులు మృతి చెందటం మావోయిస్టులు పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఏడాది ఇది ఐదో పెద్ద ఎన్ కౌంటర్ కావటం గమనార్హం. గడిచిన 10 నెలల వ్యవధిలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 225 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర మావోయిస్టు పార్టీ అత్యవసరంగా సమావేశమైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ తీరుపై కేంద్ర పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: కాంగ్రెస్ యువతను చీకటి ప్రపంచంలోకి నెడుతోంది: అమిత్ షా -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని బొత్తలంక, ఎరపల్లి అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న సైనికులపై నక్సల్స్ కాల్పులు జరిపారు. సైనికులపై నక్సల్స్ మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్స్ కాల్పులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. నక్సల్స్ కోర్ ఏరియాలోకి భద్రతా బలగాలు ప్రవేశించాయి. గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.అయితే.. ఈ ఎన్ కౌంటర్లో పలువురు నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. డీఆర్జీ, సీఆర్పీ ఎఫ్, కోబ్రా దళాలకు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్, సీఆర్పీ ఎఫ్ డీఐజీ ఆనంద్, కుంట డీఐజీ సూరజ్‌పాల్ వర్మలు ఎప్పటి కప్పుడు ఎన్ కౌంటర్ సమాచారం తెలుసుకుంటూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.చదవండి: కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ.. సోషల్ మీడియాలో చర్చ -
ఛత్తీస్‌గఢ్‌లో ఉత్తుత్తి ‘ఎస్బీఐ’ శాఖ
జంజ్‌గిర్–చంపా(ఛత్తీస్‌గఢ్): ఆన్లైన్ మోసాల బారినపడిన బాధితులు మొట్టమొదట న్యాయం కోసం వెళ్లేది బ్యాంక్ బ్రాంచ్ వద్దకే. అలాంటి బ్యాంక్ కార్యాలయం నకిలీ అని తేలితే?. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి మోసం ఒకటి తాజాగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పేరిట కొందరు మోసగాళ్లు నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను తెరచి జనం నుంచి డబ్బులు ‘ఫిక్స్డ్’ డిపాజిట్లు తీసుకోవడం మొదలెట్టారు. శక్తి జిల్లా అదనపు ఎస్పీ రామాపటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. శక్తి జిల్లాలోని మల్ఖారౌదా పోలీస్‌స్టేషన్‌పరిధిలోని ఛంపోరా గ్రామంలో సెప్టెంబర్ 18వ తేదీన కొత్తగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరుచుకుంది. అక్కడి దుకాణసముదాయంలో ఒక షాప్‌ను అద్దెకు తీసుకుని కంప్యూటర్లు, ఇతర బ్యాంకింగ్ సామగ్రితో ఎస్బీఐ శాఖను కొందరు మొదలుపెట్టారు. అయితే ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చిన ఒక వ్యక్తి పోలీసులు, బ్యాంక్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేశారు. దీంతో హుతాశులైన పోలీసులు, కొర్బా పట్టణంలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ బృందంతో కలిసి ఈ నకిలీ బ్రాంచ్‌కు హుటాహుటిన వచ్చారు. అప్పుడు ఆ నకిలీ బ్రాంచ్‌లో ఐదుగురు పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడి ఉద్యోగులకు తాము నకిలీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నామన్న విషయం కూడా తెలీదని వార్తలొచ్చాయి. బ్యాంక్ మేనేజర్‌గా చెప్పుకునే ఒక వ్యక్తి వీరిని ఇంటర్వ్యూ చేసి నియమించుకున్నాడని సమాచారం. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించడం మొదలెట్టారు. బ్రాంచ్‌లోని కంప్యూటర్లు, ఇతర మెటీరియల్‌ను స్వా«దీనం చేసుకున్నారు. అయితే ఈ నకిలీ బ్రాంచ్ వల్ల ఎవరైనా మోసపోయారా? ఎంత మంది డిపాజిట్లు చేశారు? ఇతర తరహా లావాదేవీలు జరిగాయా? అనే వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. -
వందేభారత్‌పై రాళ్ల దాడి.. ఐదుగురు నిందితుల అరెస్ట్
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. సెప్టెంబరు 16న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో మహాసముంద్లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. రాళ్ల దాడిలో సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. బాగ్బహ్రా రైల్వే స్టేషన్లో ఈ రాళ్ల దాడి జరిగింది.ఈ దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాగ్బహ్రాకు చెందినవారు. వీరిపై పోలీసులు రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు. 16 నుంచి నడవనున్న వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ జరుగుతుండగా, రాళ్ల దాడి చోటుచేసుకున్నదని ఆర్పీఎఫ్ అధికారి పర్వీన్ సింగ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. ఇది కూడా చదవండి: పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య -
బుచ్చి బాబు టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు
టేక్ స్పోర్ట్స్-ఆలిండియా బుచ్చి బాబు టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 11) ముగిసిన ఫైనల్లో ఛత్తీస్ఘడ్పై 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 518 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఛత్తీస్‌ఘడ్ 274 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆయుష్ పాండే(134 బంతుల్లో 117; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతనికి తోడుగా మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్ (45 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు, అనికేత్ రెడ్డి రెండు, రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 417 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 181, రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. కాగా, గతేడాది ప్లేట్ గ్రూప్‌లో ఉండిన హైదరాబాద్.. తదుపరి సీజన్లో ఎలైట్ గ్రూప్‌లోకి అడుగుపెట్టనుంది.చదవండి: బుచ్చిబాబు టోర్నీ ఫైనల్: పటిష్ట స్థితిలో హైదరాబాద్ -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ –బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా లోహాగావ్, పురంగేల్ అడవుల్లో ఆండ్రి గ్రామం వద్ద 40 మంది వరకు మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ దళాల జవాన్లు ఉదయం 6 గంటల నుంచి కూంబింగ్ చేపట్టారు.ఆక్రమంలో 10.30 గంటల సమయంలో ఇరువర్గాల మధ్య మొదలైన ఎదురుకాల్పులు దాదాపు మూడు గంటలపాటు సాగాయి. అనంతరం బలగాలు ఘటనా స్థలిలో పరిశీలించగా ఆరుగురు మహిళలు సహా 9 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తేలింది. వీరిని దక్షిణ బస్తర్, పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ–2కు చెందిన వారిగా భావిస్తున్నారు. ఘటనాస్థలిలో ఎస్ఎల్ఆర్, 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్, 315 బోర్‌గన్లతోపాటు బారెల్ గన్ లాంఛర్లు ఒక్కొక్కటి చొప్పున దొరికాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్ట్‌ల మృతి
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 10మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీజాపూర్ దంతెవాడ జిల్లా లావాపురెంగల్ వద్ద మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందారు. పురంగెల్ అటవీ ప్రాంతంలో రిజర్వు గార్డు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధాలు, వస్తుసామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ⚡⚡ Nine Naxalites eliminated in encounter by Security forces in Chhattisgarh's Dantewada District.— Āryāvarta Updates (@_AryavartaNews) September 3, 2024 -
విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..
సాక్షి, హైదరాబాద్: అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక ఆస్పత్రిలో చేర్చి, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి, అక్కడినుంచి బాబును ఇక్కడకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది.ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావడానికి మా పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు ఇక్కడ 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది, ఫిట్స్ వచ్చాయి, అన్నింటినీ తగిన మందులతో నయం చేశాం. అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటినీ మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ పరాగ్ డెకాటే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లయినా ఉండవచ్చని, వారికి చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు అక్కడ ఉండకపోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రభ్‌జోత్, డాక్టర్ జయంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు), డాక్టర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు), డాక్టర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు), డాక్టర్ ప్రతీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)లతో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. “ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చినవాటిలో ఇది రెండో కేసు. ఇటీవలే మేము నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చినవాటిలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం. ఒక రకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యూనిట్‌ను రోడ్డుమీదే సృష్టించడం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్టమైన కేసులకు కూడా సమర్థవంతంగా చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది” అని డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. -
పావురం ఎగరలేదని.. ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. అధికారంలో ఉన్నవాళ్లు ఎలాంటి ఆదేశాలైనా ఇస్తారనడానికి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. రాష్ట్రంలోని ముంగేలీ జిల్లాలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథి, బీజేపీ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి పున్నులాల్ మోహ్లేతో పా టు కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్‌లకు పావురాలు అందజేశారు. ఎమ్మె ల్యే, కలెక్టర్ వదిలిన పావురాలు రివ్వుమంటూ ఎగిరిపోయాయి. ఎస్పీ విడిచిపెట్టింది మాత్రం నేలపై పడిపోయిందట! సదరు వీడియోను సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. ‘‘ఛత్తీస్‌గడ్‌లో పంచాయత్–3 (వెబ్ సిరీస్) రిపీటైంది. పంద్రాగస్టు సందర్భంగా ఎస్పీ ఎగరేసిన పావు రం కింద పడిపోయింది. వీడియో చూడండి’’ అని రాసుకొచ్చారు. దాంతో తన పరువు పో యిందని భావించిన పోలీస్ బాసు, సంబంధి త అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఏకంగా లేఖ రాశారు! ‘‘పావురం అనారోగ్యంతో ఉండటమే దీనికి కారణం. అది ఎగరకుండా కింద పడిపోయిన వైనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలై జిల్లా యంత్రాంగం పరువు తీసింది. బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోండి’’ అంటూ రాసుకొచ్చారట. 'Panchayat' Pigeon scene comes alive in ChhattisgarhThe video of the pigeon, which was released by Superintendent of Police (SP) Girija Shankar Jaiswal, went viral after it showed the bird falling to the ground instead of flying away. The event, meant to symbolize freedom and… pic.twitter.com/sc1lRJvtRO— The NewsWale (@TheNewswale) August 21, 2024 -
ఆ గ్రామంలో రెండు రోజుల పాటు రక్షాబంధన్
దేశంలో రక్షాబంధన్ సందడి నెలకొంది. వాడవాడలా రాఖీ దుకాణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా రక్షాబంధన్‌ను ఒకరోజు జరుపుకుంటారు. అయితే ఆ గ్రామంలో మాత్రం రెండు రోజుల పాటు రక్షాబంధన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ పండుగను ఆగస్టు 19వ తేదీ సోమవారం జరుపుకుంటున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ చంపా జిల్లాలోని బహెరాడీ గ్రామంలో రక్షాబంధన్‌ను ప్రతీయేటా రెండురోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడి రైతులు, మహిళలు విద్యార్థులు రక్షాబంధన్ పండుగకు ఒక రోజు ముందు పర్యావరణ పరిరక్షణ కోరుతూ చెట్లకు, మొక్కలకు రాఖీలు కడతారు. ప్రకృతిని కాపాడాలని ప్రజలకు సందేశం ఇస్తుంటారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, పర్యావరణ ప్రేమికులు, అధికారులు, ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఆ మర్నాడు రక్షాబంధన్ రోజున గ్రామంలోని మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టి, ఆనందంగా నృత్యాలు చేస్తారు.స్థానికుడు దీనదయాళ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హెర్బల్ రాఖీలను తయారుచేస్తారని, వాటిని వివిధ ప్రాంతాలకు కూడా పంపిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కలెక్టర్లకు ఇక్కడి మహిళా సంఘం సభ్యులు రాఖీలను పంపిస్తుంటారన్నారు. -
Chhattisgarh: స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి.. అరోగ్యశాఖ అప్రమత్తం
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో స్వైన్ ఫ్లూతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యింది. వ్యాధి లక్షణాల గురించి అధికారులు మరింత విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అనుమానిత రోగులను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.అనారోగ్యం బారినపడిన కొరియా జిల్లాలోని పండోపరా గ్రామానికి చెందిన 51 ఏళ్ల మహిళ జిల్లా ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్య పరీక్షలు జరపగా, స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో బాధితురాలిని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ బాధితురాలి పరిస్థితి మరింత దిగజారింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. శుక్రవారం బాధితురాలు మృతిచెందింది.రెండవ కేసు విషయానికొస్తే జంజ్‌గిర్ చంపాలోని లక్షన్‌పూర్ గ్రామంలో నివసిస్తున్న 66 ఏళ్ల మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. స్వైన్‌ఫ్లూ వ్యాధికి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. జూలై 29 నుంచి ఆగస్టు 9 వరకు అపోలో ఆస్పత్రిలో 9 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరిలో ఐదుగురు బిలాస్పూర్ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ఐదుగురు బాధితులు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఆరోగ్యశాఖ ప్రతిరోజూ సేకరిస్తోంది. -
Daughter Save Father: సాయుధులతో ఒంటరిగా పోరాడి..
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా?. శివంగిల దూకి రక్షించుకుంది.ఛత్తీస్‌గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన తప్పించుకోవడంతో అది ఛాతీలో దిగబడింది. ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు. అయితే..ఇంట్లో తండ్రికి భోజనం వడ్డిస్తూ ఆ అలికిడి విన్న కొర్రం కూతురు సుశీల.. ఒక్క దూటున వాళ్ల మధ్యకు చేరింది. తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆగంతకులపై పిడిగుద్దులు గుప్పించింది. ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని.. కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది. అయితే..బయట నలుగురు కాపలా.. లోపల నలుగురు. వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది. సాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరారు. అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సాయంతో జగదల్పూర్లోని దిమ్రాపాల్ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో.. ఇది మావోయిస్టుల పనని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పోలీస్ విచారణలో కాదని తేలింది. భూ తగాదాలతో ఆయన చిన్న తమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.अपने पिता की जान बचाने के लिए एक बेटी 8 हथियार बंद नक्सलियों से भिड़ गई... बहादुर बेटी की कहानी देख लीजिए @gyanendrat1#Chhattisgarh #Narayanpur #NaxalAttack #CGNews #SeedheMuddeKiBaat #GyanendraTiwari #VistaarNews pic.twitter.com/d6PFOlsOnf— Vistaar News (@VistaarNews) August 6, 2024 Video Credits: Vistaar News -
chhattisgarh: 72 రైళ్లు రద్దు.. రూ. 29 కోట్లు నష్టం
జార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రైలు ప్రమాదం తర్వాత ఈ మార్గంలోని అరడజనుకు పైగా రైళ్లు రద్దు కావడంతో ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు రైల్వేశాఖ ఆదాయానికి గండిపడింది.తాజాగా రాజ్‌నంద్‌గావ్-కల్మనా రైల్వే సెక్షన్ మధ్య మూడవ రైల్వే లైన్‌ను కలమన రైల్వే స్టేషన్‌కు అనుసంధానించేందుకు రైల్వేశాఖ ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, ప్రీ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్, మెమూ రైళ్లు ఆగస్టు 4 నుండి 20 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో రక్షాబంధన్ సందర్భంగా ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.బిలాస్పూర్- నాగ్‌పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రద్దు ప్రభావం అటు ప్రయాణికులపైన, ఇటు రైల్వే ఆదాయంపైన పడనుంది.అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో గత మూడు నెలలుగా రాయ్‌పూర్ మీదుగా వెళ్లే రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఈసారి ఏకంగా 72 రైళ్లను (416 ట్రిప్పులు) రద్దు చేయడంతో ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో కన్ఫర్మ్ చేసిన 4 లక్షల 32 వేల టిక్కెట్లను రద్దు చేయడంతో, రైల్వేశాఖ ప్రయాణికులకు రూ.28 కోట్ల 86 లక్షలు వాపసు చేయాల్సి ఉంటుంది. -
Chhattisgarh: నెలసరి సెలవు విధానం అమలు
ఛత్తీస్‌గఢ్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎల్‌యూ) విద్యార్థినులకు పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి యూనివర్శిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.హెచ్ఎన్ఎల్యు చేపట్టిన ‘హెల్త్ షీల్డ్’ కార్యక్రమంలో భాగంగానే ఈ సెలవు విధానం అమలు చేసినట్లు యూనివర్సిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ.సీ. వివేకానందన్ మాట్లాడుతూ యువ విద్యార్థినుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలు చేయడం మెచ్చుకోదగిన విధానమని అన్నారు. దీనికి మద్దతిచ్చినందుకు అకడమిక్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ విధానంలో విద్యార్థినులు క్యాలెండర్ నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరీక్షా రోజులలో కూడా ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. క్రమరహిత ఋతు సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి రుగ్మతలు ఉన్న బాలికలు ఒక సెమిస్టర్లో ఆరు రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చని అన్నారు.అంతకుముందు 2023 జనవరిలో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలో తొలిసారిగా పీరియడ్స్ సెలవు విధానాన్ని ప్రారంభించింది. అనంతరం పంజాబ్ యూనివర్శిటీ ఆఫ్ చండీగఢ్, గువాహటి యూనివర్శిటీ ఆఫ్ అస్సాం, నల్సార్ యూనివర్శిటీ (హైదరాబాద్), అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్శిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్...
-
ఒకేరోజు 85 వేల పండ్ల మొక్కలు! ప్రపంచ రికార్డు
ఛత్తీస్‌ఘడ్‌లోని గరియాబంద్ జిల్లాలో 17వేల మంది మహిళలు ఒకేరోజులో 85వేల పండ్ల మొక్కలను నాటడం ద్వారా రికార్డ్ సృష్టించారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు కొత్తగా పెళ్లయిన వారు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు. మామిడి, జామ, నిమ్మ, పనస... మొదలైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, పౌష్టికాహార మెరుగుదలకు దోహదపడే ఈ మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. వీరి ఘనతను ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. ‘మొక్క నాటాను. ఇక నా పని పూర్తయిపోయింది అనుకోడం లేదు. నేను నాటిన మొక్క మా అమ్మ, నా బిడ్డతో సమానం. కంటికి రెప్పలా చూసుకుంటాను’ అంటుంది దస్పూర్ గ్రామానికి చెందిన సునీత అనే గృహిణి. ఇది ఆమె మాటే కాదు ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో పాల్గొన్న పదిహేడు వేల మంది మహిళలది. -
పోలవరం నుంచి కావేరికి గోదావరి
సాక్షి, అమరావతి: గోదావరి నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షిస్తూ పోలవరం నుంచి గోదావరి – కావేరి అనుసంధానం చేపట్టాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం నుంచి గోదావరి జలాలను బొల్లాపల్లి వద్ద 300 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి కావేరికి తరలించాలని సూచించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని, దీని ద్వారా తరలించే నీటిలో 50 శాతం తమకు కేటాయించాలని తెలంగాణ ప్రతిపాదించింది. తెలంగాణ ప్రతిపాదనను ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకించింది. సమ్మక్క, ఇచ్చంపల్లి బ్యారేజ్‌ల వల్ల తమ రాష్ట్రాంలో ముంపు ఉత్పన్నమవుతుందని, దీనికి తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని, ఇందుకు త్వరలోనే ఆ రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పష్టం చేశారు. వాడీవేడిగా ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశందేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ పాలక మండలి 73వ సమావేశం సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, ఏపీ ప్రభుత్వం తరఫున హైడ్రాలజీ విభాగం సీఈ కుమార్, తెలంగాణ తరఫున ఈఎన్సీ అనిల్‌కుమార్, అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి, అక్కడి నుంచి జలాలను కావేరికి తరలించాలన్న ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనను తెలంగాణ ఈఎన్సీ అనిల్ వ్యతిరేకించారు. తెలంగాణ రాష్ట్రానికి 158 టీఎంసీల (దేవాదులకు 38, సీతారామకు 70, తుపాకులగూడెంకు 50 టీఎంసీ) నీటి అవసరాలున్నాయని, ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే తెలంగాణ, ఏపీ అవసరాలతోపాటు గోదావరి– కావేరీ అనుసంధానం ప్రాజెక్టు అవసరాలను ఏకకాలంలో ఎలా తీరుస్తారని ప్రశి్నంచారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి అనుసంధానం చేపట్టాలని కోరారు.దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్‌ల వల్ల తమ ప్రాంతం ముంపునకు గురవుతుందని, అందువల్ల ఆ బ్యారేజ్‌ల నిర్మాణానికి అంగీకరించబోమని తేలి్చచెప్పింది. ఇచ్చంపల్లి, సమ్మక్క బ్యారేజ్‌లను ఎగువ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ సీఈ కుమార్ ప్రతిపాదించారు. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి సోమశిలలోకి, అక్కడి నుంచి కావేరికి తరలించాలన్న ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని తేలి్చచెప్పారు.గోదావరికి జూలై ఆఖరు నుంచి ఆగస్టు వరకు భారీ వరద ఉంటుందని, ఆగస్టులో కృష్ణాకు కూడా వరద వచ్చి నాగార్జునసాగర్ కూడా నిండుగా ఉంటుందని వివరించారు. గోదావరి–కావేరి అనుసంధానంలో నాగార్జున సాగర్‌ను భాగం చేస్తే దాని ఆయకట్టుకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలంటే పోలవరం నుంచి గోదావరి జలాలను కొత్తగా బొల్లాపల్లి వద్ద నిరి్మంచే రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి సోమశిల.. అటు నుంచి కావేరికి తరలించాలని సూచించారు.ఇదే ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు గతంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడు అందజేశామని, దాన్ని పరిశీలించాలని కోరారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలిస్తున్న 80 టీఎంసీలకుగానూ.. ఆ మేరకు సాగర్ ఎగువన కృష్ణా బేసిన్లో వాడుకునేలా రాష్ట్రాలకు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని ఏపీ, తెలంగాణ అధికారులు గుర్తు చేశారు.మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలు అదనంగా వాడుకుని, గోదావరి–కావేరి అనుసంధానం వల్ల కృష్ణా జలాలను ఆ రాష్ట్రాలకు అదనంగా వాడుకోవడానికి అవకాశం కలి్పస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడ్డాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ఈఎన్సీ అనిల్ స్పష్టం చేశారు. -
మీ విచారణలో నిష్పాక్షికత లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసేలా పనిచేస్తున్నారంటూ విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నిరాధారమైన ఆరోపణలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ ఏడు పేజీల లేఖను జగదీశ్‌రెడ్డి శనివారం తన పీఏ ద్వారా కమిషన్‌కు పంపించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఉద్దేశాలను తప్పుబట్టారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.పద్నాలుగేళ్లు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిమిషం కరెంటు కోత లేకుండా రైతులు, పారిశ్రామికవేత్తలకు, గృహాలకు విద్యుత్ అందిస్తే... ఏదో జరిగిపోయిందన్నట్లుగా, జరిగిన నష్టాన్ని లెక్కకట్టడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడడం, మరునాడే ఆరువేల కోట్ల నష్టం అని అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వార్తలు వచి్చనందున వారికి ఆ సమాచారం ఎలా వచి్చంది, ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారనే అంశాలు కూడా విచారణలో భాగం కావలసిన అవసరం ఉందని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి కొన్నాం తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఉందని, 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని జగదీశ్ రెడ్డి లేఖలో వివరించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు వచి్చన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని, ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ప్రారంభించిందని, పీజీసీఐఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్న నిబంధన మేరకు ఛత్తీస్‌గఢ్‌తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను రూ.17కు కొంటున్న పరి స్థితి ఉండగా, ఛత్తీస్‌గఢ్ నుంచి రూ.3.90కి యూని ట్ చొప్పున కొనాలని తెలంగాణ ఈఆర్సీ నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90కి విద్యుత్ తీసుకున్నారన్నారు. రాష్ట్ర కరెంటు డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, యాదాద్రి ప్లాంట్‌ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందని వివరించారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. ఇద్దరు జవాన్ల మృతి
రాయిపూర్ : ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన జవాన్లు విష్ణు, శైలేంద్రగా గుర్తించారు పోలీసు అధికారులు. బీజార్ పూర్ జిల్లా సిల్గూర్ -టేకులగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాలకు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో సైనికుడు, పికప్ వాహనం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ప్రాథమిక సమాచారం ప్రకారం ఛత్తీస్‌గఢ్ సాయుధ దళాల (సీఎఎఫ్) వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి ప్రమాదం జరగడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనంలో ఎంతమంది ఉన్నారనే సమాచారం ఇంకా తెలియరాలేదు. Chhattisgarh | Two Chhattisgarh Armed Force (CAF) security personnel died and one was injured after the vehicle they were travelling in overturned in the Balrampur district. The civil driver of the pick-up vehicle was also injured in the incident. Both the injured are under… pic.twitter.com/xVlVowxnop— ANI (@ANI) June 20, 2024 -
ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌తో నష్టం!
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ సర్కారు శాసనసభలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రకటించడం, ఆ తర్వాత ప్రతిపక్ష బీఆర్ఎస్తో సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో.. ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి అధ్యక్షతన విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు పలు గణాంకాలు చెప్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల దాదాపు రూ.6 వేల కోట్ల వరకు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని అంటున్నాయి. అనవసరంగా ట్రాన్స్మిషన్ కారిడార్లను బుక్ చేసుకోవడం, ఒప్పందం మేరకు విద్యుత్ తీసుకోకపోవడం, అర్ధంతరంగా కొనుగోళ్లు ఆపేయడం, బకాయిలు చెల్లింపుపై వివాదాలు వంటివన్నీ కలసి సమస్యగా మారాయని పేర్కొంటున్నాయి. అదనపు ఖర్చులతో రేటు పెరిగి.. 2017 చివరి నుంచి ఛత్తీస్‌గఢ్ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. 2022 ఏప్రిల్ వరకు సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సంస్థలతో యూనిట్‌కు రూ.3.90 ధరతో 1000 మెగావాట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నా.. ఏనాడూ పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా కాలేదని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్ 17,996 మిలియన్ యూనిట్లని.. ఇప్పటివరకు రూ.7,719 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.1,081 కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించాయి.ట్రాన్స్మిషన్ లైన్ల కోసం రూ.1,362 కోట్లు చార్జీలు చెల్లించారని తెలిపాయి. అన్ని ఖర్చులు కలిపి లెక్కిస్తే ఒక్కో యూనిట్ సగటు ఖర్చు రూ.5.64కు చేరిందని.. దీనితో దాదాపు రూ.3,110 కోట్లు అదనపు భారం పడిందని వెల్లడించాయి. బకాయిల విషయంలో వివాదం ఉందని, రూ.1,081 కోట్లే బకాయి ఉందని తెలంగాణ చెప్తుంటే.. ఛత్తీస్‌గఢ్ మాత్రం రూ.1,715 కోట్లు రావాల్సి ఉందని లెక్క చూపిస్తోందని పేర్కొన్నాయి. సరిగా విద్యుత్ సరఫరా లేక.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏనాడూ వెయ్యి మెగావాట్ల కరెంటు సాఫీగా రాలేదని.. దీనితో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచి్చందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇలా 2017 నుంచి 2022 వరకు రూ.2,083 కోట్లు అదనపు భారం పడిందని పేర్కొన్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్‌ను తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ నుంచి వెయ్యి మెగావాట్ల కారిడార్ బుక్ చేయడం.. విద్యుత్ తెచ్చుకున్నా, లేకున్నా ఒప్పందం ప్రకారం చార్జీలు చెల్లించాల్సి రావడంతో రూ.638 కోట్లు భారం పడిందని తెలిపాయి.దీనికితోడు మరో 1000 మెగావాట్ల కారిడార్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేయడం, దాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకోవడం కూడా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు నష్టం కలిగించిందని పేర్కొన్నాయి. పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని పవర్‌గ్రిడ్ సంస్థ రాష్ట్ర డిస్కంలకు నోటీసులు జారీ చేసిందని వివరించాయి. ఇక ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ఈఆర్సీ ఇప్పటివరకు ఆమోదం తెలపలేదని.. ఈ లెక్కన ఛత్తీస్‌గఢ్‌కు కట్టిన వేల కోట్ల రూపాయలను అడ్డదారి చెల్లింపులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఆరోపించాయి. -
సామూహిక వివాహాల్లో 30 జంటలకు ‘మళ్లీ పెళ్లి’
ప్రభుత్వం పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేపడుతున్న కొన్ని పథకాలు పెడదారి పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలనే ఆశతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ యోజనలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఇంటి సామగ్రి పొందాలనే ఆశతో 30 జంటలు ఈ కార్యక్రమంలో మళ్లీ పెళ్లి చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే దుర్గ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు జరిగాయి. 301 జంటలకు వివాహం జరిగింది.ఈ కార్యక్రమానికి సీఎం విష్ణుదేవ్ సాయి కూడా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఇక్కడ వివాహాలు చేసుకున్న జంటలలో 30 జంటలు మళ్లీ పెళ్లిచేసుకున్నాయని మీడియాకు తెలియవచ్చింది. అలాగే ఇక్కడ పెళ్లిళ్లు చేయిస్తామంటూ కొందరు ఏజెంట్ల తయారైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వీరు కొందరు జంటల నుంచి సొమ్ము వసూలు చేసినట్లు భోగట్టా. ఒక జంటకు ఇద్దరు పిల్లలను ఉన్నప్పటికీ వారు ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకున్నారని తెలియవచ్చింది.దుర్గ్‌లోని అగ్రసేన్ భవన్లో ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో సినిమా తరహా దృశ్యాలు అనేకం కనిపించాయి. ఒకరు పెళ్లి విషయంలో గొడవ పడుతూ, డబ్బు కోసం పెళ్లి చేసుకున్నట్లు కనిపించింది. అలాగే ఒక ఏజంట్ ఏడు జంటలను మళ్లీ పెళ్లి కోసం తీసుకువచ్చినట్లు నిర్వాహకుల విచారణలో తేలింది. కాగా ఈ ఏజెంట్ ఆ జంటల నుంచి రూ. రెండు వేలు చొప్పున వసూలు చేశాడని సమాచారం. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకునే జంటలకు రూ. లక్షతో పాటు ఇతరత్రా సామాను అందిస్తుంటుంది. -
చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురి మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో 5 మంది మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్-దంతెవాడ-కొండగావ్ అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్ ఘటన జరిగింది. ఈస్ట్ బస్తర్ డివిజన్ పరిధిలోని గోబెల్ ప్రాంతంలోని ముంగేడి గ్రామంలో మావోయిస్టులుపై అంతర్ జిల్లా ఉమ్మడి ఆపరేషన్‌ను పోలీసులు, జవాన్లు సంయూక్తంగా నిర్వహించారు. ఆపరేషన్‌లో యూనిఫారం ధరించిన ఐదుగురు మావోయిస్టులు ఆయుధాలతో సహా మృతి చెందారు.పెద్ద సంఖ్యలో మావోయిస్టులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నారాయణపూర్ డీఆర్జీకి చెందిన ముగ్గురు జవాన్లకు గాయాలు అయినట్లు సమాచారం. -
ఛత్తీస్‌గఢ్: పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టుల బాంబుల వర్షం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూడ్మడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్‌పై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో దాడి చేశారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.అర్ధరాత్రి జవాన్లు నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు ఈరక్ బట్టి క్యాంప్‌పై ఒక్కసారిగా బారెల్ గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. నాలుగు బీజీఎల్లను ప్రయోగించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అదనపు బలగాలతో క్యాంపు పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. -
Bhupesh Baghel: పోలింగ్ తర్వాత ఈవీఎంలను మార్చేశారు
న్యూఢిల్లీ: పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల వెల్లడికి సర్వం సిద్ధమైనా ఎన్నికల సంఘంపై, ఈవీఎంల పనితీరుపై విపక్షాల ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగెల్ సోమవారం రాత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోటీ చేసిన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ ముగిశాక పలుచోట్ల ఏకంగా ఈవీఎంలనే మార్చేశారని పేర్కొన్నారు! ‘‘పలు బూత్‌ల్లో ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ల సీరియల్ నంబర్లు పోలింగ్ తర్వాత మారిపోయాయి. ఫామ్ 17సీలో పొందుపరిచిన సమాచారమే ఇందుకు రుజువు. దీనివల్ల వేలాది ఓట్లు ప్రభావితమవుతాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యాలంటూ ఈవీఎంల తాలూకు తొలి నంబర్లు, మారిన నంబర్లతో కూడిన వివరాలను పోస్ట్ చేశారు. ‘‘ఇలా మార్చిన ఈవీఎం నంబర్ల తాలూకు జాబితా చాలా పెద్దది. అందరికీ తెలియాలని చిన్న జాబితా మాత్రమే పోస్ట్ చేస్తున్నా’’ అని తెలిపారు. ‘‘ఇది చాలా సీరియస్ అంశం. ఇలా నంబర్లను ఎందుకు మార్చాల్సి వచి్చంది?’’ అని ఈసీని ఉద్దేశించి భగెల్ ప్రశ్నించారు. చాలా లోక్‌సభ స్థానాల నుంచి ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నాం. నంబర్లను ఏ పరిస్థితుల్లో మార్చాల్సి వచి్చందో ఈసీ బదులివ్వాల్సిందే. దీనివల్ల ఆయా స్థానాల్లో ఎన్నికల ఫలితంపై ప్రభావం పడితే అందుకు ఎవరిది బాధ్యత?’’ అంటూ మండిపడ్డారు. పోలింగ్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా 150 జిల్లాల కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరింపులకు దిగారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆదివారం ఆరోపించడం తెలిసిందే. పుకార్లు వ్యాప్తి చేయొద్దని, రుజువులుంటే ఇవ్వాలని సీఈసీ రాజీవ్‌కుమార్ స్పందించారు. -
'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..
సినిమాల్లోనూ చూస్తుంటాం హీరోనే మొత్తం ప్రత్యర్థులను గడగడలాడించి యోధుడులా గెలవడం. రియల్ లైఫ్‌లో అంత ఈజీ కాదు. కానీ అటాంటి రియల్ హీరోని చత్తీశ్‌గఢ్‌లో చూడొచ్చు. ఒకేఒక్కడు యోధుడిలా లంగ్స్ ఆప్ చత్తీస్‌గఢ్‌గా పేరుగాంచిన హస్డియో అడువులను సంరక్షించారు. ఇవి భారతదేశంలోని అతిపెద్ద అటవీ సంపద. ఆయన ఒక్కడే అక్కడ ఉన్న గిరిజనులు ప్రజలను చైత్యన్యవంతం చేసి అక్కడ పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చేశాడు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే దిగొచ్చి ఇక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా వెనుదిరిగేలా చేశాడు. అందుకుగాను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు కూడా. ఎవరా వ్యక్తి అంటే..?'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'గా పేరుగాంచిన హిస్టియో అడువులు భారతదేశంలోని అతిపెద్ద అటవీ ప్రాంతంలో ఒకటి. దాదాపు 657 చదరుపు విస్తీర్ణంలో దట్టమైన జీవవైవిధ్యమైన హస్టియో అడువులు భారతదేశంలోని అత్యంత విస్తృతమైన అటవీ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ సుమారు 25 రకాల అంతరించిపోతున్న జాతులు, 92 పక్షి జాతులు, 167 అరుదైన ఔషధ వృక్ష జాతులకు నిలయం ఈ అడవులు. దాదాపు 15 వేల మంది గిరిజనులు జీవనోపాధి ఈ హస్టియో అరణ్య అడవులపైనే ఆధారపడి ఉంది.అంతేగాక ఈ ప్రాంతం భారతదేశంలోని అతిపెద్ద బొగ్గు నిల్వల్లో ఒకటి. ఈ హస్టియో అడవులు కింద దాదాపు ఐదు బిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అంచనా. దీంతో 2010లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ హస్టియో అడవులలో ఉన్న గొప్ప జీవవైవిధ్యాన్ని గుర్తించి మైనింగ్ కోసం నోగో జోన్‌గా ప్రకటించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ ప్రదేశంలో మైనింగ్ కార్యకలాపాలు సాగించేందుకు ముమ్మరంగా ప్రయత్నించాయి. అంతేగాదు సుమారు 21 ప్రతిపాదిత బొగ్గు గనులను వేలం వేసే యత్నం చేసింది. దీంతో అటవీ, గిరిజన హక్కుల కార్యకర్త అలోక్ శుక్లా(43) స్ధానిక గిరిజన సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి..బొగ్గు వేలాన్ని వ్యతిరేకించేలా చేశాడు. అంతేగాదు బొగ్గు గనులను రక్షించేందుకు గ్రామ శాసనమండలి చేత 2020లో 9.45 లక్షల ఎకరాల్లో లెమ్రు ఏనుగుల రిజ్వరాయర్ సంబంధించిన ఏనుగులు కారిడార్‌ని నియమించేలా పోత్సహించాడు. చత్తీస్‌గఢ్ బచావో వంటి హ్యాష్ ట్యాగ్ నినాదాలతో డిజిటల్, సోషల్ మీడియాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయాడు అలోక్. మోటారు సైకిల్‌పై ర్యాలీ దగ్గర నుంచి, వివాహ పత్రికల్లో సైతం అదే నినాదంతో కూడిన హ్యాష్ ట్యాగ్లు ఒక్కసారిగా పంచదృష్టిని ఆకర్షించాయి. గ్రామస్తుల చేత చెట్లు నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని కౌగలించుకుని కాపాడుకునేలా చైతన్యం తీసుకొచ్చాడు. దీంతో జూలై 2022లో రాష్ట్ర శాసనసభ మొత్తం హస్టియో అరణ్య ప్రాంతంలోని మైనింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అమోదించింది. ఆ తర్వాత అదే ఏడాది జూలై 21 నాటి 21 బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వ రద్దు చేసింది. ఇలా అలోక్ శుక్లా తన ప్రణాళికబద్ధమైన అలుపెరగని కృషితో 21 మైనింగ్ గనుల తవ్వకాలు జరపకుండా నాలుగున్నర ఎకరాల అడువులను విజయవంతంగా రక్షించాడు. అందుకుగానూ ప్రతిష్టాత్మక గోల్డ్‌మ్యాన్ పర్వావరణ బహిమని అందుకున్నాడు. దీన్ని గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తారు. ఈ బహుమతి, ఆఫ్రికా, ఆసియా, యూరప్, ద్వీపాలు, ఉత్తర అమెరికా, దక్షిణ మధ్య అమెరికా వంటి ప్రపంచంలోని దాదాపు ఆరు ఖండాంతర ప్రాంతాల్లోని పర్యావరణ నాయకుల చేసిన కృషిగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవిస్తారు. కాగా, ఈ గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్‌ను శాన్‌ఫ్రావిన్సిస్కో పౌర నాయకులు రిచర్డ్, రోడా గోల్డ్‌మన్‌లు ఏర్పాటు చేశారు. (చదవండి: ఫిడే చెస్ రేటింగ్ పొందిన అతిపిన్న వయస్కురాలు! దటీజ్ జియానా గర్గ్..!) -
ఛత్తీస్‌గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్‌పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అందులో పని చేసేవాళ్లు మృతి చెందారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీయగా.. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు శబ్ధం భయంకరంగా వినిపించిందని.. ఆ ధాటికి భయంతో వణికిపోయామని స్థానికులు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఆ శబ్ధం వినిపించిందని.. కొన్ని ఇళ్లు సైతం దెబ్బ తిన్నాయని అంటున్నారు. భారీగా మంటలతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు పరుగులు తీశారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించింది. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల దేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయని, ఫ్యాక్టరీ లోపల 20 అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు.కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడు ధాటికి గల కారణాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యే మహారాష్ట్ర థానేలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్- బీజాపూర్ సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రభాత్ కుమార్ తెలిపారు. అయితే మరణించిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది.వరస ఎన్కౌంటర్లు.. ఇటీవల ఛత్తీస్గడ్ అడవులను భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వరస ఎన్కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు విడుస్తున్నారు. గత నెల ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెలిసిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
6000 కి.మీ ఎగురుతూ ఛత్తీస్‌గఢ్‌కు అరుదైన పక్షి!
పక్షి ప్రేమికులు సంబరపడే వార్త ఇది. కెనడా, అమెరికాలకు ఆనుకుని ఉన్న మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో కనిపించే వింబ్రెల్ పక్షి తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్ జిల్లాకు తరలివచ్చింది. ఇది దాదాపు ఆరు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చింది.ఈ పక్షి మొదటిసారిగా ఈ ప్రాంతంలో కనిపించింది. దీనిని చూసేందుకు అటవీశాఖ సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వింబ్రల్ పక్షి ఖైరాఘర్ జిల్లా మొహభట్టా గ్రామానికి తరలివచ్చింది. దాని శరీరంపై రేడియో కాలర్ అమర్చారు. ఈ కాలర్ అంచనా ధర రూ.10 లక్షలని తెలుస్తోంది. ఆ పక్షి వెనుక భాగంలో సోలార్ జీపీఎస్ కాలర్ కూడా ఉంది. దీని ద్వారా అది ఎంత దూరం ఎగురుతూ ఇక్కడకు చేరిందో తెలుస్తుంది.ఈ కాలర్‌ను ఆ పక్షికి 2023 నవంబర్ 16న ఒక ద్వీపంలో అమర్చారు. ఆ పక్షి దాదాపు 6 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని దీని ద్వారా తెలుస్తోంది. ఆ పక్షి పాకిస్తాన్ మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్కు చేరుకుంది. దీవి నుంచి బయలుదేరిన ఆ పక్షి అరేబియా సముద్రానికి చేరుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుని, అక్కడ నాలుగు రోజుల పాటు మకాం వేసింది.ఈ పక్షి భారత తీరంలో 10 రోజులు ఉండి, తరువాత ఖైరాఘర్ జిల్లాలోని మొహభట్టా గ్రామానికి చేరుకుంది. ఇక్కడ ఈ పక్షి నీటిలో ఉల్లాసంగా తిరుగుతూ కనిపిస్తోంది. గత మూడు రోజులుగా ఈ పక్షి ఇక్కడే ఉంటోంది. ఈ పక్షి రెండు కాళ్లపై ఆకుపచ్చ, పసుపు రంగుల జెండాలు ఉన్నాయి. యూరప్‌లోని ఒక సంస్థ ఈ పక్షిని పర్యవేక్షిస్తున్నదని సమాచారం. వింబ్రల్ పక్షి రాకపై తమకు సమాచారం అందిందని ఖైరాగఢ్ డీఎఫ్ఓ అమిత్ తివారీ తెలిపారు. సాధారణంగా ఈ పక్షి మధ్యధరా సముద్ర తీరంలో నివసిస్తుంది. ఇది సంతానోత్పత్తి కోసం వివిధ ప్రదేశాలను వెతుకుతూ ఉంటుంది. -
చత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం
దుమ్ముగూడెం: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కబిర్ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. మృతుల్లో 18 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కభీర్దామ్ జిల్లాలోని సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో బంజారి ఘాట్‌లో అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడింది. -
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సల్స్ మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శుక్రవారం మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ సాగిస్తున్న భద్రతా బలగాలపై నక్సల్స్ కాల్పులకు దిగారు. ఇరువురి నడుమ ఎదురుకాల్పులు గంటలపాటు కొనసాగాయి. కాల్పుల అనంతరం ఘటనా ప్రాంతంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. అదేసమయంలో, మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో ఒక బారెల్ గ్రెనేడ్ లాంఛర్, 12 బోర్ గన్, దేశవాళీ రైఫిల్, భారీగా పేలుడు పదార్థాలు లభించాయన్నారు. ఏప్రిల్ 16, 30వ తేదీల్లో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లలో 39 మంది మావోయిస్టులు చనిపోవడం తెల్సిందే. బస్తర్ ప్రాంతంలో ఈ ఏడాదిలో వివిధ ఎన్కౌంటర్లలో103 మంది నక్సల్స్ చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్
భువనేశ్వర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఘటన జరిగిన ప్రాంతం గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందిఘటనా స్థలం నుంచి హతమైన నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 6 గంటలకు మొదలైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఈ నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో మూడు జిల్లాల నుంచి భద్రతా బలగాలు పాల్గొన్నాయి.బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల నుంచి సుమారు 1200 మంది DRG, STF, COBRA, CRPF సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. అగ్రశ్రేణి నక్సల్స్ నేతలు ఉన్నారన్న సూచనతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బస్తర్ ఐజీ, మూడు జిల్లాల డీఐజీ, ఎస్పీలు ఎన్‌కౌంటర్‌పై నిఘా పెట్టారు. -
Lok sabha elections 2024: ఇస్తినమ్మా తాంబూలం.. వస్తినమ్మా ఓటింగ్‌కు!
లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా వినూత్నమైన కార్యక్రమాలెన్నో జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బలరామ్‌పూర్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలు చేసిన ‘సంప్రదాయ’ కృషి వీటన్నింట్లో ఎంతో ఆసక్తికరం. మూడో దశలో భాగంగా ఈ నెల 7న రాష్ట్రంలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. బలరామ్‌పూర్ జిల్లాలోని సర్గూజా లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు చింతాకులు, అక్షితలు అందించారు. తప్పకుండా ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. స్థానిక సంప్రదాయాలను ఇలా వినూత్నంగా వాడుకున్న తీరు అందరినీ ఆకర్షించింది. ‘చింతాకులు, అక్షితలు అందించడం మా సంస్కృతిలో భాగం. పెళ్లిళ్లకు, మా సంఘం కార్యక్రమానికి ఇలాగే ఆహా్వనిస్తాం. అదే పద్ధతిలో విధిగా ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాం. దీనికి స్పందన కూడా చాలా బాగా వచి్చంది’’ అని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యురాలు విమలా సింగ్ హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించినట్టు జిల్లా నోడల్ అధికారి రైనా జమీల్ పేర్కొన్నారు. ఓటర్లను ఇలా వినూత్నంగా పోలింగ్ బూత్‌లకు తరలాల్సిందిగా కోరిన తీరు పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశాలను కూడా ఆకట్టుకుంది. ఆ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం మే 13న నాలుగు విడతలో మొదలై జూన్ 1న ఏడో విడత దాకా కొనసాగనుంది. అక్కడ కూడా ఇలా ఓటర్లను సంప్రదాయ పద్ధతిలో ఓటేసేందుకు ఆహా్వనించాలని పలు జిల్లాల ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు కూడా చేస్తున్నారట!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ బూత్‌లో 9 గంటలకే 100 శాతం పోలింగ్!
ఈరోజు (మంగళవారం) దేశంలో లోకసభ ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే ఒక పోలింగ్ బూత్‌లో ఉదయం 9 గంటలకే వందశాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పోలింగ్ కేంద్రం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని షెర్దాండ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 143లో మొత్తం ఐదుగురు ఓటర్లు తమ ఓటు వేశారు. దీంతో ఇక్కడ 100 శాతం పోలింగ్ పూర్తయ్యింది. ఎంపీని ఎన్నుకునేందుకు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.షెర్దాండ్ పోలింగ్ కేంద్రం కొరియా జిల్లాలోని సోన్హట్ జన్‌పాడ్ పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. ఐదుగురు ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, ఉదయం 9కే 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే, సీఈవో డాక్టర్ అశుతోష్ చతుర్వేది, అదనపు కలెక్టర్ అరుణ్ మార్కం, ఎస్డీఎం రాకేష్ సాహు తదితర జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటర్లకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే కృతజ్ఞతలు తెలిపారు.వనాంచల్ ప్రాంతంలోని షెర్దాండ్‌లో మొత్తం ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు. ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడికి చేరుకోవడానికి పక్కా రోడ్లు లేవు. గ్రామపంచాయతీ చందా నుంచి పోలింగ్ పార్టీలు ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాయి. -
ఓటుకు సిద్ధం.. 100 ఏళ్లు దాటిన 2,000 మంది ఓటర్లు!
ఛత్తీస్‌గఢ్‌లో నేడు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల మూడో విడతలో ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఒక కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనుండగా, వారిలో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారే కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి సారి ఓటు వేయబోయేవారి సంఖ్య దాదాపు నాలుగు లక్షలు. రాష్ట్రంలోని సుర్గుజా, రాయ్‌గఢ్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రాయ్‌పూర్‌లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఏడు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో మహిళా అభ్యర్థుల సంఖ్య 26.పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రింకింగ్ వాటర్, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. క్యూలో నిలుచునే ఓటర్లకు నీడను కల్పించారు. వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. అవసరమైన మందులతో పాటు మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచారు.రాష్టంలోని ఏడు స్థానాలకు నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మూడో దశలో 26 మంది మహిళలతో సహా మొత్తం 168 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. రాయ్‌పూర్‌లో అత్యధికంగా 38 మంది, బిలాస్పూర్లో 37 మంది, కోర్బాలో 27 మంది, దుర్గ్‌లో 25 మంది, జాంజ్‌గిర్-చంపాలో 18 మంది, రాయ్‌గఢ్‌లో 13 మంది, సుర్గుజాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారని ఆయన చెప్పారు. ఏడు నియోజకవర్గాల్లో 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, అందులో 25 పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్‌గా, 1072 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్‌గా వర్గీకరించారు. -
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఒంటరి పోరుతో పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత ఇప్పుడు బీజేపీ నుంచి రాష్ట్రంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మూడో విడతలో భాగంగా అక్కడ నాలుగు లోక్‌సభ స్థానాలకు, బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఏడింటికి, అసోంలో నాలుగింటికి మంగళవారం పోలింగ్ జరగనుంది. వాటిల్లో కీలక స్థానాలను ఓసారి చూస్తే... జాంగీపూర్ (పశి్చమ బెంగాల్) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. 2019లో బీజేపీ అభ్యర్థి మఫుజా ఖాతూన్‌పై తృణమూల్ కాంగ్రెస్ నేత ఖలీలుర్ రెహమాన్ 2.4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. బీజేపీ ధనుంజయ్ ఘోష్‌కు టికెటివ్వగా కాంగ్రెస్ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ను పక్కన పెట్టి మొర్తజా హుస్సేన్‌ను పోటీకి దింపింది. దాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.దక్షిణ మాల్డా (పశి్చమ బెంగాల్) ఉత్తర మాల్డాతో పాటు ఈ స్థానం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. జమిందారీ కుటుంబీకుడు ఘనీఖాన్ చౌదరి హవా నడిచేది. రెండు దశాబ్దాలు మాల్డా రాజకీయాలను శాసించిన ఆయన మరణానంతరం పరిస్థితి మారింది. ముస్లిం ప్రాబల్య స్థానమైన దక్షిణ మాల్డాలో ముక్కోణపు పోటీ నెలకొంది. 2009, 2014, 2019ల్లో ఘనీఖాన్ సోదరుడు అబూ హసీం ఖాన్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు ఇషా ఖాన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి శ్రీరూప మిత్ర చౌదరి, టీఎంసీ తరఫున షానవాజ్ అలీ రెహమాన్ పోటీ చేస్తున్నారు.ఉత్తర మాల్డా (పశి్చమ బెంగాల్) ఇక్కడి ఓటర్లలో చైతన్యం ఎక్కువ. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ముకు తృణమూల్ నుంచి బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రసూన్ బెనర్జీ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముస్తాక్ ఆలం బరిలో ఉన్నారు. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన మౌసమ్ నూర్ 2019లో తృణమూల్ నుంచి పోటీ చేశారు. ఖగేన్ చేతిలో 1.85 లక్షల ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.మాధేపుర (బిహార్) మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరీ ప్రసాద్ మండల్, జేడీ(యూ) దిగ్గజం శరద్ యాదవ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి నుంచి ప్రొఫెసర్ కుమార్ చంద్రదీప్ యాదవ్ పోటీలో ఉన్నారు. జేడీ(యూ) నుంచి సిట్టింగ్ ఎంపీ దినేశ్ చంద్ర యాదవ్ మరోసారి పోటీకి నిలబడ్డారు.అరారియా (బిహార్) బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రదీప్‌కుమార్ సింగ్ బరిలో ఉన్నారు. 2019లో ఆయన చేతిలో 1.37 లక్షల ఓట్ల తేడాతో ఓడిన మహమ్మద్ సర్ఫరాజ్ ఆలంకే ఆర్జేడీ మళ్లీ టికెటి చి్చంది. ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులూ బరిలో ఉన్నారు.గువాహటి (అసోం) ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండూ మహిళలకే టికెటిచ్చాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాను కాదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు బిజూలి కలిత మేధిను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బీరా బోర్తకుమార్ గోస్వామి పూర్వాశ్రమంలో బీజేపీ నేతే! పర్వత, మారుమూల ప్రాంతాల్లోనూ ఆమె సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం, వరదలు, తాగునీరు ఇక్కడి సమస్యలు. డుబ్రి (అసోం) ఈ లోక్‌సభ స్థానం ఏకంగా 142 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటోంది. బ్రహ్మపుత్ర పొంగినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవు. వరదలు, పేదరికం, బాల్య వివాహాలు ప్రధాన సమస్యలు. ముస్లింలు ఏకంగా 80 శాతమున్నారు. దాంతో వారి ఓట్లే ఫలితాన్ని నిర్దేశిస్తుంటాయి. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఇక్కడ వరుసగా నాలుగోసారి గెలిచేందుకు శ్రమిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం ఏజీపీ నుంచి జబేద్ ఇస్లాం, కాంగ్రెస్ నుంచి రకీబుల్ హుస్సేన్ పోటీలో ఉన్నారు. రాయ్‌గఢ్ (ఛత్తీస్‌గఢ్) ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి 1999 నుంచి 2014 దాకా ఇక్కడినుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పైగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కూడా రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. దాంతో ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడం సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి రాధేశ్యామ్ రతియా, కాంగ్రెస్ నుంచి మేనకాదేవి సింగ్ పోటీ చేస్తున్నారు. గోండ్ రాజ కుటుంబ వారసురాలైన మేనకాదేవి డాక్టర్ కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.తాజాగా ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.‘‘అయోధ్యలోని రామమందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా. నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ, కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు. -
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
ఛత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ మే 7న జరగనుంది. రాష్ట్రంలోని రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా మొదలైన ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాల్లో మే 5 నుండి 7 వరకు డ్రై డేగా ప్రకటించారు. అంటే ఈ రెండు రోజూలూ ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో మద్యం విక్రయాలు ఉండవు. డ్రై డేకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఓటింగ్‌కు 48 గంటల ముందు సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలను మూసివేస్తారు. అంతే కాదు మద్యం రవాణాను కూడా నిషేధించారు. ఈ సమయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాయ్‌పూర్, దుర్గ్, బిలాస్పూర్, జాంజ్‌గిర్-చంపా, కోర్బా, రాయ్‌గఢ్, సుర్గుజా లోక్‌సభ నియోజకవర్గాల్లో మే 5 నుండి మే 7 వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గాలకు మూడు కిలోమీటర్ల పరిధిలోగల అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఎవరైనా మద్యం దుకాణాన్ని తెరిచి, విక్రయాలు సాగిస్తున్నారని తేలితే సంబంధిత అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. -
జయహో జోయా
‘ఈ ప్రపంచంలో గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం జోయా మీర్జా మనసులో ముద్రించుకుపోయింది. ఆ తరువాత కలగా మారింది. కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది. నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తరువాత మాత్రం ఆత్మవిశ్వాసం అనే ఇంధనంతో వేగంగా ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఎంపిక అయింది జోయా మీర్జా. చత్తీస్‌గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా....కల కన్నప్పుడే విజయానికి దగ్గరవుతాం. ఏ కలా లేనప్పుడు ఏ విజయమూ ఉండదు. ఛత్తిస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మీర్జా చిన్నప్పటి నుంచి పెద్ద కలలు కనేది. అయితే అవేమీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకునే కలలు కావు. ‘వైద్యురాలిగా సేవ అందించాలి, సైన్యంలో పనిచేయాలి’... ఇలా ఉండేవి ఆమె కలలు.కన్న కలలు కాలానికి నిలబడతాయనే గట్టి నిబంధన లేదు. అయితే గట్టి పట్టుదల ఉంటే కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు అని చెప్పడానికి స్ఫూర్తి... జోయా మీర్జా. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా నియామకం కావడం ద్వారా తన కలను నిజం చేసుకుంది.అయితే జోయా మీర్జాది నల్లేరు మీద నడకేమీ కాదు. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ‘ఇక చదివింది చాలు’ అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు. చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ్రపోత్సహించేవారు. జోయాను డాక్టర్‌గా చూడాలనేది అమ్మమ్మ కల.‘నీట్’ పరీక్షలో జోయాను ఫెయిల్యూర్ పలకరించింది. బాధపడుతూ కూర్చోకుండా ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో గ్రాడ్యుయేషన్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజస్థాన్‌లోని కోటాలో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకోవడానికి జోయా మీర్జాను తల్లిదండ్రులు ఒప్పించారు. కోచింగ్ కోసం అప్పులు చేశారు. ‘తల్లిదండ్రుల కోరిక మేరకు కోటాకు వెళ్లాను. అయితే ్రపాక్టీస్ ఎగ్జామ్స్‌లో ఇతర విద్యార్థులు నా కంటే మెరుగ్గా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నీట్ పరీక్షకు ఇరవై రోజుల ముందు అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి కోటాకు వచ్చాను. ఒకే ఒక్క ర్యాంకు తేడాతో సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మీర్జా.తల్లిదండ్రులు మొదట నిరాశ పడినా ‘మరో ప్రయత్నం’ అంటూ కుమార్తెను కోచింగ్ కోసం భిలాయ్‌కు పంపించారు.‘భిలాయ్ కోచింగ్ సెంటర్లోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అది నాకు ఎంతగానో ఉపకరించింది’ అంటుంది మీర్జా. ఆ ఆత్మబలమే ‘నీట్’లో తగిన మార్కులు సాధించి ‘ఏఎఫ్ఎంసీ’ ఎంచుకునేలా చేసింది. పుణేలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చేసింది.‘గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు... ‘సోల్జర్, డాక్టర్’ అని చేప్పేవాడు. లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఆ రెండు గొప్ప వృత్తులలో పనిచేసే అవకాశం తన అదృష్టం అంటుంది జోయా మీర్జా.తన ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో.‘చదువుపై నాకు ఉన్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది. నన్ను యూనిఫామ్‌లో చూడలేకపోయింది’ అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మీర్జా.‘పరులకు సహాయం చేయాలనే తత్వం తనది. తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది. మీర్జాకు ఎలాంటి సవాలైనా ఎదుర్కొనే శక్తి ఉంది’ అంటున్నాడు జోయా తండ్రి షమీమ్ మీర్జా. -
చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాో సరిహద్దుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాగా 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. సంఘటనా ప్రాంతం నుంచి ఒక ఏకే 47తోపాటు ఇతన భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రీజియన్‌లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగుర్ని మట్టుబెట్టాయి. -
ఓటేస్తే మజూరీలో రాయితీ
రాయ్‌పూర్: ఓటేస్తే రెస్టారెంట్లు డిస్కౌంట్ ఇవ్వడాన్ని నోయిడాలో చూశాం. బెంగళూరులో అయితే ఏకంగా ఫ్రీ బీర్ ప్రకటించారు! ఈ జాబితాలో తాజాగా ఛత్తీస్‌గఢ్ చేరింది. అయితే ఇందులో కాస్త వెరైటీ ఉంది! ఓటేసి వేలికి నీలి రంగు సిరా చూపిస్తే బంగారం తయారీ ధరలను (మజూరీ) తగ్గిస్తామని రాష్ట్ర వాణిజ్య మండలి ప్రకటించింది. దాంతోపాటు పలు ఇతర ఉత్పత్తులపైనా రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ సంస్థల నిర్వాహకులు కూడా ఇందుకు అంగీకరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అమర్ పర్వానీ నేతృత్వంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ గౌరవ్ కుమార్ సింగ్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన వారికి తమ ఉత్పత్తుల కొనుగోలుపై ఫర్నిచర్ అసోసియేషన్ 10 శాతం, టెక్స్టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ 10 శాతం, రాయ్‌పూర్ ఆప్టికల్ అసోసియేషన్ 15 శాతం, ప్లైవుడ్ అసోసియేషన్ 5 శాతం, బులియన్ అసోసియేషన్ 15 శాతం రాయితీ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలకు గాను ఏడింటికి మే 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. -
ఏప్రిల్‌లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రామానుజ్‌గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్‌లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్‌గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్‌గంజ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
ఆ ఐదు చోట్ల అమీతుమీ
పూర్ణియా (బిహార్) ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి సిట్టింగ్ ఎంపీ, జేడీ(యూ) నేత సంతోష్ కుమార్ కుశ్వాహా ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. విపక్ష ఇండియా కూటమి తరఫున ఆర్జేడీ నాయకురాలు బీమా భారతీ పోటీలో ఉన్నారు. ఆమె నెల క్రితమే జేడీ(యూ) నుంచి ఆర్జేడీలో చేరారు. కానీ బాహుబలి రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ రంగప్రవేశంతో పోటీ ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఆయనపై లెక్కలేనన్ని హత్య, హత్యాయత్నం తదితర కేసులున్నాయి. ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా నెగ్గారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురయ్యాక జన్ అధికార్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశతో దాన్ని ఇటీవలే ఆ పార్టీలో విలీనం చేశారు. కానీ కూటమి సర్దుబాటులో ఆ సీటు ఆర్జేడీకి వెళ్లడంతో ఆగ్రహించి స్వతంత్రునిగా రంగంలోకి దిగి ప్రధాన పార్టీల అభ్యర్థులకు పెనుసవాలు విసురుతున్నారు. గతంలో కూడా ఆయన స్వతంత్రునిగా నెగ్గడం విశేషం. సంతోష్ కుమార్‌పై ఓటర్లలో అసంతృప్తి, వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. పైగా జేడీ(యూ) మాజీ నేత అయిన బీమా భారతీ కూడా ఆ పార్టీ ఓట్లను బాగానే చీల్చేలా కన్పిస్తున్నారు. ప్రణామ్ పూర్ణియా పేరిట పప్పూయాదవ్ చేస్తున్న ప్రచారానికి భారీ స్పందన లభిస్తుండటం విశేషం! రాజ్‌నంద్‌గావ్ (ఛత్తీస్‌గఢ్) ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ఈసారి దాన్ని ఎలాగైనా బద్దలు కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందులో భాగంగా తాజా మాజీ సీఎం భూపేశ్ బఘెల్‌ను బరిలో దింపింది. అయితే, కాకాగా ప్రసిద్ధుడైన ఆయన బహుముఖ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజానికి సీఎంగా ఈ ప్రాంతాన్ని బఘెల్ ఎంతగానో అభివృద్ధి చేశారు. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని 8 అసెంబ్లీ సీట్లలో ఏకంగా ఐదు కాంగ్రెస్ ఖాతాలోనే ఉన్నాయి. అయినా ఈసారి కూడా ఇక్కడ బీజేపీదే విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే ఈసారి కూడా విజయంపై ధీమాగా ఉన్నారు. 2000లో రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఒక్కసారి మినహా ఇక్కడ కాషాయ జెండాయే ఎగిరింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి నేపథ్యంలో ఇక్కడ గెలుపు బఘెల్‌కు తప్పనిసరిగా మారింది. దాంతో ఈ పోరును ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు. నిత్యం ఓటర్లను కలుస్తూ ఓట్లడుగుతున్నారు. కాకపోతే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఆయన అవకాశాలకు మరింతగా గండికొట్టేలా కన్పిస్తున్నాయి. ఇక్కడి ఓటర్లలో ఆదివాసీలు ఏకంగా 35 శాతం, ఓబీసీలు 30 శాతమున్నారు. నాందేడ్ (మహారాష్ట్ర) ఈ లోక్‌సభ స్థానం కొన్నాళ్ల క్రితం దాకా కాంగ్రెస్‌కు పెట్టని కోట. కానీ ఆ పార్టీ అగ్ర నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ ఇటీవల బీజేపీలో చేరడంతో ఇక్కడ సమీకరణాలు పూర్తిగా మారాయి. దానికి తోడు గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పాగా వేసింది. అయితే సిట్టింగ్ బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావ్ గోవిందరావ్ పాటిల్ చికలీకర్కు ఇండియా కూటమి తరఫున వసంత్ చవాన్ ఈసారి గట్టి పోటీ ఇస్తున్నారు. దీనికి తోడు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాఢీ (వీబీఏ) కూడా బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఈ సెగ్మెంట్లో సంఖ్యాధికులైన ఓబీసీలు బీజేపీకి గట్టి ఓటు బ్యాంకు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన వీబీఏ అభ్యర్థి అవినాశ్ భోసికర్ బీజేపీ ఓట్లను చీలుస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికలీకర్ను గెలిపించుకోవాల్సిన బాధ్యతను పార్టీ నాయకత్వం అశోక్ చవాన్‌పై ఉంచింది. దాంతో ఆయన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. వీబీఏ అభ్యర్థి బీజేపీ వ్యతిరేక ఓట్లనే చీల్చి చికిలీకర్ విజయాన్ని సునాయాసం చేస్తారని చవాన్ చెబుతున్నారు. అమరావతి (మహారాష్ట్ర) రాష్ట్రంలో అత్యంత హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాల్లో ఇదొకటి. సిట్టింగ్ ఎంపీ, సినీ నటి నవ్‌నీత్ కౌర్ రాణా ఈసారి బీజేపీ టికెట్‌పై బరిలో ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ దన్నుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌రావ్ అడ్సుల్‌పై నెగ్గి తొలిసారి లోక్‌సభలో ప్రవేశించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి మాత్రం ఎదురీదుతున్నారు. ఎందుకంటే ఆమెకు టికెటివ్వడంపై స్థానిక బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇది చాలదన్నట్టు ఎన్డీఏ స్థానిక భాగస్వామి ప్రహార్ పార్టీ రాణా అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ తరఫున దినేశ్ బూబ్ను పోటీకి నిలిపింది! దీనికి తోడు మహావికాస్ అఘాఢీ కూటమి తరఫున బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వంత్ వాంఖడేకు నియోజకవర్గమంతటా మంచి పేరుంది. పైగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లలో మూడు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే వంచిత్ బహుజన్ పార్టీ నుంచి బరిలో ఉన్న అంబేడ్కర్ మనవడు ఆనంద్‌రాజ్ అంబేడ్కర్ కాంగ్రెస్ ఓట్లను భారీగా చీలుస్తారని భావిస్తున్నారు. ఇది రాణాకు బాగా కలిసొచ్చే అంశం. బాలూర్ఘాట్ (పశ్చిమబెంగాల్) పశ్చిమబెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోటీ నెలకొన్న లోక్‌సభ స్థానాల్లో బాలూర్ఘాట్ ముఖ్యమైనది. ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సుకాంత మజుందార్ పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో భారీగా సీట్లను గెలుచుకోవడం తెలిసిందే. ఆ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి అర్పితా ఘోష్‌పై సుకాంత భారీ మెజారిటీతో నెగ్గారు. దాంతో ఈసారి బాలూర్ఘాట్ను తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుకాంతను ఎలాగైనా ఓడించి తీరాలని పట్టుదలగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి విప్లవ్ మిత్రాను మమత బరిలో దించడంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. అయినా సుకాంత మాత్రం బాలూర్ఘాట్తో పాటు బెంగాల్ మొత్తాన్నీ మోదీ వేవ్‌లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందంటున్నారు. ఈసారి కూడా తనకు భారీ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ నేతల అంతులేని అవినీతి, సందేశ్‌ఖాలీలో మహిళలపై వారి అకృత్యాలతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని చెబుతున్నారు. మీరట్ (ఉత్తరప్రదేశ్) ‘టీవీ రాముడు’ అరుణ్ గోవిల్ పోటీతో ఈ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దూరదర్శన్‌లో సీరియల్‌గా వచ్చిన రామాయణంలో రాముని పాత్ర పోషించిన ఆయన దేశవ్యాప్త క్రేజ్ సంపాదించారు. బీజేపీ ఆయనను అనూహ్యంగా పార్టీలో చేర్చుకోవడమే గాక మీరట్ టికెట్ కూడా ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గడం తెలిసిందే. ఈసారి దేశవ్యాప్తంగా సొంతంగా 370 లోక్‌సభ స్థానాల లక్ష్యాన్ని సాధించాలంటే యూపీలో క్లీన్‌స్వీప్ చేయడం తప్పనిసరని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మీరట్ పరిసరాల్లోని పలు లోక్‌సభ స్థానాల్లో గోవిల్ ప్రభావం చూపుతారన్న అంచనాతో ఆయన్ను బరిలోకి దింపింది. సమాజ్‌వాదీ నుంచి సునీతా వర్మ, బీఎస్పీ నుంచి దేవవ్రత్ కుమార్ త్యాగీ ఆయనకు ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు. -
Chhattisgarh Encounter: ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల జిల్లా) / సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ లేరని బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు. బుధవారం రాత్రి వరకు 8 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్, ఆయన భార్య ఉన్నారని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు. ఘటన స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల్లో చిన్నన్న లేడని ధ్రువీకరించిన సోదరులు ఈ ఎన్కౌంటర్లో సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నంద్యాల పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్ – కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తించిన మృతులు 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు, మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్తాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ -
పక్కా సమాచారం.. పకడ్బందీ వ్యూహం
మృతి చెందిన మావోయిస్టుల్లో గుర్తించింది వీరినే.. 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు (మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్), డీవీసీ మెంబర్, నార్త్ బస్తర్ మాస్ ఇన్చార్జి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: పక్కాగా అందిన సమాచారం, పకడ్బందీ వ్యూహం నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ డివిజన్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. సోమవారం సాయంత్రం పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట కాంకేర్ జిల్లాలో ఒకరిని హతమార్చిన మావోయిస్టులు.. అదే ప్రాంతంలో సమావేశం అయ్యారన్న సమాచారంతో బలగాలు ప్రత్యేక వ్యూహంతో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లోనే 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. వీరిలో 15 మంది మహిళలు కాగా, 14 మంది పురుషులు ఉన్నారు. ఘటనా స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల బుధవారం రాత్రి వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వారు తెలియజేశారు. ఇప్పటివరకు 9 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు భావించామని, అయితే బుధవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనతో పాటు ఇప్పటివరకు గుర్తించిన మొత్తం 9 మంది పేర్లను తెలిపారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఆపరేషన్ యాంటీ మావోయిస్టులు పేరిట ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అందిన సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం నుంచి కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసులు (డీఆర్జీ), కేంద్ర భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు బుధవారం ప్రకటించారు. లోక్‌సభ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఈనెల 19న 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందులో దండకారణ్య ప్రాంతంలోని బస్తర్, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి స్థానాలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన కాంకేర్ పార్లమెంట్ స్థానానికి రెండో విడతలో ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నెల రోజులుగా నిఘా వేసిన పోలీసు వర్గాలకు అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ పోలీసుల దృష్టిలో మోస్ట్ వాంటెడ్‌లుగా ఉన్న పలువురు టాప్ కమాండర్లు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. నాలుగైదు రోజుల ముందే అగ్రనేతలు, ఆర్కేబీ డివిజన్ కమిటీ ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన నేపథ్యంలో రావ్‌ఘాట్ ఏరియా కమిటీ (పర్థాపూర్)మాత్రమే ఛోటె బెటియా పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయి పోలీసుల ఎదురుకాల్పుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్లు సమాచారం. ముగిసిన 25 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం చిట్యాల: విప్లవ గీతాలకు ఆకర్షితుడై 25 ఏళ్లక్రితం అడవి బాటపట్టిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ విగతజీవుడై గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. సిరిపెల్లి రాజపోశమ్మ–ఓదెలు దంపతుల కుమారుడు సుధాకర్ 1996లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తరువాత లొంగిపోయి జైలు జీవితం గడిపాడు. 1998లో మళ్లీ అడవి బాట పట్టాడు. దళ సభ్యుడి నుంచి నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం శంకర్ పేరుతో ఛత్తీస్‌గఢ్ ఏరియాలో జిల్లా కార్యదర్శిగా ఎదిగాడు. సుధాకర్ తండ్రి చనిపోగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. బస్తర్ ఎన్కౌంటర్లో సుధాకర్ చనిపోయాడని తెలియడంతో తల్లి, బంధువులు ఛత్తీస్‌గఢ్ వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. సుధాకర్ భార్య సుమన మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు ధ్రువీకరించిన సోదరులు ఆత్మకూరు రూరల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు, అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ కూడా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే స్థానిక పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన..2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. తదనంతర కాలంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్–కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు పోలీసు రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. -
ఏవోబీలోకి మావోయిస్టులు?
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టు పార్టీకి అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం కేంద్ర పోలీసు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యులను కోల్పోయింది. కాంకేరు జిల్లాలోని మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మరోవైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒడిశా పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చింతూరుకు సరిహద్దులోని ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. అప్రమత్తంగా ఉన్నాం ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్ పోస్టుల పరి«ధిలో రెడ్ అలర్ట్ అమలులో ఉంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు -
Bastar Encounter: 29 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ బస్తర్ అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతిచెందిన 29 మంది నక్సలైట్ల మృతదేహాలకు శవపరీక్ష జరుగుతోందని బస్తర్ రేజం్ ఐజీ సుందరరాజన్ తెలిపారు. ఎన్ కౌంటర్ మృతుల్లో 15 మంది మహిళా మావోయిస్టులు, 14 మంది పురుషు నక్సల్స్ ఉన్నారని పేర్కొన్నారు. డీఆర్జీ, బీఎస్ఎఫ్ జవాన్లు సంయుక్తంగా నక్సల్స్‌ను చుట్టు ముట్టి మంచి ఫలితాలు సాధించారన్నారు. నాలుగు గంటల పాటు హోరా హోరిగా ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు. దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో భారీ ఎన్కౌటర్లో భారీ ఎన్కౌటర్తో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. బస్తర్ అడవుల్లోని కాంకేరు జిల్లా ఛోట్ బెటియా ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఈయన పై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఏడు ఏకే–47లు, మూడు ఎల్ఎంజీలు, ఇతర ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. నెలరోజుల్లో 79 మంది లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీకి చెందిన 79 మంది మరణించారు. వరుస ఎదురుదెబ్బలతో కేంద్ర మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. -
నవమి వేళ.. శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠ!
శ్రీరామ నవమి సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్ చంపా జిల్లాలోని కులీపోతా గ్రామంలో శ్రీసీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. చైత్ర నవరాత్రుల ప్రారంభం నుంచి ఇక్కడ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ దక్షిణముఖి హనుమాన్ 30 ఏళ్లుగా గ్రామంలో కొలువైవున్నాడన్నారు. ఇప్పుడు ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని, ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీసీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని తెలిపారు. ఏప్రిల్ 16న కలశ స్థాపన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పూర్ణాహుతి, మహా హారతి, ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభమవుతుందని, ఇది ఏప్రిల్ 25 వరకు కొనసాగుతుందని తెలిపారు. హనుమంతుని జయంతిని ఏప్రిల్ 23 న నిర్వహించనున్నామన్నారు. -
నెత్తురోడిన బస్తర్.. ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్‌కౌంటర్‌గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, (ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్‌కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో మజ్జిదేవ్ భార్య లలిత! ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా బజార్హత్నూరుకు చెందిన ఆశశ్వర్ సుమన అలియాస్ రజిత మరణించినట్లు తెలుస్తోంది. సిరిపల్లె సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలామ్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు. మజ్జిదేవ్ కూడా ఉన్నారా? ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపాయి. ఎన్కౌంటర్లో గాయపడిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. నెలరోజుల్లో 79 మంది లోక్‌సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈనెల 19న లోక్‌సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. తెలంగాణ పోలీసుల అలర్ట్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది. -
హెలికాఫ్టర్‌లో బయలుదేరిన పోలింగ్ సిబ్బంది.. వీడియో వైరల్
బీజాపూర్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జాతీయ పార్టీలు మాత్రమే కాకుండా.. ప్రాంతీయ పార్టీలు సైతం విజయమే ప్రధానంగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ తరుణంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. దేశం మొత్తం మీద ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ప్రారంభంలో మొదటి దశలో చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది హెలికాఫ్టర్లలో పయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవితున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు MI-17 ఛాపర్లను ఉపయోగించి పోలింగ్ బృందాలు బయలుదేరాయి. శాంతియుతంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఎన్నికల అధికారులకు, ఓటర్లకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే, ఎస్పీ జితేంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. ఎన్నికలు జరగటానికి మూడు రోజులు ముందుగానే పోలింగ్ సిబ్బందిని.. పోలింగ్ జరిగే ప్రాంతాలకు పంపడం ప్రారంభిస్తామని బీజాపూర్ కలెక్టర్ అనురాగ్ పాండే పేర్కొన్నారు. ఇవన్నీ ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మెడకు జరుగుతాయని ఆయన అన్నారు. నేటి నుంచి పోలింగ్ అధికారులు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.. ఎన్నికల అధికారులందరికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM), అవసరమైన అన్ని పరికరాలను సంబంధిత అధికారులకు అందించారు. చత్తీస్ఘఢ్లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నారు. అయితే ఏప్రిల్ 19వ తేదీన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికలు జరగున్నాయి. రెండు, మూడో దశల్లో మిగిలిన నియోజక వర్గాల్లో జరుగుతాయి. #WATCH | Chhattisgarh: Ahead of Lok Sabha elections, polling teams leave by helicopter to Naxal-hit areas, in Narayanpur 11 Lok Sabha seats in Chhattisgarh will go to polls in three phases on April 19, April 26 and May 7. Bastar will be the only seat to go to polls in the first… pic.twitter.com/bxQYMuwbVx — ANI (@ANI) April 16, 2024 -
ప్రధాని మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
రాయ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు తెలిపారు. ‘ప్రధాని మోదీపై అసభ్యకరమైన వాఖ్యలు చేసిన అరవింద్ కుమార్ సోని అనే వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతన్ని మస్తురీ పట్టణంలో అదుపులోకి తీసుకున్నాం’ అని బిలాస్పూర్ ఏఎస్పీ(రూరల్ అర్చనా ఝా తెలిపారు. శనివారం భాదోరా గ్రామంలో జరిగిన బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో అరవింద్ కుమార్ తీవ్రమైన అసభ్య పదజాలంతో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారని పోలీసులు తెలిపారు. దీంతో బీజేపీ నేత బీపీ సింగ్ అరవింద్ కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే విధంగా ప్రధానిమోదీపై అరవింద్ అనే వ్యక్తి అస్యభ వ్యాఖ్యలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బిలాస్పూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థి దేవేంద్రసింగ్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కన్హయ్య కుమార్ పాల్గొన్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో ఏప్రిల్ 19 నుంచి మే 7వరకు మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేవేంద్ర సింగ్ యాదవ్ బిలాయ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. బీజేపీ అభ్యర్థి టోకెన్ సాహూకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేవేంద్ర సింగ్‌ను బరిలోకి దించింది. -
‘విద్యుత్’ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి?
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ ఆదివారం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఆయా అధికారులు, మాజీ అధికారులు పోషించిన పాత్ర ఏమిటనే వివరణ, అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో భాగస్వాములైన వ్యక్తులు, సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సోమవారం బహిరంగ ప్రకటన కూడా జారీ చేయనుంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు రాతపూర్వకంగా అందించడానికి వీలు కల్పించనుంది. అవసరమైతే బహిరంగ విచారణకు రావాలని వారిని పిలిపించే అవకాశమూ ఉంది. ప్రస్తుత, మాజీ అధికారులందరికీ.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో సంబంధమున్న ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ జి.రఘుమారెడ్డి, టీఎస్ఎన్పీడీసీఎల్ మాజీ సీఎండీలు కె.వెంకటనారాయణ, ఎ.గోపాల్‌రావుతోపాటు ఆయా విద్యుత్ సంస్థల మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరితోపాటు నామినేషన్లపై యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్ సంస్థ ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులు, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత ఉన్నతాధికారులకు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం నుంచి వీరికి నోటీసులు అందనున్నట్టు సమాచారం. త్వరలో ప్రజాప్రతినిధులకు కూడా.. విద్యుత్ ప్లాంట్లు, కొనుగోళ్లపై న్యాయ విచారణలో భాగంగా తొలిదశలో ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసిన కమిషన్.. ఆ నిర్ణయాల్లో తమ పాత్రపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అవసరమైతే కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరుకావాలని పిలిచే అవకాశం ఉందని విద్యుత్ వర్గాలు చెప్తున్నాయి. ఈ వివరణల్లో లభించే సమాచారం ఆధారంగా.. తర్వాతి దశలో పలువురు ప్రజాప్రతినిధులకు నేతలకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించిన నేపథ్యంలో.. కమిషన్ న్యాయ విచారణ ప్రక్రియను వేగిరం చేయాలని నిర్ణయించింది. ఈఆర్సీకి అరవింద్ కుమార్ లేఖనే కీలకం.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని.. ఆ ఒప్పందాన్ని ఆమోదించవద్దని కోరుతూ నాటి రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ 2016 డిసెంబర్లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహించిన అప్పటి సర్కారు.. ఆయనను మరుసటి రోజే ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. తాజాగా ఆయనకు కూడా విచారణ కమిషన్ నోటీసులు జారీ చేయడంతో.. నాటి లేఖ, ఆయన వివరణ కీలకంకానున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
Rahul Gandhi: వాళ్లది దాడి తంత్రం.. మాది పరిరక్షణ మంత్రం
జగ్దల్పూర్/భండారా: రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పాటుపడుతుంటే దానిని నచ్చినట్లు సవరించే కుట్రకు బీజేపీ బరితెగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. లోక్‌సభ సమరంలో విజయం సాధించి అధికారం చేపట్టగానే దేశవ్యాప్త కులగణనకు శ్రీకారం చుడతామని రాహుల్ పునరుద్ఘాటించారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలోని బస్తర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఈసారి జరుగుతున్న ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విధ్వంసక సిద్ధాంతాల మధ్య పోరాటం. ఓవైపు కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’కూటమి రాజ్యాంగ పరిరక్షణకు ప్రయత్నం చేస్తుంటే మరోపక్క మోదీ, అదానీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. గిరిజన మహిళ అని కనీస గౌరవం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి రాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇది బీజేపీ ఆలోచనాధోరణికి అద్దంపడుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. షెడ్యూల్ తెగలకు కేటాయించిన బస్తర్ ఎంపీ స్థానంలో బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మాకు మద్దతుగా రాహుల్ ఈ సభకు వచ్చి మాట్లాడారు. ఆదివాసీ.. వనవాసీ ‘‘ ఆదివాసీ పదాన్నే ప్రధాని వాడుక నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మేం ఆదివాసీ అంటే బీజేపీ వాళ్లు వనవాసీ అంటున్నారు. రెండు పదాల అర్ధాల్లో చాలా బేధముంది. ఆదివాసీ అంటే అడవితో మమేకమైన వాళ్లు అని అర్థం. ఆ పదం మీకు జలం, జంగిల్(అడవి), జమీన్(భూమి)పై మీకున్న హక్కులను ఎలుగెత్తి చాటుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గిరిజనప్రాంతాల్లో స్వయంపాలనకు బాటలువేస్తూ గ్రామసభలకు అనుమతినిస్తూ పంచాయతీ చట్టాన్ని తెచ్చాయి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గిరిజనుల మత విశ్వాసాలు, సిద్ధాంతాలు, చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటవీ భూములను అదానీ లాంటి వాళ్లకు బీజేపీ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటికే దేశంలో అడవులు కుచించుకుపోతున్నాయి’’ అని రాహుల్ అన్నారు. మేమొస్తే రైతు రుణమాఫీ మహారాష్ట్రలోని భండారా జిల్లా సకోలీ పట్టణంలో పార్టీ ర్యాలీలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘‘అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీచేస్తాం. నిరుద్యోగం, అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్న సాధారణ జనం జీఎస్టీ కడుతున్నారు. కోట్లు గడిస్తున్న వాళ్లూ అంతే జీఎస్టీ కడుతున్నారు. మోదీ హయాంలో 22 మంది బడా పారిశ్రామికవేత్తల వద్ద పోగుబడిన సంపద 70 కోట్ల మంది భారతీయుల ఆస్తితో సమానం. ఈ విషయం వదిలేసి మోదీ ఎప్పుడూ మతం గురించే మాట్లాడతారు’’ అని రాహుల్ అన్నారు. -
ఒకేరోజు 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఛత్తీస్‌గఢ్‌లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు తగ్గింది. తేమ 87 శాతానికి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలోని ఇళ్లు, కార్యాలయాల్లోని ఏసీలు, కూలర్లకు విశ్రాంతి దొరికింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. గడచిన 24 గంటల్లో రాయ్‌పూర్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, రాయ్‌పూర్‌లో 24.7, మనాలో 24, బిలాస్పూర్లో 28.4, పెండ్రారోడ్లో 29.6, అంబికాపూర్‌లో 31.5, జగదల్పూర్లో 26.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రాష్ట్రపతి, ప్రధాని విచారం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భారీ గుంతలో బస్సు బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతిచెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన బస్సు బోల్తాపడింది. కాగా, ఓ డిస్టిలర్లీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇక, రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 12మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. President Droupadi Murmu tweets, "The news of many people getting killed in a bus accident in Durg district of Chhattisgarh is very sad. My deepest condolences to all the bereaved families! I wish for the speedy recovery of the injured." pic.twitter.com/bkqAVvKGNR — ANI (@ANI) April 9, 2024 మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఇక, ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. छत्तीसगढ़ के दुर्ग में हुआ बस हादसा अत्यंत दुखद है। इसमें जिन्होंने अपने प्रियजनों को खोया है, उनके प्रति मेरी संवेदनाएं। इसके साथ ही मैं घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की निगरानी में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा है। — Narendra Modi (@narendramodi) April 9, 2024 ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దుర్గ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం బస్సు ప్రమాద ఘటనపై స్పందించారు. ఈ సందర్బంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడినవారు వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. #WATCH | Chhattisgarh: On Durg bus accident, SP Jitendra Shukla says, "Today around 8.30 pm, workers of a distillery were leaving after their shift ended... All the people were rescued and admitted to various hospitals. As per data so far, 12 people have died... * people who were… pic.twitter.com/MPPa3rrIhl — ANI (@ANI) April 9, 2024 -
PM Narendra Modi: లూటీ లైసెన్స్ రద్దు చేశా
రాయ్‌పూర్/జగ్దల్పూర్/చంద్రాపూర్: దశాబ్దాలు గా పేదల అవసరాలు, వారి బాధలు అవినీతి కాంగ్రెస్‌కు పట్టలేదని ప్రధాని మోదీ విమర్శల వాగ్భాణాలు సంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ఛోటే అంబాల్ గ్రామంలో సోమవారం బీజేపీ ‘విజయ్ సంకల్ప్ శంఖనాదం’ ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ‘‘ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటి హయాంలో అవినీతిని దేశ గుర్తింపుగా మార్చేశాయి. అధికారంలో ఉండటమంటే లూటీ చేయడానికి లైసెన్స్ సంపాదించినట్లుగా కాంగ్రెస్ నిశ్చితాభిప్రాయానికి వచ్చేసింది. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి పేదల బాధను కాంగ్రెస్ ఏనాడూ అర్ధంచేసుకోలేదు. అలాంటి పేదలు కోవిడ్ విలయకాలంలో ఏమైపోతారో అని చాలా మంది నన్ను ప్రశ్నించారు. వాళ్లకేమీ కాదు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ఆహారధాన్యాలు అందిస్తానని ఆనాడే చెప్పా. మా ప్రభుత్వ కృషి కారణంగానే దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం కోరల నుంచి బయటపడ్డారు’’ అని చెప్పారు. పేదల హక్కులను కాంగ్రెస్ హరించింది ‘‘పేదల హక్కులను అవినీతి కాంగ్రెస్ మింగేసింది. 2014కు ముందు పలు కుంభకోణాలతో లక్షల కోట్ల ప్రజాధనం నొక్కేశారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించే ప్రతి రూపాయిలో లబ్ధిదారునికి కేవలం 15 పైసలే చేరుతున్నాయని స్వయంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీయే ఒప్పుకున్నారు. మిగతా 85 పైసలను ఎవరు కొట్టేశారు?. కాంగ్రెస్ కొనసాగించిన ఈ లూటీ లైసెన్స్ విధానానికి నేనే చరమగీతం పాడా. గత పదేళ్లకాలంలో బీజేపీ సర్కార్ లబ్దిదారుల ఖాతాలకు నేరుగా రూ.34 లక్షల కోట్ల మొత్తాలను బదిలీచేసింది. హస్తిన నుంచి విడుదలైన ప్రతి రూపాయి 100 శాతం పేదల చెంతకు చేరింది. ఇప్పటికీ కాంగ్రెస్సే అధికారంలో ఉండి ఉంటే ఈ రూ.34 లక్షల కోట్లలో 85 పైసలు అంటే రూ.28 లక్షల కోట్ల స్వాహా చేసేవారు’ అని మోదీ ఆరోపణలు గుప్పించారు. దేశంలో అన్ని సమస్యలకూ కాంగ్రెస్సే కారణం దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పారీ్టయే కారణమని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ను కాకరకాయతో పోలి్చన ఆయన..నెయ్యిలో వేయించినా, చక్కెర కలిపినా కాకర రుచి మాత్రం మారదన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో సోమవా రం ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఆయన స్థిరత్వానికి, అస్థిరతకు మధ్య జరుగుతున్న పోరుగా పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేందుకే ప్రతిపక్షాలు అధికారంలోకి రావాలనుకుంటున్నాయన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధి పూజారి కాంకేర్– నంబి సమీపాన కర్రిగుట్టల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున కర్రిగుట్ట అడవుల్లో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నడుమ గంటసేపు ఎదురుకాల్పులు కొనసాగాయి. అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక ఏకే–47, ఒక మెషీన్‌గన్, ఒక 12 బోర్ తుపాకీతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, ఔషధా లు, నిత్యావసర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకు‹Ùపూర్ గ్రామానికి చెందిన అన్నె సంతోష్ అలియాస్ శ్రీధర్ అలియాస్ సాగర్‌గా గుర్తించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడైన(ఎస్సీఎం) సాగర్.. సెంట్రల్ రీజియన్ కమాండ్(సీఈసీ)కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉంది. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో మంగళవారం పోలీసుల బలగాలు, మావోల నడుమ జరిగిన ఎదురుకాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధి కొర్చోలి, లేంద్ర గ్రామాల సమీపాన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే నిఘా వర్గాల సమాచారంతో సోమవారం రాత్రి జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్, కోబ్రా కమాండో , బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం కొర్చేలి, లేంద్ర మధ్య అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడి కాల్పులు పది మంది మావోయిస్టుల మృతి మొదలుపెట్టారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 11 గంటల సమయాన మళ్లీ వారికి మావోలు తారసపడి కాల్పులకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మొత్తంగా పది మంది మావోయిస్టులు మృతి చెందారని, ఇందులో ఒక మహిళ ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్ రాజు వెల్లడించారు. మృతులు మావోల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రెండో కంపెనీ సభ్యులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనలో సుమారు 30 మంది మావోలు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. పలువురు గాయాల పాలై తప్పించుకున్నట్లు భావించి పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. ఘటనాస్థలి నుంచి పెద్ద మొత్తంలో లైట్ మెషీన్ గన్స్, ఏకే 47 తుపాకులు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్లు, మందుపాతరలు, పేలుడు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మరో ఇద్దరు బాలాఘాట్: మధ్యప్రదేశ్‌లోని బాలా ఘాట్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఘటనలో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతి చెందారు. వారిని సాజంతి అలియాస్ క్రాంతి(38), రఘు అలియాస్ షేర్ సింగ్(52)గా గుర్తించారు. ఘటనా స్థలిలో ఆయుధాలు దొరికాయి. సాజంతిపై రూ.29 లక్షలు, రఘుపై రూ.14 లక్షల రివార్డులున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని కొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సలైట్లు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో నక్సల్స్ గాయపడినట్లు సమాచారం. గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన నక్సల్స్ మృత దేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్, ఎల్ ఎంజీ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్ బలగాలు ఇంకా ఎదురు కాల్పుల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రతా బలగాలు, పోలీసుల..చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నారు. -
లోక్‌సభ ఎన్నికల బరిలో సమోసా బాబా
ఛత్తీస్‌గఢ్‌లో పలు దుకాణాలకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయించే అజయ్ పాలి అలియాస్ సమోసా బాబా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. కవర్ధా జిల్లాకు చెందిన సమోసా బాబా.. రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ ఫారమ్‌ను కొనుగోలు చేశారు. కవర్ధా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఈ సమోసా బాబా 20 ఏళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. నగరంలోని జనం అజయ్పాలిని సమోసా బాబా అని పిలుస్తుంటారు. మొదట్లో ఒక సమోసా 50 పైసలకు విక్రయించే ఈయన ఇప్పుడు నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రూ. 5కు ఒక సమోసా విక్రయించే అతని దుకాణం ముందు జనం క్యూ కడుతుంటారు. ఈ సమోసా బాబా ఇప్పటివరకు 12కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో కౌన్సిలర్, ఎంపీ వరకు జరిగిన పలు ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇప్పుడు రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నుంచి నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి జనం బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనను చూసి విసిగిపోయారని, ఇప్పుడు తనకు అవకాశం కల్పిస్తారని సమోసా బాబా చెబుతున్నారు. బడా నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోరని సమోసా బాబా ఆరోపిస్తున్నారు. తనను ఇక్కడి జనం గెలిపిస్తే, తనకు వచ్చే ఎంపీ జీతాన్ని ప్రజా సేవకు ఖర్చు చేస్తానన్నారు. అజయ్ పాలీ 2008 నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపాలిటీ అధ్యక్ష, కౌన్సిలర్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో సమోసా బాబా పోటీ చేశారు. తాజాగా ఆయన రూ. 25 వేలు వెచ్చించి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ఫారం కొనుగోలు చేశారు. ఎన్నికల ఫలితాల గురించి పట్టించుకోకుండా సమోసా బాబా పోటీ చేస్తూ వస్తున్నారు. -
‘కొడుక్కి పిల్లను అడిగితే నాకు ఇచ్చారు’.. టికెట్ గురించే!
ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, బస్తర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు లోక్‌సభ టికెట్ దక్కిన వైనం గురించి హాస్యభరితంగా చెప్పారాయన. "ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తోంది. నాకు టిక్కెట్ ఎందుకు వచ్చింది.. నేను అడగలేదు. అంతగా అయితే నా కొడుక్కి నా ఇవ్వమన్నాను. నేను నా కొడుక్కి వధువును (టికెట్) అడిగాను. కానీ వారు నాకు ఇచ్చారు" అని హాస్యోక్తులు పూయించారు. అలాగే మోదీ పాలనను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు మన దేశం అమ్ముడవుతోందని, మన రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కవాసీ లఖ్మాపై జగదల్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దంతేశ్వరి ఆలయం ముందు నోట్లు పంచినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నోట్ల పంపిణీ సమాచారం అందిన వెంటనే మంత్రి కేదార్ కశ్యప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఇదివరకే మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. #WATCH | Lok Sabha elections 2024 | Congress candidate from Bastar (Chhattisgarh), Kawasi Lakhma says, "I am not contesting the elections, Congress party will contest the elections...Why did I get a ticket? I had not asked for one...If it is being insisted, give the ticket to my… pic.twitter.com/WSPUJ17I9O — ANI (@ANI) March 28, 2024 -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో బుధవారం హోరాహోరీగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజీపూర్ జిల్లా పరిధిలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆరీ్మ(పీఎల్జీఏ) ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్‌తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం..బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధి పూసుబాక మార్గంలో సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్న కొందరు యువకులు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. వారిలో ముగ్గురిని మావోయిస్టులు చంపేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచే పూసుబాక, చీపురుబట్టి గ్రామాల సమీప అటవీ ప్రాంతంలో కోబ్రా 210, 205, సీఆర్పీఎఫ్ 229 బెటాలియన్లకు చెందిన పోలీసు బలగాలతో పాటు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. హోరాహోరీగా కాల్పులు కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు బుధవారం తెల్లవారుజామున తాలిపేరు నదీ తీరాన మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో 4 గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. వాటిలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 40 మంది మావోయిస్టుల్లో పలువురు గాయాలతో తప్పించుకున్నారనే సమాచారంతో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. పట్టుబడ్డ మావోయిస్టును విచారిస్తున్నారు. మృతి చెందిన మావోయిస్టులను ప్లాటూన్–10 డిప్యూటీ కమాండర్ పూనెం నగే‹Ù, ఆయన భార్య వెట్టి సోని, ఆయ్తు పూనెం, సుక్కా ఓయం, నుప్పో మోకా, కొవసి గంగిగా గుర్తించారు. వారిపై రూ.14 లక్షల రివార్డుంది. ఘటనాస్థలి వద్ద మందుగుండు, ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. హోలీ రోజు ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని హతమార్చి ఈ వైపుగా పోలీసులను రప్పించి మెరుపుదాడి చేయాలని మావోలు పథక రచన చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
Chhattisgarh Encounter: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు
రాయ్‌పూర్: స్వల్ప రోజుల వ్యవధిలో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం బాసగూడ ప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు బలగాలు ప్రకటించుకున్నాయి. ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు ముగ్గురు స్థానికులను హతమార్చారు. దీంతో.. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇటీవల వరుసగా ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు, అంతకు ముందు చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు!
ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులను భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) అనర్హులుగా ప్రకటించింది. ఖర్చు వివరాలు తెలియజేయని లేదా ఇతర నిబంధనలను పాటించని ఈ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఈ అభ్యర్థుల జాబితాను బహిరంగపరిచింది. అనర్హతకు గురయిన ఈ 73 మందిలో 65 మంది అభ్యర్థులు 2024 వరకు, ఎనిమిదిమంది అభ్యర్థులు 2025 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమయ్యింది. వీటిని పరిశీలించాక సంబంధిత అధికారులు అనర్హుల జాబితాను విడుదల చేశారు. రాయ్‌పూర్ జిల్లా నుండి గరిష్టంగా 17 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ అనర్హుల జాబితాను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి యుఎస్ బాండే తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని 11 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్ 19న ఒక స్థానానికి, ఏప్రిల్ 26న మూడు స్థానాలకు, మే 7న ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మాల్లో విషాదం: తండ్రి చేతుల్లోంచి జారిపడి..
కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్‌మాల్‌కు వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది. తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్కులేటర్ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు. ఆ టైంలో ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడంతో.. నిలువరించేందుకు ఆ తండ్రి యత్నించాడు. ఈ లోపు చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడిపోయాడు. మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. మాల్ సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చొచ్చు.. సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk — Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024 -
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు నక్సల్స్ మృతి
-
91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా
దేశ వ్యాప్తంగా మార్చి 8న మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా అత్యంత వైభవంగా జరిగే ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ పరిధిలోని చటీడీహ్ శివాలయంలో ఈ ఏడాది మార్చి 8 నుంచి 12 వరకు 5 రోజుల పాటు మేళా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు దయాశంకర్ సోని మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయం సుమారు 91 సంవత్సరాల క్రితం నాటిదని, చార్ ధామ్ యాత్రకు వెళ్లి వచ్చాక తన తాత మంగ్లీ ప్రసాద్ సోనీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 91 ఏళ్లుగా మహాశివరాత్రి మేళా నిర్వహిస్తున్నమన్నారు. ఈ ఏడాది కూడా మేళాలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు రావాలని కోరామన్నారు. ప్రస్తుతం మంగ్లీ ప్రసాద్ సోనీ వారసులు ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయంలో ధ్వజారోహణం చేసే సంప్రదాయం కూడా ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని స్థానికులు చెబుతుంటారు. శివరాత్రి సందర్భంగా ఊరేగింపు కూడా నిర్వహించనున్నారు. -
బస్తర్‌లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్‌లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్‌గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్‌గఢ్‌తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్‌కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్‌లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్‌కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్‌కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్‌పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్‌లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్‌గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్‌్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
ముగ్గురు మావోయిస్టులు మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో కాంకేర్ జిల్లా కోయిల్‌బెడా అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ముగ్గురు మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా విభాగాల ప్రత్యేక పోలీసులు తారçసపడిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతోందని ఎస్పీ చెప్పారు. మందుపాతర పేలి జవాను దుర్మరణం ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం మందుపాతర పేలి హెడ్ కానిస్టేబుల్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ జరుపుతుండగా ఆయన పొరపాటున మందుపాతరపై కాలు వేశారని పోలీసులు తెలిపారు. -
సీఏఎఫ్ కమాండర్‌ను పొట్టనబెట్టుకున్న మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సాయుధ బలగాల కమాండర్‌ను దారుణంగా చంపారు. కుట్రు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దర్బా గ్రామంలో ఆదివారం జరిగే సంతకు ఛత్తీస్‌గఢ్ సాయుధ బలగాల 4వ బెటాలియన్ జవాన్లు బందోబస్తుగా ఉన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో గ్రామీణుల వేషధారణలో వచి్చన మావోయిస్టులు ఏమరుపాటుగా ఉన్న కమాండర్ తేజో రాం బౌర్యా తలపై గొడ్డలితో వేటు వేశారు. దీంతో, ఆయన అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలొదిలారు. ఆ వెంటనే మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న బలగాలు మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. -
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని వైకుంఠ్‌పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్‌సేల్‌లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్‌సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం
Ranji Trophy 2023-24: ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమనంలో ధనాధన్ శతకంతో సత్తా చాటాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత పృథ్వీ షా మళ్లీ మైదానంలో దిగాడు. గతేడాది ఆగష్టులో మోకాలి నొప్పి కారణంగా దేశవాళీ క్రికెట్‌కూ దూరమైన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకున్న పృథ్వీ షా.. నెట్స్‌లో కఠిన శ్రమకోర్చి.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఎన్సీఏలో పునరావాసం పొంది ఈ క్రమంలో రిటర్న్ టు ప్లే సర్టిఫికెట్ సంపాదించి రంజీ ట్రోఫీ-2024 సీజన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్‌తో మ్యాచ్ సందర్భంగా పునరాగమనం చేసిన పృథ్వీ.. తన మొదటి మ్యాచ్‌లో 35 పరుగులకే పరిమితమయ్యాడు. తాజాగా.. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌తో మొదలైన మ్యాచ్‌లో సెంచరీతో మెరవడం విశేషం. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పృథ్వీ షా.. 107 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. పదమూడో సెంచరీ మరో ఓపెనర్ భూపేన్ లల్వాణీ 37 పరుగులతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో భాగంగా 32 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. ఇక పృథ్వీ షాకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది పదమూడో సెంచరీ కావడం విశేషం. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పృథ్వీ షా ఓపెనర్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, శుబ్‌మన్ గిల్‌తో ఎదురైన పోటీలో వెనుకబడ్డ అతడు.. మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా తరఫున ఆఖరి టీ20 ఆడాడు పృథ్వీ షా. ఇక భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ అయిన పృథ్వీ షా సారథ్యంలో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ తదితరులు ఆడటం విశేషం. చదవండి: Ind vs Eng: కేఎస్ భరత్‌కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు! -
మావోయిస్టు నేత మృతి
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మూడు దశాబ్దాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్ మావోయిస్టు నేత ఒకరు చనిపోయారు. అతడిని మావో డివిజినల్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న అలియాస్ సత్యంగా గుర్తించారు. సుక్మా – దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో గురువారం రాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇతను మరణించారు. ఈయనపై రూ.8 లక్షల రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామగ్రిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నాయి. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. మావోయిస్టు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు చనిపోయాడు. సోధి గజేంద్ర తదితర సుమారు 20 మంది మావోయిస్టులతో కూడిన కుంటా ఏరియా కమిటీ సమావేశమవుతున్నట్లు అందిన సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా భేజీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నగరం, పంటాభేజీ గ్రామాల మధ్య ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. -
ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతి
నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమ్లేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్వోఎస్)కమాండర్ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్ఛా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు. సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. -
మావోల బంకర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు నిర్మించిన బంకర్‌ను భద్రతాబలగాలు గుర్తించారు. బస్తర్ డివిజన్లో మావోయిస్టులు బంకర్లను నిర్మించి వినియోగిస్తున్న విషయం బయటపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. బస్తర్‌లో ఇలాంటివి ఉండొచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉందిగానీ ఇన్నాళ్లలో ఎన్నడూ ఒక్కదానిని కూడా గుర్తించలేకపోయారు. బీజాపూర్–దంతెవాడ జిల్లాల మధ్య ఇంద్రావతి నదీతీరంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలను గుర్తించేందుకు జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా బీజాపూర్ జిల్లాలోని తోడోపాట్–ఉస్పారీ గ్రామ సమీప అడవిలో మంగళవారం ఈ బంకర్‌ను భద్రతా బలగాలు గుర్తించాయని దంతేవాడ అదనపు ఎస్పీ బర్మన్ చెప్పారు. ఈ సొరంగం 130 మీటర్ల పొడవు, 6 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పుతో ఉంది. బంకర్ కనపడకుండా ప్రవేశమార్గాన్ని మట్టితో కూడిన కర్రలను కప్పి వాటిపైన చెట్ల పొదలను పరిచారు. మావోలు డంపింగ్ ప్రాంతంగానూ దీనిన వినియోగించినట్లు భద్రతాబలగాలు గుర్తించాయి. జనవరి 9న మావోయిస్టుల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకున్నారు. మైదాన ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తే డ్రోన్ల సాయంతో జాడ కనిపెట్టే అవకాశం ఉండటంతో ఇటీవలే ఈ బంకర్ నిర్మించి సమావేశం జరిపి ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇంద్రావతి నదిఒడ్డున ఏర్పాటు చేసిన ఈ బంకర్లో 100 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా దాక్కునేందుకు వీలుగా ఉంది. ఇలాంటి బంకర్లు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరిన్ని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు, వాటిని గుర్తించేందుకు అడవుల్లో సోదాలు గాలింపు ముమ్మరం చేశారు. అబూజ్మడ్ అడవుల్లో ఇలాంటివి ఎన్ని బంకర్లు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై భద్రతాదళాలకు కొత్త సవాల్‌గా మారినట్టయ్యింది. వచ్చే వేసవిలో విస్తృతంగా కూంబింగ్ చేపట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్న భద్రతాదళాలకు కనిపించని బంకర్లతో మరిన్ని చిక్కులు వచ్చి పడే అవకాశముంది. గాలి, వెలుతురు సోకేలా ఏర్పాట్లు బైరాంఘర్ పోలీస్‌స్టేషన్, భద్రతాదళాల బేస్ క్యాంప్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ బంకర్ ఉంది. బంకర్లోకి వచ్చి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. గాలి, వెలుతురు సోకేలా ప్రతీ ఆరు మీటర్లకు ఒకటి చొప్పున ద్వారాలు ఏర్పాటు చేశారు. అయితే, ఇవి బయటకు కనిపించకుండా చెట్ల పొదలు అడ్డుపెట్టారు. మావో అగ్రనేతలు తలదాచుకునేందుకు ఉపయోగించుకోవడంతో పాటు మెరుపు దాడులకు వీలుగా దీనిని నిర్మించారని వార్తలొచ్చాయి. అయితే దీని నిర్మాణ వివరాలను భద్రతా బలగాలు ఇంకా అధికారికంగా బహిర్గతంచేయలేదు. -
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్‌లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్‌లు, పామేడు పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్‌పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
700 శవపరీక్షలు చేసిన మహిళకు శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం
అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాల రామ విగ్రయ ప్రాణ ప్రతిష్టకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆహ్వానితులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నారు. పౌర పురస్కార గ్రహీతలు, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, రామ మందిర ఉద్యమంలో మరణించిన కరసేవకుల కుటుంబ సభ్యులు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకకు ఆహ్వానితుల్లో ఉన్నారు. తాజాగా 700 శవపరీక్షలు నిర్వహించిన ఛత్తీస్‌గఢ్ మహిళ సంతోషి దుర్గకు రామమందిరానికి ఆహ్వానం రావడం విశేషంగా నిలిచింది. జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామమందిర్ ట్రస్ట్ నుండి ఆహ్వానం అందుకున్నారు. దీంతో సంతోషి దుర్గ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవుతోంది. తన జీవితంలో ఇలాంటి అదృష్టం దక్కుతుందని ఊహించలేదు. సాక్షాత్తూ ఆ రాముడే తన ఆహ్వానం పంపాడంటూ పరవశంలో మునిగి తేలుతూ భావోద్వేగానికి లోనైంది. ఆహ్వానం అందినందుకు గాను ప్రధాని మోదీకి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.నర్హర్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)కు చెందిన సంతోషి దుర్గ(35) ప్రత్యేకత ఏంటంటే 700 శవపరీక్షలు నిర్వహించారు. నర్హర్‌పూర్ ప్రాథమిక ఆరోగ్యంలో జీవన్ దీప్ కమిటీకి దాదాపు 18 సంవత్సరాలు పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు.. ఈ సమయంలో, ఆమె 700 పోస్ట్‌మార్టమ్‌లను నిర్వహించడం విశేషం ఆమె చేసిన కృషికి వివిధ సంఘాల నుండి గుర్తింపు పొందారు. ఆహ్వాన లేఖ అందగానే ఆశ్చర్యపోయానని, ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని ఆమె వెల్లడించారు.మార్చురీలో చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పనికి ఇంత పెద్ద గౌరవం లభించడంపై ఎంతగానో పొంగిపోయింది. జనవరి 18న నర్హర్‌పూర్ నుండి బయలుదేరి, అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై, నర్హర్‌పూర్ ప్రజల సంతోషం, శాంతి , పురోగతి కోసం ప్రార్థించాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు నర్హర్‌పూర్ BMO ప్రశాంత్ కుమార్ సింగ్ కూడా సంతోషిని అభినందించారు.ఇ ది తమకు కూడా గర్వకారణమన్నారు. కాగా అయోధ్యలోశ్రీ రామమందిర ప్రారంభోత్సవం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు శుభ ముహూర్తంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రామాలయ ఉద్యమంలో పాల్గొన్న నాయకుల బంధువులు, న్యాయవాదుల బృందం, హిందూ సాధువులు, నేపాల్‌లోని సెయింట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు, జైన, బౌద్ధులకు చెందిన వ్యక్తులు ఉంటారు. ఇంకా సిక్కు కమ్యూనిటీలు, గిరిజన సంఘాల ప్రతినిధులు, వార్తాపత్రికలు ,టెలివిజన్ ఛానెల్‌ల రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, నోబెల్ బహుమతి, భారతరత్న, పరమవీర చక్ర , పద్మ అవార్డుల వంటి ప్రతిష్టాత్మక అవార్డుల గ్రహీతలు, ముగ్గురు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల వరకు , త్రివిధ దళాల విశ్రాంత అధిపతులు, మాజీ రాయబారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులుతోపాటు, మేధావులు, క్రీడాకారులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు , పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. -
పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో పోలీసులు, మానోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మాట్వాండిలో సోమవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా.. తల్లి గాయాల పాలైంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అంధించారు. పోలీసులు, మానోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు అయ్యాయి. చదవండి: గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్! ఇంతకీ నేపథ్యం ఏంటంటే.. -
గోదావరి–కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే!
సాక్షి, అమరావతి: ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యంకాదని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య 1975, డిసెంబర్ 19న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదు. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీలు తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనను అమలుచేస్తే మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం, గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినట్లవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మేరకు పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తక్కువ వ్యయంతో పనులు పూర్తిచేయవచ్చునని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ.. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) వరకూ నీటిని తరలించడం ద్వారా గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ తొలుత ప్రతిపాదించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అభ్యంతరం చెప్పాయి. గోదావరి నికర జలాల్లో మిగులులేదని.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే అనుసంధానం చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మా కోటాలో నీటిని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. గోదావరి, ఉప నదులలోని నికర జలాల్లో ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నీరు, వరద జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు పలుమార్లు కోరింది. పోలవరం నుంచైతేనే కావేరికి గోదావరి.. గోదావరి బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏ రాష్ట్రం హక్కులకు విఘాతం కలగదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ.. పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు చేరిన గోదావరి జలాలను కృష్ణా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి ఎత్తిపోసి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల భూసేకరణ, నిర్వాసితుల సమస్య తప్పుతుందని.. తక్కువ వ్యయంతో గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను న్యాయ, సాగునీటిరంగ నిపుణులు బలపరుస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఇదీ.. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు. రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీలు మధ్యప్రదేశ్, 4 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చు. మిగతా నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించాలి. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో మధ్యప్రదేశ్ 38 శాతం, మహారాష్ట్ర 35 శాతం, ఆంధ్రప్రదేశ్ 27 శాతం వాడుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 78.10 శాతం ఆంధ్రప్రదేశ్, 10.50 శాతం మహారాష్ట్ర, 11.40 శాతం మధ్యప్రదేశ్ భరించాలి. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించాలి. -
పైలట్‌కు ‘ఛత్తీస్’ బాధ్యతలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు పారీ్టలో కీలక పదవి అప్పగించింది. ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ సభ్యులుగా, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగిన రెండు రోజులకే ఇలా పలువురు ప్రధాన కార్యదర్శలు, ఇన్‌చార్జ్‌ల బాధ్యతలను మార్చడం గమనార్హం. ఢిల్లీ, హరియాణా ఇన్చార్జ్ బాధ్యతలను దీపక్ బబారియాకు అప్పగించారు. కూమారి సెల్జాను ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మాణిక్కం ఠాగూర్‌ను అండమాన్ అండ్ నికోబార్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమించారు. జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి జీఏ మిర్‌కు పశ్చిమబెంగాల్ బాధ్యతలూ అప్పగించారు. జితేంద్ర సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు కట్టబెట్టారు. మహారాష్ట్ర ఇన్చార్జ్గా రమేశ్ చెన్నితల, బిహార్ ఇన్చార్జ్గా మోహన్ ప్రకాశ్ నియమితులయ్యారు. మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లకు ఇన్చార్జ్గా చెల్లకుమార్ ఎంపికయ్యారు. అజయ్ కుమార్‌కు తమిళనాడు, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జమ్మూకశ్మీర్ ఇన్చార్జ్గా భరత్సిన్హ్ సోలంకీ, హిమాచల్, చండీగఢ్ ఇన్చార్జ్గా రాజీవ్ శుక్లా, రాజస్తాన్ ఇన్చార్జ్గా సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా, పంజాబ్ ఇన్చార్జ్గా దేవేందర్ యాదవ్, గోవా, డామన్, డయ్యూ, దాద్రానగర్, హవేలా ఇన్చార్జ్గా మాణిక్‌రావు థాకరేను నియమించారు. త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్‌లకు గిరీశ్ చోదంకర్ను ఇన్చార్జ్గా నియమించారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ, ఏపీకి మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. ప్రియాంక చేజారిన యూపీ ఉత్తర్‌ప్రదేశ్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«దీని తప్పించడం గమనార్హం. ప్రియాంక గాం«దీకి ప్రధాన కార్యదర్శి పదవి ఉన్నాసరే ఆమెకు ఎలాంటి పోర్ట్‌ఫోలియో కేటాయించలేదు. అవినాశ్ పాండేకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను కట్టబెట్టారు. అజయ్ మాకెన్ పార్టీ కోశాధికారిగా ఉంటారు. -
భార్య నల్లగా ఉందని విడాకులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: చర్మరంగుపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2005లో వివాహమైన సదరు వ్యక్తి విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా తన భార్య తనను విడిచి వెళ్లినట్లు భర్త వాదించాడు. అయితే తన నలుపు రంగు కారణంగ భర్త వేధింపులకు గురిచేసినట్లు, ఇంటి నుంచి గెంటేసినట్లు భార్య తెలిపింది. దీంతో ఆమె తరపున నిలిచిన న్యాయస్థానం భర్తకు చివాట్లు పెట్టింది. ఈ కేసులో తీర్పు ద్వారా ఇతరులు కూడా చర్మ రంగు ఆధారంగా ఎంపిక చేసుకునే మనస్తత్వాన్నిప్రోత్సహించలేమని జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చర్మ రంగు ఆధారంగా వివక్షను నిర్మూలించాలని పిలుపునిచ్చింది. చర్మం రంగు ప్రాధాన్యతను ప్రోత్సహించలేమని పేర్కొంది. వివాహ సమయంలో భాగస్వామ్యుల ఎంపికవ విషయంలో చర్మం రంగు ప్రాధాన్యత, ఫేయిర్ నెస్ క్రీములపై జరిగిన లోతైన అధ్యయనాలను కోర్టు ప్రస్తావించింది. ముదురు రంగు చర్మం గల(మహిళలు) వారిని తక్కువగా చూపించడం, చర్మాన్ని కాంతివంతం చేసే సౌందర్య సాధనాలలో ఎక్కువ భాగం మహిళలను లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది. తక్కువ రంగు చర్మం కలిగిన స్త్రీలను తక్కువ కాన్ఫిడెంట్‌గా చూపించే ప్రయత్నం చేయడంతో పాటు జీవితంలో సక్సెస్ అవ్వలేరని చూపించే వారని కోర్టు పేర్కొంది. కాబట్టి నల్లటి రంగు కంటే ఫెయిర్ స్కిన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలనే సమాజం మనస్తత్వం మారాలని కోర్టు తెలదిపింది. ఈ కేసులో భర్త విడాకులను ఆమోదించలేమని కోర్టు చెప్పింది. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. వెంటనే తేరుకున్న మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు మావోల క్యాంప్‌ను ధ్వంసం చేశారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ‘‘మావోల జాడ కోసం గాలింపు చేపట్టగా సమీప ప్రాంతాల్లో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించాయి. ఎన్కౌంటర్ సందర్భంగా దాదాపు ఆరుగురు మావోలు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు లేదా మరణించి ఉండొచ్చు ఉండొచ్చు’’ అని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్ ఎస్ఐ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందగా రాము అనే కానిస్టేబుల్ గాయపడ్డారు. జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బద్రేలోని సీఆర్పీఎఫ్ క్యాంపు నుంచి ఉర్సంగల్ వైపు జవాన్లు కూంబింగ్ సాగిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్సై సుధాకర్‌రెడ్డి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సుధాకర్‌రెడ్డి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు. ఈ నెలలో బస్తర్ డివిజన్లో మావోయిస్టుల సంబంధిత ఘటనల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. 13న నారాయణ్‌పూర్ జిల్లా మావోయిస్టుల దాడిలో ఒక జవాను, 14న కాంకేర్ జిల్లా నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి మరో బీఎస్ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు. -
ఛత్తీస్‌గఢ్‌లో పేలిన మందు పాతర..నేలకొరిగిన బీఎస్ఎఫ్ జవాన్
కాంకేర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఒక బీఎస్ఎఫ్ జవాను వీర మరణం పొందారు. పర్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సడక్టోలా గ్రామ సమీపంలో కూంబింగ్ జరుపుతుండగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అఖిలేశ్ రాయ్(45) చనిపోయారని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. -
ఛత్తీస్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
రాయ్‌పూర్: బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర చర్చోపచర్చల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో నూతన ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం లభించింది. ఆదివారం రాయ్‌పూర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు హాజరైన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయ్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 59 ఏళ్ల విష్ణుదేవ్ రాష్ట్రంలోని సుర్గుజా ప్రాంతంలోని జష్పూర్ జిల్లా కుంకురీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ప్రాంతంలోని మొత్తం 14 స్థానాల్లోనూ బీజేపీనే విజయబావుటా ఎగరేసింది. ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాలకు విష్ణుదేవ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఎన్నిలక హామీ ప్రకారం వెంటనే హౌజింగ్ పథకం కింద 18 లక్షల ఇళ్లు ఇస్తామని ఆయన ప్రకటించారు. రాయ్‌పూర్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల భేటీకి 54 మంది పార్టీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ అధిష్టానం పంపిన పర్యవేక్షకులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్‌లు హాజరయ్యారు. సమావేశం తర్వాత రాష్ట్ర గవర్నర్‌ను విష్ణుదేవ్ తదితరులు కలిశారు. దీంతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాబోయే ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆహా్వనించారని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో బీజేపీ 54 చోట్ల గెలిచింది. సర్పంచ్‌గా మొదలై ఆదివాసీ సీఎం దాకా... ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ కీలక నేతల్లో విష్ణుదేవ్ ఒకరు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చారు. సర్పంచ్‌గా రాజకీయ జీవితం మొదలెట్టి ఆ తర్వాత పలుమార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి మోదీ తొలి కేబినెట్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా మూడుపర్యాయాలు పనిచేసి అధిష్టానం మెప్పు పొందారు. 1990లో బగియా గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అదే ఏడాది అవిభాజ్య మధ్యప్రదేశ్‌లో తప్కారా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004, 2009లో రాయ్‌గఢ్ ఎంపీగా గెలిచారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలిస్తే విష్ణుదేవ్‌ను ‘పెద్దనేత’ను చేస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారసభలో అమిత్ షా ప్రకటించడం తెల్సిందే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక అజిత్ జోగీ తొలి ఆదివాసీ సీఎంగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబోతున్న ఆదివాసీ నేతగా విష్ణుదేవ్ పేరు నిలిచిపోనుంది. విష్ణుదేవ్ తాత బుద్ధనాథ్ సాయ్ 1947–52 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన పెదనాన్న నరహరి ప్రసాద్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, జనతాపార్టీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగాచేశారు. ఇంకో పెదనాన్న సైతం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు, రమణ్ సింగ్‌కు స్పీకర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. అరుణ్ సావో, విజయ్ శర్మల పేర్లను ఖరారు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా నియమితులయ్యారు. సీఎంగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంపిక చేసింది. రాయ్‌పూర్‌లో బీజేపీ కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేల కీలక సమావేశం తర్వాత విష్ణు దేవ్ సాయిని సీఎంగా ప్రకటించారు. 2003 నుంచి 2018 వరకు మూడు సార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నాయకుడు రమణ్ సింగ్‌ను స్పీకర్ పదవికి పరిమితం చేశారు. ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ పోటీలో నిలిచింది. మొత్తం 90 స్థానాలకు గాను 54 స్థానాలను కైవసం చేసుకుని ఘనవిజయం సాధించింది. గెలుపు అనంతరం సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై గత వారం రోజులుగా బీజేపీ పెద్దలు నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు నేటి సమావేశంలో విష్ణుదేవ్ సాయిని సీఎంగా ఎంపిక చేయడానికే బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. గిరిజన వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయి .. ఈ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎత్తున గిరిజనుల మద్దతు కూడగట్టారు. ఇదీ చదవండి: ఛత్తీస్‌గఢ్ నూతన సీఎంగా విష్ణుదేవ్ సాయి -
ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో వెనుకబడిన రమణ్ సింగ్!
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ నేపధ్యంలో బీజేపీ మరో విజయానికి ఇక్కడి నుంచే బీజం వేయాలని భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలోనూ ప్రభావం చూపే నేతను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని ఓబీసీ గిరిజన నేతకు అప్పగించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ వ్యూహాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవి రేసులో మాజీ సీఎం రమణ్ సింగ్ పేరు వెనుకబడింది. సీఎం పదవికి బీజేపీ కొత్త పేరును పరిశీలిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో సీఎం రేసులో ఎంపీ రేణుకా సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, ఎంపీ గోమతి సాయి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా రేసులో ఉన్నారని చెప్పినప్పటికీ, మిగిలినవారు ఈ రేసులో ముందున్నారు. రమణ్ సింగ్ 71 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో అతనిని పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ సీఎం రేసులో లతా ఉసేంది, రాంవిచార్ నేతమ్, విష్ణుదేవ్ సాయి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విష్ణుదేవ్ సాయి గిరిజన నాయకుడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక కోసం ఈరోజు (ఆదివారం) జరిగే శాసనసభా పక్ష సమావేశంలో ముగ్గురు పరిశీలకులు, జార్ఖండ్ మాజీ సీఎం, గిరిజన నాయకుడు అర్జున్ ముండా, అస్సాం మాజీ సీఎం, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశీలకులు సీఎం ఎంపిక విషయంలో ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకుని పార్టీ హైకమాండ్‌కు తెలియజేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇది కూడా చదవండి: బొగ్గు గనుల మూసివేత పరిణామాలేమిటి? కూలీలు ఏం చెయ్యాలి? -
ఛత్తీస్‌గఢ్‌లో 20 మంది మావోయిస్టులు లొంగుబాటు
సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత సుక్మా జిల్లాలో శనివారం ఐదుగురు మహిళలు సహా 20 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వివిధ మావోయిస్టు అనుబంధ విభాగాలకు చెందిన వీరంతా అమానవీయ మైన, పసలేని మావోయిస్టుల సిద్ధాంతాలతో విసిగినట్లు తెలిపారని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. లొంగుబాటపట్టిన వారిలో మిలిషియా డిప్యూటీ కమాండర్ ఉయిక లఖ్మా, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘటన్(డీఏకేఎంఎస్), క్రాంతికారీ మహళా ఆదివాసీ సంఘటన్(కేఏఎంఎస్), చేతన నాట్య మండలి(సీఎన్ఎం)లకు చెందిన సభ్యులున్నార న్నారు. జిల్లాలోని జాగర్‌గుండా పోలీస్‌స్టేషన్ పరిధిలో వీరు మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లొంగిపోయిన వారికి పునరావా స కార్యక్రమాలను వర్తింప జేస్తామన్నారు. -
నక్సలైట్ల ఘాతుకం.. బీజేపీ నాయకుడు మృతి
చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. ఛోటేడోంగర్‌లో ఓ బీజేపీ నాయకుడిని నకల్స్ హతమార్చారు. దేవాలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడు కోమల్ మాంఘీని నకల్స్ తీవ్రంగా కొట్టి చంపారు. సదరు బీజేపీ నేతకు ఆమడై గనుల విషయంలో గతంలోనే నక్సల్స్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన నక్సల్స్ హెచ్చరికలు పట్టించుకోకపోవటంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఛోటేడోంగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు?
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటైంది. అయితే మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి? అనేదానిపై బీజేపీ నాయకత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి కోసం పోటీ పడుతున్నవారి వారి జాబితా భారీగానే ఉంది. ఈ నేపధ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి పీఠాలను ఎవరికి కట్టబెడతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. దీనిగురించి ఢిల్లీలో బీజేపీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో సీఎం విషయంలో బీజేపీ ఎప్పుటికి నిర్ణయం తీసుకుంటుందనే ప్రశ్న అలానే మిగిలివుంది. సోమవారం (డిసెంబర్ 11) జరగనున్న శాసనసభా పక్ష సమావేశంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి ఎన్నిక జరగనుందని తెలుస్తోంది. అదే సమయంలో ఆదివారం (డిసెంబర్ 10) రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో శాసనసభా పక్ష సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి ఎవరనేది ఆరోజు ప్రకటించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రుల ఎంపిక కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు ముగ్గురు చొప్పున పరిశీలకులను బీజేపీ నియమించింది. రాజస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండే వ్యవహరిస్తుండగా, మధ్యప్రదేశ్ ఛత్తీస్‌గడ్‌లకు మనోహర్ లాల్ ఖట్టర్ , కే లక్ష్మణ్, ఆశా లక్రా పరిశీలకులుగా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్‌కు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ గౌతమ్‌లను పరిశీలకులుగా నియమించారు. రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, మహంత్ బాలక్‌నాథ్ పేర్లు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగే శాసనసభా పక్ష సమావేశం తర్వాత ఇక్కడ సీఎం ఎవరనేది తేలనుంది. మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది డిసెంబర్ 11 నాటికి తెలియనుంది. సోమవారం భోపాల్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే సీఎం పేరు ఖరారు కానుంది. కాగా రాజస్థాన్‌లోని 199 స్థానాలలో భారతీయ జనతా పార్టీ 115 సీట్లు గెలుచుకుంది. ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలోని 230 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 163 సీట్లు వచ్చాయి. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ 54 స్థానాలను గెలుచుకుంది. ఇది కూడా చదవండి: అయోధ్య రామాలయం రెడీ -
ఛత్తీస్‌గఢ్: గిరిజన ప్రాంతాల్లో స్వీప్
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న పోల్ పండితుల అంచనాలను, ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ తలకిందులు చేసింది. సునాయాసంగా మెజారిటీ మార్కు దాటేసి భూపేశ్ బఘేల్ సర్కారును గద్దె దించింది. ఐదు సంవత్సరాల విరామం అనంతరం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 54 సీట్లు నెగ్గింది. రాష్ట్రంలో బీజేపీకి ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. గిరిజన ప్రాంతాలైన సర్గుజా, బస్తర్‌లను ఏకపక్షంగా కొల్లగొట్టడమే బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. బస్తర్, సర్గుజాలో హవా ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు షాకివ్వడం నిజమే అయినా బీజేపీని కూడా ఒకింత విస్మయపరిచాయనే చెప్పాలి. ఎందుకంటే బఘేల్ సర్కారు ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు ప్రధానంగా ఆయన పక్కాగా అమలు చేసిన పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలే కారణంగా నిలిచాయి. ముఖ్యంగా 2018లో రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో అధికారంలోకి రాగానే బఘెల్ ప్రవేశపెట్టిన వరికి బోనస్ పథకం రాష్ట్రంలో సూపర్‌హిట్టయింది. వరికి దేశంలోనే అత్యధిక బోనస్ ఇస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. పారీ్టలకతీతంగా అర్హులందరికీ పథకం ఫలాలు అందేలా బఘేల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఈసారి బీజేపీ గెలుపు అందరినీ ఆశ్చర్యపరిచిన పరిణామమే. గిరిజన ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలన్నింటినీ ఈసారి బీజేపీ ఏకపక్షంగా ఒడిసిపట్టడమే దాని మెజారిటీకి ప్రధాన కారణంగా నిలిచింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఉత్తరాదిన ఉన్న సర్గుజా రెండూ బీజేపీకి జైకొట్టాయి. బస్తర్‌లోని 12 స్థానాలకు గాను బీజేపీకి 9 స్థానాలు దఖలుపడ్డాయి. సర్గుజాలోనైతే మొత్తం 14 సీట్లను గాను బీజేపీ ఏకంగా 13 స్థానాలను దక్కించుకుంది. ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్ కంచుకోట కావడం విశేషం. రాజవంశీకుడైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావంతో సర్గుజా ప్రాంతంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆనాడు 14 స్థానాలకుకుగాను కాంగ్రెస్‌కు 12 సీట్లు దక్కాయి. ఈసారి పరిస్థితి దాదాపుగా తారుమారవడం విశేషం. ఇక్కడ బీజేపీ హవా దెబ్బకు చివరికి సింగ్‌దేవ్ సైతం ఓటమి చవిచూశారు. బస్తర్‌లో మాత్రం 3 స్థానాలతో కాంగ్రెస్ ఉనికి నిలుపుకోగలిగింది. రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్‌కు మొగ్గు ► గిరిజన ప్రాంతాలతో పోలిస్తే రాజధాని రాయ్‌పూర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శనే చేసింది. ►ఇక్కడి 20 స్థానాల్లో ఆ పార్టీ 11 సీట్లు నెగ్గింది. బీజేపీకి 9 స్థానాలు దక్కాయి. ►బిలాస్పూర్ ప్రాంతంలో బీజేపీ 13, కాంగ్రెస్ 10 చోట్ల గెలిచింది. పాలి తనఖర్లో గోండ్వానా గణతంత్ర పార్టీ గెలిచింది. ►దుర్గ్ ప్రాంతంలోనూ 20 స్థానాలుండగా బీజేపీ, కాంగ్రెస్ చెరో పదింటిని గెలుచుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!?
New Chief Ministers: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాలను నమోదు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయనుంది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను కూడా బీజేపీ హైకమాండ్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఖరారైన ముఖ్యమంత్రుల పేర్లను బీజేపీ ఇంకా వెల్లడించలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ రికార్డ్ స్థాయిలో సీట్లు గెలుపొందింది. మధ్యప్రదేశ్‌లో 163 సీట్లు, రాజస్థాన్‌లో 115 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 54 సీట్లు గెలిచి కాషాయ పార్టీ చరిత్ర సృష్టించింది. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. సీఎం అభ్యర్థులు వీళ్లే..? మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా ఉన్నారు. అక్కడ బీజేపీ అఖండ విజయంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే మరోసారి కొనసాగించే అవకాశం ఉంది. బుద్ని నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శివరాజ్ చౌహాన్.. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు విక్రమ్ మస్టల్ శర్మపై 1,04,974 ఓట్ల బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం 2006 నుంచి ఆయనకు కంచుకోటగా ఉంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోనూ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు మరోసారి అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు, అల్వార్ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ యోగి, మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేలలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. -
కాంగ్రెస్ చేసిన తప్పు అదేనా?
Election Results: దేశంలో తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంను పక్కనపెడితే ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నామామాత్రపు సీట్లకు పరిమితమైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈ పరాజయానికి మిత్ర పక్షాలన్నీ కాంగ్రెస్‌ను నిందిస్తున్నాయి. అన్ని చోట్ల ఒంటరిగా వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమని తేల్చేస్తున్నాయి. ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ తప్పు చేసిందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ స్పష్టం చేసింది. బీజేపీ ఆరోపించిన మతోన్మాద రాజకీయాలను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవడమే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమని జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఆరోపించారు. కృత్రిమంగా ‘ఇండియా’ కూటమి బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో ‘ఇండియా’ (INDIA) కూటమి ఏర్పాటైంది. రాష్ట్రాలలో విడిగా పోటీ చేస్తూ జాతీయ స్థాయిలో పొత్తు ఉందని చెప్పడంలో అర్థం లేదని జేడీయూ నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. పెద్దగా సమావేశాలు నిర్వహించుకుండా, పొత్తుతో క్షేత్రస్థాయికి వెళ్లకుండా ‘ఇండియా’ కూట మి చాలా కృత్రిమంగా కనిపిస్తుందని ఆయన ఆక్షేపించారు. కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంతో జేడీయూ కూడా విడిగా 5 స్థానాల్లో అక్కడ పోటీ చేసింది. కాంగ్రెస్ ఓటమికి అదే కారణం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదివరకే ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు. -
Five States Assembly Elections 2023: 12 రాష్ట్రాల్లో అధికార పీఠంపై కమలం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రశంసనీయమైన ఫలితాలు సాధించింది. మూడు కీలక రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకోగా, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో సులువుగా నెగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టినట్లయ్యింది. ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వాలు కొలువుదీరడం లాంఛనమే. అలాగే మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాడ్, సిక్కిం ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. అక్కడ మిత్రపక్షాలతో కలిసి అధికారం పంచుకుంటోంది. దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లను కోల్పోయింది. తెలంగాణలో విజయం సాధించింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇప్పటికే సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు తెలంగాణ సైతం ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. అంటే మొత్తం మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి ఉన్నట్లు లెక్క. బిహార్, జార్ఖండ్ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కాదు. మరో జాతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ఢిల్లీ, పంజాబ్‌లో పూర్తి మెజారీ్టతో అధికారంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోవడంతో ఇక ఉత్తర భారతదేశంలో ‘ఆప్’ అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించిందని ఆ పార్టీ నేత జాస్మిన్ షా తెలిపారు. 2024లో లోక్‌సభ సాధారణ ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. -
అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు: మోదీ
సాక్షి, హైదరాబాద్: అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు ఒక హెచ్చరికలాంటిదని అన్నారు.దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్‌కు మోదీ హెచ్చరించారు. దేశంలో నేడు మూడు రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. జీఎస్టీ వసూళ్లు రికార్డ్ సృష్టిస్తున్నాయని మోదీ తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. ఈ విజయం 2024 విజయానికి బాటలు వేసిందని తెలిపారు. అన్ని రంగాల్లో దేశం ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకుగాను బీజేపీ 164 సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 65 సీట్లకు పరిమితమైంది. రాజస్థాన్‌లో 199 సీట్లకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 69 సీట్లను మాత్రమే గెలిచింది. ఇతరులు మరో 15 సీట్లను సొంతం చేసుకున్నారు. అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ అంతే.. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లను సాధించింది. కాంగ్రెస్ 35కే పరిమితమైంది. ఇతరులు 1 సీటును సాధించారు. -
Chhattisgarh Election Results 2023: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘన విజయం
Updates.. 54 చోట్ల గెలిచిన బీజేపీ 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ 54 స్థానాల్లో బీజేపీ ముందంజ 49 చోట్ల గెలిచిన బీజేపీ, మరో 5 చోట్ల ఆధిక్యం 33 స్థానాల్లో కాంగ్రెస్ విజయం, 2 చోట్ల ముందంజ ఒక సీటు గెలిచిన గోండ్వానా గణతంత్ర పార్టీ 55కు చేరిన బీజేపీ ఆధిక్యం 12 చోట్ల బీజేపీ గెలుపు. మరో 42 స్థానాల్లో ఆధిక్యం. 7 స్థానాల్లో కాంగ్రెస్ విజయం. మరో 28 చోట్ల ముందంజ. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఆధిక్యంలో బీజేపీ బీజేపీ-53 కాంగ్రెస్-36 ఇతరులు-1 ►ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సగం మార్కును దాటింది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం 50 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 38 స్థానాల్లో కొనసాగుతోంది. BJP crosses the halfway mark in Chhattisgarh; leads on 50 seats as official ECI trends; Congress - 38 pic.twitter.com/3nwc7kjU8M — ANI (@ANI) December 3, 2023 ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-46 కాంగ్రెస్-40 ఇతరులు-1 Assembly election results 2023: BJP, Congress in close fight in Chhattisgarh Read @ANI Story | https://t.co/5qa7sIWm8r#ChhattisgarhElection2023 #Chhatisgarh #BJP #Congress pic.twitter.com/PfSEFuDabk — ANI Digital (@ani_digital) December 3, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ కో-ఇన్చార్జ్ నితిన్ నబిన్ అన్నారు. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఇదీ ప్రజలు గ్రహించారన్నారు. స్పష్టమైన మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Bihar BJP MLA and Chhattisgarh BJP Co-in charge, Nitin Nabin says, "...BJP will form government in Chhattisgarh...The people of Chhattisgarh have realised that the Congress government is corrupt and they have cheated the people. BJP will form the government with a clear… pic.twitter.com/rKlcGnFMHp — ANI (@ANI) December 3, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-39, కాంగ్రెస్-35 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. Update | Assembly elections 2023 | BJP leading on 39 seats, Congress on 35 in Chhattisgarh, say ECI https://t.co/XPv0B1D71f pic.twitter.com/OwTxHgaR5v — ANI (@ANI) December 3, 2023 ఈసీ ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ-27 కాంగ్రెస్-24 ఇతరులు-2 Assembly results: BJP leading on 23 seats in Chhattisgarh Read @ANI Story |https://t.co/CFLP1TPfQ1#ChhattisgarhElections2023 #Chhattisgarh #Congress #BJP #ElectionCommissionOfIndia pic.twitter.com/E2FlQ6As6H — ANI Digital (@ani_digital) December 3, 2023 ►మొదటి రౌండ్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ 15, బీజేపీ 13 స్థానాల్లో ఆధిక్యం ►అంబికాపూర్ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ డియో ముందంజ ►పటాన్ నియోజకవర్గంలో సీఎం భూపేష్ బఘేల్ వెనుకంజ Congress - 11, BJP- 11 in 90-seat assembly of Chhattisgarh pic.twitter.com/6Q8Frk0jKn — ANI (@ANI) December 3, 2023 ►బీజేపీ మాజీ మంత్రి అమర్ అగర్వాల్ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శైలేష్ పాండేపై 3000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ►పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ 45 , బీజేపీ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ►ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మాట్లాడుతూ, మా అంచనాల కంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రెండింటిలోనూ మేము అధికారాన్ని నిలుపుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకుంటామని, తెలంగాణలో అధికారం చేపడతామన్నారు. #WATCH | Counting of votes begins, Congress leader Pawan Khera says, "The results will be better than our hopes and expectations. We are retaining power in both Rajasthan and Chhattisgarh. We will reclaim power in Madhya Pradesh and claim power in Telangana." pic.twitter.com/nRXevzQcdp — ANI (@ANI) December 3, 2023 ►ఛత్తీస్‌గఢ్‌లో 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ►రాష్ట్రంలో మొత్తం 1,181 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ నుంచి సీఎం భూపేశ్ బఘెల్, ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తదితర ప్రముఖులున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు: 90 మెజారిటీ మార్కు:46 -
Ind vs Aus: 3.16 కోట్ల రూపాయలు బకాయి! ఇప్పటికీ..
India vs Australia, 4th T20I: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ20కి వేదికైన రాయ్‌పూర్ స్టేడియం గురించి ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కోట్ల రూపాయల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ స్టేడియానికి అధికారులు కరెంటు కోత విధించినట్లు సమాచారం. తాజాగా అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనున్న నేపథ్యంలో లైటింగ్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీటీవీ నివేదిక ప్రకారం.. రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియానికి సంబంధించి రూ. 3.6 కోట్ల మేర కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, రాష్ట్ర క్రీడా విభాగానికి మధ్య సమన్వయ లోపం వల్ల 2009 నుంచి ఇప్పటి దాకా ఇలా కోట్ల రూపాయల చెల్లింపులు అలాగే నిలిచిపోయాయి. నిజానికి రాయ్‌పూర్ స్టేడియం నిర్మాణం తర్వాత నిర్వహణ బాధ్యతలను పీడబ్ల్యూడీకే అప్పగించారు. అయితే, అదనంగా ఏవైనా సదుపాయాలు కల్పించాల్సి వస్తే అందుకు సంబంధించిన ఖర్చును క్రీడా శాఖ భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే ఇరు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు ఇక్కడిదాకా దారి తీసినట్లు తెలుస్తోంది. కుప్పలా పేరుకుపోతున్న బిల్లు చెల్లింపుల గురించి ఇప్పటికే విద్యుత్ శాఖ ఈ రెండు శాఖలకు నోటీసులు ఇచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణ సందిగ్దంలో పడింది. కరెంట్ కోత తర్వాత 2018 నుంచి రాయ్‌పూర్ స్టేడియంలో కేవలం ఒకే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. అది కూడా వన్డే! అప్పుడు కూడా జెనరేటర్ల వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మమ అనిపించారు. ఈ విషయం గురించి.. చత్తీస్గడ్ స్టేట్ క్రికెట్ సంఘ్ మీడియా కో ఆర్డినేటర్ తరుణేశ్ సింగ్ పరిహార్ మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా మాకుంది. నిజానికి స్టేడియం, లైట్లకు సంబంధించి ఎంత కరెంటు వినియోగం జరిగింది? బిల్లు ఎంతైంది? అన్న విషయాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే, తాజా మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ సంఘ్ అభ్యర్థన మేరకు విద్యుత్ శాఖ తాత్కాలిక కనెక్షన్ ఇచ్చింది’’ అని పేర్కొన్నారు. కాగా రాయ్‌పూర్ స్టేడియంలో అంతర్జాతీయ టీ20 జరగడం ఇదే తొలిసారి. ఇక శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. చదవండి: ఇర్ఫాన్‌తో ప్రేమ.. గంభీర్ మిస్డ్కాల్స్ ఇచ్చేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు